Prajakshethre News & : అంతర్జాతీయం https://prajakshethrenews.com/rss/category/అంతర్జాతీయం-10 Prajakshethre News & : అంతర్జాతీయం en Copyright 2024 Prajakshethre News & All Rights Reserved. అఫ్గాన్‌లో భూకంపం.. 625 కు చేరిన మృతులు https://prajakshethrenews.com/అఫ్గాన్లో-భూకంపం-625-కు-చేరిన-మృతులు https://prajakshethrenews.com/అఫ్గాన్లో-భూకంపం-625-కు-చేరిన-మృతులు అఫ్గాన్‌లో భూకంపం.. 625 కు చేరిన మృతులు

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌ సరిహద్దులోని కునార్‌ ప్రావిన్స్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 6.0 తీవ్రత నమోదైంది. ఈ ఘోర విపత్తు కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 500కు చేరింది. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వివరాల ప్రకారం.. నంగర్హార్‌ ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. 8 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రి 11.47 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

]]>
Tue, 02 Sep 2025 00:06:46 +0530 admin
నేను ఆ కార్డులను ఉపయోగిస్తే… చైనా నాశనం అవుతుంది: ట్రంప్ https://prajakshethrenews.com/నేను-ఆ-కార్డులను-ఉపయోగిస్తే-చైనా-నాశనం-అవుతుంది-ట్రంప్ https://prajakshethrenews.com/నేను-ఆ-కార్డులను-ఉపయోగిస్తే-చైనా-నాశనం-అవుతుంది-ట్రంప్ నేను ఆ కార్డులను ఉపయోగిస్తే… చైనా నాశనం అవుతుంది: ట్రంప్
ప్రజా క్షేత్ర్, న్యూయార్క్ఆగస్టు 26
 ఈ సంవత్సరం చివరలో తాను చైనా పర్యటనకు వెళ్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. చైనా, అమెరికా మధ్య అద్భుతమైన సంబంధాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. బీజింగ్‌తో తాము సంబంధాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని, కానీ చైనా కంటే తమ ఆధిపత్యమే ఎక్కువ అని హెచ్చరించారు. వాణిజ్య విభేదాల్లో బీజింగ్ కంటే వాషింగ్టన్ బలంగా ఉందని తెలియజేశారు. చైనా వద్ద కొన్ని కార్డులు ఉన్నాయని, వాళ్ల కంటే తమ వద్ద అద్భుతమైన కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ కార్డులతో తాము ఆట ఆడుకోవాలని లేదని, తాము ఒకవేళ ఆడితే చైనా నాశనం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటోమొబైల్, రక్షణ రంగానికి కావాల్సిన మ్యాగ్నెట్స్‌ను చైనా తమకు దిగుమతి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. చైనా వాళ్లు మ్యాగ్నెట్స్‌ను దిగుమతి చేయకుంటే టారిఫ్‌లను 200 శాతం పెంచుతామని ట్రంప్ వివరించారు. అందుకే ఆ కార్డులతో ఆడటం లేదని చెప్పారు.అమెరికా టెక్ కంపెనీలపై పలు దేశాలు విధిస్తున్న డిజిటల్ పన్నులపై ట్రంప్ మండిపడ్డారు. మా టెక్ కంపెనీలపై పన్నుల రూపంలో జరుగుతున్న దాడులకు ఎదురునిలబడుతానని చెప్పారు. డిజిటల్ పన్నులు, డిజిటల్ సర్వీసెస్ చట్టాలు, డిజిటల్ మార్కెట్ రెగ్యులెషన్స్ లాంటి అమెరికా టెక్నాలజీకి హాని కలిగిస్తున్నాయని, చైనా కంపెనీలపై ఎలాంటి పన్నులు వేయడంలేదని మండిపడ్డారు. ఇవన్నీ ఆగాలంటే ఆయా దేశాలపై అదనపు టారిఫ్‌లు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. మా టెక్ కంపెనీలను గౌరవించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.

]]>
Wed, 27 Aug 2025 20:52:42 +0530 admin
సింధు జాలాల విషయంలో భారత్ కు పాకిస్తాన్ మరోసారి వార్నింగ్ https://prajakshethrenews.com/సింధు-జాలాల-విషయంలో-భారత్-కు-పాకిస్తాన్-మరోసారి-వార్నింగ్ https://prajakshethrenews.com/సింధు-జాలాల-విషయంలో-భారత్-కు-పాకిస్తాన్-మరోసారి-వార్నింగ్ సింధు జాలాల విషయంలో భారత్ కు పాకిస్తాన్ మరోసారి వార్నింగ్
ప్రజా క్షేత్ర్, ఇస్లామాబాద్ ఆగష్టు 13
 సింధు జాలాల విషయంలో పాకిస్తాన్ మరోసారి భారత్ కు వార్నింగ్ ఇచ్చింది. అమెరికా పర్యటన సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ భారత్ పై అణు బెదిరింపు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో భారత్ నుండి తమ దేశం ఉనికికి ముప్పును ఎదురైతే.. పాకిస్తాన్, భారత్ తోపాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని హెచ్చరించాడు. తాజాగా పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా భారత్ ను హెచ్చరించాడు. తమ దేశానికి హక్కుగా చెందిన ఒక్క చుక్క నీటిని కూడా భారత్ ను తీసుకోనివ్వమని ప్రతిజ్ఞ చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన మంత్రి షరీఫ్ మాట్లాడుతూ.. తమకు దక్కాల్సిన నీటిని ఆపడానికి భారత్ ప్రయత్నిస్తే.. యుద్ధ చర్యగా పరిగణిస్తామని హెచ్చరించాడు. మీరు మా నీటిని నిలిపేస్తామని బెదిరిస్తే, మీరు పాకిస్తాన్ నుండి ఒక్క చుక్కను కూడా లాక్కోలేరని గుర్తుంచుకోండి. భారత్ అలాంటి చర్యకు ప్రయత్నిస్తే.. తగిన గుణపాఠం నేర్పుతాం” అని హెచ్చరించాడు.కాగా.. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆర్మీ.. పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల శిభిరాలను మిస్సైల్స్ తో ధ్వంసం చేసింది. అలాగే, ఉగ్రవాదులకు పాక్ సహకరిస్తుందని.. సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది.

]]>
Wed, 13 Aug 2025 23:38:07 +0530 admin
బ్రిక్స్ దేశాలపై అమెరికా అక్కసు https://prajakshethrenews.com/బ్రిక్స్-దేశాలపై-అమెరికా-అక్కసు https://prajakshethrenews.com/బ్రిక్స్-దేశాలపై-అమెరికా-అక్కసు బ్రిక్స్ దేశాలపై అమెరికా అక్కసు
ప్రజా క్షేత్ర్,  న్యూఢిల్లీ, ఆగస్టు 7 :
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పట్ల కఠిన వైఖరి అవలభింస్తున్నారు. ట్రంప్ బుధవారం భారతదేశంపై 50 శాతం సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రష్యా-భారతదేశం వాణిజ్య సంబంధాలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ట్రంప్ భారతదేశంపై చైనా కంటే ఎక్కువ సుంకం విధించారు. అమెరికా చైనాతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై కూడా దయ చూపిస్తోంది. అదే సమయంలో, భారతదేశం, బ్రెజిల్ సుంకం ఉచ్చులో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నాయి. ట్రంప్ భారతదేశం-బ్రెజిల్ పై ఒకే రకమైన సుంకం విధించారు. ది హిందూ నివేదిక ప్రకారం, అమెరికా మొదట బ్రెజిల్‌పై 50 శాతం సుంకం విధించింది. భారతదేశంపై 25 శాతం మాత్రమే టారిఫ్ వేసింది. కాని ఇప్పుడు భారతదేశంపై టారిఫ్‌ను 25 శాతం పెంచారు. ఈ విధంగా, దానిపై మొత్తం 50 శాతం సుంకం విధించారు. భారత్‌- బ్రెజిల్ అత్యధిక సుంకం కలిగిన దేశాలుగా మారాయి. మూడో స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. దానిపై 39 శాతం విధించారు.కెనడాపై 35 శాతం సుంకం వేశారు.
దేశం పేరు అమెరికా విధించిన టారిఫ్‌
భారత్‌ 50 శాతం
బ్రెజిల్ 50 శాతం
లావోస్‌ 40శాతం
బర్మా 40శాతం
స్విట్జర్లాండ్ 39శాతం
ఇరాక్ 35శాతం
కెనడా 35శాతం
సెర్బియా 35శాతం
చైనా 30 శాతం
సౌతాఫ్రికా 30శాతం
లిబియా 30శాతం
బోస్నియా 30శాతం
ఈయూ 15శాతం
వియత్నం 20శాతం
జపాన్ 15శాతం
కొరియా 15శాతం
యూకే, ఆస్ట్రేలియా, 10శాతం
మిగతా దేశాలు 10శాతం
అమెరికా చైనాపై 30 శాతం సుంకం విధించింది. భారతదేశంతో పోలిస్తే ఇది 20 శాతం తక్కువ. ట్రంప్ ,జిన్ పింగ్ మధ్య సుంకంపై చాలా హాట్ హాట్‌ వార్ నడిచింది. చివరకు ఇది 30 శాతం వద్ద ఆగింది.అమెరికా ,పాకిస్తాన్ మధ్య సంబంధాలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రెండోసారి అమెరికా పర్యటనకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. టారిఫ్‌ గురించి మాట్లాడితే, పాకిస్తాన్ చాలా మినహాయింపులు పొందింది. ట్రంప్ పాక్ పై 19 శాతం సుంకం విధించారు. అదే సమయంలో, బంగ్లాదేశ్ పై 20 శాతం సుంకం వేశారు.వాస్తవానికి, భారతదేశం -రష్యా మంచి సంబంధాలను కలిగి ఉన్నాయి. ఇది రష్యా నుంచ పెద్ద మొత్తంలో చమురును కొనుగోలు చేస్తోంది. భారతదేశం రష్యా నుంచి చమురును ఎందుకు కొనుగోలు చేస్తుందనే దానితో ట్రంప్‌కు కడుపు మంట మొదలైంది. దీనిపై ట్రంప్ చాలాసార్లు బెదిరించారు. రష్యా తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని యుద్ధంలో ఖర్చు చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు.అమెరికా తీసుకున్న ఈ చర్య వల్ల వస్త్రాలు, సముద్ర ఉత్పత్తులు, తోలు ఎగుమతులు వంటి రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ ఉత్తర్వు ప్రకారం, మార్చి 8, 2022న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయడంతో కొన్ని దిగుమతులు, పెట్టుబడులపై ఆంక్షలు విధించారు. ఈ టారిఫ్‌ ఇతర అన్ని టారిఫ్‌, పన్నులకు అదనంగా ఉంటుందని ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు.ఉత్తర్వులో ట్రంప్ మాట్లాడుతూ, "భారత ప్రభుత్వం ప్రస్తుతం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటోందని నేను భావిస్తున్నాను, కాబట్టి, వర్తించే చట్టం ప్రకారం, అమెరికా కస్టమ్స్ ప్రాంతంలోకి దిగుమతి చేసుకున్న భారతీయ వస్తువులపై 25 శాతం అదనపు సుంకం వేస్తాం. ఆగస్టు 27, 2025కి ముందు రవాణా చేసిన, సెప్టెంబర్ 17, 2025కి ముందు అమెరికాకు చేరుకునే వస్తువులకు సుంకం నుంచి మినహాయింపు ఉంటుంది." అని అన్నారు.
యుద్ధం ఆగితే సుంకాలు తగ్గిస్తాం..,.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ తో యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత్ పై తొలుత 25 శాతం టారిఫ్ లు విధించిన ట్రంప్.. తాజాగా మరో 25 శాతం అదనపు టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చలు జరిపిన తర్వాత ట్రంప్ ఈ నిర్ణయం వెలువరించారు.ఉక్రెయిన్ తో యుద్ధం ఆపాలంటూ రష్యాకు ట్రంప్ విధించిన గడువు కూడా రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, రష్యా– ఉక్రెయిన్ యుద్ధ విరమణకు సంబంధించిన చర్చల్లో కీలక పురోగతి సాధించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే రష్యా యుద్ధం ఆపేస్తే భారత్ పై పన్నుల భారం తగ్గిస్తారా? అంటూ ఓ మీడియా ప్రతినిధి ట్రంప్ ను ప్రశ్నించారు.ట్రంప్ జవాబిస్తూ.. ‘రష్యా యుద్ధం ఆపేస్తే భారత్ పై పన్నులు తగ్గుతాయా అంటే చెప్పలేం. బహుశా తగ్గొచ్చు. కానీ ఇప్పుడే చెప్పలేను. యుద్ధ విరమణకు సంబంధించిన చర్చల్లో పురోగతి సాధించడానికి భారత్ పై విధించిన అదనపు సుంకాలు కూడా కారణం కావొచ్చు. అందువల్ల టారిఫ్ లు తగ్గే అవకాశం ఉంది’ అని వివరించారు. అయితే, ప్రస్తుతం భారత్ పై 25 శాతం సుంకాలు అమలులోకి వచ్చాయని, ఈ నెల 27 నుంచి అదనపు సుంకాలు అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ పన్నులు చెల్లించాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు

]]>
Thu, 07 Aug 2025 23:46:48 +0530 admin
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు.. 24 మంది మృతి https://prajakshethrenews.com/అమెరికాలోని-టెక్సాస్-రాష్ట్రంలో-భారీ-వర్షాలు-24-మంది-మృతి https://prajakshethrenews.com/అమెరికాలోని-టెక్సాస్-రాష్ట్రంలో-భారీ-వర్షాలు-24-మంది-మృతి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు.. 24 మంది మృతి
ప్రజా క్షేత్ర్,  న్యూయార్క్ జూలై 5
 అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. టెక్సాస్ వరదలు ముంచెత్తడంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. భారీ వరదలు విలయతాండవం సృష్టించడంతో 24 మంది మృతి చెందారు. 30 మంది బాలికలు గల్లంతైనట్టు సమాచారం. పోలీసులు, రెస్య్కూ సిబ్బంది గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్వాడాలు పే నది ఉప్పొంగ ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్వాడాలు పే నది తీరంలో క్రిస్టియన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ క్యాంప్‌లోని భారీగా వరదలు రావడంతో 20 నుంచి 25 మంది బాలికలు గల్లంతయ్యారు. దీంతో బాలికల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పడవలు, హెలికాప్టర్ల సహాయంతో రెస్య్కూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు

