Prajakshethre News & : తెలంగాణ https://prajakshethrenews.com/rss/category/తెలంగాణ-వార్తలు Prajakshethre News & : తెలంగాణ en Copyright 2024 Prajakshethre News & All Rights Reserved. ఛత్రినాకలో రెడ్మిక్సర్ వాహనంపై పడ్డ విద్యుత్ ఇనుప స్తంభం https://prajakshethrenews.com/ఛత్రినాకలో-రెడ్మిక్సర్-వాహనంపై-పడ్డ-విద్యుత్-ఇనుప-స్తంభం https://prajakshethrenews.com/ఛత్రినాకలో-రెడ్మిక్సర్-వాహనంపై-పడ్డ-విద్యుత్-ఇనుప-స్తంభం ఛత్రినాకలో రెడ్మిక్సర్ వాహనంపై పడ్డ విద్యుత్ ఇనుప స్తంభం

 

పాతబస్తీ ఛత్రినాక మేనకాథియేటర్ వద్ద జరుగుతున్న సి.సి రోడ్డు పనుల నిమిత్తం కాంక్రీట్తో చేరుకున్న రెడ్ మిక్సర్ వాహనం పై 11కెవి సరఫరా అవుతున్న విద్యుత్ ఇనుప స్తంభం పడడంతో పెనుప్రమాదం తప్పింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం పాతబస్తీ మేనకాథియేటర్ వద్ద సి.సి రోడ్డు పనులు జరుగుతున్నాయి. దీనికి కావాల్సిన కాంక్రీట్ తో రెడ్ మిక్సర్ వాహనం అక్కడికి చేరుకుంది. అయితే ఇరుకైన గల్లీలు... రోడ్డుపై అడ్డందిడ్డంగా ఉన్న ఇనుప స్తంభాల కారణంగా రెడ్ మిక్సర్ వాహనం గల్లీలోకి రోడ్డు వేసే సమీప ప్రాంతంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా విద్యుత్ ఇనుప స్థంభం, వెర్లకు తగిలింది. 11కెవి సరఫరా అవుతున్న విద్యుత్ ఇనుప స్తంభం ఒక్కసారిగా రెడ్ మిక్సర్ వాహనంపై పడింది. ఆసమయంలో అక్కడ ఎవ్వరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

]]>
Sun, 01 Mar 2026 15:36:58 +0530 admin
ముఖేష్, నిఖిత దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన పీ ఎం. నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా https://prajakshethrenews.com/ముఖేష్-నిఖిత-దంపతులకు-వివాహ-శుభాకాంక్షలు-తెలిపిన-పీ-ఎం-నరేంద్ర-మోదీ-హోం-మంత్రి-అమిత్-షా https://prajakshethrenews.com/ముఖేష్-నిఖిత-దంపతులకు-వివాహ-శుభాకాంక్షలు-తెలిపిన-పీ-ఎం-నరేంద్ర-మోదీ-హోం-మంత్రి-అమిత్-షా బీజేపీ నాయకుడు ముఖేష్, నిఖిత దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన పీ ఎం. నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా

పాతబస్తీలో బీజేపీ కార్యకర్త  ముఖేష్, నిఖిత ల వివాహం సందర్భంగా అరుదైన గౌరవం దక్కింది.బీజేపీ శాలిబండ డివిజన్ మాజీ అధ్యక్షుడు కరన్ కోట్ నాగేకార్ ముఖేష్ నిజామాబాద్ కి చెందిన నికిత తో ఇటీవల వివాహం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ అగ్ర నాయకత్వం నుండి ప్రత్యేక శుభాకాంక్షలు అందాయి. సాధారణ కార్యకర్త పంపిన ఆహ్వానానికి స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లు ప్రత్యేకంగా లేఖల ద్వారా నవ దంపతులను ఆశీర్వదిస్తు  ఒక సాధారణ కార్యకర్తకు పంపడం అనేది పార్టీలో కార్యకర్తలకు లభించే అపారమైన విలువను, గౌరవాన్ని స్పష్టం చేస్తోందని బీజేపీ శ్రేణులు పేర్కొన్నాయి. దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్తను బీజేపీ నాయకత్వం గుర్తించి, ప్రోత్సహిస్తుందనడానికి ఈ సంఘటన ఒక బలమైన నిదర్శనమని పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

]]>
Thu, 27 Nov 2025 20:07:59 +0530 admin
రేపు కేసీఆర్, కేటీఆర్‌కూ నా పరిస్థితే...హరీష్‌దే కుట్ర : కవిత https://prajakshethrenews.com/రేపు-కేసీఆర్-కేటీఆర్కూ-నా-పరిస్థితేహరీష్దే-కుట్ర-కవిత https://prajakshethrenews.com/రేపు-కేసీఆర్-కేటీఆర్కూ-నా-పరిస్థితేహరీష్దే-కుట్ర-కవిత రేపు కేసీఆర్, కేటీఆర్‌కూ నా పరిస్థితే...హరీష్‌దే కుట్ర : కవిత

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ : 

హరీష్ రావు కుట్రలో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపేలా చేశారని కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావును పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. రేపు కేసీఆర్, కేటీఆర్ లను కూడా తన లాగే పార్టీ నుంచి బయటకు పంపుతారని.. పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకుంటారని కవిత జోస్యం చెప్పారు. కాళేశ్వరం విషయంలో హరీష్ భారీ స్కాం చేశారని, ఆ డబ్బులతో ఎమ్మెల్యే అభ్యర్థులకూ ఫండింగ్ చేశారని అన్నారు. కేటీఆర్ ను ఓడించడానికి హరీష్ రావు సిరిసిల్లకు "అరవై లక్షల" రూపాయలు పంపించాడన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్, హరీష్ రావు ఒకే ఫ్లైట్‌లో వెళ్లారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ కు, హరీష్ రావు పూర్తి స్థాయిలో సరెండర్ అయ్యారని, హాస్టళ్లకు హరీష్ రావు డెయిరీ నుంచి పాలు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. అందరిపై కేసులు పెడుతూంటే..ఒక్క హరీష్ పైనే ఎందుకు చిన్న కేసు కూడా పెట్టలేదని కవిత ప్రశ్నించారు. కేసీఆర్ వెంట..హరీష్ మొదటినుంచి లేరన్నారు. టీడీపీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తూంటే హరీష్ ఆపారని ఆరోపించారు. పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడు హరీష్ రావు వైఎస్ ను కూడా కలిశారన్నారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదని, డబుల్ షూటర్ అని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌లకు హాని కలిగించే పనులు తాను చేయబోనని స్పష్టం చేశారు. ఎంతో నష్టం జరుగుతున్నా హరీష్ , సంతోష్‌లను ఎందుకు ప్రోత్సహిస్తున్నారన్నదే తన ఆవేదన అని చెప్పారు. సంతోష్ రావు వల్ల రామన్నకు చెడ్డపేరు వచ్చిందన్నారు. బంగారు తెలంగాణ అంటే హరీష్,సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే..బంగారు తెలంగాణ అవుతుందా అని ప్రశ్నించారు. ఏ పని అయినా చెడగొట్టడానికే సంతోష్ రావు ఉంటారన్నారు. సంతోష్ రావు మోకిలాలో 750 కోట్ల ప్రాజెక్టును చేపట్టారన్నారు. గ్రీన్ ఇండియా పేరుతో నకిలీ కార్యక్రమం పెట్టి ఫారెస్ట్ ను కొట్టేయాలని కుట్ర చేశారన్నారు.

కడు ఉండాలి వీడు వాడే..?..సంతోష్ రావు ధన దాహానికి అడ్డు అదుపు లేదు.!..

టార్చర్ చేసింది సంతోష్ చెడ్డ పేరు మాత్రం కేటీఆర్ కు వీరు ఇద్దరు మేక వన్నె పులులు..హరీష్ రావు మీడియాను మేనేజ్ చేస్తే, రాం అన్న యూట్యూబ్ ను మేనేజ్ చేస్తారు.

750 కోట్ల విల్లా ఎక్కడిది తనికి? 

తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ, కేసీఆర్ మరో మేనల్లుడు అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ మీద కూడా కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సంతోష్ రావు దన దాహానికి అడ్డు అదుపు లేదు. సిరిసిల్ల ఇసుక లారీ కేసులో దళితులను టార్చర్ చేసింది సంతోష్, చెడ్డ పేరు మాత్రం కేటీఆర్ కు ఇచ్చారు. ముందులో మంచింగ్ చేయడానికి ఒకడు ఉండాలి వీడు వాడే. అంటూ కవిత తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.సంతోష్‌కు ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు. ఇప్పుడు షాట్. ఇది నాకు చెప్పింది పల్లా రాజేశ్వర్ రెడ్డి. 750 కోట్ల విల్లా ఎక్కడిదితనికి? నవీన్ రావు ఎమ్మెల్సీకి పదవి ఎలా వచ్చింది..సంతోష్ వాళ్ళ. హరీష్ రావు, సంతోష్ రావులు తలో వర్గం మేంటేయిన్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ లతో కుమ్మక్కు అయి బిఆర్ఎస్ ఓడిపోయేలా చేశారు. చివరకు కెసిఆర్ కామారెడ్డిలో ఓడిపోయేలా చేశారు. హరీష్ రావు మీడియాను మేనేజ్ చేస్తే, రాం అన్న యూట్యూబ్ ను మేనేజ్ చేస్తారు. రాం అన్నకు చెప్తున్న నువ్వు కూడా హరీష్ రావు లాగా నేర్చుకో. కూతురిగా చెప్తున్న వీళ్ళను పార్టీలో ఉంచుకుంటే వీళ్లు మిమ్మల్ని కూడా మింగేస్తారు. వీరు ఇద్దరు మేక వన్నె పులులు. అంటూ కవిత, కేసీఆర్ మేనల్లుళ్లు అయిన హరీశ్ రావు, సంతోష్ రావు లపై ధ్వజమెత్తారు.

]]>
Wed, 03 Sep 2025 23:15:53 +0530 admin
ఓటు చోరీ కాదు… రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు https://prajakshethrenews.com/ఓటు-చోరీ-కాదు-రాహుల్-గాంధీ-బ్రెయిన్-చోరీ-బీజేపీ-రాష్ట్ర-అధ్యక్షుడు-రాంచందర్-రావు https://prajakshethrenews.com/ఓటు-చోరీ-కాదు-రాహుల్-గాంధీ-బ్రెయిన్-చోరీ-బీజేపీ-రాష్ట్ర-అధ్యక్షుడు-రాంచందర్-రావు ఓటు చోరీ కాదు… రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ
* బీజేపీ గెలిస్తే ఓటు చోరీ, కాంగ్రెస్ గెలిస్తే మాత్రం కాదా? ఇదేం తీరు?
* కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం రజాకార్ల వారసుల కాళ్లు పట్టుకుని దాసోహం అవుతోంది
* కాంగ్రెస్‌కి మెజారిటీ లేకపోయినా, తెలంగాణా బిల్లు ఆమోదం పొందింది బీజేపీ మద్దతుతోనే.
 * సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్ వంటి నాయకుల కృషి వల్లే తెలంగాణా సాధ్యమైంది
* గతంలో నిజాం రాజు గొప్పోడు అని కేసీఆర్ పొగిడారు.
* తెలంగాణ ప్రజలపై నరమేధం చేసిన నిజాం ఎలా గొప్ప పాలకుడు?
* బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి బిజెపి తెలంగాణ అధ్యక్షులు  ఎన్. రాంచందర్‌ రావు డిమాండ్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ (నల్గొండ) :
సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం  నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో బిజెపి తెలంగాణ అధ్యక్షులు ఎన్.రాంచందర్‌ రావు  నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు నివాళి అర్పించారు.ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ నిజాం నిరంకుశత్వ పాలనలో గుండ్రాంపల్లిలో 26 మందిని రజాకార్లు దారుణంగా హతమార్చి బావిలో పడేసిన ఘటన మనకు మరిచిపోలేని విషాద ఘట్టం. ఆ అమరవీరుల, త్యాగధనుల కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. గుండ్రాంపల్లి గ్రామం సాహస చరిత్రకు ప్రతీక. ఇక్కడికి రావడం నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది.హైదరాబాద్ స్టేట్‌కు సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చింది.1947 ఆగస్టు 15న భారత్‌లో ఎక్కడైనా త్రివర్ణ పతాకం ఎగురుతుంటే, నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో మాత్రం ఎక్కడా భారత జెండా ఎగరలేదు. తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్నాటక జిల్లాలతో కూడిన హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం స్వతంత్ర ఇస్లామిక్ దేశంగా ఉంచాలని చూశాడు. కుదరని పక్షంలో పాకిస్తాన్‌తో కలుపుకోవాలని ప్రయత్నించాడు.నిజాం నిరంకుశత్వాన్ని ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు.. సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో ‘ఆపరేషన్ పోలో’ ద్వారా భారత సైన్యం హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేసింది. సెప్టెంబరు 17, 1948న తెలంగాణకు స్వాతంత్ర్యం లభించింది.ప్రజల ధైర్యం, సర్దార్ వల్లభభాయ్ పటేల్ కఠిన నిర్ణయం, ‘ఆపరేషన్ పోలో’లో భారత సైన్యం వీరోచిత పోరాటం వల్లే 1948 సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయాడు. తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది.ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే సర్దార్ వల్లభభాయ్ పటేల్ కృషి కారణమే. వారికి మనమంతా రుణపడి ఉన్నాం.సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవంగా జరపాలనే డిమాండ్ మొదట సీహెచ్. విద్యాసాగర్ రావు లేవనెత్తారు. ఆనాడు ఆయన సూచనతోనే అన్ని పార్టీ కార్యాలయాలకు ((కాంగ్రెస్, కమ్యూనిస్టు, తెలుగుదేశం, ఆ తదనంతరం టీఆర్ఎస్) వెళ్లి ఈ చరిత్రను వివరించాను.నేడు ఆ కార్యాలయాల్లో మూడు రంగుల జెండా ఎగురవేసి "జనగణమన" పాడుతున్నామంటే అది విద్యాసాగర్ రావు కృషి ఫలితం అని అన్నారు.. అందులో నేను భాగస్వామి కావడం గర్వకారణంగా ఉంది.కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను అధికారికంగా విముక్తి దినోత్సవంగా జరుపుతున్నాయి. కానీ సంతుష్టీకరణ రాజకీయాల కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు, తరువాత టీఆర్ఎస్–కాంగ్రెస్ ప్రభుత్వాలు వెనకడుగు వేశాయి.ఉద్యమ సమయంలో కేసీఆర్ సెప్టెంబర్ 17 అధికారికంగా జరుపుతానని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక వాగ్దానం నిలబెట్టుకోలేదు. ప్రజల ఆకాంక్షను వమ్ము చేశారు.బీజేపీ మాత్రమే ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతోంది.తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా జరగాలంటే.. 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే నన్నారు.. అది ఖాయం.నిజాం వ్యతిరేక పోరాటంలో భైరాన్‌పల్లి బురుజు, పరకాల అమరధామం, నిజామాబాద్ జైలు, నిర్మల్ సహా అనేక ప్రదేశాలు కీలక ఘట్టాలకు సాక్ష్యాలుగా నిలిచాయి.విమోచన దినోత్సవ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మజ్లిస్ భయంతో పెట్టడం లేదు. ఖాసీం రజ్వీ, రజాకార్ల వారసులకు కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీలు కవలపిల్లలవంటివి.నిజాం పాలనలో జరిగిన అకృత్యాలు మరువలేనివి. రజాకార్లు గుండ్రాంపల్లిపై దాడి చేసి ప్రజలను నీరు లేని బావిలో పడేసి సామూహిక దహనం చేశారు.తెలంగాణ మహిళలను వివస్త్రాలను చేసి బతుకమ్మ ఆడించారు. ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగాయి. ఒకేరోజు 96 మందిని హతమార్చారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటుంది కానీ కాంగ్రెస్ ఆలస్యం వల్ల వందలాది మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారన్నారు..తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కాదు. సోనియమ్మ వందలాది యువకులను బలితీసుకుంది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు.బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ తెచ్చామని చెబుతోంది. కానీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వారి ఎంపీలు హాజరే కాలేదు.కాంగ్రెస్‌కి మెజారిటీ లేకపోయినా, బిల్లు ఆమోదం పొందింది బీజేపీ మద్దతుతోనే. సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్ వంటి నాయకుల కృషి వల్లే సాధ్యమైంది.గతంలో నిజాం రాజు గొప్పోడు అని కేసీఆర్ పొగిడారు. కానీ తెలంగాణ ప్రజలపై నరమేధం చేసిన నిజాం ఎలా గొప్ప పాలకుడు? బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి.కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలన నిజాం తరహాలోనే నడుస్తోంది.కాంగ్రెస్ 42% ఇవ్వాల్సిన బీసీ రిజర్వేషన్లలో 10% ముస్లింలకు కట్టబెట్టాలని చూస్తోంది. ఎందుకంటే వారికి ఓవైసీల మద్దతు ముఖ్యం.తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువత చేసిన పోరాటాన్ని మరచిపోతున్నారు.తెలంగాణ సంపదను దోచుకున్నది బీఆర్ఎస్. అదే మాట స్వయంగా కేసీఆర్ కుటుంబ సభ్యురాలే చెబుతున్నారు. తెలంగాణ సొమ్మును దోచుకున్న డబ్బును సరిగ్గా పంచుకోలేకపోవడంతో ఈరోజు ఆ కుటుంబంలో గొడవలు అవుతున్నాయి. తెలంగాణ ప్రజల సంపదను దోచుకుని పాలనను విస్మరించిన పార్టీ బీఆర్ఎస్.నేడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కలెక్టర్లను బెదిరించి భూకబ్జాలు చేస్తున్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు నిజంగా తెలంగాణ ప్రజల శ్రేయస్సుపై చిత్తశుద్ధి ఉంటే, భారతదేశంపై గౌరవం ఉంటే సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలి. లేకుంటే ఆ అర్హత మీకు లేదు.ఓటు దొంగతనం జరిగిందని, అందుకే కాంగ్రెస్ ఓడిపోయిందని రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు విషయం ఓటు చోరీ కాదు… రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ. బీజేపీ గెలిస్తే ఓటు చోరీ, కాంగ్రెస్ గెలిస్తే మాత్రం కాదా? ఇదేంటి తీరు?కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం రజాకార్ల వారసుల కాళ్లు పట్టుకుని దాసోహం అవుతోంది.త్వరలో జూబ్లీహిల్స్ ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ మజ్లిస్ పార్టీకి చెందిన ఇండ్లలో ఒక్కో ఇంటిలో 60 నుండి వందల దొంగ ఓట్లు ఉన్నాయని వాస్తవం.మజ్లిస్ గెలిచే 7 నియోజకవర్గాల్లో ఒక్కో ఇంట్లో వందల దొంగ ఓట్లు ఉన్నాయి. రోహింగ్యాలు కూడా ఓటర్ల జాబితాలో ఉన్నారు. ఇది అసలు ఓటు చోరీ.రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటూ అబద్ధ ప్రచారం చేస్తున్నారు. అసలు ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ.హిందువులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకుంటుంది. కానీ ముస్లింలకు మాత్రం విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయ, మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటోంది.సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా జరిపి త్రివర్ణ పతాకం ఎగురవేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.తెలంగాణ విముక్తి చెంది భారతదేశంలో భాగమై, స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే దాని వెనుక అనేక మంది వీరుల త్యాగాలు ఉన్నాయి.అందుకే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బీజేపీ కృషి చేసింది, ఉద్యమించింది. తెలంగాణ విమోచన దినోత్సవం వల్లే తెలంగాణ ఉద్యమం కూడా బలపడింది.భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను రాష్ట్రంలోని అన్ని మండలాల స్థాయిలో ఘనంగా జరుపుతోంది. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను.

]]>
Tue, 02 Sep 2025 23:46:19 +0530 admin
తెలంగాణ సీఎం కాన్వాయ్ వెహికల్స్ మీద 18 చలాన్లు పెండింగ్ https://prajakshethrenews.com/తెలంగాణ-సీఎం-కాన్వాయ్-వెహికల్స్-మీద-18-చలాన్లు-పెండింగ్ https://prajakshethrenews.com/తెలంగాణ-సీఎం-కాన్వాయ్-వెహికల్స్-మీద-18-చలాన్లు-పెండింగ్ తెలంగాణ సీఎం కాన్వాయ్ వెహికల్స్ మీద 18 చలాన్లు పెండింగ్
ప్రజా క్షేత్ర్, , హైదరాబాద్ :
ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి కాన్వాయి లోని వాహానాలపై 18 ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు పెండింగ్ లో వున్నాయి. ఒకటే నెంబర్ ప్లేటుతో పలు వాహనాలు వున్నాయి. పలు వాహనాలు కాన్వాయ్ సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నట్లు గుర్తించారు. రాత్రిపూట సెక్యూరిటీ లేకుండా ఔటర్ రింగ్ రోడ్ మీద టీజీ 09 ఆర్ఆర్  0009 బీఎండబ్ల్యూ కారు చక్కర్లు కొడుతున్నట్లు నమోదయ్యింది.

]]>
Tue, 02 Sep 2025 23:36:50 +0530 admin
తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద మరణకాండలలో గుండ్రంపల్లి ఒకటి https://prajakshethrenews.com/తెలంగాణ-చరిత్రలోనే-అతి-పెద్ద-మరణకాండలలో-గుండ్రంపల్లి-ఒకటి https://prajakshethrenews.com/తెలంగాణ-చరిత్రలోనే-అతి-పెద్ద-మరణకాండలలో-గుండ్రంపల్లి-ఒకటి రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం, యువత వీరోచిత పోరాటం
*కాసిం రీజ్వీ రజాకార్ సైన్యం గుండ్రంపల్లి, వీరభైరానపల్లి, పర్కల, గొరాట వంటి గ్రామాలపై దాడి చేసి వందలాది అమాయకులను ఊచకోత కోసింది
*తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద మరణకాండలలో గుండ్రంపల్లి ఒకటిగా నిలిచింది
*గుండ్రంపల్లి అమరవీరులకు మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఘన నివాళ్ళు
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్ సెప్టెంబర్ 2 :
స్సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా నల్గొండ జిల్లా గుండ్రంపల్లి గ్రామంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన 300 మందికి పైగా అమరవీరులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు , మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్  నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ నర్సయ్య గౌడ్ ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,“రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం, యువత వీరోచిత పోరాటం చేసింది. కాసిం రీజ్వీ రజాకార్ సైన్యం గుండ్రంపల్లి, వీరభైరానపల్లి, పర్కల, గొరాట వంటి గ్రామాలపై దాడి చేసి వందలాది అమాయకులను ఊచకోత కోసింది. తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద మరణకాండలలో గుండ్రంపల్లి ఒకటిగా నిలిచింది” అని తెలిపారు.వీరభైరానపల్లి ఘటనలో 200 మంది, గుండ్రంపల్లిలో 350 మందికి పైగా, పర్కలలో 22 మంది (150 మంది గాయాలు), గొరాట గ్రామంలో 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు.అలాగే రజాకార్ల నేత ఖాసీం రీజ్వీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక విమానంలో పాకిస్తాన్‌కు పంపడం చరిత్రలో మరక అని వ్యాఖ్యానించారు. “సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభభాయ్ పటేల్ జోక్యంతో తెలంగాణ విముక్తి సాధ్యమైంది. అదే రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  జన్మదినం కూడా ఉండటం యాదృచ్చికం” అని అన్నారు.నల్గొండ జిల్లా రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్రబిందువుగా నిలిచిందని గుర్తు చేస్తూ, “ఈ ప్రాంతంలోని పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా గుండ్రంపల్లిలో జాతీయ స్థాయిలో అమర వీరుల స్ఫూర్తి చిహ్నం నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సెప్టెంబర్ 17ను అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా జరపాలి” అని ఆయన స్పష్టం చేశారు.బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత అమర వీరులు ప్రాణత్యాగం చేసిన ఈ నాలుగు ప్రాంతాల్లో అధికారికంగా స్మారక స్థూపాలు నిర్మించి, రాష్ట్ర స్థాయిలో విమోచన దినోత్సవాన్ని జరిపే కట్టుబాటు ఉందని ఈ సందర్భంగా తెలిపారు.

]]>
Tue, 02 Sep 2025 23:26:52 +0530 admin
కేసీఆర్, హరీష్ రావులకు ఊరట https://prajakshethrenews.com/కేసీఆర్-హరీష్-రావులకు-ఊరట https://prajakshethrenews.com/కేసీఆర్-హరీష్-రావులకు-ఊరట కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, సెప్టెంబర్ 2 : 
కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడం తెలిసిందే. దీనిపై మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ లో వీరికి స్వల్ప ఊరట లభించింది.
హైకోర్టు ఈ పిటిషన్ తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. అప్పటివరకూ (తదుపరి విచారణ తేదీ వరకు) వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ఏజీ తెలిపారు. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు, సీబీఐ దర్యాప్తునకు ఏ సంబంధం లేదని కోర్టుకు ఏజీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులు అవకతవకలు జరిగాయని, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని కేసును సీబీఐకి అప్పగించాలని ఆదివారం అర్ధరాత్రి శాసనసభలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేసు సీబీఐకి అప్పగిస్తున్నట్లు లేఖ సైతం రాశారు. అయితే సీబీఐకి కాళేశ్వరం కేసు దర్యాప్తును అప్పగించడంతో కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఏమాత్రం ప్రామాణికత లేని కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారని, సీబీఐ దర్యాప్తును నిలిపివేయాలని తమ పిటిషన్లో కోరారు. సోమవారం అత్యవసరంగా పిటిషన్ విచారణకు రాగా, విచారణను మంగళవారానికి (సెప్టెంబర్ 2కు) హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరినా కోర్టు అందుకు నిరాకరించింది.ఈ క్రమంలో హైకోర్టు మంగళవారం నాడు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు విచారించింది. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదికి వాయిదా వేసింది. కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. కాళేశ్వరంపై దర్యాప్తు కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని అడ్వకేట్
జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే సీబీఐ దర్యాప్తునకు, కాళేశ్వరం రిపోర్టుకు ఎలాంటి సంబంధం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా  సీబీఐ దర్యాప్తు చేపట్టరాదని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేపట్టడానికి బ్రేకులు పడ్డాయి.కేసు తదుపరి విచారణ అక్టోబర్ 7న కనుక అప్పటివరకూ ఎలాంటి చర్యలు చేపట్టవద్దన్న హైకోర్టు ఆదేశాలు పాటించాల్సి ఉంటుందని కేసీఆర్, హరీష్ రావు తరపున వాదనలు వినిపించిన లాయర్ అన్నారు. కమిషన్ రిపోర్టునే పరిగణనలోకి తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, అలాంటప్పుడు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టే అవకాశం ప్రస్తుతానికి లేదన్నారు.

]]>
Tue, 02 Sep 2025 22:07:47 +0530 admin
అంతా కావాలని చేసిన కవిత? https://prajakshethrenews.com/అంతా-కావాలని-చేసిన-కవిత https://prajakshethrenews.com/అంతా-కావాలని-చేసిన-కవిత అంతా కావాలని చేసిన కవిత? 
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్, సెప్టెంబర్ 2 : 
భారత రాష్ట్ర సమితి నుంచి కవితను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాలను పెద్దగా ఆశ్చర్యపరచలేదు. గత మే నెలలోనే కవిత కుటుంబంలో, పార్టీలో తిరుగుబాటు చేశారు. తనకు ప్రాధాన్యత లేకుండా
చేయడం, రాజకీయాల నుంచి విరమించుకోవాలని కుటుంబ పెద్దలు సలహాలు ఇవ్వడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. అందుకే అప్పటి నుంచి జాగృతి తరపున రాజకీయాలు చేయడం ప్రారంభిచారు. రాను రాను ఆ గ్యాప్ పెరిగిపోయింది. చివరికి పాతికేళ్ల పార్టీ ఆవిర్భావ సభ తర్వాత ఆమె కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు రావడంతో కవిత తిరుగుబాటు వ్యవహారం బహిరంగమయింది. తాను కేసీఆర్ కు రాసిన లేఖలు ఆయన చుట్టూ ఉందే దెయ్యాలే లీక్ చేశాయని ఆరోపించడం ప్రారంభించారు. అయితే కవిత .. కాంగ్రెస్ పార్టీతో కలిసి సొంత రాజకీయం చేస్తున్నారన్న అనుమానాలు బీఆర్ఎస్ పార్టీలో కొంత కాలం నుంచి ఉన్నాయి. దానికి  తగ్గ ఆధారాలు వారి దగ్గర ఉన్నాయో లేవో కానీ కవితపై ఎప్పుడూ దూకుడుగా మాట్లాడలేదు. విమర్శలు చేయలేదు. పార్టీ హైకమాండ్ ఆదేశాలతో సైలెంట్ గా ఉంటూనే వస్తున్నారు. అయితే కవిత మాత్రం తన రాజకీయాలు తాను జోరుగా చేసుకుంటున్నారు. కవిత చాలా ప్రణాళికా  బద్దంగా జాగృతిని రాజకీయ పార్టీగా మార్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నాయకత్వాన్ని పెంచుకున్నారు. కొత్త నేతలకు శిక్షణ ఇస్తున్నారు. నమ్మకమైన కార్యకర్తలను  దరి చేర్చుకున్నారు. ఇప్పుడు ఆమె సొంత రాజకీయాలు చేయాలంటే బలమైన కారణంతో ప్రజల ముందుకు రావాల్సింది. అందుకే కాళేశ్వరంపై సీబీఐ రిపోర్టును ఉపయోగించుకుని మీడియా ముందుకు
వచ్చారు. కేసీఆర్ పై చాలా అభిమానం చూపిస్తూ.. హరీష్, సంతోష్ లను టార్గెట్ చేశారు.హరీష్, సంతోష్‌లపై ఆరోపణలు చేసిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మరో మార్గం లేకుండా పోయింది.  కవితపై చర్యలు తీసుకుంటే..  హరీష్, కవితలకు గౌరవం ఇచ్చినట్లుగా.  తీసుకోకపోతే వారికి పార్టీలో ప్రాధాన్యత లేనట్లే అవుతుంది. కవిత సొంత పార్టీ కోసం రెడీ అయిపోయిన సమయంలో ఇద్దరు నేతల్ని వదులుకోలేరు.అందుకే కవితపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  ఇక బీఆర్ఎస్ పార్టీలో తనకు చోటు లేదని ఎప్పుడైన కవిత.. ఖచ్చితంగా ఇలాంటి ఎఫెక్ట్ కోసమే చూస్తున్నారు. తనంతట తాను బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంటే ఎఫెక్టివ్ గా ఉండదు..కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరవాత పార్టీ పెట్టుకుంటే ప్రజల్లో సానుభూతి వస్తుంది. ఆ గోల్ ను కవిత సాధించారు. కవిత ఇప్పుడు విక్టిమ్ కార్డు ప్రదర్శించవచ్చు. పార్టీని కేటీఆర్, హరీష్ ను నాశనం చేస్తున్నారని..తన తండ్రికి చెడ్డపేరు తెస్తున్నారని ప్రచారం చేసే అవకాశం ఉంది. ఆమెకు రాజకీయంగా ఎన్ని అవకాశాలు వస్తాయన్న సంగతిని పక్కన పెడితే .. కేసీఆర్ కుటుంబం మాత్రం రెండుగా చీలిపోయింది.          

]]>
Tue, 02 Sep 2025 21:59:14 +0530 admin
గీత దాటితే వేటు.. సంకేతాలు పంపిన కేసీఆర్ https://prajakshethrenews.com/గీత-దాటితే-వేటు-సంకేతాలు-పంపిన-కేసీఆర్ https://prajakshethrenews.com/గీత-దాటితే-వేటు-సంకేతాలు-పంపిన-కేసీఆర్ గీత దాటితే వేటు..
సంకేతాలు పంపిన కేసీఆర్

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ : 
తనకు ప్రాణసమానమైన కూతురిపై కేసీఆర్‌ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనక… చాలాకారణాలే కనిపిస్తున్నాయి. పార్టీ సైతం.. ఆ దిశగా నిర్ణయం తీసుకోవడానికి చాలా రీజన్సే కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ
కేసీఆర్‌ కూతురనో… పార్టీ ఆడకూతురనో.. ఆమె కామెంట్స్‌పై అధినేత సహా, పార్టీనేతలు సైతం పెద్దగా రియాక్ట్‌ కాలేదు. కానీ, ఇప్పుడు ఏకంగా కేటీఆర్‌, హరీష్‌, సంతోష్‌లాంటి పార్టీ అగ్రనాయకత్వంపై తీవ్రస్థాయిలో
విమర్శలు చేయడం.. పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడటం… అధినేతకు కోపం తెప్పించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, కాళేశ్వరం విషయంలోనూ ఆమె టంగ్‌ స్లిప్పవడం.. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. అంతా
హరీష్‌రావు, సంతోష్‌రావులే చేశారనీ.. వారివల్లే కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటుకున్నాయనీ… తీవ్ర వ్యాఖ్యలు చేసిన కవిత… పరోక్షంగా కాళేశ్వరంలో ఏదో తప్పు జరిగిందన్నట్టుగా మాట్లాడారన్న అభిప్రాయం
వ్యక్తమవుతోంది. అది ప్రత్యర్థులకు అస్త్రం అందేలా చేసిందని పార్టీ భావిస్తోంది.ఒక్క కేసీఆర్‌ తప్ప…. ఒకే ఒక్క కేసీఆర్‌ తప్ప…ఇదీ, కొన్నాళ్లుగా బీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో వినిపిస్తున్న కవితాగానం. కేసీఆర్‌ దేవుడే… ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో మొదలైన కలకలం… ఇక్కడి దాకా లాక్కొచ్చింది. కేసీఆర్‌ ఒక్కరిని మినహాయించి.. బీఆర్‌ఎస్‌లో మిగితా నేతలందరినీ ఆమె టార్గెట్‌ చేస్తున్న తీరు గులాబీసేనను ఇరకాటంలో పడేసిందనే చెప్పాలి. అందుకే అధిష్ఠానం కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలుస్తోంది.తెలంగాణ జాగృతిని స్థాపించి ఉద్యమ పార్టీతోనే కొన్నేళ్లుగా ప్రయాణం కొనసాగించిన కవిత… ఒకసారి నిజామబాద్‌ ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్సీగానూ అవకాశం ఇచ్చింది పార్టీ. పార్టీలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ల తర్వాత ఆస్థాయి నాయకురాలిగా కవితకు పేరుండేది. కానీ ఢిల్లీ లిక్కర్‌ కేసులో
అరెస్టయ్యాక, పరిస్థితి మారింది. ఈ కేసులో ఆర్నెళ్లకుపైగా జైళ్లో ఉన్న కవిత.. బెయిల్‌పై విడుదలయ్యాక అంతే స్పీడుతో రాజకీయంగా దూసుకొచ్చారు. అయితే, ఆ స్పీడు కాస్తా.. సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా చేసింది.ఏప్రిల్‌లో ఘనంగా బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సంబరాలు జరుపుకోగా… పార్టీ తీరును తప్పుబడుతూ కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖ మే 20న బహిర్గతం కావడం సంచలనం సృష్టించింది. ఆ సమయంలో అమెరికా పర్యటనలో ఉన్న కవిత… తిరిగొచ్చాక పెద్ద బాంబే పేల్చారు. అది రాసింది తానేననీ… అయితే అది ఎలా బయటకు వచ్చిందో తేలాలంటూ… పెద్ద బాంబే పేల్చారు. కేసీఆర్‌ దేవుడే కానీ… ఆయన చుట్టూతా కొన్ని దయ్యాలున్నాయంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై కేసీఆర్‌కు నోటీసులిస్తే… పార్టీ ఏం చేస్తోందంటూ.. నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కవిత. అంతేకాదు, కేసీఆర్‌ కాళేశ్వరం కమిషన్‌ ముందర హాజరయ్యేందుకు ముందు, సరిగ్గా ఒక్కరోజు ముందు…. గన్‌పార్క్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా కూడా చేశారు. తనపై కొందరు పార్టీలో కుట్రలు చేస్తున్నారంటూ… కవిత చేసిన వ్యాఖ్యలూ సంచలనమయ్యాయి. కర్మకు తగ్గ ఫలితం అనుభవిస్తారంటూ.. అప్పట్లో ఆమె చేసిన హెచ్చరిక సంచలనం రేపింది.పార్టీతో సంబంధం లేకుండా ఆమె చేపట్టిన కార్యక్రమాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. జాగృతికోసం ప్రత్యేకంగా ఆఫీసును ప్రారంభించిన ఆమె… ఇక బీఆర్‌ఎస్‌తో సంబంధం లేదన్నట్టుగానే ప్రోగ్రామ్స్‌ తీసుకున్నారు. బీసీల రిజర్వేషన్లయినా, ఇతర అంశాలైనా.. ఆమె సొంత ఎజెండాతో ముందుకు వెళ్లారు. అందుకే, ఇటీవల ఆమెను సింగరేణి పార్టీ అనుబంధం సంఘం బాధ్యతలనుంచి కూడా తప్పించారు. ఇలా వరుస పరిణామాల తర్వాత… ఆమె వ్యవహారశైలి మితిమీరినట్టుగా భావించిన గులాబీ బాస్‌… కూతురిపై బహిష్కరణ వేటు వేశారు.

]]>
Tue, 02 Sep 2025 21:51:10 +0530 admin
బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్... కొంతకాలం నుంచి కవిత ధిక్కార స్వరం.. https://prajakshethrenews.com/బీఆర్ఎస్-నుంచి-కవిత-సస్పెండ్-కొంతకాలం-నుంచి-కవిత-ధిక్కార-స్వరం https://prajakshethrenews.com/బీఆర్ఎస్-నుంచి-కవిత-సస్పెండ్-కొంతకాలం-నుంచి-కవిత-ధిక్కార-స్వరం బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్
కొంతకాలం నుంచి కవిత ధిక్కార స్వరం..
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, సెప్టెంబర్ 2 : 
అంతా ఊహించిందే జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసేందుకు పార్టీ అధినేత , కవిత తండ్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో పార్టీ క్రమశిక్షణా కమిటీ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నట్లు సోమభరత్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. గత కొంతకాలం నుంచి కవిత వ్యవహారం పార్టీకి నష్టం చేకూర్చేలా ఉందని బీఆర్ఎస్ నుంచి ఆమెపై వేటు వేశారు. కవిత చేసే వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు.ఎమ్మెల్సీ కవిత బిఆర్ ఎస్ లో కొనసాగుతూనే గత కొంత కాలంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏకంగా తన తండ్రి , బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించే స్దాయిలో ఆమె కామెంట్స్ పీక్స్ కు చేరుకున్నాయి. పార్టీలు దేయ్యాలు కేసీఆర్ ను నడిపిస్తున్నాయంటూ మొదలైన కవితధిక్కార స్వరం ,  అక్కడితో ఆగలేదు.. అనేకసార్లు పార్టీ విధానాలపై, పార్టీలో కీలక నేతలపైన తీవ్ర స్దాయిలో బహిరంగ విమర్శలు చేస్తూ వచ్చారు. తన తండ్రి దేవుడు అంటూనే ,కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉన్న నేతలపై విరుచుకుపడ్డారు.ఇన్నాళ్లు పార్టీలో కీలక నేతల పేర్లు ప్రస్తావించని కవిత, తాజాగా మాజీ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు, పార్టీలో నెంబర్ త్రీగా చెప్పుకునే హరీష్ రావుపై  మీడియా ముందు పేరు ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. కాలేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా అంటూనే, సంతోష్ , హరీష్ రావు కలసి,  తన తండ్రి కేసీఆర్ ను తప్పుదోవ పట్టించారని, వారివల్లనే కాలేశ్వరంలో అవినీతి మరకలు కేసీఆర్ కు  అంటుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి స్వార్ధం కోసమే కేసీఆర్ ను బలిచేశారని ఆరోపించడం తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ సునామీని సృష్టించారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి బిఆర్ ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ పార్టీ పరువు గంగలో కలిపినంత పనిచేశారు కవిత..కవిత వ్యాఖ్యల అనంతరం బీఆర్ఎస్ లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు భరించింది చాలు. కేసీఆర్ కూతురు కాబట్టే ఓపిక పట్టాం. ఇంక పంపేద్దాం ...పార్టీ నుండి. ఆమె మాకొద్దు మహా ప్రభో అంటూ తీవ్ర స్దాయిలో పార్టీ కేడర్ నుండి ముఖ్య నేతల నుండి కేసీఆర్ పై ఒత్తిడి పెరిగింది. మరోవైపు మీడియా సైతం కేసీఆర్ కూతురు కాబట్టే చర్యలు తీసుకోవడంలేదుంటూ ఉతికి ఆరేస్తోంది. ఈ నేపధ్యంలో రంగంలోకి దిగిన కేసీఆర్ ముఖ్యనేతలతో చర్చించి , ఓ క్లారిటీ వచ్చినట్లుగా సమాచారం. కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూతురు కదా అని ఊరుకుంటే, ఇన్నాళ్లు కాపాడుకున్న పార్టీకి భారీ నష్టం వాటిల్లే అవకాశం  ఉందని భావించిన , పార్టీ కంటే కూతురేం ఎక్కువ కాదనే నిర్ణయానికి  కేసీఆర్ వచ్చారు. పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసినట్లు ప్రకటనలో తెలిపారు. సస్పెండ్ చేయాడనికి కారణాలు చెబుతూ అటు కవితపై తీవ్ర స్దాయి విమర్శల జోలిికి వెళ్లకుండా,  పార్టీపై కవిత వ్యాఖ్యలకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నాం., ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాం అని స్పష్టత వచ్చింది.

]]>
Tue, 02 Sep 2025 21:45:50 +0530 admin
హరీష్, సంతోష్ వల్లే కేసీఆర్‌ పై మరకలు : ఎమ్మెల్సీ కవిత https://prajakshethrenews.com/హరీష్-సంతోష్-వల్లే-కేసీఆర్-పై-మరకలు-ఎమ్మెల్సీ-కవిత https://prajakshethrenews.com/హరీష్-సంతోష్-వల్లే-కేసీఆర్-పై-మరకలు-ఎమ్మెల్సీ-కవిత

హరీష్, సంతోష్ వల్లే కేసీఆర్‌ పై మరకలు : ఎమ్మెల్సీ కవిత

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి బీఆర్ఎస్ పార్టీలో అణుబాంబు వేశారు. కేసీఆర్ పై సీబీఐ విచారణకు ఆదేశించిన అంశంలో కడుపు రగిలి పోతోందని మీడియా ముందుకు వచ్చిన ఆమె, కేసీఆర్ పై మరకలు పడటానికి హరీష్ రావు, సంతోష్ రావే కారణం అని నేరుగా ఆరోపణలు చేశారు. వారిద్దదరూ తీవ్రమైన అవినీతికి పాల్పడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ కు డబ్బు యావ లేదని..కానీ హరీష్ , సంతోష్ లు మాత్రం భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు. అందుకే హరీష్ రావును గతంలో కేసీఆర్ నీటి పారుదల మంత్రిగా తొలగించారని కూడా కవిత గుర్తు చేసుకున్నారు. తన తండ్రి పై సీబీఐ కేసు నమోదు చేస్తే..కేసీఆర్ పరువుపోతే తనకు ఆవేదన ఉండదా? అని కవిత కంటతడి పెట్టుకున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. తాను ఇలా మాట్లాడుతూంటే తన వెనుక ఎవరో ఉన్నారని ఆరోపిస్తారని నిజానికి వారే రేవంత్ రెడ్డితో కలిసి తన తండ్రిపై కుట్ర చేస్తున్నారన్నట్లుగా మాట్లాడారు. కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి సభ్యులతో సమావశం అయ్యారు. హరీష్ రావు, సంతోష్ రావు వ్యక్తిగత స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఇద్దరు అధికారులు వందల కోట్లతో పట్టుబడ్డారని వారి వెనుక ఎవరున్నారో తేల్చాలన్నారు. అవినీతి ఆనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పై సీబీఐ కేసులు పెట్టే అంత పరిస్థితి వచ్చాక..పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, అని ప్రశ్నించారు. ఈ కేసులో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో పెను సంచలనానికి కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

]]>
Tue, 02 Sep 2025 00:04:28 +0530 admin
యూరియా పంపిణీపై రేపు అన్ని జిల్లా కలెక్టర్లతో సమీక్ష:మంత్రి జూపల్లి కృష్ణారావు https://prajakshethrenews.com/యూరియా-పంపిణీపై-రేపు-అన్ని-జిల్లా-కలెక్టర్లతో-సమీక్షమంత్రి-జూపల్లి-కృష్ణారావు https://prajakshethrenews.com/యూరియా-పంపిణీపై-రేపు-అన్ని-జిల్లా-కలెక్టర్లతో-సమీక్షమంత్రి-జూపల్లి-కృష్ణారావు యూరియా పంపిణీపై రేపు అన్ని జిల్లా కలెక్టర్లతో సమీక్ష : మంత్రి జూపల్లి కృష్ణారావు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ ఆగష్టు 26 :
 యూరియా కోసం రైతులు క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. యూరియా పంపిణీపై రేపు అన్ని జిల్లాల్లో సమీక్షిస్తామని అన్నారు. జూపల్లి మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కేంద్రప్రభుత్వం పంపిన యూరియానే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోందని, నానో యూరియా వాడాలని కేంద్రం చెప్తోందని తెలియజేశారు. నానో యూరియా వాడకంపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగలేదని, యూరియా కొరత ఉందని కేంద్రప్రభుత్వమే చెప్తోందని అన్నారు. అంతర్జాతీయ యుద్ధాల వల్ల దిగుమతి సమస్య ఉందని కేంద్రం చెప్తోందని, యూరియా కేటాయింపులో కేంద్రం సహకరించటం లేదని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

]]>
Wed, 27 Aug 2025 21:03:49 +0530 admin
బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి https://prajakshethrenews.com/బహరేన్-జైలు-నుంచి-ఐదుగురిని-విడిపించండి https://prajakshethrenews.com/బహరేన్-జైలు-నుంచి-ఐదుగురిని-విడిపించండి బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి
సీఎం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన నలుగురి తల్లులు, ఒకరి చెల్లెలు

ముగ్గురు నిజామాబాద్, ఒకరు జగిత్యాల, మరొకరు రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు

ప్రజా క్షేత్ర్, జగిత్యాల :

బహరేన్ లో రెండేళ్ళ జైలుశిక్ష విధించబడిన ఐదుగురు తెలంగాణ కార్మికుల కుటుంబ సభ్యులలో నలుగురి తల్లులు, ఒకరి చెల్లెలు సహాయం కోసం మంగళవారం హైదరాబాద్ లోని 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' ని ఆశ్రయించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సూచన మేరకు వారు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట అందరు కల్సి ఒక ఉమ్మడి వినతిపత్రం ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లు గల్ఫ్ కుటుంబాలను సీఎం ప్రజావాణి నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ వద్దకు తీసికెళ్లి సమస్య తీవ్రతను వివరించారు. వారి గోడు విన్న వెంటనే ఆమె సీఎంఓ లో కీలక అధికారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ వి. శేషాద్రి దృష్టికి ఈ సమస్యను తీసికెళ్లారు. గల్ఫ్ కుటుంబాల వెంట బొజ్జ అమరేందర్ రెడ్డి, బషీర్ అహ్మద్, మోత్కూరి నవీన్ గౌడ్, కొండ శ్రీనివాస్ తదితరులున్నారు.
గడువు తీరిన ఆహార ఉత్పత్తుల తేదీలను ఫోర్జరీ చేసి మార్చడం, నిల్వ, మార్కెటింగ్, అమ్మకం  చేసిన ఆహార భద్రతా కేసులో... ముగ్గురికి మూడేళ్లు, 19 మందికి రెండేళ్ల జైలుశిక్ష విధించిన  సంఘటన ఇటీవల బహరేన్ లో జరిగింది. వీరిలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నకిడి లింబాద్రి (డిచుపల్లి), కర్రోల్ల లక్ష్మినర్సింహ (మల్లారం), తిమ్మజడ సంతోష్ (తిర్మన్ పల్లి), జగిత్యాల జిల్లాకు చెందిన గోవింద్ రాకేష్ (రత్నాపూర్), రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బంటు బాబు (కొండాపూర్) అనే ఐదుగురు యువకులు ఉన్నారు. గోదాములో ఆహార ఉత్పత్తులపై లేబుళ్లు తొలగించి, కొత్త తేదీలతో స్టిక్కర్లు అతికించడానికి కంపెనీ యాజమాన్యం కార్మికులను ఉపయోగించి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టివేసిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం చెప్పినట్లు డ్యూటీ చేయడం, చేసేపని మంచో... చెడో అవగాహన లేకపోవడం ప్రవాసీ కార్మికుల పాలిట శాపమైందని వారు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని బహరేన్ లోని ఇండియన్ ఎంబసీ ద్వారా జైల్లో ఉన్న కార్మికులకు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) అందించాలని కోరారు. బహరేన్ లోని తెలంగాణ సామాజిక సేవకులు కోటగిరి నవీన్ ఇండియన్ ఎంబసీ ద్వారా సహాయం చేయడానికి ముందుకు వచ్చారని వారు తెలిపారు.
యజమాని ఒత్తిడి వలన అమాయకులైన కార్మికులు విధులు నిర్వర్తించిన విషయాన్ని గమనించాలని, ప్రత్యేక కేసుగా పరిగణించి వారికి 'క్షమాబిక్ష' లభించేలా చూడాలని బాధితుల కుటుంబ సభ్యులు నకిడి గంగామణి (డిచుపల్లి), కర్రోల్ల సరస్వతి (మల్లారం), తిమ్మజడ నర్సవ్వ (తిర్మన్ పల్లి), గోవింద్ విజయ (రత్నాపూర్), బట్టు
117 స్నేహ (కొండాపూర్) లు కోరుతున్నారు.

]]>
Wed, 27 Aug 2025 20:19:07 +0530 admin
హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ ప్రాంతం మాత్రమేనా!.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి https://prajakshethrenews.com/హైదరాబాద్-అంటే-కేవలం-హైటెక్-సిటీ-ప్రాంతం-మాత్రమేనా-కేంద్రమంత్రి-కిషన్-రెడ్డి https://prajakshethrenews.com/హైదరాబాద్-అంటే-కేవలం-హైటెక్-సిటీ-ప్రాంతం-మాత్రమేనా-కేంద్రమంత్రి-కిషన్-రెడ్డి హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ ప్రాంతం మాత్రమేనా!..
 కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్ ఆగష్టు 22 : 
 హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ ప్రాంతం మాత్రమేనా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  ప్రశ్నించారు.శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ    బిఆర్ఎస్, కాంగ్రెస్ పాలన వల్ల హైదరాబాద్ పరిస్థితి అస్తవ్యస్థంగా మారిందని కిషన్ రెడ్డి   తెలిపారు. హైదరాబాద్ లో రాత్రివేళ వీధి దీపాలు ఉండడం లేదని అన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ ప్రాంతం మాత్రమే కాదని, స్థిరాస్తి వ్యాపారం బాగా ఉన్న ప్రాంతాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించారని తెలియజేశారు. డ్రైనేజీల్లో పూడికలు తీయడం లేదని, మంచినీటి పైపులైన్లు వేయడం లేదని మండిపడ్డారు.హైదరాబాద్ ను విశ్వనగరం   చేస్తామని మాజీ సిఎం కెసిఆర్ అన్నారని, అంతకంటే ఎక్కువ అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారని చెప్పారు. జిహెచ్ఎంసికి నిధుల కొరత లేకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని, జిహెచ్ఎంసి పనులు చేసిన కాంట్రక్టర్లకు బిల్లులు చెల్లించటం లేదని విమర్శించారు. జిహెచ్ఎంసి పనులకు టెండర్లు వేసేందుకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.

]]>
Sat, 23 Aug 2025 00:00:53 +0530 admin
వినాయక చవితి కి కళాత్మక విగ్రహాలు సిద్ధం https://prajakshethrenews.com/వినాయక-చవితి-కి-కళాత్మక-విగ్రహాలు-సిద్ధం https://prajakshethrenews.com/వినాయక-చవితి-కి-కళాత్మక-విగ్రహాలు-సిద్ధం వినాయక చవితి కి కళాత్మక విగ్రహాలు సిద్ధం

 ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

శ్రీకాళహస్తి లో  వినాయక చవితి సందర్భంగా కళాకారుల కుంచె నుండి చక్కటి రంగులను సింగారించుకున్న కళాత్మక వినాయకుని విగ్రహాలు వినాయక చవితి  పండుగకు సిద్ధం అవుతున్నాయి. ఏడాదికి ఒకసారి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో సిద్ధం చేసే విగ్రహాలకు ఎనలేని గిరాకీ ఉన్నది. మట్టి విగ్రహాలు కన్నా  ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో  సిద్ధం చేసిన రంగు రంగుల వినాయక విగ్రహాలు అంటే  శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు,అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఇష్టం. వినాయక చవితి అంటేనే వీధి వీధినా అందమైన ప్రధమ గణాధిపతి వినాయక విగ్రహాలను ప్రతిష్టించడానికి పేద, ధనిక భేదము లేకుండా పోటీ పడుతుంటారు. వినాయక చవితి పండుగకు రకరకాల సైజుల్లో వినాయక ప్రతిమలకు రంగులు అలంకరించి వినాయక విగ్రహాలను విక్రయించటం చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది. శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీ  జాతీయ రహదారి ప్రక్కన వినాయక విగ్రహాలు అందరిని ఆకట్టుకునేలా  రాజస్థాన్ చెందిన కూలీలు సిద్ధం చేస్తున్నారు

]]>
Thu, 21 Aug 2025 12:26:06 +0530 admin
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుకు ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్ విడుదల https://prajakshethrenews.com/రాష్ట్రవ్యాప్తంగా-మద్యం-దుకాణాల-టెండర్ల-దరఖాస్తుకు-ఆబ్కారీ-శాఖ-నోటిఫికేషన్-విడుదల https://prajakshethrenews.com/రాష్ట్రవ్యాప్తంగా-మద్యం-దుకాణాల-టెండర్ల-దరఖాస్తుకు-ఆబ్కారీ-శాఖ-నోటిఫికేషన్-విడుదల రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుకు ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్ విడుదల
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ ;

తెలంగాణలో మద్యం దుకాణాల ఆశావాహులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుకు ఆబ్కారీ శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే, దరఖాస్తుల ఫీజు కూడా భారీగా పెంచేసింది. దరఖాస్తు పీజు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచినట్లు పేర్కొంది. వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2025 డిసెంబర్ నుంచి 27 నవంబర్ వరకు)కి కి సంబంధించి లాటరీ పద్దతి ద్వారా మద్యం దుకాణాల లైసెన్సులను ఎంపిక చేయనుంది. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించనుంది. మద్యం దుకాణాలకు 6 శ్లాబ్‌లలో ఎక్సైజ్‌శాఖ లైసెన్స్‌లు జారీ చేయనుంది.

]]>
Thu, 21 Aug 2025 12:23:24 +0530 admin
కృష్ణమ్మ పరవళ్లతో కళకళలాడుతున్న నాగార్జన సాగర్‌ https://prajakshethrenews.com/కృష్ణమ్మ-పరవళ్లతో-కళకళలాడుతున్న-నాగార్జన-సాగర్ https://prajakshethrenews.com/కృష్ణమ్మ-పరవళ్లతో-కళకళలాడుతున్న-నాగార్జన-సాగర్ కృష్ణమ్మ పరవళ్లతో కళకళలాడుతున్న నాగార్జన సాగర్‌    

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ : 

రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా భారీ వర్షాల కారణంగా ఓవైపు ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నా.. మరోవైపు జలాశయాలు మాత్రం జలకళను సంతరించుకుంటున్నాయి. నాగార్జన సాగర్‌   కూడా నీటితో నిండిపోయింది. శ్రీశైలం జలాశయం నుంచి వచ్చిన నీటి ప్రవాహంతో నాగార్జున సాగర్‌కు భారీగా నీరు వచ్చి చేసింది. దీంతో సాగర్ కృష్ణమ్మ పరవళ్లతో కళకళలాడుతుంది. ఈ సీజన్‌లో సాగర్‌‌కు 4.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడం ఇదే తొలిసారి. దీంతో అధికారులు మొత్తం 26 గేట్లను దాదాపు 10 అడుగుల పైకి ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇలా జరిగడం కూడా సాగర్ చరిత్రలో తొలిసారి కావడం విశేషం.గడిచిన మూడు రోజుల నుంచి వరద ప్రమాదం పెరుగుతుండటంతో నాగార్జున సాగర్   నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతుంది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ఇప్పటికే 584.80 అడుగులుగా నమోదైంది. నీటి నిల్వ సామర్థ్యం 312,0450 టిఎంసిలు కాగా.. ప్రస్తుతం 274,8580 టిఎంసిలుగా ఉంది.

]]>
Thu, 21 Aug 2025 12:20:32 +0530 admin
ఇక శ్రీశైలానికి తగ్గనున్న దూరం https://prajakshethrenews.com/ఇక-శ్రీశైలానికి-తగ్గనున్న-దూరం https://prajakshethrenews.com/ఇక-శ్రీశైలానికి-తగ్గనున్న-దూరం ఇక శ్రీశైలానికి తగ్గనున్న దూరం
ప్రజా క్షేత్ర్, మహబూబ్ నగర్, ఆగస్టు 14 :
హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో నాలుగు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 7,668 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ ఏరియా మీదుగా ఈ కారిడార్ నిర్మించనుండటం వల్ల పర్యావరణపరంగా కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని స్వల్ప మార్పులతో ఈ ప్రాజెక్టుకు త్వరలోనే కేంద్రం తుది ఆమోదం తెలిపే అవకాశముంది.ప్రతిపాదిత రహదారి పొడవు 54.915 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్ రహదారి పొడవు 45.19 కిలోమీటర్లు కాగా, మిగిలిన 9.725 కిలోమీటర్ల మేర సాధారణ రోడ్డు ఉంటుంది. ఈ రహదారిని దాదాపు 30 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో 300 మీటర్ల మేర వయాడక్ట్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌-శ్రీశైలం మధ్య ప్రయాణ సమయం 45 నిమిషాల వరకు తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి ప్రారంభమై అమ్రాబాద్ మండలం మన్ననూరు, కుంచోనిమూల, దోమలపెంట గ్రామాల మీదుగా శ్రీశైలం పాతాళగంగ వరకు ఈ రహదారి విస్తరిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా దోమలపెంట-శ్రీశైలం మధ్య కృష్ణా నదిపై ఒక ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జిని కూడా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇరుకైన, ప్రమాదకరమైన ఘాట్ రోడ్లు, మలుపుల వల్ల వాహనాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ కొత్త కారిడార్ వల్ల ప్రయాణం సురక్షితంగా, వేగంగా ఉంటుంది. అంతేకాకుండా, నల్లమల అడవిలో వన్యప్రాణులు రహదారి ప్రమాదాల బారిన పడకుండా ఇది సహాయపడుతుంది.హైదరాబాద్-శ్రీశైలం మార్గం పర్యాటకానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ మార్గంలో శ్రీశైలం డ్యామ్, పుణ్యక్షేత్రంతో పాటు ఫర్హాబాద్ వ్యూ పాయింట్, టైగర్ సఫారీ వంటి పలు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కొత్తగా నిర్మించనున్న ఐకానిక్ వంతెన పర్యాటకులకు అదనపు ఆకర్షణగా నిలవనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-విజయవాడ తర్వాత అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఇది ఒకటి. పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణను చేపట్టారు. ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంతంరవాణా,
పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు.

]]>
Thu, 14 Aug 2025 11:32:30 +0530 admin
సాగర్ కు భారీ వరద పోటు https://prajakshethrenews.com/సాగర్-కు-భారీ-వరద-పోటు https://prajakshethrenews.com/సాగర్-కు-భారీ-వరద-పోటు సాగర్ కు భారీ వరద పోటు
ప్రజా క్షేత్ర్, నల్గొండ :
 నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు భారీ వరద ప్రవాహం పోటెత్తింది. దాంతో అధికారులు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసారు. ఇన్ ఫ్లో, 1,74,533 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 2,33,051 క్యూసెక్కులు . పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం : 589.30. పూర్తి స్థాయి సామర్ధ్యం : 312.0450 టీఎంసీలు. ప్రస్తుత సామర్థ్యం : 309.95 టీఎంసీలు

]]>
Wed, 13 Aug 2025 23:58:15 +0530 admin
ఒటిపి, ఒక బస్తా విధానాన్ని తొలగించాలి : మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ https://prajakshethrenews.com/ఒటిపి-ఒక-బస్తా-విధానాన్ని-తొలగించాలి-మాజీ-మంత్రి-హరీశ్-రావు-డిమాండ్ https://prajakshethrenews.com/ఒటిపి-ఒక-బస్తా-విధానాన్ని-తొలగించాలి-మాజీ-మంత్రి-హరీశ్-రావు-డిమాండ్ ఒటిపి, ఒక బస్తా విధానాన్ని తొలగించాలి
       మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్
ప్రజా క్షేత్ర్, సిద్ధిపేట ఆగష్టు 13 :
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యకం చేశారు. బుధవారం ఆయన సిద్ధపేట జిల్లా రాఘవాపూర్‌లో పర్యటించారు. ఎరువుల కోసం క్యూలో నిలబడిన రైతులను చూసి పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారను. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఒటిపి, ఒక బస్తా విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. సబ్సిడి ఇచ్చే విషయంలో తప్పించుకునేందుకే ప్రభుత్వం కృత్రిమ కొరతను సృష్టిస్తోందని ఆరోపించారు. ఎన్నికలు ఉన్నాయని బిహార్‌కు ఎరువులు తరలిస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపికి బుద్ధ చెప్పాలని పేర్కొన్నారు.అంతకు ముందు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి హరీశ్ రావు  లేఖ రాశారు. కాళేశ్వరం కింద ఉన్న జలాశయాలు నింపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. రైతుల కోసం ఆరో ప్యాకేజీ ఉణ్న మోటార్లు ఆన్ చేయలని కోరారు. జలాశయాల్లో నీరు నింపకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

]]>
Wed, 13 Aug 2025 23:24:23 +0530 admin
ఈడీ విచారణకు హజరయిన మంచు లక్ష్మి https://prajakshethrenews.com/ఈడీ-విచారణకు-హజరయిన-మంచు-లక్ష్మి https://prajakshethrenews.com/ఈడీ-విచారణకు-హజరయిన-మంచు-లక్ష్మి ఈడీ విచారణకు హజరయిన మంచు లక్ష్మి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
బెట్టింగ్ యాప్ కేసు విచార‌ణ‌లో భాగంగా న‌టి మంచు లక్ష్మి హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఉన్న‌ ఈడీ కార్యాల‌యం ముందుకు హాజ‌రైయారు.బెట్టింగ్ యాప్స్‌పై ప్రచారం కేసులో దాదాపు మూడు గంట‌ల పాటు ల‌క్ష్మిని ఈడీ విచారించింది. తాను ప్ర‌మోట్ చేసిన యోలో అనే యాప్ లావాదేవిల‌తో పాటు ఇత‌ర అంశాల‌పై లక్ష్మి స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. అలాగే యాప్ ప్ర‌మోట్ చేసినందుకు తీసుకున్న పారితోషికంపై ఈడీ ఆరా తీసింది. అనంత‌రం త‌న బ్యాక్ స్టేట్‌మెంట్లను లక్ష్మి ఈడీకి అందించింది. ఇక విచార‌ణ అనంతరం ల‌క్ష్మి ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చింది. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన వ్యవహారంలో భాగంగా విచారణకు రావాలని మంచు ల‌క్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్, రానా దగ్గుబాటిలను ఈడీ విచారించింది. దీనిలో భాగంగా ప్రకాశ్‌రాజ్‌ను 6 గంటలు, విజయ్‌దేవరకొండను 4 గంటలపాటు విచారించారు

]]>
Wed, 13 Aug 2025 23:21:05 +0530 admin
ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్‌ విమానాశ్రయంలో పలు విమానాలదారి మళ్లింపు https://prajakshethrenews.com/ప్రతికూల-వాతావరణం-నేపథ్యంలో-శంషాబాద్-విమానాశ్రయంలో-పలు-విమానాలదారి-మళ్లింపు https://prajakshethrenews.com/ప్రతికూల-వాతావరణం-నేపథ్యంలో-శంషాబాద్-విమానాశ్రయంలో-పలు-విమానాలదారి-మళ్లింపు ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్‌ విమానాశ్రయంలో పలు విమానాలదారి మళ్లింపు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ ఆగస్టు 13 :

శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆయా విమానాలను దారి మళ్లిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఎనిమిది విమానాలను దారి మళ్లించినట్లు తెలిపారు. హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను విజయవాడ, బెంగళూరు, తిరుపతికి మళ్లించినట్లు పేర్కొన్నారు. విజయవాడకు ఐదుకు, బెంగళూరుకు మూడు, తిరుపతికి ఒక విమానాన్ని మళ్లించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి బయలుదేరాల్సిన విమానాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నగరాన్ని మొత్తం కారు మేఘాలు కమ్మేశాయి. ఈ క్రమంలోనే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.

]]>
Wed, 13 Aug 2025 23:02:17 +0530 admin
బిసిలపై ప్రేమ ఉంటే.. కేంద్రం వెంటనే బిల్లును ఆమోదించాలి : సీ ఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/బిసిలపై-ప్రేమ-ఉంటే-కేంద్రం-వెంటనే-బిల్లును-ఆమోదించాలి-సీ-ఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/బిసిలపై-ప్రేమ-ఉంటే-కేంద్రం-వెంటనే-బిల్లును-ఆమోదించాలి-సీ-ఎం-రేవంత్-రెడ్డి బిసి రిజర్వేషన్లు 42 శాతం ఇవ్వాలన్నది మా కమిట్మెంట్
మా పోరాటాన్ని పూర్తి చేశాం.. ఇక, అంతా బిజెపి చేతిలోనే..
బిసిలపై ప్రేమ ఉంటే.. కేంద్రం వెంటనే బిల్లును ఆమోదించాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ ఆగస్టు 7 :
42 శాతం బిసి రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలోని జంతర్ మంతర్ లో చేపట్టిన ధర్నా అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఢిల్లీలో సిఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిసి రిజర్వేషన్లు 42 శాతం ఇవ్వాలన్నది మా కమిట్మెంట్ అని.. దానికి మా ఆఖరి పోరాటాన్ని నిన్నటితో పూర్తి చేశామని అన్నారు. కులగణన, రిజర్వేషన్ల సాధనలో మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరన్నారు. బిసిలపై ప్రేమ ఉంటే.. కేంద్రం వెంటనే బిల్లును ఆమోదించాలన్నారు. జంతర్ మంతర్ వేదికగా మా వాయిస్ ను బలంగా వినిపించామని, బిల్లుపై ఇక బిజెపి పార్టే నిర్ణయం తీసుకోవాలన్నారు. మా కమిట్మెంట్ కు విపక్షాల సర్టిఫికెట్ అవసరం లేదని.. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టడం బిఆర్ఎస్ నైజమని విమర్శించారు. ఒకవేళ బిసి బిల్లును కేంద్రం ఆమోదించకపోతే.. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

]]>
Thu, 07 Aug 2025 23:38:49 +0530 admin
రెండున్నర ఏళ్లలో బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది : కేటీఆర్ https://prajakshethrenews.com/రెండున్నర-ఏళ్లలో-బిఆర్ఎస్-పార్టీ-మళ్లీ-అధికారంలోకి-వస్తుంది-కేటీఆర్ https://prajakshethrenews.com/రెండున్నర-ఏళ్లలో-బిఆర్ఎస్-పార్టీ-మళ్లీ-అధికారంలోకి-వస్తుంది-కేటీఆర్ ఐఎఎస్ లు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు
రెండున్నర ఏళ్లలో బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ ఆగస్టు 7 : 

మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అవమానం జరిగిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి పరిస్థితి విచిత్రంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఐఎఎస్ లు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదని ఐఎఎస్ లు చెబుతున్నారని అన్నారు. ఐఎఎస్ లు రాజకీయాలు మాట్లాడడం సరికాదని విమర్శించారు. రెండున్నర ఏళ్లలో బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, గతంలోమాజీ సిఎం కెసిఆర్ 24 గంటలు విద్యుత్ ఇచ్చారని తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ అధికారం లోకి వచ్చాక అందరి లెక్కలు సరిచేస్తామని కెటిఆర్ సూచించారు.కెసిఆర్ పాలనలో అందరికి న్యాయం జరిగిందని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో జరిగిన మంచి పనులు కార్యకర్తలు చెప్పలేక పోయారని అందుకే ఓడిపోయామని ఆవేదనను వ్యక్తం చేశారు. కెసిఆర్ ను మళ్లీ సిఎం చేయడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో భూముల విలువలు తగ్గిపోయాయని, యూరియా కోసం చెప్పులు లైన్లలో పెట్టాల్సి వస్తోందని కెటిఆర్ ఎద్దేవ చేశారు. రుణమాఫీ విషయంలో రాష్ట్రప్రభుత్వం విఫలం చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఓట్లు ఉన్నప్పుడు కాదని.. నాట్లు వేసేటప్పడు రైతుబంధు వేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక ప్రభుత్వం రైతుబంధు ఎత్తేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలో చాలా మంది మోసపోయారని కెటిఆర్ మండిపడ్డారు.

