శ్రీ దుర్గామాత దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్దం : జమ్మిచెట్టురాజు

శ్రీ దుర్గామాత దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్దం : జమ్మిచెట్టురాజు
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
పాతబస్తీ ఉప్పగూడలోని రాఘవేంద్ర స్వామి నగర్ జమ్మిచెట్టు వద్ద శ్రీ దుర్గామాత దేవాలయంలో అక్టోబరు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు జమ్మిచెట్టు రాజు తెలిపారు. ఈ నెల 3వ తేదీన శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి అలంకారం, నీలం రంగు వస్త్రం, గణపతి పూజ, అఖండ దీపారాదన, కలశస్థాపన, అమ్మవారి ప్రతిష్ఠాపన, నైవేద్యం తీపి బూంది, శనగలు, 4వతేదీన శ్రీగాయత్రీ దేవి అలంకారం, పసుపు రంగు వస్త్రం, సామూహిక కుంకుమార్చన, నైవేద్యం పులిహోర, 5వ తేదీన శ్రీ అన్న పూర్ణాదేవి అలంకారం, మెరున్ రంగు వస్త్రం, శివ పార్వతుల కళ్యాణం, పల్లకి సేవ, నైవేద్యం పొంగలి, 6వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరి అవతారం, అకుపచ్చ రంగు, నైవేద్యం పులిహోర, పెసరబూరెలు, 7వ తేదీన శ్రీ మహాచండి దేవి అవతారం, బంగారు రంగు వస్త్రం, మహాశివునికి అభిషేకం, నైవేద్యం వడపప్పు, పాయసం, 8వ తేదీన శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం, రాణి గులాబిరంగు వస్త్రం, శ్రీ పద్మావతి సమేత, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, పల్లకి సేవ, నైవేద్యం క్షీరన్నం, 9వ తేదీన శ్రీ సరస్వతి దేవి మూలా నక్షత్రం అవతారం, తెలుపు రంగు వస్త్రం, నైవేద్యం శనగపప్పు, కొబ్బరి అన్నం , 10వ తేదీన శ్రీ దుర్గా దేవి అవతారం, ఎరుపు రంగు వస్త్రం, నైవేద్యం కదంబం, బతుకమ్మ, దాండియా కార్యక్రమం, 11వ తేదీన శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అవతారం, ముదురు నీలం రంగు వస్త్రం, నవఛండీ హోమం, నైవేద్యం చెక్కెర పొంగలి, 12వ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం, పసుపు రంగు వస్త్రం, జమ్మిచెట్టు పూజ, నైవేద్యం పులిహోర, గారెలు తదితరర పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ నవరాత్రి ఉత్సవాలకు అత్యథిక సంఖ్యలో భక్తులు పాల్గొని, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ నిర్వాహకులు అరవింద్, ఎ.శ్రీనివాస్, రఘు, అనిల్, నరేష్, నాగేశ్వర్ రావు, జనార్థన్, సురేష్, రవి తదితరులు పాల్గొన్నారు.