]]>
Sat, 05 Jul 2025 17:40:30 +0530 admin
ప్రధాని మోదీ దిగ్రేట్....ఇప్పటివరకు 25 దేశాల అవార్డులు. https://prajakshethrenews.com/ప్రధాని-మోదీ-దిగ్రేట్ఇప్పటివరకు-25-దేశాల-అవార్డులు https://prajakshethrenews.com/ప్రధాని-మోదీ-దిగ్రేట్ఇప్పటివరకు-25-దేశాల-అవార్డులు ప్రధాని మోదీ దిగ్రేట్....ఇప్పటివరకు 25 దేశాల అవార్డులు..
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ, జూలై 5 :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్రినిడాడ్-టొబాగో అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్-టొబాగో’ లభించింది. ఈ గౌరవాన్ని ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టీన్ కంగలూ ఆయనకు ప్రదానం చేశారు. ఇది ఒక విదేశీ దేశం ప్రధానమంత్రి మోడీకి ఇచ్చిన 25వ అంతర్జాతీయ గౌరవం. గతంలో, రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్ సహా అనేక దేశాల నుండి ఆయన అత్యున్నత గౌరవాలను కూడా అందుకున్నారు. ఇప్పటి వరకు విదేశాల అత్యున్నత పురస్కారాలు పొందిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు.ఈ గౌరవంతో, ప్రధానమంత్రి మోదీ రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్-టొబాగో చరిత్రలో ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ నాయకుడిగా నిలిచారు. ఈ గౌరవాన్ని భారత్-ట్రినిడాడ్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ వేదికలలో భారతదేశం చురుకైన పాత్ర, ప్రధానమంత్రి మోదీ నాయకత్వానికి గుర్తింపుగా భావిస్తున్నారు.అత్యున్నత జాతీయ పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’ను అందుకున్నందుకు మీకు, మీ ప్రభుత్వానికి, మీ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని’ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున ఈ గౌరవాన్ని నేను ఉమ్మడి గర్వంగా అంగీకరిస్తున్నాను. ఈ గౌరవం మొదటిసారిగా ఒక విదేశీ నాయకుడికి ఇవ్వడటం మన ప్రత్యేక సంబంధాల బలాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సంబంధం మన ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక వారసత్వంపై ఆధారపడి ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.180 సంవత్సరాల క్రితం భారతదేశం నుండి ఇక్కడికి వచ్చిన ప్రజలు మన స్నేహానికి పునాది వేశారని ప్రధాని మోదీ అన్నారు. వారి చేతులు ఖాళీగా ఉన్నప్పటికీ, వారి మనస్సులు భారతీయ నాగరికత, సంస్కృతి, వైవిధ్యంతో సమృద్ధిగా ఉన్నాయి. వారు నాటిన పరస్పర సామరస్యం, సద్భావన విత్తనాలు నేడు ట్రినిడాడ్ సాకారం అవుతున్నాయి. మన ఉమ్మడి సంప్రదాయం, సంస్కృతి, ఆచారాలను ఇప్పటికీ భారతీయ సమాజం పరిరక్షించడం చాలా గర్వకారణం అని ప్రధాని మోదీ కొనియాడారు.అధ్యక్షుడు కనగలును ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, మీ పూర్వీకులు తమిళనాడుకు చెందినవారని, ఇది తిరువళ్ళువర్ జీ పుట్టిన ప్రదేశం అని అన్నారు. బలమైన దేశాలకు 6 విషయాలు ఉండాలని తిరువళ్ళువర్ జీ అన్నారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ధైర్యవంతులైన సైన్యం, దేశభక్తిగల పౌరులు, వనరులు, మంచి ప్రజా ప్రతినిధులు, బలమైన రక్షణ, ఎల్లప్పుడూ మనతో పాటు నిలిచే స్నేహపూర్వక దేశాలు. ట్రినిడాడ్-టొబాగో భారతదేశానికి చాలా స్నేహపూర్వక దేశం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.ప్రధాని మోదీ, ట్రినిడాడ్ అధ్యక్షురాలు క్రిస్టీన్, ప్రధాని కమలాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ట్రినిడాడ్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 1999 తర్వాత భారత ప్రధాని ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి.

]]>
Sat, 05 Jul 2025 09:43:17 +0530 admin
భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా హెచ్చరిక https://prajakshethrenews.com/భారత్కు-అగ్రరాజ్యం-అమెరికా-హెచ్చరిక https://prajakshethrenews.com/భారత్కు-అగ్రరాజ్యం-అమెరికా-హెచ్చరిక రష్యాతో సంబంధాలు కొనసాగిస్తే భారీ సుంకాలు విధిస్టాం

         భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా హెచ్చరిక

ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ జూలై 2 ;ఉక్రెయిన్‌తో సుదీర్ఘ యుద్ధం కొనసాగిస్తున్న రష్యాతో సంబంధాలు కొనసాగిస్తే భారీ సుంకాలు విధిస్తామని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. ఇప్పటికే మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న   భారత్‌చైనాపై 500 శాతం సుంకాలు   విధిస్తామంటూ రిపబ్లికన్‌ సెనేటర్‌ లిండ్సే గ్రాహం     హెచ్చరించారు. ఇందుకోసం ఓ బిల్లును కూడా తీసుకురానున్న తెలిపారు.ఏబీసీ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లిండ్సే గ్రాహం మాట్లాడుతూ.. ‘రష్యా ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం ఉంటుంది. భారత్   చైనా   దేశాలు మాస్కో నుంచి 70 శాతం చమురు కొనుగోలు చేస్తున్నాయి’ అని అన్నారు. రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలపై అధిక సుంకాలు విధించేలా ట్రంప్‌ మద్దతుతో యూఎస్ సెనేట్‌లో బిల్లును తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈ బిల్లు వచ్చే నెలలోనే ప్రవేశ పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగారష్యా నుంచి భారత్‌ పెద్ద మొత్తంలో ముడి చముర కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. చైనా సైతం మాస్కో నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీంతో యూఎస్‌ తెచ్చే ఈ బిల్లు భారత్‌చైనా దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది

]]>
Wed, 02 Jul 2025 22:08:48 +0530 admin
బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఐసిటి ఆరు నెలల జైలు శిక్ష https://prajakshethrenews.com/బంగ్లాదేశ్-మాజీ-ప్రధాన-మంత్రి-షేక్-హసీనాకు-ఐసిటి-ఆరు-నెలల-జైలు-శిక్ష https://prajakshethrenews.com/బంగ్లాదేశ్-మాజీ-ప్రధాన-మంత్రి-షేక్-హసీనాకు-ఐసిటి-ఆరు-నెలల-జైలు-శిక్ష బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఐసిటి ఆరు నెలల జైలు శిక్ష

ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ జూలై 2 ;: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) బిగ్ షాకిచ్చింది.  కోర్టు ధిక్కార కేసులో షేక్ హసీనాకు బుధవారం ఐసిటి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఢాకా ట్రిబ్యూన్ నివేదికల ప్రకారంచైర్మన్ జస్టిస్ ఎండీ గోలం మోర్టుజా మోజుందర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. దాదాపు ఏడాది క్రితం బంగ్లాదేశ్ నుండి పారిపోయి ఇండియాలో తలదాచుకుంటున్న హసీనాను దోషిగా నిర్ధారించింది. హసీనాతో పాటుగైబంధలోని గోబిందగంజ్‌కు చెందిన షకీల్ అకాండ్ బుల్బుల్‌కు కూడా ఇదే కేసులో రెండు నెలల జైలు శిక్ష విధించబడింది.2024 జూన్జూలైఆగస్టులో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలపై క్రూరంగా అణచివేసిన ఘటనలో హసీనా పాత్ర ఉందనిఆమెపై ఐసిటి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల అభియోగం మోపింది. చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాంఅతని బృందం.. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన సామూహిక నిరసనలపై జరిగిన దాడి వెనుక హసీనా ప్రధాన ప్రేరేపకురాలిగా ఆరోపించారు. కాగాగతేడాది జూలై 15ఆగస్టు 15 మధ్య హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లరిమూకలు దాడులకు పాల్పడ్డారు. ప్రధాని హసీనా నివాసంపై కూడా నిరసనకారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు ముందే ఆమె ప్రత్యేక విమానంలో బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఇండియాకు వచ్చింది. ఆ సమయంలో బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున హింసకాండ జరిగింది. అల్లరిమూకల దాడుల్లో దాదాపు 1400 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

 

]]>
Wed, 02 Jul 2025 21:44:49 +0530 admin
షరతులకు రెండు దేశాలూ ఓకే.. https://prajakshethrenews.com/షరతులకు-రెండు-దేశాలూ-ఓకే https://prajakshethrenews.com/షరతులకు-రెండు-దేశాలూ-ఓకే షరతులకు రెండు దేశాలూ ఓకే..

జులై 8 నాటికి భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ప్రకటన..!

ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ జూన్ 30 ;ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న భారత్‌-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని జులై 8 నాటికి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒప్పందానికి సంబంధించిన అన్ని నిబంధనలను ఇరుపక్షాలూ అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ అన్ని దేశాలపై అదనపు సుంకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అదనపు సుంకాలకు గడువు జులై 8 వరకూ నిర్ణయించారు. అంతలోపు ఆయా దేశాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. లేదంటేజులై 9 నుంచి అదనపు సుంకాలు వడ్డిస్తారు.దీంతో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితేఅదనపు సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వాలని భారత్‌ గత కొంతకాలంగా అగ్రరాజ్యాన్ని కోరుతోంది. అదే సమయంలో కొన్నింటిపై సుంకాల భారాన్ని తగ్గించాలని అమెరికా కూడా భారత్‌కు విజ్ఞప్తి చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌తో సమావేశమయ్యారు. రెండు దేశాలు పరస్పరం లాభదాయకమైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపారు. ఈ చర్చలు తాజాగా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది.మరోవైపు ఇప్పటికే చైనాతో అమెరికా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవలే ప్రకటించారు. దీనిని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తాను ఆమోదించవలసి ఉందని ట్రూత్‌ సోషల్‌ పోస్ట్‌లో తెలిపారు. ఇరు దేశాల ప్రతినిధులు లండన్‌లో రెండు రోజులపాటు జరిపిన చర్చలు ముగిసిన అనంతరం ఆయన ఈ పోస్ట్‌ చేశారు. ఫుల్‌ మేగ్నెట్స్‌అవసరమైన రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ను చైనా ఎగుమతి చేస్తుందని చెప్పారు. చైనా విద్యార్థులు అమెరికాలోని విశ్వవిద్యాలయాలుకళాశాలల్లో చదువుకోవచ్చుననిఅది తనకు సంతోషకరమని తెలిపారు.కాగాభారత ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 10 శాతం టారిఫ్‌ విధిస్తున్న విషయం తెలిసిందే. అయితేఅధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్‌ భారత్‌ సహా పలు దేశాలపై అదనపు సుంకాలను ప్రకటించారు. ఏప్రిల్‌ 2న మన దేశంపై ట్రంప్‌ 26 శాతం అదనపు సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితేఅదనపు సుంకాలను జులై 9 వరకూ నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ యంత్రాంగం గతంలోనే ప్రకటించింది. ఈ అదనపు 26 శాతం సుంకం నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని భారత్‌ కోరుతోంది.

 

]]>
Mon, 30 Jun 2025 20:05:00 +0530 admin
హెచ్‌&1బీకి ప్రత్యామ్నాయం ఓ&1! https://prajakshethrenews.com/హెచ్-1బీకి-ప్రత్యామ్నాయం-ఓ-1 https://prajakshethrenews.com/హెచ్-1బీకి-ప్రత్యామ్నాయం-ఓ-1 హెచ్‌-1బీకి ప్రత్యామ్నాయం ఓ-1!

*అసాధారణ ప్రతిభావంతులకు జారీ చేస్తున్న అమెరికా సర్కార్‌

*లాటరీ లేని హెచ్‌-1బీ వీసాగా గుర్తింపుతో పెరిగిన ఆదరణ

*ఈ వీసా లభించిన వారిలో 3వ స్థానంలో భారతీయులు

ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ జూన్ 29: అమెరికా ప్రేమికులకు హెచ్‌-1బీ వీసాకు నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఓ-1 వీసా మారింది. ఎస్‌టీఈఎంవ్యాపారంకళలుక్రీడలు వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభావంతుల కోసం ఈ వీసాను అమెరికన్‌ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది లాటరీ లేని హెచ్‌-1బీ వీసాగా పేరు పొందింది. దీనిపై భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. టాప్‌ కంపెనీలు కూడా ఈ వీసా ద్వారా నిపుణులను ఉద్యోగులుగా నియమించుకొనేందుకు ముందుకొస్తున్నాయి.

ఈ ఓ-1 వీసా? అంటే ఏమిటి

దీనిని ఇమిగ్రేషన్‌ చట్టం1990 ప్రకారం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గొప్ప పురస్కారాలుస్కాలర్లీ పబ్లికేషన్స్‌తమ రంగంలో ఒరిజినల్‌ కంట్రిబ్యూషన్స్‌ వంటి ఎనిమిది కఠినమైన ప్రమాణాలను నిర్దేశించింది. అభ్యర్థి వీటిలో కనీసం మూడింటిని సాధించి ఉండాలి. అయితేచెప్పుకోదగ్గ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటేవార్షిక లాటరీ కానిపరిమితులు కాని లేవు. 93 శాతం అప్రూవల్‌ రేటు ఉంది. మూడేళ్ల వరకు చెల్లుబాటు ఉందిగడువును పొడిగించుకునే అవకాశాలు అపరిమితం.

అనిశ్చితిని అధిగమించొచ్చు

హెచ్‌-1బీ వీసాకు విపరీతమైన తనిఖీలుపరీక్షలు ఎదురవుతున్నాయి. అప్రూవల్‌ రేటు 37 శాతమే. అదే ఓ-1 వీసా ద్వారా అయితే అత్యధిక నైపుణ్యంగల ప్రతిభావంతులు వ్యవస్థాగత అనిశ్చితిని అధిగమించొచ్చు. అందుకే ఇది ఆకర్షణీయంగా మారింది. అమెరికన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ డేటా ప్రకారం.. 2020 ఆర్థిక సంవత్సరంలో 8,838 ఓ-1ఏ వీసాలు జారీ కాగా2023 ఆర్థిక సంవత్సరంలో 18,994 జారీ అయ్యాయి. వీటిని పొందినవారిలో బ్రిటన్‌బ్రెజిల్‌ తర్వాతి స్థానంలో భారతీయులు ఉన్నారు. భారతీయులకు 1,418 ఓ-1ఏ వీసాలు వచ్చాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో 487 ఓ-1ఏ వీసాలు భారతీయులకు లభించాయిఅంటే191 శాతం పెరుగుదల నమోదైంది. ఎస్‌టీఈఎం గ్రాడ్యుయేట్లుఏఐ రీసెర్చర్స్‌ఎంటర్‌ప్రెన్యూవర్స్‌కళాకారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు.

 

టాప్‌ స్పాన్సర్స్‌లో టెస్లాగూగుల్‌

ఓ-1 ట్యాలెంట్‌ను చురుగ్గా స్పాన్సర్‌ చేస్తున్న ప్రధాన అమెరికన్‌ సంస్థల్లో గూగుల్‌టెస్లామెక్‌కిన్సే వంటివి ఉన్నాయి. అదేవిధంగా హార్వర్డ్‌యేల్‌ వంటి విశ్వవిద్యాలయాలు భారతీయ ఫ్యాకల్టీని ఈ వీసాల ద్వారా నియమించుకుంటున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) బూమ్‌ వల్ల ఈ వీసాలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ఓ-1 వీసా దరఖాస్తుదారులు తమ పరిశోధనను ప్రచురించాలనిసమావేశాల్లో ప్రసంగించాలనిలేదాపేటెంట్లను దాఖలు చేయాలనిఇలా చేయడం వల్ల దరఖాస్తులకు ఆమోదం లభించే అవకాశాలు పెరుగుతాయని కంపెనీలు సలహా ఇస్తున్నాయి. ఉదాహరణకు, ‘ది క్యూరియస్‌ మావరిక్‌’ అనే విద్యా సంస్థను స్థాపించిన సౌందర్య బాలసుబ్రమణి (28)కి ఓ-1ఏ వీసా వచ్చింది. దీనిని బట్టి సంప్రదాయ ఉపాధికి భిన్నంగా ఈ వీసా అందుబాటులో ఉన్నదనే విషయం తేటతెల్లమవుతున్నది.

