Prajakshethre News & : ఆంధ్రప్రదేశ్ https://prajakshethrenews.com/rss/category/ఆంధ్రప్రదేశ్-వార్తలు Prajakshethre News & : ఆంధ్రప్రదేశ్ en Copyright 2024 Prajakshethre News & All Rights Reserved. ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌...నేటినుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు ఓపెన్ https://prajakshethrenews.com/ఏపీలో-మందుబాబులకు-గుడ్న్యూస్నేటినుంచి-రాత్రి-12-గంటల-వరకు-బార్లు-ఓపెన్ https://prajakshethrenews.com/ఏపీలో-మందుబాబులకు-గుడ్న్యూస్నేటినుంచి-రాత్రి-12-గంటల-వరకు-బార్లు-ఓపెన్ ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌..
నేటినుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు ఓపెన్
ప్రజా క్షేత్ర్, అమరావతి సెప్టెంబర్ : 
; ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. ఇవాల్టి నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉండనున్నాయి. ఈ మేరకు నూతన బార్‌ పాలసీ అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పాలసీ 2008 వరకు మూడేళ్ల కాలం అమలులో ఉండనుంది.గతంలో ఉన్న బార్‌ పాలసీ ప్రకారం.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటలకు బార్లను తెరిచి ఉంచాల్సి ఉంటుంది. కానీ నూతన విధానం ద్వారా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లను తెరిచి ఉంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త బార్‌ పాలసీని అమలు చేస్తూ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ నిశాంత్‌ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఈ ఉత్తర్వుల్లో భాగంగా 10 శాతం మద్యం షాపులను కల్లు గీత కులాలకు కేటాయించిన సంగతి తెలిసిందే.

]]>
Tue, 02 Sep 2025 00:10:59 +0530 admin
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీ https://prajakshethrenews.com/సచివాలయంలో-సీఎం-చంద్రబాబు-అధ్యక్షతన-రాష్ట్రస్థాయి-బ్యాంకర్ల-కమిటీ-భేటీ https://prajakshethrenews.com/సచివాలయంలో-సీఎం-చంద్రబాబు-అధ్యక్షతన-రాష్ట్రస్థాయి-బ్యాంకర్ల-కమిటీ-భేటీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీ


ప్రజా క్షేత్ర్, అమరావతి :

 సచివాలయం 5 బ్లాక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అధ్యక్షత రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి న సీఎస్ కే.విజయానంద్, ఎస్ఎల్ బీసీ ఛైర్మన్ నితీష్ రంజన్, కేంద్ర ఆర్ధిక విభాగం, ఆర్బీఐ, నాబార్డు, సిడ్బీ, ఎగ్జిమ్  బ్యాంక్ ఇతర బ్యాంకుల ప్రతినిధులు, ఉన్నతాధికారులు హజరయ్యారు. ఖరీఫ్ సీజన్లో  రూ.1,80,540 కోట్ల రుణ లక్ష్యానికిగానూ  జూన్ నాటికి రూ.94,666 కోట్ల మేర రుణాలను  బ్యాంకులు ఇచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు రూ.985 కోట్ల రుణాల్ని బ్యాంకులు మంజూరు చేశాయి. ఎంఎస్ఎంఈ రంగానికి రూ.49,831 కోట్ల రుణం మంజూరు చేసాయి. విద్యారంగానికి రూ.252 కోట్లు, హౌసింగ్ కు రూ.1,146 కోట్ల రుణాలు మంజూరు చేసాయి. పునరుద్పాదక ఇంధన రంగానికి రూ.125 కోట్ల మేర రుణ మంజూరు, స్వయం సహాయ సంఘాలకు రూ.5,937 కోట్ల రుణాన్ని ఇచ్చాయి. ముద్రా రుణాల కింద రూ.3189 కోట్లు మంజూరు చేసాయి.

]]>
Wed, 27 Aug 2025 21:00:33 +0530 admin
కలవరపెడుతున్న కొత్త బార్ పాలసీ!!! https://prajakshethrenews.com/కలవరపెడుతున్న-కొత్త-బార్-పాలసీ https://prajakshethrenews.com/కలవరపెడుతున్న-కొత్త-బార్-పాలసీ కలవరపెడుతున్న కొత్త బార్ పాలసీ!!!
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బార్లకి సంబంధించి నూతన మద్యం పాలసీపై యజమానుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది.
ఈ నూతన విధానం వారి ఆర్థిక భద్రతపై, వ్యాపార స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తటస్థంగా చూస్తే, దీని వల్ల ప్రస్తుత బార్ యజమానులకు లాభాలు తగ్గిపోవడమే కాదు, కొత్తగా బిజినెస్ చేయాలనుకొనే వారికి ఎదురయ్యే సమస్యలు కూడా అధికమే.
1. లైసెన్సులు - ఆనిశ్చితి, పెట్టుబడులకు రిస్క్
లాటరీ పద్ధతి: లాటరీ విధానం ప్రవేశపెట్టడం వలన సుదీర్ఘకాలంగా ఈ రంగంలో ఉన్న ప్రస్తుత బార్ యజమానులకు తమ లైసెన్సులు కొనసాగింపును పోగొట్టుకునే ప్రమాదం ఎక్కువైంది.
సంపాదించుకున్న బ్రాండ్ విలువ, కస్టమర్ నెట్వర్క్ ఒక్కరోజులో లాటరీలో అదృష్టం దక్కకపోతే నిరాశే గతి.
• పెరిగిన లైసెన్స్ ఫీజు: జనాభా ఆధారంగా రూ.55లక్షల నుండి రూ.75 లక్షల వరకు లైసెన్స్ ఫీజులను నిర్ణయించడం, చిన్న పట్టణాల్లో బార్లు నిర్వహించే వారికి చాలా చాలా ఇబ్బందికరం.
• ఆస్తుల్లో పెట్టుబడిపై భద్రత లేదు: ఎంత పెద్ద పెట్టుబడి పెట్టినా, లైసెన్స్ పునరుద్ధరణలో మళ్లీ లాటరీ విధానమే అనిశ్చితి రావడంతో బార్ల అభివృద్ధికి విస్తరణకు అర్థం ఉండదు.
2. అనవసర పోటీ
• ప్రస్తుత యజమానులకు కొనసాగింపుపై హామీ లేదు: భారీగా ఖర్చు పెట్టి భవనాలు, ఇంటీరియర్ వెచ్చించిన యజమానులకు మరోసారి లైసెన్స్ దక్కుతుందన్న గ్యారంటీ లేదు. అది లేదంటే, వారి పెట్టుబడి పూర్తిగా నష్టపోతుంది.
• BCలకు 10% రిజర్వేషన్: సామాజిక న్యాయం అవసరమైనదే అయినా, ఇలాంటివి వేగంగా అనుభవజ్ఞులైన వ్యాపారులకు నిస్పృహ కలిగించేలా మారుతున్నాయి. మిగతా 90%కి 10% వారితో పోటీ చాలా ఎక్కువగా మారి నష్టాలను చవిచూసే అవకాశాలు పుష్కలం
3. మార్కెట్ ప్రవేశం కొత్తవారికి కష్టమే
• అధిక పెట్టుబడితో ప్రారంభం: పెద్ద మొత్తంలో లైసెన్స్ ఫీజు, వడ్డీ ఖర్చులు, చెల్లించాల్సిన పన్నులు కొత్తగా రంగంలోకి రావాలనుకునే ‘ప్రవేశికులకు, ఆదిలోనే హంసపాదులుగా మారి తెలియక వ్యాపారంలోకి ప్రవేశించేవారు దివాళ తీయడం ఖాయం!
4. లాభాల క్షీణత
• డిస్ట్రిబ్యూషన్లో ధరల్లో అసమానత: బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా బార్లకు సరఫరా చేసే మద్యం ధరలు, రిటైల్ ఔట్లెట్లకు సరఫరా చేసే ధరలకు పోలిస్తే 10% అధికం ఉంటోంది. దీనివల్ల బార్లకు లాభాల మార్జిన్ తక్కువవుతోంది. వ్యాపార భద్రత తగ్గిపోతోంది.
• ప్రభుత్వానికి మాత్రం అధిక లాభాలు: గతంలో  ప్రభుత్వానికి లైసెన్స్, అప్లికేషన్ ఫీజుల ద్వారా రూ.700 కోట్లు ఆదాయం వస్తే, బార్ల యజమానులకు మాత్రం మరింత ఒత్తిడి, అమ్మకాల్లో మార్జిన్ భారిగా తగ్గిపోయింది.
5. కాలపరిమితి, నిబంధనల్లో స్పష్టత లోపం
• లైసెన్స్ కాలపరిమితి చిన్నదే: మూడు సంవత్సరాల వరకే లైసెన్స్ మంజూరవ్వడం వ్యాపార భవిష్యత్తుపై సందేహాన్ని కలిగిస్తోంది. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో సంవత్సరానికి 40 లక్షలు ఫీజుతో బార్ లైసెన్స్ దొరికినా అక్కడ లాభాలు ఎక్కువగా ఉన్నాయి; ఇక్కడ ఇవ్వబడిన ఫీజుకు అంత లాభదాయకత ఒక్క శాతం కూడా కనిపించడం లేదు.
6. చట్టపరమైన గందరగోళం, బ్యూరోక్రసీ అంతరాయం
• లైసెన్సింగ్ పద్ధతులు స్పష్టంగా తెలియకపోవడం, గుర్తింపు మార్గదర్శకాలు లేదా ప్రామాణిక విధివిధానాల్లో పారదర్శకత లేకపోవడం కొత్తవారిని, ప్రస్తుత యజమానులను బిజినెస్ చేయాలన్న ఉత్సాహాన్ని తగ్గిస్తోంది.
సంక్షిప్తంగా విమర్శాత్మక విశ్లేషణ:
• రెగ్యులర్ వ్యాపారానికి మూల్యం తగ్గిన విధానం ఈపాలసీ. గతంలో గల యజమానులకు పెట్టుబడిపై భద్రత లేదు. నూతన ప్రవేశికులకు తలపోయే పెట్టుబడి, మార్కెట్ ప్రమాణాలు అతిగా ఉన్నాయి. లాభాల మార్జిన్లు తక్కువగా, పోటీ ఎక్కువగా ఉండటంతో ఈ రంగంలో స్థిరత్వం లేదన్న సంగతి సుస్పష్టం.
• నీతిగతంగా, ఆరోగ్య దృష్టికోణం బాగున్నా, వ్యాపార ప్రోత్సాహానికి మాత్రం ఈ పాలసీ బహు దూరంగా ఉంది.
• ప్రాధాన్యత ప్రభుత్వ ఆదాయానికి అధికంగా ఉండటం, వ్యాపారులు, వ్యాపారం చేసే తీరుపై దుష్ప్రభావం చూపేలా మారింది.
చివరగా…
ప్రస్తుతం ఉన్న బార్ యజమానులకు లేదా కొత్తగా రంగంలోకి రావాలనుకొనేవారికి, ఈ పాలసీ రాబోతున్న ఏడాదుల్లో లాభదాయక కార్యకలాపాలు సాగించేందుకు గణనీయమైన ఇబ్బందులు మిగిల్చే అవకాశమే ఎక్కువ. పాలసీ లక్ష్యాలే సరె, కానీ పారదర్శకత లేని నూతన విధానాలు , స్థిరత, వ్యాపారానికివ్వే గౌరవం లేకపోవడం – కొత్త బార్ల వ్యాపారాన్ని మరియు పాత బార్ల వ్యాపారస్థులను  తీవ్రంగా దెబ్బ తీయడం ఖాయం!!!
నాన్ రిఫండబుల్ పాలసీ కింద లాటరీ టోకెన్ ఫీజు వసూలు చేయడం ప్రభుత్వం చేస్తున్న దోపిడీ అని క్షేత్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వం ప్రకటించిన కమీషన్ పాలసీ అమలులో ఉంటుందని గ్యారంటీ లేదు. వైన్ షాపుల యజమానులకు ఇస్తామన్న కమీషన్ ఇవ్వలేదు. ఈ తీరుతో  ప్రభుత్వం మీద అపనమ్మకం పెరుగుతోంది.
 లాభార్జన కోసం మద్యం వ్యాపారుల ప్రయోజనాలను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి..

]]>
Wed, 13 Aug 2025 23:54:24 +0530 admin
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం : ఐదు రోజులపాటు వర్షాలు https://prajakshethrenews.com/వాయువ్య-బంగాళాఖాతంలో-అల్పపీడనం-ఐదు-రోజులపాటు-వర్షాలు https://prajakshethrenews.com/వాయువ్య-బంగాళాఖాతంలో-అల్పపీడనం-ఐదు-రోజులపాటు-వర్షాలు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
ఐదు రోజులపాటు వర్షాలు
ప్రజా క్షేత్ర్, విశాఖపట్నం :
పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని అనుకోని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 24 పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం వుంది. రాగల 48 గంటలలో పశ్చిమ వాయువ్య దిశగా  కదులుతూ ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తిరాలవైపు పయనించే అవకాశం వుంది. అల్పపీడననికి అనుబంధం గా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల ఐదు రోజులలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కోస్తా జిలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం. రాగల 24 గంటల్లో ఎన్ టి ఆర్ , బాపట్ల, గుంటూరు,పల్నాడు జిలాల్లో అత్యంత  భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. ఏలూరు, పశ్చిమగోదావరి, నెల్లూరు, కృష్ణ జిలాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, తిరుపతి జిలాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. రాగల రెండు రోజులలో కోస్తా తీరంలో 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయి. రానున్న ఐదు రోజులు పాటు మత్య్సకారులు వేట కు వెళ్లారాదు. గడిచిన 24 గంటలలో అత్యధికంగా మంగళగిరి 20 సెంటిమిటర్ల వర్షపాతం నమోదు అయింది.

]]>
Wed, 13 Aug 2025 23:43:47 +0530 admin
ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ కి మద్దతుగా నిలవండి : జగ్గారెడ్డి https://prajakshethrenews.com/ఎన్నికల-కమిషన్-కు-వ్యతిరేకంగా-పోరాటం-చేస్తున్న-రాహుల్-గాంధీ-కి-మద్దతుగా-నిలవండి-జగ్గారెడ్డి https://prajakshethrenews.com/ఎన్నికల-కమిషన్-కు-వ్యతిరేకంగా-పోరాటం-చేస్తున్న-రాహుల్-గాంధీ-కి-మద్దతుగా-నిలవండి-జగ్గారెడ్డి ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ కి మద్దతుగా నిలవండి...
బీజేపీ పార్టీ ఓట్లు చోరీ విషయాన్ని ఎండ గట్టండి
బిజెపి కల్లు దుకాణం.. అన్నదమ్ములు చంద్రబాబు, జగన్..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ ప్రజలకు  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపు
ప్రజా క్షేత్ర్, అమరావతి ఆగస్టు 13 : 
న్నికల కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ కి మద్దతుగా నిలిచి బీజేపీ పార్టీ ఓట్లు చోరీ విషయాన్ని ఎండ గట్టాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ ప్రజలకు  పిలుపునిచ్చారు.బుదవారం అమరావతి లో ఏపి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు......రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలపై ఎంక్వైరీ చేయడం లేదు....అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండకూడదు అనేది బిజెపి కుట్ర... రాహుల్ గాంధీకి ప్రధాని పదవి   కొత్త కాదు.. ఆ ప్రధాని పోస్టు పుట్టిందే వాళ్ళింట్లో ఈసీ ని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.. రాహుల్ గాంధీ కుటుంబం మీద బిజెపి ది కక్ష సాధింపు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్ధల ద్వారా దొంగ ఓట్లు తయారు చేసారు..ఎలక్షన్ కమీషన్ కూడా ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ రీడర్ అని చెప్పక తప్పడం లేదు పాకిస్తాన్ లాంటి విధానాలు అమలు చేయాలనే కుట్ర బిజెపి చేస్తోందిఓటుహక్కు మి చేతిలోంచీ పోవాలనేదే బిజెపి ఆలోచన ప్రజలారా గమనించండి అని జగ్గ రెడ్డి విజ్ఞప్తి చేసారు.రాహుల్ గాంధీ ప్రయత్నాలకు తోడవండి..ఆ పోస్టు ఆశ పెద్దగా వారికి ఉండదు...అలమరా ఎత్తుకెళ్ళిపోడు ఏ దొంగా.. ఏం అనుకుంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డి..ఏపీకి బిజెపి తండ్రి, జగన్ చంద్రబాబు కొడుకులు...ఏపీ పాలిటిక్స్ కల్లుదుకాణం దగ్గర కూచునే అన్నదమ్ముల్లా ఉంటుంది బిజెపి కల్లు దుకాణం.. అన్నదమ్ములు చంద్రబాబు, జగన్.. రాష్ట్ర విభజనకు లెటర్లు ఇచ్చింది చంద్రబాబు, జగన్మా కాంగ్రెస్ లో అందరూ దమ్మున్నోళ్ళమే..కోమటిరెడ్డి సోదరులు దమ్మున్న వాళ్ళే...చంద్రబాబు, జగన్ లు ఇద్దరూ బానిసలు కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు. ఈసీ ని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.. రాహుల్ గాంధీ కుటుంబం మీద బిజెపి ది కక్ష సాధింపు  ఎలక్షన్ కమీషన్ బిజెపి అడుగు జాడల్లో నడుస్తోంది బిజెపి, ఆర్ఎస్ఎస్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి దేశ ప్రజల స్వేచ్ఛను అణగదొక్కే కుట్ర బిజెపి, ఆర్ఎస్ఎస్ చేస్తున్నాయి.ప్రతీ ఒక్కరికీ ఓటు ద్వారా స్వతంత్రం, స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది ఎవ్వరూ ఊహించని విధంగా మూడోసారి మోదీ ప్రధాని అయ్యాక పలు అనుమానాలు వచ్చాయి. మోదీ ప్రధాని అవడానికి కారణమైన నలభైకి పైగా ఎంపీల ఓట్లు బోగస్ అని అనుమానం అది నిజమా అబద్ధమా చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమీషన్ ది..భద్రతగా భావించే ఎలక్షన్ కమీషన్ తప్పు దారి పట్టింది మారు మూల గ్రామాలలో, కనిపించని ప్రాంతాలలో దొంగ ఓట్లను నమోదు చేయించి గెలుపుకు ప్రణాళిక చేసారు.దొంగ ఓట్ల‌ ద్వారా అధికారం లోకి వచ్చారు.. ముఫ్ఫై, నలభై ఏళ్ళ నుంచీ ఇది జరుగుతోందని అనుమానం*వ్యూహాత్మకంగా బిజెపి చేస్తున్న ప్రయత్నం  దేశ ప్రజల స్వేచ్ఛను అణగదొక్కే కుట్ర బిజెపి, ఆర్ఎస్ఎస్ చేస్తున్నాయి.దొంగ ఓట్లను తయారుచేసే నైపుణ్యం కలిగినవి బిజెపి, ఆర్ఎస్ఎస్దే దేశం మొత్తం ఈ దొంగ ఓట్ల ప్రక్రియ జరిగింది. రాహుల్ గాంధీ కుటుంబం మీద బిజెపి ది కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. మూడోసారి బిజెపి రావడానికి చేసిన కుట్ర దొంగ ఓట్లు ఎలక్షన్ కమీషన్ బిజెపి అడుగు జాడల్లో నడుస్తోంది కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో మాజీ సీఎంబిజెపి స్క్రిప్ట్ చదవాలి కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి అదే చేసాడు.కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి లీడరా, ఎన్నికల కమీషనరా అర్ధం కాలేదన్నారు.

]]>
Wed, 13 Aug 2025 23:34:09 +0530 admin
బందిపోట్ల ముఠానాయకుడు చంద్రబాబు : వై ఎస్ జగన్ https://prajakshethrenews.com/బందిపోట్ల-ముఠానాయకుడు-చంద్రబాబు-వై-ఎస్-జగన్ https://prajakshethrenews.com/బందిపోట్ల-ముఠానాయకుడు-చంద్రబాబు-వై-ఎస్-జగన్ బందిపోట్ల ముఠానాయకుడు చంద్రబాబు
చంద్రబాబుది అడ్డగోలు రాజకీయం.. చంబల్‌వ్యాలీలో బందిపోట్లను కూడా మరిపించారు
వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
ప్రజా క్షేత్ర్, అమరావతి ఆగస్టు 13 :
ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లేవు అని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. నిన్న పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన ఘటనలే అందుకు ఉదాహరణగా ఉన్నాయని, వైసిపి సంబంధించిన ఏజెంట్లు లేకుండా పోలింగ్‌ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తాడిపల్లిలోని వైసిపి పార్టీ కేంద్ర కార్యాలయంలోజగన్ మాట్లాడారు. వైసిపి ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌లలో కూర్చోనీయలేదని, 15 పోలింగ్‌ బూత్‌లలో వైసిపి ఏజెంట్లు లేకుండా చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇంత అన్యాయంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదన్నారు.బందిపోటు దొంగల తరహాలో సిఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలు జరిపించారని దుయ్యబట్టారు. పులివెందుల జడ్ పిటిసి ఉప ఎన్నిక కోసం చంద్రబాబు కుట్రలకు పాల్పడ్డారని, పోలింగ్‌ బూత్‌లను మార్చేశారని మండిపడ్డారు. చంద్రబాబుది అడ్డగోలు రాజకీయమని, చంబల్‌వ్యాలీలో బందిపోట్లను కూడా మరిపించారని, బందిపోట్ల ముఠానాయకుడు చంద్రబాబు అని జగన్ విమర్శలు గుప్పించారు.పులివెందుల వైసిపి అభ్యర్థి హేమంత్‌రెడ్డిని ఇంటినుంచి బయటకు ఎందుకు రానీయలేదని అడిగారు. డిఐజి కోయ ప్రవీణ్‌ పర్యవేక్షణలో ఉప ఎన్నికలు జరిగాయని, చంద్రబాబు పాలనలో మాట వినని పోలీసు అధికారులపై కేసులు పెడుతున్నారని, ఎంతో మంది అధికారులను వేధించి, సస్పెండ్‌ చేశారని ధ్వజమెత్తారు. కొంత మంది పోలీసు అధికారులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని,  జడ్ పిటిసి ఉప ఎన్నిక కోసం పోలీసులను ఏరికోరి నియమించుకున్నారని జగన్ చురకలంటించారు.

]]>
Wed, 13 Aug 2025 23:27:41 +0530 admin
ఎపిలో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులకు భంగం : మాజీ సీఎం జగన్ https://prajakshethrenews.com/ఎపిలో-ప్రజాస్వామ్య-ప్రాథమిక-హక్కులకు-భంగం-మాజీ-సీఎం-జగన్ https://prajakshethrenews.com/ఎపిలో-ప్రజాస్వామ్య-ప్రాథమిక-హక్కులకు-భంగం-మాజీ-సీఎం-జగన్ ఎపిలో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులకు భంగం : మాజీ సీఎం జగన్
ప్రజా క్షేత్ర్,  అమరావతి జూలై 12 :
 ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకుని, సమాధానం నుంచి కోరుకునే అవకాశం ఉండాలని మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి   తెలిపారు. ఎపిలో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని అన్నారు. ఎపిలో జరుగుతున్న అణచివేతలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారంటూ జగన్ ట్వీట్ చేశారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలనలో అడ్డగోలుగా అణచివేయపడుతోందని, పోలీసులతో అధికార దుర్వినియోగం చేయిస్తూ, అసమ్మతి గళాలను నులిమేస్తున్నారని మండిపడ్డారు.గుంటూరు మిర్చియార్డులో.. పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్తే మూడు కేసులు పెట్టి 15 మందిని అరెస్టు చేశారని, పల్నాడులో పోలీస్ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నఎమ్మెల్యే నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే 5 కేసులు 131 మందికి నోటీసులు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా పోస్టర్ ప్రదర్శించిన యువకుడిని జైల్లో పెట్టారని, బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తే ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ సిపి కేడర్ ను అక్రమంగా ఇరికిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాన్ని బెదిరించి, అణచివేయాలని చూస్తోందని, ఇందుకోసం పోలీసు వ్యవస్థను వాడుకోవటం సరికాదు అని జగన్ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు.

