శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటు

శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటు

శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటు

ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా దేవరశెట్టి ప్రభాకర్ రావు

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

హరిబౌలి చారిత్రిక శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ కమిటీ సర్వసభ్య సమావేశం ఆదివారం అక్కన్న మాదన్న ప్రార్థన మందిరంలో జరిగింది.ఈ సందర్భంగా ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా దేవరశెట్టి ప్రభాకర్ రావు ను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.ఆలయ ప్యాట్రాన్ గా జి.నిరంజన్, సలహాదారులుగా జి.రాజారత్నం, డాక్టర్ ఏ.భారత్ ప్రకాశ్, రాందేవ్ అగర్వాల్, ఉపాధ్యక్షులుగా జగ్మోహన్ కపూర్, ఏం.కృష్ణ, ఏం.వినోద్, కార్యదర్శిగా కె.దత్తాత్రేయ, కోశాధికారిగా ఏ.సతీష్ కుమార్, సంయుక్త కార్యదర్శులుగా చేతన్ కుమార్ సూరి, ఏం.విజయ్ కుమార్, జోగేందర్ సింగ్, జి.శ్రీనివాస్,కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎస్.పి.క్రాంతి కుమార్, కార్యవర్గ సభ్యులు గా  మరో 13 మందిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో జి.రాజు, ఏ.గోపాల్, బసవరాజు, జి.కన్నయ్య లాల్, జి.దినేష్, లోకేష్ సుగంధి, రామ్ సింగ్ ఠాకూర్, ఏం. ముకేష్ యాదవ్, టి.రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.