సవాళ్లువ్యూహాలు

హెచ్‌-1బీ ఫీజు కన్నా 10 రెట్లు ఎక్కువగా అంటే 10,000 డాలర్ల నుంచి 30,000 డాలర్ల వరకు ఓ-1 వీసా పొందడానికి ఖర్చవుతుంది. అయినప్పటికీ ఈ వీసా కోసం అత్యధికంగా పెట్టుబడి పెడుతున్నారు. వీటికి పెరుగుతున్న డిమాండ్‌ వల్ల తమ క్లయింట్‌ రోస్టర్స్‌ 60 నుంచి 300కు పెరిగినట్లు జినీ గ్రీన్‌ కార్డ్‌ వంటి ఇమిగ్రేషన్‌ ఫర్మ్స్‌ చెప్తున్నాయి. ముఖ్యంగాహెచ్‌-1బీ లాటరీలో తిరస్కరణకు గురైన భారతీయులు ఓ-1 కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపాయి. ఓ-1ఏ వీసాలు ఏటా 10 శాతం చొప్పున పెరుగుతున్నాయి. కనీస జీతంఫార్మల్‌ డిగ్రీ వంటివేవీ అవసరం లేకపోవడంఅంతర్జాతీయ పురస్కారాలు లేదా మీడియా కవరేజ్‌ వంటివాటిని సాక్ష్యాలుగా అంగీకరించడంఅతి తక్కువగా 10 రోజుల్లోనే పిటిషన్లను ప్రాసెస్‌ చేయడం వంటి ఆకర్షణలు ఉత్తమ భారతీయ ప్రొఫెషనల్స్‌కుఅదేవిధంగాకంపెనీలకు ఓ-1 వీసా ప్రయోజనకరంగా మారింది.

]]>
Sun, 29 Jun 2025 20:20:04 +0530 admin
పాకిస్థాన్‌లో దారుణం.. 16 మంది జవాన్లు మృతి https://prajakshethrenews.com/పాకిస్థాన్లో-దారుణం-16-మంది-జవాన్లు-మృతి https://prajakshethrenews.com/పాకిస్థాన్లో-దారుణం-16-మంది-జవాన్లు-మృతి పాకిస్థాన్‌లో దారుణం.. 16 మంది జవాన్లు మృతి

ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ జూన్ 28 :
 పాకిస్థాన్ లో  దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సైనికులు వెళ్తున్న కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో   16 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ సైనికాధికారులు ప్రకటించారు. ఈ దాడిలో పౌరులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు సహా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్గానిస్థాన్ సరిహద్దులో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.పేలుడు పదార్థాలతో ఉన్న వాహనంతో ఉగ్రవాది సైనికుల కాన్వాయ్ పైకి దూసుకెళ్లాడు. దీంతో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మరో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో ఆరుగురు పిల్లలు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత తీసుకుంటూ ప్రకటన చేసింది.

]]>
Sat, 28 Jun 2025 21:34:03 +0530 admin
చైనా సదస్సులో సంతకం చేయని రాజ్‌నాథ్ సింగ్ https://prajakshethrenews.com/చైనా-సదస్సులో-సంతకం-చేయని-రాజ్నాథ్-సింగ్ https://prajakshethrenews.com/చైనా-సదస్సులో-సంతకం-చేయని-రాజ్నాథ్-సింగ్ చైనా సదస్సులో సంతకం చేయని రాజ్‌నాథ్ సింగ్,
పహల్గాం ప్రస్తావన లేదని అసంతృప్తి
ప్రజా క్షేత్ర్, బీజింగ్, జూన్ 26 :
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ షాంఘై సహకార సంస్థ  శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి చైనాలో పర్యటిస్తున్నారు. కానీ SCO సమ్మిట్ సంయుక్త ప్రకటనపై సంతకం చేయడానికి రాజ్‌నాథ్ సింగ్ నిరాకరించారు. నివేదిక ప్రకారం, భారతదేశం ఈ ప్రకటనలో సరిహద్దు దాటి జరుగుతున్న పాకిస్తాన్ ఉగ్రవాదం సమస్యను చేర్చాలని, పహల్గాంలో ఉగ్రదాడిని ప్రస్తావించాలని కోరింది. అక్కడ అలా జరగలేదు. అదే సమయంలో రాజ్‌నాథ్ సింగ్ దాయాది పాకిస్తాన్‌కు మరో షాక్ ఇచ్చారు. ఆయన పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ను కూడా కలవలేదు. క్వింగ్డాలో జరిగిన SCO సమావేశంలో భారత్, పాకిస్తాన్, చైనా సహా 10 సభ్య దేశాలకు చెందిన రక్షణశాఖ మంత్రులు పాల్గొన్నారు. అయితే సమ్మిట్ అనంతరం రూపొందించిన జాయింట్ డాక్యుమెంట్ లో ఉగ్రవాదంపై భారత్ చెప్పిన పాయింట్లు లేకపోవడం సంతకం చేయడానికి రాజ్‌నాథ్ సింగ్ నిరాకరించారు. ఉగ్రవాదంపై అంతా కలిసి రావాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలు నీరుగారిపోతున్నట్లు అనిపించి రాజ్‌నాథ్ సింగ్ కేంద్రం వైఖరిని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. గతంలో భారత్ ఉగ్రవాదం సమస్యను పలుమార్లు ప్రపంచ వేదికపై లేవనెత్తింది. కానీ ఎవూ అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి భారత్ ఈ సమస్యను SCO సమ్మిట్ జాయింట్ స్టేట్‌మెంట్‌లో చేర్చాలని సూచించినా అది సాధ్యం కాలేదు. దాంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ షాంఫై సమ్మిట్‌లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై తీవ్రంగా స్పందించారు. పహల్గాం ఉగ్రదాడి, పాక్ ప్రేరేపిత టెర్రరిజాన్ని సైతం అందులో ప్రస్తావించాలని పట్టుపట్టారు. చివరికి ఆ జాయింట్ స్టేట్‌మెంట్‌లో ఆ విషయాలు లేని కారణంగా సంతకం చేసేది లేదంటూ పాక్‌తో పాటు చైనాకు భారత్ వైఖరి ఏంటో స్పష్టం చేశారు.
ఉగ్రవాదంపై రాజ్‌నాథ్ సింగ్ కామెంట్స్....
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా వేదికగా పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేసేవారు, ప్రోత్సహించే వారిని మనం బాధ్యులను చేయాలి. ఉగ్రవాదాన్ని ఎదుక్కోవడంలో రెండు నాల్కల ధోరణిని పాటించకూడదు అన్నారు. షాంఘై సహకార సంస్థ సమావేశంలో రక్షణ మంత్రి ప్రసంగిస్తూ, కొన్ని దేశాలు ఇప్పటికీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఆ దేశ సరిహద్దు దాటి ఇతర దేశాలపై దాడులకు ఉగ్రవాదాన్ని తమ సాధనంగా ఉపయోగిస్తున్నాయని దాయాది పాక్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావించారు. భారతదేశం ఉగ్రవాదాన్ని సహించదు. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. SCO ఈ ముప్పును ఎదుర్కోవడంలో ఏకతాటిపైకి రావాలని సూచించారు. భారత్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గదన్నారు.

]]>
Thu, 26 Jun 2025 21:08:39 +0530 admin
ఆపరేషన్‌ సిందూర్‌ మా హక్కు.. చైనా గడ్డనుంచే పాక్‌పై నిప్పులు చెరిగిన రాజ్‌నాథ్‌ సింగ్ https://prajakshethrenews.com/ఆపరేషన్-సిందూర్-మా-హక్కు-చైనా-గడ్డనుంచే-పాక్పై-నిప్పులు-చెరిగిన-రాజ్నాథ్-సింగ్ https://prajakshethrenews.com/ఆపరేషన్-సిందూర్-మా-హక్కు-చైనా-గడ్డనుంచే-పాక్పై-నిప్పులు-చెరిగిన-రాజ్నాథ్-సింగ్ ఆపరేషన్‌ సిందూర్‌ మా హక్కు..
చైనా గడ్డనుంచే పాక్‌పై నిప్పులు చెరిగిన రాజ్‌నాథ్‌ సింగ్
  ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ :
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పొరుగుదేశం పాకిస్థాన్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొన్ని దేశాలు (పరోక్షంగా పాక్‌ను ఉద్దేశిస్తూ) సీమాంతర ఉగ్రవాద విధానాన్ని సాధనంగా ఉపయోగిస్తున్నాయంటూ చైనా  గడ్డనుంచే పాక్‌పై నిప్పులు చెరిగారు. తమ సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకుతగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.చైనాలోని కింగ్‌డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరయ్యారు. గల్వాన్‌ లోయ ఘటన తర్వాత ఆయన చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో ఇటీవలే పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి రాజ్‌నాథ్‌ మాట్లాడారు. దీనికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ గురించి కూడా వివరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం భారత్ హక్కు అంటూ కుండ బద్దలు కొట్టారు.‘కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధాన పరికరంగా మలుచుకున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. అటువంటి దేశాల చర్యలను ఏ మాత్రం ఊపేక్షించకూడదు. అలాంటి వాటిని ఎస్సీఓ ఖండించాలి. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవు. విధ్వంసాలకు కారణమయ్యే ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో ఉండకూడదు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మకమైన చర్య అవసరం. దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఐక్యం కావాలి’ అంటూ ఆయా సభ్య దేశాలకు రాజ్‌నాథ్‌ పిలుపునిచ్చారు.

]]>
Thu, 26 Jun 2025 20:12:47 +0530 admin
మెక్సికోలో కాల్పులు కలకలం.. 12 మంది మృతి https://prajakshethrenews.com/మెక్సికోలో-కాల్పులు-కలకలం-12-మంది-మృతి https://prajakshethrenews.com/మెక్సికోలో-కాల్పులు-కలకలం-12-మంది-మృతి మెక్సికోలో కాల్పులు కలకలం.. 12 మంది మృతి
ప్రజా క్షేత్ర్, గ్వానాజువాట జూన్ 26 :
 మెక్సికోలో కాల్పులు కలకలం సృష్టించాయి. గ్వానాజువాట ప్రాంతం ఇరాపువాటోలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగపడడంతో 12 మంది మృతి చెందారు. 20 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరా లప్రకారం… సెయింట్ జాన్ బాప్టిస్ట్ చర్చిలో స్ట్రీట్ ఫెస్టివల్‌లో భాగంగా డ్రమ్స్ వాయిస్తూ, డ్యాన్స్‌లు చేస్తుండగా ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరపడంతో 12 మంది చనిపోగా 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బాయ్ తీవ్రంగా ఖండించారు. మృతులకు సంతాపం తెలపగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకలించారు. ఇది దురదృష్టకరమైన సంఘటన అని దర్యాప్తు చేస్తామన్నారు. మే నెలలో గ్వానాజువాటో ప్రాంతం శాన్ బార్టోలో డి బెరియోస్లోలో దుండగులు కాల్పులు జరపడంతో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. గత సంవత్సరం నుంచి తుపాకీ తుటాలకు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

]]>
Thu, 26 Jun 2025 19:13:37 +0530 admin
నింగిలోకి దుసుకెళ్లిన ఫాల్కన్‌&9 రాకెట్‌ https://prajakshethrenews.com/నింగిలోకి-దుసుకెళ్లిన-ఫాల్కన్-9-రాకెట్ https://prajakshethrenews.com/నింగిలోకి-దుసుకెళ్లిన-ఫాల్కన్-9-రాకెట్

నింగిలోకి దుసుకెళ్లిన ఫాల్కన్‌-9 రాకెట్‌

ప్రజాక్షేత్ర్, న్యూ డిల్లీ జూన్ 25;

భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా   రోదసి యాత్ర ఎట్టకేలకు ప్రారంభమైంది. ‘యాక్సియం-4’  మిషన్‌లో భాగంగా శుభాన్షుతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరి వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న ఫాల్కన్‌-9 రాకెట్‌ ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:01 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. ఈ వ్యోమనౌక గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కానుంది. 14 రోజులపాటూ వ్యోమగాములు అంతరిక్షంలో ఉండనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్‌ఎస్‌లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. ఈ మిషన్‌కు శుక్లా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు.అమెరికా ప్రైవేట్‌ స్పేస్‌ సంస్థ యాక్సియం   చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్‌-4’ మిషన్‌  లో భాగంగా స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌   ద్వారా శుభాన్షు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. దీంతో ప్రైవేట్‌ రోదసి యాత్ర ద్వారా ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాన్షు చరిత్రకెక్కారు. ఇప్పటికే భారత్‌కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్‌ శర్మ రోదసి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రష్యా సహకారంతో అంతరిక్షయానం చేశారు. రాకేశ్‌ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.

]]>
Wed, 25 Jun 2025 23:20:47 +0530 admin
ఇరాన్‌ ఇక అణ్వాయుధ జోలికి వెళ్లొద్దు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హెచ్చరిక https://prajakshethrenews.com/ఇరాన్-ఇక-అణ్వాయుధ-జోలికి-వెళ్లొద్దు-అమెరికా-అధ్యక్షుడు-డొనాల్డ్-ట్రంప్-హెచ్చరిక https://prajakshethrenews.com/ఇరాన్-ఇక-అణ్వాయుధ-జోలికి-వెళ్లొద్దు-అమెరికా-అధ్యక్షుడు-డొనాల్డ్-ట్రంప్-హెచ్చరిక ఇరాన్‌ ఇక అణ్వాయుధ జోలికి వెళ్లొద్దు
   అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హెచ్చరిక
ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ జూన్ 25 :
ఇరాన్‌ ఇక అణ్వాయుధ జోలికి వెళ్లొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హెచ్చరించారు. యురేనియంను శుద్ధి చేయడానికి ఆ దేశం దూరంగా ఉండాలని సూచించారు. ఇరాన్‌ మద్దతున్న సాయుధ ముఠాల ఆర్థిక మూలాలపై ఇజ్రాయెల్‌  దాడుల తీవ్రత పెంచిన సమయంలో అమెరికా అధ్యక్షుడి నుంచి ఈ హెచ్చరికలు రావడం గమనార్హం. ‘ఇజ్రాయెల్‌ వాయుసేన దక్షిణ లెబనాన్‌లోని అల్‌ సాదిక్‌ కరెన్సీ ఎక్స్‌ఛేంజి అధిపతి అబ్దుల్లా బక్రిని హతమార్చింది. ఇరాన్‌ ఖుద్స్‌ ఫోర్స్‌ నుంచి వచ్చే డబ్బును ఈ సంస్థ హెజ్‌బొల్లాకు మళ్లిస్తున్నది. మరోవైపు యుద్ధం ఆగాలని ఇజ్రాయెల్‌, ఇరాన్‌ సమానంగా కోరుకున్నాయి. ఇరాన్‌ అణ్వాయుధ కేంద్రాలు, అణు సామర్థ్యాలను ధ్వంసం చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఆ తర్వాతే తాను యుద్ధాన్ని ఆపాను.’ అని ట్రంప్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో కాల్పుల విరమణకు సాయం చేస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆఫర్‌ చేసినట్లు అమెరికా అధినేత ట్రంప్‌ వెల్లడించారు. అయితే తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెప్పారు. ఆయన నెదర్లాండ్‌లో ప్రారంభం కానున్న నాటో సదస్సుకు వెళుతున్న సందర్భంగా ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’ లో జర్నలిస్టులకు ఈ విషయాలు వెల్లడించారు.

