Prajakshethre News & : జాతీయం https://prajakshethrenews.com/rss/category/జాతీయం-9 Prajakshethre News & : జాతీయం en Copyright 2024 Prajakshethre News & All Rights Reserved. రెండు రోజుల పాటు జ‌పాన్‌లో ప‌ర్య‌టించ‌నున్నప్ర‌ధాని మోదీ https://prajakshethrenews.com/రెండు-రోజుల-పాటు-జపాన్లో-పర్యటించనున్నప్రధాని-మోదీ https://prajakshethrenews.com/రెండు-రోజుల-పాటు-జపాన్లో-పర్యటించనున్నప్రధాని-మోదీ రెండు రోజుల పాటు జ‌పాన్‌లో ప‌ర్య‌టించ‌నున్నప్ర‌ధాని మోదీ
ప్రజా క్షేత్ర్,  న్యూఢిల్లీ ఆగష్టు 26 :
రెండు రోజుల పాటు జ‌పాన్‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌టించ‌నున్నారు. విదేశాంగ శాఖ ప్ర‌తినిధి విక్ర‌మ్ మిశ్రీ ఈ విష‌యాన్ని ఇవాళ వెల్ల‌డించారు. ఆగ‌స్టు 29వ తేదీన మోదీ జ‌పాన్ వెళ్ల‌నున్న‌ట్లు ఆ శాఖ పేర్కొన్న‌ది. జ‌పాన్ ప్ర‌ధాని షిగేరు ఇషిబాతో ఆయ‌న మాట్లాడుతారు. 2014లో దేశ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 8 సార్లు జ‌పాన్‌కు వెళ్లారు. రెండు దేశాల మ‌ధ్య బంధాన్ని బలోపేతం చేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. జ‌పాన్ నుంచి ఆయ‌న నేరుగా చైనాకు వెళ్తారు.

]]>
Wed, 27 Aug 2025 20:24:22 +0530 admin
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు https://prajakshethrenews.com/వైష్ణోదేవి-ఆలయానికి-వెళ్లే-మార్గంలో-విరిగిపడ్డ-కొండచరియలు https://prajakshethrenews.com/వైష్ణోదేవి-ఆలయానికి-వెళ్లే-మార్గంలో-విరిగిపడ్డ-కొండచరియలు వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు
   ఈ ప్రమాదంలో ఐదుగు మృతి .. 14 మంది తీవ్రంగా గాయాలు
ప్రజా క్షేత్ర్, శ్రీనగర్ ఆగష్టు 26 :
: జమ్ముకశ్మీర్ రాష్ట్రంపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్రంగా కష్టాలు పడుతున్నారు. మంగళవారం కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్కూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. ఘటనస్థలిలో అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

]]>
Wed, 27 Aug 2025 20:04:53 +0530 admin
తెలంగాణలో మరో రెండు విమానాశ్రయాలు https://prajakshethrenews.com/తెలంగాణలో-మరో-రెండు-విమానాశ్రయాలు https://prajakshethrenews.com/తెలంగాణలో-మరో-రెండు-విమానాశ్రయాలు తెలంగాణలో మరో రెండు విమానాశ్రయాలు

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ 

తెలంగాణలో విమానయాన రంగం కొత్త ఊపు అందుకోబోతోంది. వరంగల్, ఆదిలాబాద్‌లలో నిలిచిపోయిన విమానాశ్రయ ప్రణాళికలు ఇప్పుడు మళ్లీ కదలికలు మొదలుపెట్టాయి. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ,ఈ రెండు నగరాల్లో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను వచ్చే రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ కోసం అవసరమైన భూసేకరణ దాదాపు పూర్తయింది. 253 ఎకరాల భూమికి రూ.205 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు పట్ల తన కట్టుబాటును స్పష్టంగా చూపించింది. మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి మొదట చిన్న విమానాలకే పరిమితం చేయాలనుకున్నారు. కానీ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు ఏఏఐ పెద్ద విమానాలు, కార్గో ఫ్లైట్లకూ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. అంటే ఏ320, బోయింగ్ 737 లాంటి వాణిజ్య విమానాల రాకపోకలకు కూడా ఈ ఎయిర్‌పోర్ట్ సిద్ధమవుతుందన్నమాట.
ఈ ఏడాది చివర్లోనే పనులు ప్రారంభించేలా సన్నాహాలు జరుగుతున్నాయి. వరంగల్ అభివృద్ధికి ఇది కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. ఇక ఆదిలాబాద్‌లో ఇప్పటికే 362 ఎకరాల వాయుసేన స్థలం ఉంది. దానిని వినియోగించుకుంటూ మిగతా భూసేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఏఏఐ వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ ఎయిర్‌పోర్టును కూడా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణ ప్రభుత్వం 2027 జూన్ నాటికే పనులు పూర్తయ్యేలా కసరత్తు చేస్తుండగా, కేంద్రం డిసెంబర్ వరకు గడువు పెట్టినట్లు సమాచారం. రెండు ప్రాజెక్టులు పూర్తైతే తెలంగాణలో వాయు ప్రయాణం మరింత విస్తరించనుంది. వరంగల్ విమానాశ్రయానికి ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యం ఉంది. నిజాం కాలంలోనే ఇక్కడి నుంచి విమానాలు ఎగిరాయి. భారత్ చైనా యుద్ధ సమయంలో కీలకమైన సేవలు అందించాయి. కానీ గత మూడు దశాబ్దాలుగా ఈ ఎయిర్‌పోర్ట్ మూతపడే ఉంది. ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించాలనే ప్రయత్నం విజయవంతమైతే, వరంగల్ వాసుల కల నిజమవుతుంది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌కి ఈ ప్రాజెక్టు కొత్త ఊపును తీసుకురానుంది. ఈ రెండు విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తే, తెలంగాణలో పర్యాటకానికి, వాణిజ్యానికి, పరిశ్రమలకు పెరుగుదల ఖాయం. ప్రత్యేకంగా వరంగల్‌లో ఐటీ, ఎడ్యుకేషన్, హ్యాండ్లూమ్ రంగాల అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది. ఆదిలాబాద్‌లో ఖనిజ, అటవీ సంపద ఆధారిత వ్యాపారాలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మొత్తానికి ఈ రెండు ప్రాజెక్టులు తెలంగాణ రవాణా రంగానికే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త రెక్కలు ఇస్తాయని చెప్పొచ్చు.

]]>
Thu, 21 Aug 2025 12:30:27 +0530 admin
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పై దాడి https://prajakshethrenews.com/ఢిల్లీ-సీఎం-రేఖా-గుప్తా-పై-దాడి https://prajakshethrenews.com/ఢిల్లీ-సీఎం-రేఖా-గుప్తా-పై-దాడి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పై దాడి

గ‌ట్టిగా రెండు సార్లు ఆమె చెంప‌పై కొట్టి జుట్టు ప‌ట్టుకుని మ‌రీ బాదిన వైనం  

ప్రజా క్షేత్ర్న్యూ, ఢిల్లీ ఆగస్టు 20 : 
: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పై బుదవారం దాడి జ‌రిగింది. సీఎం నివాసంలో జ‌న్ సున్వాయి కార్య‌క్రమం నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఆ అటాక్ జ‌రిగింది. త‌న‌ స‌మ‌స్య‌ను చెప్పుకునేందుకు వ‌చ్చిన ఓ వ్య‌క్తి సీఎం రేఖా గుప్తాపై అకస్మాత్తుగా దాడి చేశాడు. ఆ వ్య‌క్తి 30 ఏళ్ల ఉంటాడ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. సీఎంపై దాడి చేసిన వ్య‌క్తిని.. అక్క‌డ ఉన్న సీఎం సిబ్బంది త‌క్ష‌ణ‌మే అదుపులోకి తీసుకున్నారు. ప‌బ్లిక్ మీటింగ్‌లో స‌మ‌స్య చెప్పుకునేందుకు వ‌చ్చిన వ్య‌క్తి ఎందుకు దాడికి పాల్ప‌డ్డార‌న్న కోణంలో విచార‌ణ నిర్వ‌హిస్తున్నారు. గ‌ట్టిగా రెండు సార్లు ఆమె చెంప‌పై కొట్టిన‌ట్లు తెలుస్తోంది. జుట్టు ప‌ట్టుకుని మ‌రీ బాదిన‌ట్లు చెబుతున్నారు. జుట్టు ప‌ట్టి పీక‌డంతో.. త‌ల‌కు గాయాలైన‌ట్లు తెలుస్తోంది

]]>
Wed, 20 Aug 2025 21:11:14 +0530 admin
ఎన్డిఎ అభ్యర్థికి సపోర్ట్ చేయండి.. ప్రతిపక్షలకు ప్రధాని విజ్ఞప్తి https://prajakshethrenews.com/ఎన్డిఎ-అభ్యర్థికి-సపోర్ట్-చేయండి-ప్రతిపక్షలకు-ప్రధాని-విజ్ఞప్తి https://prajakshethrenews.com/ఎన్డిఎ-అభ్యర్థికి-సపోర్ట్-చేయండి-ప్రతిపక్షలకు-ప్రధాని-విజ్ఞప్తి ఎన్డిఎ అభ్యర్థికి సపోర్ట్ చేయండి.. ప్రతిపక్షలకు ప్రధాని విజ్ఞప్తి
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ :
ఉపరాష్ట్రపతి పవికి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశాక.. ఆ పదవిలో ఎవరు భర్తీ చేస్తారన విషయంలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఎన్డిఎ.. మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేస్తున్న సిపి రాధాకృష్ణన్‌ను తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే తాజాగా ప్రధాని మోదీ, రాధాకృష్ణను ఉప రాష్ట్రపతిగా చేసేందుకు ప్రతిపక్షాలు మద్ధతు ఇవ్వాలని కోరారు. ఎన్నిక లేకుండా ఉప రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు అన్ని ప్రతిపక్షపార్టీలు సహకరించాలని మోదీ కోరికనట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో ఎన్డిఎ ఎంపిల సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్‌ను మోదీ ఎంపిలకు పరిచయం చేశారు. ఆనంతరం ఆయనను ప్రధాని, కేంద్ర మంత్రలు సన్మానించారు.

]]>
Wed, 20 Aug 2025 15:49:33 +0530 admin
జయాబచ్చన్‌పై కంగన రనౌత్ ఫైర్‌ https://prajakshethrenews.com/జయాబచ్చన్పై-కంగన-రనౌత్-ఫైర్ https://prajakshethrenews.com/జయాబచ్చన్పై-కంగన-రనౌత్-ఫైర్ అమితాబ్‌ భార్య కాబట్టి ఆమెను సహిస్తున్నారు..
          జయాబచ్చన్‌పై కంగన రనౌత్ ఫైర్‌
ప్రజా క్షేత్ర్, ముంబై ఆగస్టు 13
అలనాటి ప్రముఖ నటి, సమాజ్‌వాది పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్‌  పై బాలీవుడ్‌ స్టార్‌ నటి, మండి బీజేపీ ఎంపీ కంగన రనౌత్ ‌తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమె బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అమితాబ్ బచ్చన్ భార్య కాబట్టి ప్రజలు ఆమె కోపతాపాలను సహిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిపై జయాబచ్చన్‌ చిందులు తొక్కారు. అతడిని సీరియస్‌గా పక్కకు తోసేశారు. ‘ఏం చేస్తున్నావు నువ్వు..? ఏంటిది..?’ అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ రాజధాని ఢిల్లీ   లోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌  ఆవరణలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. ఆ వీడియోపై కంగన స్పందిస్తూ విమర్శలు చేశారు. జయాబచ్చన్‌ అత్యంత విశేషాధికారం కలిగిన మహిళ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఘటనను అవమానకరంగా, సిగ్గు చేటుగా అభివర్ణించారు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

]]>
Wed, 13 Aug 2025 23:49:42 +0530 admin
సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో ఆమె పేరు https://prajakshethrenews.com/సోనియా-గాంధీ-భారత-పౌరసత్వం-పొందకముందే-ఓటర్ల-జాబితాలో-ఆమె-పేరు https://prajakshethrenews.com/సోనియా-గాంధీ-భారత-పౌరసత్వం-పొందకముందే-ఓటర్ల-జాబితాలో-ఆమె-పేరు ఓట్ల చోరీ వ్యవహారం లో రాహుల్‌గాంధీ ఆరోపణలను తిప్పి కొట్టిన బీజేపీ
సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో ఆమె పేరు  
బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌   అమిత్ మాలవీయ  సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు
ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ ఆగష్టు 13 :
దేశంలో ఓట్ల చోరీ వ్యవహారం దుమారం రేపుతోంది. బీజేపీ   కేంద్ర ఎన్నికల సంఘం   కుమ్మక్కై ఎన్నికల్లో భారీ మోసానికి పాల్పడ్డాయని కాంగ్రెస్‌  అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కొద్ది రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను బీజేపీ తిప్పి కొట్టింది.ఈ మేరకు కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీని  లక్ష్యంగా చేసుకుని హస్తం పార్టీపై విరుచుకుపడింది. సోనియా గాంధీ భారత పౌరసత్వం  పొందకముందే ఓటర్ల జాబితాలో   ఆమె పేరు  ఉందని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌   అమిత్ మాలవీయ  సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందు ఎన్నికల జాబితాలో సోనియా గాంధీ పేరు ఉందని మాలవీయ తెలిపారు. విదేశీ పౌరురాలైన సోనియా గాంధీ పేరును భారత ఓటర్ల జాబితాతో చేర్చి కాంగ్రెస్‌ అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని మండిపడ్డారు. ఈ మేరకు 1980 నాటి ఢిల్లీ ఓటర్ల జాబితాకు సంబంధించిన ఒక చిత్రాన్ని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఆ జాబితాలో సోనియా గాంధీ పేరు స్పష్టంగా ఉందని, ఒక విదేశీ పౌరురాలికి ఇది ఎలా సాధ్యమైంది..? అంటూ ప్రశ్నించారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని, తీవ్రమైన తప్పిదమని ఆయన పేర్కొన్నారు.ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ 1968లో రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1983 ఏప్రిల్ 30న ఆమె భారత పౌరసత్వాన్ని అధికారికంగా స్వీకరించారు. అయితే, పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే అంటే 1980లోనే ఆమె పేరు ఓటర్ల జాబితాలో ఉంది. అయితే, ఈ విషయంపై 1982లో నిరసనలు వ్యక్తమవ్వడంతో ఆమె పేరును తొలగించారు. 1983 జనవరిలో తిరిగి చేర్చారు. ఆ ఏడాది ఏప్రిల్ 30న ఆమెకు భారత పౌరసత్వం మంజూరయినట్లు మాలవీయ తన ఎక్స్‌ ఖాతాలో వివరించారు.

]]>
Wed, 13 Aug 2025 23:12:53 +0530 admin
ఓటర్‌ ఫ్రెండ్లీగానే ఉంది కదా..? సర్‌ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..! https://prajakshethrenews.com/ఓటర్-ఫ్రెండ్లీగానే-ఉంది-కదా-సర్-వివాదంపై-సుప్రీంకోర్టు-వ్యాఖ్యలు https://prajakshethrenews.com/ఓటర్-ఫ్రెండ్లీగానే-ఉంది-కదా-సర్-వివాదంపై-సుప్రీంకోర్టు-వ్యాఖ్యలు ఓటర్‌ ఫ్రెండ్లీగానే ఉంది కదా..? సర్‌ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..!
 ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ ఆగష్టు 13;

బీహార్‌లో ఓటర్ల జాబితాను సవరించాలనే ఎన్నికల కమిషన్ (EC) నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చీ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో ఏడు ధ్రువీకరణ పత్రాలకంటే.. ప్రస్తుతం 11 పత్రాలను అనుమతించడం ఓటర్లకు ప్రయోజనకరంగా ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఆధార్‌ మినహా అనేక ఇతర డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకోవడాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. గతంలో బిహార్‌లో నిర్వహించిన రివిజన్‌లో ఏడు ధ్రువీకరపత్రాలను అనుమతించారని.. ప్రత్యేక సవరణ (SIR)లో 11 డాక్యుమెంట్లను ఈసీ అనుమతి ఇస్తుందని.. దీన్ని పరిశీలిస్తే ఓటర్లకు అనుకూలంగానే కనిపిస్తుందని ధర్మాసనం తెలిపింది. ఆధార్‌ అనుమతించడం లేదనే పిటిషనర్ల వాదనను అర్థం చేసుకున్నప్పటికీ అనేక పత్రాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా ధర్మాసనం గుర్తు చేసింది.అయితే, ఈ వాదనలతో పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ విభేదించారు. ధ్రువపత్రాల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. అందరికీ అందుబాటులో లేవని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పాస్‌పోర్టులను ఉదహరించారు. బిహార్‌లో కేవలం ఒకటి నుంచి రెండుశాతం మంది వద్దే పాస్‌ పోస్టులు ఉన్నాయన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం 36లక్షల మందికి పాస్‌పోర్టులు ఉన్నాయని.. ఇది మంచి సంఖ్యగానే కనిపిస్తోందని చెప్పింది. ఆయా ప్రభుత్వ విభాగాల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్న తర్వాతే ధ్రువపత్రాల జాబితా రూపొందిస్తారని జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చీ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ అంశంపై మంగళవారం సైతం సుప్రీంకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. పౌరులను చేర్చడం, కానివారిని ఓటరు జాబితా నుంచి మినహాయించడం ఎన్నికల కమిషన్‌ అధికార పరిధిలోనిదని ధర్మాసనం పేర్కొంది. సర్‌లో ఆధార్‌, ఓటర్‌ కార్డును పౌరసత్వానికి రుజువుగా పరిగణించలేమన్న ఈసీ వాదనలను సమర్థించింది. పార్లమెంట్‌ లోపల, వెలుపల ‘సర్‌’ అంశంపై వివాదం పెరుగుతున్న నేపథ్యంలో.. ఈసీ చేపట్టిన ఈ కార్యక్రమంపై విశ్వాసం కోల్పోవడమే సమస్య అని.. అంతకు మించి ఏమీ లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

]]>
Wed, 13 Aug 2025 23:05:44 +0530 admin
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు https://prajakshethrenews.com/గవర్నర్-కోటాలో-ఎమ్మెల్సీగా-ఎన్నికైన-కోదండరాం-అలీఖాన్-నియామకం-రద్దు https://prajakshethrenews.com/గవర్నర్-కోటాలో-ఎమ్మెల్సీగా-ఎన్నికైన-కోదండరాం-అలీఖాన్-నియామకం-రద్దు సుప్రీంకోర్టు సంచలన తీర్పు
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు
ప్రజా క్షేత్ర్,  ఢిల్లీ:

 సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ.. సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలలో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. కోదండరాం, అలీఖాన్‌లు తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియామకం అయిన విషయం తెలిసిందే. అయితే వీరి నియామకం అక్రమంగా జరిగిందని.. దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు గవర్నర్‌కు తెలిపారు. గవర్నర్ వీరి వాదనను తిరస్కరించడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి నియామకాలపై విచారణ జరిపి నియామకాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంను కోరారు. ఈ మేరకు ఇవాళ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఆగస్టు 14, 2024 తీర్పులో మార్పులు చేస్తూ.. వారి నియామకం చెల్లదని తీర్పును వెలువరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.

]]>
Wed, 13 Aug 2025 22:52:56 +0530 admin
జమ్మూ ఉదంపూర్ లో లోయలో పడిన సీఆర్పీఎఫ్ వాహనం https://prajakshethrenews.com/జమ్మూ-ఉదంపూర్-లో-లోయలో-పడిన-సీఆర్పీఎఫ్-వాహనం https://prajakshethrenews.com/జమ్మూ-ఉదంపూర్-లో-లోయలో-పడిన-సీఆర్పీఎఫ్-వాహనం జమ్మూ ఉదంపూర్ లో లోయలో పడిన సీఆర్పీఎఫ్ వాహనం  
ప్రమాదంలో ఇద్దరు ముగ్గురు  జవాన్లు మృతి,
12 మందికి గాయాలు  
ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయకచర్యలు

ప్రజా క్షేత్ర్, శ్రీనగర్ :

జమ్మూకశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. గురువారం కద్వా బసంత్గఢ్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, 12 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో 23 మంది జవాన్లు ఉన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారని అధికారులు తెలిపారు.

]]>
Thu, 07 Aug 2025 14:46:58 +0530 admin
పాక్ అణ్వాయుధ బెదిరింపుల‌కు త‌లొగ్గం : ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ https://prajakshethrenews.com/పాక్-అణ్వాయుధ-బెదిరింపులకు-తలొగ్గం-రక్షణ-శాఖ-మంత్రి-రాజ్నాథ్-సింగ్ https://prajakshethrenews.com/పాక్-అణ్వాయుధ-బెదిరింపులకు-తలొగ్గం-రక్షణ-శాఖ-మంత్రి-రాజ్నాథ్-సింగ్ పాక్ అణ్వాయుధ బెదిరింపుల‌కు త‌లొగ్గం
 ఎటువంటి యుద్ధ వ్యూహాల‌నైనా భారత్ తిప్పికొడుతుంద‌న్నారు
రాజ్య‌స‌భ‌లో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ జూలై 29:
 ఆప‌రేష‌న్ సింధూర్‌పై మంగళవారం  రాజ్య‌స‌భ‌లో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చ‌ర్చ‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పాకిస్థాన్ చేప‌డుతున్న అణ్వాయుధ బెదిరింపుల‌కు భార‌త్ త‌ల‌వంచ‌దు అని పేర్కొన్నారు. ఎటువంటి యుద్ధ వ్యూహాల‌నైనా తిప్పికొడుతుంద‌న్నారు. ఉగ్ర‌వాదానికి భార‌త్ వ్య‌తిరేక‌మ‌న్న ఉద్దేశాన్ని చాటేందుకు ఆపరేష‌న్ సింధూర్ సంకేతంగా నిలుస్తుంద‌ని, కానీ గ‌త ప్ర‌భుత్వాలు ద‌శాబ్ధాల క్రిత‌మే ఇలాంటి చ‌ర్య‌ల‌ను చేయాల్సి ఉండే అని అన్నారు.ఒక‌వేళ పాకిస్థాన్ ఉగ్ర‌వాదాన్ని రూపుమాపాల‌నుకుంటే, ఆ దేశానికి స‌హ‌కారం అందించేందుకు భార‌త్‌ సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. భార‌త్‌, పాకిస్థాన్ దేశాలు ఒకేసారి స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని జరుపుకుంటాయ‌ని, కానీ పాకిస్థాన్‌ను ఉగ్ర‌వాద కేంద్రంగా భావిస్తున్నార‌ని, ఇండియాను మాత్రం ప్ర‌జాస్వామ్యానికి త‌ల్లిగా భావిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఉగ్ర‌వాదం నుంచి ఎటువంటి విప్ల‌వం పుట్ట‌దు అని, దాని వ‌ల్ల కేవ‌లం విధ్వంసం, ద్వేషమే మిగులుతుంద‌న్నారు. ఉగ్ర‌వాదులేమీ ఫ్రీడం ఫైట‌ర్లు కాద‌న్నారు.ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో పాకిస్థాన్ ఎన్ని యుద్ధ విమానాల‌ను కోల్పోయిద‌న్న విష‌యాన్ని విప‌క్షాలు ఎందుకు అడ‌గ‌డం లేద‌న్నారు. కానీ భార‌తీయ యుద్ధ విమానాల గురించి మాత్ర‌మే ప్ర‌శ్న వేస్తోంద‌ని విమ‌ర్శించారు. ఏదో ఒక రోజు పీవోకే ప్ర‌జ‌లు ఇండియాతో క‌లుస్తార‌ని, భార‌తీయుల‌మ‌ని చెప్పుకునేందుకు వాళ్లు గ‌ర్వ‌ప‌డుతార‌ని రాజ్‌నాథ్ అన్నారు. ఆప‌రేష‌న్ సిందూర్‌కు కేవ‌లం కామా మాత్ర‌మే పెట్టామ‌ని, ఫుల్ స్టాప్ పెట్ట‌లేద‌న్నారు.కాల్పుల విర‌మ‌ణకు ఎందుకు అంగీక‌రించార‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై స్పందిస్తూ.. ఆప‌రేష‌న్ సింధూర్ ల‌క్ష్యం కేవ‌లం పాకిస్థాన్‌ను శిక్షించ‌డ‌మే అని, కానీ ఆ దేశంపై యుద్ధం చేయ‌డం త‌మ ఉద్దేశం కాద‌న్నారు. పాకిస్థాన్‌లో ఉన్న 9 ఉగ్ర స్థావ‌రాల‌పై ఇండియా దాడి చేసింద‌ని, ఆ దాడిలో ఒక్క పాకిస్థానీ పౌరుడు కూడా మ‌ర‌ణించ‌లేద‌ని మంత్రి రాజ్‌నాథ్ పేర్కొన్నారు.మ‌రో వైపు లోక్‌స‌భ‌లో హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్ర‌సంగంపై ప్ర‌ధాని మోదీ త‌న ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. ఆప‌రేష‌న్ సింధూర్‌, ఆప‌రేష‌న్ మ‌హాద‌వ్‌పై ఆ ప్ర‌సంగంలో పూర్తి వివ‌రాలు ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

]]>
Tue, 29 Jul 2025 23:42:13 +0530 admin
ఆపరేష‌న్ సింధూర్ కొన‌సాగుతున్న స‌మ‌యంలో.. పాకిస్థాన్ లొంగిపోయింది : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా https://prajakshethrenews.com/ఆపరేషన్-సింధూర్-కొనసాగుతున్న-సమయంలో-పాకిస్థాన్-లొంగిపోయింది-కేంద్ర-హోంశాఖ-మంత్రి-అమిత్-షా https://prajakshethrenews.com/ఆపరేషన్-సింధూర్-కొనసాగుతున్న-సమయంలో-పాకిస్థాన్-లొంగిపోయింది-కేంద్ర-హోంశాఖ-మంత్రి-అమిత్-షా ఆపరేష‌న్ సింధూర్ కొన‌సాగుతున్న స‌మ‌యంలో.. పాకిస్థాన్ లొంగిపోయింది
                         కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
 ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ జూలై 29
 ఆప‌రేష‌న్ సింధూర్‌పై ఇవాళ లోక్‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. ఆపరేష‌న్ సింధూర్ కొన‌సాగుతున్న స‌మ‌యంలో.. పాకిస్థాన్ లొంగిపోయిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆ ప‌రిస్థితికి దారితీసిన ఘ‌ట‌నల‌ను ఆయ‌న స‌భ‌లో పేర్కొన్నారు. పెహల్గామ్ ఉగ్ర‌దాడిలో 26 మంది ప‌ర్యాట‌కులు మ‌ర‌ణించార‌ని, దాంట్లో 25 మంది భార‌తీయులు, ఓ నేపాలీ ఉన్నార‌న్నారు. ఏప్రిల్ 30వ తేదీన సీసీఎస్ మీటింగ్‌లో సింధూ న‌దీ జ‌లాలపై నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. పాకిస్థానీ పౌరుల్ని వెన‌క్కి పంపామ‌న్నారు. సీఆర్పీఎఫ్‌, ఆర్మీ, జేకే పోలీసులు ఉగ్ర‌వాదుల‌కు గ‌ట్టి బ‌దులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.మే 9వ తేదీన పాకిస్థాన్‌పై దాడి కోసం ఆర్మీకి ఆదేశాలు ఇచ్చిన‌ట్లు మంత్రి షా చెప్పారు. 11 ఎయిర్‌బేస్‌ల‌ను ధ్వంసం చేశామ‌న్నారు. నూర్ ఖాన్ ఛ‌క్లా, మురిద్‌, సుగుర్దా, ర‌ఫికీ, ర‌హిమ్ ఖాన్‌, జాకోబాబాద్‌, భోలారిని ధ్వంసం చేసిన‌ట్లు చెప్పారు. ఆరు రేడార్ల‌ను, స‌ర్ఫేస్ టు ఎయిర్ ఆయుధాల‌ను ధ్వంసం చేశామ‌న్నారు. ఎయిర్ బేస్‌ల‌ను టార్గెట్ చేయ‌లేద‌ని, కానీ భార‌త్‌లో ఉన్న పౌర ప్రాంతాల‌ను పాకిస్థాన్ అటాక్ చేసే ప్ర‌య‌త్నం చేసింద‌న్నారు. పాకిస్థాన్ త‌న దాడుల‌కు చెందిన అన్ని ర‌కాల సామ‌ర్థ్యాల‌ను కోల్పోవ‌డంతో, ఆ ద‌శ‌లో ఆ దేశానికి మ‌రో అవ‌కాశం లేకుండా పోయింద‌ని, అప్పుడు పాకిస్థాన్ లొంగిపోయిన‌ట్లు అమిత్ షా తెలిపారు.మే 10వ తేదీన పాకిస్థాన్ డీజీఎంవో.. దాడుల్ని ఆపేస్తున్న‌ట్లు సాయంత్రం 5 గంట‌ల‌కు ఫోన్ చేశార‌న్నారు. అయితే అడ్వాంటేజ్ ఉన్న స‌మ‌యంలో ఎందుకు అటాక్ చేయ‌లేద‌ని ప్ర‌శ్నిస్తున్నార‌ని, కానీ ప్ర‌తి యుద్ధానికి ఓ సామాజిక కోణం ఉంటుంద‌ని మంత్రి అన్నారు. 1951, 1971లో జ‌రిగిన యుద్ధాల గురించి ఆయ‌న వెల్ల‌డించారు. పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ను నెహ్రూ అప్ప‌గించార‌ని, షిమ్లా ఒప్పందంలో దాన్ని డిమాండ్ చేయ‌లేదన్నారు.

]]>
Tue, 29 Jul 2025 23:37:06 +0530 admin
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు : ఎఐసిసి అద్యక్షులు మల్లికార్జున ఖర్గే https://prajakshethrenews.com/కాంగ్రెస్-ప్రభుత్వ-హయాంలోనే-ప్రభుత్వ-రంగ-సంస్థలు-ఏర్పాటు-ఎఐసిసి-అద్యక్షులు-మల్లికార్జున-ఖర్గే https://prajakshethrenews.com/కాంగ్రెస్-ప్రభుత్వ-హయాంలోనే-ప్రభుత్వ-రంగ-సంస్థలు-ఏర్పాటు-ఎఐసిసి-అద్యక్షులు-మల్లికార్జున-ఖర్గే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు
              ఎఐసిసి  అద్యక్షులు మల్లికార్జున ఖర్గే  
ప్రజా క్షేత్ర్,  న్యూఢిల్లీ జూలై  29 :
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయ్యాయని ఎఐసిసి మల్లికార్జున ఖర్గే తెలిపారు. తమరు ప్రభుత్వ రంగ కార్ఖానాలు కాదు.. అబద్ధపు కార్ఖానాలు ఏర్పాటు చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ పై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కీలకమైన అంశంపై పార్లమెంటు లో చర్చ జరుగుతుంటే ప్రధాని నరేంద్రమోడీ సభలో లేరని, కీలకమైన చర్చను వదిలేసి బిహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిందని తెలియజేశారు. పార్లమెంటుకు రాకుండా ఎన్నికల ప్రచారానికి వెళ్లడమే దేశభక్తి అవుతుందా? అని ప్రశ్నించారు. పహల్గాం దాడి   తర్వాత పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని అడిగితే  మోడీ స్పందించలేదని, ఘటన జరిగిన 3 నెలల తర్వాత పార్లమెంటులో చర్చ పెట్టారని మండిపడ్డారు. విపక్షాలు పాకిస్థాన్ కు మద్దతు ఇస్తున్నాయని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అసత్యాలతో ఎక్కువకాలం ప్రజలను మభ్య పెట్టలేరని అన్నారు. తాము ఎప్పుడూ పాకిస్థాన్ కు మద్దతు ఇవ్వలేదని, ఇవ్వబోము అని చెప్పారు. కాంగ్రెస్ దేశాన్ని నిర్మించిన పార్టీ.. కాంగ్రెస్ కు చాలా చరిత్ర ఉందని కొనియాడారు. పహల్గాం ఘటనతో సంబంధం లేని అంశాలను లేవనెత్తుతున్నారని, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందని ధ్వజమెత్తారు. తాము మొదట నుంచి చెబుతున్నామని, ఉగ్రవాద సమస్య బిజెపి హయాంలో మూడింతలు అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉగ్రవాదాల మూలాలు దెబ్బతీస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ పర్యటనలో చెప్పారని అన్నారు. పాక్ ఉగ్రవాదులు పహల్గాం వరకు ఎలా వచ్చారని, పహల్గాం దాడికి 3 రోజుల ముందు ప్రధాని జమ్మూ పర్యటన రద్దు చేసుకున్నారని ఎద్దేవ చేశారు. ప్రధాని పర్యటన రద్దు చేసుకుంటారని.. పర్యాటకులను ఎలా అనుమతించారని నిలదీశారు. పహల్గాం దాడి కచ్చితంగా భద్రతా వైఫల్యమని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. అన్నీ తన ఘనతగా చెప్పుకునే జవాబుదారీ మోడీ.. పహల్గాం ఘటనకు ఎందుకు బాధ్యత వహించరు? అని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. సైనికులు సాధించిన విజయాన్ని కూడా రాజకీయం చేయడం తగదని.. ఆపరేషన్ సిందూర్ లో భారత విజయంపై కాంగ్రెస్ కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించిందని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.

