Prajakshethre News & : క్రైమ్ https://prajakshethrenews.com/rss/category/క్రైమ్ Prajakshethre News & : క్రైమ్ en Copyright 2024 Prajakshethre News & All Rights Reserved. నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు https://prajakshethrenews.com/నల్గొండ-జిల్లా-కోర్టు-సంచలన-తీర్పు https://prajakshethrenews.com/నల్గొండ-జిల్లా-కోర్టు-సంచలన-తీర్పు నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు
పోక్సో కేసులో దోషికి 51 ఏళ్ల జైలు శిక్ష.!

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 

పోక్సో కేసులో నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషికి 51 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. అంతేకాదు 85 వేలు జరిమానా విధిస్తూ బాధితురాలికి 7 లక్షల పరిహారం అందించాలని నల్గొండ జిల్లా కోర్టు ఆదేశించింది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలానికి చెందిన బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు ఖయ్యూంకి ఈ కఠిన కారాగార శిక్షను కోర్టు విధించింది. క్రైమ్ నం.242/2021, తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సీ, నం.94/2022)లో,తిప్పర్తి గ్రామం, మండలానికి చెందిన నిందితుడు ఖయ్యూంను ఎస్సీ ఎస్టీ కోర్ట్ జడ్జి రోజా రమణి దోషిగా తేల్చారు. అత్యాచారానికి 20 సంవత్సరాల కారాగార శిక్ష, ఫోక్సో  చట్టం కింద మరో 20 సంవత్సరాల కారాగార శిక్ష, ఎస్సీ, ఎస్టి సంబంధిత సెక్షన్, చట్టం కింద 10 సంవత్సరాల కారాగార శిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.వీటితో పాటు.. ఐపీసీ సెక్షన్ 506 కింద ఒక సంవత్సరం కారాగార శిక్షను కూడా విధించారు. 

]]>
Wed, 27 Aug 2025 20:48:45 +0530 admin
సహస్ర హత్య కేసులో బాలుడే హంతకుడు https://prajakshethrenews.com/సహస్ర-హత్య-కేసులో-బాలుడే-హంతకుడు https://prajakshethrenews.com/సహస్ర-హత్య-కేసులో-బాలుడే-హంతకుడు సహస్ర హత్య కేసులో బాలుడే హంతకుడు

దొంగతనానికి వచ్చి... ఎక్కడ చెబుతుందోనని హత్య చేసిన బాలుడు

15 నిమిషాల పాటు బాలుడు ఆ ఇంటినే చూస్తున్నట్లు సిసి కెమెరాలో నిక్షిప్తం

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 

సంచలనం సృష్టించిన పన్నెండేళ్ల చిన్నారి సహస్ర హత్య కేసులో మిస్టరీ వీడింది. బాలిక ఉంటున్న అపార్ట్ మెంట్ పొరుగునే ఉంటున్న 10వ తరగతి విద్యార్థి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది. దొంగతనానికి వెళ్లిన బాలుడు ఊహించని విధంగా  సహస్​ర ఇంట్లో ఉండటం...తనను చూడటంతో అందరికీ విషయం చెప్పేస్తుందని ఆమెను కిరాతకంగా హతమార్చినట్టుగా వెల్లడైంది. క్రికెట్ బ్యాట్ కొనటానికే డబ్బు దొంగిలించటానికే వచ్చినట్టుగా తెలుస్తోంది.  ప్రస్తుతం బాలున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు. కూకట్​ పల్లి సంగీత్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ పెంట్ హౌస్​ లో నివాసముంటున్న సహస్ర అయిదు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. స్కూల్ కు వెళ్లిన కొడుక్కి లంచ్​ బాక్స్ ఇద్దామని చిన్నారి తండ్రి కృష్ణ ఇంటికి వచ్చినపుడు ఈ ఘాతుకం వెలుగు చూసింది. కత్తితో గొంతు, కడుపులో ఇరవై సార్లకు పైగా పొడవటంతో రక్తం మడుగులో చనిపోయిన సహస్ర మృతదేహం కనిపించింది. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా అందరిలో తీవ్ర కలవరాన్ని సృష్టించింది. ఈ క్రమంలో పోలీసులు కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు. నిందితున్ని పట్టుకునేందుకు బాలానగర్ జోన్​ డీసీపీ సురేశ్​ కుమార్ అయిదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ బృందాలు పదుల సంఖ్యలో అనుమానితులను విచారించాయి. సహస్ర కుటుంబం ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే అద్దెకు ఉంటున్న ఒడిషాకు చెందిన వ్యక్తితోపాటు దాదాపు నలభై మందిని ప్రశ్నించాయి. అయితే, కేసులో మిస్టరీ మాత్రం వీడలేదు. *సహస్ర కుటుంబం అద్దెకుంటున్న అపార్ట్ మెంట్ లో సీసీ కెమెరాలు లేవు. అయితే, దాని ఎదురుగా ఉన్న ఓ ఇంటి వద్ద సీసీ కెమెరాలు పని చేస్తున్నాయి. వాటి ఫుటేజీని విశ్లేషించినపుడు సహస్ర కుటుంబం ఉంటున్న అపార్ట్ మెంట్ లోకి ఎవరు వెళుతున్నట్టుగానీ...బయటకు వస్తున్నట్టుగానీ కనిపించ లేదు. ఇక, అపార్ట్ మెంట్​ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినపుడు కూడా హత్య జరిగిన సమయంలో అటుగా అనుమానాస్పదంగా ఎవరు వచ్చినట్టుగానీ...వెళ్లినట్టుగానీ అగుపించ లేదు. అయితే, సహస్ర ఉంటున్న అపార్ట్ మెంట్ గేటు వద్ద ఓ యువకుడు బయటకు తొంగి చూస్తున్న దృశ్యాలు మాత్రం రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరుగుపొరుగున ఉంటున్న వారిలోనే ఎవరో ఒకరు టెర్రస్​ పైనుంచి వచ్చి ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానించిన పోలీసులు ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని క్షుణ్నంగా విచారించటం మొదలు పెట్టారు. 

దొంగతనానికి వచ్చి...నేనే చంపేశా...

ఈ క్రమంలోనే సహస్ర కుటుంబం ఉంటున్న అపార్ట్ మెంట్ పక్క బిల్డింగ్ లోని 10వ తరగతి విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మొదట తనకేమీ తెలియదని బాలుడు నమ్మించటానికి ప్రయత్నించినా పోలీసులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిర చేయటంతో తానే సహస్రను చంపినట్టుగా అంగీకరించాడు. నిజానికి తాను దొంగతనం చేయటానికి వెళ్లినట్టుగా చెప్పాడు. సహస్ర తనను చూడటంతో అందరికీ చెబుతుందన్న భయంతోనే  ఈ నేరానికి పాల్పడినట్టుగా వెల్లడించాడు. ఈ క్రమంలో పోలీసులు అతని నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితోపాటు రక్తం మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు దొంగతనం ఎలా చేయాలి? అన్నదానికి సంబంధించి ఆ బాలుడు రాసుకున్న కాగితాన్ని కూడా సీజ్ చేశారు. 

మిషన్ don? 

హత్యకు గురైన సహస్ర కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. ఆమె తమ్ముడు మరో ప్రైవేట్ స్కూల్ విద్యార్థి. తల్లి రేణుక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తుండగా తండ్రి కృష్ణ బైక్ మెకానిక్​ గా పని చేస్తున్నాడు. ప్రతీరోజు ఉదయం పిల్లలు స్కూళ్లకు వెళ్లగానే ఇంటికి తాళం వేసి రేణుక, కృష్ణలు తమ తమ పనులపై వెళ్లిపోయేవారు. పొరుగింట్లోనే ఉంటున్న బాలునికి ఈ విషయం బాగా తెలుసు. ఈ క్రమంలో కృష్ణ ఇంట్లో చోరీకి పథకం వేసుకున్నాడు. యూ ట్యూబ్​ వీడియోలు చూసి తాళాన్ని ఎలా విరగ్గొట్టాలో తెలుసుకున్నాడు. గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆ వివరాలను మిషన్ థెఫ్ట్ అంటూ పేపర్ పై రాసుకోవటం. హౌ టు ఎంట్రీ...హౌ టు బ్రేక్ హుండీ...హౌ టు ఎస్కేప్ అని రాసి చివరకు మిషన్ డన్​ అని కూడా ఆ కాగితంపై రాశాడు. రూపొందించుకున్న పథకం ప్రకారం ఓ కత్తి, స్క్రూడ్రైవర్ వెంట తీసుకుని టెర్రస్ పైనుంచి సహస్ర కుటుంబం ఉంటున్న పెంట్ హౌస్ వద్దకు చేరుకున్నాడు. ఆ రోజు స్కూల్​ కు సెలవు కావటంతో సహస్ర ఒంటరిగా ఇంట్లో ఉంది. చోరీ చేయటానికి లోపలికి వచ్చిన బాలున్ని చూసింది. దాంతో తన గురించి అందరికీ చెబుతుందని భయపడ్డ బాలుడు ఆమెపై దాడి చేశాడు. మొదట గొంతు నులిమి ఆ తరువాత కత్తితో గొంతుపై, కడుపులో విచక్షణారహితంగా పొడిచాడు. సహస్ర చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత దేవుని ఫోటోల వద్ద ఉన్న హుండీని పగులగొట్టి దొరికిన డబ్బు తస్కరించి టెర్రస్ పైనుంచే ఉడాయించాడు. ఆ రోజు సెలవు లేకుండా ఉంటే సహస్ర స్కూల్​ కు వెళ్లేదని...ప్రాణాలతో బతికేదని స్థానికులు ఆవేదనతో వ్యాఖ్​యానించారు. చూస్తుంటే మృత్యువు ఆ చిన్నారిని వెంటాడినట్టుగా అనిపిస్తోందన్నారు. ఇక, పోలీసులు బాలుని నుంచి దొంగతనం ఎలా చేయాలని రాసుకున్న లెటర్, రక్తం మరకలు ఉన్న దుస్తులు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు. కేసులో మిస్టరీ వీడినట్టే అని చెప్పిన అధికారులు అన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

]]>
Fri, 22 Aug 2025 23:56:15 +0530 admin
హైదరాబాద్ కొండాపూర్ రేవ్‌ పార్టీ కేసులో ట్విస్ట్‌ https://prajakshethrenews.com/హైదరాబాద్-కొండాపూర్-రేవ్-పార్టీ-కేసులో-ట్విస్ట్ https://prajakshethrenews.com/హైదరాబాద్-కొండాపూర్-రేవ్-పార్టీ-కేసులో-ట్విస్ట్ హైదరాబాద్ కొండాపూర్ రేవ్‌ పార్టీ కేసులో ట్విస్ట్‌

"ఎంపీ" స్టిక్కర్‌ వాహనం ఎవరిది?

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ : 

హైదరాబాద్‌లోని కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్ దర్శనమిచ్చింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కారుపై "ఎంపీ" స్టిక్కర్ కనిపించడం, పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక, రేవ్‌ పార్టీ నిర్వహించిన అశోక్ నాయుడును ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ రేవ్ పార్టీలో ముఖ్యమైన వ్యక్తిగా అశోక్ ఉన్నారు. వివరాల ప్రకారం.. ఆదివారం కొండాపూర్ ఎస్ వి,సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి 11 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా గంజాయి, డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న వారు ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్‌ వాసు, శివంనాయుడు కొంతమంది అమ్మాయిలను తీసుకొచ్చి, యువకులతో ఎంజాయ్‌ చేయిస్తున్నారు. వీరిని ఎస్టీఎఫ్‌ బీ టీమ్‌ పట్టుకుంది. ఆ తర్వాత శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించినట్టు సీఐ సంధ్య తెలిపారు. వీరి వద్ద నుంచి 2 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్‌ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్‌ ముష్రూమ్, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆరు కార్లు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు. అయితే, వీకెండ్‌ సందర్భంగా రేవ్ పార్టీని నిర్వహించింది అశోక్ నాయుడు అని పోలీసులు తేల్చారు. రేవ్‌ పార్టీ సందర్భంగా రెండు కార్లను సీజ్ చేసిన పోలీసులు.. అందులో ఒక ఫార్చ్యూనర్ కారుకు లోక్‌సభ ఎంపీ స్టిక్కర్ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ కారులో ఎవరు వచ్చారు? ఆ ఎంపీ పేరేంటి? ఆయనే వచ్చారా లేక ఆ కారులో ఆయన బంధువులెవరైనా వచ్చారా? అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేశారు. అశోక్‌ నాయుడికి రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

]]>
Mon, 28 Jul 2025 21:59:19 +0530 admin
ఎన్‌కౌంటర్‌లో పహల్గామ్ ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి సులేమాన్ హతం https://prajakshethrenews.com/ఎన్కౌంటర్లో-పహల్గామ్-ఉగ్రదాడి-ప్రధాన-సూత్రధారి-సులేమాన్-హతం https://prajakshethrenews.com/ఎన్కౌంటర్లో-పహల్గామ్-ఉగ్రదాడి-ప్రధాన-సూత్రధారి-సులేమాన్-హతం ఎన్‌కౌంటర్‌లో పహల్గామ్ ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి సులేమాన్ హతం
ప్రజా క్షేత్ర్,  శ్రీనగర్ జూలై 28 :
 ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. అతి సమీపం నుంచి కాల్పులు జరిపి 25 మంది పర్యాటకులు, ఓ కశ్మీరీ వ్యక్తి ప్రాణాలను బలిగొన్నారు. ఈ దాడికి తర్వాత అక్కడి నుంచి పరారైన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్నారు. తాజాగా సోమవారం జమ్ము కశ్మీర్‌లో జరిగిన ‘ఆపరేషన్ మహదేవ్’లో   పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో పహల్గామ్ ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి సులేమాన్ అలియాస్ మూసాను మట్టుబెట్టారు.మహదేవ్ పర్వత ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌కి ‘ఆపరేషన్ మహదేవ్‌’గా   నామకరణం చేశారు. మహదేవ్ పర్వత ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో ఉదయం 11.30 గంటల నుంచి భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. దాచిగాం ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకోగా.. ముగ్గురు ముష్కరులను హతమార్చారు. మృతుల్లో మూసాతో పాటు అబూ హమ్జా, యాసిర్‌లు ఉన్నారు. ఈ ఇద్దరూ పహల్గాం దాడిలో పాల్గొన్నారు. డ్రోన్‌ల ద్వారా మృతదేహాలను గుర్తించి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఉగ్రవాదుల నుంచి ఎకె 47 రైఫిల్స్, 17 గ్రానైడ్లు స్వాధీనం చేసుకున్నారు.

]]>
Mon, 28 Jul 2025 21:51:00 +0530 admin
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు మృతి https://prajakshethrenews.com/ఛత్తీస్గఢ్లో-ఎన్కౌంటర్-ఆరుగురు-మావోయిస్టులు-మృతి https://prajakshethrenews.com/ఛత్తీస్గఢ్లో-ఎన్కౌంటర్-ఆరుగురు-మావోయిస్టులు-మృతి ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు మృతి
ప్రజా క్షేత్ర్, ఛత్తీస్‌గఢ్‌ జూలై  :
ఛత్తీస్‌గఢ్‌ లోని నారాయణ్‌పూర్‌  జిల్లాలో మావోయిస్టుల కు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు  జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటికే ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. సంబంధిత పోలీస్ అధికారులు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.అంబూజ్‌మడ్‌ రీజియన్‌లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని సమాచారం అందడంతో శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు, భద్రతాబలగాలు కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ సందర్భంగా మధ్యాహ్నం మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి.ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టులు మరణించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

]]>
Sat, 19 Jul 2025 00:35:32 +0530 admin
ముదిగొండ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 35 మంది విద్యార్థినులు అస్వస్థత https://prajakshethrenews.com/ముదిగొండ-గిరిజన-ఆశ్రమ-పాఠశాలలో-ఫుడ్-పాయిజన్తో-35-మంది-విద్యార్థినులు-అస్వస్థత https://prajakshethrenews.com/ముదిగొండ-గిరిజన-ఆశ్రమ-పాఠశాలలో-ఫుడ్-పాయిజన్తో-35-మంది-విద్యార్థినులు-అస్వస్థత ముదిగొండ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 35 మంది విద్యార్థినులు అస్వస్థత
నల్లగొండ  జూలై 14
నల్లగొండ జిల్లా, దేవరకొండ మండలం, ముదిగొండ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం జరిగిన ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..బాలికల ఆశ్రమ పాఠశాలలో 310 మంది విద్యార్థినిలకు ఆదివారం రాత్రి అల్పాహారంగా పెసర గుగ్గిళ్లను పెట్టారు. కొద్దిసేపటి తర్వాత బగారా అన్నం, చికెన్‌తో భోజనం పెట్టారు. రాత్రి భోజనం తిన్న తర్వాత పాఠశాలలో కొంతమంది బాలికలకు కడుపునొప్పితో బాధపడుతూ విరోచనాలు, వాంతులతో సతమతం అయ్యారు. సోమవారం ఉదయం అల్పాహారంగా విద్యార్థినిలకు పులిహోర వడ్డించారు. ఇది తిన్న అనంతరం 35 మంది బాలికలకు తీవ్రమైన కడుపునొప్పి, విరోచనాలు కావడంతో ఆందోళన చెందిన టీచర్లు పాఠశాల ఎఎన్‌ఎంతో పాటు ముదిగొండ గ్రామంలోని ఒక ఆర్‌ఎంపి వద్దకు చికిత్స నిమిత్తం పంపించారు.ఆయన సూచన మేరకు పెద్ద ఆసుపత్రికి విద్యార్థినుల్లో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 13 మంది, తూర్పుపల్లి పిహెచ్‌సిలో 22 మందిని చేర్పించారు. ఫుడ్ పాయిజన్ వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెప్పారు. ఈ రెండు ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న బాలికల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఆర్‌డిఒ రమణారెడ్డి హుటాహుటిన ఆయా ఆసుపత్రులకు చేరుకొని బాలికలను పరామర్శించారు. ముదిగొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి ఈ సంఘటనకు దారితీసిన వివరాలు తెలుసుకున్నారు. కాగా, గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ సంఘటన జరిగినా డిటిడబ్ల్యుఒ ఇంతవరకు రాలేదని విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఉదయం సంఘటన జరిగిన మధ్యాహ్న ఒంటిగంట వరకు రాలేదని మండిపడ్డారు.