]]>
Wed, 25 Jun 2025 18:44:32 +0530 admin
ఇరాన్‌లోని ఆరు వైమానిక క్షేత్రాల‌పై దాడి.. 15 విమానాలు ధ్వంసం: ఇజ్రాయిల్‌ https://prajakshethrenews.com/ఇరాన్లోని-ఆరు-వైమానిక-క్షేత్రాలపై-దాడి-15-విమానాలు-ధ్వంసం-ఇజ్రాయిల్ https://prajakshethrenews.com/ఇరాన్లోని-ఆరు-వైమానిక-క్షేత్రాలపై-దాడి-15-విమానాలు-ధ్వంసం-ఇజ్రాయిల్ ఇరాన్‌లోని ఆరు వైమానిక క్షేత్రాల‌పై దాడి.. 15 విమానాలు ధ్వంసం: ఇజ్రాయిల్‌

ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ జూన్ 23 : 

ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళాలు(IDF) ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాయి. ఇరాన్‌లో ఉన్న వైమానిక క్షేత్రాల‌ను టార్గెట్ చేసిన‌ట్లు ఐడీఎఫ్ పేర్కొన్న‌ది. ప‌శ్చిమ‌, తూర్పు, సెంట్ర‌ల్ ఇరాన్ ప్రాంతాల్లో ఉన్న సుమారు ఆరు విమానాశ్ర‌యాల‌పై ఇజ్రాయిల్ మిలిట‌రీ అటాక్ చేసిన‌ట్లు ఐడీఎఫ్ పేర్కొన్న‌ది త‌న ఎక్స్ అకౌంట్‌లో ఐడీఎఫ్ ఈ విష‌యాన్ని చెప్పింది. రిమోట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల‌తో జ‌రిగిన దాడిలో సుమారు 15 ఇరాన్ విమానాలు, హెలికాప్ట‌ర్లు ధ్వంసం అయిన‌ట్లు ఐడీఎఫ్ తెలిపింది. దాడుల వ‌ల్ల విమానాశ్ర‌య ర‌న్‌వేలు, అండ‌ర్‌గ్రౌండ్ బంక‌ర్లు, రీఫుయ‌లింగ్ విమానం, ఎఫ్‌-14, ఎఫ్‌-5, ఏహెచ్‌-1 విమానాలు ధ్వంసమైన‌ట్లు ఐడీఎఫ్ త‌న ఎక్స్‌లో వెల్ల‌డించింది. టార్గెట్ చేసిన విమానాశ్ర‌యాల్లో మెహ్ర‌బాద్‌, మాష‌ద్‌, డెజ్‌ఫుల్ ప్ర‌దేశాలు ఉన్నాయి. ఈ విమానాశ్ర‌యాల్లో టేకాఫ్ జ‌ర‌గ‌కుండా ఉండే రీతిలో ఇజ్రాయిల్ మిలిట‌రీ అటాక్ కొన‌సాగించింది. ఇరాన్ ఆర్మీ స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు చెప్పింది.సుమారు 20 యుద్ధ విమానాలు.. ఇంటెలిజెన్స్ స‌మాచారం ఆధారంగా దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఐడీఎఫ్ తెలిపింది. కెర్మ‌న్షా, హ‌మేదీన్‌, టెహ్రాన్ సైట్ల‌పై సుమారు 30 బాంబుల‌తో ఇజ్రాయిల్ దాడి చేసింది. మిస్సైల్ స్టోరేజ్‌, లాంచ్ కేంద్రాల‌తో పాటు రేడార్, శాటిలైట్ సిస్ట‌మ్స్‌, స‌ర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ లాంచ‌ర్ కేంద్రంపై దాడి చేసిన‌ట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఇరాన్ సైనిక సామ‌ర్థ్యాన్ని నిలువ‌రించ‌డంతో పాటు ఇజ్రాయిలీ పౌరుల‌పై వైమానిక దాడులు చేయ‌కుండా ఉండేందుకు అటాక్ చేసిన‌ట్లు ఐడీఎఫ్ చెప్పింది.

]]>
Mon, 23 Jun 2025 18:01:38 +0530 admin
హర్మూజ్‌ జలసంధి మూసివేత..! ప్రపంచ ఆయిల్ మార్కెట్‌పై ప్రభావం తప్పదా!! https://prajakshethrenews.com/హర్మూజ్-జలసంధి-మూసివేత-ప్రపంచ-ఆయిల్-మార్కెట్పై-ప్రభావం-తప్పదా https://prajakshethrenews.com/హర్మూజ్-జలసంధి-మూసివేత-ప్రపంచ-ఆయిల్-మార్కెట్పై-ప్రభావం-తప్పదా హర్మూజ్‌ జలసంధి మూసివేత..!
      ప్రపంచ ఆయిల్ మార్కెట్‌పై ప్రభావం తప్పదా!!
ప్రజా క్షేత్ర్, ఇరాన్‌ జూన్ 23 :
అమెరికా దాడికి నిరసనగా హర్మూజ్‌ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. అయితే, తుది నిర్ణయానికి అత్యున్నత భద్రతా సంస్థ ఆమోదం అవసరం. పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలిపే ఈ ఇరుకైన మార్గం ద్వారా ప్రపంచంలో పెద్ద చమురు వ్యాపారం జరుగుతుంది. అలాంటి దీన్ని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగనున్నాయి. ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేయకుండా ఆపాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చైనాను కోరారు. అయితే, భారత్‌లో కొన్ని వారాల పాటు ఇంధన అవసరాలు తీర్చేందుకు తగినంత చమురు అందుబాటులో ఉన్నది. భారత్‌ అనేక మార్గాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు కాగా.. గ్యాస్‌ దిగుమతిలో నాలుగో స్థానంలో ఉన్నది. ప్రభుత్వం రెండు వారాలుగా పశ్చిమాసియా పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని.. ప్రధాని మోదీ నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా సరఫరాను వైవిధ్యంలో తీసుకువచ్చామని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ పేర్కొన్నారు. ఇప్పుడు హర్మూజ్‌ జలసంధి నుంచి ఎక్కువగా తీసుకురావడం లేదని పేర్కొన్నారు. భారత్‌ మొత్తం రోజుకు 55లక్షల బ్యారెల్స్‌ చమురు దిగుమతి (BPD)లో దాదాపు 20 లక్షల బ్యారెల్స్‌ మాత్రమే ఈ జలసంధి ద్వారా వస్తున్నది. అయితే, గతకొన్ని సంవత్సరాలుగా రష్యా, అమెరికా, బ్రెజిల్‌ తదితర దేశాల నుంచి చమురు సరఫరాను పెంచింది.
రష్యా నుంచి వచ్చే చమురు హర్మూజ్‌ ద్వారా రాదు..
రష్యా నుంచి వచ్చే చమురు హర్మూజ్‌ మార్గం ద్వారా రాదు. ఇది సూయజ్‌ కాలువ.. కేప్ ఆఫ్ గుడ్ హోప్.. పసిఫిక్ మహాసముద్రం ద్వారా వస్తుంది. యూఎస్‌, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి సరఫరా ఖరీదైనప్పటికీ ఆచరణీయమైన ఎంపికగా మారాయని.. ఇంధన సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు.
భారతదేశ ఇంధన భద్రత..
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని జాతీయ భద్రతా అధ్యయనాల ప్రత్యేక కేంద్రంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ బెహెరా మాట్లాడుతూ.. ఈ ఇరుకైన మార్గాన్ని మూసివేయడం ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, భారతదేశ ఇంధన భద్రతను కూడా ప్రభావితం చేస్తుందని అన్నారు. భౌగోళిక రాజకీయ సంక్షోభానికి దారితీసే ఈ ముఖ్యమైన షిప్పింగ్ మార్గంలో ఏదైనా అంతరాయం ఇరాక్, కొంతవరకు సౌదీ అరేబియా, భారతదేశం ముడి చమురు దిగుమతులను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.
పెరగనున్న బీమా ప్రీమియంలు..
గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత నావికాదళ మాజీ ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ (రిటైర్డ్), హార్ముజ్ జలసంధిని మూసివేస్తామన్న హెచ్చరికలు ఇరాన్ ప్రపంచ చమురు వాణిజ్యానికి గణనీయమైన అంతరాయం కలిగిస్తుందని అన్నారు. షిప్పింగ్‌లో ఏదైనా అంతరాయం బీమా ప్రీమియంలపై ప్రభావం చూపుతుందని, చమురు రవాణా మరింత ఖరీదవుతుందని పేర్కొన్నారు.
చమురు ధరలు పెరుగుతుందనే భయం
ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా చమురు ధరలు ఇప్పటికే పెరిగే అవకాశం ఉందని శర్మ అన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటే.. ధరలు బ్యారెల్‌కు 80-90 నుంచి వంద బ్యారెల్‌కు వంద డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. ప్రాంతీయ దేశాల కరెన్సీ అస్థిరత.. పెట్టుబడిదారులు ఇతర స్థిరమైన మార్కెట్ల వైపు మొగ్గు చూపవచ్చని.. ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుందని కూడా ఆయన అన్నారు.
ఇరాన్ చాలా నష్టపోతుంది: రూబిన్
హర్మూజ్‌ మార్గాన్ని మూసివేస్తే ఇరాన్ చాలా నష్టపోతుందని యూఎస్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు. ఆసియాకు వెళ్లే చమురులో 44 శాతం ఈ మార్గం గుండానే వెళుతుందని ఆయన అన్నారు. ఇందులో ఎక్కువ భాగం చైనాకే వెళుతుందని ఆయన అన్నారు. ఇరాన్ హర్మూజ్‌ మార్గాన్ని మూసివేయడానికి ప్రయత్నిస్తే.. అమెరికా ప్రతిస్పందన ఇస్తుందని అమెరికన్ ఉగ్రవాద ఆర్థిక విశ్లేషకుడు జోనాథన్ స్కాంజర్ అన్నారు. బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి మద్దతు ఇస్తాయని.. ఇరాన్‌ చర్య ఆత్మహత్యా సదృశ్యమేనని పేర్కొంటున్నారు.
పశ్చిమాసియాతో భారతదేశం వాణిజ్యంపై ప్రభావం
యుద్ధం తీవ్రతరం కావడం ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ వంటి పశ్చిమాసియా దేశాలతో భారతదేశం వాణిజ్యంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. భారతదేశం వారికి 8.6 బిలియన్‌ డాలర్లు ఎగుమతి చేస్తుంది. 33.1 బిలియన్లు డాలర్లు దిగుమతి చేస్తుంది. హర్మూజ్‌ మార్గాన్ని మూసివేయడం వల్ల సరుకు రవాణా కూడా పెరుగుతుంది. ముడి చమురును మోసుకెళ్లే ప్రతి నాల్గవ నౌక ఇక్కడి నుంచే వస్తుంది. ప్రపంచంలోని రోజువారీ చమురు సరఫరాలో 30శాతం ఇక్కడి నుంచే వస్తుంది.

]]>
Mon, 23 Jun 2025 17:55:54 +0530 admin
పాక్ ఆర్మీఛీఫ్ కు వైట్ హౌస్ లో లంచ్ https://prajakshethrenews.com/పాక్-ఆర్మీఛీఫ్-కు-వైట్-హౌస్-లో-లంచ్ https://prajakshethrenews.com/పాక్-ఆర్మీఛీఫ్-కు-వైట్-హౌస్-లో-లంచ్ పాక్ ఆర్మీఛీఫ్ కు వైట్ హౌస్ లో లంచ్
ప్రజా క్షేత్ర్,  వాషింగ్టన్, జూన్ 19
ప్రపంచానికి సుద్ధులు చెబుతుంటాడు. అదేపనిగా నీతులు వల్లె వేస్తుంటాడు. కానీ తాను మాత్రం వాటిని పాటించడు. పైగా ప్రపంచం మీద పెత్తనం సాగించాలని భావిస్తుంటాడు. అడ్డగోలుగా టారిఫ్ లు వేస్తూ నరకం చూపిస్తుంటాడు.చదువుతుంటే ఇప్పటికే అర్థమై ఉంటుంది అతడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని.. ఇటీవల భారత్ పాకిస్తాన్ మీద ఆపరేషన్ సిందూర్ యుద్ధం చేసినప్పుడు.. పానకంలో పుడకలాగా వచ్చాడు. రకరకాల జిత్తుల మారి వ్యవహారాలకు పాల్పడి.. భారత్ పరోక్షంగా మూయించాడు. ఇప్పుడు ఏకంగా ఇరాన్ మీద కత్తి కట్టాడు. భారత్ అప్పుడు చేసింది తప్పు అని చెప్పిన శ్వేత దేశ అధిపతి.. ఇప్పుడేమో తనకు గిట్టని దేశం మీద పడ్డాడు. ఏకంగా ఇరాన్ అధ్యక్షుడిని టార్గెట్ చేసి మాట్లాడాడు. చంపేస్తా అంటూ హెచ్చరించాడు. అమెరికా ప్రయోజనాలు మాత్రమే కాదు, తన ప్రయోజనాలు కూడా చూసుకుంటాడు ట్రంప్. అందువల్లే తెర వెనుక రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. భారత్ ముందు పాకిస్తాన్ దేశాన్ని తిడుతుంటాడు. ఉగ్రవాద దేశమంటూ మండిపడుతుంటాడు. ఆ తర్వాత నాలుక మడత పెడుతుంటాడు. పాకిస్తాన్ కు తెర వెనుక సహాయం చేస్తూనే ఉంటాడు. తాజాగా పాకిస్తాన్ సర్వ సైన్యాధ్యక్షుడిని అమెరికాకు ఆహ్వానించాడు శ్వేత దేశ అధిపతి. అంతేకాదు అతనితో లంచ్ కూడా చేశాడు. పాకిస్తాన్ సర్వ సైన్యాధ్యక్షుడిని శ్వేత భవనం దాకా తీసుకెళ్లాడు. క్యాబినెట్ రూంలో వారిద్దరూ ఇవాళ లంచ్ కూడా చేశారు. అయితే ఆ లంచ్ మొత్తం అత్యంత ప్రైవేట్ గా సాగింది. చివరికి ఈ భేటీకి విలేకరులను కూడా ఆహ్వానించలేదు. అంతేకాదు ఈ లంచ్ పూర్తి అయిన తర్వాత అమెరికా స్టేట్ సెక్రటరీ రూబియో, అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ తో మునీర్ భేటీ అయ్యాడు. ఇక ఆపరేషన్ సిందూర్ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకున్న ట్రంప్.. ప్రపంచం ముందు గప్పాలు కొట్టాడు. ఆపరేషన్ సిందూర్ ను తానే ఆపివేసినట్టు ప్రచారం చేసుకున్నాడు. ఇక బుధవారం నాడు ట్రంప్, నరేంద్ర మోడీకి ఫోన్ కాల్ చేస్తే.. ఆపరేషన్ సిందూర్ విషయాన్ని ప్రస్తావిస్తే.. ఆ విషయంలో తాము వెనక్కి తగ్గబోమని.. ఆపరేషన్ సిందూర్ కచ్చితంగా కొనసాగుతుందని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.మునీర్ పర్యటన నేపథ్యంలో అమెరికా దేశంలో అతడికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. అమెరికాలో స్థిరపడిన పాకిస్తాన్ సొంత దేశస్తులు మునీర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అతడిని పిరికి పందగా వ్యాఖ్యానించారు. అత్యంత అవినీతిపరుడని మండిపడ్డారు. దేశ ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్న అంటూ ఆరోపించారు.. దానికి సంబంధించిన వీడియోలను కూడా వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. ఇక గతంలో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అనుచరులు కూడా మునీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజల సొమ్మును దోచుకుంటూ, విదేశాలలో దాచుకుంటున్నాడని అతని మీద మండిపడ్డారు. ప్రపంచ దేశాల వద్ద అప్పులు తీసుకొచ్చి.. ప్రజల సంక్షేమం కోసం ఖర్చుపెట్టకుండా.. వాటిని దొడ్డిదారిన ఇతర దేశాలలో దాచుకుంటున్నాడని మునిర్ మీద ఇమ్రాన్ ఖాన్ అనుచరులు ఆరోపణలు చేశారు.. అతడు పాకిస్తాన్ దేశానికి పట్టిన శని అని మండిపడ్డారు.

