అంగరంగ వైభవంగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి కళ్యాణ వేడుకలు

అంగరంగ వైభవంగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి కళ్యాణ వేడుకలు
అగ్నిగుండాలపై నడుచుకుంటూ వెళ్లిన శివసత్తులు, భక్తులు
పాతబస్తీ అలియాబాద్ మేకల్బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో శ్రీ నల్లపోచమ్మ దేవి పాదుక ప్రతిష్ఠ మహోత్సవాలలో భాగంగా ఆదివారం అమ్మవారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గత డిసెంబర్ 10వ తేదీన రాత్రి నేల మీద పసుపు పై అమ్మవారి పాదముద్ర ప్రత్యక్షమైనందున జనవరి 22వ తేదీ నుంచి ఆలయంలో శ్రీ నల్లపోచమ్మ దేవి పాదుక ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పొన్న వెంకటరమణ ఆధ్వర్యంలో శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి కళ్యాణ వేడుకలు, అమ్మవారి పటం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగాయి. అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శివ నామాన్ని జపిస్తూ ఉత్సవ మూర్తులను తీసుకుని శివసత్తులతో పాటు .... భక్తులు అగ్నిగుండం మీదుగా నడుచుకుంటూ వెళ్లారు. చిన్న పిల్లలు సైతం అగ్నిగుండం మీదుగా నడవడం వారికి అమ్మవారిపై ఉన్న భక్తికి నిదర్శనం. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.