]]>
Tue, 29 Jul 2025 23:32:20 +0530 admin
సరిహద్దుల్లోని సైనికులకు ఇక బాడీ కెమెరాలు https://prajakshethrenews.com/సరిహద్దుల్లోని-సైనికులకు-ఇక-బాడీ-కెమెరాలు https://prajakshethrenews.com/సరిహద్దుల్లోని-సైనికులకు-ఇక-బాడీ-కెమెరాలు సరిహద్దుల్లోని సైనికులకు ఇక బాడీ కెమెరాలు
ప్రజా క్షేత్ర్, శ్రీనగర్, జూలై 28 :
సరిహద్దుల్లో చొరబాటుదారుల ఆగడాలకు కేంద్రం టెక్నాలజీతో చెక్‌ పెట్టబోతోంది.  జవాన్లకు బాడీ కెమెరాలు అందజేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భారత్‌ సరిహద్దుల్లోకి వచ్చిన అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపించే క్రమంలో సాయుధ బలగాలపైనే తిరగబడుతూ దాడులు చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న సరిహద్దు బలగాలు.. ఇటువంటి ఘటనలను ఆధారాలతో సహా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దాంతో.. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కార్యకలాపాలను మరింత మెరుగుపరిచేందుకు అధునాతన బాడీ-వోర్న్ కెమెరాలను సమకూర్చుకుంటోంది. ఈ కెమెరాలు జవాన్ల యూనిఫామ్‌లకు అమర్చబడి, సరిహద్దుల్లో జరిగే ప్రతి అంశాన్ని రికార్డు చేస్తాయి. దానిలో భాగంగానే.. భారత్‌-బంగ్లాదేశ్‌, పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లోని బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు 5వేలకు పైగా శరీరానికి ధరించే కెమెరాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.ముఖ్యంగా.. బంగ్లాదేశ్, పాక్ సరిహద్దుల వెంట విధులు నిర్వర్తిస్తున్న BSF దళాలకు ఆయా బాడీ కెమెరాలను అందించనుంది. ఇప్పటికే 2,500 కెమెరాలను పంపిణీ చేయగా, మరో 2,500 కెమెరాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు ఎంపిక చేసిన సరిహద్దు ఔట్‌ పోస్టుల్లోని సిబ్బందికి ఫింగర్‌ప్రింట్‌, ఐరిస్‌ స్కాన్‌ వంటి బయోమెట్రిక్‌ పరికరాలను అందించనున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌ అక్రమ చొరబాటుదారుల నుంచి సేకరించిన ఈ సమాచారాన్ని ఫారినర్స్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌కు అందజేయనుంది.బీఎస్‌ఎఫ్‌ ప్రతిపాదించిన ఈ రెండు విధానపర నిర్ణయాలపై సమగ్ర సమీక్ష తర్వాత కేంద్ర హోంశాఖ ఇటీవల ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే.. రెండు దశల్లో వీటిని భారత్‌-బంగ్లా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న బీఎస్‌ఎఫ్‌కు అందజేస్తుంది. రాత్రిపూట చిత్రీకరణ, 12-14 గంటల ఫుటేజీ నిక్షిప్తం చేసుకునే సామర్థ్యం ఈ కెమెరాలకు ఉండనుంది.

]]>
Mon, 28 Jul 2025 22:25:50 +0530 admin
రైల్వే ట్రాక్‌ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మూడు ఏనుగులు మృతి https://prajakshethrenews.com/రైల్వే-ట్రాక్-దాటుతుండగా-రైలు-ఢీకొట్టడంతో-మూడు-ఏనుగులు-మృతి https://prajakshethrenews.com/రైల్వే-ట్రాక్-దాటుతుండగా-రైలు-ఢీకొట్టడంతో-మూడు-ఏనుగులు-మృతి రైల్వే ట్రాక్‌ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మూడు ఏనుగులు మృతి
ప్రజా క్షేత్ర్, ఖరగ్‌పూర్‌ జూలై 18 :
ఓ ఏనుగుల  మంద రైల్వే ట్రాక్‌  దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మూడు ఏనుగులు మృతిచెందాయి. వాటిలో ఒక తల్లి ఏనుగు కాగా రెండు గున్న ఏనుగులు ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌  రాష్ట్రంలోని బస్టోలా  రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఖరగ్‌పూర్‌-టాటానగర్‌ రైల్వే మార్గంలో ఏడు ఏనుగులతో కూడిన ఓ మంద ట్రాక్‌ దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లి ఏనుగు సహా దాని రెండు పిల్లలు అక్కడికక్కడే మరణించాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు.ఏనుగుల కళేబరాలను క్రేన్‌ సాయంతో ట్రాక్‌పై నుంచి తొలగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా రైలు ప్రమాదాల్లో ఏనుగులు మరణించడం ఇదే తొలిసారి కాదని, దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో రైళ్లు ఢీకొట్టడంతో ఏనుగులు మృతిచెందాయని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

]]>
Sat, 19 Jul 2025 00:41:34 +0530 admin
తెలంగాణకు ఎరువుల కొరత తీరుస్తాం : కేంద్ర మంత్రి జేపీ నడ్డా https://prajakshethrenews.com/తెలంగాణకు-ఎరువుల-కొరత-తీరుస్తాం-కేంద్ర-మంత్రి-జేపీ-నడ్డా https://prajakshethrenews.com/తెలంగాణకు-ఎరువుల-కొరత-తీరుస్తాం-కేంద్ర-మంత్రి-జేపీ-నడ్డా తెలంగాణకు ఎరువుల కొరత తీరుస్తాం....
    సీఎం రేవంత్ రెడ్డి వినతికి స్పందించిన కేంద్రం
ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ జూలై 9 :
తెలంగాణ రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని విధాలా సహకారం అందిస్తామని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి  జేపీ నడ్డా హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.మంగళవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రానికి సరిపడా యూరియా, ఎరువులు సరఫరా చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జూలై, ఆగస్టు నెలల్లో యూరియాను నిరాటంకంగా సరఫరా చేయాలని  విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తి పై స్పందించిన కేంద్ర మంత్రి నడ్డా రైతుల అవసరాలను తీర్చడానికి  మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణకు అవసరమైన మేరకు సరఫరా ఉండేలా చూసుకోవాలని ఎరువుల శాఖ అధికారులను ఆదేశించారు. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సమానంగా ఎరువులు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కోరారు.ఇదే సమయంలో తెలంగాణలో యూరియా వినియోగం పెరుగుతుండటంపై కేంద్ర మంత్రి నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు.  2023-24 యాసంగి తో పోలిస్తే 2024-25 యాసంగి లో యూరియా అమ్మకాలు 21% అధికమయ్యాయని అన్నారు.రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ప్రణామ్  పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు అందిస్తుందని ప్రస్తావించారు.

]]>
Wed, 09 Jul 2025 22:44:23 +0530 admin
రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం.. ఒకరు మృతి https://prajakshethrenews.com/రాజస్థాన్లో-కుప్పకూలిన-యుద్ధ-విమానం-ఒకరు-మృతి https://prajakshethrenews.com/రాజస్థాన్లో-కుప్పకూలిన-యుద్ధ-విమానం-ఒకరు-మృతి రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం.. ఒకరు మృతి

ప్రజాక్షేత్ర్,  రతన్‌ఘర్ జూలై 9 :

రాజస్థాన్‌లోని చురు జిల్లా రతన్‌ఘర్‌లో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన జాగ్వర్ విమానం కుప్పకూలిపోయింది. ఈ యుద్ధ విమానం సూరత్‌గఢ్‌లోని ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయింది. ఆకాశంలో ఉండగానే విమానం నియంత్రణ కోల్పోయిందని స్థానికులు చెబుతున్నారు. విమానం కూలిన పొలాల్లో కూలడంతో అక్కడ మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను అదుపు చేశామని చెప్పారు. కూలిన విమానం నుంచి ఒకరి మృతదేహాన్ని బయటకు తీశామని స్థానికులు పేర్కొన్నారు. అయితే భారత వాయుసేన మాత్రం ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలైనట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ ప్రమాదంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని పేర్కొంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు, ఆర్మీ అధికారులు ఘటనస్థలానికి చేరుకొని ఘటన ఎలా జరిగిందని దర్యాప్తు చేస్తున్నారు.

]]>
Wed, 09 Jul 2025 18:05:38 +0530 admin
భారత్‌ లోనూ అందుబాటులోకి గూగుల్‌ సెర్చ్‌ ఏఐ మోడ్‌’ https://prajakshethrenews.com/భారత్-లోనూ-అందుబాటులోకి-గూగుల్-సెర్చ్-ఏఐ-మోడ్ https://prajakshethrenews.com/భారత్-లోనూ-అందుబాటులోకి-గూగుల్-సెర్చ్-ఏఐ-మోడ్ భారత్‌ లోనూ అందుబాటులోకి గూగుల్‌ సెర్చ్‌ ఏఐ మోడ్‌’

ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ జూలై 9 :

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఏ సమాచారం కావాలన్నా.. ‘గూగుల్‌ సెర్చ్‌’   ఓపెన్‌ చేయాల్సిందే! ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 శాతం మందికి ఇదే పెద్దదిక్కు. ప్రతిరోజూ 850 కోట్ల శోధనలను ప్రాసెస్‌ చేస్తుంది. యూజర్లు అడిగిన సమాచారాన్ని.. సంబంధిత వెబ్‌లింక్‌లను వెతికి ఇస్తుంది. అయితే, చాట్‌జీపీటీ రాకతో గూగుల్‌ కూడా ‘ఏఐ’ వైపు   అడుగులు వేసింది. తన సెర్చ్‌ ఇంజిన్‌కు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను అనుసంధానం చేసింది.ఇప్పటికే అమెరికాలో విడుదలై విజయవంతంగా సేవలు అందిస్తున్న ‘గూగుల్‌ సెర్చ్‌ ఏఐ మోడ్‌’ ఇప్పుడు భారత్‌  లోనూ అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి సైన్‌అప్స్‌ చేయకుండానే డైరెక్ట్‌గా మొబైల్‌, వెబ్‌ వెర్షన్లలో ఏఐ ఆధారిత శోధనలు చేసుకోవచ్చు. ఇప్పటివరకు గూగుల్‌లో ఏదైనా వెతికితే.. అందుకు సంబంధించిన వెబ్‌లింక్‌లు మాత్రమే వచ్చేవి. కొన్ని సంక్లిష్టమైన ప్రశ్నలకు జవాబులు దొరికేవి కాదు కానీ, ఈ సరికొత్త ఏఐ మోడ్‌ టూల్‌తో.. ఎలాంటి ప్రశ్నకైనా ఇట్టే సమాధానం దొరుకుతుంది.వినియోగదారుల మనసులో ఏమున్నా.. గూగుల్‌ను నేరుగా అడగొచ్చు. వాటికి గూగుల్‌ ఏఐ టూల్‌ ‘జెమిని’ సహాయంతో సమాధానాన్ని అందిస్తుంది. అందుకే, ఈ గూగుల్‌ సెర్చ్‌ ఏఐ మోడ్‌ను ‘జెమిని 2.5’  వెర్షన్‌గా చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇంగ్లీషులో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ సేవలు అందించనున్నది

]]>
Wed, 09 Jul 2025 18:02:09 +0530 admin
తమిళనాడులో స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు..ఇద్దరు విద్యార్థుల మృతి. https://prajakshethrenews.com/తమిళనాడులో-స్కూల్-వ్యాన్ను-ఢీకొట్టిన-రైలుఇద్దరు-విద్యార్థుల-మృతి https://prajakshethrenews.com/తమిళనాడులో-స్కూల్-వ్యాన్ను-ఢీకొట్టిన-రైలుఇద్దరు-విద్యార్థుల-మృతి తమిళనాడులో స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు..ఇద్దరు విద్యార్థుల మృతి.
కడలూరుసమీపంలో ఘోర రైలు ప్రమాదం
ప్రజా క్షేత్ర్, చెన్నై :
తమిళనాడులోని కడలూర్ సమీపంలో  తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెమ్మన్కుప్పం రైల్వే క్రాసింగ్ వద్ద పాఠశాల విద్యార్థులతో వెళుతున్న వ్యాన్ను రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర దుర్ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులతో కూడిన స్కూల్ వ్యాన్ సెమ్మన్కుప్పం వద్ద రైల్వే ట్రాక్ను దాటుతోంది. అదే సమయంలో వేగంగా వస్తున్న రైలు వ్యాన్ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వ్యాన్ నుజ్జునుజ్జయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన కడలూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నది.

]]>
Wed, 09 Jul 2025 08:35:05 +0530 admin
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు .. 63 మంది మృతి https://prajakshethrenews.com/హిమాచల్-ప్రదేశ్లో-భారీ-వర్షాలు-63-మంది-మృతి https://prajakshethrenews.com/హిమాచల్-ప్రదేశ్లో-భారీ-వర్షాలు-63-మంది-మృతి హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు .. 63 మంది మృతి
ప్రజా క్షేత్ర్, న్యూ ఢిల్లీ జూలై 4 :
ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవడంతో వరదలు పొటెత్తాయి. ఈ వరదల కారణంగా 63 మంది చనిపోగా పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దాదాపుగా రూ.400 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వరదలో మృతిచెందిన వారి సంఖ్య వందకు పైగా ఉంటుందని స్థానిక మీడియా అంచనా వేస్తోంది.మండి జిల్లా నుంచి 17, కాంగ్రా(13), చంబా(06), సిమ్లా(05) ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వంద మందికి పైగా గాయపడినట్టు సమాచారం. భయకరంగా వరదలు పొటెత్తడంతో వందలాది ఇండ్లు ధ్వంసం కావడంతో పాటు 14 వంతెనాలు కొట్టుకొనిపోయాయి. కొన్ని ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడడంతో పాటు వేల మంది ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

]]>
Fri, 04 Jul 2025 21:50:24 +0530 admin
ఏజేఎల్ కు పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నకిలీ లావాదేవీలు జరిపారు https://prajakshethrenews.com/ఏజేఎల్-కు-పలువురు-సీనియర్-కాంగ్రెస్-పార్టీ-నేతలు-నకిలీ-లావాదేవీలు-జరిపారు https://prajakshethrenews.com/ఏజేఎల్-కు-పలువురు-సీనియర్-కాంగ్రెస్-పార్టీ-నేతలు-నకిలీ-లావాదేవీలు-జరిపారు ఏజేఎల్ కు పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నకిలీ లావాదేవీలు జరిపారు

              ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన ఆరోపానాలు

ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీజులై 2 ;: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనియారాహుల్ గాంధీలకు సంబంధమున్న అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నకిలీ లావాదేవీలు జరిపారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. బుధవారం న్యూఢిల్లీ కోర్టులో ఈడీ తరఫు న్యాయవాది అదనపు సోలిసిటర్ జనరల్ వి. రాజు తన వాదనలు వినిపించారు. చాలా ఏళ్లుగా వీరు మోసపూరితంగా ఇలా అద్దె చెల్లించారన్నారు.అందుకు సంబంధించిన రశీదులను వీరు తయారు చేశారని తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతల సూచనల మేరకే ఈ నగదును వీరు ఇలా ఏజేఎల్‌కు బదిలీ చేశారని కోర్టుకు విన్నవించారు. ఇదే తరహాలో.. అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సూచనల మేరకు అడ్వర్టైజ్‌మెంట్ నిధులు సైతం దారి మళ్లించారని వివరించారు. ఇటువంటి మోసపూరిత మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం నేరమని ఈడీ తరఫు న్యాయవాది ఈ సందర్భంగా కోర్టుకు స్పష్టం చేశారు.ఇక ఈ కేసులో దాతలను సైతం ఈడీ ఇప్పటికే ప్రశ్నించిందని గుర్తు చేశారు. అలాగే సీనియర్ నేతలను సైతం విచారించిందని చెప్పారు. అలాగే షేర్ల బదిలీపై ప్రశ్నించాల్సి ఉందన్నారు. సుమన్ దుబే షేర్లను సోనియా గాంధీకిఆస్కార్ ఫెర్నాండేజ్ షేర్లను రాహుల్ గాంధీకి బదిలీ చేశారన్నారు. కానీ ఆ తర్వాత ఈ షేర్లను ఆస్కార్ ఫెర్నాండెజ్‌కు తిరిగి బదిలీ చేశారని సోదాహరణగా కోర్టుకు ఆయన వివరించారు. ఇవన్నీ నకిలీ లావాదేవీలని న్యాయవాది వి రాజు ఈ సందర్బంగా పేర్కొన్నారు. అయితే 2015 వరకు ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందారని.. వారిద్దరు సోనియారాహుల్ గాంధీలు మాత్రమేనని కోర్టుకు న్యాయవాది వి. రాజు తెలిపారు.

 

]]>
Wed, 02 Jul 2025 22:04:08 +0530 admin
సుప్రీంకోర్టు సిబ్బంది నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయం https://prajakshethrenews.com/సుప్రీంకోర్టు-సిబ్బంది-నియామకాల్లో-ఎస్సీ-ఎస్టీలకు-రిజర్వేషన్లు-చారిత్రక-నిర్ణయం https://prajakshethrenews.com/సుప్రీంకోర్టు-సిబ్బంది-నియామకాల్లో-ఎస్సీ-ఎస్టీలకు-రిజర్వేషన్లు-చారిత్రక-నిర్ణయం

సుప్రీంకోర్టుసిబ్బంది నియామకాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయం

     హర్షం వ్యక్తం చేసిన బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూలై 2 ;

స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సిబ్బంది నియామకాలు మరియు పదోన్నతుల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లను అధికారికంగా అమలు చేయడం ఒక చారిత్రకప్రగతిశీల నిర్ణయమని బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ పేర్కొన్నారు.భారత సుప్రీంకోర్టు తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయాన్ని బిజెపి ఎస్సీ మోర్చా హృదయపూర్వకంగా స్వాగతిస్తోందన్నారు.గత 75 ఏళ్లుగా అమలుకాకుండా ఉన్న కోటా విధానాన్నిఇప్పుడు పునరుద్ధరించడం చారిత్రక ఘట్టం.  SCలకు 15% రిజర్వేషన్, STలకు 7.5% రిజర్వేషన్ కల్పించడం సామాజిక న్యాయంసమాన ప్రాతినిధ్యం దిశగా గొప్ప ముందడుగు. భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ సామాజిక న్యాయం కోసం కట్టుబాటుగా నిలుస్తోంది.బలహీనపీడిత వర్గాలుదళితులకు రాజకీయ మరియు ఆర్థిక ప్రాతినిధ్యం పెరగాలని బిజెపి నిరంతరం కృషి చేస్తోంది.ప్రస్తుతం మోదీ మంత్రివర్గంలో 10 మంది ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులుఐదుగురు షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ST) వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలుబోర్డులుయూనివర్సిటీల్లో ఎస్సీఎస్టీలకు గణనీయమైన ప్రాతినిధ్యం లభిస్తోంది.దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్ ను అనంతరం ఆదివాసీ సమాజానికి చెందిన ద్రౌపది ముర్ము ను  రాష్ట్రపతిగా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ గారిదే నన్నరు .మోదీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోకార్పొరేట్ బోర్డుల్లోవిశ్వవిద్యాలయాల గవర్నింగ్ కౌన్సిల్లలో ఎస్సీఎస్టీలకు ప్రాతినిధ్యం పెరిగింది. భారతీయ రాజ్యాంగ విలువలకు అనుగుణంగాఅత్యున్నత న్యాయ వ్యవస్థ రిజర్వేషన్లను తన కార్యాలయాల్లో అమలు చేయడం ఎంతో విశిష్టమైనచారిత్రక పరిణామ మన్నారు.

 

]]>
Wed, 02 Jul 2025 21:49:26 +0530 admin
భారీ వర్షాలకు హిమాచల్‌ అతలాకుతలం.. 51 మంది మృతి https://prajakshethrenews.com/భారీ-వర్షాలకు-హిమాచల్-అతలాకుతలం-51-మంది-మృతి https://prajakshethrenews.com/భారీ-వర్షాలకు-హిమాచల్-అతలాకుతలం-51-మంది-మృతి భారీ వర్షాలకు హిమాచల్‌ అతలాకుతలం.. 51 మంది మృతి

ప్రజా క్షేత్ర్, సిమ్ల జూలై 2 ; హిమాచల్‌ప్రదేశ్‌  లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు   కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నదులకు వరద ప్రవాహం పెరిగింది. పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అనేక రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ వర్షాకాల సీజన్‌లో ఇప్పటి వరకూ 51 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ జూన్‌ 20 నుంచి జులై 2 వ తేదీ వరకూ రాష్ట్రంలో వర్షాల కారణంగా జరిగిన నష్టంపై ఓ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికలో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ప్రాణఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ‘ఆకస్మిక వరదలుకొండచరియలు విరిగిపడటంపిడుగులు పడటం వంటి వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో 51 మంది మరణించారు. దాదాపు 22 మంది గల్లంతయ్యారు. మండి జిల్లాలో అత్యధికంగా 10 మంది మరణించారు. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 103 మంది గాయపడ్డారు’ అని సదరు నివేదికలో వెల్లడించింది.

]]>
Wed, 02 Jul 2025 18:40:27 +0530 admin
ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలోఅపశ్రుతి https://prajakshethrenews.com/ఒడిశాలో-పూరీ-జగన్నాథ-రథయాత్రలోఅపశ్రుతి https://prajakshethrenews.com/ఒడిశాలో-పూరీ-జగన్నాథ-రథయాత్రలోఅపశ్రుతి

ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలోఅపశ్రుతి

గుండిచా ఆలయం వద్ద జరిగిన తోపులాటలో ముగ్గురు భక్తులు మృతి

  ప్రజా క్షేత్ర్, పూరీ జూన్ 29 ;:

ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలో  అపశ్రుతి చోటుచేసుకున్నది. గుండిచా ఆలయం వద్ద జరిగిన తోపులాటలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. జగన్నాథుడుఅతని తోబుట్టువులు బలధ్రుడుసుభద్రా దేవితో కూడిన రథాలు ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి చేరుకున్నాయి. రథాలను లాగేందుకుజగన్నాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.ఈ క్రమంలో ఆదివారం ఉదయం 4.30 గంటల సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకున్నది. దీంతో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందాచరు. వారిలో ప్రభాతి దాస్‌బసంతి సాహూ అనే ఇద్దరు మహిళలు ఉండగాప్రేమ్‌కాంత్‌ మొహంతి అనే 70 ఏండ్ల వృద్ధుడు ఉన్నారు. వీరంతా ఒడిశాలోని ఖుద్రా జిల్లాకు చెందినవారనిపూరి రథయాత్రను తిలకించేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కాగాభక్తుల రద్దీకి తగిన విధంగా పోలీసులు ఏర్పాట్లు చేయలేదని స్థానిక మీడియా వెల్లడించింది.

 

]]>
Sun, 29 Jun 2025 20:25:09 +0530 admin
ట్రకోమా రహిత దేశంగా భారత్‌ https://prajakshethrenews.com/ట్రకోమా-రహిత-దేశంగా-భారత్ https://prajakshethrenews.com/ట్రకోమా-రహిత-దేశంగా-భారత్ ట్రకోమా రహిత దేశంగా భారత్‌

       ప్రకటించిన  ప్రపంచ ఆరోగ్య సంస్థ 

కృషి చేసిన అందరికీ అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ జూన్ 29 :

భారత్‌ ట్రకోమా రహిత దేశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ  ప్రకటించిన విషయాన్ని ప్రధాని   నరేంద్రమోదీ    గుర్తుచేశారు. భారత్‌ ట్రకోమా రహిత దేశంగా మారడంలో కృషి చేసిన అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. భారత్‌ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ అయిన ట్రకోమా రహిత దేశంగా అవతరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆ విషయాన్ని ఆదివారం తన మన్‌ కీ బాత్‌లో గుర్తుచేశారు.ఆదివారం ప్రధాని మోదీ 123వ మన్‌ కీ బాత్‌ ఎపిసోడ్‌ ప్రసారమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్‌ 21న జరిగిన యోగాడే కార్యక్రమంలో దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది పాల్గొన్నారని అన్నారు. దాదాపు పదేళ్ల క్రితం మొదలైన ఈ కార్యక్రమం ఏటేట మరింత విస్తరిస్తోందని చెప్పారు. చాలామంది యోగాను తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారని తెలిపారు.50 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ విధించిన వాళ్లు రాజ్యాంగాన్ని హత్య చేయడంతోపాటు న్యాయ విభాగాన్ని బానిసగా మార్చుకోవాలనుకున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. నాడు జార్జిఫెర్నాండెజ్‌ను సంకెళ్లతో బంధించారన్నారు. కానీ భారత ప్రజలు శక్తిమంతమైన వారు కావడంతో ఎమర్జెన్సీ తొలగిపోయిందని చెప్పారు. దానిని విధించినవారు ఓడిపోయారని గుర్తుచేశారు.మొరార్జీ దేశాయ్‌వాజ్‌పేయిబాబూ జగ్జీవన్‌ రామ్‌ లాంటి నేతల ప్రసంగాలను మోదీ వినిపించారు. ఎమర్జెన్సీపై పోరాడిన వారిని కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఫుట్‌బాల్‌ ఆటగాళ్లకు కేంద్రంగా బోడోల్యాండ్‌ మారిందని అభినందించారు. వారు పరిమిత వనరులతోనే సాధన చేసి అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు.దేశంలోని చిన్నారులకు వారు ఆదర్శంగా మారారని కొనియాడారు. ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి‌ఊబకాయం తగ్గించుకోవడానికి ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని సూచించారు. అదేవిధంగా మేఘాలయ ఎరీసిల్క్‌కు జీఐ ట్యాగ్‌ లభించిందని చెప్పారు. పురుగులను చంపకుండా వస్త్రాన్ని తయారు చేయడం దాని ప్రత్యేకతని తెలిపారు.ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో బౌద్ధ క్షేత్రాలకు విదేశాల్లో అత్యంత ప్రాధాన్యం ఉందని చెప్పారు. అందరూ తమతమ ప్రాంతాల్లోని బౌద్ధ క్షేత్రాలను ఒక్కసారైనా సందర్శించాలని సూచించారు. అదేవిధంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న శుభాంశు శుక్లాకు ప్రధాని అభినందనలు తెలిపారు.

]]>
Sun, 29 Jun 2025 17:48:16 +0530 admin
ఒక్కటవుతున్న ఠాక్రే బ్రదర్స్ https://prajakshethrenews.com/ఒక్కటవుతున్న-ఠాక్రే-బ్రదర్స్ https://prajakshethrenews.com/ఒక్కటవుతున్న-ఠాక్రే-బ్రదర్స్ ఒక్కటవుతున్న ఠాక్రే బ్రదర్స్
ప్రజా క్షేత్ర్, ముంబై, జూన్ 28 :
20 ఏళ్ల తరువాత ఠాక్రే బ్రదర్స్‌ ఏకమవుతున్నారు. మహారాష్ట్రలో హిందీకి వ్యతిరేకంగా ఉద్దవ్‌ ఠాక్రే, రాజ్‌ ఠాక్రే ఏకమయ్యారు. జులై 5వ తేదీన హిందీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. శివసేన ఉద్దవ్‌ వర్గం, MNS పార్టీలు ఉమ్మడిగా ఈ ఆందోళనను చేపట్టబోతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కంటే మహారాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఉద్దవ్‌ ఠాక్రే , రాజ్‌ ఠాక్రే ప్రకటించారు. మహాయుతి కూటమిపై ఠాక్రే బ్రదర్స్‌ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు హిందీని కంపల్సరీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మరాఠీ భాషను కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్దమని ఉద్దవ్‌ ఠాక్రే ప్రకటించారు. జాతీయ విద్యా విధానం NEPలో హిందీ తప్పనిసరి అని ఎక్కడ లేదన్నారు. ప్రతి రాష్ట్రానికి ఒక అధికారిక భాష ఉంటుందని , మహారాష్ట్రకు మరాఠీ అధికారిక భాష అన్నారు ఉద్దవ్‌ ఠాక్రే.తమకు మహారాష్ట్ర ప్రయోజనాలనే ముఖ్యమన్నారు ఉద్దవ్‌ వర్గం ఎంపీ సంజయ్‌ రౌత్‌. అందుకే మరాఠీ భాష కోసం ఇద్దరు ఏకమవుతున్నారని చెప్పారు. వాస్తవానికి జులై 7వ తేదీన ఉద్దవ్‌ ఠాక్రే ఆందోళనలకు పిలుపునిచ్చారని , కాని రాజ్‌ ఠాక్రే ఫోన్‌ చేసి ఐదో తేదీన ఆందోళనలు నిర్వహించాలని కోరారని చెప్పారు. మరాఠీ భాష కోసం రెండు పార్టీలు పోరాటం చేస్తున్నందున వేర్వేరుగా ఆందోళనలు చేయడం మంచిది కాదని చెప్పారన్నారు. రాజ్‌ ఠాక్రే విజ్ఞప్తికి ఉద్దవ్‌ ఠాక్రే అంగీకరించారని సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు. అయితే రాజకీయ అవసరాల కోసమే ఠాక్రే బ్రదర్స్‌ ఏకమవుతున్నారని మహాయుతి కూటమి నేతలు విమర్శించారు. ఉద్దవ్‌ ఠాక్రే సీఎంగా ఉన్నప్పుడే మహారాష్ట్రలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారని అన్నారు సీఎం ఫడ్నవీస్‌.

]]>
Sat, 28 Jun 2025 10:30:02 +0530 admin
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ చర్యలు తీసుకోవాలి : ప్రశాంత్ కిషోర్ https://prajakshethrenews.com/తెలంగాణ-ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డిపై-రాహుల్-గాంధీ-చర్యలు-తీసుకోవాలి-ప్రశాంత్-కిషోర్ https://prajakshethrenews.com/తెలంగాణ-ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డిపై-రాహుల్-గాంధీ-చర్యలు-తీసుకోవాలి-ప్రశాంత్-కిషోర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ చర్యలు తీసుకోవాలి
               జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ డిమాండ్
ప్రజా క్షేత్ర్, పాట్నా జూన్ 27 :
 బీహార్ ప్రజలను కించపరిచేలా మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చర్యలు తీసుకోవాలని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. ఆ తరువాతే బీహార్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రాహుల్ రావాలని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి  కెసిఆర్ బీహార్ అడ్వైసర్‌లను, అధికారులను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించాడని, కూలీ పనులు చేయడం బీహార్ ప్రజల డిఎన్ఎలోనే ఉందని రేవంత్ రెడ్డి మాట్లాడారని గుర్తు చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ ఏం మొహం పెట్టుకొని బీహార్‌లోకి వస్తున్నారని ప్రశ్నించారు.. బీహార్ ప్రజలను కించపరిచేలా మాట్లాడిన రేవంత్ రెడ్డిపై ముందు చర్యలు తీసుకున్న తరువాతే రాహుల్ గాంధీ బీహార్‌లో ఎన్నికల ప్రచారానికి రావాలని ప్రశాంత్ కిశోర్ విమర్శలు గుప్పించారు.రాహుల్ ఢిల్లీలో ఉండి బీహార్ వాళ్ల జోకులు వేస్తున్నారని, బీహార్ కు వచ్చి ఉపన్యాసం ఇవ్వాలని ఎద్దేవా చేశారు. 1989లో అప్పటి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ బీహార్ కు రూ.50000 కోట్లు కేటాయించారని, నిధులు మాత్రం ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. బీహార్ లో లోక్ సభ ఎన్నికలలో ప్రధాని మంత్రి మోడీ సక్సెస్ అయ్యారని తెలిపారు. బీహార్‌లో కుల ప్రాతిపదికన, మోడీ పేరుతో ప్రజలు ఓట్లు వేస్తారని పిఎం నరేంద్ర మోడీ అన్నారని, మోడీ కులానికి చెందిన ప్రజలు బీహార్‌లో ఎంత మంది ఉన్నారని ప్రశాంత్ కిశోర్ ప్రశ్నించారు. మోడీ కులానికి చెందిన వ్యక్తులు బీహార్‌లో లేనప్పుడు మోడీకి ఎలా ఓట్లు పడ్డాయని నిలదీశారు

]]>
Fri, 27 Jun 2025 23:32:01 +0530 admin
అలకనంద నదిలో పడిపోయిన బస్సు https://prajakshethrenews.com/అలకనంద-నదిలో-పడిపోయిన-బస్సు https://prajakshethrenews.com/అలకనంద-నదిలో-పడిపోయిన-బస్సు అలకనంద నదిలో పడిపోయిన బస్సు
ప్రజా క్షేత్ర్, డెహ్రాడూన్, జూన్ 26 :
ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌ రుద్రప్రయాగ్‌లోని రిషికేశ్ బద్రీనాథ్ జాతీయ రహదారి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అలకనంద నదిలో పడిపోయింది. బస్సులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటన పార్ఘోల్తీర్ సమీపంలో జరిగింది.. అక్కడ ఒక మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టింది.. ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించాడు. చాలా మంది ప్రయాణికులు నీటిలో గల్లంతయ్యారని అధికారులు పేర్కొంటున్నారు.ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, SDRF, పోలీసులు, పరిపాలన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. వెంటనే సహాయక చర్యలను ప్రారంభించాయి. రుద్రప్రయాగ్ జిల్లాలోని ఘోలాతిర్ ప్రాంతంలో ఒక బస్సు అదుపు తప్పి అలకనంద నదిలో పడిపోయిందని పోలీసు ప్రధాన కార్యాలయ ప్రతినిధి ఐజి నీలేష్ ఆనంద్ భరానే తెలిపారు.సమాచారం ప్రకారం.. బస్సులో 19 మంది ప్రయాణిస్తున్నట్లు చెబుతున్నారు. వారిలో ఏడుగురిని రక్షించారు. 11 మంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. ఒకరు మరణించారు.
రుద్రప్రయాగ్ నుంచి బద్రీనాథ్ వెళ్తోన్న బస్సు..
రెస్క్యూ టీం కొంతమందిని రక్షించి చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. వారిలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. కేదార్‌నాథ్ నుండి ప్రయాణించిన తర్వాత, ఈ ప్రయాణికులు రాత్రి రుద్రప్రయాగలో ఉండి గురువారం అంటే ఈరోజు ఉదయం బద్రీనాథ్‌కు బయలుదేరాలని ప్లాన్ చేసుకున్నారని చెబుతున్నారు. కానీ గోచార్ సమీపంలో, బస్సు అకస్మాత్తుగా ట్రక్కును ఢీకొట్టడంతో నదిలో పడిపోయింది.
ప్రమాదం గురించి డ్రైవర్ ఏం చెప్పాడంటే..
సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 8 నుండి 9 మంది ఆసుపత్రిలో చేరారు.. వారు చికిత్స పొందుతున్నారు. తాము కేదార్‌నాథ్ నుండి బద్రీనాథ్‌కు వెళ్తున్నామని.. అప్పుడు ఒక ట్రక్కు తమ బస్సును ఢీకొట్టిందని చెప్పాడు.. ఈ ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు. ఢీకొన్న తర్వాత బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది.