]]>
Thu, 07 Aug 2025 23:35:10 +0530 admin
కేసీఆర్ ను తిట్టుడే రేవంత్ పని : హరీష్ రావు https://prajakshethrenews.com/కేసీఆర్-ను-తిట్టుడే-రేవంత్-పని-హరీష్-రావు https://prajakshethrenews.com/కేసీఆర్-ను-తిట్టుడే-రేవంత్-పని-హరీష్-రావు కేసీఆర్ ను తిట్టుడే రేవంత్ పని : హరీష్ రావు
ప్రజా క్షేత్ర్, మెదక్ :
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రెండు రకాల కమిషన్లకు అలవాటు పడ్డారు. ఒకటి ప్రతిపక్షంపై విచారణకు కమిషన్, రెండోది బిల్లులు ఇవ్వాలంటే మరో కమీషన్. కమిషన్లు, కేసులు, ఢిల్లీకి మూటలు మోయడమే సీఎం రేవంత్ పని. మేడిగడ్డను ఎండబెట్టి బనకచర్లకి గోదావరి జలాల తరలింపు కోసం సీఎం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎపి సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించడానికి కంకణం కట్టుకున్నాడు. సీఎం రేవంత్ బిల్లులు చెల్లించడానికి చేతకాక హాస్టళ్లల్లో ఏసీబీ తనిఖీలు చేయిస్తున్నారు. కమీషన్ కోసం రెండేళ్లుగా కోడిగుడ్డు టెండర్ ని పక్కన పెట్టారు.  ఈ 20 నెలల్లో మాజీ సీఎం కేసీఆర్ ని తిట్టుడే పనిగా సీఎం రేవంత్ పనిపెట్టుకున్నారు. ఇలా తిడితే ప్రజలు ఊరుకోరు...ఈ విషయం మీ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డినే చెప్పారు. ఈ విషయం మీ పార్టీ ఎమ్మెల్యేకి అర్థం అయ్యింది... సీఎంకి మాత్రం అర్థం కావడం లేదని అన్నారు.

]]>
Thu, 07 Aug 2025 14:52:36 +0530 admin
బీసీలను భ్రమ పెట్టేందుకు ఉత్తుత్తి ధర్నాలు : ఎమ్మెల్సీ కవిత https://prajakshethrenews.com/బీసీలను-భ్రమ-పెట్టేందుకు-ఉత్తుత్తి-ధర్నాలు-ఎమ్మెల్సీ-కవిత https://prajakshethrenews.com/బీసీలను-భ్రమ-పెట్టేందుకు-ఉత్తుత్తి-ధర్నాలు-ఎమ్మెల్సీ-కవిత బీసీలను భ్రమ పెట్టేందుకు ఉత్తుత్తి ధర్నాలు

కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత ఘాటు విమర్శలు?


ప్రజాక్షేత్ర్, హైదరాబాద్

బీసీల రిజర్వేషన్ల బిల్లు గురించి ప్రజలను భ్రమ పెట్టేందుకే ఢిల్లీలో కాంగ్రెస్‌ ధర్నా పేరుతో నాటకాలాడుతోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సామాజిక తెలంగాణ అంటే దిల్లీకి వెళ్లి వట్టిగా ధర్నాలు చేయడం కాదన్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని కార్యాలయంలో జాగృతి జెండాను ఆమె బుధవారం ఆవిష్కరించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. బీసీలకు ఇచ్చే 42 శాతం రిజర్వేషన్‌లో ముస్లింలు ఉండవద్దని ముందునుంచి బండి సంజయ్‌ మాట్లాడుతునే ఉన్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ బీసీలను మోసం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్క పార్టీతో జై తెలంగాణ అనిపించామని గుర్తుచేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జై తెలంగాణ అని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. బీసీల కోసం తాము హైదరాబాద్‌లో 72గంటలపాటు దీక్షకు పూనుకుంటే కోర్టు నుంచి అనుమతి రాలేదని తెలిపారు.కాంగ్రెస్‌ నాయకులు దిల్లీలో దొంగ దీక్షలు చేయడం కాదు, నిజమైన దీక్షలు చేయాలని హితవు పలికారు. జాగృతిలోకి వచ్చేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని.. తమకు అన్ని వర్గాల మద్దతు లభిస్తోందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. బీసీల కోసం కాంగ్రెస్‌, బీజేపీలు చిత్తశుద్ధితో పనిచేయటం లేదని మండిపడ్డారు. బీసీల కోసం జాగృతి కార్యచరణ సిద్ధం చేస్తుందని ప్రకటించారు. ముస్లిం రిజర్వేషన్లపై బండి సంజయ్‌ మాట్లాడడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్‌లపై రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ తీసుకొని అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకొని వెళ్లాలనీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్‌ చెప్పినట్లుగా వారి బాటలో తెలంగాణ జాగృతి ముందుకు వెళ్లిందని ఉద్ఘాటించారు. జయశంకర్‌ సార్‌ ఆలోచనలను తు.చ తప్పకుండా పాటించామని చెప్పుకొచ్చారు. తెలంగాణ చూడకుండానే ఆయన దూరం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జయంతి సందర్భంగా జాగృతి ఫౌండేషన్‌ డే జరుపుకుంటున్నామని తెలిపారు. సామాజిక తెలంగాణ కోసం పాటుపడాలని జయశంకర్‌ సార్‌ అనేకసార్లు చెప్పారని గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలని జయశంకర్‌ సార్‌ చెప్పేవారని పేర్కొన్నారు.

]]>
Wed, 06 Aug 2025 22:08:39 +0530 admin
వసతి గృహాలలో కామన్ మెనూ అమలు చేయండి https://prajakshethrenews.com/వసతి-గృహాలలో-కామన్-మెనూ-అమలు-చేయండి https://prajakshethrenews.com/వసతి-గృహాలలో-కామన్-మెనూ-అమలు-చేయండి వసతి గృహాలలో  ప్రభుత్వం ప్రవేశపెట్టిన కామన్ మెనూ అమలుకావడం లేదు
తెలంగాణ రాష్ట్ర ఈబిసి సంఘం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ ఆగష్టు 4 :
;ప్రభుత్వం ప్రవేశపెట్టిన కామన్ మెనూ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్ నల్లగొండ నిజాంబాద్ మెదక్ వంటి జిల్లాల లలో  ఏమాత్రం అమలు కావడం లేదని  తెలంగాణ రాష్ట్ర ఈబిసి సంఘం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రబాకర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తమ సంగం సభ్యుల బృందం స్వయంగా వసతి గృహాలను సందర్శించి విద్యార్థులతో మమేకమై మెనూ అమలు తీరును తెలుసుకున్నట్లు తెలిపారు. పిల్లలకు రోజువారి మెనూ అమలులో పూర్తిగా వైఫల్యం చెందిందని మంత్రికి చెప్పడం జరిగిందని తెలిపారు. జిల్లా సంబంధిత సంక్షేమ అధికారులకు దృష్టికి తీసుకు వెళ్లిన కనీసం స్పందించడం లేదని మంత్రికి వినతిపత్రం ద్వారా తెలియపరచడం జరిగిందన్నారు.మెనూ అమలు తీరు పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన మాజీ డిజిపి పర్యవేక్షణ లో  ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది  బీసీ సంక్షేమ జిల్లా అధికారులు  కొంతమంది మెనూ అమలయితలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లితే ఆ సంబంధిత అధికారులను చరవాణి ద్వారా సంప్రదించిన ఆ కలెక్టర్లని తప్పుడు పట్టించిన దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు.అంటే పరిస్థితి ఎంతవరకు ఉందో గమనించాలని మంత్రి కి చెప్పడం జరిగింది. సమస్య ను పరిష్కరిస్తామని  మంత్రి హామీ ఇవ్వడం జరిగిందని ప్రబాకర్ రెడ్డి తెలిపారు.మంత్రి ని  కలిసిన వారిలో రాజు, రమేష్, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.

]]>
Mon, 04 Aug 2025 22:49:02 +0530 admin
బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై బిజెపి పూర్తి మద్దతు : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు https://prajakshethrenews.com/బిసిలకు-42-శాతం-రిజర్వేషన్ల-అమలుపై-బిజెపి-పూర్తి-మద్దతు-బిజెపి-రాష్ట్ర-అధ్యక్షుడు-రామచందర్-రావు https://prajakshethrenews.com/బిసిలకు-42-శాతం-రిజర్వేషన్ల-అమలుపై-బిజెపి-పూర్తి-మద్దతు-బిజెపి-రాష్ట్ర-అధ్యక్షుడు-రామచందర్-రావు  *బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై బిజెపి పూర్తి మద్దతు* *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బిసి రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు* *బిసిలకు 42 శాతం బిల్లు పెట్టినప్పుడు ముస్లింలకు 10 శాతం ఇస్తామని చెప్పలేదు*

* ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆగ్రహం

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ ఆగష్టు 4 :
 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బిసి రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాపై  రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసిలకు 42 శాతం బిల్లు పెట్టినప్పుడు ముస్లింలకు 10 శాతం ఇస్తామని చెప్పలేదని అన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లో చేసినట్లే ఢిల్లీకి వెళ్లి నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే బిసిలకే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పాలని డిమాండ్ చేశారు.బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటే బిజెపి పూర్తి మద్దతిస్తుందని తెలియజేశారు. ముస్లింలకు 10 శాతం ఇస్తే, పదిశాతం బిసిలకు అన్యాయం జరుగుతుందని ఆవేదనను వ్యక్తం చేశారు. బిజెపి అడ్డుకుంటోందని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ను బిసిలు నమ్మరని అన్నారు. ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ఉద్దేశం లేదని, స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే పాత రిజర్వేషన్లే కొనసాగించాలనేది ఉద్దేశం అని రామచందర్ రావు పేర్కొన్నారు.

]]>
Mon, 04 Aug 2025 22:43:54 +0530 admin
హైదరాబాద్ లో కుండపోత వర్షం https://prajakshethrenews.com/హైదరాబాద్-లో-కుండపోత-వర్షం https://prajakshethrenews.com/హైదరాబాద్-లో-కుండపోత-వర్షం హైదరాబాద్ లో కుండపోత వర్షం
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, ఆగస్టు 4
హైదరాబాద్ సిటీలో హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. ఉదయం అత్యంత వేడితో కూడిన ఎండ ఉండగా..మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారింది. హఠాత్తుగా క్యూమూలో నింబస్ మేఘాలు కమ్ముకు వచ్చాయి.  హైదరాబాద్ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.  క్యూములో నింబస్ మేఘాలు శరవేగంగా కమ్ముకున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గాలులు కూడా వస్తాయన్నారు.   తమ ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని పలువురు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో  నగర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. అత్యవసరమైతే తప్ప  బయటకి రావొద్దన్న వాతావరణ శాఖ  సూచించింది.

]]>
Mon, 04 Aug 2025 22:32:16 +0530 admin
మూసీనది లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా అధికారులు https://prajakshethrenews.com/మూసీనది-లో-ఆక్రమణలను-తొలగించిన-హైడ్రా-అధికారులు https://prajakshethrenews.com/మూసీనది-లో-ఆక్రమణలను-తొలగించిన-హైడ్రా-అధికారులు మూసీనది లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా అధికారులు
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్‌ జూలై 29
 మూసీనది గర్భంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. చాదరఘాట్ బ్రిడ్జి నుంచి పాత బస్తీ ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు. ఈ స్థలాన్ని వాహనాల పార్కింగ్ కోసం ఆక్రమణ దారులు వినియోగిస్తున్నారు. చదును చేసి షెడ్డులు నిర్మించి కిరాయికి ఇస్తున్నారు కబ్జాదారులు. మూసీ ఆక్రమణలపై హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు చేపట్టారు. 3.10 ఎకరాల మేర కబ్జా చేసి షెడ్డు నిర్మించి అక్రమ వ్యాపారం చేస్తున్నారు ఆక్రమణ దారుడు తికారంసింగ్. అలాగే 1.30 ఎకరాల మేర కబ్జా చేశారు. ఆక్రమణ దారు పూనమ్ చాంద్ యాదవ్.5.22 ఎకరాల మేర కబ్జా చేశారు. జయకృష్ణ. కబ్జా చేసిన వారంతా అక్కడ షెడ్డులు వేసి.. వాటిని అద్దెకు ఇచ్చి వ్యాపారం చేస్తున్నట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు. బస్సులు, లారీల పార్కింగ్ కోసం కిరాయికి ఇస్తూ ఆక్రమణ దారులు వినియోగిస్తున్నారు. ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. మూసీ గర్భంలో మట్టిపోసి షెడ్డులని నిర్మించినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. నర్సరీ బిజినెస్ నిర్వహణ, ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. హైడ్రా అధికారులు తీసుకుంటున్న చర్యలపై  పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

]]>
Tue, 29 Jul 2025 23:28:59 +0530 admin
నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా నీరు దిగువకు విదుదల https://prajakshethrenews.com/నాగార్జున-సాగర్-క్రస్ట్-గేట్ల-ద్వారా-నీరు-దిగువకు-విదుదల https://prajakshethrenews.com/నాగార్జున-సాగర్-క్రస్ట్-గేట్ల-ద్వారా-నీరు-దిగువకు-విదుదల నాగార్జున సాగర్ క్రస్ట్  గేట్ల ద్వారా నీరు దిగువకు విదుదల
@ నాగార్జునసాగర్ ప్రాజెక్టు చరిత్రలో మొదటిసారిగా 18 సంవత్సరాల తర్వాత జూలై నెలలోనే సాగునీటి విడుదల
@ నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఒక ఆధునిక దేవాలయం
@ రాష్ట్రంలోని ప్రాజెక్టులను ఆధునికరిస్తాము. పూడిక తీస్తాం-రాష్ట్ర నీటిపారుదల  శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ప్రజా క్షేత్ర్, నన్నగొండ జూలై 29 :
రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ఆధునికరిస్తామని,అలాగే పూడిక తీస్తామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన  రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ ,మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి, నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో కలిసి నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఒక ఆధునిక దేవాలయం అని అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల లోని 22 లక్షల ఎకరాలకు సాగునీరుతుందని చెప్పారు .జవహర్ కుడి కాలువ ద్వారా 11.74  లక్షల ఎకరాలు, లాల్ బహుదూర్ ఎడమ కాలువ ద్వారా  10.38 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 6 లక్షల 50వేల ఎకరాలకు సాగు నీరు అందుతుండగా, నల్గొండ జిల్లాలో 1,50,000 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో రెండు లక్షల 30 వేల ఎకరాలు ,ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్ష ఎకరాలకు ఆయకట్టుకు  నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరండుతున్నదని తెలిపారు. 2005 సంవత్సరంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్వర్ణోత్సవాలు. నిర్వహించడం జరిగిందని చెప్పారు.తను ఆరుసార్లు శాసనసభ్యుడిగా,ఒకసారి పార్లమెంటు సభ్యునిగా ఉంటూ ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టు మంత్రిగా నాగార్జున సాగర్ ద్వారా నీటిని వదలడం సంతోషంగా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన  తర్వాత గత వానాకాలం,యాసంగి , వానాకాలం  కలిసి రెండు లక్షల  81 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని. పండించడం జరిగిందని, ఇందులో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పాత్ర ముఖ్యమని అన్నారు.సాగునీటితో పాటు నాగార్జునసాగర్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా గడచిన 4 రోజులుగా 30000 క్యూసెక్కుల నీటిని తో పూర్తిస్థాయిలో,700 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామన్నారు.

]]>
Tue, 29 Jul 2025 23:22:02 +0530 admin
మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పై అలిగి వెళ్లిపోయిన మంత్రి కోమటిరెడ్డి https://prajakshethrenews.com/మంత్రి-ఉత్తమ్-కుమార్-రెడ్డి-పై-అలిగి-వెళ్లిపోయిన-మంత్రి-కోమటిరెడ్డి https://prajakshethrenews.com/మంత్రి-ఉత్తమ్-కుమార్-రెడ్డి-పై-అలిగి-వెళ్లిపోయిన-మంత్రి-కోమటిరెడ్డి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పై అలిగి వెళ్లిపోయిన మంత్రి కోమటిరెడ్డి
    తన రెండు ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేసుకున్న కోమటిరెడ్డి వెంకటర్‌ రెడ్డి
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్ జూలై 29 :
మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటర్‌ రెడ్డి అలిగి వెళ్లిపోయారు. మంగళవారం నాడు నాగార్జున సాగర్‌ డ్యామ్‌ గేట్లు ఎత్తడానికి హైదరాబాద్‌ బేగంపేట నుంచి మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ హెలికాప్టర్‌లో బయల్దేరాల్సి ఉంది. షెడ్యూల్‌ ప్రకారం మంత్రులు కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ ఉదయం 9 గంటలకే బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాత్రం 10 గంటలు అయినా అక్కడకు చేరుకోలేదు.తమను ఉదయం 9 గంటలకే రమ్మని చెప్పి.. 10 గంటలు దాటినా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాకపోవడంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెంతసేపు ఆగాలి అంటూ అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎయిర్‌పోర్టు చేరుకున్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి నాగార్జున సాగర్‌ బయల్దేరి వెళ్లారు. అక్కడ సాగర్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి తన రెండు ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేసుకున్నట్లు సమాచారం.

]]>
Tue, 29 Jul 2025 23:04:46 +0530 admin
బీసీ రిజర్వేషన్ల కోసం రంగంలోకి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు https://prajakshethrenews.com/బీసీ-రిజర్వేషన్ల-కోసం-రంగంలోకి-బీఆర్ఎస్-అధినేత-కల్వకుంట్ల-చంద్రశేఖర్-రావు https://prajakshethrenews.com/బీసీ-రిజర్వేషన్ల-కోసం-రంగంలోకి-బీఆర్ఎస్-అధినేత-కల్వకుంట్ల-చంద్రశేఖర్-రావు బీసీ రిజర్వేషన్ల కోసం రంగంలోకి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూలై 29 :
 బీసీ రిజర్వేషన్ల   కోసం బీఆర్ఎస్   పోరుబాట పట్టనుంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని బీఆర్ఎస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్‌లోని బీసీ నేతలతో కలసి ఢిల్లీలో రాష్ట్రపతిని కలవడానికి నయా ప్లాన్ చేశారు. ఆగస్ట్ 8వ తేదీన కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్లాన్ చేసింది. కరీంనగర్ సభ వేదికగా బీసీ రిజర్వేషన్ల‌కు తాము అనుకూలంగా ఉన్నామనే స్పష్టమైన ప్రకటన ఇవ్వాడానికి బీఆర్ఎస్ హై కమాండ్ ఓ కార్యాచరణ రూపొందించింది. ఈ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు   పాల్గొననున్నారు. బీసీ రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్, బీజేపీ నేతల వైఖరిని కేటీఆర్ ప్రశ్నించనున్నారు.కాగా, బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. తెలంగాణ భవన్‌లో ఇవాళ బీఆర్ఎస్ బీసీ నాయకుల సమావేశం జరిగింది. కాంగ్రెస్‌కు పోటీగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని బీఆర్ఎస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల కోసం ఆగస్ 8వ తేదీన కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించడనికి ప్లాన్ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌లో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లుపై కాంగ్రెస్, బీజేపీలు కలసి డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు. ఈ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టి కాంగ్రెస్‌ తప్పుకుంటోందని మండిపడ్డారు. బీసీల పట్ల చిత్తశుద్ది ఉంటే.‌. మిగిలిన మూడు మంత్రి పదవులను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో డ్రామాలు ఆపాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు.

]]>
Tue, 29 Jul 2025 22:59:42 +0530 admin
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టూరిజం సెక్టార్‌ను బలోపేతం చేయాలి https://prajakshethrenews.com/ఉమ్మడి-ఖమ్మం-జిల్లాలో-టూరిజం-సెక్టార్ను-బలోపేతం-చేయాలి https://prajakshethrenews.com/ఉమ్మడి-ఖమ్మం-జిల్లాలో-టూరిజం-సెక్టార్ను-బలోపేతం-చేయాలి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టూరిజం సెక్టార్‌ను  బలోపేతం చేయాలి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్‌, జులై 28 :
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న వివిధ చారిత్రక ప్రదేశాలను  అభివృద్ధి పరిచి టూరిజం సెక్టార్‌ను బలోపేతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, హార్టికల్చర్‌, హ్యాండ్లూమ్‌ టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పర్యాటక, ప్రొబిషన్‌, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్‌ ఎం.డి. వల్లూరి క్రాంతి, జనరల్‌ మేనేజర్‌ ఉపేందర్‌రెడ్డిలతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో ఏకో, టెంపుల్‌ టూరిజంలను అభివృద్ధిపరిచే ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. పాలేరు రిజర్వాయర్‌, నేలకొండపల్లి వద్ద ఉన్న బౌద్ధస్థూపం, పర్ణశాల, భద్రాచలం టెంపుల్‌, కిన్నెరసాని ప్రాజెక్టు, కొత్తగూడెం వద్ద హరితహోటల్‌, కనిగిరిహిల్స్‌, వైరా రిజర్వాయర్‌, వెలుగుమట్ల అర్బన్‌ పార్కు, ఖమ్మం ఖిల్లా వద్ద రోప్‌వే, ఖమ్మంలో కొత్తగా ఒక హరిత హోటల్‌లను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో టూరిజం డెవలప్‌మెంట్‌కు అనువైన వాతావరణం, ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, ఆలయాలు ఉన్నాయని, వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రులు తెలిపారు.  దేశంలో ప్రసిద్ధిగాంచిన భద్రాచలం రామాలయంను మరింత అభివృద్ధిపరిచి భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని, ఇందుకు టూరిజం డిపార్టుమెంట్‌, కార్పొరేషన్‌లు కృషి చేయాలని మంత్రులు తెలిపారు.  అందుకు కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గాని, ప్రైవేట్ భాగస్వామ్యంలో గాని వెంటనే మంజూరి చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలి. జిల్లాలో టూరిజం డిపార్టుమెంట్‌ అధికారులు, జిల్లా కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి తగు కార్యాచరణను రూపొందించాలని సూచించారు. ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి వచ్చే నెలలో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారని, టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉన్నందున, తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం పట్టణ సమీపంలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో  ఉన్న అటవీ ప్రదేశంలో ఏకో టూరిజంకు సంబంధించిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లా ఖమ్మం పట్టణంలో హరిత హోటల్ నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని, కొత్తగూడెంలో ఉన్న హరితహోటల్ ని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.

]]>
Mon, 28 Jul 2025 22:05:29 +0530 admin
రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదు : మాజీ మంత్రి హరీష్ రావు https://prajakshethrenews.com/రేవంత్-రెడ్డి-ఏనాడు-జై-తెలంగాణ-అనలేదు-మాజీ-మంత్రి-హరీష్-రావు https://prajakshethrenews.com/రేవంత్-రెడ్డి-ఏనాడు-జై-తెలంగాణ-అనలేదు-మాజీ-మంత్రి-హరీష్-రావు రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదు
 మాజీ మంత్రి హరీష్ రావు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూలై 26 
: సిఎం రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా మాజీ సిఎం కెసిఆర్ గుర్తుకు వస్తున్నారని మాజీ బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు   తెలిపారు. గోదావరి- బనకచర్లకు కలిగే నష్టంపై బిఆర్ఎస్వీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ సందర్భంగా హరీష్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదని, రేవంత్ ఎక్కడ మాట్లాడినా కెసిఆర్ పేరును ప్రస్తావిస్తున్నారని విమర్శించారు.ఉద్యమ గుర్తులు, చరిత్ర చెరిపేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని, రేవంత్ రెడ్డి పాలనలో నీళ్లు ఆంధ్రాకు.. నిధులు దిల్లీకి పంపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపి, చంద్రబాబు నాయుడు కలిసి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వాటాను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు. గురుశిష్యులు కలిసి తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తానని హరీష్ రావు పేర్కొన్నారు.

]]>
Sat, 26 Jul 2025 21:25:39 +0530 admin
ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతే తస్మాత్ జాగ్రత్త : గజ్జల కాంతం https://prajakshethrenews.com/ఇష్టం-వచ్చినట్టు-బూతులు-మాట్లాడుతే-తస్మాత్-జాగ్రత్త-గజ్జల-కాంతం https://prajakshethrenews.com/ఇష్టం-వచ్చినట్టు-బూతులు-మాట్లాడుతే-తస్మాత్-జాగ్రత్త-గజ్జల-కాంతం ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతే తస్మాత్ జాగ్రత్త...
* తెలంగాణ సొమ్ము అంతా దోచుకున్నారు...
* ప్రజల సొమ్ముతో అమెరికాలో ఇండ్లు కొన్నావు...
 * కేటీఆర్ థర్డ్ క్లాస్ పర్సంవి
 * మేడీగడ్డ చర్చకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వస్తాడు....?
* నీ స్థాయికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ చాలు  
* టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జెల కాంతం  
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్ జూలై :

ష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతే తస్మాత్ జాగ్రత్త...అని టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జెల కాంతం హెచ్చరించారు.తెలంగాణ సొమ్ము అంతా దోచుకున్నారు... ప్రజల సొమ్ముతో అమెరికాలో ఇండ్లు కొన్నావు...కాని నీతి నిజాయితీగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు.జలశక్తి మంత్రితో సీఎంల సమావేశం జరిగింది...ఆ విషయాన్ని స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్పిండు..చంద్రబాబుకు నీళ్ళు.... రాహుల్ గాంధీకి మూటలు...మాట్లాడటం విడ్డూరం..గౌరవ సోనియా కుటుంబం అంటేనే నీతి నిజాయితీ...ఈ దేశ ప్రజల కోసం పనిచేసిన నెహ్రు కుటుంబం ఆస్తి అంతా పేద ప్రజలకు ఖర్చు చేశారు..సోనియమ్మ, రాహుల్ గాంధీకి స్వంతంగా ఇల్లు లేదు.. ఎంపీ క్వార్టర్స్ లో ఉంటున్నారు.దేశం కోసమే గాంధీకుటుంబం పనిచేస్తుంది.దేశం కోసం రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారు..నీతి నిజాయితీగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు..రోజుకు 18 గంటలు పనిచేస్తున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి..గోదావరి, కృష్ణ నీళ్ళ విషయంలో నాడు జగన్ తో ఇంట్లో కలిసి మెలిసి తినలేదా!??రోజా ఇంట్లో భోజనం చేసీ రాయలసీమను రతనాల సీమగా చేస్తానని చెప్పలేదా ?మూడు వేల టీఎంసీల మిగులు జలాలున్నాయనీ కేసీఆర్ జగన్ తో చెప్పలేదా !???బిడ్డా కేటీఆర్ తస్మాత్ జాగ్రత్త... నువ్వు పెద్ద సంసారిలాగా మాట్లాడకు‌‌ కేటీఆర్రెండు రాష్ట్రాల సీఎంలు,సీఎస్ అధికారులందరి సమక్షంలో బహిరంగంగా చర్చ జరిగింది..మీరు ప్రగతి భవన్ లో జగన్ తో... రోజా ఇంట్లో నీటి మీద చర్చ చేసి పంపకాలు చేసుకోలేదా?కేంద్ర ప్రభుత్వం పిలిస్తే పోకుండా హరీష్ రావును పంపించారు..ఆనాడు నీళ్ళ విషయంలో ఏమీ పీకారు‌..ఫాంహౌస్ లో 2012లో ఇదే జగన్ తో అర్థరాత్రి కేసీఆర్ మాట్లాడలేదా ? ప్రతి డిపార్ట్మెంట్ లో ఆంధ్ర ఆఫీసర్లే ఉన్నారు కదా ఆంధ్రా బడాబాబులతోనే దోచిపెట్టి ప్రభుత్వాన్ని నడిపించుకున్నారు....బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తుంటే అరవడం ఎందుకు !?గతంలో మీరు బీసీలకు ఏమీ చేశారు....మేడీగడ్డ చర్చకు మా కరీంనగర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రైతులు, అధికారులు వస్తారు..నీ స్థాయికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వస్తాడు....?థర్డ్ క్లాస్ పర్సన్ కేటీఆర్నీ అయ్య కేసీఆర్ ను అసెంబ్లీకి రమ్మను అక్కడ చర్చ చేస్తాడు.. మా సీఎం....ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ , కాళేశ్వరం కమీషన్ దోపిడీ ఇవన్నీ విచారణలు కొనసాగుతున్నాయి..కచ్చితంగా 43% రిజర్వేషన్లు అమలు చేసి చూపిస్తాంఎస్సీ వర్గీకరణ చేశాం...బడుగు బలహీన వర్గాల ప్రజలు బాగు కోసం పనిచేస్తాం...బీసీ బిడ్డా ఈటెల రాజేందర్ ను అవమానంగా పార్టీ నుంచి బయటకు పంపించారు..గతంలో డిప్యూటీ సీఎం రాజయ్యను బర్తరఫ్ చేసి అవమానించలేదా !?దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, బీసీ బంద్,దళితుని సీఎం చేస్తాననీ మోసం చేయలేదా !?మేము దాడులు చేస్తే నువ్వు తట్టుకోలేవు....మేము స్టార్ట్ చేస్తే టీ న్యూస్ ఉంటదా..?కేటీఆర్ దొరంహకారం తగ్గించుకో బిడ్డా గతంలో నన్ను కూడా బెదిరించే ప్రయత్నం చేశావ్ ... తస్మాత్ జాగ్రత్త

]]>
Sat, 19 Jul 2025 00:56:12 +0530 admin
2034 వరకు నేనే ముఖ్యమంత్రిని https://prajakshethrenews.com/2034-వరకు-నేనే-ముఖ్యమంత్రిని https://prajakshethrenews.com/2034-వరకు-నేనే-ముఖ్యమంత్రిని 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని
సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా క్షేత్ర్, నాగర్ కర్నూలు :
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం తన బాధ్యత అంటూ స్పష్టం చేశారు. వెనుకబడిన కొల్లాపూర్ ప్రాంతానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పాలమూరు ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్లోగా భూసేకరణ పూర్తి చేసి, కృష్ణా జలాలను పొలాలకు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.21వేల కోట్ల రైతు రుణమాఫీ చేసినట్లు గుర్తు చేసారు.  పాలమూరు పచ్చగా మారాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లక్ష్యం కోసం కృషి చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. రేవంత్ తన ప్రసంగంలో కేసీఆర్, కేటీఆర్ లపై వరుస విమర్శలు చేసారు. కేసీఆర్ హయంలో రూ.25వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పటికే పూర్తయ్యేదన్నారు. . జిల్లాకు చెందిన వివిధ ప్రాజెక్టులను పక్కన పెట్టారని ఆరోపించారు. తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ హామీలు నెరవేరలేదని అన్నారు. రేవంత్ విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో పాలమూరు పచ్చగా మారుతుంటే కేసీఆర్కు దుఃఖం వస్తోందని అన్నారు. 2034 వరకు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. దీనిని కేసీఆర్ తన గుండెల మీద రాసుకోవాలని పేర్కొన్నారు.

]]>
Sat, 19 Jul 2025 00:49:45 +0530 admin
మొదలైన దక్షిణాయణం https://prajakshethrenews.com/మొదలైన-దక్షిణాయణం https://prajakshethrenews.com/మొదలైన-దక్షిణాయణం మొదలైన దక్షిణాయణం...

ప్రజా క్షేత్ర్, బ్రహ్మంగారిమఠం :

అయనాలు రెండు సంవత్సరానికి, ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయణం మంగళవారం వరకు ఉత్తరాయణంలో ఉన్న సూర్యభగవానుడు గురువారం నుండి దక్షిణాయనంలోకి వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి.దక్షిణాయణం అంటే  సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు.  సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'ఉత్తరాయాణం' అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'దక్షిణాయణం' అని అంటారు. మన పూర్వికులు సూర్య భగవానుని గమనం ప్రకారం యుగాలు గానూ, యుగాలను సంవత్సరములు గానూ, సంవత్సరములను మాసములు గానూ, మాసములను వారములు గానూ, వారములను రోజులు గానూ, రోజులను జాములు గానూ, జాములను ఘడియలు గానూ కాల గమనాన్ని తెలుసుకోవటానికి విభజించారు. సంవత్సరంలో ఉన్న 12 మాసములను రెండు ఆయనాలుగా విభజించారు. సనాతన ధర్మంలో అంటే మతం కాదు. ఇది ఒక శాస్త్రీయమైన జీవినవిధానం. దీనిలో మన పూర్వీకులు అనేకానేక శాస్త్రీయ అంశాలను జోడించి నిత్యనూతనంగా మనకు అందించారు. భారతదేశంలో ప్రాచీనకాలం నుంచి కాలగణo అద్భుతంగా చేశారు.
'అయనం' అంటే ప్రయాణం అని అర్ధం. భూమి తనచుట్టూ తాను రోజుకు ఒకసారి తిరుగుతుంది. అందువలన పగలు, రాత్రి ఏర్పడుతున్నాయి. ఒక పగలు, ఒక రాత్రి ఇవి పూర్తీ కావడానికి 24 గంటల సమయం పడుతుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణం, జూలై 16 నుంచి జనవరి14 వరకు దక్షిణాయణం అని అంటారు. సూర్య గమణాన్నిబట్టి మన భారతీయులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని, దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయణం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం. కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయణం ప్రారంభమవుతుంది.సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది. ఆ సమయంలో స్నాన, దాన, జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి. ఖగోళ శాస్త్రం ప్రకారం.. సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు.
మానవ కార్యకలాపాలపై ఆధారపడిన ఈ సమయం నుండి ప్రకృతిలో సమూల మార్పులు పుష్కలంగా ప్రారంభమవుతాయి.
ఈ దక్షిణాయణంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు. ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే, దక్షిణాయణం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడనికి ఈ కాలంలో ఉపాసనలు, యజ్ఞాలు, జపాలు, అభిషేకాలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం అయినది. శ్రీహరి ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ సమయంలో యోగులు, మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు. శాస్త్రీయంగా దక్షిణాయణంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా జీవులలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం, ఉపసాన, తరుచుగా ఉపవాసాలు, పూజలు, వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.

దక్షిణాయనం నుంచి పగలు తక్కువ సమయం, రాత్రి వేల ఎక్కువ సమయం ఉంటుంది.

]]>
Thu, 17 Jul 2025 23:08:45 +0530 admin
నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామంలో బిజెపి జెండా ఎగరాలి : రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు https://prajakshethrenews.com/నల్లగొండ-జిల్లాలోని-ప్రతి-గ్రామంలో-బిజెపి-జెండా-ఎగరాలి-రాష్ట్ర-అధ్యక్షులు-ఎన్-రాంచందర్-రావు https://prajakshethrenews.com/నల్లగొండ-జిల్లాలోని-ప్రతి-గ్రామంలో-బిజెపి-జెండా-ఎగరాలి-రాష్ట్ర-అధ్యక్షులు-ఎన్-రాంచందర్-రావు బిజెపి తోనే వికసిత్ తెలంగాణ నిర్మాణం సాద్యం
*నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామంలో బిజెపి జెండా ఎగరాలి.
*ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ గెలిచేలా ప్రతి ఒక్కరు పనిచేయాలి
*కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం అందరం కలసి ఉద్యమించాలి
ప్రజా క్షేత్ర్, నల్లగొండ, జూలై 14
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు   చౌటుప్పల్ పర్యటన సందర్భంగా కార్యకర్తలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జరిగిన స్వాగతసభలో  ఎన్. రాంచందర్ రావు  మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా తొలి పర్యటనను నల్లగొండ జిల్లాలో చేయాలని కోరాను. నేను పుట్టిన జిల్లా ఇదే కావడంతో ప్రత్యేకంగా కోరాను. పార్టీ కూడా అందుకు నుమతినిచ్చింది. పార్టీ బలోపేతం కోసం కృషి చేయమని సూచించింది.తెలంగాణలో బిజెపి ప్రభుత్వం రావాలని ఎంతోకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ రోజు కార్యకర్తలు, ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహమే దీనికి నిదర్శనమన్నారు..నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామంలో బిజెపి జెండా ఎగరాలి. ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ గెలిచేలా ప్రతి ఒక్కరు పనిచేయాలి.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం అందరం కలసి ప్రజా ఉద్యమం చేయాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను, విద్యార్థులను మోసం చేసింది.రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టింది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో పాటు పాలనా వైఫల్యంతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మారుస్తోంది. ప్రజలు ‘ఎందుకు కాంగ్రెస్‌ను ఎన్నుకున్నాం’ అనే బాధపడుతున్నారు.బిజెపి మాత్రమే బంగారు తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, వికసిత్ తెలంగాణ నిర్మించగలదు. అందుకే బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయం.రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలందరూ కలిసిమెలిసి పనిచేసి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా కృషిచేయాలని రామ చంద్రార్ రావు పిలుపునిచ్చారు

]]>
Tue, 15 Jul 2025 00:11:39 +0530 admin
కృష్ణా , గోదావరి నదీ బేసిన్లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలి https://prajakshethrenews.com/కృష్ణా-గోదావరి-నదీ-బేసిన్లలో-సమస్యలపై-కేంద్రం-వెంటనే-చొరవచూపాలి https://prajakshethrenews.com/కృష్ణా-గోదావరి-నదీ-బేసిన్లలో-సమస్యలపై-కేంద్రం-వెంటనే-చొరవచూపాలి కృష్ణా , గోదావరి నదీ బేసిన్లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలి
కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ
 ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  కృతనిశ్చయంతో ఉన్నారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.కృష్ణాతో పాటు గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించుకోవటంతో పాటు, ఇంతకాలం జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాలను సాధించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి  కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కి లేఖ రాశారు.ఈనెల 16న ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రితో సమావేశమై తెలంగాణ నీటి వాటాల సాధనతో పాటు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పట్టుబట్టాలని నిర్ణయించారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా మరియు గోదావరి నదీ బేసిన్లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని లేఖలో కోరారు. తెలంగాణలో చేపట్టిన ఆయా ప్రాజెక్టులు, స్థితిగతులు, పరిణామ క్రమంపైన సవివరంగా లేఖలో ప్రస్తావించారు.  తెలంగాణకు సంబంధించిన పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా మరియు గోదావరి నదీ బేసిన్లలో తాజా పరిస్థితులు, పరిణామాలు, ఏపీ ఉల్లంఘనలు, ఉత్పన్నమైన సమస్యలు, భవిష్యత్తు ప్రమాదాలపై వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కారానికి చొరవ చూపాలని లేఖలో కోరారు.కృష్ణా నదీ జలాల వినియోగంలో ఇంతకాలం తెలంగాణకు తీరని ద్రోహం జరిగింది. గడిచిన పదేండ్లలో కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది.  తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే నీటి వాటాకు అంగీకరించి ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టింది. శ్రీశైలం ఎగువన ఏపీ అక్రమంగా నిర్మించుకున్న ప్రాజెక్టులన్నింటికీ వంత పాడి, కృష్ణా నీళ్లను ఏపీ యధేచ్ఛగా మళ్లించుకుంటే మౌనం వహించింది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఇవ్వకుండా అసంపూర్తిగా వదిలేసింది. అటు గోదావరిపై తుమ్మిడిహెట్టిపై చేపట్టిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత పక్కనబెట్టింది. దానికి బదులుగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. కృష్ణా, గోదావరి నదీ జలాలపై తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా మరియు గోదావరి నదీ బేసిన్లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

]]>
Tue, 15 Jul 2025 00:01:00 +0530 admin
బీఆర్ఎస్ హయాంలో బెల్ట్ షాపులు తప్ప.. రేషన్ షాపులు తెరవలేదు : సీ ఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/బీఆర్ఎస్-హయాంలో-బెల్ట్-షాపులు-తప్ప-రేషన్-షాపులు-తెరవలేదు-సీ-ఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/బీఆర్ఎస్-హయాంలో-బెల్ట్-షాపులు-తప్ప-రేషన్-షాపులు-తెరవలేదు-సీ-ఎం-రేవంత్-రెడ్డి
బీఆర్ఎస్ హయాంలో బెల్ట్ షాపులు తప్ప.. రేషన్ షాపులు తెరవలేదు..
* రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తుంటే.. ఓర్వలేక తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు
* మూడు అడుగులున్న స్థానిక నేత ఎగిరెగిరి పడుతున్నాడు
*కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం.. ఆయన హయాంలోనే కూలేశ్వరం అయ్యింది
* కూలేశ్వరం ప్రాజెక్టు దగ్గరే వారిని ఉరి తీసినా తప్పు లేదు
* ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్
తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
  ప్రజా క్షేత్ర్, నల్గొండ, జులై 14
 బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఏ ఒక్కరికీ రేషన్ కార్డు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదవాడికి సన్న బియ్యం ఇచ్చి.. గుక్కెడు ముద్ద పెట్టాలని ఆలోచన సైతం గత ప్రభుత్వ పెద్దలు చేయలేదని మండిపడ్డారు. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రూ.34.20 కోట్ల విలువైన పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో రేషన్ షాపులు తెరవలేదని.. బెల్ట్ షాపులు తెరిచారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తుంటే.. ఓర్వలేక తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తున్నామని.. బోనస్ సైతం ఇస్తున్నామని చెప్పారు. రేషన్‌ కార్డు అంటే పేదవారి ఆత్మగౌరవం.. గుర్తింపు అని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. పేదల ఆకలి తీర్చే ఆయుధమే రేషన్‌ కార్డు అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల వల్లే నేడు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తున్నాయని గుర్తు చేశారు.రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పామని.. ఈ హామీని తమ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. అయితే తమ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టిందంటూ దుష్ప్రచారం చేశారని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతులకు రైతు భరోసా నగదు అందించామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు.మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన 18 నెలల కాలంలోనే రూ. 6,500 కోట్లు ఖర్చు అయిందని వివరించారు. తమ ప్రభుత్వం కొలువు తీరి రెండేళ్లు పూర్తయ్యే సరికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం.. ఆయన హయాంలోనే కూలేశ్వరం అయ్యిందని ఎద్దేవా చేశారు. కూలేశ్వరం ప్రాజెక్టు దగ్గరే వారిని ఉరి తీసినా తప్పు లేదన్నారు. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా? అంటూ బీఆర్ఎస్ నేతలకు ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.
మాజీ మంత్రి జగదీష్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి గట్టి కౌంటర్‌...
మూడు అడుగులున్న స్థానిక నేత ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లు అవకాశం ఇచ్చినా తుంగతుర్తికి నీళ్లు ఎందుకు తేలేదంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సీఎం సూటిగా ప్రశ్నించారు. తుంగతుర్తికి నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదంటూ బీఆర్ఎస్ నేతకు ఈ సందర్భంగా చురకలంటించారు. దొర ముందు చేతులు కట్టుకుని గ్లాస్‌లో సోడా పోయడమే నీకు తెలుసంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు.సొంత మండలానికి ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీస్‌లే కాదు.. పోలీస్ స్టేషన్‌ సైతం తెచ్చుకోలేని ఘనత బీఆర్ఎన్ నేతలదంటూ వ్యంగ్యంగా అన్నారు. పోరాట యోధులను అందించిన గడ్డ నల్గొండ అని ఈ సందర్బంగా సీఎం రేవంత్‌ రెడ్డి అభివర్ణించారు. నాడు గంజికి లేని మూడు అడుగుల నాయకుడు.. నేడు బెంజి కార్లలో తిరుగుతున్నారంటూ జగదీశ్వర్ రెడ్డిపై వ్యంగ్య బాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి సంధించారు. తెలంగాణలో కొత్తగా 3.58 లక్షల రేషన్‌ కార్డుల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కొత్త రేషన్‌ కార్డుల ద్వారా 11.3 లక్షల మందికి లబ్ధి చేకూరతుందన్నారు. తెలంగాణలో మొత్తం 95. 56 లక్షల మంది రేషన్‌ కార్డులు అందుకున్నారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

]]>
Mon, 14 Jul 2025 23:47:00 +0530 admin
యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం : సిఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/యువతకు-ఉపాధి-కల్పించాలనే-లక్ష్యంతో-ముందుకెళ్తున్నాం-సిఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/యువతకు-ఉపాధి-కల్పించాలనే-లక్ష్యంతో-ముందుకెళ్తున్నాం-సిఎం-రేవంత్-రెడ్డి యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం : సిఎం రేవంత్ రెడ్డి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూలై  :
 రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని సిఎం రేవంత్ రెడ్డి  తెలిపారు. సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలన్నారు. ఈ సందర్భంగా సిఎం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, మూడు రంగాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపైన ఆందోళన వ్యక్తం చేశారు. అధికశాతం వడ్డీల   కారణంగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని ఇలాంటి విధానం ద్వారానే, సమాఖ్య వ్యవస్థ బలోపేతమవుతుందని, దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వడ్డీలు చెల్లించడం కోసమే రాష్ట్ర ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తోందని, రుణాలపైన వడ్డీ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

]]>
Sun, 13 Jul 2025 14:34:26 +0530 admin
భద్రాచలం ఈఓపై దాడి ఖండించిన మంత్రి తుమ్మల https://prajakshethrenews.com/భద్రాచలం-ఈఓపై-దాడి-ఖండించిన-మంత్రి-తుమ్మల https://prajakshethrenews.com/భద్రాచలం-ఈఓపై-దాడి-ఖండించిన-మంత్రి-తుమ్మల భద్రాచలం ఈఓపై దాడి ఖండించినమంత్రి తుమ్మల

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

భద్రాచలం రామాలయ ఈఓ రమాదేవిపై, ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన భూ ఆక్రమణదారులు దాడి చేయడాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. ఈఓను, ఫోన్‌లో పరామర్శించిన ఆయన ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆలయ భూముల విషయంలో ఇరు రాష్ట్రాలు చర్చించి దేవాలయానికి చెందేలా చర్యలు తీసుకుంటారని, ఆ భూములు దక్కితేనే ఆలయ అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

]]>
Wed, 09 Jul 2025 22:48:55 +0530 admin
నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరయిన డాక్టర్ కె. లక్ష్మణ్ https://prajakshethrenews.com/నాంపల్లి-స్పెషల్-కోర్టుకు-హాజరయిన-డాక్టర్-కె-లక్ష్మణ్ https://prajakshethrenews.com/నాంపల్లి-స్పెషల్-కోర్టుకు-హాజరయిన-డాక్టర్-కె-లక్ష్మణ్ నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరయిన డాక్టర్ కె. లక్ష్మణ్
హైదరాబాద్ జూలై 9
;పార్లమెంట్ ఎన్నికల సమయంలో ముషీరాబాద్ లోనే దోమలగూడ పోలీస్ స్టేషన్, సూర్యాపేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదులో భాగంగా బుధవారం బిజెపి ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్  నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  భాజపా ప్రభంజనాన్ని ఎదుర్కోలేక, అప్పటి BRS ప్రభుత్వం మరియు నాయకులు రాచరిక విధానంలో తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు.ఈ వేధింపుల నేపథ్యంలో, వేలాది మంది భాజపా కార్యకర్తలు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా అనుసరిస్తోంది. మేము నమ్మిన సిద్ధాంతాల కోసం, దేశం కోసం పనిచేస్తున్న నిబద్ధత గల కార్యకర్తలం. న్యాయస్థానాల పట్ల, ధర్మం పట్ల మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. BRS, కాంగ్రెస్ పార్టీల కక్ష సాధింపు చర్యలకు లొంగకుండా, మేము దేశం కోసం పని చేస్తూనే ఉంటాం,” అని పేర్కొన్నారు.

]]>
Wed, 09 Jul 2025 20:28:24 +0530 admin
తెలంగాణ ఉద్యమ కార్యకర్తలకు నెలవారీ ₹25,000/& పెన్షన్ మంజూరు చేయాలి https://prajakshethrenews.com/తెలంగాణ-ఉద్యమ-కార్యకర్తలకు-నెలవారీ-25000-పెన్షన్-మంజూరు-చేయాలి https://prajakshethrenews.com/తెలంగాణ-ఉద్యమ-కార్యకర్తలకు-నెలవారీ-25000-పెన్షన్-మంజూరు-చేయాలి తెలంగాణ ఉద్యమ కార్యకర్తలకు నెలవారీ ₹25,000/- పెన్షన్ మంజూరు చేయాలి
          అర్హత ఉన్న ప్రతి 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలి
  ప్రజా పాలనలో  మంత్రి వివేక్ కు తెలంగాణ ఉద్యమకారుల సంఘం వినతి పత్రం
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూలై 7 :
;తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలని  తెలంగాణ ఉద్యమకారుల సంఘం విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు ఉద్యమకారుల సంఘం చైర్మన్ బండి రమేష్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమకారుల సంఘం ప్రతినిధి బృందం,  ప్రజా పాలనలో బాగంగా బుదవారం గాంధి భవన్ లో  మంత్రి వివేక్ కు  తెలంగాణ ఉద్యమకారుల సంఘం వినతి పత్రం వినతి పత్రం సమర్పించింది. అర్హత ఉన్న ప్రతి పాల్గొనేవారికి 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలి. తెలంగాణ ఉద్యమ కార్యకర్తలకు నెలవారీ ₹25,000/- పెన్షన్ మంజూరు చేయాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలి. తెలంగాణ అమరవీరులు మరియు పోరాట యోధులను అధికారికంగా గుర్తించి సత్కరించాలి.తెలంగాణ పోరాటంలో గణనీయమైన పాత్ర పోషించిన అర్హులైన కార్యకర్తలందరికీ అదనపు సంక్షేమ ప్రయోజనాలు, అధికారిక గుర్తింపు ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తెలంగాణ ఉద్యమకారుల సంఘం సమస్యలను ఉత్తమ గ్రామ పంచాయతీలుగా నిలపాలి. 

]]>
Wed, 09 Jul 2025 19:17:33 +0530 admin
బండి సంజయ్ జన్మదినం పురస్కరించుకుని పదోతరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ https://prajakshethrenews.com/బండి-సంజయ్-జన్మదినం-పురస్కరించుకుని-పదోతరగతి-విద్యార్థులకు-ఉచితంగా-సైకిళ్లు-పంపిణీ https://prajakshethrenews.com/బండి-సంజయ్-జన్మదినం-పురస్కరించుకుని-పదోతరగతి-విద్యార్థులకు-ఉచితంగా-సైకిళ్లు-పంపిణీ తలదించుకుని పుస్తకాలు చదివితే భవిష్యత్ లో తలెత్తుకుని జీవిస్తాం
బండి సంజయ్ జన్మదినం పురస్కరించుకుని పదోతరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ
ప్రజా క్షేత్ర్, కరీంనగర్ జూలై 9 :
 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తలుచుకుంటే అద్భుతాలు చేయగలరని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్  తెలిపారు. తలదించుకుని పుస్తకాలు చదివితే భవిష్యత్ లో తలెత్తుకుని జీవిస్తాం అని అన్నారు. బండి సంజయ్ జన్మదినం పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ‘మన మోడీ కానుక ’    పేరుతో ప్రభుత్వ పాఠశాలల పదోతరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. కేంద్రప్రభుత్వం విద్య కోసం రూ. 1.28 లక్షల కోట్లు కేటాయించిందని తెలియజేశారు. త్వరలో నరేంద్రమోడీ కిట్ లు కూడా పంపిణీ చేస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని చెప్పారు. తన పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారని, విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రుల కష్టానికి సార్థకత చేకూర్చాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

]]>
Wed, 09 Jul 2025 18:13:18 +0530 admin
కోట్లాది కుటుంబాలను దగా చేసిన కాంగ్రెస్ : కేటీఆర్ https://prajakshethrenews.com/కోట్లాది-కుటుంబాలను-దగా-చేసిన-కాంగ్రెస్-కేటీఆర్ https://prajakshethrenews.com/కోట్లాది-కుటుంబాలను-దగా-చేసిన-కాంగ్రెస్-కేటీఆర్ కోట్లాది కుటుంబాలను దగా చేసిన కాంగ్రెస్
రేవంత్ కు బెసిక్ నాలెడ్జ్ కుడా లేదు
ఏ వర్గానికి రేవంత్ రెడ్డి మేలు చేయలేదు
 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

 ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

గత 18 నెలల నుంచి తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ అరాచక పాలన తో  రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  అన్నారు. నోటికొచ్చిన హామీలు, నోటికి వచ్చిన వచ్చిన వాగ్దానాలు, 420 హామీలు, వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు అని డైలాగులు కొట్టి  గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను, కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్ దగా చేసిందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుకు మాది గ్యారంటీ అని బాండ్ పేపర్ మీద రాసి గద్దెనెక్కి 18 నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి నెరవేర్చలేకపోయాడు. తెల్లారి లేస్తే అరుపులు, గావుకేకలు, బూతులు తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు.  తెలంగాణ రైతాంగానికి, యువతకు ఎవరేం చేశారో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి  విసిరితే స్వీకరించి నేను వచ్చాను. బేసిన్ నాలెడ్జి లేని రేవంత్ రెడ్డికి బేసిక్ నాలెడ్జి లేదని తెలిసినా కూడా ముఖ్యమంత్రి ముచ్చట పడుతున్నాడు కదా అని సవాల్ ను స్వీకరించాను.  బేసిన్ నాలెడ్జ్ , బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టే ఓ 72 గంటల టైం ప్రిపరేషన్ కోసం ఇచ్చి రమ్మన్నాను. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పాను.  జులై 8 తారీఖున  11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్ కు వస్తాము, మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా చర్చిద్దామంటే రేవంత్ రాకుండా ఢిల్లీకి పోయిండు.  ఒకవేళ ముఖ్యమంత్రి  రాలేకపోతే ఆయన తరపున బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి గాని, వ్యవసాయ మంత్రి గానీ, లేదంటే ఇంకెవరైనా మంత్రులను పంపుతారని అనుకున్నానని అన్నారు.
కానీ రేవంత్ రెడ్డికి రచ్చ చేయడమే వచ్చు కాని చర్చ చేయడం రాదని ఇవాళ తేలిపోయింది.  రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది కానీ రైతుల గురించి మాట్లాడడం రాదని స్పష్టంగా తెలిసిపోయింది.  రేవంత్ రెడ్డికి బేసిన్ ల గురించి కూడా బేసిక్ నాలెడ్జ్ లేదు. ఏ ప్రాజెక్టు బేసిన్లో ఉంది అని  ఇరిగేషన్ అధికారులను ఒక చిన్న పిల్లాడు అడిగినట్లు అడుగుతుంటే ఇతనా  మనకు న్యాయం చేసేదని రాష్ట్రంలోని రైతులు బాధపడుతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్, , కేసీఆర్  తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రాతిపదికను కల్పించారు.ఈ సిద్ధాంతాన్ని తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వాడుతున్నాడని అన్నారు. తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతులను మోసం చేస్తూ ఆయన గురువు చంద్రబాబుకు కృష్ణా గోదావరి నీళ్లను పంపిస్తున్నాడు. కింద గోదావరిలో బనకచర్ల కడుతుంటే పచ్చ జెండా ఊపుతున్నడు.  పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీళ్లను దొంగ చాటుగా తీసుకెళ్తుంటే కళ్ళు మూసుకొని చంద్రబాబు చెప్పినట్టు కోవర్టు పాలన సాగిస్తున్నాడు.  నీళ్లేమో ఆంధ్రకు పోతున్నాయి. నిధులు ఢిల్లీకి పోతున్నాయి. తన తొత్తులకు నియామకాలు ఇచ్చుకొని రేవంత్, మురిసిపోతున్నాడు.  కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో పాటు  కేంద్రంలోని బీజేపీ పెద్దలకు పైసల మూటలు మోసి రేవంత్ తన పదవిని కాపాడుకుంటున్నాడన్న సంగతి ఇవాళ తెలంగాణలోని చిన్న పిల్లలకు కూడా తెలుసు. తెలంగాణ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి పేసిఎం అని పేరు పెట్టారు. రాష్ట్రంలోని ఏ వర్గానికి రేవంత్ రెడ్డి మేలు చేయలేదు. రైతు భరోసాలోని డొల్లతనాన్ని చెబుదామని అధికారిక సమాచారంతో వచ్చా. స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో రైతు భరోసా రాని 670 మంది రైతుల పేర్లు, అడ్రస్సులు, ఫోన్ నెంబర్లతో సహా తీసుకొని వచ్చాను. రాష్ట్రంలో రుణమాఫీ కానీ లక్షల మంది వివరాలతో జాబితా తీసుకొచ్చానని అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న 670 మంది రైతుల వివరాల మా దగ్గర ఉన్నాయి.  రాష్ట్రంలో బోనస్ రాక పంటలు అమ్ముకునే దిక్కు లేక ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితాను తీసుకొని వచ్చా.  ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత రైతులను సతమతం చేస్తున్నది. ఒక్క ఆధార్ కార్డుతో ఒక ఎరువుల బస్తా, యూరియా బస్తా ఇస్తామంటే చెప్పులను క్యూలో  పెట్టి రైతులు ఫర్టిలైజర్ దుకాణాల ముందు ఎదురుచూస్తున్నారు.  మళ్లీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ నిజంగానే ఆ పాత దుర్ధినాలను తీసుకొచ్చింది  కరెంటు కోతలు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే ఆనాటి రోజులు మళ్లీ ఇప్పుడు వచ్చాయి.  ఎరువులు, విత్తనాల కోసం లైన్లో నిలబడే ఆనాటి రోజులు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం అనుకున్నారు ప్రజలు. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.

]]>
Wed, 09 Jul 2025 08:41:51 +0530 admin
అందరికీ వడదెబ్బ తగిలితే.. కేటీఆర్ కి సిస్టర్.. బ్రదరిన్ల స్ట్రోక్ తగిలింది : జగ్గారెడ్డి https://prajakshethrenews.com/అందరికీ-వడదెబ్బ-తగిలితే-కేటీఆర్-కి-సిస్టర్-బ్రదరిన్ల-స్ట్రోక్-తగిలింది-జగ్గారెడ్డి https://prajakshethrenews.com/అందరికీ-వడదెబ్బ-తగిలితే-కేటీఆర్-కి-సిస్టర్-బ్రదరిన్ల-స్ట్రోక్-తగిలింది-జగ్గారెడ్డి అందరికీ వడదెబ్బ తగిలితే.. కేటీఆర్ కి సిస్టర్.. బ్రదరిన్ల స్ట్రోక్ తగిలింది..
            *అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు
*అమెరికా లో చదువుకుని వచ్చిన నీకు..ఎంఎల్ఏ లు చర్చలు ఎక్కడ చేయాలో తెలియదా!
*రోడ్డు మీద చర్చ చేయాలా అనే ఙ్ఞానం కూడా లేదా..?
*కేటీఆర్...నువ్వు రేవంత్ ను గోకుడు ఎందుకు.. తన్నించుకోవడం ఎందుకు..?
*సీఎం రేవంత్ నిధుల కోసం ఢిల్లీ వెళ్తే.. కేసీఆర్ కుటుంబం లిక్కర్ దందా కోసం ఢిల్లీ వెళ్లింది
*మా సీఎం రేవంత్ కేంద్రం చుట్టు  నిధుల కోసం తిరుగుతున్నారు..
*కేటీఆర్ విదేశాల చుట్టూ తిరుగుతున్నారు
*కేటీఆర్ కి విదేశాల్లో పని ఏంది..?
*మా అనుభవం ముందు..నీ అనుభవం ఎంత..?
*కేటీఆర్..హరీష్ లు సవాల్ విసిరితే చర్చకు నేను ఏ క్లబ్ కి అయినా వస్తా
*కేటీఆర్ పై నిప్పులు చెరిగినా జగ్గారెడ్డి
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్ జూలై 8 :
అందరికీ వడదెబ్బ తగిలితే.. కేటీఆర్ కి సిస్టర్.. బ్రదరిన్ల స్ట్రోక్ తగిలింది..అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడుఅమెరికా లో చదువుకుని వచ్చిన నీకు..ఎంఎల్ఏ లు చర్చలు అసెంబ్లీ లో చేయాలా..అన్న ఇంకిత జ్యానం లేకుండ  మాట్లాడుతున్నాడని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు మంగళ వారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ రోడ్డు మీద చర్చ చేయాలా అనే ఙ్ఞానం కూడా లేదా..?కేటీఆర్...నువ్వు రేవంత్ ను గోకుడు ఎందుకు.. తన్నించుకోవడం ఎందుకు..?సీఎం రేవంత్ నిధుల కోసం ఢిల్లీ వెళ్తే.. కేసీఆర్ కుటుంబం లిక్కర్ దందా కోసం ఢిల్లీ వెళ్లింది  మా సీఎం రేవంత్ కేంద్రం చుట్టు  నిధుల కోసం తిరుగుతున్నారు.. కేటీఆర్ విదేశాల చుట్టూ తిరుగుతున్నారుకేటీఆర్ కి విదేశాల్లో పని ఏంది..?మా అనుభవం ముందు..నీ అనుభవం ఎంత..?సన్నాసులు అని బూతులు స్టార్ట్ చేసింది మీ అయ్య మీ అయ్యను కంట్రోల్ చేసేందుకు సీఎం రేవంత్ బూతులు తిట్టాల్సి వస్తుందికేటీఆర్.. మీ ఫ్యామిలీ నే ఒక 420.. మమ్మల్ని 420 అంటారా..?ఈ సారి సీఎం రేవంత్ తో చర్చ అంటే నేను వస్తానని సవాల్ విసిరారు.నువ్వు ..నేను సెకండ్ బెంచ్ లీడర్లమేరేవంత్ రెడ్డి zptc నుండి సీఎం అయ్యాడు నేను కౌన్సిలర్ నుండి మూడు సార్లు mla..వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యా... మా ఇద్దరికీ రాజకీయ అనుభవం ఉంటదినువ్వు  డైరెక్ట్ గా అమెరికా నుండి వచ్చి మీ నాయన పేరుమీద mla అయ్యావు..నీకేం అనుభవం ఉంటదిమా అనుభవం ముందు..నీ అనుభవం ఎంత..? కేటీఆర్..హరీష్ లు సవాల్ విసిరితే చర్చకు నేను ఏ క్లబ్ కి అయినా వస్తా కేసీఆర్ చర్చకు సవాల్ విసిరితే... రేవంత్ రెడ్డి వస్తారు.. అవసరం ఐతే నేను ఒప్పిస్త. కేటీఆర్ కి ఈ మధ్య తెలంగాణ లో ఉండటం లేదు నెలకోసారి విదేశాల్లో ఉంటున్నాడు .నెలలో పది రోజులు ఇక్కడ... 20 రోజుకు విదేశాల్లో ఉంటాడు కాబట్టి సిఎం  రేవంత్ షెడ్యూల్ తెలియదు . విదేశాల్లో తిరిగే కేటీఆర్ కి..  సిఎం రేవంత్ ఏం చేస్తున్నది ఎందుకు తెలుస్తుంది. . పదేళ్లు మంత్రిగా నువ్వు... సీఎం గా మీ నాయన చేశాడు .ఢిల్లీకి ఎందుకు పోతారో అనే ఇంగిత ఙ్ఞానం లేదా..? కేటీఆర్ఎరువులు.. నిధుల కోసం..నీళ్ల పంచాయతీ కోసం ఢిల్లి పోయాడు రేవంత్కేసీఆర్ కుటుంబం ఢిల్లీకి లిక్కర్ దందా కోసం పోయారుహరీష్ కేటీఆర్ లు... Ed ఆఫీస్ ల కోసం డిల్లీ వెళ్ళారుమా cm రేవంత్ కేంద్రం చుట్టు తిరుగుతున్నారు మీ తిరుగ ed చుట్టూ తిరుగుతున్నాడా..?కేటీఆర్ కి సిస్టర్ స్ట్రోక్ తగిలిందికాంగ్రెస్ కి పుట్టినిల్లు డిల్లీ.. మీ లాగా మాది గల్లి పార్టీ కాదు కదా?కేటీఆర్..నీ స్ట్రోక్ ల లొల్లి మాకెందుకు రుద్దుతున్నావుకేటీఆర్.. కేసీఆర్ కోటా లో డైరెక్ట్ mla అయిపోయాడురాజకీయ ఒడిదుడుకులు నీకేం తెలుసు..?సన్నాసులు అనే మాటలు స్టార్ట్ చేసింది మీ అయ్యా నేమీరు తిట్టిన మాటలను కాస్త పాలిష్ చేసి తిడుతున్నారుమేము సత్రం నడపడం లేదు.. మీరు తిడితే మేము తిడతం..రేవంత్ నీ గోకుడు ఎందుకు తన్నించుకోవడం ఎందుకు..?తిట్ల పురాణం మీదే.. మీరు ఒకటి అంటే మీరు పది తిడుతున్నాంఅమెరికాలో చదివి.. పదేళ్లు మంత్రి అయినవి... చర్చ అసెంబ్లీ లో చేయాలా..?కల్లు కాంపౌండ్ లోకి  రా అంటే ఎట్లా ..?brs సోషల్ మీడియా తప్పు చేస్తుంది అని కేటీఆర్ ఒప్పుకున్నాడువెయ్యి కోట్లు... పక్క రాష్ట్రాల ఎన్నికల్లో పంపింది కేసీఆర్ కుటుంబందాని గురించి మాట్లాడే హక్కు కేటీఆర్ కి లేదుకేటీఆర్...అబద్దాల కోరుఅందరికీ వడదెబ్బ తగిలితే.. ఫ్యామిలీ దెబ్బలు తగులుతున్నాయికేటీఆర్ కి అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారుకేటీఆర్ విదేశాల్లో చల్లదనం కోసం పోతున్నారు నెలలో 20 రోజుల్లో విదేశాల్లో కేటీఆర్ కి ఏం పని చెప్పుకేటీఆర్.. మీరు ఒక్క బూతు మాట్లాడితే.. సీఎం రేవంత్ పది తిడతాడు నువ్వు బూతులు మాట్లాడటం బంద్ చెయ్.. రేవంత్ కూడా బంద్ చేస్తారన్నారు. ఈ విషయంలో మా లైన్ క్లియర్ పదేళ్లు కేటీఆర్..ఏం పీకిండు.. 18 నెలలు పవర్ లేకుండా పోయే సరికి.. నీళ్లలో చేప ఒడ్డున పడ్డట్టు గిల గిల కొట్టుకుంటున్నాడని విమర్సహించారు.,ఇందిరమ్మ పాలన పై వేలు పెట్టే హక్కు హరీష్ కి లేదు మీరు పదేళ్లలో కొందరు ci..dsp..sp లను అడ్డం పెట్టుకుని మమ్మల్ని వేధించారు .నాపై కూడా నిఘా పెట్టారుజగ్గారెడ్డి ఎక్కడ దొరుకుతడా..? అని చూశారు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నాపై నిఘా ఇంచార్జిపోలీసుల నిఘా లో తేలింది అప్పులే తప్పా..ఆస్తులు లేవు అని తేల్చారు . భూముల పంచాయతీ ఉందా అని అప్పటి కలెక్టర్ రోనాల్డ్ రాస్ ను విచారణ చేయించారుఎక్కడ దొరక్కా... పాస్ పోర్ట్ కేసు పెట్టారు రేవంత్..నాక్కూడా ఆరు నెలల క్రితమే నిన్ను అరెస్ట్ చేస్తారు జగ్గన్న అని చెప్పారు పాస్ పోర్ట్ కేసులో కేసీఆర్ కుటుంబమే మూలం.నేను రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే..హరీష్ హైదరాబాద్ లో తిరగడుపాస్ పోర్టు కేసు తిరగ తోడు అని సీఎం రేవంత్ వెంట పడేటాన్ని కాదా..? కేటీఆర్.. మళ్ళీ వస్తా అంటే నేను వస్తా..?కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్.. నేను వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ సెకండ్ బెంచ్ స్టూడెంట్కేసీఆర్..రేవంత్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లు..కేసీఆర్ సవాల్ విసిరి చర్చకు రా...అంటే రేవంత్ నీ నేను ఒప్పిస్త కేటీఆర్..హరీష్ లు ఏ క్లబ్ కి రమ్మన్నా.. నేను వస్తా నువ్వు సెకండ్ బెంచ్ .. నేను సెకండ్ బెంచ్ స్టూడెంట్స్.. మనం మనం చూసుకుందాం కేసీఆర్ సవాల్ విసిరితే..రేవంత్ వస్తారు.. నేను ఒప్పిస్త ఒక 420..మమ్మల్ని 420 అంటున్నాడు నువ్వు కంట్రోల్ లో ఉండు.. మా వాళ్ళు కంట్రోల్ లో ఉంటారని  జగ్గా రెడ్డి హెచ్చరించారు.