]]>
Tue, 15 Jul 2025 00:04:44 +0530 admin
భారీ వర్షాలు కురియడంతో విదర్భ రీజియన్‌లో ఎనిమిది మంది మృతి https://prajakshethrenews.com/భారీ-వర్షాలు-కురియడంతో-విదర్భ-రీజియన్లో-ఎనిమిది-మంది-మృతి https://prajakshethrenews.com/భారీ-వర్షాలు-కురియడంతో-విదర్భ-రీజియన్లో-ఎనిమిది-మంది-మృతి భారీ వర్షాలు కురియడంతో విదర్భ రీజియన్‌లో ఎనిమిది మంది మృతి
ప్రజా క్షేత్ర్,  నాగపూర్ జూలై 14;

ఈనెల 8, 9 తేదీల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురియడంతో వరదలు సంభవించి విదర్భ రీజియన్‌లో ఎనిమిది మంది మృతి చెందారు. తూర్పు ప్రాంతం నాగపూర్, అమరావతి డివిజన్లలో ఎడతెరిపి లేని వానలతో ఇళ్లు ఆస్తులు ధ్వంసమై పంటలు దెబ్బతిని అపారనష్టం సంభవించింది. నాగపూర్, వార్ధా, గోండియా, భాంద్రా, గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాల్లో వరదలు ముంచెత్తాయి. బాధితులకు తక్షణం సహాయం అందేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర వైపరీత్యాల నివారణ నిర్వహణ మంత్రి గిరీష్ మహాజన్ సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. మే 30 తీర్మానం ప్రకారం ఇళ్లు కూలిపోయిన బాధితులకు ఆర్థిక సహాయం అందించడమైందని, ఇంకా 2023 జులై 28 తీర్మానం ప్రకారం బాధితులైన షాపుల యజమానులకు, వ్యాపారులకు, వంటపాత్రలు,దుస్తులు తదితర నిత్యావసరాలు అందించడానికి గడువు పొడిగించినట్టు చెప్పారు. వర్షాలు, వరదల కారణంగా 20,854 హెక్టార్ల పంటభూములు దెబ్బతిన్నాయని, 29,920 మంది రైతులు బాధితులయ్యారని తెలిపారు. “ నాగపూర్ డివిజన్‌లో ఏడుగురు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. 1927 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 40 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి.,209 పశువుల పాకలు దెబ్బతిన్నాయి. 715 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడమైంది. ఈ నష్టాలపై అంచనా జరుగుతోంది. అమరావతి డివిజన్‌లో ఒకరు చనిపోగా, మరొకరు గాయపడ్డారు. 180 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తొమ్మిది పూర్తిగా కూలిపోయాయి, 3411 హెక్టార్ల పంటభూములు దెబ్బతిన్నాయి.” అని మంత్రి వివరించారు. బాధితులందరికీ సత్వరం సహాయం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

]]>
Mon, 14 Jul 2025 23:57:12 +0530 admin
లోయలో పడిన వాహనం ఐదుగురు మృతి https://prajakshethrenews.com/లోయలో-పడిన-వాహనం-ఐదుగురు-మృతి https://prajakshethrenews.com/లోయలో-పడిన-వాహనం-ఐదుగురు-మృతి లోయలో పడిన  వాహనం ఐదుగురు మృతి
ప్రజా క్షేత్ర్, శ్రీనగర్ జూలై 12 :
జమ్ము కశ్మీర్ రాష్ట్రం రాంబన్ జిల్లాలో శనివారం ఉదయం వాహనం లోయలో పడింది.  ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. గాయపడిన ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో యావర్ అహ్మద్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. యుక్రల్ పోగల పరిస్తాన్ ప్రాంతంలోని సేనాబాతిలో రోడ్డుపక్కన ఉన్న 600 అడుగుల లోయలో పర్యాటకుల వాహనం పడింది. రెస్య్కూ సిబ్బంది, అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి జీతేంద్ర సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు లక్ష రూపాయలు, గాయపడిన 25 వేల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతులు తౌఖర్ అహ్మద్, షకీల్ అహ్మద్, గాయపడిన వారు మహ్మద్ రఫీక్, అబ్దుల్ లతీఫ్, అజాజ్ అహ్మద్‌గా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

]]>
Sun, 13 Jul 2025 09:47:41 +0530 admin
ఇంజన్లు ఆగిపోవడం వల్లే ప్రమాదం https://prajakshethrenews.com/ఇంజన్లు-ఆగిపోవడం-వల్లే-ప్రమాదం https://prajakshethrenews.com/ఇంజన్లు-ఆగిపోవడం-వల్లే-ప్రమాదం ఇంజన్లు ఆగిపోవడం వల్లే ప్రమాదం
ప్రజా క్షేత్ర్, గాంధీనగర్, జూలై 12 :
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై భారత విమాన ప్రమాద పరిశోధన సంస్థ  ప్రాథమిక నివేదిక ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ నివేదికపై తాము ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ ప్రమాదం ఎంత భయంకరంగా ఉందంటే, విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం టేకాఫ్ అయిన 98 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 260 మంది మరణించారు.బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకుంది, ఆ తర్వాత లండన్ వెళ్లాల్సి ఉంది. విమానం అహ్మదాబాద్‌కు చేరుకున్న తర్వాత సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత టేకాఫ్ చేయడానికి అనుమతి ఇచ్చారు. విమానానికి 08:03:45  (యూనివర్సల్ కోఆర్డినేటెడ్ టైమ్) వద్ద రన్‌వే 23లో లైన్‌అప్ చేయడానికి అనుమతి లభించింది. ఆ తర్వాత 08:07:33 UCT వద్ద టేకాఫ్ చేయడానికి అనుమతి లభించింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత, 08:09:05 UCT వద్ద పైలట్ మెడే...మెడే అని పిలిచాడు, ఆ తర్వాత విమానం కూలిపోయింది.
తక్కువ ఎత్తు కారణంగా RAT పనిచేయలేదు
విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి, దీనివల్ల అది అవసరమైన శక్తిని పొందలేకపోయింది. ఆ తర్వాత రామ్ ఎయిర్ టర్బైన్ బయటకు వచ్చింది. ఇది విమానానికి అత్యవసర విద్యుత్ అవసరమని హెచ్చరిస్తుంది, కానీ తక్కువ ఎత్తులో ఉండటం వల్ల ఇది పనిచేయలేదు. అయితే, ఆ తర్వాత పైలట్ ఇంజిన్‌లను ఆన్ చేయడానికి ప్రయత్నించాడు, అప్పటికే చాలా ఆలస్యమైంది.
మధ్యాహ్నం 1:43 గంటలకు: అగ్నిమాపక సిబ్బందికి హాట్‌లైన్ ద్వారా ప్రమాదం గురించి సమాచారం అందింది. కొద్ది నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
నివేదికలో మరిన్ని ముఖ్యమైన విషయాలు వెలుగులోకి   ప్రాథమిక నివేదికను సమర్పించింది. దీనికి ముందు, శిథిలాల ఫోటోలు, వీడియోలు తీశారు. వాటిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచారు. రెండు ఇంజిన్‌లు, అవసరమైన భాగాలు వేరుగా ఉంచారు. ఇంధన నమూనాలను కూడా తీసుకున్నారు, అవి సరిగ్గా ఉన్నట్లు తేలింది.
నివేదికను పరిశీలిస్తున్నాము - మంత్రి
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తక్షణమే ఒక నిర్ణయానికి రావొద్దని, తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) సమర్పించిన ప్రాథమిక నివేదికపై ఆయన స్పందించారు.ప్రపంచంలోనే అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు, సిబ్బంది మనకు ఉన్నారని, వారు విమానయాన రంగానికి వెన్నుముక వంటి వారని మంత్రి అన్నారు. వారే విమానయాన రంగానికి ప్రధాన వనరులని, వారి సంక్షేమం, శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఎటువంటి నిర్ధారణకు రాకుండా తుది నివేదిక కోసం వేచి చూద్దామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో అనేక సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయని ఆయన అన్నారు. అందుకే నివేదికపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు.అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ 15 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను ఇటీవల సమర్పించింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆగిపోయినట్లు ఆ నివేదికలో పేర్కొంది. ఒక పైలట్ మరో పైలట్‌ను ఆ స్విచ్ ఎందుకు ఆపివేశావని ప్రశ్నించగా, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరొక పైలట్ చెప్పినట్లు నివేదిక వెల్లడించింది. కాక్‌పిట్‌లో పైలట్ల చివరి మాటలు ఇవేనని ఏఏఐబీ తెలిపింది. ఆ తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చారని పేర్కొంది.

]]>
Sun, 13 Jul 2025 09:44:43 +0530 admin
ఇన్సూరెన్స్ కోసం అత్తను చంపిన అల్లుడు https://prajakshethrenews.com/ఇన్సూరెన్స్-కోసం-అత్తను-చంపిన-అల్లుడు https://prajakshethrenews.com/ఇన్సూరెన్స్-కోసం-అత్తను-చంపిన-అల్లుడు ఇన్సూరెన్స్ కోసం అత్తను చంపిన అల్లుడు
ప్రజా క్షేత్ర్, మెదక్, జూలై 12 :
సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాన్‌సాన్‌పల్లి శివారులో ఇటీవల జరిగిన కారు ప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో 60 ఏళ్ల రామవ్వ మృతి చెందగా, ఇది ప్రమాదం కాదని, హత్య అని పోలీసుల విచారణలో తేలింది. రూ. 60 లక్షల ప్రమాద బీమా కోసం అల్లుడే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు గుర్తించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెద్దమాన్‌సాన్‌పల్లి శివారులో ఈ నెల 7న కారు ఢీకొని రామవ్వ మృతి చెందింది. ఆమె అల్లుడు వెంకటేశ్ ప్రమాదం జరిగిందని ఫిర్యాదు చేశాడు. కేసును విచారించిన పోలీసులు, ప్రమాద బీమా కోసం అల్లుడు ఈ హత్య చేయించినట్లు నిర్ధారించారు.వెంకటేశ్ గతంలో అత్తపై పలు రకాల బీమా పాలసీలు తీసుకున్నాడు. ఈ క్రమంలో బీమా డబ్బుల కోసం ఆమెను కారుతో ఢీకొట్టి చంపేందుకు కరుణాకర్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాను చెప్పినట్లు చేస్తే బీమా సొమ్ములో సగం ఇస్తానని అతనికి చెప్పాడు.ఆ తరువాత, పొలం పనుల నిమిత్తమని చెప్పి వెంకటేశ్ అత్తగారిని ఊరికి తీసుకువచ్చాడు. పథకం ప్రకారం ఈ నెల 7న రాత్రి పొలం నుంచి ఆమెను ఒంటరిగా ఇంటికి పంపించాడు. నడుచుకుంటూ వెళుతున్న ఆమెను కరుణాకర్ కారుతో ఢీకొట్టాడు. వెంకటేశ్, కరుణాకర్‌కు ఒక అద్దె కారును సమకూర్చాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా డ్రైవర్‌ను గుర్తించగా, కరుణాకర్ విచారణలో నేరం అంగీకరించాడు.

]]>
Sat, 12 Jul 2025 21:36:30 +0530 admin
కూకట్‌పల్లి కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి? https://prajakshethrenews.com/కూకట్పల్లి-కల్తీ-కల్లు-తాగి-ముగ్గురు-మృతి https://prajakshethrenews.com/కూకట్పల్లి-కల్తీ-కల్లు-తాగి-ముగ్గురు-మృతి కూకట్‌పల్లి కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి?
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్‌ జూలై 9 :

కూకుట్ పల్లి కల్తీ కల్లు బాధితుల్లో ముగ్గురు మృతి చెందారు. బుధవారం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించగా.. ఇంట్లోనే ఉన్న మరో వ్యక్తి చనిపోయినట్లు తెలుస్తోంది. హెచ్‌ఎంటీ హిల్స్‌ సాయిచరణ్‌ కాలనీకి చెందిన తులసిరామ్‌(47), బొజ్జయ్య(55), నారాయణమ్మ(65)గా గుర్తించారు.నిన్న కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కల్తీ కల్లు సేవించిన వారిలో 19 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. వైద్యం అందించిన డాక్టర్లు 24 గంటలు గడిస్తే గాని వారి పరిస్థితి చెప్పలేమని తెలిపారు. పలువురు బాధితులు వెంటిలేటర్స్‌పై చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరెకపూడి గాంధీలు బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

]]>
Wed, 09 Jul 2025 23:09:00 +0530 admin
సిటీ సివిల్ కోర్టుకు బెదిరిపులు https://prajakshethrenews.com/సిటీ-సివిల్-కోర్టుకు-బెదిరిపులు https://prajakshethrenews.com/సిటీ-సివిల్-కోర్టుకు-బెదిరిపులు సిటీ సివిల్ కోర్టుకు బెదిరిపులు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూలై 8 :
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపుతో కోర్టు కార్యకలాపాలు నిలిపివేశారు. చీఫ్ మెజిస్ట్రేట్‌ సూచనతో కోర్టు మూసివేశారు. సమాచారం అందుకున్న వెంటనే డాగ్‌, బాంబు స్క్వాడ్‌తో సిటీ సివిల్ కోర్టులో తనిఖీలు చేపట్టాయి. కోర్టులో బాంబు ఉందని బెదిరింపులు రావడంతో అడ్వకేట్లు, లాయర్లు, క్లైంట్స్ కోర్టు బిల్డింగ్ ప్రాంగణం నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని రోజుల కిందట బేగంపేట ఎయిర్ పోర్టుకు సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ సమయంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, హాస్పిటల్స్ లో బాంబులు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనూ బాంబులు పెట్టాం, పేల్చివేస్తామని గతంలో బెదిరింపులు వచ్చాయి. తాజాగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టారని బెదిరింపు మెయిల్స్‌ రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రాజ్‌భవన్‌, జింఖానా క్లబ్‌, సిటీ సివిల్‌ కోర్టు, సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టుల్లో బాంబులు పెట్టామంటూ మెయిల్స్‌ వచ్చాయని సిటీ పోలీసులు మంగళవారం తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్స్‌, డాగ్‌ స్వ్కాడ్స్‌తో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి.
ఊపిరి పీల్చుకున్న పోలీసులు....
‘అబీదా అబ్దుల్లా’ అనే పేరుతో ఉన్న ఈ-మెయిల్ ఐడీ నుంచి ఈ బెదిరింపు సందేశాలు వచ్చాయి. సిటీ సివిల్ కోర్టు, జింఖానా క్లబ్‌లలో ఆర్‌డీఎక్స్, ఐఈడీ వంటి శక్తివంతమైన పేలుడు పదార్థాలు అమర్చామని, అవి కొద్దిసేపట్లో పేలిపోతాయని మెయిల్‌లో హెచ్చరించారు. దీంతో అధికారులు వెంటనే కోర్టు కార్యకలాపాలను నిలిపివేసి, న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను ప్రాంగణం నుంచి ఖాళీ చేయించారు.సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన బెదిరింపులు వచ్చిన అన్ని ప్రాంతాలకు చేరుకున్నాయి. సుమారు మూడు గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఈ సోదాల్లో ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో బెదిరింపులు బూటకమని నిర్ధారించారు. దీంతో అధికారులు, నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బెదిరింపు మెయిల్స్ పంపిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు

]]>
Tue, 08 Jul 2025 18:24:45 +0530 admin
మదర్ సా టీచర్ కీచకం https://prajakshethrenews.com/మదర్-సా-టీచర్-కీచకం https://prajakshethrenews.com/మదర్-సా-టీచర్-కీచకం మదర్ సా టీచర్ కీచకం
ప్రజా క్షేత్ర్, లక్నో, జూలై 5
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మదరసా టీచర్, బంధువైన విద్యార్థినిని మూడేళ్లుగా గృహ నిర్బంధంలో ఉంచి, చిత్రహింసలకు గురిచేస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యంలో బాధితురాలు మూడుసార్లు గర్భం దాల్చగా, నిందితుడు తన భార్యతో కలిసి బలవంతంగా అబార్షన్లు చేయించాడు. ఈ అమానవీయ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన టీచర్‌ను అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళితే, బీహార్‌కు చెందిన 22 ఏళ్ల యువతిని ఐదేళ్ల క్రితం ఆమె బంధువైన 45 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మీరట్‌కు తీసుకొచ్చాడు. అనంతరం ఆమెను ఓ స్థానిక మదరసాలో చేర్పించి, తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. గత మూడేళ్లుగా ఆమెను బయటకు వెళ్లకుండా నిర్బంధించి, చిత్రహింసలు పెడుతూ లైంగికంగా వేధించాడు. బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నిస్తే, ఆమెకు మానసిక స్థితి సరిగా లేదని ఇరుగుపొరుగు వారిని నమ్మించేవాడు.జూన్ 9న బాధితురాలు ఇంటికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించగా, ఈ విషయం తెలుసుకున్న నిందిత దంపతులు ఆమెను మళ్లీ గదిలో బంధించారు. గురువారం మరోసారి ఆమెను తీవ్రంగా కొట్టడంతో, బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం బయటపడింది.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని రక్షించారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడైన టీచర్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ల కింద అత్యాచారం కేసు, అతడి భార్యపై నేరపూరిత కుట్ర కేసు నమోదు చేశారు. ఎస్పీ సిటీ ఆయుష్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ, "యువతి చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. నిందితుడైన టీచర్‌ను అరెస్ట్ చేశాం. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం," అని తెలిపారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని, వైద్య పరీక్షలు నిర్వహించామని, నివేదికల కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి భార్య కోసం గాలిస్తున్నారు.

]]>
Sat, 05 Jul 2025 18:09:00 +0530 admin
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు మావో మృతి https://prajakshethrenews.com/ఛత్తీస్గఢ్-రాష్ట్రం-బీజాపూర్-జిల్లాలో-ఎదురుకాల్పులు-మావో-మృతి https://prajakshethrenews.com/ఛత్తీస్గఢ్-రాష్ట్రం-బీజాపూర్-జిల్లాలో-ఎదురుకాల్పులు-మావో-మృతి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు మావో మృతి
ప్రజా క్షేత్ర్, రాయ్‌పూర్ జూలై 5 :
 ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక మావో మృతి చెందాడు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో డిఆర్‌జి, ఎస్‌టిఎఫ్ బలగాలు సంయుక్తంగా మావోల కోసం ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాల అలజడితో మావోలు కాల్పులు జరిపారు. భద్రతా ఎదురుకాల్పులు జరపడంతో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఎకె 47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

]]>
Sat, 05 Jul 2025 17:37:57 +0530 admin
అమ్మో...వాళ్లిద్దరు ఉగ్రవాదులు సామాన్యులు కాదే https://prajakshethrenews.com/అమ్మోవాళ్లిద్దరు-ఉగ్రవాదులు-సామాన్యులు-కాదే https://prajakshethrenews.com/అమ్మోవాళ్లిద్దరు-ఉగ్రవాదులు-సామాన్యులు-కాదే అమ్మో...వాళ్లిద్దరు ఉగ్రవాదులు సామాన్యులు కాదే
రాయచోటి ఉగ్రవాదుల లింక్...
కడప, జూలై :
ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టుతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. అబూబకర్ సిద్ధిఖీ, మహమ్మద్ అలీ అనే ఈ ఉగ్రవాదులు చాలాకాలంగా స్థానికుల్లో కలిసిపోయి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వీరి నుంచి పేలుడు పదార్థాలు, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ టెర్రరిస్టులు పలు కీలక కేసులో వాంటెడ్‌గా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే 30ఏళ్లుగా ఈ ఉగ్రవాదులు పోలీసుల కళ్లుగప్పి ఎలా తిరిగుతున్నారు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు, లుంబినీ పార్కు, గోకుల్ చాట్ బాంబు పేలుడు ఘటనలు గుర్తొస్తే.. ఇప్పటికీ వణుకు పుడుతుంది. ఆ తర్వాత దక్షిణాదిలో ఉగ్రదాడుల ఘటనలు చాలా వరకు తగ్గిపోయాయని భావిస్తుండగా.. తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపాటుకు గురిచేసే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏపీలోని రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేయడం అలజడి రేపింది. వీళ్లు చాలా ఏళ్లుగా స్థానికులుల్లో కలిసిపోయి చాప కింద నీరు లాగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలియడం ఆందోళనకు గురిచేస్తోంది. పని మీద బయటకి వెళ్తున్నట్లు చెప్పి, దేశంలో ఎక్కడెక్కడో ఉగ్రవాద దాడులకు ప్రయత్నిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా బాంబులను తయారు చేస్తున్నారు.జమ్మూ కాశ్మీర్‌లోని హహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన మారణహోమం తర్వాత.. ఇంటెలిజెన్స్ వర్గాలు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అప్రమత్తమై జరుపుతున్న తనిఖీల్లో భాగంగా రాయచోటిలో ఉగ్రవాదుల కదలికల గురించి వెలుగులోకి వచ్చింది. పహల్గామ్‌లో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. పేర్లు అడిగి, మతం నిర్ధరించుకుని మరీ భార్యా, పిల్లల కళ్ల ముందే భర్తలను చంపేశారు. పెళ్లి ముచ్చట ఇంకా తీరకముందే.. భర్తను కోల్పోయి మృతదేహం వద్ద నవవధువు రోధించిన దృశ్యాలు ఇంకా కళ్ల ముందే కదలాడుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. అంతేకాకుండా దేశంలో అంతర్గతంగా ఉగ్రకార్యకలాపాలపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఉగ్ర లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు టెర్రరిస్టులను అరెస్టు చేయడంతో దక్షిణ భారతం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి సొంత నియోజకవర్గంలో.. అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని కొత్తపల్లిలో అబూబకర్ సిద్ధిఖీ (అలియాస్ అమానుల్లా), మహమ్మద్ అలీ (అలియాస్ మన్సూర్) అనే ఇద్దరు ఉగ్రవాదులను తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా హై-ప్రొఫైల్ ఉగ్రవాద ఘటనల్లో నిందితులుగా ఉన్న వీరిద్దరిపై.. పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అయితే, మొత్తం కేసుల సంఖ్యపై స్పష్టమైన సమాచారం లేదు.