]]>
Thu, 26 Jun 2025 20:03:26 +0530 admin
మాకు దేశమే తొలి ప్రాధాన్యం. కానీ, కొందరికి ప్రధాని మోదీనే ప్రాధాన్యం’: కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు https://prajakshethrenews.com/మాకు-దేశమే-తొలి-ప్రాధాన్యం-కానీ-కొందరికి-ప్రధాని-మోదీనే-ప్రాధాన్యం-కాంగ్రెస్-చీఫ్-మల్లికార్జున-ఖర్గే-కీలక-వ్యాఖ్యలు https://prajakshethrenews.com/మాకు-దేశమే-తొలి-ప్రాధాన్యం-కానీ-కొందరికి-ప్రధాని-మోదీనే-ప్రాధాన్యం-కాంగ్రెస్-చీఫ్-మల్లికార్జున-ఖర్గే-కీలక-వ్యాఖ్యలు మాకు దేశమే తొలి ప్రాధాన్యం. కానీ, కొందరికి ప్రధాని మోదీనే ప్రాధాన్యం’
    ఎంపీ శశిథరూర్‌ పై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే   కీలక వ్యాఖ్యలు
ప్రజా క్షేత్ర్, న్యూ దిఇల్లీ జూన్ 25
కాంగ్రెస్ పార్టీ  సీనియర్‌ నాయకుడు, ఎంపీ శశిథరూర్‌   మోదీ   ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ గత కొంత కాలంగా సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ప్రచారం కోసం అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహించడానికి శశిథరూర్‌ను మోదీ ప్రభుత్వం ఎంపిక చేసినప్పటి నుంచి థరూర్‌-కాంగ్రెస్‌ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాలపై ప్రశంసలు కురిపిస్తూ ఆయన ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇలా మోదీని పదేపదే ప్రశంసిండచంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం థరూర్‌పై గుర్రుగా ఉంది.ఈ క్రమంలో థరూర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే   కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మాకు దేశమే తొలి ప్రాధాన్యం. కానీ, కొందరికి ప్రధాని మోదీనే ప్రాధాన్యం’ అంటూ వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ .. ‘శశి థరూర్‌ ఆంగ్ల భాషలో నిష్ణాతులు. ఆయన భాష చాలా బాగుంది. అందుకే ఆయనను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడిని చేశాం. ఆయన వ్యాఖ్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. దేశ క్షేమం, రాజ్యాంగ పరిరక్షణపైనే మా దృష్టి. మేము దేశం కోసం కలిసి నిలబడతాం. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో కూడా దేశం కోసమే నిలబడ్డాం. మాకు దేశమే తొలి ప్రాధాన్యం. ఆ తర్వాతే పార్టీ. కానీ కొంతమందికి మాత్రం ప్రధాని మోదీయే తొలి ప్రాధాన్యం’ అంటూ వ్యాఖ్యానించారు.శశిథరూర్ రాసిన వ్యాసాన్ని ప్రధాని కార్యాలయం సోమవారం ఎక్స్‌లో పోస్టు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దేశం ఒంటరిగా ఉందంటూ మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలకు విరుద్ధంగా ఆ వ్యాసంలో థరూర్‌ అభిప్రాయాలు ఉండటం గమనార్హం. ‘ఆపరేషన్‌ సింధూర్‌’ తర్వాత జరిగిన దౌత్యపరమైన కృషి జాతీయ సంకల్పం, ప్రభావవంతమైన వ్యక్తీకరణకు రుజువుగా పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలు, ఆపరేషన్‌ సింధూర్‌తో భారత్‌ దృఢమైన ప్రతిస్పందనను చాటి చెప్పిందని తెలిపారు. ఇది మన విదేశాంగ విధానానికి కీలక ఘట్టాన్ని అందించిందని వ్యాఖ్యానించారు.

]]>
Wed, 25 Jun 2025 23:34:49 +0530 admin
శుభాంశు శుక్లా 140 కోట్ల మంది ఆకాంక్షలను మోసుకెళ్లారు : ప్రధాని మోదీ https://prajakshethrenews.com/శుభాంశు-శుక్లా-140-కోట్ల-మంది-ఆకాంక్షలను-మోసుకెళ్లారు-ప్రధాని-మోదీ https://prajakshethrenews.com/శుభాంశు-శుక్లా-140-కోట్ల-మంది-ఆకాంక్షలను-మోసుకెళ్లారు-ప్రధాని-మోదీ శుభాంశు శుక్లా 140 కోట్ల మంది ఆకాంక్షలను మోసుకెళ్లారు : ప్రధాని మోదీ
ప్రజా క్షేత్ర్,  న్యూ డిల్లీ జూన్ 25
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా  యాక్సియం-4   మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు. దాంతో దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రలో నిలిచారు. ఈ మిషన్‌కు శుక్లా గ్రూప్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. దీనిపై తాజాగా ప్రధాని   నరేంద్ర మోదీ  స్పందించారు.ఇక భారత్‌, హంగెరీ, పోలాండ్‌, యూఎస్‌ వ్యోమగాములతో కూడిన స్పేస్‌ మిషన్‌ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని మోదీ వ్యోమగాములకు అభినందనలు తెలియజేశారు. భారత వ్యోమగామి, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచారన్నారు. కోట్ల మంది భారతీయుల కలలు, కోరికలు, ఆకాంక్షలను ఆయన మోసుకెళ్లారని కొనియాడారు.ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. ఫాల్కన్‌ 9 రాకెట్‌ సక్సెస్‌ఫుల్‌గా అంతరిక్షంలోకి వెళ్లింది. కొన్ని నిమిషాల తర్వాత వారు ప్రయాణిస్తున్న వ్యోమనౌక రాకెట్‌ నుంచి విడిపోయి భూకక్ష్యలోకి ప్రవేశించింది. 28 గంటల ప్రయాణం తర్వాత అంటే గురువారం సాయంత్రం 4.30 గంటలకు వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కానుంది.ఐఎస్‌ఎస్‌లో శుభాంశు బృందం 14 రోజులపాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతోపాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో వ్యోమగాములు అక్కడి నుంచి ముచ్చటించనుననారు

]]>
Wed, 25 Jun 2025 23:15:54 +0530 admin
భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయి : శుభాంశు శుక్లా రోదసి యాత్రపై రాష్ట్రపతి https://prajakshethrenews.com/భారత-అంతరిక్ష-చరిత్రలో-కొత్త-మైలురాయి-శుభాంశు-శుక్లా-రోదసి-యాత్రపై-రాష్ట్రపతి https://prajakshethrenews.com/భారత-అంతరిక్ష-చరిత్రలో-కొత్త-మైలురాయి-శుభాంశు-శుక్లా-రోదసి-యాత్రపై-రాష్ట్రపతి భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయి..
     శుభాంశు శుక్లా రోదసి యాత్రపై రాష్ట్రపతి
ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ జూన్ 25 :
భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా   యాక్సియం-4   మిషన్‌లో భాగంగా బుధవారం రోదసిలోకి వెళ్లారు. దాంతో దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రలో సృష్టించారు. ఈ మిషన్‌కు శుక్లా గ్రూప్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రయోగం సక్సెస్‌పై తాజాగా రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము  స్పందించారు.ఫాల్కన్‌ 9 రాకెట్‌లో భారత్‌ నుంచి గ్రూప్‌ కెప్టెన్‌గా వెళ్లిన శుభాంశు శుక్లా భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిని నెలకొల్పారని రాష్ట్రపతి అన్నారు. వారి ప్రయాణంపై దేశం మొత్తం సంతోషంగా, గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘మీరు, యాక్సియం-4 మిషన్‌లోని ఇతర దేశాల వ్యోమగాములు కలిసి ప్రపంచం అంతా ఒకే కుటుంబమని నిరూపించారు.’ అని రాష్ట్రపతి ప్రశంసించారు.నాసా, ఇస్రో మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే ఈ మిషన్‌ విజయవంతం కావాలని తాను ఆకాంక్షిస్తున్నానని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. అక్కడ వ్యోమగాములు చేసే విస్తృత ప్రయోగాలు, శాస్త్రీయ అధ్యయనాలు, అంతరిక్ష యాత్రలకు ముందడుగుగా మారనున్నాయని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రయోగం విజయవంతమైంది.ఫాల్కన్‌ 9 రాకెట్‌ సక్సెస్‌ఫుల్‌గా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు వారు ప్రయాణిస్తున్న వ్యోమనౌక రాకెట్‌ నుంచి విడిపోయి భూకక్ష్యలోకి ప్రవేశించింది. 28 గంటల ప్రయాణం తర్వాత అంటే గురువారం సాయంత్రం 4.30 గంటలకు వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కానుంది. ఐఎస్‌ఎస్‌లో శుభాంశు బృందం 14 రోజులపాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతోపాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో వ్యోమగాములు అక్కడి నుంచి మాట్లాడనున్నారు.

]]>
Wed, 25 Jun 2025 23:13:01 +0530 admin
కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని తాకట్టుపెట్టింది : ప్రధాని నరేంద్ర మోదీ https://prajakshethrenews.com/కాంగ్రెస్-ప్రజాస్వామ్యాన్ని-తాకట్టుపెట్టింది-ప్రధాని-నరేంద్ర-మోదీ https://prajakshethrenews.com/కాంగ్రెస్-ప్రజాస్వామ్యాన్ని-తాకట్టుపెట్టింది-ప్రధాని-నరేంద్ర-మోదీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని తాకట్టుపెట్టింది : ప్రధాని నరేంద్ర మోదీ
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ, జూన్ 25 :
భారత దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి.. బీజేపీ దేశవ్యాప్తంగా సంవిధాన్ హత్యా దివస్ అభియాన్‌ను నిర్వహిస్తోంది. మరోవైపు దేశంలో ఎమర్జెన్సీ
పరిస్థితులపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. భారత చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమన్నారు. ఈరోజును సంవిధాన్‌ హత్య దివస్‌గా భారత ప్రజలు జరుపుకుంటున్నారని మోదీ చెప్పారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్‌ చేసిందని ఆరోపించారు. అత్యవసర పరిస్థితిని ఏ భారతీయుడు మరచిపోలేరని.. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినవారికి మా సెల్యూట్ అంటూ ట్వీట్
చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించేందుకు.. రాజ్యాంగంలోని సూత్రాలను బలోపేతం చేస్తామన్నారు మోదీ.. వికసిత్‌ భారత్‌ సాధించేందుకు కృషి చేస్తున్నామన్న ప్రధాని.. పేదలు, అణగారిన వర్గాల కలలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు..కాంగ్రెస్ పార్టీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. భారతదేశంలో జూన్ 25, 1975న అత్యవసర పరిస్థితి విధించారు.. అయితే.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయాలలో ఒకటైన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి యాభై సంవత్సరాలు గడిచిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టిన సమయం అది అంటూ పేర్కొన్నారు. మన రాజ్యాంగం స్వరాన్ని ఎలా అణచివేశారో ఏ భారతీయుడు మర్చిపోలేడు.. పార్లమెంటు స్వరాన్ని అణచివేసి, కోర్టులను నియంత్రించడానికి ప్రయత్నాలు జరిగాయి. 42వ సవరణ వారి చర్యలకు
ఒక ప్రధాన ఉదాహరణ. పేదలు, అణగారిన వర్గాలు, దళితులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాటంలో దృఢంగా నిలిచిన వారందరికీ మేము వందనం చేస్తున్నామని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని రక్షించడం కోసం మన స్వాతంత్ర్య సమరయోధులు తమ జీవితాలను అంకితం చేశారని తెలిపారు.సమిష్టి పోరాటం ఫలితంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి, కొత్తగా ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది, కానీ వారు ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని గుర్తుచేశారు. “మన రాజ్యాంగంలో పొందుపరచబడిన సూత్రాలను బలోపేతం చేయడానికి – అభివృద్ధి చెందిన భారతదేశం అనే మన కలను సాకారం చేసుకోవడానికి మనం కలిసి పనిచేస్తున్నాము. మనం పురోగతిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తాము.. పేదలు.. అణగారిన వర్గాల కలలను నెరవేర్చుతాము” అని ప్రధానమంత్రి రాశారు..నేను అప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌ని:
మోడీ అత్యవసర పరిస్థితి రోజులను గుర్తుచేసుకున్నారు. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, నేను ఆర్‌ఎస్‌ఎస్ యువ ప్రచారక్‌ని అని అన్నారు. అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమం నాకు ఒక అభ్యాస అనుభవం. ఇది మన ప్రజాస్వామ్య నిర్మాణాన్ని రక్షించుకోవడం – ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది. అలాగే, రాజకీయ వర్గాల ప్రజల నుండి నేను చాలా నేర్చుకోగలిగాను.. అంటూ పేర్కొన్నారు.ఆ అనుభవాలలో కొన్నింటిని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ఒక పుస్తకం రూపంలో సంకలనం చేయడం తనకు సంతోషంగా ఉందన్నారు. ముందుమాటను స్వయంగా అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమంలో అనుభవజ్ఞుడైన హెచ్‌డి దేవెగౌడ రాశారు. అని తెలిపారు.అత్యవసర పరిస్థితి నాటి చీకటి రోజులను లేదా ఆ సమయంలో వారి కుటుంబాలు ఎదుర్కొన్న అనుభవాలను గుర్తుచేసుకునే ప్రతి ఒక్కరూ వాటిని సోషల్ మీడియాలో పంచుకోవాలని నేను కోరుతున్నాను. ఇది 1975 నుండి 1977 వరకు ఉన్న సమయం గురించి యువతలో అవగాహన పెంచుతుంది.. అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకాన్ని ఆవిష్కరించనున్న అమిత్ షా..
నాటి ప్రధాని ఇందిరాగాంధీ 25 జూన్‌ 1975లో దేశంలో ఎమర్జెన్సీని విధించిన తర్వాత, అప్పట్లో దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ఆసక్తికర విషయాలను బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకంలో పొందుపరిచింది. 

]]>
Wed, 25 Jun 2025 23:01:19 +0530 admin
కోరిక తీరకుండానే చనిపోయిన తండ్రి కోసం కొడుకు ఎం చేశాడంటే !... https://prajakshethrenews.com/కోరిక-తీరకుండానే-చనిపోయిన-తండ్రి-కోసం-కొడుకు-ఎం-చేశాడంటే https://prajakshethrenews.com/కోరిక-తీరకుండానే-చనిపోయిన-తండ్రి-కోసం-కొడుకు-ఎం-చేశాడంటే  కోరిక తీరకుండానే చనిపోయిన తండ్రి కోసం కొడుకు ఎం చేశాడంటే !...

ఓ నాన్న కల...

కొడుకు బాగా చదువుకుని ప్రయోజకుడు అయ్యి గొప్పవాడు కావాలని.

ఓ కొడుకు కల..

తండ్రి కష్టం చూస్తూ తను కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించి కారుకొని అందులో నాన్నని తిప్పాలని.

ఇద్దరు అనుకున్నట్టే జరిగింది...కొడుకు ఉద్యోగం సాధించాడు...కారుకూడా కొన్నాడు.... నాన్న కోరిక తీరింది కానీ కొడుకు కోరిక తీర్చుకోవడానికి నాన్న ను కారులో తిప్పడానికి నాన్న ఇక బతికి లేరు... తన కోరిక తీరకుండానే నాన్న బతికి లేకపోవడాన్ని జీర్ణించుకోలేక పోయిన కొడుకు నాన్న రూపాన్ని మైనం బొమ్మతో ప్రత్యేకంగా తయారు చేయించి కొత్తగా కొన్న కారులో నాన్నని పక్కన కూర్చోపెట్టుకుని, సీటు బెల్టు పెట్టి మరీ తిప్పాడు ఆ కొడుకు...

]]>
Wed, 25 Jun 2025 19:25:32 +0530 admin
బనకచర్లపై ఏపీ సర్కార్ కసరత్తు https://prajakshethrenews.com/బనకచర్లపై-ఏపీ-సర్కార్-కసరత్తు https://prajakshethrenews.com/బనకచర్లపై-ఏపీ-సర్కార్-కసరత్తు బనకచర్లపై ఏపీ సర్కార్ కసరత్తు
ప్రజా క్షేత్ర్, విజయవాడ, జూన్ 25 :
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమవుతున్న బనకచర్లపై నిజానిజాలు కేంద్రం ముందు ఉంచి అనుమతులు పొందాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ చేస్తున్న ప్రచారాన్నికి విరుగుడు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన సీఎం, మంత్రులు కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో సమావేశమై బనకచర్లపై ఫిర్యాదుల చేశారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రంతో కలవాలని చూస్తోంది. ప్రత్యేక బృందంతో ఢిల్లీ వెళ్లాలని భావిస్తోంది. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో ప్రత్యేక బృందాన్ని ఢిల్లీ పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో ఎలాంటి ఇబ్బంది ఉండదని వారిని ఒప్పించనుంది. ఇందతా రాజకీయం కోసం బీఆర్‌ఎస్ రాద్దాంతం చేస్తోందని తెలియజేయనుంది. పూర్తి వివరాలు కేంద్రం ముందు ఉంచిన తర్వాత వారి సమక్షంలోనే ఏపీ తెలంగాణ మధ్య చర్చలు జరిగేలా చూడనుంది. వారి సంప్రదింపులతోనే ప్రక్రియను వేగవంతం చేయబోతోంది. కేబినెట్ భేటీలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ముగ్గురు నలుగుర మంత్రులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అనుసంధాన ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించినందున మరోసారి ఓ ప్రత్యేక బృందంతో వెళ్లి నిజానిజాలు వెళ్లడించాలని నిర్ణయించారు. తెలంగాణ పార్టీలు ఏకమై రాజకీయ పోరాటం చేస్తున్నందు అదే రీతిలో విరుగుడు చర్యలు తీసుకోవాలని భావించారు. ప్రత్యేక బృందం వెళ్లడం ఉత్తమైన మార్గంగా తేల్చారు. సమగ్ర సమాచారంతో ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, జలవనరుల శాఖ మంత్రి, ఆర్ధిక శాఖ మంత్రిని కలవాలని నిశ్చయించారు. ఎవరి ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లాలనే విషయంపై క్లారిటీ లేదు. పూర్తి సమాచారంతో ప్రత్యేక వినతి పత్రం, అందుకు తగ్గ డాక్యుమెంట్స్ రెడీ చేయాలని అధికారులు ఆదేశించారు. అనంతరం ఢిల్లీలో అపాయింట్మెంట్ లభించినదాని బట్టి
బృందం వెళ్లనుంది. తెలంగాణలో కేవలం రాజకీయంగా లబ్ధిపొందాలని దీన్ని బీఆర్ఎస్‌ ప్రచారం చేస్తోందని మంత్రులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉందన్నారు. సముద్రంలోకి వెళ్లే వృథా నీటిలో 200 టీఎంసీలను సీమకు తరలించేందుకు బనకచర్ల రూపొందిస్తున్నామని అన్నారు. దీని వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టమో అర్థం కావడం లేదని ఆశ్చర్యపోయారు. ఇప్పటికే ఈ బనకచర్ల ప్రాజెక్టుపై ప్రి ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి సమర్పించింది ఏపీ ప్రభుత్వం. ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ- పర్యావరణశాఖ అనుమతులు వస్తే పూర్తి స్థాయి ప్రాజెక్టు రిపోర్టు కేంద్రానికి సమర్పించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు
కానీ ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదనందున వారు చేసే విమర్శలపై స్పందించాల్సిన అవసరం లేదని కేబినెట్‌లో సీఎం చంద్రబాబు చెప్పారు. మీడియాతో మాట్లాడే టైంలో  సంయమనం పాటించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వంతోపాటు అన్ని పార్టీలు బనకచర్లకు వ్యతిరేకంగా స్వరం అందుకున్నాయి. అసలు ఈ ప్రాజెక్టుకు ఆధ్యం పోసింది కేసీఆర్ అంటు కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టును ఆడ్డుకోవాలని కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం కలిసింది. బనచర్ల అడ్డుకోవడానికి రేవంత్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చంద్రబాబుతో లాలూచీ పడ్డారని బీఆర్‌ఎస్ ఆరోపిస్తూ వచ్చింది.

]]>
Wed, 25 Jun 2025 19:14:18 +0530 admin
జూలై 1 నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు...ఆరేళ్ల తర్వాత పెంపు https://prajakshethrenews.com/జూలై-1-నుంచి-పెరగనున్న-రైల్వే-చార్జీలుఆరేళ్ల-తర్వాత-పెంపు https://prajakshethrenews.com/జూలై-1-నుంచి-పెరగనున్న-రైల్వే-చార్జీలుఆరేళ్ల-తర్వాత-పెంపు జూలై 1 నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు...ఆరేళ్ల తర్వాత పెంపు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 25 :
రైలు టికెట్‌ ధరలు స్వల్పంగా పెరుగనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. కోవిడ్‌ 19 తర్వాత రైల్వే మొదటిసారిగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్వల్ప ఛార్జీల పెరుగుదల జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నాన్‌
ఏసీ మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ టికెట్‌ ధర కిలోమీటర్‌కు 1 పైసా, ఏసీ తరగతి టికెట్‌ ధర కిలోమీటర్‌కు 2 పైసల చొప్పున పెరగనున్నాయి. 500 కిలోమీటర్లలోపు ప్రయాణానికి సబర్బన్ టిక్కెట్లు, సెకండ్‌ క్లాస్‌
ప్రయాణానికి ఛార్జీల పెంపు ఉండదు. 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాలకు టికెట్‌ ధరలు పెరుగుతాయి. 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాలంటే కిలోమీటరుకు సగం పైస పెరుగుతుంది. నెలవారీ సీజన్ టికెట్‌లో ఎటువంటి పెంపు ఉండబోదని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రైల్వే వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్లమీడియా వెబ్‌సైట్లలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై రైల్వే శాఖ నుంచి అధికారిక ప్రకటన
వెలువడాల్సి ఉంది.అలాగే జూలై 1 నుంచి తత్కాల్ రైలు టిక్కెట్ బుకింగ్‌లకు ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరి చేస్తూ ఇండియన్‌ రైల్వే ఇటీవల ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని రైల్వే జోన్‌లకు ఈ మార్పును అమలు చేయనుంది. తత్కాల్ పథకం ప్రయోజనాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఆధార్‌ ప్రామాణీకరణ తీసుకువచ్చినట్లు రైల్వే శాఖ తెలియజేసింది. దీంతో జూలై 1, 2025 నుంచి తత్కాల్ పథకం కింద టిక్కెట్లను ఆధార్ ప్రామాణీకరించిన వినియోగదారులు మాత్రమే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా టికెట్‌ బుకింగ్‌కు అవకాశం ఉంటుంది. జూలై 15 ప్రయాణికులు తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ ఆధారిత OTP ప్రామాణీకరణ దశ అమలులోకి వస్తుందని, ప్రయాణికులు విధిగా దీనిని పూర్తి చేయాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త మార్గదర్శకాల ద్వారా భారతీయ రైల్వేల అధీకృత బుకింగ్ ఏజెంట్ల తత్కాల్ టికెట్ రిజర్వేషన్లపై పరిమితులను  విధించినట్లయింది. Ac  క్లాస్ బుకింగ్‌లకు ఉదయం 10.00 నుంచి ఉదయం 10.30 వరకు, నాన్-AC క్లాస్ బుకింగ్‌లకు ఉదయం 11.00 నుంచి ఉదయం 11.30 వరకు అవకాశం ఉంటుంది. రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెంటర్ (CRIS), IRCTC.. ఈ రెండింటినీ అవసరమైన సిస్టమ్ మార్పులు చేయాలని, ఈ మార్పులను అన్ని జోనల్ రైల్వే డివిజన్లకు తెలియజేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ చొరవ ప్రయాణికుల కోసం తత్కాల్ రిజర్వేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఈ ప్రక్రియను తీసుకువచ్చింది. జూలై 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. అదేరోజు నుంచి టికెట్‌ ధరల పెంపు కూడా అమల్లోకి రానున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి

]]>
Wed, 25 Jun 2025 15:25:31 +0530 admin
మోదీని పొగడ్తలతో ముంచెత్తిన కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ https://prajakshethrenews.com/మోదీని-పొగడ్తలతో-ముంచెత్తిన-కాంగ్రెస్-ఎంపీ-శశిధరూర్ https://prajakshethrenews.com/మోదీని-పొగడ్తలతో-ముంచెత్తిన-కాంగ్రెస్-ఎంపీ-శశిధరూర్ మోదీని పొగడ్తలతో ముంచెత్తిన కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ, జూన్ 24 :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు తాను బీజేపీలో చేరుతున్నాననడానికి సంకేతాలు కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాలను మెచ్చుకుంటూ ఆయన ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో భాజపాలో చేరనున్నారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ ప్రచారంపై థరూర్ తాజాగా స్పందిస్తూ తన వైఖరిని స్పష్టం చేశారు.నిన్న ప్రధాని కార్యాలయం సైతం శశి థరూర్ రాసిన వ్యాసాన్ని ఎక్స్ వేదికగా పంచుకోవడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం వల్ల ప్రపంచ యవనికపై భారతదేశం ఏకాకిగా మారిందంటూ కాంగ్రెస్ పార్టీ తరచూ విమర్శలు చేస్తున్న తరుణంలో, అందుకు భిన్నంగా థరూర్ అభిప్రాయాలు వ్యక్తం చేయడం గమనార్హం.ఈ ఊహాగానాలపై థరూర్ మాట్లాడుతూ, "నేను రాసిన వ్యాసం 'ఆపరేషన్ సిందూర్' విజయాన్ని, అన్ని పార్టీల ఐక్యతను వివరిస్తుంది. ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో ప్రధాని మోదీ ప్రదర్శించిన శక్తి, చైతన్యాన్ని నేను ప్రస్తావించాను. ఇది బీజేపీ లేదా కాంగ్రెస్ విదేశాంగ విధానాలకు సంబంధించిన విషయం కాదు. ఇది పూర్తిగా భారత విదేశాంగ విధానానికి చెందిన అంశం" అని తెలిపారు. తాను పార్లమెంటు విదేశాంగ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా 11 ఏళ్ల క్రితం కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని ఆయన గుర్తుచేశారు. తాను ఇలా మాట్లాడటం భాజపాలో చేరడానికి సంకేతంగా భావించరాదని, ఇది కేవలం జాతీయ ఐక్యతకు సంబంధించిన విషయమని ఆయన పేర్కొన్నారు.
'ఆపరేషన్ సిందూర్' అనంతరం జరిగిన దౌత్యపరమైన కృషి, భారతదేశ జాతీయ సంకల్పానికి, ప్రభావవంతమైన వ్యక్తీకరణకు నిదర్శనమని థరూర్ తన వ్యాసంలో పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, 'ఆపరేషన్ సిందూర్' ద్వారా భారత్ ఇచ్చిన దృఢమైన ప్రతిస్పందన, మన విదేశాంగ విధానంలో ఒక కీలక ఘట్టాన్ని ఆవిష్కరించిందని ఆయన తన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, ఈ ప్రశంసలు వ్యక్తిగత రాజకీయాలకు అతీతమైనవని, దేశ ప్రయోజనాల దృష్ట్యా చేసినవని ఆయన స్పష్టం చేశారు.

]]>
Tue, 24 Jun 2025 18:34:35 +0530 admin
మావోయిస్టులతో ఎలాంటి చర్చలు జరిపేదే లేదు : హోంమంత్రి అమిత్ షా https://prajakshethrenews.com/మావోయిస్టులతో-ఎలాంటి-చర్చలు-జరిపేదే-లేదు-హోంమంత్రి-అమిత్-షా https://prajakshethrenews.com/మావోయిస్టులతో-ఎలాంటి-చర్చలు-జరిపేదే-లేదు-హోంమంత్రి-అమిత్-షా మావోయిస్టులతో ఎలాంటి చర్చలు జరిపేదే లేదు
 హోంమంత్రి అమిత్ షా .

ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ :

ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు.వర్షాకాలంలో కూడా నక్సల్స్ ఏరివేత కొనసాగుతుందని, మార్చి 2026లోగా నక్సల్స్ ను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యం అన్నారు. ఆయుధాలు వదలిన వారిని తాము హృదయ పూర్వకంగా స్వాగతిస్తామని తెలిపారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా పలు కీలక పనులకు శంకుస్థాపన ఆయన ఈ మేరకు ఛత్తీస్గఢ్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో విష్ణు దేవ్ సాయి ప్రభుత్వం దూసుకు పోతుందని, నక్సల్స్ ఏరివేతలో అతిపెద్ద విజయం సాధించారని అమిత్ షా ప్రశంసించారు. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌ను వేగవంతం చేయడమే కాకుండా, ఎప్పటికప్పుడు దానికి మార్గనిర్దేశం చేస్తూ వస్తుందని తెలిపారు. తాను గత పదకొండు సంవత్సరాలుగా ఛత్తీస్‌గఢ్‌కు వస్తున్నాని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ను అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్ అటల్ నగర్‌లో మూడు నూతన కార్యక్రమాలకు అమిత్ షా ఆదివారం శంకుస్థాపన చేశారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్‌, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ పనులు ప్రారంభించారు. వాటితో పాటు ఎన్‌ఎఫ్‌ఎస్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్, ఛత్తీస్‌గఢ్-ఐహబ్ కూడా ప్రారంభించారు.

]]>
Mon, 23 Jun 2025 21:12:15 +0530 admin
పహల్గామ్ దాడి... ఇద్దరిని అరెస్ట్ చేసిన NIA https://prajakshethrenews.com/పహల్గామ్-దాడి-ఇద్దరిని-అరెస్ట్-చేసిన-nia https://prajakshethrenews.com/పహల్గామ్-దాడి-ఇద్దరిని-అరెస్ట్-చేసిన-nia పహల్గామ్ దాడి... ఇద్దరిని అరెస్ట్ చేసిన NIA

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ టెర్రర్ దాడికి సంబంధించిన కేసులో NIA పురోగతి సాధించింది. టెర్రరిస్టులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరిని అరెస్టు చేసింది. ఉగ్రవాదులకు సహాయం చేసిన పహల్గామ్ కు చెందిన పర్వేజ్ అహ్మద్, హిల్ పారుకు చెందిన బషీర్ అహ్మద్ లను ఎన్ ఐ ఎ అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనలో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు పాక్ టెర్రరిస్టుల హస్తమున్నట్లు ఎన్ ఐ ఎ ధ్రువీకరించింది. కాగా ఉగ్రదాడిలో 26 మంది మరణించిన విషయం విధితమే 

]]>
Sun, 22 Jun 2025 11:24:32 +0530 admin
గాజా, ఇరాన్‌పై ఇజ్రాయిల్ మార‌ణ‌హోమం పై భార‌త్ మౌనం వీడాలి : కాంగ్రెస్ నేత సోనియా గాంధీ https://prajakshethrenews.com/గాజా-ఇరాన్పై-ఇజ్రాయిల్-మారణహోమం-పై-భారత్-మౌనం-వీడాలి-కాంగ్రెస్-నేత-సోనియా-గాంధీ https://prajakshethrenews.com/గాజా-ఇరాన్పై-ఇజ్రాయిల్-మారణహోమం-పై-భారత్-మౌనం-వీడాలి-కాంగ్రెస్-నేత-సోనియా-గాంధీ గాజా, ఇరాన్‌పై ఇజ్రాయిల్ మార‌ణ‌హోమం పై  భార‌త్ మౌనం వీడాలి
                   కాంగ్రెస్ నేత సోనియా గాంధీ
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ జూన్ 21
 గాజా, ఇరాన్‌పై ఇజ్రాయిల్ సృష్టిస్తున్న మార‌ణ‌హోమం పట్ల భార‌త్ మౌనంగా ఉండ‌డాన్ని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ త‌ప్పుప‌ట్టారు. భార‌త్ త‌న స్వ‌రాన్ని కోల్పోవ‌డ‌మే కాదు, విలువ‌ల్ని స‌రెండ‌ర్ చేసిన‌ట్లు అవుతుంద‌ని ఆమె పేర్కొన్నారు. ద హిందూ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌లో సోనియా రాసిన వ్యాసాన్ని ప‌బ్లిష్ చేశారు. ఇండియాన త‌న స్వ‌రాన్ని వినిపించేందుకు ఇంకా ఆల‌స్యం కాలేద‌న్న టైటిల్‌తో ఆ ఐట‌మ్‌ను రాశారు. పాల‌స్తీనా, ఇజ్రాయిల్ అంశంపై గ‌తంలో కుదిరిన ఒప్పందాన్ని అమ‌లు చేయ‌డంలో కేంద్రంలోని మోదీ స‌ర్కారు విఫ‌ల‌మైన‌ట్లు ఆమె పేర్కొన్నారు.భార‌త్ త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేయ‌డంలో ఆల‌స్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. ఇప్ప‌టికైనా ఆల‌స్యం కాలేద‌ని, భార‌త్ త‌న నిర్ణ‌యాన్ని స్ప‌ష్టంగా తెలుపాల‌ని, బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, ప‌శ్చిమాసియాలో ఉన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను త‌గ్గించేందుకు దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్చ‌లు చేప‌ట్టాల‌ని ఆమె త‌న వ్యాసంలో సూచించారు. ప‌శ్చిమాసియా అంశంలో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ అనుస‌రిస్తున్న విధ్వంస‌క‌ర వైఖ‌రిని ఆమె ఖండించారు.