]]>
Sun, 13 Jul 2025 14:30:21 +0530 admin
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భేటీ https://prajakshethrenews.com/ఉప-ముఖ్యమంత్రి-పవన్-కళ్యాణ్-తో-బీజేపీ-రాష్ట్ర-అధ్యక్షుడు-మాధవ్-భేటీ https://prajakshethrenews.com/ఉప-ముఖ్యమంత్రి-పవన్-కళ్యాణ్-తో-బీజేపీ-రాష్ట్ర-అధ్యక్షుడు-మాధవ్-భేటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్  భేటీ
ప్రజా క్షేత్ర్, విజయవాడ :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ను  బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు  పి.వి.ఎన్.మాధవ్  మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా శాలువా కప్పి, జ్ఞాపిక అందించి  మాధవ్ కి  పవన్ కళ్యాణ్  శుభాకాంక్షలు తెలియచేశారు. కూటమి స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.
వర్తమాన రాజకీయ అంశాలపైనా, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంపైనా వారివురూ చర్చించుకున్నారు.

]]>
Wed, 09 Jul 2025 22:53:19 +0530 admin
వైఎస్సార్ కు జగన్ నివాళి https://prajakshethrenews.com/వైఎస్సార్-కు-జగన్-నివాళి https://prajakshethrenews.com/వైఎస్సార్-కు-జగన్-నివాళి వైఎస్సార్ కు జగన్ నివాళి
ప్రజా క్షేత్ర్, కడప :
దివంగత  వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా వైఎస్సార్ తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆయనతో పాటు తన తల్లి విజయమ్మ నివాళి ఘటించారు. ఈ జయంతి కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు

]]>
Wed, 09 Jul 2025 08:31:18 +0530 admin
శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లను ఎత్తివేత https://prajakshethrenews.com/శ్రీశైలం-జలాశయం-క్రస్ట్-గేట్లను-ఎత్తివేత https://prajakshethrenews.com/శ్రీశైలం-జలాశయం-క్రస్ట్-గేట్లను-ఎత్తివేత శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లను ఎత్తివేత
పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మ నాగార్జునసాగర్ వైపుకు పరుగులు
ఆనకట్టపై నారాచంద్రబాబు నాయుడు కృష్ణమ్మ ప్రత్యేక పూజలు
ప్రజా క్షేత్ర్, శ్రీశైలం జూలై 8 :
 శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపుకు పరుగులు తీస్తున్నది. ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆనకట్టపై కృష్ణమ్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరసారెలను సమర్పించారు. ఆ తర్వాత ఆనకట్టపై 6, 7, 8, 11 గేట్ల ద్వారా లాంచనప్రాయంగా నీటిని విడుదల చేశారు. అంతకు ముందు సీఎం శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. సీఎం వెంట పలువురు మంత్రులు, అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఉన్నారు.కృష్ణానదీ పరివాహక ప్రాంతంతో పాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయానికి వరద పోటెత్తుతున్నది. సుంకేశుల, జురాల నుంచి 1.70లక్షల క్యూసెక్కులకరుపైగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882 అడుగుల మేర నీరు ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కుడి, ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నది.

]]>
Tue, 08 Jul 2025 23:04:58 +0530 admin
ఏపీ లో రాష్ట్రపతి పాలన విధించండి : వై ఎస్ జగన్ https://prajakshethrenews.com/ఏపీ-లో-రాష్ట్రపతి-పాలన-విధించండి-వై-ఎస్-జగన్ https://prajakshethrenews.com/ఏపీ-లో-రాష్ట్రపతి-పాలన-విధించండి-వై-ఎస్-జగన్ ఏపీ లో రాష్ట్రపతి పాలన విధించండి : వై ఎస్ జగన్ 
ప్రజా క్షేత్ర్,  గుంటూరు, జూలై 5 : 
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామపంచాయతీ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఓ షాపు వద్ద ఉంటున్న నాగమల్లేశ్వరరావుపై అకస్మాత్తుగా అత్యంత పాశవికంగా
ప్రత్యర్థులు దాడి చేశారు. కర్రలతో తలపై కసికసిగా బాదుతూ ఆయన ప్రాణాలు తీసేందుకు యత్నించారు. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు
నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన నాగమల్లేశ్వరరావుకు ముందు పొన్నూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స కొనసాగుతోంది.  వైసీపీ నేత నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నేతలే హత్యాయత్నం చేశారని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును ట్యాగ్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. రెడ్‌ బుక్ రాజ్యాంగం నడుస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు.  ఇంకా ఆయన ఏమన్నారంటే..." చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని
ఉల్లంఘిస్తూ, లా అండ్‌ ఆర్డర్‌ కాపాడలేని ప‌రిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను." అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అంతకు ముందు వైసీపీ కార్యాలయంలో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడు దాడులు-ఆరు కేసుల అన్నట్టు చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రోజూ వైసీపీ నేతలే టార్గెట్‌గా కేసులు పెట్టడమో హత్యలు చేయడమే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగమల్లేశ్వరరావుపై దాడి పొన్నూరు ఎమ్మెల్యేకి తెలియకుండానే జరిగిందా ఆని ప్రశ్నించారు. నిందితులను రక్షించేందుకు పోలీసులు, ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని అన్నారు. వారిని ఊరు దాటించింది వారేనని అన్నారు. అన్నింటినీ తగిన గుణపాఠం చెప్పే రోజు కచ్చితంగా వస్తుందని అంబటి వార్నింగ్ ఇచ్చారని అన్నారు

]]>
Sat, 05 Jul 2025 18:30:36 +0530 admin
చెరువు కట్టపై నుంచి పడి ఏనుగు మృతి https://prajakshethrenews.com/చెరువు-కట్టపై-నుంచి-పడి-ఏనుగు-మృతి https://prajakshethrenews.com/చెరువు-కట్టపై-నుంచి-పడి-ఏనుగు-మృతి చెరువు కట్టపై నుంచి పడి ఏనుగు మృతి
ప్రజా క్షేత్ర్, చిత్తూరు :
పుంగనూరు పులిచెర్ల(మం) పెద్దఒడ్డు సమీపంలో చెరువు కట్టపై నుంచి జారి పడి ఏనుగు మృతి చెందింది. గత కొద్దిరోజులుగా పులిచెర్ల కొండ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి కల్లూరు సమీపంలోకి ఏనుగుల గుంపు వచ్చింది. ఏనుగు మృతి సమాచారం తెలియగానే అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పులిచెర్ల(మం)పాత పేట అటవీ ప్రాంతంలో  ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు సమాచారం.  ఏనుగుల గుంపు మామిడి,అరటి,టమోటా తోటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. ఏనుగుల దాడిలో తమ పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయని రైతులు  రోధిస్తున్నారు. పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని  కోరుతున్నారు.

]]>
Sat, 05 Jul 2025 14:39:10 +0530 admin
ప్రపంచ పోలీస్ క్రీడల్లో టీటీడీ సెక్యూరిటీ,విజిలెన్స్ అధికారుల అద్భుత విజయం https://prajakshethrenews.com/ప్రపంచ-పోలీస్-క్రీడల్లో-టీటీడీ-సెక్యూరిటీవిజిలెన్స్-అధికారుల-అద్భుత-విజయం https://prajakshethrenews.com/ప్రపంచ-పోలీస్-క్రీడల్లో-టీటీడీ-సెక్యూరిటీవిజిలెన్స్-అధికారుల-అద్భుత-విజయం ప్రపంచ పోలీస్ క్రీడల్లో టీటీడీ సెక్యూరిటీ,విజిలెన్స్ అధికారుల అద్భుత విజయం

దేశానికి బంగారు, కాంస్య పతకాలు టీటీడీకి గర్వకారణం

విజేతలను అభినందించిన టీటీడీ చైర్మన్, ఈవో


 ప్రజా క్షేత్ర్, తిరుమల :
 అమెరికాలోని బర్మింగ్‌హామ్ నగరంలో జరిగిన ప్రపంచ పోలీస్, ఫైర్ గేమ్స్ - 2025 పోటీల్లో టీటీడీ సెక్యూరిటవిజిలెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు అరుదైన క్రీడా ప్రతిభను ప్రదర్శిస్తూ అద్భుత విజయాలు సాధించి జాతీయ మువ్వెన్నల పతాకాన్ని రెపరెపలాడించారు. 45 సంవత్సరాల పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీలో టీటీడీ విజీవో  ఎ.సురేంద్ర స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, 55 సంవత్సరాల పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీలో వీజీవో  ఎన్టీవీ రామ్ కుమార్ కాంస్య పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్  బీ.ఆర్.నాయుడు, టీటీడీ ఈవో  జె.శ్యామలరావు విజేతలను అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల పోలీస్, ఫైర్ విభాగాల నుంచి 9,000 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ద్వైవార్షిక పోటీల్లో టీటీడీ అధికారుల విజయాలు దేశానికే గర్వకారణమని, టీటీడీకి ఇది ఒక గొప్ప గౌరవంగా నిలిచిందని కొనియాడారు.
అదనపు ఈవో  సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో  వీ.వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణలు కూడా విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జాతీయ స్థాయి విజయం టీటీడీ సెక్యూరిటీ, విజిలెన్స్ విభాగం లోని అధికారుల నైపుణ్యాన్ని, నిబద్ధతను చాటిందని,  ప్రపంచవ్యాప్తంగా టీటీడీ ప్రతిష్టను మరింత పెంచేలా ఈ విజయం తోడ్పడిందని పేర్కొన్నారు.

]]>
Fri, 04 Jul 2025 21:31:09 +0530 admin
వైసిపి కార్యకర్తలను రప్పా రప్పా ఆడిస్తాం https://prajakshethrenews.com/వైసిపి-కార్యకర్తలను-రప్పా-రప్పా-ఆడిస్తాం https://prajakshethrenews.com/వైసిపి-కార్యకర్తలను-రప్పా-రప్పా-ఆడిస్తాం

వైసిపి కార్యకర్తలను రప్పా రప్పా ఆడిస్తాం

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి జెసి ప్రభాకర్ రెడ్డి  హెచ్చరిక

 ప్రజా క్షేత్ర్, అమరావతి జూన్ 29 ;:

ఎపి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు రిజిస్ట్రేషన్ తప్పు అని ఇంటికి ప్లాన్ లేదని జెసి ప్రభాకర్ రెడ్డి  అన్నారు. తమకు శత్రువు పెద్దారెడ్డి మాత్రమే అని తెలిపారు. అనంతపురంలో జెసి మీడియాతో మాట్లాడుతూ.. పెద్దారెడ్డి వెంట వైసిపి కార్యకర్తల ఫోటోలు (Photos activists) తన దగ్గర ఉన్నాయనిపెద్దారెడ్డి వెంట వచ్చిన వైసిపి కార్యకర్తలను రప్పా రప్పా ఆడిస్తామని హెచ్చరించారు. రేపటి నుంచి తమ కార్యకర్తలు ఎలా ఉంటారో చూడండి అని రేపటి నుంచి పెద్దారెడ్డి ఇంటి దగ్గర వైసిపి కార్యకర్తలు ఉంటే తమ కార్యకర్తలు రప్పా రప్పా అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం అని జెసి ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు.

 

]]>
Sun, 29 Jun 2025 20:56:57 +0530 admin
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం: సిఎం చంద్రబాబు https://prajakshethrenews.com/ప్రజల-సమస్యలను-ఎప్పటికప్పుడు-పరిష్కరిస్తున్నాం-సిఎం-చంద్రబాబు https://prajakshethrenews.com/ప్రజల-సమస్యలను-ఎప్పటికప్పుడు-పరిష్కరిస్తున్నాం-సిఎం-చంద్రబాబు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం: సిఎం చంద్రబాబు

ప్రజా క్షేత్ర్, అమరావతి జూన్ 29 ;: విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తామని ప్రజలకు చెప్పామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు  తెలిపారు. మూడు పార్టీలు ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకెళ్తున్నాం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో తాము ఏం చేయాలనే దానిపై ఇప్పటికే చర్చించాం అని ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ అఖండ విజయం   సాధించామని చెప్పారు. ప్రజలు పెట్టిన ఆకాంక్షలను తాము కాపాడుకోవాలనినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం మన బాధ్యత అని తెలియజేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనిభవిష్యత్తులో ఏం చేస్తామో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని అన్నారు. ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేశామని చంద్రబాబు పేర్కొన్నారు.

]]>
Sun, 29 Jun 2025 20:51:32 +0530 admin
ఎంత పని చేశామనేది కాదు..ఎలా చేస్తున్నామనేది కూడా కీలకం: చంద్రబాబు https://prajakshethrenews.com/ఎంత-పని-చేశామనేది-కాదుఎలా-చేస్తున్నామనేది-కూడా-కీలకం-చంద్రబాబు https://prajakshethrenews.com/ఎంత-పని-చేశామనేది-కాదుఎలా-చేస్తున్నామనేది-కూడా-కీలకం-చంద్రబాబు ఎంత పని చేశామనేది కాదు..ఎలా చేస్తున్నామనేది కూడా కీలకం: చంద్రబాబు

ప్రజా క్షేత్ర్, అమరావతి జూన్ 29 ; కొందరు ఎంతో పని చేస్తారు కానీ మంచి పేరు రాదని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎంత పని చేశామనే అంశంతో పాటు ఎలా చేస్తున్నామనేది కూడా కీలకం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు పెద్దగా పని చేయకున్నాప్రజల్లో మంచి పేరు ఉంటుందని చెప్పారు. ఇప్పుడు గెలిచిన వాళ్లు మళ్లీ మళ్లీ గెలవాలి అని ఆ దిశగా ఆలోచన చేస్తున్నాననిపార్టీలో ప్రతి ఒక్కరూ అదే తరహాలో ఆలోచన చేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులకు వారసత్వం ఉందని తాము పని చేయమంటే వారికి ఓ నమస్కారం పెడతానని హెచ్చరించారు.ఎప్పటికప్పడు నేతల పనితీరుపై సమాచారం తెప్పించుకుంటున్నాననిఅనేక మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్నానని తెలియజేశారు. అన్నీ సర్వేలను విశ్లేషించి  వాస్తవాలను బేరీజు వేస్తున్నాననిఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు. తాను చెప్పాల్సింది ఎమ్మెల్యేలకు చెబుతున్నాననిమారాల్సింది ఎమ్మెల్యేల పనితీరు అని సలహాలు ఇచ్చారు. పనితీరు మార్చుకుంటే బాగుంటుందనిలేకపోతే ఇక అంతే సంగతులు అని చంద్రబాబు స్పష్టం చేశారు.

]]>
Sun, 29 Jun 2025 17:50:22 +0530 admin
కేసీ కెనాల్ పై శిల్పా వెంచర్ వేసి 7 వేల ఎకరాలకు రైతులకు నీరు వెళ్లకుండా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా https://prajakshethrenews.com/కేసీ-కెనాల్-పై-శిల్పా-వెంచర్-వేసి-7-వేల-ఎకరాలకు-రైతులకు-నీరు-వెళ్లకుండా-చేసిన-వారిపై-కఠిన-చర్యలు-తీసుకోవాలి-ఎమ్మెల్యే-భూమా-అఖిల-ప్రియా https://prajakshethrenews.com/కేసీ-కెనాల్-పై-శిల్పా-వెంచర్-వేసి-7-వేల-ఎకరాలకు-రైతులకు-నీరు-వెళ్లకుండా-చేసిన-వారిపై-కఠిన-చర్యలు-తీసుకోవాలి-ఎమ్మెల్యే-భూమా-అఖిల-ప్రియా కేసీ కెనాల్ పై శిల్పా వెంచర్ వేసి  7 వేల ఎకరాలకు రైతులకు నీరు వెళ్లకుండా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి :  ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా

జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ప్రజా క్షేత్ర్, ఆళ్లగడ్డ :
ఆళ్లగడ్డలో శిల్పా వెంచర్ పేరుతో కేసీ కెనాల్ ను ఆక్రమించుకొని కేసీ కెనాల్ పై శిల్పా వెంచర్ వేసి  7 వేల ఎకరాలకు రైతులకు నీరు వెళ్లకుండా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోని కేసులు పెట్టాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. శిల్ప వెంచర్ ఆళ్లగడ్డలోనే కాదు నంద్యాలలో కడపలో కూడ కేసీ కెనాల్ ను  ఆక్రమించుకొని రైతులకు నీరు వెళ్లకుండా ఆక్రమించుకొని వెంచర్లు వేశారు. వీటన్నిటి పైన తగు చర్యలు తీసుకోవాలని నేను అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. హైకోర్టు నుంచి కూడ ఆర్డర్స్ తీసుకొని రావడం జరిగింది అని  కచ్చితంగా నేను అసెంబ్లీ వెళ్లే లోపు వారిపై చర్యలు తీసుకోవాలని  లేకుంటే 200 మంది రైతులు అలాగే శిల్పా వెంచర్ లో ఇళ్ళు తీసుకొని మోసపోయిన బాధిత కుటుంబాలను తీసుకొని ధర్నాకు దిగాల్సి వస్తుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు. అలాగే ఆళ్లగడ్డ రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందేలాగా చూడాలని, ఎక్కువగా పంటలు వేసేది ఆళ్లగడ్డ రైతులే అని వారెవరు నష్టపోకూడదని ప్రతి ఒక్క రైతుకు నీరు అందేలాగా చూడాలని  ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులకు తెలియజేశారు...

]]>
Sat, 28 Jun 2025 22:36:46 +0530 admin
జగన్, కేసీఆర్ ఒక్కటై నా ఫోన్ ట్యాప్ చేసారు : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ https://prajakshethrenews.com/జగన్-కేసీఆర్-ఒక్కటై-నా-ఫోన్-ట్యాప్-చేసారు-ఏపీ-పీసీసీ-అధ్యక్షురాలు-వైఎస్-షర్మిళ https://prajakshethrenews.com/జగన్-కేసీఆర్-ఒక్కటై-నా-ఫోన్-ట్యాప్-చేసారు-ఏపీ-పీసీసీ-అధ్యక్షురాలు-వైఎస్-షర్మిళ జగన్, కేసీఆర్ ఒక్కటై నా ఫోన్ ట్యాప్ చేసారు : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ
ప్రజా క్షేత్ర్, అమలాపురం :
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శనివారం జరిగిన జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిళ మీడియాతో మాట్లాడారు.      ముమ్మాటికీ నా ఫోన్ ట్యాఫింగ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఒకటై ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని వైఎస్ షర్మిల ఆరోపించారు.    రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ళు అయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ అమలు జరగలేదని షర్మిళ విమర్శించారు. గత 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రధాని మోడీ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేడీ గా మారారని  షర్మిళ ఆరోపించారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం జిల్లాల పర్యటనల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొని కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటున్నానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, కాంగ్రెస్ నాయకులు జంగా గౌతమ్, కేబీఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
 మహిళా కార్యకర్త ఆవేదన....
నేను పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టాను... నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారని ఒక మహిళా కార్యకర్త వైఎస్ షర్మిళ ముందు వాపోయారు . రామచంద్రాపురం మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఇసుకపట్ల శ్యామల సమావేశంలో షర్మిళ ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు.

]]>
Sat, 28 Jun 2025 21:46:17 +0530 admin
మహిళలకు ఉచిత బస్సు’ పథకంపై కసరత్తు : అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు https://prajakshethrenews.com/మహిళలకు-ఉచిత-బస్సు-పథకంపై-కసరత్తు-అధికారులతో-సమీక్షలో-ముఖ్యమంత్రి-చంద్రబాబు https://prajakshethrenews.com/మహిళలకు-ఉచిత-బస్సు-పథకంపై-కసరత్తు-అధికారులతో-సమీక్షలో-ముఖ్యమంత్రి-చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు’ పథకంపై కసరత్తు
ఇబ్బందులు తలెత్తకుండా ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు
ఆర్థికంగా భారమైనా ఆగస్ట్ 15 నుంచే పథకం అమలు
ఇకపై ఆర్టీసీలో ప్రవేశ పెట్టేవన్నీ ఈవీ ఏసీ బస్సులే
అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజా క్షేత్ర్,  అమరావతి, జూన్ 28 :
ఎన్నికల్లో హమీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకంలోని మరో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 15 నుంచి కల్పించే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో చర్చించారు. పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు కొత్త బస్సులు కొనడం గానీ, అవసరమైతే అద్దెకు తీసుకోవడం గానీ చేయాలని సీఎం సూచించారు.
ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ ఈవీ ఏసీ బస్సులే ఉండాలని, ఇప్పుడున్న బస్సులను కూడా ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. అలాగే, ప్రతీ బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.
ఆర్థిక కష్టాలున్నా హామీలు నిలబెట్టుకోవాలి.......
రాష్ట్రంలో ఆర్ధికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా... ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని... అదే సమయంలో ప్రజాధనం సద్వినియోగం కావాలని, ప్రతీ రూపాయి విలువైనదేనని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు. ఆర్ధిక కష్టాలను అధిగమించాలంటే ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఖర్చు ఎలా తగ్గించుకోవాలి... ఇతర మార్గాల ద్వారా ఆదాయాలను ఎలా పొందాలి అనే దానిపై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా సమర్ధత పెంచుకోవాలని చెప్పారు. బస్ కాంప్లెక్స్‌లో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచడం దగ్గర నుంచి బస్సు ప్రయాణం వరకు ప్రయాణికుల్లో సంతృఫ్తి పెరిగేలా నిర్వహణ ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

]]>
Sat, 28 Jun 2025 21:30:40 +0530 admin
విజయవాడలో ఓ వ్యాపార సంస్థ భారీగా కుచ్చుటోపి https://prajakshethrenews.com/విజయవాడలో-ఓ-వ్యాపార-సంస్థ-భారీగా-కుచ్చుటోపి https://prajakshethrenews.com/విజయవాడలో-ఓ-వ్యాపార-సంస్థ-భారీగా-కుచ్చుటోపి విజయవాడలో ఓ వ్యాపార సంస్థ భారీగా కుచ్చుటోపి

ప్రజా క్షేత్ర్, విజయవాడ :

విజయవాడలో ప్రజలకు ఓ వ్యాపార సంస్థ భారీగా కుచ్చుటోపి పెట్టింది.
గుణదల ఎన్టీఆర్ కాలనీలో ఉంటున్న అద్విక ట్రేడింగ్ కంపెనీ ప్రజలకు అధిక వడ్డీలు ఇస్తామంటూ సుమారు 300 మందిని నుంచి భారీగా రూ. కోట్ల నగదును వసూలు చేశారు. కైకలూరుకు చెందిన ఓ వ్యక్తి టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ మేరకు విచారణ చేపట్టగా సంస్థ ఎండి వెంకట ఆదిత్యను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

]]>
Fri, 27 Jun 2025 23:28:49 +0530 admin
డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి సాద్యం: పురంధేశ్వరి https://prajakshethrenews.com/డబుల్-ఇంజిన్-సర్కారు-ఉంటేనే-అభివృద్ధి-సాద్యం-పురంధేశ్వరి https://prajakshethrenews.com/డబుల్-ఇంజిన్-సర్కారు-ఉంటేనే-అభివృద్ధి-సాద్యం-పురంధేశ్వరి డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి సాద్యం: పురంధేశ్వరి
ప్రజా క్షేత్ర్, అమరావతి జూన్ 26 :
వికసిత్ భారత్ లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఒక భాగం అని బిజెపి ఎంపి పురంధేశ్వరి తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే అభివృద్ధి సాధ్యమని ఆనాడు చెప్పామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు తమపై నమ్మకం ఉంచి ఆశీర్వదించి గెలిపించారని, అమరావతి, పోలవరం ఇలా అన్నింటిలో కేంద్రం సహకారం అందిస్తోందని, అనేక పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన   చేసుకుంటున్నామని తెలియజేశారు. చారిత్రక ప్రాధాన్యత గుర్తించి అభివృద్ధి చేసేందుకు కేంద్రం సాయమందిస్తోందని పురంధేశ్వరి పేర్కొన్నారు.

