ఎమర్జెన్సీ సేవల్లో కేర్ హాస్పిటల్ విప్ల వాత్మక మార్పులు

ఎమర్జెన్సీ సేవల్లో విప్లవాత్మక మార్పులు
* ‘ది పవర్ ఆఫ్ త్రీ’ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన కేర్ హాస్పిటల్స్
•వేగం, నిపుణత మరియు సానుభూతితో కూడిన అత్యవసర వైద్య సేవలలో కొత్త మైలురాయి
•హైదరాబాద్‌లోని అన్ని కేర్ హాస్పిటల్స్‌కి 5G టెక్నాలజీతో కూడిన అత్యాధునిక అంబులెన్సులు
•హైదరాబాద్ నగరానికి ఇదే తొలి పూర్తి స్థాయి ఎమర్జెన్సీ కవరేజ్
•28 ఏళ్లుగా నమ్మకంగా సేవలందిస్తున్న కేర్ హాస్పిటల్స్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, మే31:
భారతదేశంలో ప్రముఖ ఆరోగ్య సంస్థ అయిన కేర్ హాస్పిటల్స్, "ది పవర్ ఆఫ్ త్రీ" పేరుతో దేశవ్యాప్తంగా నూతన ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ద్వారా, వేగవంతమైన స్పందన, నిపుణులచే చికిత్స, సానుభూతితో కూడిన సేవలపై దృష్టిపెట్టి, అత్యవసర వైద్య సేవల్లో దేశవ్యాప్తంగా కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేయడం ఈ ప్రచార లక్ష్యం.ఈ కార్యక్రమంలో భాగంగా, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ లోని అన్ని ఆసుపత్రులలో 5G అంబులెన్సులు ప్రారంభించింది. ఇవి అత్యవసర సేవలను వేగంగా, చాకచక్యంగా అందించేందుకు సహాయపడతాయి. ఇలాంటివి హైదరాబాదులో తొలిసారిగా చూడబోతున్నాం — ఇది ఒక రకంగా సాంకేతికతతో వైద్య నైపుణ్యాలు కలసి పనిచేసే విధానం. రోగి పరిస్థితిని అంబులెన్స్‌లోనే ఆసుపత్రికి వెంటనే తెలియజేస్తారు. దీంతో డాక్టర్లు ముందుగానే సిద్ధంగా ఉంటారు. ఈ అంబులెన్సులు ఆసుపత్రితో సులభంగా మాట్లాడగలుగుతాయి, అవసరమైన సమాచారం వెంటనే షేర్ చేయగలుగుతాయి, లైవ్ ట్రాకింగ్ సహాయంతో ఆసుపత్రి ఎమర్జెన్సీ డాక్టర్లు త్వరగా స్పందించగలుగుతారు. రోగి సమాచారం సురక్షితంగా ఉంటుంది. తక్షణ అలర్ట్స్ మరియు రిపోర్ట్స్ ద్వారా చికిత్సను మెరుగుపరిచేలా కూడా సహాయపడతాయి. ప్రతి నిమిషం కీలకమైన పరిస్థితుల్లో, ఈ 5G అంబులెన్సులు మరిన్ని ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఈ కార్యక్రమం, 28 ఏళ్లుగా కేర్ హాస్పిటల్స్ అందిస్తున్న అత్యున్నత వైద్య సేవల ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. అత్యవసర మరియు ప్రత్యేక వైద్య చికిత్సల్లో నాణ్యత ఎలా మెరుగుపడిందో ఈ ప్రచారం ద్వారా తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత వేగవంతమైన, నాణ్యమైన వైద్యం అందించడానికి కేర్ హాస్పిటల్స్ ప్రామాణికతను చూపిస్తోంది.ఈ కార్యక్రమాన్ని, క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఖన్నా, గ్రూప్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ విశాల్ మహేశ్వరి, గ్రూప్ చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ శలభ్ డాంగ్, గ్రూప్ చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డా. నిఖిల్ మాథూర్, జోనల్ హెచ్ సిఓఓ బిజు నాయర్, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డా. కిరణ్ కుమార్, కేర్ యొక్క ఇతర హాస్పిటల్ హెడ్‌లు & సీనియర్ నాయకత్వంతో కలిసి ప్రారంభించారు. బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో నిర్వహించైనా ఈ కార్యక్రమంలో సీనియర్ డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మరియు అత్యవసర చికిత్సల ద్వారా ప్రాణాలు నిలిచిన రోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ ఖన్నా మాట్లాడుతూ, “ఇది కేర్ హాస్పిటల్స్ మరియు భారతదేశంలో ఆరోగ్య సంరక్షణకు గర్వకారణమైన క్షణం. మూడు దశాబ్దాలుగా, కేర్ సమయానికి , నాణ్యమైన, హృదయపూర్వక సేవలకు ప్రతీకగా నిలిచింది. ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రామాణికత ద్వారా, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేస్తున్నాం. ‘ది పవర్ ఆఫ్ త్రీ’ క్యాంపెయిన్ ద్వారా వేగం, ప్రాప్యత మరియు నిపుణత్వం కలిసి ప్రాణాలను ఎలా రక్షించగలవో తెలియజేస్తున్నాం. ప్రతి రోగి మరియు వారి కుటుంబానికి – మేము అత్యవసర సమయాల్లో మీకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం.” అని తెలిపారు. ‘ది పవర్ ఆఫ్ త్రీ’ ప్రచారంలో భాగంగా కేర్ హాస్పిటల్స్ మూడు ముఖ్యమైన హామీలు ఇస్తోంది.ఎమర్జెన్సీ కాల్స్‌కు 3 రింగ్స్ లోపల స్పందిస్తారుహైదరాబాద్‌లో ఎక్కడైనా 30 నిమిషాల్లో అంబులెన్స్ రోగిని తీసుకెళ్తుంది