అబుబకర్ సిద్ధిక్‌, మహమ్మద్‌ అలీపై నమోదైన ప్రధాన కేసులు: 1995 నాగూర్ పోలీస్ స్టేషన్ హత్య, పేలుడు పదార్థాల కేసు: 1990ల మధ్యలో జరిగిన ఈ ఘటనలో అబుబకర్ సిద్ధిక్ ప్రమేయం ఉన్నట్లు తేలింది.1995 చింతద్రిపేట బాంబు పేలుడు: చెన్నైలోని హిందూ మున్నాని కార్యాలయం వద్ద జరిగిన ఈ బాంబు దాడి కేసులో ఇతడు నిందితుడు.1995 నాగూర్ పార్సెల్ బాంబు పేలుడు: టి. ముత్తుకృష్ణన్ హత్యకు దారితీసిన పార్సెల్ బాంబు కేసులో కూడా అబుబకర్ నిందితుడిగా ఉన్నాడు.

1999 కో-ఆర్డినేటెడ్ బాంబు పేలుళ్లు:

కేరళలోని కొన్ని ప్రాంతాలు సహా తమిళనాడులోని చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూర్ లాంటి ఏడు వేర్వేరు ప్రాంతాలలో జరిగిన ఈ వరుస బాంబు పేలుళ్ల కేసులలో అబుబకర్ సిద్ధిక్ కీలక నిందితుడు. అదే సమయంలో చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం (ఎగ్మూర్) వద్ద జరిగిన పేలుడు పేలుడులో అబుబకర్ సిద్ధిక్‌తో పాటు మహమ్మద్ అలీ నిందితుడిగా ఉన్నాడు.

2011 మధురై పైప్-బాంబు అమర్చే ప్రయత్నం:

బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వానీ రథయాత్రను లక్ష్యంగా చేసుకుని మధురైలో పైప్-బాంబు అమర్చే ప్రయత్నం కేసులో అబుబకర్ ప్రమేయం ఉంది. 2012 వేలూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య కేసులో కూడా అబుబకర్ నిందితుడు. 2013 బెంగళూరు బీజేపీ కార్యాలయం బాంబు పేలుడు: ఈ కేసు చార్జిషీట్‌లో అబుబకర్ సిద్ధిక్ 19వ నిందితుడిగా పేర్కొన్నారు. ఈ బాంబు దాడి కేసులో మన్సూర్ కూడా నిందితుడిగా ఉన్నాడు. దక్షిణాదిలో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ
కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించిన కీలక సమాచారం ప్రకారం, స్థానిక పోలీసుల సహాయంతో తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఈ ఇద్దరు వ్యక్తులు 'అలూమా' అనే ఉగ్రవాద సంస్థకు చెందినవారు. 'అలూమా' అనేది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ అని ప్రవీణ్ పేర్కొన్నారు. నిందితులు.. దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు.అబూబకర్ సిద్ధిఖీ, మహమ్మద్ అలీల ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులు ఉగ్రవాదానికి సంబంధించిన పుస్తకాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వారి ఇళ్లకు తాళాలు వేశారు. దర్యాప్తులో భాగంగా దాదాపు 50-60 ఐఈడీలు తయారు చేసేందుకు కావాల్సిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ తెలిపారు. ఒక సూట్‌కేసు బాంబు కూడా స్వాధీనం చేసుకుని, రాయచోటి డీఎస్పీ ఆఫీస్ దగ్గర యాంటీ టెర్రర్ టీమ్- ఆక్టోపస్ డిఫ్యూజ్ చేసింది.
ఇక్కడి నుంచే అంతా నడిపిస్తున్నారా..?
నిందితుల నుంచి పేలుడు పదార్థాలతో పాటు ఫ్యూయల్ ఆయిల్ కలిపిన అమ్మోనియం నైట్రేట్, గన్ పౌడర్‌లు, 20కిలో సూట్ కేసులో PETN-బేస్డ్ బాంబ్, పొటాసియం నైట్రేట్, పొటాసియం క్లోరైట్, పొటాసియం పర్మాంగనేట్, బాల్ బేరింగ్స్, నట్స్ బోల్ట్స్, క్లాక్ మెకానిజం, ప్రెషర్ స్విచ్‌లు, పుల్ స్విచ్‌లు, స్పీడ్ కంట్రోలర్స్, వాకీటాకీలు, రేడియో ఎక్విప్‌మెంట్, హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్, మొబైల్ ఫోన్లు, డిజిటల్ స్టోరేజీ డివైజ్‌లు, కోడింగ్ బుక్స్, దేశంలోని మూడు ప్రధాన నగరాలు, రైల్వే నెట్‌వర్క్‌ల మ్యాప్‌లు, మత సంబంధమైన పుస్తకాలు, చెక్ బుక్స్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తమిళనాడుకు చెందిన అబూబకర్ సిద్ధిఖీ, మొహమ్మద్ అలీలు గత కొన్నేళ్లుగా రాయచోటిలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ ఇక్కడే పెళ్లిళ్లు చేసుకుని స్థానికులుగా ఉండిపోయారు. చిన్న, చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అబుబకర్ రాయచోటిలోని కొత్తపల్లె ఉర్దూ స్కూల్ ఎదురుగా అమానుల్లా పేరుతో షాపు నిర్వహిస్తున్నాడు. మహబూబ్‌ బాషా వీధిలో మొహమ్మద్ అలీకి సొంత ఇల్లు ఉంది, చీరల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వీరు కొన్ని నెలలపాటు రాయచోటిలో ఉండకుండా వెళ్లిపోయి, వ్యాపారం కోసం బయటకు వెళ్లినట్లు స్థానికులతో చెప్పేవారని తెలుస్తోంది.
ఇన్నేళ్లు ఇలా తప్పించుకున్నారా?
నకిలీ గుర్తింపులు, స్థానిక సమాజంలో కలసిపోవడం: ఈ నిందితులు దశాబ్దాలుగా నకిలీ పేర్లతో ఆంధ్రప్రదేశ్‌లో సామాన్యుల్లా జీవించారు. చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ, స్థానికంగా పెళ్లిళ్లు చేసుకొని ఎవరికీ అనుమానం రాకుండా మారువేషంలో ఉన్నారు.
రాష్ట్రాల మధ్య సంచారం: వీరు తమిళనాడుకు చెందినవారైనా.. ఆంధ్రప్రదేశ్‌లోతో పాటు వివిధ రాష్ట్రాల్లో దాక్కున్నారు. వివిధ రాష్ట్రాల మధ్య నిఘా సమన్వయం లేకపోవడాన్ని ఉపయోగించుకున్నారు.పరిమిత నిఘా సమాచారం: దశాబ్దాలుగా ఈ ఉగ్రవాదుల కచ్చితమైన ఆచూకీపై ఎలాంటి సమాచారం లేదు. డిజిటల్ అడుగుజాడలు లేకుండా, తక్కువ ప్రొఫైల్‌ను నిర్వహించారు. దీంతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు.క్రియాశీల మిలిటెంట్లపై దృష్టి: భద్రతా దళాలు ప్రధానంగా క్రియాశీల ఉగ్రవాద కణాలు, పెద్ద నెట్‌వర్క్‌ల ఛేదనపై దృష్టి సారించాయి. ఇది తక్కువ ప్రొఫైల్‌లో ఉన్నవారికి తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చింది.మారుతున్న ఉగ్రవాద వ్యూహాలు: ఉగ్రవాదులు ఆండర్‌గ్రౌండ్‌కి వెళ్లి, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లకు దూరంగా ఉండటం వంటి కొత్త వ్యూహాలను అవలంబించడం నిఘాను కష్టతరం చేసింది.1995 నుంచి దేశంలోని వివిధ నగరాల్లో జరిగిన ఉగ్ర బాంబు పేలుళ్లకు లింక్ ఉన్న ప్రధాన నిందితులని ఐబీ గుర్తించింది. దీంతో 20 ఏళ్లయినా చట్టం నుంచి తప్పించుకోలేరనడానికి ఇది నిదర్శనం అని డీఐజీ చెప్పారు.
ఈ కేసులో అబుబకర్ సిద్ధిఖీ భార్య షేక్ సైరాభాను, మహ్మద్ అలీ భార్య షేక్ షమీమ్‌లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.ఈ అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. రాయచోటిలో నిందితులకు సహకరిస్తున్న వారిపై కూడా విచారణ చేస్తున్నారు. ఐసిస్, అలూమా సంస్థలు ఒకే విధమైన ఆలోచనలతో పనిచేస్తాయని పోలీసులు తెలిపారు. తాజాగా అరెస్టైన ఉగ్రవాదులు.. మరికొందరికి ఉగ్రవాద శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. వీరిద్దరితో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదుల కుటుంబ సభ్యులకు పేలుడు పదార్థాల గురించి తెలుసా? లేదా? అనే విషయంపై కూడా విచారణ జరుగుతోందని అధికారులు వెల్లడించారు.ఈ ఇద్దరి అరెస్ట్ తర్వాత స్థానికులు ఆందోళనలో ఉన్నారు. వారిని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా రాయచోటి చుట్టూ 6 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేశారు. సమాజంలో ఒకరిగా కలిసిపోయి మేక వన్నె పులుల్లా ప్రజలకే చేటు చేస్తున్నారు కర్కశ టెర్రరిస్టులు.ఉగ్రవాదులకు మతం, జాతి ఏదీ లేదని.. నిర్దాక్షిణ్యంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఇలాంటి ఘోర నేరాలకు పాల్పడినవారు దశాబ్దాల తరబడి చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతుంటే.. ఇంటెలిజెన్స్ వ్యవస్థల పని తీరుపైనా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

]]>
Sat, 05 Jul 2025 08:49:26 +0530 admin
ఉగ్రవాదుల ఇళ్లనుంచి భారీ పేలుడు పదార్ధాలు స్వాధీనం https://prajakshethrenews.com/ఉగ్రవాదుల-ఇళ్లనుంచి-భారీ-పేలుడు-పదార్ధాలు-స్వాధీనం https://prajakshethrenews.com/ఉగ్రవాదుల-ఇళ్లనుంచి-భారీ-పేలుడు-పదార్ధాలు-స్వాధీనం ఉగ్రవాదుల ఇళ్లనుంచి భారీ పేలుడు పదార్ధాలు స్వాధీనం
పోలీసులపై దాడి చేసిన నిందితుల భార్యలకు రిమాండ్
ప్రజా క్షేత్ర్,  రాయచోటి :
రాయచోటి పట్టణంలో నిర్వహించిన ఉగ్రవాదుల ఇంటి సోదాలపై కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్  అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు  వివరాలు వెల్లడించారు.2025 జూన్ 30న తమిళనాడు పోలీసులు పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్లను అమలు చేశారు. ఈ నిందితులు 1999 నుండి పరారీలో ఉండగా, వారు గత 20 సం. గా రాయచోటి పట్టణంలో తప్పుడు పేర్లతో (అబూ బకర్ సిద్ధిక్ – అమానుల్లా పేరుతో, మహమ్మద్ అలీ – మంసూర్ పేరుతో) నివసిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందిన తర్వాత, అన్నమయ్య జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి, రాయచోటిలోని కొత్తపల్లి  మహబూబ్ బాషా వీధిలో ఉన్న నిందితుల ఇళ్లను చట్టపరమైన విధానాల ప్రకారం శోధించారు. ఈ గృహశోధనలో భారీ మొత్తంలో విస్ఫోటక పదార్థాలు లభించాయి, వీటిని ఉపయోగించి పేలుడు పరికరాలు  తయారు చేయవచ్చు. ఈ పదార్థాలు భారతదేశ పౌరుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే స్థాయిలో ఉన్నాయి. ఈ శోధనతో దేశ స్థాయిలో ప్రమాదం నివారించారు.  అబూ బకర్ సిద్ధిక్ @ అమానుల్లా మరియు మహమ్మద్ అలీ @ మంసూర్ అనే ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించి ఈ సామగ్రిని పోలీస్ బృందం స్వాధీనం చేసుకుంది. వీరు "అల్ ఉమ్మా" అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం కలిగినవారిగా గుర్తించారు. నిందితులనుంచి ఫ్యూయల్ ఆయిల్తో కలిపిన అమ్మోనియం నైట్రేట్ – ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్, స్లర్రీ ఎక్స్ప్లోసివ్ – (నైట్రో గ్లిసరిన్ /  అయ్యి ఉండవచ్చు) తో నిండి ఉండే బాంబు,  20 కేజీల లో మరొక సూటికస్ అయ్యి ఉండవచ్చు, ఒక బాక్స్ – ఐ ఈ డి అయ్యి ఉండవచ్చు. పొటాషియం నైట్రేట్, పొటాషియం క్లోరేట్, పొటాషియం పెర్మాంగనేట్, గన్ పౌడర్,  డ్యాగర్, కొడవళ్లు, టైమర్ల కోసం గడియార యంత్రాలు, పుల్ స్విచ్లు, ప్రెషర్ స్విచ్లు, స్పీడ్ కంట్రోలర్లు, గ్యాస్ ట్యూబ్ అరెస్టర్లు పేలుళ్ల సమయంలో గాయాలకు ఉపయోగించే బాల్ బెరింగ్స్, నట్-బోల్టులు, మానిటరింగ్ కోసం బైనాక్యూలర్స్, వాకీ-టాకీలు, రేడియో పరికరాలు, అనేక మొబైల్ ఫోన్లు, అనేక చెక్ పుస్తకాలు స్వాదీనం చేసుకున్నారు.  ఆర్థిక లావాదేవీల సమాచారం కుడా లభించింది. డిజిటల్ స్టోరేజ్ పరికరాలు, ముస్లిం సాహిత్యం, భారతదేశంలోని నగరాల మ్యాపులు, టైమింగ్ సర్క్యూట్ల మాన్యువల్స్, కోడింగ్ బుక్స్ కుడా లభించాయి. ఈ ఇంటి శోధన సందర్భంగా, నిందితుల భార్యలు  సైరా భాను (అబూ బకర్ సిద్ధిక్ భార్య)  షేక్ షమీం (మహమ్మద్ అలీ భార్యలు) పోలీసులపై ప్రతిఘటన చేయడమే కాకుండా మహిళా పోలీసులపై దాడికి యత్నించారు. ఈ ఘటనపై రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు చేసారు. సైరా భాను, షమీం లు పోలీసులపై దాడికి ప్రయత్నించినందుకు అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు రిమాండ్ కి పంపారు. వీరికి నిందితుల ఉగ్రచర్యలపై ఎంత సంబంధముందో అనే దానిపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.

]]>
Fri, 04 Jul 2025 21:56:08 +0530 admin
మణిపూర్ లో కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు.. నలుగురు మృతి https://prajakshethrenews.com/మణిపూర్-లో-కారుపై-గుర్తు-తెలియని-దుండగులు-కాల్పులు-నలుగురు-మృతి https://prajakshethrenews.com/మణిపూర్-లో-కారుపై-గుర్తు-తెలియని-దుండగులు-కాల్పులు-నలుగురు-మృతి మణిపూర్ లో కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు.. నలుగురు మృతి

ప్రజా క్షేత్ర్, మణిపూర్  జూన్ 30 ;మణిపూర్ చురాచాంద్ జిల్లా మాంగ్‌జంగ్ గ్రామంలో సోమవారం గుర్తు తెలియని దుండగులు కారుపై కాల్పులు జరపడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు చెప్పారు. చురాచాంద్‌పూర్ పట్టణానికి ఏడు కిమీ దూరంలో మాంగ్‌జంగ్ గ్రామం ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. మృతులు థెంఖోథాంగ్ హావోకిప్ అలియాస్ థాపి (48)సెయిఖోగిన్ (34)లెంగౌహావో (35)ఫల్‌హింగ్ (72) గా గుర్తించారు. సంఘటన ప్రదేశం నుంచి 12 ఖాళీ తూటాలను సేకరించారు. ఈ దాడికి బాధ్యులమంటూ ఇంతవరకు ఎవరూ వెల్లడించలేదు. పోలీసులుఅదనపు భద్రతా బలగాలు ఆ ప్రదేశానికి వెళ్లి దర్యాప్తు చేపట్టాయి.

]]>
Mon, 30 Jun 2025 20:23:06 +0530 admin
పాశ మైలారం పారిశ్రామిక వాడ సిగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు https://prajakshethrenews.com/పాశ-మైలారం-పారిశ్రామిక-వాడ-సిగాచి-కెమికల్స్-పరిశ్రమలో-భారీ-పేలుడు https://prajakshethrenews.com/పాశ-మైలారం-పారిశ్రామిక-వాడ-సిగాచి-కెమికల్స్-పరిశ్రమలో-భారీ-పేలుడు  పాశ మైలారం పారిశ్రామిక వాడ సిగాచి కెమికల్స్  పరిశ్రమలో భారీ పేలుడు

                           

ఎనిమిది మంది కార్మికులు మృతి

                 ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి

ప్రజా క్షేత్ర్, పటాన్‌చెరు జూన్ ౩0 :

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలంలోని పాశ మైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్‌ పార్కులోని సిగాచి కెమికల్స్   పరిశ్రమలో సోమవారం ఉదయం ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయింది. దీంతో ఎనిమిది మంది కార్మికులు మృతిచెందారు. ఘటనా స్థలంలో ఐదుగురు మరణించాగాదవాఖానలో మరో ముగ్గురురు చనిపోయారు. మరో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.సోమవారం ఉదయం 6 గంటలకు రియాక్టర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. పేలుడు ధాటికి రియాక్టర్‌ వద్ద పనిచేస్తున్న కార్మికులు100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ప్రొడక్షన్‌ విభాగం కుప్పకూలింది. మరో భవనానికి బీటలు వారింది. ఉదయం షిఫ్ట్‌కు వచ్చిన కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. పేలుడు శబ్ధం వినిపించడంతో కార్మికులు బయటకు పరుగులుతీశారు. మంటల్లో చిక్కుకున్న 50 నుంచి 60 మంది కార్ముకులను బయటకు తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడిన కార్మికులను ప్రైవేటు దవాఖానకు తరలించారు. మిగితా కార్మికుల విషయం వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద స్థలాన్ని సంగారెడ్డి కలెక్టర్ ప్రావిణ్యఎస్పీ పంకజ్ తదితరులు పరిశీలించారు. సహాయక చర్యలో ఫైర్‌రెవన్యూపోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.కాగాప్రమాదంతో రసాయన పరిశ్రమ పరిసరాలకు ఘాటైన వాసనలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు ఇబ్బుందులు పడుతున్నారు. కంపెనీలో ఒడిశాఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు పనిచేస్తున్నారు. విధులకు వెళ్లిన కార్మికులకు వారి కుటుంబ సభ్యులు ఫోన్లు చేస్తున్నారు. అయితే కొందరి ఫోన్లు పనిచేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరాతీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

 

]]>
Mon, 30 Jun 2025 19:44:28 +0530 admin
నా కూతురు చనిపోవడానికి కారణం అతనే: స్వేచ్చ తండ్రి https://prajakshethrenews.com/నా-కూతురు-చనిపోవడానికి-కారణం-అతనే-స్వేచ్చ-తండ్రి https://prajakshethrenews.com/నా-కూతురు-చనిపోవడానికి-కారణం-అతనే-స్వేచ్చ-తండ్రి నా కూతురు చనిపోవడానికి కారణం అతనే: స్వేచ్చ తండ్రి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కారణమని స్వేచ్చ తండ్రి ఆరోపించాడు. భర్తతో విడిపోయాక స్వేచ్ఛ పూర్ణచంద్రరావుతో ఉంటోందన్నారు. స్వేచ్ఛ, పూర్ణచంద్రరావు మధ్య విబేధాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. పూర్ణతో కలిసి ఉండలేను నాన్న అని తనకి జూన్ 26న ఫోన్ చేసిందన్నారు. ఈ విషయంలోనే నా కూతురు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. నా కూతురు ఆత్మహత్యకు కారణమైన పూర్ణను కఠినంగా శిక్షించాలని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

]]>
Sun, 29 Jun 2025 09:01:09 +0530 admin
తాటికల గ్రామంలో అమానుషం https://prajakshethrenews.com/తాటికల-గ్రామంలో-అమానుషం https://prajakshethrenews.com/తాటికల-గ్రామంలో-అమానుషం తాటికల గ్రామంలో అమానుషం
మహిళను వివస్త్రను చేసి..జననాంగంలో జీడిరసం పోసిన గ్రామస్తులు

ప్రజా క్షేత్ర్, హన్మకొండ :

వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసినా ఘటన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం తాటికల గ్రామంలో చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా ధర్మసా గర్ మండలం తాటికాయల గ్రామంలో ఐదు రోజుల కిందట జరిగిన ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తోందం టూ అనుమానం తో కొందరు వ్యక్తులు ఓ వివాహితను వివస్త్రను చేసి జననాంగంలో జీడిరసం పోసి విచక్షణారహితంగా దాడి చేశారు.  విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకా రం.. తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వారికి ముగ్గురు పిల్లలు. అయితే సమీప బంధువైన ఓ వివాహితతో అతను వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. సుమారు పది రోజులు ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య స్వగ్రామమైన తాటి కాయలకు వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు ఆ ఇద్దరినీ వెతికి పట్టుకొని ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకువచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికీ గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసారు.  జననాంగంపై జీడి రసం పోశారు. 'తప్పు చేశా ను.. క్షమించండి' అంటూ బాధిత మహిళ వేడుకున్నా వినకుండా దాడి చేశారు. జన నాంగంలోనుంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వదల్లేదు. ఆ తరువాత ఆ ఇద్దరినీ ఏం చేశారో ఇప్పటివరకు ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం లేదని తెలిసింది. అసలు ఆ ఇద్దరూ ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది.