]]>
Thu, 19 Jun 2025 15:00:05 +0530 admin
పాకిస్తాన్ కు మోడీ బిగ్ వార్నింగ్ https://prajakshethrenews.com/పాకిస్తాన్-కు-మోడీ-బిగ్-వార్నింగ్ https://prajakshethrenews.com/పాకిస్తాన్-కు-మోడీ-బిగ్-వార్నింగ్ పాకిస్తాన్ కు మోడీ బిగ్ వార్నింగ్
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ, జూన్ 18 : 
సభ్య దేశం కాకపోయినా భారత్‌కు ఈ ఏడాది జీ7 సమ్మిట్‌లో పాల్గొనే అవకాశం లభించడంతో ప్రధాని మోదీ కెనడాకు వెళ్లారు. అదే వేదికగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఉగ్రవాదంపై పాక్ తీరును ఎండగట్టారు. కెనడాలోని కనానిస్కిస్‌లో మంగళవారం జరిగిన G-7 సమ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ఉగ్రవాదంపై కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. G-7 సమ్మిట్ సందర్భంగా దక్షిణ కొరియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా అధినేతలను కలిశారు. తనకు అవకాశం ఇచ్చిన నేతలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.కెనడాలోని కనానాస్కిస్‌లో జరిగిన G7 ఔట్రీచ్ సెషన్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన జరిగిన ఉగ్రవాద దాడి కేవలం ఆ ప్రాంతం మీద దాడి మాత్రమే కాదు, ప్రతి భారతీయుడి గుర్తింపు, గౌరవంపై జరిగిన దాడి. ఇది మొత్తం మానవాళిపై జరిగిన ఉగ్రదాడి. ఉగ్రవాదం మానవాళికి శత్రువు, అది ప్రతి ఒక్కరికీ ముప్పులాంటిది. ఇది ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునే అన్ని దేశాలకు వ్యతిరేకం. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం, మన ఆలోచనలు, విధానాలు స్పష్టంగా ఉండాలి. ఏ దేశమైతే ఉగ్రవాదాన్ని సమర్థిస్తుందో అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది." అన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఒకవైపు అన్ని రకాల ఆంక్షలు విధించడానికి మేం సిద్ధంగా ఉన్నాము. మరోవైపు, ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థించే దేశాలకు రిటర్న్ గిఫ్ట్‌లు సైతం లభిస్తున్నాయి. దురదృష్టవశాత్తు, గ్లోబల్ సౌత్ దేశాలు అనిశ్చితి, సంఘర్షణలతో ఎక్కువ ప్రభావితం అవుతున్నాయి. ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థిక సంబంధిత సంక్షోభాలతో వారు ప్రభావితం అవుతున్నారు. ఆ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి, సమస్యలను ప్రపంచ వేదికపైకి తీసుకురావడాన్ని భారతదేశం తన బాధ్యతగా భావిస్తుందని'' పేర్కొన్నారు.ప్రధాని మోదీకి కనానిస్కిస్‌లో కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఘన స్వాగతం పలికారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ 'X'లో పోస్ట్ చేస్తూ, ''ప్రపంచ పురోగతి, సహకారం కోసం అడుగులు పడుతున్నాయి. కెనడా ప్రధాని మార్క్ జె. కార్నీ కెనడాలోని కనానిస్కిస్‌లో జరిగిన G-7 సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికారని'' అని రాసుకొచ్చారు.
ట్రంప్ కు డైరక్ట్ కౌంటర్....
భారత్‌-పాక్‌ మధ్య యుద్ధం ఆపింది నేనే అంటూ పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి మోదీకి గట్టి డోస్‌ ఇచ్చారు. “మీకు అంత సీన్‌ లేదు” అని అర్థం వచ్చేలా క్లాస్‌ తీసుకున్నంత పనిచేశారు. మీ జోక్యాన్ని ఎవ్వరూ అడగలేదంటూ ట్రంప్‌కి తేల్చిచెప్పారు ప్రధాని మోదీ. భారత్‌, పాక్‌ మధ్య ట్రంప్‌ మధ్యవర్తిత్వం ప్రకటనను ప్రధాని మోదీ ఖండించారు. జమ్ముకశ్మీర్‌పై భారత్‌-పాక్‌ మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. ఇక ముందు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు.ట్రంప్‌ విజ్ఞప్తి మేరకు 35 నిమిషాల పాటు మోదీ ఫోన్‌ కాల్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా.. “కాల్పుల విరమణపై పాక్‌తో మేం నేరుగా చర్చించాం. పాక్‌ విన్నపం మేరకు కాల్పుల విరమణపై చర్చించాం. ఆపరేషన్‌ సింధూర్‌ కొనసాగుతూనే ఉంది.” ప్రధాని అన్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని మోదీ నేరుగా ట్రంప్‌కే చెప్పాల్సి ఉంది. కానీ కెనడాలో ఇద్దరు నేతల సమావేశం జరగలేదు. కానీ ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్‌- హుటాహుటిన అమెరికాకు బయల్దేరారు. మోదీని కలుసుకోలేకపోయిన ట్రంప్‌, ఆయనతో ఫోన్‌లో మాట్లాడినట్లు భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రి వివరించారు.కెనడాలో G7 సమ్మిట్‌లో పాల్గొని ప్రధాని మోదీ క్రొయేషియా వెళ్లారు. దానికి ముందు తిరుగు ప్రయాణంలో అమెరికా వస్తారా అని ట్రంప్ ప్రధాని మోదీని అడిగారు. ప్రస్తుత షెడ్యూల్ కారణంగా అది కుదరదని మోదీ, ట్రంప్‌తో అన్నారు. అయితే త్వరలో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపైనా కూడా చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ నేరుగా మాట్లాడుకోవాలని మోదీ అభిప్రాయపడ్డారు.

]]>
Wed, 18 Jun 2025 18:24:29 +0530 admin
అమెరికా వర్సెస్ చైనా మిక్కీ, మౌస్ లలో నేతల వ్యవహారం https://prajakshethrenews.com/అమెరికా-వర్సెస్-చైనా-మిక్కీ-మౌస్-లలో-నేతల-వ్యవహారం https://prajakshethrenews.com/అమెరికా-వర్సెస్-చైనా-మిక్కీ-మౌస్-లలో-నేతల-వ్యవహారం అమెరికా వర్సెస్ చైనా
మిక్కీ, మౌస్ లలో నేతల వ్యవహారం
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ, జూన్ 4 :
చైనా ఆర్థిక, సాంకేతిక వ్యూహాలు అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ఉద్దేశించినవి. దక్షిణ చైనా సముద్రం, బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ వంటి చర్యలు ఈ లక్ష్యంలో భాగం. అయితే, అమెరికా ఆంక్షలు, ఇండో–పసిఫిక్‌ ఒప్పందాలు చైనాకు సవాళ్లుగా నిలిచాయి. చైనా ఆఫ్రికాలో వాణిజ్య ఆధిపత్యం సాధించినప్పటికీ, పూర్తి విజయం సాధించలేకపోయింది, త్రిశంకు స్వర్గంలా మధ్యలో నిలిచిపోయింది.బ్రిక్స్‌ దేశాలు డాలర్‌ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కొత్త కరెన్సీ లేదా చెల్లింపు విధానం కోసం చర్చించాయి. 2024లో రష్యా ‘ది యూనిట్‌‘ అనే బంగారం ఆధారిత కరెన్సీని ప్రదర్శించినప్పటికీ, ఇది అమలులోకి రాలేదు. చైనా–ఇండియా విభేదాలు, ఏకీకృత బ్యాంకు లేకపోవడం వంటి సమస్యలు ఈ ప్రయత్నాన్ని అసాధ్యం చేశాయి. డాలర్‌ ఇప్పటికీ 58% గ్లోబల్‌ రిజర్వ్‌లలో ఆధిపత్యం చెలాయిస్తోంది.చైనా దక్షిణ చైనా సముద్రంలో 2016లో PCA తీర్పును తిరస్కరించడం ద్వారా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని విమర్శలు ఎదుర్కొంది. ఈ తీర్పు చైనా చర్యలను నియంత్రించలేకపోయింది, ఇది చైనా యొక్క ‘సినోసెంట్రిక్‌‘ లక్ష్యాలను కొనసాగించేలా చేసింది. ఈ వైఫల్యం చైనా అంతర్జాతీయ చట్టపరమైన సవాళ్లను సూచిస్తుంది.చైనా యొక్క భౌగోళిక రాజకీయ లక్ష్యాలు అమెరికాతో పోటీ, బ్రిక్స్‌ కరెన్సీ, చట్టపరమైన సవాళ్లు పాక్షిక విజయాలు, పాక్షిక వైఫల్యాలతో త్రిశంకు స్వర్గంలా నిలిచిపోయాయి.
ఇండో–పసిఫిక్‌లో చైనా దూకుడు..
తైవాన్‌ను చైనా తన భూభాగంలో భాగంగా పరిగణిస్తుంది. అయితే తైవాన్‌ తనను స్వతంత్ర దేశంగా చూస్తోంది. ఈ అంశం దశాబ్దాలుగా చైనా–తైవాన్‌ మధ్య, అలాగే చైనా–అమెరికా మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. పీట్‌ హెగ్సెత్‌ తన ప్రసంగంలో చైనా తైవాన్‌ చుట్టూ సముద్ర జలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలను మోహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇటీవలి సంవత్సరాల్లో, చైనా తైవాన్‌ సమీపంలో సైనిక విన్యాసాలు, యుద్ధ విమానాల రాకపోకలను పెంచింది. ఇది ఈ ప్రాంతంలో భద్రతా ఆందోళనలను పెంచింది. ఉదాహరణకు, 2024లో చైనా తైవాన్‌ సమీపంలో రికార్డు స్థాయిలో సైనిక విన్యాసాలు నిర్వహించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్‌ జియాన్, తైవాన్‌ అంశం చైనా అంతర్గత వ్యవహారమని, ఇందులో విదేశీ దేశాల జోక్యం అనవసరమని స్పష్టం చేశారు. ఈ స్పందన చైనా ‘‘ఒకే చైనా’’ విధానాన్ని గట్టిగా నొక్కి చెబుతుంది, ఇది తైవాన్‌ను తమ భూభాగంగా చూసే వైఖరిని ప్రతిబింబిస్తుంది.ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడు కేవలం తైవాన్‌కే పరిమితం కాదు. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఏకపక్ష చర్యలు, ద్వీపాల నిర్మాణం, సైనికీకరణ వంటివి ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా వంటి దేశాలతో వివాదాలకు దారితీశాయి. హెగ్సెత్‌ తన ప్రసంగంలో ఈ భౌగోళిక వివాదాలను ప్రస్తావిస్తూ, చైనా ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోందని విమర్శించారు. చైనా యొక్క ‘‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌’’ (BRI) ద్వారా ఆర్థిక, వాణిజ్య ఒత్తిళ్లను కూడా ఈ ప్రాంతంలోని దేశాలపై చైనా చేస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా, హెగ్సెత్‌ పనామా కాలువపై చైనా ఆధిపత్య ప్రయత్నాలను ప్రస్తావించారు. చైనా లాటిన్‌ అమెరికాలో తన ప్రభావాన్ని పెంచుకోవడానికి పనామా కాలువను ఒక వ్యూహాత్మక సాధనంగా ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చైనా యొక్క ఆర్థిక, సైనిక విస్తరణ వైఖరిని ఎదుర్కోవడానికి అమెరికా తీసుకుంటున్న చర్యలను సూచిస్తాయి.చైనా దూకుడును అడ్డుకోవడానికి అమెరికా ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో తన సైనిక, ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేస్తోంది. హెగ్సెత్‌ తన ప్రసంగంలో ఈ ప్రాంతంలోని మిత్ర దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, భారతదేశం వంటి దేశాలతో సహకారాన్ని పెంచడం, రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంలో, ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా నాయకత్వంలో ఏర్పడిన  సహకారం మరింత బలపడుతోంది. ఈ కూటమి చైనా యొక్క ఆధిపత్య ధోరణులను అడ్డుకోవడానికి కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా తైవాన్‌కు ఆయుధాల సరఫరా, సైనిక శిక్షణను కొనసాగిస్తోంది, ఇది చైనాకు కోపం తెప్పిస్తోంది.చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్‌ జియాన్, అమెరికా తైవాన్‌కు ఆయుధాల సరఫరా, సైనిక సంబంధాలను నిలిపివేయాలని హెచ్చరించారు. ‘‘నిప్పుతో ఆడుకోవద్దు’’ అనే వ్యాఖ్య చైనా యొక్క గట్టి వైఖరిని, ఈ అంశంలో ఎట్టి రాజీ లేని స్థితిని సూచిస్తుంది. ఈ ఉద్రిక్తతలు భవిష్యత్తులో సైనిక ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా–చైనా మధ్య ఈ ఉద్రిక్తతలు కేవలం రాజకీయ, సైనిక సమస్యలకే పరిమితం కాక, ఆర్థిక, వాణిజ్య రంగాలపై కూడా ప్రభావం చూపవచ్చు. చైనా ఆర్థిక ఒత్తిళ్లు, వాణిజ్య ఆంక్షలు ఈ ప్రాంతంలోని దేశాల ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేయవచ్చు. అదే సమయంలో, అమెరికా యొక్క సైనిక బలోపేతం, మిత్ర దేశాలతో సహకారం ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడేందుకు కీలకం.