]]>
Sat, 21 Jun 2025 20:21:12 +0530 admin
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్ https://prajakshethrenews.com/శంషాబాద్-ఎయిర్పోర్ట్-విస్తరణకు-గ్రీన్సిగ్నల్ https://prajakshethrenews.com/శంషాబాద్-ఎయిర్పోర్ట్-విస్తరణకు-గ్రీన్సిగ్నల్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 21 :
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమాన సేవలకు కేంద్రంగా ఉన్న శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారీ విస్తరణకు సిద్ధమవుతోంది. ప్రయాణికుల రద్దీ, విమాన రాకపోకలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో.. జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ లిమిటెడ్  ఈ విమానాశ్రయాన్ని సుమారు రూ.14,000 కోట్లతో విస్తరించాలని యోచిస్తోంది. రానున్న కాలంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ కనెక్టివిటీకి ఒక కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ బృహత్తర ప్రాజెక్ట్ ను చేపడుతున్నారు. ఈ విస్తరణ.. నగరం ఆర్థిక వృద్ధికి, ప్రపంచ వేదికపై దాని స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి గణనీయంగా దోహదపడనుంది.2008లో ప్రారంభమైన శంషాబాద్ విమానాశ్రయం.. అతి తక్కువ కాలంలోనే భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటిగా మారింది. దీని ప్రస్తుత సామర్థ్యం పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు సరిపోవడం లేదు. హైదరాబాద్, దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ కేంద్రంగా మారడంతో.. అంతర్జాతీయ, దేశీయ ప్రయాణాల డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విమానాశ్రయాన్ని సిద్ధం చేయడానికి విస్తరణ అవసరమని  గుర్తించింది.ఈ విస్తరణ ప్రణాళికలో భాగంగా.. ప్రయాణికుల సౌకర్యార్థం ఒక కొత్త టెర్మినల్, విమానాల రాకపోకలను సులభతరం చేయడానికి ఒక అదనపు రన్‌వేను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నూతన మౌలిక సదుపాయాలు విమానాశ్రయం కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి. వచ్చే ఏడాది  ప్రారంభంలోనే విస్తరణ పనులను మొదలుపెట్టి.. 2029 నాటికి వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కాలపరిమితిలో.. పనులు వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేయడానికి GHIAL కృషి చేయనుంది.రూ.14,000 కోట్ల భారీ పెట్టుబడి కేవలం మౌలిక సదుపాయాల పెంపుదలకు మాత్రమే పరిమితం కాదు.. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై బహుముఖ సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. విమానాశ్రయం విస్తరణ పనుల ద్వారా ప్రత్యక్షంగా.. పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నిర్మాణ రంగం, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, ఇతర అనుబంధ పరిశ్రమలకు ఇది ఊతమిస్తుంది. అంతేకాకుండా.. మెరుగైన వాయు కనెక్టివిటీ పర్యాటక రంగానికి, వాణిజ్య కార్యకలాపాలకు, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదపడుతుంది. ఈ విస్తరణ ప్రాజెక్టులో సుస్థిరత అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పర్యావరణ అనుకూల సాంకేతికతలు, స్మార్ట్ ఎయిర్‌పోర్ట్ ఫీచర్లను ఉపయోగించి భవిష్యత్ అవసరాలకు ధీటుగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలని జీఎంఆర్ భావిస్తోంది. రానున్న పదేళ్లలో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తుల్లో ఒకటిగా మారాలనే లక్ష్యంతో ఈ విమానాశ్రయం విస్తరణ ఒక కీలకమైన సాధనంగా నిలుస్తుంది. ఇది హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో మరింత ప్రముఖంగా నిలుపుతుంది.

]]>
Sat, 21 Jun 2025 14:09:22 +0530 admin
ఆర్జేడీ&కాంగ్రెస్‌ కూటమిపై నిప్పులు చెరిగిన ప్రధాని నరేంద్ర మోదీ https://prajakshethrenews.com/ఆర్జేడీ-కాంగ్రెస్-కూటమిపై-నిప్పులు-చెరిగిన-ప్రధాని-నరేంద్ర-మోదీ https://prajakshethrenews.com/ఆర్జేడీ-కాంగ్రెస్-కూటమిపై-నిప్పులు-చెరిగిన-ప్రధాని-నరేంద్ర-మోదీ బీహార్ పై ఫోకస్ పెంచిన ప్రధాని నరేంద్ర మోదీ

అంబేద్కర్ నికాళ్ల దగ్గర పెడతారా.. మేము హృదయంలో ఉంచుకుంటాం..

లాలుకు మోడీ కౌంటర్
ప్రజా క్షేత్ర్, పాట్నా, జూన్ 20 :
మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న బీహార్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోకస్‌ పెంచారు. సివాన్‌లో భారీ సభకు హాజరయ్యారు. పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్నా-గోరఖ్‌పూర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేస్తున్నారు మోదీ. ఈ సభకు బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ పాల్గొన్నారు. దాదాపు రూ. 10 వేల కోట్ల అభివృద్ది పనులను ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు.ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమిపై నిప్పులు చెరిగారు ప్రధాని నరేంద్ర మోదీ. హస్తం పార్టీ , లాంతర్‌ పార్టీ కలిసి బీహార్‌లో అధికారం లోకి వచ్చి రాష్ట్రాన్ని మరోసారి సర్వనాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఆర్జేడీ అంబేద్కర్‌ను అవమానించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఆర్జేడీ-కాంగ్రెస్‌ కలిసి బీహార్‌ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని మండిపడ్డారు. ఆర్జేడీ , కాంగ్రెస్‌ నేతలు అంబేద్కర్‌ ఫోటోను తమ కాళ్ల దగ్గర పెట్టుకున్నారని, కాని అంబేద్కర్‌ తన హృదయంలో ఉన్నారని అన్నారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ వేదిక నుంచి పునాది రాయి వేశామని ప్రధాని మోదీ అన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ బీహార్‌ను ఉజ్వల భవిష్యత్తు వైపు తీసుకెళ్తాయన్నారు. ఈ ప్రాజెక్టులు ప్రతి సమాజ జీవితాన్ని సులభతరం చేస్తాయి. అలాగే, పేదరికాన్ని తగ్గించవచ్చని, ప్రపంచ బ్యాంకు కూడా భారతదేశానికి అభిమానిగా మారిందని ప్రధాని అన్నారు.వైరల్ అవుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిత్రంపై ప్రధాని మోదీ తొలిసారిగా స్పందించారు. ఆర్జేడీ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను తన పాదాల వద్ద ఉంచుకుంటుందని ఆయన అన్నారు. మోదీ ఆయనను తన హృదయంలో ఉంచుకుంటారని అన్నారు. బాబాసాహెబ్ అవమానాన్ని బీహార్ సహించదన్నారు. “నేను నిన్ననే విదేశాల నుండి తిరిగి వచ్చాను. ఈ పర్యటన సందర్భంగా చాలా మంది నాయకులతో మాట్లాడాను, అందరు నాయకులు భారతదేశ అభివృద్ధిని చూసి చాలా ఆకట్టుకున్నారు. భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుతుందని వారు చూస్తున్నారు. ఇందులో బీహార్ చాలా పెద్ద పాత్ర పోషించబోతోంది” అని ప్రధానమంత్రి అన్నారు.కాంగ్రెస్, ఆర్జేడీలను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. చెయ్యి, లాంతరు వ్యక్తులు కలిసి బీహార్ గౌరవాన్ని దెబ్బతీశారని ప్రధాని అన్నారు. ఈ వ్యక్తులు కలిసి దోపిడీకి పాల్పడ్డారని, పేదరికం బీహార్ దురదృష్టకరంగా మారిందని అన్నారు. అనేక సవాళ్లను అధిగమించిన తర్వాత, సీఎం నితీష్ నాయకత్వంలో బీహార్‌ను తిరిగి అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చామని అన్నారు. “బీహార్ ప్రజలకు విశ్వాసం కలిగించడానికి వచ్చాను, మేము చాలా చేసి ఉండవచ్చు, చేస్తున్నాము, చేస్తూనే ఉంటాము, కానీ దీని తర్వాత మౌనంగా ఉండే వ్యక్తి మోదీ కాదు. బీహార్ కోసం ఇంకా చాలా చేయాలి. గత 10 సంవత్సరాలలో, బీహార్‌లో 55 వేల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు నిర్మించడం జరిగింది. 1.5 కోట్లకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరాతోపాటు 1.5 కోట్ల మందికి నీటి కనెక్షన్ ఇవ్వడం జరిగింది’’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.‘‘మన దేశం గరీబీ హఠావో నినాదాలను చాలాసార్లు విన్నదని ప్రధానమంత్రి అన్నారు. కానీ మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడు, పేదరికాన్ని కూడా తగ్గించవచ్చని ఎన్డీఏ ప్రభుత్వం చూపించింది. గత దశాబ్దంలో, రికార్డు స్థాయిలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికాన్ని ఓడించారు. ప్రపంచ బ్యాంకు వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు భారతదేశం సాధించిన ఈ గొప్ప విజయాన్ని ప్రశంసిస్తున్నాయి. కాంగ్రెస్-ఆర్జేడీ పాలనలో, పేదలకు ఇళ్ళు రాలేదు. చికిత్స లేదు, విద్య లేదు, విద్యుత్ లేదు, గ్యాస్ కనెక్షన్ లేదు, ఉద్యోగం లేదు. పేదరిక నిర్మూలన కలను వారికి చూపించడం ద్వారా, వారి స్వంత కుటుంబాలు లక్షాధికారులు అయ్యాయి’’ అని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటివరకు 4 కోట్ల మందికి శాశ్వత గృహాలు లభించాయని ప్రధాని అన్నారు. సివాన్‌లో 1 లక్ష మందికి పైగా శాశ్వత గృహాలు లభించాయని అన్నారు. మా ప్రభుత్వం ఉచిత రేషన్, విద్యుత్, నీటి సౌకర్యాలను కూడా అందిస్తోందని తెలిపారు.ఆర్జేడీ-కాంగ్రెస్ చర్యలు బీహార్ వ్యతిరేకమని ప్రధాని అన్నారు. ఈ వ్యక్తులు అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడల్లా, దుకాణాలు పరిశ్రమలు మూసివేయటం ప్రజలు చూస్తారు, అందుకే వారు బీహార్ యువత హృదయాల్లో ఎప్పటికీ స్థానం సంపాదించుకోలేరన్నారు. “మేము సబ్కా సాథ్, సబ్కా వికాస్ అని అంటాము, కానీ లాంతర్లు ఉన్నవారు పరివార్ కా సాథ్, పరివార్ కా వికాస్ అని అంటారు ” అని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు

]]>
Fri, 20 Jun 2025 20:19:58 +0530 admin
బీహార్ పై ఫోకస్ పెంచిన ప్రధాని నరేంద్ర మోదీ https://prajakshethrenews.com/బీహార్-పై-ఫోకస్-పెంచిన-ప్రధాని-నరేంద్ర-మోదీ https://prajakshethrenews.com/బీహార్-పై-ఫోకస్-పెంచిన-ప్రధాని-నరేంద్ర-మోదీ బీహార్ పై ఫోకస్ పెంచిన ప్రధాని నరేంద్ర మోదీ

ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమిపై నిప్పులు చెరిగిన ప్రధాని నరేంద్ర మోదీ

అంబేద్కర్ నికాళ్ల దగ్గర పెడతారా.. మేము హృదయంలో ఉంచుకుంటాం..

లాలుకు మోడీ కౌంటర్
ప్రజా క్షేత్ర్, పాట్నా, జూన్ 20 :
మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న బీహార్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోకస్‌ పెంచారు. సివాన్‌లో భారీ సభకు హాజరయ్యారు. పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్నా-గోరఖ్‌పూర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేస్తున్నారు మోదీ. ఈ సభకు బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ పాల్గొన్నారు. దాదాపు రూ. 10 వేల కోట్ల అభివృద్ది పనులను ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు.ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమిపై నిప్పులు చెరిగారు ప్రధాని నరేంద్ర మోదీ. హస్తం పార్టీ , లాంతర్‌ పార్టీ కలిసి బీహార్‌లో అధికారం లోకి వచ్చి రాష్ట్రాన్ని మరోసారి సర్వనాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఆర్జేడీ అంబేద్కర్‌ను అవమానించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఆర్జేడీ-కాంగ్రెస్‌ కలిసి బీహార్‌ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని మండిపడ్డారు. ఆర్జేడీ , కాంగ్రెస్‌ నేతలు అంబేద్కర్‌ ఫోటోను తమ కాళ్ల దగ్గర పెట్టుకున్నారని, కాని అంబేద్కర్‌ తన హృదయంలో ఉన్నారని అన్నారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ వేదిక నుంచి పునాది రాయి వేశామని ప్రధాని మోదీ అన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ బీహార్‌ను ఉజ్వల భవిష్యత్తు వైపు తీసుకెళ్తాయన్నారు. ఈ ప్రాజెక్టులు ప్రతి సమాజ జీవితాన్ని సులభతరం చేస్తాయి. అలాగే, పేదరికాన్ని తగ్గించవచ్చని, ప్రపంచ బ్యాంకు కూడా భారతదేశానికి అభిమానిగా మారిందని ప్రధాని అన్నారు.వైరల్ అవుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిత్రంపై ప్రధాని మోదీ తొలిసారిగా స్పందించారు. ఆర్జేడీ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను తన పాదాల వద్ద ఉంచుకుంటుందని ఆయన అన్నారు. మోదీ ఆయనను తన హృదయంలో ఉంచుకుంటారని అన్నారు. బాబాసాహెబ్ అవమానాన్ని బీహార్ సహించదన్నారు. “నేను నిన్ననే విదేశాల నుండి తిరిగి వచ్చాను. ఈ పర్యటన సందర్భంగా చాలా మంది నాయకులతో మాట్లాడాను, అందరు నాయకులు భారతదేశ అభివృద్ధిని చూసి చాలా ఆకట్టుకున్నారు. భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుతుందని వారు చూస్తున్నారు. ఇందులో బీహార్ చాలా పెద్ద పాత్ర పోషించబోతోంది” అని ప్రధానమంత్రి అన్నారు.కాంగ్రెస్, ఆర్జేడీలను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. చెయ్యి, లాంతరు వ్యక్తులు కలిసి బీహార్ గౌరవాన్ని దెబ్బతీశారని ప్రధాని అన్నారు. ఈ వ్యక్తులు కలిసి దోపిడీకి పాల్పడ్డారని, పేదరికం బీహార్ దురదృష్టకరంగా మారిందని అన్నారు. అనేక సవాళ్లను అధిగమించిన తర్వాత, సీఎం నితీష్ నాయకత్వంలో బీహార్‌ను తిరిగి అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చామని అన్నారు. “బీహార్ ప్రజలకు విశ్వాసం కలిగించడానికి వచ్చాను, మేము చాలా చేసి ఉండవచ్చు, చేస్తున్నాము, చేస్తూనే ఉంటాము, కానీ దీని తర్వాత మౌనంగా ఉండే వ్యక్తి మోదీ కాదు. బీహార్ కోసం ఇంకా చాలా చేయాలి. గత 10 సంవత్సరాలలో, బీహార్‌లో 55 వేల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు నిర్మించడం జరిగింది. 1.5 కోట్లకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరాతోపాటు 1.5 కోట్ల మందికి నీటి కనెక్షన్ ఇవ్వడం జరిగింది’’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.‘‘మన దేశం గరీబీ హఠావో నినాదాలను చాలాసార్లు విన్నదని ప్రధానమంత్రి అన్నారు. కానీ మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడు, పేదరికాన్ని కూడా తగ్గించవచ్చని ఎన్డీఏ ప్రభుత్వం చూపించింది. గత దశాబ్దంలో, రికార్డు స్థాయిలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికాన్ని ఓడించారు. ప్రపంచ బ్యాంకు వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు భారతదేశం సాధించిన ఈ గొప్ప విజయాన్ని ప్రశంసిస్తున్నాయి. కాంగ్రెస్-ఆర్జేడీ పాలనలో, పేదలకు ఇళ్ళు రాలేదు. చికిత్స లేదు, విద్య లేదు, విద్యుత్ లేదు, గ్యాస్ కనెక్షన్ లేదు, ఉద్యోగం లేదు. పేదరిక నిర్మూలన కలను వారికి చూపించడం ద్వారా, వారి స్వంత కుటుంబాలు లక్షాధికారులు అయ్యాయి’’ అని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటివరకు 4 కోట్ల మందికి శాశ్వత గృహాలు లభించాయని ప్రధాని అన్నారు. సివాన్‌లో 1 లక్ష మందికి పైగా శాశ్వత గృహాలు లభించాయని అన్నారు. మా ప్రభుత్వం ఉచిత రేషన్, విద్యుత్, నీటి సౌకర్యాలను కూడా అందిస్తోందని తెలిపారు.ఆర్జేడీ-కాంగ్రెస్ చర్యలు బీహార్ వ్యతిరేకమని ప్రధాని అన్నారు. ఈ వ్యక్తులు అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడల్లా, దుకాణాలు పరిశ్రమలు మూసివేయటం ప్రజలు చూస్తారు, అందుకే వారు బీహార్ యువత హృదయాల్లో ఎప్పటికీ స్థానం సంపాదించుకోలేరన్నారు. “మేము సబ్కా సాథ్, సబ్కా వికాస్ అని అంటాము, కానీ లాంతర్లు ఉన్నవారు పరివార్ కా సాథ్, పరివార్ కా వికాస్ అని అంటారు ” అని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు

]]>
Fri, 20 Jun 2025 20:19:00 +0530 admin
భూతల స్వర్గానికి మంచి రోజులు https://prajakshethrenews.com/భూతల-స్వర్గానికి-మంచి-రోజులు https://prajakshethrenews.com/భూతల-స్వర్గానికి-మంచి-రోజులు భూతల స్వర్గానికి మంచి రోజులు
ప్రజా క్షేత్ర్, శ్రీనగర్, జూన్ 19
జమ్మూ కాశ్మీర్‌.. భూతల స్వర్గం.. పూర్తిగా భారత్‌ అధీనంలో ఉన్న జమ్మూ కశ్మీర్‌లో పాకిస్తాన్‌ తరచూ చిచ్చుపెడుతూ విడదీయాలని చూస్తోంది. ఇక దేశ విభజన సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం.. మొన్నటి వరకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 365 ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి అమలైంది. అయితే మోదీ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం దీనిని రద్దు చేశారు. దీంతో జమ్మూ కాశ్వీర్‌ ఇప్పుడు పూర్తిగా భారత్‌తో భాగమైంది.ముస్లిం రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్‌లో మొదటి నుంచి అడ్మినిస్ట్రేషన్‌ కూడా ముస్లింల చేతుల్లోనే ఉంటుంది. అధికారులు, పాలకులు అంతా ముస్లింలే ఉంటున్నట్లు సమాచారం. ఒకరిద్దరు హిందూ అధికారులు వచ్చినా.. వారికి నామమాత్రపు శాఖలతో సరిపెడతారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే 75 ఏళ్ల జమ్మూ కశ్మీర్‌ చరిత్రలో తొలిసారిగా ఓ పండిట్‌ డిప్యూటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ నియామకం కాశ్మీరీ పండిట్ల సామాజిక, రాజకీయ పునరాగమనానికి ఒక సంకేతంగా నిలుస్తుంది.కాశ్మీరీ పండిట్లు 1990లలో ఉగ్రవాదం, హింసాత్మక ఘటనల కారణంగా కాశ్మీర్‌ లోయ నుంచి వలస వెళ్లవలసి వచ్చిన సమాజం. దశాబ్దాల తర్వాత, ఆర్టికల్‌ 370 రద్దు (2019) తర్వాత, కాశ్మీరీ పండిట్ల పునరావాసం, రాజకీయ, పరిపాలనా పాత్రలలో వారి భాగస్వామ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. శ్రీనగర్‌ డిప్యూటీ కమిషనర్‌గా కాశ్మీరీ పండిట్‌ నియామకం ఈ దిశలో ఒక మైలురాయి. ఈ నియామకం కాశ్మీరీ పండిట్లకు చెందిన ఒక అధికారి శ్రీనగర్‌ వంటి కీలక పరిపాలనా పదవిని చేపట్టడం ద్వారా సమాజంలో విశ్వాసాన్ని పెంపొందించే అవకాశం ఉంది. ఇది జమ్మూ కాశ్మీర్‌లో సామాజిక సమైక్యత, శాంతిని పునరుద్ధరించే ప్రయత్నాలకు ఊతం ఇస్తుంది. శ్రీనగర్‌ డిప్యూటీ కమిషనర్‌గా కాశ్మీరీ పండిట్‌ నియమితులవడం కేవలం పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు, ఇది రాజకీయ, సామాజిక సందేశాన్ని కూడా అందిస్తుంది. ఈ సంఘటన ఈ క్రింది అంశాలను సూచిస్తుంది. పునరావాసం, ఆమోదం: కాశ్మీరీ పండిట్లను తిరిగి లోయలో స్థిరపరచడం, వారిని పరిపాలనలో భాగస్వాములను చేయడం ద్వారా, కేంద్ర ప్రభుత్వం వారి సామాజిక ఆమోదాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది.
విశ్వాస నిర్మాణం: ఈ నియామకం కాశ్మీరీ పండిట్లలో విశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, ఇతర సమాజాలతో సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది. శ్రీనగర్‌ వంటి రాజకీయంగా సున్నితమైన ప్రాంతంలో ఈ నిర్ణయం ఒక సానుకూల సంకేతం.పరిపాలనలో వైవిధ్యం: కాశ్మీరీ పండిట్లకు ఉన్నత స్థాయి పరిపాలనా పదవులలో అవకాశాలు కల్పించడం ద్వారా, ప్రభుత్వం వైవిధ్యమైన పరిపాలనా వ్యవస్థను నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది.
కాశ్మీర్‌పై ప్రభావం...
ఈ నియామకం జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయ, సామాజిక డైనమిక్స్‌పై గణనీయమైన ప్రభావం చూపనుంది.సామాజిక సమైక్యత: కాశ్మీరీ పండిట్లు, ఇతర సమాజాల మధ్య దశాబ్దాలుగా ఉన్న అంతరాన్ని తగ్గించడంలో ఈ నియామకం సహాయపడవచ్చు. శ్రీనగర్‌లో కాశ్మీరీ పండిట్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఉండటం స్థానిక సమాజంలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.రాజకీయ సందేశం: ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత, కాశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం ఏకీకరణ, అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఈ నియామకం ఆ దిశలో ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తుంది.పునరావాస ప్రయత్నాలకు ఊతం: కాశ్మీరీ పండిట్ల పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఈ నియామకం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇది ఇతర కాశ్మీరీ పండిట్లను తిరిగి లోయలో స్థిరపడేందుకు ప్రోత్సహిస్తుంది.
భవిష్యత్తు అవకాశాలు..
ఈ నియామకం కాశ్మీర్‌లో సానుకూల మార్పులకు దారితీసినప్పటికీ, కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి.స్థానిక వ్యతిరేకత: శ్రీనగర్‌ వంటి సున్నితమైన ప్రాంతంలో కాశ్మీరీ పండిట్‌ డిప్యూటీ కమిషనర్‌గా నియమితులవడం కొంతమంది స్థానికుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొనవచ్చు. ఈ సవాలును అధిగమించడానికి సమర్థవంతమైన దౌత్యం, సమాజంతో సంప్రదింపులు అవసరం.
భద్రతా ఆందోళనలు: కాశ్మీరీ పండిట్లు గతంలో హింసను ఎదుర్కొన్న నేపథ్యంలో, ఈ అధికారికి తగిన భద్రత కల్పించడం కీలకం.
సుస్థిర పునరావాసం: ఈ నియామకం ఒక సానుకూల సంకేతం అయినప్పటికీ, కాశ్మీరీ పండిట్ల పునరావాసం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు మరియు సమగ్ర విధానం అవసరం. ఈ నియామకం భవిష్యత్తులో కాశ్మీరీ పండిట్లకు మరిన్ని అవకాశాలను తెరవగలదు. ఇది రాజకీయ, పరిపాలనా, సామాజిక రంగాలలో వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి దోహదపడుతుంది.

]]>
Thu, 19 Jun 2025 15:11:32 +0530 admin
రాజకీయనేతలకు గుడ్ న్యూస్.... ఏపీలో పెరగనున్న 225 నియోజకవర్గాలు https://prajakshethrenews.com/రాజకీయనేతలకు-గుడ్-న్యూస్-ఏపీలో-పెరగనున్న-225-నియోజకవర్గాలు https://prajakshethrenews.com/రాజకీయనేతలకు-గుడ్-న్యూస్-ఏపీలో-పెరగనున్న-225-నియోజకవర్గాలు రాజకీయనేతలకు గుడ్ న్యూస్
ఏపీలో పెరగనున్న 225 నియోజకవర్గాలు
ప్రజా క్షేత్ర్, విజయవాడ, జూన్ 19 :
తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరగనుందా? పునర్విభజన కచ్చితంగా చేపడతారా? కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కదలిక వచ్చింది. కేంద్ర ప్రభుత్వం జన గణనకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో తప్పనిసరిగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని ప్రచారం సాగుతోంది. జన గణనతో పాటు కుల గణన కూడా చేపట్టనున్నారు. తద్వారా నియోజకవర్గాల పెంపు, రిజర్వేషన్ల కేటాయింపునకు ఈ రెండు అంశాలు దోహదపడతాయని భావిస్తున్నారు. కులగణనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. తరువాత పునర్విభజన ప్రక్రియ చేపట్టి 2029 ఎన్నికలకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావహుల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది.రాష్ట్ర విభజనజరిగి 11 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికే 2014, 2019, 2024 ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే రాష్ట్ర విభజన జరిగిన సమయంలోనే నియోజకవర్గాల పెంపు ఉంటుందని అంతా భావించారు. విభజన హామీల్లో సైతం నియోజకవర్గాల పెంపు విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. పునర్విభజన చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉంది. కానీ జన గణన, కుల గణన జరగకపోవడంతో దానిపై ముందడుగు వేయలేకపోయింది కేంద్రం. వాస్తవానికి 2011లో చివరిసారిగా జనగణన జరిగింది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన చేపట్టాల్సి ఉంది. ఈ లెక్కన 2021లో చేపట్టాల్సిన జనగణన.. కరోనా వైరస్ కారణంగా చేపట్ట లేకపోయారు. దేశంలో వచ్చే ఏడాది రెండు విడతల్లో జనగణన చేపట్టేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో తప్పనిసరిగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి.పునర్విభజనలో భాగంగా ఏపీలో అసెంబ్లీ సీట్లు50 వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 25 పార్లమెంట్ స్థానాలు కొనసాగుతున్నాయి. ప్రతి పార్లమెంటు స్థానంలో రెండు నియోజకవర్గాల చొప్పున పెరిగే అవకాశం ఉంది. ఈ పునర్విభజన పైనే చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా అధికార పార్టీకి పునర్విభజన అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. తమకు అనుకూలంగా పునర్విభజన చేపట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో కూటమి పార్టీల నేతలు ఎక్కువగా పునర్విభజన పై ఆశలు పెట్టుకున్నారు. 50 అసెంబ్లీ సీట్లు పెరిగితే.. ఆశావహులకు సైతం చాలా సులువుగా సీట్లు కేటాయించవచ్చని పార్టీలు భావిస్తున్నాయి.చివరిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉండేది. రాష్ట్రంలో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఆ సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా పునర్విభజన జరిగిందన్న కామెంట్స్ వినిపించాయి. 2009లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి విజయం సాధించడం వెనుక పునర్విభజన ప్రక్రియ దోహద పడిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండడం, కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామి కావడంతో తప్పకుండా కూటమికి అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. అయితే 2027 ద్వితీయార్థంలో పునర్విభజన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

]]>
Thu, 19 Jun 2025 09:01:38 +0530 admin
3 వేలు ఫాస్టాగ్ తో ఏడాది ప్రయాణం https://prajakshethrenews.com/3-వేలు-ఫాస్టాగ్-తో-ఏడాది-ప్రయాణం https://prajakshethrenews.com/3-వేలు-ఫాస్టాగ్-తో-ఏడాది-ప్రయాణం  3 వేలు ఫాస్టాగ్ తో ఏడాది ప్రయాణం
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ, జూన్ 18
జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ల వ్యవస్థపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీసుకున్న ఈ నిర్ణయం, భారత రహదారి మౌలిక సదుపాయాల ప్రస్థానంలో ఒక గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ 'ఎక్స్ (ట్విట్టర్)' వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.ఫాస్టాగ్ వార్షిక పాస్‌లను ప్రవేశపెట్టాలన్న ప్రయాణికుల చిరకాల డిమాండ్‌కు ఈ నిర్ణయంతో సరైన పరిష్కారం లభించిందని పవన్ పేర్కొన్నారు. టోల్ చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడం ద్వారా ప్రైవేటు వాహన యజమానులకు ఈ కొత్త విధానం ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. "రూ.3000 వార్షిక పాస్‌తో వాహనదారులకు ఆర్థికంగా ఉపశమనం కలగడమే కాకుండా, దేశవ్యాప్తంగా సున్నితమైన, వేగవంతమైన, ఎలాంటి వివాదాలకు తావులేని విధంగా హైవే ప్రయాణం సాధ్యమవుతుంది" అని జ‌న‌సేనాని పేర్కొన్నారు. ముఖ్యంగా టోల్ ప్లాజాల సమీపంలో నివసిస్తూ, తరచూ ప్రయాణించే వారికి ఈ విధానం వల్ల సమయంతో పాటు ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వానికి ప్రజాపాలన పట్ల ఉన్న నిబద్ధతకు నితిన్ గడ్కరీ తీసుకున్న ఈ నిర్ణయం ఒక నిదర్శనమని పవన్ కొనియాడారు.కాగా, ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌లను ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.3000 చెల్లించి ఈ పాస్‌ను పొందవచ్చని ఆయన 'ఎక్స్ (ట్విట్టర్)' లో వెల్లడించారు. గడ్కరీ చేసిన ఈ పోస్టును రీట్వీట్ చేస్తూ పవన్ కల్యాణ్ పైవిధంగా స్పందించారు. అయితే, ప్రస్తుతం కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటి వాణిజ్యేతర వాహనాలకు వర్తించేలా కేంద్రం ప్రకటించిన ఈ పాస్‌కు సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలు, వర్తించే నిబంధనలు ఇంకా వెలువడాల్సి ఉంది.

]]>
Wed, 18 Jun 2025 19:06:44 +0530 admin
ఏపీకి పాకిన ఫోన్ ట్యాపింగ్? https://prajakshethrenews.com/ఏపీకి-పాకిన-ఫోన్-ట్యాపింగ్ https://prajakshethrenews.com/ఏపీకి-పాకిన-ఫోన్-ట్యాపింగ్ ఏపీకి పాకిన ఫోన్ ట్యాపింగ్?
ప్రజా క్షేత్ర్, విజయవాడ, జూన్ 18 :
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుతో ఏపీకి లింక్స్ ఉన్నట్టు బయటపడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ కేసు హాట్ హాట్ టాపిక్ అయింది. తన ఫోన్ ట్యాప్ చేశారని ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాప్ కావడం వెనుక జగనన్న హస్తం ఉన్నట్లు తెలిపారు. షర్మిలను మాత్రమే కాదు... సినిమా ఇండస్ట్రీలోని పవన్ కళ్యాణ్ సన్నిహితులను సైతం టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ సన్నిహితులు ఎవరు? అని ప్రశ్నిస్తే... నలుగురైదుగురు కనిపిస్తారు. వాళ్ళ పేర్లు మాత్రమే వినపడతాయి. రెండు నుంచి ఐదో స్థానం వరకు పలువురు పేర్లు కిందకి పైకి మారొచ్చు.‌ కానీ ఒక్కరి పేరు మాత్రం ఎవరిని అడిగినా మొదటి స్థానంలో ఉంటుంది. పవన్ ఆప్త మిత్రుడిగా అందరికీ తెలిసిన ఆ దర్శకుడు ఫోన్ ట్యాప్ చేశారని తెలుస్తోంది. రాజకీయాలలో ఆయన ఎప్పుడూ క్రియాశీలకంగా వ్యవహరించినది లేదు. రాజకీయ నాయకులతో ఆయన మాట్లాడినది కూడా లేదు. పవన్ సన్నిహితులు కావడం వల్ల... జనసేనానికి సలహాలు ఇస్తున్నారనే అనుమానంతో ఆయన ఫోన్ ట్యాప్ చేశారని టాక్.పవన్ కళ్యాణ్ కుటుంబం అంతా ఇండస్ట్రీలో ఉంది. ఆయన పిల్లలు చిన్న వాళ్ళు. ఇంకా ఇండస్ట్రీలో ఎంటర్ కాలేదు. అయితే... మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు సహా వాళ్ల పిల్లలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సుస్మిత, నిహారిక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు. మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ పొలిటికల్ ట్వీట్స్ కూడా చేశారు. వాళ్ల ఫోన్స్ కూడా ట్యాప్ చేశారని టాక్. పవన్ కుటుంబ సభ్యులను సైతం వదల్లేదట.జనసేన పార్టీ స్థాపించిన పదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ విజయ పథంలోకి వచ్చింది. అధికారంలో లేని సమయంలో నిర్వహించిన రాజకీయ సభలో పవన్ పదేపదే ప్రస్తావించిన అంశం ఒకటి... పార్టీని నడపడం కోసం డబ్బులు అవసరమని, అందుకోసం సినిమాలు చేయక తప్పదని!పవన్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం కోసం ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతలను టార్గెట్ చేశారట. ఆ సమయంలో పవన్ హీరోగా నటించిన సినిమాల మీద ఏపీలోని ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పవన్‌తో సినిమాలు నిర్మించిన, ఆయా సినిమాలు నిర్మించడం ద్వారా పవన్ పార్టీకి పరోక్షంగా ఆర్థిక సహకారం అందించిన నిర్మాతలను టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ముఖ్యంగా పవన్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా నిర్మాత తెలంగాణ వాసి అయినప్పటికీ... ఆయన ఫోన్ ట్యాప్ చేశారు. అటు ఏపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం... రెండిటిలోని పెద్దలు అతడిని టార్గెట్ చేశారట. పవన్ సన్నిహిత మిత్రుడైన దర్శకుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, నిర్మాతలు మాత్రమే కాదు... సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు సైతం ఫోన్ ట్యాపింగ్ బాధితులే. అప్పట్లో ఏపీలో అధికారంలో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి స్నేహం కోసం సినిమా ఇండస్ట్రీలో పవన్ సన్నిహితులను టార్గెట్ చేస్తూ అప్పటి తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్‌కి పాల్పడితే... వాళ్లతో పాటు కొంత మంది హీరోయిన్ల ఫోనులు సైతం ట్యాప్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరి పేర్లు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్నప్పటికీ... ఎవరెవరి ఫోనులు ట్యాప్ అయ్యాయనేది ఫిలిం ఇండస్ట్రీలో కొందరికి తెలుసు.అప్పటి జగన్ ప్రభుత్వం తమను మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయడంలో పవన్ క్రియాశీలక పాత్ర పోషిస్తారని విషయాన్ని గుర్తించడం వల్ల ఇదంతా జరిగిందని, తెలుగు దేశంతో పవన్ చేతులు కలిపితే తమకు ఓటమి తప్పదని గుర్తించి ముందస్తుగా కొన్ని అడ్డదారులు తొక్కేందని రాజకీయ - సినీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి

]]>
Wed, 18 Jun 2025 18:36:17 +0530 admin
అండమాన్ లో భారీగా చమురు నిల్వలు https://prajakshethrenews.com/అండమాన్-లో-భారీగా-చమురు-నిల్వలు https://prajakshethrenews.com/అండమాన్-లో-భారీగా-చమురు-నిల్వలు అండమాన్ లో భారీగా చమురు నిల్వలు
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ, జూన్ 17
ఇప్పటికే భారత్ నాలుగో ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. జపాన్ దేశాన్ని పక్కనపెట్టి.. జర్మనీని అధిగమించి.. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తోంది. అదే గనక వాస్తవరూపం దాల్చితే జర్మనీ మన తర్వాతి స్థానంలోకి వెళ్లిపోతుంది.ఎలాగూ మూడో స్థానంలోకి వెళ్తాం కాబట్టి మన ముందు కేవలం డ్రాగన్, అమెరికా దేశాలు మాత్రమే ఉంటాయి. అప్పుడిక ఆ రెండు దేశాలను అధిగమించడానికి మనం ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అయితే అన్నీ మంచి శకునములే అన్నట్టుగా.. భారత్ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి చేస్తున్న ప్రయత్నం ఫలించే విధంగా కనిపిస్తోంది. ఒకవేళ అదే గనుక వాస్తవరూపం దాల్చితే.. ప్రపంచంలోనే మనం రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటాం. చైనాను సైతం పడగొట్టి.. అమెరికాకు సవాల్ విసిరేస్థాయిలో ఉంటాం. ఇంతకీ మన శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారు? కేంద్ర మంత్రి ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేశారు? ఇంతకీ అండమాన్ సముద్రంలో ఏముంది? అది వెలికి తీస్తే ఏం జరుగుతుంది?ప్రపంచ గమనాన్ని మార్చుతుంది కేవలం ఒకటే ఒకటి. అదే ముడిచమురు. ఆ చమురు నిల్వలు ఉన్న దేశాలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నాయి. దుబాయ్ ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య నగరంగా ఏర్పడిందంటే దానికి కారణం చమురు మాత్రమే. ఆ చమురు కోసమే అమెరికా ఇరాన్, ఇరాక్ వంటి దేశాలపై యుద్ధాలు చేసింది. చమరు నిల్వలపై గుత్తాధిపత్యాన్ని సాధించడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. చివరికి ఎంతో కొంత విజయం సాధించింది. ఇక ఉక్రెయిన్ తో ఏళ్ల పాటు యుద్ధం సాగిస్తున్న రష్యా.. ఆర్థికంగా ఇప్పటికీ అదే స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం చమురు మాత్రమే. అందువల్లే చమురు ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసిస్తోంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న మనదేశంలో చమురు నిల్వలు అంతంత మాత్రమే. పైగా అవి మన దేశీయ అవసరాలకు సరిపోవు. అందువల్లే విదేశాల నుంచి ముడిచమురు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది.ఇక మనదేశంలో విస్తారంగా సముద్రాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సముద్రతీరం ఉన్న ప్రధాన ప్రాంతాలలో అండమాన్ ఒకటి. ఈ అండమాన్ సముద్రంలో కొంతకాలంగా మన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాలు ఇప్పుడు సత్ఫలితాన్ని ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే అండమాన్ సముద్రంలో దాదాపు 11.6 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. వీటిని కనుక వెలికి తీస్తే మన ఎకానమీ 3.7 ట్రిలియన్ డాలర్ల నుంచి 20 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. మన దేశం ముడిచమురు దిగుమతుల్లో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఈ చమురు కోసం భారీగా విదేశీ మారక నిల్వలను ఖర్చు చేస్తోంది. ఒకవేళ ఈ చమురు గనుక వెలికి తీసినట్టయితే.. అప్పుడు దేశ అవసరాలతో పాటు.. ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మన దేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుంది. ప్రపంచ దేశాలను అధిగమించి.. రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా.. అన్ని అనుకూలిస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది.