]]>
Tue, 08 Jul 2025 23:00:24 +0530 admin
సవాల్‌ విసిరి తప్పించుకున్నవెందుకు? *సీఎం రేవంత్‌ను సూటిగా ప్ర‌శ్నించిన కేటీఆర్ https://prajakshethrenews.com/సవాల్-విసిరి-తప్పించుకున్నవెందుకు-సీఎం-రేవంత్ను-సూటిగా-ప్రశ్నించిన-కేటీఆర్ https://prajakshethrenews.com/సవాల్-విసిరి-తప్పించుకున్నవెందుకు-సీఎం-రేవంత్ను-సూటిగా-ప్రశ్నించిన-కేటీఆర్ సవాల్‌ విసిరి తప్పించుకున్నవెందుకు?
*సీఎం రేవంత్‌ను సూటిగా ప్ర‌శ్నించిన కేటీఆర్
*సీఎం రాకుంటే మంత్రులు వచ్చినా చర్చకు సిద్ధం
*ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడైనా రెడీ
*అసెంబ్లీకైనా వస్తం..కానీ మైక్‌ కట్‌ చేయద్దు
*ముఖ్యమంత్రి ఒప్పుకొంటే ఆయన చాలెంజ్‌ను స్వీకరిస్తాం
*బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్‌ జూలై 8  :
‘సీఎం రేవంత్‌రెడ్డి..రైతు సమస్యలపై చర్చిద్దాం రమ్మంటే తొక ముడిచి తప్పించుకొని ఢిల్లీకి పారిపోయినవెందుకు? అయినా సవాల్‌ విసరడం.. బురదజల్లడం.. పారిపోవడం నీకు మొదటి నుంచి అలవాటే, నువ్వు రాకుంటే నీ మంత్రినైనా పంపు చర్చకు సిద్ధం..’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. మంగళవారం రైతు సమస్యలపై చర్చించేందుకు సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌కు వెళ్లే ముందు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.ముఖ్య మంత్రి ముచ్చటపడితే తాను చర్చకు సిద్ధమయ్యాయని కేటీఆర్‌ స్పష్టం చేశారు. గతంలో ఎన్నోసార్లు సవాల్‌ విసిరి తప్పించుకుపోయిన విషయాన్ని గుర్తుచేశారు. ‘కొడంగల్‌లో ఒడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ చేసి ఆరు నెలలు తిరగకముందే మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేస్తివి..హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంట అంటివి..అందుకే నువ్వు మాట మీద నిలబడే మనిషిని కాదు కాబట్టే నీ కొరిక మేరకు కొడంగల్‌లోనైనా, కొండారెడ్డిపల్లిలోనైనా, నీ జూబ్లీహిల్స్‍ ప్యాలెస్లోనైనా..అంబేద్కర్ చౌరస్తాలోనైనా, చివరికి అసెంబ్లీలోనైనా చర్చకు సిద్ధమని చెప్పినం.. కాదుపోదూ అంటే తటస్థ వేదిక అయినా ప్రెస్‌క్ల‌బ్‌కు మేమే వస్తమని చెప్పినం.. జూలై 8న 11 గంటలకు రమ్మని అడిగినం..  నువ్వు తప్పించుకపోతవని తెలుసు.. నీకు బేషజాలు తప్పా బేసిన్ల గురించి తెలియదని మూడు రోజుల టైమిచ్చినం.. అంటూ దెప్పిపొడిచారు. రేవంత్‌ సవాల్‌ను స్వీకరించి మొన్ననే ప్రెస్‌క్ల‌బ్‌ను బుక్‌ చేశామని తెలిపారు. ఈ రోజూ సీఎం విసిరిన సవాల్‌ను స్వీకరించి కొడంగల్‌లో రైతుబంధు అందని 670 మంది రైతుల జాబితాతో సహా, రుణమాఫీ కానీ రైతుల వివరాలు, రానీ బోనస్, రైతు శ్రేయస్సుకు సంబంధించిన ప్రతి అంశంపై విస్తారంగా చర్చించేందుకు మా నాయకత్వం మొత్తం రైతు సమస్యలపై అధికారికంగా సమాచారం తీసుకొని ఈ రోజు ప్రెస్‌క్ల‌బ్‌కు వెళ్తున్నామని స్పష్టం చేశారు.
మంత్రులతోనైనా చర్చకు రెడీ..
ముచ్చటపడి పిలిచిన ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారని తెలిసిందన్నారు. ఒకవేళ ఆయన రాని పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రో, వ్యవసాయ శాఖ మంత్రో, బాధ్యాతాయుతమైన మరో మంత్రి వస్తరని అనుకుంటున్నామన్నారు. అందుకే సోమాజిగూడ ప్రెస్క్లబ్‌కు బయల్దేరి వెళ్తున్నారన్నారు. ‘మా కేం భేషజం లేదు.. ముఖ్యమంత్రే రావాలని లేదు.. ఆయన తరుఫున ఉప ముఖ్యమంత్రి వచ్చినా, ఇంకో మంత్రి వచ్చినా వారితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నం.. చర్చించి వివరాలన్నీ అందజేస్తాం’ అని స్పష్టం చేశారు. రైతుల సబ్జెక్టే కాదు.. తెలంగాణ యువత, అశోక్‌నగర్‌లో చాయ్‌ అడ్డామీద రాహుల్‌గాంధీతో చెప్పించిన 2 లక్షల ఉద్యోగాలపై గానీ, ఆడబిడ్డలకు ఇస్తానన్న నెలకు రూ. 2500 హామీలపై తాము చర్చించేందుకు సిద్ధమా అని ముఖ్యమంత్రి అన్నారు.. ఆయన చెప్పినట్లు ఆ అంశాలపై చర్చించేందుకు సిద్ధమేనని తేల్చిచెప్పారు.
ఈ రోజు కాకుంటే ఇంకే రోజైనా..
ముఖ్యమంత్రి మాటమీద నిలబడి చర్చకు వస్తే మంచిదన్నారు. ఒకవేళ ఈ రోజు వీలుకాకుంటే మరోరోజైనా తాము వచ్చేందుకు రెడీగా ఉన్నామని కుండబద్ధలుకొట్టారు. మీరు చెప్పిన సమయం, తేదీ నాడే రెడీగా ఉంటామని స్పష్టం చేశారు. ఏనాడు చర్చకు వచ్చినా రైతులకు కాంగ్రెస్ చేసిన మోసాలను ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, మరోసారి సవాల్‌ విసురుతున్నామని పేర్కొన్నారు.
అసెంబ్లీలోనైనా చర్చిద్దాం..
మేం ప్రజల సమక్షంలో తటస్థ వేదికపై చర్చిద్దామంటున్నామని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. ఒకవేళ అసెంబ్లీలో చర్చ చేసేందుకు కూడా సిద్ధమేనని చెప్పారు. కానీ గతంలో ఫార్మాసిటీ, ఫార్మర్స్‍ సమస్యలు లేవనెత్తిన సందర్భాల్లో అధికారపక్షం తమ మైక్‌ కట్‌ చేయించదని, సీనియర్లు, మాజీ మంత్రులు మాట్లాడినా ఆరేడుసార్లు మైక్‌ కట్‌ చేసిన ఉదంతాలు ఉన్నాయని ఉదహరించారు. అయితే అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం ఏనాడు సుముఖంగా లేదన్నారు. గతంలో ఫార్ములా-ఈపై, ఫార్మర్స్‍ సమస్యలపై, ఫార్మాసిటీపై చర్చకు తాము ప్రతిపాదిస్తే తప్పించుకొన్నదని దుయ్యబట్టారు. అందుకే స్పీకర్‌ను ఇబ్బంది పెట్టవద్దని ఉద్ధేశ్యంతో ప్రెస్‌క్ల‌బ్‌లో చర్చించేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. అయితే ఇప్పుడు అసెంబ్లీలో చర్చపెట్టి మైక్‌ కట్‌ చేయకుండా మాట్లాడే సమయం ఇస్తే, ముఖ్యమంత్రి మాటిస్తే చర్చించేందుకు రెడీగా ఉన్నాం..అయితే తమ ప్రతిపాదనలకు ఒప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.
చేతగాకుంటే తప్పుకొని కేసీఆర్‌కు అప్పజెప్పు...
అసెంబ్లీ సమావేశాలు నిర్వహించమని స్పీకర్‌కు కేసీఆర్‌ లేఖ రాయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరడం వింతగా ఉన్నదని ఎద్దేవా చేశారు. ‘మరీ కేసీఆరే అసెంబ్లీ పెట్టమని, కేసీఆరే ముందు చెప్పాలని, అన్ని నిర్ణయాలు ఆయననే చేయమంటే సీఎంగా రేవంత్‌రెడ్డి ఎందుకు? మీరు కదా ఆరు గ్యారెంటీలు, 420 హామీలిచ్చింది.. అమలు చేయాల్సిన బాధ్యతమీపైలేదా? అని ప్రశ్నించారు. ఒక వేళ పాలన చేయడానికి చేతగాకుంటే తప్పుకొని కేసీఆర్‌కు అప్పగిస్తే అప్పుడు ఏం జేయాలో అది చేసి చూపెడతామని స్పష్టం చేశారు.

]]>
Tue, 08 Jul 2025 18:56:05 +0530 admin
చర్చకు రావడానికి రేవంత్ కి దమ్ము లేదా?... కేటీఆర్ https://prajakshethrenews.com/చర్చకు-రావడానికి-రేవంత్-కి-దమ్ము-లేదా-కేటీఆర్ https://prajakshethrenews.com/చర్చకు-రావడానికి-రేవంత్-కి-దమ్ము-లేదా-కేటీఆర్ చర్చకు రావడానికి రేవంత్ కి దమ్ము లేదా?... కేటీఆర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూలై 6 : 
18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల రైతులు, కోట్లాది ప్రజలను నోటికొచ్చిన హామీలతో మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మొత్తం 420 హామీలిచ్చి, రచ్చ చేశారు కానీ చర్చకు రమ్మంటే పరార్ అవుతారని సెటైర్లు వేశారు. కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఆ సవాల్ స్వీకరించడంతో పాటు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం 11 గంటలకు చర్చకు రావాలని సూచించాం. మాట మీద నిలబడని నేత రేవంత్ రెడ్డి కనుక ప్రెస్ క్లబ్ లో మేం హాల్ బుక్ చేసి చర్చకు రమ్మని పిలిస్తే ఏ నేత కూడా రాలేదన్నారు.ఏ బేసిన్ ఏ నదిలో ఉందో కూడా తెలియని నేత తెలంగాణ ముఖ్యమంత్రా అని జనం నవ్వుకుంటున్నారు. నీళ్లు , నిధులు, నియామకాలు తెలంగాణ నినాదం. వీటిని రేవంత్ రెడ్డి ఎలా ఫాలో అవుతున్నాడంటే.. ఏపీ సీఎం చంద్రబాబుకు కృష్ణా, గోదావరి నీళ్లు ఇస్తున్నాడు. కోవర్టు పాలన నడుస్తోంది. నీళ్లు ఆంధ్రాకు పోతే, నిధులు ఢిల్లీకి పోతున్నాయి. నియామకాలు ఆయన తొత్తులకు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ఢిల్లీ పర్యటనపై ఓ కాంగ్రెస్ నేతతో మాట్లాడాను. రేవంత్ ఢిల్లీ ఎందుకు పోయాడని అడిగితే ఎరువుల బస్తాల కోసం ఢిల్లీకి వెళ్లాడని తెలిసింది. దూడకు గడ్డెయ్యాలని వెనుకటికి ఒకడు తాటిచెట్టు ఎక్కాడంట. రేవంత్ ఏ బస్తాలు తీసుకుని ఢిల్లీకి పోతున్నాడు. ఆయన ఓ పేటీఎం. పేమెంట్ కోటాలో సీఎం పదవి తెచ్చుకున్నాడు. రైతులు, మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, యువతపై ప్రేమ లేదు. హామీలు అమలు చేస్తలేదు. రైతు బంధు అయిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గం కోడంగల్ లో 670 మంది రైతులకు రైతు భరోసా రాని వారి జాబితా ఇదీ. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న 600 మంది రైతుల వివరాలు మేం వెల్లడిస్తున్నాం. ఎరువుల కొరతతో రైతులు అల్లాడుతున్నారు. ఒక్క ఆధార్ కు ఒక్క బస్తా ఇస్తాడంట. గత రోజులు తెస్తామన్నాడు. నిజంగానే కరెంట్ కోత, ఎరువులు, విత్తనాల కోసం లైన్లలో నిల్చునే రోజులు తెచ్చాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు, అణచివేతలు, ఎమర్జెన్సీని గుర్తుకుతెచ్చేలా పాలన చేస్తున్నాడు. నల్లబాలు అనే సోషల్ మీడియా వ్యక్తి ప్రశ్నించాడని కేసు పెట్టి అరెస్ట్ చేశారు. కేసీఆర్ హయాంలో రుణమాఫీ జరిగింది. పంట కాలానికి ముందే రైతు బంధు నగదు ఏ ఇబ్బంది లేకుండా వారి ఖాతాల్లో జమచేశాం. ఇప్పుడు మళ్లీ పైరవీల పాలన వచ్చింది. రైతుల ఆత్మహత్యలతో కూడా రేవంత్ రెడ్డి చలించడం లేదు. వర్షాకాలం వచ్చినా పంపు హౌజ్ లు బోర్లు ఆన్ చేసి నీళ్లు వదలడం లేదు. రైతులు కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. ఈరోజు చర్చకు రాకపోయినా ఎప్పుడు చర్చకు వస్తారో డేట్, ప్లేస్ చెప్పాలని ’ మరోసారి ఛాలెంజ్ చేశారు కేటీఆర్.
మీ ఇంటికి రమ్మంటావా..... 
రైతుల సంక్షేమంపై రేవంత్ అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే 600మందికి పైగా రైతులకు రైతు బంధు రాలేదన్నారు. రైతుల మరణాల లిస్టు కూడా రెడీగా ఉందని చెప్పారు. రైతుల సంక్షేమంపై చర్చించడానికి రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌కు కేటీఆర్ మరో సవాల్ విసిరారు. ‘‘సీఎం చర్చ ఎక్కడ పెట్టినా ఒకే. చర్చ కోసం అవసరమైతే రేవంత్ తన ఇంటికి రమ్మన్నా వెళ్తా. చర్చించే సత్తా లేకపోతే మరోసారి సవాళ్లు విసరొద్దు’’ అని కేటీఆర్ అన్నారు. దమ్ముంటే రేవంత్ చర్చకు రావాలి.. లేదా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి హామీలు అమలుచేయకుండా రంకెలు వేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు పక్కా అమలు చేస్తామంటూ బాండ్ పేపర్లు రాసిచ్చారు.. ఇప్పుడు అవి ఎటుపోయాయంటూ ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణను సాధిస్తే.. రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి తరలిపోతున్నాయని ఆరోపించారు. ఎరువుల బస్తాల కోసం రేవంత్ ఢిల్లీ వెళ్లలేదని.. ఢిల్లీ పెద్దల కోసం ఏం బస్తాలు తీసుకెళ్లారో అందరికీ తెలుసని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేతలు, అక్రమ కేసులు అన్న కేటీఆర్.. కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు.  రైతు సంక్షేమంపై అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమని ప్రకటించారు. 9 రోజుల్లో రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని విమర్శించారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ పెట్టాలని కేసీఆర్ లేఖ రాస్తే పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కేటీఆర్ ముందు కేసీఆర్‌తో లేఖ రాయించాలని సూచించారు.

]]>
Tue, 08 Jul 2025 18:45:49 +0530 admin
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడులు చేస్తే బీ ఆర్ ఎస్ నాయకులకు చుక్కలు చూపిస్తాం : కేంద్ర మంత్రి బండి సంజయ్ https://prajakshethrenews.com/ఏబిఎన్-ఆంధ్రజ్యోతి-మీద-దాడులు-చేస్తే-బీ-ఆర్-ఎస్-నాయకులకు-చుక్కలు-చూపిస్తాం-కేంద్ర-మంత్రి-బండి-సంజయ్ https://prajakshethrenews.com/ఏబిఎన్-ఆంధ్రజ్యోతి-మీద-దాడులు-చేస్తే-బీ-ఆర్-ఎస్-నాయకులకు-చుక్కలు-చూపిస్తాం-కేంద్ర-మంత్రి-బండి-సంజయ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడులు చేస్తే బీ ఆర్ ఎస్ నాయకులకు చుక్కలు చూపిస్తాం : కేంద్ర మంత్రి బండి సంజయ్

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ : 

పాతబస్తీ సల్కం చెరువు భూమిలో అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన కాలేజీ జోలికి పోబోమని, ఒకవేళ చర్యలు తీసుకుంటే అన్యాయం జరుగుతుందని హైడ్రా కమిషనర్ చెప్పడం మూర్ఖత్వం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమా? సంబంధిత అధికారి నిర్ణయమా? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.అక్బరుద్దీన్ ఒవైసీకి కొమ్ములున్నాయా? ఎందుకు మినహాయింపు ఇవ్వాలి? అట్లయితే మూసీ పరివాహక ప్రాంతంలో గుడిసెలు, చిన్న చిన్న ఇండ్లు కట్టుకుని జీవిస్తున్న వేలాది మంది పేదల ఇండ్లను కూల్చేశారు కదా? వాళ్లు మనుషులు కాదా? వాళ్ల ప్రాణాలకు విలువ లేదా? అక్బరుద్దీన్ కాలేజీ భవనంపై యాజమాన్యానికి నోటీసులెందుకు ఇవ్వలేదు. వెంటనే ఖాళీ చేయాలని నోటీసులిచ్చి విద్యా సంవత్సరం ముగిశాక కూల్చేస్తామంటే సరిపోయేది కదా? ఆ పని ఎందుకు చేయలేదు? ఒక్క అక్బరుద్దీన్ కుటుంబానికే విలువ ఉందా? పేదలకు విలువ లేదా?కానిస్టేబుళ్లపై దాడి చేసే ఒవైసీ మనుషులకు వాళ్లకు వత్తాసు పలుకుతారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జా చేస్తే వత్తాసు పలుకుతారు. తీవ్రవాదులతో సంబంధాలున్న వాళ్లకు ఉద్యోగాలిస్తుంటే వత్తాసు పలుకుతారు. ఇదేం పద్దతి? ఒవైసీ ఆస్తులకు, అరాచకాలకు హైడ్రా మినహాయింపు ఇచ్చిందా? వాళ్లు ఏమైనా కబ్జాలు చేయొచ్చా? అరాచకాలు చేయవచ్చా? తక్షణమే సీఎం సమాధానమివ్వాలి.మొన్న మహా టీవీ పై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులు ఆంధ్రజ్యోతిలో వాళ్లకు వ్యతిరేకంగా ఎడిటోరియల్ రాస్తే ఆ పేపర్, టీవీపై కూడా దాడి చేసేందుకు సిద్ధమవుతున్న పోలీసుల నుండి సమాచారం వచ్చింది. ఇదేం పద్దతి? మహా టీవీపై దాడి చేసినప్పుడు వాళ్లను అరెస్ట్ చేసి కఠినంగా వ్యవహరిస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా? మీరు ఏబీఎన్ మీద దాడి చేసి చూపించండి. మా అధ్యక్షులు రామచంద్రరావు ఆదేశాల మేరకు యువ మోర్చా కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులకు చుక్కలు చూపిస్తారు. తెలంగాణలో ఇక బీఆర్ఎస్, కేటీఆర్ జాగీర్ కాదు. వాడు వీడు అని మాట్లాడితే రోడ్ల మీద నీ కాన్వాయ్ కూడా తిరగదు. రాధాక్రిష్ణ అన్నట్లుగా ‘తెలంగాణకు ముందు మీ బతుకేంది? ఆనాడు రబ్బర్ చెప్పులు, ముడతల చెప్పులు వేసుకున్న బతుకు నీది. ఇయాళ వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి? తెలంగాణ ఉద్యమంలో మీరెన్నడైనా లాఠీదెబ్బలు తిన్నారా? జైలుకు వెళ్లారా? ఇయాళ వేల కోట్లు సంపాదించి దుబాయి, మస్కట్ లో వ్యాపారాలు చేస్తోంది నిజం కాదా? తెలంగాణకు ముందు ఫైనాన్స్ పైసలు కట్టలేకపోతే కేసీఆర్ కారును కూడా గుంజుకు పోయింది నిజం కాదా? నా కొడుకు కొత్త షర్ట్ వేసుకుంటే కేసీఆర్ కొడుకు ఇస్టమొచ్చినట్లు ట్రోలింగ్ చేశారు. నా కొడుకుతో కొట్లాడే స్థాయి కేటీఆర్ ది. నేను మొన్ననే చిన్న పాత ఇల్లు కట్టుకున్నా. నాకు వేల కోట్ల ఆస్తులున్నయని ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ను సవాల్ చేస్తున్నా... ఎవరికి ఎన్ని ఆస్తులున్నాయో, ఎవరికి వేల కోట్ల బినామీ ఆస్తులున్నాయో తేల్చుకుందాం. దేవుడి వద్దకు వెళ్లి ప్రమాణం చేద్దాం.. దమ్ముంటే రావాలి.ఆనాడు తెలంగాణ కోసం మాతోపాటు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి మద్దతిస్తూ... కేసీఆర్ కుటుంబం ఎన్ని తప్పులు చేసినా ఆయనకు బాహాటంగా మద్దతిచ్చింది. ఆయనను హీరో చేసింది. ఇయాళ అదే పేపర్, టీవీ మీరు చేసిన తప్పులను ఎత్తి చూపితే మాత్రం తెలంగాణ వ్యతిరేక టీవీ, పత్రికని దాడులు చేయాలనుకుంటున్నారా? అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నడు? దాడి చేస్తామని అన్న వెంటనే లోపలేసి బొక్కలే వేయకుండా మీనమేషాలు వేస్తోంది. టెన్త్ హిందీ పేపర్ లీక్ పేరుతో నన్ను, డ్రోన్ ఎగరేశారనే సాకుతో రేవంత్ రెడ్డి జైల్లో వేసి బెయిల్ రాకుండా చేసింది. మరి రేవంత్ కు ఆ పౌరుషం ఎటు పోయింది?  వాళ్లను ఎందుకు జైల్లో వేస్తలేవు? వాళ్లతో ఎందుకు కుమ్మక్కైనట్లు?నేనడుగుతున్నా.. కాళేశ్వరంలో లక్ష కోట్లు దోచుకుంది నిజం కాదా? ఫోన్ ట్యాపింగ్ పేరుతో అందరి జీవితాలను నాశనం చేసింది వాస్తవం కాదా? ఈ ఫార్ములా కేసులో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పినా ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? డ్రగ్స్ కేసులో, ఫాంహౌజ్ కేసులో, గొర్రెల స్కాం, విద్యుత్ కొనుగోళ్ల స్కాంలో కేసీఆర్ కుటుంబ పాత్ర ఉన్నది నిజమా? కాదా? అయినా ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చట్టం కేసీఆర్ చుట్టంగా మారింది.ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేసిన 2 గంటల్లోపే టీ ఛానల్ పై దాడి తప్పదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలను ఆదేశించారు. అంతే తప్ప మీ ఊకదంపుడు హెచ్చరికలకు, దాడులకు  తెలంగాణ ప్రజలు భయపడరు. అసలు ఇట్లాంటి వాటిని సమర్దించే వాళ్లకు సిగ్గుండాలి. అట్లాంటోళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడటం వారి అసమర్ధతకు నిదర్శనం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, మీడియాకు బాసటగా నిలిచేందుకు బీజేపీ సిద్ధం. తెలంగాణలోని లక్షలాది మంది కార్యకర్తలు అండగా ఉంటారని పేర్కొన్నారు..

]]>
Mon, 07 Jul 2025 17:59:26 +0530 admin
ఒవైసీ కాలేజీలను కూల్చేస్తారా... లేదా? : కేంద్రమంత్రి బండి సంజయ్ https://prajakshethrenews.com/ఒవైసీ-కాలేజీలను-కూల్చేస్తారా-లేదా-కేంద్రమంత్రి-బండి-సంజయ్ https://prajakshethrenews.com/ఒవైసీ-కాలేజీలను-కూల్చేస్తారా-లేదా-కేంద్రమంత్రి-బండి-సంజయ్ ఒవైసీ కాలేజీలను కూల్చేస్తారా... లేదా?  : కేంద్రమంత్రి బండి సంజయ్
ప్రజా క్షేత్ర్, కరీంనగర్, జూలై 7 :
ఆక్రమ నిర్మాణాల పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు చెరువులు, కుంటల్లో భవంతులు నిర్మించి కాలేజీలు, వ్యాపారాలు చేసుకుంటున్న అక్బరుద్దీన్  ఒవైసీ కుటుంబానికి మినహాయింపు ఏమైనా ఇచ్చారా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. అక్బరుద్దీన్ కాలేజీలో 10 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నందున అక్రమ నిర్మాణాలైనా వాటిని కూల్చలేమని చెబుతున్న హైడ్రా అధికారులు... ఏ జీవనాధారం, గూడు లేక మూసీ పరివాహక ప్రాంతాల్లో కట్టుకున్న గుడిసెల్లో, చిన్న చిన్న ఇండ్లను ఎందుకు కూల్చివేశారని నిలదీశారు. ‘‘అక్బరుద్దీన్ కుటుంబానికే విలువ ఉంటుందా? పేదల ప్రాణాలకు, జీవితాలకు విలువ లేదా? వాళ్లు మనుషులు కాదా? ఎంఐఎం నాయకులు పోలీసులను కొడితే చర్యలు తీసుకోరు. కరెంట్ బిల్లులు కట్టకుంటే వత్తాసు పలుకుతారా? ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జా చేస్తే వత్తాసు పలుకుతారు? ఆఖరికి తీవ్రవాదులతో సంబంధాలున్న వాళ్లకు ఉద్యోగాలిచ్చి పోషిస్తుంటే పట్టించుకోరు? ఇదేం పద్దతి..’’అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కథనాలు రాసిందనే కారణంతో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై ఆ పార్టీ నాయకులు దాడి చేసేందుకు సిద్ధమవడంపైనా కేంద్ర మంత్రి నిప్పులు చెరిగారు. మీడియాపై దాడులు చేస్తుంటే ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. ‘‘రేవంత్ రెడ్డి.. మీకు పౌరుషం లేదా? మిమ్ముల్ని ఆకారణంగా జైల్లో వేసి బెయిల్ రాకుండా చేశారు కదా? అవన్నీ మర్చిపోయి వాళ్లతో కుమ్కక్కైపోయారా? కాళేశ్వరం, ఈఫార్ములాసహా అనేక స్కాంలు చేసిన కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేసి బొక్కలో  వేయడం లేదు’’అని నిలదీశారు. మహా టీవీపై దాడి చేసినప్పుడే కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు కదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని, మీడియా స్వేచ్ఛను కాపాడే విషయంలో బీజేపీ ముందుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు ‘‘మీకు దమ్ముంటే ఏబీఎన్, ఆంధ్రజ్యొతిపై దాడులు చేసి చూడండి. మీరు దాడి చేసిన రెండే రెండు గంటల్లోనే మీ బీఆర్ఎస్ ఆఫీస్ ను, అందులోని టీవీ ఛానల్ సంగతి మా బీజేవైఎం నాయకులు చూస్తరు.’’  అని స్పష్టం చేశారు

]]>
Mon, 07 Jul 2025 17:44:31 +0530 admin
91 గ్రామాలకు సోలార్ వెలుగులు https://prajakshethrenews.com/91-గ్రామాలకు-సోలార్-వెలుగులు https://prajakshethrenews.com/91-గ్రామాలకు-సోలార్-వెలుగులు 91 గ్రామాలకు సోలార్ వెలుగులు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూలై 7 :
తెలంగాణలో 81 గ్రామాలను రూ. 1,273 కోట్లతో సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా మార్చేందుకు రెడ్కో టెండర్లు పిలిచింది. ఇందులో రూ. 400 కోట్లు కేంద్రం, రూ. 873 కోట్లు రాష్ట్రం భరిస్తాయి. 16,840 వ్యవసాయ బోర్లు, 40,349 ఇళ్లకు సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తారు. రైతులు మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అందించి యూనిట్‌కు రూ. 3.13 ఆదాయం పొందవచ్చు. ఈ పథకం విజయవంతమైతే.. గ్రామాల్లో కరెంట్ బిల్లుల భారం పూర్తిగా తగ్గుతుంది.తెలంగాణ వ్యాప్తంగా 81 గ్రామాలను సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలకు మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇళ్ల పైకప్పులు, వ్యవసాయ బోర్లకు, ఇతర విద్యుత్ కనెక్షన్లన్నింటికీ సౌరశక్తిని వినియోగించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు రూ. 1,273 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ కింద సౌర ఫలకాల ఏర్పాటుకు రెడ్కో టెండర్లను ఆహ్వానించింది. మొత్తం వ్యయంలో రూ. 400 కోట్లను కేంద్ర నూతన ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ రాయితీగా అందించనుంది. మిగిలిన రూ. 873 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. జూలై 24లోగా టెండర్లను దాఖలు చేయాలని రెడ్కో సూచించింది.ఈ 81 గ్రామాల్లో 16,840 వ్యవసాయ బోర్లు ఉన్నాయి. ఒక్కో బోరుకు 7.5 కిలోవాట్ల స్థాపిత సామర్థ్యం గల సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తారు. సౌర విద్యుత్ ద్వారా ఉత్పత్తి అయిన కరెంటును బోరుకు వాడుకున్న తర్వాత మిగిలింది సాధారణ గ్రిడ్‌కు సరఫరా అవుతుంది. ఈ విధంగా సరఫరా చేసిన విద్యుత్‌కు గాను బోరు యజమానికి యూనిట్‌కు రూ. 3.13 చొప్పున డిస్కంలు చెల్లిస్తాయి. దీనివల్ల రైతలకు పంటల సాగుతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.ప్రస్తుత అంచనాల ప్రకారం 7.5 కిలోవాట్ల సామర్థ్యంతో ఫలకాలను ఏర్పాటు చేయడానికి దాదాపు రూ. 4.50 లక్షల వరకూ ఖర్చవుతుంది. ఇందులో 30 శాతం కేంద్రం రాయితీగా ఇస్తుంది. మిగిలిన సొమ్మునంతా రైతుల తరఫున ఈ 81 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా సౌర కంపెనీలకు చెల్లిస్తుంది. ఇది రైతులపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ గ్రామాల్లో ఉన్న 40,349 ఇళ్లపై ఒక్కోదానికి 2 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ పలకాలను ఏర్పాటు చేయాలని రెడ్కో మరో టెండర్ పిలిచింది. మొత్తం 80,698 కిలోవాట్ల స్థాపిత సామర్థ్యంతో ఈ ఫలకాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.వ్యవసాయ బోర్లు (126.30 మెగావాట్లు), గృహాలు (80.69 మెగావాట్లు) కలిపి మొత్తం 206.99 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో సౌర ఫలకాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకానికి మొత్తం రూ. 1,273 కోట్లు కేటాయించినందున, సగటున ఒక మెగావాట్‌కు రూ. 6.15 కోట్లు వెచ్చించనున్నారు. భూమి అందుబాటులో ఉంటే మెగావాట్‌కు రూ. 4 కోట్లలోపే ఖర్చవుతుందని రెడ్కో అంచనా వేస్తున్నప్పటికీ, ఈ గ్రామాల్లో భూసేకరణ లేకుండా బోర్ల వద్ద, ఇళ్లపై సౌరవిద్యుత్ ఏర్పాటుకు ఈ వ్యయం చేయనున్నారు.ఈ పైలట్ పథకం ఈ 81 గ్రామాల్లో విజయవంతమైతే, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని గ్రామాల్లో సౌరవిద్యుత్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. కాగా, ఈ సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తే ఈ గ్రామాల్లో కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన పనిలేదు. ఇప్పటికే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుండగా..ఇకపై దాని అవసరం కూడా ఉండకపోవచ్చు

]]>
Mon, 07 Jul 2025 11:20:04 +0530 admin
పల్లెలకు ఇంటర్నెట్ సేవలు https://prajakshethrenews.com/పల్లెలకు-ఇంటర్నెట్-సేవలు https://prajakshethrenews.com/పల్లెలకు-ఇంటర్నెట్-సేవలు పల్లెలకు ఇంటర్నెట్ సేవలు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూలై 7 :
తెలంగాణ ప్రభుత్వం టి-ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని కోటి ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడం ద్వారా విద్యార్థులు అంతర్జాతీయ విజ్ఞానాన్ని పొందుతున్నారని AI సంబంధిత సంస్థ 'పెర్‌ప్లెక్సిటీ' సహ-వ్యవస్థాపకుడు, CEO అరవింద్ శ్రీనివాస్ ఇటీవల 'ఎక్స్'లో ప్రశంసించారు. వాయిస్ మోడ్ ద్వారా రీసెర్చ్ అసిస్టెంట్‌ను ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకుంటూ పాఠ్యపుస్తకాలకు మించిన విజ్ఞానాన్ని విద్యార్థులు పొందుతున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి అరవింద్ శ్రీనివాస్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అరవింద్ శ్రీనివాస్ ప్రశంసలకు స్పందిస్తూ,.. మంత్రి శ్రీధర్‌బాబు కూడా 'ఎక్స్'లో ధన్యవాదాలు తెలిపారు. గత ఆగస్టులో తాను అరవింద్ శ్రీనివాస్‌ను కలిసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధ (AI)కి ఇస్తున్న ప్రాధాన్యాన్ని, టి-ఫైబర్ ద్వారా మారుమూల పల్లెల్లోనూ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు చేస్తున్న కృషిని వివరించినట్లు గుర్తు చేశారు. 'మా ప్రభుత్వ కృషి వల్ల అడవి శ్రీరామపూర్ వంటి ప్రాంతాల్లోని విద్యార్థులు కూడా 'పెర్‌ప్లెక్సిటీ AI' వంటి సిలికాన్ వ్యాలీ-గ్రేడ్ టెక్నాలజీలను యాక్సెస్ చేయగలుగుతున్నారు. డిజిటలీకరణలో గ్రామీణ-పట్టణ అంతరాన్ని తగ్గించడానికి తెలంగాణ కట్టుబడి ఉంది. మా పురోగతిని వేగవంతం చేయడంలో మాతో కలిసి పనిచేయాలని ఆహ్వానిస్తున్నా.' అని శ్రీధర్ బాబు వెల్లడించారు.టి-ఫైబర్ (తెలంగాణ ఫైబర్ గ్రిడ్) ప్రాజెక్ట్ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రభుత్వ కార్యాలయాలకు, వ్యాపార సంస్థలకు, విద్యాసంస్థలకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల ఆన్‌లైన్ విద్య, రిమోట్ లెర్నింగ్ అవకాశాలు మెరుగుపడతాయి. విద్యార్థులు ప్రపంచ స్థాయి విజ్ఞానాన్ని పొందగలరు. టెలిమెడిసిన్ సేవలు అందుబాటులోకి వచ్చి, మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువవుతాయి. చిన్న వ్యాపారాలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి అవకాశం లభిస్తుంది. ఈ-గవర్నెన్స్ సేవలు ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి.

]]>
Mon, 07 Jul 2025 11:16:03 +0530 admin
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజిక వర్గానికి అన్ని పార్టీలు సముచిత అవకాశాలు కల్పించాలి : ఎమ్మెల్సీ కవిత https://prajakshethrenews.com/స్థానిక-సంస్థల-ఎన్నికల్లో-ఎరుకల-సామాజిక-వర్గానికి-అన్ని-పార్టీలు-సముచిత-అవకాశాలు-కల్పించాలి-ఎమ్మెల్సీ-కవిత https://prajakshethrenews.com/స్థానిక-సంస్థల-ఎన్నికల్లో-ఎరుకల-సామాజిక-వర్గానికి-అన్ని-పార్టీలు-సముచిత-అవకాశాలు-కల్పించాలి-ఎమ్మెల్సీ-కవిత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజిక వర్గానికి అన్ని పార్టీలు సముచిత అవకాశాలు కల్పించాలి : ఎమ్మెల్సీ కవిత

ఏకలవ్యుడి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ప్రజా క్షేత్ర్,, హైదరాబాద్ : 

ఏకలవ్యుడు భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ట్యాంక్ బండ్ వద్ద జరిగిన ఏకలవ్యుడి జయంతి ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కెసిఆర్ మొదలుపెట్టిన ఏకలవ్యుడు భవన నిర్మాణాన్ని పూర్తి చేయని దారుణ పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.  కేసీఆర్ ఎరుకల ఎంపవర్మెంట్ స్కీంని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, పలు సందర్భాల్లో నేను శాసనమండలిలో ఈ అంశాన్ని లేవనెత్తానన్నారు. అయినా కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమన్నారు.50 వేల ఎరుకల కుటుంబాలకు రూ 60 కోట్ల మేర లబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని మరింత మెరుగుపరిచి ప్రభుత్వం యధాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎరుకల సామాజిక వర్గ రాజకీయ అభివృద్ధి కోసం కూడా అందరూ కృషి చేయాలన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజిక వర్గానికి అన్ని పార్టీలు సముచిత అవకాశాలు కల్పించాలన్నారు.రూ 500 కోట్లతో తక్షణమే ఎరుకల కార్పొరేషన్ లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.బహుజనుల పట్ల ఏ విధంగా అణిచివేత ఉందని చెప్పడానికి ఏకలవ్యుడి జీవితమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చారు. చరిత్రలో నిలబడిపోయే త్యాగం చేసిన ఏకలవ్యుడి అందరికీ స్ఫూర్తి ప్రదాత అని, సమాజానికి మంచి మార్గం చూపించే ప్రయత్నం చేసి ఆరాధ్య దైవమయ్యారు బహుజనలకు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు దక్కాలన్న ఉద్యమంలో పాల్పంచుకోవడం సంతోషంగా ఉంది.రాబోయే రోజుల్లో ఏకలవ్యుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించుకునే ప్రయత్నం చేద్దామని పేర్కొన్నారు.

]]>
Sun, 06 Jul 2025 16:10:15 +0530 admin
దమ్ముంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేసి..బీసీ నీ సీఎం చేయండి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు https://prajakshethrenews.com/దమ్ముంటే-రేవంత్-రెడ్డి-రాజీనామా-చేసిబీసీ-నీ-సీఎం-చేయండి-బీజేపీ-రాష్ట్ర-అధ్యక్షుడు-ఎన్రామచంద్రరావు https://prajakshethrenews.com/దమ్ముంటే-రేవంత్-రెడ్డి-రాజీనామా-చేసిబీసీ-నీ-సీఎం-చేయండి-బీజేపీ-రాష్ట్ర-అధ్యక్షుడు-ఎన్రామచంద్రరావు దమ్ముంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేసి..బీసీ నీ సీఎం చేయండి
*నేను బిజెపి అద్యక్షపదవికి రాజీనామా చేసి బిసి ని అద్యక్షున్ని చేస్తా
*బీసీ రిజర్వేషన్లు విషయంలో కాంగ్రెస్ బీసీ లను మోసం చేసింది
*ప్రజా సమస్యలే మా ప్రధాన ఏజెండా
*AICC అంటే ఆల్ ఇండియా ఛీటింగ్ కమిటి అన్నట్టుగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్.
*సమర భేరి” సభలో మోదీ,బిజెపి, ఆర్ఎస్ఎస్‌ను విమర్శించడమే తప్పమాట్లాదిండి ఏమిలేదు
* ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత సైనికుల త్యాగాలను కించపరిచేలా మాట్లాడే వాళ్లు ప్రజల క్షమాపణ చెప్పాలి.
* మతపరమైన రిజర్వేషన్స్ కు బిజెపి వ్యతిరేకం
* కేంద్ర ప్రభుత్వ నిధులపై కాంగ్రెస్ చర్చకు సిద్ధమా..?
* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూలై 5 :
మామూలు కార్యకర్తగా పార్టీలో పనిచేస్తూ, సైకిళ్లపై తిరుగుతూ పోస్టర్లు అంటించడం, బ్యానర్లు వేయడం, బూత్ ఏజెంట్‌గా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేయడం ద్వారా నా రాజకీయ ప్రయాణం బిజెపిలో ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు అన్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఎన్. రాంచందర్ రావు   బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాదారు.విద్యార్థి పరిషత్‌లో ఉన్న సమయంలో ప్రారంభించిన ఉద్యమ స్వభావం, బిజెపిలో కొనసాగించాను.దేశంలో సొంత మెజార్టీతో బిజెపి ప్రభుత్వం 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి ద్వారా అధికారంలో ఉంది.ఇటువంటి బలమైన పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్న నాకు, పార్టీ అధిష్టానం నమ్మకంతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతను అప్పజెప్పడం, నేను పనిచేసిన కృషికి గుర్తింపుగా భావిస్తున్నాను.బిజెపి అంటే కార్యకర్తల పార్టీ. ఈ రోజు తెలంగాణలో 40 లక్షల మంది కార్యకర్తలు బూత్ స్థాయిలో అహర్నిశలు పనిచేస్తున్నారు.బిజెపి బలోపేతం వెనుక వేలాది మంది కార్యకర్తల త్యాగాలు ఉన్నాయి. వారి ప్రాణత్యాగాలే బిజెపిని 14 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు.నేను కూడా ఒక కార్యకర్తగా అహోరాత్రులు పార్టీ కోసం కృషి చేశాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీలు రెండు విఫలమైన ప్రభుత్వాలు.ఈ రోజు తెలంగాణ ప్రజలు బిజెపిని అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు. ప్రజలు బిజెపికి ఒక అవకాశం ఇవ్వాలనే భావనతో ఎదురుచూస్తున్నారు.గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రజలను మభ్యపెట్టే హామీలు ఇచ్చింది. రైతులు, మహిళలు, విద్యార్థులకు అనేక రకాల హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, “డబ్బుల్లేవు... ప్రభుత్వం భిక్షాటన స్థితిలో ఉంది... ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని ఏడుస్తోందని ఎద్దేవా చేసారు..రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ హామీలు ఎలా ఇచ్చింది... ఇది ప్రజలను మోసం చేసే ఆలోచనే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ఇవాటిలో ఏవీ అమలు చేయలేదు.రైతుల రుణ మాఫీను పూర్తిగా చేయకుండా మధ్యలో నిలిపివేశారు. రైతు భరోసా పేరుతో రూ. 15 వేలు ఇస్తామని చెప్పి రూ. 12 వేలకు తగ్గించారు. ఇప్పటివరకు రెండు దఫాలు మోసం చేశారు. మళ్లీ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా రూ. 6 వేలు చొప్పున మాత్రమే రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకున్నారు.రైతులను మోసం చేస్తే, దగా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.బిజెపి పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని తెలుసుకున్న కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది.“తెలంగాణలో యూరియా లేదంటూ” దుష్ప్రచారం చేస్తున్నారు.యూరియా కొరత యూపీఏ ప్రభుత్వంలోనే వచ్చింది. ఆ సమయంలో యూరియాకు రైతులు షాపుల ముందు క్యూలలో నిలబడాల్సి వచ్చేది. యూరియా దొరక్క రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు జరిగాయి.కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం తెలంగాణకు అవసరమైన మేరకు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసింది. అదనంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మంజూరు చేసింది.కేంద్రం పంపిన యూరియాను సకాలంలో సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఆ యూరియాను ఏమయ్యిందో చెప్పాలి. యూరియా సరఫరా విషయంలో బిజెపి చర్చకు సిద్ధంగా ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమా..?గ్రెస్ నిర్వహించిన “సామాజిక న్యాయ సమర భేరి” సభలో మోదీ , బిజెపి, ఆర్ఎస్ఎస్‌ను విమర్శించడమే తప్ప సామాజికంగా వెనుకబడిన వర్గాల గురించి కనీసం మాట్లాడలేదు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజల గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు.కాంగ్రెస్ అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ ముక్త్ భారత్ కోరుతూ వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీని ఓడించారు.బిజెపి ప్రజల కోసం పనిచేసే పార్టీ, కాంగ్రెస్ అధికారం కోసం, అవినీతి కోసం పనిచేసే పార్టీ.AICC అంటే All India Cheating Committee అన్నట్టుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్.అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రజల మధ్య విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది కాంగ్రెస్. ఇంత తక్కువ కాలంలో ఇంతటి వ్యతిరేకత వచ్చిన పార్టీ మరొకటి లేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధిచెబుతారు.నిన్నటి సభలో భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 ఎమ్మెల్యేలు, 15 ఎంపీ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. బహుశా ఆ కాంగ్రెస్ నాయకులు టంగ్ స్లిప్ అయి మాట్లాడినట్లున్నారు. 100 మంది ఎమ్మెల్యేలు, 15  ఎంపీ సీట్లు బిజెపి గెలుస్తుందని చెప్పబోయి పొరపాటుగా కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు.రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు “కాంగ్రెస్ ముక్త్ భారత్” అని నినదిస్తారన్నారు.ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి ధర్మయుద్ధం చేస్తుంది.గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. బిజెపి మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు రూ. 4 వేల భృతి ఇస్తామని చెప్పి ఆ హామీని మర్చిపోయారు.సంపదతో ఉన్న తెలంగాణను భిక్షాటన చేసే స్థితికి తీసుకువచ్చారు.బిజెపి నాయకులు అందరి సహకారంతో, కార్యకర్తల బలంతో తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తాం.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ల నుంచి జడ్పీటీసీల వరకు అన్ని సీట్లలో బిజెపి పోటీ చేస్తుంది. అత్యధిక స్థానాల్లో గెలుస్తుంది.హర్యానా, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ప్రజలు బిజెపిని గెలిపించినట్లుగా తెలంగాణలోనూ గెలిపిస్తారు.బిజెపి పరిపాలనలో అవినీతి ఉండదు, అబద్ధాలు ఉండవు.తెలంగాణను వికసిత రాష్ట్రంగా మార్చేందుకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరం. అందుకు కార్యకర్తలంతా కృషి చేయాలి.బిజెపి బలోపేతం అవుతోంది. త్వరలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం."సెక్యులరిజం", "సోషలిజం" వంటి పదాలు కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ తర్వాత రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. కాంగ్రెస్ మతపరమైన రాజకీయాలతో ఈ పదాలను చేర్చింది. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులను కాలరాసిన పార్టీ కాంగ్రెస్.ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత సైనికుల త్యాగాలను కించపరిచేలా మాట్లాడే వాళ్లు ప్రజల ముందుకి వచ్చి క్షమాపణ చెప్పాలి.బడుగు, బలహీన వర్గాల కోసం మోదీ ప్రభుత్వం కృషిచేస్తోంది.  స్వయంగా ప్రధానమంత్రి మోదీ  బ్యాక్‌వర్డ్ క్లాస్‌కు చెందినవారు.బిజెపి పాలిత రాష్ట్రాల్లో సగం మందికిపైగా ముఖ్యమంత్రులు బ్యాక్‌వర్డ్ వర్గాలకు చెందినవారే ఉన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో బిజెపికి విశేష ఆదరణ లభిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యేలు, లోక్‌సభలో 8 ఎంపీ స్థానాల్లో గెలుపుతో పాటు, తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లలో విజయం సాధించాం. ఇవి బిజెపి బలపడుతున్న సంకేతాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటు శాతం స్థిరంగా పెరుగుతుండటం ప్రజల విశ్వాసానికి నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది. అసలు ఆ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ఆలోచన లేదు. కేవలం బీసీలను బిజెపి పార్టీ నుంచి డైవర్ట్ చేసేందుకే రిజర్వేషన్ల హామీ ఇచ్చింది.42 శాతం రిజర్వేషన్ల విషయంలో తీసుకొచ్చిన బీసీ బిల్లుకు బిజెపి మద్దతు ఇచ్చింది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే నన్నారు..కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయే సమయానికి రాష్ట్రంలో లక్షా 30 వేల ఉద్యోగ ఖాళీలు ఉండేవి. మరి ఆ ఖాళీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయలేదు..?తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ. 12 లక్షల కోట్ల నిధులు ఇచ్చింది. దీనిపై కాంగ్రెస్ చర్చకు సిద్ధమా..? అని ప్రశ్నించారు

]]>
Sat, 05 Jul 2025 22:29:07 +0530 admin
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ https://prajakshethrenews.com/బీజేపీ-రాష్ట్ర-అధ్యక్షులుగా-రామచంద్రరావు-బాధ్యతల-స్వీకరణ https://prajakshethrenews.com/బీజేపీ-రాష్ట్ర-అధ్యక్షులుగా-రామచంద్రరావు-బాధ్యతల-స్వీకరణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూలై 5 :
తెలంగాణ బీజేపీ చీఫ్‌ గా రామచందర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో కిషన్‌రెడ్డి నుంచి రామచందర్‌రావు బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ డీకే ఆరుణ, బీజేపీ ఎమ్మెల్యే లు హాజరయ్యారు. రామచందర్‌రావు తన నివాసం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సరస్వతీ దేవి ఆలయంలో, చారిత్రక చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డి నుంచి అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకుంటున్నందుకు గొప్పగా ఉండడంతో పాటు సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు బిజెపి అండగా నిలబడుతుందని రామచందర్ రావు స్పష్టం చేశారు. కొత్త అధ్యక్షుడికి బిజెపి శ్రేణులు అభినందనలు తెలిపారు.

]]>
Sat, 05 Jul 2025 18:49:19 +0530 admin
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి రైతు బంధు వెయ్యడు : కేటీఆర్ కీలక వ్యాఖ్యలు https://prajakshethrenews.com/స్థానిక-సంస్థల-ఎన్నికల-తర్వాత-రేవంత్-రెడ్డి-రైతు-బంధు-వెయ్యడు-కేటీఆర్-కీలక-వ్యాఖ్యలు https://prajakshethrenews.com/స్థానిక-సంస్థల-ఎన్నికల-తర్వాత-రేవంత్-రెడ్డి-రైతు-బంధు-వెయ్యడు-కేటీఆర్-కీలక-వ్యాఖ్యలు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి రైతు బంధు వెయ్యడు  కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
రైతులకు ఎకరానికి రూ.15 వేలు మూడు పంటలు వేస్తానని అన్నాడు ఎవరికైనా పడ్డాయా? స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు రైతు భరోసా డబ్బులు వేశాడని టీ ఆర్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికలు అయిపోయాక రైతుబంధుకు రాం రాం.. నాలుగు పంటలు కలిసి అసలు పట్టాదారు రైతులకు రూ.24 వేల కోట్లు, కౌలు రైతులకు రూ.15 వేల కోట్లు మొత్తం రూ.39 వేల కోట్లు ఎగగొట్టాడని, రైతు రుణమాఫీ రూ.38 వేల కోట్లు ఎగగొట్టిండని, కేసీఆర్ నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తే, రేవంత్ రెడ్డి ఓట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తున్నాడని  కేటీఆర్ విమర్శించారు.

]]>
Sat, 05 Jul 2025 18:44:22 +0530 admin
భాగ్యలక్ష్మి దేవాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు పూజలు https://prajakshethrenews.com/భాగ్యలక్ష్మి-దేవాలయంలో-బీజేపీ-రాష్ట్ర-అధ్యక్షుడు-ఎన్-రామచంద్ర-రావు-పూజలు https://prajakshethrenews.com/భాగ్యలక్ష్మి-దేవాలయంలో-బీజేపీ-రాష్ట్ర-అధ్యక్షుడు-ఎన్-రామచంద్ర-రావు-పూజలు పార్టీ నాకు గొప్ప అవకాశం ఇచ్చింది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
పార్టీ నాకు గొప్ప అవకాశం ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు అన్నారు. శనివారం నాడు అయన  పాత బస్తి భాగ్యలక్షి ఆలయంలో పూజలు జరిపారు.  తరువాత మీడియాతో మాట్లాడారు. ఇవాళ అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకుంటున్నాను. కిషన్ రెడ్డి నేతృత్వం అనేక సంవత్సరాలుగా రాష్ట్ర బిజెపికి మార్గదర్శకం అయింది. కిషన్ రెడ్డి నుంచి అధ్యక్షుడిగా చార్జ్ తీసుకుంటున్నందుకు గొప్పగా అనిపిస్తుంది. సంతోషంగా ఉంది. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై నిండుగా ఉండాలి. తెలంగాణ సస్యశ్యామలoగా ఉండాలని, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నా. తెలంగాణ ప్రజలకు బిజెపి అండగా నిలబడుతుంది. అందుకు శక్తినివ్వాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నానని అన్నారు.

]]>
Sat, 05 Jul 2025 18:39:00 +0530 admin
ఉప్పుగూడ బోనాలలో పాల్గొనాలని స్వామి గౌడ్ కు ఆహ్వానం https://prajakshethrenews.com/ఉప్పుగూడ-బోనాలలో-పాల్గొనాలని-స్వామి-గౌడ్-కు-ఆహ్వానం https://prajakshethrenews.com/ఉప్పుగూడ-బోనాలలో-పాల్గొనాలని-స్వామి-గౌడ్-కు-ఆహ్వానం ఉప్పుగూడ బోనాలలో పాల్గొనాలని స్వామి గౌడ్ కు ఆహ్వానం

ప్రజా క్షేత్ర్, చార్మినార్ : 

ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయ 76వ వార్షిక బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 20 వ తేదీన జరుగనున్న బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మాజీ లెజిస్టేటివ్ కౌన్సిల్ చైర్మన్  కనకమామిడి స్వామి గౌడ్ ని ఆలయ కమిటీ అధ్యక్షులు జనగామ మధుసూదన్ గౌడ్ బృందం మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్బంగా ముందుగా స్వామి గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉప్పుగూడ శ్రీ మహంకాళి ఆలయంలో ఈ సంవత్సరము బోనాల ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా భక్తిశ్రద్ధలతో జరుపనున్నట్లు, అదేవిధంగా  ఈ నెల 16 వ తేదీన బుధవారం అమ్మవారి శాకంబరీ దేవి అలంకారాన్ని పురస్కరించుకొని అమ్మవారి దర్శనార్థమై ఆలయానికి రావాలని విజ్ఞప్తి చేశారు. 

]]>
Sat, 05 Jul 2025 18:22:01 +0530 admin
దమ్ముంటే చర్చకు రండి... రేవంత్ కు కేటీఆర్ సవాల్ https://prajakshethrenews.com/దమ్ముంటే-చర్చకు-రండి-రేవంత్-కు-కేటీఆర్-సవాల్ https://prajakshethrenews.com/దమ్ముంటే-చర్చకు-రండి-రేవంత్-కు-కేటీఆర్-సవాల్ దమ్ముంటే చర్చకు రండి...
రేవంత్ కు కేటీఆర్ సవాల్
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్, జూలై 5 :
ఎల్బీస్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఎవరి హయాంలో రైతులకు మేలు జరిగిందో చర్చించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా చర్చకు రెడీ అని ప్రకటించారు. అసెంబ్లీలోనైనా చర్చిద్దామని పిలుపునిచ్చారు. ఇంకా కావాలంటే సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో అయితే మరీ మంచిదన్నారు. ఈ ఉదయం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల సంక్షేమంపై చర్చించేందుకు రేవంత్ రెడ్డికి 72 గంటల సమయం ఇచ్చారు కేటీఆర్. చేసినవాటిపై ప్రిపేర్ అయ్యేందుకు ఈ టైంలో ఇచ్చినట్టు పేర్కొన్నారు. "8వ తేదీ ఉదయానికి ప్రెస్‌క్లబ్‌లో ఉంటాను. రేవంత్ రెడ్డి ఒక్కడు వస్తారో, మంత్రివర్గాన్ని తీసుకొస్తోరో వాళ్ల ఇష్టం. కార్యకర్తలతో వచ్చినా రెడీ. రేవంత్ రెడ్డికి కుర్చీ వేసి పెడతాం. ఆయన కోసం ఎదురు చూస్తాం. అక్కడ కాదు అనుకుంటే రాష్ట్రంలో ఎక్కడైనా నేను చర్చకు సిద్ధమే. అసెంబ్లీలోనా, లేదా కొండారెడ్డి పల్లెలో, చింతమడకలో ఎక్కడైనా సిద్ధంగా ఉన్నాం." అని సవాల్ చేశారు. ప్లేస్, టైమ్, డేట్ అన్ని సీఎం ఇష్టం.. మేం ఎప్పుడైనా సిద్ధమే అంటున్నారు కేటీఆర్. బేసిన్‌కు, బేసిక్‌కు తేడా తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి అని అలాంటి వ్యక్తి సీఎంగా ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్‌కు కేసీఆర్ అవసరం లేదని తాము చాలంటూ చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి, ఆయన సన్నిహితులకు నియామకాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.దేశంలో ఎవరూ రైతులకు చేయని విధంగా తెలంగాణలో రైతులకు కేసీఆర్ మేలు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించిందని తెలిపారు. వాటి గురించి తెలంగాణలో
చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని అన్నారు. చేసింది చెప్పుకోలేని రేవంత్ రెడ్డి సభ పెట్టి బూతులు తిడుతూ ఛాలెంజ్‌లు విసురుతున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయడం లేదని అడిగితే విమర్శలు చేసే రేవంత్ రెడ్డి... బనకచర్లతో గోదావరి తరలించుకుపోతున్నా గట్టిగా అగడం లేదని అన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల కోసం రైతులు క్యూలో నిల్చుంటున్నారని తెలిపారు. ఈ ప్రబుత్వానికి ఎరువుల పంపిణీ కూడా చేతకావడం లేదని విమర్శించారు. "తెలంగాణలో రైతు బంధు విప్లవాత్మక స్కీం. రైతు బంధుపై ఆక్స్‌ఫర్డ్‌లో చెబితే ఆశ్చర్యపోయారు. అలాంటిది ఎరువులు కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రి మమ్మల్ని విమర్శిస్తారా? ఇందిరమ్మ రాజ్యంలో చెరువులు ఎండిపోతే మేము కళకళలాడేలా చేశాం. చంద్రబాబు రైతులు గొంతు కోస్తున్నా జల దోపిడీని సీఎం రేవంత్‌ రెడ్డి అడ్డుకోలేకపోతున్నారు. ఫ్లోరైడ్‌ మహమ్మరిని కేసీఆర్‌ తరిమికొట్టలేదా? తెలంగాణ ఏర్పాటైన కొత్తలోనే రూ.30వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రూపురేఖలు మార్చాం" అని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.  ముఖ్యమంత్రికి బేసిన్‌ల గురించి గానీ, ప్రాజెక్టుల గురించి గానీ కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి తరలిపోతున్నాయని, నియామకాలు ఆయన వ్యక్తులకే దక్కుతున్నాయని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో నీళ్ల వాటాలో అన్యాయం జరగడం వల్లే తెలంగాణ ఉద్యమం పుట్టిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం రైతుబంధును నాట్లు వేసే సమయంలో ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వచ్చే ముందు రైతు భరోసా ఇస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు రైతులకు ఎకరానికి 19 వేల రూపాయలు ఎగ్గొట్టి అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు కోవర్ట్ అని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థించారు. ఆ ఎమ్మెల్యే
చాలా కరెక్టుగా చెప్పారని, ఆయనను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. తాము కల్పించిన ఉద్యోగాలను కూడా కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటూ సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు.సీఎం తన సభల్లో బూతులు మాట్లాడుతూ రంకెలు వేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. చర్చకు కేసీఆర్ అవసరం లేదని, తామే చాలని అన్నారు. మందబలంతో కాకుండా 10-15 మందితోనే ప్రెస్‌క్లబ్‌కు వస్తామని, మీడియా ముందే అన్ని విషయాలు తేల్చుకుందామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉద్యోగాలు మిలీయనర్ జోక్
ఏడాదిన్నరలో 60వేల ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్ వ్యాఖ్యలను కేటీఆర్ కొట్టిపారేశారు. ఉద్యోగాల భర్తీపై రేవంత్ మాట్లాడటం మిలీనియం జోక్‌ అని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు.. అపాయింట్ మెంట్ లెటర్స్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేశామనడం సిగ్గుచేటన్నారు. రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని.. కాంగ్రెస్‌కు మరోసారి అధికారం రావడం కల అని ఎద్దేవా చేశారు.

]]>
Sat, 05 Jul 2025 17:58:48 +0530 admin
ఈవీఎం గోదామ్ ను పరిశీలించిన కలెక్టర్ https://prajakshethrenews.com/ఈవీఎం-గోదామ్-ను-పరిశీలించిన-కలెక్టర్ https://prajakshethrenews.com/ఈవీఎం-గోదామ్-ను-పరిశీలించిన-కలెక్టర్ ఈవీఎం గోదామ్ ను పరిశీలించిన కలెక్టర్
ప్రజా క్షేత్ర్, వనపర్తి :
జిల్లా కేంద్రంలోని ఈవీఎంలు భద్రపరిచిన గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి తెలిపారు. శనివారం ఆర్డివో కార్యాలయం వెనక  ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదాము ను నెలవారీ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ,ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా గోదాం వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో శనివారం నెలవారి తనిఖీ లు చేసినట్లు వివిధ రాజకీయ వివరించారు.
తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

]]>
Sat, 05 Jul 2025 17:48:40 +0530 admin
వనపర్తి జిల్లాను సందర్శించిన నీటి అయోగ్ బృందం https://prajakshethrenews.com/వనపర్తి-జిల్లాను-సందర్శించిన-నీటి-అయోగ్-బృందం https://prajakshethrenews.com/వనపర్తి-జిల్లాను-సందర్శించిన-నీటి-అయోగ్-బృందం వనపర్తి జిల్లాను సందర్శించిన నీటి అయోగ్ బృందం
 ప్రజా క్షేత్ర్, వనపర్తి  :
         భారత దేశ వికాసం అనేది జిల్లాలు, రాష్ట్రాల  వికాసం పైనే ఆధారపడి ఉంటుందని నీతి ఆయోగ్ ఉప కార్యదర్శి  అరవింద్ కుమార్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా ప్రజలకు తాగు, సాగు నీరు క్షేత్ర స్థాయిలో ఏ విధంగా అందుతుంది, వాటి నాణ్యత ప్రమాణాలు ఎలా వున్నాయి అనే విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు న్యూఢిల్లీ నుండి కేంద్ర కమిటీ శనివారం వనపర్తి జిల్లాను సందర్శించింది.
కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా కమిటీ బృందాలను ఏర్పాటు చేసి దేశంలోని ఆయా రాష్ట్రాల్లో పర్యటించి జల్ జీవన్ మిషన్ అభియాన్ ఏ విధంగా అమలవుతుంది అనే విషయాలను  క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవిక నివేదికను ఇచ్చేందుకు  ఏర్పాటు చేసిన బృందాలలో  28వ బృందం శనివారం వనపర్తి జిల్లాను సందర్శించింది. ఈ బృందానికి నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రెటరీ అరవింద్ కుమార్ నాయకత్వం వహించగా డిప్యూటీ డైరెక్టర్ సెంట్రల్ వాటర్ కమిషన్ అరుణ్ కుమార్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ సైంటిస్ట్ పి. యాదయ్య సహాయకులుగా ఉన్నారు.  కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కలెక్టరేట్ లో స్వాగతం పలికారు. అనంతరం సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేసి వనపర్తి జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు అందిస్తున్న తాగు నీరు విధానం,  అవాంతరాలను అధిగమించేందుకు చేపట్టిన చర్యల పై ప్రొజెక్టర్ ద్వారా, నివేదిక రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సెక్రెటరీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ 2047 లో భారత దేశాన్ని అన్ని రంగాల్లో వికసిత దేశంగా చూసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో ఏ విధంగా అమలు అవుతున్నాయి, ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా అభివృద్ధి అవుతున్నాయి అనే విషయాలను తెలుసుకొని నివేదిక ఇచ్చేందుకు వనపర్తి జిల్లాలో శని, ఆదివారం రెండు రోజులు పర్యటించనున్నట్లు తెలిపారు. వనపర్తి జిల్లాలోని అచ్యుతాపుర్, ఖాసిం నగర్, కానాయపల్లి మంచినీటి శుద్ధి కేంద్రం, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ 2 వ కెనాల్ ను సందర్శించి జిల్లా ప్రజలకు తాగు నీరు ఎలా ఇస్తున్నారు, నాణ్యత ప్రమాణాలు ఏవిధంగా ఉన్నాయి, సమస్యలు వస్తె ఏ విధంగా అధిగమిస్తున్నారు అనే విషయాలను తెలుసుకోడానికి రావడం జరిగిందన్నారు.  జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఇంటింటికి శుద్ధమైన  తాగు నీరు ఇవ్వడం జరుగుతుందని, ఓవర్ హెడ్ ట్యాంకులను నెలలో మూడుసార్లు శుభ్రం చేసేవిధంగా అక్కడే రిజిస్టరు పెట్టించడం జరిగిందన్నారు. అదేవిధంగా వ్యవసాయానికి అత్యధికంగా సాగు నీరు ఇస్తున్నట్లు తెలిపారు.  వర్షాల వల్ల చెరువులు కుంటలు నింపుకోవడమే కాకుండా పై నుంచి వచ్చే నదీ ప్రవాహం వల్ల రిజర్వాయర్లు, చెరువులు నింపుకోవడం జరుగుతోందన్నారు.  భూగర్భ జలాలు పెంచేందుకు వాటర్ కన్సర్వేషన్, వాటర్ షెడ్, రూఫ్ టాప్ హార్వెస్టింగ్ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వేసవి కాలంలో కొంత నీటి సమస్య ఏర్పడితే పరిష్కరించేందుకు బోరు బావులు సిద్ధంగా ఉంటాయని వివరించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, మిషన్ భగీరథ ఎస్. ఈ వెంకటరమణ, ఇరిగేషన్ ఎస్. ఐ శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ ఈ. ఈ మేఘా రెడ్డి, పి.డి. డిఆర్డీఓ ఉమాదేవి  తదితరులు పాల్గొన్నారు.

]]>
Sat, 05 Jul 2025 17:45:26 +0530 admin
కె.సి.ఆర్ ని మర్యాదపూర్వకంగా కలసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి https://prajakshethrenews.com/కెసిఆర్-ని-మర్యాదపూర్వకంగా-కలసిన-మాజీ-మంత్రి-సింగిరెడ్డి-నిరంజన్-రెడ్డి https://prajakshethrenews.com/కెసిఆర్-ని-మర్యాదపూర్వకంగా-కలసిన-మాజీ-మంత్రి-సింగిరెడ్డి-నిరంజన్-రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ని మర్యాదపూర్వకంగా కలసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  ,జిల్లా నేతలు.
               
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఏం.ఎల్.సి నవీన్ రెడ్డి,మాజీ ఎం.ఎల్.ఏలు రావుల.చంద్రశేఖర్ రెడ్డి,జైపాల్ యాదవ్,గువ్వల బాలరాజు లు శనివారం నందినగర్ నివాసంలో  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కె.సి.ఆర్  ఆరోగ్య,యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు భేటీ అయిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బృందంతో కె.సి.ఆర్ పార్టీ నిర్మాణం,రాష్ట వ్యాప్తంగా ప్రజల సమస్యలు,జిల్లాలో పార్టీ బలోపేతం గురించి చర్చించి పలు సూచనలు చేశారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాధకులు తెలంగాణ అభివృద్ధి ప్రదాత మాకు మార్గదర్శకులు కె.సి.ఆర్ అని వారి నాయకత్వం మాకు ప్రజలకు శ్రీరామరక్ష అని కొనియాడారు

]]>
Sat, 05 Jul 2025 17:34:50 +0530 admin
మహిళా సంఘాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది : డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క https://prajakshethrenews.com/మహిళా-సంఘాలకు-తమ-ప్రభుత్వం-అండగా-ఉంటుంది-డిప్యూటీ-సిఎం-భట్టి-విక్రమార్క https://prajakshethrenews.com/మహిళా-సంఘాలకు-తమ-ప్రభుత్వం-అండగా-ఉంటుంది-డిప్యూటీ-సిఎం-భట్టి-విక్రమార్క మహిళా సంఘాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది : డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క  
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూలై 5 :
 తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు అండగా ఉంటుందని తెలంగాణా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. అవకాశం ఉన్న ప్రతిచోటా మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామని అన్నారు. ప్రజాభవన్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఆర్టిసికి అద్దె బస్సులు అందించిన మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. వ్యాపారం చేసుకునే మహిళలను ప్రోత్సహిస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలియజేశారు.ఐదేళ్లలో మహిళలకు రూ. లక్ష రుణాలు ఇవ్వాలనేది లక్ష్యమని, మహిళలకు తమ ప్రభుత్వం కల్పిస్తున్న లబ్ది గురించి చర్చించాలని అన్నారు. గ్రామాలు, మండలాల్లో మహిళా సమాఖ్య సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 10 నుంచి 16 వరకు అసెంబ్లీ నియోజక వర్గాల్లో సమావేశాలు జరగనున్నాయని చెప్పారు. వడ్డి లేని రుణాల నగదును చెక్కుల రూపంలో అందిస్తామని, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంపై ప్రజలకు వివరించాలి అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

]]>
Sat, 05 Jul 2025 17:29:48 +0530 admin
బాలలపై లైంగిక దాడులను అరికట్టాలి : సీ ఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/బాలలపై-లైంగిక-దాడులను-అరికట్టాలి-సీ-ఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/బాలలపై-లైంగిక-దాడులను-అరికట్టాలి-సీ-ఎం-రేవంత్-రెడ్డి బాలలపై లైంగిక దాడులను అరికట్టాలి
బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడానికి అత్యంత ప్రాధాన్యత
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్ : 
సోషల్ మీడియాలో ద్వారా బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో ఎలాంటి జాలి చూపకుండా దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  అభిప్రాయపడ్డారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో “నిస్సహాయకులకు అండగా - లైంగిక దాడికి గురైన పిల్లల రక్షణ మరియు హక్కులు” అన్న అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్,  తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ తో కలిసి ముఖ్యమంత్రి  పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ... “పిల్లలపై జరుగుతున్న హేయమైన నేరాలను నియంత్రించడమే కాకుండా బాధితులకు చట్టపరంగా, నైతిక పరంగా మాత్రమే కాకుండా అన్ని రకాలుగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. వారి రక్షణ కోసం తెలంగాణలో భరోసా ప్రాజెక్టును చేపట్టాం. భరోసా ప్రాజెక్టు కింద ప్రస్తుతం 29 కేంద్రాలు పనిచేస్తున్నాయని అన్నారు.
  హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భరోసా కేంద్రం ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంది. ఈ కోర్టుల ద్వారా కేసులను సత్వరం పరిష్కరించడమే కాకుండా పిల్లలకు సంపూర్ణ రక్షణ, వారిలో విశ్వాసం కల్పించడం, భవిష్యత్తులో వారి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్న లక్ష్యంతో వీటిని ప్రారంభించాం.
పోక్సో చట్టం, , జువెనైల్ చట్టాల ఆచరణలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించాలి. ఆ చట్టాలు బాధితులకు ఎలాంటి వేదన కలిగించకుండా, వారి భవిష్యత్తుకు రక్షణగా సంపూర్ణ సహాయకారిగా ఉండాలి. న్యాయం కేవలం కోర్టుల్లోనే లభించాలనే కాకుండా, ఈ ప్రక్రియలో ప్రతి దశలోనూ వారికి అవసరమైన అండదండలు లభించాలి. పోలీస్ స్టేషన్, బాలల సంక్షేమ కేంద్రాలతో పాటు అన్ని దశల్లోనూ బాధితులకు న్యాయం దక్కాలి, రక్షణ కల్పించాలని అయన అన్నారు. ఈ సదస్సులో యునిసెఫ్ ప్రతినిధి సింథియా మెకాఫ్రే,  డీజీపీ జితేందర్, , తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారులు, పోలీసు అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో పాటు పౌర సమాజంలోని భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు హాజరయ్యారు.