]]>
Wed, 04 Jun 2025 12:17:53 +0530 admin
తెలంగాణ ప్రతిష్ట పెంచిన అందాల పోటీలు https://prajakshethrenews.com/తెలంగాణ-ప్రతిష్ట-పెంచిన-అందాల-పోటీలు https://prajakshethrenews.com/తెలంగాణ-ప్రతిష్ట-పెంచిన-అందాల-పోటీలు తెలంగాణ ప్రతిష్ట పెంచిన అందాల పోటీలు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 3 :
దాదాపు నెల రోజుల పాటు జరిగిన మిస్ వరల్డ్ పోటీలు ముగిసాయి.   రకరకాలఈవెంట్స్ లో భాగంగా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు తెలంగాణ ప్రతిష్టను పెంచాయి. బిగ్ ఫోర్ బ్యూటీ కాంటెస్ట్ లలో ( మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ , మిస్ వరల్డ్ )ఒకటైన మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఘనంగా ముగిశాయి. నెల రోజులపాటు ప్రపంచ సుందరీమణులంతా తెలంగాణలో సందడి చేశారు. ఈ పోటీలు కేవలం అందగత్తెల ఎంపిక మాత్రమే కాకుండా, తెలంగాణ సంస్కృతి, ప్రత్యేక ఆతిథ్యాన్ని  ప్రపంచానికి  పరిచయం చేసిందీ  అందాల పండుగ. వివిధ సంస్కృతుల నుంచి వచ్చిన సుందరీమణుల సామాజిక సేవా కోణం ప్రదర్శితమైంది. మిస్ వరల్డ్ పోటీలకు భారత్ మూడోసారి  ఆతిథ్యం  ఇచ్చింది.  1996లో ఇండియన్ సిలీకాన్ వ్యాలీగా పేరుపొందిన  బెంగళూరు ఆతిథ్యం ఇవ్వగా, 2024లో మన దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయి  వేదికైంది.  గతేడాదే మన  దేశ ఆతిథ్యం రుచి చూసిన మిస్ వరల్డ్  ఆర్గనైజేషన్  మరోసారి  ఇండియాలోనే ఈ పోటీలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈదఫా  అందుకు సిటీ ఆఫ్ పెరల్స్ గా  ప్రపంచంలో గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరాన్ని వేదికగా ఎంచుకుంది. మే 10, 2025న ప్రారంభమైన ఈ పోటీలు నెల రోజుల పాటు సాగాయి.  ఈ  అతి పెద్ద అందాల సుందరాంగుల పండుగలో 108 దేశాల  అందగత్తెలు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడ్డారు.మిస్ వరల్డ్ 2025 వేడుకల్లో తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసేందుకు  తెలంగాణ ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. నెల రోజులపాటు సాగిన అందాల పండుగలో ప్రపంచ సుందరీమణులు తెలంగాణ పర్యాటక స్థలాలు, చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించి అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. చార్మినార్, రామప్ప దేవాలయం,  నాగార్జున సాగర్ లోని బుద్ద వనం, యాదాద్రి దేవాలయం వంటి ప్రాంతాలను సందర్శించారు. చారిత్రాత్మక కట్టడాలను చూసి వారు అబ్బురపడ్డారు. అంతే కాకుండా నవ తెలంగాణకు నిదర్శనమైన తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, నూతన సచివాలయం, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి  పర్యాటక ప్రాంతాలను, నిర్మాణాలను చూసి ఆశ్చర్యమయ్యారు. అంతే కాకుండా తెలంగాణ స్థానిక కళలను వీక్షించారు. సంప్రదాయ వంటకాలను రుచి చూశారు. స్థానిక నృత్యాలను అనుసరిస్తూ వారు చిందులేశారు.  దాకేవలం ర్యాంపులపై హోయలొలికిస్తూ నడవటమే కాదు  సామాజిక బాధ్యతలో తాము అంటూ నిర్వహించే బ్యూటీ విత్ ఏ పర్పస్ కాంటెస్ట్ ఈ అందాల పోటీల్లో హైలెట్ గా చెప్పవచ్చు. ఇందులో పోటీ పడ్డ అందగత్తెలందరూ సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శించారు. మన దేశం నుంచి పోటీ పడ్డ  నందినీ గుప్తా  ప్రాజెక్ట్ ఏక్తాను ప్రదర్శించారు. దివ్యాంగుల పట్ల అవగాహన, వారి పట్ల దయ,కరుణను పెంచే  ప్రాజెక్టు ఇది. అయితే ఈ పోటీలో పైప్ లైన్ ఫర్ లైఫ్ లైన్ ప్రాజెక్టును ప్రదర్శించిన  ఇండోనేషియా కాంటెస్ట్ మోనికా కెజియా సెంబరింగ్ ,  బ్యూటి విత్ ఏ పర్పస్ పోటీలో గెలుపొందారు. పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్య సదుపాయలను మెరుగుపర్చే ప్రాజెక్టు ఇది.మిస్ వరల్డ్ 2025లో మరో ప్రధాన ఆకర్షణ గచ్చిబౌలి ఇండోర్ స్డేడియంలో జరిగిన  అందాల భామల స్పోర్ట్స్ ఛాలెంజ్ పోటీలు. ఈ ఛాలెంజ్ లో ప్రధానంగా మల్లఖంబ, యోగా, మార్షల్ ఆర్ట్స్, వంటి భారతీయ సంప్రదాయ  పోటీలను నిర్వాహకులు నిర్వహించారు. వీటితోపాటు స్కేటింగ్, జమ్నాస్టిక్, షాట్ పుట్, బ్యాట్మింటన్, ఫుట్ బాల్ షూటౌట్స్,  స్ప్రింట్, జుంబా సెషన్ వంటివి నిర్వహించారు. ఈ పోటీల్లో చిన్న పిల్లల్లా వీరంతా పాల్గొని కేరింతలు కొట్టారు. ఇందులో మిస్ ఎస్టోనియా ఎలిస్ రాండ్మా  గోల్డ్ మెడల్ గెల్చుకున్నారుశిల్పకళావేదికగా ప్రపంచ సుందరీమణులంతా వారి కున్న టాలెంట్స్ ను ప్రదర్శించే పోటీలో ఉత్సాహంగా పాల్గొనడం ఈ ఈవెంట్లో మరో ముఖ్య ఆకర్షణ. వీరంతా సంగీత వాయిద్యాలు వాయించడం, పాటలు పాడటం, వారి స్థానిక నృత్య రీతులను ప్రదర్శించడం వంటివి చేసి ఆకట్టుకున్నారు. అంతే కాకుండా కవిత్వం, ఉపన్యాస పోటీలు, ఏక పాత్రాభినయనం వంటి నైపుణ్యాలతో ఆకట్టుకున్నారు.  చిన్న నాటికలు వేసి తమ నటనా సామర్ధ్యాన్ని బయటపెట్టారు.  ఇందులో మిస్ నైజిరీయ్ ఆడా ఓలువ్మి తన పాటలు, డాన్స్ లతో ఉర్రూతలూగించారు. ఇక తెలుగులో బాగా వైరల్ అయిన రాను ముంబయికి నే రాను అనే పాట పాడి, ఆఫ్రికన్- ఇండియన్ స్టైల్ లోఆ పాటకు డ్యాన్స్  చేసి వేసిన స్టెప్పులు  సూపర్ డూపర్ గా ఆకట్టుకున్నాయివరల్డ్ -2025 ఫైనల్స్ పోటీల్లో మిస్ వరల్డ్ 2016 విజేత స్టెఫానీ డెల్వాలే, ఇండియన్ టీవీ ప్రజెంటర్ సచిన్ కుంభార్ తమ  వాఖ్యానంతో అదరగొట్టారు. బాలీవుడ్ స్టార్స్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ చేసిన డ్యాన్సులు ఆహుతులను ఆలరించాయి. ఇషాన్ ఖట్టర్ ఆర్. ఆర్. ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు వేసిన స్టెప్పులు అక్కడికి  ప్రపంచ సుందరీమణులు లేచి ఆడేలా  చేశాయి.మిస్ వరల్డ్ జడ్జి ప్యానెల్ లో మన భారతీయులే ఎక్కువ మంది ఉండటం విశేషంగా చెప్పాలి. ఇందులో సినీ యాక్టర్ సోనూ సూద్, రానా, నమ్రత శిరోద్కర్, మాజీ మిస్ ఇంగ్లాండ్ డా. కరీనా టర్రెల్,  మిస్ వరల్డ్ ఛైర్ పర్సన్ జూలియా మెర్లీ, మిస్ వరల్డ్ 2017  మానుషి చిల్లర్, ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్, వ్యాపారవేత్త సుధారెడ్డి ఉన్నారు. ఈ  వేడుకల్లోనే సోనూ సూద్ ప్రముఖ మానవతా వాదిగా ప్రత్యేక గౌరవాన్ని రానా చేతుల మీదుగా పొందారు.ఈ ఏడాది మిస్ వరల్డ్ క్రౌన్ అత్యంత విలువైంది. 1770 వజ్రాలతో 175.49 క్యారెట్ల మొత్తంలో, 18 క్యారెట్ వైట్ గోల్డ్ తో ఈ కిరీటం తయారు చేశారు.  దీని విలువ మూడు కోట్లు. ప్రైజ్ మనీ 8.5  కోట్లు గా ప్రకటించారు. ఈ సంవత్సరం మిస్ వరల్డ్ క్రౌన్ అత్యంత విలువైనదిగా నిలిచింది.మిస్ వరల్డ్ 72 ఎడిషన్లలో గతంలో ఎన్నడూ లేనిది, తొలిసారి  థాయ్‌లాండ్‌ ఈ కిరీటాన్ని దక్కించుకుంది. ఈ గ్రాండ్ ఫినాలేలో  థాయ్‌లాండ్  అందగత్తె సుచాత చాయాంగ్రి శ్రీ విజేతగా నిలిచారు. ఫస్ట్ రన్నరప్ గా ఇథియోపియాకు చెందిన  హాసెట్ డెరెజె  ఫస్ట్ రన్నరప్ గా నిలిచారు. ఇలా ఇధియోపియా నుంచి పోటీ పడిన ఓ సుందరీమణికి ఫస్ట్ రన్నరప్ రావడం 72 ఎడిషన్లలో ఇదే తొలిసారి. ఈ  మిస్ వరల్డ్ పోటీల్లో ఇదీ ఓ  హైలెట్ .

]]>
Tue, 03 Jun 2025 19:48:05 +0530 admin
భారత్ కు రష్యా మరిన్ని ఆయుధాలు https://prajakshethrenews.com/భారత్-కు-రష్యా-మరిన్ని-ఆయుధాలు https://prajakshethrenews.com/భారత్-కు-రష్యా-మరిన్ని-ఆయుధాలు భారత్ కు రష్యా మరిన్ని ఆయుధాలు

ప్రజా క్షేత్ర్, ఢిల్లీ, జూన్ 3 :
ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారతదేశం–పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఐదో∙తరం యుద్ధ విమానాల గురించి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో, రష్యా మరోసారి ఐదవ తరం Su-57E ఫైటర్‌ జెట్‌ ఎగుమతి వేరియంట్‌ను భారతదేశానికి అందించింది ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారతదేశం–పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఐదవ తరం యుద్ధ విమానాల గురించి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో, రష్యా మరోసారి ఐదవ తరం Su–57E ఫైటర్‌ జెట్‌ ఎగుమతి వేరియంట్‌ను భారతదేశానికి అందించింది. ఈ ప్రతిపాదన భారతీయ వ్యవస్థల స్థానికీకరణ, ఏకీకరణకు ఎంతగానో ఉపయోగపడనుంది.ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారతదేశం–పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఐదో∙తరం యుద్ధ విమానాల గురించి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో, రష్యా మరోసారి ఐదవ తరం Su-57E ఫైటర్‌ జెట్‌ ఎగుమతి వేరియంట్‌ను భారతదేశానికి అందించింది. ఈ ప్రతిపాదన భారతీయ వ్యవస్థల స్థానికీకరణ, ఏకీకరణకు ఎంతగానో ఉపయోగపడనుంది.భారతదేశ సూపర్‌–30 జెట్‌ కోసం ప్రణాళిక చేసిన కీలక సాంకేతికతలను Su-57E కలిగి ఉంటుంది. వాటిలో –ఆధారితరాడార్, భారతదేశం అభివృద్ధి చేసిన మిషన్‌ కంప్యూటర్‌ ఉన్నాయి. ఈ చర్య సూపర్‌–30 ప్రోగ్రామ్‌తో సారూప్యతను కలిగి ఉంది,. భారత వైమానిక దళం (IAF) Su-57E ని దేశీయంగా అభివృద్ధి చేసిన ఎయిర్‌–టు–ఎయిర్, ఎయిర్‌–టు–సర్ఫేస్‌ ఆయుధ వ్యవస్థలతో సన్నద్ధం చేయడానికి వీలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రక్షణ తయారీలో భారతదేశం స్వావలంబన దిశగా చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుంది. Su-57E సమర్పణ సూపర్‌–30 జెట్‌ సాంకేతిక చట్రంపై ఆధారపడి ఉంటుంది. ఇది IAF Su–30MKI విమానాల అప్‌గ్రేడ్‌ వెర్షన్‌. గాలియం నైట్రైడ్‌ ఆధారిత యాక్టివ్‌ ఎలక్ట్రానిక్‌ స్కాన్డ్‌ అర్రే  రాడార్, ఇండియన్‌ మిషన్‌ కంప్యూటర్‌ ఇండక్షన్‌ Su-57E సామర్థ్యాలను మెరుగుపరచడమే కాకుండా సూపర్‌–30 జెట్‌లతో సారూప్యతను నిర్ధారించడం ద్వారా నిర్వహణ, కార్యాచరణ లాజిస్టిక్‌లకు ఉపయోగపడుతుంది.ఈ అనుసంధానం Su-57E భారత సంతతికి చెందిన ఆయుధాలను దృశ్య పరిధికి మించి గాలి నుంచిì∙గాలికి క్షిపణి, గాలి నుంచి∙ఉపరితల క్షిపణి వంటి వాటిని మోసుకెళ్లడానికి అనుమతిస్తుంది. ఇది విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. మేక్‌ ఇన్‌ ఇండియా చొరవతో సమకాలీకరించడం జరిగింది. భారతదేశం కోరుకుంటే, తన అవసరానికి అనుగుణంగా Su-57E లో మార్పులు చేసుకోవచ్చని రష్యా చెబుతోంది. సుఖోయ్‌ యుద్ధ విమానాలను తయారు చేసే కంపెనీలు కూడా దీనిని తయారు చేయగలవు. రష్యా కూడా తన సోర్స్‌ కోడ్, టెక్నాలజీని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ ఐదవ తరం ఫైటర్‌ జెట్‌ ఐదవ తరం స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌ కలిగి ఉండవలసిన అన్ని లక్షణాలతో అమర్చబడి ఉంది. దీనికి స్టీల్త్‌ డిజైన్‌ ఉంది. దీని కారణంగా ఆధునిక రాడార్ల ద్వారా దీనిని గుర్తించడం కష్టం. దీని రాకను శత్రువులు సైతం గుర్తించలేవు. ఈ ఫైటర్‌ జెట్‌లో అమర్చిన R–37M క్షిపణులు 400 కి.మీ. పరిధిని కలిగి ఉంటాయి. గురి పెట్టగలదు. ఇది రాఫెల్‌ కంటే ప్రాణాంతకమైన యుద్ధ విమానం అని రష్యా చెబుతోంది.