]]>
Tue, 17 Jun 2025 12:53:25 +0530 admin
ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాప్టార్... ఏడుగురు మృతి https://prajakshethrenews.com/ఉత్తరాఖండ్-లో-కూలిన-హెలికాప్టార్-ఏడుగురు-మృతి https://prajakshethrenews.com/ఉత్తరాఖండ్-లో-కూలిన-హెలికాప్టార్-ఏడుగురు-మృతి ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాప్టార్... ఏడుగురు మృతి

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటన మరువకముందే ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం మరో విషాదంగా మారింది.ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ధామ్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం దేశవ్యాప్తంగా షాక్ కు గురించేసిన విషయం విధితమే. ఆదివారం ఉదయం 5:30 గంటల సమయంలో, కేదార్‌నాథ్ నుంచి గుప్తకాశీకి బయలుదేరిన ఒక హెలికాప్టర్ గౌరీకుండ్ సమీపంలోని అడవుల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌తో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హెలికాప్టర్ ఆర్యన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినదని, ఇది ప్రైవేట్ సర్వీస్ అని అధికారులు పేర్కొన్నారు.

]]>
Sun, 15 Jun 2025 20:34:10 +0530 admin
బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష https://prajakshethrenews.com/బలవంతంగా-అప్పు-వసూలు-చేస్తే-ఐదేళ్లు-జైలు-శిక్ష https://prajakshethrenews.com/బలవంతంగా-అప్పు-వసూలు-చేస్తే-ఐదేళ్లు-జైలు-శిక్ష బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష

శాసనభలో బిల్లు ప్రవేశపెట్టిన తమిళనాడు ప్రభుత్వం,
ఆమోదించిన గవర్నర్

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

*ప్రజల వద్ద కొన్ని రుణసంస్థలు బలవంతంగా రుణాలు వసూలు చేస్తున్నాయని, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నాయని ఇలాంటి సంఘటనలు ఆపడానికే ఈ బిల్లు ప్రవేశపెట్టామని తెలిపిన తమిళనాడు ప్రభుత్వం*

*ఇకపై ప్రజల వద్ద బలవంతంగా రుణాలు వసూలు చేసినా, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినా ఐదేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించిన తమిళనాడు ప్రభుత్వం*

*రుణసంస్థల ఒత్తిడితో ఎవరైనా బలవన్మరణానికి పాల్పడితే, ఆ సంస్థ నిర్వాహకులకు బెయిల్ రాకుండా జైలు శిక్ష అమలు చేసే విధంగా ఈ బిల్లును రూపొందించామని పేర్కొన్న స్టాలిన్ ప్రభుత్వం*

]]>
Sun, 15 Jun 2025 09:49:42 +0530 admin
అహ్మదాబాద్ లో విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం https://prajakshethrenews.com/అహ్మదాబాద్-లో-విమాన-ప్రమాద-ఘటన-నేపథ్యంలో-ఎయిర్-ఇండియా-కీలక-నిర్ణయం https://prajakshethrenews.com/అహ్మదాబాద్-లో-విమాన-ప్రమాద-ఘటన-నేపథ్యంలో-ఎయిర్-ఇండియా-కీలక-నిర్ణయం అహ్మదాబాద్ లో విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
AI-171 స్థానంలో AI-159 నెంబర్‌ విమానం
ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ :
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. AI-171 నంబర్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. విమాన ప్రమాద మృతులకు గౌరవార్ధంగా ఈ నెంబర్ ను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా శనివారం ప్రకటించింది. AI-171 స్థానంలో AI-159 నెంబర్‌ విమానం అహ్మదాబాద్-లండన్‌ మధ్య సేవలందించనుందని తెలిపింది.కాగా, గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 270కి పెరిగిందని వైద్యులు తెలిపారు. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న విమానం AI 171 గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన నిమిషాలకే BJ మెడికల్ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టిన సంగతి తెలిసిందే.

]]>
Sat, 14 Jun 2025 22:39:44 +0530 admin
టెలికం శాఖ మొబైల్ ప్లాన్ల మార్పు ప్రక్రియను మరింత సరళతరం https://prajakshethrenews.com/టెలికం-శాఖ-మొబైల్-ప్లాన్ల-మార్పు-ప్రక్రియను-మరింత-సరళతరం https://prajakshethrenews.com/టెలికం-శాఖ-మొబైల్-ప్లాన్ల-మార్పు-ప్రక్రియను-మరింత-సరళతరం టెలికం శాఖ మొబైల్ ప్లాన్ల మార్పు ప్రక్రియను మరింత సరళతరం
ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ జూన్ 13 :
దేశంలో మొబైల్ వినియోగదారులకు   గుడ్ న్యూస్ వచ్చేసింది. టెలికం శాఖ మొబైల్ ప్లాన్ల మార్పు ప్రక్రియను మరింత సరళతరం చేయాలని నిర్ణయించింది. జూన్ 10, 2025 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పులతో వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా టెలికాం ప్లాన్లను ఈజీగా మార్చుకోవచ్చు. ఈ మార్పు ప్రకారం మీరు ఒకసారి ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ లేదంటే పోస్ట్‌పెయిడ్ టూ ప్రీపెయిడ్‌కు మారిన తర్వాత, తదుపరి మార్పు కోసం కేవలం 30 రోజుల వేచి ఉంటే సరిపోతుంది.
 ఓటిపి ఆధారిత మార్పు....
ఇది వరకు ఈ వ్యవధి 90 రోజులుగా ఉండేది. అంటే 30 రోజుల తర్వాత మీకు ఆ ప్లాన్ నచ్చకుంటే మళ్లీ మారిపోవచ్చు. ప్రస్తుతం, మీరు OTP ద్వారా మీ ప్లాన్ మార్చుకునే ఛాన్సుంది. ఈ ప్రక్రియలో మీ ఆధార్ లేదా డిజిలాకర్ ద్వారా మీ వివరాలు ధృవీకరించబడతాయి. ఫిజికల్ KYC కూడా అవసరం లేదు. మీరు 30 రోజుల కూలింగ్ ఆఫ్ సమయంలో ఉంటే, ఫిజికల్ KYC ప్రక్రియ ద్వారా ప్లాన్ మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియలో మీ వివరాలు ఆథారైజ్డ్ పాయింట్ ఆఫ్ సేల్ వద్ద ధృవీకరించబడతాయి.

]]>
Fri, 13 Jun 2025 21:23:37 +0530 admin
ఉగ్రవాద మావోయిస్టుల నిర్మూలనలో సీఆర్పీఎఫ్ పాత్ర కీలకం : కేంద్ర మంత్రి బండి సంజయ్ https://prajakshethrenews.com/ఉగ్రవాద-మావోయిస్టుల-నిర్మూలనలో-సీఆర్పీఎఫ్-పాత్ర-కీలకం-కేంద్ర-మంత్రి-బండి-సంజయ్ https://prajakshethrenews.com/ఉగ్రవాద-మావోయిస్టుల-నిర్మూలనలో-సీఆర్పీఎఫ్-పాత్ర-కీలకం-కేంద్ర-మంత్రి-బండి-సంజయ్ పారామిలిటరీ బలగాల్లో అత్యుత్తం సీఆర్పీఎఫ్

సీఆర్పీఎఫ్ బలగాల త్యాగాలు సేవలను మరువలేం:

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

ఉగ్రవాద మావోయిస్టుల నిర్మూలనలో సీఆర్పీఎఫ్ పాత్ర కీలకం

 అత్యాధునిక ఆయుధాలను అందిస్తాం.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.

జంషేడ్ పూర్ లో సీఆర్పీఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన బండి సంజయ్
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
జమ్మూ కాశ్మీర్‌ సహా దేశంలోని ఉగ్రవాదం, వేర్పాటువాదం ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదంతోపాటు మావోయిస్టుల ఏరివేతలో సీఆర్పీఎఫ్ బలగాలు చూపుతున్న తెగువ అద్బుతమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.  దేశంలోని అంతర్గత శాంతి భద్రతలను పరిరక్షించడంలో సీఆర్పీఎఫ్ ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. దేశ అంతర్గత భద్రత విషయంలో సీఆర్పీఎఫ్ బలగాల త్యాగాలను వెలకట్టలేనివని అభివర్ణించారు. రాంచిలోని బిర్సాముండా విమానాశ్రయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడి నుండి బిఎస్ఎఫ్, హెలికాప్టర్ ఎం ఐ 17, లో జంషేడ్ పూర్ వెళ్లారు. విప్లవ వీరుడు బిర్సా ముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి సీఆర్పీఎఫ్ కేంద్రానికి వెళ్లిన బండి సంజయ్ నూతనంగా నిర్మించిన పలు సీఆర్పీఎఫ్ భవనాలను ప్రారంభించారు. అందులో 480 టైప్-2 మరియు 24 టైప్-3 కుటుంబ నివాస గృహాలు, 20 పడకల ఆసుపత్రి, స్టోర్ బిల్డింగ్, ట్రేడ్స్‌మెన్ షాప్, 180 మందికి గల మెన్ బ్యారక్ లు ఉన్నారు.  ఈ సందర్భంగా  నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎంపీ విద్యుత్ బరణ్ మహతో అదనపు డీజీ అమిత్ కుమార్, ఐపీఎస్ అధికారులు శాలినీ, సాకేత్ కుమార్ తోపాటు పలువురు పోలీసు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైనవారికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు.సిఆర్.పీ.ఎఫ్. జవాన్లు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ భద్రత కోసం, ప్రత్యేకించి తీవ్రమైన దుర్భర ప్రాంతాల్లో  విధులు నిర్వహిస్తూ మాతృభూమికి అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. వారి సేవలను ద్రుష్టిలో ఉంచుకుని  జవాన్లకు, అధికారులకు వారి కుటుంబాలతో నివసించేందుకు వీలుగా గృహ నిర్మాణాల్ని నిర్మిస్తున్నాం. ఈ గ్రుహ నిర్మాణాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. అందులో భాగంగానే జంషేడ్ పూర్ లోని సీఆర్పీఎఫ్ గ్రూప్ కేంద్రంలో 165 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన 480 టైప్-2,  24 టైప్-3 కుటుంబ ఆవాసాలతోపాటు భండార్  భవనం, ట్రేడ్స్‌మెన్ షాప్, 20 బెడ్ల ఆసుపత్రి, అధికారుల మెస్, 180 మందికి సరిపడా మెయిన్ బ్యారక్ లను నిర్మించడంతోపాటు  నా చేతుల ద్వారా వాటిని ప్రారంభించడాన్ని గర్వంగా భావిస్తున్నాను. విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లు, అధికారులు తమ కుటుంబాలను సురక్షిత వాతావరణంలో ఉంచి, పిల్లలకు మంచి విద్య అందించడంలో వీలు కల్పించి, ఎటువంటి ఆందోళన లేకుండా దేశ సేవలో మునిగిపోవడానికి ఈ రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.

]]>
Fri, 13 Jun 2025 20:44:58 +0530 admin
అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. మృత్యుంజయుడిని పరామర్శించిన ప్రధాని మోదీ https://prajakshethrenews.com/అహ్మదాబాద్-విమాన-ప్రమాదం-మృత్యుంజయుడిని-పరామర్శించిన-ప్రధాని-మోదీ https://prajakshethrenews.com/అహ్మదాబాద్-విమాన-ప్రమాదం-మృత్యుంజయుడిని-పరామర్శించిన-ప్రధాని-మోదీ అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. మృత్యుంజయుడిని పరామర్శించిన ప్రధాని మోదీ
ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ : 
ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ బ్రిటిష్‌ జాతీయుడు రమేశ్‌ విశ్వాస్‌ కుమార్‌ బుచర్వాడను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు PM Modi. గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా  బోయింగ్‌ ఏ-171లో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది మరణించారు. అయితే, ఒకే ఒక్కరు రమేశ్‌ విశ్వాస్‌ కుమార్‌ బుచర్వాడ   త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. ప్రస్తుతం అతను అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు రమేశ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు.

]]>
Fri, 13 Jun 2025 20:37:05 +0530 admin
విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ https://prajakshethrenews.com/విమాన-ప్రమాద-స్థలాన్ని-పరిశీలించిన-ప్రధాని-మోదీ https://prajakshethrenews.com/విమాన-ప్రమాద-స్థలాన్ని-పరిశీలించిన-ప్రధాని-మోదీ విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ
ప్రజా క్షేత్ర్, అహ్మదాబాద్ :
గుజరాత్ అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. విమానం కూలిన ప్రదేశానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రికి వెళ్లారు మోదీ. విమాన ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అయితే ప్రధాని వెంట గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్‌ సంఘవి తదితరులు ఉన్నారు.

]]>
Fri, 13 Jun 2025 15:45:43 +0530 admin
విమాన ప్రమాదం గురించి అరునెలల ముందే చెప్పిన ఓ మహిళ ట్వీట్ వైరల్? https://prajakshethrenews.com/విమాన-ప్రమాదం-గురించి-అరునెలల-ముందే-చెప్పిన-ఓ-మహిళ-ట్వీట్-వైరల్ https://prajakshethrenews.com/విమాన-ప్రమాదం-గురించి-అరునెలల-ముందే-చెప్పిన-ఓ-మహిళ-ట్వీట్-వైరల్ విమాన ప్రమాదం గురించి అరునెలల ముందే చెప్పిన ఓ మహిళ ట్వీట్ వైరల్?

అస్ట్రో శర్మిష్ట ..

ప్రజా క్షేత్ర్, హైదరాబాబ్, జూన్ 13 :
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 242 మందితో లండన్‌లోని గాట్విక్‌ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది ఎయిరిండియా విమానం. మధ్యాహ్నం 1.17 నిమిషాలకు టేకాఫ్ తీసుకుని 2 నిమిషాల్లోనే మేఘానిలోని గుజ్‌సెల్‌ విమానాశ్రయ సమీపంలో కుప్పకూలింది. భారీ పేలుడు కారణంగా దట్టమైన పొగలు వ్యాపించాయి. గురువారం మధ్యాహ్నం సంభవించిన ఈ ఘోర విమాన దృశ్యాలు అందరి హృదయాలను కలచివేస్తున్నాయి. అయితే ఈ విమాన ప్రమాదంపై ఓ మహిళ ఆరు నెలల ముందే ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఆ ట్వీట్‌ వైరల్ అవుతోంది.ఈ ప్రమాదాన్ని ‘ఆస్ట్రో షర్మిష్టా’ అనే మహిళ డిసెంబర్ 29, 2024లోనే ట్వీట్ చేసింది. ‘2025లో ఏవియేషన్ వృద్ది అద్భుతంగా ఉంటుంది. కాకపోతే సేఫ్టీ, సెక్యురిటీ పరంగా ఇబ్బందులు ఉంటాయి. అలాగే, విమానం కూలింది అనే బ్రేకింగ్ వార్తలు మనల్ని కలిచి వేస్తాయి’. అని ఆ మహిళ 6 నెలలకు ముందే అంచనా వేసి చెప్పింది. అలాగే జూన్ 5, 2025న కూడా ఇదే ట్వీట్‌ను రీ-ట్వీట్ చేస్తూ.. ‘ఓ విమాన ప్రమాదం జరుగుతుందని.. అది విమానయాన సంస్థను 2025లో నాశనం చేస్తుందని గట్టిగా అంచనా వేస్తున్నట్టు మళ్లీ చెప్పుకొచ్చింది’. ప్రస్తుతం ఆ మహిళ ట్వీట్లు వైరలవుతున్నాయి.

]]>
Fri, 13 Jun 2025 11:03:33 +0530 admin
రక్తదాత ప్రాణాలను కాపాడే వ్యక్తితో సమానం." & డాక్టర్ లిల్లీ మేరి https://prajakshethrenews.com/రక్తదాత-ప్రాణాలను-కాపాడే-వ్యక్తితో-సమానం-డాక్టర్-లిల్లీ-మేరి https://prajakshethrenews.com/రక్తదాత-ప్రాణాలను-కాపాడే-వ్యక్తితో-సమానం-డాక్టర్-లిల్లీ-మేరి రక్తదాత ప్రాణాలను కాపాడే వ్యక్తితో సమానం." -  డాక్టర్ లిల్లీ మేరి
                      (రేపు ప్రపంచ రక్త దాతల దినోత్సవం)
ప్రజా క్షేత్ర్, కొడంగల్ జూన్ 12 :
అత్యవసర పరిస్థితుల్లో మరొకరి ప్రాణం పోసేదే రక్తదానం.  దీనిని కృత్రిమంగా ఉత్పత్తి చేయడం సాధ్యపడదు. రక్తదానం ఒక పవిత్ర కార్యo.  పోయిన ప్రాణాలను మనము ఎలాగో తీసుకురాలేము. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడే ప్రాణాలను ఒక్కోసారి సాటి  మనిషి రక్తముతో కాపాడగల ము. ఇది రక్త దానము తోనే సాధ్యం.  పుట్టినరోజులు, పెళ్లిరోజులు చేసుకుంటూ బంధుమిత్రులకు విందు ఇవ్వడం కంటే ఇలాంటి రోజులలో రక్తదానం చేయడం గొప్ప సంతృప్తినిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు రక్తదానంపై ప్రజలలో ఇంకా సరైన అవగాహన లేదు. ఎన్నో అపోహలు  వెంటాడుతున్నాయి. విధి వంచితులకు, క్షతగాత్రులకు, ప్రమాదం బారిన పడి అల్లాడే వారిని బతికించడానికి ఇవ్వాల్సింది రక్తం. ఒకప్పుడు రక్తదానం చేయాలంటే భయపడేవారు. ఇప్పుడు రక్తం ఇవ్వడానికి ముందుకు  వస్తుండడం శుభపరిణామం. రాష్ట్రంలో ఎంతోమంది దాతలు  రక్త నిధి కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన వారికి రక్తం అందించి ఎంతో మంది అభాగ్యుల  ప్రాణాలు నిలుపుతున్నారు. ప్రాణం నిలపడానికి అవసరమైన ఈ రక్తం గురించి  చాలామందికి తెలియదు. అసలు రక్తదానం ఎందుకు చేయాలి. రక్తదానం చేయాలంటే ఎవరిని సంప్రదించాలి.

ఎవరు రక్తదానం చేయాలి :
18 నుంచి 65 సంవత్సరాల లోపు ఉండి 45 కిలోల కంటే బరువు ఎక్కువగా ఉన్న ఆరోగ్యవంతులు రక్తదానం చేయవచ్చు. గతంలో రక్తదానం చేసి ఉంటే మూడు నెలల తర్వాత  తిరిగి చేయవచ్చును. రక్తపోటు సాధారణ స్థితిలో ఉన్నవారు, గుండె జబ్బులు లేనివారు రక్తదానం చేయవచ్చును. రక్తదానం చేసినా చేయకపోయినా ప్రతి మనిషి రక్తoలోని జీవకణాల జీవిత కాలము నాలుగు నెలలు మాత్రమే. రక్తదానం చేసిన తర్వాత 24 గంటల లోగా ప్లాస్మా ఏర్పడుతుంది. నాలుగు వారాల్లోగా జీవ కణాలు ఏర్పడతాయి.
రక్త మార్పిడి ఎందుకు?
                రక్తంలో భాగంగా ఉండే కొన్ని అంశాలు తగ్గిన, శరీరంలో తగినంత రక్తం లేకపోయినా, రక్త మార్పిడి అవసరము. మన రాష్ట్రంలో అత్యవసరంగా రక్తాన్ని ఎక్కించాల్సిన కేసులు ఎక్కువ కావడం గమనార్హం. రక్తం అవసరమైన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి, రక్తహీనతతో బాధపడే వారికి, సికిల్ సెల్, తల సేమియా వంటి జన్యు సంబంధ వ్యాధులకు గురైనప్పుడు రక్తమార్పిడి తప్పనిసరి. తల సేమియా వ్యాధిగ్రస్తులకు హిమోగ్లోబిన్ తయారయ్యే జన్యువులు లోపిస్తాయి. వీరికి ప్రతి 20 రోజులకోసారి రక్త మార్పిడి జరగాలి. సికిల్ సెల్, అనీమియా వ్యాధిగ్రస్తులకు ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారిపోయి రక్తప్రసరానికి ఆక్సిజన్ సరఫరాకు పనికి రాకుండా పోతాయి. కొంతమంది స్త్రీలలో ప్రసవం తర్వాత పోస్ట్ పార్టం హేమరేజ్ అనే సమస్య వస్తుంది. ఫలితంగా రక్తస్రావ సమస్యకు గురవుతారు. అలాంటి వారికి రక్తమార్పిడి అవసరం అవుతుంది.
రక్తము రకాలు:
                రక్తంలో నాలుగు గ్రూపులుంటాయి. ఏ, బి, ఓ, ఏబి ఆర్హెచ్ పాజిటివ్ లు, నాలుగు ఓ ప్లస్,  ఎ ప్లస్, బి ప్లస్, ఏ బి ప్లస్ లు ఉంటాయి. ఆర్ హెచ్ నెగిటివ్ లు నాలుగు ఓ మైనస్, ఏమైనస్, బి మైనస్, ఏ బి మైనస్ గ్రూపుల వారు. నాలుగు గ్రూపుల వారికి రక్తదానం చేసే అవకాశం
ఉంటుంది. దేశ జనాభాలో రక్తము 1%ఒకటి నుంచి1.5% వరకు అవసరము అవుతుందని సర్వే రిపోర్ట్ లు తెలియజేస్తున్నాయి. కానీ రక్త సేకరణ మాత్రము 0.80% వరకు రక్తాన్ని సేకరిస్తున్నారు. అంటే మన జనాభాలో 0.20% మంది రక్తం దొరకగా మృత్యువాత పడుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. దీనిని బట్టి రక్తదాన ఆవశ్యకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశ జనాభాలో ప్రతి వంద మందిలో 400 నుంచి 450 మందికి ఓ ప్లస్ రక్తము, 200 నుంచి 250 మందికి  ఏ ప్లస్ రక్తము, 200 నుంచి 250 మందికి బి ప్లస్ రక్తము, 70 నుంచి 80 మందికి ఏబి ప్లస్ రక్తము, ఒక శాతం చొప్పున నెగటివ్ గ్రూప్ రక్తము ఉంటుంది.
ఎర్ర రక్త కణాలు:
                 రక్తంలో 40- 45 శాతం ఉంటాయి. ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని కణాలన్నిoటికీ  ఆక్సిజన్ తీసుకువెళ్తాయి. తిరిగి కార్బన్డయాక్సైడ్ ను ఊపిరితిత్తులకు మోసుకు వస్తాయి. రక్తము నుంచి వేరు చేసిన తర్వాత 30-35 రోజుల వరకు నిల్వ ఉంటాయి. వ్యాధులు రాకుండా రక్షించేది మాత్రం తెల్ల రక్త కణాలే.
ప్లాస్మా:
                రక్తంలో 55 నుంచి 60 శాతం వరకు ప్లాస్మాకణాలు ఉంటాయి. రక్తంలో ఉండే ద్రవరూపము ప్లాస్మా. ప్లాస్మాలో 92 శాతం నీరు, ఏడు శాతం ప్రోటీన్లు, ఒక శాతం ఖనిజాలు ఉంటాయి. దీని రక్తం నుంచి వేరు చేసిన తర్వాత ఒక ఏడాది వరకు నిల్వ చేయవచ్చు.
ప్లేట్లెట్స్ (రక్త కణాలు):
                రక్తము గడ్డ కట్టడానికి, వీటి పరిమాణం తగ్గితే రక్తస్రావాన్ని ఆపడం కష్టం. ప్లేట్లెట్స్ కణాలను తీసిన రోజే అవసరమైన వారికి ఎక్కిస్తారు.
క్రయోప్రెసిపిటెట్ (ఫ్యాక్టర్-8):
                 హిమోఫిలియా ఉన్నవారికి దీనిని ఎక్కిస్తారు. దీనికి  గడ్డ కట్టించే స్వభావం ఉంటుంది.
రక్తదానం చేయాలనుకుంటే :
                హైదరాబాద్ నగరంలో సుమారు 150 కి పైగా రక్తనిధి కేంద్రాలున్న రక్తనిది సేకరణకు ప్రభుత్వ ఆసుపత్రులలో గల రక్తనిధి కేంద్రాలకుగాని, రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రాలకుగాని, అనుమతి పొందిన రక్త నిధి కేంద్రాలకు మాత్రమే ప్రభుత్వం సేకరణకు అనుమతినిచ్చింది..
రక్తం అవసరమైతే:
                రక్తం అవసరమైన వ్యక్తులు నగరంలోని అనుమతి పొందిన రక్తం కేంద్రాల నుంచి రక్తాన్ని తీసుకోవాలి. ప్రభుత్వ, రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగానూ మిగిలిన వ్యక్తులకు ఏ గ్రూపు రక్తం అయినా 1050 రూపాయలకు ఇస్తారు.

]]>
Thu, 12 Jun 2025 22:48:02 +0530 admin
గో ఆధారిత వ్యవసాయం తోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం https://prajakshethrenews.com/గో-ఆధారిత-వ్యవసాయం-తోనే-ఆరోగ్యవంతమైన-సమాజ-నిర్మాణం https://prajakshethrenews.com/గో-ఆధారిత-వ్యవసాయం-తోనే-ఆరోగ్యవంతమైన-సమాజ-నిర్మాణం గో ఆధారిత వ్యవసాయం తోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం
*  గో ఆధారిత వ్యవసాయం కొనసాగాలి
 * గోశాలల్లో పశువులను నిర్భందించవద్దు ప్రకృతిలో స్వేచ్ఛగా అవి తిరుగాడాలి
 * రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేం సాగర్ యాదవ్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 12 :
 గో ఆధారిత వ్యవసాయం తోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుందని, గో ఆధారిత వ్యవసాయం కొనసాగాలని, గోశాలల్లో పశువులను నిర్భందించవద్దు ప్రకృతిలో స్వేచ్ఛగా అవి తిరుగాడాలని రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేం సాగర్ అభి ప్రాయపడ్డారు. గో ఆధారిత వ్యవసాయం పై ఆయన మాటల్లో చుస్తే   కాల చక్రం ఒక్క సారి గిర్రున తిరుగుతే బాగుండు. పల్లె సీమల మట్టి వాసనలు మరో మారు ప రిమళిస్తే ఇంకా బాగుండు. నిర్ణీమైన పుడమి పునరుద్దరణ జరగాలంటే పశువుల మల మూత్రా లతో వ్యవసాయం కొనసాగించాల కొమ్ము ప్రేం సాగర్ పేర్కొన్నారు.. ఆరు పదుల వయస్సు లో తీవ్రమైన అనారోగ్యంతో ఇద్దరు సహాయకులు లేకుండా ఇంటి నుండి బయటకు వెల్లలేని ఆ యన మలి దశలో తొలి పొద్దును చూడాలని పరితపిస్తున్నాడు. ఎద్దు ఎవుసం, గొర్రె మేకలతో అచ్చమైన పల్లె కాజిపల్లెలో జన్మించిన ఆయన భీమారం మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివిన ఆయన ఉద్యోగం కోసం పటణానికి ప్రయనమయిన ప్రేం సాగర్ హైదరాబాద్ లో   తీవ్రమైన అనారోగ్యంతో ఇద్దరు సహాయకులు లేకుండా ఇంటి నుండి బయటకు వెల్లలేని ఆ యన మలి దశలో తొలి పొద్దును చూడాలని పరితపిస్తున్నాడు. ఎద్దు ఎవునం, గొర్రె మేకలతో అచ్చమైన పల్లె కాజిపల్లెలో జన్మించిన ఆయన భీమారం మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివిన ఆయన ఉద్యోగం కోసం పట్టణానికి ప్రయనమయ్యా డు. ప్రైవేటు కంపెనీల్లో పని చేస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నివాసమై ఉంటున్నా... పల్లె సీమల మీద ప్రేమానురాగం తగ్గ లేదు. వయస్సు పెరిగే కొద్ది రకరకాలైన వ్యాధులు ఆయనను వెంబడిస్తున్నా ఎంత మాత్రం వెరువకుండా పశువులను పెంచాలీ వాటి ద్వార వచ్చే మల మూ తాలతో పుడమిని పుణరుద్దరించాలని ఆకాంక్షిస్తున్నాడు. మార్కెట్లో లభించే రక రకాలైన వంగ డాలను సాగు చేస్తూ దిగుబడి పెంచుకోవడం కోసం విరివిరిగా రసాయన ఎరువులు, పిచికారి మందులతో పుడమి సహజ లక్షణాలను కోల్పోందని ఆవేధన వ్యక్తం చేస్తున్నాడు. దీనంతటికి కారణం నాటి వ్యవసాయ విధానం నేడు కొనసాగించకపోయినా కనీసం పశువుల మల మూత్రాల తో పంట పొలాలకు పరిపుష్టి అందించాలని ఆకాంక్షిస్తున్నాడు.
రైతు సంక్షేమ సేవా సంఘం ద్వార రాష్ట్ర వ్యాప్త ప్రచారం
రైతును రాజుగ చూడాలి.. గోఆధారిత వ్యవసాయాన్ని తీసుకురావాలన్న తలంపుతో రైతు సంక్షే మ సేవా సంఘం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ప్రారంభించాడు. జిల్లాల వారిగా తిర ఎగుతూ సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించాలి. పశువులను పెంచి పోషించాలని ప్రచారం చేస న్నాడు. రసాయన ఎరువులు, పిచికారి మందులతో సహజత్వం కోల్పోయిన పంట పొలాలకు వ పున:జీవం అందించాలని కోరుతున్నాడు. పూర్వీకుల అడుగుజాడల్లో నడిచి పుడమి తల్లిని కాపా డుకుందామని ఊరూరా పిలుపునిస్తున్నాడు. భావితరాల వారికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రకృతిని పర్యావరణాన్ని రెండు కళ్లుగా భావించాలని అభ్యర్థిస్తున్నాడు. రైతు కు టుంబాలు, వ్యవసాయ కూలీలను కలుస్తూ ప్రకృతి వ్యవసాయానికి పూనుకోవాలని కోరుతున్నాడు. 3. దీనికి గోడు ప్రతి ఇంటిలో కాలానుగుణంగా పండ్లనిచ్చే చెట్లు పెంచడం, చెట్టు చేమ లేకుండా - ఏ ఇల్లు ఉండకుండా ప్రతి ఒక్కరు పచ్చదనాన్ని పెంపొందిచుకోవాలని పిలుపునిస్తున్నారు. నలుగున్న సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ కోసం పరితపన రైతు సంక్షేమ సేవా సంఘం ఏర్పాటు చేసిన ప్రేం సాగర్ గత నాలుగున్న సంవత్సరాలుగా ప్రకృ తి వ్యవసాయం కోసం పరితపిస్తున్నాడు. హైదరాబాద్ లో ఉంటున్న ఆయన పట్టణ పరిసర ప్రాం తాలతో పాటు గ్రామీణ ప్రాంతాల వారిని ప్రకృతి వ్యవసాయంపై అవగాహణ కల్పిస్తున్నాడు. ఆ లేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి రాయగిరిలో రైతులతో సమావేశమైన ఆయన అనారోగ్యాల కు ప్రధాన కారణం రసాయన ఎరువులతో పండించిన పంటలు ఆహారంగా తీసుకోవడమే అని వివరించారు. ఆరోగ్యంగా జీవించాలంటే సేంద్రి పద్దతుల్లో పండించిన పంటలను ఆహారంగా తీ సుకోవాలని సూచించారు. కొర్రలు, సామలు చిరుధాన్యాలు పండించాలని సూచించిన ఆయన రైతు సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో పండ్ల మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతు * సేవా సంఘం ద్వార సుమారుగా ఐదు లక్షల మందికి విత్తనాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. న్వచ్ఛంద సంస్థల ద్వార సీడ్బాల్స్ పంపిణీ చేస్తున్నామని తెలిపిన ఆయన ప్రకృతి వ్యవసాయం వై పు రైతులు దృష్టి సారించాలని కోరినట్లు తెలిపారు.
పశువులను గోశాలల్లో బంధించవద్దు.. ప్రకృతిలో స్వేచ్ఛగా పశువులు తిరుగాలి. పశువులను గోశాలల్లో నిర్భందింవద్దని కొమ్ము ప్రేమా సాగర్ యాదవ్ డిమాండ్ చేస్తున్నాడు. వే ముల వాడలో గల రాజేశ్వర స్వామి గోశాలలో ఉన్నటువంటి పశువులు సుమారుగా 3 వేలు పశువులకు పంపిణీ చేయించడంలో ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలిపారు. అదేవిధంగా హైదరా బాద్ పట్టణ పరిసరాల్లో గల ప్రైవేట గోశాలల్లో ఉన్నటువంటి పశువులను రైతులకు పంపిణీ చే యాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. భవిష్యత్తరాల వారికి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్య క రమైన ఆహారం అందించడం కోసం తనువు చాలించేంత వరకు గో ఆధారిత వ్యవసాయం వృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు

]]>
Thu, 12 Jun 2025 21:14:12 +0530 admin
గుజరాత్ విమాన ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి https://prajakshethrenews.com/గుజరాత్-విమాన-ప్రమాదంపై-రాష్ట్రపతి-ప్రధాని-దిగ్భ్రాంతి https://prajakshethrenews.com/గుజరాత్-విమాన-ప్రమాదంపై-రాష్ట్రపతి-ప్రధాని-దిగ్భ్రాంతి గుజరాత్ విమాన ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
ప్రజా క్షేత్ర్, అహ్మదాబద్ జూన్ 12 :
 గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 242 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొంత సమయానికే కుప్పకూలిపోయింది. అయితే ఈ ప్రమాదంపై దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.‘‘అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్రంగా కలచి వేసింది. ఇది హృదయ విదారకర ఘటన. మాటలు రావట్లేదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశం మొత్తం బాధితులకు తోడుగా ఉంటుంది’’: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము‘‘ పేర్కొన్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం విని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది మాటలకందని విషాదం. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలను నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా నని ప్రధాని నరేంద్ర మోదీఇప్పటికే పేర్కొన్నారు. సహాయక చర్యలపై మంత్రులు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నా’’: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఘటనస్థలికి వెళ్లారు. ప్రధాని మోదీ రామ్మోహన్ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల వేగవంతం చేయాలని.. ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్ చేయాలని కేంద్ర మంత్రిని ప్రధాని ఆదేశించారు.