]]>
Sat, 05 Jul 2025 17:16:57 +0530 admin
6 ఏళ్లలో రూ.20 వేల కోట్లకుపైగా అభివృద్ది పనులు చేశాం : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ https://prajakshethrenews.com/6-ఏళ్లలో-రూ20-వేల-కోట్లకుపైగా-అభివృద్ది-పనులు-చేశాం-కేంద్ర-మంత్రి-బండి-సంజయ్-కుమార్ https://prajakshethrenews.com/6-ఏళ్లలో-రూ20-వేల-కోట్లకుపైగా-అభివృద్ది-పనులు-చేశాం-కేంద్ర-మంత్రి-బండి-సంజయ్-కుమార్ 6 ఏళ్లలో రూ.20 వేల కోట్లకుపైగా అభివృద్ది పనులు చేశాం :
 
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

ప్రజా క్షేత్ర్, జమ్మికుంట :

గడిచిన 6 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం రూ.20 వేల కోట్లకుపైగా నిధులను ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కేంద్ర మంత్రిగా మరిన్ని నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివ్రుద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యం పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు స్థానిక బీఆర్స్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వాగతం పలికారు. ఆయనతో కలిసి జాతీయ ఉపాధి పథకం కింద  వీణవంకలో రూ.78 లక్షల వ్యయంతో నిర్మించిన 18 అంతర్గత సీసీ రోడ్లను, అట్లాగే జమ్మికుంట మండంలోని గండ్రపల్లి, ఇతర గ్రామాల్లో 78 లక్షల వ్యయంతో నిర్మించిన 13 అంతర్గత రోడ్లను ప్రారంభించారు. స్థానిక బీజేపీ నాయకుల నివాసాలకు వెళ్లి ముచ్చటించారు. అనంతరం బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలంలో జాతీయ ఉపాధి హామీ నిధుల కింద 78 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 18 అంతర్గత సీసీ రోడ్లున ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. మీకు తెలుసు.. మోదీ ప్రభుత్వం రోడ్లకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. నేను ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉంటూ ఎక్కువ నిధులు కరీంనగర్ పార్లమెంట్ కు తీసుకొచ్చానంటే అవి రోడ్ల కోసమే.
కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధి కోసం గత ఆరేళ్లలో మొత్తంగా 20  వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన. అందులో సింహభాగం గ్రామీణ ఉపాధి  హామీ, ప్రధానమంత్రి సడక్ యోజన, సీఆర్ఐఎఫ్ కార్యక్రమాల నిధులతోపాటు జాతీయ రహదారుల విస్తరణ కోసమే ఎక్కువ నిధులు తీసుకొచ్చిన. ఎందుకంటే ఏ దేశమైనా, రాష్ట్రమైనా, జిల్లా, గ్రామమైనా  రవాణా సౌకర్యాలు బాగుంటేనే అవి బాగుపడతాయి.  నేను 5 ఏళ్లు ఎంపీగా ఉన్నప్పుడు రెండేళ్ల కాలాన్ని కరోనా మింగేసింది. అయినా ప్రజల కోసం మోదీని ఒప్పించి భారీ నిధులు తీసుకొచ్చా. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఇంకా నిధులు తీసుకొచ్చే అవకాశం వచ్చింది. మొదటిసారి ఎంపీ అయినప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్రమంతా తిరిగాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరీంనగర్ పార్లమెంట్ ను అభివృద్ధి లోనెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యంతో పనిచేస్తున్నా. అందుకోసం స్థానిక ఎమ్మెల్యేలందరితో కలిసి అన్ని గ్రామాలు, మండలాలను అభివృద్ది చేస్తున్నామని,అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

]]>
Sat, 05 Jul 2025 17:13:10 +0530 admin
తెలంగాణలో 13 పార్టీలకు నోటీసులు https://prajakshethrenews.com/తెలంగాణలో-13-పార్టీలకు-నోటీసులు https://prajakshethrenews.com/తెలంగాణలో-13-పార్టీలకు-నోటీసులు తెలంగాణలో 13 పార్టీలకు నోటీసులు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూలై 5 :
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఆరు సంవత్సరాలుగా ఎటువంటి ఎన్నికల్లోనూ పోటీ చేయని రాజకీయ పార్టీలకు తమ గుర్తింపును కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ మేరకు రాష్ట్రంలోని 13 రాజకీయ పార్టీలకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. తమ పార్టీల పేరును రిజిస్టర్డ్ జాబితా నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో ఈసీ పేర్కొంది. ఈ చర్యలు తీసుకునేందుకు గాను ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.పార్టీల పేరుతో దినపత్రికల్లో ప్రకటనలు, సోషల్ మీడియాల్లో ప్రచారం చేయడంతో పాటు.. ఆయా పార్టీలను జాబితా నుంచి తొలగించాలా వద్దా అనే దానిపై స్పష్టమైన సిఫార్సులతో కూడిన ప్రతిపాదనలను ఈ నెల 10వ తేదీలోపు సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారుల నుంచి అందే నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా రాజకీయ పార్టీల వ్యవస్థలో జవాబుదారీతనం పెంచాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. గతంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి చర్యలు తీసుకుంది.నోటీసులు అందుకున్న పార్టీల్లో హన్మకొండ జిల్లాకు చెందిన తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ, హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ, జాగో పార్టీ, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, తెలంగాణ లోక్ సత్తా పార్టీ, తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం, యువ పార్టీ ఉన్నాయి. అలాగే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (అంబేద్కర్-ఫూలే), తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ, జాతీయ మహిళా పార్టీ, యువ తెలంగాణ పార్టీ, చివరగా వరంగల్‌కు చెందిన తెలంగాణ ప్రజా సమితి (కిషోర్, రావు, కిషన్) కూడా నోటీసులు అందుకున్నాయి. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చిన్న పార్టీల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

]]>
Sat, 05 Jul 2025 14:45:37 +0530 admin
20 వేల సైకిళ్ల పంపిణీ చేయనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ https://prajakshethrenews.com/20-వేల-సైకిళ్ల-పంపిణీ-చేయనున్న-కేంద్ర-మంత్రి-బండి-సంజయ్ https://prajakshethrenews.com/20-వేల-సైకిళ్ల-పంపిణీ-చేయనున్న-కేంద్ర-మంత్రి-బండి-సంజయ్ మోదీ కానుకగా.....

20 వేల సైకిళ్ల పంపిణీ చేయనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్


టెన్త్ క్లాస్ విద్యార్ధినీ, విద్యార్థులందరికీ సైకిళ్లు అందజేయనున్న కేంద్ర మంత్రి


ప్రతి మండలానికి అదనంగా వంద చొప్పున సైకిళ్ల సరఫరా


డివిజన్లకు అదనంగా 50 సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైన కేంద్ర మంత్రి


ఈనెల 11న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజును పురస్కరించుకొని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లలో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థినీ, విద్యార్థులతోపాటు  భారీ ఎత్తున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. తన పార్లమెంట్ పరిధిలోని జిల్లాల వారీగా చూస్తే.... కరీంనగర్ జిల్లాలో పదో తరగతి చదువుకునే బాలబాలికలు 3096 మంది ఉన్నారు. రాజన్న సిరిసిల్లలో 3841, జగిత్యాల జిల్లాలో 1137, సిద్దిపేటలో 783, హన్మకొండ జిల్లాలో 491 మంది వెరసి 9348 మంది బాలబాలికలు టెన్త్ క్లాస్ అభ్యసిస్తున్నారు.
అట్లాగే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్ కు 50 చొప్పున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. వీటితోపాటు ఒక్కో మండలానికి వంద చొప్పున సైకిళ్లను అదనంగా పంపిణీ చేస్తారు. అట్లాగే హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో వార్డుకు 50కి చొప్పున పంపిణీ చేస్తారు. ఇక గ్రామ పంచాయతీల వారీగా 10 నుండి 25 సైకిళ్ల చొప్పున పంపిణీ చేయనున్నారు. వెరసి తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 20 వేల సైకిళ్లను దశలవారీగా పంపిణీ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు సైకిళ్ల తయారీలో పేరుగాంచిన ప్రముఖ సంస్థకు నెల రోజుల క్రితమే ఆర్డర్ కూడా ఇచ్చారు.
ఇప్పటికే 5 వేల సైకిళ్లు కరీంనగర్ కు వచ్చాయి. తొలి దశలో ఐదు వేల సైకిళ్లను  ఈనెల 8 లేదా 9వ తేదీన పంపిణీ చేసేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. మిగిలిన సైకిళ్లు కూడా వచ్చిన వెంటనే అసెంబ్లీ నియోజకవర్గాల, మండలాల వారీగా పంపిణీ చేయనున్నారు. ఇక  సైకిళ్ల ఖర్చు వివరాలకు వస్తే ఒక్కో సైకిల్ ను రూ.5, 300ల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సైకిల్ రాడ్ కు ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంకోవైపు బండి సంజయ్ ఫోటోను ముద్రించనున్నారు.
టెన్త్ విద్యార్థులకే ఎందుకంటే....
 ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లే ఉంటారనే విషయం తెలిసిందే. తమ ఇంటి నుండి స్కూల్ దాకా వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యాల్లేక, ఆటోలు, బస్సులు వెళ్లే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా టెన్త్ క్లాస్ విషయానికొచ్చే సరికి స్కూల్ వేళలు ముగిసిన తరువాత స్పెషల్ క్లాస్ లకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనివల్ల పొద్దుపోయేదాకా స్కూళ్లోనే ఉండాల్సి వస్తుంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని టెన్త్ బాలబాలికలకు రవాణా ఇబ్బంది ఉండకూడదనే సదుద్దేశంతో బండి సంజయ్ కుమార్ ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేయనుండటం విశేషం.

]]>
Sat, 05 Jul 2025 14:33:57 +0530 admin
బావూపేట రహదారిపై మోకాళ్ల లోతు నీటి నిల్వపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం https://prajakshethrenews.com/బావూపేట-రహదారిపై-మోకాళ్ల-లోతు-నీటి-నిల్వపై-కేంద్రమంత్రి-బండి-సంజయ్-ఆగ్రహం https://prajakshethrenews.com/బావూపేట-రహదారిపై-మోకాళ్ల-లోతు-నీటి-నిల్వపై-కేంద్రమంత్రి-బండి-సంజయ్-ఆగ్రహం ఇంత అధ్వాన్నంగా రోడ్డుంటే ఏం చేస్తున్నారు?
బావూపేట రహదారిపై మోకాళ్ల లోతు నీటి నిల్వ
కరీంనగర్ సిరిసిల్ల వెళ్లే ప్రయాణీకుల తీవ్ర అవస్థలు
అటుగా వెళుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ రోడ్డు దుస్థితిపై ఆరా
గత కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని వాపోయిన స్థానికులు, వాహనదారులు
వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన
వెంటనే జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులకు ఫోన్ చేసి కేంద్ర మంత్రి
తక్షణమే రహదారిని బాగుచేయాలని ఆదేశం
ప్రజా క్షేత్ర్, కరీంనగర్ :
అధికారిక కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్ నుండి సిరిసిల్ల జిల్లాకు వెళుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మార్గమధ్యలో బావూపేట రహదారిపై మోకాళ్ల లోతు నీళ్లుండటాన్ని చూసి బండి దిగారు. ఆ నీటిలో ప్రయాణం చేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్న వాహనదారులను, ప్రయాణీకులను చూశారు. కేంద్ర మంత్రి ఆగడంతో స్థానికులు ఆయన వద్దకు రావడంతో ఈ నీళ్లు ఎప్పటి నుండి ఉన్నాయి? అధికారుల ద్రుష్టికి తీసుకురాలేదా? అని అడిగారు. గత 15 రోజులుగా రహదారిపై మోకాళ్ల లోతు నీళ్లు నిల్వ ఉన్నాయని, అధికారుల ద్రుష్టికి తీసుకుపోయినా ఫలితం లేదని స్థానికులు వాపోయారు. ఈ నీటిలో ప్రయాణం చేయడంవల్ల భారీగా ట్రాఫిక్ జాం అవుతోందని,  వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. నిన్ననే మూడు ఆటోలు బోల్తా పడ్డాయని, అందులో ప్రయాణిస్తున్న వారు గాయాలతో బయటపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంచెం వాన కురిసినా ఈ రహదారిపై మోకాళ్ల లోతు నీళ్లు నిల్వ ఉంటున్నాయని చెప్పారు. ఇంత జరుగుతున్నా తన ద్రుష్టికి ఎందుకు తీసుకురాలేదని, స్థానిక నేతలు అధికారులపై ఎందుకు ఒత్తిడి తేలేదని అసహనం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే ఆర్ అండ్ బి ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ప్రజలు ఇంతగా ఇబ్బంది పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తగిన నిధులు లేవని జవాబివ్వడంతో వెంటనే జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఫోన్ చేసి తక్షణమే బావూపేట రహదారిని బాగు చేయాలని, ప్రయాణీకుల రాకపోకలకు ఇబ్బంది రాకుండా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఆ మేరకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

]]>
Sat, 05 Jul 2025 14:28:43 +0530 admin
దేశ ప్రజలకు ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్దాలే : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే https://prajakshethrenews.com/దేశ-ప్రజలకు-ప్రధాని-మోదీ-చెప్పేవన్నీ-అబద్దాలే-ఏఐసీసీ-చీఫ్-మల్లికార్జున్-ఖర్గే https://prajakshethrenews.com/దేశ-ప్రజలకు-ప్రధాని-మోదీ-చెప్పేవన్నీ-అబద్దాలే-ఏఐసీసీ-చీఫ్-మల్లికార్జున్-ఖర్గే దేశ ప్రజలకు ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్దాలే..
ప్రధాని మోదీలాగా ఇందిరా గాంధీ భయపడలేదు
క్షమాపణలు చెప్పడమే బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ల పని
ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరభేరి సభలో ఖర్గే
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్, జులై 04 :
 ప్రధాని మోదీలాగా ఇందిరా గాంధీ భయపడ లేదని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే గుర్తు చేశారు. ఎవరు వచ్చినా బంగ్లాదేశ్‌కు స్వాతంత్రం ఇస్తామని ఇందిరాగాంధీ ప్రకటించారని.. అదే పని ఆమె చేసి చూపించారన్నారు. క్షమాపణలు చెప్పడమే బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ల పని అంటూ అయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లే.. కేంద్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతుందని ఏఐసీసీ అధ్యక్షులు, ఎంపీ మల్లికార్జున్ ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరభేరి సభలో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. దేశానికి ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చాలా చాలా చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.కానీ వాళ్లు ఈ దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమిటని సూటిగా ప్రశ్నించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పటి వరకు ప్రధాని మోదీ 42 దేశాలు తిరిగారని గుర్తు చేశారు. కానీ ప్రజలు చనిపోతున్నా.. మణిపూర్‌ రాష్ట్రానికి మాత్రం ఆయన వెళ్లలేదని మండిపడ్డారు. పాకిస్థాన్‌ను ఏదేదో చేస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటించారన్నారు. కానీ ఎందుకు ఏం చేయలేదని మోదీ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. పాకిస్తాన్‌పై యుద్ధం చేయకుండా.. మిమ్మల్ని ఎవరు ఆపారంటూ సందేహం వ్యక్తం చేశారు.ప్రధాని మోదీలాగా ఇందిరా గాంధీ ప్రధానిగా భయపడ లేదన్నారు. ఎవరు వచ్చినా బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం కల్పిస్తామని ఇందిరాగాంధీ ప్రకటించారని.. అదే పని ఆమె చేసి చూపించారన్నారు. క్షమాపణలు చెప్పడమే బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ల పని అంటూ అయన ఎద్దేవా చేశారు. రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్ని తీసి వేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలోనే లేదని బీజేపీ చెపుతుందన్నారు.రాజ్యాంగం నుండి లౌకిక పదాన్ని తీసేయారని తాను చాలెంజ్ చేస్తున్నానని ఈ సందర్భంగా ఖర్గే ప్రకటించారు. సెక్యులర్ అనే పదం బీజేపీ ప్రణాళికలో రాసుకున్నారని వివరించారు. సెక్యులర్ అనే పదంతో మీకు ఇబ్బంది ఉంటే మీ పార్టీ ప్రణాళిక నుంచి తీసివేయాలని బీజేపీ అగ్రనేతలకు ఖర్గే బహిరంగ సవాల్ విసిరారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే.. అది కార్యకర్తల కృషి ఫలితమేనని స్పష్టం చేశారు. రేవంత్, భట్టి, మంత్రులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారన్ని వివరించారు. కేసీఆర్, బీజేపీ కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అడ్డుకుంటున్నారన్నారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ఈ రెండు పార్టీలను ఓడించారని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని గతంలో తాను చెప్పానని వివరించారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణలో 50కిపైగా కేంద్ర సంస్థలు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణకు ఈ 11 ఏళ్లలో ఏం ఇచ్చారంటూ ప్రధాని మోదీని ఈ సందర్భంగా ఖర్గే సూటిగా ప్రశ్నించారు.

]]>
Fri, 04 Jul 2025 22:48:04 +0530 admin
మాకు మంత్రి పదవి ఇవ్వండి సార్ ప్లీజ్ https://prajakshethrenews.com/మాకు-మంత్రి-పదవి-ఇవ్వండి-సార్-ప్లీజ్ https://prajakshethrenews.com/మాకు-మంత్రి-పదవి-ఇవ్వండి-సార్-ప్లీజ్ మాకు మంత్రి పదవి ఇవ్వండి సార్ ప్లీజ్
మల్లికార్జున్ ఖర్గేకి పోటాపోటీ నివేదికలు అందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఖర్గేను కలిసి తమ అభ్యర్థనలు వినిపించిన ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి
 ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గేను పలువురు ఎమ్మెల్యేలు కలిసారు. ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి అయనను కలిసి మాకు మంత్రి పదవి ఇప్పించడని నివేదికలు ఇచ్చారు.
అత్యధిక జనాభా ఉన్న హైదరాబాద్–రంగారెడ్డి జిల్లాలో మంత్రి లేకపోవడం ఇదే మొదటిసారని  మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. బంజారాల్లో 80% మంది కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచారని, అయినా తనకు మంత్రి పదవి ఇవ్వలేదని బాలు నాయక్  అన్నారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో మంత్రి పదవి లేనిది తానొక్కడికే అని న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి  విన్నవించుకున్నారు.

]]>
Fri, 04 Jul 2025 22:39:35 +0530 admin
వ్యవసాయాన్ని దండుగ నుంచి పండుగగా మార్చిన ఘనత కాంగ్రెస్ దే : సీ ఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/వ్యవసాయాన్ని-దండుగ-నుంచి-పండుగగా-మార్చిన-ఘనత-కాంగ్రెస్-దే-సీ-ఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/వ్యవసాయాన్ని-దండుగ-నుంచి-పండుగగా-మార్చిన-ఘనత-కాంగ్రెస్-దే-సీ-ఎం-రేవంత్-రెడ్డి ఢిల్లీలో ఉండే మోడీ అయినా, గల్లీలోని కేడీ అయినా..
రైతు సంక్షేమం విషయంలో తేల్చుకునేందుకు రండి, సవాళ్లకు సిద్దం
బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి సవాల్
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్ జలై 4;

ఢిల్లీలో ఉండే మోడీ అయినా, గల్లీలోని కేడీ అయినా.. రైతు సంక్షేమం విషయంలో తేల్చుకునేందుకు రండి, సవాళ్లకు సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలకు గట్టి సవాల్ విసిరారు. కేవలం 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసి, వ్యవసాయాన్ని దండుగ నుంచి పండుగగా మార్చిన ఘనత తమదంటూ రేవంత్ రెడ్డి గర్వంగా వెల్లడించారు. 24 గంటల ఉచిత కరెంట్, రుణ మాఫీ సహా రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో రైతుల శ్రేయస్సు కోసం చేసిన పనులపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు రేవంత్ సవాల్ చేశారు. రైతుల బాగు కోసం ఎవరు ఎంత చేశారో తేల్చుకునేందుకు రావాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు, పథకాలను అమలు చేస్తోందన్నారు సీఎం. అనేక కష్టాలు ఎదురైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నిలబడి, సమస్యలను అధిగమించి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించే దిశగా పనిచేస్తోందన్నారు.
రైస్ ఉత్పత్తి, కొనుగోలు....
ఈ క్రమంలో తెలంగాణ రైతులు ఈ ఏడాది 2 కోట్ల మెట్రిక్ టన్నుల రైస్‌ను ఉత్పత్తి చేసినట్లు సీఎం గుర్తు చేశారు. ప్రజా పాలనలో ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు సరైన ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కేవలం 9 రోజుల వ్యవధిలో రూ. 9 వేల కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రైతులకు ఆర్థిక భరోసాను అందించడమే కాకుండా, వ్యవసాయాన్ని ఒక పండుగగా మార్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ సరఫరా చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం, రైతు సంక్షేమం, ఆర్థిక పునరుద్ధరణ కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సామాజిక న్యాయ విజయ భేరి సభలో సీఎం ఈ మేరకు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

]]>
Fri, 04 Jul 2025 22:29:14 +0530 admin
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహం ఆవిష్కరణ https://prajakshethrenews.com/మాజీ-ముఖ్యమంత్రి-రోశయ్య-విగ్రహం-ఆవిష్కరణ https://prajakshethrenews.com/మాజీ-ముఖ్యమంత్రి-రోశయ్య-విగ్రహం-ఆవిష్కరణ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్:
లక్డీకాపూల్ లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , సీఎం రేవంత్ రెడ్డి  అవిష్కరించారు. ఈ కార్యక్రమానికి న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క,మంత్రులు శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,రోశయ్య కుటుంబ సభ్యులు తదితరులు హజరయ్యారు.

]]>
Fri, 04 Jul 2025 22:16:26 +0530 admin
ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతాం : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ https://prajakshethrenews.com/ప్రజాక్షేత్రంలో-కాంగ్రెస్-పార్టీని-దోషిగా-నిలబెడతాం-బీఆర్ఎస్-వర్కింగ్-ప్రెసిడెంట్-కేటీఆర్ https://prajakshethrenews.com/ప్రజాక్షేత్రంలో-కాంగ్రెస్-పార్టీని-దోషిగా-నిలబెడతాం-బీఆర్ఎస్-వర్కింగ్-ప్రెసిడెంట్-కేటీఆర్ రాహుల్ చేసిన ద్రోహంపై నిలదీసేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య
                                     బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ప్రజా క్షేత్ర్, హైద‌రాబాద్ జూలై 4 :

ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ద్రోహంపై నిలదీసేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఊదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా..? అని ప్ర‌శ్నించారు.అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని పిలిపించి మరీ నిరుద్యోగులతో చాయ్ పే చర్చ పెట్టిన రేవంత్‌కు గద్దెనెక్కిన తరువాత జాబ్ క్యాలెండర్ అసలు గుర్తే లేదా..? చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో నిరుద్యోగులు హైదరాబాద్ రాకుండా ముందుగానే నిర్బంధించడమే దారుణమైతే, ఇవాళ సచివాలయానికి గోడు చెప్పుకునేందుకు వచ్చిన వారిని కూడా అరెస్టు చేయడం దుర్మార్గం అని కేటీఆర్ మండిప‌డ్డారు.యూత్ డిక్లరేషన్ పేరిట ఢిల్లీ పెద్దలను పిలిపించి మరీ మోసం చేసిన రేవంత్ ఏడాదిన్నర కాలంలో పట్టుమని పదివేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం నిరుద్యోగులకు వెన్నుపోటు పొడవడమే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రక్రియ పూర్తి చేసిన 60 వేల ఉద్యోగాలకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకున్న చేతకాని ముఖ్యమంత్రిని నిరుద్యోగులు ఎప్పటికీ క్షమించరు. ఓవైపు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇంకెప్పుడు అని నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే, మరోవైపు నిరుద్యోగులు నోటిఫికేషన్లే వద్దంటున్నారని బుకాయించడం కాంగ్రెస్ సర్కారు దిగజారుడుతనానికి నిదర్శనం అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్‌లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రికి నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం. చలో సచివాలయం కార్యక్రమాన్ని చేపట్టిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్టుచేసి వారి గొంతులు నొక్కలేరు. వెంటనే వారందరినీ బేషరతుగా విడుదల చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను ఇప్పటికైనా నిలబెట్టుకోవాలి. లేకపోతే రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి రేవంత్ సర్కారు మెడలు వంచుతాం.. కాంగ్రెస్ సర్కారు చేసిన ద్రోహాన్ని గడపగడపకూ తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతాం అని కేటీఆర్ హెచ్చ‌రించారు.

]]>
Fri, 04 Jul 2025 22:02:53 +0530 admin
ఆత్మనిర్భర్ కు కోల్ ఇండియా అధిక ప్రాధాన్యం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి https://prajakshethrenews.com/ఆత్మనిర్భర్-కు-కోల్-ఇండియా-అధిక-ప్రాధాన్యం-కేంద్రమంత్రి-కిషన్-రెడ్డి https://prajakshethrenews.com/ఆత్మనిర్భర్-కు-కోల్-ఇండియా-అధిక-ప్రాధాన్యం-కేంద్రమంత్రి-కిషన్-రెడ్డి ఆత్మనిర్భర్ కు కోల్ ఇండియా అధిక ప్రాధాన్యం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి    
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్ జూలై 4 :
 ఆత్మనిర్భర్ కు కోల్ ఇండియా అధిక ప్రాధాన్యం ఇస్తోందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  తెలిపారు. ఖనిజాల ఉత్పత్తిలో కోల్ ఇండియా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కోల్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో కిషన్ రెడ్డి ప్రసంగించారు. స్థానికల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా కోల్ ఇండియా చర్యలు చేపట్టిందని, అత్యాధునిక సాంకేతికత వినియోగించి ఖనిజాల ఉత్పత్తి   జరుగుతుందని తెలియజేశారు. ఖనిజాల తవ్వకంలో కోల్ ఇండియా పారదర్శకంగా వ్యవహరిస్తోందని, 500 మినరల్స్ బ్లాక్స్ లో లీజ్ రెన్యువల్ సులభతరం చేసిందని చెప్పారు. లీజ్ రెన్యువల్ కు సింగిల్ విండో సిస్టం అందుబాటులోకి తెచ్చిందని, అరుదైన ఖనిజాల ఉత్పత్తిలోకి కోల్ ఇండియా అడుగు పెట్టిందని కిషన్ రెడ్డి ప్రశంసించారు.

]]>
Fri, 04 Jul 2025 21:46:57 +0530 admin
మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు ఇంటి ముందు రోహింగ్యాలు రెక్కీ https://prajakshethrenews.com/మహేశ్వరం-నియోజకవర్గ-బిజెపి-ఇంచార్జ్-అందెల-శ్రీరాములు-ఇంటి-ముందు-రోహింగ్యాలు-రెక్కీ https://prajakshethrenews.com/మహేశ్వరం-నియోజకవర్గ-బిజెపి-ఇంచార్జ్-అందెల-శ్రీరాములు-ఇంటి-ముందు-రోహింగ్యాలు-రెక్కీ మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు ఇంటి ముందు రోహింగ్యాలు రెక్కీ
         ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూలై 4 :
 రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు ఇంటి ముందు రోహింగ్యాలు రెక్కీ నిర్వహించారు. అందెల శ్రీరాములు ఇంటి ముందు అనుమానాస్పద తిరుగుతున్న ఆరుగురు వ్యక్తులను బిజెపి కార్యకర్తలు, నేతలు గుర్తించారు. వారు పెట్రోల్ బాటిల్, సుత్తి, కట్టర్, ఐరన్ రాడ్స్, బాక్స్ లో పెట్టుకుని తిరుగుతున్నారు. గత కొన్ని రోజులుగా రోహింగ్యాలపై బిజెపి నేత అందెల శ్రీరాములు యాదవ్ ఉద్యమం చేస్తున్నారు. అందెల శ్రీరాములకు ప్రాణహాని ఉందని బిజెపి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి నేతలు పట్టుకోవడానికి ప్రయత్నించగా వాహనం వదిలి పారిపోయారు. ఐదుగురు వ్యక్తులను గుర్తించి మీర్ పేట పోలీస్ స్టేషన్ కు బిజెపి నేతలు సమాచారం ఇచ్చారు. ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

]]>
Fri, 04 Jul 2025 21:42:28 +0530 admin
యాదగిరిగుట్ట పిహెచ్ సి లో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు https://prajakshethrenews.com/యాదగిరిగుట్ట-పిహెచ్-సి-లో-ఆకస్మిక-తనిఖీ-చేసిన-కలెక్టర్-హనుమంతరావు https://prajakshethrenews.com/యాదగిరిగుట్ట-పిహెచ్-సి-లో-ఆకస్మిక-తనిఖీ-చేసిన-కలెక్టర్-హనుమంతరావు వైద్యసేవలో నిర్లక్ష్యం సహించం
* యాదగిరిగుట్ట పిహెచ్  సి లో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు
* ఫార్మసీలో మందుల కొరత లేకుండా చూడాలి
* ప్రసవాల సంఖ్య పెంచాలి
* అనధికారికంగా గైర్హాజర్ అయిన ల్యాబ్ టెక్నిషియన్ కు షోకాజ్ నోటీసు
ప్రజా క్షేత్ర్, యాదగిరిగుట్ట, జూలై 4:
యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు . సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు, సిబ్బందికి సూచించారు.ఆసుపత్రి లో ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ వార్డు లను పరిశీలించారు.ఆసుపత్రి లోని అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేసి ఎంత మంది సిబ్బంది విధులకు హాజరయ్యారని పరిశీలించారు.  డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది రెగ్యులర్ గా వస్తున్నారా లేదా అని ఆరా తీశారు. సమయ పాలన పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓపి రిజిస్టర్ ని చెక్ చేశారు. ప్రతి రోజూ ఆసుపత్రికి ఎంత మంది రోగులు వస్తున్నారని ఆసుపత్రి సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు.  వైద్యులు  అందుబాటులో ఉండి.. వైద్యం కోసం వచ్చిన వారికి సకాలంలో స్పందించి వైద్యం అందించారు అన్నారు. ఆసుపత్రికి ఎంత మంది గర్భిణి స్త్రీలు వస్తున్నారని, ఎంత మంది చెకప్ చేసుకుంటున్నారని, వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగా ఇస్తున్నారా లేదా అని అడిగి  తెలుసుకున్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ఫార్మసీలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. అవసరమైన మందులు నిల్వ ఉంచాలన్నారు.ఆసుపత్రి  పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ల్యాబ్ టెక్నీషియన్ సుగుణ రాజు అనధికారిక గైర్హాజరు కారణంగా షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు.

]]>
Fri, 04 Jul 2025 21:19:05 +0530 admin
కేసీఆర్ హెల్త్ స్టేబుల్ https://prajakshethrenews.com/కేసీఆర్-హెల్త్-స్టేబుల్ https://prajakshethrenews.com/కేసీఆర్-హెల్త్-స్టేబుల్ కేసీఆర్ హెల్త్ స్టేబుల్ 

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూలై 4 :

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయనకు జ్వరం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, సోడియం స్థాయిలు తగ్గడం వంటి సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర అస్వస్థతతో గురువారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యుల బృందం ఒక అధికారిక హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. బులిటెన్ ప్రకారం.. కేసీఆర్ తీవ్ర జ్వరంతో ఆసుపత్రికి వచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఆయనకు రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరిగాయని (హై బ్లడ్ షుగర్), అలాగే సోడియం స్థాయిలు గణనీయంగా పడిపోయాయని (తక్కువ సోడియం లెవెల్స్) నిర్ధారించారువైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసీఆర్‌కు నిర్వహించిన మిగిలిన అన్ని వైద్య పరీక్షల నివేదికలు సాధారణంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ, డయాబెటిస్‌ను నియంత్రణలోకి తీసుకురావడానికి.. శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేయడానికి ఆయనను క్లోజ్ అబ్జర్వేషన్‌లో ఉంచి, నిరంతరం చికిత్స అందిస్తున్నారు. ఆయన వయసు, గతంలో ఎదుర్కొన్న తుంటి గాయం వంటి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని, వైద్యులు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు, అలాగే సంతోష్ రావు వంటి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లారు.కేసీఆర్ అస్వస్థత వార్త తెలిసిన వెంటనే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు, అధికారులతో ఫోన్‌లో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌కు అత్యుత్తమ చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి వైద్యులకు సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అంతేకాకుండా.. కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరారు.గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్ ప్రజా జీవితంలో అంతగా చురుకుగా కనిపించడం లేదు. ఆయన గతంలో ప్రదర్శించిన దూకుడు, ఉత్సాహం ప్రస్తుతం తగ్గింది. ఇటీవల వరంగల్‌లో జరిగిన పార్టీ బహిరంగ సభలోనూ ఆయన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో మునుపటి ఉత్సాహాన్ని నింపలేకపోయింది. ఇటీవల జరిగిన పరిణామాలు ఆయనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశాయి.కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టుగా భావించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై వస్తున్న తీవ్ర అవినీతి ఆరోపణలు, ప్రాజెక్టులోని కొన్ని భాగాలకు ఇటీవల సంభవించిన నష్టం వంటి అంశాలు ఆయనకు మరింత మానసిక భారాన్ని చేకూర్చాయి. దీనిపై న్యాయ విచారణలు జరుగుతుండటం, ప్రజల్లో దీనిపై పెరిగిన వ్యతిరేకత ఆయన ప్రతిష్టను దెబ్బతీశాయి. గతంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కూడా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు హాజరయ్యారు.ఈ పరిణామాలు, అధికారం కోల్పోయిన తర్వాత ఎదురయ్యే సవాళ్లు, కేసుల భయం, పార్టీని తిరిగి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, గత ప్రభుత్వ ఆర్థిక విధానాలపై వస్తున్న విమర్శలు వంటివన్నీ కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన త్వరగా కోలుకోవాలని తన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కోరుతున్నారు.

]]>
Fri, 04 Jul 2025 15:32:33 +0530 admin
సరికొత్త నిబంధనలతో భూ సమీకరణకు కొత్త చట్టం రూపకల్పన https://prajakshethrenews.com/సరికొత్త-నిబంధనలతో-భూ-సమీకరణకు-కొత్త-చట్టం-రూపకల్పన https://prajakshethrenews.com/సరికొత్త-నిబంధనలతో-భూ-సమీకరణకు-కొత్త-చట్టం-రూపకల్పన

సరికొత్త నిబంధనలతో భూ సమీకరణకు కొత్త చట్టం రూపకల్పన

-మార్గదర్శకాలకు త్వరలోనే ప్రతిపాదనలు

- విస్తరిత హెచ్‌ఎండీఏ పరిధిలో అమలు

ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్‌ సిటీ: భూ సమీకరణ పథకం (ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌)కు మరిన్ని సంస్కరణలను జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విస్తరిత హెచ్‌ఎండీఏ(HMDA) పరిధిలో అమలు చేయనుంది. భూ సమీకరణ పథకం-2017తో ఆశించిన ప్రయోజనాలు నెరవేరకపోవడంతో ఆస్థానంలో సరికొత్త చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. సరికొత్త నిబంధనలుమార్గదర్శకాలతో ల్యాండ్‌ పూలింగ్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ (ఎల్‌పీఏడీ) అనే ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి ఓ కన్సల్టెన్సీని నియమించేందుకు హెచ్‌ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది.

పట్టాభూములకే అవకాశం

అభివృద్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితమవ్వకుండా ఔటర్‌ అవతల మినీ నగరాలుటౌన్‌షి్‌పలను తీసుకొచ్చేందుకు అప్పటి ప్రభుత్వం ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌-2017 తీసుకువచ్చింది. అయితే దానికి ఆశించిన స్పందన రావడం లేదు. ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌ను 733 ఎకరాలతో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టగాఅదే తరహాలో స్వరాష్ట్రంలోనూ ఎనిమిదేళ్ల క్రితం తీసుకొచ్చారు. నాటి చట్టం ప్రకారం ఇన్ముల్‌ నర్వ (95 ఎకరాలు)లేమూరు (84 ఎకరాలు)లో లే అవుట్‌లు అభివృద్ధి చేయగాప్రతాపసింగారం (110 ఎకరాలు)లో పనులు చేపట్టాల్సి ఉన్నది. ఈ స్కీమ్‌ వచ్చిన ఎనిమిదేళ్లలో మూడు ప్రాంతాల్లో 289 ఎకరాలే సేకరించారు. 2017లో ఉన్న కొన్ని నిబంధనలు ప్రభుత్వానికిరైతులకు ఇబ్బందికరంగా మారాయి. కేవలం పట్టా భూములకే అవకాశం కల్పించారు. అసైన్డ్‌సీలింగ్‌ భూములు సేకరించే అవకాశం లేదు.

 

]]>
Thu, 03 Jul 2025 08:09:24 +0530 admin
శివగంగా అజిత్ కూమార్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ క్షమాపణలు https://prajakshethrenews.com/శివగంగా-అజిత్-కూమార్-కుటుంబ-సభ్యులకు-ముఖ్యమంత్రి-స్టాలిన్-క్షమాపణలు https://prajakshethrenews.com/శివగంగా-అజిత్-కూమార్-కుటుంబ-సభ్యులకు-ముఖ్యమంత్రి-స్టాలిన్-క్షమాపణలు శివగంగా అజిత్ కూమార్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ క్షమాపణలు

ప్రజా క్షేత్ర్, చెన్నై జూలై 2 :

శివగంగా అజిత్ కూమార్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఫోన్‌ చేశారు. అజిత్ కూమార్ తల్లికి సిఎం క్షమాపణలు చెప్పారు. జరగకూడని ఘటన జరిగిందనిఆమెను ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఘటనకు కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే వారందరినీ అరెస్టు చేయించామనికుటుంబానికి అండగా ఉంటానని సిఎం హామీ ఇచ్చారు. అజిత్‌ కుమార్‌ లాకప్‌ డెత్‌ కేసును సిబిఐకి బదిలీ చేస్తూ తమిళనాడు సర్కార్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి. లాకప్‌ డెత్‌ కేసులో తమిళనాడు ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. లాకప్ డెత్ కేసులో ఐదుగురు పోలీస్ అధికారులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.తిరుప్పవనమ్‌లోని శివగంగాలో ఓ దేవాలయంలో అజిత్ కుమార్(27) సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. బంగారు ఆభరణాలను అజిత్ ఎత్తుకెల్లాడనే అనుమానం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని చితకబాదారు. అజిత్‌ను నిర్మానుష్య ప్రదేశానికి పోలీసులు లారీలతో తీవ్రంగా కొట్టడంతో దెబ్బలు తాళలేక ఘటనా స్థలంలోనే చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసుల తీరుపై నెటిజన్లు  ఆగ్రహం వ్యక్తం చేశారు.

]]>
Wed, 02 Jul 2025 22:32:40 +0530 admin
గ్రూప్‌&1 అక్రమాలపై హైకోర్టులో కొనసాగిన వాదనలు https://prajakshethrenews.com/గ్రూప్-1-అక్రమాలపై-హైకోర్టులో-కొనసాగిన-వాదనలు https://prajakshethrenews.com/గ్రూప్-1-అక్రమాలపై-హైకోర్టులో-కొనసాగిన-వాదనలు హాల్‌టికెట్లు.. మూల్యాంకనం.. అన్నీ మోసాలే

     గ్రూప్‌-1 అక్రమాలపై హైకోర్టులో కొనసాగిన వాదనలు

ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్‌జూలై 2 ; గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షల నిర్వహణలో మొదటి నుంచి అక్రమాలు చోటు చేసుకున్నాయనిఇందుకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. అయినవాళ్లకుకొందరికి లబ్ధి చేకూరేలా టీజీపీఎస్సీ వ్యవహరించిందని చెప్పారు. హాల్‌ టికెట్ల దశ నుంచి పరీక్షా కేంద్రాల ఖరారుఅభ్యర్థుల హాజరు సంఖ్యలో వ్యత్యాసంమూడుసార్లు మూల్యాంకనంమూల్యాంకనానికి ఎంపిక చేసిన ప్రొఫెసర్లు.. అన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగిన అక్రమాలకు అద్దం లాంటి సాక్ష్యాలని అన్నారు. గ్రూప్‌- 1 పరీక్షలో అవకతకవలపై దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు మంగళవారం విచారణ కొనసాగించారు.సీనియర్‌ న్యాయవాది సురేందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. జనవరి 11 నుంచి 25 వరకు మూల్యాంకనం కోసం ప్రొఫెసర్లను కేటాయించాలని కోరుతూ కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌కు టీజీపీఎస్సీ లేఖ రాసిందని తెలిపారు. అయితే ఆ లేఖ రాయకముందే సదరు ప్రొఫెసర్లకు వ్యక్తిగతంగా సమాచారం వెళ్లిపోయిందని చెప్పారు. తెలుగులో పరీక్ష రాసిన పేపర్లను ఇంగ్లిషు ప్రొఫెసర్లు ఎలా మూల్యాంకనం చేశారో ఆ దేవుడికే తెలియాలని అన్నారు. మరో సీనియర్‌ న్యాయవాది రచనారెడ్డి వాదిస్తూప్రిలిమ్స్‌కుమెయిన్‌కు వేర్వేరు హాల్‌ టికెట్లను జారీ చేయడం టీజీపీఎస్సీ చరిత్రలో మాయనిమచ్చగా అభివర్ణించారు.అవినీతికి ఇదే తొలి బీజమని చెప్పారు. మూల్యాంకనం తొలిసారి చేసిన వాళ్లకిరెండో వ్యక్తి బండిల్‌ నంబర్‌తో ఇస్తారనిమూడో వ్యక్తికి ఇవ్వరని చెప్పారు. పకన కాలమ్‌లో మారులు వేస్తారనిఇందుకు ప్రాతిపదిక మాత్రం ఉండదని అన్నారు. మూల్యాంకనం చేశారా లేదా అన్న విషయాన్ని గుర్తించడానికి వీల్లేదని తెలిపారు. అయితేబండిల్‌ నంబర్లుసీరియల్‌ నంబర్లు ఎవరివో వాళ్లకు తెలుసునని అన్నారు. 

]]>
Wed, 02 Jul 2025 22:28:39 +0530 admin
అహంకారంతో మాట్లాడితే ఈ రాష్ట్ర ప్ర‌జ‌లు అధఃపాతాళానికి తొక్కేస్తారు బిడ్డా : హరీష్ రావు https://prajakshethrenews.com/అహంకారంతో-మాట్లాడితే-ఈ-రాష్ట్ర-ప్రజలు-అధఃపాతాళానికి-తొక్కేస్తారు-బిడ్డా-హరీష్-రావు https://prajakshethrenews.com/అహంకారంతో-మాట్లాడితే-ఈ-రాష్ట్ర-ప్రజలు-అధఃపాతాళానికి-తొక్కేస్తారు-బిడ్డా-హరీష్-రావు అహంకారంతో మాట్లాడితే ఈ రాష్ట్ర ప్ర‌జ‌లు అధఃపాతాళానికి తొక్కేస్తారు బిడ్డా

          ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు నిప్పులు

ప్రజా క్షేత్ర్, హైద‌రాబాద్ జూలై 2 : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రిసిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. అహంకారంతో మాట్లాడితే ఈ రాష్ట్ర ప్ర‌జ‌లు అధఃపాతాళానికి తొక్కేస్తారు బిడ్డా అని సీఎంను హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు. మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఇవాళ తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు.సీఎం ప‌ద‌విని అంద‌రం గౌర‌విస్తాం. రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన ప‌ద‌విలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బాధ్య‌త‌తో మాట్లాడుతాడునిజాలు మాట్లాడుతాడు అని విశ్వ‌సిస్తాం. దుర‌దృష్టం ఏంటంటే మ‌న సీఎం రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన ప‌ద‌విలో అంటూ అన్ని అబ‌ద్దాలు మాట్లాడుతున్నాడు. కుక్క తోక వంక‌ర అన్న‌ట్టు ప్ర‌తిప‌క్షంలో ఉప్పుడుఅధికారంలో ఉన్న‌ప్పుడు అబ‌ద్దాలు మాట్లాడుతున్నాడు. త‌ప్పులుఅబ‌ద్దాలు మాట్లాడిన‌ప్పుడు పాఠ‌కుల‌కు ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు చేర‌వేసే బాధ్య‌త మీడియాపై ఉంది. నిజాల‌ను ప్ర‌సారం చేసే గొప్ప‌త‌నం మీడియాకు ఉంది అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.నిన్న రేవంత్ రెడ్డి ప‌చ్చి అబ‌ద్దాలు మాట్లాడారు. వ్య‌క్త‌లు ముఖ్యం కాదు.. రాష్ట్ర ప్ర‌జ‌లురాష్ట్ర హ‌క్కులు ముఖ్యం. బీఆర్ఎస్ ఉద్య‌మ పార్టీ. తెలంగాణ‌ను తెచ్చిన పార్టీ బీఆర్ఎస్. ఈ రాష్ట్రాన్ని ప‌దేండ్లు పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్. ప్ర‌జ‌లే కేంద్రంగారాష్ట్ర హ‌క్కులే కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ ప‌ని చేస్తుంది. రాజ‌కీయాలు కేంద్రంగాబుర‌ద‌జ‌ల్లే విధంగా అబ‌ద్దాలు మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాబ‌ట్టి నిజాలు ప్ర‌జ‌ల‌కు అందించాల‌ని మీడియాను కోరుతున్నాను అని హ‌రీశ్‌రావు తెలిపారు.నిన్న కాంగ్రెస్ పార్టీ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌జెంటేష‌న్ అధికారిక హోదాలో ఇచ్చింది. కేవ‌లం కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను పిలిచారు. స‌చివాల‌యం నుంచిఇరిగేష‌న్ శాఖ నుంచి వ‌చ్చిన అధికారులు అక్క‌డి ప్ర‌జెంటేష‌న్‌లో ఉన్నారు. మిగ‌తా పార్టీల‌ను పిల‌వాలి క‌దా..నిన్న పీపీటీ హైద‌రాబాద్‌లో ఇచ్చిన‌ట్లు లేదు.. అమ‌రావ‌తిలో ఇచ్చిన‌ట్లు ఉంది. అది చూసిన త‌ర్వాత తెలంగాణ ప్ర‌భుత్వం త‌యారు చేసిందా..చంద్ర‌బాబు పంపిండా..అనే అనుమానం క‌లుగుతుంది. బ‌న‌క‌చ‌ర్ల‌ను ఆపాల‌నే చిత్త‌శుద్ధి ఉంటే ఏపీ ప్ర‌భుత్వంచంద్ర‌బాబు కేంద్రానికి రాసిన లేఖ‌లుజ‌ల‌వ‌న‌రుల‌కు రాసిన లేఖ‌లుబ‌న‌క‌చ‌ర్ల‌ను ముందుకు తీసుకుపోతున్న విధానం చూపించాలి. దాని గురించి ఎక్క‌డ పీపీటీలో చూపించ‌లేదు. దానికి స్థానం దొర‌క‌లేదు. కాళేశ్వ‌రంపాల‌మూరుడిండితుమ్మిళ్ల లిఫ్ట్‌ను బాబు అడ్డుకున్నారు. వాటిని ఎందుకు పీపీటీలో చూపించ‌లేదు అని రేవంత్ రెడ్డిని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.బ‌న‌చ‌ర్ల క‌ట్టే బాబేమో బంగారు లాగా క‌న‌బ‌డుతుంది రేవంత్ రెడ్డికి. బ‌న‌క‌చ‌ర్ల‌ను ఆపాల‌ని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ స‌చ్చిన పాములాగా క‌న‌బ‌డుతుంది. స‌చ్చిన పాము అయితే క‌ల‌లో కూడా బీఆర్ఎస్‌ను ఎందుకు క‌ల‌వ‌రిస్తున్నావు. కేసీఆర్ పేరెత్త‌కుండా ఒక్క స‌మావేశంలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడ‌డు. నిద్ర‌లో కూడా నీకు గులాంబీ జెండాను క‌న‌బ‌డుతుంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప‌ద‌కొండున్న‌ర ఏండ్ల నుంచి అధికారానికి దూరంగా ఉంది. అనేక రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. అనేక శాస‌న‌స‌భ‌ల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు గెల‌వ‌లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెల‌వ‌లేదు. అంత‌మాత్రాన కాంగ్రెస్ పార్టీ స‌చ్చిన‌ పాము అవుతందా..నీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గ‌ల్లంతు అయ్యింది. స‌చ్చిన‌పాము లాంటి చ‌వ‌క‌బారు ముచ్చ‌ట్లు మాకు కాదు రాహుల్ గాంధీకి చెప్పుకో. నీవు సీఎం అయ్యాక నీ సొంత జిల్లా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గెలిచాం. అహంకారంతో మాట్లాడితే అధఃపాతాళానికి ప్ర‌జ‌లు తొక్కేస్తారు బిడ్డా అని సీఎం రేవంత్ రెడ్డిని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

]]>
Wed, 02 Jul 2025 22:24:56 +0530 admin
పాపికొండల యాత్రకు బ్రేక్ https://prajakshethrenews.com/పాపికొండల-యాత్రకు-బ్రేక్ https://prajakshethrenews.com/పాపికొండల-యాత్రకు-బ్రేక్ పాపికొండల యాత్రకు బ్రేక్
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తూ జలవనరులశాఖ ఆదేశాలు జారీ చేసింది. వర్షంతోపాటు గోదావరిలో నీటిమట్టం పెరుగుతున్న కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఈ..నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. యాత్ర ప్రారంభమయ్యే తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని వివరించింది.

]]>
Wed, 02 Jul 2025 22:17:00 +0530 admin
మృతుల కుటుంబాల‌కు రూ. కోటి చొప్పున ప‌రిహారం ప్రకటించిన సిగాచీ ప‌రిశ్ర‌మ https://prajakshethrenews.com/మృతుల-కుటుంబాలకు-రూ-కోటి-చొప్పున-పరిహారం-ప్రకటించిన-సిగాచీ-పరిశ్రమ https://prajakshethrenews.com/మృతుల-కుటుంబాలకు-రూ-కోటి-చొప్పున-పరిహారం-ప్రకటించిన-సిగాచీ-పరిశ్రమ మృతుల కుటుంబాల‌కు రూ. కోటి చొప్పున ప‌రిహారం ప్రకటించిన సిగాచీ ప‌రిశ్ర‌మ

ప్రజా క్షేత్ర్, హైద‌రాబాద్ జూలై 2, ; : పాశ‌మైలారం ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సిగాచీ ప‌రిశ్ర‌మ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ మేర‌కు ప్ర‌మాదంపై స్టాక్ మార్కెట్ల‌కు కంపెనీ సెక్ర‌ట‌రీ వివేక్ కుమార్ లేఖ రాశారు. ఈ ప్ర‌మాదంలో 40 మంది మ‌ర‌ణించిన‌ట్లు లేఖ‌లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాల‌కు రూ. కోటి చొప్పున ప‌రిహారం ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌మాదంలో 33 మంది గాయ‌ప‌డ్డార‌ని పేర్కొంది. గాయ‌ప‌డిన వారికి పూర్తి వైద్య‌సాయం అందిస్తామ‌ని తెలిపింది. గాయ‌ప‌డిన కార్మికుల‌ను అన్ని విధాలుగా అండ‌గా ఉంటాం. కార్మికుల‌కు అన్ని ర‌కాల బీమా క్లెయిమ్‌లు చెల్లిస్తాం. క్ష‌త‌గాత్రుల వైద్య ఖ‌ర్చులు భ‌రిస్తాం.. వారి కుటుంబ పోష‌ణ చూస్తామ‌ని సిగాచీ ప‌రిశ్ర‌మ త‌ర‌పున కంపెనీ సెక్ర‌ట‌రీ వివేక్ కుమార్ ప్ర‌క‌టించారు. ప్ర‌మాదానికి రియాక్ట‌ర్ పేలుడు కార‌ణం కాద‌ని తెలిపారు. ప్ర‌భుత్వ విచార‌ణ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప‌రిశ్ర‌మ‌లో మూడు నెల‌ల పాటు(90 రోజులు) కార్య‌క‌లాపాలు నిలిపివేస్తున్నట్లు వివ‌నేక్ కుమార్ ప్ర‌క‌టించారు.

]]>
Wed, 02 Jul 2025 22:12:59 +0530 admin
హెల్త్ టూరిజం హబ్‌గా మారిన తెలంగాణ రాష్ట్రం : సీ ఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/హెల్త్-టూరిజం-హబ్గా-మారిన-తెలంగాణ-రాష్ట్రం-సీ-ఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/హెల్త్-టూరిజం-హబ్గా-మారిన-తెలంగాణ-రాష్ట్రం-సీ-ఎం-రేవంత్-రెడ్డి హెల్త్ టూరిజం హబ్‌గా మారిన  తెలంగాణ రాష్ట్రం :ముఖ్యమంత్రి రేవంత్

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూలై 2 ;: తెలంగాణ రాష్ట్రం హెల్త్ టూరిజం హబ్‌గా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 66 దేశాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలందించే స్థాయికి ఎఐజి చేరుకుందని ప్రశంసించారు. ఎఐజి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కారించాలని డిమాండ్ చేశారు. అ తెలంగాణ ముఖ్యమంత్రి తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. బుధవారం బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఎఐజి ఆస్పత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎఐజి ఆస్పత్రి సేవలు ఇంకా విస్తరించాలనిహెల్త్ టూరిజంలో ప్రభుత్వానికి నాగేశ్వర్ రెడ్డి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.దేశంలో తయారయ్యే బల్క్ డ్రగ్‌లో 35 శాతం హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతుందని రేవంత్ వెల్లడించారు. ఐడిపిఎల్ మాజీ ఉద్యోగుల కృషితోనే ఫార్మారంగం అభివృద్ధి చెందిందని ప్రశంసించారు. క్యాన్సర్ చికిత్సలో నోరి దత్తాత్రేయ సలహాలుసూచనలు తీసుకుంటున్నామనిక్యాన్సర్ వల్ల మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతుండడంతో వారి ఆరోగ్య వివరాలు నమోదు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. సామాజిక బాధ్యతగా ఏడాదిలో ఒక్క నెల రోజులు ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్యులు పని చేయాలని కోరారు. జనని మిత్ర యాప్ పేద రోగులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిమ్స్‌లో అదనపు బ్లాక్ఎల్‌బి నగర్సనత్‌నగర్‌లో ఆస్పత్రులు నిర్మిస్తున్నాని సిఎం తెలియజేశారు. మిస్ వరల్డ్ వనితలను ఎఐజి ఆస్పత్రి సందర్శించాలని తాను సూచించానని పేర్కొన్నారు.

]]>
Wed, 02 Jul 2025 21:59:42 +0530 admin
శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతున్నవరద నీరు https://prajakshethrenews.com/శ్రీశైలం-జలాశయానికి-వచ్చి-చేరుతున్నవరద-నీరు https://prajakshethrenews.com/శ్రీశైలం-జలాశయానికి-వచ్చి-చేరుతున్నవరద-నీరు

శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతున్నవరద నీరు

  ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూలై 2 :

శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. జూరాల నుంచి శ్రీశైలానికి 83.224 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. అదే విధంగా జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం ప్రస్తుత నీటిమట్టం 875.2 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 164.7 టీఎంసీలు ఉన్నాయి. శ్రీశైలం కుడిఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ ఉత్తత్తి చేసి35,315 క్యూసెక్కులు దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

 

]]>
Wed, 02 Jul 2025 18:28:22 +0530 admin
స్పోర్ట్స్ స్కూళ్ల ఎంపికలో పైరవీలకు తావు లేదు : క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి https://prajakshethrenews.com/స్పోర్ట్స్-స్కూళ్ల-ఎంపికలో-పైరవీలకు-తావు-లేదు-క్రీడా-శాఖ-మంత్రి-వాకిటి-శ్రీహరి https://prajakshethrenews.com/స్పోర్ట్స్-స్కూళ్ల-ఎంపికలో-పైరవీలకు-తావు-లేదు-క్రీడా-శాఖ-మంత్రి-వాకిటి-శ్రీహరి

క్రీడా శాఖలో సమూల మార్పు

 విధుల్లో అలసత్వం వద్దు

 స్పోర్ట్స్ స్కూళ్ల ఎంపికలో పైరవీలకు తావు లేదు

 కోచులకు పునఃశ్చరణ తరగతులు

 స్పోర్ట్స్ స్కూళ్ల పనితీరు మెరుగుపడాలి

 క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

 

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్,   జూలై ; తెలంగాణ క్రీడా పాఠశాలల్లో సమూల మార్పు జరగాల్సిన అవసరం ఉందని  రాష్ట్ర క్రీడ యువజన సర్వీసులు మరియు పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈరోజు హకీంపేటలోని  తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా ఈరోజు నుంచి ప్రారంభమైన రాష్ట్రస్థాయి  క్రీడా పాఠశాల ఎంపికల ప్రక్రియను ఆయన  పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ క్రీడా పాఠశాలలు హకీంపేట కరీంనగర్ అదిలాబాదుల లో క్రీడా పాఠశాల నిర్వహణలో సమూలమైన మార్పులు జరగాల్సిన అవసరం ఉందని మూడు నెలల్లో వీటి పనితీరును మెరుగుపరిచి చూపిస్తామని ఆయన ప్రకటించారు. క్రీడా పాట శాలల ఎంపికలో ఎటువంటి పైరవీలకు ఆస్కారం ఉండకూడదని, పాఠశాలల విద్యార్థుల ఎంపికలో ఎటువంటి ఒత్తిడిలు వచ్చిన  పారదర్శకంగా వ్యవహరించి  క్రీడల్లో ప్రతిభ ఉన్న వారిని ఎంపిక చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కరీంనగర్ అదిలాబాద్ లో ఉన్న పాఠశాలల కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని  ఆయన అన్నారు. క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ సందర్భంగా విద్యార్థుల్లో తల్లిదండ్రులు అందరితో  ఆయన మాట్లాడుతూ, ఎంపిక కానీ పిల్లలను  క్రీడలకు దూరం చేయకుండా వారిని క్రీడల్లో రాణించే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్రీడా పాఠశాలలు అకాడమీ లలో  విద్యార్థుల ఎంపిక తర్వాత వారికి మెరుగైన శిక్షణ ఇచ్చే విధంగా కోచులు సిబ్బంది శ్రద్ధ వహించాలన్నారు. నూతన క్రీడా విధానం అనుసరించి  అంచలంచలుగా కోచులు మరియు క్రీడా సిబ్బంది సంఖ్యను పెంచుకుంటూ పోవడమే కాకుండా , ప్రతి సంవత్సరం కోచులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహించి  వారి పనితీరును మెరుగు పరుస్తామని అన్నారు. ఫలితాలు సాధించే కోచులను ప్రోత్సహిస్తూనే, ఫలితాలు తీసుకురాని, క్రీడా శిక్షకులను ఉపేక్షించబోమని ఆయన అన్నారు. ఇకముందు  స్పోర్ట్స్ స్కూల్ లను అకాడమీ లను ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన  స్పోర్ట్స్ స్కూల్ క్యాంటీన్, కిచెను ను పరిశీలించి మరింత శుభ్రతను పాటించాలని  పిల్లలకు అందించే ఆహారం  మరింత పరిశుభ్రంగా అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో పాటు లైన్లో నిలబడి, భోజనం తీసుకోవడమే కాకుండా వారితో కలిసి భోజనం చేశారు. ప్రతి 10 సంవత్సరాల నుండి క్రీడా శాఖ పనితీరు కుంటుపడిందని, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో మాదిరిగానే క్రీడా శాఖలో మార్పు మొదలైందని, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన అందుకొని క్రీడాభివృద్ధి కోసం శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సోనీ బాలాదేవి, స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి టీ మమత, స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు, స్పోర్ట్స్ స్కూల్  సిబ్బంది పాల్గొన్నారు.

 

]]>
Wed, 02 Jul 2025 10:19:34 +0530 admin
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు https://prajakshethrenews.com/కేంద్ర-మంత్రి-కిషన్-రెడ్డిపై-ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి-కీలక-వ్యాఖ్యలు https://prajakshethrenews.com/కేంద్ర-మంత్రి-కిషన్-రెడ్డిపై-ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి-కీలక-వ్యాఖ్యలు కిషన్‌రెడ్డి మాట్లాడే ప్రతి మాట.. కెటిఆర్ ఆఫీసు నుండి వచ్చే ప్రెస్‌నోటే..

   కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూలై ;

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను బతికించే పనిలో కిషన్‌రెడ్డి ఉన్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.  సిఎం రేవంత్ మాట్లాడుతూ.. కిషన్‌రెడ్డి మాట్లాడే ప్రతి మాట.. కెటిఆర్ ఆఫీసు నుండి వచ్చే ప్రెస్‌నోటేనని అన్నారు. “తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై మేం కిషన్‌రెడ్డి దగ్గరికి వెళ్తే.. ఆయన ఎప్పుడూ మమ్మల్ని కేంద్ర మంత్రి దగ్గరికి తీసుకుపోలేదు. మేం పోతే.. మాకంటే ముందు రోజే ఆయన మంత్రులను కలుస్తున్నారు. కిషన్‌రెడ్డి తీరు అనుమానాలు కలిగిస్తున్నాయి. రాష్ట్ర నీటి హక్కులను కాపాడటంలో పోరాడుతునే ఉంటాం. రాజకీయంగాన్యాయపరంగా పోరాడుతాం” అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

]]>
Wed, 02 Jul 2025 10:14:19 +0530 admin
ఒకరు చెబితే నిర్ణయం తీసుకునే పార్టీ బీజేపీ కాదు : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ https://prajakshethrenews.com/ఒకరు-చెబితే-నిర్ణయం-తీసుకునే-పార్టీ-బీజేపీ-కాదు-కేంద్రమంత్రి-బండి-సంజయ్-కుమార్ https://prajakshethrenews.com/ఒకరు-చెబితే-నిర్ణయం-తీసుకునే-పార్టీ-బీజేపీ-కాదు-కేంద్రమంత్రి-బండి-సంజయ్-కుమార్ ఒకరు చెబితే నిర్ణయం తీసుకునే పార్టీ బీజేపీ కాదు
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్
బీజేపీ పై దుష్ప్రచారం చేసే వాళ్లపై కఠిన చర్యలుంటాయ్
బీసీకి అధ్యక్ష పదవి గురించి అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదు.
దళితుడికి సీఎం ఇస్తానని మాట తప్పిన బీఆర్ఎస్ కు బీజేపీకి గురించి మాట్లాడే హక్కు లేదు,
చేతనైతే కేసీఆర్ తప్పుకుని బీసీకి బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చే దమ్ముందా?

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
బీసీకి అధ్యక్ష పదవి గురించి అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీ బీజేపీ అని, దేశంలో, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ. సిద్దాంతం కోసం కమిట్ మెంట్ తో పనిచేసే లక్షలాది కట్టర్ కార్యకర్తలున్న పార్టీ బీజేపీ. అంత గొప్ప చరిత్ర కలిగిన బీజేపీ ఒకరు చెబితేనే, ఇంకొకరు ఒత్తిడి తెస్తేనో తలొగ్గి నిర్ణయం తీసుకునే పార్టీ బీజేపీ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.  రామచంద్రరావు పేరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఖరారు చేయడం వెనుక చంద్రబాబు కీలక పాత్ర పోషించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ పైవిధంగా స్పందించారు. ఇది కావాలని కొంతమంది చేస్తున్న దుష్ప్రచారమన్నారు. అట్లాంటి వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. బీజేపీలోనూ కొందరు ఇలాంటి ప్రచారమే చేస్తున్నారంటూ మీడియా ప్రస్తావించగా, బీజేపీలో అట్లాంటివి జరగవు. ఇట్లాంటి పోకడలను ఇప్పడే చూస్తున్నా ఇది కరెక్ట్ కాదు. బండి సంజయ్ ఉంటేనే పార్టీ  ఉన్నట్లు, లేకపోతే పార్టీయే లేనట్లు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎవరు లేకపోయినా పార్టీ నడస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని స్పష్టం చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు స్వీకరిస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన బండి సంజయ్ ను ఈ అంశంతోపాటు మీడియా అడిగిన పలు ప్రశ్నలకు బండి సంజయ్ కుండ బద్దలు కొట్టినట్లుగా సమాధానమిచ్చారు. ఏమన్నరంటే..రాష్ట్ర అధ్యక్ష పదవిపై జాతీయ నాయకత్వం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడి పేరును ప్రకటించలేదు. పదవి కోసం ఎవరైనా నామినేషన్ వేసే అవకాశముంది. అధ్యక్షుడు కావాలని కోరుకోవడంలో కూడా తప్పులేదు. కానీ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని పార్టీ ప్రయోజనాలను ద్రుష్టిలో ఉంచుకుని హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్ మెంట్ తో పనిచేసే ప్రతి కార్యకర్తపై ఉంది. ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలో హైకమాండ్ నిర్ణయిస్తది. అధ్యక్ష పదవి రానంత మాత్రాన మిగితా వాళ్లు డమ్మీ అనుకోవడం కూడా సరికాదు. చంద్రబాబు చెబితేనే రామచంద్రరావుకు పదవి ఇచ్చారనే ప్రచారంపై..అవన్నీ ఫాల్త్ మాటలు. సోషల్ మీడియాలో కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య ఇట్లాంటి కొత్త పోకడలు కన్పిస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు చెబితే వినే పార్టీ బీజేపీ కాదు. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వమున్న పార్టీ. దేశంలో, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కట్టర్ కార్యకర్తలున్న పార్టీ బీజేపీ. ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నిర్ణయించిన అభ్యర్ధికి వ్యతిరేకంగా మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే హైకమాండ్ సీరియస్ గా చర్యలు తీసుకుంటుంది. బండి సంజయ్ ఉంటేనే పార్టీ  ఉన్నట్లు. లేకపోతే పార్టీయే లేనట్లు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎవరు లేకపోయినా పార్టీ నడస్తుంది.

డమ్మీ అని ప్రచారం చేస్తే చర్యలు తప్పవ్...

మోదీ నాయకత్వంలో బీజేపీ కచ్చితంగా తెలంగాణ అధికారంలోకి రావడం తథ్యం. కట్టర్ కార్యకర్తలంతా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అంతే తప్ప ఆయన డమ్మీ ఈయన డమ్మీ అని దుష్ప్రచారం చేస్తే ఎవరూ పట్టించుకోరు.బీసీకి అధ్యక్ష పదవి ఎందుకివ్వలేదనే ప్రశ్నపై...అంతేందుకు బీసీకి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్న బీఆర్ఎస్ ను అడుగుతున్నా  కేసీఆర్ దిగి బీసీకి బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చే దమ్ముందా? దళితుడికి సీఎం ఇస్తా, లేకుంటే తల నరక్కుంటానని హామీ ఇచ్చి మాట తప్పిన నాయకుడు కేసీఆర్. బీజేపీ భాజాప్తా ఒక్కటే మాట చెప్పింది. అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే సీఎం అవుతారని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం ఆ విషయం చూసుకుంటుంది. కానీ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు కదా? పార్టీ బలోపేతం కోసం అనేక రకాలుగా ఆలోచించి నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. బీసీల్లో నాకు కేంద్ర పదవి ఇవ్వలేదా, లక్ష్మణ్ కు ఇవ్వలేదా, దత్తాత్రేయకు ఇవ్వలేదా? దళితుడైన బంగారు లక్ష్మణ్ కు పదవి ఇవ్వలేదా?  దళితుడికి సీఎం ఇస్తానని మాట తప్పి వేల కోట్లు దోచుకున్న పార్టీ బీఆర్ఎస్అని మండిపడ్డారు.