]]>
Thu, 26 Jun 2025 21:00:40 +0530 admin
టీటీడీ ఉద్యోగులకు 2వేల హెల్మెట్లు పంపిణీ https://prajakshethrenews.com/టీటీడీ-ఉద్యోగులకు-2వేల-హెల్మెట్లు-పంపిణీ https://prajakshethrenews.com/టీటీడీ-ఉద్యోగులకు-2వేల-హెల్మెట్లు-పంపిణీ టీటీడీ ఉద్యోగులకు 2వేల హెల్మెట్లు పంపిణీ
ప్రజా క్షేత్ర్, తిరుమల :
టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్  బీ.ఆర్.నాయుడు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సీవీఎస్వో  మురళీకృష్ణ తో కలిసి గురువారం హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హెల్మెట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇటీవలే 500 హెల్మెట్లు పంపిణీ చేశామని, అమాలాపురానికి చెందిన నిమ్మకాయల సత్యనారాయణ, హైదరాబాద్ కు చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే దాతలు విరాళంగా ఇచ్చిన 2 వేల హెల్మెట్లు ప్రస్తుతం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరో 7500 హెల్మెట్లు టీటీడీ ఉద్యోగులకు అందిస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలని ఆయన కోరారు.

]]>
Thu, 26 Jun 2025 19:23:31 +0530 admin
5 వేల ఎకరాల్లో ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు https://prajakshethrenews.com/5-వేల-ఎకరాల్లో-ఏపీలో-కొత్త-ఎయిర్పోర్టు https://prajakshethrenews.com/5-వేల-ఎకరాల్లో-ఏపీలో-కొత్త-ఎయిర్పోర్టు 5 వేల ఎకరాల్లో ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.
ప్రజా క్షేత్ర్, విజయవాడ, జూన్ 26 :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అమరావితి అంతర్జాతీయ స్థా్యి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. అమరావతిలో మౌలిక వసతుల ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తోంది. అమరావతిని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అలాగే స్పోర్ట్స్ సిటీ, అమరావతిలోక్రికెట్ స్టేడియం వంటి నిర్మాణాలను చేపట్టనుంది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. అమరావతి కోసం అదనంగా భూమిని సమీకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి అదనపు భూసమీకరణకు ఏపీ కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక విషయాలు వెల్లడించారు. అమరావతిలో అదనపు భూ సమీకరణకు జులై నెలాఖరులో సీఆర్డీఏ నోటిఫికేషన్ ఇస్తుందని మంత్రి నారాయణ వెల్లడించారు. అలాగే అదనపు భూ సమీకరణకు 2015 నాటి నిబంధనలే అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అమరావతిలో 5000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నారు. అలాగే 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, మరో 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం 10 వేల ఎకరాలు అవసరమవుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు.మరోవైపు అమరావతి భవిష్యత్తు అవసరాల కోసం అదనంగా 45 వేల ఎకరాలు సమీకరించనున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటుందన్న ఆయన.. ఈ నేపథ్యంలో ఎక్కువ భూమి అవసరమవుతోందన్నారు. మరోవైపు అమరావతిలో అనేక సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తోంది.రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో పలు కంపెనీలకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అమరావతిలో భూములు కేటాయిస్తోంది. ఇప్పటి వరకూ సుమారుగా 74 సంస్థలకు అమరావతిలో భూములు కేటాయించారు. మూడేళ్లలోగా అమరావతి నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

]]>
Thu, 26 Jun 2025 19:07:28 +0530 admin
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు అమరావతిలో ఘన స్వాగతం https://prajakshethrenews.com/కేంద్ర-మంత్రి-గజేంద్ర-సింగ్-షెకావత్కు-అమరావతిలో-ఘన-స్వాగతం https://prajakshethrenews.com/కేంద్ర-మంత్రి-గజేంద్ర-సింగ్-షెకావత్కు-అమరావతిలో-ఘన-స్వాగతం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు అమరావతిలో ఘన స్వాగతం
ప్రజా క్షేత్ర్, అమరావతి :
రాజమహేంద్రవరం పర్యటన పూర్తి చేసుకొని అమరావతికి చేరుకున్న కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు రాష్ట్ర విద్యా, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం లో జరిగిన అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ₹94.44 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ తన పాదయాత్ర "యువగళం" విశేషాలతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు బహూకరించారు

]]>
Thu, 26 Jun 2025 18:37:37 +0530 admin
రెడ్ బుక్ పేరు వింటే వైసీపీ నేతలకు గుండెపోటు లోకేష్ https://prajakshethrenews.com/రెడ్-బుక్-పేరు-వింటే-వైసీపీ-నేతలకు-గుండెపోటు-లోకేష్ https://prajakshethrenews.com/రెడ్-బుక్-పేరు-వింటే-వైసీపీ-నేతలకు-గుండెపోటు-లోకేష్ రెడ్ బుక్ పేరు వింటే వైసీపీ నేతలకు గుండెపోటు
లోకేష్
ప్రజా క్షేత్ర్, మచిలీపట్నం :
రెడ్ బుక్ పేరు ఎత్తితే చాలు వైకాపా నేతలకు గుండె పోటు వస్తోందని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 'పిల్లలను చదివించేందుకు ఏ తల్లి ఇబ్బంది పడకూడదని 'తల్లికి వందనం' అమలు చేశాం. కూటమి సర్కార్లో మహిళలకు ఎనలేని గౌరవం ఇస్తున్నాం. కానీ వైకాపా  హయాంలో స్త్రీలను కించపరచి, అగౌరవపరిచారు. కానీ మా ప్రభుత్వం మహిళల గౌరవం పెరిగేలా చర్యలు తీసుకుంటోంది' అని ఆయన పేర్కొన్నారు.

]]>
Wed, 25 Jun 2025 20:00:32 +0530 admin
హైకోర్టుకు జగన్ https://prajakshethrenews.com/హైకోర్టుకు-జగన్ https://prajakshethrenews.com/హైకోర్టుకు-జగన్ హైకోర్టుకు జగన్
ప్రజా క్షేత్ర్, విజయవాడ, జూన్ 25 :
సత్తెనపల్లి పర్యటనలో తన కారు కింద పడి చనిపోయిన దళితుడు సింగయ్య మృతి కేసులోతనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టును జగన్ ఆశ్రయించారు. అత్యవసరంగా విచారణ చేయాలని లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.  హైకోర్టు గురువారం పిటిషన్ పై విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఏ 2గా చేర్చారు.సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామానికి చెందిన కార్యకర్త ఏడాది కిందట ఆత్మహత్య చేసుకుంటే ఇటీవల విగ్రహావిష్కరణకు వెళ్లారు. ఆయన పర్యటన సమయంలో గుంటూరు శివారులో ఏటుకూరు రోడ్డు వద్ద ఓ వృద్దుడుచనిపోయాడు. ఆ సమయంలో పోలీసులు జగన్ కాన్వాయ్ వాహనం కాదని.. వేరే వాహనం ఢీకొట్టిందని చెప్పారు. దాంతో అందరూ సైలెంట్ అయిపోయారు. నాలుగు రోజుల తర్వాత జగన్ కారు కింద పడే సింగయ్య చనిపోయాడని దృసశ్యాలు వెలుగులోకి వచ్చాయి.  
పోలీసులు చెప్పిన దానికి..బయటపడిన దృశ్యాలకు చాలా తేడా ఉండటంతో విమర్శలు వచ్చాయి. దాంతో పోలీసులు కేసును మార్చారు. ఏ వన్ గా జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని.. ఏ 2గా కారులో ఉన్న జగన్ ను చేర్చారు. పర్యటనలో పాల్గొన్న ఇతర నేతలపైనా కేసులు పెట్టారు. A3-A6  నాగేశ్వర్ రెడ్డి (జగన్ వ్యక్తిగత కార్యదర్శి), వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని,  రజనీ ఉన్నారు. ఈ వ్యక్తులు జగన్
కారులో లేనప్పటికీ, అనుమతులకు మించి కాన్వాయ్‌లో వాహనాలు, జన సమీకరణ వల్ల ఘటన జరిగిందని పోలీసులుఆ తర్వాత రమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఏఆర్ కానిస్టేబుల్ గా  చెబుతున్నారు. జగన్ పోలీసులు పెట్టిన ఆంక్షలు పట్టించుకోకుండా  ర్యాలీ చేయడం, కారు కింద మనిషి పడినా కనీస వైద్యం అందించకుండా రోడ్డు పక్కన పడేసి పోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.  పోలీసులు కేసు నమోదు చేసుకుని  జగన్ కారు కింద పడిన సింగయ్యను ఎవరు బయటకు తీశారు.. ఆయనను ఎందుకు ఆస్పత్రికి తరలించలేదు అనే దానిపై విచారణ జరిపారు.  జగన్ భద్రతా సిబ్బందిని కూడా పోలీసులు పిలిపించి ప్రశ్నించారు. అందరూ జనాల్లో ఏం జరిగిందో తెలియలేదని చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది.  మొత్తం 58 మంది భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ.. ఈ ప్రమాదం గురించి ఉన్నతాధికారులకు చెప్పలేదు. గుంటూరు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జగన్ బుల్లెట్ ఫ్రూఫ్ కారును సీజన్ చేశారు. జగన్ కు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో.. ముందస్తుగా క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా భావిస్తున్నారు.

]]>
Wed, 25 Jun 2025 19:08:47 +0530 admin
ఇకపై ప్రతిరోజూ ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం : నారా లోకేష్ https://prajakshethrenews.com/ఇకపై-ప్రతిరోజూ-ప్రజలు-కార్యకర్తలతో-మాట్లాడి-ఫీడ్-బ్యాక్-తీసుకుంటాం-నారా-లోకేష్ https://prajakshethrenews.com/ఇకపై-ప్రతిరోజూ-ప్రజలు-కార్యకర్తలతో-మాట్లాడి-ఫీడ్-బ్యాక్-తీసుకుంటాం-నారా-లోకేష్ ఇకపై ప్రతిరోజూ ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం

కూటమి ప్రభుత్వ విజయాలను జులై 2నుంచి ఇంటింటికీ తీసుకెళ్లండి

కూటమిలో మనది పెద్దన్న పాత్ర... సమన్వయంతో ముందుకు సాగాలి

ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషిచేయండి

మచిలీపట్నం ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత నారా లోకేష్

ప్రజా క్షేత్ర్, మచిలీపట్నం :
ఇకపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నేను ప్రతిరోజు 5గురు ప్రజలు, 5గురు కార్యకర్తలతో మాట్లాడి ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరు, పార్టీ అంతర్గత సమస్యలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని,పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్క కార్యకర్తను విస్మరించేది లేదు, తప్పనిసరి వారి సేవలను గుర్తిస్తామన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ... గత ఎన్నికలకు ముందు బాబు సూపర్ – 6, బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, ఎన్నికల తర్వాత మన టిడిపి, సభ్యత్వం కార్యక్రమాల్లో  కార్యకర్తలంతా చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ కార్యకలాపాలను డిజిటల్ విధానంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి పనిచేసిన వారిని గుర్తించాలన్నదే మన పార్టీ విధానం. అధికారంలోకి వచ్చాక కేడర్ ను మరువకుండా చంద్రబాబు , నేను ప్రతిజిల్లాకు వెళ్లినపుడల్లా కార్యకర్తలను కలుస్తున్నాం. పార్టీ అధినేత నుంచి కార్యకర్త వరకు పార్టీ ఆదేశాలను అమలు చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం. పార్టీ సంస్థాగత విషయాలు, సమస్యలపై చంద్రబాబు తో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నా. 10 నిర్ణయాల్లో ఒక తప్పు జరగొచ్చు, తప్పులున్నపుడు వివిధ స్థాయిల్లో నాయకుల ద్వారా తమ దృష్టికి తెస్తే సరిదిద్దుకుంటాం అని లోకేష్ అన్నారు.

జులై 2నుంచి గడపగడపకు వెళ్లండి...

జులై 2వతేదీ నుంచి ప్రతిఒక్కరూ గడపగడపకు వెళ్లి గత ఏడాది కాలంలో మనం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బాబు సూపర్ – 6 కార్యక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. తల్లికి వందనం పథకం కింద ఒక్క జిఓ తో రూ.8,745 వేల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశాం. ఆర్థిక ఇబ్బందులున్నా నిర్ణీత సమయానికే తల్లికి వందనం పథకాన్ని విజయవంతంగా అమలుచేశాం.  మెగా డిఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాం. పెద్దఎత్తున పరిశ్రమలను రప్పించడం ద్వారా అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పనకు శాయశక్తులా కృషిచేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా వృద్ధులకు 4వేల పెన్షన్ అందజేస్తున్నాం. ఆగస్టు 15నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నాం.
అహంకారం, ఇగోలను వీడండి!
అహంకారం, ఇగోలను ప్రజలు హర్షించరు. గత పాలకులు అహంకారంతో వ్యవహరించడం వల్లే 151 కాస్త 11కి పడిపోయింది. ఎవరైనా నాయకులు తప్పుగా ప్రవర్తిస్తే ఆ ప్రభావం పార్టీపై పడుతుంది. ప్రజల్లోకి వెళ్లి ఓర్పు, సహనంతో వారు చెప్పే సమస్యలను వింటూ పరిష్కారానికి కృషిచేయండి. గత ప్రభుత్వం కక్షసాధింపుతో నిలిపివేసిన ఉపాధి హామీ, నీరు – చెట్టు బిల్లులను 90శాతం వరకు క్లియర్ చేశాం, మిగిలినవి కూడా జులైలోగా అందజేసే ఏర్పాటుచేస్తాం. కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, పెండింగ్ బిల్లులు వంటి సమస్యలుంటే మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోండి. యువగళం పాదయాత్ర, శంఖారావం కార్యక్రమంలో మీ ప్రాంతానికి రాలేకపోయాను, ఆ తర్వాత నా అవసరం లేకుండా మీరు భారీ మెజారిటీతో పార్టీని గెలిపించారు. పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ బలం, బలహీనతలను నేను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నా. చట్టపరిధిలో రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది, ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి...
గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి దివాలా తీయించింది. ప్రధాని మోడీ మనకు అన్నివిధాలా సహకరిస్తూ ఆక్సిజన్ అందిస్తున్నారు. అమరావతి, విశాఖ ఉక్కు, విశాఖ రైల్వే జోన్ వంటి అన్ని కోర్కెలను ప్రధాని తీరుస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టిడిపి, జనసేన, బిజెపిల కూటమి ఏర్పాటైంది, కూటమిలో మనది పెద్దన్న పాత్ర, సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటూ సమన్వయంతో ముందుకు సాగాలి. తెలుగుదేశం పార్టీ చొరవ వల్లే వక్ఫ్ బిల్లులో 4 కీలక సవరణలు చేశారు, అది మనకున్న కమిట్ మెంట్. పార్టీలో ఏ ఒక్క నాయకుడు మనం గతంలో పడిన ఇబ్బందులు, అవమానాలను మరువకూడదు. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేసినపుడు... నేను ఆయనను కలిసేందుకు తీవ్రస్థాయిలో పోరాడాల్సి వచ్చిందని లోకేష్ చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఆర్టీసి చైర్మన్ కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు.

]]>
Wed, 25 Jun 2025 15:17:08 +0530 admin
విశాఖలోనే భారీగా ఐటీ జాబ్స్ https://prajakshethrenews.com/విశాఖలోనే-భారీగా-ఐటీ-జాబ్స్ https://prajakshethrenews.com/విశాఖలోనే-భారీగా-ఐటీ-జాబ్స్ విశాఖలోనే భారీగా ఐటీ జాబ్స్
ప్రజా క్షేత్ర్ విశాఖపట్టణం, జూన్ 25 :
 విశాఖపట్టణం మధురవాడ పేరు వినిపిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా శాంతంగా ఉండే ఈ ప్రాంతం, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. అక్కడ ఎలాంటి మలుపు తిరిగిందంటే.. పెద్ద ఎత్తున ఉద్యోగాలు, అంతర్జాతీయ కంపెనీ, కోటి రూపాయల పెట్టుబడులు అన్నీ ఒకే వేదికపైకి వచ్చాయి. ఇక్కడి యువతకు ఇదొక భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. విశాఖపట్నం జిల్లా మధురవాడ ప్రాంతంలోని సర్వే నంబర్లు 394, 395, 396, 397లలో ఉన్న మొత్తం 22.19 ఎకరాల భూమిని ఎకరానికి ఒక ప్రముఖ ప్రైవేట్ కంపెనీకి అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మామూలు భూమి కేటాయింపు కాదు దీని వెనక ఉంది భారీ స్థాయిలో ఐటీ పెట్టుబడి, లక్షల రూపాయల రాబడి, వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నది ప్రభుత్వ వాదన. ఈ భూమిని పొందబోతున్న సంస్థ పేరు కాగ్నిజెంట్  ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కంపెనీ. విశాఖపట్నంలో వారు ఏర్పాటు చేయబోయే కేంద్రం ద్వారా రూ. 1582.98 కోట్లు విలువైన పెట్టుబడి రానుంది. ఇది ఎక్కడినుంచైనా ఒక మేజర్ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే చెప్పాలి. ఈ ప్రాజెక్టు ద్వారా 8000 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. ఉద్యోగాలంటే కేవలం కంప్యూటర్ బేసిక్ జాబ్స్ అనుకోవద్దు.. ఇందులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా అనలిస్టులు, టెక్నికల్ సపోర్ట్, మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో అవకాశాలు వస్తాయన్న మాట. అంటే విశాఖ, ఆంధ్రప్రదేశ్ యువతకు ఇది నేరుగా ఉపాధి అవకాశాలను దరికి చేర్చనుంది. ఈ ప్రాజెక్టును 2024-25 కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పాలసీ ద్వారా పెట్టుబడిదారులకు భూమి, మౌలిక సదుపాయాలు, పన్ను సడలింపులు, విద్యుత్, నీటి సరఫరా వంటి అవసరాల్లో ప్రభుత్వ సహకారం లభిస్తుంది. అంటే ఇందులో ప్రభుత్వ రోల్ కేవలం భూమి ఇవ్వడమే కాదు, పూర్తి ప్రోత్సాహాన్ని అందించడమనే చెప్పాలి. ఈ ప్రతిపాదనకు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అర్ధం ఏంటంటే.. ఇక ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ అధికారిక మద్దతుతో ప్రారంభం కాబోతోంది. ఇది విశాఖపట్నానికి, ముఖ్యంగా మధురవాడకు ఐటీ కేంద్రంగా రూపం తీసుకునే అవకాశం. ఇదే కాకుండా, కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు జోరుగా పెరుగుతాయి. ప్రైవేట్ స్కూల్స్, ట్రైనింగ్ సెంటర్లు, హోటల్స్, ట్రాన్స్‌పోర్ట్, చిన్న వ్యాపారాలు ఇవన్నీ బాగా అభివృద్ధి చెందుతాయి. అంటే ఇది కేవలం ఉద్యోగాలకే కాదు, ప్రాంత అభివృద్ధికీ బీజం వేస్తుందన్నమాట. ఈ ప్రకటనపై ఇప్పటికే విశాఖపట్నంలో యువతలో ఉత్సాహం కనిపిస్తోంది. మనం బెంగుళూరు వెళ్ళకుండా ఇక్కడే జాబ్ దొరకాలంటే ఇదే ఆరంభం అనే భావన కూడా కలుగుతోందని టాక్. ఐటీ స్టూడెంట్స్, ట్రైనింగ్ సెంటర్లు, ఇంజనీరింగ్ కాలేజీలు.. అందరూ ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలా అనే దిశగా ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఇటువంటి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో యువతను ఉద్యోగ రాహిత్యం నుండి బయటపడేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. IT, ITeS రంగాల్లో వందలాది కంపెనీలను ఆకర్షించేందుకు పలు మార్గసూచనలు, నూతన పాలసీలను తీసుకువస్తోంది. ఈ ప్రాజెక్ట్ వాటికి ఒక మైలురాయి అవుతుంది. మధురవాడలో మొదలైన ఈ ప్రయోగం కేవలం భూమి కేటాయింపు కాదని, అది రాష్ట్ర భవిష్యత్తు కోసం వేసిన బలమైన బాట అని చెప్పొచ్చు. వేల మందికి ఉద్యోగం, కోట్లాది పెట్టుబడి, ఐటీ రంగానికి కొత్త కేంద్రం అన్నీ కలిపి ఇది ఒక గేమ్ చేంజర్. ఇక మిగతా జిల్లాలు కూడా ఇదే దిశగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వ ఆలోచనగా విశ్లేషకులు భావిస్తున్నారు.

]]>
Wed, 25 Jun 2025 15:02:42 +0530 admin
గుడివాడ ఎమ్మెల్యే రాముకు మంత్రి లోకేష్ ఆత్మీయ పలకరింపు https://prajakshethrenews.com/గుడివాడ-ఎమ్మెల్యే-రాముకు-మంత్రి-లోకేష్-ఆత్మీయ-పలకరింపు https://prajakshethrenews.com/గుడివాడ-ఎమ్మెల్యే-రాముకు-మంత్రి-లోకేష్-ఆత్మీయ-పలకరింపు గుడివాడ ఎమ్మెల్యే  రాముకు మంత్రి లోకేష్ ఆత్మీయ పలకరింపు
ప్రజా క్షేత్ర్, మచిలీపట్నం :
మచిలీపట్నం పర్యటనకు వెళ్తున్న నారా లోకేష్ కు నిమ్మకూరులో.... ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము,వర్ల కుమార్ రాజా, తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ స్వగృహం నిమ్మకూరులో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తో కలిసి, పుష్పగుచ్చాలు అందిస్తూ లోకేష్ కు  ఎమ్మెల్యే రాము  స్వాగతం పలికారు. గజ మాలలతో సత్కరించారు. నిమ్మకూరు ఆడపడుచులు మంగళ హారతులిచచారు. అందరూ బాగున్నారా అంటూ నిమ్మకూరు గ్రామస్తులు, టిడిపి శ్రేణులను లోకేష్  కుశల ప్రశ్నలడిగారు. చెయ్యి పట్టుకుంటూ, భుజం తడుతూ ఎమ్మెల్యే రాము, కుమార్ రాజా, నిమ్మకూరు గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించారు. లోకేష్ వెంట ర్యాలీగా మచిలీపట్నం  ఎమ్మెల్యేలు తెలుగు తమ్ముళ్లు తరలివెళ్లారు.

]]>
Wed, 25 Jun 2025 14:28:59 +0530 admin
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదు https://prajakshethrenews.com/వైఎస్సార్సీపీ-అధినేత-వైఎస్-జగన్-మోహన్-రెడ్డిపై-మరో-కేసు-నమోదు https://prajakshethrenews.com/వైఎస్సార్సీపీ-అధినేత-వైఎస్-జగన్-మోహన్-రెడ్డిపై-మరో-కేసు-నమోదు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదు
ప్రజా క్షేత్ర్, గుంటూరు, జూన్ 24 :
మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదు అయ్యింది. జగన్ మిర్చి యార్డ్ పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ కీలక
నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. గత ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం యార్డ్‌కు వెళ్లారు జగన్. కానీ అనుమతి లేకుండా యార్డ్‌లోకి వచ్చి వైసీపీ నేతలు నానా హంగామా సృష్టించారు.
దీంతో జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్యాన్ పార్టీ నేతలకు 41 ఏ నోటీసులు అందజేస్తున్నారు.మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు, అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి , అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు, కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేతలు పేర్నినాని, కొడాలి నాని, తలశిల రఘురాంతో పాటు జగన్‌పై గతంలోనే నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లోనే కేసు నమోదు అయ్యింది. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత అందుబాటులో ఉన్న నేతలకు నోటీసులు జారీ చేశారు. పిలిచినప్పుడు నల్లపాడు స్టేషన్‌కు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో
పేర్కొన్నారు.