]]>
Thu, 12 Jun 2025 20:52:25 +0530 admin
కొత్త టోల్ విధానం.. https://prajakshethrenews.com/కొత్త-టోల్-విధానం https://prajakshethrenews.com/కొత్త-టోల్-విధానం కొత్త టోల్ విధానం..
ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్ని షన్
ప్రజా క్షేత్ర్, ముంబై, జూన్ 11 :
కొత్త విధానం ప్రకారం... అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే, ఇప్పుడు వాహనదారులు తాము ప్రయాణించిన దూరాన్ని బట్టి మాత్రమే టోల్ రుసుము చెల్లించాలి.కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా కొత్త టోల్ విధానాన్ని అమలు చేయనుంది. దీని ద్వారా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి భారీ ఉపశమనం లభించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కొత్త టోల్ విధానం వచ్చే వారం లేదా పది రోజుల్లో అమలులోకి రావచ్చు. టోల్ వసూలుకు సంబంధించిన ప్రస్తుత వ్యవస్థను మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా, సరసమైనదిగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యం.కొత్త విధానం ప్రకారం… అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే, ఇప్పుడు వాహనదారులు తాము ప్రయాణించిన దూరాన్ని బట్టి మాత్రమే టోల్ రుసుము చెల్లించాలి. అంటే, ఒక వాహనం కేవలం 10 కిలోమీటర్ల దూరం మాత్రమే ఎక్స్‌ప్రెస్‌వే లేదా జాతీయ రహదారిని ఉపయోగించినట్లయితే, దానికి అనుగుణంగానే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల తక్కువ దూరం ప్రయాణించే వారికి కూడా పూర్తి టోల్ స్లాబ్‌ను చెల్లించాల్సిన పరిస్థితి నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం ఒక టోల్ ప్లాజాను దాటితే, ఎంత దూరం ప్రయాణించినా నిర్దిష్ట రుసుము చెల్లించాల్సి వస్తుంది. కొత్త విధానంతో ఈ సమస్య పరిష్కారమవుతుంది.కొత్త వ్యవస్థలో ప్రతి టోల్ బూత్ వద్ద అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఈ కెమెరాలు వాహనాల నంబర్ ప్లేట్‌లను స్కాన్ చేస్తాయి. అదే సమయంలో, ఫాస్టాగ్ ద్వారా వాహనదారుల బ్యాంకు ఖాతా నుండి టోల్ మొత్తం ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ఈ సాంకేతికత ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, ఫాస్టాగ్‌లను కలిపి పనిచేస్తుంది. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద ఏర్పడే పొడవైన క్యూలు, ట్రాఫిక్ జామ్‌ల నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా, టోల్ దొంగతనం, మోసాలపై కూడా అడ్డుకట్ట పడుతుంది. ప్రయాణికులు టోల్ ప్లాజాల వద్ద ఆగి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు, ఇది సమయాన్ని ఆదా చేస్తుంది.ఈ కొత్త టోల్ విధానం ప్రస్తుత వ్యవస్థతో పోలిస్తే మరింత పారదర్శకంగా, వినియోగదారునికి అనుకూలంగా ఉంటుంది. టోల్ మొత్తం నేరుగా వాహన యజమాని ఖాతా నుండి కట్ అవుతుంది. కాబట్టి నగదు లావాదేవీలు, వివాదాలకు అవకాశం ఉండదు. ప్రయాణికులు పదే పదే ఆగాల్సిన అవసరం ఉండదు.ప్రభుత్వం ఈ కొత్త చొరవ ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా, ట్రాఫిక్ జామ్‌లు, ఇంధన వృధా, సమయం వృధాను కూడా తగ్గిస్తుంది. కొత్త టోల్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రహదారులపై ప్రయాణించడం గతంలో కంటే మరింత చౌకగా, వేగంగా, సౌకర్యవంతంగా ఉంటుందని ఆశిస్తున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వస్తువుల రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.

]]>
Wed, 11 Jun 2025 23:39:13 +0530 admin
స్వదేశంలో టీం ఇండియా మ్యాచ్‌‌ల విషయంలో బిసిసిఐ కీలక నిర్ణయం https://prajakshethrenews.com/స్వదేశంలో-టీం-ఇండియా-మ్యాచ్ల-విషయంలో-బిసిసిఐ-కీలక-నిర్ణయం https://prajakshethrenews.com/స్వదేశంలో-టీం-ఇండియా-మ్యాచ్ల-విషయంలో-బిసిసిఐ-కీలక-నిర్ణయం స్వదేశంలో టీం ఇండియా మ్యాచ్‌‌ల విషయంలో బిసిసిఐ కీలక నిర్ణయం
ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ జూన్ 9 :
స్వదేశంలో టీం ఇండియా   ఆడే పలు మ్యాచ్‌‌ల విషయంలో బిసిసిఐ   కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో ప్రారంభం కాబోయే టీం ఇండియా హోం సీజనలో మార్పులు చేసింది. భారత సీనియర్ పురుషుల జట్టు.. వెస్టిండీస్, సౌతాఫ్రికాతో తలపడే మ్యాచ్‌ల వేదికలు, భారత సీనియర్ మహిళలు ఆస్ట్రేలియాతో ఆడే వన్డే సిరీస్ వేదికలు, సౌతాఫ్రికా-ఎ జట్టు, భారత-ఎ జట్టు మధ్య జరిగే మ్యాచ్‌ వేదికల్లో మార్పులు చేసింది.భారత సీనియర్ పురుషుల జట్టు   అక్టోబర్‌ 10 నుంచి 14 వరకూ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో వెస్టిండస్‌తో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ వేదికను న్యూఢిల్లీకి బిసిసిఐ (BCCI) మార్చింది. ఆ తర్వాత నవంబర్ 14 నుంచి 18 వరకూ న్యూఢిల్లీలో సౌతాఫ్రికాతో జరగాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్‌ను కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌కి తరలించారు. వేదికలు మారిన మ్యాచ్‌లు మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. ఇక భారత సీనియర్ మహిళల జట్టు సెప్టెంబర్‌ 14, 17, 20 తేదీల్లో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ, చిదంబరం స్టేడియంలో రిపేర్లు జరుగుతున్న కారణంగా తొలి రెండు వన్డేలు న్యూ చండీఘడ్‌లోని పిసిఎ స్టేడియంకు, చివరి వన్డే న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకు మార్చారు.సౌతాఫ్రికా పురుషుల-ఎ టీం నవంబర్ 13, 16, 19 తేదీల్లో భారత్-ఎ జట్టుతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ చిన్నస్వామి స్టేడియం నుంచి రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంకు మార్చారు.

]]>
Mon, 09 Jun 2025 19:11:33 +0530 admin
రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన కమల్‌ హాసన్‌ https://prajakshethrenews.com/రాజ్యసభకు-నామినేషన్-దాఖలు-చేసిన-కమల్-హాసన్ https://prajakshethrenews.com/రాజ్యసభకు-నామినేషన్-దాఖలు-చేసిన-కమల్-హాసన్ రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన కమల్‌ హాసన్‌
ప్రజా క్షేత్ర్, చెన్నయ్ జూన్ 6 :
ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌  రాజ్యసభ కు నామినేషన్‌ దాఖలు  చేశారు. శుక్రవారం తమిళనాడు సచివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. కాగా, ఇటీవలే చెన్నైలో నిర్వహించిన తన చిత్రం ‘థగ్ లైఫ్’ ఈవెంట్‌లో కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దాంతో బుధవారం వేయాల్సిన రాజ్యసభ నామినేషన్‌ను కమల్‌ వాయిదా వేసుకున్నారు. సినిమా వ్యవహారాలు పూర్తయిన తర్వాతే నామినేషన్‌ వేయాలని భావిస్తున్నట్లు అప్పట్లో తెలిపారు. అయితే, ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం గురువారం విడుదల కావడంతో నేడు నామినేషన్‌ దాఖలు చేశారు. కమల్‌తో పాటు మరో ముగ్గురు డీఎంకే నేతలు రాజ్యసభకు నామినేషన్ వేశారు. సిట్టింగ్‌ ఎంపీ, సీనియర్‌ న్యాయవాది పి విల్సన్‌, రోకియా మాలిక్‌, మాజీ ఎమ్మెల్యే శివలింగం ఇవాళ రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేశారు.కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం పూర్తి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు డీఎంకే తరపున ఆయన తమిళనాడులో ప్రచారం కూడా చేశారు. దాంతో ఆయన రాజ్యసభలో అడుగుపెట్టేందుకు డీఎంకే పూర్తి సహకారం అందించనుంది. జూన్‌ 19న జరిగే రాజ్యసభ ద్వై వార్షిక ఎన్నికల్లో ఆయనను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు ఎంఎన్‌ఎం గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంఎన్‌ఎం కమల్‌ హాసన్‌ పేరును ప్రతిపాదించగానే రాజ్యసభ సీటును ఆయనకు కేటాయిస్తున్నట్టు మిత్రపక్ష పార్టీ డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. 2024లో ఎంఎన్‌ఎం పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అనుసరించి స్టాలిన్‌ ఈ కేటాయింపు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ప్రస్తుతం ఎంఎన్‌ఎం పార్టీకి శాసనసభ, పార్లమెంట్‌లో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు.

]]>
Fri, 06 Jun 2025 18:28:34 +0530 admin
చీనాబ్ వంతెన, కత్రా&శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలుప్రారంబించిన్న ప్రధాని మోదీ https://prajakshethrenews.com/చీనాబ్-వంతెన-కత్రా-శ్రీనగర్-వందే-భారత్-ఎక్స్ప్రెస్-రైలుప్రారంబించిన్న-ప్రధాని-మోదీ https://prajakshethrenews.com/చీనాబ్-వంతెన-కత్రా-శ్రీనగర్-వందే-భారత్-ఎక్స్ప్రెస్-రైలుప్రారంబించిన్న-ప్రధాని-మోదీ చీనాబ్ వంతెన, కత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలుప్రారంబించిన్న ప్రధాని మోదీ
ప్రజా క్షేత్ర్, శ్రీనగర్‌ జూన్ 6 :
 లెఫ్టినెంట్ గవర్నర్‌ ప్రమోట్‌ కాగా తాను డిమోట్‌ అయ్యానని జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. ప్రధాని మోదీతో వేదిక పంచుకున్న ఆయన జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా అంశాన్ని మరోసారి లేవనెత్తారు. శుక్రవారం చీనాబ్ వంతెన, కత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒమర్‌ అబ్దుల్లా మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌లోని అన్ని రైల్వే ప్రాజెక్టుల్లో ప్రధానితో అనుబంధం కలిగి ఉండటం తన అదృష్టమని అన్నారు.కాగా, మొదటిది అనంతనాగ్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం, రెండవది బనిహాల్ రైల్వే టన్నెల్ ప్రారంభోత్సవంలో తాను పాల్గొన్నట్లు ఒమర్‌ అబ్దుల్లా గుర్తుచేశారు. ‘2014లో కాట్రా రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇదే నలుగురు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. అప్పటి రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా, జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పదోన్నతి పొందారు. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కేంద్రపాలిత ప్రాంతం సీఎంగా నన్ను తగ్గించారు. కానీ మనకు తెలియకముందే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తారు’ అని అన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న డిమాండ్‌ను మోదీ ముందు ఇలా ప్రస్తావించారు.

]]>
Fri, 06 Jun 2025 18:00:22 +0530 admin
సీనియర్ సిటీజన్స్ రైల్వే రాయితీలు ఇవ్వండి https://prajakshethrenews.com/సీనియర్-సిటీజన్స్-రైల్వే-రాయితీలు-ఇవ్వండి https://prajakshethrenews.com/సీనియర్-సిటీజన్స్-రైల్వే-రాయితీలు-ఇవ్వండి సీనియర్ సిటీజన్స్ రైల్వే రాయితీలు ఇవ్వండి
ప్రధానికి లేఖ
ప్రజా క్షేత్ర్, నరసాపురం :
రైలు ఛార్జ్ లపై సీనియర్ సిటిజన్సుకు రాయితీ పునరుద్ధరించాలని కోరుతూ    అఖిల భారత సీనియర్ సిటిజన్సు కాన్ఫెడరేషన్ (AISCON) పిలుపు మేరకు ఈ రోజు నరసాపురం సీనియర్ సిటిజన్సు వెల్ఫేర్ అసోసియేషన్   " పోస్ట్  కార్డ్  టు పి.యమ్ " అనే ఉద్యమం నిర్వహించారు. ఉద్యమం లో భాగంగా నరసాపురం ప్రధాన తపాలా కార్యాలయం వద్ద రాయితీ పునరుద్ధరణ పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రధాన మంత్రి ని కోరుతూ  నినాదాలు చేసి అనంతరం ప్రధాన మంత్రి కి రాసిన ఇన్లాండ్ లెటర్ కార్డులు పోస్ట్ మాస్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత సీనియర్ సిటిజన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు. సెంట్రల్ కమిటీ మెంబర్ అందే రంగారావు. గౌరవ అధ్యక్షులు పెన్నోచ బాబు శ్రీ .సెక్రెటరీ షేక్ సిలార్ సాహెబ్ .ట్రెజరర్ పీతాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

]]>
Fri, 06 Jun 2025 17:45:18 +0530 admin
హైదరాబాద్ లోనే రఫెల్ విమాన భాగాల తయారీ https://prajakshethrenews.com/హైదరాబాద్-లోనే-రఫెల్-విమాన-భాగాల-తయారీ https://prajakshethrenews.com/హైదరాబాద్-లోనే-రఫెల్-విమాన-భాగాల-తయారీ హైదరాబాద్ లోనే రఫెల్ విమాన భాగాల తయారీ

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 5 :

భారత రక్షణ రంగంలో స్వావలంబన దిశగా 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో మరో ముందడుగు పడింది. భారత వైమానిక దళానికి వెన్నెముకగా ఉన్న రఫేల్ యుద్ధ విమానాలకు చెందిన అత్యంత కీలకమైన భాగాలను ఇకపై హైదరాబాద్‌లో తయారు చేయనున్నారు. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (టీఏఎస్‌ఎల్) మధ్య ఒక ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం ప్రకారం, రఫేల్ యుద్ధ విమానాల ప్రధాన విడిభాగాలను హైదరాబాద్‌లోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తారు. రఫేల్ విమాన భాగాలను ఫ్రాన్స్ వెలుపల తయారు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఏరో స్పేస్ రంగంలో భారతదేశం సాధిస్తున్న ప్రగతికి, పెరుగుతున్న తయారీ సామర్థ్యానికి ఈ ఒప్పందం ఒక నిదర్శనంగా నిలుస్తుంది.2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం అవసరమైన ఏర్పాట్లను సంస్థ వేగవంతం చేయనుంది.ఈ సందర్భంగా డసో ఏవియేషన్ ఛైర్మన్ అండ్ సీఈవో ఎరిక్‌ ట్రాపియర్‌ మాట్లాడుతూ, “భారత్‌లో మా కార్యకలాపాలను మరింత విస్తరించడంలో ఇది ఒక నిర్ణయాత్మక ముందడుగు. భారత రక్షణ రంగానికి మా సేవలను అందించే అవకాశాన్ని మరింతగా పెంచుతున్నందుకు సంతోషిస్తున్నాం. ఈ నిర్ణయం ద్వారా నాణ్యమైన సేవలు అందిస్తూ సైనిక అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది” అని తెలిపారు.టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్) సీఎండీ సుకరన్‌ సింగ్‌ ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. “భారత రక్షణ రంగ చరిత్రలో ఇది ఒక మైలురాయి వంటిది. డసో ఏవియేషన్‌తో కుదిరిన ఈ ఒప్పందం, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ తయారీ నైపుణ్యాలను, సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి తెలియజేస్తుంది. భారతదేశ వైమానిక, రక్షణ వ్యవస్థల అభివృద్ధిలో ఇది ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

]]>
Thu, 05 Jun 2025 22:28:25 +0530 admin
ప్రధానమంత్రి సూర్య ఘర్ సు విస్తృత పరచాలి https://prajakshethrenews.com/ప్రధానమంత్రి-సూర్య-ఘర్-సు-విస్తృత-పరచాలి https://prajakshethrenews.com/ప్రధానమంత్రి-సూర్య-ఘర్-సు-విస్తృత-పరచాలి ప్రధానమంత్రి సూర్య ఘర్ సు విస్తృత పరచాలి

ప్రజా క్షేత్ర్, రాయచోటి :

ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం క్రింద 03 కిలోవాట్ల పవర్ కు కేంద్ర ప్రభుత్వం ద్వారా 78 వేల రూపాయల రాయితీ ఇవ్వబడుతుందని, ఒక కిలో వాట్ పవర్ సోలార్ ఇన్స్టాలేషన్ ద్వారా 120 విద్యుత్ యూనిట్ల ఉత్పత్తి జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. బీసీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అదనంగా 20 వేల రూపాయల రాయితీ ఇవ్వబడుతుందని, ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందించే పాలసీ రూపకల్పన జరగనుందని తెలిపారు. గురువారం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విద్యుత్ శాఖ ఎస్ ఈ, ఈఈలు, నెడ్‌క్యాప్ సిబ్బంది, జిల్లాలో సోలార్ ఇన్స్టాల్ చేసే వెండర్లు, ఎంపీడీవోలు, తదితరులతో అన్నమయ్య జిల్లాలో సీఎం సూర్య ఘర్ పథకం అమలుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వారు ఫిబ్రవరి 2024 లో ప్రారంభించారని, ఈ పథకం ద్వారా  ప్రజలు తమ ఇళ్లపై సోలార్ ప్యానల్ ను ఇన్స్టాల్ చేసుకుని సోలార్ విద్యుత్తును వాడుకోవచ్చు అన్నారు. జిల్లా విద్యుత్ శాఖ, సోలార్ పవర్ ఇన్స్టాలేషన్ వెండర్లు మరియు నెడ్కాప్ వారు సమన్వయంగా రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద సోలార్ పవర్ ను ఇన్స్టాల్ చేసుకునే లబ్ధిదారులకు ఏ మేరకు రాయితీ ఇవ్వబడుతుంది మరియు ఇతర అంశాలపై ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా వివిధ అంశాలు పేర్కొన్నారని దానిని ఉపయోగించుకొని జిల్లాలో రిజిస్ట్రేషన్లు చేయించాలని అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ద్వారా లోను తీసుకుని సోలార్ పవర్ ను ఇన్స్టాల్ చేయించుకోవాలనుకునేవారు ఎల్డీఎం మరియు డిఆర్డిఏ లను సంప్రదించే విధంగా ప్రజలకు తెలియజేయాలన్నారు. ఒక కిలోవాట్ సోలార్ పవర్ ను ఇన్స్టాల్ చేసుకుంటే 120 యూనిట్ల వరకు విద్యుత్ ను వాడుకోవచ్చని తద్వారా దాదాపు 640 రూపాయల విద్యుత్ చార్జీ తగ్గుతుందన్నారు. జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ పవర్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకునే రిజిస్ట్రేషన్లు పెరగాలని విద్యుత్ శాఖ సిబ్బందిని, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా సోలార్ విద్యుత్తు అందించే విధంగా ప్రత్యేకంగా నూతన విధానాన్ని తీసుకురానున్నందున బీసీలు మరియు ఓసీల మీద దృష్టి సారించాలని వారి దగ్గర నుండి వీలైనన్ని ఎక్కువ రిజిస్ట్రేషన్లు చేయించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్పీడీసీఎల్ శాఖ ఎస్ ఇ చంద్రశేఖర్ రెడ్డి, ఈఈలు, డీఈలు, ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.ఆవులు దూడలు, ఒంటెల వధ నిషేధం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై జంతు హింస నివారణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు.  రాయచోటి కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పశుసంవర్ధక శాఖ... "ఆవులు దూడలు, ఒంటెల వధ నిషేధం చట్టరీత్యా నేరం" అనే అంశంపై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆవులు దూడలు  ఒంటెల వధ నిషేధం అని, ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై జంతు హింస నివారణ చట్టం 1960 ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధము మరియు పశు సంరక్షణ చట్టం 1977ల ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్ళై పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చౌక దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీని సక్రమంగా నిర్వహించాలని, తూకాల్లో ఏమాత్రం తేడా వచ్చినా.ఒక్క గ్రాము తగ్గినా కూడా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులకు సూచించారు.గురువారం పుల్లంపేట మండలం ఎగువ రెడ్డిపల్లి 8ఏ చౌక దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిత్యవసర వస్తువుల పంపిణీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి.ఈ సందర్భంగా చౌక దుకాణం ఏయే సమయాల్లో నిర్వహిస్తున్నారు, ఆ దుకాణం పరిధిలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఇప్పటివరకు ఎంతమందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు, అలాగే ఆ చౌక దుకాణం పరిధిలో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఎంతమంది ఉన్నారు, ఇప్పటివరకు ఎంతమందికి ఇంటింటికి డోర్ డెలివరీ చేశారు తదితర వివరాలను కలెక్టర్ ఆరా తీశారు.

ప్రభుత్వం నిర్దేశించిన సమయాలలో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా చౌక దుకాణంను నిర్వహిస్తున్నామని, ఆ చౌక దుకాణం పరిధిలో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు 37 మంది ఉన్నట్లు తహసిల్దార్ అరవింద కిషోర్ కలెక్టర్ కు వివరించారు. వస్తువుల పంపిణీ సందర్భంగా.. తూకంలో ఏ మాత్రం తేడా రాకూడదని, లబ్ధిదారుకు ఒక్క గ్రాము తక్కువ ఇచ్చినా కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని, అలాగే 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దకే తప్పనిసరిగా నిత్యావసర వస్తువులను డోర్ డెలివరీ చేయాలని చౌక దుకాణం డీలర్ కు కలెక్టర్ సూచించారు. అనంతరం ఆ చౌక దుకాణం పరిధిలోని అనంతంపల్లిలో  నివసించే 65 ఏళ్లు వయసు పైబడిన కే.వెంకట సుబ్బమ్మ లబ్ధిదారు ఇంటికి వెళ్లి బియ్యం చక్కెరల వస్తువులను స్వయంగా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అందజేశారు.

]]>
Thu, 05 Jun 2025 22:09:46 +0530 admin
నీట్&పీజీ 2025'ను ఆగస్టు 3న నిర్వహిస్తాం : సుప్రీంకోర్టు అనుమతి కోరిన ఎన్బీఈ https://prajakshethrenews.com/నీట్-పీజీ-2025ను-ఆగస్టు-3న-నిర్వహిస్తాం-సుప్రీంకోర్టు-అనుమతి-కోరిన-ఎన్బీఈ https://prajakshethrenews.com/నీట్-పీజీ-2025ను-ఆగస్టు-3న-నిర్వహిస్తాం-సుప్రీంకోర్టు-అనుమతి-కోరిన-ఎన్బీఈ నీట్-పీజీ 2025'ను ఆగస్టు 3న నిర్వహిస్తాం
సుప్రీంకోర్టు అనుమతి కోరిన ఎన్బీఈ
ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ :

దేశవ్యాప్తంగా ఒకే షిఫ్ట్లో నీట్-పీజీ 2025ను నిర్వహించాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో జూన్ 15న నిర్వహించదలచిన ఈ పరీక్షను వాయిదా వేయాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) నిర్ణయించింది. ఒకే షిఫ్ట్లో సుమారు 2.43 లక్షల మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించాలంటే కేంద్రాల సంఖ్యతో పాటు ఇతర మౌలిక సదుపాయాలనూ భారీగా పెంచాల్సి ఉంటుందని ఎన్బీఈ పేర్కొంది. ఇందుకుగాను మరింత సమయం కావాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. పరీక్ష నిర్వహణకు సాంకేతిక భాగస్వామిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) ఆగస్టు 3వ తేదీని సూచించిందని, ఎన్బీఈ వివరిం చింది. రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించలగమని సుప్రీంకోర్టుకు విన్నవించింది.

]]>
Wed, 04 Jun 2025 20:07:22 +0530 admin
రెండు దశల్లో దేశవ్యాప్తంగా జనాభా, కుల గణన https://prajakshethrenews.com/రెండు-దశల్లో-దేశవ్యాప్తంగా-జనాభా-కుల-గణన https://prajakshethrenews.com/రెండు-దశల్లో-దేశవ్యాప్తంగా-జనాభా-కుల-గణన రెండు దశల్లో దేశవ్యాప్తంగా జనాభా, కుల గణన
భారీ స్థాయి గణనకు తాత్కాలిక షెడ్యూల్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్ణయం!
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ జూన్ 4 :
 దేశవ్యాప్తంగా జనాభా, కుల గణన రెండు దశల్లో జరుగనున్నది. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఈ భారీ స్థాయి గణనకు తాత్కాలిక షెడ్యూల్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2027 మార్చి 1 నుంచి దేశ వ్యాప్తంగా జనాభా గణనతో పాటు కుల గణన కూడా ప్రారంభంకానున్నది. అయితే జమ్ముకశ్మీర్‌, లడఖ్, ఉత్తరాఖండ్‌లో 2026 అక్టోబర్‌ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.కాగా, సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి జాతీయ గణన నిర్వహించి జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్‌)ను అప్‌డేట్‌ చేస్తారు. 2011లో జరిగిన చివరి జనాభా గణనలో దేశ జనాభా 121 కోట్లకు పైగా నమోదైంది. గత పదేళ్లలో జనాభా 17.7 శాతం మేర పెరిగింది.మరోవైపు షెడ్యూల్‌ ప్రకారం 2021లో జనాభా గణన చేపట్టాల్సి ఉన్నది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఇది వాయిదా పడింది. తాజా జనాభా గణనలో కుల గణనను కూడా చేర్చడానికి రాజకీయ వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏప్రిల్‌లో ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా జనాభా గణనతోపాటు కుల సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.

]]>
Wed, 04 Jun 2025 19:47:09 +0530 admin
నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు : కమల్ హాసన్ https://prajakshethrenews.com/నన్ను-తప్పుగా-అర్థం-చేసుకున్నారు-కమల్-హాసన్ https://prajakshethrenews.com/నన్ను-తప్పుగా-అర్థం-చేసుకున్నారు-కమల్-హాసన్ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు : కమల్ హాసన్
ప్రజా క్షేత్ర్, బెంగళూరు, జూన్ 3 :
 కన్నడ భాషపై తాను చేసిన కామెంట్స్‌పై వివాదం ముదురుతోన్న వేళ కమల్ హాసన్ తాజాగా స్పందించారు. కమల్ సారీ చెప్పాల్సిందేనంటూ వస్తోన్న డిమాండ్లు, హైకోర్టు కామెంట్స్ నేపథ్యంలో తాజాగా కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు లెటర్ రాశారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారంటూ రాసుకొచ్చారు.రాజ్ కుమార్‌ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. కన్నడ భాషపై తాను చేసిన కామెంట్స్‌ను అక్కడి వారు అపార్థం చేసుకోవడం బాధగా ఉందని కమల్ అన్నారు. తమిళం, కన్నడ ప్రజలు ఒకే ఫ్యామిలీ అని చెప్పడమే తన ఉద్దేశమని.. అంతే తప్ప ఏ భాషను తక్కువ చేయడం కాదంటూ లేఖలో పేర్కొన్నారు.ఒక భాష.. మరో భాషపై ఆధిపత్యం చెలాయించడాన్ని తాను  వ్యతిరేకిస్తానని.. అన్నీ భాషలకు సమాన గౌరవం కోసం నిలుస్తానని కమల్ లెటర్‌లో పేర్కొన్నారు. 'తమిళంలాగే కన్నడ భాషకు సాంస్కృతిక నేపథ్యం ఉంది. దాన్ని నేను ఆరాధిస్తాను. కన్నడిగుల ఆదరణ నా కెరీర్ మొత్తం ఉంది. అందుకు నేను చాలా సంతోషిస్తున్నా. భాష పట్ల నా ప్రేమ నిజమైంది. కన్నడిగులు తమ మాతృభాషను ప్రేమించడాన్ని నేను గౌరవిస్తున్నా. తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం ఇలా అన్నీ భాషలతోనూ నాకు ఎప్పటి నుంచే అనుబంధం ఉంది.నాకు సినిమా భాష తెలుసు. అది యూనివర్సల్ లాంగ్వేజ్. దానికి ప్రేమ, అనుబంధం మాత్రమే తెలుసు. అలా మన మధ్య ఉన్న బంధం గురించే మాట్లాడాను. ఈ ప్రేమ, బంధం గురించి నాకు నా సీనియర్లు చెప్పారు. ఆ ప్రేమ, అభిమానంతోనే శివరాజ్ కుమార్ (శివన్న) ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఈ పరిణామాలతో ఆయన ఇబ్బందిపడడం విచారకరం. ఏది ఏమైనా మా మధ్య బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. సినిమా.. ప్రజల మధ్య వారధిలాంటిది. అశాంతి, శత్రుత్వాన్ని నేను ఎప్పుడూ కోరుకోను.' అంటూ పేర్కొన్నారు.'థగ్ లైఫ్' ప్రీ రిలీజ్ వేడుకలో కమల్.. 'కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది' అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై అధికార, విపక్ష సభ్యులతో పాటు కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ సారీ చెప్పాలని.. లేకుంటే 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్ అడ్డుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. కమల్ సైతం ఈ విషయంపై వెనక్కి తగ్గలేదు. 'థగ్ లైఫ్' మూవీని బ్యాన్ చేయాలంటూ కేఎఫ్‌సీసీ తాజాగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేయగా విచారించిన న్యాయస్థానం కమల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరేమైనా భాషావేత్తనా?, చరిత్రకారుడా?.. ఒక్క 'సారీ' చెబితే ఇంత దూరం రాదు కదా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా కమల్ కేఎఫ్‌సీసీకి లేఖ రాశారు. ఎక్కడా సారీ చెప్పకపోయినా.. తన కామెంట్స్‌పై వివరణ ఇచ్చారు.

]]>
Tue, 03 Jun 2025 19:01:01 +0530 admin
కమల్ వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం https://prajakshethrenews.com/కమల్-వ్యాఖ్యలపై-కర్ణాటక-హైకోర్టు-తీవ్ర-ఆగ్రహం https://prajakshethrenews.com/కమల్-వ్యాఖ్యలపై-కర్ణాటక-హైకోర్టు-తీవ్ర-ఆగ్రహం మీరేమైనా చరిత్రకారులా..? క్షమాపణ చెబితే సరిపోయేది కదా..
         కమల్‌ వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ప్రజా క్షేత్ర్, బంగలూర్  జూన్ 3 :
తమిళ స్టార్‌ కమల్‌ హాసన్‌ వివాదంలో చిక్కుకున్నారు. తమిళం నుంచి కన్నడ భాష   పుట్టిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కమల్‌ వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు     తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాక్‌ స్వాతంత్య్ర హక్కను ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు ఉపయోగించొద్దంటూ హెచ్చరించింది.ఈ వివాదం నేపథ్యంలో కమల్‌ హాసన్‌ తాజా చిత్రం ‘థగ్‌లైఫ్‌’ ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ది కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కమల్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తన రాబోయే చిత్రం థగ్‌ లైఫ్‌ను రాష్ట్రంలో విడుదల చేసి ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కమల్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘క్షమాపణలు చెప్పకుండా కోర్టుకు వచ్చారా..?’ అంటూ తీవ్రంగా మండిపడింది.‘మీరు కమల్‌ హాసన్‌ కావొచ్చు.. ఎంత పెద్ద నటుడైనా కావొచ్చు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు మీకు లేదు. ఒక ప్రజాప్రతినిధిగా అలాంటి ప్రకటన చేయకూడదు. మీ కామెంట్స్‌ వల్ల అశాంతి ఏర్పడింది. నీరు, భూమి, భాష.. ఇవి ప్రజలకు ముఖ్యమైనవి. ఈ దేశ విభజన భాషా ప్రాతిపదికన జరిగింది. ఏ భాష మరొక భాష నుంచి పుట్టదు. మీ వ్యాఖ్యలతో కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. మీరేమైనా చరిత్రకారులా? లేక భాషావేత్తనా..? ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారు..? కన్నడ ప్రజలు మిమ్మల్ని ఏమి అడిగారు..? కేవలం క్షమాపణలే కద. ఈ వ్యవహారంలో ఒక్క క్షమాపణ చెబితే సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది’ అని న్యాయమూర్తి నాగప్రసన్న వ్యాఖ్యానించారు.