]]>
Sun, 29 Jun 2025 08:55:55 +0530 admin
రూ. 20 లక్షల విలువైన 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం https://prajakshethrenews.com/రూ-20-లక్షల-విలువైన-24-ఎర్రచందనం-దుంగలు-స్వాధీనం https://prajakshethrenews.com/రూ-20-లక్షల-విలువైన-24-ఎర్రచందనం-దుంగలు-స్వాధీనం రూ. 20 లక్షల విలువైన 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
 ఒకరు అరెస్టు
 రవాణాకు ఉపయోగించిన కారు స్వాధీనం
 రంగంపేట వద్ద సంఘటన
ప్రజా క్షేత్ర్, తిరుపతి :
రంగంపేట మార్గంలో అక్రమ రవాణా చేస్తున్న 24 ఎర్రచందనం దుంగలతో పాటు, వాటిని తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకుని, ఒకరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్ ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ ఎస్ ఐ లింగాధర్ టీమ్ శుక్రవారం నుంచి భాకరాపేట సెక్షన్ నాగపట్ల బీటు పరిధిలో కూంబింగ్ చేపట్టారు. శనివారం తెల్లవారుజామున రంగంపేట - శ్రీనివాస మంగాపురం రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా వేగంగా వచ్చిన ఒక కారు పోలీసులను చూసి కారు ఆపి ఒక వ్యక్తి దిగి పారి పోతుండగా  అతనిని చుట్టుముట్టి అరెస్టు చేశారు. అతనిని తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కారులో 24ఎర్రచందనం దుంగలు ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 20 లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు. దుంగలు సహా అరెస్టు అయిన వ్యక్తిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. డీఎస్పీ శ్రీనివాస రెడ్డి అతనిని విచారించగా, ఎస్ ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

]]>
Sun, 29 Jun 2025 08:41:55 +0530 admin
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో మరో దారుణం https://prajakshethrenews.com/పశ్చిమబెంగాల్-రాజధాని-కోల్కతాలో-మరో-దారుణం https://prajakshethrenews.com/పశ్చిమబెంగాల్-రాజధాని-కోల్కతాలో-మరో-దారుణం పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో మరో దారుణం
   ఆర్జీకర్ ఆస్పత్రికలో జూనియర్ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం
ప్రజా క్షేత్ర్, కోల్‌కతా జూన్ 27 : పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఆర్జీకర్ ఆస్పత్రికలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన దారుణం మరువక ముందే మరో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కస్బాలోని సౌత్ కోల్‌కతాలా కళాశాలలో ఈ నెల 25వ తేదీన ముగ్గురు వ్యక్తులు సెక్యూరిటీ రూంలో బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టారు. వారిలో ఇద్దరు సిబ్బంది కాగా, మరొకరు పూర్వ విద్యార్థి అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన మరుసటి రోజు దీనిపై కేసు నమోదు కాగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.పెళ్లికి నిరాకరించిందనే నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధితురాల వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమె నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. నిందితులలో ఒకరు మోనోజిత్ మిశ్రా (31) తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో రాజకీయంగా దుమారం రేగింది. మరో ఇద్దరు జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20) అని తెలుస్తోంది. నిందితులకు ప్రస్తుతం ఐదు రోజుల కస్టడీ విధించారు. ఈ ఘటనపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మమతా బెనర్జీ పాలనలో ఆడవాళ్లకు భద్రత కరువైందని.. పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని బిజెపి నేత అమిత్ మాలవీయా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

]]>
Fri, 27 Jun 2025 22:36:17 +0530 admin
అమ్మకానికి భార్య, భర్తల రోమాన్స్... దంపతుల బూత్ బిజినెస్ https://prajakshethrenews.com/అమ్మకానికి-భార్య-భర్తల-రోమాన్స్-దంపతుల-బూత్-బిజినెస్ https://prajakshethrenews.com/అమ్మకానికి-భార్య-భర్తల-రోమాన్స్-దంపతుల-బూత్-బిజినెస్
అమ్మకానికి భార్య, భర్తల రోమాన్స్
దంపతుల బూత్ బిజినెస్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 26 :
హైదరాబాద్ అంబర్‌పేట్‌లో ఇద్దరు దంపతులు వెర్రి చేష్టలకు పాల్పడ్డారు. తమ ఇంటి టెర్రస్‌ను అడ్డాగా చేసుకొని తమ ప్రైవేట్ వీడియోలను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసి పోలీసుల వరకు వెళ్లింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి దంపతులు ఉంటున్న ఇంటిని రైడ్ చేశారు. వీడియోలు చిత్రీకరిస్తున్న కెమెరాతో పాటు సామాగ్రిని స్వాధీనం చేసుకుని అంబర్‌పేట పోలీసులకు ఇద్దరినీ అప్పగించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతను గతంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేసేవాడు. ఇప్పుడు అందులో పెద్దగా డబ్బులు రాకపోవడంతో ఈ పాడు వ్యవహారానికి తెరలేపాడు. నాలుగు నెలల నుంచి  తన భార్య తో గడుపుతున్న ప్రైవేట్ వీడియోలను కెమెరాలో చిత్రీకరించి వాటిని ఆన్లైన్లో వీక్షించే వినియోగదారులకు పేమెంట్ చెల్లిస్తేనే చూసే విధంగా వ్యాపారం మొదలుటపెట్టాడు. ఇన్‌స్ట్రాగ్రామ్ పేజీలో లైవ్ స్ట్రీమింగ్‌ని సైతం ఏర్పాటు చేశారు. క్యాబ్ డ్రైవర్ కు డ్రైవింగ్ చేసి చిరాకేసిందేమో కానీ.. చివరికి ఈ పని ప్రారంభించాడు. ఇదొక్కటే కాదు.. వారి శృంగార వీడియోలను అమ్మడం..   శృంగార చాట్ సౌకర్యాలను కూడా అందిస్తున్నారు. నాలుగు నెలలుగా వీరి బిజినెస్ పెరిగిపోయింది. లింక్ రెండు వేలకు చొప్పున అమ్ముతున్నారు. ఇలాంటి లింకుల్ని కొనుగోలు చేసి చూసేవారు ఎక్కవైపోయారు. ఆ నోటా ఈ నోటా పడి పోలీసులకు చేరింది. చివరికి పోలీసులు రెయిడ్ చేశారు. పట్టుకున్నారు. కానీ అదేమంత పెద్ద నేరం కాదు. రేపు బయటకు వచ్చి మళ్లీ అదే చేసుకుంటారు. ఈ జంట బరితెగింపు సమాజాన్ని ఆశ్చర్య పురస్తోంది. నిజానికి ఇలాంటి లైవ్ సర్వీసుల్ అందించే యాప్స్ ఉంటాయి. వాటి సంగతి ఈ జంటకు తెలియదేమో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మారుతున్న సమాజంలో.. డబ్బు సంపాదన కోసం ఎలాంటి పనులు అయినా చేయడానికి కొంత మంది సిద్ధపడుతున్నారని ఇలాంటి వారిని పట్టుకున్నప్పుడు అందరూ భావిస్తున్నారు. ఇంటర్నెట్ లో యూట్యూబ్ వీడియోలు పెట్టి డబ్బులు సంపాదించేవారు వారు ఉంటారు. విదేశాల్లో ఇలా  జంటలు లేదా మహిళలు.. తమ ప్రైవేటు వ్యవహారాలను.. బెడ్ రూం పనుల్ని  ప్రైవేటుగా అమ్మకానికి పెట్టి  వ్యాపారం చేస్తూంటారు.  మన దేశంలో అలాంటి సంస్కృతి లేదు.కానీ ఇటీవలి కాలంలో ఇలాంటి వారు పెరిగిపోతున్నారు.  ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోని వెబ్ సైట్లతో ఒప్పందాలు చేసుకుని ఇలాంటి శృంగార వీడియోలు తీసేందుకు స్టూడియోలు కూడా ఏర్పా టు చేస్తున్న ఘటనలు తరచు వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల కిందట అనంతపురం జిల్లాలోనూ పోలీసులు ఓ ముఠాను పట్టుకున్నారు. ఇప్పుడీ జంట స్వతంత్రంగా తమ వ్యాపారాన్ని ఇలా చేస్తూ దొరికిపోయారు. అయితే వారిపై ఐటీ చట్టం ప్రకారం మాత్రమే కేసులు పెట్టగలరని న్యాయనిపుణులు చెబుతున్నారు.  తమ వీడియోలను లైవ్ స్ట్రీమింగ్ చూడాలి అనుకునేవారు 2000 రూపాయలు చెల్లించాల్సిందిగా నిబంధన పెట్టి నాలుగు నెలలుగా ప్రతిరోజు ఈ తరహా వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు.అయితే ఇది సాధారణ వీక్షకులు చూసేందుకు వీలు లేకుండా కేవలం ఎవరైతే డబ్బులు చెల్లిస్తారో వారు మాత్రమే ఈ వీడియోలను చూసే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కొడుకు బీటెక్ చదువుతుండగా.. కుమార్తె ఇంటర్ చదువుతున్నట్లు తెలిపారు. అయితే తమ తల్లిదండ్రులు చేస్తున్న ఈ బాగోతం పిల్లలకు తెలియదు అని పోలీసులు చెబుతున్నారు. వీరు చేస్తున్న వీడియోల బాగోతం స్థానిక వ్యక్తుల ద్వారా టాస్క్ ఫోర్స్ వారికి తెలియడంతో… రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకుని అంబర్‌పేట్ పోలీసులకు అప్పగించారు.

]]>
Thu, 26 Jun 2025 19:56:15 +0530 admin
రైతుభరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేసిన కొడుకు https://prajakshethrenews.com/రైతుభరోసా-డబ్బులు-ఇవ్వలేదని-తండ్రి-నాలుక-కోసేసిన-కొడుకు https://prajakshethrenews.com/రైతుభరోసా-డబ్బులు-ఇవ్వలేదని-తండ్రి-నాలుక-కోసేసిన-కొడుకు రైతుభరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేసిన కొడుకు
ప్రజా క్షేత్ర్, మెదక్ , జూన్ 25  :
రైతు భరోసా కుటుంబంలో చిచ్చు పెట్టింది. ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు తనకు ఇవ్వలేదని కుమారుడు దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి నాలుక కోసేశాడు. ఈ దుర్ఘటన మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం
ఔరంగాబాద్ తండాలో జరిగింది. తండాలో బానోత్ కీర్యా అనే రైతుకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి. ఎకరా భూమి ఉన్నందున ప్రభుత్వం తరఫున రూ.6000 అకౌంట్‌లో జమ అయ్యాయి. ఈ డబ్బుల విషయంలో కుటుంబంలో వివాదం తలెత్తింది. తనకు ఈ డబ్బులు ఇవ్వాలని చిన్న కుమారుడు సంతోష్‌ అడిగాడు. ఇంతలో ఆరోగ్యం బాగాలేదని రెండు వేల రూపాయలను తండ్రి ఖర్చుపెట్టేశాడు. తండ్రి 2 వేల రూపాయలు ఖర్చు పెట్టేయడంపై చిన్న కుమారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను డబ్బులు అడిగితే ఎందుకు ఖర్చు చేశావని గొడవ పడ్డాడు. కోపంతో తండ్రిపై దాడి చేశాడు. అక్కడితో ఆగిపోకుండా తండ్రి తిరిగి సమాధానం చెబుతున్నాడని గొడ్డలితో నాలుక కోసేశాడు.  స్థానికులు కీర్యాను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్న కుమారుడు ఇలా తన భర్తపై దాడి చేసి నాలుక కోశాడని కీర్యా భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

]]>
Wed, 25 Jun 2025 23:06:27 +0530 admin
సిట్ కస్టడీకి కాకాణి https://prajakshethrenews.com/సిట్-కస్టడీకి-కాకాణి https://prajakshethrenews.com/సిట్-కస్టడీకి-కాకాణి సిట్ కస్టడీకి కాకాణి
ప్రజా క్షేత్ర్, నెల్లూరు :

 గ్రావెల్ అక్రమ రవాణా కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కృష్ణపట్నం పోర్టు పీఎస్ కు తరలించారు. ఇవాళ, రేపు సిట్ అధికారులు కాకాణిని ప్రశ్నించనున్నారు. గ్రావెల్ అక్రమ రవాణా కేసులో ఎంపీ మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేశారనే కేసులో కాకాణి  ఏ2గా ఉన్నారు.

]]>
Wed, 25 Jun 2025 19:45:49 +0530 admin
మహిళా రైతు దారుణ హత్య…. పొలంలో పని చేస్తుండగా కత్తితో దాడి https://prajakshethrenews.com/మహిళా-రైతు-దారుణ-హత్య-పొలంలో-పని-చేస్తుండగా-కత్తితో-దాడి https://prajakshethrenews.com/మహిళా-రైతు-దారుణ-హత్య-పొలంలో-పని-చేస్తుండగా-కత్తితో-దాడి మహిళా రైతు హత్య….
పొలంలో పని చేస్తుండగా కత్తితో దాడి
బంగారు ఆభరణాలు  అపహరణ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లిలో ఘటన
ప్రజా క్షేత్ర్, గజ్వేల్ :

పొలంలో ఒంటరిగా పని చేసుకుంటున్న మహిళా రైతును హత్య చేసి, ఆమె మెడలోని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్  మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. గజ్వేల్  సీఐ సైదా తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నల్ల సత్తమ్మ(70), భర్త కిష్టారెడ్డి చనిపోవడంతో కొడుకుల వద్ద ఉంటూ చేసులో పని చేసేది. రోజూ పొలం వెళ్లి పని చేసుకుని తిరిగి వచ్చేది. పొలం రైల్వే ట్రాక్  పక్కన ఉండడంతో జన సంచారం తక్కువగా ఉంటుంది. మంగళవారం ఆమె పొలంలో పని చేస్తుండగా ఎవరో కత్తితో దాడి చేయగా, ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ తరువాత మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసు, చెవి కమ్మలు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సత్తమ్మను రక్తపు మడుగులో ఉండడాన్ని గమనించి, విషయాన్ని అతని కొడుకులకు తెలియజేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

]]>
Wed, 25 Jun 2025 14:52:11 +0530 admin
పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం... తల్లీ, కొడుకు మృతి https://prajakshethrenews.com/పిల్లలతో-సహా-తల్లి-ఆత్మహత్యాయత్నం-తల్లీ-కొడుకు-మృతి https://prajakshethrenews.com/పిల్లలతో-సహా-తల్లి-ఆత్మహత్యాయత్నం-తల్లీ-కొడుకు-మృతి పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం
తల్లీ, కొడుకు మృతి
కూతురును కాపాడిన గ్రామస్తులు
ప్రజా క్షేత్ర్,  పెందుర్తి :
విశాఖ పెందుర్తిలో విషాదం చోటు చేసుకుంది. సత్తివానిపా లెంలో కుటుంబ కలహాలతో కొడుకు, కూతురుతో కలిసి ఓ తల్లి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లి, కుమారుడు మృతి చెందారు. కూతురు ప్రాణాలతో బయటప డింది. స్థానికులు కాపాడి ఆసుప త్రికి తరలించారు. సత్యవాణిపాలెం గ్రామానికి చెందిన కొల్లు పవన్, గీత భార్యాభర్తలు. వీరికి కుమారుడు భవిష్యన్ మణికంఠ, కుమార్తె మోక్షశ్రీ లు ఉన్నారు. పవన్ మద్యానికి బానిస అవవడంతో.. గీతతో తరచుగా గొడవలు అయ్యేవి. ఈ క్రమంలో గీత తన ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి అనంతరం ఆమె కూడా దూకింది. ఈ ఘటనలో గీత, మణికంఠ మృతి చెందారు. మోక్షశ్రీ బావిలో మెట్టును పట్టుకొని ఉండటంతో ప్రాణాలతో బయటపడింది. గ్రామస్తులు మోక్షశ్రీ కాపాడారు. విషయం తెలుసుకున్న పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు.

]]>
Tue, 24 Jun 2025 19:49:39 +0530 admin
బ్యాంక్ మేనేజర్ భార్యను చంపాలనుకున్నాడు? https://prajakshethrenews.com/బ్యాంక్-మేనేజర్-భార్యను-చంపాలనుకున్నాడు https://prajakshethrenews.com/బ్యాంక్-మేనేజర్-భార్యను-చంపాలనుకున్నాడు బ్యాంక్ మేనేజర్ భార్యను చంపాలనుకున్నాడు?
ప్రజా క్షేత్ర్, కర్నూలు, జూన్ 24 :
గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దారుణ హత్య వెనుక బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ప్రధాన కుట్రదారుడిగా పోలీసులు నిర్ధారించారు. కేవలం తేజేశ్వర్‌ను హత్య చేయడమే కాకుండా, తన భార్యను కూడా అంతమొందించాలని తిరుమలరావు పథకం పన్నినట్లు తాజా విచారణలో తేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.వివరాల్లోకి వెళితే, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు, ఐశ్వర్య అనే మహిళతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వివాహమై ఎనిమిదేళ్లు గడిచినా తనకు సంతానం లేకపోవడంతో, ఐశ్వర్య ద్వారా పిల్లల్ని కనాలని తీవ్రంగా ఆశించాడు. ఈ క్రమంలో, తన అక్రమ సంబంధానికి, తన కోరికకు అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఐశ్వర్య భర్త అయిన సర్వేయర్ తేజేశ్వర్‌ను, అలాగే తన భార్యను కూడా శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని తిరుమలరావు నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఒక సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.జూన్ 17వ తేదీన, నగేష్, పరుశురాం, రాజు అనే ముగ్గురు వ్యక్తులు ల్యాండ్ సర్వే పని ఉందనే నెపంతో తేజేశ్వర్‌ను కారులో తీసుకెళ్లారు. పథకం ప్రకారం, అంతకుముందు రోజే బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేసిన తిరుమలరావు, తేజేశ్వర్ హత్య జరిగిన తర్వాత సుపారీ గ్యాంగ్‌కు రూ.2 లక్షలు ముట్టజెప్పాడు. తేజేశ్వర్‌ను కత్తితో అత్యంత దారుణంగా పొడిచి చంపిన హంతకులు, మృతదేహాన్ని కర్నూలు శివారు ప్రాంతంలో పడేసి, తిరుమలరావుకు సమాచారం అందించారు.హత్య అనంతరం ఐశ్వర్యతో కలిసి లడఖ్‌కు పారిపోవాలని తిరుమలరావు ప్లాన్ చేశాడు. ఈ ప్రణాళికలో భాగంగా, ఐశ్వర్య తన తల్లికి ఫోన్ చేసి, ప్రయాణానికి అవసరమైన కొన్ని దుస్తులు కూడా తెప్పించుకున్నట్లు తెలిసింది. పోలీసులు ఐశ్వర్యను ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడైన తిరుమలరావు లడఖ్‌కు పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, దర్యాప్తు కొనసాగుతోంది.