]]>
Mon, 30 Jun 2025 22:04:10 +0530 admin
గుట్ట అన్నదాన పథకానికి 25 లక్షల విరాళం https://prajakshethrenews.com/గుట్ట-అన్నదాన-పథకానికి-25-లక్షల-విరాళం-815 https://prajakshethrenews.com/గుట్ట-అన్నదాన-పథకానికి-25-లక్షల-విరాళం-815 గుట్ట అన్నదాన పథకానికి 25 లక్షల విరాళం 

ప్రజా క్షేత్ర్, యాదగిరిగుట్ట, జూన్ 30 ;:  యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దేవస్థానం శాశ్వత నిత్య అన్నదాన పథకానికి భారీ స్పందన లభిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా తీర్చిదిద్దేందుకు కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకట్రావు చేస్తున్న కృషికి మంచి స్పందన లభిస్తోంది. హైద్రాబాద్ కొండాపూర్ కు చెందిన భూపతిరాజు సూర్యనారాయణరాజు వారి మనవడు అనంత్ ఇషాన్ పేరున శ్రీ స్వామి వారి శాశ్వత నిత్య అన్నదాన పథకానికి 25 లక్షల రూపాయల విరాళం చెక్కును కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకట్రావు కు అందజేశారు. విరాళాల దాతలను ప్రోత్సహించేందుకు దేవస్థానం ప్రత్యేక పథకాలు రూపొందించాలని, తద్వారా భక్తులకు మరిన్ని సౌకర్యాలు సమకూరుతాయని, దేవస్థానం త్వరితగతిన మరింత అభివృద్ధి చెందుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

]]>
Mon, 30 Jun 2025 21:03:23 +0530 admin
యాదగిరిగుట్ట దేవస్థానంలో చింతపండు చోరీ కేసు....దోషులపై సీరియస్ యాక్షన్ షురూ https://prajakshethrenews.com/యాదగిరిగుట్ట-దేవస్థానంలో-చింతపండు-చోరీ-కేసుదోషులపై-సీరియస్-యాక్షన్-షురూ https://prajakshethrenews.com/యాదగిరిగుట్ట-దేవస్థానంలో-చింతపండు-చోరీ-కేసుదోషులపై-సీరియస్-యాక్షన్-షురూ యాదగిరిగుట్ట దేవస్థానంలో చింతపండు  చోరీ కేసు....

 దోషులపై సీరియస్ యాక్షన్ షురూ 

* పలువురికి సంజాయిషీ నోటీసులు ,చార్జీ మెమోలు, సస్పెన్షన్లు 

* కమిటీ విచారణ లో విస్తుపోయే నిజాలు 

 ప్రజా క్షేత్ర్, యాదగిరిగుట్ట జూన్ 30 :

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఇటివల జరిగిన చింతపండు దొంగతనం సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది .కేసుకు సంబంధించిన దోషులపై  చర్యలు ప్రారంభమయ్యాయి. పులిహోర ప్రసాదానికి మూల సరుకు చింతపండు.దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకట్రావు ఈ కేసు పై సీరియస్ గా స్పందించి ఐదుగురు సభ్యులతో   కమిటీ వేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కూడా ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీ నియమించారు . విచారణ అధికారులు యాదగిరిగుట్టకు విచ్చేసి దొంగతనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. పలువురు సిబ్బందితో విషయం అడిగి తెలుసుకున్నారు .విచారణ కమిటీ తన నివేదికను సమర్పించింది. దీంతో తదుపరి చర్యలలో భాగంగా పలువురికి షోకాస్ నోటీసులు ...సంజాయిషులు.. సస్పెన్షన్లు చేపట్టారు. ప్రసాద విక్ర యశాల విభాగంలో స్టాక్ రిజిస్టర్ లో అవకతవకలు కనుగొన్నారు. స్టోర్ గుమస్తా పి నవీన్ ,సీనియర్ అసిస్టెంట్ ప్రసాదాల తయారీ సరుకుల హెచ్చుతగ్గుల వివరాలను పై అధికారులకు తెలియపరచక అవుట్సోర్సింగ్ సిబ్బంది దొంగతనం చేయడానికి అవకాశం కల్పించి విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సహాయపాచకులు టి వాసు, ఎస్ బి సంతోష్, కృష్ణమాచార్యులకు పాటు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు . అదేవిధంగా విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా వెనువెంటనే జారీ చేశారు. ప్రసాదాల తయారీ స్టాక్ ను, రిజిస్టర్ను  ఎప్పటికప్పుడు పరిశీలించక విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, ఉదాసీనంగా వ్యవహరించడం, ఫలితంగా అజమాయిషి లోపించి క్రింది స్థాయి సిబ్బంది అవకతవకలకు పాల్పడేందుకు పరోక్షంగా అవకాశం కల్పించిన సంబంధిత పర్యవేక్షకుడు ఏ సత్యనారాయణ శర్మ, బి వెంకటేశం పై అభియోగాలు మోపారు . వారిని చార్జీ మెమో ద్వారా సంజాయిషీ కోరారు.

]]>
Mon, 30 Jun 2025 21:01:26 +0530 admin
పంచాయతీ కో ఆప్షన్ మెంబర్ గా టాస్కా సభ్యుడిని తీసుకోవాలి https://prajakshethrenews.com/పంచాయతీ-కో-ఆప్షన్-మెంబర్-గా-టాస్కా-సభ్యుడిని-తీసుకోవాలి https://prajakshethrenews.com/పంచాయతీ-కో-ఆప్షన్-మెంబర్-గా-టాస్కా-సభ్యుడిని-తీసుకోవాలి పంచాయతీ కో ఆప్షన్ మెంబర్ గా టాస్కా సభ్యుడిని తీసుకోవాలి

* కాచారం సమావేశం లో ప్రభుత్వాన్ని కోరిన జిల్లా టాస్కా ప్రధాన కార్యదర్శి ఎర్రగుంట వెంకటేశం

* స్థానిక యాదగిరిగుట్ట దేవస్థానం లో వృద్ధులకు ఉచిత దర్శనం కల్పించాలని మండల అధ్యక్షుడు ముడుంబై జయమోహనా చార్య డిమాండ్

ప్రజా క్షేత్ర్, యాదగిరిగుట్టజూన్ 30 జూన్ 30 : వయోజనులకు అండగా టాస్కా ( తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్) నిలబడుతుందనిన్యాయం జరిగే వరకు పోరాడుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా టాస్కా ప్రధాన కార్యదర్శి ఎర్రగుంట్ల వెంకటేశం పునరుద్ఘాటించారు. యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మండల టాస్కా అధ్యక్షుడు ముడుంబై జయమోహనా చార్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత మండల టాస్కా ప్రధాన కార్యదర్శి పులుగం చక్రపాణి గ్రామ వయోజనులకు స్వాగతం పలికారు. చట్టం ద్వారా వయోజనులకు చేకూరి న రక్షణకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రయోజనాలు తదితర అనేక అంశాలపై ఎర్రగుంట్ల వెంకటేశం సుదీర్ఘంగా ప్రసంగించారు. వృద్దాప్యం లో ఒంటరి తనానికి లోనుకావద్దనిగ్రామం లో వయోజనులు సంఘటితంగా వుంటే సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయన్నారు. ఉన్న ఆస్తులు పిల్లల పేరు మీద రాసేసి తర్వాత ఇబ్బందులకు గురి కావద్దనిచరమాంకంలో వీలునామా రాసి జాగ్రత్తలు పడవచ్చునని ఆయన సూచించారు. జిల్లాలో 425 కేసులలో వయోజనులకు టాస్కా అండగా నిలిచి ఎలా న్యాయం కోసం పోరాడిందో అనేక సంఘటనలను ఆయన వివరించారు. ప్రతి పంచాయతీ పాలక వర్గంలో కో ఆప్షన్ సభ్యుడుగా టాస్కా సభ్యుడిని తీసుకోవాలనితద్వారా గ్రామ వయోజనులకు స్థానికంగా సంపూర్ణ న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాలతో టాస్కా కు ఎలాంటి సంబంధం లేదనిఇది ఒక సామాజిక సేవా కార్యక్రమం అని ఆయన స్పష్టం చేశారు.మండల టాస్కా అధ్యక్షుడు ముడుంబై జయమోహనా చార్య మాట్లాడుతూ రాష్ట్రంలో 70 లక్షలకు పైగా ఉన్న వయోజనుల కోసం ప్రత్యేక పథకాలు రూపొందించాలని కోరారు.వృద్ధులకు ప్రత్యేకంగా ఆశ్రమాలుఆసుపత్రులు ఏర్పాటు చేయాలనిస్థానిక శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దేవాలయంలో ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ఒకగంట చొప్పున వృద్ధులకు ఉచిత దర్శనం కల్పించాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా దాదాపు వందమందికి పైగా పాల్గొన్న వయోజనులు ఒకటిరెండు రోజుల్లో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకుంటామని ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా టాస్కా సంయుక్త కార్యదర్శి బండారు బిక్షపతిభువనగిరి మండల అధ్యక్షుడు పి రోమన్ తోపాటు జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ రాగి సహదేవ్మండల కమిటీ నాయకులు నూకల సుధాకర్ రెడ్డిగుంటి యాదగిరిగుండ్లపల్లి మల్లేశం గౌడ్గౌడ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

]]>
Mon, 30 Jun 2025 20:32:29 +0530 admin
స్వేచ్ఛ కూతురు.. పూర్ణచందర్‌పై సంచలన ఆరోపణలు https://prajakshethrenews.com/స్వేచ్ఛ-కూతురు-పూర్ణచందర్పై-సంచలన-ఆరోపణలు https://prajakshethrenews.com/స్వేచ్ఛ-కూతురు-పూర్ణచందర్పై-సంచలన-ఆరోపణలు స్వేచ్ఛ కూతురు.. పూర్ణచందర్‌పై సంచలన ఆరోపణలు

తనతో కూడా అతను అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణ

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 30 : తెలుగు యాంకర్‌ స్వేచ్ఛ వొటార్కర్‌   ఆత్మహత్య కేసు యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ కేసులో నిందితుడు పూర్ణచందర్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. స్వేచ్ఛ కూతురు.. పూర్ణచందర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తన తన తల్లి సూసైడ్‌కు కారణమైన పూర్ణచందర్‌ను చంపేయాలని ఆయన చిన్నారి డిమాండ్ చేసింది. అంతేకాక తనతో కూడా అతను అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణ చేసింది.అయితే తాజాగా పూర్ణచందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చారు. తన భర్తపై స్వేచ్ఛ  కూతురు తన భర్తపై వేసిన నిందులు విని తట్టుకోలేకోపోయానని ఆమె అన్నారు. స్వేచ్ఛ కూతురిని పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నారని ఆమె తెలిపారు. స్వేచ్ఛ పూర్ణను బ్లాక్‌మెయిల్ చేసిందని.. తనను కూడా చాలా టార్చర్ పెట్టిందని పేర్కొన్నారు. స్వేచ్ఛ కూతురితో అలా ఎవరు చెప్పిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త చెడ్డవాడు కాదని.. న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందని ఆమె అన్నారు.

]]>
Mon, 30 Jun 2025 20:26:38 +0530 admin
దేశానికే ఆదర్శమైన గురుకులాలు రేవంత్‌ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం : ఎమ్మెల్యే హరీష్ రావు https://prajakshethrenews.com/దేశానికే-ఆదర్శమైన-గురుకులాలు-రేవంత్-రెడ్డి-పాలనా-వైఫల్యం-వల్ల-నిర్వీర్యం-ఎమ్మెల్యే-హరీష్-రావు https://prajakshethrenews.com/దేశానికే-ఆదర్శమైన-గురుకులాలు-రేవంత్-రెడ్డి-పాలనా-వైఫల్యం-వల్ల-నిర్వీర్యం-ఎమ్మెల్యే-హరీష్-రావు

దేశానికే ఆదర్శమైన గురుకులాలు రేవంత్‌ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం

                   బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శ

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 30 ; బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలురేవంత్‌ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్ రావు   విమర్శించారు. విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి లక్షల మంది ఎస్సీఎస్టీబీసీ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నదని ఆరోపించారు. రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలుకళాశాలల పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటం శోచనీయమని వెల్లడించారు. జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లుమాంసంఅరటి పండ్ల సరఫరా నిలిచిపోయాయని చెప్పారు. బకాయిలు చెల్లించకుంటే జులై 1 నుంచి అన్ని రకాల ఆహార పదార్థాలుఇతర సామాగ్రి సరఫరాను నిలిపేస్తామని హెచ్చరించే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.మరోవైపు 13 నెలలుగా రూ.450 కోట్లకుపైగా అద్దె బకాయిలు చెల్లించక భవనాల యజమానులు తాళాలు వేస్తున్న దుస్థితి నెలకొన్నదని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటికీ యూనిఫాంటైబెల్ట్బూట్లుస్కూల్ బ్యాగులు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ఎస్సీఎస్టీబీసీ గురుకులాల్లో యూనిఫామ్ ఇవ్వకపోవడంతో పిల్లలు పాతచినిగిపోయిన దుస్తులు వేసుకుంటున్నారని తెలిపారు. పదేండ్లలో అద్భుతంగా నడిచిన గురుకులాల వ్యవస్థరేవంత్   పాలనలో కుదేలవుతుండటం దురదృష్టకరమన్నారు.దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలబెట్టాలనిఎస్సీ ఎస్టీబీసీమైనార్టీ వర్గాలకు చెందిన పేద పిల్లల భవిష్యత్తును కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకుల కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు బకాయిలు వెంటనే చెల్లించాలని తెలిపారు. ఆహార పదార్థాలుఇతర సామగ్రి సరఫరా అంతరాయం లేకుండా చూడాలన్నారు. యూనిఫామ్బూట్లుస్కూల్ బ్యాగులు.. తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.

 

]]>
Mon, 30 Jun 2025 20:16:12 +0530 admin
జూరాల 14 గేట్లు ఎత్తివేత https://prajakshethrenews.com/జూరాల-14-గేట్లు-ఎత్తివేత https://prajakshethrenews.com/జూరాల-14-గేట్లు-ఎత్తివేత

జూరాల 14 గేట్లు ఎత్తివేత

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 30;

జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. సోమవారం సాయంత్రం వరద ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకుని అధికారులు 14 గేట్లు ఎత్తివేశారు. జూరాల ఇన్‌ఫ్లో లక్షా 26 వేల క్యూసెక్కులు కాగాఔట్‌ఫ్లో 1,20,185 క్యూసెక్కులకు చేరుకుంది. జూరాల పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగాప్రస్తుతం 317.360 మీటర్లకు చేరుకుంది. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టిఎంసిలు కాగా… ప్రస్తుతం 7.389 టిఎంసిలకు చేరుకుంది.

 

]]>
Mon, 30 Jun 2025 20:11:33 +0530 admin
గుట్ట అన్నదాన పథకానికి 25 లక్షల విరాళం https://prajakshethrenews.com/గుట్ట-అన్నదాన-పథకానికి-25-లక్షల-విరాళం https://prajakshethrenews.com/గుట్ట-అన్నదాన-పథకానికి-25-లక్షల-విరాళం

గుట్ట అన్నదాన పథకానికి 25 లక్షల విరాళం

ప్రజా క్షేత్ర్, యాదగిరిగుట్టజూన్ 30 ;:  యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దేవస్థానం శాశ్వత నిత్య అన్నదాన పథకానికి భారీ స్పందన లభిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా తీర్చిదిద్దేందుకు కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకట్రావు చేస్తున్న కృషికి మంచి స్పందన లభిస్తోంది. హైద్రాబాద్ కొండాపూర్ కు చెందిన భూపతిరాజు సూర్యనారాయణరాజు వారి మనవడు అనంత్ ఇషాన్ పేరున శ్రీ స్వామి వారి శాశ్వత నిత్య అన్నదాన పథకానికి 25 లక్షల రూపాయల విరాళం చెక్కును కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకట్రావు కు అందజేశారు. విరాళాల దాతలను ప్రోత్సహించేందుకు దేవస్థానం ప్రత్యేక పథకాలు రూపొందించాలనితద్వారా భక్తులకు మరిన్ని సౌకర్యాలు సమకూరుతాయనిదేవస్థానం త్వరితగతిన మరింత అభివృద్ధి చెందుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

 

]]>
Mon, 30 Jun 2025 19:59:12 +0530 admin
బీజేపీ ఫ్యూడల్ పార్టీ.. బీజేపీ లో బీసీ లకు ఎప్పుడూ న్యాయం జరగలేదు : మంత్రి పొన్నం ప్రభాకర్ https://prajakshethrenews.com/బీజేపీ-ఫ్యూడల్-పార్టీ-బీజేపీ-లో-బీసీ-లకు-ఎప్పుడూ-న్యాయం-జరగలేదు-మంత్రి-పొన్నం-ప్రభాకర్ https://prajakshethrenews.com/బీజేపీ-ఫ్యూడల్-పార్టీ-బీజేపీ-లో-బీసీ-లకు-ఎప్పుడూ-న్యాయం-జరగలేదు-మంత్రి-పొన్నం-ప్రభాకర్ బీజేపీ ఫ్యూడల్ పార్టీ..  బీజేపీ లో బీసీ లకు ఎప్పుడూ న్యాయం జరగలేదు

* ఒక బీసీ నాయకుడు  నామినేషన్ వేయనివకుండా అడ్డుకొని నిరంకుశత్వంగా వ్యవహరించారు..

* బీజేపీ పార్టీ బీసీ ల వ్యతిరేకి అని మరోసారి  నిరూపించుకుంది..

* బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్,

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 30 ;బీజేపీ పార్టీ బీసీ ల వ్యతిరేకి అని మరోసారి  నిరూపించుకుందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.ముగ్గురు బీసీ ఎంపీలు ఉన్న బీసీ సీనియర్ నేతలు ఉన్న  బీజేపీ అధ్యక్షుడు   కావడానికి అన్ని అర్హతలు ఉన్న ఇవ్వలేదు,గతంలో బీసీ ముఖ్యమంత్రి  చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి కనీసం సభాపక్ష నాయకుడు ని కూడా బీసీ లకు ఇవ్వలేదు బీజేపీ ఫ్యూడల్ పార్టీ..  బీజేపీ లో బీసీ లకు ఎప్పుడూ న్యాయం జరగలేదన్నారు.బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఒక బీసీ నాయకుడు  నామినేషన్ వేయనివకుండా అడ్డుకొని నిరంకుశత్వంగా వ్యవహరించారు.. ఆయన మద్దతుదారులను భయబ్రాంతులకు గురి చేశారు..బీజేపీ లో బీసీ లకు  అన్యాయం జరుగుతుందని మీ పార్టీ నాయకులే వాపోతున్నారు.. దీనికి బీజేపీ అధిష్టానం ఏం సమాధానం చెప్తుంది..సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం..బీసీ ల ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీముఖ్యమంత్రి రెడ్డి ఉంటే... పీసీసీ అధ్యక్షుడిని బీసీ నీ చేసుకున్నాంమేము ఒకవైపు కుల గణన చేసుకొని బీసీ లకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు చేస్తూ  శాసన సభలో చట్టం చేసుకొని సామాజిక న్యాయం కోసం ముందుకు పోతుంటే..బీజేపీ మరోసారి బీసీ ల  గొంతు కోసింది..దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ  బీసీ ల కోసం నినాదాన్ని ఎత్తుకున్నారుతెలంగాణలో దేశ వ్యాప్తంగా ఎస్సీఎస్టీబీసీ,మైనార్టీ లకు న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యంగతంలో బీజేపీ అధ్యక్షుడు బీసీ నేత బండి సంజయ్ ఉంటే ఎన్నికల సమయంలో ఆయనను తొలగించి  కిషన్ రెడ్డి ని అధ్యక్షుడిని చేశారు..

]]>
Mon, 30 Jun 2025 19:54:05 +0530 admin
21వ తెలంగాణ ప్రాంతీయ ప్రాడిజీ పోటీ https://prajakshethrenews.com/21వ-తెలంగాణ-ప్రాంతీయ-ప్రాడిజీ-పోటీ https://prajakshethrenews.com/21వ-తెలంగాణ-ప్రాంతీయ-ప్రాడిజీ-పోటీ 21వ తెలంగాణ ప్రాంతీయ ప్రాడిజీ పోటీ

        3100 మంది పోటీ పడ్డ చిన్నారులు 

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్జూన్ 30; శంషాబాద్ సమీపంలోని క్లాసిక్ కన్వెన్షన్-3లో జరిగిన 21వ తెలంగాణ ప్రాంతీయ SIP ప్రాడిజీ పోటీ 2025లో రికార్డు స్థాయిలో 3,100 మంది పిల్లలు పాల్గొన్నారు.భారతదేశంలోని ప్రముఖ పిల్లల నైపుణ్య అభివృద్ధి సంస్థ SIP అబాకస్ నిర్వహించిన ఈ కార్యక్రమం మానసిక చురుకుదనం, విద్యా నైపుణ్యానికి పోటీ నిర్వహించింది.SIP ప్రాడిజీ అనేది వార్షిక అబాకస్, మానసిక అంకగణిత పోటీ. ఉత్సాహంతో నిండిన , "మానవ కాలిక్యులేటర్లు" అని పిలువబడే పిల్లలు కేవలం 11 నిమిషాల్లో 200 కి పైగా అంకగణిత సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించారు ఈ పోటీలో వారి అబాకస్-ఆధారిత మానసిక గణిత నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ పోటీని రెండు రౌండ్లలో నిర్వహించారుప్రతి సెషన్‌లో 1,550 మంది విద్యార్థులు పోటీ పడ్డారు.పోటీని ప్రారంభిస్తూ, SIP అకాడమీ డైరెక్టర్ శ్రీ సిబి శేఖర్, "అబాకస్ గణితానికి అతీతమైనది. ఇది అవసరమైన జీవిత నైపుణ్యాలను - ఏకాగ్రతవినడంజ్ఞాపకశక్తి మరియు పోటీ స్ఫూర్తిని - నిర్మిస్తుంది - ఇవన్నీ విద్యా నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసానికి పునాది వేస్తాయి" అని నొక్కి చెప్పారు."ఏదైనా పోటీలో రెండు ఫలితాలు ఉంటాయి: ఒకటి విజేతమరొకటి అభ్యాసకుడు. గెలవడం లేదా ఓడిపోవడం కంటే పాల్గొనడం ముఖ్యం - ఇది స్థితిస్థాపకత మరియు ఎదగడానికి స్ఫూర్తిని పెంచుతుంది."ఈ పోటీలో ప్రాంతీయ విజేతలు నవంబర్ 2025 లో చెన్నైలో జరగనున్న అంతర్జాతీయ ప్రాడిజీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తారుఇక్కడ 23 భారతీయ రాష్ట్రాలు మరియు 11 దేశాల నుండి 5,000 మందికి పైగా పిల్లలు పోటీ పడతారని భావిస్తున్నారు.SIP అబాకస్ శిక్షణలో అత్యంత అధునాతన దశ అయిన ప్రతిష్టాత్మక గ్రాండ్ మాస్టర్ స్థాయిని పూర్తి చేసిన 300 మంది విద్యార్థులకు స్నాతకోత్సవ వేడుక కూడా జరిగింది.

]]>
Mon, 30 Jun 2025 19:48:11 +0530 admin
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అంశం పార్టీ హైకమాండ్ చేతిలో ఉంది : మల్లికార్జున్‌ ఖర్గే https://prajakshethrenews.com/కర్ణాటక-ముఖ్యమంత్రి-మార్పు-అంశం-పార్టీ-హైకమాండ్-చేతిలో-ఉంది-మల్లికార్జున్-ఖర్గే https://prajakshethrenews.com/కర్ణాటక-ముఖ్యమంత్రి-మార్పు-అంశం-పార్టీ-హైకమాండ్-చేతిలో-ఉంది-మల్లికార్జున్-ఖర్గే

కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అంశం పార్టీ హైకమాండ్ చేతిలో ఉంది

            కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే  

ప్రజా క్షేత్ర్,  బెంగళూర్ జూన్ ౩౦ :
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగనుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌   కు సీఎం పగ్గాలు కట్టబెట్టబోతున్నారని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు   మల్లికార్జున్‌ ఖర్గే   స్పందించారు. కర్ణాటక రాజధాని బెంగళూరు లో మీడియా ఈ అంశంపై ప్రశ్నించడంతో ఆయన సమాధానం చెప్పారు.ముఖ్యమంత్రి మార్పు అంశం పార్టీ హైకమాండ్ చేతిలో ఉందనిపార్టీ హైకమాండ్‌లో ఏం జరుగుతుందనే విషయాన్ని ఏ ఒక్కరూ బయటికి చెప్పరని మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. ఈ విషయంలో చర్య తీసుకునే హక్కు హైకమాండ్‌కు మాత్రమే ఉందనికాబట్టి విషయాన్ని హైకమాండ్‌కే వదిలేద్దామని చెప్పారు. దీనిపై ఎ,వరూ అనవసరమైన సమస్యలు సృష్టించవద్దని ఆయన కోరారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు వార్తలు నిజమేనా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఖర్గే పైవిధంగా స్పందించారు.డీకే శివకుమార్‌ కర్ణాటక సీఎం కాబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ ఆదివారం అదే విషయం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరో రెండుమూడు నెలల్లో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశముందని హుస్సేన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసని.. ప్రస్తుతం హైకమాండ్‌ శివకుమార్‌ గురించే యోచిస్తోందని అన్నారు. డీకే శివకుమార్‌కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది

 

]]>
Mon, 30 Jun 2025 19:39:20 +0530 admin
భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా https://prajakshethrenews.com/భారతీయ-జనతా-పార్టీకి-ఎమ్మెల్యే-రాజాసింగ్-రాజీనామా https://prajakshethrenews.com/భారతీయ-జనతా-పార్టీకి-ఎమ్మెల్యే-రాజాసింగ్-రాజీనామా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఆ పార్టీలో కల్లోలం

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తనను నామినేషన్‌ వెయ్యనివ్వలేదు

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన నిర్ణయం

భారతీయ జనతా పార్టీకి రాజీనామా

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ ౩౦ ; బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఆ పార్టీలో కల్లోలం సృష్టిస్తున్నది. పదవి కోసం పోటీపడి భంగపడ్డ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పంపినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన రాజీనామాను ఆమోదించాలని కిషన్‌రెడ్డిని కోరినట్లు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తనను నామినేషన్‌ వెయ్యనివ్వలేదని ఆరోపించారు. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయడానికి వస్తే.. తన మద్దతుదారులను కొందరు బెదిరించారనిజాతీయ కౌన్సిల్‌ సభ్యులు మద్దతు ఇవ్వకుండా బెదిరించారనర్నారు. పార్టీలో ఉంటారాసస్పెండ్‌ చేయాలాఅని హెచ్చరించారని తెలిపారు. నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేయనివ్వలేదన్నారు.నా నామినేషన్‌ పత్రంపై సంతకం చేసేందుకు పది మంది సిద్ధంగా ఉన్నారని.. కానీమద్దతుదారులను నామినేషన్‌పత్రంపై సంతకాలు చేయనివ్వలేదని విమర్శించారు. నా విషయంలో లక్షలాది మంది కార్యకర్తలు బాధపడుతున్నారన్నారు. రామచందర్‌రావుకు అధ్యక్ష పదవి ఇవ్వడంపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉందన్నారు. 2014 నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానన్నారు. బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలో ముందే డిసైడ్‌ చేశారనిపార్టీ సింబల్‌పై తాను ఎమ్మెల్యేగా గెలిచానని.. రాజీనామా లేఖను సైతం కిషన్‌రెడ్డికి అందించానన్నారు. స్పీకర్‌కు రాజీనామా లేఖను కిషన్‌రెడ్డే పంపించాలన్నారు. పార్టీ కోసం తాను సర్వం ధారపోశానని.. ఉగ్రవాదులకు టార్గెట్‌గా ఉన్నానన్నారు. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ వ్యాఖ్యనించిన రాజాసింగ్‌.. ఆ పార్టీకి రాజీనామా చేసిన హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటానన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

 

]]>
Mon, 30 Jun 2025 19:22:02 +0530 admin
కెసిఆర్, కెటిఆర్‌ లకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశమే లేదు : టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ https://prajakshethrenews.com/కెసిఆర్-కెటిఆర్-లకు-తెలియకుండా-ఫోన్-ట్యాపింగ్-జరిగే-అవకాశమే-లేదు-టిపిసిసి-అధ్యక్షుడు-మహేశ్కుమార్-గౌడ్ https://prajakshethrenews.com/కెసిఆర్-కెటిఆర్-లకు-తెలియకుండా-ఫోన్-ట్యాపింగ్-జరిగే-అవకాశమే-లేదు-టిపిసిసి-అధ్యక్షుడు-మహేశ్కుమార్-గౌడ్

కెసిఆర్కెటిఆర్‌ లకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశమే లేదు

                  టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్  

 ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 29 ;:

రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్   బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై విరుచుకుపడ్డారు. వీరిద్దరికి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశమే లేదని ఆయన అన్నారు. ఓ మీడియా ఛానెల్‌పై బిఆర్‌ఎస్ శ్రేణులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సినీతారల ఫోన్లు ట్యాపింగ్ చేయడం ద్వారా వాళ్ల కుటుంబాల్లో చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ తారలుజడ్జిలుమహిళ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని ఆరోపించారు. వాళ్ల టార్గెట్ రాజకీయ నేతలు అయితే.. వాళ్ల ఇంట్లో ఉన్న మహిళల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశఆరని ప్రశ్నించారు. ఈ విషయంలో ఏదైనా అభ్యంతరం ఉంటే న్యాయపరంగా ముందుకు వెళ్లాలని సూచించారు.

 

]]>
Sun, 29 Jun 2025 20:48:45 +0530 admin
కాంగ్రెస్ పార్టీ నుంచి రావి శ్రీనివాస్ 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ https://prajakshethrenews.com/కాంగ్రెస్-పార్టీ-నుంచి-రావి-శ్రీనివాస్-6-ఏళ్ల-పాటు-సస్పెన్షన్ https://prajakshethrenews.com/కాంగ్రెస్-పార్టీ-నుంచి-రావి-శ్రీనివాస్-6-ఏళ్ల-పాటు-సస్పెన్షన్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావి శ్రీనివాస్ 6 ఏళ్ల పాటు సస్పెన్షన్

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 29 ;

అసిఫాబాద్  జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ ని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరేళ్ళ పాటు సస్పెన్షన్ చేసిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ..టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ఎంపీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావి శ్రీనివాస్ చేసిన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలపై ఇచ్చిన ఫిర్యాదు ను కమిటీ పరిశీలించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది...

]]>
Sun, 29 Jun 2025 20:43:02 +0530 admin
42 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్రపతి కలిసేందుకు అఖిలపక్ష బృందాన్నితీసుకెళ్ళాలి : ఆర్. కిష్ణయ్య https://prajakshethrenews.com/42-శాతం-రిజర్వేషన్ల-అమలుకు-రాష్ట్రపతి-కలిసేందుకు-అఖిలపక్ష-బృందాన్నితీసుకెళ్ళాలి-ఆర్-కిష్ణయ్య https://prajakshethrenews.com/42-శాతం-రిజర్వేషన్ల-అమలుకు-రాష్ట్రపతి-కలిసేందుకు-అఖిలపక్ష-బృందాన్నితీసుకెళ్ళాలి-ఆర్-కిష్ణయ్య

42 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్రపతి కలిసేందుకు అఖిలపక్ష బృందాన్నితీసుకెళ్ళాలి

              జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య

  ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 29 ;

“బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం  రాజ్యాంగబద్ధంగా హామీ ఇచ్చిన  42 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్రపతి కలిసేందుకు అఖిలపక్ష బృందాన్ని డిల్లీ కి తీసుకెళ్ళాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.ఆదివారం బిసి భవన్ లో బిసి సేన జాతీయ అద్యక్షులు బర్కే కృష్ణ,  షాద్నగర్ నియోజకవర్గానికి చెందిన బిసి సేన మహిళా అధ్యక్షురాలు బాస వరలక్ష్మి  ఆర్. కృష్ణయ్య ను కలిసారు.  ఈ సందర్బంగా స్తానీక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు పై కృష్ణయ్య తో చర్చించారు.ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగానిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసారు.మరో మూడు నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నదుడున ఈ దశలో గవర్నర్ కార్యాలయం తక్షణంగా స్పందించాలి. రాష్ట్రపతికి బిల్లుల సమాచారాన్ని వివరించడంతో పాటు ప్రజల అభిప్రాయాన్ని చేరవేయాలి. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా హైకోర్టు మార్గదర్శకాలను అనుసరించి — తగిన డేటాకమిషన్ నివేదికల తర్వాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాలని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం మోసం చేస్తే — మండల కార్యాలయాల వద్ద నిరసనలు చేస్తాంఎన్నికల ప్రచారం నిలిపేస్తాం. అని హెచ్చరించారు.

 

]]>
Sun, 29 Jun 2025 20:38:38 +0530 admin
40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారు : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా https://prajakshethrenews.com/40-ఏళ్లుగా-ఎదురుచూస్తున్న-రైతుల-కలను-ప్రధాని-మోదీ-నెరవేర్చారు-కేంద్ర-హోం-శాఖ-మంత్రి-అమిత్-షా https://prajakshethrenews.com/40-ఏళ్లుగా-ఎదురుచూస్తున్న-రైతుల-కలను-ప్రధాని-మోదీ-నెరవేర్చారు-కేంద్ర-హోం-శాఖ-మంత్రి-అమిత్-షా 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారు

             పసుపు బోర్డును ప్రారంభించిన కేంద్రమంత్రి అమిత్ షా

ప్రజా క్షేత్ర్, నిజామాబాద్‌ జూన్ 29 ;నిజామాబాద్‌లో కేంద్రమంత్రి అమిత్ షా పసుపు బోర్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని అన్నారు. పసుపు బోర్డు ఇక్కడికి రావడంలో రాష్ట్ర బీజేపీ ఎంపీల కృషి చాలా ఉందన్నారు. నిజామాబాద్ పసుపు ప్రపంచ మార్కెట్ లోకి వెళ్తుందనిపసుపు ధర పెరుగుతుందనివ్యాపారాలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. మార్కెటింగ్ఎక్స్‌పోర్ట్స్ ఆఫీస్ కూడా నిజామాబాద్‌లో ఉంటాయనివివిధ దేశాలకు ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే.. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా పాకిస్థాన్ మూకలకు బుద్ధి చెప్పామన్నారు. ఈ నేపథ్యంలోనే.. నక్సల్స్ ఆయుధాలు పక్కన పెట్టి లొంగిపొవడం మంచిదని సూచించారు. నక్సల్ కు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఆయుధాలు పట్టిన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. నక్సల్స్ కు మద్దతుగా మాట్లాడే వారువారి బాధిత కుటుంబాల పరిస్థితి తెలుసుకోవాలని అన్నారు. 2026 మార్చి చివరి వరకు నక్సల్స్ ను పూర్తిగా అంతమొందిస్తామన్నారు. రాష్ట్రంలో భారీ అవినీతి జరిగిందనితెలంగాణ మొన్నటి వరకు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా ఉందనిఇప్పుడు రేవంత్ రెడ్డికి మారిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే అవినీతి అంతం అవుతుందని కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

]]>
Sun, 29 Jun 2025 20:13:32 +0530 admin
అభివృద్ధి అంటే ఏమిటో ప్రధాని మోదీని చూసి తెలుసుకో : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి https://prajakshethrenews.com/అభివృద్ధి-అంటే-ఏమిటో-ప్రధాని-మోదీని-చూసి-తెలుసుకో-కేంద్రమంత్రి-కిషన్-రెడ్డి https://prajakshethrenews.com/అభివృద్ధి-అంటే-ఏమిటో-ప్రధాని-మోదీని-చూసి-తెలుసుకో-కేంద్రమంత్రి-కిషన్-రెడ్డి అభివృద్ధి అంటే ఏమిటో ప్రధాని మోదీని చూసి తెలుసుకో...

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధం

సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్జూన్ 29 ; తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రిసికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి కాస్తా ఘాటుగా స్పందించారు. ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే ఏమిటో ప్రధాని మోదీని చూసి తెలుసుకోమంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరి నువ్వు సిద్ధమాఅంటూ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాజకీయాల కోసం ఇలా మాట్లాడితే.. ఎలా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. మీరుమీ క్యాబినెట్ సహాచరులు ఇలా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై మంగళవారం క్లారిటీ వస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి.. నోటిఫికేషన్ ఈ రోజు వస్తుందన్నారు. సోమవారం నామినేషన్లు వేస్తారన్నారు. మంగళవారం నూతన అధ్యక్ష పదవిపై ప్రకటన వస్తుందని చెప్పారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించనున్న సునీల్ బన్సల్శోభా కర్లందాజ్లే సోమవారం రాష్ట్రానికి రానున్నారని వివరించారు. వారి సమక్షంలోనే నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు.అయితే సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజామాబాద్‌లో ఆదివారం పసుపు బోర్డు ప్రారంభిస్తున్నామని గుర్తు చేశారు. తాము తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తామని.. అంతేకానీ సీఎం రేవంత్ రెడ్డి కోసం.. కాంగ్రెస్ పార్టీ కోసం తాము పని చేయబోమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. మెట్రో డీపీఆర్ గత వారమే కేంద్రానికి ఇచ్చారన్నారు. మెట్రో రైలు సాధ్యాసాధ్యాలపై కేంద్రం పరిశీలన చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

]]>
Sun, 29 Jun 2025 20:08:00 +0530 admin
పిల్లలు లేని దంపతులు బంధువుల నుండి చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలి : కలెక్టర్ పమేలా సత్పతి https://prajakshethrenews.com/పిల్లలు-లేని-దంపతులు-బంధువుల-నుండి-చట్టబద్ధమైన-దత్తత-తీసుకోవాలి-కలెక్టర్-పమేలా-సత్పతి https://prajakshethrenews.com/పిల్లలు-లేని-దంపతులు-బంధువుల-నుండి-చట్టబద్ధమైన-దత్తత-తీసుకోవాలి-కలెక్టర్-పమేలా-సత్పతి పిల్లలు లేని దంపతులు బంధువుల నుండి చట్టబద్ధమైన దత్తత  తీసుకోవాలి :
        కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజా క్షేత్ర్, కరీంనగర్ :

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కు చెందిన రెండు కుటుంబాల్లోని పిల్లలు లేని వారు వారి బంధువులు, రక్తసంబంధీకుల నుండి చట్టబద్ధమైన దత్తత తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దత్తత ఉత్తర్వులను దత్తత తల్లిదండ్రులకు అందజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో   జరిగిన ఈ దత్తత కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని అన్నారు. బంధువులు రక్తసంబంధీకుల నుండి దత్తత తీసుకోదలిస్తే జిల్లా పరిషత్ కార్యాలయం లోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం కరీంనగర్ లో సంప్రదించాలన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డిసిపిఓ పర్వీన్, ఎల్.సి.పి.ఓ రాజు పాల్గొన్నారు.

]]>
Sun, 29 Jun 2025 08:46:36 +0530 admin
కంటితుడుపుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల పర్యటన https://prajakshethrenews.com/కంటితుడుపుగా-మంత్రి-ఉత్తమ్-కుమార్-రెడ్డి-జూరాల-పర్యటన https://prajakshethrenews.com/కంటితుడుపుగా-మంత్రి-ఉత్తమ్-కుమార్-రెడ్డి-జూరాల-పర్యటన కంటితుడుపుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల పర్యటన
ప్రజా క్షేత్ర్, వనపర్తి :
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల పర్యటన కంటితుడుపుగా కొనసాగిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు.జూరాలలో ఐరన్ రోప్ లు తెగడం సాధారణం అయితే అసలు జూరాల పర్యటనకు ఎందుకు వచ్చారు ? ఆ సమస్యతో ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బందులు లేకుంటే ఆఘమేఘాల మీద మంత్రి పర్యటన ఎందుకు ? మరి వచ్చిన మంత్రి స్పిల్ వే, క్రస్ట్ గేట్లు, ఐరన్ రోప్ లు తెగిన వాటిపై ఎందుకు పరిశీలన చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. కేవలం మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో ధ్వంసమైన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్  నిలబెట్టారు. కేవలం ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరిగి సమూలంగా నాశనం చేస్తున్నారు. కాంగ్రెస్ కుట్రలకు ప్రజలు సమాధానం చెప్పడం ఖాయం. జూరాల ప్రాజెక్టులో ఐరన్ రోప్ లు తెగిన విషయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొక్కుబడి పర్యటనపై ఒక ప్రకటనలో విమర్శించారు.

]]>
Sun, 29 Jun 2025 08:33:00 +0530 admin
మహాటివి ఆఫీసు చిన్న గ్లాస్ పగిలితేనే రాద్దాంతం చేస్తున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు : గెల్లు శ్రీనివాస్ యాదవ్ https://prajakshethrenews.com/మహాటివి-ఆఫీసు-చిన్న-గ్లాస్-పగిలితేనే-రాద్దాంతం-చేస్తున్న-రేవంత్-రెడ్డి-చంద్రబాబు-గెల్లు-శ్రీనివాస్-యాదవ్ https://prajakshethrenews.com/మహాటివి-ఆఫీసు-చిన్న-గ్లాస్-పగిలితేనే-రాద్దాంతం-చేస్తున్న-రేవంత్-రెడ్డి-చంద్రబాబు-గెల్లు-శ్రీనివాస్-యాదవ్ మహాటివి ఆఫీసు చిన్న గ్లాస్ పగిలితేనే రాద్దాంతం చేస్తున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు 

కేటీఆర్ పైన, బీఆర్ఎస్ నేతలపైన అసత్య ప్రచారం చేస్తే.. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం 

బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

మహాటీవీ ఆఫీసులో చిన్న గ్లాస్ పగులుతేనే భాదపడుతు, ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు నాయుడు హైరానా చేస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఇంతకుముందు చాలాసార్లు మహాటీవీ యాజమాన్యం మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు. కేటిఆర్ తో పాటు వారి కుటుంబ సభ్యుల పరువుతీసే విధంగా తమ టీవీలో ప్రసారాలు చేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యకర్తలు అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక సెక్షన్ ఆఫ్ ఆంధ్రా మీడియా పనిగట్టుకుని కేసీఆర్ ని, కేటీఆర్ ని బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారు. మేము కేసులకు భయపడం, కేటీఆర్ పైన, బీఆర్ఎస్ నేతలపైన అసత్య ప్రచారం చేస్తే.. ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

]]>
Sun, 29 Jun 2025 08:28:58 +0530 admin
హైదరాబాద్‌ను ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దుతాం : సీ ఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/హైదరాబాద్ను-ప్రపంచ-శ్రేణి-నగరంగా-తీర్చిదిద్దుతాం-సీ-ఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/హైదరాబాద్ను-ప్రపంచ-శ్రేణి-నగరంగా-తీర్చిదిద్దుతాం-సీ-ఎం-రేవంత్-రెడ్డి హైదరాబాద్‌ను ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దుతాం : సీ ఎం రేవంత్ రెడ్డి

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌గా.. మూడు ప్రాంతాలుగా విభజించి రాష్ట్రం సమ్మిళిత, సమగ్రాభివృద్ధి సాధించడానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9 వ తేదీలోపు విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌ను ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలందరి సహకారం ఉండాలని విజ్ఞప్తి చేశారు. గచ్చీబౌలి కూడలిలో ఆరు లేన్లతో నిర్మించిన దివంగత పి. జనార్ధన్ రెడ్డి ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణను మూడు ప్రాంతాలుగా.. ఓఆర్ఆర్ లోపలి భాగంలో కోర్ అర్బన్‌గా, ఓఆర్ఆర్ అవతలి నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు సెమీ-అర్బన్‌గా, రీజినల్ రింగ్ రోడ్డు అవతలి భాగంలో గ్రామీణ ప్రాంతంగా విభజించి, ప్రాంతాల వారిగా ప్రణాళికా బద్ధమైన అభివృద్ధితో ముందుకు వెళతాం.  ఓఆర్‌ఆర్‌ ఆవలివైపున 30 వేల ఎకరాల్లో ప్రపంచ శ్రేణి భారత్ ఫ్యూచర్ సిటీని ప్రతిపాదించాం. ఇందులో క్రీడలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, నాన్-పొల్యూటెడ్ ఫార్మా రంగాలను అభివృద్ధి పరుస్తాం. ఫ్యూచర్ సిటీలో పచ్చదనం కోసం దాదాపు 15 వేల ఎకరాల్లో పార్కులను, మిగతా ప్రాంతంలో మౌలిక సదుపాయాలను కల్పిస్తాం.వాయు కాలుష్యంతో ఢిల్లీ, విపరీతమైన ట్రాఫిక్ సమస్యలతో బెంగుళూరు, వర్షాలొస్తే వరదలతో చెన్నై నగరాలు  అతలాకుతమవుతున్న పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఉంది. హైదరాబాద్‌ను ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో పనిచేస్తున్నాం.  నగరంలో కాలుష్యం నివారించాలన్న లక్ష్యంతోనే ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్ పన్నులను పూర్తిగా రద్దు చేశాం. జంట నగరాల్లో తిరుగుతున్న 3 వేల ఆర్టీసీ బస్సులను ఓఆర్ఆర్ బయటి ప్రాంతాలకు తరలించి వాటి స్థానంలో వచ్చే ఏడాది లోపు 3 వేల ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాం.  కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో అనేక విధాలుగా పనిచేస్తున్నాం. నాలాలు, చెరువులు కబ్జాలు చేశారు. నీరుండాల్సిన చోట అపార్ట్‌మెంట్లు వెలువడంతో నీరు రోడ్లపైకి వస్తోంది. అందుకే నాలాలు, చెరువుల ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాం.  దీన్ని కొందరు రాజకీయం చేసి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. అభివృద్ధిలో అందరూ కలిసి రావాలి. ఆ మధ్య కాలంలో ఎన్-కన్వెన్షన్ కూల్చివేసిన సందర్భంగా సినీనటుడు నాగార్జున గారు స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించి చెరువును అభివృద్ధి పరచడంలో తాను సహకరిస్తామని చెప్పారు. ఎన్నో వివాదాలు సృష్టించినప్పటికీ కబ్జాలకు గురైన బతుకమ్మ కుంట 6 ఎకరాలను కాపాడగలిగాం. జంట నగరాల అభివృద్ధికి దివంగత పీజేఆర్ గారు అందించిన సేవలు ప్రజల్లో చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయి. 1.2 కోట్ల జంట నగరాల ప్రజల దాహార్తి తీరిందంటే అది పీజేఆర్ గారి నాయకత్వంలో జరిగిన పోరాటాల ఫలితమే. అలాంటి పీజేఆర్ పేరును ఫ్లైఓవర్‌కు పెట్టుకోవడం ఎంతో సముచితం. తగిన స్థలం గుర్తిస్తే పీజేఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తాం. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచంలోనే ఫార్చూన్ 500 కంపెనీల్లో 85 కంపెనీలు హైదరాబాద్ నుంచి పనిచేస్తున్నాయి. లక్షలాది మంది యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పించాలన్న సంకల్పంతోనే 2.8 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను సాధించాం. ఈ నగరాన్ని మరింత గొప్ప నగరంగా తీర్చిదిద్దాలి. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రభుత్వం రూపొందించిన  ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 2028 వరకు రాజకీయాలను పక్కన పెడుతాం. అభివృద్ధికి అందరూ సహకరించాలి. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ , ప్రజా ప్రతినిధులు అనిల్ కుమార్ యాదవ్ , అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి , అద్దంకి దయాకర్ , బల్మూరు వెంకట్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ ఫ్లైఓవర్‌కు దివంగత పీజేఆర్ ఫ్లైఓవర్‌గా నామకరణం చేసినందుకు వారి కుమార్తె విజయారెడ్డి తో పాటు కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

]]>
Sun, 29 Jun 2025 08:19:23 +0530 admin
భారత్ ఫ్యూచర్ సిటీ కోసం భూ సేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి : సీ ఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/భారత్-ఫ్యూచర్-సిటీ-కోసం-భూ-సేకరణ-ప్రక్రియ-త్వరగా-పూర్తి-చేయండి-సీ-ఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/భారత్-ఫ్యూచర్-సిటీ-కోసం-భూ-సేకరణ-ప్రక్రియ-త్వరగా-పూర్తి-చేయండి-సీ-ఎం-రేవంత్-రెడ్డి భారత్ ఫ్యూచర్ సిటీ కోసం భూ సేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి : సీ ఎం రేవంత్ రెడ్డి

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్: 

భారత్ ఫ్యూచర్ సిటీ కోసం భూ సేకరణ ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక వేత్తలు ఎవరూ వెనక్కి వెళ్లరాదని, ఆ రకమైన ప్రణాళికలతో పరిశ్రమల శాఖ సర్వసన్నద్ధంగా ఉండాలని చెప్పారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో కలిసి ముఖ్యమంత్రి పరిశ్రమల శాఖకు సంబంధించిన అంశాలపైన ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్‌గా మారిన పరిస్థితుల్లో కొత్తగా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చే సంస్థల డేటా సెంటర్ల ఏర్పాటుకు కావలసిన స్థలం సిద్ధం చేయాలని చెప్పారు. నిమ్జ్‌లో మిగిలి ఉన్న భూ సేకరణను తక్షణమే పూర్తి చేయాలని, అందుకు రైతులతో సంప్రదించి ఒప్పించాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో అందుకు అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ ఆర్కిటెక్ట్‌ను నియమించుకోవాలని సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్రికెట్, ఫుట్‌బాల్, గోల్ఫ్ వంటి అన్ని క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండేలా ప్రణాళికలు సిద్దం చేయాలని చెప్పారు.రాష్ట్రంలో ప్రతిపాదిత మెగా ప్రాజెక్టులపైన మంత్రివర్గ ఉప సంఘం ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై వాటి పురోగతిపైన చర్చించాలని అన్నారు. 2024 లో హైదరాబాద్ నగరానికి 70 గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ వచ్చాయని, 2025 లో ఇప్పటివరకు 25 రాగా మరిన్ని సెంటర్లు వచ్చేలా ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. అందుకోసం అధికార యంత్రాంగం వంద రోజుల లక్ష్యంతో ప్రణాళికను సిద్ధం చేసుకుని పనిచేయాలని చెప్పారు.

]]>
Sun, 29 Jun 2025 08:11:21 +0530 admin
పివి కి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/పివి-కి-నివాళులర్పించిన-సీఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/పివి-కి-నివాళులర్పించిన-సీఎం-రేవంత్-రెడ్డి పివి కి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుములరేవంత్ రెడ్డి ఆయన నివాసంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 104 జయంతి సందర్భంగా  చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు.  బహుభాష కోవిందుడు, రచయిత ఆర్థిక సంస్కరణాల పితామహుడిగా పీవీ నరసింహారావు దేశానికి అందించిన అమూల్యమైన సేవలను భారత వనిని ప్రగతి పదంలో నడిపించడంలో ఆయన పాత్రను ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు వేముల నరేందర్ రెడ్డి, శాసన సభ్యులు మందుల సామెల్, ఎమ్మెల్యే మట్ట రాగమాయి, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. తదితరులు ఉన్నారు.

]]>
Sat, 28 Jun 2025 22:41:08 +0530 admin
42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వం https://prajakshethrenews.com/42-శాతం-బీసీ-రిజర్వేషన్లు-అమలు-చేయకపోతే-స్థానిక-సంస్థల-ఎన్నికలు-జరగనివ్వం https://prajakshethrenews.com/42-శాతం-బీసీ-రిజర్వేషన్లు-అమలు-చేయకపోతే-స్థానిక-సంస్థల-ఎన్నికలు-జరగనివ్వం 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వం
డా. వకుళాభరణం అధ్యక్షతన... R. కృష్ణయ్య నేతృత్వంలో బీసీ రౌండ్‌టేబుల్ సమావేశం
                  – 90 బీసీ సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలతో డిమాండ్
 ప్రజా క్షేత్ర్, హైదరాబాద్‌ జూన్ 28 :
42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు హైదరాబాద్‌ లక్డీకపూల్‌లోని హోటల్ అశోక్‌లోబిసి కమిషన్ మాజీ చర్మెన్  డా. వకుళాభరణం అధ్యక్షత శనివారం బీసీ అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్, సామాజిక శాస్త్రవేత్త నరగోని, వివిధ రాజకీయ పార్టి లు, 90 బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత మాత్రమే గ్రామ–నగర స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలన్న డిమాండ్‌ను 90 బీసీ కుల సంఘాల ప్రతినిధులు తీర్మానాల రూపంలో సమర్థించారు.ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు R. కృష్ణయ్య నేతృత్వం వహించగా, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ “బీసీలకు రాజ్యాంగబద్ధంగా హామీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వం. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నప్పటికీ — ఇప్పటివరకు రాష్ట్రపతిని కలిసేందుకు ఒక్క అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని కూడ పంపలేదు. ఇది ప్రభుత్వ వైఖరిపై బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది,” అన్నారు.“ఈ దశలో గవర్నర్ కార్యాలయం తక్షణంగా స్పందించాలి. రాష్ట్రపతికి బిల్లుల సమాచారాన్ని వివరించడంతో పాటు ప్రజల అభిప్రాయాన్ని చేరవేయాలి. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా హైకోర్టు మార్గదర్శకాలను అనుసరించి — తగిన డేటా, కమిషన్ నివేదికల తర్వాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాలని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం మోసం చేస్తే — మండల కార్యాలయాల వద్ద నిరసనలు చేస్తాం, ఎన్నికల ప్రచారం నిలిపేస్తాం. అవసరమైతే ఎమ్మెల్యేలు ఊర్లలో తిరగలేని పరిస్థితులు తలెత్తుతాయి,” అని హెచ్చరించారు.అనంతరం మాజీ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ “బీసీ జనాభా రాష్ట్రంలో 50 శాతం మించినా, ప్రాతినిధ్యం లేకుండా కొనసాగుతున్న తీరును ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది. రాజ్యాంగంలోని 243-D(6), 243-T(6) ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అమలవ్వాలి. ఇది అధికారమిత్రుల కృప కాదని, న్యాయమైన హక్కని గుర్తించాలి,” అన్నారు. సామాజిక శాస్త్రవేత్త నరగోని మాట్లాడుతూ “బీసీలను స్థానిక ఎన్నికల వ్యవస్థ నుంచి దూరంగా ఉంచడం మాత్రమే కాకుండా — కోట్లాది ఓటర్ల అభిమతాన్ని తక్కువ చేయడమే. రాష్ట్రంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న బీసీ వర్గాలకు చెందిన నేతలు కూడా మౌనంగా ఉండటం బాధాకరం. ఈప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా బీసీలు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిని గమనించి తక్షణంగా చర్యలు తీసుకోవాలి, లేదంటే ఇది సామాజిక స్థిరత్వాన్ని దెబ్బతీసే పరిస్థితులకు దారితీయొచ్చు,” అని పేర్కొన్నారు. సభాధ్యక్షుడు డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ హైకోర్టు తీర్పు ప్రకారం కమిషన్ నివేదికలు, గణాంక ఆధారాలు లేకుండా బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యపడదు. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత చూపలేదు. బిల్లులను రాష్ట్రపతికి పంపినట్టు చెప్పి ఎన్నికల ప్రక్రియను ఆలస్యం చేస్తోంది. ఇది పూర్తిగా బీసీల హక్కులపై ఆటపడే చర్య,” అన్నారు.“ఈ పరిస్థితుల్లో బీసీ సంఘాల ప్రతినిధులతో కూడిన బృందం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించనుంది. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లిఖితపూర్వకంగా వినతిని అందించి, రిజర్వేషన్ల అమలుపై తక్షణ నిర్ణయం కోరనున్నాం. రాష్ట్రపతిని కలిసేందుకు అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేయాలన్న తీర్మానం కూడా ఈ సమావేశంలో ఆమోదించబడింది,” అని స్పష్టం చేశారు.

]]>
Sat, 28 Jun 2025 21:39:38 +0530 admin
సింగరేణి ప్రమాద బీమా పథకం దేశానికి ఆదర్శం & ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు https://prajakshethrenews.com/సింగరేణి-ప్రమాద-బీమా-పథకం-దేశానికి-ఆదర్శం-ఉప-ముఖ్యమంత్రి-భట్టి-విక్రమార్క-మల్లు https://prajakshethrenews.com/సింగరేణి-ప్రమాద-బీమా-పథకం-దేశానికి-ఆదర్శం-ఉప-ముఖ్యమంత్రి-భట్టి-విక్రమార్క-మల్లు సింగరేణి ప్రమాద బీమా పథకం దేశానికి ఆదర్శం
 - ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
రామగుండం-1 ఏరియాకు చెందిన సింగరేణి కార్మికుడు పెండ్రి రంజిత్ కుమార్  ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సింగరేణి సంస్థలో అమలవుతోన్న రూ.1.2 కోట్ల ఉచిత ప్రమాద బీమా పథకం కింద వారి భార్య శ్రీమతి లతకు రూ.1.2 కోట్ల బీమా చెక్కు ను మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ప్రజా భవన్ లో అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు .త్వరలో కారుణ్య నియామకం కూడా అందిస్తామని భరోసా కల్పించి ధైర్యం చెప్పారు. ఈ పథకం దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదర్శప్రాయం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు  అన్నారు
ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్, ఇతర అధికారులు హాజరయ్యారు.

]]>
Sat, 28 Jun 2025 21:25:27 +0530 admin
నిజామాబాద్ పసుపు బోర్డును ఇంకెన్నీ సార్లు ప్రారంభిస్తారు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత https://prajakshethrenews.com/నిజామాబాద్-పసుపు-బోర్డును-ఇంకెన్నీ-సార్లు-ప్రారంభిస్తారు-ఎమ్మెల్సీ-కల్వకుంట్ల-కవిత https://prajakshethrenews.com/నిజామాబాద్-పసుపు-బోర్డును-ఇంకెన్నీ-సార్లు-ప్రారంభిస్తారు-ఎమ్మెల్సీ-కల్వకుంట్ల-కవిత నిజామాబాద్ పసుపు బోర్డును ఇంకెన్నీ సార్లు ప్రారంభిస్తారు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 28 :
నిజామాబాద్ పసుపు బోర్డును ఇంకెన్నీ సార్లు ప్రారంభిస్తారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. రేపు(ఆదివారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా నిజామాబాద్ లో పసుపుబోర్డును ఆయన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో శనివారం కవిత మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి నాయకులపై ఫైరయ్యారు. ఇప్పటికే రెండుసార్లు పసుపుబోర్డును ప్రారంభించారని.. మూడోసారి ప్రారంభించేందుకు అమిత్ షా వస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్.. ఈ విషయం చెప్పకుండా అమిత్ షాను ఇక్కడికి తీసుకువస్తున్నారేమోనని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని పసుపు రైతుల పట్ల చిత్తశుద్ది ఉంటే.. వెంటనే పసుపుబోర్డుకు చట్టబద్దత కల్పించాలని కవిత అన్నారు.

]]>
Sat, 28 Jun 2025 21:22:36 +0530 admin
పిజెఆర్‌ నేతృత్వంలోనే హైదరాబాద్ హైటెక్ సిటీకి పునాది : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/పిజెఆర్-నేతృత్వంలోనే-హైదరాబాద్-హైటెక్-సిటీకి-పునాది-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/పిజెఆర్-నేతృత్వంలోనే-హైదరాబాద్-హైటెక్-సిటీకి-పునాది-రేవంత్-రెడ్డి పిజెఆర్‌ నేతృత్వంలోనే హైదరాబాద్ హైటెక్ సిటీకి పునాది : రేవంత్ రెడ్డి

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్‌ జూన్ 28 :

 పి.జనార్దన్ రెడ్డి(పిజెఆర్‌) నేతృత్వంలోనే హైదరాబాద్ హైటెక్ సిటీకి పునాది పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్‌ గాంధీ టెక్నాలజీ పార్క్‌ పేరును హైటెక్ సిటీగా మార్చి చంద్రబాబు అభివృద్ధి చేశారని సిఎం చెప్పారు. శనివారం ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్‌ వరకు నిర్మించిన పిజెఆర్‌ ఫ్లైఓవర్‌ ను సిఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. పిజెఆర్ ఇల్లు ఒకప్పుడు జనతా గ్యారేజీగా ఉండేదని, జంట నగరాల సమస్యల పరిష్కారం కోసం ఆయన కృషి చేసేవారని చెప్పారు. ఆయన కృషి వల్లే నగరంలోకి సురక్షిత మంచి నీరు వచ్చిందని తెలిపారు. వాజ్‌పేయీ, పీవీ నర్సింహారావు వల్లే ఐటీ కారిడార్‌ అభివృద్ధి జరిగిందన్నారు.కాగా, రూ.182.75 కోట్లతో 6 లేన్లతో 1.2 కిలోమీటర్ల మేర పిజెఆర్ ఫ్లైఓవర్‌ ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభం కావడంతో గచ్చిబౌలి చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ సమస్య తగ్గనుంది

]]>
Sat, 28 Jun 2025 21:19:51 +0530 admin
అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం హాస్యాస్పదం, సిగ్గుచేటు: కెటిఆర్ https://prajakshethrenews.com/అన్నపూర్ణ-క్యాంటీన్ల-పేరు-మార్చడం-హాస్యాస్పదం-సిగ్గుచేటు-కెటిఆర్ https://prajakshethrenews.com/అన్నపూర్ణ-క్యాంటీన్ల-పేరు-మార్చడం-హాస్యాస్పదం-సిగ్గుచేటు-కెటిఆర్ అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం హాస్యాస్పదం, సిగ్గుచేటు: కెటిఆర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 28 :
 అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం హాస్యాస్పదం, సిగ్గుచేటు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఎక్స్ వేదికగా సిఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రూ.5 భోజనం ‘అన్నపూర్ణ’ పథకం పేరు మార్చడంపై మండిపడ్డారు. ఢిల్లీ బాసులకు విధేయత కోసం వాళ్ల పేరును మార్చుకోవచ్చు కదా? అని ఎద్దేవా చేశారు. వాళ్ల పేరును రాజీవ్ లేదా జవహర్ గా ఎందుకు మార్చుకోకూడదు? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ అర్థరహిత చర్యలన్నింటినీ రద్దు చేస్తాం అని కెటిఆర్ పేర్కొన్నారు.

]]>
Sat, 28 Jun 2025 21:14:37 +0530 admin
మీడియాపై దాడి అనాగరికం & బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు — డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క https://prajakshethrenews.com/మీడియాపై-దాడి-అనాగరికం-బాధ్యులపై-కఠిన-చర్యలు-తప్పవు-డిప్యూటీ-సీఎం-భట్టి-విక్రమార్క https://prajakshethrenews.com/మీడియాపై-దాడి-అనాగరికం-బాధ్యులపై-కఠిన-చర్యలు-తప్పవు-డిప్యూటీ-సీఎం-భట్టి-విక్రమార్క మీడియాపై దాడి అనాగరికం - బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు
— డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

 ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

మహా న్యూస్ మీడియా కార్యాలయంపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలను హరిస్తున్న ఘోరమైన చర్య. మీడియా హక్కులను భంగపరిచే ఇలాంటి ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదు. మూకదాడులు చేయడం అనేది శాంతియుతమైన హైదరాబాద్ చరిత్రకు, తెలంగాణ అభివృద్ధికి  అడ్డుపడే చర్య. ఇటువంటి దుశ్చర్యలతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు ఎవరు చేసిన సహించం. సంఘటనకు సంబంధించి అన్ని ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నాను. శాంతి భద్రతలు, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడమే మా ప్రభుత్వ బాధ్యతని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

]]>
Sat, 28 Jun 2025 21:04:30 +0530 admin
బనకచర్లపై పిపిటి పేరుతో సిఎం రేవంత్ రెడ్డి కాలయాపన: హరీష్ రావు https://prajakshethrenews.com/బనకచర్లపై-పిపిటి-పేరుతో-సిఎం-రేవంత్-రెడ్డి-కాలయాపన-హరీష్-రావు https://prajakshethrenews.com/బనకచర్లపై-పిపిటి-పేరుతో-సిఎం-రేవంత్-రెడ్డి-కాలయాపన-హరీష్-రావు బనకచర్లపై పిపిటి పేరుతో సిఎం రేవంత్ రెడ్డి కాలయాపన: హరీష్ రావు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 27 :
బనకచర్లపై పిపిటి పేరుతో సిఎం రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. డైవర్షన్ కోసమే ప్రజాప్రతినిధులకు సిఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2016 ఎజెండా మినిట్స్ పై రేవంత్ తో చర్చకు సిద్ధం అని అన్నారు. తెలంగాణకు ఆమోదయోగ్యం   లేకుంటే ఒప్పుకునేది లేదని, బనకచర్ల పై జలశక్తి మీటింగ్ లో తెలంగాణ వాదన గట్టిగా విన్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కేంద్రంలో తనకున్న పలుకుబడితో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ హయాంలో బనకచర్ల కార్పొరేషన్ లేదని, టెండర్లు పిలవలేదని విమర్శించారు. తెలంగాణకు నష్టం జరగకముందే బనకచర్లను ఆపేలా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చర్యలు తీసుకోవాలని సూచించారు. బనకచర్లపై రైతులతో కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం అని హరీష్ రావు పేర్కొన్నారు.

]]>
Fri, 27 Jun 2025 23:25:05 +0530 admin
నిపుణులు నివేదిక ఇచ్చినా సిఎం రేవంత్ రెడ్డి మొద్దునిద్ర వీడట్లేదు: కెటిఆర్ https://prajakshethrenews.com/నిపుణులు-నివేదిక-ఇచ్చినా-సిఎం-రేవంత్-రెడ్డి-మొద్దునిద్ర-వీడట్లేదు-కెటిఆర్ https://prajakshethrenews.com/నిపుణులు-నివేదిక-ఇచ్చినా-సిఎం-రేవంత్-రెడ్డి-మొద్దునిద్ర-వీడట్లేదు-కెటిఆర్ నిపుణులు నివేదిక ఇచ్చినా సిఎం రేవంత్ రెడ్డి మొద్దునిద్ర వీడట్లేదు:
కెటిఆర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 27 :
 మంజీరా బ్యారేజీ విషయంలో నిపుణులు నివేదిక ఇచ్చినా సిఎం రేవంత్ రెడ్డి మొద్దునిద్ర వీడట్లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. మంజీరా ఆఫ్రాన్ కొట్టుకు పోయిందని, స్పిల్ వే దెబ్బతిందని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు చేతకాని తనంతో మంజీరా బ్యారేజీ ప్రమాదంలో పడిందని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..మార్చి 22 న నిపుణులు మంజీరా బ్యారేజీని   సందర్శించారని, మంజీరా దిగువ భాగంలో పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని తెలియజేశారు. పిల్లర్లు, ఆఫ్రాన్, స్పిల్ వే పై నిపుణుల బృందం నివేదిక ఇచ్చిందని, మేడిగడ్డ, మంజీరా బ్యారేజీలను వెంటనే రిపేర్ చేయించాలని చెప్పారు. మంజీరాపై కాంగ్రెస్, బిజెపి నేతలు స్పందించకపోవడం దారుణమని కెటిఆర్ పేర్కొన్నారు.

]]>
Fri, 27 Jun 2025 22:43:02 +0530 admin
వాసవి అమ్మవారికి ఆషాడమాస సారె సమర్పణ https://prajakshethrenews.com/వాసవి-అమ్మవారికి-ఆషాడమాస-సారె-సమర్పణ https://prajakshethrenews.com/వాసవి-అమ్మవారికి-ఆషాడమాస-సారె-సమర్పణ వాసవి అమ్మవారికి ఆషాడమాస సారె సమర్పణ
ప్రజా క్షేత్ర్, నరసరావుపేట :
నరసరావుపేట పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి ఆషాడమాస సారే సమర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో 125 మంది మహిళలచే అత్యంత వైభవంగా అమ్మవారి నగరోత్సవం, దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి 58 రకముల పూలు, గాజులు, చీరలు, జాకెట్ ముక్కలు, గోరింటాకు ప్యాకెట్స్, అనేక పిండి వంటలు అమ్మవారికి సారె గా సమర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ కొత్త మాసు మెహర్ బాబు, కార్యదర్శి కొత్త మాసు వెంకటప్పయ్య, కోశాధికారి పొత్తూరి లక్ష్మీ వరప్రసాదరావు, మారుతీ కృష్ణ, రెడ్డి శ్రీనివాసరావు, కొత్త హనుమంతరావు, మురారి శెట్టి పద్మ, యక్కల సుజాత, కొత్తూరి లక్ష్మీ కుమారి, దేవస్థాన పాలకమండలి సభ్యులు, చలువాది బ్రహ్మయ్య, చేగు వెంకటేశ్వరరావు అనేకమంది మహిళా భక్తులు పాల్గొని పూజలు నిర్వహించినారు.

]]>
Fri, 27 Jun 2025 22:28:50 +0530 admin
ఫోన్ ట్యాపింగ్‌లో గాడిద గుడ్డు తప్ప చర్యలు ఉండవు : బీజేపీ ఎంపీ రఘునందన్ రావు https://prajakshethrenews.com/ఫోన్-ట్యాపింగ్లో-గాడిద-గుడ్డు-తప్ప-చర్యలు-ఉండవు-బీజేపీ-ఎంపీ-రఘునందన్-రావు https://prajakshethrenews.com/ఫోన్-ట్యాపింగ్లో-గాడిద-గుడ్డు-తప్ప-చర్యలు-ఉండవు-బీజేపీ-ఎంపీ-రఘునందన్-రావు ఫోన్ ట్యాపింగ్‌లో గాడిద గుడ్డు తప్ప చర్యలు ఉండవు..
 కాంగ్రెస్, బీఆర్ఎస్ మూలాఖత్ అయ్యాయి : బీజేపీ ఎంపీ రఘునందన్ రావు  
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 27
 దుబ్బాక ఉప ఎన్నికలతోనే ఫోన్ ట్యాపింగ్ ప్రారంభమైందని.. మొట్ట మొదటిసారిగా తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు  తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని డీజీపీకి అనేక సార్లు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధంలేని కాంగ్రెస్ నాయకులను సిట్ పిలుస్తోందని.. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ అయ్యింది తనదన్నారు. మమ్మల్ని అడిగితే అన్ని వివరాలు ఇచ్చే వాళ్ళమన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో గాడిద గుడ్డు తప్ప చర్యలు ఉండవని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మూలాఖత్ అయ్యాయని విమర్శించారు. ఫిర్యాదు చేసిన తమను సిట్ ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. రోజుకు ఒక్కరిని మాత్రమే విచారణ చేయడానికి ఇదేమైనా డైలీ సీరియలా అని ప్రశ్నించారు. ఆధారాలు ఇచ్చే వాళ్లను పక్కన పెట్టి డైలీ సీరియల్ నడుపుతున్నారని విమర్శలు గుప్పించారు.

