సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రఖ్యాత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies Limited) సంస్థ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో టెక్నాలజీ రంగం అభివృద్ధి, తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రపంచ అవసరాలను తీర్చగలిగే స్థాయిలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలు, పెట్టుబడుల విస్తరణ పట్ల రోష్ని నాడార్ ఆసక్తి కనబర్చారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారులు, హెచ్‌సీఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.