]]>
Tue, 24 Jun 2025 20:04:59 +0530 admin
జగన్ ఎమెర్జెన్సీ మీటింగ్ https://prajakshethrenews.com/జగన్-ఎమెర్జెన్సీ-మీటింగ్ https://prajakshethrenews.com/జగన్-ఎమెర్జెన్సీ-మీటింగ్ జగన్ ఎమెర్జెన్సీ మీటింగ్ 
ప్రజా క్షేత్ర్, కడప, జూన్ 24 :
ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది కూటమి. కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఆ పార్టీ నేతలు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సైతం కూటమిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వైసిపి కార్యకర్త మృతి రాజకీయ రంగు పులుముకుంది. జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొట్టి సింగయ్య మృతి చెందాడని పోలీసులు నిర్ధారించారు. అందుకు సంబంధించి వీడియో ఒకటి బయటకు రావడంతో జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు అయింది. ఆయనపై మోపిన సెక్షన్లు కూడా ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. చాలా విషయాలపై చర్చించారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న నేతలతో చర్చలు జరిపారు. ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశం జరపాలని నిర్ణయించారు.పల్నాడు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విగ్రహ ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనల సందర్భంగా ఎదురైన పరిణామాల దృష్ట్యా కొన్ని ఆంక్షలు విధించారు ఏపీ పోలీసులు. కేవలం 11 వాహనాలతో కాన్వాయ్ గా వెళ్లాలని.. 100 మందితో విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవాలని సూచించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి నుంచి 50 వాహనాలతో కాన్వాయ్ గా వెళ్లారు. స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భారీగా జన సమీకరణ చేశారు. ఈ తరుణంలోనే సింగయ్య మృతి చెందడం సంచలనంగా మారింది. అందుకు సంబంధించి వీడియోలు సైతం బయటకు వచ్చాయి. అయితే ఆ వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సృష్టించినవని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. పోలీసులు మాత్రం కఠిన సెక్షన్లు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కింద అరెస్టులు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇది జీవిత ఖైదుకు సంబంధించిన సెక్షన్లు అని అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్యులు తాడేపల్లి కార్యాలయానికి హాజరుకావాలని సమాచారం ఇచ్చారు.జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని కూటమి ప్రభుత్వం పాలు కదుపుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదని ప్రచారం సాగుతోంది. అందుకే జగన్ పునరాలోచనలో పడ్డారు. పార్టీ ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. జగన్ బయటకు వస్తుండడంతో జనాదరణ పెరిగిందని.. దానిని నియంత్రించేందుకే ఇలా చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. మరోవైపు జూలై 8న వైయస్సార్ జన్మదినం. ఆరోజు ఇడుపాలపాయలో నివాళులు అర్పించేందుకు జగన్ వెళ్ళనున్నారు. అదే రోజు నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడతారని తెలుస్తోంది. అందుకే పార్టీ ముఖ్యులతో ముందుగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు ఏనాడో వెళ్లాల్సి ఉంది. సంక్రాంతి కంటే ముందే జిల్లాల పర్యటనకు సంబంధించి కీలక ప్రకటన చేశారు జగన్ మోహన్ రెడ్డి. కానీ జిల్లాల పర్యటనకు వెళ్లలేదు. ఆ విషయంలో కాలయాపన జరుగుతోంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే జనాల ఆదరణ కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే మంచి ప్రయోజనం ఉంటుందని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డిని నియంత్రించేందుకు అనేక రకాల కేసులను కూటమి తెరపైకి తెస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ప్రజల మధ్యకు వెళితే వారి ఆదరణ తప్పకుండా లభిస్తుందని ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. మొత్తానికైతే ఈనెల 25న జరగనున్న కీలక సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

]]>
Tue, 24 Jun 2025 10:11:15 +0530 admin
జగన్ మోహన్ రెడ్డి కు వస్తున్న ప్రజాదరణను చూసి ప్రభుత్వం ఓర్వలేకపోతుంది : మండిపడ్డ మాజీ మంత్రి ఆర్ కె రోజా https://prajakshethrenews.com/జగన్-మోహన్-రెడ్డి-కు-వస్తున్న-ప్రజాదరణను-చూసి-ప్రభుత్వం-ఓర్వలేకపోతుంది-మండిపడ్డ-మాజీ-మంత్రి-ఆర్-కె-రోజా https://prajakshethrenews.com/జగన్-మోహన్-రెడ్డి-కు-వస్తున్న-ప్రజాదరణను-చూసి-ప్రభుత్వం-ఓర్వలేకపోతుంది-మండిపడ్డ-మాజీ-మంత్రి-ఆర్-కె-రోజా జగన్ మోహన్ రెడ్డి కు వస్తున్న ప్రజాదరణను చూసి ప్రభుత్వం ఓర్వలేకపోతుంది
                           మండిపడ్డ మాజీ మంత్రి ఆర్ కె రోజా
ప్రజా క్షేత్ర్, అమరావతి జూన్ 23 :
 వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కు వస్తున్న ప్రజాదరణను చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతుందని  మాజీ మంత్రి ఆర్ కె రోజా మండిపడ్డారు. సింగయ్య చనిపోవడంతో కక్ష్యసాధింపు చర్యల్లో భాగంగానే కుట్రలు, తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.  ఆమె మీడియాతో మాట్లాడుతూ..18న జగన్ కాన్వాయ్ ముందు చనిపోయారంటూ ఎస్పి చెప్పారని, 22న అదే ఎస్పి చేత అబద్ధం చెప్పించారని చెప్పారు. నిజమైతే డ్రైవర్ పై కేసు పెట్టాలి కానీ జగన్ పై పెట్టడమేంటీ అని అన్నారు. విమానం కూలిన ఘటనపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ పై ఎందుకు కేసు పెట్టలేదు? అని ప్రశ్నించారు. సింహాచలం గోడ కూలిన ఘటనపై హోం మంత్రి అనితపై ఎందుకు కేసు పెట్టలేదు? అని అన్నారు. బైక్ స్టంట్ లు చేయాలన్న పవన్ మాటలు విని ఇద్దరు చనిపోయారని, మరి పవన్ కల్యాణ్ పై ఎందుకు కేసులు పెట్టలేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఆపకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని రోజా పేర్కొన్నారు.

]]>
Mon, 23 Jun 2025 19:24:03 +0530 admin
శ్రీశైలంలో బుల్లెట్ల కలకలం https://prajakshethrenews.com/శ్రీశైలంలో-బుల్లెట్ల-కలకలం https://prajakshethrenews.com/శ్రీశైలంలో-బుల్లెట్ల-కలకలం శ్రీశైలంలో బుల్లెట్ల కలకలం
ప్రజా క్షేత్ర్, శ్రీశైలం :
శ్రీశైలంలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. గుర్తుతెలియని వ్యక్తులు బుల్లెట్లు వదిలి వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలోని వాసవీసత్రం ఎదురు రోడ్డు డివైడర్ పై ఈ బుల్లెట్లు లభ్యమయ్యాయి. మొత్తం 9 పెద్ద సైజు బుల్లెట్లు, 4 చిన్న సైజు బుల్లెట్లు దొరికాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.  బుల్లెట్లతో పాటు 4 బాంబులు కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

]]>
Mon, 23 Jun 2025 18:16:38 +0530 admin
జగన్ ధైర్యం వెనుక అదేనా? https://prajakshethrenews.com/జగన్-ధైర్యం-వెనుక-అదేనా https://prajakshethrenews.com/జగన్-ధైర్యం-వెనుక-అదేనా జగన్ ధైర్యం వెనుక అదేనా? ....
ప్రజా క్షేత్ర్, గుంటూరు, జూన్ 23 :
వైసీపీ అధినేత వైఎస్ జగన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో పడిందా? ఆయనపై చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయన్నది ఇప్పుడు కూటమి పార్టీలో పెద్దయెత్తున చర్చజరుగుతుంది. కొన్నేళ్లుగా జగన్ పై ఉన్న కేసులన్నీ పెండింగ్ లోనే ఉన్నాయని, కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదని కూటమి పార్టీలో ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. మోదీ తనకు అనుకూలంగా ఉంటారన్న ధైర్యంతోనే జగన్ ఉన్నారని టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. అందుకు ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ పై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిందితులను విచారించి చాలా రోజులయినప్పటికీ ఇప్పటికీ ముందడగు పోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోనూ పురోగతి లేదు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సీబీఐ అధికారులు కూడా దీనిపై పెద్దగా స్పందించడంలేదు. ఇక 2019లో జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ పురోగతి లేదు. అసలు నిందితులని అనుమానిస్తున్న వారిని పట్టించుకోవడం లేదు. ఈ ఇప్పటికే ఈ కేసు సీబీఐ విచారణ ప్రారంభించి ఇన్నేళ్లవుతున్నా అంగుళం కదలకపోవడానికి కారణాలపై ముఖ్యంగా టీడీపీ నేతల్లోనే చర్చ మొదలయింది. జగన్ బెంగళూరులో ఉంటున్నప్పటికీ, ఢిల్లీ గడప తొక్కపోయినప్పటికీ అక్కడి వారితో సంబంధాలు బాగానే
నెరుపుతున్నారన్న అనుమానాన్ని టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కూడా వైసీపీ ఎంపీల జోలికి పోవడం లేదు. ఇద్దరిని మాత్రమే రాజీనామా చేయించగలిగింది. కనీసం జగన్ పై వత్తిడి చేసే ప్రయత్నం చేయలేదు. నాడు టీడీపీలో ఉన్న రాజ్యసభ సభ్యులందరూ నలుగురు వెళ్లి బీజేపీలో కలిశారని, నేడు ఏడాది అవుతున్నా కేవలం ఇద్దరు మాత్రమే రాజీనామా చేశారని, వారిలో ఒకరు తిరిగి బీజేపీలో చేరగా, మరొకరి స్థానంలో బీజేపీ అభ్యర్థినే పోటీకి నిలబెట్టి గెలిపించుకున్నారంటున్నారు. జగన్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల్లో ఆర్థికంగా బలవంతులున్నప్పటికీ వారి జోలికి వెళ్లకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభలో జగన్ ను జీరో చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే సహకరించడం లేదన్న భావన తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతుంది. . అందుకే జగన్ ధైర్యంగా రాష్ట్రంలో తిరగగలుగుతున్నారని, ఢిల్లీలో ఉన్న పెద్దలకు జగన్ పట్ల ఉన్న సాఫ్ట్ కార్నర్ ఇలాంటి పరిస్థితిని తెచ్చిపెట్టిందన్న అభిప్రాయం పసుపు పార్టీలో పుష్కలంగా కనిపిస్తుంది. తమ చేతికి మట్టి అంటకుండా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల చేత అరెస్ట్ లు చేయించాలని భావించిన తెలుగుదేశం పార్టీ నేతల ఆశలు నిజం కాకపోవడంతో రాను రాను ఇక జగన్ కు క్రేజ్ పెరిగే అవకాశముండటంతో అప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా సహకరించే అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ విచారణలు వంటివి తాబేటి నడకలా సాగుతుండటంతో ఈ అనుమనాలు సహజంగానే కలుగుతున్నాయి. మరినిజమేంటో కానీ.. జగన్ ఏ ధైర్యంతో ఉన్నారన్నది ఆయనకే తెలియాలి.

]]>
Mon, 23 Jun 2025 09:27:36 +0530 admin
యోగాంధ్రకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ https://prajakshethrenews.com/యోగాంధ్రకు-గిన్నిస్-వరల్డ్-రికార్డ్ https://prajakshethrenews.com/యోగాంధ్రకు-గిన్నిస్-వరల్డ్-రికార్డ్ యోగాంధ్రకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్
ప్రజా క్షేత్ర్, విశాఖపట్నం :
 విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించిన 'యోగాంధ్ర' కార్య క్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. సూరత్ యోగా రికార్డు(1.5 లక్షల మంది)ను విశాఖ యోగాంధ్ర బ్రేక్ చేసింది. బీచ్ రోడ్లో 26 కి.మీ. మేర యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేయగా.. 3 లక్షల మందికి పైగా పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. 45 నిమిషాల పాటు సీఎం మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ సహా రాష్ట్ర, కేంద్ర మంతులు యోగాసనాలు చేశారు.

]]>
Sat, 21 Jun 2025 13:56:37 +0530 admin
ఏపీలో మావోల కదలికలు https://prajakshethrenews.com/ఏపీలో-మావోల-కదలికలు https://prajakshethrenews.com/ఏపీలో-మావోల-కదలికలు ఏపీలో మావోల కదలికలు
ప్రజా క్షేత్ర్, విశాఖపట్టణం, జూన్ 20 :
ఆపరేషన్‌ కగార్‌తో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా చేపట్టిన ఆపనేషన్లులో మావోయిస్టులకు ద్బెమీద దెబ్బతగులుతూనే ఉంది. వరుస ఆపరేషన్లులో మావోయిస్టు పార్టీ కీలక సెంట్రల్‌ నేతలు ఒక్కొరు హతమవుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ అటవీప్రాంతం నుంచి రంపచోడవరం డివిజన్‌వైపు మావోనేతలు ఇటువైపుగా వరుస కట్టడం వారి ఉనికికే ప్రమాదాన్ని తీసుకొస్తుందా అంటే అవుననే అంటున్నారు. పోలీసులు చేపడుతున్న కూంబింగ్‌లో వరుసగా మావోల కీలక నేతలు హతమవుతున్న నేపథ్యంలో జూన్‌ 18 మావోలకు మరింత పెద్దదెబ్బ తగిలినట్లయ్యింది.. రంపచోడవరానికి 26 కిలోమీటర్లు దూరంలో ఉన్న దేవిపట్నం మండలం కించకూరు కాకవాడ గండి దట్టమైన అటవీప్రాంతంతంలో పోలీసులకు, మావోలకు జరిగిన ఎదురుకాల్పుల్లో కీలక నేతలు మృత్యువాత పడడం సంచలనంగా మారింది.చాలా రోజులుగా రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో మావోల కదలిక కూడా అంతంత మాత్రంగా మారిందని అయితే తాజా ఎన్‌కౌంటర్‌తో ఈ ప్రాంతంలో మావోయిస్టులు కదలికలు ఉన్నాయనే తెలుస్తోంది. పోలీసులు, మావోల మధ్య జరిగి ఎదురు కాల్పల్లో మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌, స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యురాలు రావి వెంకట హరిచైతన్య అలియాస్‌ అరుణ(మావోయిస్టు నేత చలపతి సతీమణి), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అంజు మృతి చెందారు. దీంతో రంపచోడవరంలో మావో కదలికలున్నాయన్న విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది.. ఆపరేషన్‌ కగార్‌తో మావోయిస్టులను నిర్మూలించే లక్ష్యంతో పోలీసులు పనిచేస్తుండగా వరుస సంఘటనలతో కీలక సెంట్రల్‌కమిటీ నేతలు దుర్మరణం చెంది పార్టీ కోలుకోలేని స్థితిలోకి వెళ్లింది.. ఈక్రమంలోనే ఏవీబీ నుంచి ఛత్తీస్‌గఢ్‌ అటవీప్రాంతం మీదుగా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోకి వచ్చే రంపచోడవరం డివిజన్‌లోకి మావోయిస్తు పార్టీ కీలక నేతలు వరుస కడుతున్నారని పోలీసలు గుర్తించారు. ఈక్రమంలోనే ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు కీలక నాయకుడిగా ఉన్న చలపతిరావు అలియాస్‌ చలపతి కూంబింగ్‌ ఆపరేషన్‌లో భాగంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. ఈ ఎన్‌కౌంటర్‌ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం డివిజన్‌ చింతూరు ఏజెన్సీ ప్రాంతం ముక్కాళి అటవీప్రాంతంలో జరిగింది. ఆ తరువాత ఇదే జిల్లాలోని వై.రామవరం ఏజెన్సీ ప్రాంతంలోని యార్లగడ్డ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టు నేతలు మృతిచెందారు. ఈప్రాంతంలో గ్రేహౌండ్స్‌ బలగాలు కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలుస్తోంది.. కగార్‌ ఆపరేషన్‌లో భాగంగా గ్రేహౌండ్స్‌ బలగాలు రంపచోడవరం డివిజన్‌ పరిధిలో ఇటీవల కాలంలో విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తుండడానికి కారణం ప్రధానంగా ఈ ప్రాంతంలోకి గత కొంతకాలంగా మావోయిస్తులు వస్తుండడం కారణంగా నిలుస్తోందంటున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతి పరిజ్ఞానంతో మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా పెట్టిన పోలీసులు దట్టమైన అడవుల్లో మావోల ప్రతీ కదలికను ఇట్టే పసిగడుతున్నట్లు తెలుస్తోంది. దట్టమైన అడవుల్లో సైతం ధర్మల్‌ డ్రోన్ల సాయంతో మావోల కదలికలను పసిగట్టగలుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతం నుంచి అల్లూరి జిల్లాలోని రంపచోడవరం డివిజన్‌లోకి అటవీమార్గం ద్వారా ఇటీవల కాలంలో వచ్చిన పలువురు మావోయిస్టు పార్టీ కీలకనేతలు ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి అటవీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు ఇద్దరు మృతి చెందడం కూడా మావోలు మరో మార్గంలేని స్థితిలోనే రంపచోడవరం డివిజన్‌లో తలదాచుకుని మృత్యువాతపడ్డారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

]]>
Fri, 20 Jun 2025 10:18:28 +0530 admin
మరోసారి పాదయాత్ర చేపట్టనున్న వై ఎస్ జగన్? https://prajakshethrenews.com/మరోసారి-పాదయాత్ర-చేపట్టనున్న-వై-ఎస్-జగన్ https://prajakshethrenews.com/మరోసారి-పాదయాత్ర-చేపట్టనున్న-వై-ఎస్-జగన్ వై ఎస్ జగన్ పాదయాత్రకు రిహార్సల్స్...
ప్రజా క్షేత్ర్, విజయవాడ, జూన్ 20 :
వైసీపీ అధినేత జగన్ మరొకసారి పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. అందుకోసమే ట్రయల్ గా ఇప్పుడు జిల్లాలను పర్యటిస్తున్నారట. ప్రజల్లో తనకు ఉన్న ఇమేజ్ తగ్గిందా? లేదా? అన్న అంచనాలను వేసుకోవడానికే జగన్ ఈ రకమైన పర్యటనలు చేపట్టినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అన్ని ప్రాంతాల్లో తాను పర్యటించిన తర్వాత పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని జగన్ భావిస్తున్నారని తెలిసింది. 2019 ఎన్నికలకు ముందు చేపట్టిన యాత్ర సక్సెస్ అయి అధికారం దక్కడంతో ఈసారి కూడా అదే ఫార్ములాతో వెళ్లాలన్నది జగన్ అభిప్రాయంగా ఉంది. అయితే ఏ సమయంలో పాదయత్ర నిర్వహిచాలన్నది ఇంకా నిర్ణయించకపోయినా 2027 లో యాత్రకు శ్రీకారం చుట్టే అవకాశముందని సీనియర్ నేతలు ఒకరు తెలిపారు. వైఎస్ జగన్ మళ్లీ పాదయాత్రతో జనంలోకి వెళ్లడానికే నిర్ణయించుకున్నారు. రాయలసీమలో తన గ్రాఫ్ పెరిగిందని జగన్ భావిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరికి వెళ్లినప్పుడు చివరకు తాను ప్రయాణించే హెలికాప్టర్ కూడా ధ్వంసమయింది. అలాగే తిరుపతిలో తొక్కిసలాట జరిగి మరణించినప్పుడు పార్టీ కార్యకర్తలు విపరీతంగా వచ్చారు. ఇక కడప తన సొంత జిల్లా కావడంతో ఈసారి తనకు ప్రజలు అండగా నిలబడతారని భావిస్తున్నారు. కర్నూలు జిల్లాకు వెళ్లినప్పుడు నంద్యాల ప్రాంతంలో కూడా జనం పోటెత్తారు. దీంతో రాయలసీమలో ఇక తనకు ఇబ్బంది లేదని, తిరిగి తన ఇమేజ్ బిల్డప్ అయిందని జగన్ పూర్తిగా విశ్వసిస్తున్నారు. తన పాలనకు, ప్రస్తుతకూటమి పాలనకు బేరీజు వేసుకున్న ప్రజలు క్రమంగా తనవైపునకు సీమలో తిరుగుతున్నారని భావిస్తున్నారు.  పొదిలి, పల్నాడు పర్యటనలు సక్సెస్ కావడంతో ఇక ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో అనూహ్య స్పందన లభించింది. చివరకు పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ కూడా జరిగింది. జనం హెలికాప్టర్ ల్యాండ్ అయిన దగ్గరనుంచితిరిగి టేకాఫ్ అయ్యేంత వరకూ తన వెంటే ఉండటంతో ఆ జిల్లాపై కూడా భరోసా వచ్చింది. తెనాలి పర్యటనకు వెళ్లినప్పుడు కూడా నం పోటెత్తారు. తాజాగా పల్నాడు జిల్లాలో పర్యటన కూడా ఫుల్లు సక్సెస్ అయిందని వైసీపీ వర్గాలే కాదు అందరూ ఒప్పుకుంటున్నారు. రెంటపాళ్ల గ్రామానికి చేరుకోవాలంటే ఆరు గంటల సమయం పట్టిందంటే అడుగడుగునా జగన్ ను కార్యకర్తలు ఎలా కాళ్లకు అడ్డంపడ్డారన్నది అర్థం అవుతుంది. రాజధాని అమరావతి పక్కన ఉన్న గుంటూరు జిల్లాలో తన పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇక జగన్ ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది.  శ్రీకాకుళం, విశాఖపట్నంలో పార్టీ బలహీనంగా ఉందని జగన్ వివిధ నివేదికల ద్వారా తెప్పించుకుని దానిని సెట్ రైట్ చేసి అక్కడ బలమైన నాయకత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత ఆ జిల్లాలకు వెళ్లాలన్న యోచనలో ఉన్నారని తెలిసింది. ఇక గెలుపునకు ఖచ్చితంగా అత్యధిక స్థానాలు సాధించాల్సిన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాల్లో కూడా జగన్ వివిధ దశల్లో పర్యటించిన తర్వాత పాదయాత్ర మొదలు పెట్టాలన్న యోచనలో ఉన్నారు. పాదయాత్ర ద్వారా అయితేనే తాను ప్రజల్లోకి సులువుగా వెళ్లగలనని, వారిని కలుసుకోవడంతో పాటు నేరుగా కనెక్ట్ అయి వారితో ఇంటరాక్ట్ అయితే వచ్చే ఫలితం అనుకూలంగా వస్తుందని జగన్ అంచనా వేస్తున్నారు.  దీంతో పాటు పార్టీలో ఎక్కడెక్కడ ఏ రకమైన లోపాలున్నాయన్నది కూడా గుర్తించేందుకు పాదయాత్ర ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నారు. అయితే ప్రభుత్వంపై ఇంకా బాగా వ్యతిరేకత పెరిగిన తర్వాత మాత్రమే పాదయాత్ర చేపడితే మంచి ఊపు లభిస్తుందని ఆయన భావిస్తున్నారు. అందుకోసమే ముందుగా అన్ని జిల్లాల్లో పర్యటనలు చేసిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని 2027లో పాదయాత్ర మొదలుపెట్టి ఎన్నికల నాటికి పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఈసారి కూడా గతంలో మాదిరిగా తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాతనే పాదయాత్ర ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారు. పాదయాత్ర రోడ్ మ్యాప్ ఇంకా ఖరారు కాలేదు కానీ బహుశ ఈసారి ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకూ జగన్ పాదయాత్ర చేస్తారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. మరి పాదయాత్ర మరోసారి అధికారాన్ని తెచ్చిపెడుతుందా? లేదా? అన్నది మాత్రంచూడాల్సి ఉంది.