]]>
Fri, 27 Jun 2025 22:01:39 +0530 admin
ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమాయకులను చంపుతోంది : .మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి https://prajakshethrenews.com/ఆపరేషన్-కగార్-పేరుతో-కేంద్ర-ప్రభుత్వం-అమాయకులను-చంపుతోంది-మాజీ-ఎమ్మెల్సీ-కొండా-మురళి https://prajakshethrenews.com/ఆపరేషన్-కగార్-పేరుతో-కేంద్ర-ప్రభుత్వం-అమాయకులను-చంపుతోంది-మాజీ-ఎమ్మెల్సీ-కొండా-మురళి ఆపరేషన్ కగార్  పేరుతో కేంద్ర ప్రభుత్వం అమాయకులను చంపుతోంది
ఓ బీసీ ఉద్యమకారుడిని ఎన్‌కౌంటర్ చేయడం బాధాకరం
ఆపరేషన్ కగార్‌ని నిలిపివేయాలి ..మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి
ప్రజా క్షేత్ర్, వరంగల్ జూన్ 27 :

ఆపరేషన్ కగార్   పేరుతో కేంద్ర ప్రభుత్వం అమాయకులను చంపుతోందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి   ఆరోపించారు. ఆపరేషన్ కగార్‌ని నిలిపివేయాలని కోరారు. ఓ బీసీ ఉద్యమకారుడిని ఎన్‌కౌంటర్ చేయడం బాధాకరమని అన్నారు. ఆపరేషన్ కగార్‌ని నిలిపివేయాలని ఆందోళనలు చేస్తామంటే పోలీసులు అడ్డుకున్నారని గుర్తుచేశారు. వరంగల్ జిల్లాలోని పోచమ్మ మైదాన్ జంక్షన్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాక‌ర్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నంత వరకు కార్యకర్తలను కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్షగట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల నియోజకవర్గంలో త్వరలోనే కొండా సుస్మిత పటేల్ రంగ ప్రవేశం చేస్తారని తెలిపారు. కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదని స్పష్టం చేశారు. తమ వెంట సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ఉన్నారని కొండా మురళి పేర్కొన్నారు.

]]>
Fri, 27 Jun 2025 21:43:55 +0530 admin
29 న తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా https://prajakshethrenews.com/29-న-తెలంగాణలో-పర్యటించనున్న-కేంద్ర-హోంశాఖ-మంత్రి-అమిత్-షా https://prajakshethrenews.com/29-న-తెలంగాణలో-పర్యటించనున్న-కేంద్ర-హోంశాఖ-మంత్రి-అమిత్-షా 29 న తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్‌ జూన్ 27 :
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ నెల 29 వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. ఎల్లుండి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. అక్కడి నుంచి నిజామాబాద్‌కు బయల్దేరతారు. అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో అమిత్‌ షా పాల్గొననున్నారు. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అలాగే, బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ తండ్రి, దివంగత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్‌ షా ఆవిష్కరించనున్నారు.

]]>
Fri, 27 Jun 2025 21:37:16 +0530 admin
తెలంగాణ లో కొత్తగా ఈగల్ ఫోర్స్ ఏర్పాటు https://prajakshethrenews.com/తెలంగాణ-లో-కొత్తగా-ఈగల్-ఫోర్స్-ఏర్పాటు https://prajakshethrenews.com/తెలంగాణ-లో-కొత్తగా-ఈగల్-ఫోర్స్-ఏర్పాటు తెలంగాణ లో కొత్తగా ఈగల్ ఫోర్స్ ఏర్పాటు

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

ఒకనాటి ఉద్యమాల గడ్డ తెలంగాణ మాదక ద్రవ్యాల మహమ్మారికి అడ్డాగా మారకూడదన్న లక్ష్యంతో ఇకనుంచి రాష్ట్రంలో ఒక మొక్క గంజాయి మెలిచినా ఇట్టే కనిపెట్టే “Elite Action Group For Drug Law Enforcement” (#Eagle) ను ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  ప్రకటించారు. ప్రపంచంతో పోటీ పడే ఒక ఆరోగ్యకరమైన, మాదక ద్రవ్య రహిత తెలంగాణను నిర్మించుకోవడంలో ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం” పురస్కరించుకుని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, తెలంగాణ వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, లింగమార్పిడి వ్యక్తుల సాధికారత శాఖ సంయుక్తంగా శిల్పకళా వేదిక ప్రాంగణంలో డ్రగ్స్ నియంత్రణపై కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  మాట్లాడుతూ..తెలంగాణలో ఒకనాడు ఉద్యమాలకు వేదికలైన కాలేజీలు, యూనివర్సిటీలు గంజాయి, మాదక ద్రవ్యాలకు వేదిక అయితే అది అందరికీ అవమానం. యువకులు డ్రగ్స్ బారిన పడి బలవుతున్నారు. డ్రగ్స్ నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. పాఠశాల, కాలేజీల్లో ఎక్కడైనా సరే దీనికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే తెలియజేయండి. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో విద్యార్థులను స్కూళ్లు, కాలేజీల్లో చేర్పిస్తుంటే, కేవలం చదువు చెబితే చాలన్నట్టు యాజమాన్యాలు, అధ్యాపకులు భావించడం సరికాదు. వాటిని నియంత్రించడంలో యాజమాన్యాలకు కూడా బాధ్యత ఉంటుంది. కాలేజీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే ఇక నుంచి వాటి యాజమాన్యాలపైన కూడా కేసులు నమోదు చేయండి. యాజమాన్యాలు, అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థుల నడవడికను కూడా గమనించాల్సి ఉంటుంది. డ్రగ్స్ నియంత్రణపై పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలతో నార్కోటిక్స్ బ్యూరో ఒక సమావేశం నిర్వహించాలి. 140 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో 68 శాతం యువత ఉంది. ఐటీతో సహా అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళుతుంటే దెబ్బతీయడానికి, దేశాన్ని నిర్వీర్యం చేయడానికి ఇలాంటి డ్రగ్స్ మహమ్మారితో యువతను బలిగొనే కుట్రలు జరుగుతున్నాయి. దేశ రక్షణలో ముందు వరుసలో నిలుచున్న పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ భారిన పడి యువత నిర్వీర్యమైపోతోంది. డ్రగ్స్‌తో ఎవరైనా తెలంగాణలో కాలు పెట్టాలంటే వందసార్లు ఆలోచించాలి. ఒక గడ్డి పరకైనా రాష్ట్రంలో అడుగుపెట్టినా  వెన్ను విరుస్తాం. ఐటీ హబ్‌గా, ఫార్మా హబ్‌గా ఉన్న తెలంగాణ గంజాయి, డ్రగ్స్‌ హబ్‌గా మారితే మనమంతా విఫలమైనట్టే. యువతను సరైన దిశగా నడిపించాల్సిన అవసరం ఉంది. యువతను సరైన దిశలో నడిపించాలన్న ఉద్దేశంతోనే క్రీడా పాలసీని తెచ్చాం. నైపుణ్యాలను మెరుగుపరచడానికి స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. రేపటి రోజున ఎవరైనా క్రీడల్లో శిక్షణ తీసుకోవాలంటే తెలంగాణ వెళ్లాలన్న పరిస్థితి రావాలి. తెలంగాణను ఒక స్పోర్ట్స్ హబ్‌గా మార్చడానికి దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోని యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకున్నాం. ప్రపంచంతో పోటీ పడే శక్తి, యుక్తి దేశంలో ఉంది. తెలంగాణలోని 1కోటి 50 లక్షల ఎకరాల్లో ఒక్క గంజాయి మొక్క మొలవొద్దు. ఒక్క గంజాయి మొక్క మొలిచినా ఈ #Eagle (గద్ద) ఇట్టే పట్టేస్తుంది. ఈ గద్ద ఈరోజు నుంచే పనిచేస్తుంది” అని ముఖ్యమంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఎంపీలు అనిల్ కుమార్ యాద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి , సినీనటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, హోం సెక్రెటరీ రవి గుప్తా, తెలంగాణ డీజీపీ జితేందర్ , తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యాతో పాటు అధికారులు, యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తో సహా కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మాదక ద్రవ్యాల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములం అవుతామని ప్రతిజ్ఞ చేశారు.

]]>
Fri, 27 Jun 2025 08:41:29 +0530 admin
పసుపు బోర్డు లోగో ఆవిష్కరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి https://prajakshethrenews.com/పసుపు-బోర్డు-లోగో-ఆవిష్కరించిన-కేంద్రమంత్రి-కిషన్-రెడ్డి https://prajakshethrenews.com/పసుపు-బోర్డు-లోగో-ఆవిష్కరించిన-కేంద్రమంత్రి-కిషన్-రెడ్డి పసుపు బోర్డు లోగో ఆవిష్కరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 26 :
 నిజామాబాద్ ప్రజలు గర్వించాల్సిన సమయం ఇది అని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ లో కిషన్ రెడ్డి పర్యటించారు. పసుపు బోర్డు లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 29న పసుపు బోర్డు ఆఫీస్ ను హోం మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారని, పలు రాష్ట్రాలు కోరినా కేంద్రం నిజామాబాద్ కే బోర్డు కేటాయించిందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐతో విచారణ జరిపించాలని, ట్యాపింగ్ చేసింది పోలీసులే కాబట్టి సిబిఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ తో సిఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. పోలీసులపై పోలీసులే దర్యాప్తు జరిపే పరిస్థితి వచ్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు.

]]>
Thu, 26 Jun 2025 20:58:24 +0530 admin
ఆర్టీవో చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారుల తనిఖీలు https://prajakshethrenews.com/ఆర్టీవో-చెక్-పోస్ట్-లో-ఏసీబీ-అధికారుల-తనిఖీలు https://prajakshethrenews.com/ఆర్టీవో-చెక్-పోస్ట్-లో-ఏసీబీ-అధికారుల-తనిఖీలు ఆర్టీవో చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారుల తనిఖీలు
ప్రజా క్షేత్ర్,  కామారెడ్డి :
మద్నూర్ మండలం సరిహద్దు సలాబత్ పూర్ వద్ద రవాణా శాఖ తనిఖీ కేంద్రంపై అర్ధరాత్రి నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల్ సల్లబాత్ పూర్  చెక్ పోస్ట్ వద్ద వాహనదారుల నుంచి ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా వసూలు చేసిన రూ. 92,000/- నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. తనిఖీ కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారులు నిద్రిస్తుంటే.. ప్రైవేట్ వ్యక్తులే చెక్ పోస్ట్ ను వారి చేతిలోకి తీసుకొని లారీల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గమనించామన్నారు. పలువురు ప్రైవేట్ వ్యక్తులు పారిపోగా, ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించామని అన్నారు. తనిఖీలు కొనసాగిస్తామని పూర్తి వివరాలు ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు చెప్పారు. ఏసీబీ అధికారులు వచ్చిన సమాచారం తెలుసుకున్న ప్రైవేట్ వ్యక్తులు దూరప్రాంతాలకు పరుగులు తీశారు. పదేళ్ల క్రితం ఇదే తనిఖీ  కేంద్రంపై దాడులు నిర్వహించారు. పదేళ్ల తర్వాత మళ్లీ దాడులు నిర్వహించడంతో అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు భయాందోళనకు గురయ్యారు.

]]>
Thu, 26 Jun 2025 19:26:49 +0530 admin
గోదావరి& కావేరి లింక్ పేరుతో చంద్రబాబు నీళ్లు తరలింపు : ఎమ్మెల్సీ కవిత https://prajakshethrenews.com/గోదావరి-కావేరి-లింక్-పేరుతో-చంద్రబాబు-నీళ్లు-తరలింపు-ఎమ్మెల్సీ-కవిత https://prajakshethrenews.com/గోదావరి-కావేరి-లింక్-పేరుతో-చంద్రబాబు-నీళ్లు-తరలింపు-ఎమ్మెల్సీ-కవిత గోదావరి- కావేరి లింక్ పేరుతో చంద్రబాబు నీళ్లు తరలింపు
రేవంత్ ప్రభుత్వ మొద్దు నిద్రతో అన్యాయం
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 26 :
గోదావరి- కావేరి లింక్ పేరుతో చంద్రబాబు నీళ్లు తరలిస్తుంటే, రేవంత్ ప్రభుత్వ మొద్దు నిద్రతో అన్యాయం జరుగుతోందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పులను మాజీ సిఎం కెసిఆర్ సకాలంలో చెల్లించారని కవిత తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డికి అవినీతి చక్ర బిరుదు ఇస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..18 నెలల్లోనే రూ. 2 లక్షల కోట్లు రేవంత్ అప్పులు తెచ్చారని, ఆర్ సి సంస్థకు 2024 నుంచి రేవంత్ ప్రభుత్వం కిస్తీలు కట్టడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో రేవంత్ విఫలం అయ్యారని ఎద్దేవా చేశారు. పోలవరంతో భద్రాచలంతో పాటు 5 గ్రామాలకు అన్యాయం జరుగుతున్నా, రేవంత్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 2024జూలై 6న ప్రగతి భవన్ లోఎపి సిఎం చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ తర్వాతనే..బనకచర్ల ప్రాజెక్టు పనులు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు.

]]>
Thu, 26 Jun 2025 19:20:25 +0530 admin
జూరాల రోప్ 9వ నంబర్ గేట్ తెగిపోవడం ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం: కెటిఆర్ https://prajakshethrenews.com/జూరాల-రోప్-9వ-నంబర్-గేట్-తెగిపోవడం-ప్రభుత్వ-నిర్లక్షానికి-నిదర్శనం-కెటిఆర్ https://prajakshethrenews.com/జూరాల-రోప్-9వ-నంబర్-గేట్-తెగిపోవడం-ప్రభుత్వ-నిర్లక్షానికి-నిదర్శనం-కెటిఆర్ జూరాల రోప్ 9వ నంబర్ గేట్ తెగిపోవడం ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం: కెటిఆర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 26 :
ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం వల్లే జూరాల ప్రమాదంలో పడిందని బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. జూరాల రోప్ 9వ నంబర్ గేట్ తెగిపోవడం ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం అని అన్నారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయలేదని, మెయింటెనెన్స్ పనులు చేయించడంలో నిర్లప్తత స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జూరాలకు వరద ఉద్ధృతి దృష్ట్యా ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని సూచించారు. జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కెటిఆర్ కోరారు.

]]>
Thu, 26 Jun 2025 19:16:55 +0530 admin
కేసీఆర్‌ దమ్మేంటో ఒరిజినల్‌ కాంగ్రెస్‌ నాయకులను అడిగితే తెలుస్తుంది : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత https://prajakshethrenews.com/కేసీఆర్-దమ్మేంటో-ఒరిజినల్-కాంగ్రెస్-నాయకులను-అడిగితే-తెలుస్తుంది-ఎమ్మెల్సీ-కల్వకుంట్ల-కవిత https://prajakshethrenews.com/కేసీఆర్-దమ్మేంటో-ఒరిజినల్-కాంగ్రెస్-నాయకులను-అడిగితే-తెలుస్తుంది-ఎమ్మెల్సీ-కల్వకుంట్ల-కవిత కేసీఆర్‌ దమ్మేంటో ఒరిజినల్‌ కాంగ్రెస్‌ నాయకులను అడిగితే తెలుస్తుంది :
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
కేసీఆర్‌ దమ్మేంటో ఒరిజినల్‌ కాంగ్రెస్‌ నాయకులను అడిగితే తెలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్‌ పోరాడి తెలంగాణ సాధించారు కాబట్టే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వడం తోపాటు పింఛన్ల పెంపు హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆబిడ్స్‌ జనరల్‌ పోస్టాఫీస్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం సోనియాగాంధీకి పోస్ట్‌ కార్డులు పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ. ఏపీ సీఎం చంద్రబాబునాయుడును పిలిచి ప్రజాభవన్‌లో బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్‌గా ఇచ్చిందే రేవంత్‌రెడ్డి అన్నారు. 2016లో పోలవరం- బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు అనే ప్రస్తావనే లేదన్నారు. హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, నాయకులు మహేందర్‌, సంపత్‌గౌడ్‌, రూప్‌సింగ్‌, అర్చనా సేనాపతి, లలిత యాదవ్‌, శోభ తదితరులు పాల్గొన్నారు.

]]>
Thu, 26 Jun 2025 19:10:46 +0530 admin
అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ భారీ ర్యాలీ https://prajakshethrenews.com/అంతర్జాతీయ-మాదకద్రవ్యాల-దుర్వినియోగం-అక్రమ-రవాణా-వ్యతిరేక-దినోత్సవ-భారీ-ర్యాలీ https://prajakshethrenews.com/అంతర్జాతీయ-మాదకద్రవ్యాల-దుర్వినియోగం-అక్రమ-రవాణా-వ్యతిరేక-దినోత్సవ-భారీ-ర్యాలీ అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం:
పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఆధ్వర్యంలో ర్యాలీ
ప్రజా క్షేత్ర్, కరీంనగర్ :
 అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని  ప్రపంచ మాదకద్రవ్యాల దినోత్సవం పురస్కరించుకుని, కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఆధ్వర్యంలో 2 కిలోమీటర్ల మేర ర్యాలీని నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యం.
ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జెండా ఊపి ప్రారంభించగా, కరీంనగర్ కలెక్టరేట్ నుండి ప్రారంభమై, ప్రతిమ మల్టీప్లెక్స్ జంక్షన్ నుండి తెలంగాణ చౌక్ మీదుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని పరేడ్ గ్రౌండ్ వద్ద ముగిసింది. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా ఉన్నత అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్‌సిసి క్యాడెట్లు, పోలీసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ. ముఖ్యంగా యువత విద్యార్థులలో మాదకద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, పోరాడటానికి ప్రభావవంతమైన అవగాహన కార్యక్రమాలు, ప్రజాభాగస్వామ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 20, 2025 నుండి జూన్ 26, 2025 వరకు అవగాహన వారం నిర్వహిస్తున్నందున, కరీంనగర్ కమిషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన ప్రచారం మరియు కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. కమీషనర్ తమ ప్రసంగంలో విద్యార్థి దశలో వివిధ కారణాల వల్ల ఒత్తిడికి లోనై, చెడు స్నేహాల వలన మాదక ద్రవ్యాల వినియోగం వల్ల మానసికంగా, శారీరకంగా తీవ్రంగా నష్టపోతారని, కొన్ని సందర్భాల్లో జీవితాలను సైతం కోల్పోతారని తెలిపారు. దీని నిర్మూలనకు విద్యార్థి దశలోనే మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యులై, డ్రగ్ రహిత సమాజ నిర్మాణం కోసం పాటుపడతామని పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు మరియు అధికారులంతా ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ ఏఎస్పీ శుభం ప్రకాష్ ఐపీఎస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి పర్విన్, ఏసీపీలు వెంకటస్వామి టౌన్, విజయ్ కుమార్ సీసీఆర్బి, ఇన్స్పెక్టర్లు,  తదితరులు పాల్గొన్నారు.

]]>
Thu, 26 Jun 2025 18:57:53 +0530 admin
పెండింగ్ లో ఉన్న 180.38 కోట్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు ఒకేసారి క్లియర్ https://prajakshethrenews.com/పెండింగ్-లో-ఉన్న-18038-కోట్ల-మెడికల్-రీయింబర్స్మెంట్-బిల్లులు-ఒకేసారి-క్లియర్ https://prajakshethrenews.com/పెండింగ్-లో-ఉన్న-18038-కోట్ల-మెడికల్-రీయింబర్స్మెంట్-బిల్లులు-ఒకేసారి-క్లియర్ పెండింగ్ లో ఉన్న 180.38 కోట్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు ఒకేసారి క్లియర్.
-26,519 మందికి ఊరట
-గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులను సైతం క్లియర్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ రియంబర్స్మెంట్ పెండింగ్ బిల్లుల మొత్తం 180.38 కోట్లు నిధులను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఒకేసారి విడుదల చేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, లెక్కకు మించిన సంక్షేమ పథకాలు మరోవైపు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులకు ప్రాధాన్యత ఇస్తూ డిప్యూటీ సీఎం వాటిని క్లియర్ చేశారు.
గత ప్రభుత్వం కాలం లో 04- 03- 2023 నుంచి 20-06-2025  వరకు పెండింగ్లో ఉన్న బిల్లులను క్లియర్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలిగింది

]]>
Thu, 26 Jun 2025 18:50:26 +0530 admin
రాష్ట్ర ఖజానా .. కేసీఆర్ కుటుంబం సంకనాకించింది : జగ్గా రెడ్డి https://prajakshethrenews.com/రాష్ట్ర-ఖజానా-కేసీఆర్-కుటుంబం-సంకనాకించింది-జగ్గా-రెడ్డి https://prajakshethrenews.com/రాష్ట్ర-ఖజానా-కేసీఆర్-కుటుంబం-సంకనాకించింది-జగ్గా-రెడ్డి రాష్ట్ర ఖజానా .. కేసీఆర్ కుటుంబం  సంకనాకించింది
 కేసీఆర్ రైతు బంధు ఐదు నెలలు పాటు వేస్తే.
 రైతులకు రైతు భరోసా 9 రోజుల్లో ..9 వేల కోట్లు వేయడం జరిగింది.
ఫోన్ ట్యాపింగ్ చేసి కేసీఆర్ పీకింది ఏందీ..?
సీఎం రేవంత్ రెడ్డి గుడ్..జగ్గ రెడ్డి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 26 :
రాష్ట్ర ఖజానా .. కేసీఆర్ కుటుంబం  సంకనాకించిందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ రైతు బంధు ఐదు నెలలు పాటు వేస్తే... రైతులకు రైతు భరోసా 9 రోజుల్లో ..9 వేల కోట్లు వేయడం జరిగింది.సీఎం రేవంత్ రెడ్డి ఇస్ గుడ్..అని జగ్గ రెడ్డి కితాబు ఇచ్చారు..మా సీఎం రేవంత్...డిప్యూటీ సీఎం భట్టి లు 9 రోజుల్లోనే రైతు భరోసా వేశారు కేసీఆర్ పాలనకు... కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడా ఇదేకరువులో ఉండి కూడా కస్టపడి రైతుల ఖాతాలో కి 9 వేల కోట్లు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పై నిందలు వేస్తున్నారన్నారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని నాకు పోలీసులు అప్పుడే చెప్పారు..  ఫోన్ ట్యాపింగ్ చేసి కేసీఆర్ పీకింది ఏందీ..? అని జగ్గ రెడ్డి ప్రశ్నించారు.

]]>
Thu, 26 Jun 2025 18:43:15 +0530 admin
కాంగ్రెస్ హమీలపై సీఎం రేవంత్ కు ఎమ్మెల్సీ కవిత సవాల్ https://prajakshethrenews.com/కాంగ్రెస్-హమీలపై-సీఎం-రేవంత్-కు-ఎమ్మెల్సీ-కవిత-సవాల్-724 https://prajakshethrenews.com/కాంగ్రెస్-హమీలపై-సీఎం-రేవంత్-కు-ఎమ్మెల్సీ-కవిత-సవాల్-724 కాంగ్రెస్ హమీలపై సీఎం రేవంత్ కు ఎమ్మెల్సీ కవిత సవాల్

సోనియాకు వేలాది పోస్టు కార్డులు పంపిన జాగృతి కార్యకర్తలు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చిద్దాం. రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యాని పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చారు. 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదు. రేవంత్ రెడ్డికి అబద్దాలు ఆడడం అలవాటైందని ఆరోపించారు.
గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం సరికాదు. యస్.. అసెంబ్లీ పెడుదాం... ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసినదానిపై చర్చిద్దాం. కేసీఆర్ దమ్మెంతా అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అది మరిచిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరం. రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలి. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని అన్నారు. మహిళలకు 2500, పెన్షన్ల మొత్తాన్ని పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డు ఉద్యమం చేసారు. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు పంపించారు. అబిడ్స్ జీపీవోలో పోస్ట్ కార్డులను ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి కార్యకర్తలు పోస్ట్ చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. వృద్ధులకు రూ 2 వేల పెన్షన్ ను రూ 4 వేలు చేస్తామన్న హామీని విస్మరించిన కాంగ్రెస్. వికలాంగుల పెన్షన్ ను రూ 4 వేల నుంచి రూ 6 వేల కు పెంచకుండా మోసం చేసిన కాంగ్రెస్. మహిళలకు నెలకు రూ 2500 ఇస్తామన్న హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. గ్యారెంటీలపై సోనియా గాంధీ సంకతం పెట్టిన గ్యారెంటీ కార్డులను ఇంటింటికి పంచారు. సోనియాగాంధీ ముఖం చూసి ఓట్లేసిన  మహిళలను, వృద్ధులను, వికలాంగులు మోసం చేశారు. అందుకే సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు పంపించాము. పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని రేవంత్ రెడ్డికి ఆదేశాలివ్వాలని సోనియా గాంధీని కోరామని అన్నారు.

]]>
Wed, 25 Jun 2025 23:52:13 +0530 admin
పదేళ్ల బిఆర్ ఎస్ పాలన..ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దం https://prajakshethrenews.com/పదేళ్ల-బిఆర్-ఎస్-పాలనఏడాదిన్నర-కాంగ్రెస్-పాలనపై-చర్చకు-సిద్దం https://prajakshethrenews.com/పదేళ్ల-బిఆర్-ఎస్-పాలనఏడాదిన్నర-కాంగ్రెస్-పాలనపై-చర్చకు-సిద్దం పదేళ్ల బిఆర్ ఎస్ పాలన..ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దం
* బిఆర్ ఎస్ కు టీపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సవాల్
* బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది
* బీజేపీ రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య   కవితకు మద్దతు మాట్లాడటం విచారకరం
* కవిత చెప్పినట్టు బీఆర్‌ఎస్‌లో దెయ్యాలుంటే... కాంగ్రెస్‌లో దేవతలున్నారు
హైదరాబాద్ జూన్ 25
నిన్నటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు పదేళ్ల బిఆర్ ఎస్ పాలన..ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దం అని టీపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సవాల్  విసిరారు.న్యాయం స్థానం తీర్పుకు అనుగుణంగానే రాష్ట్రంలో స్థానికల ఎన్నికల నిర్వహణ ఉంటుంది బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బుదవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లడుతూ కాంగ్రెస్ 18 నెలల పాలన గోల్డెన్ పిరియడ్  బీసీ రిజర్వేషన్ల విషయంలో బిజేపి నేతలు నోరు మెదపడం లేదు   బీసీ రిజర్వేషన్లు ఇచ్చి తీరాలని కాంగ్రెస్ పార్టీ తపన    నిన్న జరిగిన పీసీసీ, పీఏసీ సమావేశాలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. ఈ సమావేశాల్లో రాబోయే స్థానిక ఎన్నికలకు, జుబ్లీహీల్స్‌ ఉప ఎన్నికకు పార్టీని సన్నద్ధం చేసేలా పలు కీలక నిర్ణయాలుతో వచ్చే ghmc ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహలాపై చర్చించాం  జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు గెలిచేది మేమే  రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేసి రికార్డు సృష్టించడమే కాదు, కాంగ్రెస్‌ రైతు పక్షపాతి ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నామని తెలిపారు.  రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది  తెలంగాణలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ పార్టీదే విజయం స్థానిక ఎన్నికల్లో, జుబ్లీహీల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తిరుగుండదు.  మూ ముక్కలాటతో బిఆర్ ఏ స్ పార్టీ పని ముగిసింది    కవిత చెప్పినట్టు బీఆర్‌ఎస్‌లో దెయ్యాలుంటే... కాంగ్రెస్‌లో దేవతలున్నారు  మహిళల అభివ్రుది గురించి కవిత మాట్లాడటం సిగ్గుచేటు  బీజేపీ రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య   కవితకు మద్దతు మాట్లాడటం విచారకరం  క్యాబినెట్ లో 5 గురు దళితులకు చోటు కల్పించాం  రైతు సంక్షేమం కోసం లక్షా 4 వేల కోట్లు కేటాయించాం  పదేళ్ల బిఆర్ ఎస్ పాలనలో వెలగబెట్టింది ఏంటి అంటే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఫోన్ ట్యాపింగ్ చేశారు  ఫోన్ ట్యాపింగ్ తో సినీ తారల కుటుంబంలో చిచ్చు పెట్టారు.  తుదకు సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాపింగ్ చేశారు   దేశ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ హేయమైన చర్య   ఫోన్ ట్యాపింగ్ లో ఎంతటి వారు ఉన్నా సరే శిక్ష తప్పదు  కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్‌ పలు పథకాల్లో జరిగిన కుంభకోణాలను వెలుగుతీసి ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు.   బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు సరిగ్గా పూర్తి చేయలేదు  కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నారు  అభూత కల్పనతో బిఆర్ యస్ పార్టీ సోషల్ మీడియా నడుపుతున్నారు వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను, పథకాలను మంజూరు చేయకుండా వివక్ష చూపిస్తోంది  బనకచర్లతో రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరకోం  పోతిరెడ్డి ప్రాజెక్టు కట్టుకోమని జీవోలు ఇచ్చింది బిఆర్ఎస్ కదా?  కృష్ణాజలాల విషయంలో హరీశ్ రావు సంతకం ఎందుకు పెట్టారని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు

]]>
Wed, 25 Jun 2025 23:43:54 +0530 admin
లవ్ మర్డర్ల పట్ల మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆందోళన https://prajakshethrenews.com/లవ్-మర్డర్ల-పట్ల-మాజీ-ఎంపీ-వి-హనుమంతరావు-ఆందోళన https://prajakshethrenews.com/లవ్-మర్డర్ల-పట్ల-మాజీ-ఎంపీ-వి-హనుమంతరావు-ఆందోళన హై టెక్ సిటీలో కో లివింగ్ ను ఆపాలి
లవ్ మర్డర్ల పట్ల మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆందోళన
      వీటి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు లు దృష్టి పెట్టాలి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 25
;హై టెక్ సిటీలో కో లివింగ్ ను ఆపాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు లను కోరారు.బుదవారం  గాంధీ భవన్లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఒకే హాస్టల్ లో ఆడపిల్ల,మగ పిల్లలు కలిసి ఉంటుంన్నారు హైదరాబాద్ నెంబర్ వన్ సిటీ కావాలంటే ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ఎస్యుఐ  విద్యార్థి సంఘం  వీటి మీద దృష్టి పెట్టాలిగతంలో ఫ్యాక్షన్ మర్థర్స్ ఉండేవి ఇప్పుడు సొంత భర్త ను బార్య  బార్యను భర్త ,కూతురు తల్లిని చంపడం లాంటివి  ఇప్పుడు లవ్ మర్థర్స్ జరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.ఇలాంటి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని రిక్వెస్ట్సమాజం ఎటు వైపు పోతుందని భయమేస్తుంది. హ్యూమన్ రైట్స్ నక్షలైట్ల హత్యల విషయంలో మాట్లాడుతారులవ్ మర్డర్స్ పై హ్యూమన్ రైట్స్ ఎందుకు మాట్లాడటం లేదుఇలాంటి మర్థర్స్ ను  హ్యూమన్ రైట్స్  టేక్ అప్ చేయాలిసైకాలజిస్ట్ లు,ఇంటలెక్చవల్స్ ఆలోచన చేయాలిఎక్కడో తప్పు జరుగుతుందిసవిత్రిభాయ్ పూలే ను ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

]]>
Wed, 25 Jun 2025 23:39:42 +0530 admin
బూర్గంపాడు ఘ‌ట‌న‌పై నివేదిక కోరాం : మంత్రి కొండా సురేఖ https://prajakshethrenews.com/బూర్గంపాడు-ఘటనపై-నివేదిక-కోరాం-మంత్రి-కొండా-సురేఖ https://prajakshethrenews.com/బూర్గంపాడు-ఘటనపై-నివేదిక-కోరాం-మంత్రి-కొండా-సురేఖ బూర్గంపాడు ఘ‌ట‌న‌లో నివేదిక కోరాం
రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌
సురేఖ‌తో ఫోన్ లో ఘటన వివ‌రాలు తెలుసుకున్న మంత్రి సీత‌క్క‌
ప్రజా క్షేత్ర్, హైద‌రాబాద్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ఇరవెండి ఫారెస్ట్ బీట్లో లోని కొసగుంపు వలస ఆదివాసీ గ్రామంలో ఇటీవ‌ల‌ చోటు చేసుకున్న ఘ‌ట‌న‌పై తెలంగాణ రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఫారెస్ట్ భూమికి కందకాలు తవ్వేందుకు వెళ్లిన జేసీబీని కొసగుంపుకు చెందిన వలస ఆదివాసీ మహిళలు అడ్డుకున్న నేప‌థ్యంలో చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ విష‌యంలో మంత్రి సురేఖ‌, జిల్లా అట‌వీ అధికారుల‌ను, జిల్లా  ఉన్న‌తాధికారుల‌ను నివేదిక కోరుతాన‌ని చెప్పారు. ఈ మేర‌కు మంత్రి సురేఖ మీడియాకి బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కందకాలు తవ్వకుండా జేసీబీకి అడ్డుగా మహిళలు బైఠాయించ‌గా, ఫారెస్ట్ అధికారులు మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వలస ఆదివాసీ మహిళలకు, ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఇదే విష‌యంలో రాష్ట్ర పంచాయ‌తీరాజ్, మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ అన‌సూయ సీత‌క్క కూడా మంత్రి సురేఖతో ప్ర‌త్యేకంగా ఫోన్ లో మాట్లాడారు. నివేదిక వ‌చ్చిన త‌ర్వాత త‌ద‌నుగుణంగా ముందుకు వెళ‌దామ‌ని అట‌వీ మంత్రి సురేఖ, సీతక్కకు హామీనిచ్చారు.

]]>
Wed, 25 Jun 2025 22:42:57 +0530 admin
సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించండి : హైకోర్టు కీలక ఆదేశాలు https://prajakshethrenews.com/సెప్టెంబర్-30లోపు-ఎన్నికలు-నిర్వహించండి-హైకోర్టు-కీలక-ఆదేశాలు https://prajakshethrenews.com/సెప్టెంబర్-30లోపు-ఎన్నికలు-నిర్వహించండి-హైకోర్టు-కీలక-ఆదేశాలు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించండి : హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 25 :

స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్‌ 30 లోపు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో గతేడాది ఫిబ్రవరితోనే సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. దీనిపై దాఖలైన ఆరు పిటిషన్‌లను జస్టిస్‌ మాధవి బెంచ్‌ విచారించింది. ఇవాళ తీర్పు వెల్లడించిందితెలంగాణలో గతేడాది ఫిబ్రవరితోనే సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. దీనిపై దాఖలైన ఆరు పిటిషన్‌లను జస్టిస్‌ మాధవి బెంచ్‌ విచారించింది. ఇవాళ తీర్పు వెల్లడించింది. పిటిషనర్ల ఏమని వాదించారంటే... గతేడాది ఫిబ్రవరితో సర్పంచుల పదవీ కాలం ముగిసిందని తెలిపారు. ఇన్ని రోజులు ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. దీని వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని కోర్టు ముందు ఉదాహరణలతో ఉంచారు. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రావడం లేదని వివరించారు. కేంద్రం నుంచి నిధులు వస్తాయని చాలా మంది సర్పంచ్‌లు సొంత నిధులతో అభివృద్ధి పనులు చేశారని ఆ నిధులు రాక అప్పులు పాలయ్యారని వాపోయారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుకు రిక్వెస్ట్ చేశారు. పిటిషనర్ల వాదనకు ప్రభుత్వం తరఫున ఏజీ కౌంటర్‌ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఈ ప్రక్రియ చేపట్టడానికి టైం పడుతుందని పేర్కొన్నారు. అదనంగా మరో నెలరోజులు గడువు కావాల్సి ఉందన్నారు. ఎన్నికల సంఘం తరఫున కూడా వాదనలు వినిపించిన న్యాయవాది రిజర్వేషన్ల ప్రక్రియతోనే నిర్వహణ ఆలస్యమవుతుందన్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల వచ్చిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని కోర్టుకు తెలిపారు. అటు ప్రభుత్వం, ఇటు ఎన్నికల సంఘం కూడా మరో గడువు కోరాయి. అన్నింటిని పరిగణలోకి తీసుకున్న  కోర్టు సెప్టెంబర్‌ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తీర్పు చెప్పింది.

రాజ్యంగం ఏమి చెబుతోంది: తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలు 30 సెప్టెంబర్ 2025లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఈ తీర్పును ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది, రాజ్యాంగం స్థానిక సంస్థల ఎన్నికలపై ఏం చెబుతుందో సమగ్రంగా పరిశీలిద్దాం.స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విధిరాజ్యాంగంలోని 73వ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. దీని ప్రకారం, గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా కొత్త పాలక వర్గం ఏర్పాటు చేసేందుకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగ విధి. తెలంగాణలో 12,991 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పంచాయతీల పాలకవర్గం గడువు 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పంచాయతీలు ఉన్నాయి. ఆరు నెలల గడువులోగా ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకునే హైకోర్టు ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది.స్థానిక ప్రభుత్వాలలో ప్రజల ప్రాతినిధ్యం లేకపోవడం ప్రస్తుతం పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నడుస్తున్నాయి. కానీ రాజ్యాంగం ప్రకారం పంచాయతీల పాలన ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గం ద్వారా నడవాల్సి ఉంది. ప్రత్యేక అధికారుల పాలన తాత్కాలిక ఏర్పాటు తప్ప ప్రజాస్వామ్యబద్ధమైన వ్యవస్థ కాదని కోర్టు అభిప్రాయం. స్థానికంగా ప్రజల భాగస్వామ్యంతోనే పాలన జరగాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి. వారి భాగస్వామ్యం లేకపోవడం అంటే ప్రజల గొంతుకను అణిచివేయడమని హైకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల జాప్యానికి సంబంధించి ఎన్నికల సంఘం కోర్టు ముందు ఉంచిన కారణాలను సాకులుగా భావించి న్యాయస్థానం తిరస్కరించింది.ఎన్నికల నిర్వహణలో జాప్యానికి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పిన కారణాలివే:

1. గ్రామ పంచాయతీల పునర్విభజన, కొన్ని గ్రామ పంచాయతీలు సరిహద్దుల పునర్విభజన పెండింగ్‌లో ఉన్నాయి.

2. ఓటర్ల జాబితాలో సవరణలు పూర్తిగా జరగలేదని, మార్పులు-చేర్పులు, తొలగింపు వంటి ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.

3. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన ప్రక్రియ ఖరారు కాలేదు.
4. వర్షాకాలంలో ఎన్నికల నిర్వహణ కష్టమైన పని.
ఈ కారణాలను హైకోర్టు తప్పుబట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సాకులు చెబుతున్నారని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని న్యాయస్థానం ఆక్షేపించింది. ఈ ప్రక్రియను ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే పూర్తి చేసి ఉండాలని అభిప్రాయపడింది. వర్షాకాలంలో అవసరమైన చర్యలు చేపట్టి ఎన్నికలను పూర్తి చేయాలని ఆదేశించింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం చేస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వంపై కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు. అందులో రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన తన విధులు
నిర్వర్తించడంలో విఫలమైందని, ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకుంటుందని పేర్కొనడం జరిగింది. ఈ పిటిషన్లను కొందరు మాజీ సర్పంచ్‌లు, సామాజిక కార్యకర్తలు, రాజకీయనేతలు వేయడం జరిగింది. దీనిపై స్పందించిన హైకోర్టు విచారణను చేపట్టింది. ఎన్నికల సంఘం చూపించిన కారణాలను తప్పుబట్టిన హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలోనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను జారీ చేయాల్సి ఉంటుంది.

]]>
Wed, 25 Jun 2025 19:41:56 +0530 admin
బార్ కౌన్సిల్ చైర్మన్ ను సన్మానించిన నోటరీ అడ్వకేట్ల సంఘం https://prajakshethrenews.com/బార్-కౌన్సిల్-చైర్మన్-ను-సన్మానించిన-నోటరీ-అడ్వకేట్ల-సంఘం https://prajakshethrenews.com/బార్-కౌన్సిల్-చైర్మన్-ను-సన్మానించిన-నోటరీ-అడ్వకేట్ల-సంఘం బార్ కౌన్సిల్ చైర్మన్ ను సన్మానించిన నోటరీ అడ్వకేట్ల సంఘం
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 25 :
 రాష్ట్రంలోని నోటరీ అడ్వకేట్ లకు బార్ కౌన్సిల్ అండగా నిలుస్తుందని తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ ప్రాక్టీసింగ్ నోటరీ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గంజి యాదగిరి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు హై కోర్టులోని బార్ కౌన్సిల్ కార్యాలయంలో చైర్మన్ తోపాటు వైస్ చైర్మన్ కే. సునీల్ గౌడ్, కార్యదర్శి వి.నాగలక్ష్మి లను కలిశారు. కృతఙ్ఞతపుర్వకంగా ముగ్గురిని శాలువాతో సత్కరించి, మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా తానా రాష్ట్ర అధ్యక్షుడు గంజి యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ప్రాక్టీస్ చేస్తున్న నాలుగువేల మంది నోటరీ అడ్వకేట్ల సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నామని అన్నారు. కొద్దిరోజుల క్రితం తాము వినతిపత్ర రూపంలో పలు సమస్యలను బార్ కౌన్సిల్ కు సమర్పించడం జరిగిందని అన్నారు. అందుకు సమ్మతించి తమకు న్యాయం చేసిన బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్యదర్శిలను సన్మానించి కృతజ్ఞతలు తెలిపామని అన్నారు. భవిష్యత్తులో కూడా బార్ కౌన్సిల్ తమకు అండగా నిలుస్తుందని ఆశిస్తున్నామని గంజి యాదగిరి అన్నారు.ఈ కార్యక్రమంలో నోటరీ అడ్వకేట్ల సంఘం గౌరవ అధ్యక్షుడు గోలి దేవేందర్ బాబు, కార్యదర్శి మాయబ్రహ్మ నరసింహ, కోశాధికారి ఏబి.నర్సింగ్ రావు, కార్యవర్గ సభ్యులు కే మురళీధర్, ఎం.ఎం.బేగ్, కే.నరసింహారావు, కుమనన్ బలరాం, ఎం.వెంకటేశ్వర్లు, పి సతీష్, సుదర్శన్ చారి, కే. సత్యనారాయణ పాల్గొన్నారు.

]]>
Wed, 25 Jun 2025 18:59:22 +0530 admin
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! https://prajakshethrenews.com/వాయువ్య-బంగాళాఖాతంలో-అల్పపీడనం-తెలంగాణకు-ఐదురోజులు-వర్ష-సూచన https://prajakshethrenews.com/వాయువ్య-బంగాళాఖాతంలో-అల్పపీడనం-తెలంగాణకు-ఐదురోజులు-వర్ష-సూచన వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..!
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 25 :
వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఒత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వొంగి ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ దీని ప్రభావం రాగల 24గంటల్లో ఆ ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక తెలంగాణలో రాగల ఐదురోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్‌, పెద్దపల్లి, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ క్రమంలో వాతావరణశాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడుతాయని చెప్పింది. శుక్రవారం ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 నుంచి కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది.శనివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఆదివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడుతాయని వివరించింది.

]]>
Wed, 25 Jun 2025 18:50:19 +0530 admin
మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఐ అండ్ పిఆర్ కమిషనర్ https://prajakshethrenews.com/మంత్రి-కోమటిరెడ్డిని-కలిసిన-ఐ-అండ్-పిఆర్-కమిషనర్ https://prajakshethrenews.com/మంత్రి-కోమటిరెడ్డిని-కలిసిన-ఐ-అండ్-పిఆర్-కమిషనర్ మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఐ అండ్ పిఆర్ కమిషనర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని రాష్ట్ర ఐ అండ్ పిఆర్ కమిషనర్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన సిఎచ్.ప్రియాంక  బుధవారం నాడు మంత్రుల నివాస సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిశారు

]]>
Wed, 25 Jun 2025 15:08:29 +0530 admin
అనధికార ప్రెస్, పోలీసు స్టిక్కర్లపై పోలీసుల కొరడా https://prajakshethrenews.com/అనధికార-ప్రెస్-పోలీసు-స్టిక్కర్లపై-పోలీసుల-కొరడా https://prajakshethrenews.com/అనధికార-ప్రెస్-పోలీసు-స్టిక్కర్లపై-పోలీసుల-కొరడా అనధికార ప్రెస్, పోలీసు స్టిక్కర్లపై పోలీసుల కొరడా
ప్రజా క్షేత్ర్, తిరుపతి :
జిల్లా వ్యాప్తంగా పోలీసులు అనధికారికంగా ప్రెస్, పోలీసు స్టిక్కర్ వేసుకున్న వాహనదారుల పై స్పెషల్ డ్రైవ్  నిర్వహించారు.
అనధికారికంగా కార్లు, ద్విచక్ర వాహనాలపై  ప్రెస్, పోలీస్ స్టిక్కర్  వేసుకుంటే అలాంటి వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చింరారు.
అనధికారికంగా ప్రెస్, పోలీసు స్టిక్కర్లు  వేసుకున్న ప్రెస్ 2 వాహనాలు, పోలీసు 9 మంది వాహనదారులకు  మొదటి తప్పు గా పరిగణలోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. తిరుపతి జిల్లాలో కొందరు జర్నలిస్టులు, పోలీసులు కాకున్నా తమ వాహనాలపై ప్రెస్, పోలీస్ అని స్టిక్కర్లు అతికించుకుని తిరుగుతున్నట్లు సమాచారం వచ్చింది.  ప్రెస్, పోలీస్ విధులతో సంబంధం లేనివారు వాహనాలపై స్టిక్కర్లను అతికించుకోవడం చట్టపరపరంగా నేరం. ఇక నుండి ఎవరైన ప్రెస్, పోలీసు  స్టిక్కర్స్  గుర్తింపు కార్డులు లేకుండా వేసుకుని తిరిగే అలాంటి వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు వారు నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన  వారి వాహనాలను సీజ్ చేస్తామని అన్నారు.

]]>
Wed, 25 Jun 2025 14:25:20 +0530 admin
కాంగ్రెస్ హమీలపై సీఎం రేవంత్ కు ఎమ్మెల్సీ కవిత సవాల్ https://prajakshethrenews.com/కాంగ్రెస్-హమీలపై-సీఎం-రేవంత్-కు-ఎమ్మెల్సీ-కవిత-సవాల్ https://prajakshethrenews.com/కాంగ్రెస్-హమీలపై-సీఎం-రేవంత్-కు-ఎమ్మెల్సీ-కవిత-సవాల్ కాంగ్రెస్ హమీలపై సీఎం రేవంత్ కు ఎమ్మెల్సీ కవిత సవాల్
సోనియాకు వేలాది పోస్టు కార్డులు పంపిన జాగృతి కార్యకర్తలు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చిద్దాం. రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యాని పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చారు. 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదు. రేవంత్ రెడ్డికి అబద్దాలు ఆడడం అలవాటైందని ఆరోపించారు.
గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం సరికాదు. యస్.. అసెంబ్లీ పెడుదాం... ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసినదానిపై చర్చిద్దాం. కేసీఆర్ దమ్మెంతా అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అది మరిచిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరం. రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలి. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని అన్నారు. మహిళలకు 2500, పెన్షన్ల మొత్తాన్ని పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డు ఉద్యమం చేసారు. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు పంపించారు. అబిడ్స్ జీపీవోలో పోస్ట్ కార్డులను ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి కార్యకర్తలు పోస్ట్ చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. వృద్ధులకు రూ 2 వేల పెన్షన్ ను రూ 4 వేలు చేస్తామన్న హామీని విస్మరించిన కాంగ్రెస్. వికలాంగుల పెన్షన్ ను రూ 4 వేల నుంచి రూ 6 వేల కు పెంచకుండా మోసం చేసిన కాంగ్రెస్. మహిళలకు నెలకు రూ 2500 ఇస్తామన్న హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. గ్యారెంటీలపై సోనియా గాంధీ సంకతం పెట్టిన గ్యారెంటీ కార్డులను ఇంటింటికి పంచారు. సోనియాగాంధీ ముఖం చూసి ఓట్లేసిన  మహిళలను, వృద్ధులను, వికలాంగులు మోసం చేశారు. అందుకే సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు పంపించాము. పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని రేవంత్ రెడ్డికి ఆదేశాలివ్వాలని సోనియా గాంధీని కోరామని అన్నారు.

]]>
Wed, 25 Jun 2025 14:16:59 +0530 admin
సీఎం రేవంత్ రెడ్డి పై సుబేదారి పోలీస్ స్టేషన్ లో దళిత నేతల ఫిర్యాదు https://prajakshethrenews.com/సీఎం-రేవంత్-రెడ్డి-పై-సుబేదారి-పోలీస్-స్టేషన్-లో-దళిత-నేతల-ఫిర్యాదు https://prajakshethrenews.com/సీఎం-రేవంత్-రెడ్డి-పై-సుబేదారి-పోలీస్-స్టేషన్-లో-దళిత-నేతల-ఫిర్యాదు సీఎం రేవంత్ రెడ్డి పై సుబేదారి పోలీస్ స్టేషన్ లో దళిత నేతల ఫిర్యాదు
దళిత ఎమ్మెల్యే పై.. సీఎం వ్యాఖ్యలు గర్హనీయం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
ప్రజా క్షేత్ర్, హనుమకొండ : 
సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఒక వీడియోలో ఎమ్మెల్యే వేముల వీరేశం ను ఉద్దేశించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ  దీనిపై ముఖ్యమంత్రి పై కేసు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బిఆర్ఎస్ నాయకులు హనుమకొండ సిటీలోని సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కమలాపూర్ మండల మాజీ జెడ్పిటిసి మారేపల్లి నవీన్ కుమార్, సీనియర్ నాయకులు పోడేటి రామస్వామి, సరికొమ్ముల వెంకటేష్, మొలుగు దిలీప్, ములుగు పూర్ణచందర్, తొగరు బిక్షపతి, మాట్లరాజకుమార్ తదితరులు పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందించారు. దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశమును ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "బట్టలూడదీసి నడిబజార్లో కొడతామని, నల్లగొండ క్లాక్ టవర్ వద్ద బట్టలూడదీసి .. పగలగొడితే" అంటూ అభ్యంతరకరమైన అగౌరవమైన ఉపయోగించడానికి వీలులేని భాషలో వ్యాఖ్యానించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు దళితుల మనోభావాలను దిబ్బ తీసాయని, బెదిరించేలా ఉన్నాయని వారన్నారు. ఈ ఫిర్యాదు పరిశీలించి విచారణ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో కోరారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి పై సుబేదారి పోలీస్ స్టేషన్లో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించడంతోపాటు చర్చనీయాంశమైంది.

]]>
Wed, 25 Jun 2025 13:49:42 +0530 admin
ఎన్నికల్లో గెలిచే దమ్ము లేకే ఫోన్ ట్యాపింగ్ : బీఆర్ఎస్‌పై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ https://prajakshethrenews.com/ఎన్నికల్లో-గెలిచే-దమ్ము-లేకే-ఫోన్-ట్యాపింగ్-బీఆర్ఎస్పై-ఎంపీ-ఈటల-రాజేందర్-ఫైర్ https://prajakshethrenews.com/ఎన్నికల్లో-గెలిచే-దమ్ము-లేకే-ఫోన్-ట్యాపింగ్-బీఆర్ఎస్పై-ఎంపీ-ఈటల-రాజేందర్-ఫైర్ ఎన్నికల్లో గెలిచే దమ్ము లేకే ఫోన్ ట్యాపింగ్..
         బీఆర్ఎస్‌పై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 24 :
 ఫోన్ ట్యాపింగ్ కేసులో  బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ప్రేమేందర్ రెడ్డి వాంగ్మూలాలను మంగళవారం సిట్ అధికారులు నమోదు చేశారు. 2023 నవంబర్ ఎన్నికల సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీరిద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 4వేల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు సిట్ అధికారులు కనుక్కున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో సిట్ ఎదుట ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈటల స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితుడిని తనేనంటూ ఈటల ఆరోపించారు. తన కుటుంబ సభ్యులు, డ్రైవర్లు, గన్‌మెన్‌లు ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికతో పాటు అంతకుముందు, తర్వాత కూడా ఫోన్ ట్యాపింగ్‌కి గురైనట్లు సిట్ గుర్తించింది. అలాగే.. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సిట్ అధికారులకి ఫిర్యాదు చేశారు. 2020 నుంచి 2024 వరకు తన ఫోన్ సంభాషణలను రహస్యంగా తెలుసుకున్నారని ఫిర్యాదులో మాధవరం కృష్ణారావు తెలిపారు. కుట్ర పూరితంగా కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేసినట్లు సిట్‌కి తెలంగాణ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెజండ్ల కిషోర్ బాబు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలను సిట్ అధికారులకి కిషోర్ బాబు ఇచ్చారు.

]]>
Tue, 24 Jun 2025 20:10:25 +0530 admin
సీనియర్ జర్నలిస్టు దత్తురెడ్డి మృతి పట్ల మంత్రి శ్రీధర్ బాబు సంతాపం https://prajakshethrenews.com/సీనియర్-జర్నలిస్టు-దత్తురెడ్డి-మృతి-పట్ల-మంత్రి-శ్రీధర్-బాబు-సంతాపం https://prajakshethrenews.com/సీనియర్-జర్నలిస్టు-దత్తురెడ్డి-మృతి-పట్ల-మంత్రి-శ్రీధర్-బాబు-సంతాపం సీనియర్ జర్నలిస్టు దత్తురెడ్డి మృతి పట్ల మంత్రి శ్రీధర్ బాబు
సంతాపం
ప్రజా క్షేత్ర్, జగిత్యాల :
ఈనాడు వరంగల్ సీనియర్ జర్నలిస్టు దత్తు రెడ్డి హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆన్నారు. సమాజం కోసం నిరంతరం తపించే ఒక మంచి జర్నలిస్ట్ ను కోల్పోవడం బాధాకరం ఆని అనతికాలంలోనే ఒక మంచి జర్నలిస్ట్ గా దత్తు రెడ్డి పేరు తెచ్చుకున్నారన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సరస్వతి పుష్కరాలు విజయవంతం కావడంలో ఆయన సహకారం మరువలేనిది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్ననని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మంత్రి
దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

]]>
Tue, 24 Jun 2025 19:44:36 +0530 admin
పార్టీలో క్రమశిక్షణ దాటితే వేటు తప్పదు... నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ https://prajakshethrenews.com/పార్టీలో-క్రమశిక్షణ-దాటితే-వేటు-తప్పదు-నేతలకు-సీఎం-రేవంత్రెడ్డి-స్ట్రాంగ్-వార్నింగ్ https://prajakshethrenews.com/పార్టీలో-క్రమశిక్షణ-దాటితే-వేటు-తప్పదు-నేతలకు-సీఎం-రేవంత్రెడ్డి-స్ట్రాంగ్-వార్నింగ్ పార్టీలో క్రమశిక్షణ దాటితే వేటు తప్పదు..
    నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 24 :
 ఇన్‌చార్జ్ మంత్రుల పనితీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి     అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా జిల్లాల్లో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే బాధ్యత ఇన్‌చార్జ్ మంత్రులకు అప్పగించినా ఎందుకు చేయడం లేదని ప్రశ్నిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 99 శాతం సీట్లు గెలిచేలా ఇన్‌చార్జ్ మంత్రులే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులకు నిధులు ఇచ్చామని, వాటిని సరిగ్గా ఎందుకు ఆయా జిల్లాల్లో ఉపయోగించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
పని చేయకపోతే డిమోషన్..
అలాగే.. మంత్రి పదవుల కోసం కొంతమంది కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేయించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. పార్టీలో క్రమశిక్షణ దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. పదవులు వచ్చినవారు తెలంగాణ రాష్ట్రమంతా తిరగాలని ఆదేశించారు. పదవులు అడగటం తప్పు లేదు.. కానీ నిరసన హుందాగా ఉండాలని సూచించారు. పీసీసీ కార్యవర్గంలో ఉన్న వారిని రెండుగా చేసి జాబితా సిద్ధం చేయాలని.. ముందు అందరికీ పని అప్పగించాలని ఆదేశించారు. పని చేసిన వాళ్లది ఒక జాబితా, పనిచేయని వాళ్లది మరో జాబితా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్దేశించారు. ఇవాళ(మంగళవారం) గాంధీ‌భవన్‌లో జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పని చేయకపోతే డిమోషన్.. పని చేస్తే ప్రమోషన్ ఇస్తామని స్పష్టం చేశారు. పని చేయకపోతే పక్కన పెట్టడంలో మొహమాటం అవసరం లేదని తేల్చిచెప్పారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
పదేళ్లు అధికారం మనదే..
గతంలో తాను టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్ బాధ్యతలు తీసుకోమంటే కొందరు నేతలు తీసుకోలేదని గుర్తుచేశారు. తాము సీనియర్లం, ఆ చిన్న బాధ్యత తీసుకోమని తనకు ఆ నేతలు చెప్పారని అన్నారు. ఆ రోజు బాధ్యత తీసుకున్ననాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్పొరేషన్ పదవులు ఇచ్చామని స్పష్టం చేశారు. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం అయితే పదవులు వాటంతట అవే వస్తాయని ఉద్గాటించారు. ఇంకో నాలుగు సంవత్సరాలు తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని అన్నారు. త్వరలోనే మహిళా రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 2029 ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. పార్టీలో పనిచేయని వారిని పదవుల నుంచి తొలగించాలని ఆదేశించారు. తెలంగాణలో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రావాలంటే.. పార్టీ నేతల పనితీరుపైనే ఆధారపడి ఉందని తేల్చిచెప్పారు. పదేళ్లు అధికారం మనదేనని స్పష్టం చేశారు. పార్టీ పదవిని చిన్నచూపు చూస్తే వారికే నష్టమని హెచ్చరించారు. పార్టీ, ప్రభుత్వం జోడేదుల్లాలాగా పనిచేయాలని సూచించారు. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అని అభివర్ణించారు. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లగలుగుతామని ఉద్ఘాటించారు. పార్టీ నిర్మాణంపైన టీపీసీసీ దృష్టి సారించాలని అన్నారు. పార్టీ నాయకులంతా ఐక్యంగా పని చేయాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.
నేతలు కలిసి పని చేయాలి..
మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా నేతలు అందరూ కలిసి పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్లో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పని చేస్తేనే పదవులు వస్తాయని చెప్పారు. పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చామని ఉద్ఘాటించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని పార్టీ నాయకులు పని చేయాలని సూచించారు. మార్కెట్ కమిటీలు, టెంపుల్ కమిటీల వంటి నామినేటేడ్ పోస్టులు భర్తీ చేసుకోవాలని ఆదేశించారు. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహారించాలని కోరారు. మన ప్రభుత్వo చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఉద్గాటించారు. అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించిందని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో చాలా సవాళ్లు ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయని వెల్లడించారు. తాను గ్రామాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

]]>
Tue, 24 Jun 2025 19:35:03 +0530 admin
ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు?.. : ఎంపీ ఈటల రాజేందర్ https://prajakshethrenews.com/ఫోన్-ట్యాపింగ్-ఎవరు-చేయమన్నారు-ఎంపీ-ఈటల-రాజేందర్ https://prajakshethrenews.com/ఫోన్-ట్యాపింగ్-ఎవరు-చేయమన్నారు-ఎంపీ-ఈటల-రాజేందర్ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు? ఈటల రాజేందర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 24 :
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లను ట్యాపింగ్ చేశారో స్పష్టం చేయాలని మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నేడు సిట్ ముందు హాజరై ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.అనంతరం ఈటల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, గతంలో తన ఫోన్‌ను అనేక సందర్భాల్లో ట్యాప్ చేశారని ఆరోపించారు. "నేను హుజూరాబాద్‌లో పోటీ చేసినప్పుడు, 2023లో గజ్వేల్‌లో ఎన్నికల బరిలో నిలిచినప్పుడు అత్యంత దుర్మార్గమైన పద్ధతిలో నా ఫోన్‌ను ట్యాప్ చేశారు. అంతేకాకుండా, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మేం ఎవరితో సంభాషిస్తున్నాం, ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నామనేది కూడా ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు. మా పార్టీ నాయకుల మధ్య జరిగిన సంభాషణలను సైతం కాల్ డేటాలో పొందుపరిచారు. ధైర్యంగా ఎదుర్కోలేనివారే ఇలాంటి చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడతారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభాకర్ రావు నియామకంపై కూడా ఈటల రాజేందర్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. "ప్రభాకర్ రావు ఐపీఎస్ అధికారి కాకపోయినా, నిబంధనలకు విరుద్ధంగా ఆయనను ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించారు. ఒక విశ్రాంత అధికారిని కీలకమైన పదవిలో అక్రమంగా కొనసాగించారు. మార్గదర్శకాలన్నింటినీ తుంగలో తొక్కారు. ఫోన్లు ట్యాప్ చేయడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు లాంటిది. ఈ వ్యవహారంలో కేవలం రాజకీయ నాయకులే కాకుండా, జడ్జిలు, మంత్రులు, పార్టీల ముఖ్య నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు" అని ఆయన ఆరోపించారు.గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం మొత్తం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే నడిచిందని ఈటల విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను ఇప్పటికీ ప్రభుత్వం బయటపెట్టకపోవడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. "ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ కమిషన్ వేసి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లాలూచీ పడకపోతే, ఈ విచారణ నివేదికలను ఎందుకు వెల్లడించడం లేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి" అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

]]>
Tue, 24 Jun 2025 19:12:50 +0530 admin
ఆర్కే ఎస్ మిషిన్ స్కూల్ లో నోట్ బుక్స్ పంపిణీ https://prajakshethrenews.com/ఆర్కే-ఎస్-మిషిన్-స్కూల్-లో-నోట్-బుక్స్-పంపిణీ https://prajakshethrenews.com/ఆర్కే-ఎస్-మిషిన్-స్కూల్-లో-నోట్-బుక్స్-పంపిణీ ఆర్కే ఎస్ మిషిన్ స్కూల్ లో నోట్ బుక్స్ పంపిణీ 

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

ఆర్యవైశ్య సంఘం లాల్ దర్వాజా గౌలిపుర ఆధ్వర్యంలో ఆర్కే ఎస్ మిషిన్ స్కూల్ లో నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. దాత సరాబు విశ్వేశ్వర గుప్త సహకారంతో నిర్వహించిన ఈ  కార్యక్రమానికి చీర రాములు గుప్తా, గుగ్గిల అశోక్ కుమార్ లు పాల్గొని, పేద విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్ లు బిస్కెట్లు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట చారి, సంఘ అధ్యక్షులు సరాబు సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి చాలిక నాగరాజు, కోశాధికారి గుగ్గిల సంతోష్ కుమార్, అడిషనల్ సెక్రెటరీ కటకం సతీష్ కుమార్, అడిషనల్ కార్యదర్శి పెద్ద నాగేష్ గుప్తా, సంఘ సభ్యులు చాలిక శివకుమార్, యాదగిరి, సంతోష్ కుమార్, శివ కృష్ణ, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Tue, 24 Jun 2025 18:21:44 +0530 admin
బండి సంజయ్‌కు సిట్ నోటీసులు...కాంగ్రెస్ రాజకీయ వ్యూహమా? https://prajakshethrenews.com/బండి-సంజయ్కు-సిట్-నోటీసులుకాంగ్రెస్-రాజకీయ-వ్యూహమా https://prajakshethrenews.com/బండి-సంజయ్కు-సిట్-నోటీసులుకాంగ్రెస్-రాజకీయ-వ్యూహమా బండి సంజయ్‌కు సిట్ నోటీసులు...కాంగ్రెస్ రాజకీయ వ్యూహమా?
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్,జూన్ 24  :
ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుల విచారణ బీఆర్ఎస్ ముఖ్య నేతలనే లక్ష్యంగా చేసుకుని సాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి, ఈ కేసును విచారిస్తున్న సిట్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో బండి సంజయ్ స్వయంగా తన ఫోన్‌ను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో, ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసులో ఆయన్ను బాధితుడిగానూ, ఓ సాక్షిగానూ విచారించాలని సిట్ నిర్ణయించింది. అయితే, ఈ నోటీసులు జారీ వెనుక బలమైన రాజకీయ వ్యూహం కూడా దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది పక్కా కాంగ్రెస్ మార్క్ రాజకీయంగా చెబుతున్నారు.

]]>
Tue, 24 Jun 2025 12:41:35 +0530 admin
బీసీ చేతివృత్తులకు చేయుత... బోనాల ఉత్సవాల సందర్భంగా ఎగ్జిబిషన్ https://prajakshethrenews.com/బీసీ-చేతివృత్తులకు-చేయుత-బోనాల-ఉత్సవాల-సందర్భంగా-ఎగ్జిబిషన్ https://prajakshethrenews.com/బీసీ-చేతివృత్తులకు-చేయుత-బోనాల-ఉత్సవాల-సందర్భంగా-ఎగ్జిబిషన్ బీసీ చేతివృత్తులకు చేయుత
- బోనాల ఉత్సవాల సందర్భంగా ఎగ్జిబిషన్
- బీసీ చేతివృత్తుల కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం
- హజరుకానున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులు
- పర్యావరణ హితమైన చేతి వృత్తుల వారి ఉత్పత్తులకు మార్కెటింగ్
- బీసీ కుల సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలి
- పెద్ద ఎత్తున చేతివృత్తుల వారిని ప్రోత్సహించాలి
- బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 23 :
;తెలంగాణ ప్రభుత్వము బోనాల ఉత్సవాల సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల  25 నుంచి 29వ తేదీ వరకు ఐదు రోజులు బి.సి. చేతివృత్తుల కళాకారులచే తయారుచేసిన వివిధ వస్తువుల ప్రదర్శన మరియు అమ్మకం  (Exhibition cum sale) నిర్వహిస్తున్నామని బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.టాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహము ప్రక్కన గల ప్రాంతలో ప్రతిష్టాత్మకంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఈ ప్రదర్శనలో కుమ్మరులు వారు తయారుచేసిన మట్టిపాత్రలు, గౌడన్నలచే 'నీరా' స్టైల్, మేదరివారు తయారు చేసిన వెదురు వస్తువులు,  పూసలవారి సామగ్రి అలాగే  పోచంపల్లి, గద్వాల, నారాయణ పేట మొదలైన చేనేత ఉత్పత్తులు, ఇతర బిసి వర్గాలచే తయారుచేసిన వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా తెలంగాణ వంటకాలు, బెస్త సోదరులచే చేప వంటకాలు, ఇతర భోజన స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రదర్శన ప్రతిరోజు ఉదయం 10:00 గంటల నుండి సాయత్రం 09:30 గంటల వరకు కొనసాగుతుంది. ఉచిత  ప్రవేశము బీసీ చేతివృత్తుల వారి పర్యావరణ హితమైన ఉత్పత్తుల ప్రదర్శనకు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలి. ఈ ప్రదర్శనను తిలకించి వారికి నచ్చిన వస్తువులు, పర్యావరణ హితమైన, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉత్పత్తులు కొనుగోలు చేసి చేతివృత్తుల వారికి చేయూత ఇవ్వాలని, ఈ ప్రదర్శన విజయవంతము చేయాలని బి.సి. సంక్షేమ శాఖ తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

]]>
Mon, 23 Jun 2025 21:59:07 +0530 admin
బీసీ బిల్లును చట్టం రూపంలో చేసుకొని గవర్నర్ కు పంపించాం : మంత్రి, పొన్నం ప్రభాకర్ https://prajakshethrenews.com/బీసీ-బిల్లును-చట్టం-రూపంలో-చేసుకొని-గవర్నర్-కు-పంపించాం-మంత్రి-పొన్నం-ప్రభాకర్ https://prajakshethrenews.com/బీసీ-బిల్లును-చట్టం-రూపంలో-చేసుకొని-గవర్నర్-కు-పంపించాం-మంత్రి-పొన్నం-ప్రభాకర్ బీసీ బిల్లును చట్టం రూపంలో చేసుకొని  గవర్నర్ కు పంపించాం :
మంత్రి, పొన్నం ప్రభాకర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

బిఆర్ ఎస్ హయంలో బలహీన వర్గాల తరఫున గొంతెత్తి ఉంటే బీసీల గురుంచి కవితకు మాట్లాడే అర్హత లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజ్యసభ సభ్యులు, బీసీ నేత ఆర్.కృష్ణయ్య అంటే గౌరవమని,
డిల్లీ కి వస్తాం.. మీరు ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోండి అందరం కలిసి వెళదామని చెప్పారు. మీ తమ్ముడిగా రీక్వెస్ట్ చేస్తున్నా ఆర్. కృష్ణయ్య కు
మా నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా బీసీ విజన్ గురించి బల్ల గుద్ది చెబుతున్నారు. కవిత సత్రంలో భోజనం పెడుతుంటే కూడా సిఫార్సు లెటర్ కావాలి అనే రకమని, సన్నాయి నొక్కులు నొక్కితే అర్థమే లేదన్నారు. సీఎం రేవంత్, టీపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నుంచి క్యాబినెట్ వరకు క్లియర్ కట్ గా ఉన్నామని, పదేళ్ల లో బిఆర్ఎస్ బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.
కేసీఆర్ కావొచ్చు ఆయన చుట్టూ ఉన్న దెయ్యాలు కావొచ్చు  ఎవరైనా సరే బీసీల కోసం మాతో కలిసి రావాలని, బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందన్నారు. బలహీన వర్గాలను పట్టించుకోని కవితతో కూర్చొని మద్దతు గురుంచి కృష్ణయ్య మాట్లాడటం సమంజసం కాదు. బీసీ బిల్లుకి రాజకీయ రంగు పులమడం సబబు కాదు
తెలంగాణలో 56 శాతం బీసీలు ఉన్నారు అన్నది క్లియర్.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ మార్గదర్శకం లో సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీ బిల్లును చట్టం రూపంలో చేసుకొని గవర్నర్ కు పంపించడం జరిగిందన్నారు.