]]>
Tue, 24 Jun 2025 19:23:47 +0530 admin
వెలుగులోకి నిత్య పెళ్లి కూతురి మోసాలు https://prajakshethrenews.com/వెలుగులోకి-నిత్య-పెళ్లి-కూతురి-మోసాలు https://prajakshethrenews.com/వెలుగులోకి-నిత్య-పెళ్లి-కూతురి-మోసాలు వెలుగులోకి నిత్య పెళ్లి కూతురి మోసాలు
ప్రజా క్షేత్ర్, ఏలూరు, జూన్ 24 :
పెళ్ల‌యి విడాకులు తీసుకున్నారా.. లేదా వివాహం కాలేద‌న్న డిఫ్రెష‌న్లో ఉన్నారా.. అయితే మీకు ఫోన్ ద్వారా కానీ, ఎవ‌రైనా పెళ్లిళ్ల బ్రోక‌ర్ల ద్వారా కానీ మీకు చ‌క్క‌ని అమ్మాయి ఉంది.. చాలా మంచిది.. చాలా అందంగా ఉంటుంది.. అంటూ చెబితే మీరు అమ్మాయి ఫోటోచూసి ఉబ్బిత‌బ్బిబ్య‌య్యి పోకండి.. ఇలా చాలా మందే ఇలా మోస‌పోయారు.. ఈ విష‌యం ఎవ‌రో చెబితే పెద్ద విష‌యం కాదు కానీ స్వ‌యంగా మోస‌పోయిన బాధితులే బాబోయ్ ఈ నిత్య పెళ్లి కూతురు వ‌ల‌లో ప‌డి మోస‌పోయామ‌ని ఏకంగా జిల్లా ఎస్పీకే ఫిర్యాదు చేశారు.అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా ఎస్సీ కార్యాల‌యంలో  నిర్వ‌హించిన‌ గ్రీవెన్స్ కు నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు పట్టణాలకు చెందిన ముగ్గురు  బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు. తమలాగ మరి ఎవరూ మోసపోకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసామన్నారు. నిత్య పెళ్లికూతురు కాజేసిన సొమ్మును తిరిగి తమకు ఇప్పించాలని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గ నీలిమ, ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ, కళ్యాణ్ లు ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ గా చేసుకుని మోసం చేస్తున్నార‌ని ఇటీవ‌లే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కేసు న‌మోద‌య్యింది.. అయితే ఈ కేసు విష‌యంలో న్యాయం కోరుతూ  నిత్య పెళ్లికూతురిపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణరావుకు బాధితులు సోమ‌వారం ఫిర్యాదు చేశారుత‌మ లాంటి వారిని మోసం చేసి 12 పెళ్లిళ్లు చేసుకుంద‌ని,  ఆ త‌రువాత త‌మ వ‌ద్ద మొత్తం డ‌బ్బు,బంగారం లాగేసి ఆపై సెక్షన్ 498 కేసులు పెట్టి వేధిస్తోంద‌ని వారంతా జిల్లా ఎస్పీ వ‌ద్ద వాపోయారు..  ఈ నిత్య పెళ్లికూతురు వ‌ల‌లో ప‌డి మోస‌పోయిన త‌మ‌కు న్యాయం చేయాల‌ని వారు ఎస్పీకు విజ్ఞ‌ప్తి చేశారు..వైవాహిక జీవితంలో మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చో లేక మ‌రే కార‌ణం చేత‌నైనా విడిపోతే వారిలో చాలా మంది డిఫ్రెష‌న్‌లోకి వెళ్లిపోయి మాన‌సికంగా ఇబ్బందులు ప‌డుతుంటారు.. స‌రిగ్గా ఈ నిత్య పెళ్లికూతురుకు వీళ్లే టార్గెట్‌గా మారుతున్నార‌ని బాధితులు వాపోయారు. విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషులకు మాయ మాటలు చెప్పి వివాహం వరకు తీసుకువెళతారని, ఈ లోపు వారి నుండి అందినకాడికి డబ్బును దోచుకుని, బాధితులు తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధించేవారన్నారు.  ఈ విధంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 12 మంది పురుషులను మోసం చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసుకుని పరారయ్యారని బాధితులు గొల్లు మ‌న్నారు.. ఇటీవల నిత్య పెళ్ళి కూతురు బేతి వీర దుర్గా నీలిమపై కేసులు నమోదు కావడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సోమవారం నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు పట్టణాలకు చెందిన ముగ్గురు  బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు. తమలాగ మరి ఎవరూ మోసపోకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసామన్నారు. నిత్య పెళ్లికూతురు కాజేసిన సొమ్మును తిరిగి తమకు ఇప్పించాలని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బ‌య‌టకు వ‌చ్చ‌ని వారు చాలా త‌క్కువేన‌ని, ప‌రువు కోసం చాలా మంది బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో నిత్య‌పెళ్లికూతురు, ఆమె కుటుంబం ఇదే ప‌నిగా పెట్టుకుని ఎంతో మంది జీవితాల‌తో ఆడుకుంటున్నార‌ని వారు వాపోయారు.

]]>
Tue, 24 Jun 2025 09:54:48 +0530 admin
చంద్రగిరిలో నలుగురు స్మగ్లర్లు అరెస్టు https://prajakshethrenews.com/చంద్రగిరిలో-నలుగురు-స్మగ్లర్లు-అరెస్టు https://prajakshethrenews.com/చంద్రగిరిలో-నలుగురు-స్మగ్లర్లు-అరెస్టు చంద్రగిరిలో నలుగురు స్మగ్లర్లు అరెస్టు

15 ఎర్రచందనం దుంగలతో పాటు కారు స్వాధీనం

కారులో అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్న టాస్క్ ఫోర్స్
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
చంద్రగిరి-శ్రీవారిమెట్టు మార్గంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15 ఎర్రచందనం దుంగలు, రవాణా చేస్తున్న కారును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా, టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్  అధ్వర్యంలో  డీఎస్పీ  జె. బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ఎస్ఐ సి. వినోద్ కుమార్ టీమ్ ఆదివారం రాత్రి భాకరాపేట రేంజిలోని నాగపట్ల అటవీ పరిధిలోని శ్రీవారిమెట్టు నుంచి చంద్రగిరి వెళ్లే మార్గంలో వాహనాల తనిఖీ చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున వేగంగా వచ్చిన ఒక కారు పోలీసులను చూసి ఆగిపోయింది. ఇంకా అందులోని వ్యక్తులు కారు దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పందించి, వారిని చుట్టుముట్టారు. కారులో చూడగా 15 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. పట్టుబడిన వారిని తమిళనాడు వాసులుగా గుర్తించారు. వారిని దుంగలతో సహా తిరుపతిలోని టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

]]>
Mon, 23 Jun 2025 21:17:22 +0530 admin
మైనర్ బాలిక నగ్న వీడియోలు స్నేహితులకు షేర్ చేసిన మైనర్ బాలుడు https://prajakshethrenews.com/మైనర్-బాలిక-నగ్న-వీడియోలు-స్నేహితులకు-షేర్-చేసిన-మైనర్-బాలుడు https://prajakshethrenews.com/మైనర్-బాలిక-నగ్న-వీడియోలు-స్నేహితులకు-షేర్-చేసిన-మైనర్-బాలుడు మైనర్ బాలిక నగ్న వీడియోలు స్నేహితులకు షేర్ చేసిన మైనర్ బాలుడు
ప్రజా క్షేత్ర్, అదిలాబాద్ :
అదిలాబాద్ లో దారుణం జరిగింది. ఒక మైనర్ బాలుడు మరో మైనర్ బాలిక న్యూడ్ వీడియోలు రికార్డు చేసి స్నేహితులకు షేర్ చేసాడు. స్నేహం పేరుతో మాయ మాటలు చెప్పి, బాలికను బెదిరించి నగ్నంగా వీడియోలు రికార్డు చేసి ఇతరులకు పంపాడు. అదిలాబాద్ జిల్లా కు చెందిన బాలుడు సామాజిక మాధ్యమం ద్వారా ఒక బాలిక కు దగ్గరయ్యాడు. తనకు నగ్నంగా వీడియో కాల్ చేయాలని, లేకపోతే చాట్ మొత్తం ఆమె తల్లిదండ్రులకు చూపిస్తానని బాలికను బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక నగ్నంగా వీడియో కాల్ చేయగా, వీడియో కాల్ రికార్డు చేసి తన స్నేహితులకు పంపాడు. గత కొంత కాలంగా శారీరికంగా, మానసికంగా వేధించడంతో బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది.  తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, పోలీసులు 8 మంది ని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు.

]]>
Mon, 23 Jun 2025 18:10:44 +0530 admin
అయేషా హత్య కేసు... సీబీఐ రిపోర్ట్ https://prajakshethrenews.com/అయేషా-హత్య-కేసు-సీబీఐ-రిపోర్ట్ https://prajakshethrenews.com/అయేషా-హత్య-కేసు-సీబీఐ-రిపోర్ట్ అయేషా హత్య కేసు... సీబీఐ రిపోర్ట్
ప్రజా క్షేత్ర్, విజయవాడ, జూన్ 23 :
 2007 డిసెంబర్ 27న ఇబ్రహీంపట్నంలో మహిళల వసతి గృహంలో బీఫార్మసీ చదువుతున్న అయోషా మీరా దారుణ హత్యకు గురైన విషయం విధితమే.. అప్పటినుంచి విచారణ కొనసాగుతుంది కానీ కొలిక్కి మాత్రం రావడం లేదు. కరుడుగట్టిన నేరాలను సైతం త్వరితగతిన ఛేదిస్తున్న రోజులు ఇవి. అటువంటిది 17 సంవత్సరాలుగా అయోషా మీరా అత్యాచారం, హత్య కేసును తేల్చలేని స్థితిలో పోలీస్ యంత్రాంగం ఉంది. ఇంతవరకు నిందితులను పట్టుకోలేకపోయిందన్న అపవాదు ముట్టుకుంది.అయితే ఉమ్మడి హైకోర్టు ఆదేశాలతో మరోసారి దర్యాప్తు చేపట్టిన సిబిఐ దాదాపు ఏడేళ్ల పాటు ఈ దర్యాప్తు కొనసాగింది. తాజాగా విజయవాడలోని సిబిఐ కేసులు విచారించే ప్రత్యేక కోర్టుకు దర్యాప్తు నివేదిక సమర్పించింది. 17 ఏళ్ల కిందట జరిగిన ఈ ఘటనపై సిబిఐ ఏం తెలిసింది అన్నది సర్వత్ర ఆసక్తికరంగా మారింది. 2007 డిసెంబర్ 27న ఇబ్రహీంపట్నంలో మహిళల వసతిగృహంలో బీఫార్మసీ చదువుతున్న అయోషా మీరా దారుణ హత్యకు గురైంది. అప్పటినుంచి విచారణ కొనసాగుతుంది కానీ కొలిక్కి మాత్రం రావడం లేదు.అప్పట్లో అయోషా మీరాను దారుణంగా అత్యాచారం చేసి హత్యచేశారని తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు దాదాపు 150 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. అయితే 2008 ఆగస్టులో ఈ ఘటనకు బాధ్యుడిగా చేస్తూ సత్యంబాబును అరెస్టు చేశారు. ఈ కేసులో విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. దీనిపై పోలీసులు హైకోర్టులో అప్పీల్ చేశారు. 2017 మార్చి 31న హైకోర్టు కొట్టి వేసింది. పోలీసు దర్యాప్తు సక్రమంగా జరగలేదని అభిప్రాయపడింది. సత్యంబాబును నిర్దోషిగా తీర్పు ఇచ్చింది. దర్యాప్తు అధికారులపై చర్యలు తీసుకోవాలని తీర్పులో పేర్కొంది.అయితే ఈ కేసు జఠిలం కావడంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ కేసువిచారణను ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించింది. నాటు విశాఖ రేంజ్ డిఐజి శ్రీకాంత్ ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించారు. కానీ విచారణ సక్రమంగా ముందుకు సాగకపోవడంతో అయోషా తల్లి హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐకి కేసు విచారణ బాధ్యతలు అప్పగించారు. 2018లో సిబిఐ దర్యాప్తు ప్రారంభం అయింది. ఏడేళ్ల దర్యాప్తులో 260 మంది సాక్షులను విచారించింది.అప్పట్లో కేసు దర్యాప్తు చేసిన 50 మంది పోలీసులు, అయేషా ఉన్న హాస్టల్ లో విద్యార్థులు, 25 మంది సిబ్బందిని సిబిఐ ప్రత్యేకంగా పిలిపించి ప్రశ్నించింది. ఈ కేసులో నిందితుడిగా పరిగణిస్తున్న సత్యంబాబు స్వగ్రామం అనాసాగరం వెళ్లి కూడా విచారణ చేపట్టింది. అయోషా మీరా మృతదేహాన్ని బయటకు తీసి రి పోస్టుమార్టం కూడా చేశారు. దిగువ కోర్టులో ఆధారాలను ధ్వంసం చేసిన అభియోగాలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారించారు. ప్రస్తుతం విచారణ పూర్తి కావడంతో సిబిఐ కోర్టుకు నివేదిక ఇచ్చారు. అందులో ఏం పొందుపరిచారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

]]>
Mon, 23 Jun 2025 09:17:54 +0530 admin
ఐదు ఆలయాలకు కల్తీ నెయ్యి? https://prajakshethrenews.com/ఐదు-ఆలయాలకు-కల్తీ-నెయ్యి https://prajakshethrenews.com/ఐదు-ఆలయాలకు-కల్తీ-నెయ్యి ఐదు ఆలయాలకు కల్తీ నెయ్యి?
ప్రజా క్షేత్ర్, తిరుమల, జూన్ 21 :
తిరుమలలోలడ్డు వివాదం ప్రకంపనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో నెయ్యిలో జంతు కొవ్వు కలిపారు అన్న ఆరోపణలు వచ్చాయి... దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సంయుక్తంగా ఏర్పాటైన ఈ బృందం విచారణను ప్రారంభించింది. అయితే ఈ దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్ కు చెందిన బోలె బాబా డెయిరీ అక్రమాలు బయటపడ్డాయి. తిరుపతిలోని ఓ చిన్న డెయిరీ ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఒక్క తిరుమలకే కాదు శ్రీకాళహస్తి, కాణిపాకం, విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, ద్వారకా తిరుమల వంటి దేవాలయాలకు కూడా ఈ కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని తాజాగా తేలింది. తిరుపతిలోని డైరీకి కమిషన్లు చెల్లించి.. ఆ కంపెనీ పేరుతో కల్తీ నెయ్యిని దేవాలయాలకు పంపినట్లు తేలిందని సమాచారం.కేవలం టీటీడీకి మాత్రమే కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు అంతా భావించారు. కానీ ఇప్పుడు ఇతర దేవాలయాలకు సైతం సరఫరా జరిగినట్లు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు నెల్లూరు ఏసీబీ కోర్టులో భోలే బాబా డైరీ జనరల్ మేనేజర్ హరి మోహన్ రానా మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ చేపట్టగా ఏపీపీ వాదనలు వినిపించారు. హరి మోహన్ ఈ ఎపిసోడ్ లో సూత్రధారి అని.. బయటకు వస్తే సాక్షాధారాలు మాయం చేస్తారని.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏపీపీ వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. ఈ సందర్భంగా నే కేవలం తిరుమల కే కాదు.. అన్ని దేవాలయాలకు సరఫరా చేసిన నెయ్యి కల్తీ జరిగిందని తెలుస్తుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.తిరుమలలో వైసిపి హయాంలో నెయ్యిలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు బయటపెట్టారు. అటు తరువాత ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ ఇరుకున పడింది. దీంతో ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం సిబిఐ అధికారి నేతృత్వంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. గత కొద్ది రోజులుగా ఈ బృందం తిరుమలను వేదికగా చేసుకుని దర్యాప్తు చేస్తూ వస్తోంది. ఈ దర్యాప్తు నివేదికను సుప్రీంకోర్టుకు నివేదించే అవకాశం ఉంది. అయితే కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

]]>
Sat, 21 Jun 2025 09:23:50 +0530 admin
234 మంది కరడుగట్టిన నేరస్థుల ఎన్ కౌంటర్ https://prajakshethrenews.com/234-మంది-కరడుగట్టిన-నేరస్థుల-ఎన్-కౌంటర్ https://prajakshethrenews.com/234-మంది-కరడుగట్టిన-నేరస్థుల-ఎన్-కౌంటర్ 234 మంది కరడుగట్టిన నేరస్థుల ఎన్ కౌంటర్ 

ప్రజా క్షేత్ర్, లక్నో, జూన్ 20 :
2017లో బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ అంతటా పోలీసు ఎన్‌కౌంటర్లలో గణనీయమైన పెరుగుదల ఉందని ఇటీవలి డేటా వెల్లడిస్తోంది. ఈ ఆపరేషన్లలో అనేక మంది నేరస్థులు హతమయ్యారు. అలాగే వేల సంఖ్యలో పలువురు గాయపడ్డారు. అయితే తాజాగా మొట్ట మొదటిసారి ఉత్తరప్రదేశ్ పోలీసులు గత ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్ర నేర నిరోధక కార్యకలాపాలపై సమగ్ర డేటాను విడుదల చేశారు.యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) రాజీవ్ కృష్ణ విడుదల చేసిన డేటా ప్రకారం.. 2017 నుంచి 2024 మధ్య పోలీసు ఎన్‌కౌంటర్లలో మొత్తం 234 మంది కరడుగట్టిన నేరస్థులు హతమయ్యారు. అదనంగా ఈ ఘర్షణల్లో 9,202 మంది నేరస్థులు గాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నేరాలకు వ్యతిరేకంగా కఠినమైన జీరో-టాలరెన్స్ విధానాన్ని అమలు చేసింది. గత ఎనిమిది సంవత్సరాలలో ఉత్తరప్రదేశ్ అంతటా 14,741 ఎన్‌కౌంటర్ సంఘటనలు జరిగాయి. ఈ ఆపరేషన్లలో 30,293 మంది నేరస్థులు అరెస్టు అయ్యారు. అయితే ఎన్‌కౌంటర్‌ ఆపరేషన్స్‌ సమయంలో పోలీసులు కూడా మరణించారు. విధి నిర్వహణలో నేరస్థులతో పోరాడుతున్నప్పుడు 18 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 1,700 మంది పోలీసులు గాయపడ్డారు.డేటా ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే మీరట్ జోన్‌లో అత్యధికంగా ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. మొత్తం 4,183 ఆపరేషన్లలో 7,871 మంది నేరస్థులు అరెస్టు అయ్యారు. 2,839 మంది గాయపడ్డారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో 77 మంది భయంకరమైన నేరస్థులు మరణించారు. అలాగే ఇద్దరు పోలీసులు వీరమరణం పొందగా, 452 మంది గాయపడ్డారు. వారణాసిలో1,041 ఎన్‌కౌంటర్‌లలో 2,009 మంది నేరస్థులను అరెస్టు చేశారు. 605 మంది గాయపడ్డారు, 26 మంది మరణించారు. 96 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. అలాగే ఆగ్రా జోన్‌లో 2,288 ఎన్‌కౌంటర్ సంఘటనలు జరిగాయి. దీని ఫలితంగా 5,496 మంది నేరస్థులు అరెస్టు అయ్యారు, 715 మంది గాయపడ్డారు. 19 మంది మరణించారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో 56 మంది పోలీసులు కూడా గాయపడ్డారు.