]]>
Fri, 20 Jun 2025 10:07:40 +0530 admin
విశాఖకు ఇంటర్నేషనల్ బ్రాండ్ https://prajakshethrenews.com/విశాఖకు-ఇంటర్నేషనల్-బ్రాండ్ https://prajakshethrenews.com/విశాఖకు-ఇంటర్నేషనల్-బ్రాండ్ విశాఖకు ఇంటర్నేషనల్ బ్రాండ్...
ప్రజా క్షేత్ర్, విశాఖపట్టణం, జూన్ 19 : 
అంతర్జాతీయ స్థాయిలో మరోసారి విశాఖపట్నం మార్మోగ నుంది. ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు విశాఖలో జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఐదు లక్షల మందితో యోగా దినోత్సవ వేడుకలు జరిపేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. ఇప్పటికే విశాఖ సిటీ పర్యాటకంగా గుర్తింపు పొందింది. వాణిజ్యపరంగా అభివృద్ధి సాధిస్తోంది. ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మెగాసిటీగా గుర్తింపు సాధించింది. అందుకే సిటీ ఆఫ్ డెస్టినీ గా పేర్కొంటారు. ఇక టూరిజం అంటే విశాఖ అని అంతర్జాతీయ పర్యాటకులు భావిస్తారు. అటువంటి చోట ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు జరుపుతుండడంతో.. మరోసారి అంతర్జాతీయ స్థాయిలో విశాఖ చర్చకు దారితీస్తోంది.యోగాకు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చింది భారత్. అందుకే యోగా విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి విశాఖలో జరిగే వేడుకలకు హాజరవుతానని ముందుగానే ప్రకటించారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మోడీ.. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలకు సాగర తీరానికి వస్తానని రాష్ట్ర ప్రభుత్వానికి ఆఫర్ ఇచ్చారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే విశాఖ అభివృద్ధికి అడుగులు పడినట్టే. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు విశాఖకు క్యూ కడుతున్నాయి. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి. ఆర్థిక రాజధానిగా విశాఖ మారుతున్న క్రమంలో ఇటువంటి అంతర్జాతీయ వేడుకలకు వేదికగా నిలవడం శుభపరిణామం.ప్రధాని విశాఖ పర్యటనక సంబంధించి షెడ్యూల్ ముందుగానే ఖరారు అయింది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రకటన వచ్చింది. ఈనెల 20న ప్రధాని నరేంద్ర మోడీ భువనేశ్వర్ నుంచి విశాఖకు చేరుకోనున్నారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు విశాఖ బీచ్ రోడ్ లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్నారు. అదేరోజు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖకు ప్రముఖుల తాకిడి పెరిగింది. ఇప్పటికే ఏర్పాట్లను సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆయన ఈనెల 20న విశాఖకు చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ నేరుగా విశాఖకు చేరుకుంటారు. కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతారు. ఒకరోజు ముందుగానే విశాఖ నగరం భద్రత వలయంలోకి వెళ్తుంది. ఇప్పటికే నగరం నిఘా నీడలో ఉంది. మొత్తానికైతే విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతి రావడం పై నగరవాసులతోపాటు ఉత్తరాంధ్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

]]>
Thu, 19 Jun 2025 09:35:47 +0530 admin
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ తో లోకేష్ భేటీ https://prajakshethrenews.com/కేంద్ర-ఫుడ్-ప్రాసెసింగ్-మంత్రి-చిరాగ్-పాశ్వాన్-తో-లోకేష్-భేటీ https://prajakshethrenews.com/కేంద్ర-ఫుడ్-ప్రాసెసింగ్-మంత్రి-చిరాగ్-పాశ్వాన్-తో-లోకేష్-భేటీ రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి సహకరించండి

కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ తో లోకేష్ భేటీ

ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ :  
పండ్లతోటల అభివృద్ధికి అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ కు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ తో మంత్రి లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... రాయలసీమలో రైతులు మామిడి, అరటి, టమోటా, బత్తాయి, దానిమ్మ, డేట్స్ వంటి పండ్లతోటలను పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. అయితే పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా వారి కష్టాలను ప్రత్యక్షంగా చూశాను. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా అక్కడి రైతులకు మెరుగైన రేట్లు లభించి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సహకరించాలకు లోకేష్ కోరారు. దీనికి కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ... ఎపిలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తిస్థాయి సహకారం అందిస్తాం. తిరుపతి ట్రిపుల్ ఐటిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి నేను ఏపీకి వస్తున్నాను. జులై 11, 12 తేదీల్లో రాయలసీమ పర్యటనకు వస్తున్నా. మీరు కూడా వస్తే క్షేత్ర స్థాయిలో పర్యటించి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై అధ్యయనం చేద్దాం. అన్నదాతలకు మేలు చేసేందుకు మోడీజీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందని చెప్పారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని లోకేష్... చిరాగ్ పాశ్వాన్ కు అందించారు.

]]>
Wed, 18 Jun 2025 19:26:22 +0530 admin
నేనూ ట్యాపింగ్ బాధితురాలినే : వైఎస్ షర్మిల కీలక కామెంట్స్ https://prajakshethrenews.com/నేనూ-ట్యాపింగ్-బాధితురాలినే-వైఎస్-షర్మిల-కీలక-కామెంట్స్ https://prajakshethrenews.com/నేనూ-ట్యాపింగ్-బాధితురాలినే-వైఎస్-షర్మిల-కీలక-కామెంట్స్ నేనూ ట్యాపింగ్ బాధితురాలినే..
   ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక కామెంట్స్
ప్రజా క్షేత్ర్, అమరావతి ;

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ పై ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక కామెంట్స్ చేశారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని ఆమె చెప్పారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు.. సుప్రీం ఆదేశాల మేరకు భారత్ కు వచ్చి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటివరకు ఆయనను మూడుసార్లు విచారించిన అధికారులు.. ఈ కేసులో దూకుడు పెంచారు. మరోసారి ఈ కేసులో నిందితులైన ప్రణీత్ రావు వంటి వారిని మళ్లీ విచారిస్తూ కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ షర్మీల ఫోన్ ట్యాపింగ్ పై స్పందించారు.బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ నిజమేనని చెప్పారు. “బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా… ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవమే. నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గర వాళ్ల ఫోన్‌లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తా. ఫోన్‌ ట్యాపింగ్‌పై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు విచారణ వేగవంతం చేయాలి. తెలంగాణ మాజీ సిఎం కెసిఆర్, జగన్‌ సంబంధం ముందు.. రక్తసంబంధం కూడా చిన్నబోయింది” అని షర్మిల పేర్కొన్నారు.

]]>
Wed, 18 Jun 2025 19:13:05 +0530 admin
వైఎస్ షర్మిల ఫోన్ సైతం ట్యాప్? https://prajakshethrenews.com/వైఎస్-షర్మిల-ఫోన్-సైతం-ట్యాప్ https://prajakshethrenews.com/వైఎస్-షర్మిల-ఫోన్-సైతం-ట్యాప్ వైఎస్ షర్మిల ఫోన్ సైతం ట్యాప్?
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. వైకాపా అధినేత, ఏపీసీసీ ఛీఫ్  వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ట్యాపింగ్ వ్యవహారంతా అత్యంత గోప్యంగా  జరిగింది.వైసిపి అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ రికార్డులు అయినట్లు సమాచారం . షర్మిల ఎవరెవరితో మాట్లాడుతుంది అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ” అన్నకు “ చేరవేసారు. షర్మిల మాట్లాడే ప్రతి ఒక్కరిపై నిఘా  వుంచారు. షర్మిల దగ్గరి మనుషులను పిలిపించినా ఓ సీనియర్ పోలీస్ అధికారి ద్వారా వార్నింగ్ ఇచ్చినట్లు కుడా వార్తలు వస్తున్నాయి. తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు అప్పట్లోనే షర్మిల గుర్తించారు.

]]>
Tue, 17 Jun 2025 14:00:27 +0530 admin
హైడ్రాలిక్ నీ జాయింట్ విత్ కార్బన్ పైబర్ ఫూట్ 5 సీల్ లైనర్ ను అందజేసిన జాయింట్ కలెక్టర్ https://prajakshethrenews.com/హైడ్రాలిక్-నీ-జాయింట్-విత్-కార్బన్-పైబర్-ఫూట్-5-సీల్-లైనర్-ను-అందజేసిన-జాయింట్-కలెక్టర్ https://prajakshethrenews.com/హైడ్రాలిక్-నీ-జాయింట్-విత్-కార్బన్-పైబర్-ఫూట్-5-సీల్-లైనర్-ను-అందజేసిన-జాయింట్-కలెక్టర్ హైడ్రాలిక్ నీ జాయింట్  విత్ కార్బన్ పైబర్ ఫూట్  5 సీల్ లైనర్ ను  అందజేసిన జాయింట్ కలెక్టర్

ప్రజా క్షేత్ర్, తిరుపతి :

ప్రతిభా వంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా  విభిన్న ప్రతిభావంతునికి  ఎమ్ పి లాడ్స్ ద్వారా  హైడ్రాలిక్ నీ జాయింట్  విత్ కార్బన్ పైబర్ ఫూట్  5 సీల్ లైనర్ ను  జాయింట్ కలెక్టర్. శుభం బన్సల్ తో కలసి జిల్లా కలెక్టర్. డా ఎస్ వెంకటేశ్వర్ అందజేశారు.
సోమవారం మధ్యాహ్నం స్థానిక  కలెక్టరేట్ నందు  శ్రీకాళహస్తి మండలం  ఆంజనేయపురం గ్రామస్తుడైన సుబ్బారాయులు విభిన్న ప్రతిభావంతునికి  ఎమ్ పి లాడ్స్ ద్వారా సుమారు 5 లక్షల 70 వేలు  రూపాయలు. విలువైన  సంగమేశ్వర హెల్త్ ఎయిడ్స్ అండ్ సర్జీకల్  ఏజెన్సీ వారు తయారు చేసిన హైడ్రాలిక్ నీ జాయింట్  విత్ కార్బన్ పైబర్ ఫూట్  5 సీల్ లైనర్ ను  అందజేశారు. ఈ కార్యక్రమంలో  డి ఎమ్ అండ్ హెచ్ ఓ బాలకృష్ణ నాయక్,  ప్రతిభా వంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ  సి ఆర్ అండ్ ఎమ్. ఓ జి. కె. రాజశేఖర్,  సంగమేశ్వర హెల్త్ ఎయిడ్స్ అండ్ సర్జీకల్  ఏజెన్సీ ప్రాపరైటర్  రాజు, ఇంజనీర్ చెంచల్ భారత్  తదితరులు  పాల్గొన్నారు.

]]>
Mon, 16 Jun 2025 21:20:01 +0530 admin
వైమానిక దళం లో ఉద్యోగాలు పొందాలి https://prajakshethrenews.com/వైమానిక-దళం-లో-ఉద్యోగాలు-పొందాలి https://prajakshethrenews.com/వైమానిక-దళం-లో-ఉద్యోగాలు-పొందాలి వైమానిక దళం లో ఉద్యోగాలు పొందాలి

ప్రజా క్షేత్ర్, రాయచోటి :

భారత వైమానిక దళంలో యువకులు ఉద్యోగాలు పొందాలని భారత వైమానిక దళానికి చెందిన ఉన్నతాధికారులు సందీప్ కుమార్, సురేంద్ర సింగ్ లు సూచించారు. సోమవారం అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల భారత వైమానిక దళం ఉద్యోగావకాశాలపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ నుండి వచ్చిన భారత వైమానిక దళానికి చెందిన కార్పోరల్స్ శ్రీ ఎన్. సందీప్ కుమార్ మరియు శ్రీ సురేంద్ర సింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.వైద్య, శారీరక అర్హతలతో పాటు ప్రవేశ పరీక్షల ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అవకాశాలు పొందవచ్చని వారు వివరించారు.ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ కంబైన్డ్ డిఫెన్సె స్కీమ్ మరియు యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ వంటి ఎంట్రీల ద్వారా బీటెక్ విద్యార్థులకు మంచి అవకాశాలున్నాయని తెలియజేశారు.ఇంజనీరింగ్ బ్రాంచ్‌ లోని ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలపై వివరాలు అందజేశారు. కనీసం 60% మార్కులతో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, ఎంపిక అనంతరం ఫిజికల్, మెడికల్ టెస్టులు, ఇంటర్వ్యూలు కూడా విజయవంతంగా పూర్తి చేయవలసి ఉంటుందని చెప్పారు.ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ,భారత రక్షణ రంగంలో సేవ చేయడం ప్రతి విద్యార్థికి గర్వకారణంగా ఉంటుంది. మన విద్యార్థులు ఇటువంటి అవకాశాలను వినియోగించుకొని దేశ సేవలో భాగస్వాములవ్వాలి” అని సూచించారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. బాలాజీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి. వెంకటరమణ, ప్లేస్మెంట్ ఆఫీసర్ కొత్తపల్లి ఇంతియాజ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Mon, 16 Jun 2025 20:52:25 +0530 admin
శ్రీ వేంకటేశ్వర కళాశాల గవర్నింగ్ బాడీ ఛైర్మెన్ గా బీఆర్ నాయుడు ఎంపిక https://prajakshethrenews.com/శ్రీ-వేంకటేశ్వర-కళాశాల-గవర్నింగ్-బాడీ-ఛైర్మెన్-గా-బీఆర్-నాయుడు-ఎంపిక https://prajakshethrenews.com/శ్రీ-వేంకటేశ్వర-కళాశాల-గవర్నింగ్-బాడీ-ఛైర్మెన్-గా-బీఆర్-నాయుడు-ఎంపిక టిటిడి ప్రతిష్ట మరింత పెంచేలా ఢిల్లీ ఎస్వీ కళాశాల
బీఆర్ నాయుడు, టిటిడి ఛైర్మెన్
తిరుమల  శ్రీ వేంకటేశ్వర కళాశాల గవర్నింగ్ బాడీ ఛైర్మెన్ గా  బీఆర్ నాయుడు ఎంపిక
ప్రజా క్షేత్ర్, తిరుమల : 
టిటిడి ప్రతిష్టను మరింత పెంచేలా ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలను రూపొందించాలని అధికారులను టిటిడి ఛైర్మెన్  బీఆర్ నాయుడు  కోరారు. తిరుపతి శ్రీ పద్మావతీ అతిథి గృహంలో టిటిడి ఈవో  జె. శ్యామలరావు, గవర్నంగ్ బాడీ సభ్యులతో సోమవారం 155వ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్వీ కళాశాల గవర్నింగ్ బాడీ ఛైర్మెన్ గా  బీఆర్ నాయుడు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గవర్నింగ్ బాడీ ఛైర్మెన్ గా ఎంపికైన టిటిడి ఛైర్మెన్  బీఆర్ నాయుడును గవర్నింగ్ బాడీ సభ్యులు అభినందించారు. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా టిటిడి నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అవసరమైన మౌళిక సదుపాయాల పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు సూచించారు. ఎస్వీ కళాశాలలో తెలుగు విద్యార్థులకు అడ్మిషన్ల కోటాలో ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరాది వైపున ఉన్నటిటిడి ఆలయాలలో, ఢిల్లీలోని ఎస్వీ కళాశాలకు ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇంజనీరింగ్ ఈఈ విభాగాన్ని ఏర్పాటు చేయాలని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావుకు టిటిడి ఛైర్మెన్ సూచించారు. ఎస్వీ కళాశాలలో విద్యార్థులకు ఉద్యోగ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థులకు ఉపాధికి అవకాశం ఉన్న వృత్తిపరమైన కోర్సులను ప్రవేశ పెట్టాలని సూచించారు. కళాశాలలో పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు నిర్వహణ, ఇంజనీరింగ్ మరమ్మతులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. కాలం చెల్లిన భవనాల స్థానంలో భవనాల పునర్మానం, ఆడిటోరియం మరమ్మతులు, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా నూతన టెక్నాలజీతో కళాశాల ప్రవేశంలో మరింత ఆకర్షణీయంగా ఉండేలా మార్పులు చేర్పులు చేపట్టాలన్నారు.  కళాశాలకు సంబంధించిన పలు అంశాలను ప్రిన్సిపాల్   డా. వఝల రవి టిటిడి ఛైర్మెన్, ఈవోల దృష్టికి తీసుకువచ్చారు. త్వరలో ఢిల్లీలో నిర్వహించనున్న గవర్నింగ్ బాడీ సమావేశం నాటికి కళాశాల అభివృద్ధి పనులపై పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని అధికారులను ఛైర్మెన్ కోరారు. ఈ సమావేశంలో టిటిడి బోర్డు సభ్యులు డా. పనబాక లక్ష్మీ, ఎస్. నరేష్ కుమార్, ఎండోమెంట్ కమీషనర్ కె. రామచంద్ర మోహన్, ఎప్.ఏ అండ్ సీఏవో ఓ. బాలాజీ, సీఈ  టివి సత్యనారాయణ, టిటిడి డీఈవో  వెంకట సునీల్, పలువురు గవర్నింగ్ బాడీ ప్రతినిధులు, టిటిడి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

]]>
Mon, 16 Jun 2025 20:44:38 +0530 admin
రోజాకు వార్నింగ్ బెల్స్? https://prajakshethrenews.com/రోజాకు-వార్నింగ్-బెల్స్ https://prajakshethrenews.com/రోజాకు-వార్నింగ్-బెల్స్ రోజాకు వార్నింగ్ బెల్స్?
ఇక షోకు ప్యాక ప్
ప్రజా క్షేత్ర్, తిరుపతి : 
మాజీ మంత్రి ఆర్కే రోజా మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. నగరిలోనే కాకుండా ఆమె కూటమి ప్రభుత్వంపై పెద్దయెత్తున విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆర్కే రోజాపై ఇప్పటికే నమోదయిన కేసులను పోలీసులు వేగంగా పరిశీలిస్తున్నారని సమాచారం. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలో రెండు సార్లు విజయం సాధించారు. మూడోసారి మాత్రం 2024 ఎన్నికల్లో గాలి భాను ప్రకాష్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత కొద్ది రోజులు రోజా మౌనంగానే ఉన్నారు. ఈ మధ్య కొన్ని బుల్లి తెర షోలలో కూడా ఆర్కే రోజా పాల్గొంటున్నారు. ఇదే సమయంలో వైసీపీకి వాయిస్ గా మారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆర్కే రోజా టీడీపీ హిట్ లిస్ట్ లో చేరిపోయారంటున్నారు.రోజా చేస్తున్న వ్యాఖ్యల పట్ల కూటమి సర్కార్ సీరియస్ గానే ఉందని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆర్కే రోజాపై నమోదయిన కేసులను పరిశీలించాలని పోలీసులకు ఆదేశాలు పాలకుల నుంచి వెళ్లినట్లు తెలిసింది. మహిళ అయినంత మాత్రాన అవినీతి చేస్తే ఊరుకోవద్దని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు వెళ్లడంతో ప్రస్తుతం ఆర్కే రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు తెలిసింది. అందిన సమాచారం మేరకు ఆమెపై నమోదయిన కేసులను పరిశీలించి నోటీసులు ఇచ్చి విచారణకు కూడా పిలిచేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆర్కే రోజా వైసీపీ అధికారంలో ఉన్నప్పడు తొలి రెండున్నరేళ్లు ఏపీఐఐసీ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేసి తర్వాత టూరిజం, క్రీడల శాఖ మంత్రిగా పదవి బాద్యతలను చేపట్టారు. కార్పొరేషన్ ఛైర్మన్ గా ఆమె తీసుకున్న నిర్ణయాలు వివాదాలుగా ఉన్నాయని చెబుతున్నారు. అదే సమయంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరిట వైసీపీ ప్రభుత్వ హయంలో రాష్ట్రమంతటా క్రీడా సంబరాలను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆడుదాం ఆంధ్రపేరిట వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని టీడీపీ నేతుల సీఐడీ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారుకూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే పాత్యా సంఘం, కబడ్డీ అసోసియేషన్ లు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సీఐడీకి ఫిర్యాదు చేశాయి. వంద కోట్ల రూపాయల స్కాం జరిగిందని వారు ఆరోపించారు. ఆర్కే రోజా పై కేవలం ఇదే కాకుండా తిరుమలలో దర్శనం టిక్కెట్ల విషయంపై కూడా ఫిర్యాదులు చేసే అవకాశాలున్నాయి. ఆడుదాం ఆంధ్ర కేసులో బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి పేరు కూడా వినపడింది. పెద్దయెత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో సీఐడీ అధికారులు ఫైలు దుమ్ము దులుపుతున్నారని తెలిసింది. రెచ్చిపోతున్న రోజాను అడ్డుకట్ట వేయడానికి కేసు నమోదు చేసి విచారించడం మినహా మరొక మార్గం లేదని భావించి ఆ దిశగా చర్యలకు దిగుతున్నట్లు తెలిసింది. మరి ఆర్కే రోజా కేసులను తట్టుకుని ఎలా బయటపడతారన్నది చూడాల్సిందే.

]]>
Mon, 16 Jun 2025 13:31:24 +0530 admin
మహిళలు, చిన్నారుల సంరక్షణ కొరకు "శక్తి"వంతమైన యాప్..... https://prajakshethrenews.com/మహిళలు-చిన్నారుల-సంరక్షణ-కొరకు-శక్తివంతమైన-యాప్ https://prajakshethrenews.com/మహిళలు-చిన్నారుల-సంరక్షణ-కొరకు-శక్తివంతమైన-యాప్ మహిళలు, చిన్నారుల సంరక్షణ కొరకు "శక్తి"వంతమైన యాప్.....
శక్తి యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోండి... ఆపదనుండి రక్షణ పొందండి.....
ఎస్పీ  అధిరాజ్ సింగ్ రాణా
ప్రజా క్షేత్ర్, నంద్యాల :
జిల్లాలో మహిళలు మరియు చిన్నారుల సంరక్షణార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన శక్తి యాప్ సేవలను నంద్యాల జిల్లాలోని మహిళలు, చిన్నారులకు అందించుటకు ఎస్సై/ఏ ఎస్సై  స్థాయి అధికారితో ఒక్కో బృందంలో 06 మంది పోలీసు సిబ్బంది, అధికారులు ఉండేట్లు 06 శక్తి పోలీస్ బృందాలను జిల్లలో పనిచేయుచున్నాయి. అందులో భాగంగా ఆళ్లగడ్డ, ఆత్మకూరు,డోన్ ,పోలీస్ సబ్ డివిజన్లలో  ఒక్కో బృందం పని చేస్తుందని, నంద్యాల కు సంబంధించి సబ్ డివిజన్ పరిధిలో ఒక్క బృందం, నంద్యాల హెడ్ క్వాటర్ కు సంబంధించి 2 బృందాలు పని చేస్తున్నాయి.

]]>
Sun, 15 Jun 2025 09:42:48 +0530 admin
జగన్ వర్సెస్ లోకేశ్....సోషల్ మీడియా వార్ https://prajakshethrenews.com/జగన్-వర్సెస్-లోకేశ్సోషల్-మీడియా-వార్ https://prajakshethrenews.com/జగన్-వర్సెస్-లోకేశ్సోషల్-మీడియా-వార్ జగన్ వర్సెస్ లోకేశ్
సోషల్ మీడియా వార్
ప్రజా క్షేత్ర్, విజయవాడ, జూన్ 13 :
సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేయడం పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణకు సంబంధించిన వీడియోలను ఆయన పోస్ట్ చేశారు. గతంలో చంద్రబాబు, బాలకృష్ణ చేసిన కామెంట్లు ఇందులో ఉన్నాయి. అలాగే, నారా లోకేశ్ పలువురు అమ్మాయిలతో దిగిన ఫొటోలను కూడా వీడియో రూపంలో జగన్ పోస్ట్ చేశారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో పారదదర్శకంగా పాలన కొనసాగిందని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మోసపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని అన్యాయంగా కేసులో ఇరికించి, అరెస్టు చేశారని తెలిపారు. కూటమి పాలనలో 188 లైంగిక దాడులు జరిగాయని అన్నారు.జగన్ ట్వీట్‌పై నారా లోకేశ్ దీటుగా స్పందించారు. జగన్ సహా వైసీపీ నేతలు చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియోలను ఆయన పోస్ట్ చేశారు. మహిళలంటే ఎందుకింత ద్వేషమని ప్రశ్నించారు. తనకు కాలేజీ లైఫ్ ఉందని, జగన్‌కు జైలు జీవితం ఉందని తెలిపారు. తనకు క్లాస్‌మేట్స్ ఉన్నారని, జగన్‌కు జైల్‌మేట్స్ ఉన్నారని అన్నారు.మహిళలను గౌరవించడాన్ని తాను చిన్నప్పటినుంచు నేర్చుకున్నానని, జగన్ మాత్రం కన్న తల్లితో పాటు సొంత చెల్లిని ఇంటి నుంచి గెంటేశారని, న్యాయస్థానానికి లాగారని అన్నారు. వారిపై మీడియాతో పాటు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో జగన్ ఐదేళ్ల పాలన ఒక చీకటి అధ్యాయమని విమర్శించారు.