]]>
Mon, 23 Jun 2025 21:26:18 +0530 admin
తొలి మ‌హిళా కండ‌క్ట‌ర్లను అభినందించిన ఆర్టీసీ యాజ‌మాన్యం https://prajakshethrenews.com/తొలి-మహిళా-కండక్టర్లను-అభినందించిన-ఆర్టీసీ-యాజమాన్యం https://prajakshethrenews.com/తొలి-మహిళా-కండక్టర్లను-అభినందించిన-ఆర్టీసీ-యాజమాన్యం తొలి మ‌హిళా కండ‌క్ట‌ర్లను అభినందించిన  ఆర్టీసీ యాజ‌మాన్యం
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 23 :
ఆర్టీసీలో తొలి మ‌హిళా కండ‌క్ట‌ర్లుగా విధుల్లో చేరి 28 ఏళ్ల ఉత్త‌మ స‌ర్వీసును పూర్తి చేసుకున్న ముగ్గురిని యాజ‌మాన్యం అభినందించింది. హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్‌లో దిల్‌సుఖ్‌న‌గ‌ర్ డిపోన‌కు చెందిన శ్రీదేవి, అనిత, మెహిదిప‌ట్నం డిపో శార‌ద‌ను సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ స‌న్మానించారు. ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి వారికి ప్ర‌శంసాప‌త్రాల‌ను అంద‌జేశారు. ఎన్నో ఏళ్లుగా ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో స‌మ‌ర్థ‌వంతంగా విధులు నిర్వ‌ర్తిస్తోన్న మ‌హిళా కండ‌క్ట‌ర్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన అసోసియేష‌న్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ‌ర్ టేకింగ్స్(ASRTU) అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఇటీవ‌ల న్యూఢిల్లీలో స‌త్క‌రించింది. అందులో టీజీఎస్ఆర్టీసీ నుంచి కండ‌క్ట‌ర్లు శ్రీదేవి, అనిత, శార‌ద ఉన్నారు.  ఈ నేప‌థ్యంలో ఆర్టీసీలో వారి సేవ‌ల‌ను కొనియాడుతూ యాజ‌మాన్యం స‌న్మానించింది. ఈ స‌న్మాన కార్య‌క్ర‌మంలో సంస్థ ఈడీ మునిశేఖ‌ర్, సీపీఎం ఉషా దేవి, దిల్ సుఖ్ నగర్ డీఎం సమత, త‌దిత‌రులు పాల్గొన్నారు.

]]>
Mon, 23 Jun 2025 20:59:29 +0530 admin
ఆర్టీసీ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే చట్టపరమైన చ‌ర్య‌లు : టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ https://prajakshethrenews.com/ఆర్టీసీ-సిబ్బందిపై-దాడులకు-పాల్పడితే-చట్టపరమైన-చర్యలు-టీజీఎస్ఆర్టీసీ-ఎండీ-వీసీ-సజ్జనర్ https://prajakshethrenews.com/ఆర్టీసీ-సిబ్బందిపై-దాడులకు-పాల్పడితే-చట్టపరమైన-చర్యలు-టీజీఎస్ఆర్టీసీ-ఎండీ-వీసీ-సజ్జనర్ ఆర్టీసీ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే చట్టపరమైన చ‌ర్య‌లు
               టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్
                దాడికి గురైన డ్రైవ‌ర్‌కు పరామర్శ
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 23 :
త‌మ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే ఎంతటి వారికైనా చట్టపరమైన చర్యలు తప్పవని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ హెచ్చ‌రించారు. పోలీస్ శాఖ స‌హ‌కారంతో బాధ్యులపై రౌడీ షీట్స్ తెరుస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బండ్లగూడ డిపో డ్రైవర్ విద్యా సాగర్ ను వీసీ స‌జ్జ‌న‌ర్  సోమవారం ప‌రామ‌ర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును ఆయ‌న‌ను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ డ్రైవర్ కు టీజీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. మెహదీపట్నం నుంచి ఎల్బీ నగర్ వెళ్తున్న రూట్ నంబ‌ర్ 300 ఆర్డినరీ బ‌స్సు కింద బైక్ పడి ఒక గర్భిణి మృతి చెందారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు డోర్ ఒక్కసారిగా తెరవడంతో బైక్ అదుపు తప్పి బస్సు వెనుక టైర్ల కింద పడింది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 198 వ‌ద్ద ఈ నెల 19న ప్రమాదం జరిగిన విషయం విధితమే.ఈ రోడ్డు ప్రమాదంలో ఎలాంటి తప్పు లేకున్నా డ్రైవ‌ర్ విద్యా సాగర్ పై కొందరు  విచ‌క్ష‌ణ‌ర‌హితంగా దాడి చేశారు. అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషిస్తూ  తీవ్రంగా కొట్టారు. విధులు ముగించుకుని ఇండ్లకు వెళ్తున్న ఆర్టీసీ కానిస్టేబుళ్లు  భాస్కర్, ముఫకర్ అలీ లు డ్రైవర్ ను తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అప్పటికే తీవ్ర గాయ‌ల‌వ‌డంతో అక్కడి నుంచి  తార్నాకలోని ఆర్టీసీ ఆస్ప‌త్రికి డ్రైవర్ ను త‌ర‌లించారు. ఈ ప్రమాదంలో తమ డ్రైవ‌ర్‌ది ఎలాంటి తప్పులేదని, ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీజీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయ‌డం బాధాక‌ర‌మ‌ని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు.ఈ ఘటనపై ఆర్టీసీ అధికారుల పిర్యాదు మేరకు దుండగులపై సైబరాబాద్ కమిషనరేట్ అత్తాపూర్ పోలీసులు బీఎన్ఎస్‌లోని 121(1), 126(2), 115(2) 352, 351(2) ) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశార‌న్నారు. తమ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను యాజమాన్యం ఏమాత్రం సహించబోదని, నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

]]>
Mon, 23 Jun 2025 20:54:26 +0530 admin
బిజెపి ఎంపి రఘునందన్‌రావుకు బెదిరింపు కాల్ https://prajakshethrenews.com/బిజెపి-ఎంపి-రఘునందన్రావుకు-బెదిరింపు-కాల్ https://prajakshethrenews.com/బిజెపి-ఎంపి-రఘునందన్రావుకు-బెదిరింపు-కాల్ బిజెపి ఎంపి రఘునందన్‌రావుకు బెదిరింపు కాల్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 23 :
బిజెపి ఎంపి రఘునందన్‌రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. ఆయన్ను సాయంత్రంలోగా చంపేస్తామంటూ పీపుల్ వార్ మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసి బెదిరించారు. ఈ ఫోన్‌ కాల్‌ను రఘునందన్‌రావు పిఎ ఎత్తాడు. తాను మధ్యప్రదేశ్‌కి చెందిన మావోయిస్టునని ఆగంతకుడు చెప్పాడు. దమ్ముంటే కాపాడుకోండని రఘునందన్‌ను అతడు బెదిరించాడు.మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపి రఘునందన్‌  పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఆయనకు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే రఘునందన్‌ రావు అప్రమత్తమై తెలంగాణ డిజిపి జితేందర్‌, సంగారెడ్డి ఎస్పి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ 912143352974 అనే నెంబర్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఎంపి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్ వచ్చిన నెంబర్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.

]]>
Mon, 23 Jun 2025 20:48:13 +0530 admin
స్వదేశానికి వచ్చే ప్రతి తెలంగాణవాసికి అన్ని ఏర్పాట్లు చేయండి సీ ఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/స్వదేశానికి-వచ్చే-ప్రతి-తెలంగాణవాసికి-అన్ని-ఏర్పాట్లు-చేయండి-సీ-ఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/స్వదేశానికి-వచ్చే-ప్రతి-తెలంగాణవాసికి-అన్ని-ఏర్పాట్లు-చేయండి-సీ-ఎం-రేవంత్-రెడ్డి స్వదేశానికి వచ్చే ప్రతి తెలంగాణవాసికి అన్ని ఏర్పాట్లు చేయండి సీ ఎం రేవంత్ రెడ్డి

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలను అనుసరించి, తెలంగాణ ప్రభుత్వం మిడిల్ ఈస్ట్ సంక్షోభాన్ని నిశితంగా పర్యవేక్షిస్తూ, ప్రభావిత ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే తెలంగాణ పౌరులకు పూర్తి సహాయాన్ని అందిస్తోంది.సమన్వయంతో కూడిన ప్రయత్నంతో, ఆరుగురు తెలంగాణ విద్యార్థులు నిన్న అర్ధరాత్రి న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. వీరిలో నలుగురు ఇరాన్ నుంచి, ఇద్దరు ఇజ్రాయెల్ నుంచి సురక్షితంగా వచ్చారు. అందరూ హైదరాబాద్‌కు ముందస్తు విమానాలను బుక్ చేసుకోగా, ఈ రోజు ఉదయం 5:30 గంటలకు హైదరాబాద్ బయలుదేరే వరకు తెలంగాణ భవన్ సిబ్బంది వారికి సహాయం చేశారు.మరో ఏడుగురు తెలంగాణ పౌరులు ఇజ్రాయెల్ నుంచి జోర్డాన్‌లోని అమ్మాన్‌కు సురక్షితంగా చేరుకున్నారు. త్వరలోనే న్యూఢిల్లీకి చేరుకోనున్న వీరి కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.ఇజ్రాయెల్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడం వల్ల ఇబ్బందులు తలెత్తినప్పటికీ, ఈ సవాళ్లను అధిగమించి, ప్రభావిత పౌరులందరికీ సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సంబంధిత అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతర సమన్వయంతో పనిచేస్తోంది.స్వదేశానికి వచ్చే ప్రతి తెలంగాణ నివాసికి సకాలంలో సహాయం, సరైన వసతి, తదుపరి ప్రయాణ సౌకర్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి  అధికారులను ఆదేశించారు.పౌరులంతా అధికారిక మార్గాలనే అనుసరించాలని, ధృవీకరించని సమాచారంపై ఆధారపడరాదని సూచనలు జారీ అయ్యాయి. ఈ క్లిష్ట సమయంలో తెలంగాణ ప్రభుత్వం పౌరులకు అండగా నిలుస్తూ వారి భద్రతకు, త్వరితగతిన స్వదేశానికి రప్పించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.

]]>
Mon, 23 Jun 2025 19:46:34 +0530 admin
కాళేశ్వరం అవినీతి నుండి బయటపడేందుకు బీఆర్ఎస్ నేతలు అపసోపాలు : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ https://prajakshethrenews.com/కాళేశ్వరం-అవినీతి-నుండి-బయటపడేందుకు-బీఆర్ఎస్-నేతలు-అపసోపాలు-ఎన్వీఎస్ఎస్-ప్రభాకర్ https://prajakshethrenews.com/కాళేశ్వరం-అవినీతి-నుండి-బయటపడేందుకు-బీఆర్ఎస్-నేతలు-అపసోపాలు-ఎన్వీఎస్ఎస్-ప్రభాకర్ కాళేశ్వరం అవినీతి నుండి బయటపడేందుకు బీఆర్ఎస్ నేతలు అపసోపాలు
     బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
హైదరాబాద్ జూన్ 23 :
కాళేశ్వరం అవినీతి నుండి బయటపడేందుకు బీఆర్ఎస్ నేతలు అపసోపాలు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ  బీఆర్ఎస్ నేతలారా....కాళేశ్వరం ఎంత డొల్ల ప్రాజెక్టో ఎన్డీఎస్ఏ నివేదికను చదివి తెలుసుకోండిఐఐటిలో చదువుకున్న అత్యున్నత మేధావులు, నిపుణుల బ్రుందం కాళేశ్వరం సందర్శించి లోపాలను ఎత్తి చూపిందికాళేశ్వరంలో జరిగిన అక్రమాలు, నాణ్యతా లోపాలు, మొరాయించిన మోటార్లు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పిందన్నారు.అయినా ఎన్డీఎస్ఏ నివేదికను బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టడాన్ని ఖండిస్తున్నాపీసీ ఘోష్ కమిషన్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కారుకూతలు కూశారు,బీఆర్ఎస్ నేతల అవినీతిని బీజేపీ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదుకాళేశ్వరంపై సీబీఐ విచారణ జరగాలని రాహుల్ గాంధీ చెప్పిన మాటలను మార్చిపోయారాఅసెంబ్లీలోపల, బయట కూడా సీఎం, మంత్రులు కాళేశ్వరం అవినీతిపై మాట్లాడారు కదా?పీసీ ఘోష్ కమిషన్ విచారణను నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.బీఆర్ఎస్ చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదుకాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రబాకర్  డిమాండ్ చేశారు.

]]>
Mon, 23 Jun 2025 19:33:36 +0530 admin
బిఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయింది : బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ https://prajakshethrenews.com/బిఆర్ఎస్-అవినీతిలో-కూరుకుపోయింది-బిజెపి-ఎంపి-ధర్మపురి-అర్వింద్ https://prajakshethrenews.com/బిఆర్ఎస్-అవినీతిలో-కూరుకుపోయింది-బిజెపి-ఎంపి-ధర్మపురి-అర్వింద్ బిఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయింది
బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్
సిఎం రేవంత్ రెడ్డి ఉదయం బిఆర్ఎస్ ను బెదిరించి సాయంత్రం ములాఖత్ అవ్వొద్దు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 23 :
 బిఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. బిఆర్ఎస్ నేతలను రప్పా,రప్పా జైలులో వేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి ఉదయం బిఆర్ఎస్ ను బెదిరించి   సాయంత్రం ములాఖత్ అవ్వొద్దు అని సూచించారు. ములాఖత్ అయితే కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవు అని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తప్ప, ఎవరూ గెలవరు అని చెప్పారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు ఓటమి తప్పదు అని హెచ్చరించారు. ఈ నెల 29న జిల్లాలో అమిత్ షా పర్యటన చేయనున్నారని ఎంపి అర్వింద్ పేర్కొన్నారు.

]]>
Mon, 23 Jun 2025 19:20:17 +0530 admin
యానిమల్ కారిడార్ గా మణుగూరు&కొత్తగూడెం రైల్వే మార్గం https://prajakshethrenews.com/యానిమల్-కారిడార్-గా-మణుగూరు-కొత్తగూడెం-రైల్వే-మార్గం https://prajakshethrenews.com/యానిమల్-కారిడార్-గా-మణుగూరు-కొత్తగూడెం-రైల్వే-మార్గం యానిమల్ కారిడార్ గా మణుగూరు-కొత్తగూడెం రైల్వే మార్గం
ప్రజా క్షేత్ర్, ఖమ్మం, జూన్ 23 :
తెలంగాణలోని మణుగూరు-కొత్తగూడెం రైల్వే మార్గాన్ని వన్యప్రాణి కారిడార్‌గా గుర్తించేందుకు అటవీ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటీవల రైలు ప్రమాదంలో అడవిదున్న మృతి చెందిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. 48 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ మార్గంలో 52 రకాల జంతువులు సంచరిస్తున్నట్లు గుర్తించారు. కారిడార్ ఏర్పాటుతో వన్యప్రాణులకు రక్షణ కల్పించనున్నారు. రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, జంతువుల సంచారాన్ని పర్యవేక్షించనున్నారుతెలంగాణలోని మణుగూరు-కొత్తగూడెం (భద్రాచలం రోడ్) మధ్య ఉన్న రైల్వే మార్గాన్ని వన్యప్రాణి కారిడార్‌గా గుర్తించే ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ కీలక నిర్ణయం అడవుల గుండా వెళ్లే రైలు మార్గాల వల్ల వన్యప్రాణులకు తలెత్తుతున్న ప్రమాదాలను నివారించడంలో.. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలో గణనీయమైన ముందడుగు. ఇటీవల మణుగూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఒక అడవిదున్న రైలు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతి చెందడంతో.. అటవీ శాఖ అధికారులు ఈ విషయంలో మరింత అప్రమత్తమయ్యారు. ఇలాంటి విషాద సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని వారు పట్టుదలగా ఉన్నారు.మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, కిన్నెరసాని డివిజన్ల పరిధిలో లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం గుండా 48 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్ వెళ్తుంది. ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లతో పాటు, సింగరేణి నుంచి బొగ్గు రవాణా చేసే గూడ్సు రైళ్లు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. రైల్వే లైన్లు అటవీ ఆవాసాలను ఛిన్నాభిన్నం చేసి, వన్యప్రాణుల స్వేచ్ఛా సంచారాన్ని అడ్డుకోవడమే కాకుండా, వాటికి ప్రత్యక్ష మరణాలకు కారణమవుతాయి. అందువల్ల, అడవుల గుండా వెళ్లే రైల్వే మార్గాలకు వన్యప్రాణి కారిడార్లు అత్యవసరం. ఇవి జంతువులు సురక్షితంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లేందుకు వీలు కల్పిస్తాయి.. తద్వారా వాటి ఆవాసాల విభజనను నిరోధించి, జన్యు వైవిధ్యాన్ని కాపాడతాయి.వన్యప్రాణుల సంచారంపై అవగాహన పెంచుకోవడానికి అటవీ శాఖ అధికారులు రైలు మార్గంలో ఒక సమగ్ర సర్వేను నిర్వహించారు. ఈ నివేదికను వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ డిపార్ట్‌మెంట్‌కు సమర్పించారు. అక్కడి నుంచి ఇది రైల్వే శాఖ ఉన్నతాధికారులకు వెళ్లనుంది. సర్వే వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. నెల రోజుల పరిశీలనలోనే సుమారు 52 రకాల జంతువులు, వివిధ పక్షులు ఈ ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, 110 సీసీ కెమెరాలను ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, దాదాపు 200 సార్లు జంతువులు, పక్షులు సంచరించిన దృశ్యాలను నమోదు చేశారు. ఈ దృశ్యాలను వన్యప్రాణుల డిపార్ట్‌మెంట్‌కు అందజేశారు.ఈ అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణ, వాటి నీటి అవసరాల కోసం ఇటీవల అనేక చర్యలు చేపట్టారు. అడవి జంతువుల అభివృద్ధి కోసం గడ్డి మైదానాలను ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి వరకు చెక్‌డ్యాంలు, సోలార్ బోర్లు, నీటి తొట్లను అమర్చారు. దీనివల్ల మూగజీవుల సంచారం మరింత పెరిగింది. అయితే అదే సమయంలో రైలు ప్రమాదాల ముప్పు కూడా ఎక్కువైంది.రైల్వే శాఖ ఏదైనా మార్గాన్ని యానిమల్ కారిడార్‌గా ప్రకటిస్తే.. ఆ మార్గంలో వన్యప్రాణులు రైల్వే ట్రాక్‌లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగా.. రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా ఫెన్సింగ్‌ (కంచె) ఏర్పాటు చేస్తారు. ఇది జంతువులు పట్టాలపైకి రాకుండా అడ్డుకుంటుంది. అయినప్పటికీ సమస్య తీవ్రత తగ్గకుంటే.. లేదా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పరిస్థితులు ఉంటే, సెక్యూరిటీ సిబ్బందిని నియమించి వన్యప్రాణుల సంచారాన్ని పర్యవేక్షిస్తారు. లోకోపైలెట్లకు ముందుగానే సమాచారం అందిస్తారు. అవసరమైతే.. రైళ్ల వేగాన్ని తగ్గించడం, లేదా అండర్‌పాస్‌లు, ఓవర్‌పాస్‌లు వంటి నిర్మాణాలు చేపట్టడం ద్వారా జంతువులు సురక్షితంగా దాటేందుకు వీలు కల్పిస్తారు. ఇటీవల అడవి దున్న రైల్వే ప్రమాదంలో మృతి చెందడంతో సర్వే నిర్వహించామని ఎఫ్డీఓ(FDO) మక్సూద్ తెలిపారు. అందుకే ఈ ప్రాంతాన్ని యానిమల్ కారిడార్‌గా గుర్తించేందుకు రిపోర్ట్ పంపినట్లు పేర్కొన్నారు. ఈ ప్రయత్నం మణుగూరు-కొత్తగూడెం రైల్వే మార్గంలో వన్యప్రాణుల భద్రతను గణనీయంగా పెంచుతుంది. ఇది మానవ-వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడంలో, తెలంగాణలోని అటవీ సంపదను, జీవవైవిధ్యాన్ని కాపాడటంలో ఒక ఆదర్శప్రాయమైన అడుగు అవుతుంది. ఇలాంటి కారిడార్లు భవిష్యత్తులో దేశంలోని ఇతర అటవీ మార్గాలకు కూడా ఒక నమూనాగా నిలుస్తాయి.

]]>
Mon, 23 Jun 2025 13:45:09 +0530 admin
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన డా. దత్తాత్రేయుడు https://prajakshethrenews.com/ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డిని-కలిసిన-డా-దత్తాత్రేయుడు https://prajakshethrenews.com/ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డిని-కలిసిన-డా-దత్తాత్రేయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన డా. దత్తాత్రేయుడు

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి ని ప్రముఖ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ని కలిసిన డా. దత్తాత్రేయుడు , విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, కృషిని అభినందించారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టం అభివృద్ధిలో ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.

]]>
Sun, 22 Jun 2025 16:17:23 +0530 admin
మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపర్చడం వెనుక పెద్ద కుట్ర : కేంద్రమంత్రి బండి సంజయ్ https://prajakshethrenews.com/మల్లెపూలు-పెట్టుకునే-మహిళలను-కించపర్చడం-వెనుక-పెద్ద-కుట్ర-కేంద్రమంత్రి-బండి-సంజయ్ https://prajakshethrenews.com/మల్లెపూలు-పెట్టుకునే-మహిళలను-కించపర్చడం-వెనుక-పెద్ద-కుట్ర-కేంద్రమంత్రి-బండి-సంజయ్ మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపర్చడం వెనుక పెద్ద కుట్ర
అన్యమతంలోకి మార్చడమే వారి లక్ష్యం
హిందూ ధర్మంపై దాడిని తిప్పికొట్టండి
రామచంద్రమిషన్ చేస్తున్న సేవలు భేష్...
యోగా... ప్రపంచానికి మోదీ అందించిన మహా ‘యోగం’
కరీంనగర్ జిల్లాలో యోగా వేడుకులల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్
ప్రజా క్షేత్ర్, కరీంనగర్ :
మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ ఆంధ్రాలో కొందరు చేస్తున్న వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర కోణం దాగి ఉందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇట్లాంటి వ్యాఖ్యలతో హిందూ మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి అన్యమతంలోకి మార్చుకోవాలనే కుట్ర జరుగుతోందన్నారు. ఇది ముమ్మాటికీ హిందూ ధర్మంపై జరిగిన దాడిగా భావించి తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో తిమ్మాపూర్ మండలం రామక్రిష్ణాకాలనీలోని రామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన యోగా వేడుకలకు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ అన్ని టెన్షన్లు దూరం చేసిన మానసిక ప్రశాంతత కలిగించే శక్తి యోగా, ధ్యాన ప్రక్రియలకు ఉందని చెప్పారు. ఈ విషయంలో రామచంద్ర మిషన్ చేస్తున్న సేవలను కొనియాడారు. హిందూ ధర్మ రక్షణ కోసం రామచంద్ర మిషన్ చేస్తున్న సేవలు ఎనలేనివని అభిప్రాయపడ్డారు. ఇవాళ ప్రపంచలోని 200 దేశాలకుపైగా ప్రజలు యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నారంటే మోదీ చేసిన కృషి, మన దేశ సంస్క్రుతి, సాంప్రదాయాలపట్ల ఉన్న నిబద్దతే కారణమని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశాల మధ్య చూసినా ఉద్రిక్త పరిస్థితులే కన్పిస్తున్నాయని రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్ ఇరాన్ యుద్దాలతోపాటు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద చర్యలతో ప్రపంచమంతా ఆందోళన చెందుతోందన్నారు. ఇటువంటి తరుణంలో దేశాల మధ్య, మనుషుల మధ్య వైరం తగ్గించడానికి ‘యోగా’ ఎంతో మేలు చేస్తుందని, టెన్షన్లను దూరం చేసి మానసిక, ఆధ్యాత్మిక ప్రశాంతత కలిగించే సాధనమే యోగా అని స్పష్టం చేశారు.

]]>
Sun, 22 Jun 2025 10:56:37 +0530 admin
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.. వరంగల్ కు తరలింపు https://prajakshethrenews.com/ఎమ్మెల్యే-పాడి-కౌశిక్-రెడ్డి-అరెస్ట్-వరంగల్-కు-తరలింపు https://prajakshethrenews.com/ఎమ్మెల్యే-పాడి-కౌశిక్-రెడ్డి-అరెస్ట్-వరంగల్-కు-తరలింపు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.. వరంగల్ కు తరలింపు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని, వరంగల్ కు తరలించారు. ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదుచేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించే అవకాశం ఉంది. మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడని అతని భార్య సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

]]>
Sat, 21 Jun 2025 09:36:10 +0530 admin
ఆ ఐదు గ్రామాలు ఇచ్చేయండి : ఎమ్మెల్సీ కవిత https://prajakshethrenews.com/ఆ-ఐదు-గ్రామాలు-ఇచ్చేయండి-ఎమ్మెల్సీ-కవిత https://prajakshethrenews.com/ఆ-ఐదు-గ్రామాలు-ఇచ్చేయండి-ఎమ్మెల్సీ-కవిత  ఆ ఐదు గ్రామాలు ఇచ్చేయండి : ఎమ్మెల్సీ కవిత
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 20
పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురవుతున్న ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ నెల 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించ తలపెట్టిన 'ప్రగతి ఎజెండా' సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేయాలని ఆమె కోరారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అంశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడే తాము వ్యతిరేకించామని కవిత గుర్తుచేశారు. అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రాజెక్టును ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిందని ఆమె అన్నారు."2014లో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి తెలంగాణకు చెందిన ఏడు మండలాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించారు. దీంతోపాటు 460 మెగావాట్ల సామర్థ్యం ఉన్న లోయర్‌ సీలేరు పవర్‌ ప్రాజెక్టును కూడా ఏపీకే ఇచ్చేశారు" అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పార్లమెంటులో పోరాటం చేశామని, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బంద్‌కు పిలుపునిచ్చినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె విమర్శించారు.పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకుంటూ పోవడం వల్ల ముంపు సమస్య తీవ్రమవుతోందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మానవీయ కోణంలో ఆలోచించి, తక్షణమే పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కిచెప్పారు.ముఖ్యంగా పురుషోత్తమపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకులపాడు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. "రాబోయే జూన్ 25వ తేదీన ప్రధాని మోదీ నాలుగు రాష్ట్రాల సీఎంలతో 'ప్రగతి ఎజెండా' పేరిట సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో ఈ ఐదు పంచాయతీలను తెలంగాణకు తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించాలి" అని కవిత స్పష్టం చేశారు.

]]>
Fri, 20 Jun 2025 19:42:13 +0530 admin
5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇస్తున్నట్లు ప్రకటించాలి : ఎమ్మెల్సి కవిత https://prajakshethrenews.com/5-గ్రామాలను-తిరిగి-తెలంగాణకు-ఇస్తున్నట్లు-ప్రకటించాలి-ఎమ్మెల్సి-కవిత https://prajakshethrenews.com/5-గ్రామాలను-తిరిగి-తెలంగాణకు-ఇస్తున్నట్లు-ప్రకటించాలి-ఎమ్మెల్సి-కవిత  5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇస్తున్నట్లు ప్రకటించాలి : ఎమ్మెల్సి కవిత
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 20 :
ఈ నెల 25న 4 రాష్ట్రాల సిఎంలతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సమావేశం ఏర్పాటు చేయాలని, సమావేశంలో 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇస్తున్నట్లు ప్రకటించాలని కోరారు. 5 గ్రామాల్లో వెనక్కి తీసుకొచ్చేలా సిఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని, కరకట్టల ఎత్తు పెంచుకోవాలని, లేకపోతే రక్షణ ఉండదని తెలియజేశారు. భారీ వరదలు వస్తే ఆయా గ్రామాలు మునిగిపోతాయని కవిత పేర్కొన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని బిఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత తెలిపారు. 5 గ్రామాల ప్రజలకు అనారోగ్యం వస్తే గుంటూరు ఆసుపత్రికి వెళ్లాలని అన్నారు.

]]>
Fri, 20 Jun 2025 15:40:41 +0530 admin
యోగా చేస్తే యోగ్యులు అవుతారు : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు https://prajakshethrenews.com/యోగా-చేస్తే-యోగ్యులు-అవుతారు-మాజీ-ఉపరాష్ట్రపతి-వెంకయ్యనాయుడు https://prajakshethrenews.com/యోగా-చేస్తే-యోగ్యులు-అవుతారు-మాజీ-ఉపరాష్ట్రపతి-వెంకయ్యనాయుడు యోగా చేస్తే యోగ్యులు అవుతారు
     మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 20 :
 యోగా చేస్తే యోగ్యులు అవుతారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఎల్బి స్టేడియంలో జరిగిన యోగా కౌంట్‌డౌన్ కార్యక్రమంలో భాగంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. మానసిక శక్తులను ఏకం చేసేది యోగా అని ప్రశంసించారు. విశ్వమంతా పరిపూర్ణ ఆరోగ్యంతో, శాంతితో ముందుకు సాగాలన్నదే యోగ దినోత్సవ సంకల్పమని స్పష్టం చేశారు. యోగాకు మతం లేదు జాతి లేదని, యోగా మన జీవన విధానమని తెలియజేశారు. ప్రపంచంలోనే అద్భుత సాహసం ఆపరేషన్ సింధూర్ అని కొనియాడారు.ఒకే భూమి… ఒకటే ఆరోగ్యం కోసం యోగ అని అనే సంకల్పంతో ఈ ఏడాది యోగ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని, మనమంతా ఇదే సంకల్పాన్ని తీసుకుని వసుధైవ కుటుంబ భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యోగ మార్గాన్ని సాధన చేస్తూ ముందుకు సాగుతున్నారని,  విదేశీయులంతా యోగ మార్గాన్ని తలకెత్తుకుని ముందుకు సాగుతుంటే, ఈ నేల మీద పుట్టిన మనం యోగ మార్గానికి ఇంకెంత గౌరవం ఇవ్వాలో ఒక్కసారి ఆలోచించుకోవాలని, యోగ మార్గాన్ని అనుసరించవలసిందిగా వెంకయ్యనాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, వెంకయ్యనాయుడు..కిషన్‌రెడ్డి, భూపతిరాజు శ్రీనివాసవర్మ, సినీనటులు కుష్బూ, మీనాక్షి చౌదరి హాజరయ్యారు.

]]>
Fri, 20 Jun 2025 15:35:05 +0530 admin
జూరాల ప్రాజెక్టు వరద నీటితో జలకళ https://prajakshethrenews.com/జూరాల-ప్రాజెక్టు-వరద-నీటితో-జలకళ https://prajakshethrenews.com/జూరాల-ప్రాజెక్టు-వరద-నీటితో-జలకళ జూరాల ప్రాజెక్టు వరద నీటితో జలకళ
ప్రజా క్షేత్ర్, మహబూబ్ నగర్ జూన్ 20 :
 ఉమ్మడి పాలమూరు జిల్లాకు వర ప్రదాయినిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వరద నీటితో జలకళ సంతరించుకుంది. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణానదికి వరదలు వస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు నిండడంతో అక్కడి నుంచి జూరాలకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరడంతో అధికారులు 10 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలారు.

]]>
Fri, 20 Jun 2025 15:28:36 +0530 admin
వాసాల మర్రిని దత్తత తీసుకొని ఆగం చేసిన కేసీఆర్ : మంత్రి పొంగులేటి https://prajakshethrenews.com/వాసాల-మర్రిని-దత్తత-తీసుకొని-ఆగం-చేసిన-కేసీఆర్-మంత్రి-పొంగులేటి https://prajakshethrenews.com/వాసాల-మర్రిని-దత్తత-తీసుకొని-ఆగం-చేసిన-కేసీఆర్-మంత్రి-పొంగులేటి వాసాల మర్రిని దత్తత తీసుకొని ఆగం చేసిన కేసీఆర్ : మంత్రి పొంగులేటి

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
మాజీ సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామంలో ప్రభుత్వ సొమ్ముతో భోజనం చేసి, గ్రామస్తులకు అబద్ధపు హామీలు ఇచ్చి, తన స్వార్ధ రాజకీయంతో గ్రామస్తులు అందరిని మోసం చేసి వాసాలమర్రిని ఆగం ఆగం చేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలోని 227 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన మంత్రికి ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గతంలో మాజీ సీఎం కేసీఆర్ తో కలిసి భోజనం చేసిన ఆకుల ఆగవ్వకు ఇందిరమ్మ ఇంటి మొదటి ప్రొసీడింగ్ పత్రాన్ని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఆమెకు ఇంటిని నిర్మించుకోవడానికి లక్ష రూపాయలను స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అందించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా వాసాలమర్రిని అభివృద్ధి చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని ఆగం చేసిన వాసాలమర్రిని అభివృద్ధి చేద్దామని రేవంత్ రెడ్డి చెప్పినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వాసాలమర్రి గ్రామంలో పేదోడి చిరకాల కోరిక అయిన సొంతింటి కల సాకారం చేశామన్నారు. కేసీఆర్ ఆగం చేసిన వాసాలమర్రిని రేవంత్ ఆదుకుంటున్నాడని చెప్పారు. ఆగవ్వకు అన్నం పెట్టి వాసాలమర్రిని రోల్ మోడల్ గా చేస్తా అని కేసీఆర్ మాటిచ్చి ఆగం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించుకుని ఓట్లు వేయించుకున్నాడే తప్ప ఒక్క ఇల్లు కూడా కట్డించలేదని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ రూ. 8.19 లక్షల కోట్లు అప్పు చేశాడని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతినెల రూ. 6500 కోట్లు అసలు, వడ్డీ కడుతుందని చెప్పారు. ఆర్థిక భారం మీద పడుతున్న భరిస్తూ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ పోతున్నామన్నారు. గ్యాస్, కరెంటు, ఉచిత ఆర్టీసీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ, పేదోడికి సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ ఎందుకు ఇవన్నీ చేయలేకపోయాడని ప్రశ్నించారు. ఇందిరమ్మ ప్రభుత్వమంటేనే ఇందిరమ్మ ఇండ్లని, పేదోడి కలను నిజం చేయడం కోసం ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామన్నారు. రూ.22 వేల 500 కోట్లతో రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదోడి కలను నెరవేర్చుతున్నామని చెప్పారు. ధరణితో ఇబ్బంది పడ్డ రైతులను ఆదుకోవడం కోసం భూభారతి చట్టం తెచ్చామని అన్నారు. ధరణి తెచ్చిన కేసీఆర్ భూములను ఖతం చేసిండని చెప్పారు. భూసమస్యల పరిష్కారం కోసం అధికారులే ఊర్లలోకి వచ్చి సమస్యలు తీర్చుతున్నామని, భూభారతి చట్టం ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తుందన్నారు. ఆగస్టు లోపు భూసమస్యలు మొత్తం పరిష్కరిస్తామని, పేదోడి కష్టాలను తీర్చడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని, ఆలస్యమైనా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. తప్పును ఒప్పుగా.. ఒప్పును తప్పుగా చేసి పదేళ్లు రాష్ట్రాన్ని ఆగం చేసిన కేసీఆర్.. మళ్లీ ప్రజలకు నమ్మించి మోసం చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్రంలో సర్వేయర్ల వ్యవస్థను భలోపేతం చేయడానికి లైసెన్స్ డ్ ఆరు వెల సర్వేయర్లను తీసుకువస్తున్నామన్నారు.

 కేసీఆర్ వల్లకాడు చేసిన వాసాలమర్రిని బాగు చేస్తాం.. బీర్ల అయిలయ్య

కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిని ఆయన వల్లకాడు చేశాడని, ఆ గ్రామాన్ని బాగు చేస్తామని బీర్ల అయిలయ్య అన్నారు. వాసాలమర్రి ప్రజలకు కేసీఆర్ చేసిన గాయాలకు సీఎం రేవంత్ రెడ్డి అయింట్ మెంట్ పెడుతున్నారని, ఫాం హౌస్ కు రోడ్డు కోసం వాసాలమర్రిని కేసీఆర్ వల్లకాడు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.వాసాలమర్రి మాదిరిగానే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేశాడని, వాసాలమర్రిని ఆదుకుంటానని తిర్మలాపూర్ కు వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఇవాళ నిజం చేశాడని చెప్పారు.కేసీఆర్ తెచ్చిన ధరణితో రైతులు ఆగమయ్యారని, అందుకే భూభారతి చట్టాన్ని తెచ్చి రైతులకు చుట్టంగా మార్చిన ఘనుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

]]>
Thu, 19 Jun 2025 19:10:40 +0530 admin
రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఆర్ కృష్ణయ్య https://prajakshethrenews.com/రాష్ట్ర-ప్రభుత్వంపై-మండిపడ్డ-ఆర్-కృష్ణయ్య https://prajakshethrenews.com/రాష్ట్ర-ప్రభుత్వంపై-మండిపడ్డ-ఆర్-కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఆర్ కృష్ణయ్య
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
తూతూ మంత్రంగా బీసీల రిజర్వేషన్లను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టి కాలయాపన చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద 42 శాతం బీసీల రిజర్వేషన్లు అమలుపై ధర్నాను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్న కేంద్రంపై నెట్టి కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా అఖిలపక్ష నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించారా అని నిలదీశారు. ఈ రోజు బిసిల రిజర్వేషన్లపై అలసట వ్యక్తం చేసి కేంద్రం పై రుద్దడం సరికాదన్నారు.  శాసనసభలో బిల్లు ఆమోదం చేసి పార్లమెంటుకు నివేదించి చట్టం చేసినప్పుడే 42 శాతం అమలు అవుతాయని అన్నారు. తమిళనాడులో కూడా ఇలాగే చేస్తే వారికి ఇప్పటివరకు అమలు కాలేదని గుర్తు చేశారు.  ఇప్పటికైనా అన్ని బీసీ సంఘాల నేతలు, అఖిలపక్ష నాయకులు సమావేశమై బీసీల 42 శాతం రిజర్వేషన్లపై గట్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.

]]>
Wed, 18 Jun 2025 19:55:49 +0530 admin
నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్న కేటీఆర్..తిట్టుకుంటున్న ముసలివాళ్ళు : ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ https://prajakshethrenews.com/నీతి-వ్యాఖ్యలు-వల్లిస్తున్న-కేటీఆర్తిట్టుకుంటున్న-ముసలివాళ్ళు-ఫిషరీష్-కార్పొరేషన్-చైర్మన్-మెట్టు-సాయి-కుమార్ https://prajakshethrenews.com/నీతి-వ్యాఖ్యలు-వల్లిస్తున్న-కేటీఆర్తిట్టుకుంటున్న-ముసలివాళ్ళు-ఫిషరీష్-కార్పొరేషన్-చైర్మన్-మెట్టు-సాయి-కుమార్ నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్న కేటీఆర్..తిట్టుకుంటున్న ముసలివాళ్ళు
            ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 18 :
నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్న కేటీఆర్ ను చూసి భార్య భర్తల ఫోన్లు ఎలా వింటాడని కేటీఆర్ ను 65 ఏండ్ల ముసలివాళ్ళు తిడుతున్నారని ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విమర్శించారు. బుదవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పరువు బజారున పడేసినందుకు కల్వకుంట్ల కుటుంబానికి నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కేటీఆర్ నోరు తెరిస్తే అబద్దమే మాట్లాడుతాడని,బీఆర్ఎస్ పార్టీ అనేది గతంరేవంత్ రెడ్డి అరగంట బీఆర్ఎస్ గురించి ఆలోచిస్తే ఆ పార్టీలో నలుగురు తప్పా ఎవరూ ఉండరన్నారు. కేటీఆర్ కి ఇంగ్లీష్ ఫుల్... సబ్జెక్టు నిల్ కల్వకుంట్ల కుటుంబం రేవంత్ పేరును కోటి సార్లు పలికి ఉంటారు కల్వకుంట్ల కుటుంబం కల్వ కుట్రల కుటుంబం కేటీఆర్ చీప్ గా చిల్లరగా మాట్లాడుతాని ఎద్దేవా చేసారు.

]]>
Wed, 18 Jun 2025 19:22:57 +0530 admin
గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను ప్రారంభించిన సీ ఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/గూగుల్-సేఫ్టీ-ఇంజనీరింగ్-సెంటర్-ను-ప్రారంభించిన-సీ-ఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/గూగుల్-సేఫ్టీ-ఇంజనీరింగ్-సెంటర్-ను-ప్రారంభించిన-సీ-ఎం-రేవంత్-రెడ్డి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను ప్రారంభించిన సీ ఎం రేవంత్ రెడ్డి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 18 :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ప్రారంభించారు. ఇది భారతదేశంలో మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో టోక్యో (Tokyo) తర్వాత రెండవ సెంటర్ కావడం విశేషం. ఈ సేఫ్టీ సెంటర్ సైబర్‌ సెక్యూరిటీ, ఆన్‌లైన్ భద్రత, AI-ఆధారిత భద్రతా పరిష్కారాలపై పరిశోధన చేస్తుంది. ఇది తెలంగాణ, భారతదేశ డిజిటల్ భద్రతను పెంపొందించడంతోపాటు, వేలాది యువతకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయని.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఈ ప్రాజెక్ట్‌ను హైదరాబాద్‌కు తేవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కేంద్రం భారతదేశానికి సంబంధించిన సైబర్‌ సెక్యూరిటీ సవాళ్లకు పరిష్కారాలను అందిస్తుంది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి భద్రతా హబ్‌గా తీర్చిదిద్దుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది. రేవంత్ రెడ్డి గూగుల్‌తో ఈ భాగస్వామ్యం తెలంగాణ యువతకు, ఇంజనీర్‌లకు, భద్రతా నిపుణులకు విశేష అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు.సైబర్ భద్రత, ఆన్‌లైన్ సెక్యూరిటీ: ఈ కేంద్రం సైబర్‌ సెక్యూరిటీ, ఆన్‌లైన్ భద్రత, AI-ఆధారిత భద్రతా పరిష్కారాలపై పరిశోధన చేస్తుంది. ఇది భారతదేశం, తెలంగాణకు అవసరమైన సైబర్ భద్రతా సవాళ్లకు పరిష్కారాలను అందిస్తుంది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి భద్రతా హబ్‌గా మార్చడంలో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుంది.ఈ కేంద్రం వల్ల యువతకు, ఇంజనీర్‌లకు, భద్రతా నిపుణులకు వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ భద్రత, సాంకేతిక వికాసం, ఇన్నోవేషన్‌లను పెంపొందిస్తుంది. గూగుల్‌తో భాగస్వామ్యం వల్ల తెలంగాణకు ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ ఎక్స్పోజర్ లభిస్తుంది.
గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయింది. నేడు, మన జీవితాలు పూర్తిగా డిజిటల్ మారాయి. మనం గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందుతున్నాం. మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్ గా మారాయి. డిజిటల్ సురక్షితంగా ఉంటే, మనం మరింత అభివృద్ధి చెందుతాం.  అధునాతన సైబర్ సెక్యూరిటీ , భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్-సెక్యూరిటీ హబ్‌ను ఉపయోగిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇది నైపుణ్య అభివృద్ధి పై దృష్టి పెడుతుంది. ఉపాధిని సృష్టించడం తో పాటు  దేశం  సైబర్ భద్రతా సామర్థ్యాన్ని పెంచుతుంది. చెడు చేయవద్దన్నది గూగుల్ సంస్థ సిద్ధాంతం ..ఈ విధానాన్ని నేను ఇష్టపడుతున్నాను.
ఇదే తెలంగాణ రైజింగ్
గూగుల్ లాగా, నా ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నాను. ఈ విధానం వల్ల ప్రయోజనాలు కొంత నెమ్మదిగా కనిపిస్తాయి.. అయితే మనం దీర్ఘకాలికంగా దృష్టి పెట్టి పని చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉత్తమ పెట్టుబడి అనుకూల రాష్ట్రం కోసం శోధిస్తే దానికి సమాధానం తెలంగాణ అని వస్తుంది. మీకు సెర్చ్ లో మొదటి లింక్ హైదరాబాద్ వస్తుంది. దీనిని మేము తెలంగాణ రైజింగ్ అని పిలుస్తాము.
1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు
2035 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మేము 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను  చేయాలనుకుంటున్నాం. గూగుల్ ఆఫీస్ పక్క ని రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళ ల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశా మేము మా రైతులను సంపన్నులుగా తయారు చేయడంతో పాటు సంతోషంగా ఉంచాలనుకుంటున్నాం.  మా యువతలో నైపుణ్యాలు పెంచడంతో పాటు  వారికి ఉపాధి కల్పించాలనుకుంటున్నాం. వీటన్నిటికీ, నాకు మీ మద్దతు అవసరం. తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా కావాలని కోరుకుంటున్న. గూగుల్ , హైదరాబాద్ పాత స్నేహితులు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గూగుల్ తన మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. దాదాపు 7,000 మంది గూగుల్ ఉద్యోగులు నేడు హైదరాబాద్‌ను తమ ఇల్లుగా భావిస్తున్నారు. విద్య, భద్రత, మ్యాప్‌లు, ట్రాఫిక్, స్టార్టప్‌లు, ఆరోగ్యం ఇలా  అనేక రంగాలలో గూగుల్ తో కలిసి మేం పనిచేస్తున్నాం. గూగుల్  ఒక వినూత్న సంస్థ, మాది ఒక వినూత్న ప్రభుత్వం. మా ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్‌జెండర్‌లను నియమించాం. GHMC కూడా వివిధ పనుల కోసం ట్రాన్స్‌జెండర్‌లను నియమిస్తుంది. నాణ్యమైన విద్య మా లక్ష్యం.. ఇందుకోసం యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను తీసుకువస్తున్నాం. తెలంగాణ లో ప్రతి సంవత్సరం 1.10 లక్షల ఇంజనీర్స్ కాలేజ్ ల నుంచి వస్తున్నారు. చాలా మంది విద్యార్థులకు నైపుణ్యం ఉండడం లేదు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. పబ్లిక్,ప్రైవేట్ భాగస్వామ్యం లో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నా అందరికీ ఆరోగ్యం మా లక్ష్యం. ఇవే నా ప్రధాన ఆవిష్కరణలు.. గూగుల్ లాగానే, నా ప్రభుత్వంలో భాగస్వాములైన  మహిళలు, యువత, రైతులు, పేదలు, మధ్యతరగతి, సీనియర్ సిటిజన్లు, పిల్లలకు ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ లో మీ కొత్త సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు మరోసారి అభినందిస్తున్నాను. మేం గర్వపడేలా మీరు పనిచేస్తారని నమ్మకం ఉందన్నారు’ సీఎం రేవంత్ రెడ్డి.

]]>
Wed, 18 Jun 2025 18:58:21 +0530 admin
కాంగ్రెస్ పాలనలో మెడికల్ కళాశాలల భవిష్యత్ గందరగోళం : జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత https://prajakshethrenews.com/కాంగ్రెస్-పాలనలో-మెడికల్-కళాశాలల-భవిష్యత్-గందరగోళం-జిల్లా-పరిషత్-తొలి-ఛైర్-పర్సన్-దావ-వసంత https://prajakshethrenews.com/కాంగ్రెస్-పాలనలో-మెడికల్-కళాశాలల-భవిష్యత్-గందరగోళం-జిల్లా-పరిషత్-తొలి-ఛైర్-పర్సన్-దావ-వసంత కాంగ్రెస్ పాలనలో మెడికల్ కళాశాలల భవిష్యత్ గందరగోళం
పాలన వదిలేసి ప్రతీకార చర్యలతోనే ఈ దుస్థితి.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి.
 జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత
ప్రజా క్షేత్ర్, జగిత్యాల : 
 జగిత్యాల మెడికల్ కాలేజీలో మౌలిక వసతులు లేక జాతీయ వైద్య మండలి నోటీసులు జారీ చేయాదంతోనే రాష్ట్రంలోని మెడికల్ కళాశాల ల పరిస్థితి గందరగోళంగా మారిందని తాజా మాజీ జడ్పి చైర్మన్ దావ వసంత అన్నారు. జగిత్యాల  జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్   మాట్లాడారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన ప్రభుత్వం మెడికల్ కాలేజీల భవితవ్యం రేవంత్ రెడ్డి పాలనలో ప్రశ్నార్థకంగా మారిందనీ అన్నారు. జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజ్ కు నోటీసులు రావడం సిగ్గుచేటు అని అన్నారు. జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజీ తో పాటు 26 మెడికల్ కాలేజీల్లో నిబంధనలకు అనుగుణంగా సౌకర్యాలు వసతులు లేకపోవడంపై ఈ నెల 18 న ఎన్. ఎమ్. సి ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని హెల్త్ సెక్రటరీ, డీఎంఈ కి నోటీసులు ఇవ్వడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనం అని అన్నారు. 2014లో స్వరాష్ట్రం ఏర్పడ్డ నాటికి తెలంగాణలో ఐదు ప్రభుత్వ ,15 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వాటిలో 2850 ఎంబిబిఎస్ సీట్లు మాత్రమే ఉండేవి అని అన్నారు తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కో జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో 2023 అక్టోబర్ నాటికి మొత్తం కళాశాలల సంఖ్య 56 సీట్ల సంఖ్య 8340 కి చేరింది అప్పటికి కెసిఆర్ ప్రభుత్వం మరో 8 మెడికల్ కాలేజ్లు మంజూరు చేయడంతో మొత్తం సీట్ల సంఖ్య 9140 కి చేరిందన్నారు.  కానీ కెసిఆర్ సంకల్పానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పోడుస్తుందని అన్నారు. వైద్య కళాశాలలో కనీసం వసతులు కల్పించలేని దుస్థితిలో  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని అన్నారు.
కెసిఆర్  నాయకత్వంలో మొదటి జగిత్యాల మెడికల్ కాలేజ్ కు  పెర్మిషన్ వచ్చింది ఇవాళ కనీసం కనీస అవసరాలు  లేని దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోఎందుకు వచ్చింది  ఇప్పుడు ఉన్న నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదు అని ప్రశ్నించారు. అప్పట్లో జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ వస్తదా అని అన్న నాయకులు కేసీఆర్  సారధ్యంలో కల్వకుంట్ల కవితక్క  కృషి తో జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీనీ సాధించుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు  హయాంలో మెడికల్ కాలేజీకు అన్ని అనుమతులు సాధించుకున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా కూడా కేసీఆర్ ని విమర్శిస్తూనే ఉన్నారు కానీ పాలన మీద దృష్టి సాదించడం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేసి ప్రతికార రాజకీయాలు చేస్తున్నారని ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజీకి కావలసిన  నిధులు విడుదల చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి ఎన్. ఎమ్. సి నిబంధనలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థి జీవితాలను నిలబెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మహేష్, మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్, సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ రావు, రిజ్వాన్, అనురాధ, బాలే చందు తదితరులు పాల్గొన్నారు.

]]>
Wed, 18 Jun 2025 18:53:00 +0530 admin
కవితక్కకు మళ్లీ కోపం వచ్చింది https://prajakshethrenews.com/కవితక్కకు-మళ్లీ-కోపం-వచ్చింది https://prajakshethrenews.com/కవితక్కకు-మళ్లీ-కోపం-వచ్చింది కవితక్కకు మళ్లీ కోపం వచ్చింది
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 18 :
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి రాకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని, లేనిపక్షంలో ఎన్నికలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లకు అనుమతి తీసుకువస్తేనే నామినేషన్లు వేయనిస్తాం. లేదంటే ప్రతి వార్డులో వందల సంఖ్యలో నామినేషన్లు వేసి ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తాం" అని కవిత అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ, మండలిలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపామని, పార్లమెంటులో ఈ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలిపారు. "జులై రెండో వారం వరకు కేంద్రానికి గడువు ఇస్తున్నాం. ఆలోపు అనుమతి రాకపోతే జులై 17 నుంచి రైలు రోకోలు నిర్వహిస్తాం" అని కవిత హెచ్చరించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు, బొల్లాపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అడ్డుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "ఆపరేషన్ కగార్" పైన కూడా ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేసి, మావోయిస్టులతో శాంతియుత చర్చలు జరపాలని ఆమె కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఎన్‌కౌంటర్లు అమానవీయ చర్యలని, ఈ ఆపరేషన్‌ను తమ పార్టీతో పాటు తెలంగాణ ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని కవిత పేర్కొన్నారు. మావోయిస్టు సమస్యకు చర్చలే పరిష్కారమని ఆమె అభిప్రాయపడ్డారు.

]]>
Wed, 18 Jun 2025 18:28:10 +0530 admin
వచ్చే నెలలోనే స్థానిక ఎన్నికలు : సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ https://prajakshethrenews.com/వచ్చే-నెలలోనే-స్థానిక-ఎన్నికలు-సీఎం-రేవంత్-రెడ్డి-క్లారిటీ https://prajakshethrenews.com/వచ్చే-నెలలోనే-స్థానిక-ఎన్నికలు-సీఎం-రేవంత్-రెడ్డి-క్లారిటీ వచ్చే నెలలోనే స్థానిక ఎన్నికలు

సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

వారం..పది రోజుల్లో మంత్రి వర్గ సమావేశంలో తుది నిర్ణయం

కేబినెట్లో నిర్ణయం జరిగేదాకా బయట మాట్లాడొద్దని సూచన

బనకచర్లపై కేంద్రం దగ్గరే తేల్చుకుందామని వెల్లడి.

ఇందుకోసం బుధవారం, గురువారం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయం


 ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :


వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని, ఇందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. వారం, పది రోజుల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామన్నారు. స్థానిక ఎన్నికల విషయంలో కొందరు మంత్రులు చేస్తున్న ముందస్తు ప్రకటనలపై సీఎం అసహనం వ్యక్తంచేశారు. కేబినెట్‎లో ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందే ఎన్నికలపై మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. పైగా ఈ అంశం హైకోర్టులో ఉన్న విషయం గుర్తు పెట్టుకుంటే మంచిదని సూచించారు. మంత్రులు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం చేయకుండా.. స్థానిక ఎన్నికలపై ప్రకటనలు చేయడం ఏంటి? ముందు ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తోందో చెప్పుకోవడంపై దృష్టి పెట్టండి, అంటూ సీఎం అన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్కంట్రోల్ సెంటర్‎లో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికలకు వెళ్లేముందు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు. లీగల్సమస్యలు వస్తే పార్టీ పరంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని మంత్రులకు సూచనప్రాయంగా తెలిపారు. హైకోర్టులో స్థానిక ఎన్నికలపై ఇప్పటికే విచారణ కొనసాగుతోందని, అది త్వరలోనే క్లియర్ అవుతుందని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నెల చివరి వారంలో కేబినెట్ సమావేశం ఏర్పాటుచేసి లోకల్బాడీ ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేశారు. ముందు సర్పంచ్ ఎన్నికలా? లేదంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలా? అనేదానిపై ఆ రోజే డిసైడ్ చేయాలనే అభిప్రాయానికి వచ్చారు.
మంత్రులు పనితీరు మెరుగు పర్చుకోవాలి:
మనది రైతు సంక్షేమ ప్రభుత్వం. ఈసారి వానాకా లం సీజన్ ముందే వచ్చినందున పెట్టుబడి సాయం కూడా ముందే ఇద్దాం. అందుకే రైతు నేస్తం కార్యక్ర మం ద్వారా రైతు భరోసాను కూడా సోమవారం నుంచే ప్రారంభించాం. అని మంత్రులకు సీఎం తెలిపారు. గతానికి భిన్నంగా ఈ సారి జూన్ నెల పూర్తయ్యేలోపే రైతులందరికీ పూర్తిస్థాయిలో రైతు భరోసా నిధులు చెల్లిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పథకాలను మంత్రులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మంత్రులు వారి శాఖల్లో అమలవుతున్న స్కీములు, ఇతర సంస్కరణలు, కార్యక్రమాలపై నెలవారీగా టార్గెట్లు పెట్టుకుని పూర్తి చేయాలని సీఎం సూచించారు.
అప్పుడే పనితీరు మెరుగుపడుతుందన్నారు. డిపార్ట్మెంట్లలో ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాలన్నారు. కొత్తగా వచ్చిన ఇన్చార్జి మంత్రులతో.. ఆయా జిల్లాల మంత్రులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. జోడెడ్ల మాదిరి అభివృద్ధి పనుల్లో ముందుండాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం దగ్గరే తేల్చుకోవాలని డిసైడ్ అయినట్లు సీఎం మంత్రులకు తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి తెలంగాణ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తామని.. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అపాయింట్మెంట్రాగానే ఆయనను కూడా కలుస్తామని సీఎం మంత్రు లకు వివరించారు.

]]>
Wed, 18 Jun 2025 16:45:59 +0530 admin
ఫోన్లు ట్యాప్ చేయడం దుర్మార్గపు చర్య : టిపిసిసి ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ https://prajakshethrenews.com/ఫోన్లు-ట్యాప్-చేయడం-దుర్మార్గపు-చర్య-టిపిసిసి-ఛీఫ్-మహేశ్-కుమార్-గౌడ్ https://prajakshethrenews.com/ఫోన్లు-ట్యాప్-చేయడం-దుర్మార్గపు-చర్య-టిపిసిసి-ఛీఫ్-మహేశ్-కుమార్-గౌడ్ ఫోన్లు ట్యాప్ చేయడం దుర్మార్గపు చర్య
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటివారున్నా శిక్షపడాల్సిందే
టిపిసిసి ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 17 :
 అసెంబ్లీ ఎన్నికల వేళ టిపిసిసి ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన మంగళవారం జూబ్లీహిల్స్ పిఎస్ కు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. తమ ఫోన్లు ట్యాప్ చేసి బిఆర్ఎస్ రాజకీయ లబ్ది పొందిందని, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా అధికారులు, నేతలకు శిక్ష పడాలని సూచించారు. టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ తమ ఫోన్లను ట్యాప్ చేశారని మండిపడ్డారు.రాజకీయనాయకుల ఫోన్లు ట్యాప్   చేయడం హేయమైన చర్య అని ఫోన్ల ట్యాపింగ్ కు పాల్పడిన మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సిగ్గుతో తలవంచుకోవాలని అన్నారు. సుమారు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నేతల ట్యాప్ జరిగిందని, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటివారున్నా శిక్షపడాల్సిందేనని డిమాండ్ చేశారు. రాజకీయ నేతలు, జడ్జిలు, అధికారుల ఫోన్లనూ ట్యాప్ చేశారని, ఫోన్ ట్యాపింగ్ వల్లే కాంగ్రెస్ కొన్ని స్థానాల్లో ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. నక్సల్స్ తో సంబంధం ఉందనే అసత్య ఆరోపణలతో తమ ఫోన్లు ట్యాప్ చేశారని, బిఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసే.. హార్డ్ డిస్కలను ధ్వంసం చేశారని మహేశ్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు.

]]>
Tue, 17 Jun 2025 21:22:39 +0530 admin
మా ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే కుట్ర‌ : సీ ఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/మా-ప్రభుత్వాన్ని-పడగొట్టే-కుట్ర-సీ-ఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/మా-ప్రభుత్వాన్ని-పడగొట్టే-కుట్ర-సీ-ఎం-రేవంత్-రెడ్డి మా ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే కుట్ర‌ : సీ ఎం రేవంత్ రెడ్డి


ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఓ కుటుంబం(కేసీఆర్‌) కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌దోసి తాము అధికారంలోకి వ‌చ్చేందుకు ఆది నుంచి కుట్ర‌లు ప‌న్నింద‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఎప్పటిక‌ప్పుడు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో తాము ఆ కుట్ర‌ల‌ను ఛేదిస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని చూసి ఆ కుటుంబం జీర్ణించుకోలేక పోతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. అందుకే.. ప్ర‌తి చిన్న విష‌యాన్నీరాజ‌కీయం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తుంటే.. దానిపైనా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. తాజాగా ‘రైతు నేస్తం’ కార్య‌క్ర‌మాన్ని రంగారెడ్డి జిల్లా రాజేంద్రగనర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాము గ‌ద్దె నెక్కిన ఆరు మాసాల్లోనే రైతుల‌కు రుణ మాఫీ చేశామ‌న్నారు. సుమారు ల‌క్ష కోట్ల‌కు పైగా సొమ్మును రైతుల‌కు రుణ మాఫీ రూపంలో అందించామ‌ని చెప్పారు. గ‌త పాల‌కులు ప‌దేళ్ల‌లో చేయ‌లేని ప‌నిని కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేవ‌లం ఆరు మాసాల్లోనే చేసి చూపింద‌ని.. దీంతో వారి క‌డుపు మంట మ‌రింత పెరుగుతోంద‌ని ఎద్దేవా చేశారు. త‌మ ప్ర‌భుత్వాన్నికూల్చేసేందుకు కుట్ర‌లు ప‌న్నుతూనే ఉన్నార‌ని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో శ‌వ రాజ‌కీయాలుచేస్తున్నార‌ని బీఆర్ ఎస్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎవ‌రు ఏ విధంగా చ‌నిపోయినా.. దానిని తమ ప్ర‌భుత్వానికి అంట‌గ‌డుతున్నార‌ని రేవంత్ రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. అయినా.. త‌మ ప్ర‌భుత్వం ఎవ‌రినీ చ‌నిపోవాల‌ని కోరుకోద న్నారు. రైతుల‌కు సాధ్య‌మైనంత మేలు చేస్తున్నామ‌ని చెప్పారు. స‌ర్పంచులను గ‌త ప్ర‌భుత్వం ఏడిపించింద‌ని.. పోలీసుల‌తో కేసులు పెట్టించింద‌ని పేర్కొన్నారు. “గత సీఎం అందినకాడికల్లా అప్పులు చేసి రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజార్చారు. రిటైర్‌ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్‌ చెల్లించలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. మేం వ‌చ్చాక వాటిని స‌రిచేస్తున్నాం. ఇప్పుడు నెల నెలా జీతాల‌ను టైం ప్ర‌కారం ఇస్తున్నాం” అని తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్ విష‌యంపై స్పందిస్తూ.. గ‌తంలో ఏ ఇద్ద‌రు వ్య‌క్తులు ఫోన్లు మాట్లాడుకున్నా.. భ‌య‌ప‌డే ప‌రిస్థితికి తీసుకువ‌చ్చారని సీఎం రేవంత్ అన్నారు. చివ‌ర‌కు ప‌డ‌క గ‌దిలో కూడా ఫోన్లు మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండా చేశార‌ని అన్నారు. ” అప్ప‌ట్లో ఫోన్‌ ట్యాపింగ్‌తో అరాచకం చేశారు. భార్యాభర్తలు కూడా ఫోన్‌లో స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితి క‌ల్పించారు. ఇప్పుడు అన్నీ నంగ‌నాచి క‌బుర్లు చెబుతున్నారు. విచార‌ణ‌కు పిలిస్తే.. అరెస్టు చేసి జైల్లో పెడ‌తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇవ‌న్నీ.. ప్ర‌జ‌లు చూసే వారికి త‌గిన విదంగా బుద్ధి చెప్పారు.” అని రేవంత్ వ్యాఖ్యానించారు.

]]>
Tue, 17 Jun 2025 14:04:32 +0530 admin
ఫార్ములా&ఈ కార్‌ రేసు కేసులో ఏసీబీ విచారణకు హాజరయిన కేటీఆర్‌ https://prajakshethrenews.com/ఫార్ములా-ఈ-కార్-రేసు-కేసులో-ఏసీబీ-విచారణకు-హాజరయిన-కేటీఆర్ https://prajakshethrenews.com/ఫార్ములా-ఈ-కార్-రేసు-కేసులో-ఏసీబీ-విచారణకు-హాజరయిన-కేటీఆర్ ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో ఏసీబీ విచారణకు హాజరయిన కేటీఆర్‌
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్‌ జూన్ 16
 ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో ఏసీబీ విచారణకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరయ్యారు. ఆయనతోపాటు మాజీ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచందర్‌ రావు కూడా విచారణకు హాజరయ్యారు. అంతకుముందు నందీనగర్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫార్ములా వన్‌ విచారణకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. ఈ భేటీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు కూడా పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనాయకులతో భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన నుంచి నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలనికి చేరుకున్నారు.ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కార్యాలయం గేటు వద్దే బీఆర్‌ఎస్‌ నాయకులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీఆర్‌ఎస్‌ శ్రే ణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. పోలీసుల తీరుపై ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

]]>
Mon, 16 Jun 2025 21:05:00 +0530 admin
కేటీఆర్ .. నీ డ్రామాలు, దొంగ నాటకాలు ఆపు : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ https://prajakshethrenews.com/కేటీఆర్-నీ-డ్రామాలు-దొంగ-నాటకాలు-ఆపు-ఎమ్మెల్సీ-బల్మూర్-వెంకట్ https://prajakshethrenews.com/కేటీఆర్-నీ-డ్రామాలు-దొంగ-నాటకాలు-ఆపు-ఎమ్మెల్సీ-బల్మూర్-వెంకట్ కేటీఆర్ .. నీ డ్రామాలు, దొంగ నాటకాలు ఆపు
ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
చట్టం మీద గౌరవం ఉందని అంటూనే కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కు తున్నాడని, సత్యహరిశ్చంద్రుడి లా కేటీఆర్ తెగ బిల్డప్ ఇస్తున్నాడని ఎమ్మెల్సీ బల్యూర్ వెంకట్ మండిపడ్డారు. అధికారులకు అవసరమైతే మూడు సార్లు కాదు 300 సార్లైనా పిలుస్తారు..వెళ్లాల్సిందే. కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే విచారణ లో నిజాయితీ గా సమాధానాలు చెప్పాలి. కేసులు బనాయించాల్సిన అవసరం మా  ప్రభుత్వానికి ఏ మాత్రం లేదు. ఈ ఫార్ములా రేస్ అస్తవ్యస్థంగా నిర్వహించి దొరికిపోయింది కేటీఆర్. మంత్రి వర్గం అనుమతి లేకుండా ఇష్టానుసారంగా విదేశీ కంపెనీ కి 55 కోట్లు చెల్లించింది నువ్వని అన్నారు. నిబంధనలు పాటించకుండా, ఆర్బీఐ కి చెప్పకుండా డబ్బులు పంపించ మన్నది నువ్వు...అడ్డంగా దొరికిపోయి నంగనాచి లా కేటీఆర్ కబుర్లు చెపుతున్నాడు. కేవలం విచారణ కు పిలిస్తేనే పైశాచిక ఆనందం  తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నావు.. అక్రమ కేసుల్లో ఇరికించి మా రేవంత్ రెడ్డిని, మమ్మల్ని రోజుల తరబడి జైల్లో పెట్టినదాన్ని ఏమనాలి.. పైశాచిక ఆనందం లేక శాడిజమా ..?  అరెస్టులకు భయపడనని తెగ బిల్డప్ లు ఇస్తున్నావు..  నీ కోరిక నెరవేరాలని మేం కూడా కోరుకుంటున్నాం. నీ అవినీతి, అక్రమాలు దర్యాప్తులో బయటపడితే ఒక్కసారి కాదు వందసార్లైనా జైలుకు వెళ్లాల్సి వస్తుంది.. రెఢీ గా ఉండు.  కేటీఆర్ .. నీ డ్రామాలు, దొంగ నాటకాలు ఆపు. నీ కుటుంబ సభ్యులే నిన్ను దెయ్యం అంటున్నారు. బిడ్డా కబడ్దార్.. నువ్వు , నీ అయ్య ను తెలంగాణ ప్రజలు నేలకేసి కొట్టారు.  వచ్చే ఎన్నికల్లో నువ్వు కనీసం ఎమ్మెల్యే గా గెలిచే పరిస్థితి కూడా ఉండదని అన్నారు.

]]>
Mon, 16 Jun 2025 16:20:14 +0530 admin
చల్పాకలో తీవ్ర ఉద్రిక్తత https://prajakshethrenews.com/చల్పాకలో-తీవ్ర-ఉద్రిక్తత https://prajakshethrenews.com/చల్పాకలో-తీవ్ర-ఉద్రిక్తత చల్పాకలో తీవ్ర ఉద్రిక్తత
ప్రజా క్షేత్ర్, ములుగు :
ఏటూరునాగారం మండలం చల్పాక శివారులో ఉద్రిక్తత నెలకొంది. అటవీభూముల్లో గిరిజనులు  గుడిసెలు వేసుకున్నారు. దాంతో గుడిసెలు తొలగించేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసులు భారీఎత్తున మొహరించారు. పోలీసులు, అటవీశాఖ అధికారులపై గిరిజనులు  తిరగబడ్డారు. కర్రలతో ఎదురుదాడికి దిగారు. రిజర్వ్ ఫారెస్ట్ లో వేసిన గుడిసెలను తొలగించేందుకు  అటవీశాఖ, అధికారులు పోలీసులు ప్రయత్నించారు. గిరిజనులు- అటవీశాఖ సిబ్బంది మధ్య తీవ్రవాగ్వాదం, తోపులాట జరిగింది.