]]>
Tue, 03 Jun 2025 19:40:54 +0530 admin
పాక్ లో భూకంపం .. తప్పించుకున్న 200లకు పైగా ఖైదీలు https://prajakshethrenews.com/పాక్-లో-భూకంపం-తప్పించుకున్న-200లకు-పైగా-ఖైదీలు https://prajakshethrenews.com/పాక్-లో-భూకంపం-తప్పించుకున్న-200లకు-పైగా-ఖైదీలు
పాక్ లో భూకంపం .. తప్పించుకున్న 200లకు పైగా ఖైదీలు
ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ జూన్ 3
;పాకిస్థాన్‌లోని బఛా జైలు పరిసర ప్రాంతంలో భూకంపం రావడంతో 200లకు పైగా ఖైదీలు  తప్పించుకున్నారు. సోమవారం ఇక్కడ మూడుసార్లు భూమి కంపించింది. దీంతో జైలులోని కొన్ని గోడలకు పగుళ్లు రాగా.. కొన్ని కూలిపోయాయి. ఈ క్రమంలో 600 నుంచి వెయ్యి మంది ఖైదీలను బ్యారక్‌ల నుంచి వేరే ప్రాంతానికి అధికారులు తరలిస్తుండగా.. ఖైదీలు తప్పించుకున్నారు.  పలువురు అధికారుల వద్ద ఉన్న తుపాకులు తీసుకొని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక ఖైదీ మృతి చెందగా.. నలుగురు అధికారులు గాయపడ్డారు.ఖైదీల పరారీతో అప్రమత్తమైన అధికారులు తిరిగి ఖైదీలను పట్టుకొనేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ 80 మందిని పట్టుకున్నామని.. అందుకు స్థానికుల సహాయం తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ జైలులో ఎక్కువ శాతం మాదకద్రవ్యాల సంబంధిత కేసుల్లోని నేరస్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారని మరో అధికారి తెలిపారు. పారిపోయిన వారిలో డ్రగ్స్ నేరస్థులు, మానసికంగా సరిగా లేని వారే అని ఎక్కవు ఉన్నారన్నారు.

]]>
Tue, 03 Jun 2025 17:31:05 +0530 admin
సిక్కింలో దారుణం.. అసలు ఏమి జరిగిందంటే? https://prajakshethrenews.com/సిక్కింలో-దారుణం-అసలు-ఏమి-జరిగిందంటే https://prajakshethrenews.com/సిక్కింలో-దారుణం-అసలు-ఏమి-జరిగిందంటే సిక్కింలో దారుణం.. విరిగిపడిన కొండచరియలు. .
      ముగ్గురు సైనికులు మృతి.. ఆరుగురు మిస్సింగ్
ప్రజా క్షేత్ర్, సిక్కిం, జూన్ 2 : 

ప్రకృతి ప్రకోపానికి సిక్కింలో దారుణం చోటు చేసుకుంది. మాగాన్ జిల్లాలోని లాచన్ నగరంలో ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో కొండచరియలు విరిగి ఆర్మీ కాంప్‌‌పై పడ్డాయి. ఈ దుర్ఘటనలో ముగ్గుర సైనికులు మృతి చెందగా.. మరో ఆరుగురు ఆచూకీ దొరకడం లేదు. మృతి చెందిన వ్యక్తులు హవల్దార్ లఖ్వీందర్ సింగ్, లాన్స్ నాయక్ మునీష్ ఠాకూర్, పోర్టర్ అభిషేక్ లఖడాగా గుర్తించారు. మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టంకి తరలించారు. గల్లంతైన ఆరో ఆరుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన ముగ్గురు సైనికులకు భారత ఆర్మీ సంతాపం తెలియజేసింది.

]]>
Mon, 02 Jun 2025 20:47:25 +0530 admin
మూడేండ్లలో మళ్ళీ కేసీఆరే తెలంగాణ ముఖ్యమంత్రి : కేటీ ఆర్ https://prajakshethrenews.com/మూడేండ్లలో-మళ్ళీ-కేసీఆరే-తెలంగాణ-ముఖ్యమంత్రి-కేటీ-ఆర్ https://prajakshethrenews.com/మూడేండ్లలో-మళ్ళీ-కేసీఆరే-తెలంగాణ-ముఖ్యమంత్రి-కేటీ-ఆర్ ఓడిపోయినా తెలంగాణను ప్రేమించడంలో ఎప్పుడూ ముందున్నాం
* మూడేండ్లలో కేసీఆర్‌ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారు
 * మిమ్మల్ని చూసి తెలంగాణ గడ్డ గర్విస్తున్నది.
 * ఖండాలను దాటి తెలంగాణ నైపుణ్యాన్ని చాటిన మీ అందరికీ వందనం.
* పుట్టిన గడ్డకు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా బతుకమ్మను మరచిపోలేదు.
* బతుకును ఇచ్చిన తెలంగాణను మీరు మరచిపోలేదు.
* అమెరికాలోని డాలస్‌ నగరంలో రాష్ట్ర ఆవిర్భావ సంబురాలలలో కేటిఅర్
 ప్రజా క్షేత్ర్, డాలస్, జూన్  2 :
నాలుగు కోట్ల మంది కోసం మహాత్ముని స్ఫూర్తిగా తెలంగాణ కలగన్న కేసీఆర్‌.. ఒకే ఒక్కడిగా బయల్దేరారని, ఎన్నో అవమానాలను అధిగమించి తెలంగాణను సాధించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌   అన్నారు. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే.. దశాబ్దాలుగా కొట్లాడితే తెలంగాణ వచ్చిందని చెప్పారు. పోరాడి సాధించిన యోధుడు ముఖ్యమంత్రిగా ఉండటంతో అదే కసి.. స్ఫూర్తితో పనిచేశామన్నారు. 2023లో ఓడిపోయినా తెలంగాణను ప్రేమించడంలో ఎప్పుడూ ముందున్నామని చెప్పారు. మూడేండ్లలో కేసీఆర్‌ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని వెల్లడించారు. అమెరికాలోని డాలస్‌ నగరంలోని డాక్టర్‌ పెప్పర్‌ ఎరీనాలో రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు, బీఆర్‌ఎస్‌ రజతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఎన్నారైలు పెద్దసంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమానికి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంర్భంగా మాట్లాడుతూ.. ‘ మిమ్మల్ని చూసి తెలంగాణ గడ్డ గర్విస్తున్నది. ఖండాలను దాటి తెలంగాణ నైపుణ్యాన్ని చాటిన మీ అందరికీ వందనం. తెలంగాణకు ప్రతీకగా నిలిచిన మీ అందరికీ అభివందనం. అమెరికాలోని తెలంగాణవాసులను చూసి తెలంగాణ తల్లి గర్విస్తున్నది. పుట్టిన గడ్డకు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా బతుకమ్మను మరచిపోలేదు. బతుకును ఇచ్చిన తెలంగాణను మీరు మరచిపోలేదు. దశాబ్ద కాలంగా ఎలాంటి ఉత్సాహం కనిపించిందో ఇప్పుడూ అలాగే కనబడుతున్నది. నిన్నటి వరకు తెలుగు వారికి రెండు రాష్ట్రాలే ఉన్నాయి అనుకున్నా.. కానీ నాకు నిన్ననే అర్థం అయింది మనకి రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయని.. అది టెక్సాస్‌లో ఉందని.
అమెరికాలో ఉన్నట్లు ఎంతమాత్రం అనిపించడం లేదు. 2015లో పెట్టుబడుల కోసం అమెరికాలో తిరుగుతూ డాలస్‌కు వచ్చాం. పదేండ్ల తర్వాత ఇక్కడకు వచ్చి చూస్తే కేసీఆర్‌ దూతలుగా ఎన్నో చేసి చూపించారు. జీవితంలో ఎన్నో కలలు కంటారు. కొందరు వాటిని సాకారం చేసుకుంటారు. 2001లో నాలుగు కోట్ల మంది కోసం మహాత్ముని స్ఫూర్తిగా కేసీఆర్‌ తెలంగాణ కలగన్నారు. ఒకే ఒక్కడిగా బయల్దేరారు. ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్డండన్నారు. శూన్యం నుంచి బయల్దేరి అందరినీ ఏకం చేసి తెలంగాణను సాధించారు. విదేశీ గడ్డపైనా జై తెలంగాణ అని నినదించారు. ఎన్నో అవమానాలను అధిగమించి తెంగాణను సాధించారు. మేం బాధ్యతగా భావించడంతోనే అనితర సాధ్యమైన విజయాలు చేకూరాయి. స్వరాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా నిలుపుకోవడంలో ఏ అవకాశాన్ని వదులుకోలేదు. 2023లో ఓడిపోయినా తెలంగాణను ప్రేమించడంలో ఎప్పుడూ ముందున్నాం. మళ్లీ మూడేండ్లలో తిరిగి బిడ్డ తెలంగాణ తల్లి వద్దకు చేరుతుంది. మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారు. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే.. దశాబ్దాలుగా కొట్లాడితే తెలంగాణ వచ్చింది. పోరాడి సాధించిన యోధుడు ముఖ్యమంత్రిగా ఉండటంతో అదే కసి.. స్ఫూర్తితో పనిచేశామని చెప్పుకొచ్చారు..

]]>
Mon, 02 Jun 2025 16:37:51 +0530 admin
కరడుగట్టిన ఉగ్రవాదులు మసూద్‌ అజార్‌, హఫీజ్‌ సయీద్‌ను అప్పగించండి : పాక్‌కు రాజ్‌నాథ్‌ కీలక హెచ్చరికలు https://prajakshethrenews.com/కరడుగట్టిన-ఉగ్రవాదులు-మసూద్-అజార్-హఫీజ్-సయీద్ను-అప్పగించండి-పాక్కు-రాజ్నాథ్-కీలక-హెచ్చరికలు https://prajakshethrenews.com/కరడుగట్టిన-ఉగ్రవాదులు-మసూద్-అజార్-హఫీజ్-సయీద్ను-అప్పగించండి-పాక్కు-రాజ్నాథ్-కీలక-హెచ్చరికలు కరడుగట్టిన ఉగ్రవాదులు మసూద్‌ అజార్‌, హఫీజ్‌ సయీద్‌ను అప్పగించండి..
                            పాక్‌కు రాజ్‌నాథ్‌ కీలక హెచ్చరికలు
ప్రజా క్షేత్ర్,  న్యూ డిల్లీ :
ఆప‌రేష‌న్ సిందూర్ అనేది కేవ‌లం సైనిక చ‌ర్య మాత్రమే కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌   అన్నారు. అది ఉగ్రవాదంపై మూకుమ్మడి దాడి అని పేర్కొన్నారు. పాక్ ఉగ్రవాదుల‌ను నాశ‌నం చేసేందుకు ఏ ప‌ద్ధతినైనా అనుస‌రిస్తామ‌న్నారు. పాక్ ఊహించ‌లేని ప‌ద్ధతుల్లో ఆ చ‌ర్యలు ఉంటాయ‌ని తీవ్రంగా హెచ్చరించారు. స్వాతంత్ర్యం వ‌చ్చిన నాటి నుంచి పాకిస్థాన్ ఆడుతున్న ప్రమాద‌క‌ర ఉగ్రవాద ఆట ఇప్పుడు ముగిసింద‌ని వ్యాఖ్యానించారు.యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ర‌క్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ సంద‌ర్శించారు. ఈ సందర్భంగా పాక్‌  కు కీలక హెచ్చరికలు జారీ చేశారు. తమ గడ్డపై ఉగ్రవాదాన్ని పాకిస్థాన్‌ నిర్మూలించాలని హెచ్చరించారు. పాకిస్థాన్‌ చర్చలకు సిద్ధంగా ఉంటే ముందు ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలన్నారు. కరడుగట్టిన టెర్రరిస్ట్‌లు మసూద్‌ అజార్  ‌, హఫీజ్‌ సయీద్‌  ను భారత్‌కు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. భారత నౌకాదళం పరాక్రమాన్ని పాకిస్థాన్‌ ఇంకా చూడలేదని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. స‌మ‌గ్రమైన రీతిలో సాగిన ఆప‌రేష‌న్‌లో భార‌తీయ నౌకాద‌ళ పాత్ర కూడా అద్భుత‌మైంద‌ని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. పాకిస్థానీ నేల‌పై ఉన్న ఉగ్ర స్థావ‌రాల‌ను ఐఏఎఫ్ ధ్వంసం చేస్తే, ఆరేబియా స‌ముద్రంలో ఉన్న భార‌త యుద్ధ నౌక‌లు.. పాకిస్థానీ నేవీని తీరానికి ప‌రిమితం చేశాయ‌న్నారు.

]]>
Fri, 30 May 2025 19:05:05 +0530 admin
ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ పై హ‌త్యాయ‌త్నం!? https://prajakshethrenews.com/రష్యా-అధ్యక్షుడు-వ్లాదిమిర్-పుతిన్-పై-హత్యాయత్నం https://prajakshethrenews.com/రష్యా-అధ్యక్షుడు-వ్లాదిమిర్-పుతిన్-పై-హత్యాయత్నం ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ పై హ‌త్యాయ‌త్నం!?
    హెలికాప్ట‌ర్‌పై డ్రోన్ల దాడి జ‌రిగిన‌ట్లు ఊహాగానాలు
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్ :
 ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. పుతిన్ ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్‌పై డ్రోన్ల దాడి జ‌రిగిన‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వ‌స్తున్న డ్రోన్ల మ‌ధ్య‌లో పుతిన్ హెలికాప్ట‌ర్ చిక్కుకున్న‌ట్లు చెప్పారు. అయితే ఆ దాడి నిజ‌మే అని ఎయిర్ డిఫెన్స్ డివిజ‌న్ క‌మాండ‌ర్ యురీ దాస్కిన్ తెలిపారు.గ‌త మంగ‌ళ‌వారం కుర్క్స్ ప్రాంతంలో పుతిన్ ప‌ర్య‌టించారు. ఏప్రిల్‌లో ఉక్రెయిన్ ద‌ళాల నుంచి ఆ ప్రాంతం విముక్తి పొందింది. ఈ నేప‌త్యంలో ఆ ప్రాంతాన్ని పుతిన్ విజిట్ చేశారు. త‌న ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ అలెగ్జాండ‌ర్ కిన్షెటిన్‌ను క‌లివారు. అయితే ఆ స‌మ‌యంలో ఉక్రెయిన్ డ్రోన్లు.. పుతిన్ హెలికాప్ట‌ర్‌ను టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.ఛాన‌ల్ ర‌ష్యా 1కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. శ‌త్రు దేశం డ్రోన్లతో దాడి చేసింద‌ని, ఆ దాడి స‌మ‌యంలో పుతిన్ త‌న హెలికాప్ట‌ర్‌లో ఉన్నార‌ని, స‌మ‌ర్థ‌వంతంగా త‌మ ద‌ళాలు ఆ డ్రోన్ దాడిని తిప్పికొట్టిన‌ట్లు క‌మాండ‌ర్ దాస్కిన్ తెలిపారు. కుర్క్స్ ప్రాంతంలో పుతిన్ ప‌ర్య‌టిస్తున్న స‌మ‌యంలో.. అసాధార‌ణ రీతిలో యూఏవీల‌ను ఉక్రెయిన్ వ‌ద‌లింది. అయితే త‌మ ద‌ళాలు 46 యూఏవీల‌ను కూల్చిన‌ట్లు ర‌ష్యా క‌మాండ‌ర్ పేర్కొన్నారు.డ్రోన్ల దాడి స‌య‌మంలో త‌మ వైమానిక ర‌క్ష‌ణ ద‌ళాలు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ కంబాట్ విన్యాసాలు నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. ప్రెసిడెంట్ హెలికాప్ట‌ర్ క్షేమంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. శ‌త్రు డ్రోన్ల‌ను తిప్పికొట్టామ‌ని, ఏరియ‌ల్ టార్గెట్ల‌ను పేల్చివేసిన‌ట్లు దాస్కిన్ తెలిపారు. మంగ‌ళ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు సుమారు 764 ఉక్రెయిన్ డ్రోన్ల‌ను నేల‌కూల్చిన‌ట్లు ర‌ష్యా పేర్కొన్న‌ది. శనివారం, ఆదివారం కూడా వంద‌ల సంఖ్య‌లో మాన‌వ‌ర‌హిత వైమానిక వాహ‌నాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు చెప్పారు. యూకే, ఫ్రాన్స్, జ‌ర్మ‌నీ, ఈయూ దేశాల స‌హ‌కారంతో ర‌ష్యాపై దాడుల‌కు ఉక్రెయిన్ తెగిస్తున్న‌ట్లు విదేశాంగ మంత్రి తెలిపారు.