]]>
Fri, 13 Jun 2025 16:58:20 +0530 admin
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్న నారా లోకేష్ https://prajakshethrenews.com/విద్యా-వ్యవస్థలో-సమూల-మార్పులు-తెస్తున్న-నారా-లోకేష్ https://prajakshethrenews.com/విద్యా-వ్యవస్థలో-సమూల-మార్పులు-తెస్తున్న-నారా-లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్న లోకేష్
 
- ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం సిఫార్సు లేఖలిచ్చే పరిస్థితి రావాలన్నది ధ్యేయం

- పాలకుల బొమ్మలు లేకుండా నాణ్యమైన కిట్లు
 
- నగరంలో మూడు స్కూల్స్ హైస్కూల్స్ గా అప్ గ్రేడ్ చేసాం
 
- సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

ప్రజా క్షేత్ర్, రా59విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్న లోకేష్జ

 

- ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం సిఫార్సు లేఖలిచ్చే పరిస్థితి రావాలన్నది ధ్యేయం

 

- పాలకుల బొమ్మలు లేకుండా నాణ్యమైన కిట్లు

 

- నగరంలో మూడు స్కూల్స్ హైస్కూల్స్ గా అప్ గ్రేడ్ చేసాం

 

- సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

ప్రజా క్షేత్ర్, రాజమహేంద్రవరం :

ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే విధంగా విద్యావవ్యస్థలో సమూల మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు (వాసు) చెప్పారు. సిటిలో అప్ గ్రేడ్ అయిన అన్నపూర్ణమ్మపేట సీనియర్ నేషనల్ బేసిక్ స్కూల్, వి ఎల్ పురం శ్యామలాంబ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్, మోరంపూడి స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ ను శుక్రవారం ఆయన పంపిణీ చేసారు. ఆయా పాఠశాలల్లో అప్ గ్రేడ్ చేసిన తరగతి గదులను ప్రారంభించి ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రయివేటు పాఠశాలల్లో సీట్లకు సిఫార్సు లేఖల కోసం తల్లిదండ్రులు వస్తూ ఉంటారని గుర్తుచేసారు. అయితే వచ్చే రెండు మూడేళ్ళలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సీటు కోసం సిఫార్సు చేయమని తమ దగ్గరకు లేఖల కోసం వచ్చేలా విద్యావ్యవస్థలో మార్పులు రాబోతున్నాయని అన్నారు. ఆ దిశగా మంత్రి లోకేష్ మార్పులు తెస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఇచ్చిన విద్యాకిట్లకు ఇప్పటికీ ఎంతో తేడా ఉందని ఎమ్మెల్యే వాసు చెబుతూ, గతంలో జగనన్న బొమ్మలు ఉండేవని, ఇప్పుడు పాలకుల బొమ్మలు కాకుండా రాష్ట్రపతిగా చేసిన ఉపాధ్యాయుడైన డా సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతొ ఆయన బొమ్మ వేసి కిట్లు ఇప్పుడు ఇస్తున్నామని అన్నారు. గతంలో యూనిఫారంలు, బ్యాగులు ఏమాత్రం నాణ్యత లేకుండా ఉండేవని, ఇప్పుడు అత్యంత నాణ్యత గల బ్యాగులు, యూనిఫారంలు ఇస్తున్నామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. ఇక ఇప్పటివరకు పాఠశాల స్థాయిలోనే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే, విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం ఉంటేనే బాగా చదువుతారని భావించి జూనియర్ కాలేజీల్లో కూడా మధ్యాహ్నం భోజన పథకం మంత్రి లోకేష్ ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు. గతంలో జగనన్న గోరుముద్ద వంటి పేర్లతో పథకాలు పెడితే, కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరుతొ మధ్యాహ్నం భోజన పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందని ఎమ్మెల్యే వాసు హర్షద్వానాల మధ్య చెప్పారు. డొక్కా సీతమ్మ ఓపిక ఉన్నంతకాలం ఎవరు ఆకలితో వచ్చిన లేదనకుండా కాదనకుండా కడుపునిండా భోజనం పెట్టి పంపించిన డొక్కా సీతమ్మ దాతృత్వాన్ని గుర్తించి ఆనాటి బ్రిటిషు ప్రభుత్వం ప్రశంసించిందని అటువంటి మహనీయురాలి గురించి విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశ్యంతో ఈ పేరు పెట్టినట్లు ఆయన చెబుతూ ఇదీ కూటమి ప్రభుత్వ విశాలమైన ఆలోచనకు నిదర్శనమన్నారు. అలాగే సిటిలోని సీనియర్ నేషనల్ బేసిక్ స్కూల్, శ్యామలాంబ స్కూల్, మోరం పూడి స్కూల్స్ లో 8వ తరగతి వరకు మాత్రమే ఉండగా, తల్లిదండ్రుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని హైస్కూల్స్ గా మార్చాలని ప్రతిపాదన పంపిన వెంటనే ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. ఇక ఇన్నాళ్లూ భయపడుతూ వస్తున్న బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ల పని కూడా పడుతున్నామని హెచ్చరించారు.

]]>
Fri, 13 Jun 2025 16:47:47 +0530 admin
ఎయిమ్స్‌లో మరిన్ని వైద్య సేవలు అందించాలి https://prajakshethrenews.com/ఎయిమ్స్లో-మరిన్ని-వైద్య-సేవలు-అందించాలి https://prajakshethrenews.com/ఎయిమ్స్లో-మరిన్ని-వైద్య-సేవలు-అందించాలి ఎయిమ్స్‌లో మరిన్ని వైద్య సేవలు అందించాలి
ప్రజా క్షేత్ర్, మంగళగిరి :
మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరిన్ని వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, మంగళగిరి ఎయిమ్స్ పాలక మండలి సభ్యులు వల్లభనేని బాలశౌరి కోరారు. ఢిల్లీలో  కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీ పుణ్య శ్రీవాత్సవ, జాయింట్ సెక్రటరీ అంకితా మిశ్రా బుందేలా తో   ఆయన  సమావేశమయ్యారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి అభివృద్ధిపై చర్చించారు.  మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో 25 లక్షల మంది రోగులకు వైద్య సేవలు అందించడం గర్వకారణమని, భవిష్యత్తులో మరింత మంది రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించి రాష్ట్రంలోనే నెంబర్ ఒన్ ఆసుపత్రిగా పేరుగాంచేలా చర్యలు తీసుకోవాలని  కోరారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్నందున ఎటువంటి రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అవసరమైన వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రతి రోజూ తరలివచ్చే రోగుల  సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు క్యాన్సర్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ 19 సమయంలో తాత్కాలిక క్రిటికల్ కేర్ బ్లాక్ ను ఏర్పాటు చేసి, రోగులకు వైద్య సేవలు అందించాలని, అదేవిధంగా శాశ్వతంగా ఒక క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేయాలన్నారు.  రోగులు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు ఎయిమ్స్ లో మాత్రమే పొందగలుగుతారని, ప్రతి ఒక్కరూ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుని ప్రజా మన్ననలను పొందేలా తమ వంతు కృషి చేయాలని ఎంపీ బాలశౌరి కోరారు.

]]>
Fri, 13 Jun 2025 15:54:07 +0530 admin
విమాన ప్రమాదంపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి https://prajakshethrenews.com/విమాన-ప్రమాదంపై-మాజీ-సీఎం-వైఎస్-జగన్-తీవ్ర-దిగ్భ్రాంతి https://prajakshethrenews.com/విమాన-ప్రమాదంపై-మాజీ-సీఎం-వైఎస్-జగన్-తీవ్ర-దిగ్భ్రాంతి విమాన ప్రమాదంపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వైసీపీ
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్ : 
అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఎయిరిండియా ఏఐ-171 విమానం కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు.

]]>
Thu, 12 Jun 2025 21:05:57 +0530 admin
ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత https://prajakshethrenews.com/ఏరువాక-కార్యక్రమంలో-పాల్గొన్న-హోం-మంత్రి-వంగలపూడి-అనిత https://prajakshethrenews.com/ఏరువాక-కార్యక్రమంలో-పాల్గొన్న-హోం-మంత్రి-వంగలపూడి-అనిత ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత
రైతులకు విత్తనాల పంపిణీ, డ్రోన్ ప్రారంభం..
రైతులకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
సాంకేతికత జోడిస్తే వ్యవసాయ పనులు సులభం
- హోం మంత్రి అనిత

ప్రజా క్షేత్ర్, యస్ రాయవరం,జూన్ 11:

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో  హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు.యస్ రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, భూమి పూజ చేసి సంప్రదాయంగా కాడెడ్లతో నాగలి పట్టి పొలం దున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత రైతులకు రాయితీపై విత్తనాలను పంపిణీ చేశారు. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ 80 శాతం రాయితీపై డ్రోన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, రైతులకు ఆధునిక సాంకేతికత ఆధారంగా పరికరాలు అందించడమే లక్ష్యమన్నారు. డ్రోన్ల సాయంతో ప్రస్తుతం రైతులు వ్యవసాయ పనులను సులభతరం చేసుకుంటున్నారని చెప్పారు.
రైతుల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. రైతు దేశానికి వెన్నెముకలాంటివారని అభిప్రాయపడ్డారు. పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

]]>
Wed, 11 Jun 2025 23:03:25 +0530 admin
మోడీ 11సంవత్సరాల పాలన స్వర్ణయుగమే https://prajakshethrenews.com/మోడీ-11సంవత్సరాల-పాలన-స్వర్ణయుగమే https://prajakshethrenews.com/మోడీ-11సంవత్సరాల-పాలన-స్వర్ణయుగమే మోడీ 11సంవత్సరాల పాలన స్వర్ణయుగమే
కేంద్రమంత్రి బండి సంజయ్
ప్రజా క్షేత్ర్, తిరుపతి :
అభివృద్ధి, సంక్షేమం, దేశభక్తి, నూతన ఆవిష్కరణలు నరేంద్ర మోడీ పాలనలో కనిపిస్తున్నాయి. మోడీ పాలనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మోడీ 11సంవత్సరాల పాలన స్వర్ణయుగమేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
బుధవారం అయన తిరుపతిలో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ 11సంవత్సరాల పాలనపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించారు. బండి సంజయ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. త్వరలోనే అగ్రస్థానంలో నిలబెడతామని అన్నారు. కేంద్రప్రభుత్వ పథకాలతో కోట్లాది మంది నిరుపేదలు లబ్ధి పొందుతున్నారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పిఎం ఆవాస్ యోజన, జన్ ధన్ అకౌంట్స్, ఆయుష్మాన్ భారత్, స్వనిధి, ముద్రయోజన, స్టార్టప్ ఇండియా వంటి పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన నిధులను కేటాయిస్తున్నాం. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోమని అన్నారు.

]]>
Wed, 11 Jun 2025 22:50:55 +0530 admin
తిరుమలకు భారీగా పెరిగిన రద్దీ https://prajakshethrenews.com/తిరుమలకు-భారీగా-పెరిగిన-రద్దీ https://prajakshethrenews.com/తిరుమలకు-భారీగా-పెరిగిన-రద్దీ తిరుమలకు భారీగా పెరిగిన రద్దీ
ప్రజా క్షేత్ర్, తిరుమల, జూన్ 10 :
వేసవి సెలవులు ముగిసి మరో నాలుగురోజుల్లో పాఠశాలలు ప్రారంభంకానుండటంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమల కొండపై ఎటుచూసిన భక్త జన సందోహమే కన్పిస్తోంది. సెలవుదినాలు కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో ఉన్న 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతోందని టీటీడీ అధికారులు వివరించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు దర్శనానికి 6 గంటలు పడుతోంది. కల్యాణకట్టలు, లడ్డూ కేంద్రం, అఖిలాండం, అన్నప్రసాద భవనాలూ రద్దీగా మారాయి. గదులకు డిమాండ్‌ మరింత పెరిగిపోయింది. గదులు పొందేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరాల్సి వచ్చింది. సీఆర్వో ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. అలాగే అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయిస్లాటెడ్‌ సర్వదర్శన టోకెన్లు జారీ చేసే భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణు నివాసం కూడా రద్దీగా మారాయి. నిన్న స్వామివారిని 88వేల2వందల57 మంది భక్తులు దర్శించుకోగా 45వేల068 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల రూపేణ శ్రీవారి హుండీకి రూ.3.68 కోట్లు వచ్చాయని తెలిపారు. ఈనెల 9 నుంచి 11వతేదీవరకు తిరుమలలో శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్ఠాభిషేకం జరుగనుంది. ఏటా జ్యేష్ఠమాసంలో మూడురోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహించనున్నారు. మొదటి రోజున శ్రీ మలయప్ప స్వామివారి బంగారు కవచాన్ని తొలగించి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నానం, తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండో రోజు ముత్యాల కవచంతో స్వామిని అలంకరిస్తారు. మూడోరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి తిరిగి బంగారు కవచాన్ని సమర్పిస్తారు. జ్యేష్ఠాభిషేకం సందర్భంగా తిరుమలకు భక్తుల రాక మరింత పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది.

]]>
Tue, 10 Jun 2025 09:27:32 +0530 admin
భూమా అఖిలప్రియకు అస్వస్థత https://prajakshethrenews.com/భూమా-అఖిలప్రియకు-అస్వస్థత https://prajakshethrenews.com/భూమా-అఖిలప్రియకు-అస్వస్థత భూమా అఖిలప్రియకు అస్వస్థత
ప్రజా క్షేత్ర్, అళ్లగడ్డ :
దొర్నిపాడు మండలం గోవిందిన్నెలో ఓ జాతరకు వెళ్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అఖిలప్రియ స్పృహతప్పి పడిపోయారు. ఉపవాస దీక్షలో ఉండడంతోనే స్పృహతప్పి పడిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

]]>
Mon, 09 Jun 2025 18:36:04 +0530 admin
ఆర్మీ జవాను భూ సమస్యను పరిష్కరించిన మంత్రి నారా లోకేష్ https://prajakshethrenews.com/ఆర్మీ-జవాను-భూ-సమస్యను-పరిష్కరించిన-మంత్రి-నారా-లోకేష్ https://prajakshethrenews.com/ఆర్మీ-జవాను-భూ-సమస్యను-పరిష్కరించిన-మంత్రి-నారా-లోకేష్ ఆర్మీ జవాను భూ సమస్యను పరిష్కరించిన మంత్రి నారా లోకేష్

మంత్రి లోకేష్ న్యాయం చేయాలంటూ కశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో

తక్షణమే స్పందించి జవాన్ కు అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్

మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన జవాన్ కుటుంబ సభ్యులు

ప్రజా క్షేత్ర్, అమరావతిః
 దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే ఆర్మీ జవాన్ కు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం కె.శివరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని కబ్జా చేశారంటూ రాష్ట్రానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ డి.నరసింహమూర్తి జమ్మూకశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనం రేపింది. అమరాపురం మండలం ఉదుకూరుకు చెందిన నరసింహమూర్తి దేశ సరిహద్దుల్లో జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన నాగరాజు అనే వ్యక్తి తమ భూమిని కబ్జా చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి నారా లోకేష్ ను జవాన్ విజ్ఞప్తి చేశారు. సదరు వీడియోపై తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేష్ భూ సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సర్వే జరిపి పోలీసుల సమక్షంలో హద్దులు నిర్ణయించడంతో సదరు భూ సమస్య పరిష్కారమైంది. మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని తమకు అండగా నిలవడం పట్ల జవాన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

]]>
Wed, 04 Jun 2025 20:26:31 +0530 admin
తనను జైల్లో పెట్టారని.. జగన్‌‌ను కూడా జైలులో పెడతామంటే ఎలా! : ఎపి సీఎం చంద్రబాబు నాయుడు https://prajakshethrenews.com/తనను-జైల్లో-పెట్టారని-జగన్ను-కూడా-జైలులో-పెడతామంటే-ఎలా-ఎపి-సీఎం-చంద్రబాబు-నాయుడు https://prajakshethrenews.com/తనను-జైల్లో-పెట్టారని-జగన్ను-కూడా-జైలులో-పెడతామంటే-ఎలా-ఎపి-సీఎం-చంద్రబాబు-నాయుడు తనను జైల్లో పెట్టారని.. జగన్‌‌ను కూడా జైలులో పెడతామంటే ఎలా!

* ఇది వరకు నేరస్థులు ప్రభుత్వానికి బయపడి వెళ్ళిపోయేవారని..

* ఇప్పుడు మనం నేరస్థులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి
* మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి’
* ఏపీ కేబినెట్‌ సమావేశంలో   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు   కీలక వ్యాఖ్యలు
ప్రజా క్షేత్ర్, అమరావతి, జూన్ 4 :
ఏపీ కేబినెట్‌ సమావేశంలో   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు   కీలక వ్యాఖ్యలు చేశారు. తనను జైల్లో పెట్టారని.. జగన్‌‌ను కూడా జైలులో పెడతామంటే ఎలా కుదురుతుంది.. అది కరెక్ట్ కాదు కదా’ అని మంత్రులతో సీఎం అన్నారు. బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. ‘జగన్ తప్పు చేశాడు కదా? మనం ఎందుకు చర్యలు తీసుకోకూడదు’ అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి   ప్రశ్నించగా.. ‘అతను తప్పులు చేసినట్లు రుజువులు ఉంటే చట్టానికి దొరికితే మనం చర్యలు తీసుకోవాలి. మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి’ ముఖ్యమంత్రి సూచించారు.ఇది వరకు నేరస్థులు ప్రభుత్వానికి బయపడి వెళ్ళిపోయేవారని.. ఇప్పుడు మనం నేరస్థులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నేరం చేసి మళ్ళీ ప్రభుత్వంపైనే నిందలు వేసే పరిస్థితి నేడు నెలకొందని తెలిపారు. గంజాయ్ బ్యాచ్ నేరాలు చేసిందని.. తప్పులు చేసి.. తిరిగి ప్రభుత్వంపైనే నెడుతున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది మంత్రులు బాగా పనిచేశారని.. ఇంకా కష్టపడాలని.. ఈ ఏడాది ఏం చేశారనేది ఒకసారి సమీక్ష చేసుకోవాలని సూచించారు. రాబోయే ఏడాదికి ప్లాన్ చేసుకోవాలన్నారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్ట్‌లకు కేంద్రం సాయం చేస్తుందన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తోందని.. ఆలస్యం అయితే ప్రతీ ఏడాది వ్యయం పెరుగుతుందని అన్నారు. నిధుల సమీకరణ కూడా జరుగుతోందన్నారు. పోలవరం, బనకచర్లకు కేంద్రం, రాష్ట్రం, ఏషియన్ డెవలప్‌మెంట్‌ బ్యాంకు, హైబ్రిడ్ అన్యూటీ మోడల్లో కూడా నిధులు వస్తాయని అన్నారు. క్వాంటం వ్యాలీని చేయాలని.. 2026 జనవరికి కార్యరూపం తీసుకురావాలని వెల్లడించారు. క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చూపించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.ఈ నెల 15న తిరుపతిలో సినిమా సెలబ్రిటీలతో యోగా నిర్వహించాలని తెలిపారు. టూరిజం మంత్రి వెళ్లి సెలబ్రెటీలను ఆహ్వానించాలని.. తాను కూడా కొంత మందికి ఫోన్లు చేసి చెబుతానని సీఎం అన్నారు. 1983లో మహానాడుకు షర్ట్‌‌లు పసుపునీళ్లలో ముంచుకుని అటెండ్ అయ్యారని.. అప్పటి నుంచి మహానాడు నిర్వహిస్తున్నారన్నారు. వాతావరణం బాగా సహకరించిందని.. ఇది వరకు సమ్మర్‌లో అల్లాడిపోయామన్నారు. కానీ ఇప్పుడు వాతావరణం మంచిగా సహకరించిందని అన్నారు. ఈ సారి మహానాడు బాగా జరిగింది... కార్యకర్తలు కూడా బాగా వచ్చారని కేబినెట్ సమావేశంలో తెలిపారు.

]]>
Wed, 04 Jun 2025 20:00:31 +0530 admin
జగన్ రెడ్డీ... ఖబడ్డార్ * : మంత్రి సవిత హెచ్చరిక https://prajakshethrenews.com/జగన్-రెడ్డీ-ఖబడ్డార్-మంత్రి-సవిత-హెచ్చరిక https://prajakshethrenews.com/జగన్-రెడ్డీ-ఖబడ్డార్-మంత్రి-సవిత-హెచ్చరిక జగన్ రెడ్డీ... ఖబడ్డార్
* మంత్రి సవిత హెచ్చరిక
*సీఎం చంద్రబాబుపై నోరుజారితే తగిన గుణ పాఠం చెబుతామని హెచ్చరిక 

*నైతికంగా పతనమైన నాయకుడు జగన్

*రౌటీ షీటర్లకు పరామర్శతో అరాచకాలకు ప్రోత్సాహమిచ్చినట్లే.
 5 ఏళ్ల అసమర్థ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం

*దళితులను ఏనాడూ పట్టించుకోలేదు...

*ఉనికి కోసమే కుల, శవ రాజకీయాలు
* జగన్ పై మంత్రి సవిత విసుర్లు
*కూటమి ప్రభుత్వం అన్ని హామీలూ నెరవేస్తోంది...
* పథకాల అమలుపై చర్చకు సిద్ధమా :
మంత్రి సవిత సవాల్
ప్రజా క్షేత్ర్, అమరావతి :
 నీతి, నిజాయితీకి నిలువెత్తురూపమైన సీఎం చంద్రబాబునాయుడు గురించి నోటికొచ్చిన మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతాం... ఖబడ్డార్ జగర్ రెడ్డి అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి సవిత హెచ్చరించారు. రౌడీ షీటర్లకు, గంజాయి గ్యాంగ్ కు పరామర్శ చేసి నైతికంగా పతనమైన రాజకీయ నాయకుడివని మండిపడ్డారు.  అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు జగన్ రెడ్డి రాజ్యాంగం, చట్టం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు సైతం జగన్ రెడ్డి మాటలను విని నవ్వుకుంటున్నారన్నారు. అయిదేళ్ల పాలనలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ అన్ని వర్గాలనూ జగన్ మోసం చేశారన్నారు. దళితులను అన్ని విధాలా అన్యాయం చేశారన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారన్నారు. 2014-19లో అమలు చేసిన 27 పథకాలను, దళిత యువతకు స్వయం ఉపాధి పథకాలను నిలిపేశారని మండిపడ్డారు. జగన్ పాలనలో గతంలో ఎన్నడూ లేనంతగా దళితులపై దాడులు జరిగాయన్నారు. దళిత మహిళలపై అఘాయిత్యాలు సైతం చోటుచేసుకున్నాయన్నారు. ఇన్ని జరిగినా ఏనాడూ దళితులను పరామర్శించిన పాపాన జగన్ పోలేదన్నారు. మాస్క్ అడిగిన పాపానికి దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ ను మానసికంగా హింసించి చంపారన్నారు. దళిత డ్రైవర్ ను డోర్ డెలవరీ చేసిన ఘనత కూడా వైసీపీ నాయకుడిదేనన్నారు. జగన్ కు కుల, శవ రాజకీయాలు చేయడం అలవాటైపోయిందని, అందుకే ఆయనను ప్రజలు పక్కనబెట్టారని అన్నారు. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. జగన్ పరామర్శించిన వారి దాడిలో గాయపడిన కానిస్టేబుల్ కూడా దళితుడేనన్నారు. ఆయననెందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. అయిదేళ్లలో ఎంతమంది దళితులను జగన్ రెడ్డి పరామర్శించాడో చర్చించడానికి సిద్ధమా..? అని మంత్రి సవిత సవాల్ విసిరారు.