]]>
Tue, 03 Jun 2025 17:49:19 +0530 admin
స్కూటర్‌పై 98వేల కిలోమీటర్ల సంకల్పయాత్ర https://prajakshethrenews.com/స్కూటర్పై-98వేల-కిలోమీటర్ల-సంకల్పయాత్ర https://prajakshethrenews.com/స్కూటర్పై-98వేల-కిలోమీటర్ల-సంకల్పయాత్ర స్కూటర్‌పై 98వేల కిలోమీటర్ల సంకల్పయాత్ర

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 
పాత బజాజ్‌ చేతక్‌ స్కూటర్‌ నడుపుతూ కొడుకు.. వెనుక సీటుపై అమ్మ.. ఒకటీ రెండూ కాదు, ఇలా 98వేల కిలోమీటర్లు తిరిగి తిరుమలకు వచ్చారు ఈ తల్లీకుమారులు. ఉల్లాసంగా ఉత్సాహంగా దూసుకుపోతున్న వీరిని పలకరించినపుడు ఆసక్తికరమైన అనేక సంగతులు పంచుకున్నారు. స్కూటర్‌ నడుపుతున్న దక్షిణామూర్తి కృష్ణకుమార్‌ది మైసూరు. బెంగళూరులోని ఒక కార్పొరేట్‌ సంస్థలో టీం లీడర్‌గా ఉద్యోగం. 2015లో తండ్రి చనిపోవడంతో అమ్మను బెంగళూరుకు తీసుకువచ్చాడు. జీవన సహచరుడ్ని కోల్పోయిన దుఃఖంలోంచి అమ్మను బయటకు తీసుకురావడానికి రోజూ ఆఫీసు నుంచి వచ్చాక ఆలయాల గురించి చెప్పేవాడు. ఆమె ఎంతో ఆసక్తిగా వినేది. ఒకరోజు ఎందుకో.. ' అమ్మా.. నువ్వు ఇప్పటిదాకా ఏయే ఆలయాలు సందర్శించావు?' అని అడిగాడు. నోటితో కాకుండా తొణికిసలాడే కన్నీటితో అమ్మ సమాధానం చెప్పింది. తన సమీపంలో ఉండే ఒక్క ఆలయానికి కూడా ఆమె ఇప్పటిదాకా వెళ్లనేలేదు అని తెలుసుకుని తల్లడిల్లిపోయాడు. 68 ఏళ్ల వయసు వచ్చినా ఇల్లు తప్ప ఆమెకు మరో ప్రపంచం తెలీదు. 'నీకు దేశంలో ఉన్న అన్ని ఆలయాలూ చూపిస్తానమ్మా!' అని కృష్ణకుమార్‌ తల్లికి మాటిచ్చాడు. ఉద్యోగం చేస్తూ అమ్మకి ఆలయాలన్నీ చూపించడం సాధ్యం కాదని అతనికి అర్థమైంది. 2018లోనే రూ.60 వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. 2018 జనవరి 16న తన బజాజ్‌ స్కూటర్‌ మీదే 'మాతృ సేవా సంకల్ప యాత్ర' ప్రారంభించాడు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, సిక్కిం, అస్సోం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌, మణిపుర్‌, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్‌.. ఇలా కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ తల్లితో స్కూటర్‌పై తిరుగుతున్నాడు ఈ 45 ఏళ్ల కుమారుడు. నేపాల్‌, భూటాన్‌కూ తల్లితో స్కూటర్‌పైనే వెళ్లాడు. ఇప్పటికి 98,109 కిలోమీటర్లు ప్రయాణించాడు. గురువారం తిరుమలకు చేరుకుని తల్లి చూడరత్నమ్మతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నాడు. తన సంకల్పయాత్రకు అవరోధం కాకూడదని కృష్ణకుమార్‌ పెళ్లి కూడా చేసుకోలేదు. ఎందుకీ త్యాగం? అని అడిగితే, 'చనిపోయాక శ్రాద్ధకర్మలు ఘనంగా చేయడం కాదు.. బతికి ఉన్నపుడు సంతోషపెట్టడమే కొడుకుగా నా బాధ్యత' అని సమాధానం ఇచ్చాడు. ఈ సంకల్ప యాత్రలో ప్రయాణిస్తున్నది ఇద్దరు కాదు, ముగ్గురు. అంటూ తన స్కూటర్‌ వైపు మురిపెంగా చూశాడు. 'నాకు 21 ఏళ్ల వయసులో నాన్న ఇచ్చిన కానుక ఇది. దీని మీద తిరుగుతూ ఉంటే నాన్న కూడా మాతోపాటే యాత్రలు చేస్తున్నట్టుగా ఉంది. ఈ యాత్రకు ముగింపు లేదు. అమ్మా నేనూ ఓపిక ఉన్నంతదాకా ఇలా తిరుగుతూనే ఉంటాం. ఒక్కో గుడినీ సందర్శిస్తూ ఉంటే అమ్మ గొప్ప ఆనందం పొందుతోంది. నాకు జన్మనిచ్చిన తల్లికి ఇంతకన్నా ఏవిధంగా రుణం తీర్చుకోగలను?' అని అమ్మను అల్లుకుపోయి ఆనందంగా చెప్పాడు కృష్ణకుమార్‌.

]]>
Mon, 02 Jun 2025 23:41:09 +0530 admin
తిరిగి చలామణి లోకి రూ. 2000 నోట్లు : ఆర్బిఐ కీలక ప్రకటన https://prajakshethrenews.com/తిరిగి-చలామణి-లోకి-రూ-2000-నోట్లు-ఆర్బిఐ-కీలక-ప్రకటన https://prajakshethrenews.com/తిరిగి-చలామణి-లోకి-రూ-2000-నోట్లు-ఆర్బిఐ-కీలక-ప్రకటన తిరిగి చలామణి లోకి రూ. 2000 నోట్లు : ఆర్బిఐ కీలక ప్రకటన

ప్రజా క్షేత్ర్, న్యూ ఢిల్లీ జూన్ 2 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 నోట్ల గురించి కీలక ప్రకటన చేసింది. వీటిని మే 19, 2023న ఉపసంహరించాలని నిర్ణయించినప్పటికీ, రెండేళ్ల తర్వాత కూడా ప్రస్తుతం రూ. 6,181 కోట్ల విలువైన నోట్లు ఇంకా ప్రజల వద్ద ఉన్నాయని ఆర్బీఐ డేటా సోమవారం తెలిపింది. ఈ నోట్లు ఇప్పటికీ చెల్లుబాటు అవుతాయని, అంటే వాటిని లావాదేవీల కోసం ఉపయోగించవచ్చని RBI స్పష్టం చేసింది.
నోట్లను ఎలా మార్చుకోవాలి..
2023లో వీటి రద్దు నిర్ణయం ప్రకటించినప్పుడు మొత్తం రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. ఆ తర్వాత 2025 మే 31 నాటికి ఈ మొత్తం గణనీయంగా తగ్గి కేవలం రూ. 6,181 కోట్లకు చేరింది. అంటే, 98.26% నోట్లు మాత్రమే ఇప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి చేరాయి. మిగిలిన ఆరు వేల కోట్లు ఇంకా ప్రజల వద్దనే ఉన్నాయి. మిగిలిన రూ. 2000 నోట్లను సాధారణ బ్యాంక్ బ్రాంచ్‌లలో డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం 2023 అక్టోబర్ 7తో ముగిసింది.
పోస్టాఫీస్ ద్వారా..
అయినప్పటికీ, మిగిలిన రూ.2 వేల నోట్లను ఆర్బీఐ 19 కేంద్రాల ద్వారా ఇప్పటికీ స్వీకరిస్తోంది. ఈ ఆఫీసులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు తమ వద్ద ఉన్న ఈ నోట్లను అక్కడ డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది. దీంతోపాటు అక్టోబర్ 9, 2023 నుంచి వ్యక్తులు, వ్యాపారస్తులు తమ రూ. 2000 నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా RBI ఆఫీసులకు పంపవచ్చని వెల్లడించింది. ఈ నోట్ల విలువను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఈ సౌలభ్యం ప్రజలకు సులభంగా నోట్లను తిరిగి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.
ఎందుకు ఈ ఉపసంహరణ?
రూ.2000 నోట్లను ఉపసంహరించడం వెనుక ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడం RBI ఉద్దేశం. ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడంలో భాగంగా నిర్ణయం తీసుకున్నారు. మీ వద్ద రూ. 2000 నోట్లు ఇంకా ఉంటే, వాటిని RBI ఆఫీసులకు ఇండియా పోస్ట్ ద్వారా పంపించండి. ఆ మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. వ్యక్తులే కాదు, వ్యాపార సంస్థలూ ఈ విధంగా మార్చుకోవచ్చు.
ప్రజలు ఎందుకు తిరిగి ఇవ్వలేదు అనడానికి అందుకు అనేక కారణాలు ఉండవచ్చు. కొంతమంది మరచిపోయి ఉండవచ్చు. మరికొంత మందికి సమాచారం తెలియకపోవచ్చు. ఇంకొందరు ఈ నోట్లు వ్యక్తిగతంగా నిల్వ చేసుకుని ఉండవచ్చు. కారణం ఏదైనా సరే, RBI ఇప్పటికీ వాటిని తీసుకునేందుకు అవకాశం ఇస్తోంది. కాబట్టి వాటిని వీలైనంత త్వరగా మార్చుకోండి.

]]>
Mon, 02 Jun 2025 23:22:38 +0530 admin
భారత్ ఉగ్రవాదాన్ని సహించదు : భారత ప్రధాని మోదీ https://prajakshethrenews.com/భారత్-ఉగ్రవాదాన్ని-సహించదు-భారత-ప్రధాని-మోదీ https://prajakshethrenews.com/భారత్-ఉగ్రవాదాన్ని-సహించదు-భారత-ప్రధాని-మోదీ భారత్ ఉగ్రవాదాన్ని సహించదు
సిందూర్ నారీ శక్తి (మహిళా శక్తి), జాతీయ శౌర్యానికి చిహ్నం
ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ
ప్రజా క్షేత్ర్, భోపాల్ మే 31 :
సాంప్రదాయకంగా వైవాహిక నిబద్ధతకు చిహ్నంగా ఉన్న సిందూర్ నేడు నారీ శక్తి (మహిళా శక్తి), జాతీయ శౌర్యానికి చిహ్నంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం భోపాల్‌లో ప్రముఖ రాణి, సంఘ సంస్కర్త దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా జరిగిన మహిళా సశక్తికరణ్ మహా సమ్మేళనంలో మోడీ మాట్లాడుతూ.. అహల్యాబాయి చెప్పినట్లుగా నాయకుడు ప్రజల జీవితాల్లో సంస్కరణలను తీసుకురావాలని ప్రధాని మోడీ అన్నారు. దేవుడిని ఆరాధించడం, ప్రజలను సేవించడం మధ్య దేవి అహల్యాబాయి ఎప్పుడూ తేడా చూపించలేదని చెప్పారు. పేదలకు సహాయం చేయడానికి, వారు జీవితంలో పురోగతి సాధించడానికి అహల్యాబాయి కృషి చేశారని ప్రధాని కొనియాడారు.అలాగే, ఆపరేషన్ సిందూరు గురించి మాట్లాడుతూ.. భారత్ ఇప్పటివరకు చేపట్టిన అతిపెద్ద సరిహద్దు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఆపరేషన్ సిందూర్ అని అన్నారు.ఈ ఆపరేషన్.. దేశం ఉగ్రవాదాన్ని సహించదని స్పష్టమైన సందేశాన్ని పంపిందని ప్రధాని చెప్పారు. పాకిస్తాన్ దాడి చేస్తే, ప్రతిస్పందన బుల్లెట్లతో ఉంటుందని ఆయన అన్నారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని, ప్రజలను కాపాడుకోవడంలో అచంచలమైన నిబద్ధతను ఈ ఆపరేషన్ ప్రదర్శించిందని మోడీ చెప్పారు.

]]>
Sat, 31 May 2025 20:02:20 +0530 admin
ప్రధాని మోదీని చంపేస్తా అంటూ బెదిరింపు కాల్? https://prajakshethrenews.com/ప్రధాని-మోదీని-చంపేస్తా-అంటూ-బెదిరింపు-కాల్ https://prajakshethrenews.com/ప్రధాని-మోదీని-చంపేస్తా-అంటూ-బెదిరింపు-కాల్ ప్రధాని మోదీని చంపేస్తా అంటూ బెదిరింపు కాల్?
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ : 
ప్రధాని మోదీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం సంచలనం రేపింది. ప్రధాని బిహార్ లో పర్యటిస్తున్న సమయంలో ఈ బెదిరింపులు రావడంతో నిఘా అధికారులు అప్రమత్తమయ్యారు. మోదీని చంపేస్తానని కాల్ చేసిన 35 ఏళ్ల సమీర్ కుమార్ రంజన్ ను అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. రంజన్ మెట్రిక్యులేషన్ కూడా పాస్ కాలేదని కీప్యాడ్ మొబైల్ ఫోన్తో బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

]]>
Fri, 30 May 2025 16:58:37 +0530 admin
సాగర తీరంపై నిఘా https://prajakshethrenews.com/సాగర-తీరంపై-నిఘా https://prajakshethrenews.com/సాగర-తీరంపై-నిఘా సాగర తీరంపై నిఘా
ప్రజా క్షేత్ర్, విశాఖపట్నం : 
పాకిస్తాన్ తో  యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెడ్ అలెర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఉగ్రవాదుల నుంచి దాడులు ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రధాన నగరాలతో పాటు వీరప్రాంతాలపై దృష్టి పెట్టాయి. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా విశాఖ నగరం పై దృష్టి సారించింది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. ఆసియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు ఉంది. సిటీ ఆఫ్ డెస్టినీ గా పేరు గడించిన విశాఖ ఉన్నది సముద్ర తీర ప్రాంతంలోనే. అందుకే ఉగ్రదాడులకు అవకాశం చాలా ఎక్కువ. అందుకే కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అడుగడుగునా నిఘా పెంచింది.ప్రస్తుతం విశాఖ నగరాన్నిపోలీసులు జల్లెడ పడుతున్నారు. రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సోదాలు జరుపుతున్నారు. విశాఖలో అణువణువు గాలిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు విశాఖ నగరవ్యాప్తంగా పోలీస్ తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమానితులను గుర్తించి వారి కదలికలపై నిఘా పెడుతున్నారు. విశాఖలో ప్రతి కూడలి వద్ద పోలీసుల పహారా పెరిగింది. ప్రయాణికులపై అనుమానం వస్తే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వారి ప్రయాణ వివరాలను తెలుసుకుంటున్నారు.అయితే విశాఖ నగరంపై ఈ స్థాయిలో దృష్టి పెట్టడానికి గత అనుభవాలు ఒక కారణం. 1971లో విశాఖ టార్గెట్ గా పాకిస్తాన్ జలాంతర్గామితో దాడి చేసింది. దీంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సున్నితమైన ప్రదేశాలలో నిఘా పెంచడమే కాదు.. పోలీసులు నగరాన్ని పహారా కాస్తున్నారు. దేశ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం ఉంది. విశాఖ నగరంలోని పోర్టు ఏరియాతో పాటు సముద్ర తీర ప్రాంతం పై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు.సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం విశాఖ సొంతం. నార్త్ కోస్టల్ ఏరియా గా విశాఖకు పేరు ఉంది. సు విశాలమైన పోర్టు ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఉన్నాయి. దేశంలోనే అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు ఉంది. అందుకే పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే కేంద్రం హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అయితే పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో విశాఖ నగరంలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. అందుకే సర్వత్రా నగరవాసుల్లో ఆందోళన నెలకొంది

]]>
Fri, 30 May 2025 09:20:23 +0530 admin
రేపే ఎన్నికలు పెట్టండి.. మోదీకి దీదీ సవాల్! https://prajakshethrenews.com/రేపే-ఎన్నికలు-పెట్టండి-మోదీకి-దీదీ-సవాల్ https://prajakshethrenews.com/రేపే-ఎన్నికలు-పెట్టండి-మోదీకి-దీదీ-సవాల్ రేపే ఎన్నికలు పెట్టండి.. మోదీకి దీదీ సవాల్!
ప్రజా క్షేత్ర్, కల్‌కతా :

లిపుర్‌దువార్‌లో జరిగిన ర్యాలీలో మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. అఖిలపక్ష ఎంపీల బృందం విదేశాల్లో పర్యటిస్తున్న ఈ తరుణంలో మోదీ నుంచి ఇలాంటి కామెంట్స్‌ను తాను అస్సలు ఊహించలేదన్నారు. ఉగ్రవాదంపై పోరులో మనమంతా ఐక్యంగా ఉన్నామని, టెర్రరిజాన్ని సహించబోమని చెప్పేందుకు ఎంపీలు పర్యటిస్తున్నారని.. ఈ సమయంలో మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇదే సమయంలో ప్రధానికి ఆమె ఓ సవాల్ విసిరారు. ఆ చాలెంజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

గెలుపు మాదే..

+బెంగాల్‌లో రేపే అసెంబ్లీ ఎన్నికలు పెట్టాలని మోదీకి సవాల్ విసిరారు మమతా బెనర్జీ. రాష్ట్ర ప్రజలంతా తమ వైపే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. తృణమూల్‌కు ఢోకా లేదని.. తక్షణం ఎన్నికలు నిర్వహించినా తమదే విజయమని దీదీ స్పష్టం చేశారు. కాగా, అలిపుర్‌దువార్‌లో జరిగిన సభలో మమతా సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు మోదీ. బెంగాల్ ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోందని.. ముర్షిదాబాద్, మాల్దా అల్లర్లే దీనికి ఉదాహరణ అని అన్నారు. గూండాలకు స్వేచ్ఛ ఇచ్చి ప్రజలపై ఉసిగొల్పారని ప్రధాని ఆరోపించారు. ఇలాగేనా ప్రభుత్వం నడిపేది అని దుయ్యబట్టారు. ప్రతి అంశంలో కోర్టులు కలుగజేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. తృణమూల్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదని.. ఈ సర్కారు మాకు వద్దని అంటున్నారని పేర్కొన్నారు మోదీ. ఈ వ్యాఖ్యలపై దీదీ పైవిధంగా స్పందించారు. వెంటనే ఎన్నికలు పెట్టాలని ప్రధానికి సవాల్ విసిరారు

]]>
Thu, 29 May 2025 22:46:33 +0530 admin
ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదు : ప్రధాని నరేంద్ర మోదీ https://prajakshethrenews.com/ఆపరేషన్-సిందూర్-ఇంకా-ముగియలేదు-ప్రధాని-నరేంద్ర-మోదీ https://prajakshethrenews.com/ఆపరేషన్-సిందూర్-ఇంకా-ముగియలేదు-ప్రధాని-నరేంద్ర-మోదీ ఆపరేషన్ సిందూర్’  ఇంకా ముగియలేదు
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా చర్యలు
                   మరోసారి స్పష్టం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  
న్యూ డిల్లీ, ప్రజా క్షేత్ర్ : 
ఆపరేషన్ సిందూర్’  ఇంకా ముగియలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ   మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. పాక్‌  పై ఇప్పటికే మూడుసార్లు వారి సొంతగడ్డపైనే దాడులు చేశామని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్‌  లో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.‘బెంగాల్‌ గడ్డ నుంచి 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రకటిస్తున్నా.. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదు. పాకిస్థాన్‌ను ఇప్పటికే దాని సొంత గడ్డపై మూడు సార్లు దాడులు చేశాం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంది. భారతీయ మహిళల గౌరవాన్ని అవమానించిన ఉగ్రవాదులపై దేశ సాయుధ దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి.ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచివేశారు. మన సైన్యం సింధూరం శక్తిని వారికి తెలిసేలా చేసింది. ఉగ్రవాదం పట్ల భారత్‌ జీరో-టాలరెన్స్‌ విధానాన్ని అవలంభించింది. పాక్‌ ఎన్నడూ ఊహించని సరిహద్దు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. వారి భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ మూడుసార్లు దాడులు చేశాం. ఆపరేషన్‌ సిందూర్‌తో.. భారత్‌పై దాడి చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రపంచానికి చాటిచెప్పాం. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ అర్థం చేసుకోవాలి’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.

]]>
Thu, 29 May 2025 19:25:19 +0530 admin
ఎనిమిది రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల 19న పోలింగ్‌ https://prajakshethrenews.com/ఎనిమిది-రాజ్యసభ-స్థానాలకు-వచ్చే-నెల-19న-పోలింగ్ https://prajakshethrenews.com/ఎనిమిది-రాజ్యసభ-స్థానాలకు-వచ్చే-నెల-19న-పోలింగ్ ఎనిమిది రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల 19న పోలింగ్‌
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
రెండు రాష్ట్రాల్లో ఖాళీ కాబోతున్న ఎనిమిది రాజ్యసభ స్థానాల   కు వచ్చే నెల 19న పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ ముగియగానే అదేరోజు ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం  షెడ్యూల్‌ విడుదల చేసింది. అసోం లో రెండు, తమిళనాడు లో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి.అసోంలో రాజ్యసభ సభ్యులు రంజన్‌ దాస్‌, బీరేంద్ర ప్రసాద్‌ బైస్యల పదవీకాలం జూన్‌ 14న ముగియనుంది. అదేవిధంగా తమిళనాడులో ఆరుగురు సభ్యులు అన్బుమణి రామదాస్‌, ఎం షణ్ముగం, ఎన్‌ చంద్రశేగరన్, ఎం మహ్మద్‌ అబ్దుల్లా, పీ విల్సన్‌, వైకో జూలై 24న పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన జూన్‌ 2న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.నామినేషన్‌ల దాఖలుకు జూన్‌ 9 వరకు గడువు ఇవ్వనున్నారు. జూన్‌ 10 నామినేషన్‌ల స్క్రూటినీ నిర్వహించనున్నారు. అభ్యర్థిత్వాన్ని వదులుకోవడానికి తుది గడువు జూన్‌ 12. జూన్‌ 19న పోలింగ్‌ నిర్వహించనున్నారు. జూన్‌ 23తో ఈ రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియనుంది.

]]>
Mon, 26 May 2025 20:19:01 +0530 admin
11 ఏళ్లలో ఎంతో సాధించాం.. సాధించాల్సింది ఎంతో ఉంది https://prajakshethrenews.com/11-ఏళ్లలో-ఎంతో-సాధించాం-సాధించాల్సింది-ఎంతో-ఉంది https://prajakshethrenews.com/11-ఏళ్లలో-ఎంతో-సాధించాం-సాధించాల్సింది-ఎంతో-ఉంది  11  ఏళ్లలో ఎంతో సాధించాం..
సాధించాల్సింది ఎంతో ఉంది

ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్ : 

2014 మే 26.. సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు భారత దేశ ప్రధాన మంత్రిగా తొలిసారి నరేంద్ర మోదీ ప్రమాణాస్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పాలన నిరాంటంకంగా కొనసాగుతోంది. 2014, 2019, 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో.. అఖండ విజయాలను నమోదు చేసి.. వరుసగా మూడు సార్లు ప్రధాని పదవిని స్వీకరించారు. అప్రతిహతంగా దూసుకెళ్తున్న మోదీ పాలన నేటితో 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రా, ఇందిరా గాంధీ తర్వాత అత్యధిక కాలం ఈ దేశానికి సేవలందించిన ప్రధానిగా నరేంద్ర మోదీ పేరు చిరస్థాయిగా చిలిచిపోనుంది. ఇంత పెద్ద ఘనత సాధించిన ప్రధాని మోదీ.. తన ఈ 11 ఏళ్ల పాలనలో జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించింది. యునైటెడ్ స్టేట్స్, చైనా, జర్మనీ తర్వాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే అని గర్వంలో ప్రతి భారతీయుడు చెప్పుకోవచ్చు.
2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, 2019లో జరిగిన బాలకోట్ వైమానిక దాడి ఆయన నాయకత్వంలో భారత్‌ బలమేంటో ప్రపంచానికి తెలిసొచ్చింది దేశ పౌరులపై పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రస్థావరాలను పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లి మరీ కూల్చాం. ఆపరేషన్‌ సిందూర్‌తో ఈ ప్రపంచానికి భారత సైనిక శక్తి గురించి చాటిచెప్పాం. ఈ సాహసోపేతమైన చర్యలు భారతదేశ ప్రతిష్టను పెంచాయి.మోడీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ పరివర్తన, వ్యాపార సౌలభ్యానికి అపూర్వమైన ప్రాధాన్యతనిచ్చింది. భారత్‌మాల హైవే నెట్‌వర్క్, స్మార్ట్ సిటీలు, రైలు, వాయు కనెక్టివి వేగవంతమైన విస్తరణ వంటి ప్రాజెక్టులు భారతదేశ స్థాయిని పెంచడంలో దోహదపడ్డాయి. GST, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల అమలు వంటి వ్యూహాత్మక ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షించాయి.నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం.. గత తొమ్మిదేళ్లలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు.  ఆయుష్మాన్ భారత్ నిర్వహణకు భారతదేశం వేదిక అయింది. 50 కోట్ల మంది భారతీయులకు వర్తించే ఈ ఆయుష్మాన్ భారత్ పేదలకు, మధ్యతరగతి ప్రజలకు భరించగల స్థాయిలో నాణ్యమైన వైద్యసేవలను సమకూర్చుతుంది.  ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన ద్వారా అవ్యవస్థీకృత రంగంలో 42 కోట్ల మందికి పైగా పింఛన్‌ అందించారు. యావత్తు ప్రపంచం సంవత్సరంలో ఒక రోజును “అంతర్జాతీయ యోగ దినం’’ గా పాటించాలన్న మోదీ పిలుపునకు ఐక్య రాజ్య సమితిలో అద్భుత స్పందన వచ్చింది. ప్రతి సంవత్సరంలో జూన్ 21వ తేదీని “ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ యోగ దినం”గా పాటించాలన్న తీర్మానాన్ని177 సభ్యత్వ దేశాలు ముక్తకంఠంతో ఆమోదించాయి. 17 సంవత్సరాల అనంతరం నేపాల్, 28 సంవత్సరాల అనంతరం ఆస్ట్రేలియా, 31 సంవత్సరాల అనంతరం ఫిజీ, 34 సంవత్సరాల అనంతరం సెశెల్స్, యుఎఇ లలో పర్యటించిన మొట్టమొదటి భారత ప్రధాన మంత్రిగా మోదీ నిలిచారు. తొలి సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మోదీ.. ఐక్య రాజ్య సమితి, బిఆర్ ఐసిఎస్ (బ్రిక్స్), సార్క్, జి-20 శిఖరాగ్ర సమావేశాల లో పాల్గొన్నారు.ప్రధాన మంత్రి మోదీకి ఎన్నో అంతర్జాతీయ అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి. సౌదీ అరేబియా ఆయన కు తమ అత్యున్నత పౌర పురస్కారం సాష్ ఆఫ్ కింగ్ అబ్దులజీజ్ తో సత్కరించింది. మోదీకి అత్యున్నత పౌర పురస్కారాలను ప్రదానం చేసిన వివిధ దేశాలలో రష్యా (ద ఆర్డర్ ఆఫ్ హోలీ ఆపాస్సల్ యాండ్రూ ద ఫస్ట్), పాలస్తీనా (గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీన్), అఫ్గానిస్తాన్ (అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డ్), యుఎఇ (జయేద్ మెడల్), మాల్దీవ్స్ (రూల్ ఆఫ్ నిశాన్ ఇజ్జుద్దీన్) లు ఉన్నాయి. శాంతికి, అభివృద్ధికి చేస్తున్న కృషి కి గుర్తింపుగా మోదీ 2018 లో ప్రతిష్ఠాత్మకమైన సియోల్ శాంతి బహుమతిని అందుకొన్నారు.

]]>
Mon, 26 May 2025 20:16:36 +0530 admin
నోరు విప్పిన సిరాజ్ https://prajakshethrenews.com/నోరు-విప్పిన-సిరాజ్ https://prajakshethrenews.com/నోరు-విప్పిన-సిరాజ్ నోరు విప్పిన సిరాజ్
దేశవ్యాప్త పేలుళ్ల కుట్ర కేసులో కొనసాగుతున్న విచారణ..!
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
ఉగ్ర కేసులో నిందితుడు సిరాజ్ పోలీసులకు గుట్టు విప్పుతున్నాడు. పోలీసుల విచారణలో వెలుగులోకి కీలక విషయాలు వస్తున్నాయి. సిరాజ్ను పోలీసులు, ఎన్ఐఏ ఐదు రోజులుగా విచారిస్తున్నారు.  తన గ్రూపులోని సభ్యుల వివరాలను సిరాజ్ బయటపెట్టాడు. పరారీలో ఉన్న అహిం గ్రూప్కు చెందిన 12మంది సభ్యుల కోసం గాలింపులు మొదలయ్యాయి. 12 మందిని మానవబాంబులుగా తయారుచేశారని అనుమానాలు వస్తున్నాయి. వరంగల్కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బారాదర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సిరాజ్, సమీర్
ముంబైకి వెళ్లి 12 మందితో సమావేశమైనట్లు గుర్తించారు. ఆ  ముంబై సమావేశం వివరాలు తెలుసుకుంటున్నారు అధికారులు.

]]>
Mon, 26 May 2025 19:37:35 +0530 admin
తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు https://prajakshethrenews.com/తెలంగాణ-ఆంధ్రప్రదేశ్లలో-ప్రవేశించిన-నైరుతి-రుతుపవనాలు https://prajakshethrenews.com/తెలంగాణ-ఆంధ్రప్రదేశ్లలో-ప్రవేశించిన-నైరుతి-రుతుపవనాలు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లలో ప్రవేశించిన   నైరుతి రుతుపవనాలు
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 
 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు గుడ్‌న్యూస్. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లలోని   కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు   ప్రవేశించాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు రోజుల్లో రుతుపవనాలు మిగితా ప్రాంతాలను కూడా తాకే అవకాశం ఉందని పేర్కొంద. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో సోమవారం నుంచి గురువారం వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుసే అవకాశం ఉందని స్పస్టం చేసింది.

]]>
Mon, 26 May 2025 19:24:22 +0530 admin
మహారాష్ట్రలో క్రమంగా పెరుగుతున్న మహమ్మారి కోవిడ్ కేసులు https://prajakshethrenews.com/మహారాష్ట్రలో-క్రమంగా-పెరుగుతున్న-మహమ్మారి-కోవిడ్-కేసులు https://prajakshethrenews.com/మహారాష్ట్రలో-క్రమంగా-పెరుగుతున్న-మహమ్మారి-కోవిడ్-కేసులు మహారాష్ట్రలో క్రమంగా పెరుగుతున్న మహమ్మారి కోవిడ్ కేసులు
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్ : 
మహారాష్ట్రలో మహమ్మారి కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం 43 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరుకుందని తెలిపింది. తాజాగా బయటపడిన కేసుల్లో ముంబైలో 35, పూణేలో 8 కొత్త కేసులు నమోదయ్యాయి. జనవరి నుండి మహారాష్ట్రలో మొత్తం 300 COVID-19 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముంబైలోనే ఏకంగా 248 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

]]>
Mon, 26 May 2025 18:50:32 +0530 admin
పాకిస్థాన్‌కి గూఢచర్యం చేస్తున్నసిఆర్‌పిఎఫ్ ఉద్యోగి అరెస్ట్ https://prajakshethrenews.com/పాకిస్థాన్కి-గూఢచర్యం-చేస్తున్నసిఆర్పిఎఫ్-ఉద్యోగి-అరెస్ట్ https://prajakshethrenews.com/పాకిస్థాన్కి-గూఢచర్యం-చేస్తున్నసిఆర్పిఎఫ్-ఉద్యోగి-అరెస్ట్ పాకిస్థాన్‌కి గూఢచర్యం చేస్తున్నసిఆర్‌పిఎఫ్ ఉద్యోగి అరెస్ట్
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 
పాకిస్థాన్‌కి గూఢచర్యం చేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ తర్వాత కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా పాకిస్థాన్ కోసం పని చేస్తున్న వ్యక్తులను జల్లెడ వేసి పట్టుకొనే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో ఇప్పటికే పలువురు అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. తాజాగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) (CRPF) ఉద్యోగి మోతీరామ్ జాట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) (NIA) అధికారులు అరెస్ట్ చేశారు. పాక్ ఇంటెలిజెన్స్‌ అధికారులకు మోతీరామ్ సున్నిత సమాచారం అందిస్తున్నట్లు గుర్తించారు. 2023 నుంచి పాక్ ఇంటెలిజెన్స్‌ అధికారులతో సిఆర్‌పిఎఫ్ (CRPF) ఉద్యోగి మోతీరామ్ టచ్‌లో ఉన్నట్లు బయటపడింది.అనంతరం అతడిని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి జూన్ 6వ తేదీ వరకూ ఎన్‌ఐఎ (NIA) కస్టడీలో ఉండాలని ఆదేశించింది. మోతీరామ్‌పై వచ్చిన ఆరోపణలు దేశ భద్రతకు పెను ముప్పుగా మారే అవకాశం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. అతను పాకిస్థాన్‌కు ఏ విధమైన రహస్యాలు అందించాడో విచారణలో వెలికి తీయాలని పేర్కొంది. మోతిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ 15, సెక్షన్ 16, సెక్షన్ 18 కింద కేసులు నమోదు చేశారు.