]]>
Mon, 26 May 2025 20:10:44 +0530 admin
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావుకు అమెరికాలో చుక్కెదురు https://prajakshethrenews.com/ఫోన్-ట్యాపింగ్-కేసులో-ఎస్ఐబీ-మాజీ-చీఫ్-ప్రభాకర్-రావుకు-అమెరికాలో-చుక్కెదురు https://prajakshethrenews.com/ఫోన్-ట్యాపింగ్-కేసులో-ఎస్ఐబీ-మాజీ-చీఫ్-ప్రభాకర్-రావుకు-అమెరికాలో-చుక్కెదురు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావుకు అమెరికాలో చుక్కెదురు
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్
;తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావుకు అమెరికాలో చుక్కెదురైంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక సూత్రధారైన ప్రభాకర్‌ రావు అమెరికాలో ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో అతన్ని ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర సహకారం తీసుకున్న రాష్ట్ర పోలీసులు.. ప్రభాకర్ రావును రప్పించేందుకు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావు అమెరికా కోర్టును ఆశ్రయించాడు. రాజకీయ కక్షలో భాగంగా తనపై కేసులు పెట్టారని.. కాబట్టి, తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే జూన్‌ 20లోగా కోర్టులో హాజరు కావాలంటూ ప్రభాకర్ రావుకు నోటీసులు జారీ చేసింది.

]]>
Mon, 26 May 2025 19:29:39 +0530 admin
4వ ఆర్థిక శక్తిగా భారత్ https://prajakshethrenews.com/4వ-ఆర్థిక-శక్తిగా-భారత్ https://prajakshethrenews.com/4వ-ఆర్థిక-శక్తిగా-భారత్ 4వ ఆర్థిక శక్తిగా భారత్
* జపాన్‌ను వెనక్కి నెట్టిన ఇండియా భారత్ కన్నా ముందున్న
* అమెరికా, చైనా, జర్మనీ నీతి ఆయోగ్ ప్రకటన
* మరోరెండేళ్లలో మూడో స్థానానికి ఎగబాకే అవకాశం
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
 భారతదేశం ఇప్పుడు 4వ అతి పెద్ద ఆర్థి క శక్తివంత దేశంగా అవతరించిందని నీతి ఆయో గ్ కార్యనిర్వాహణాధికారి (సిఇఒ) బివిఆర్ సుబ్రమణ్యం తెలిపారు. ఈ కీలక మైలురాయి సాధన దిశలో మనం జపాన్‌ను వెనకకు నెట్టివేశామని వివరించారు. ఇది మనకు మనం చెప్పుకునే ప్రగ తి కాదని, ఐఎంఎప్ ఇతర అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు వెలువరించిన తాజా గణాంకాల, నివేదికల క్రమంలో వెలుగులోకి వచ్చిన సత్యం అని వివరించారు. తాను ఈ ప్రగతి పథం గురించి వివరిస్తున్న దశలో మన ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో బలోపేతంగా ఉందని తెలిపారు.ఇది మన నాలుగవ స్థానాన్ని నిర్థారించింది. ఇం తటితో ఆగిపోకుండా మనకు అన్ని రకాలుగా భౌ గోళిక రాజకీయ, ఆర్థిక అనుకూల పరిస్థితులు పలు విధాలుగా ఊతం ఇస్తున్నాయని సిఇఒ చె ప్పారు. అమెరికా, చైనా, జర్మనీ తరువాతి స్థానం మనదే అని, ఈ ప్రగతి పథం వేగం మరింత ఇనుమడిస్తే ఇక మనం వచ్చే రెండేళ్లలోనే మూడవ ఆర్థిక శక్తివంత దేశంగా నిలుస్తామని తెలిపారు. గత ఏడాది చివరి వరకూ ఇండియా జపాన్ కన్నా వెనుక ఉండి, ఐదవ ఆర్థిక శక్తిగా జాబితాలో ఉం ది. అయితే జపాన్‌ను మనం తోసిరాజన్నామని తెలిపారు. ఎప్రిల్‌లో ఐఎంఎఫ్, వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ సంస్థల నివేదిక వెలువడింది. ఇందులో ఇండియా నాలుగవ ఆర్థిక శక్తి కానుందని తెలిపారని గుర్తు చేశారు. దేశ జిడిపి ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో 4.187 బిలియన్ డాలర్లు దాటుతుంది. ఇది జపాన్ ఆర్థిక శక్తిని దాటేయడం కిం దికి తీసుకోవచ్చు. ఇక తలసరి ఆదాయం క్రమంలో భారతదేశ వివరాలు ఐఎంఎఫ్ డేటా ప్రకారం చూస్తే ఏడాదిలో రెండింతలు అయింది. పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల విశ్వసనీయ ప్రతిష్టాత్మక నివేదికలలో కూడా భారత్ అజేయ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న వైనం స్పష్టం అవుతోందని సిఇఒ తెలిపారు.ఐఎంఎఫ్ తమ ప్రపంచ ఆర్థిక .పరిస్థితి నివేదికలో భారతదేశ ఆర్థిక రంగం 2025 26 ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం ఎదుగుదల ఉంటుందని విశ్లేషించింది. నిర్ణీత ఆరున్నర శాతంతో పోలిస్తే కొద్దిగా మందగమనం ఉంటున్నప్పటికీ పరిస్థితి ద్విగుణీకృత రీతిలో ఉందని తెలిపారని సిఇఒ చెప్పారు. ఈ విషయాలన్నింటిని సిఇఒ ఇటీవలి నీతి ఆయోగ్ భేటీలో పమర్పించిన వికసిత్ రాజ్య వికసిత్ భారత్ @2047 నివేదికలో తెలిపారు. ఇంతకు ముందటి వరకూ బలహీన స్థాయి ఐదవ ఆర్థిక శక్తిగా మన దేశందశాబ్ధ కాలంలో బలీయ ఆర్థిక శక్తివంత దేశంగా ఎదిగింది. ఇది ఇప్పుడు నాలుగో అతి పెద్ద ఆర్థిక శక్తిగా మారడం తిరుగులేని విజయం అని నీతి ఆయోగ్ నిర్వాహక అధికారి వివరించారు. ఇక భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్ణీత 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుని తీరుతుందని వివరించారు.
క్రెడిట్ మోడీదే: కేంద్ర మంత్రి జితేంద్ర
భారత్ ఇప్పుడు జపాన్‌ను దాటేసి, నాలుగో ఆర్థిక శక్తివంత దేశం అయిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఆదివారం జమ్మూకు వచ్చిన ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోడీ 11 సంవత్సరాల పాలనలో సాధించిన సత్ఫలితాలు, సాగిన ప్రగతి ప్రతిఫలంగానే ఇప్పుడు భారత్ ఈ విశిష్టతను సాధించామని మంత్రి తెలిపారు. జాతికి ఇంతటి ఖ్యాతి తెచ్చిపెట్టిన ఘనత ఆయనదే అన్నారు.నీతి ఆయోగ్ నివేదిక క్రమంలో భారత్ ప్రగతి పథం గురించి ప్రపంచానికి తెలిసింది. మన రక్షణ వ్యవస్థను మనం తీర్చిదిద్దుకున్నామని, 2014లో అధికారంలోకి వచ్చినప్పటి పరిస్థితితో పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్షం భారత్‌కు కీలకం అని, ఈ దిశలోనే మనం ముందుకు సాగుతున్నామని , ఇప్పుడు మ నం సంపాదించుకున్న 4వ ర్యాంకుతో తేటతెల్లం అయిందని మంత్రి విశ్లేషించారు. నీతి ఆయోగ్ సిఇఒ సుబ్రహమణ్యం వెలువరించిన నివేదికలోని అం శాలు భారతీయులందరికీ సంతోషదాయకం అన్నారు. అన్నింటికి ముందు ఈ శుభవార్త పట్ల తాను ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియచేస్తున్నానని ప్రధా న మంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి అయిన జితేంద్ర సింగ్ చెప్పారు.

]]>
Mon, 26 May 2025 18:47:28 +0530 admin
పాకిస్థాన్ కు భారత్ ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్ https://prajakshethrenews.com/పాకిస్థాన్-కు-భారత్-ప్రధాని-మోదీ-సీరియస్-వార్నింగ్ https://prajakshethrenews.com/పాకిస్థాన్-కు-భారత్-ప్రధాని-మోదీ-సీరియస్-వార్నింగ్ పాకిస్థాన్ కు భారత్ ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్ 

]]>
Mon, 12 May 2025 23:09:36 +0530 admin
*మోదీ సంచలన ప్రకటన* https://prajakshethrenews.com/మోదీ-సంచలన-ప్రకటన https://prajakshethrenews.com/మోదీ-సంచలన-ప్రకటన *మోదీ సంచలన ప్రకటన*

*పి ఓ కే, ఉగ్రవాదులను అప్పగిస్తే చర్చలకు సిద్ధం*: *మోదీ*

పాక్ కాల్పులు జరిపితే భారత్ కూడా ప్రతి దాడి చేయాలని త్రివిధ దళాలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాక్ కాల్పులు జరిపితే భారత్ కూడా ప్రతి దాడి తప్పక చేస్తుందని తేల్చి చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు, ఉగ్రవాదులను అప్పగించడం తప్ప మరే అంశం చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయంలో మరే దేశ జోక్యానికి ఒప్పుకోబోమన్నారు.

]]>
Sun, 11 May 2025 17:08:45 +0530 admin
*ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన..!* https://prajakshethrenews.com/ఆపరేషన్-సిందూర్ను-ఆపలేదు-ఇండియన్-ఎయిర్-ఫోర్స్-సంచలన-ప్రకటన https://prajakshethrenews.com/ఆపరేషన్-సిందూర్ను-ఆపలేదు-ఇండియన్-ఎయిర్-ఫోర్స్-సంచలన-ప్రకటన *ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన..!*

యుద్ధంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన చేసింది.. ఆపరేషన్ సింధూర్ ఆప లేదని ఇండియన్ ఫోన్స్ ఎక్స్ లో తెలిపింది.. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని పేర్కొంది. త్రివిధ దళాలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన చేసింది. ఇప్పటికే, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాకిస్తాన్‌కు వాళ్ల స్టయిల్‌ లోనే మోదీ ప్రభుత్వం బుద్ధి చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. అప్పగించిన పనిని బాధ్యతగా విజయవంతం చేశామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసింది. ఆపరేషన్ సిందూర్‌పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మ వద్దని భారతీయ వాయు సేన పేర్కొంది. శనివారం కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట పాకిస్తాన్ కాల్పులకు తెగించింది. దీంతో, భారత్ పాకిస్తాన్ వైఖరిని ఖండించింది. ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఈ రోజు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, సీడీఎస్, త్రివిధ దళాధిపతులతో సమావేశమైయ్యారు. ఈ సమావేశం అనంతరం ఎయిర్ ఫోర్స్ ఇలా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది..

]]>
Sun, 11 May 2025 15:56:42 +0530 admin
రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేసిన రాహల్​గాంధీ పై మండి పడ్డ ప్రశాంత్​ కిషోర్​ https://prajakshethrenews.com/రిజర్వేషన్లపై-కీలక-వ్యాఖ్యలు-చేసిన-రాహల్గాంధీ-పై-మండి-పడ్డ-ప్రశాంత్-కిషోర్ https://prajakshethrenews.com/రిజర్వేషన్లపై-కీలక-వ్యాఖ్యలు-చేసిన-రాహల్గాంధీ-పై-మండి-పడ్డ-ప్రశాంత్-కిషోర్ రాహుల్​గాంధీ ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో అతనికే తెలియదు : ప్రశాంత్​ కిషోర్​ 

రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేసిన రాహల్​గాంధీ పై మండి పాటు

ప్రజాక్షేత్ర్ , నేషనల్​ బ్యూరో

రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై జాన్ సూరాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ గురువారం మండిపడ్డారు. కొన్ని నెలల క్రితం కోటా పెంపుదలకు గాంధీ మొగ్గుచూపారని, అయితే ఇప్పుడు రిజర్వేషన్లు తొలగించడం గురించి మాట్లాడుతున్నారని కిషోర్ అన్నారు. ఏ సమయంలో ఏం మాట్లాడతారో రాహుల్ గాంధీకే తెలియదని అన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికా పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.  జార్జ్‌టౌన్ యూనివర్శిటీ విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “భారతదేశం న్యాయమైన ప్రదేశం” అయినప్పుడు రిజర్వేషన్‌లను రద్దు చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తుందని, ప్రస్తుతం అది కాదన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత విరుద్ధమైన వైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై జాన్ సూరాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ గురువారం మండిపడ్డారు. కొన్ని నెలల క్రితం కోటా పెంపుదలకు గాంధీ మొగ్గుచూపారని, అయితే ఇప్పుడు రిజర్వేషన్లు తొలగించడం గురించి మాట్లాడుతున్నారని కిషోర్ అన్నారు.ఏది ఏమైనప్పటికీ, అతని వ్యాఖ్య "రిజర్వేషన్‌కు వ్యతిరేకం" అని బీజేపీ ఆరోపించడంతో ఇంటింటికి తిరిగి తీవ్ర స్పందన వచ్చింది. “కొన్ని నెలల క్రితం, అతను కుల జనాభా గణనకు అనుకూలంగా మాట్లాడాడు...రిజర్వేషన్లు పెంచాలి. ఇప్పుడు అమెరికా వెళ్లి రిజర్వేషన్లు ఎత్తివేయాలని మాట్లాడుతున్నాడు... ఎన్నికల వరకు కుల గణన జరగాలని, అవసరమైతే రిజర్వేషన్లు పెంచాలని రాహుల్ గాంధీ ఎప్పటినుంచో చెబుతుంటారని, ఇప్పుడు తన ప్రకటన ఎందుకు మార్చారో, సహచర కాంగ్రెస్ నేతలే చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలావుండగా, రిజర్వేషన్ అంశంపై రాహుల్ గాంధీ అభిప్రాయానికి, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ అభిప్రాయాలకు తేడా లేదని కాంగ్రెస్ సమర్థించింది. "సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు దూరంగా ఉన్నంత వరకు, రిజర్వేషన్లు కొనసాగాలని కాంగ్రెస్ విశ్వసిస్తుందని, బాబా సాహెబ్ కూడా అదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు" అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హరీష్ రావత్ అన్నారు.

]]>
Fri, 13 Sep 2024 01:40:09 +0530 admin