2024 పారాలింపిక్స్ లో భారత్​ హవా : 29 పతకాలు కైవసం

2024 పారాలింపిక్స్ లో భారత్​ హవా

2024 పారాలింపిక్స్ లో భారత్​ హవా : 29 పతకాలు కైవసం

29 పతకాలతో మువ్వెన్నెల జెండాను ప్రపంచవేదికపై రెపరెపలాడించిన భారత క్రీడాకారులు

పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచిన భారత్​  

ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్య పతకాలు కైవసం

ప్రజాక్షేత్ర్, స్పోర్ట్స్​ న్యూస్​ 

పారిస్ పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తాచాటారు. 25 పతకాల లక్ష్యంగా బరిలోకి దిగి 29 పతకాలతో మువ్వెన్నెల జెండాను ప్రపంచవేదికపై రెపరెపలాడించారు. అద్భుత ప్రదర్శనతో అంచనాలకు మించి పతకాలు సాథించి దేశం గర్వించేలా ప్రదర్శన చేశారు. వైకల్యాన్ని దాటి సత్తా చాటారు. పతక లక్ష్యంగా 84 మందిలో  29 మెడల్స్ సాధించడమంటే మామూలు విషయం కాదు. ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్య పతకాలు సాధించారు. పతకాల పట్టికలో 18వ స్థానంలో దేశాన్ని సగర్వంగా నిలబెట్టారు. గత టోక్నో పారాలింపిక్స్‌ 19 పతకాలను ఆదిలోనే అధిగమించి అదరగొట్టారు. 1968 నుంచి పారాలింపిక్స్‌లో భారత్ పోటీపడగా, 2016 పారాలింపిక్స్ వరకు మన క్రీడాకారులు కేవలం 12 పతకాలే సాధించారు. కానీ ఆ తర్వాత గత రెండు పారాలింపిక్స్‌లో ఏకంగా 48 పతకాలు సాధించారు. 12 స్వర్ణాలు, 17 రజతాలు, 19 సార్లు కంచు మోత మోగించారు. ఈ విశ్వక్రీడల్లో మన పతక విజేతల పూర్తి జాబితా ఇదే.....

1.అవని లేఖా -  (షూటింగ్) మహిళల 10మీ ఎయిర్‌ రైఫిల్ SH1 .. స్వర్ణం

2.మోనా అగర్వాల్ - (షూటింగ్) మహిళల 10మీ ఎయిర్‌ రైఫిల్ SH1 .. కాంస్యం

3.ప్రీతి పాల్ -  (అథ్లెటిక్స్) మహిళల 100మీ T35 ...కాంస్యం

4.మనీశ్‌ నర్వాల్ - (షూటింగ్) పురుషుల ఎయిర్‌ పిస్టల్ SH1.. రజతం ..

5.రుబీనా ఫ్రాన్సిస్‌ - (షూటింగ్) మహిళల 10మీ ఎయిర్‌పిస్టల్ SH1 .. కాంస్యం 

6. ప్రీతి పాల్ -  (అథ్లెటిక్స్‌) మహిళల 200మీ T35..కాంస్యం

7. నిషాద్ కుమార్ - (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ T47 ..రజతం 

8.యోగేశ్ కతునియా - (అథ్లెటిక్స్‌) పురుషుల డిస్కస్ త్రో F56..రజతం  

9.నితేష్ కుమార్ - (బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్ SL3 ..స్వర్ణం 

10.తులసిమతి మురుగేశన్ -  (బ్యాడ్మింటన్) మహిళల సింగిల్స్ SU5 ..రజతం

11.మనీశా రామదాస్ -  (బ్యాడ్మింటన్) మహిళల సింగిల్స్ SU5 ..కాంస్యం

12.సుహాస్ యతిరాజ్ -  (బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్ SL4 ..రజతం

13.రాకేశ్‌ కుమార్/శీతల్ దేవి -(ఆర్చరీ) ఆర మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్.. కాంస్యం  

14.సుమిత్‌ అంటిల్‌ -  (అథ్లెటిక్స్) జావెలిన్ త్రో ఎఫ్64 ..స్వర్ణం

15.నిత్య శ్రీ శివన్ - (బ్యాడ్మింటన్) మహిళల సింగిల్స్ SH6 ..కాంస్యం 

16.దీప్తి జీవాంజి -  (అథ్లెటిక్స్) మహిళల 400 మీటర్ల టీ20 ..కాంస్యం

17.శరద్ కుమార్ -  (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ టీ63 (అథ్లెటిక్స్) ..రజతం

18.మరియప్పన్ తంగవేలు - (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ టీ63 ..కాంస్యం 

19.అర్జీత్‌ సింగ్‌ - (అథ్లెటిక్స్‌) పురుషుల జావెలిన్ త్రో F46 ..రజతం 

20.గుర్జర్‌ సుందర్‌ సింగ్‌ - (అథ్లెటిక్స్) పురుషుల జావెలిన్ త్రో F46 ..కాంస్యం 

21.సచిన్‌ ఖిలారీ - (అథ్లెటిక్స్) పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46 ..రజతం  

22.హర్విందర్ సింగ్ - (ఆర్చరీ) పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్..స్వర్ణం  

23.ధరంబీర్ సింగ్ - (అథ్లెటిక్స్) పురుషుల క్లబ్ త్రో 51..స్వర్ణం 

24.ప్రణవ్ -  (అథ్లెటిక్స్) పురుషుల క్లబ్ త్రో 51..రజతం

25.కపిల్ పర్మార్ -  (జూడో) పురుషుల -60 కేజీల జే1 ..కాంస్యం

26.ప్రవీణ్ కుమార్ - (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ T64..స్వర్ణం  

27.హొకాటో హొటోజి సెమా - (అథ్లెటిక్స్‌) పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57 ..కాంస్యం 

28.సిమ్రాన్ - (అథ్లెటిక్స్) మహిళల 200 మీటర్ల టీ12 ..కాంస్యం 

29.నవదీప్ సింగ్ -  (అథ్లెటిక్స్) పురుషుల జావెలిన్ త్రో F41...స్వర్ణం