]]>
Fri, 20 Jun 2025 20:07:18 +0530 admin
లారీని ఢీకొట్టిన బొలెరో వాహనం: 9 మంది మృతి https://prajakshethrenews.com/లారీని-ఢీకొట్టిన-బొలెరో-వాహనం-9-మంది-మృతి https://prajakshethrenews.com/లారీని-ఢీకొట్టిన-బొలెరో-వాహనం-9-మంది-మృతి లారీని ఢీకొట్టిన బొలెరో వాహనం: 9 మంది మృతి

ప్రజా క్షేత్ర్, కోల్ కతా జూన్ 20  :

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం పురులియా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బలరామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నమ్ షోల్ శివారులో జాతీయ రహదారి 18పై లారీని బొలెరో వాహనం ఢీకొనడంతో 9 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఝార్ఖండ్ రాష్ట్రం నిమ్ధిహ పోలీస్ స్టేషన్ పరిధిలో టిలైటాండ్ గ్రామంలోని పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా ఈప్రమాదం జరిగింది. మృతుల స్వస్థలం పురులియా జిల్లాలోని అదాబానా గ్రామంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు

]]>
Fri, 20 Jun 2025 15:45:08 +0530 admin
ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి https://prajakshethrenews.com/ఛత్తీస్గఢ్-లో-ఎన్-కౌంటర్-ఇద్దరు-మావోయిస్టులు-మృతి https://prajakshethrenews.com/ఛత్తీస్గఢ్-లో-ఎన్-కౌంటర్-ఇద్దరు-మావోయిస్టులు-మృతి ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
ప్రజా క్షేత్ర్, రాయ్ పూర్ జూన్ 20 :
 ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో శుక్రవారం ఎన్ కౌంటర్ జరిగింది. చోటే భేథియాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామాగ్రి, ఎకె 47 రైఫిళ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. భద్రాచలం ఏజెన్సీలో విస్తృత తనిఖీలు చేపట్టారు. దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడుకు రాత్రివేళ ఆర్ టిసి బస్సులు, ప్రైవేట్ వాహనాలు నిలిపివేశారు. ఏజెన్సీలో కూంబింగ్ కొనసాగుతుంది.

]]>
Fri, 20 Jun 2025 15:37:51 +0530 admin
గువ్వలచెరువు ఘాట్ లో బస్సు ప్రమాదం https://prajakshethrenews.com/గువ్వలచెరువు-ఘాట్-లో-బస్సు-ప్రమాదం https://prajakshethrenews.com/గువ్వలచెరువు-ఘాట్-లో-బస్సు-ప్రమాదం గువ్వలచెరువు ఘాట్ లో బస్సు ప్రమాదం
ప్రజా క్షేత్ర్, కడప :
గువ్వలచెరువు ఘాట్ రోడ్డులోని గుడి వద్ద జగన్ ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటన కలకలం రేపుతోంది.ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారి సంఖ్య ఇంకా తేలాల్సి ఉంది. స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

]]>
Thu, 19 Jun 2025 14:51:10 +0530 admin
చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య https://prajakshethrenews.com/చార్టెడ్-అకౌంటెంట్-ఆత్మహత్య https://prajakshethrenews.com/చార్టెడ్-అకౌంటెంట్-ఆత్మహత్య చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో రాజరాజేశ్వరి కాలనీ చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు.  తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని హీలియం గ్యాస్ పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన అక్క ఇంటికి వెళ్తానని చెప్పి రాజరాజేశ్వరి కాలనీ కు  చార్టెడ్ అకౌంటెంట్ సురేష్ రెడ్డి వచ్చాడు.రెండు రోజుల కోసం ఓ సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాడు. మొదటి రోజు కాకుండా,మరుసటి రోజు డైరీ లో సూసైడ్ నోట్ రాసుకున్న సురేష్ రెడ్డి.. తనతో పాటు తెచ్చుకున్న హిలియం సిలిండర్ తో సూసైడ్ చేసుకున్నాడు. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లభ్యం అయింది. ...

]]>
Wed, 18 Jun 2025 19:47:58 +0530 admin
పెళ్లి కోసం మద్యం మత్తులో మహిళను దారుణంగా హత్య చేసిన స్నేహితురాలు https://prajakshethrenews.com/పెళ్లి-కోసం-మద్యం-మత్తులో-మహిళను-దారుణంగా-హత్య-చేసిన-స్నేహితురాలు https://prajakshethrenews.com/పెళ్లి-కోసం-మద్యం-మత్తులో-మహిళను-దారుణంగా-హత్య-చేసిన-స్నేహితురాలు  పెళ్లి కోసం మద్యం మత్తులో మహిళను దారుణంగా హత్య చేసిన స్నేహితురాలు 
ప్రజా క్షేత్ర్, తిరుపతి, జూన్ :
చిత్తూరు లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చిత్తూరు రూరల్ చెర్లోపల్లిలో జరిగిన ఘటనపై పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 12వ తేదీన ఇంట్లో మంచంపై విగతజీవిగా పడి ఉన్న సరోజ అనే మహిళది సహజ మరణంగా భావించారు. జూన్ 13వ తేదీన అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే అసలు నిజం ఇప్పుడు బయటపడింది. దీంతో పోలీసులు కూపీలాగుతున్నారు.సరోజ కొడుకు కన్నన్ కు ఒక బాలుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆరా తీస్తే, పక్కింటిలో ఉన్న స్నేహితురాలు నదియానే సరోజను హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. వివరాల్లోకి వెళితే సరోజ-నదియా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ వియ్యంకురాళ్లు కావాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే చిత్తూరు శివారు ప్రాంతం యాదవ కాలనీలో ఉన్న సరోజ-నదియాల కులాలు వేరైనా స్నేహంగానే చాలా కాలం మెలిగారు. సరోజకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉండగా.. చిన్న కొడుకు కన్నన్‌కు నదియా కూతురుతో పెళ్లి చేయాలని భావించారు.జూన్ 12వ తేదీన నదియా-సరోజలు ఇద్దరూ ఇంటి వద్దే మద్యం కూడా సేవించారు. మాటల్లో కూతురును సరోజ కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న నదియా కూతురు పెళ్లి ప్రస్తావన సరోజతో తెచ్చింది. ఇక్కడే కులం అడ్డొచ్చింది. కులాలు వేరుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్నేహితులుగా ఉన్న వారి మధ్య ఒక్కసారి వచ్చిన కులం ప్రస్తావనే గొడవకు దారి తీసింది. మద్యం మత్తులో ఉన్న సరోజను ప్లాస్టిక్ కవర్ కప్పి దిండుతో ఊపిరి ఆడకుండా చేసిన నదియా.. హంతమార్చింది. స్నేహిరాలినే హంతకురాలిని చేసింది. ఒకరిని హత్య చేసే దాకా పరిస్థితిని తీసుకెళ్ళింది.అయితే సరోజ మంచంపై మృతి చెంది ఉండటంతో.. సహజ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు జూన్ 13వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం ఇంటి పక్కనే ఉన్న పిల్లోడు సరోజ మరణంపై నిప్పులాంటి నిజాన్ని బయట పెట్టాడు. సరోజ కొడుకు కన్నన్‌కు సరోజ మర్డర్‌లో నదియా పాత్రను బయటపెట్టాడు. సరోజకు ఫుల్ గా మద్యం తాగించి, మత్తులో ఉండగా ముఖానికి ప్లాస్టిక్ కవర్ కప్పి దిండుతో నొక్కి చంపిందని ఆ కుర్రాడు చెప్పాడు. దీంతో తల్లి సరోజది సహజ మరణం కాదని, హత్య చేసినట్లు భావించిన కొడుకు కన్నన్ చిత్తూరు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తిరుపతిలో నిందితురాలు నదియాను అదుపులోకి తీసుకన్నారు.తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపడింది. సరోజ కొడుకుకు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని నదియా ప్రపోజల్ పెట్టగా అప్పటికే మద్యం మత్తులో ఉన్న సరోజ, నదియా కులం ఏంటని నిలదీసింది. కులాన్ని దూషించిన సరోజపై నదియాకు కోపం కట్టలు తెంచుకుంది. మద్యం మత్తులో ఉన్న సరోజను నదియా హతమార్చింది. హత్య చేసినట్లు పోలీసుల ముందు వెల్లడించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు సరోజ మర్డర్ ప్లాన్ ను క్లూస్ టీం రంగంలోకి దిగారు. సరోజను హత్య తీసి పాతిపెట్టిన ప్రాంతంలో శరీర భాగాలను సేకరించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. ఇప్పటికీ పోలీసుల అదుపులో ఉన్న నదియాను విచారిస్తున్న పోలీసులు కేసు మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు.

]]>
Wed, 18 Jun 2025 18:45:25 +0530 admin
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిలయిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య https://prajakshethrenews.com/ఇంటర్-సప్లిమెంటరీ-పరీక్షల్లో-ఫెయిలయిన-ముగ్గురు-విద్యార్థులు-ఆత్మహత్య https://prajakshethrenews.com/ఇంటర్-సప్లిమెంటరీ-పరీక్షల్లో-ఫెయిలయిన-ముగ్గురు-విద్యార్థులు-ఆత్మహత్య ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిలయిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య
ప్రజా క్షేత్ర్, మంచిర్యాల :
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిలయిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ లోని జయశంకర్ కాలనీకి చెందిన అక్షయ్ అనే విద్యార్థి ఇంటర్ సెకండ్ ఇయర్ గణితం సప్లిమెంటరీ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు.  సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం దాస్ తండాకు చెందిన గుగులోత్ హారిక (17) ఇంటర్ మొదటి సంవత్సరంలో బాటనీ పరీక్ష ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీ రాయగా అందులోనూ ఫెయిల్ అయింది. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం మహాబత్ పూర్ గ్రామానికి చెందిన వెంకటరమణ (18) కుడా  ఇంటర్ సెకండ్ ఇయర్  సప్లిమెంటరీ పరీక్షలు రాసి అందులో ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. ముగ్గురూ  మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

]]>
Tue, 17 Jun 2025 13:58:10 +0530 admin
రామాయంపేట వాసి ముంబైలో సముద్రంలో గల్లంతు https://prajakshethrenews.com/రామాయంపేట-వాసి-ముంబైలో-సముద్రంలో-గల్లంతు https://prajakshethrenews.com/రామాయంపేట-వాసి-ముంబైలో-సముద్రంలో-గల్లంతు రామాయంపేట వాసి ముంబైలో సముద్రంలో గల్లంతు
ప్రజా క్షేత్ర్, మెదక్ :
మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. ముంబై లో సముద్రం చూడటానికి వెళ్లి రామాయంపేట వాసి గల్లంతు అయ్యాడు. కుటుంబ సభ్యులతో  రాము(34) గురువారం బోట్ లో ప్రయాణం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. బోట్ దిగి వస్తున్న క్రమంలో అలలకు సముద్రంలో కొట్టుకుపోయి గల్లంతు అయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

]]>
Fri, 13 Jun 2025 15:56:46 +0530 admin
రూ. 1.50 లక్షల ఎండిఎంఎ డ్రగ్స్‌ పట్టి వేత.. https://prajakshethrenews.com/రూ-150-లక్షల-ఎండిఎంఎ-డ్రగ్స్-పట్టి-వేత https://prajakshethrenews.com/రూ-150-లక్షల-ఎండిఎంఎ-డ్రగ్స్-పట్టి-వేత  1.50 లక్షల ఎండిఎంఎ డ్రగ్స్‌ పట్టి వేత..

బెంగూళూరు నుంచి దిగుమతి.
.
ఉప్పల్‌లో అమ్మకాలు..

21.3 గ్రాముల ఎండిఎంఎ, నిందితుడితోపాటు బైక్‌ స్వాధీనం..

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 
రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో ఉద్యోగం. సైడ్‌గా డ్రగ్స్‌, గంజాయి అమ్మకాలు చేపడుతూ ఏసీ రంగారెడ్డి ఎన్‌ఫొర్స్‌మెంట్‌ టీమ్‌ బి సీఐ సుబాష్‌ చందర్‌ అధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో ఎండిఎంఎ డ్రగ్స్‌తోపాటు బైక్‌ ఒక వ్యక్తిని పట్టుబడ్డాడు. బండ్లగూడ నుంచి నాగోల్‌ ప్రాంతానికి డ్రగ్స్‌ రవాణ అవుతున్నాయనే సమాచారం  మేరకు ఎన్‌ఫొర్స్‌మెంట్‌ సీఐ సుబాష్‌, ఎస్సైలు కె. వెంకటేశ్వర్లు, ఏ.అనిల్‌ కుమార్‌ ఆరుగురు సిబ్బంది కలిసి అనంద్‌నగర్‌ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన బైక్‌ను నిలిపి తనిఖీలు చేపట్టగా బ్యాగులో 21.3 గ్రాముల ఎండిఎంఎ  డ్రగ్స్‌ను ఉన్నాయి. డ్రగ్స్‌తోపాటు, ఒక బైక్‌ను  సెల్ ఫొన్‌ను స్వాధీనం చేసుకొని ఉప్పల్‌కు చెందిన కె. వెంకట్‌ మోతీ కుమార్‌ను అరెస్టు చేసి ఉప్పల్ ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించారు. పట్టుకున్న డ్రగ్స్‌ను బెంగూళూరును ఒక వ్యక్తి తీసుక వచ్చి ఇస్తాడని, అక్కడ రూ.3 వేలకు గ్రాము చొప్పున కొనుగోలు చేసి ఉప్పల్‌ ప్రాంతంలో రూ. 5 వేల నుంచి  రూ. 6 వేలకు అమ్మకాలు జరుపుతానని నిందితుడు విచారణలో వెల్లడించాడు. పట్టుకున్న డ్రగ్స్ విలువ రూ. 1.50 లక్షలు గా ఉంటుందని అంచనా వేశారు. డ్రగ్స్ పట్టుకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ బీ టీం సిబ్బందిని ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి,అసిస్టెంట్ కమిషనర్ రంగారెడ్డి ఆర్ కిషన్ ఏఈఎస్ జీవన్ కిరణలు అభినందించారు

]]>
Thu, 12 Jun 2025 21:20:21 +0530 admin
అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం https://prajakshethrenews.com/అహ్మదాబాద్లో-ఘోర-విమాన-ప్రమాదం https://prajakshethrenews.com/అహ్మదాబాద్లో-ఘోర-విమాన-ప్రమాదం అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం
ప్రజా క్షేత్ర్, గాంధీనగర్, జూన్ 12 :
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘాని ప్రాంతంలో ఎయిర్‌ ఇండియా విమానం కూలింది. విమానంలో చాలామంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొంటున్నారు. ప్రమాదం తరువాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. టేకాఫ్‌ కాగానే విమానం కుప్పకూలింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. జనావాసాలపై విమానం కూలినట్లు చెబుతున్నారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు.అహ్మదాబాద్‌లో టేకాఫ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం వెనుక భాగం చెట్టును ఢీకొట్టిందని సమాచారం. విమానం అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళుతుండగా. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నారు.అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ప్రయాణీకుల విమానం బోయింగ్ డ్రీమ్‌లైన్ 787 కుప్ప కూలిపోయింది. మధ్యాహ్నం 1:10 గంటలకు అహ్మదాబాద్‌ నుంచి టేకాఫ్‌ తీసుకున్న వెంటనే కూలిపోయింది. టేకాఫ్‌ తీసుకున్న వెంటనే మేఘానీ ప్రాంతంలో ప్రమాదం జరిగింది
సివిల్ హాస్పిటల్ వరకు గ్రీన్ కారిడార్
సివిల్ హాస్పిటల్ వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు అధికారులు. మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ సహా ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలంలో ఉన్నారు.
అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ వెళ్లే విమానం AI 171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయం వెలుపల కూలిపోయింది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. వెంటనే అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు అమిత్ షా.అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం 171 కూలిపోయిందని ఎయిర్ ఇండియా ధృవీకరించింది. ఈ వినాశకరమైన సంఘటనలో ప్రభావితమైన వారందరి కుటుంబాలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. ఈ సమయంలో ప్రాథమిక దృష్టి బాధిత వారందరినీ, వారి కుటుంబాలను ఆదుకోవడం. అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సహాయం చేయడానికి, బాధిత వారికి అవసరమైన అన్ని సహాయం, సంరక్షణను అందించడానికి, శక్తి మేరకు ప్రతిదీ చేస్తున్నామని ఎయింర్ ఇండియా తెలిపింద. అత్యవసర కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చి, సమాచారం కోరుకునే కుటుంబాల కోసం సహాయక బృందాలను ఏర్పాటు చేశామని ఎయిర్ ఇండియా తెలిపింది.సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ వెళ్లే విమానం AI 171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయం వెలుపల కూలిపోయింది. దీంతో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు అన్ని విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయానికి ప్రయాణించే ముందు తాజా అప్‌డేట్స్ కోసం ప్రయాణీకులు తమ తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడుతో మాట్లాడి ప్రమాదం గురించి ఆరా తీశారు. “రక్షణ, సహాయ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు అహ్మదాబాద్ వెళ్తున్నారని ప్రధానమంత్రికి సమాచారం అందింది. అవసరమైన అన్ని సహాయాలను వెంటనే అందించాలని, పరిస్థితి గురించి క్రమం తప్పకుండా సమాచారం అందించాలని ప్రధానమంత్రి మంత్రిని ఆదేశించారు” అని విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.అహ్మదాబాద్‌లోని ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లడానికి గ్రీన్ కారిడార్‌ను రూపొందిస్తున్నారు. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలిస్తున్నారు.ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో అహ్మదాబాద్ విమానాశ్రయ రన్‌వే మూసి వేశారు. దీంతో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లాల్సిన 4 ఇండిగో, 5 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు అయ్యాయి.విమాన ప్రమాదంపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసి షాక్‌కు గురయ్యానని కేంద్ర మంత్రి తెలిపారు. వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విమానానికి కెప్టెన్ సుమిత్ సభర్వాల్ నాయకత్వం వహించారు. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ఉన్నారని DGCA తెలిపింది.విమాన కెప్టెన్ సుమిత్ సభర్వాల్ 8200 గంటల LTC అనుభవం ఉంది. కో-పైలట్‌కు 1100 గంటల విమానయాన అనుభవం ఉంది. TC ప్రకారం, విమానం అహ్మదాబాద్ నుండి 1339 IST (0809 UTC)కి రన్‌వే 23 నుండి బయలుదేరింది. రన్‌వే 23 నుండి టేకాఫ్ అయిన వెంటనే, విమానం విమానాశ్రయ వెలుపల నేలపై కూలిపోయింది. ప్రమాద స్థలం నుండి భారీ నల్లటి పొగ వెలువడటం కనిపించింది” అని DGCA తెలిపింది.ప్రమాదంపై ఎయిర్ ఇండియా ప్రకటన వెలువడింది. అహ్మదాబాద్-లండన్ గాట్విక్ వెళ్తున్న AI171 విమానం ప్రమాదానికి గురైందని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం, ఈ సంఘటన గురించి సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. వీలైనంత త్వరగా  సోషల్ మీడియా X హ్యాండిల్ వేదికగా మరిన్ని వివరాలను తెలియజేస్తామని తెలిపింది.ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సూరత్ నుండి అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు.  యుద్ధ ప్రాతిపదికన తక్షణ సహాయ చర్యలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సూచనలు ఇచ్చారు. గాయపడిన ప్రయాణీకులకు తక్షణ చికిత్స అందించాలని కూడా ఆయన కోరారు.గాంధీనగర్ నుండి 90 మంది సిబ్బందితో కూడిన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం  3 బృందాలను విమానం కూలిపోయిన ప్రదేశానికి పంపారు. వడోదర నుండి మొత్తం 3 బృందాలనుఢీకొట్టి కూలిపోయింది.ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. విమానాశ్రయ సరిహద్దు సమీపంలోనే విమానం కూలిపోయింది.బయటపడిన ప్రాథమిక చిత్రాలలో, విమానం ముక్కలైపోయినట్లు కనిపిస్తుంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనస్థలానికి చేరుకుని సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.విమానం ఒక రెక్క విరిగి పడిపోయినట్లు చిత్రంలో కనిపిస్తుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం, మంటలు కొంతవరకు అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానం విమానాశ్రయం నుండి బయలుదేరుతోంది. చుట్టూ గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘోర ప్రమాదాన్ని చూసి ప్రజలు భయపడి అక్కడికి పరుగులు తీశారు. విమానం పూర్తిగా దెబ్బతింది. విమానంలోని చాలా భాగాలు కాలి బూడిదయ్యాయి. విమానం కూలిపోయిన భవనం కూడా దెబ్బతింది.ప్రమాదంపై ఎయిర్ ఇండియా ప్రకటన వెలువడింది. అహ్మదాబాద్-లండన్ గాట్విక్ వెళ్తున్న AI171 విమానం ప్రమాదానికి గురైందని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం, ఈ సంఘటన గురించి సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. వీలైనంత త్వరగా https://www.airindia.com/ , సోషల్ మీడియా X హ్యాండిల్ వేదికగా మరిన్ని వివరాలను తెలియజేస్తామని తెలిపింది.
అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేత
సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ వెళ్లే విమానం AI 171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయం వెలుపల కూలిపోయింది. దీంతో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు అన్ని విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయానికి ప్రయాణించే ముందు తాజా అప్‌డేట్స్ కోసం ప్రయాణీకులు తమ తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.

