Prajakshethre News & : HYDERABAD TEMPLES https://prajakshethrenews.com/rss/category/hyderabad-temples Prajakshethre News & : HYDERABAD TEMPLES en Copyright 2024 Prajakshethre News & All Rights Reserved. శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటు https://prajakshethrenews.com/శ్రీ-అక్కన్న-మాదన్న-మహంకాళి-ఆలయ-కమిటీ-నూతన-కార్యవర్గం-ఏర్పాటు https://prajakshethrenews.com/శ్రీ-అక్కన్న-మాదన్న-మహంకాళి-ఆలయ-కమిటీ-నూతన-కార్యవర్గం-ఏర్పాటు శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటు

ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా దేవరశెట్టి ప్రభాకర్ రావు

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

హరిబౌలి చారిత్రిక శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ కమిటీ సర్వసభ్య సమావేశం ఆదివారం అక్కన్న మాదన్న ప్రార్థన మందిరంలో జరిగింది.ఈ సందర్భంగా ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా దేవరశెట్టి ప్రభాకర్ రావు ను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.ఆలయ ప్యాట్రాన్ గా జి.నిరంజన్, సలహాదారులుగా జి.రాజారత్నం, డాక్టర్ ఏ.భారత్ ప్రకాశ్, రాందేవ్ అగర్వాల్, ఉపాధ్యక్షులుగా జగ్మోహన్ కపూర్, ఏం.కృష్ణ, ఏం.వినోద్, కార్యదర్శిగా కె.దత్తాత్రేయ, కోశాధికారిగా ఏ.సతీష్ కుమార్, సంయుక్త కార్యదర్శులుగా చేతన్ కుమార్ సూరి, ఏం.విజయ్ కుమార్, జోగేందర్ సింగ్, జి.శ్రీనివాస్,కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎస్.పి.క్రాంతి కుమార్, కార్యవర్గ సభ్యులు గా  మరో 13 మందిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో జి.రాజు, ఏ.గోపాల్, బసవరాజు, జి.కన్నయ్య లాల్, జి.దినేష్, లోకేష్ సుగంధి, రామ్ సింగ్ ఠాకూర్, ఏం. ముకేష్ యాదవ్, టి.రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

]]>
Sun, 01 Jun 2025 21:02:28 +0530 admin
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉమ్మడి దేవయాల వృత్తిదారుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు https://prajakshethrenews.com/శ్రీ-లక్ష్మీ-వెంకటేశ్వర-స్వామి-దేవాలయం-ఉమ్మడి-దేవయాల-వృత్తిదారుల-సంఘం-నూతన-కార్యవర్గం-ఏర్పాటు https://prajakshethrenews.com/శ్రీ-లక్ష్మీ-వెంకటేశ్వర-స్వామి-దేవాలయం-ఉమ్మడి-దేవయాల-వృత్తిదారుల-సంఘం-నూతన-కార్యవర్గం-ఏర్పాటు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం  ఉమ్మడి దేవయాల వృత్తిదారుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు 

మూడవ సారి అధ్యక్షునిగా పేరోజీ మహేష్ కుమార్ 

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఫూల్ బాగ్ లాల్ దర్వాజా ఉమ్మడి దేవయాల వృత్తిదారుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. మూడోసారి అధ్యక్షునిగా పేరోజి మహేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా కొల్లూరు జ్ఞానేశ్వర్, కోశాధికారిగా గట్టు సుదర్శన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు అనేక పూజలు చేస్తూ సంఘానికి ముందుకు తీసుకెళ్తూన్నమన్నారు.కులవృత్తి సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

]]>
Sun, 01 Jun 2025 20:52:45 +0530 admin
జూలై 11 వ తేదీన లాల్​ దర్వాజా బోనాలు https://prajakshethrenews.com/జూలై-11-వ-తేదీన-లాల్-దర్వాజా-బోనాలు https://prajakshethrenews.com/జూలై-11-వ-తేదీన-లాల్-దర్వాజా-బోనాలు జూలై 11 వ తేదీన లాల్​ దర్వాజా బోనాలు

దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 30, జులై 1,2 వ తేదీల్లో లాల్​ దర్వాజా బోనాలు 

ప్రజా క్షేత్ర్, చార్మినార్​ :

తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా,  ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే లాల్​దర్వాజా శ్రీ మహంకాళి 117వ వార్షిక బోనాల జాతర ఉత్సవాలు జూలై 11 వ తేదీన ప్రారంభం కానున్నాయని ఆలయ కమిటీ చైర్మన్​ బి. మారుతీ యాదవ్, ​ప్రధాన కార్శదర్శి పోసాని సతీష్ ముదిరాజ్, బి. అమర్ నాథ్ యాదవ్, కోశాధికారి ఎ. చంద్రకుమార్, జి. హరీష్ గౌడ్ లు తెలిపారు. ఆదివారం లాల్​దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో జరిగిన  మీడియా సమావేశంలో వారు పాల్గొని వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జూలై 11వ తేదీన ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాలు 21వ తేదీవరకు కొనసాగుతాయన్నారు. జూలై 11వ తేదీన శుక్రవారం ఉదయం గణపతి హోమం, సప్తశతి పారాయణం, దేవి అభిషేకం, ద్వజా రోహణ, శిఖర పూజ, సాయంత్రం కలశస్థాపనతో ఉత్సవాలు లాంచనంగా ప్రారంభమవుతాయన్నారు. జూలై 13 వ తేదీన సాయంత్రం శాలిబండ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి అమ్మవారి ఘటమును భాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు. అనంతరం 9రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. జూలై 20వ తేదీన ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారికి బోనాల సమర్పణ, రాత్రికి ప్రపంచ శాంతి కోరుతూ శాంతి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. జూలై 21వ తేదీన సోమవారం పోతరాజు స్వాగతం, అమ్మవారి భవిష్య వాణి వినిపించే రంగం కార్యక్రమం, అమ్మవారి బ్రహ్మాండమైన  సామూహిక ఘటాల ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. 

*దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 30, జూలై 1,2 వ తేదీల్లో లాల్​ దర్వాజా బోనాలు* .....

లాల్​ దర్వజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో మూడు రోజుల పాటు 11వ వార్షిక బోనాల ఉత్సవాలు జూన్ 30, జూలై 1,2 తేదీలలో జరుగనున్నట్లు ఆలయ కమిటీ కన్వీనర్​ జి.అరవింద్​ గౌడ్​ తెలిపారు. 30వ తేదీన తెలంగాణ భవన్​లో ఫోటో ఎగ్జిబిషన్​ ప్రారంభమవుతుందన్నారు. జూలై 1 వ తేదీన సాయంత్రం 5గంటలకు ఇండియా గేట్​ నుంచి అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి తెలంగాణ భవన్​ లో ప్రతిష్ఠాపన మహోత్సవాలు, 2వ తేదీన అమ్మవారికి బోనాల సమర్పణ, పోతరాజు స్వాగతం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పిస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఢిల్లీ బోనాల ఉత్సవాలలో పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని కన్వీనర్ జి. అరవింద్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆలయ మాజీ చైర్మన్ లు బంగ్లా రాజు, సి. వెంకటేష్, బల్వంత్ యాదవ్, కె. వెంకటేష్, సి. రాజేందర్ యాదవ్, తిరుపతి నర్సింగ్ రావు, షీరా రాజ్ కుమార్, రాజేందర్ ఆలయ కమిటీ సంస్కృతిక కార్యదర్శులు ఎ.వినోద్ కుమార్, కె. సురేష్ బాబు, ప్రచార కార్యదర్శులు ఎస్. శేష నారాయణ, ఎ. యశ్వంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Sun, 01 Jun 2025 20:33:47 +0530 admin