మీ ఇండ్లను కూల్చకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రక్షణ కవచం లా నిల్చుంటాం : హరీష్‌రావు
మీ ఇండ్లను కూల్చకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రక్షణ కవచం లా నిల్చుంటాం : హరీష్‌రావు
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
మీ ఇండ్లను కూల్చకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రక్షణ కవచం లా నిల్చుంటారని మాజీ మంత్రి హరీష్‌రావు భరోసా ఇచ్చారు. లంగర్‌హౌజ్ హైదర్ షా కోట్ లోని మూసి నిర్వాసిత బాధితులను ఆదివారం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఎమ్మెల్యేలు పరామర్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రుల,నగర ఎమ్మెల్యేల,బీఆర్ఎస్ బృందం ముందు బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలు మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంలో పేదలకు ఒక న్యాయం,పెద్దలకు ఒక న్యాయం అమలవుతుందని మండి పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని, మీరు ఫోన్ చేస్తే అర్థగంటలో మీ ముందు ఉంటామని భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇళ్లన్నీ కూలగొట్టి ప్రపంచ బ్యాంకుకు మన భూములను కుదువబెడతాడని ఆరోపించారు. మూసీ నది సుందరీకరణ పేరుమీద రిసార్ట్లు గట్టి హోటల్ కట్టి ఏదో ఉద్దరిస్తాడంట అని చమత్కరించారు. పేదవాళ్ల రక్తం మీద, కన్నీళ్ళ మీద మూసీ సుందరీ కరణ చేస్తావా? చేయడానికి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అయినా వాటిని వదిలేసి మూసి నది మీద పడి పేదల ఉసురు తీస్తున్నారని రేవంత్ రెడ్డి ని తీవ్రంగా విమర్షించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టకుండా. ఎన్నికల్లో ఇవ్వని హామీ కోసం ఎందుకు కూల్చడం అని ప్రశ్నించారు. ఇందులో ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. మహిళలకు ఇచ్చేందుకు 2500 లేవు కానీ పేదల బతుకులను కూల్చేందుకు 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కెసిఆర్ 200 పెన్షన్ 2000 చేసిండు. రేవంత్ రెడ్డి 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నాడు కానీ ఇప్పటివరకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదని ఆరోపించారు. అసెంబ్లీలో పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని నిలదీస్తే పైసలు లేవని చేతులెత్తేశారు. మరి మూసి ప్రాజెక్టు కోసం లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని మండిపడ్డారు. మేనిఫెస్టోలో మూసి గురించి చెప్పలేదు కదా. ఆరు గ్యారెంటీల గురించి చెప్పావు కదా ఎందుకు మూసి గురించి డ్రామాలు చేస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికోసం మూసి ప్రాజెక్ట్ నిర్మిస్తున్నావు.? ఇందులో ఎవరెవరి హస్తముందో చెప్పాలన్నారు. కెసిఆర్ నిర్మాణాలు చేపడితే రేవంత్ రెడ్డి కూలగొట్టే కార్యక్రమం పెట్టుకున్నాడని దుయ్యబట్టారు. ఇతర రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం నడవదు అని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కానీ హైదరాబాద్ లో మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూండా రాజ్ రాజ్యం తెచ్చాడు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును తీసేసి బుల్డోజర్ గుర్తును పెట్టుకోవాలి. ఇది మీ అయ్య జాగిరి కాదు రేవంత్ రెడ్డి. ఇక్కడ 30 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఉండే ప్రజలు అన్ని రకాల టాక్స్లు కడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించుకున్న నిర్మాణాలే కదా... కేసు పెట్టేది ఉంటే ఏ ప్రభుత్వమైతే అనుమతులు ఇచ్చిందో వారి మీద కేసు పెట్టాలని హితవు పలికారు. మీరు ధైర్యంగా ఉండండి బుల్డోజర్ రావాల్సి వస్తే మమ్మల్ని దాటుకొని రావాల్సిందేనన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీకు కోర్టు ద్వారా న్యాయం చేయిస్తుందన్నారు. కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎమ్మెల్యే దగ్గరకి పోతే నాకు సంభంధం లేదు అంటున్నారు.బాధితులకు అండగా ఉంటాం....బీఆర్ఎస్ పక్షాన పోరాడుతాం.అతి తక్కువ సమయంలోనే అత్యధిక ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటికైనా పేదల గురుంచి ఆలోచించి,బుల్డోజర్ సంస్కృతిని విడనాడాలని కార్తీక్‌రెడ్డి హితవు పలికారు.