]]>
Mon, 26 May 2025 18:37:00 +0530 admin
నేషన్‌&వన్‌ ఎలక్షన్‌’ దేశానికి అవసరమైన మార్పు : ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ https://prajakshethrenews.com/నేషన్-వన్-ఎలక్షన్-దేశానికి-అవసరమైన-మార్పు-ఎపి-డిప్యూటి-సిఎం-పవన్-కల్యాణ్ https://prajakshethrenews.com/నేషన్-వన్-ఎలక్షన్-దేశానికి-అవసరమైన-మార్పు-ఎపి-డిప్యూటి-సిఎం-పవన్-కల్యాణ్ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌’ దేశానికి అవసరమైన మార్పు

ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

 ప్రధాన మంత్రి నరేంద్ర మెడీ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే నాయకుడు ప్రధాని మోడీ అని ప్రశంసలు కురిపించారు. సోమవారం చెన్నైలో ‘వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌’ సెమినార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌’ దేశానికి అవసరమైన మార్పు అని చెప్పారు. మనసు ఉంటే మార్గం ఉంటుందని.. ముందు ప్రారంభిస్తే.. తర్వాత వచ్చే అడ్డంకులు అధిగమించొచ్చని చెప్పారు. సమస్యలు లేవని తాను చెప్పనని.. కానీ వాటిని అధిగమించగలమని, భారత్‌కు ఉన్న సామర్థ్యంతో ‘వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌’ ఆచరణ సాధ్యమేనని పవన్ అన్నారు.

]]>
Mon, 26 May 2025 18:31:34 +0530 admin
ఎపి సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ సీ ఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/ఎపి-సీఎంకి-కృతజ్ఞతలు-తెలిపిన-తెలంగాణ-సీ-ఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ఎపి-సీఎంకి-కృతజ్ఞతలు-తెలిపిన-తెలంగాణ-సీ-ఎం-రేవంత్-రెడ్డి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతించడానికి ఆదేశాలిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల (MP/MLC/MLA) సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  తెలంగాణ ముఖ్యమంత్రి కి ప్రత్యుత్తరం రాశారు.తెలంగాణ ప్రజలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో వందల సంవత్సరాలుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, తెలంగాణ నుంచి ప్రతి రోజూ వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని ముఖ్యమంత్రి  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో గుర్తుచేశారు.గత సంప్రదాయం ప్రకారం తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు ఇచ్చే విజ్ఞాపనల మేరకు స్వామి వారి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలని  రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి రాసిన లేఖలో కోరారు.శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని, తెలుగు జాతి సత్సంబంధాల నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన లేఖలో పేర్కొన్నారు.ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ బ్రేక్ దర్శనం (రూ.500/- టికెట్) కొరకు రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ (SED) (రూ. 300/- టికెట్) కొరకు రెండు లేఖలు స్వీకరించబడతాయని పేర్కొన్నారు. ప్రతి లేఖతో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫారసు చేయొచ్చని చంద్రబాబు నాయుడు  రాసిన లేఖలో పేర్కొన్నారు.

]]>
Wed, 01 Jan 2025 12:53:31 +0530 admin
తెలంగాణకు 11,713.49 కోట్లు స‌త్వ‌ర‌మే విడుద‌ల చేయాలని అమిత్ షా కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి https://prajakshethrenews.com/తెలంగాణకు-1171349-కోట్లు-సత్వరమే-విడుదల-చేయాలని-అమిత్-షా-కు-రేవంత్-రెడ్డి-విజ్ఞప్తి https://prajakshethrenews.com/తెలంగాణకు-1171349-కోట్లు-సత్వరమే-విడుదల-చేయాలని-అమిత్-షా-కు-రేవంత్-రెడ్డి-విజ్ఞప్తి  తెలంగాణకు 11,713.49 కోట్లు స‌త్వ‌ర‌మే విడుద‌ల చేయాలని అమిత్ షా కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు రూ. 11,713.49 కోట్లు స‌త్వ‌ర‌మే విడుద‌ల చేయాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. వారిని ఢిల్లీలో కలిసి వరద నష్టంపై సమగ్రమైన నివేదికను అందించి తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. అలాగే, తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ప్రభావం, పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పునర్విభజన సమస్యలు, రాష్ట్రానికి ఐపీఎస్ ల కేటాయింపు వంటి పలు అంశాలపై అమిత్ షాతో చర్చించి సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చిన పలు వివరాలు..తెలంగాణ‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా 37 మంది ప్రాణాలు, ల‌క్ష‌కు పైగా ప‌శువులు, ఇత‌ర మూగ జీవాలు మృతి చెందాయి. 4.15 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంటతో పాటు రోడ్లు, క‌ల్వ‌ర్టులు, కాజ్‌వేలు, చెరువులు, కుంట‌లు, కాలువ‌లు దెబ్బ‌తిన్నాయి.ప్రాథమిక అంచనాల మేరకు రూ. 5,438 కోట్లు మేరకు వరద నష్టం వాటిల్లినట్టు సెప్టెంబ‌రు రెండో తేదీన లేఖ రాశాం. ఆ తర్వాత సెప్టెంబర్ 11 నుంచి 13 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించి 30 వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. భారీ వర్షాలు, వరదల వల్ల మొత్తంగా రూ.11,713 కోట్ల మేర న‌ష్టం వాటిల్లింది.వామ‌ప‌క్ష తీవ్ర‌వాద (#LWE) ప్ర‌భావిత జిల్లాల నుంచి తొల‌గించిన ఆదిలాబాద్‌, మంచిర్యాల‌, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల‌ను తిరిగి ఆ జాబితాలో చేర్చాలి.తెలంగాణ పోలీస్ శాఖ కొత్త‌గా నియ‌మితులైన పోలీసు సిబ్బందికి గ్రేహౌండ్స్ ద్వారా తీవ్ర‌వాద వ్య‌తిరేక వ్యూహాల్లో (AET) శిక్ష‌ణ ఇప్పిస్తున్నాం. అందుకోసం అవసరమైన అదనపు బడ్జెట్ రూ.25.59 కోట్లు విడుద‌ల చేయాలి.పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర పున‌ర్విభ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌హ‌క‌రించాలి. షెడ్యూల్ 9 లోని ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్ 10 లోని సంస్థ‌ల వివాదం సామ‌ర‌స్య‌ పూర్వ‌క‌ ప‌రిష్కారానికి కృషి చేయాలి.పునర్విభజన చట్టంలో ఎక్క‌డా పేర్కొనని ఆస్తులు, సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్నందున‌, వాటిలో తెలంగాణ‌కు న్యాయం జ‌రిగేలా చూడాలి.రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణ‌కు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారుల‌ను మాత్ర‌మే కేటాయించారు. తెలంగాణకు అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలి.

]]>
Tue, 08 Oct 2024 02:50:51 +0530 admin
వామపక్ష తీవ్రవాద ప్రభావిత (LWE) రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరయిన రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/వామపక్ష-తీవ్రవాద-ప్రభావిత-lwe-రాష్ట్రాల-ముఖ్యమంత్రుల-సమావేశానికి-హాజరయిన-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/వామపక్ష-తీవ్రవాద-ప్రభావిత-lwe-రాష్ట్రాల-ముఖ్యమంత్రుల-సమావేశానికి-హాజరయిన-రేవంత్-రెడ్డి వామపక్ష తీవ్రవాద ప్రభావిత  (LWE) రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరయిన రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరుగుతున్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత  (LWE) రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ  జితేందర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ శివధర్ రెడ్డి , ఎస్ఐబీ ఐజీ సుమతి పాల్గొన్నారు.

]]>
Tue, 08 Oct 2024 02:30:18 +0530 admin
కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసిన అక్కినేని అమల https://prajakshethrenews.com/కొండా-సురేఖపై-రాహుల్-గాంధీకి-ఫిర్యాదు-చేసిన-అక్కినేని-అమల https://prajakshethrenews.com/కొండా-సురేఖపై-రాహుల్-గాంధీకి-ఫిర్యాదు-చేసిన-అక్కినేని-అమల కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసిన అక్కినేని అమల

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఎక్స్​ వేదిక ద్వారా అకకినేని అమల ఫిర్యాదు చేశారు. తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన కొండా సురేఖ పై మండి పడ్డారు. రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగవద్దు.. నా భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. కొండా సురేఖ చేసిన  వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుంది? సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

]]>
Thu, 03 Oct 2024 03:46:18 +0530 admin
రామ మందిరం కార్యక్రమంలోను తిరుపతి లడ్డూలు పంపిణీ చేశాం : ఆచార్య సత్యేంద్ర దాస్ https://prajakshethrenews.com/రామ-మందిరం-కార్యక్రమంలోను-తిరుపతి-లడ్డూలు-పంపిణీ-చేశాం-ఆచార్య-సత్యేంద్ర-దాస్ https://prajakshethrenews.com/రామ-మందిరం-కార్యక్రమంలోను-తిరుపతి-లడ్డూలు-పంపిణీ-చేశాం-ఆచార్య-సత్యేంద్ర-దాస్ రామ మందిరం కార్యక్రమంలో తిరుపతి లడ్డూలు పంపిణీ చేశాం : ఆచార్య సత్యేంద్ర దాస్ 

ప్రజాక్షేత్ర్, నేషనల్​ బ్యూరో

జనవరి లో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో తిరుపతి దేవస్థానం నుంచి లడ్డూలను ప్రసాదంగా పంపిణీ చేసినట్లు రామాలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో తిరుపతి దేవస్థానం నుండి లడ్డూలను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసినట్లు అయోధ్యలోని రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పారు. తిరుమల నుంచి ఎన్ని లడ్డూలు తెచ్చారో తెలియదని, ఆ విషయం ట్రస్ట్‌కే తెలుసు అన్నారు. అయితే ఏ లడ్డూలు వచ్చినా భక్తులకు ప్రసాదంగా పంచామని, కాలుష్యానికి సంబంధించిన నివేదికలు ప్రమాదకరమైన కుట్రను సూచిస్తున్నాయి" అని ఆచార్య సత్యేంద్ర నేషనల్​ మీడియాతో మాట్లాడారు. శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంప్రోక్షణ వేడుకల కోసం లక్షకు పైగా లడ్డూలను పంపిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకకు 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యారు. ఏది ఏమైనప్పటికీ, రామాలయాన్ని నిర్వహించే ట్రస్ట్ అయిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం, రామ్ లల్లా యొక్క ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రసాదంగా పంపిణీ చేయబడిందని చెప్పారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా అందించిన లడ్డూల్లో జంతువుల కొవ్వు, చేపనూనె ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో వివాదం చెలరేగిన విషయం విధితమే.  గుజరాత్ నుండి వచ్చిన ల్యాబ్ నివేదికను ఉటంకిస్తూ, నెయ్యిలో "బీఫ్ టాలో", "పందికొవ్వు" చేప నూనె ఉన్నట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

]]>
Sat, 21 Sep 2024 23:46:12 +0530 admin
సెప్టెంబర్ 30న ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ https://prajakshethrenews.com/సెప్టెంబర్-30న-ఎయిర్-ఫోర్స్-కొత్త-చీఫ్గా-బాధ్యతలు-స్వీకరించనున్నఎయిర్-మార్షల్-అమర్-ప్రీత్-సింగ్ https://prajakshethrenews.com/సెప్టెంబర్-30న-ఎయిర్-ఫోర్స్-కొత్త-చీఫ్గా-బాధ్యతలు-స్వీకరించనున్నఎయిర్-మార్షల్-అమర్-ప్రీత్-సింగ్  సెప్టెంబర్ 30న ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో 

ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ గా పనిచేస్తున్న ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ను ఎయిర్ స్టాఫ్ తదుపరి చీఫ్ గా ప్రభుత్వం నియమించింది. 2024 సెప్టెంబర్ 30న ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అదే రోజున ప్రస్తుతం కొనసాగుతున్న ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవీవిరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణ నంతరం అమర్ ప్రీత్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఫిబ్రవరి 1, 2023న భారత వైమానిక దళానికి 47వ వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. భారత వైమానిక దళంలో అతని ప్రయాణం 1984లో ప్రారంభమైంది. అమర్​ సింగ్ డిసెంబర్ 21, 1984న IAF యొక్క ఫైటర్ స్ట్రీమ్‌లోకి ప్రవేశించారు. ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ ఎయిర్ కమాండ్ (CAC)కి నాయకత్వం వహించే ముందు, అతను తూర్పు ఎయిర్ కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా పనిచేశాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, వెల్లింగ్‌టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ మరియు నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌లో పూర్వ విద్యార్థి అయిన సింగ్, మిగ్-27 స్క్వాడ్రన్‌లో ఫ్లైట్ కమాండర్, కమాండింగ్ ఆఫీసర్, అలాగే ఎయిర్ బేస్ కమాండింగ్ ఎయిర్ ఆఫీసర్ వంటి కీలక పాత్రలను నిర్వహించారు. అతని కెరీర్‌లో, అతను 2019లో అతి విశిష్ట సేవా పతకం, 2023లో పరమ విశిష్ట సేవా పతకాన్ని అందుకున్నాడు.

]]>
Sat, 21 Sep 2024 23:26:33 +0530 admin
రాజీనామా చేస్తా..ప్రజలు మళ్లీ గెలిపిస్తేనే సీఎం పీఠంపై కూర్చుంటా : కేజ్రీవాల్​ https://prajakshethrenews.com/రాజీనామా-చేస్తాప్రజలు-మళ్లీ-గెలిపిస్తేనే-సీఎం-పీఠంపై-కూర్చుంటా-కేజ్రీవాల్ https://prajakshethrenews.com/రాజీనామా-చేస్తాప్రజలు-మళ్లీ-గెలిపిస్తేనే-సీఎం-పీఠంపై-కూర్చుంటా-కేజ్రీవాల్ రాజీనామా చేస్తా..ప్రజలు మళ్లీ గెలిపిస్తేనే సీఎం పీఠంపై కూర్చుంటా : అరవింద్​ కేజ్రీవాల్​ 

ప్రజాక్షేత్ర్, తెలంగాణబ్యూరో

ముఖ్యమంత్రి పదవికి రెండు రోజుల తర్వాత రాజీనామా చేస్తానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఇటీవలే జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ మళ్లీ ప్రజల తీర్పు కోరతానని, అప్పుడే తిరిగి సీఎం పీఠంపై కూర్చుంటానని స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన కేజ్రీవాల్, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ప్రజలు మళ్లీ నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చే వరకు నేను ఆ పీఠంపై కూర్చోను. నేను ప్రతి వీధికి, ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజా తీర్పును కోరతాను. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. కేజ్రీవాల్ నిజాయితీపరుడు అని మీరు భావిస్తేనే నాకు ఓటేయండి. నేను నీతి పరుడిని కాదనుకుంటే నాకు ఓటేయకండి. నా నిజాయితీకి మీ ఓటే సర్టిఫికెట్. మళ్లీ ఎన్నికయ్యాకే నేను సీఎం పీఠంపై కూర్చుంటా’’ అని ఆయన పేర్కొన్నారు. 

]]>
Sun, 15 Sep 2024 19:51:45 +0530 admin
అది జ్ఞాన వాపి మసీద్ కాదు.. శివాలయం : యోగి ఆదిత్యనాథ్ https://prajakshethrenews.com/అది-జ్ఞాన-వాపి-మసీద్-కాదు-శివాలయం-యోగి-ఆదిత్యనాథ్ https://prajakshethrenews.com/అది-జ్ఞాన-వాపి-మసీద్-కాదు-శివాలయం-యోగి-ఆదిత్యనాథ్ అది జ్ఞాన వాపి మసీద్ కాదు.. శివాలయం : యోగి ఆదిత్యనాథ్ 

ప్రజా క్షేత్ర్, నేషనల్ బ్యూరో :

జ్ఞానవాపి మసీదు నిజానికి ఒక శివాలయం అని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. జ్ఞాన్‌వాపి టైటిల్‌పై ఈ గందరగోళం సైట్‌లో పూజలు, ప్రార్థనలు చేయడంలో మాత్రమే కాకుండా, జాతీయ ఐక్యత, సమగ్రతకు కూడా అతిపెద్ద అడ్డంకి అని యుపి ముఖ్యమంత్రి అన్నారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదును ముస్లింల ప్రార్థనా స్థలంగా పిలువడంపై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, అది 'శివుని దేవాలయం' అని అన్నారు.యుపిలోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "దురదృష్టవశాత్తూ, ప్రజలు జ్ఞాన్‌వాపిని మసీదుగా పిలుస్తారని, అయితే అది నిజానికి 'విశ్వనాథ్' (శివుడు) అని అన్నారు.యోగి ఆదిత్యనాథ్ సైట్‌ను సందర్శించే భక్తులు దాని నిజమైన గుర్తింపు లేదా పేరుపై ఈ గందరగోళం సైట్‌లో పూజలు, ప్రార్థనలు చేసే మార్గంలో మాత్రమే కాకుండా, జాతీయ ఐక్యత మరియు సమగ్రతకు కూడా అతిపెద్ద అడ్డంకిగా ఉన్నందుకు విచారం వ్యక్తం చేశారు.

]]>
Sun, 15 Sep 2024 03:45:45 +0530 admin
సీఎం రేవంత్​రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన ఢిల్లీ జర్నలిస్టులు https://prajakshethrenews.com/సీఎం-రేవంత్రెడ్డికి-కృతజ్ఞతలు-తెలియజేసిన-ఢిల్లీ-జర్నలిస్టులు https://prajakshethrenews.com/సీఎం-రేవంత్రెడ్డికి-కృతజ్ఞతలు-తెలియజేసిన-ఢిల్లీ-జర్నలిస్టులు సీఎం రేవంత్​రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన ఢిల్లీ జర్నలిస్టులు 

ప్రజాక్షేత్ర్, నేషనల్​బ్యూరో

జర్నలిస్టుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుంటూ, త్వరితగతిన అమలు చేస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాత్రికేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రిని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోన్న తెలుగు జర్నలిస్టుల ప్రతినిధి బృందం కలిశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్‌ కార్డులు, అక్రిడిటేషన్‌ వంటి కీలక సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి శ్రద్ధతో చొరవ తీసుకోవడం అభినందనీయమని మీడియా ప్రతినిధులు అన్నారు. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడంతోపాటు తెలంగాణ మీడియా అకాడమీకి రూ.10 కోట్లు ప్రకటించడం జర్నలిస్టు సంక్షేమం పట్ల ప్రజా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నిజమైన జర్నలిస్టుల సంక్షేమాన్ని పరిరక్షిస్తామని పునరుద్ఘాటించారు. జర్నలిస్టుల సంక్షేమం, భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటామని  హామీ ఇచ్చారు. వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని, నిజమైన జర్నలిస్టులు వ్యవస్థలో భాగమేనని అన్నారు. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ, జర్నలిజం విలువలకు కట్టుబడి పనిచేసే వారికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

]]>
Thu, 12 Sep 2024 23:57:53 +0530 admin
యుద్దం ఎప్పుడు వచ్చిన సిద్దంగా ఉండాలి.. త్రివిధ దళాలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపు https://prajakshethrenews.com/యుద్దం-ఎప్పుడు-వచ్చిన-సిద్దంగా-ఉండాలి-త్రివిధ-దళాలకు-రక్షణ-మంత్రి-రాజ్నాథ్-సింగ్-పిలుపు https://prajakshethrenews.com/యుద్దం-ఎప్పుడు-వచ్చిన-సిద్దంగా-ఉండాలి-త్రివిధ-దళాలకు-రక్షణ-మంత్రి-రాజ్నాథ్-సింగ్-పిలుపు యుద్దం ఎప్పుడు వచ్చిన సిద్దంగా ఉండాలి.. త్రివిధ దళాలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపు

భారత్‌ ఎల్లప్పుడు శాంతిని కోరుకుంటుంది 

శాంతిని కాపాడడానికి యుద్దం చేయాల్సిన అవసరం రావచ్చు 

జాతీయ భద్రత అన్నిటికంటే ముఖ్యం 

ప్రజా క్షేత్ర్, నేషనల్ బ్యూరో :

యుద్దం ఎప్పుడైనా రావచ్చని ..అందుకు సిద్దంగా ఉండాలని త్రివిధ దళాలకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పిలపునిచ్చారు. భవిష్యత్‌లో రక్షణరంగంలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించేందుకు కమాండర్ల కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేశారు.లక్నోలో జాయింట్‌ కమాండర్స్‌ కాన్ఫరెన్స్‌లో రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిధిగా పాల్గొని, మాట్లాడారు. భారత్‌ ఎల్లప్పుడు శాంతిని కోరుకుంటుందని , శాంతిని కాపాడడానికి యుద్దం చేయాల్సిన అవసరం రావచ్చని అన్నారు. సరిహద్దులను కాపాడడంలో భద్రతా బలగాలు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో త్రివిధ దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. రష్యా – ఉక్రెయిన్‌ , ఇజ్రాయెల్‌ -హమాస్‌ , బంగ్లాదేశ్‌లో అలర్లను ప్రస్తావిస్తూ రాజ్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకోకుండా ఇలాంటి పరిస్థితి వస్తే సంసిద్దంగా బలగాలు ఉండాలని సూచించారు. భవిష్యత్‌లో వచ్చే యుద్దాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేలా త్రివిధ బలాలను సిద్దం చేస్తునట్టు చెప్పారు. సశక్త్‌ ఔర్‌ సురక్షిత్‌ భారత్‌ తమ లక్ష్యమన్నారు.యుద్దాలను ధీటుగా ఎదుర్కొనేలా రెడీగా ఉన్నట్టు తెలిపారు. సవాళ్లను ముందుగానే గుర్తించాలని కమాండర్లకు రాజ్‌నాథ్‌ పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో భద్రతపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. సరిహద్దు దేశాల్లో ఉన్న సమస్యలు భారత్‌కు కూడా సవాళ్లుగా మారుతున్నాయన్నారు. ఇవి శాంతికి , స్థిరత్వానికి ఆటంకం కలిగించే అవకాశముందని హెచ్చరించారు. ప్రపంచంలో పలు దేశాలు యుద్దంతో ప్రభావితమవుతున్నప్పటికి , ఆ ప్రభావం భారత్‌పై లేకుండా చూస్తునట్టు వెల్లడించారు. అయితే అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం మాత్రం ఉందన్నారు. మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ , భవిష్యత్‌లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు మనం సిద్దంగా ఉండాలని సూచించారు. జాతీయ భద్రత అన్నిటికంటే ముఖ్యమన్నారు. సాంప్రదాయ యుద్దసామాగ్రితో పాటు ఆధునిక ఆయుధ సంపత్తిని ఉపయోగించడంపై దృష్టి పెట్టాలన్నారు.స్పేస్‌ ,ఎలక్ట్రానిక్‌ వార్‌ యుద్ద విధాలనాలపై దృష్టి పెట్టినట్టు రాజ్‌నాథ్‌ తెలిపారు. డేటా , కృత్రిమ మేథను కూడా కూడా యుద్ద విద్యలకు జోడించాలన్నారు. నేరుగా యుద్దంపై ఈ విధానాలు ప్రభావం చూపకపోయినప్పటికి పరోక్షంగా సాయపడుతాయన్నారు.

]]>
Fri, 06 Sep 2024 17:50:55 +0530 admin
సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ https://prajakshethrenews.com/సీఎం-రేవంత్-రెడ్డికి-ప్రధాని-నరేంద్ర-మోదీ-ఫోన్ https://prajakshethrenews.com/సీఎం-రేవంత్-రెడ్డికి-ప్రధాని-నరేంద్ర-మోదీ-ఫోన్ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ 

ప్రజా క్షేత్ర్,తెలంగాణ బ్యూరో :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టం ప్రాథమిక వివరాలను సీఎం  ప్రధాని  దృష్టికి తీసుకెళ్లారు.ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని, తక్షణ సహాయక చర్యలు చేపట్టామని, ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు.కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సేవలు అందించే హెలికాప్టర్లను తెలంగాణకు పంపిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ప్రాణ నష్టం  జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మోదీ అభినందించారు.

]]>
Mon, 02 Sep 2024 13:41:32 +0530 admin
సీ ఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ https://prajakshethrenews.com/సీ-ఎం-రేవంత్-రెడ్డి-కి-కేంద్ర-హోం-మంత్రి-అమిత్-షా-ఫోన్ https://prajakshethrenews.com/సీ-ఎం-రేవంత్-రెడ్డి-కి-కేంద్ర-హోం-మంత్రి-అమిత్-షా-ఫోన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఫోన్ చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపైముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు.క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించిన సీఎం.. వరదల వల్ల  వాటిల్లిన నష్టాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు అవసరమైన తక్షణ సాయం చేస్తామని, వరద సహాయక చర్యల్లో సహకారం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి  రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో నేరుగా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

]]>
Mon, 02 Sep 2024 13:29:08 +0530 admin
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల పరిస్థితి పై అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన బండి సంజయ్ https://prajakshethrenews.com/తెలంగాణలో-కురుస్తున్న-భారీ-వర్షాల-పరిస్థితి-పై-అమిత్-షా-దృష్టికి-తీసుకెళ్లిన-బండి-సంజయ్ https://prajakshethrenews.com/తెలంగాణలో-కురుస్తున్న-భారీ-వర్షాల-పరిస్థితి-పై-అమిత్-షా-దృష్టికి-తీసుకెళ్లిన-బండి-సంజయ్ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల పరిస్థితి పై అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన బండి సంజయ్ 

ఖమ్మం లో వరద ముంపుకు గురైన 110 గ్రామాలు 

ప్రకాష్ నగర్ గుట్టపై చిక్కుకున్న 9 మంది 

అజ్మీరాతండ గుట్టపైన చిక్కుకున్న 68 మంది

బిల్డింగులపైన చిక్కు కున్న 42 మంది

అమిత్ షా ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా దృష్టికి కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి  బండి సంజయ్ తీసుకువెళ్లారు.ఖమ్మం జి ల్లాలో 110 గ్రామాలు ముంపునకు గురవడంతోపాటు పట్టణంలోని ప్రకాశ్ నగర్ గుట్టపై 9 మంది, పాలేరు నియోజకవర్గంలోని అజ్మీరాతండ గుట్టపైన 68 మంది, బిల్డింగులపైన 42 మంది చిక్కుకున్న విషయాన్ని అమిత్ షాకి వివరించారు.తెలంగాణలో ప్రాణ నష్టం లేకుండా తక్షణమే అన్ని చర్యలు తీసుకోవాలని అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ ను ఆదేశించారు. చెన్నై, వైజాగ్, అసోం నుండి 3 చొప్పున, మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెలంగాణకు పంపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో సహాయక చర్యలు, తెలంగాణలో పరిస్థితి పై వారిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

]]>
Mon, 02 Sep 2024 00:19:47 +0530 admin
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు https://prajakshethrenews.com/ఎమ్మెల్సీ-కవితకు-బెయిల్-మంజూరు https://prajakshethrenews.com/ఎమ్మెల్సీ-కవితకు-బెయిల్-మంజూరు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు

ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట

ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో

ఢిల్లీ లిక్కర్​స్కామ్​కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటీషన్​ పై జస్టిస్​ బీఆర గవాయి, జస్టిస్​ విశ్వనాథన్​ ధర్మాసనం విచారణ చేపట్టింది. గంట పాటు సాగిన సుధీర్ఘ వాదనల అనంతరం ద్విసభ్య ధర్మాసనం కవితకు రూ.10లక్షల పూచీ కత్తు, పాస్ పోర్ట్​ అప్పగించాలని, సాక్ష్యులను ఎట్టి పరిస్థితుల్లోను ప్రభావితం చేయకూడదని సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సాయంత్రం 5గంటలలోపు ట్రయల్​కోర్టు నుంచి తీహు జైలుకు ఆదేశాలు చేరితే కవిత మంగళవారం సాయంత్రం 7గంటల వరకు విడుదల అయ్యే అవకాశ ఉంది. ప్రాసెస్​లో ఆలస్యమయితే మాత్రం రేపు విడుదల అయ్యే అవకాశం ఉంది. మార్చి 15 వ తేదీన  ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్​ేసింది. 166 రోజులుగా తీహారు జైలులో ఉన్న కవితకు బెయిల్ రావడంతో  బీఆర్​ఎస్​ శ్రేణులలో ఆనందానిి అవధులు లేకుండా పోయింది.  

]]>
Tue, 27 Aug 2024 20:48:50 +0530 admin
తెలంగాణలో జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌కాశం ఇవ్వండి https://prajakshethrenews.com/తెలంగాణలో-జాతీయ-అంతర్జాతీయ-క్రీడల-నిర్వహణకు-అవకాశం-ఇవ్వండి https://prajakshethrenews.com/తెలంగాణలో-జాతీయ-అంతర్జాతీయ-క్రీడల-నిర్వహణకు-అవకాశం-ఇవ్వండి తెలంగాణలో జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌కాశం ఇవ్వండి

 స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి ఆర్థిక స‌హాయం అంద‌జేయండి

 క్రీడా సంస్థ‌ల అప్‌గ్రెడేష‌న్ డీపీఆర్‌ల‌ను ఆమోదించండి

 కేంద్ర క్రీడా శాఖ మంత్రి మ‌న్‌సుఖ్‌ మాండ‌వీయ‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి

ప్రజాక్షేత్ర్ , నేషనల్​ బ్యూరో

జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల‌న్నీ తెలంగాణ‌లో ఉన్నాయ‌ని, భ‌విష్య‌త్తులో ఆసియ‌న్ గేమ్స్‌, కామ‌న్‌వెల్త్ గేమ్స్ తెలంగాణ‌లో నిర్వ‌హించే అవ‌కాశం ఇప్పించాల‌ని, 2025 జ‌న‌వ‌రిలో నిర్వ‌హించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు వేదికగా హైద‌రాబాద్‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కేంద్ర క్రీడ‌లు, యువ‌జ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వీయ‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ , రాష్ట్ర ప‌ర్యాట‌క‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు లతో కలిసి ముఖ్యమంత్రి శుక్రవారం సాయంత్రం కేంద్ర క్రీడా శాఖ మంత్రి మాండవీయ తో సమావేశమయ్యారు.తెలంగాణ యువ‌తలోని క్రీడా నైపుణ్యాల‌ను వెలికితీసేందుకు  స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు కేంద్ర మంత్రి మాండ‌వీయ‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.  స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీల్లో అన్ని ర‌కాల క్రీడ‌ల‌కు సంబంధించిన శిక్ష‌ణ‌, ప‌రిశోధ‌న‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు. ఈ నేప‌థ్యంలో స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి అవ‌స‌ర‌మైన ఆర్థిక స‌హాయం అంద‌జేయాల‌ని కేంద్ర మంత్రి మాండ‌వీయ‌కు ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి ఖేలో ఇండియా ప‌థ‌కం కింద నిధులు విడుద‌ల‌ను పెంచాల‌ని కేంద్ర మంత్రి మాండ‌వీయ‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలోని  జీఎంసీ బాల‌యోగి స్టేడియం,  సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలోని (UoH) షూటింగ్ రేంజ్‌, ఎల్ బీ స్టేడియం, హ‌కీంపేట‌లోని స్పోర్ట్స్ స్కూల్‌, స‌రూర్ న‌గ‌ర్ ఇండోర్ స్టేడియంల‌లో మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి తాము ఇప్ప‌టికే పంపించిన  డీపీఆర్‌ల‌ను ఆమోదించాల‌ని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

]]>
Sat, 24 Aug 2024 20:25:58 +0530 admin
Nirmala Sitaraman | ఉచిత పథకాల పేరిట భావితరాలపై భారం మోపొద్దు.. తేల్చి చెప్పిన విత్త మంత్రి నిర్మలమ్మ..! https://prajakshethrenews.com/nirmala-sitaraman-ఉచిత-పథకాల-పేరిట-భావితరాలపై-భారం-మోపొద్దు-తేల్చి-చెప్పిన-విత్త-మంత్రి-నిర్మలమ్మ https://prajakshethrenews.com/nirmala-sitaraman-ఉచిత-పథకాల-పేరిట-భావితరాలపై-భారం-మోపొద్దు-తేల్చి-చెప్పిన-విత్త-మంత్రి-నిర్మలమ్మ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివిధ వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఉచిత పథకాల్లో స్థిరత్వం తేవాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఉచిత పథకాల అమలుతో భవిష్యత్ తరాలపై భారం మోపవద్దని తెలిపారు. ‘మీరు (రాజకీయ పార్టీలు) ప్రకటించే ఉచిత పథకాలను ఈనాడు సమర్ధించుకోవచ్చు. కానీ ప్రజాభిప్రాయం ప్రకారం పన్నుచెల్లింపుదారులకు జవాబుదారీగా ఉండాలి. మీరు కొందరు వ్యక్తుల నుంచి పన్ను వసూలు చేసి మరికొందరికి ఇస్తున్నారు. ఉచిత పథకాలకు అర్హులై ఉండాలి’ అని పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ సమర్పించిన మరుసటి రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఏది ఏమైనా, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం నుంచి తాగునీరు, విద్యుత్, ప్రాథమిక ఆరోగ్యం, విద్యారంగాలకు సరిపడా నిధులు కేటాయించాలని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాల నుంచి ఎవరైనా లబ్ధి పొందొచ్చు, కానీ ఇతర పన్ను చెల్లింపు దారులపై ప్రతికూల ప్రభావం ఏర్పడకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. నగదు బదిలీ పథకం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర ఐదు హామీలతో గతేడాది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సంగతిని ఆమె గుర్తుచేశారు. ‘కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడండి. అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధుల్లేవని చెప్పకుండా ఎన్నికల హామీలను తప్పనిసరిగా గౌరవించాలి’ అని అన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి, పురుషులపై బస్సు ప్రయాణ చార్జీలు రెట్టింపు చేయడం వల్ల కుటుంబాలపైనే భారం పడుతుందని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ఉచిత పథకాలపై నిజాయితీతో కూడిన చర్చ జరుగాలన్నారు. ‘ఉచితాలపై మీరు నిజాయితీగా చర్చ పెట్టండి. మీరు ఇచ్చే ఉచిత పథకం ఆమోద యోగ్యం కాదని అంత తేలిక్కాదు. నేను అమలు చేసే సంక్షేమ పథకాన్ని సమర్ధించుకోవాలి’ అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టుతోపాటు వివిధ విధాన నిర్ణేతలు తరుచుగా ఉచిత పథకాలు, సంక్షేమ పథకాల మధ్య తేడాలు చెప్పడం చాలా కష్టం అని చెబుతున్నారు.

]]>
Fri, 26 Jul 2024 01:53:07 +0530 admin