]]>
Thu, 12 Jun 2025 20:47:52 +0530 admin
ఎర్రచందనం ముద్దాయిపై పీడీ యాక్ట్ https://prajakshethrenews.com/ఎర్రచందనం-ముద్దాయిపై-పీడీ-యాక్ట్ https://prajakshethrenews.com/ఎర్రచందనం-ముద్దాయిపై-పీడీ-యాక్ట్ ఎర్రచందనం ముద్దాయిపై పీడీ యాక్ట్

 ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న టాస్క్ ఫోర్స్

  ప్రజా క్షేత్ర్,  వెబ్ న్యూస్ :
ఎర్రచందనం అక్రమ రవాణాకు చెందిన పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న తమిళనాడుకు చెందిన అజిత్ బాబు ఎలియాస్ అజిత్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు పీడీ యాక్ట్ అమలు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడమే కాకుండా, నమోదైన కేసులను నిరూపించే విధంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఇందులొ భాగంగా గత ఐదేళ్లుగా 10కంటే ఎక్కువ కేసుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా వృత్తిగా చేసుకుని, ముఠాగా ఏర్పడి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న అజిత్ బాబు ఎలియాస్ అజిత్ (22)పై పీడీ యాక్ట్ అమలుకు టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు  సిఫారసు చేశారు. ఈ మేరకు తిరుపతి  జిల్లా కలెక్టరు, జిల్లా మెజిస్ట్రేట్  డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ , అతనిపై పీడీ యాక్ట్ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యక్తి ఎర్రచందనం కొల్లగొట్టడుతూ, వన్య మృగాల చట్టాలను ఉల్లంఘించి నేరాలు చేస్తూ ప్రజాజీవనానికి అటంకం కలిగిస్తున్నట్లు గుర్తించారు. పీడీ యాక్ట్ అమలులో భాగంగా నిందితుడిని కడప సెంట్రల్  జైలుకు తరలించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధకంలో భాగంగా పీడీ యాక్ట్ అమలు చేయడానికి వెనుకాడబోమని టాస్క్ ఫోర్సు ఎస్పీ  పీ.శ్రీనివాస్ హెచ్చరించారు. ఎర్రచందనం కేసుల్లో ఇప్పటికే అనేక మందికి శిక్షలు పడ్డాయని గుర్తు చేశారు. యువత ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రయత్నించి వారి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని చెప్పారు. స్మగ్లర్లకు శిక్ష పడటంతో పాటు వారి ఆస్తులు కూడా జప్తు చేసుకో పడతాయని తెలియజేశారు.

]]>
Wed, 11 Jun 2025 22:46:57 +0530 admin
సిట్‌ విచారణకు హాజరైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు.. https://prajakshethrenews.com/సిట్-విచారణకు-హాజరైన-ఎస్ఐబీ-మాజీ-చీఫ్-ప్రభాకర్రావు https://prajakshethrenews.com/సిట్-విచారణకు-హాజరైన-ఎస్ఐబీ-మాజీ-చీఫ్-ప్రభాకర్రావు సిట్‌ విచారణకు హాజరైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు..

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్‌:
ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు సిట్‌ విచారణకు హాజరయ్యారు. ఆయన సుమారు 14 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్‌కు చేరకున్నారు. పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆయన ఏ1గా ఉన్నారు. ప్రభాకర్‌రావు నుంచి కీలక సమాచారం రాబట్టాలని సిట్‌ అధికారులు భావిస్తున్నారు. ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్‌రావును ప్రశ్నించనున్నారు.
ప్రభాకర్‌రావు ఈ కేసు నమోదైన సమయంలోనే అమెరికా వెళ్లారు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆయన పాస్‌పోర్టు రద్దు చేయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్‌ డాక్యుమెంట్‌తో ఆదివారం రాత్రి 8.20 గంటల సమయంలో ఎమిరేట్స్‌ విమానంలో దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌ చేరుకున్నారు. ఐజీ స్థాయిలో పదవీ విరమణ చేసిన అధికారి పోలీసు విచారణకు హాజరవుతుండటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.

]]>
Mon, 09 Jun 2025 19:58:50 +0530 admin
ఛత్తీస్‌గఢ్‌ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మృతి https://prajakshethrenews.com/ఛత్తీస్గఢ్-ఎన్-కౌంటర్-లో-ఐదుగురు-మావోయిస్టులు-మృతి https://prajakshethrenews.com/ఛత్తీస్గఢ్-ఎన్-కౌంటర్-లో-ఐదుగురు-మావోయిస్టులు-మృతి ఛత్తీస్‌గఢ్‌ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మృతి
ప్రజా క్షేత్ర్, ఛత్తీస్‌గఢ్‌ జూన్ 7 :
 బీజాపూర్‌ జిల్లా నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. గత 3 రోజులుగా నేషనల్‌ పార్క్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటికే మావోయిస్టు కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర కీలక సభ్యుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. తాజాగా మరో ఐదుగురు మావోలను భద్రతా బలగాలు హతమార్చాయి. ఘటనాస్థలం నుంచి మృతదేహాలను, ఆయుధాలను బలగాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

]]>
Sat, 07 Jun 2025 22:15:53 +0530 admin
తొక్కిసలాటల్లో 189 మంది మృతి.. https://prajakshethrenews.com/ఏడాది-కాలంలో-దేశవ్యాప్తంగా-తొక్కిసలాటల్లో-189-మంది-మృతి https://prajakshethrenews.com/ఏడాది-కాలంలో-దేశవ్యాప్తంగా-తొక్కిసలాటల్లో-189-మంది-మృతి ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా తొక్కిసలాటల్లో 189 మంది మృతి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 5 :
దేశంలో గత ఏడాది కాలంలో పలు తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విషాధ ఘటనల్లో ఇప్పటివరకు 182 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని వందల మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటిదాకా 11 మంది మృతి చెందారు. గతేడాది ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా సందర్భంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన దగ్గరి నుంచి తాజా ఘటన వరకు ఏమేం ఘటనలు జరిగాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలవాలని దేశవ్యాప్తంగా 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోట్లాది మంది ఫ్యాన్స్ ఆశలు నెరవేరుస్తూ.. మంగళవారం ఆర్సీబీ పంజాబ్‌పై జయభేరి మోగించి.. కప్‌ను ముద్దాడింది. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ జట్టుకు బెంగళూరులో ఘన సన్మానం చేశారు. అయితే ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే దేశంలో గత ఏడాది కాలంగా జరిగిన 6 తొక్కిసలాట ఘటనల్లో 182 మంది మృతి చెందారు. మరికొన్ని వందల మంది గాయాల పాలయ్యారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో 18 మంది, మహా కుంభమేళాలో 30 మంది, గోవా ఆలయంలో ఆరుగురు, తిరుపతిలో ఆరుగురు, హైదరాబాద్‌ సంధ్యా థియేటర్ వద్ద ఒకరు, హత్రాస్ సత్సంగ్ 121 మంది ప్రాణాలు కోల్పోయారు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట
ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన దేశ రాజధానిలోని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 11 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళాకు వెళ్లేందుకు రైళ్ల కోసం వేచి ఉన్న ప్రయాణికులు.. ఒక్కసారిగా గందరగోళానికి గురై పరుగులు తీయడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. స్టేషన్‌లోని 14, 15 ప్లాట్‌ఫారాలను కలిపే ఫుట్ఓవర్ బ్రిడ్జిపై కొంతమంది ప్రయాణికులు జారిపడటంతో ఈ విషాదం జరిగింది. రైలు బయలుదేరడంలో ఆలస్యం, ప్రతి గంటకు 1500 జనరల్ టికెట్ల విక్రయించడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రైలు ప్లాట్‌ఫారాలు మారినట్లు తప్పుడు ప్రకటనలు రావడం ప్రయాణికుల్లో గందరగోళం సృష్టించడంతో.. అది ఈ తొక్కిసలాటకు దారితీసినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా తొక్కిసలాట
144 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళా సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 30 మంది మరణించగా.. 60 మంది గాయపడ్డారు. జనవరి 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా అమృత్ స్నానం చేసేందుకు కోట్లాది సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది.
గోవా ఆలయంలో తొక్కిసలాట
ఉత్తర గోవాలోని షిర్‌గావ్‌లో జరిగిన వార్షిక లైరై దేవి జాతర (ఊరేగింపు)లో తొక్కిసలాట జరగడంతో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని పనాజి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ దేవి లైరై ఆలయం వద్ద ఈ వార్షిక ఉత్సవం నిర్వహించగా.. దాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అధిక రద్దీ, సరిపడా భద్రతా బలగాలు లేకపోవడం గందరగోళానికి దారితీసి తొక్కిసలాటకు కారణమైందని వార్తలు వెలువడ్డాయి.
తిరుపతి తొక్కిసలాట
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల టోకెన్ల పంపిణీ సందర్భంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు విడిచారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద వైకుంఠ ద్వార సర్వదర్శనం, భక్తుల కోసం ప్రత్యేక దర్శనం, టోకెన్ల పంపిణీ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. 10 రోజుల పండుగ కోసం దర్శనం టోకెన్లను జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి పంపిణీ చేయాల్సి ఉండగా.. అర్ధరాత్రి నుంచే కౌంటర్ల వద్ద వేలాది మంది భక్తులు చేరుకున్నారు. దీంతో టికెట్ కౌంటర్ల వద్ద తీవ్ర గందరగోళం చెలరేగడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. క్యూ లైన్లలో ఉన్న ఒక మహిళకు ఆరోగ్యం బాగోలేదని సహాయం చేయడానికి గేటు తెరవగా.. భక్తుల గుంపు మొత్తం ఒకేసారి ముందుకు దూసుకురావడంతో గందరగోళం చెలరేగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట
గతేడాది డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సంధ్యా థియేటర్‌లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్ వద్ద గుమిగూడటంతో మెయిన్ గేటు విరికిగిపోయింది. ప్రేక్షకులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఈ ఘటనలో 35 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె 9 ఏళ్ల కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతడ్ని సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. ఇటీవలె డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు.
హత్రాస్ సత్సంగ్ తొక్కిసలాట
గతేడాది జూలైలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఉన్న భోలే బాబా అని పిలువబడే నారాయణ్ సాకర్ హరి సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాట పైన చెప్పిన అన్ని ఘటనల కంటే చాలా పెద్దది. ఈ సత్సంగ్‌లో భారీగా భక్తులు గుమిగూడినపుడు తీవ్ర గందరగోళం చెలరేగింది. దీంతో తొక్కిసలాట జరగ్గా.. అక్కడ 121 మంది మరణించారు. సత్సంగ్ నిర్వాహకులు 80 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేయగా.. అంచనాలకు మించి ఏకంగా 2.5 లక్షల మందికి పైగా హాజరయ్యారు.
సింహాచలంతొక్కిసలాట
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి జరిగింది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతిచెందగా, ఒకరు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. తెల్లవారుజామున సింహాచలంలో 3:30 గంటలకు ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం కురిసింది.దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్‌ కౌంటర్‌ వద్ద ఇటీవల నిర్మించిన గోడ కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు భారీ ఈదురుగాలుల ధాటికి రేకులు, ఐరన్ పైపులు పడడంతో గోడ కూలిపోయింది. మహిళ ఆర్తనాదాలతో ఆలయ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు.

]]>
Thu, 05 Jun 2025 13:02:34 +0530 admin
నిజాంపేట్‌లో దారుణం.. బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం https://prajakshethrenews.com/నిజాంపేట్లో-దారుణం-బ్యాగులో-గుర్తు-తెలియని-మహిళ-మృతదేహం https://prajakshethrenews.com/నిజాంపేట్లో-దారుణం-బ్యాగులో-గుర్తు-తెలియని-మహిళ-మృతదేహం నిజాంపేట్‌లో దారుణం.. బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 4 :
నిజాంపేట్‌లో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని.. రెడ్డిస్ ల్యాబ్ గోడ పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఓ బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. దీన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మహిళ వయస్సు సుమారుగా 25 నుంచి 35 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ వివరాలు తెలిస్తే.. అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మహిళను ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న సిసిటివి కెమెరాలను పరిశీలిస్తున్నారు.

]]>
Wed, 04 Jun 2025 19:13:55 +0530 admin
డ్రగ్స్ దందా చేస్తున్న ఏపీ కానిస్టేబుల్ను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు https://prajakshethrenews.com/డ్రగ్స్-దందా-చేస్తున్న-ఏపీ-కానిస్టేబుల్ను-అరెస్ట్-చేసిన-తెలంగాణ-పోలీసులు https://prajakshethrenews.com/డ్రగ్స్-దందా-చేస్తున్న-ఏపీ-కానిస్టేబుల్ను-అరెస్ట్-చేసిన-తెలంగాణ-పోలీసులు డ్రగ్స్ దందా చేస్తున్న ఏపీ కానిస్టేబుల్ను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆరుగురు డ్రగ్ ముఠా సభ్యులను అరెస్టు చేసారు. తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్లోని కూకట్పల్లి రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకొస్తుండగా ఆరుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసారు. పట్టుబడ్డ కానిస్టేబుల్ నుండి 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్,  నగదు స్వాధీనం చేసుకున్నట్టు  ఎస్ఓటీ అధికారులు వెల్లడించారు.
తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్(40), తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి ఉన్నం సురేంద్ర(31), బాపట్ల జిల్లా కర్ల పాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతి రెడ్డి హరిబాబు రెడ్డి (38) అద్దంకిమండలానికి చెందిన ఫాస్ట్ ఫియాడ్ నిర్వాహకురాలు చెగుడు మెర్సీ మార్గరేట్(34), షేక్ మస్తాన్వలీ(40), దేవరాజు యేసుబాబు(29) కలిసి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

]]>
Tue, 03 Jun 2025 15:25:57 +0530 admin
అస్సాంలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి https://prajakshethrenews.com/అస్సాంలో-భారీ-వర్షాలు-కొండచరియలు-విరిగిపడి-ఐదుగురు-మృతి https://prajakshethrenews.com/అస్సాంలో-భారీ-వర్షాలు-కొండచరియలు-విరిగిపడి-ఐదుగురు-మృతి అస్సాంలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి
ప్రజా క్షేత్ర్, గౌహతి మే31 :
: అస్సాంలోని పలు జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో కామ్రూప్(మెట్రో) జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి పిల్లలతో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ASDMA) వెల్లడించాడు. వరదలు కామ్రూప్, కామ్రూప్ (మెట్రో), కాచర్ మూడు జిల్లాలను ప్రభావితం చేశాయని, ఐదు రెవెన్యూ సర్కిళ్లపై, 10,150 మందికి పైగా ప్రజలను ప్రభావితం చేశాయని  పేర్కొంది.గౌహతిలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షపాతం కారణంగా గౌహతిలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయని చెప్పారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయాలు, చెట్లు కూలిపోవడం, స్థానికంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ASDMA హెచ్చరించింది.

]]>
Sat, 31 May 2025 20:17:39 +0530 admin
గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై న్యాయవిచారణ జరిపించాలి https://prajakshethrenews.com/గుల్జర్-హౌస్-అగ్ని-ప్రమాద-ఘటనపై-న్యాయవిచారణ-జరిపించాలి https://prajakshethrenews.com/గుల్జర్-హౌస్-అగ్ని-ప్రమాద-ఘటనపై-న్యాయవిచారణ-జరిపించాలి  గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై న్యాయవిచారణ జరిపించాలి


ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

ఇటీవల గుల్జర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని బాధిత కుటుంబానికి చెందిన సంతోష్ గుప్తా కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో గోషామహల్ నివాసి శ్రీనివాస్, న్యాయవాది అతుల్ అగర్వాల్ తో కలిసి మాట్లాడారు. అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యం వల్లే  (17) మంది ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడడం తమను తీవ్రంగా కలిసి వేస్తుందని అన్నారు. ఘటన జరిగిన గంట వరకు అగ్నిమాపక శాఖ వాహనాలు రాకపోవడం వచ్చిన వాహనాల్లో సరైన సిబ్బంది నీటి సదుపాయం లేకపోవడంతోనే మరణాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.  ఈ ఘటన యావత్ దేశాన్ని కలిచి వేసిందని అన్నారు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన అనంతరం ఉస్మానియా వైద్యుల నిర్లక్ష్యంతో మరో ముగ్గురు మృత్యువాత పడ్డారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై జ్యూడిషియల్ ఎంక్వయిరీ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం జ్యూడిషియల్ ఎంక్వయిరీ ఆదేశించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు..

]]>
Fri, 30 May 2025 18:13:45 +0530 admin
గూడచారిగా సిఆర్పిఎఫ్ ఉద్యోగి https://prajakshethrenews.com/గూడచారిగా-సిఆర్పిఎఫ్-ఉద్యోగి https://prajakshethrenews.com/గూడచారిగా-సిఆర్పిఎఫ్-ఉద్యోగి గూడచారిగా సిఆర్పిఎఫ్ ఉద్యోగి
ప్రజా క్షేత్ర్ , వెబ్ న్యూస్ :
దాయాది పాకిస్థాన్ దేశానికి గూఢచార్యం చేస్తోన్న స్పైల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దేశ సున్నిత, రహస్య సమాచారం పాక్‎కు చేరవేశారన్న ఆరోపణలపై హర్యానా, యూపీ, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. లేటెస్ట్‌గా ఇవే తరహా ఆరోపణలపై CRPF సిబ్బంది మోతీ రామ్ జాట్‌‎ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఆ తర్వాత ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశ పెట్టారు. నిందితుడి నుంచి మరిన్నీ వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి అప్పగించాలని ఎన్ఏఐ కోర్టును విజ్ఞప్తి చేశారు. ఎన్ఐఏ అభ్యర్థన మేరకు మోతీ రామ్‎ను కోర్టు జూన్ 6 వరకు కస్టడీకి అప్పగించింది.పాక్‌కు గూడచారిగా
పనిచేస్తున్న సిఆర్పిఎఫ్ ఉద్యోగిని అరెస్టు చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ .. మరిన్ని వివరాలను రాబట్టింది. సీఆర్పీఎఫ్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎస్సై)పనిచేస్తున్న మోతీ రామ్‌ జాట్‌.. 2023 నుంచి
పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్స్‌తో సంబంధాలు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్స్ కు అందజేస్తున్నాడని అధికారులు వెల్లడించారు.అంతేకాకుండా పహల్గామ్ ఉగ్ర దాడికి ఆరు రోజుల ముందు వరకు మోతీరామ్ పహల్గామ్ లో విధులు నిర్వహించాడు. ఆ తర్వాత జాట్‌ను జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ నుంచి బదిలీ చేశారు. ఈ సంఘటనతో అతని సంబంధాలను NIA ఇప్పుడు పరిశీలిస్తోంది. అందుకు ప్రతిఫలంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి వివిధ రూపాల్లో నగదు అందుకున్నట్లు తెలిపారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జూన్ ఆరో తేదీ వరకు మోతీరాంను విచారించి.. మరిన్ని వివరాలను సేకరించనుంది.కాగా.. పహల్గామ్ ఘటన, ఆపరేషన్ సిందూర్ అనంతరం.. పాకిస్తాన్ తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసింది.. ఇప్పటికే.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 10 మందికి పైగా వ్యక్తులను అరెస్ట్ చేసి.. విచారణ చేపట్టారు. నిందితులు పాక్ నిఘా వర్గాలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

]]>
Thu, 29 May 2025 22:25:14 +0530 admin
గోదావరి నదిలో8 మంది గల్లంతు https://prajakshethrenews.com/గోదావరి-నదిలో8-మంది-గల్లంతు https://prajakshethrenews.com/గోదావరి-నదిలో8-మంది-గల్లంతు గోదావరి నదిలో8 మంది గల్లంతు

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 

జిల్లాలో 8 మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. ముమ్మడివరం మండలం కమినిలంక వద్ద స్నానానికి 11 మంది గోదావరి నదిలో దిగి, లోతైన ప్రాంతం కావడంతో వీరిలో 8 మంది గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు సురక్షితంగా బయటకొచ్చారు.ఈ 11 మంది కె.గంగవరం మండలం శురుల్లంకలో ఓ శుభకార్యానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, గల్లంతైన వారిని కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్‌, సాయి, సతీశ్‌, మహేశ్‌, రాజేశ్, రోహిత్‌, మహేశ్‌గా గుర్తించారు.