]]>
Tue, 03 Jun 2025 19:25:07 +0530 admin
రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డుల జారీకై ప్రతిపాదనలు https://prajakshethrenews.com/రేషన్-కార్డుతో-సంబంధం-లేకుండా-ఆరోగ్యశ్రీ-కార్డుల-జారీకై-ప్రతిపాదనలు https://prajakshethrenews.com/రేషన్-కార్డుతో-సంబంధం-లేకుండా-ఆరోగ్యశ్రీ-కార్డుల-జారీకై-ప్రతిపాదనలు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా  ఆరోగ్యశ్రీ కార్డుల జారీకై ప్రతిపాదనలు

రేషన్ కార్డు ప్రాతిపదికన హెల్త్ కార్డు జారీ విదానాన్ని డిలింక్ చేస్తే రేషన్ బియ్యం సగ్లింగ్ ను అరికట్టవచ్చు

 రాష్ట్ర  శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్ & శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణరాజు

ప్రజా క్షేత్ర్, అమరావతి, జూన్ 3:  
తెల్ల  రేషన్ కార్డుతో సంబందం లేకుండా   ఎన్.టి.ఆర్.ఆరోగ్యశ్రీ కార్డులను జారీచేస్తే  రేషన్ బియ్యం స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో అరికట్టే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అభిప్రాయ పడుతున్నట్లు ఆ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె. రఘు రామకృష్ణ రాజు తెలిపారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ కమిటీ త్వరలోనే ప్రతిపాదలను పంపనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం రాష్ట్ర శాసన సభలో ప్రాంగణంలోని తమ ఛాంబరులో కమిటీ సభ్యులు  అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మరియు విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణు కుమార్ రాజుతో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడిచేశారు.  రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మినహా తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఏడాదికి రూ.25 లక్షల వరకూ  ఆరోగ్య భీమాని ప్రభుత్వం కల్పిస్తున్న నేపథ్యంలో ఎన్.టి.ఆర్.ఆరోగ్యశ్రీ కార్డులను పొందేందుకు ప్రజలకు పెద్ద ఎత్తున మక్కువ చూపుతున్నారన్నారు. ఇందుకై వారికి  తెల్ల రేషన్ కార్డు అవసరం లేకపోయినా పొందుతున్నారున్నారు.   ప్రతి ప్రభుత్వ పథకాని  తెల్ల రేషన్ కార్డే ప్రాతిపదికగా  తీసుకోవడం వల్ల తెల్ల  రేషన్ కార్డు అవసరం లేనివారు కూడా ఈ కార్డును తీసుకోవడం వల్ల  రేషన్ బియ్యం దుర్వినియోగం అవ్వడమే  కాకుండా భారీ ఎత్తున రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు దారితీస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఒప్పుకుంటూ  హెల్త్ కార్డు జారీ విషయంలో  తెల్ల రేషన్ కార్డును  డిలింక్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్ అభిప్రాయాన్ని వారు కూడా వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.70 కోట్ల ప్యామిలీలు ఉన్నాయని, వాటిలో దాదాపు 1.48 కోట్ల కుటుంబాలకు   తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎటు వంటి సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీకై  దాదాపు రూ.5,100 కోట్లను వెచ్చిస్తున్నదని, దీనిలో దాదాపు రూ.2 వేల కోట్ల వరకూ ఆదాచేసే అవకాశం ఉంటుందన్నారు.  ఆ డబ్బులను విద్య, వైద్యంపై ఖర్చుపెట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్క ఎన్.టి.ఆర్.ఆరోగ్యశ్రీ కార్డులకే కాకుండా ఎన్.టి.ఆర్.భరోసా ఫించన్లు మరియు ఇతర ప్రభుత్వ పథకాల మంజూరీ విషయంలో రేషన్ కార్డులను  డిలింక్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశాన్ని నెలకు రెండు సార్లు నిర్వహిస్తామని,  శాంతి భద్రతల సమస్యలతో పాటు ప్రజలకు, సమాజానికి హితవు చేసే సామూహిక సమస్యలను పరిష్కరించే అంశంపై ఈ కమిటీ ప్రత్యేక శ్రద్ద చూపుతుందని ఆయన తెలిపారు. ఆయా సమస్యలకు సంబందించి విజ్ఞాపనలను స్థానిక శాసన సభ్యుల ద్వారా  ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అందజేస్తే వాటి పరిష్కానికి  తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అంతకు ముందుకు  శాసన సభా ప్రాంగణంలో చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె. రఘు రామకృష్ణ రాజు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశంలో శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ, పి విష్ణు కుమార్ రాజు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో పాటు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంభ సంక్షేమ శాఖ స్పెషల్ సి.ఎస్. ఎం.టి.కృష్ణబాబు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబౌ గౌర్ మరియు శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, డిప్యుటీ సెక్రటరీ కె.రాజకుమార్, అసిస్టెంట్ సెక్రటరీ ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

]]>
Tue, 03 Jun 2025 17:14:24 +0530 admin
సీఎం చంద్రబాబును కలిసిన నటుడు నాగార్జున https://prajakshethrenews.com/సీఎం-చంద్రబాబును-కలిసిన-నటుడు-నాగార్జున https://prajakshethrenews.com/సీఎం-చంద్రబాబును-కలిసిన-నటుడు-నాగార్జున సీఎం చంద్రబాబును కలిసిన నటుడు నాగార్జున
ప్రజా క్షేత్ర్, అమరావతి :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సినీ హీరో అక్కినేని నాగార్జున ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కలిశారు.  తన చిన్నకొడుకు అఖిల్ వివాహ ఆహ్వానపత్రికను సీఎం చంద్రబాబుకు నాగార్జున అందించారు.

]]>
Tue, 03 Jun 2025 15:21:04 +0530 admin
చంద్రబాబును కలిసిన మంద కృష్ణ మాదిగ https://prajakshethrenews.com/చంద్రబాబును-కలిసిన-మంద-కృష్ణ-మాదిగ https://prajakshethrenews.com/చంద్రబాబును-కలిసిన-మంద-కృష్ణ-మాదిగ చంద్రబాబును కలిసిన మంద కృష్ణ మాదిగ
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ : 
ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడును ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ  ఢిల్లీలో కలిశారు. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అవార్డును అందుకున్న మందకృష్ణ శుక్రవారం సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా మందకృష్ణను సీఎం అభినందించారు. వర్గీకరణ ఉద్యమ ప్రస్థానాన్ని గురించి ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు.

]]>
Fri, 30 May 2025 18:45:09 +0530 admin
తిరుమలలో భ‌ద్ర‌త‌పై రాష్ట్ర డీజీపీ, టీటీడీ ఈఓ ఉన్న‌త‌స్థాయి సమీక్ష సమావేశం https://prajakshethrenews.com/తిరుమలలో-భద్రతపై-రాష్ట్ర-డీజీపీ-టీటీడీ-ఈఓ-ఉన్నతస్థాయి-సమీక్ష-సమావేశం https://prajakshethrenews.com/తిరుమలలో-భద్రతపై-రాష్ట్ర-డీజీపీ-టీటీడీ-ఈఓ-ఉన్నతస్థాయి-సమీక్ష-సమావేశం తిరుమలలో భ‌ద్ర‌త‌పై రాష్ట్ర డీజీపీ, టీటీడీ ఈఓ ఉన్న‌త‌స్థాయి
సమీక్ష సమావేశం

ప్రజా క్షేత్ర్, తిరుమల :

దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో భద్రతను ఏ విధంగా మరింత బలోపేతం చేయాలన్న అంశం పై ఆంధ్రప్రదేశ్ డీజీపీ  హరిష్ కుమార్ గుప్తా, టీటీడీ ఈవో  జె. శ్యామల రావు సమక్షంలో శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉన్నత స్థాయి భద్రత సమావేశం
జరిగింది. ఈ సమావేశం ప్రారంభంలో ముందుగా తిరుపతి ఎస్పీ, టీటీడీ ఇన్ ఛార్జ్‌ సీవీఎస్వో  హర్షవర్ధన్ రాజు భద్రతా అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం అవసరమని తెలిపారు. ఏపీఎస్పీ, డీఏఆర్‌, ఎస్పీఎఫ్‌, హోంగార్డు, సివిల్ పోలీసు, టీటీడీ సెక్యూరిటీతోపాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. వివిధ సెక్యూరిటీ ఏజెన్సీలకు స్థిరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని సూచించారు. అలిపిరి వద్ద బహుళ స్థాయి వాహన తనిఖీ వ్యవస్థ, డిఫెన్స్ ఏజెన్సీలతో కలసి సెన్సార్ ప్లే సిస్టమ్, ఆధునిక భద్రతా పరికరాలు, సైబర్ భద్రత వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా ఆయన చ‌ర్చించారు. అనంతరం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు మాట్లాడుతూ, భద్రతపై అనుబంధ ఏజెన్సీలతో ఒక సమన్వయ వ్యవస్థ అవసరమని అభిప్రాయ పడ్డారు. తిరుమలలో సైబర్ భద్రతా వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాల‌ని పేర్కొన్నారు. విస్తృతస్థాయిలో తిరుమల భద్రతా సమీక్ష నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్  సుధాకర్ రెడ్డి, అడిషనల్ డీజీ ఇంటలిజెన్స్  మహేష్ చంద్ర లద్దా, అనంత‌పురం రేంజ్ డీఐజీ డా.శేముషి, ఐఎస్ డ‌బ్ల్యూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, డీఎఫ్ఓ  వివేక్ ఆనంద్, అలాగే వివిధ భద్రతా బ‌ల‌గాల‌ అధికారులు పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో  సి.హెచ్‌.వెంకయ్య చౌద‌రి, టీటీడీ నిఘా, భద్రత అధికారులు, వివిధ విభాగాల
టీటీడీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

]]>
Fri, 30 May 2025 18:25:21 +0530 admin
కోవర్టులు వారేనా https://prajakshethrenews.com/కోవర్టులు-వారేనా https://prajakshethrenews.com/కోవర్టులు-వారేనా కోవర్టులు వారేనా
ప్రజా క్షేత్ర్, గుంటూరు :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు ప్రత్యర్థులతో చేతులు కలిపి మన మధ్య కోవర్టులుగా ఉంటున్నారని అన్నారు. వాళ్ళ ప్రోత్సాహంతో హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. అందుకే తాను ఇప్పుడు ఎవరినీ నమ్మడం లేదన్నచంద్రబాబు నాయుడు ఇలాంటి తప్పుడు పనులు చేసే ఏ కార్యకర్తను కూడా వదిలిపెట్టనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలే హత్యకు గురవుతుండటం పార్టీ అధినేతకు ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే వైసీపీ హయాంలో కంటే తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే టీడీపీ కార్యకర్తలు వరసగా హత్యకు గురి కావడం పట్ల చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్లు కనపడుతుంది. ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి హత్య కేసులోనూ టీడీపీకి చెందిన వారే ఉన్నారని తేలింది. దీంతో పాటు ఒకే సామాజికవర్గానికి చెందిన వారి మధ్య తలెత్తిన విభేదాలు హత్యకు దారి తీశాయి. వీరయ్య చౌదరిని హత్య చేసింది వైసీపీ నేతలంటూ తొలుత ప్రచారం జరిగినా తర్వాత వారంతా టీడీపీలో ఉన్న వారే అని తేలడంతో పార్టీ అధినాయకత్వం అవాక్కయింది. అయితే కేవలం వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, ఆధిపత్య పోరుతోనే ఈ హత్య జరిగిందని తెలిసిన తర్వాత మౌనం వహించక తప్పలేదు. చిన్న వయసులోనే వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడంతో ఆవేదనలో ఉన్న అధినాయకత్వం నియోజకవర్గాల్లో మద్యం, ఇసుక, మైనింగ్ విషయాల్లోనే ఎక్కువ ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించారు. ఇక ప్రత్యర్థులకు చుక్కలే పల్నాడు జిల్లాలో జంట హత్యలు... ఇక తాజాగా పల్నాడు జిల్లాలోనూ ఇద్దరు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఈ హత్యకు కారణం టీడీపీ వారేనని తొలుత జిల్లా ఎస్పీ ప్రకటించినప్పటికీ తర్వాత పల్నాడు ప్రాంత వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు చేశారు. అయితే దీనిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తలు కోవర్టులుగా మారి ప్రత్యర్థి పార్టీల నేతలతో చేతులు కలుపుతూ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు నమ్మారు. అందుకే ఈ హత్యల్లో నేరుగా వైసీపీ వారి ప్రమేయం లేకపోయినా పరోక్షంగా ఉందని భావించిన చంద్రబాబు పార్టీలో కోవర్టులున్నారంటూ వారికి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేవలం కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తేనే సరిపోతుందా? లేక నేతలకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి కదా? అన్న కామెంట్స్ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.

]]>
Fri, 30 May 2025 09:55:23 +0530 admin
కృష్ణానదికి పోటెత్తున్న నీరు... జల కళ ను సంతరించుకున్న తెలుగు రాష్ట్రాల ప్రాజెక్ట్ లు https://prajakshethrenews.com/కృష్ణానదికి-పోటెత్తున్న-నీరు-జల-కళ-ను-సంతరించుకున్న-తెలుగు-రాష్ట్రాల-ప్రాజెక్ట్-లు https://prajakshethrenews.com/కృష్ణానదికి-పోటెత్తున్న-నీరు-జల-కళ-ను-సంతరించుకున్న-తెలుగు-రాష్ట్రాల-ప్రాజెక్ట్-లు కృష్ణానదికి పోటెత్తున్న నీరు... జల కళ ను సంతరించుకున్న తెలుగు రాష్ట్రాల ప్రాజెక్ట్ లు
ప్రజా క్షేత్ర్, విజయవాడ : 
నైరుతి రుతుపవనాలు ముందే రావడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నైరుతి రుతుపవనాలు రాక ముందే కర్ణాటక మహారాష్ట్రలో అకాల వర్షాలు దంచి కొట్టాయి. వీటికి తోడు రుతుపవనాలు రావడంతోవర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో మే నెలలో కురిసిన అకాల వర్షాలు చెరువులు, నదులు ఎండిపోతున్నాయి. కొన్ని రోజులుగా కర్ణాటక, మహారాష్ట్ర,కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం కృష్ణా నది పై ఉన్న జూరాల డ్యామ్ శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. ప్రాజెక్టుకు... తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టు కు గత మూడు రోజులుగా వరద నీరు పోటెత్తుతుంది. ప్రస్తుతం ఇన్ ఫో 3,258 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 805 క్యూసెక్కులుగా ఉంది. కంటిన్యూగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 318.490 మీటర్లకు చేరుకుంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంలీలు కాగా.. ప్రస్తుతం 5.928 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం వస్తున్న వరద ఇలానే కొనసాగితే మరో వారం రోజుల్లో జూరాల డ్యామ్ పూర్తి స్థాయికి నిండి గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఇక ప్రత్యర్థులకు చుక్కలే ఎగువన కురుస్తున్న వర్షాలకు... ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఉప నదులకు వరద నీరు పోటెత్తడంతో.. శ్రీశైలం జలాశయానికి వరద తాకిడి పెరిగింది. ప్రతి సంవత్సరం జులై నెలలో వరద ప్రారంభం అవ్వనుండగా ఈ సారి అకాల వర్షాల కారణంగా ముందస్తుగానే శ్రీశైలం డ్యామ్ కు వరద వచ్చి చేరుతుంది. నిన్న ఉదయానికి ఎగువ నుంచి 4,462 క్యూసెక్కుల వరద వస్తుండగా 19,070 క్యూసెక్కులు ఔట్ ఫ్లో దిగువకు వెళ్తుంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 817.20 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి ముందస్తుగానే వరద ప్రారంభం కావడంతో అప్రమత్తమైన అధికారులు ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరద కంటే దిగువకు వెళ్తున్న ఔట్ ఫ్లో అధికంగా ఉందని అధికారులు తెలిపారు. మొత్తం మీద ఏపీ, తెలంగాణలలో ప్రాజెక్టులు జల కళను సంతరించుకున్నాయి.

]]>
Fri, 30 May 2025 09:50:23 +0530 admin
5 లక్షల మందితో యోగా మెగా ఈవెంట్... https://prajakshethrenews.com/5-లక్షల-మందితో-యోగా-మెగా-ఈవెంట్ https://prajakshethrenews.com/5-లక్షల-మందితో-యోగా-మెగా-ఈవెంట్  5 లక్షల మందితో యోగా మెగా ఈవెంట్...
ప్రజా క్షేత్ర్, విశాఖపట్టణం :

 ఏపీలో మరో భారీ ఈవెంట్ జరగనుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు వేదిక కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహించడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే.ప్రపంచానికి యోగాలో భారత్ దిక్సూచిగా నిలవనుంది. అయితే ఈసారి ప్రధాని మోదీ పాల్గొనే యోగా దినోత్సవానికి విశాఖ వేదిక కానుండడం విశేషం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సైతం భారీగా ప్లాన్ చేస్తోంది. సాధారణ పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యోగా సంఘాల సభ్యులు, నేవీ, కోస్టల్ గార్డ్, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కార్మికులు.. ఇలా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి యోగా దినోత్సవం. ఇదే విషయాన్ని మహానాడు వేదికగా ప్రకటించారు సీఎం చంద్రబాబు. విశాఖలో జరిగే యోగా దినోత్సవం గురించి వ్యాఖ్యలు చేశారు.జూన్ 21న యోగా దినోత్సవాన్నిపురస్కరించుకుని విశాఖలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వచ్చిన సంగతి తెలిసిందే. అదే వేదికపై యోగా దినోత్సవానికి సైతం వస్తానని ప్రధాని ప్రకటించారు. ఏపీ పై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నారు. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 5 లక్షల మందితో భారీ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఆరోగ్యకర జీవనానికి యోగ చాలా కీలకమని.. ఎప్పుడైనా అలసట వస్తే ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తే గొప్ప రిలీఫ్ వస్తుందని మహానాడు వేదికగా చంద్రబాబు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచానికి యోగాను పరిచయం చేయడంపై కొనియాడారు. రాబోయే మహానాడుకు అందరూ యోగా చేయాలని.. యోగా నేర్చుకుని జూన్ 21న విశాఖ రావాలని సూచించారు చంద్రబాబు.కాగా విశాఖలో యోగా వేడుకలకు సంబంధించి అప్పుడే ఏర్పాట్లు ప్రారంభించింది యంత్రాంగం. ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ నుంచి భీమిలి వరకు యోగ ప్రదర్శనలు నిర్వహించేందుకు భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గిన్నిస్ బుక్ఆఫ్ రికార్డ్స్ సాధన లక్ష్యంగా… మొత్తం మార్గంలో 127 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఒక్కో కంపార్ట్మెంటులో 1000 మంది చొప్పున పాల్గొంటారని. ప్రతి 200*14 మీటర్లకు ఒక కంపార్ట్మెంట్ ఉంటుందని.. ప్రతి కంపార్ట్మెంట్ కు ఒక ఇంచార్జ్, వైద్య సిబ్బంది, పదిమంది వాలంటీర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు భారీ ఎల్ఈడి స్క్రీన్లు, చిన్న స్టేజీలు, సౌండ్ సిస్టం వంటి మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయనున్నారు.మరోవైపు ప్రధాని హాజరయ్యే కార్యక్రమానికి సంబంధించి పీ ఎం ఓ నుంచి ప్రత్యేక ప్రకటన వచ్చింది. విశాఖ జిల్లా కలెక్టరేట్ కు సమాచారం కూడా ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మరోవైపు భద్రతా సిబ్బంది సైతం ఇప్పటికే నగరాన్ని పరిశీలించినట్లు సమాచారం. విశాఖ బీచ్ రోడ్డులో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. యోగా దినోత్సవం నాడు ఐదు లక్షల మంది రానుండడంతో.. భద్రతకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

]]>
Fri, 30 May 2025 09:26:49 +0530 admin
మహానాడు సూపర్ సక్సెస్& తెలుగు తమ్ముళ్లలో జోష్ https://prajakshethrenews.com/మహానాడు-సూపర్-సక్సెస్-తెలుగు-తమ్ముళ్లలో-జోష్ https://prajakshethrenews.com/మహానాడు-సూపర్-సక్సెస్-తెలుగు-తమ్ముళ్లలో-జోష్ మహానాడు సూపర్ సక్సెస్-
తెలుగు తమ్ముళ్లలో జోష్
ప్రజా క్షేత్ర్, కడప : 
పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి కడప నగరంలో నిర్వహించిన మహానాడు సూపర్ సక్సెస్ అని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మహానాడులతో పోలిస్తే కడప మహానాడు బెస్ట్ అంటున్నారు వారు. కడపలో మహానాడు ఎనౌన్స్ చేసినప్పటి నుంచి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన తెలుగుదేశం అధిష్టానం కొన్ని కీలకమైన మార్పులను ఈసారి తీసుకొచ్చింది. దానికి తోడు వాతావరణ పరిస్థితులు కూడా కలిసి రావడంతో మహానాడు కారణం అంటున్నారు ఆర్గనైజర్స్.  సాధారణంగా మహానాడు అంటేనే నేతల ప్రసంగాలతో నిండిపోతుంది. అధినేత దృష్టిలో పడాలని ప్రతీ నాయకుడూ వారిని పొగడ్తలతో ముంచుతూ  ఊకదంపుడు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఈసారి ఆర్గనైజర్స్ అలాంటి వాటికి చెక్ పెట్టారు. అధినేత చంద్రబాబు సహా వక్తలందరూ మహానాడు ఎజెండాకు మాత్రమే కట్టుబడి ఉన్నారు. మితిమీరిన పొగడ్తలు లేకుండా వారి ప్రసంగాలు సాగాయి.ఈసారి మహానాడు ఆర్గనైజింగ్ కమిటీల్లో ప్రధాన పాత్ర వహించింది ఎక్కువ శాతం యువకులే. ముఖ్యంగా లోకేష్ టీం ఈసారి ఆర్గనైజింగ్ బాధ్యతలు వహించింది. కడపలో తొలిసారి జరుగుతున్న మహానాడు కావడంతో ఎలాగైనా దీన్ని సక్సెస్ చేసేలా ఎక్కడా సమన్వయ లోపాలు లేకుండా జాగ్రత్త వహించారు. ఎక్కడికక్కడ వాలంటీర్లకు బాధ్యతలు అప్పజెప్తూ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పెద్ద సంఖ్యలో వచ్చిన టిడిపి కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. దీనికోసం సాంకేతిక సహాయం ఎక్కువగా వాడుకున్నారు.ఈసారి మహానాడులో టెక్నాలజీని బలంగా వాడుకున్నారు ఆర్గనైజర్స్. ఎంతెలా అంటే సంప్రదాయబద్దంగా ఎప్పుడూ ఏర్పాటు చేసే సీనియర్ ఎన్టీఆర్ ఫోటో గ్యాలరీ కూడా డిజిటల్ రూపంలో నిర్వహించారు.  వాకీ టాకీలు డ్రోన్ల సాయంతో ఎక్కడ ఎవరికి ఇబ్బంది అనిపించినా వెంటనే అడ్రస్ చేస్తూ మూడు రోజుల పసుపు పండుగ సజావుగా సాగేలా జాగ్రత్తలు తీసుకున్నారు.ఇంతకుముందు జరిగిన వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు మహానాడుల్లో ప్రధానంగా కనిపించిన సమస్య ట్రాఫిక్.అవన్నీ టౌన్‌కి దగ్గర్లోనో సిటీ మధ్యనో జరగడంతో సాధారణ ప్రజలు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొనే వారు. కానీ కడపలో మాత్రం ఆ సమస్య ఎదురు కాలేదు. టౌన్‌కి ఏడు కిలోమీటర్ల దూరంలోని ఒక లూప్ లైన్‌లో మహానాడు ఏర్పాటు చేయడం వల్ల కడప ప్రజలు ఈ మూడు రోజులు ట్రాఫిక్ సమస్య వల్ల ఇబ్బందులు పడలేదు. ఈ మహానాడు ప్రత్యేకతల్లో ఇదొకటిగా చెప్పుకోవచ్చు.ఈ మహానాడులో కడప, రాయలసీమ అభివృద్ధికి పెద్దపేట వేసేలా నేతల ప్రసంగాలు సాగాయి. కడప స్టీల్ ప్లాంట్ పనులు మరో 10 రోజుల్లో మొదలుపెడతామని చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం బనకచర్ల నదుల అనుసంధానంపై మరోసారి భరోసా ఇచ్చారు. అంతేకాదు మహానాడు సంప్రదాయానికి వ్యతిరేకంగా భోజనాల్లో రాయలసీమ ప్రజల కోసం నాన్ వెజ్ ను చేర్చారు. ఈసారి మహానాడు ఇంత సక్సెస్ కావడానికి ప్రధానమైన కారణం వాతావరణం. ఎన్టీఆర్ జన్మదినం మే 28 సందర్భంగా జరిగే మహానాడు ఎప్పుడూ వేసవి తాపానికి గురవుతూనే ఉంటుంది. రాజమండ్రి విజయవాడ ఒంగోలులో జరిగిన మహానాడు సమయంలో ఎండ వల్ల అందరూ తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. కానీ విచిత్రంగా ఈసారి కడప మహానాడుకు వాతావరణం పూర్తిగా అనుకూలించింది. 26వ తారీఖున వర్షం కురిసి నిర్వాహకులను భయపెట్టినా తర్వాత మూడు రోజులు ఆహ్లాదకర వాతావరణమే ఉండడంతో టిడిపి కార్యకర్తలు అందరూ  చక్కటి వాతావరణంలో గడిపారు. వరుస స్పీచ్‌లు వినబడుతున్నా సభ ప్రాంగణం వదిలి ఎవరూ బయటికి వెళ్లలేదు. దానితో చివరి రోజున సభకు టిడిపి నేతలు ఊహించిన దానికంటే ఎక్కువ మంది పసుపు తమ్ముళ్లు బహిరంగ సభకు హాజరై మహానాడు ను సూపర్ సక్సెస్ చేశారని పార్టీ  అధినాయకత్వం సంతృప్తి గా ఉంది.