]]>
Mon, 26 May 2025 20:05:33 +0530 admin
ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర..! ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు వ్యక్తులు https://prajakshethrenews.com/ఎమ్మెల్యే-రాజాసింగ్-హత్యకు-కుట్ర-ఇంటి-వద్ద-రెక్కీ-నిర్వహించిన-ఇద్దరు-వ్యక్తులు https://prajakshethrenews.com/ఎమ్మెల్యే-రాజాసింగ్-హత్యకు-కుట్ర-ఇంటి-వద్ద-రెక్కీ-నిర్వహించిన-ఇద్దరు-వ్యక్తులు ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర..! ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు వ్యక్తులు

ప్రజాక్షేత్ర్, క్రైం బ్యూరో 

బీజేపీ ఫైర్​ బ్రాండ్​  గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఒక వర్గం కు చెందిన ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించడం తీవ్ర కలకలం రేపుతుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు అనుమాస్పదంగా సంచరిస్తుండడంతో గమనించిన స్థానికులు వారిని పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా తుపాకులు, బుల్లెట్​ లు, ఎమ్మెల్యే రాాజా సింగ్​ ఫొటోలతో పాటు అతని ఇంటి ఫొటోలు కనిపించాయి. దీంతో స్థానికుు వారిని మంగళాట్​ పోలీసులకు అప్పగించారు.  వీరిని ఇస్మాయిల్, మహ్మద్ ఖాజాగా పోలీసులు గుర్తించారు. దీంతో రాజాసింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలుతెలియాల్సి ఉంది. 

]]>
Sun, 29 Sep 2024 19:16:08 +0530 admin
హైదరాబాద్ లో ఎన్ ఐ ఏ సోదాలు https://prajakshethrenews.com/హైదరాబాద్-లో-ఎన్-ఐ-ఏ-సోదాలు https://prajakshethrenews.com/హైదరాబాద్-లో-ఎన్-ఐ-ఏ-సోదాలు హైదరాబాద్ లో ఎన్ ఐ ఏ సోదాలు

ప్రజా క్షేత్ర్, నేషనల్ బ్యూరో :

ఢిల్లీలో ఉగ్రవాది రిజ్వాన్ అరెస్ట్ అయిన క్రమంలో హైదరాబాద్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు.దేశ రాజధానిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కొద్ది రోజుల ముందు. రాత్రి 11 గంటల ప్రాంతంలో అరెస్టు జరిగింది. గంగా బక్ష్ మార్గ్ సమీపంలో, ఢిల్లీ, ఒక చిట్కాను అనుసరించి. అధికారులు అతని వద్ద నుండి .30 బోర్ పిస్టల్, మూడు లైవ్ కాట్రిడ్జ్‌లు మరియు రెండు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని స్పెషల్ సెల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.ఢిల్లీలోని దర్యాగంజ్‌లో నివాసం ఉంటున్న రిజ్వాన్‌ తలపై రూ. 3 లక్షల నజరానా ఉందని, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రకటించిన ప్రత్యేక విభాగం, ఢిల్లీ పోలీసులు తెలిపారు.రిజ్వాన్ ISIS యొక్క పూణే మాడ్యూల్‌లో భాగం, పరారీలో ఉన్నాడు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రాజధానిలో అతని ఉనికిపై విచారణ జరుగుతోంది. ఎన్‌ఐఏ రిజ్వాన్ అలీ ఫోటోతో పాటు పరారీలో ఉన్న ఇతర  మోస్ట్ వాంటెడ్ లను కూడా విడుదల చేసింది.ఆదివారం సైదాబాద్ పరిధిలోని శంఖేశ్వర్ బజార్లోని గ్రీన్ వ్యూ అపార్టుమెంట్లో సోదాలు చేశారు ఎన్ ఐఏ అధికారులు సుమారు గంటపాటు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల ఢిల్లీలో అరెస్ట్ అయిన ఉగ్రవాది రిజ్వాన్ అబ్దుల్ గ్రీన్ వ్యూ అపార్టుమెంటులో నివాసం ఉన్నట్లు విచారణలో తేలడంతో.. ఆదివారం ఎన్ఐఏ అధికారులు ఈ అపార్టుమెంటులో సోదాలు నిర్వహించారు. రిజ్వాన్ను హైదరాబాద్కు తీసుకొచ్చి గ్రీన్ వ్యూ అపార్టుమెంట్లో సోదాలు చేశారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులుఆగస్టులో ఉగ్రవాది రిజ్వాన్ అబ్దుల్ను ఢిల్లీలో అరెస్ట్ ఎన్ఐఏ చేసింది. ఐసిస్తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్. ఐసిస్ పూణెలో మాడ్యుల్లో భాగంగా పనిచేస్తున్న రిజ్వాన్ అబ్దుల్.. ఢిల్లీలోని గంగా బక్ష్ మార్గ్ వద్ద అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో రిజ్వాన్ వద్దా 30 బోర్ పిస్టల్, మూడు లైవ్ కాట్రిడ్జ్లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. ఢిల్లీలోని స్పెషల్ సెల్ పోలీస్ స్టేషన్లో రిజ్వాన్పై కేసు నమోదు చేశారు. గతంలో రిజ్వాన్ తలపై రూ.3 లక్షల నజరానా కూడా ప్రకటించారు పోలీసులు.

]]>
Mon, 23 Sep 2024 04:00:36 +0530 admin
డబ్బులు ఎక్కువగా అడిగిందని ముక్కలుగా కోశాడు https://prajakshethrenews.com/డబ్బులు-ఎక్కువగా-అడిగిందని-ముక్కలుగా-కోశాడు https://prajakshethrenews.com/డబ్బులు-ఎక్కువగా-అడిగిందని-ముక్కలుగా-కోశాడు డబ్బులు ఎక్కువగా అడిగిందని ముక్కలుగా కోశాడు 

ప్రజాక్షేత్ర్, నేషనల్​ బ్యూరో 

చెన్నైలోని తొక్కే పాకం ప్రాంతంలో దారుణం జరిగింది. ఒప్పందం కుదిరినదానికంటే ఎక్కువ డబ్బులు అడిగినందుకు వ్యభిచారం చేస్తున్న మహిళను దారుణంగా హత్య చేశాడు. అనంతరం సదరు మహిళ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ ముక్కలన్నీ సూట్​ కేసులో వేసి బయట పడేశాడు. చివరకు పోలీసులకు చిక్కడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గంటల వ్యవధిలోనే మణికంద్​ ను పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు 

]]>
Fri, 20 Sep 2024 22:16:23 +0530 admin
జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ ఎన్​ కౌంటర్​ https://prajakshethrenews.com/జమ్మూ కాశ్మీర్-లో-మళ్ళీ-ఎన్-కౌంటర్ https://prajakshethrenews.com/జమ్మూ కాశ్మీర్-లో-మళ్ళీ-ఎన్-కౌంటర్ జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ ఎన్​ కౌంటర్​ 

ప్రజాక్షేత్ర్ , నేషనల్​బ్యూరో

పూంచ్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భారీ కాల్పులు జరిగాయి. ఆదివారం ఉదయం పక్కా సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ చేస్తుండగా ఎన్‌కౌంటర్‌ జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని మారుమూల గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం ఆధారంగా భద్రతా దళాలు కార్డన్ , సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఎన్‌కౌంటర్ జరిగిందని ఒక అధికారి తెలిపారు. ఈ సమాచారం మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం శనివారం సాయంత్రం మెంధార్ సబ్ డివిజన్‌లోని గుర్సాయ్ టాప్ సమీపంలోని పఠానాతీర్ ప్రాంతంలో సంయుక్త శోధన ఆపరేషన్ ప్రారంభించినట్లు భద్రతా అధికారి తెలిపారు.దాగి ఉన్న ఉగ్రవాదుల నుంచి సెర్చ్ పార్టీ కాల్పులకు తెగబడిందని, దీంతో కాల్పులు జరిగాయని ఆయన చెప్పారు. ఇరుపక్షాల మధ్య అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయని, ఆ ప్రాంతానికి బలగాలను తరలించామని, మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నామని అధికారి తెలిపారు..

జమ్మూకశ్మీర్ లో తెగబడుతున్న ఉగ్రవాదులు ...

సెప్టెంబరు 14న బారాముల్లా వద్ద జరిగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలచే ముగ్గురు ఉగ్రవాదులు హతమైన ఒక రోజు తర్వాత తాజా కాల్పులు జరిగాయి. జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని చక్ తాపర్ క్రీరి పట్టాన్ ప్రాంతంలో శుక్రవారం (సెప్టెంబర్ 13) రాత్రి ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.శుక్రవారం తెల్లవారుజామున,  జెకె కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులు,భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. 

]]>
Sun, 15 Sep 2024 13:20:31 +0530 admin
మాదాపూర్​ లో ఆర్టీసీ బస్సుఢీ ... యువతి మృతి సి.సికెమెరా విజువల్స్ https://prajakshethrenews.com/మాదాపూర్-లో-ఆర్టీసీ-బస్సుఢీ-యువతి-మృతి-సిసికెమెరా-విజువల్స్ https://prajakshethrenews.com/మాదాపూర్-లో-ఆర్టీసీ-బస్సుఢీ-యువతి-మృతి-సిసికెమెరా-విజువల్స్ మాదాపూర్ కొత్తగూడ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతున్న యువతిని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన సదరు యువతి అక్కడిక్కడే మృతిచెందింది. ఈ కేసును మాదాపూర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

]]>
Sun, 15 Sep 2024 00:11:31 +0530 admin
జ్యుస్ లో మూత్రం కలిపిన యజమాని, అసిస్టెంట్ అరెస్ట్ https://prajakshethrenews.com/జ్యుస్-లో-మూత్రం-కలిపిన-యజమాని-అసిస్టెంట్-అరెస్ట్ https://prajakshethrenews.com/జ్యుస్-లో-మూత్రం-కలిపిన-యజమాని-అసిస్టెంట్-అరెస్ట్ జ్యుస్ లో మూత్రం కలిపిన యజమాని, అసిస్టెంట్ అరెస్ట్ 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

జ్యూస్‌లో మూత్రం కలిపినందుకు ఘజియాబాద్ దుకాణదారుడిని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు.ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వినియోగదారులకు మూత్రం కలిపిన పండ్ల రసాలను అందిస్తున్నాడన్న ఆరోపణతో కోపోద్రిక్తులైన స్థానికులు దుకాణదారుడిని కొట్టారు. పోలీసులు ఆ తర్వాత ఖుషీ జ్యూస్ కార్నర్ యజమాని అమీర్అ ఖాన్ ను అరెస్టు చేశారు. అతని అసిస్టెంట్ ను కూడా పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.పండ్ల రసంలో పసుపురంగు ద్రవాన్ని దుకాణదారుడు కలుపుతుండగా కొందరు గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కొద్దిసేపటికే పెద్ద ఎత్తున గుమిగూడి షాపు యజమానిని కొట్టడం ప్రారంభించారు.ఈ చర్య వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని సీనియర్ పోలీసు అధికారి భాస్కర్ వర్మ తెలిపారు. షాపులో మూత్రం ఉందన్న దానిపై దుకాణదారుడు సంతృప్తికరమైన సమాధానం చెప్పకపోవడంతో అరెస్ట్ చేసినట్లు వర్మ తెలిపారు."సెప్టెంబర్ 13న సమాచారం అందిన తర్వాత, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, దుకాణంలోని డబ్బా నుండి సుమారు 1 లీటర్ మూత్రాన్ని కనుగొన్నారు. పోలీసులు అమీర్ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో తెలంగాణ కుల్ఫీ, ఐస్‌క్రీమ్ విక్రేతను హస్తప్రయోగం చేసి ఫలూదా ఉన్న కంటైనర్‌లో వీర్యాన్ని కలిపినందుకు అరెస్టు చేశారు. వ్యాపారిని స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

]]>
Sat, 14 Sep 2024 19:59:56 +0530 admin
గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం.... తప్పిన పెను ప్రమాదం https://prajakshethrenews.com/గణేష్-మండపంలో-అగ్ని-ప్రమాదం-తప్పిన-పెను-ప్రమాదం https://prajakshethrenews.com/గణేష్-మండపంలో-అగ్ని-ప్రమాదం-తప్పిన-పెను-ప్రమాదం గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం.... తప్పిన పెను ప్రమాదం 

ప్రజాక్షేత్ర్, క్రైం బ్యూరో :

ఈ ఏడు కొత్తదనం ఉండాలన్న ఆలోచనతో ఎంతో ఉత్సాహంగా గణేష్ మండపంలో కాటన్ తో డెకరేషన్ చేశారు..... వినాయక విగ్రహాన్ని కూడా మండపానికి తీసుకువచ్చారు... వినాయక చవితి పండుగ సందర్బంగా కాసేపట్లో పూజ చేస్తామని స్నానానికి అని చిన్నారులంతా వెళ్లారు... ఒక్కసారి విద్యుత్ కాంతులతో గణేష్ఎ మండపం ఎలా?  ఉందో చూద్దామని ఒక్కసారి మెయిన్ అన్ చేయగానే షార్ట్ సర్క్యూట్ తగిలి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. రెప్పపాటులో గణేష్ మండపం అగ్నికి అహుతయ్యింది. ఇదంతా హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని పి ఎన్ టి కాలనీలో జరిగింది. స్నానాలు ముగించుకొని వచ్చిన చిన్నారులు గణేష్ మండపం అగ్నికి అహుతవ్వడంతో క్షణాల్లో బూడిదయ్యిందంటూ  కన్నీరు మున్నీరయ్యారు. 

.

]]>
Sun, 08 Sep 2024 13:00:08 +0530 admin
ఛత్రపతి శివాజీ విగ్రహం తయారు చేసిన శిల్పి అరెస్ట్ https://prajakshethrenews.com/ఛత్రపతి-శివాజీ-విగ్రహం-తయారు-చేసిన-శిల్పి-అరెస్ట్ https://prajakshethrenews.com/ఛత్రపతి-శివాజీ-విగ్రహం-తయారు-చేసిన-శిల్పి-అరెస్ట్

ఛత్రపతి శివాజీ విగ్రహం తయారు చేసిన శిల్పి అరెస్ట్

ప్రజా క్షేత్ర్, నేషనల్ క్రైం బ్యూరో :

మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనలో శిల్పి జైదీప్‌ ఆప్టేని పోలీసులు అరెస్టు చేశారు. సింధుదుర్గ్‌ జిల్లాలోని రాజ్‌కోట్‌ కోటలో ఏర్పాటు చేసిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని 2023 నేవీ డే సందర్భంగా డిసెంబర్‌ 4న ప్రధాని మోదీ ఆవిష్కరించారు.అయితే పది నెలలు కూడా గడువక ముందే ఛత్రపతి శివాజీ విగ్రహం ఆగస్టు 26న కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో శిల్పి సహా పలువురిపై కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో తనని అరెస్ట్‌ చేస్తారనే భయంతో జయదీప్‌ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు ఏడు బృందాలను ఏర్పాటు చేశారు. కుటుంబాన్ని కలిసేందుకు వస్తున్నాడని ఆప్టే భార్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కల్యాణ్‌లోని అతని ఇంటి బయట అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కల్యాణ్‌ ప్రాంతంలో విగ్రహాల తయారీ సంస్థను నిర్వహిస్తున్న జయ్‌దీప్‌కు అనుభవం లేదని పోలీసులు గుర్తించారు. చిన్న చిన్న విగ్రహాలు తయారు చేసిన అనుభవం ఉన్న జయ్‌దీప్‌ 30 అడుగుల భారీ విగ్రహాన్ని ఎలా తయారు చేశారనే సందేహాలు తలెత్తతున్నాయి. కాగా, విగ్రహం కూలిన ఘటనలో ఆప్టేపై లుక్‌ అవుట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. శివాజీ విగ్రహం కోసం రాష్ట్ర ఖజానా నుంచి రూ.236 కోట్లు తీసుకున్నప్పటికీ.. రూ.1.5 కోట్లు మాత్రమే ఖర్చే చేశారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. కాగా, విగ్రహం కూలిన ఘటనపై పెనుదుమారం చెలరేగడంతో ప్రధాని మోదీ ప్రజలకు క్షమాణలు కూడా చెప్పిన విషయం తెలిసిందే.

]]>
Thu, 05 Sep 2024 18:20:58 +0530 admin
వరదనీటిలో కొట్టుకుపోయిన కారు https://prajakshethrenews.com/వరదనీటిలో-కొట్టుకుపోయిన-కారు https://prajakshethrenews.com/వరదనీటిలో-కొట్టుకుపోయిన-కారు వరదనీటిలో కొట్టుకుపోయిన కారు

ఖమ్మం జిల్లా కారేపల్లి గంగారం తాండలో విషాదం 

సహాయం కోసం ఫోన్​లు చేసిన తండ్రి, కూతురు

సకాలంలో చేరుకోకపోవడంతో వరదనీటి ఉదృతికి కొట్టుకుపోయిన కారు 

తండ్రి, కూతురు మృతి 

ప్రజాక్షేత్ర్ , క్రైం బ్యూరో 

వరదనీటిలో ప్రయాణిస్తున్న కారు చిక్కుకుపోవడంతో తండ్రి, కూతురు మృతి చెందిన హృదయవిధారక సంఘటన ఇది. వివరాలలోకి వెళితే ..ఖమ్మం జిల్లా కారేపల్లి గంగారం తాండకు చెందిన సునావత్ మోతిలాల్ ఆయన కూతురు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్​ అశ్విని. వ్యవసాయ శాస్త్రంలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్ డి,  హైదరాబాదులోని ఇంక్రిషాట్ లో వ్యవసాయ శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తుంది. చత్తీస్​ఘడ్​ లోని రాయపూర్ లో జరిగే శాస్త్ర  జాతీయ సదస్సు హాజరయ్యేందుకు శంషాబాద్ ఎయిర్​పోర్ట్​ కు తండ్రి , కూతుళ్ళు కారులో బయలుదేరారు. మార్గ మధ్యలో పురుషోత్తమయ్య గూడెం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు వరదనీటిలో చిక్కుకుంది. దీంతో తమ పరిస్థితిని బంధువులకు స్నేహితులకు ఫోన్​  ద్వారా వివరించినప్పటికీ సకాలంలో రాలేకపోవడంతో వరద నీటి ఉదృతికి కారు నీట మునిగింది. దీంతో డాక్టర్​ అశ్విని మృత దేహం లభ్యం అయిన చాలాసేపటికి తండ్రి మోతీలాల్​ మృతదేహం లభ్యమయ్యింది. అనేక పేద గిరిజన బాల బాలికలకు స్ఫూర్తి కలిగించి శాస్త్రవేత్తగా ఉజ్వల భవిష్యత్తుతో ముందుకు సాగుతున్న డాక్టర్​ అశ్విని ఎంతో కష్టపడి తన కుమార్తె విద్యావేత్త ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఎన్నో కలలు కన్నా తండ్రి సునావత్ మోతిలాల్ తో పాటే కూతరు అశ్విని మృతిచెందడం అందరిని కలిచివేసింది. దీంతో ఖమ్మం జిల్లాలో కారేపల్లి గంగారం తాండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

]]>
Thu, 05 Sep 2024 01:48:46 +0530 admin