]]>
Fri, 30 May 2025 09:14:39 +0530 admin
సంక్షేమాన్ని పంచిపెడదాం.. అభివృద్ధిలో భాగస్వాములమౌదాం :చంద్రబాబు నాయుడు https://prajakshethrenews.com/సంక్షేమాన్ని-పంచిపెడదాం-అభివృద్ధిలో-భాగస్వాములమౌదాం-చంద్రబాబు-నాయుడు https://prajakshethrenews.com/సంక్షేమాన్ని-పంచిపెడదాం-అభివృద్ధిలో-భాగస్వాములమౌదాం-చంద్రబాబు-నాయుడు సంక్షేమాన్ని పంచిపెడదాం
అభివృద్ధిలో భాగస్వాములమౌదాం
చంద్రబాబు నాయుడు

ప్రజా క్షేత్ర్, కడప : 
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నన్ను మళ్లీ ఎన్నుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు సవినయంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు.  ప్రజాస్వామ్యయుతంగా సంస్థాగత ఎన్నికలు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. అదే ప్రకారం కడప మహానాడులో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. నా పేరు ప్రతిపాదించిన, సమర్థించిన, ఆమోదించిన వారందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు నా పై ఉంచిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, ‘కార్యకర్తే అధినేత’ అనే సూత్రానికి అనుగుణంగా పని చేస్తానని ఈ సందర్భంగా మరొక్కమారు తెలుపుతున్నాను. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ఎన్ డి ఏ కూటమి ఘన విజయం సాధించింది. ఆ విజయం మన బాధ్యతను పెంచింది. గాడితప్పిన రాష్ట్రాన్ని ఇప్పటికే చాలా రంగాల్లో సరిదిద్దాం. పేద ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకు తీసుకువెళుతున్నాం. పెట్టుబడుల కోలాహలంతో, పరుగులు పెడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులతో, భవిష్యత్తును అందంగా చూపించే మౌలికసదుపాయాల కల్పనతో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాష్ట్రం ముందడుగు వేస్తున్నది. సంక్షేమాన్ని పంచిపెడదాం… అభివృద్ధిలో భాగస్వాములమౌదాం… భావితరాలకు మార్గదర్శులమౌదాం. ప్రపంచ దేశాల్లో తెలుగువారి సత్తాను చూపే దిశగా పయనిద్దాం. నా జీవితం తెలుగు ప్రజల సేవకే అంకితమని మరొక్కమారు తెలుపుకుంటూ ఈ అద్భుత అవకాశాన్ని నాకు అందించిన వారికి మరోసారి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నానని అన్నారు.

]]>
Thu, 29 May 2025 21:27:48 +0530 admin
అలిపిరి మార్గంలో చిరుత సంచారం https://prajakshethrenews.com/అలిపిరి-మార్గంలో-చిరుత-సంచారం https://prajakshethrenews.com/అలిపిరి-మార్గంలో-చిరుత-సంచారం అలిపిరి మార్గంలో చిరుత సంచారం
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. 350వ మెట్టు సమీపంలో చిరుతను చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. అనంతరం భద్రతా సిబ్బందికి భక్తులు సమాచారం అందించారు. దీంతో భక్తులతో గోవింద నామాలు చెప్పిస్తూ సిబ్బంది కొండపైకి పంపిస్తున్నారు. చిరుత కోసం గాలింపు చేపట్టారు. కాగా గతంలోనూ పలుమార్లు తిరుమలలో చిరుతలు సంచరించిన సంగతి తెలిసిందే.

]]>
Mon, 26 May 2025 20:22:07 +0530 admin
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్ https://prajakshethrenews.com/శ్రీశైలం-వెళ్లే-భక్తులకు-గుడ్న్యూస్ https://prajakshethrenews.com/శ్రీశైలం-వెళ్లే-భక్తులకు-గుడ్న్యూస్ శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్..
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఆలయంలో ప్రస్తుతం శని, ఆది, సోమవారాల్లో ఉదయం, రాత్రి మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు. దీనికి టికెట్లను ఆన్ లైన్‌లోనే ఉంచుతున్నారు. అయితే, స్పర్శ దర్శనం మధ్యాహ్నం స్లాట్‌ను ఆలయ అధికారులు పున: ప్రారంభించారు. తాజా నిర్ణయంతో ఇకపై శని, ఆది, సోమవారాల్లో మధ్యాహ్నం కూడా భక్తులు స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఆ మూడ్రోజులు మధ్యాహ్నం మల్లన్న స్పర్శదర్శనం చేసుకునే వారికి ఆన్ లైన్‌లో 350 టికెట్లు, కరెంట్ బుకింగ్‌లో 200 టికెట్లు అందుబాటులో ఉంచారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు ఇటీవల ఆలయ అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ, వసతి విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం వేళల్లో స్పర్శ దర్శనం కల్పించేందుకు వైదిక కమిటీ, అధికారులు సుముఖత వ్యక్తం చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

]]>
Mon, 26 May 2025 19:34:40 +0530 admin
మహానాడుకు సర్వం సిద్దం https://prajakshethrenews.com/మహానాడుకు-సర్వం-సిద్దం https://prajakshethrenews.com/మహానాడుకు-సర్వం-సిద్దం మహానాడుకు సర్వం సిద్దం
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
రాయలసీమ జిల్లాల నడిబొడ్డున కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమం పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో పాటు పాలు చరిత్ర ఆత్మకు నిర్ణయాలకు వేదికగా నిలవనుంది తొలి రోజు 27వ తేదీన పార్టీ ప్రతినిధుల సభ సంస్థాగత నిర్మాణం భవిష్యత్తు కార్య చరణతోపాటు తెలుగుదేశం పార్టీ మౌలిక సిద్ధాంతాలు పార్టీ ఆవిష్కరణ పార్టీ నియమాలతో పాటు వాటి సవరణలపై ప్రధాన చర్చ జరగనున్నది అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు మంగళవారం ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో పసుపు పండగ ప్రారంభమవుతుంది. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలు ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షులు, పొలిట్బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు వేదికపైకి చేరుకుంటారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేసి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనతరం ‘మా తెలుగు తల్లికి’ గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పార్టీ కోసం పనిచేసి మృతిచెందిన కార్యకర్తలు, నేతలకు సంతాపం తెలియజేస్తారు. తర్వాత ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పిస్తారు. 11.30 గంటలకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేస్తారు. కోశాధికారి పార్టీ జమాఖర్చుల నివేదిక సమర్పిస్తారు.

]]>
Mon, 26 May 2025 18:59:52 +0530 admin
పెన్నా నదిలో బయటపడిన అమ్మవారి విగ్రహం https://prajakshethrenews.com/పెన్నా-నదిలో-బయటపడిన-అమ్మవారి-విగ్రహం https://prajakshethrenews.com/పెన్నా-నదిలో-బయటపడిన-అమ్మవారి-విగ్రహం పెన్నా నదిలో బయటపడిన అమ్మవారి విగ్రహం

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 

నెల్లూరు జిల్లాలో అరుదైన ఘటన వెలుగుచూసింది. జొన్నవాడ కామాక్షితాయి టెంపుల్ సమీపంలోని పెన్నా నదిలో అమ్మవారి విగ్రహం బయటపడింది. సరిగ్గా కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే నదిలో అమ్మవారి విగ్రహం బయటపడటంతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి.. శక్తి స్వరూపినిగా ఉన్న అమ్మవారి రూపాన్ని చూసి పూజలు నిర్వహిస్తున్నారు. విగ్రహాన్ని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.  అమ్మవారి విగ్రహం ఎక్కడి నుంచైనా కొట్టుకువచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది.

]]>
Mon, 26 May 2025 18:40:19 +0530 admin
ఏపీ డిప్యూటీ సీ ఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన నీరబ్ ప్రసాద్ కుమార్ ఐఏఎస్ https://prajakshethrenews.com/ఏపీ-డిప్యూటీ-సీ-ఎం-పవన్-కళ్యాణ్-ను-కలిసిన-నీరబ్-ప్రసాద్-కుమార్-ఐఏఎస్ https://prajakshethrenews.com/ఏపీ-డిప్యూటీ-సీ-ఎం-పవన్-కళ్యాణ్-ను-కలిసిన-నీరబ్-ప్రసాద్-కుమార్-ఐఏఎస్ ఏపీ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan క్యాంప్ కార్యాలయం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (చీఫ్ సెక్రటరీ) పదవీ విరమణ చేసిన నీరబ్ ప్రసాద్ కుమార్ ఐఏఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా నిబద్ధతతో, అంకిత భావంతో రాష్ట్రానికి సేవలందించిన ఆయనను పవన్ కళ్యాణ్ అభినందించారు.

]]>
Thu, 02 Jan 2025 19:16:22 +0530 admin
అతిసారం బారినపడి మృతి చెందిన కుటుంబాలకు పవన్​కళ్యాణ్ భరోసా https://prajakshethrenews.com/అతిసారం-బారినపడి-మృతి-చెందిన-కుటుంబాలకు-పవన్కళ్యాణ్-భరోసా https://prajakshethrenews.com/అతిసారం-బారినపడి-మృతి-చెందిన-కుటుంబాలకు-పవన్కళ్యాణ్-భరోసా అతిసారం బారినపడి మృతి చెందిన కుటుంబాలకు పవన్​కళ్యాణ్ భరోసా

ప్రజా క్షేత్ర్, ఏపీ బ్యూరో 

విజయనగరం జిల్లా గుర్ల మండలం, గుర్ల గ్రామంలో కలుషిత నీటి ప్రభావంతో అతిసారం బారినపడి ఇటీవల మృతి చెందినవారి కుటుంబాలను ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద కలిసి, పరామర్శించి వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గుర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అతిసార ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యుల్లో చదువుకునే పిల్లలు ఉంటే వారి విద్య బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏడుగురు మృతి చెందడం విచారకరమని, పలువురు ఆసుపత్రి పాలు కావడం ఆవేదన కలిగించిందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో చర్చించి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా, నీటి కాలుష్యం నివారించేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. బాధితులు చెప్పిన విషయాలను ఓపికగా విని, సమస్యలను తీర్చేలా పని చేస్తామని భరోసా ఇచ్చారు. శుద్ధి చేసిన తాగునీరు ప్రతి కుటుంబానికి అందేలా 'జల జీవన్ మిషన్' పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా ప్రణాళిక సిద్ధం అవుతుందని తెలియజేశారు.

]]>
Mon, 21 Oct 2024 20:11:08 +0530 admin
సీఎం చంద్రబాబుతో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ https://prajakshethrenews.com/సీఎం-చంద్రబాబుతో-కేంద్ర-రైల్వే-మంత్రి-అశ్వినీ-వైష్ణవ్-భేటీ https://prajakshethrenews.com/సీఎం-చంద్రబాబుతో-కేంద్ర-రైల్వే-మంత్రి-అశ్వినీ-వైష్ణవ్-భేటీ సీఎం చంద్రబాబుతో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్ అంశాలపై  ఇరువురి మధ్య చర్చ సాగింది.

]]>
Tue, 08 Oct 2024 03:04:33 +0530 admin
ముస్తాబయిన విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం https://prajakshethrenews.com/ముస్తాబయిన-విజయవాడ-కనకదుర్గమ్మ-దేవాలయం https://prajakshethrenews.com/ముస్తాబయిన-విజయవాడ-కనకదుర్గమ్మ-దేవాలయం ముస్తాబయిన విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం

ప్రజాక్షేత్ర్, ఏపీ బ్యూరో 

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట భద్రత కల్పిస్తున్నారు. 

]]>
Thu, 03 Oct 2024 02:45:42 +0530 admin
హిందువులారా తమకెందుకులే అని ఇంట్లో కూర్చోకండి : పవన్ కళ్యాణ్ https://prajakshethrenews.com/హిందువులారా-తమకెందుకులే-అని-ఇంట్లో-కూర్చోకండి-పవన్-కళ్యాణ్ https://prajakshethrenews.com/హిందువులారా-తమకెందుకులే-అని-ఇంట్లో-కూర్చోకండి-పవన్-కళ్యాణ్ హిందువులారా తమకెందుకులే అని ఇంట్లో కూర్చోకండి : పవన్ కళ్యాణ్ 

ప్రతీ హిందువును ప్రశ్నిస్తున్నాను... ముందు మీరు హిందూ మతాన్ని గౌరవించండి, ప్రతీ హిందువు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, తప్పులను ఖండించాలి, బయటకు వచ్చి పోరాడాలి, తప్పు జరుగుతుంటే మనకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే మన ధర్మంపై తిరుమల లడ్డుపై జరిగినట్లుగా దాడులు జరుగుతాయి.

]]>
Mon, 23 Sep 2024 03:09:08 +0530 admin
ఏడుకొండలవాడా..! క్షమించు •11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష : పవన్​ కళ్యాణ్​ https://prajakshethrenews.com/ఏడుకొండలవాడా-క్షమించు-11-రోజులపాటు-ప్రాయశ్చిత్త-దీక్ష-పవన్-కళ్యాణ్ https://prajakshethrenews.com/ఏడుకొండలవాడా-క్షమించు-11-రోజులపాటు-ప్రాయశ్చిత్త-దీక్ష-పవన్-కళ్యాణ్ ఏడుకొండలవాడా..! క్షమించు  •11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష : పవన్​ కళ్యాణ్​

ప్రజాక్షేత్ర్, ఏపీ బ్యూరో

అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని ఏపీ డిప్యూటి సీఎం పవన్​ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.  జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. ‘దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటాను. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది.

]]>
Sun, 22 Sep 2024 00:28:12 +0530 admin
ప్రతి వ్యక్తికీ 55 లీటర్ల మంచి నీరు అందించండి : చంద్రబాబునాయుడు https://prajakshethrenews.com/ప్రతి-వ్యక్తికీ-55-లీటర్ల-మంచి-నీరు-అందించండి-చంద్రబాబునాయుడు https://prajakshethrenews.com/ప్రతి-వ్యక్తికీ-55-లీటర్ల-మంచి-నీరు-అందించండి-చంద్రబాబునాయుడు ప్రతి వ్యక్తికీ 55 లీటర్ల మంచి నీరు అందించండి : చంద్రబాబునాయుడు 

ప్రజాక్షేత్ర్, ఏపీ బ్యూరో

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గ్రామీణ నీటి సరఫరా విభాగం సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్​ కళ్యాణ్​ , ప్రిన్సిపల్ సెక్రటరీ, RWS ఇంజనీర్ ఇన్ చీఫ్ లు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 95.44 లక్షల ఇళ్లకు, జల్ జీవన్ మిషన్ ద్వారా కనీసం రోజుకు ప్రతి వ్యక్తికీ 55 లీటర్ల రక్షిత మంచి నీరు అందించేందుకు మంచి నీటి పంపు కనెక్షన్లు అందించాలని, దీనికి సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను మూడు నెలల్లోగా రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 

]]>
Fri, 20 Sep 2024 22:25:33 +0530 admin
100 రోజుల పాలనపై ఎన్డీఏ కూటమి సమీక్ష https://prajakshethrenews.com/100-రోజుల-పాలనపై-ఎన్డీఏ-కూటమి-సమీక్ష https://prajakshethrenews.com/100-రోజుల-పాలనపై-ఎన్డీఏ-కూటమి-సమీక్ష 100 రోజుల పాలనపై ఎన్డీఏ కూటమి సమీక్ష 

ప్రజా క్షేత్ర్, ఏపీ బ్యూరో

ఆంధ్రప్రదేశ్ లో కనీవినీ ఎరుగని విజయం దక్కించుకొని ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు,మంత్రుల సమావేశంలో పాల్గొన్నాను. 100 రోజుల్లో సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రసంగించారు

]]>
Fri, 20 Sep 2024 21:59:01 +0530 admin
ఆ కల్తీని నైవేద్యంగా పెట్టడం మా దురదృష్టకరం : రమణ దీక్షితులు https://prajakshethrenews.com/ఆ-కల్తీని-నైవేద్యంగా-పెట్టడం-మా-దురదృష్టకరం-రమణ-దీక్షితులు https://prajakshethrenews.com/ఆ-కల్తీని-నైవేద్యంగా-పెట్టడం-మా-దురదృష్టకరం-రమణ-దీక్షితులు ఆ కల్తీని నైవేద్యంగా పెట్టడం మా దురదృష్టకరం : రమణ దీక్షితులు

ప్రజాక్షేత్ర్ , ఏపీబ్యూరో 

గత 5 ఏళ్ళలో తిరుమల లడ్డూ ప్రసాదం తిన్నప్పుడు, ప్రసాదం వాసన చూసినప్పుడు ఆ తేడా తెలిసేదని, వీళ్ళు ఇచ్చిన కల్తీ నెయ్యితో స్వామి వారికి మా చేతులతో, ఆ కల్తీని నైవేద్యంగా పెట్టాం అంటే ఇది మా దురదృష్టం అని ఎక్స్​ వేదికగా  టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ కల్తీ నెయ్యితో లడ్డూ మాత్రమే కాదు, ఇతర నైవేద్యాలు కూడా చేస్తారు. చివరకు స్వామి వారి నైవేద్య సేవని కూడా కుంచించారు. మా మీద ఒత్తిడి తెచ్చి, స్వామి వారికి అపచారం చేశారు.

-  

]]>
Fri, 20 Sep 2024 21:51:40 +0530 admin
ఛీ..ఛీ.. టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలు : వైఎస్​ షర్మిల https://prajakshethrenews.com/ఛీ..ఛీ.. టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలు : వైఎస్​ షర్మిల https://prajakshethrenews.com/ఛీ..ఛీ.. టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలు : వైఎస్​ షర్మిల ఛీ..ఛీ.. టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలు : వైఎస్​ షర్మిల

తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను, దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీసీసీ చీఫ్​ వైఎస్​ షర్మిల ట్విట్టర్​వేదికగా స్పందించారు. సిఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయి. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే.. సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే మీకు లేకుంటే.. నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే... తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండి. లేదా CBI తో విచారణ జరిపించండి. మహా పాపానికి,ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి. మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని షర్మిల డిమాండ్ ​చేశారు.  

]]>
Thu, 19 Sep 2024 23:28:41 +0530 admin
గిరిజన రైతు కూలీకి దొరికింది అదే .... వామ్మో అంత ఖరీదే https://prajakshethrenews.com/గిరిజన-రైతు-కూలీకి-దొరికింది-అదే-వామ్మో-అంత-ఖరీదే https://prajakshethrenews.com/గిరిజన-రైతు-కూలీకి-దొరికింది-అదే-వామ్మో-అంత-ఖరీదే గిరిజన రైతు కూలీకి దొరికింది అదే .... వామ్మో అంత ఖరీదే 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

కర్నూలు తుగ్గలి సూర్యతండాకు చెందిన ఓ గిరిజన రైతు కూలీకి విలువైన వజ్రం దొరికింది. ఈ వార్త దావానంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న వ్యాపారులు వజ్రాన్ని కొనేందుకు మాములుగా పోటీ పడలేదు. అది 8 క్యారెట్ల వజ్రం కావడంతో పెరవలికి చెందిన వ్యాపారి రూ.5లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో అక్కడి గ్రామ ప్రజలు వజ్రాల కోసం అన్వేషించడం గమనార్హం. 

]]>
Thu, 19 Sep 2024 03:17:17 +0530 admin
ముందు జాగ్రత్త చర్యలతో తప్పిన వరద ముప్పు : పవన్ కళ్యాణ్ https://prajakshethrenews.com/ముందు-జాగ్రత్త-చర్యలతో-తప్పిన-వరద-ముప్పు-పవన్-కళ్యాణ్ https://prajakshethrenews.com/ముందు-జాగ్రత్త-చర్యలతో-తప్పిన-వరద-ముప్పు-పవన్-కళ్యాణ్ ముందు జాగ్రత్త చర్యలతో తప్పిన వరద ముప్పు : పవన్ కళ్యాణ్ 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 

కాకినాడ జిల్లా వి.కె.రాయపురం దగ్గర ఏలేరు కాలువకు గండిపడకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టడం వల్ల అయిదు గ్రామాల ప్రజలు ముంపుకి గురికాకుండా అధికార యంత్రాంగం కాపాడగలిగారని ఏపీ డిప్యూటీ సీ ఎం పవన్ కళ్యాణ్ అన్నారు.ఎంతో అప్రమత్తతో వ్యవహరించడం వల్ల వి.కె.రాయపురం, మాధవపట్నం, రామేశ్వరం, కొవ్వాడ, రేపూరు గ్రామాలు ఏలేరు వరద నుంచి బయటపడ్డాయన్నారు. పంచాయతీరాజ్ డైరెక్టర్  కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్  పర్యవేక్షణలో మూడు రోజులపాటు అక్కడి గట్టు రక్షణలో పాలుపంచుకున్న జిల్లా అధికారులు, సామర్లకోట ఎంపీడీఓ, తహశీల్దార్, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. బృందం – ఏపీఓ, ఈసీ, టి.ఏ., ఫీల్డ్ అసిస్టెంట్ లకు, స్థానిక సర్పంచ్, మాజీ సర్పంచ్ లకు పవన్  కళ్యాణ్ఒక ప్రకటన లో అభినందనలు  తెలియజేశారు.

]]>
Sun, 15 Sep 2024 03:19:01 +0530 admin
విజయవాడలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు https://prajakshethrenews.com/విజయవాడలో-సహాయక-చర్యలను-పర్యవేక్షిస్తున్న-సీఎం-చంద్రబాబు https://prajakshethrenews.com/విజయవాడలో-సహాయక-చర్యలను-పర్యవేక్షిస్తున్న-సీఎం-చంద్రబాబు విజయవాడ నిడమానూరులో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్బంగా వరద బాధితులను సీఎం పరామర్శించారు.అనంతరం నిడమానూరులో జరుగుతున్న సహాయక చర్యలను చంద్రబాబు పర్యవేక్షించారు.

]]>
Thu, 05 Sep 2024 18:40:05 +0530 admin
తిరుమల : 17 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు https://prajakshethrenews.com/తిరుమల-17-కంపార్టుమెంట్లలో-వేచివున్న-భక్తులు https://prajakshethrenews.com/తిరుమల-17-కంపార్టుమెంట్లలో-వేచివున్న-భక్తులు తిరుమల :  తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

17 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,080 మంది భక్తులు.

తలనీలాలు సమర్పించిన 27,394 మంది భక్తులు..

హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు

]]>
Sat, 31 Aug 2024 12:04:25 +0530 admin
విశాఖలో 400 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం https://prajakshethrenews.com/విశాఖలో-400-మీటర్లు-వెనక్కి-వెళ్లిన-సముద్రం https://prajakshethrenews.com/విశాఖలో-400-మీటర్లు-వెనక్కి-వెళ్లిన-సముద్రం విశాఖలో 400 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం

ప్రజాక్షేత్ర్, నేషనల్ బ్యూరో : 

..సాగర జలాల్లో పులకరించుపోవాలని విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌కు చాలా మంది వెళ్తుంటారు. తీరా వెళ్లాక.. ఎగసిపడుతున్న అలలు చూసి భయంతో వెనకడుగు వేస్తారు. ఈ సారి ఆ సముద్రుడే సుమారు 400 మీటర్లు వెనక్కి వెళ్లాడు. దీంతో పర్యాటకులు తీరంలో బయటపడ్డ రాళ్లపైకి చేరి ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. అయితే ఎంత వెనక్కి అలలు వెళ్ళాయో... ఒక్క సారిగా ముందుకు వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే సాగర కదలికలు గమనించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

]]>
Wed, 28 Aug 2024 02:55:34 +0530 admin