]]>
Mon, 16 Jun 2025 16:13:47 +0530 admin
మేడ్చల్ లో ఎంపి ఈటల రాజేందర్ పర్యటన https://prajakshethrenews.com/మేడ్చల్-లో-ఎంపి-ఈటల-రాజేందర్-పర్యటన https://prajakshethrenews.com/మేడ్చల్-లో-ఎంపి-ఈటల-రాజేందర్-పర్యటన మేడ్చల్ లో ఎంపి ఈటల రాజేందర్ పర్యటన
మేడ్చల్ మల్కాజిగిరి
మేడ్చల్ మండలం శ్రీ రంగవరం గ్రామంలో మండల పరిషత్  ప్రాథమిక పాఠశాలలను ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించి, అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  ఎంపి మాట్లాడుతూ సిటీకి కూతవేటు దూరంలో ఉండి, మేడ్చల్ మున్సిపాలిటీలో కలపబడ్డ గ్రామాలు రావల్ కోల్ తండా, సైదోని గడ్డ తండా. ఈ తండాలో అంగన్వాడి కేంద్రాలను డ్రైనేజీ సమస్యలను పరిశీలించాను.  రోడ్డు మీద నుండి లోపలికి రావడానికి లైట్లు లేవు. ఇది ఈ తండా దుస్థితి.  అనేక సంవత్సరాలుగా ఈ గ్రామం మురికినీళ్ళన్నీ పంట పొలాల మీదకు పోతున్నాయి. ఆ నీళ్లు పారుతుంటే  దుర్గంధంతో  వరికోసే సమయంలో  మిషన్లు రావడం లేదు.  మురికి కాలువ సమస్యలు తీర్చాలని, తండా లోపలికి రావడానికి లైట్లు పెట్టించాలని గ్రామస్తులు కోరారు. వీళ్ళు గెలిపించిన ఎంపీగా తప్పకుండా సమస్య అతి తొందరలో పరిష్కారం చేస్తామని మాట ఇచ్చానని అన్నారు.

]]>
Mon, 16 Jun 2025 16:10:21 +0530 admin
ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ ను అభినందించిన మంత్రి పొన్నం https://prajakshethrenews.com/ఆర్టీసీ-తొలి-మహిళా-డ్రైవర్-ను-అభినందించిన-మంత్రి-పొన్నం https://prajakshethrenews.com/ఆర్టీసీ-తొలి-మహిళా-డ్రైవర్-ను-అభినందించిన-మంత్రి-పొన్నం ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ ను అభినందించిన మంత్రి పొన్నం
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ సరిత ను సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.  ఆర్టీసీ లో తొలి మహిళా డ్రైవర్ గా అవకాశం కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి డ్రైవర్ సరిత దన్యవాదాలు తెలిపింది.

]]>
Mon, 16 Jun 2025 16:07:43 +0530 admin
గాంధీ ఆసుపత్రి ని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి https://prajakshethrenews.com/గాంధీ-ఆసుపత్రి-ని-సందర్శించిన-కేంద్ర-మంత్రి-కిషన్-రెడ్డి https://prajakshethrenews.com/గాంధీ-ఆసుపత్రి-ని-సందర్శించిన-కేంద్ర-మంత్రి-కిషన్-రెడ్డి గాంధీ ఆసుపత్రి ని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ప్రజా క్షేత్ర్, సికింద్రాబాద్ :
గాంధీ ఆసుపత్రిలో ఇటీవల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆసుపతిని సందర్శించారు. గత నెల రోజులుగా కరోనా కేసులు దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఆదేశాల మేరకు తెలంగాణలోని నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటును పరిశీలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రిలోని కొన్ని విభాగాలలో పెరుగుతూ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆస్పత్రి వైద్య యంత్రాంగం నుండి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సూపరిండెంట్ రాజకుమారితో గాంధీ ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలు రోగులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి చర్చించారు.  ఇటీవల గాంధీ ఆసుపత్రిలో తాగునీటి సరఫరా సరిగా లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో రోగులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూపర్డెంట్ కు సూచించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ లోపం లేకుండా సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిటీ స్కాన్, ఎమ్మారై యంత్రాలు పనిచేసే విధంగా చూడాలని రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని సూపరిండెంట్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానని స్పష్టం చేశారు.ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు.

]]>
Mon, 16 Jun 2025 16:04:43 +0530 admin
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : ఏసీబీ విచారణకు హజరయిన కేటీఆర్ https://prajakshethrenews.com/కాంగ్రెస్-ప్రభుత్వాన్ని-వదిలిపెట్టే-ప్రసక్తే-లేదు-ఏసీబీ-విచారణకు-హజరయిన-కేటీఆర్ https://prajakshethrenews.com/కాంగ్రెస్-ప్రభుత్వాన్ని-వదిలిపెట్టే-ప్రసక్తే-లేదు-ఏసీబీ-విచారణకు-హజరయిన-కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
ఏసీబీ విచారణకు హజరయిన కేటీఆర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు హజరయ్యారు. అంతకుముందు అయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. చట్టం  మీద గౌరవం ఉంది కాబట్టే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పాము. ఇది మూడోసారి విచారణకు పిలవటం. మూడుసార్లు కాదు 30 సార్లు అయినా విచారణకు వస్తాం. విచారణకు సహకరిస్తామని అన్నారు.
మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినంతమాత్రాన ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రశ్నించకుండా ఉంటారనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకం మాత్రమే, కెసిఆర్, హరీష్ రావులను కాలేశ్వరం కమిషన్ల ముందు కూర్చోబెట్టారు. వారిని  కమిషన్ ముందు కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు . నన్ను ఏసీబీ విచారణకు మళ్లీ మళ్లీ పిలుస్తున్నారు. నన్ను మళ్లీ ఏసీబీ విచారణకు పిలిచి రాక్షస ఆనందం పొందుతున్నారని అన్నారు.అవసరమైతే నన్ను అరెస్టు కూడా చేస్తారు కావచ్చు. మాకు జైలు కేసులు కొత్త కాదు గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్లొచ్చాను. ఫార్ములా ఈ రేసులో తెలంగాణ ను ప్రపంచంలో నెంబర్ వన్ చేశాం. మీరు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరేవరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదని అన్నారు. ఒక్కసారి కాదు వందసార్లు అయినా జైలుకు పోతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఇచ్చిన 420 హామీలు దొంగ ఆరు గ్యారెంటీలు మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవ్వాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తోందని సంకేతాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ రెడ్డి తీరును గమనిస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి ఇప్పుడు వాటిని విస్మరించి స్థానిక సంస్థలకు వెళ్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. వీటిని బీసీ ప్రజలు గమనిస్తున్నారు. రైతుబంధును ఎలక్షన్ బందుగా మార్చి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రైతుబంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని రాష్ట్ర మహిళలు గమనిస్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నువ్వు చేసిన మోసాన్ని నిరుద్యోగులు యువత గమనిస్తున్నారు. మీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడని అన్నారు.
ఏదో ఒక కమిషన్ ఎంక్వయిరీ అంటూ కాలయాపన చేస్తున్నారు. కాంగ్రెస్ బిజెపి దొంగనాటకాలు దొంగ బాగోతం అంతా తెలంగాణ ప్రజలకు అంతా అర్థమయింది. ఒక కేసు కాదు ఇంకా వెయ్యి కేసులు పెట్టిన మీ ప్రశ్నిస్తూనే ఉంటాం నువ్వు లై డిటెక్టర్ కు సిద్ధం కావాలని అన్నారు.

]]>
Mon, 16 Jun 2025 13:24:42 +0530 admin
ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా చేరిన వాంకుడోతు సరిత https://prajakshethrenews.com/ఆర్టీసీలో-తొలి-మహిళా-డ్రైవర్గా-చేరిన-వాంకుడోతు-సరిత https://prajakshethrenews.com/ఆర్టీసీలో-తొలి-మహిళా-డ్రైవర్గా-చేరిన-వాంకుడోతు-సరిత ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా చేరిన వాంకుడోతు సరిత 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన సరిత కు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులుగా చేస్తున్న సందర్భంలో, మహిళా డ్రైవర్ నియామకం ఒక కీలక ముందడుగు అని పేర్కొన్నారు. మహిళలు విద్య, విజ్ఞానం, వృత్తి, వ్యాపారం, క్రీడలు, సైన్యం వంటి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని చెప్పారు.గృహ బాధ్యతలు, సమాజ నిర్మాణంలోనూ మహిళల పాత్ర అపూర్వమైనదిగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, అడ్డంకులను అధిగమించి మహిళలు విజయాల బాటలో ముందుకెళ్తున్నారని, సరిత అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు."ఇందిరా మహిళా శక్తి" పథకం ద్వారా రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు ప్రారంభించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. కోటి మందిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కోరారు.

]]>
Sun, 15 Jun 2025 19:21:34 +0530 admin
హైదరాబాద్ నగరాన్ని హాలీవుడ్, బాలీవుడ్‌ సినిమా పరిశ్రమకు అడ్డాగా మార్చడానికి సహకారం అందిస్తాం : సీ ఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/హైదరాబాద్-నగరాన్ని-హాలీవుడ్-బాలీవుడ్-సినిమా-పరిశ్రమకు-అడ్డాగా-మార్చడానికి-సహకారం-అందిస్తాం-సీ-ఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/హైదరాబాద్-నగరాన్ని-హాలీవుడ్-బాలీవుడ్-సినిమా-పరిశ్రమకు-అడ్డాగా-మార్చడానికి-సహకారం-అందిస్తాం-సీ-ఎం-రేవంత్-రెడ్డి హైదరాబాద్ నగరాన్ని హాలీవుడ్, బాలీవుడ్‌ సినిమా పరిశ్రమకు అడ్డాగా మార్చడానికి సహకారం అందిస్తాం : సీ ఎం రేవంత్ రెడ్డి

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

హైదరాబాద్ నగరాన్ని హాలీవుడ్, బాలీవుడ్‌ సినిమా పరిశ్రమకు అడ్డాగా మార్చడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న 2047 విజన్ డాక్యుమెంట్‌లో సినీ పరిశ్రమ రాణించడానికి నిర్దేశిత లక్ష్యాలతో ఒక చాప్టర్ ఉండాలని, అందుకు సినీ ప్రముఖులు అవసరమైన ప్రణాళికను తయారు చేయాలని కోరారు.*హైదరాబాద్ హైటెక్స్‌లో కన్నుల పండుగగా సాగిన ప్రతిష్టాత్మక “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024” ప్రదానోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు లతో కలిసి ముఖ్యమంత్రి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..“స్వాతంత్రం సిద్ధించి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే సినిమా రంగం కూడా ఒక పరిశ్రమగా రాణించాలి. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, వచ్చే 10 ఏళ్ల నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించాలంటే సినీ పరిశ్రమ కూడా అభివృద్ధి సాధించాలి.*సినిమా రంగం అభివృద్ధి సాధించడానికి పరిశ్రమకు ఏం కావాలో చెప్పండి. ఏ హోదాలో ఉన్నా మీకు అండగా నిలబడుతా. అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. తెలంగాణకు ఎవరైనా రావొచ్చు. ఎవరైనా వాణిజ్యం నిర్వహించవచ్చు. 500 ఫార్చూన్ కంపెనీల్లో 85 కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచ నగరాలతో పోటీ పడదలచుకున్నాం.*తెలుగు సినీ పరిశ్రమలను గుర్తించడానికి 1964 లో ఈ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించి అప్పటి నుంచి 2014 వరకు నిరాటంకంగా నిర్వహించారు. వివిధ కారణాల చేత 14 ఏళ్ల కిందట ఆగిపోయిన సినిమా అవార్డుల ప్రదానోత్సవాన్ని పునరుద్దరించాలని #DilRaju గారు ప్రతిపాదించారు. వాటిని పునరుద్దరించడమే కాకుండా గడిచిన పదేండ్ల కాలంలో ప్రతిభ కనబరిచిన అందరినీ అభినందించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందుకు సహకరించిన సినీ రంగానికి అభినందనలు.*కొన్ని అంశాల్లో ప్రభుత్వ నిర్ణయాలు కఠినంగా కనిపిస్తాయి. కానీ ప్రభుత్వం సినిమా రంగాన్ని అభిమానంగా చూస్తుంది. ఇప్పుడే కాదు గతంలోనూ మా ప్రభుత్వాలు సినిమా రంగాన్ని గౌరవించింది. ఇంత అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వహకులకు, అందుకు సహకరించిన సినీ రంగ ప్రముఖులందరికీ అభినందనలు.*గద్దరన్న స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ భాగస్వామ్యం కావాలి. అందరం కలిసికట్టుగా తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలి. తెలంగాణను అభివృద్ధి వైపు నడిపించడంలో కళా చైతన్యం తోడుగా నిలవాలి..” అని ముఖ్యమంత్రి  కోరారు.*2014 నుంచి 2024 వరకు ప్రతి ఏటా ఆయా కేటగిరీల్లో ఎంపికైనా ఉత్తమ చిత్రాలతో పాటు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులు, చిత్రపరిశ్రమలో విశేష కృషి చేసిన ప్రముఖులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా GaddarFilmAwards అందజేశారు.

]]>
Sun, 15 Jun 2025 11:00:52 +0530 admin
బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి : కవిత https://prajakshethrenews.com/బీసీ-రిజర్వేషన్లు-పెంచిన-తరువాతే-స్థానిక-సంస్థల-ఎన్నికలు-జరపాలి-కవిత https://prajakshethrenews.com/బీసీ-రిజర్వేషన్లు-పెంచిన-తరువాతే-స్థానిక-సంస్థల-ఎన్నికలు-జరపాలి-కవిత బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి
హైదరాబాద్
తెలంగాణ జాగృతిలో విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున చేరారు. వారికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  కండువా కప్పి తెలంగాణ జాగృతిలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదిలిరావాలి. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండి కొట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. అదే స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధన ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండాలి. సామాజిక తెలంగాణను సాధించడానికి విద్యార్థులు నడుం బిగించాలని అన్నారు. బీసీ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన సరికాదు. బీసీలకు 42 రిజర్వేషన్లకు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోము. 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి. కర్నాటకలో కులగణన ఎలా చేయాలో అక్కడి సీఎం సిద్దరామయ్యకు నేర్పించానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. సీఎం ఈ ప్రకటన చేసిన గంట సేపటికే కాంగ్రెస్ అధికారికంగా ఒక ఫోటో విడుదల చేసింది . ఆ ఫోటోలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం లేరని అన్నారు. దీన్ని బట్టే రేవంత్ రెడ్డి ఎన్ని అబద్దాలు ఆడుతున్నారో అర్థమవుతోంది. రాహుల్ గాంధీ దర్శనం లేక సీఎం రేవంత్ రెడ్డి విలవిలలాడుతున్నారు. దర్శనాల సంగతి పక్కనబెట్టి ప్రజా సమస్యలపై సీఎం దృష్టిపెట్టాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ స్కూల్, టీడీపీ కాలేజీలో చదువుకున్నానని.. జాబ్ కాంగ్రెస్ లో చేస్తున్నానని సీఎం అన్నారు. చేస్తున్న జాబ్ లో కూడా రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు రావడం లేదు. ఢిల్లీకి వెళ్లడంలో రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ చేశారు. కనీసం మంత్రివర్గాన్ని కూర్పు చేసుకోలేని సీఎం రేవంత్ రెడ్డి. ఇంత అసమర్థ, బలహీన ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇంత బలహీనంగా లేకుండే నని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. విద్యార్థల సమస్యలు, విద్యారంగ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 8 వేల కోట్ల మేర ఫీజు రియింబర్స్ మెంటు బకాయిలు ఉన్నాయని అన్నారు. తక్షణమే ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విద్య భరోసా కార్డులు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని విస్మరిస్తోంది. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం మెరుపులా పనిచేయాలని అన్నారు.

]]>
Sun, 15 Jun 2025 10:19:02 +0530 admin
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి : మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్ https://prajakshethrenews.com/స్థానిక-సంస్థల-ఎన్నికలను-నిర్వహించాలి-మాజీ-ఎంపీ-డా-బూర-నర్సయ్య-గౌడ్ https://prajakshethrenews.com/స్థానిక-సంస్థల-ఎన్నికలను-నిర్వహించాలి-మాజీ-ఎంపీ-డా-బూర-నర్సయ్య-గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి
మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకం...అవి అసెంబ్లీ అయినా కావొచ్చు, పార్లమెంట్ అయినా కావొచ్చు, స్థానిక సంస్థలైన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలైనా కావొచ్చు. ప్రతి స్థాయిలో ఈ ఎన్నికలు సమయానికి అనుగుణంగా జరగాలని భువనగిరి మాజీ ఎంపి డా బూర నర్సయ్య గౌడ్ అన్నారు. కాని..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు గడిచినా, ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత లేదు.  రాష్ట్రంలో 12,769 మంది సర్పంచుల పదవీకాలం 2024 జనవరి 31న ముగిసింది.   రాష్ట్రవ్యాప్తంగా 5,717 మంది ఎంపీటీసీల పదవీకాలం 2024 మే నెలలో ముగిసింది. ఇప్పటికీ ఈ స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. 538 మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్ పర్సన్ల పదవీకాలం కూడా పూర్తయ్యి సంవత్సరం దాటిపోయింది. రాష్ట్రంలోని 130 మున్సిపాలిటీలలో 128 మున్సిపాలిటీల పదవీకాలం పూర్తై ఆరు నెలలు గడిచింది. అయినా ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-A, 243-U, 243-ZA పరిధిలో ఉన్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత మరియు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో సంబంధం లేదు. ఇది పూర్తిగా రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ కావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వంటి లోకల్ బాడీలకు అభివృద్ధి నిధులు ప్రధానంగా కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ద్వారా వస్తాయి. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రావలసిన రూ. 1514 కోట్లు నిధులు ఎన్నికలు జరగకపోవడం వల్ల నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రజలు ఈ నష్టాన్ని భరించాల్సి వస్తోంది. అంతేకాక, గతంలో 14వ ఆర్థిక సంఘం కింద రావలసిన రూ. 800 కోట్ల బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇవి కూడా ఎన్నికల నిర్వహణ లేకపోవడం వల్ల విడుదల కాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా సూచిస్తోందని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. ఎన్నికల్లో రిజర్వేషన్ నిష్పత్తి నిర్ణయించే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆ ప్రక్రియను అమలు చేస్తుంది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఎలా ఉండాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వడంలో విఫలమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గొప్పగా మాటలు చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేసారు. కానీ ఆ హామీలు ఎటూ తీరకపోవడం, ఎన్నికలు జరగకపోవడం వల్ల అభివృద్ధి నిధులు నిలిచిపోవడం.. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను చూపిస్తున్నాయి. అందువల్ల తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, రాష్ట్రం నష్టపోకుండా చూడాలని అన్నారు. ఆర్టికల్ 243 (U), 243 (Z), 243 (A) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హక్కు, బాధ్యత. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయిస్తే, రాష్ట్రంలో ఎన్నికలు జరగకపోవడం వల్ల ఆ నిధులు పూర్తిగా వినియోగం కావడం లేదు.
రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎంత ఉండాలో నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానిదే. అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్నది ఇంకా అమలు రూపం దాల్చలేదు. బీసీలకు రిజర్వేషన్ పెంచాలంటే ‘ట్రిపుల్ టెస్ట్’ ప్రకారం — (1) కులగణన, (2) బీసీ కమిషన్, (3) డెడికేటెడ్ కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టంగా పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలంప్రకటనలు చేసి, పబ్లిక్కు వివరాలు మాత్రం వెల్లడించలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టాలని చూడటం తప్పుదారి పట్టించే చర్య అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో బీసీ కులాల గణాంకాలను ప్రచురించాలని, రిజర్వేషన్లను అమలు చేసి ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో, ప్రతి రోజూ ఒక మంత్రి “ఇప్పుడు జరుగుతాయి”, “తొందర్లో ఉంటాయి”, “సంక్రాంతికి జరుగుతాయి” వంటి ప్రకటనలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.

]]>
Sun, 15 Jun 2025 10:09:27 +0530 admin
బీసీలలో ఐక్యత లోపించింది : టీపీసీసీ చీఫ్‌ https://prajakshethrenews.com/బీసీలలో-ఐక్యత-లోపించింది-టీపీసీసీ-చీఫ్ https://prajakshethrenews.com/బీసీలలో-ఐక్యత-లోపించింది-టీపీసీసీ-చీఫ్ బీసీలలో ఐక్యత లోపించింది
పార్టీలకు అతీతంగా ఏకం కావాలి టీపీసీసీ చీఫ్‌
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
బీసీలలో ఐక్యత లోపించిందని బీసీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీలకు అతీతంగా బీసీలు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. నాంపల్లిలో జరిగిన ఓబీసీ పోరుబాట పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ. కేంద్రం తీసుకున్న కుల గణన నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంగా అభివర్ణించారు. కుల గణనతో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ దేశంలోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోగలిగారన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనల్లో నుంచి పుట్టిందే కుల సర్వే అన్నారు. చాలా వరకు బీసీలను ఓటు సాధనాలుగానే చూశారని.. మా వాటా మాకు కావాలి అనే స్థాయికి బీసీలు ఎదిగారు. సమాజంలో ఎవరి వాట వారికే సిద్ధాంతానికి కట్టుబడి పారదర్శకంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే నిర్వహించిందన్నారు. కుల సర్వేను వ్యతిరేకించిన కేంద్రంలోని బీజేపీ సైతం జనగణనతో పాటు కుల గణన చేపడతామని ప్రకటించింది. ఖర్గే,రాహుల్ గాంధీ సమక్షంలో కుల సర్వే పై దేశ వ్యాప్తంగా చేపడుతామన్నారు.

]]>
Sun, 15 Jun 2025 09:32:08 +0530 admin
తమ్మిడి హట్టికి బదులుగా మేడిగడ్డ ఎంపిక చేయడమే ముమ్మాటికి రాజకీయ నిర్ణయమే : ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ https://prajakshethrenews.com/తమ్మిడి-హట్టికి-బదులుగా-మేడిగడ్డ-ఎంపిక-చేయడమే-ముమ్మాటికి-రాజకీయ-నిర్ణయమే-ఎన్విఎస్ఎస్-ప్రభాకర్ https://prajakshethrenews.com/తమ్మిడి-హట్టికి-బదులుగా-మేడిగడ్డ-ఎంపిక-చేయడమే-ముమ్మాటికి-రాజకీయ-నిర్ణయమే-ఎన్విఎస్ఎస్-ప్రభాకర్ తమ్మిడి హట్టికి బదులుగా మేడిగడ్డ ఎంపిక చేయడమే ముమ్మాటికి రాజకీయ నిర్ణయమే..
         ప్రజల్ని మోసం చేసినవారిని వదిలిపెట్టేది లేదు : ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
 తమ్మిడి హట్టికి బదులుగా మేడిగడ్డ ఎంపిక చేయడమే ముమ్మాటికి రాజకీయ నిర్ణయమేనని ప్రజల్ని మోసం చేసినవారిని వదిలి పెట్టేది లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ హెచ్చరించారు. పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ  పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తయినట్టు ఇటీవల పత్రికల ద్వారా వార్తలు వచ్చాయి. కమిషన్ కాలపరిమితి పొడిగింపుల అనంతరం తుది విచారణ పూర్తయిందని, నివేదిక త్వరలో ప్రభుత్వానికి అందించబోతున్నట్టు ప్రకటించారు. ఈ తుది విచారణలో పాల్గొన్న వారంతా "క్యాబినెట్ నిర్ణయమే" అంటుండటం గమనార్హం. సాంకేతిక విషయాలు తమకు తెలియవని, నిపుణుల సూచనల ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. ఇది పూర్తిగా క్యాబినెట్ ఉపసంఘం తీసుకున్న నిర్ణయం ఆధారంగా జరిగిందన్న వాదన వల్ల తప్పిదానికి బాధ్యత ఎవరిదన్నది ప్రజలకు స్పష్టంగా తెలియకుండానే మిగిలిపోతోంది.మధ్య మధ్యలో సిడబ్ల్యూసీ పేరు ఎత్తుతూ తప్పించుకోవడానికి కబుర్లు చెప్పినట్టు కనిపిస్తోందన్నారు. చేసిన తప్పును అంగీకరించి ప్రజల ముందు బహిరంగంగా నివేదించి ఉంటే నైతికత కలిగిన నాయుకత్వంగా గుర్తింపు పొందేది. కానీ "అనారోగ్యం" అనే కారణంతో బహిరంగ విచారణకు రావడం మానుకుంటూ, ఏకాంతంగా మాట్లాడతాను అని చెప్పిన తీరు ప్రజల్లో అనుమానాలకే దారి తీస్తోంది. ఈ దశలో అసలు ఎవరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమి దాచాలనుకుంటున్నారు?కాళేశ్వరం పనులు ప్రారంభమైనప్పటి నుంచే సిఏజి వార్షిక నివేదికల ద్వారా ఈ ప్రాజెక్టు ఫీజబుల్ కాదని, వ్యయప్రయోజన సంబంధం లేదు అని అన్నారు. కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారని స్పష్టంగా పేర్కొంటూ వచ్చింది. అయినా ప్రభుత్వం చెల్లింపులు కొనసాగించడమే కాక, అక్రమాలకు ఆస్కారం కలిగింది. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) కూడా ప్రతి సంవత్సరం ఈ ప్రాజెక్టులో జరిగిన తప్పులను, అవకతవకలను ఎత్తిచూపింది. అయినా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా చర్యలు తీసుకోవడం గానీ, లోపాలు సరిచూడడం గానీ జరగలేదు.ప్రతిదానికీ "క్యాబినెట్ నిర్ణయం" అన్నదే నడుస్తోంది. అంటే మేము ఒక్కరే దోచుకోలేదు, క్యాబినెట్ మొత్తమే దోచుకుందన్న అర్థమా? కాళేశ్వరం కాలువలు కొట్టుకుపోయినట్టు వార్తలు నిజమా కాదా? కాలువలు కుంగిపోయిన మాట వాస్తవమా కాదా? బ్యారేజ్‌కి బీటలు పడటం జరిగిందే కదా? అని ప్రబాకర్ ప్రశ్నించారు.ఇవన్నీ దేశం మొత్తానికి తెలిసిన విషయాలే. దీని గురించి ముఖ్యమంత్రి నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది.తమ్మిడి హట్టికి బదులుగా మేడిగడ్డ ఎంపిక చేయడమే ముమ్మాటికి రాజకీయ నిర్ణయమే. కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడి హట్టికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించింది. అనంతరం వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం టెండర్లను మార్చకుండా అదే సంస్థలకు మేడిగడ్డ అప్పగించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో ఇప్పటికీ వివరణ రావాల్సిన అవసరం ఉంది.  భారతదేశంలో లేదా ఏ రాష్ట్రంలో అయినా ఇన్నిసార్లు అంచనాలు పెరిగిన ప్రాజెక్ట్‌ను చూసిన దాఖలాలు లేవు. సాధారణంగా ప్రాజెక్టుల ఖర్చు ఎస్కలేషన్‌ కొన్ని కారణాల వల్ల జరిగితే అది సహజం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అంచనాలు డబుల్, ట్రిపుల్‌గా మారిపోయాయి. ఈ విషయంలో పీసీ ఘోష్ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, టెండర్లు పిలవకుండానే అప్పగించడమో, సిఏజీ స్పష్టంగా "Undue favour to the contractor" అన్న అంశాన్ని ఎత్తిచూపడమో.. ఇవన్నీ అప్పట్లోనే ఆపి, ముఖ్యమంత్రి స్పందించి ఉండాల్సింది. కానీ అప్పుడు స్పందించకపోవడం పెద్ద తప్పిదం.ఇప్పుడు పీసీ ఘోష్ విచారణ ఒక స్కూల్ లో వైవా పరీక్షలా మారింది. ముందుగా ఎవర్ని ఏమి అడుగుతున్నారో చూసి, మూడో వ్యక్తి ప్రిపేర్ అయ్యేలా తయారయ్యే పరిస్థితి కనిపిస్తోందన్నారు.. కనీసం పాస్ మార్కులు కాకపోయినా డీటైన్ కాకూడదనే ప్రయత్నంగా మారింది. అందుకే ఈ విచారణలో పీసీ ఘోష్ రకరకాల కథనాలు చెబుతూ, అన్నీ "క్యాబినెట్ నిర్ణయం" కింద తీసుకురావడం ఆశ్చర్యంగా ఉందన్నారు..కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన తర్వాత, కాలువలు కొట్టుకుపోయిన తర్వాత, మోటార్లు మొరాయించిన తర్వాత, బ్యారేజ్‌కు బీటలు వారిన తర్వాత నీరు నిల్వ ఉంచలేమన్న విషయమే ప్రధానంగా చర్చకు వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఈ సమస్యను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నివేదించారు. ప్రతి రాష్ట్రంలో స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ అప్పటి ప్రభుత్వ కాలంలో, ఈ మేడిగడ్డ గాని, అన్నారం గాని, సుందిల్ల గాని ప్రాజెక్టులకు సంబంధించి, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఒకసారి కూడా విషయాలను తెలియజేయలేదు. వీటి పరిశీలన కోసం విజిట్ చేయాలని కూడా ప్రయత్నించలేదు. అంతా నా వల్లే... పారుతున్న నీళ్లు, పండుతున్న పంట, వస్తున్న దిగుబడి అన్నట్టుగా అప్పటి ముఖ్యమంత్రి చెప్పడం విచారకరమన్నారు..భారతీయ జనతా పార్టీ మొదటి నుండి ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువస్తూ వచ్చింది. కాళేశ్వరం లో జరిగిన అక్రమాలకు సంబంధించి సీబీఐని విచారణకు చేరవేయాలని మా పార్టీ తరఫున అనేకసార్లు కోరాం. ఈడీ రంగప్రవేశం చేయాలని డిమాండ్ చేశాం. ప్రాజెక్టు లో జరిగిన అవినీతిని తేల్చడానికి ఇది అత్యవసరమైన చర్య. అయినా ఇప్పుడు తుది నివేదిక ఏమి ఇస్తుందో చూడాలి. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం కాళేశ్వరాన్ని ఏటీఎంగా వాడుకున్న నాయకులనూ, పార్టీలనూ, అప్పటి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకువస్తున్నది. మరోవైపు ఏసిబి తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఒక్కొక్క అధికారి ఇళ్లల్లో సెర్చ్ చేస్తే, సాధారణ స్థాయిలో కాకుండా, భారీగా అవినీతి, ఆస్తులు, వివరాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన ఇరిగేషన్ ఇంజినీర్ల అవినీతిని ఏసిబి వెలుగులోకి తీసుకొస్తోంది. అప్పటి ప్రభుత్వాధినేతల అవినీతిని కూడా బయటపెట్టాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోవద్దు. మేము కోరినట్లు సీబీఐ, ఈడీ రంగప్రవేశం చేయాలన్న డిమాండ్‌ను మరోసారి గుర్తు చేస్తున్నాం.తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రతి రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరిగే సిడబ్ల్యూసీ మీటింగ్, బహిరంగ సభ, పార్టీ కార్యక్రమాల్లో ఒకచేత రాజ్యాంగ పుస్తకం పట్టుకుని "మేము రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఉన్నాం" అని చెప్పడం చూస్తున్నాం. తాజాగా ప్రతీ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని కేంద్రం మార్గదర్శక సూత్రాలు పంపించినా, దేశంలోని చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 18 నెలలుగా గ్రామాల్లో పాలన నిలిపివేసింది. నగరాలు మురికి కూపాల్లా మారాయి. కేంద్రం నిధులు అందించకపోతే సాధారణ కార్యకలాపాలు కూడా ఆగిపోతున్నాయి. ఆర్థిక సంఘం ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రాలకే భవిష్యత్‌లో నిధులు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ, ఈ ప్రభుత్వం మాత్రం స్పందించలేదన్నారు.. ఎన్నికలు వస్తున్నాయ్ అంటూ మాటలతో మోసం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా తెలంగాణ గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పి, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసారు..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలతో అధికారంలోకి వచ్చామనే నమ్మకంతో కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చి ఎన్నికల్లో గెలవాలని చేస్తు కుట్రను చూస్తున్నాం. ప్రజలు మరోసారి మోసపోయే స్థితిలో లేరు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే వీరిని ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఏజీ, పిఏసీ, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీలు ఇచ్చిన నివేదికల్ని కమిషన్ తీసుకున్నదా లేదా అన్నది చూస్తాం. దోషుల్ని కాపాడుతారో, పట్టుకుంటారో తేలుతుంది.  కాని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో దోచుకున్నవాళ్లను వదిలిపెట్టబోమని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోందన్నారు.

]]>
Sun, 15 Jun 2025 09:21:07 +0530 admin
ఎపి జల దోపిడికి బిజెపి పూర్తి మద్దతు: హరీష్ రావు https://prajakshethrenews.com/ఎపి-జల-దోపిడికి-బిజెపి-పూర్తి-మద్దతు-హరీష్-రావు https://prajakshethrenews.com/ఎపి-జల-దోపిడికి-బిజెపి-పూర్తి-మద్దతు-హరీష్-రావు ఎపి జల దోపిడికి బిజెపి పూర్తి మద్దతు: హరీష్ రావు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 14 :
ఆంధ్రప్రదేశ్ జల దోపిడికి పాల్పడుతోందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఎపి నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ బిజెపి నేతలు ఏం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్ లో బనకచర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బిజెపి పార్టీలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎపి జల దోపిడికి బిజెపికి పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. న్యాయబద్ధంగా రెండు రాష్ట్రాలకు కేంద్రం నీళ్లు పంచాలని.. కానీ ఎపికి బిజెపి మద్దతు తెలుపుతుందని చెప్పారు.పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే నియంత్రించాల్సిన కేంద్రం.. నిధులిస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రం నుండి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డికి, బండి సంజయ్.. ప్రధాన మంత్రితో మాట్లాడి ఎపి నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని బిఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఎపి జల దోపిడిపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలన్నారు. అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి బనకచర్లను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని.. లేకపోతే, బిఆర్ఎస్ ప్రజా పోరాటానికి, న్యాయ పోరాటానికి శ్రీకారం చుడుతుందని హరీష్ రావు అన్నారు

]]>
Sat, 14 Jun 2025 22:42:40 +0530 admin
అహ్మదాబాద్ విమాన దుర్ఘటన మృతుల ఆత్మ శాంతికై శ్రద్ధాంజలి https://prajakshethrenews.com/అహ్మదాబాద్-విమాన-దుర్ఘటన-మృతుల-ఆత్మ-శాంతికై-శ్రద్ధాంజలి https://prajakshethrenews.com/అహ్మదాబాద్-విమాన-దుర్ఘటన-మృతుల-ఆత్మ-శాంతికై-శ్రద్ధాంజలి అహ్మదాబాద్ విమాన దుర్ఘటన మృతుల ఆత్మ శాంతికై శ్రద్ధాంజలి 

ప్రజాక్షేత్ర్, చార్మినార్ :

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచి వేసి దిగ్భ్రాంతికి  గురిచేసిందని ప్రముఖ విద్యావేత్త జ్ఞాన భారతి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ వి ప్రభాకర్ రావు అన్నారు. శుక్రవారం పాత బస్తి గౌలిపుర  జ్ఞాన భారతి ఉన్నత పాఠశాలలో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనలో మృతి చెందిన వారికి ఏర్పాటు చేసిన శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ ఘటనలో సిబ్బందితో సహా 242 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం సమీపంలో ఉన్న డాక్టర్ల హాస్టల్ లోకి దూసుకెళ్లి కూలిపోయి బిల్డింగ్ లో ఉన్న డాక్టర్లు కూడా  చనిపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఇంత పెద్ద దుర్ఘటన జరగడం భారతదేశాన్ని కాకుండా యావత్తు ప్రపంచాన్నే విషాదంలో ముంచిందని పేర్కొన్నారు. బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు రాధాకృష్ణ పవన్ రెడ్డి లు మాట్లాడుతూ మనం ప్రయాణికులను మాత్రమే కాకుండా రేపటి యువ వైద్యులను కూడా కోల్పోయామని, విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ కరుణాచలేశ్వరుని కోరుకుంటున్నామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు  కాశమోని శ్యారావు ముదిరాజ్ మాట్లాడుతూ ఆశలు, ఆవిరి అవడం కలలు కన్నీళ్లుగా మారడం అంటే బహుశా ఈ ఘోర ప్రమాదం మిగిల్చిన విషాదం అని అందులో మృతి చెందిన వారి కుటుంబాల రోదనలు వర్ణనాతీరం అని, భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అమెరికా దేశ పర్యటనలో ఉన్న తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ్ ముదిరాజ్ ఒక సందేశం పంపుతూ ఈ విమాన దుర్ఘటనలో మరణించిన వారికి ప్రధాన సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. ప్రముఖ సంఘ సేవకులు సామ విజయ్ కుమార్ పోతురాజు మాట్లాడుతూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మృతులకు అశ్రునివాళి అర్పిస్తున్నానని అన్నారు. ఈ సంతాప కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ శాఖ బీసీ విభాగం కార్యదర్శి జి వేణుగోపాల్, పాఠశాల సిబ్బంది రమాదేవి, విజయలక్ష్మి, సిహెచ్ స్నేహలత, నిర్మల,ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొని ప్రసంగించి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు సంఘ సేవకులు, అతిధులు జాతీయ జెండాలు చేతబట్టి కొవ్వొత్తులను వెలిగించి ఈ దుర్ఘటంలో మరణించిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

]]>
Fri, 13 Jun 2025 20:50:05 +0530 admin
రేవంత్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా https://prajakshethrenews.com/రేవంత్-క్వాష్-పిటిషన్-పై-హైకోర్టులో-విచారణ-మరోసారి-వాయిదా https://prajakshethrenews.com/రేవంత్-క్వాష్-పిటిషన్-పై-హైకోర్టులో-విచారణ-మరోసారి-వాయిదా రేవంత్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ  మరోసారి వాయిదా
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
తనపై నమోదు అయిన భూవివాదం కేసును క్వాష్ చేయాలని గతంలో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. శేరిలింగంపల్లిలోని గోపన్ పల్లిలో భూవివాదానికి సంబంధించిన కేసు వ్యవహారంలో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ధర్మాసనం విచారణకు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.
గోపన్ పల్లిలోని సర్వే నెంబర్ 127కు సంబంధించి రేవంత్ రెడ్డిపై 2016లోనే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. చార్జీషీట్ కూడా దాఖలు చేశారు. ఈ భూవివాదంలో రేవంత్ రెడ్డి హస్తం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో రేవంత్ , ఆయన సోదరుడు కొండల్ రెడ్డితోపాటు లక్ష్మయ్య అనే వ్యక్తిని చేర్చారు.
అయితే, ఇదంతా రేవంత్ పై కక్షపూరితంగా కేసు నమోదు చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అప్పటి నుంచి ఈ కేసుపై విచారణ జరుగుతోంది. దీంతో ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన కోర్టు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది

]]>
Fri, 13 Jun 2025 17:03:11 +0530 admin
ఎమ్మెల్యే పల్లాను పరామర్శించిన కేటీఆర్ https://prajakshethrenews.com/ఎమ్మెల్యే-పల్లాను-పరామర్శించిన-కేటీఆర్ https://prajakshethrenews.com/ఎమ్మెల్యే-పల్లాను-పరామర్శించిన-కేటీఆర్ ఎమ్మెల్యే పల్లాను పరామర్శించిన కేటీఆర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో దవాఖానలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పల్లా రాజేశ్వర్ తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. శస్త్ర చికిత్స అనంతరం  బాగానే కోలుకుంటున్నట్లు  పల్లా రాజేశ్వర్ తెలిపారు. పల్లా రాజేశ్వర్  వేగంగా కోలుకుని, త్వరలోనే తిరిగి ప్రజాక్షేత్రంలో యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీర్  ఆకాంక్షించారు. కేటీఆర్  వెంట మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,  పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు

]]>
Fri, 13 Jun 2025 16:09:21 +0530 admin
కొమ్మినేనికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు https://prajakshethrenews.com/కొమ్మినేనికి-సుప్రీం-కోర్టు-బెయిల్-మంజూరు https://prajakshethrenews.com/కొమ్మినేనికి-సుప్రీం-కోర్టు-బెయిల్-మంజూరు కొమ్మినేనికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ :
 ఏపీ రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీం కోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. కొమ్మినేని  బెయిల్  పిటీషన్ కింది కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.  మరోసారి అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయవద్దని కొమ్మినేనికి సుప్రీం ధర్మాసనం సూచించింది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కింది కోర్టు విధించిన షరతులకు లోబడే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు ట్రయల్ కోర్టు ఇస్తుందని ధర్మాసనం తెలిపింది.

]]>
Fri, 13 Jun 2025 14:51:58 +0530 admin
దేవాదాయ భూముల జోలికోస్తే కఠిన చర్యలు : మంత్రి కొండ సురేఖ https://prajakshethrenews.com/దేవాదాయ-భూముల-జోలికోస్తే-కఠిన-చర్యలు-మంత్రి-కొండ-సురేఖ https://prajakshethrenews.com/దేవాదాయ-భూముల-జోలికోస్తే-కఠిన-చర్యలు-మంత్రి-కొండ-సురేఖ దేవాదాయ భూముల జోలికోస్తే కఠిన చర్యలు
రాష్ట్ర మంత్రి కొండ సురేఖ
బోడుప్పల్ లో కబ్జాకు గురైన దేవాదాయ భూముల పరిశీలన

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను కబ్జా కాకుండా చూస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ హామీ ఇచ్చారు.. గురువారం మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్ల లో   దేవాదాయశాఖ భూమి అన్యక్రాంతం అవుతున్న ఫిర్యాదు మేరకు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, మేడ్చల్ జిల్లా రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కొండ సురేఖ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 33/8 లో 10.35 ఎకరాలు,33/9 లో 13 ఎకరాలు,33/10 లో 6.23 ఎకరాల చొప్పున మొత్తం 30.28 ఎకరాల భూమిని 1968 లో టీఎల్పీ చారిటబుల్ ట్రస్ట్ కు భూ పట్టదారులైన తోటకూర ఎల్లయ్య యాదవ్ ఇతరులు రామయ్య చౌదరి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం సీలింగ్ యాక్ట్ నిబంధనల మేరకు సదరు భూమిని 1976 సంవత్సరంలో దేవాదాయ శాఖకు అప్పగించారని తెలిపారు. దేవాదాయ శాఖ భూములు కబ్జాకు పాల్పడిందేవరైన సరే వదిలే ప్రసక్తే లేదని కబ్జా అయిన భూములను స్వాధీనం చేసుకొని కబ్జా దారులపై పీడీ యాక్ట్ పేడుతామని హెచ్చరించారు.మంత్రి వెంట పర్యటించిన వారిలో బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్,కీసర అర్డీవో ఉపేందర్ రెడ్డి, మేడిపల్లి తహసీల్దారు హసీనా, దేవాదాయ శాఖ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు

]]>
Thu, 12 Jun 2025 22:08:09 +0530 admin
తెలంగాణ స్పీకర్ ను కలిసిన యూపీ స్పీకర్ https://prajakshethrenews.com/తెలంగాణ-స్పీకర్-ను-కలిసిన-యూపీ-స్పీకర్ https://prajakshethrenews.com/తెలంగాణ-స్పీకర్-ను-కలిసిన-యూపీ-స్పీకర్ తెలంగాణ స్పీకర్ ను కలిసిన యూపీ స్పీకర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి  గడ్డం ప్రసాద్ కుమార్ ను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్  సతీష్ మహానా గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సతీష్ మహానా దంపతులు  బంజారాహిల్స్, మంత్రుల నివాసంలోని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అధికార నివాసానికి విచ్చేసారు. తన నివాసానికి విచ్చేసిన ఉత్తరప్రదేశ్ స్పీకర్ దంపతులను స్పీకర్ ప్రసాద్ కుమార్ శాలువా, పుష్ప గుచ్ఛంతో సన్మానించి మెమొంటో బహుకరించారు. ఈసందర్భంగా తెలంగాణ, ఉత్తరప్రదేశ్ శాసనసభల నిర్వాహణపై ఇరువురు స్పీకర్లు ముచ్చటించారు.

]]>
Thu, 12 Jun 2025 22:01:07 +0530 admin
ఫిట్‌నెస్ లేని బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేస్తాం https://prajakshethrenews.com/ఫిట్నెస్-లేని-బస్సులు-రోడ్డెక్కితే-సీజ్-చేస్తాం https://prajakshethrenews.com/ఫిట్నెస్-లేని-బస్సులు-రోడ్డెక్కితే-సీజ్-చేస్తాం ఫిట్‌నెస్ లేని బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేస్తాం
 ప్రజా క్షేత్ర్, చార్మినార్ : 
పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా  స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించి స్కూల్ బస్సులను తనిఖీ చేస్తున్నామని  మోటారు వెహికల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్ కుమార్ తెలిపారు. గురువారం పాతబస్తీ లోని పలు ప్రాంతాల్లో స్కూల్స్ బస్సులను తనిఖీ చేసి వాహనాలకు సంబందించిన పూర్తి డాక్యుమెంట్ను పరిశీలించడం జరిగిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడిపితే శాఖ పరంగా చర్యలు తప్పవన్నారు. పరిమితికి మించి వాహనాల్లో విద్యార్థులను తరలించకూడదన్నారు. నిరంతరం స్కూల్ బస్సుల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. బస్సుల కండీషన్‌, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్‌ లేని బస్సులపై కేసులు నమోదు  చేస్తామన్నారు. పాఠశాలల యాజమాన్యాలు  సైతం రోడ్డు నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలను అరికట్ట వచ్చాన్నారు. ఒక్క రోజుతోనే కాకుండా నిరంతరం వాహనాల  తనిఖీలు కొనసాగుతాయన్నారు.

]]>
Thu, 12 Jun 2025 21:56:16 +0530 admin
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ కు కళ్లు చెదిరే ఆస్తులు? https://prajakshethrenews.com/కాళేశ్వరం-ప్రాజెక్టు-ఇంజినీర్-కు-కళ్లు-చెదిరే-ఆస్తులు https://prajakshethrenews.com/కాళేశ్వరం-ప్రాజెక్టు-ఇంజినీర్-కు-కళ్లు-చెదిరే-ఆస్తులు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ కు కళ్లు చెదిరే ఆస్తులు?
పదవిని అడ్డం పెట్టుకుని వందల కోట్లు కూడబెట్టిన నూనె శ్రీధర్?
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన అధికారి,
 నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్‌ కళ్లు చెదిరే ఆస్తులు కూడబెట్టారు. ఆయన ఇళ్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ, అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. శ్రీధర్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో జరిపిన తనిఖీల్లో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్‌ లోని తెల్లాపూర్‌లో ఒక విల్లా, షేక్‌పేటలో ఫ్లాట్‌, అమీర్‌పేటలో వాణిజ్య భవనంతో పాటు కరీంనగర్‌లో మూడు ఓపెన్‌ ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ నగరాల్లో 3 ఇండిపెండెంట్‌ ఇళ్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, వివిధ ప్రాంతాల్లో మరో 19 ఓపెన్‌ ప్లాట్లు శ్రీధర్‌ పేరు మీద ఉన్నట్లు తేలింది. వీటితో పాటు రెండు కార్లు, పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు నిల్వలు కూడా ఏసీబీ అధికారులు కనుగొన్నారు. ఈ ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ వందల కోట్లలో ఉంటుందని ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేస్తోంది.
నూనె శ్రీధర్‌ ప్రస్తుతం ఎస్‌ఆర్‌ఎస్పీ డివిజన్‌-8లో ఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీల పనులను ఆయన పర్యవేక్షించారు. అంతేకాకుండా, ప్రస్తుతం ఇరిగేషన్‌ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. తన పదవిని అడ్డం పెట్టుకుని శ్రీధర్‌ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా సోదాలు కొనసాగించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటన నీటిపారుదల శాఖలో కలకలం రేపింది.

]]>
Thu, 12 Jun 2025 21:51:13 +0530 admin
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ https://prajakshethrenews.com/ఇచ్చిన-హామీలను-నెరవేర్చకుండా-ప్రజలను-మోసం-చేస్తున్న-రేవంత్-సర్కార్ https://prajakshethrenews.com/ఇచ్చిన-హామీలను-నెరవేర్చకుండా-ప్రజలను-మోసం-చేస్తున్న-రేవంత్-సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్
     నిప్పులు చెరిగిన ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
ప్రజా క్షేత్ర్, యాదాద్రి భువనగిరి జూన్ 12 :
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పక్షాలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆత్మ‌కూరు (ఎం) మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ అంటేనే ఒక చరిత్ర అన్నారు. ఆయన ఆనవాళ్లను చెరిపేస్తాన‌ని విర్రవిగుతున్న సీఎం రేవంత్ రెడ్డి కాలగర్భంలో కలిసిపోవడం ఖాయ‌మ‌న్నారు. ఇందిరమ్మ ఇళ్ల ను అర్హులైన వారికి ఇవ్వకుండా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు మంజూరు చేయడం సరికాదన్నారు.నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల 28 వేల మంది దరఖాస్తులు చేసుకోవడంతో దడుసుకున్న ప్రభుత్వం జూన్ 2న రుణాల మంజూరు అనుమతి పత్రాలను ఇస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా వాయిదాలు వేస్తూ నిరుద్యోగులను నిరాశ పరిచిందన్నారు.బూటకపు మాటలతో పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో రానున్న రోజుల్లో గ్రామాల్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను తరిమికొట్టడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు యాస ఇంద్రారెడ్డి, కోరే భిక్షపతి, ప్రతికంఠం పూర్ణచందర్ రాజు, బిసు ధనలక్ష్మి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సిలిపురం అరుణ, బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ దేవరపల్లి ప్రవీణ్ రెడ్డి, కొరటికల్ మాజీ సర్పంచ్ కోల సత్తయ్య గౌడ్, యువజన విభాగం మండల అధ్యక్షుడు శంతన్ రాజు, బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షుడు సతీష్ గౌడ్, బీఆర్ఎస్ మండల నాయకులు గనగాని మల్లేశం గౌడ్, సైదులు, మధుసూదన్, రాములు తదితరులు పాల్గొన్నారు.

]]>
Thu, 12 Jun 2025 21:09:06 +0530 admin
కేటిఆర్ సిగ్గుందా ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా : మెట్టు సాయికుమార్ https://prajakshethrenews.com/కేటిఆర్-సిగ్గుందా-ఏం-మాట్లాడుతున్నావో-అర్థం-అవుతుందా-మెట్టు-సాయికుమార్ https://prajakshethrenews.com/కేటిఆర్-సిగ్గుందా-ఏం-మాట్లాడుతున్నావో-అర్థం-అవుతుందా-మెట్టు-సాయికుమార్ కేటిఆర్ ఒక అపురూప దృశ్య కావ్యం
          కేటిఆర్ సిగ్గుందా ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా
కొంతమంది బేకర్ గాండ్లు చిల్లర గాండ్లు రోడ్ల మీదకు వచ్చి మాట్లాడుతున్నారు
                      ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 12 :
కేటిఆర్ ఒక అపురూప దృశ్య కావ్యమని,కేటిఆర్ సిగ్గుందా ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందాఅని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ నిప్పులు చెరిగారు.కొంతమంది బేకర్ గాండ్లు చిల్లర గాండ్లు రోడ్ల మీదకు వచ్చి మాట్లాడుతున్నారని, మేం మాట్లాడితే చెవుల్లో రక్తాలు కారుతాయన్నారు.బేకర్ మాటలు మాట్లాడుతున్న బెవకుబ్ గానివి నువ్వుతెలంగాణ ఒక్కటే కాదు దక్షిణ రాష్ట్రాల్లో చిల్లర గాడు ఎవరయినా ఉన్నాడు అంటే వాడు కేటిఆర్ ఒక్కడే నన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ గురించి మాట్లాడే స్థాయి కాదు నీధి మాకు సంస్కారం అడ్డు వస్తుందిమేం మాట్లాడే భాష మీరు తట్టుకోలేరు ఫాల్తు మాటలు మాట్లాడే ముందు తెలుసుకో మైక్ ముందుకు వస్తె చిల్లర మల్లర మాట్లాడకు లుచ్చగాడువి నువ్వునీలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చిన రేవంత్ కాలి గోటికి సరిపోరన్నారు.నాయన పేరు చెప్పి ఇంకొకరు పేరు చెప్పి రేవంత్ రాలే అయ్యా పేరు మీద రాజకీయాల్లోకి వచ్చిన లుచ్చ నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్తం మరుగుతున్నదిచిల్లర మాటలు మాట్లాడుతవర చిల్లరగా ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి తెలుసుకో అని  అన్నారు.ఐదారు మంది చిల్లర గాండ్లను పక్కన బెట్టుకొని ఏం మాట్లాడుతున్నావ్ రారేవంత్ రెడ్డితో ఫోటో దిగి ఫోటో లు పెట్టింది మర్చిపోయావా కౌశిక్వీడు ఇవ్వాళ మాట్లాడుతున్నాడుతిస్మార్ ఖాన్ మాటలు మాట్లాడుతున్నావ్ నోరు అదుపులో పెట్టుకోకుండా చిల్లర మాట్లాడితేతిరిగి సమాధానం చెప్తే తట్టుకోలేరు కేటిఆర్ భజన సంఘాలు కాళ్ళు మొక్కండి ఏమయినా చేసుకోండిరేవంత్ గురించి మాట్లాడితే మీ బద్దలు బాసింగలు అవుతాయని హెచ్చరిఇంచారు.

]]>
Thu, 12 Jun 2025 21:03:31 +0530 admin
తెలంగాణ ఉద్యమకారుల నిరసన https://prajakshethrenews.com/తెలంగాణ-ఉద్యమకారుల-నిరసన https://prajakshethrenews.com/తెలంగాణ-ఉద్యమకారుల-నిరసన తెలంగాణ ఉద్యమకారుల నిరసన
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగలేదని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల మహిళా వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు కోతి మాధవిరెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ నాంపల్లి లోని గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్  ఇచ్చిన హామీల మేరకు ఉద్యమకారులకు మోసం చేశారని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తున్నా మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం రం ఉద్యమకారులను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
రాహుల్, సోనియా గాంధీ ఇచ్చిన హామీలు మేరకే రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పి మొండి చేయి చూపించారని మండిపడ్డారు.
నాటి తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని, అలాగే సంక్షేమ సంఘంను ఏర్పాటు చేయాలని కోరారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు

]]>
Wed, 11 Jun 2025 23:20:43 +0530 admin
సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం? https://prajakshethrenews.com/సింగర్-మంగ్లీ-బర్త్-డే-పార్టీలో-గంజాయి- కలకలం https://prajakshethrenews.com/సింగర్-మంగ్లీ-బర్త్-డే-పార్టీలో-గంజాయి- కలకలం సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం
ప్రజా క్షేత్ర్రం, వెబ్గా న్యూస్ :
చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో సింగర్ మంగ్లీ బర్త్ డే  పార్టీ జరిగింది. విదేశీ మద్యం, గంజాయి వినియోగం పై సమాచారం అందగానే పోలీసులు దాడులు జరిపారు. అక్కడ దామోదర్ అనే వ్యక్తి గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు.  మంగ్లీ అనుమతి లేకుండా బర్త్ డే పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. దాంతో  ఫోక్ సింగర్ మంగ్లీ పై కేసు నమోదు అయింది.  విదేశీ మద్యం అనుమతి లేకుండా  పార్టీ నిర్వహించడం పై కేసు నమోదు అయింది. దాంతో పాటు  త్రిపురా రిసార్ట్ జిఎం శివరామకృష్ణ పై కేసు నమోదు చేసారు.  అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డిజే సీజ్ చేసారు. పార్టీలో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఈ ఉదంతం పై నా బర్త్ డే పార్టీ లో మద్యం లభించిన మాట వాస్తవమే. అయితే.. నాకు వాటికి అనుమతి తీసుకోవాలని  తెలియదు... ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి కూడా ఎక్కడో  సేవించి ఇక్కడికి వచ్చారని పోలీసులే తెలిపారని మంగ్లీ పేర్కొంది.

]]>
Wed, 11 Jun 2025 23:15:36 +0530 admin
కాళేశ్వరం విచారణకు హాజరైన కేసీఆర్ https://prajakshethrenews.com/కాళేశ్వరం-విచారణకు-హాజరైన-కేసీఆర్ https://prajakshethrenews.com/కాళేశ్వరం-విచారణకు-హాజరైన-కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరైన కేసీఆర్
50 నిమిషాల పాటు వన్ టూ వన్ ప్రశ్నలు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 11 :
కాళేశ్వరంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ విచారణ ముగిసింది. కేసీఆర్‌ను వన్‌ టు వన్‌ విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. పలు కీలక వివరాలను అడిగి తెలుసుకుంది. మధ్యాహ్నం 12గంటలకు మొదలైన కేసీఆర్‌ విచారణ.. 50 నిమిషాల పాటు కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌కు కమిషన్‌ పలు కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.  కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో మాజీ సీఎం కేసీఆర్ విచారణ పూర్తి అయింది. దాదాపు 50 నిమిషాల పాటు ఈ ఆయన్ని కమిషన్ విచారించింది. అనుమానం ఉన్న వివిధ అంశాలపై ప్రశ్నించింది. ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్‌లో జరిగే పీసీ ఘోష్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. ఆయన్ని కమిటీ హాల్‌లోకి తీసుకెళ్తే తనకు వేరుగా విచారించాలని రిక్వస్ట్ చేశారు కేసీఆర్. ఆయన అభ్యర్థనను ఘోష్‌ అంగీకరించారు. మిగతా నాయకులను బయటకు పంపేశారు. కేసీఆర్‌ను ఓ రూమ్‌లో ఉంచి ప్రశ్నలు అడిగినట్టు సమాచారం అందుతోంది. జలుబు ఉందని అందుకే తాను గట్టిగా మాట్లాడలేనని కేసీఆర్ చెప్పారని సమాచారం. ఎక్కువ మంది ఉన్న హాల్‌లో విచారిస్తే తన మాట సరిగా వినిపించకపోవచ్చని కూడా వివరించారు. ఆయన అభ్యర్థనను మన్నించిన పీసీఘోష్ కమిషన్ ఒంటరిగా ప్రత్యేక రూమ్‌లో విచారించేందుకు ఓకే చెప్పింది. విచారణ సందర్భంగా తన వెంట తెచ్చుకున్న కీలకమైన డాక్యుమెంట్స్‌ను కూడా కేసీఆర్ అధికారులకు వివరించారని తెలుస్తోంది. విచారణ అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కారు డోరులో నిలబడి.. కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. నేరుగా హైదరాదాద్ లోని బీఆర్కే భవన్ నుంచి ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు కేసీఆర్‌ పయనమయ్యారు.కోర్టు హాల్‌లో కేవలం ముగ్గురికే అనుమతిచ్చిన కమిషన్‌.. మాజీమంత్రులు, ఎమ్మెల్యేలను బయటకు పంపించారు. కోర్టు హాల్‌లో కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతించింది. విచారణలో జస్టిస్ ఘోష్, కమిషన్ కార్యదర్శి మురళీధర్ కలిసి కేసీఆర్ ను ప్రశ్నించారు.కాగా.. బీఆర్‌కే భవన్‌లో విచారణకు హాజరైన రెండో మాజీ సీఎంగా కేసీఆర్‌ నిలిచారు. గతంలో జస్టిస్‌ శ్రీరాములు కమిషన్‌ ముందు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ హాజరయ్యారు. మల్లెల బాజ్జీపై హత్యాయత్నం కేసులో విచారణను ఎదుర్కొన్నారు ఎన్టీఆర్‌.. మాజీ సీఎం హోదాలో ఎన్టీఆర్‌ తర్వాత… BRK భవన్‌లో న్యాయవిచారణ ఎదుర్కొన్న రెండో సీఎంగా కేసీఆర్‌ నిలిచారు.మొదట ఓపెన్‌ కోర్టులో కేసీఆర్‌ బహిరంగ విచారణ జరుగుతుందని అంతా భావించినా… ఆరోగ్యరీత్యా వన్‌ టు వన్‌ విచారణ కోరారు కేసీఆర్‌. ఆయన విజ్ఞప్తిని అంగీకరించిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌… కేసీఆర్‌తో పాటు లోపలికి 9 మందికి అనుమతించింది. అయితే, చివరగా హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మా రావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు లోపలికి అనుమతించారు.ఇక, కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR.. కాళేశ్వరం తెలంగాణలో కాకుండా.. ఇంకెక్కడ కట్టినా కేసీఆర్‌కు అత్యున్నత పురస్కారం దక్కేదన్నారు కేటీఆర్‌. చిల్లర రాజకీయాలు చేసే పార్టీలు ఉన్నచోట కాకుండా, ఇంకెక్కడైనా కడితే.. గొప్ప గౌరవం దక్కేదన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు ప్రయత్నించిన కేసీఆర్‌పై కాంగ్రెస్‌, బీజేపీలు రాజకీయకుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కమిషన్ విచారణలో నిజాలన్నీ నిగ్గుతేలుతాయన్న కేటీఆర్‌.. ఈ పార్టీలకు ప్రజలకు తగిన బుద్ధి చెబుతాయని స్పష్టం చేశారు.మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణలో చివరి ఘట్టం ముగిసినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు 114 మందిని విచారించిన కమిషన్ 115వ వ్యక్తిగా కేసీఆర్‌ను ప్రశ్నించింది. ప్పటికే హరీష్ రావు, ఈటలను విచారించిన కమిషన్ .. కేసీఆర్‌ను కూడా విచారించడంతో… జస్టిస్‌ ఘోష్ కమిషన్‌ టాస్క్‌ కంప్లీట్‌ అయినట్టు తెలుస్తోంది. జులై నెలాఖరుతో గడువు ముగుస్తుండటంతో.. ఇక కమిషన్‌ కమిషన్‌ తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.కరెక్టుగా 11గంటలకు బీఆర్‌కే భవన్‌కు చేరుకున్నారు కేసీఆర్‌.. పదిగంటల తర్వాత ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి బయల్దేరిని కేసీఆర్‌… భారీ కాన్వాయ్‌గా హైదరాబాద్‌ బయలు దేరగా, ఆయనకు మద్దతుగా గులాబీ దండు వెంట నడిచింది. 12గంటలకు విచారణ ప్రారంభం కాగా… సరిగ్గా ఒక గంటల తర్వాత… బీఆర్కే భవన్‌ వెలుపలకు వచ్చారు.ఇక, కేసీఆర్‌ విచారణ సందర్భంగా… ఆసక్తికర పరిణామం జరిగింది. ఇటీవల తండ్రికి లేఖరాసి వివాదం రేపిన ఎమ్మెల్సీ కవిత… తొలిసారిగా కేసీఆర్‌ను కలిశారు. భర్తతో కలిసి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత కేసీఆర్‌ను కలిశారు. ఇప్పటికే కేసీఆర్‌కి నోటీసులు నిరసిస్తూ ఇందిరాపార్క్‌ దగ్గర ధర్నాచేసిన కవిత..ఇవాళ ఫామ్‌హౌస్‌కి వెళ్లి కేసీఆర్‌ను కలవడం ఆసక్తి రేపుతోంది.
పల్లా రాజేశ్వర రెడ్డికి పరామర్శ...
విచారణ అనంతరం కేసీఆర్ నేరుగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లారు. ఉదయం ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌లో బాత్రూమ్‌లో రాజేశ్వర్‌రెడ్డి జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన కాలు విరిగినట్టు తెలుస్తోంది. వెంటనే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన్ని కవిత పరామర్శించి వచ్చారు. విచారణ అనంతరం కేసీఆర్‌ ఆసుపత్రికి వెళ్లారు. రాజేశ్వర్‌రెడ్డిని పరామర్శించారు.

]]>
Wed, 11 Jun 2025 23:11:41 +0530 admin
గాంధీ భవన్ ప్రజా దర్బార్ లో 109 కి పైగా ప్రజల నుంచి వినతులు https://prajakshethrenews.com/గాంధీ-భవన్-ప్రజా-దర్బార్-లో-109-కి-పైగా-ప్రజల-నుంచి-వినతులు https://prajakshethrenews.com/గాంధీ-భవన్-ప్రజా-దర్బార్-లో-109-కి-పైగా-ప్రజల-నుంచి-వినతులు గాంధీ భవన్ ప్రజా దర్బార్ లో 109 కి పైగా ప్రజల నుంచి వినతులు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 11 :
బుదవారం గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు ప్రవేశపెట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా  109 కి పైగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.  రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వినతులు అధికంగా వచ్చాయి.అనంతరం మంత్రి మీడియా సమావేశం లో మాట్లాడుతూ  ప్రజల సమస్యలను ఆయా శాఖల అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేశారు.  సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులపై నమ్మకంతో ప్రజలు పెద్ద ఎత్తున గాంధీ భవన్‌కి తరలివచ్చారు.వచ్చిన అన్ని వినతులను పరిశీలించి తగిన పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు

]]>
Wed, 11 Jun 2025 22:55:05 +0530 admin
వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు https://prajakshethrenews.com/వినియోగదారుల-సమస్యల-సత్వర-పరిష్కారానికి-సీజీఆర్ఎఫ్-లోకల్-కోర్టులు https://prajakshethrenews.com/వినియోగదారుల-సమస్యల-సత్వర-పరిష్కారానికి-సీజీఆర్ఎఫ్-లోకల్-కోర్టులు వినియోగదారుల సమస్యల  సత్వర పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు
నిజామాబాద్ చైర్ పర్సన్ ఎరుకల నారాయణ
 
ప్రజా క్షేత్ర్, మెట్ పల్లి :
అపరిష్కృతంగా మిగిలిపోయిన విద్యుత్ సంబంధిత సమస్యలు తక్షణమే పరిష్కరించడానికి లోకల్ కోర్టులు నిర్వహిస్తున్నామని, అందుకు విద్యుత్ అధికారులు,సిబ్బంది మెరుగైన సేవలు అందించాలని సీజీఆర్ఎఫ్-2, నిజామాబాద్ చైర్ పర్సన్ ఎరుకల నారాయణ పిలుపునిచ్చారు. బుధవారం మెట్ పల్లి లో విద్యుత్ వినియోగదారుల సమస్యలకు సంబంధించి ఏర్పాటు చేసిన పరిష్కార వేదిక-లోకల్ కోర్టు ఫోరమ్ చైర్ పర్సన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికారులు వినియోగారుల సమస్యను లోతుగా పరిశీలించి వెనువెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని, ఉపేక్షిస్తే, అలసత్వం ప్రదర్శించిన ఉద్యోగులపై కఠినమైన చర్యలుంటాయన్నారు.
వినియోగదారుల పట్ల జవాబుదారీ తనంతో ఉండాలని, అన్ని విధ్యుత్ కార్యాలయాల ముందర పౌర సేవా పత్రం అతికించాలని, ఇంజనీర్లు, సిబ్బంది చరవాణి నంబర్లను గోడలపై రాయించాలని ఆదేశించారు.
రైతులు, వినియోగారులు విద్యుత్ ఆదా కొరకు తమ వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు బిగించుకోవాలని, ప్రమాదాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోకల్ కోర్టు లో ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదని, భవిష్యత్తులో సిజిఆర్ఎఫ్ లోకల్ కోర్టు ల గురించి వినియోగదారుల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిజిఆర్ఎఫ్ మెంబర్ టెక్నికల్ రామకృష్ణ, మెంబర్ ఫైనాన్స్ కిషన్, జగిత్యాల ఎస్ఈ షాలియా నాయక్, మెటుపల్లి డిఈ గంగారాం, ఏడీఈ లు మనోహర్, రఘుపతి, ఏఈలు రవి, ప్రదీప్, శివకుమార్, శ్రీనివాస్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Wed, 11 Jun 2025 22:39:05 +0530 admin
బీజేపీలో ఉండి బీసీలను మోసం చేయాలని చూస్తున్న ఆర్ కృష్ణయ్య : ఈరవత్రి అనిల్ https://prajakshethrenews.com/బీజేపీలో-ఉండి-బీసీలను-మోసం-చేయాలని-చూస్తున్న-ఆర్-కృష్ణయ్య-ఈరవత్రి-అనిల్ https://prajakshethrenews.com/బీజేపీలో-ఉండి-బీసీలను-మోసం-చేయాలని-చూస్తున్న-ఆర్-కృష్ణయ్య-ఈరవత్రి-అనిల్ బీజేపీలో  ఉండి బీసీలను మోసం చేయాలని చూస్తున్న ఆర్ కృష్ణయ్య
    జిఓ ను కోర్టు కొట్టేస్తే ఆర్ కృష్ణయ్య బిల్లును 9 వ  షెడ్యూల్ లో పెట్టించగలడా?
40ఏండ్ల నుండి బిసిల రిజర్వేషన్ కోసం పోరాడి ఎందుకు రిజర్వేషన్ సాధించలేదు
         ప్రశ్నించిన మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 11 :
 బీజేపీ లో  ఉండి ఆర్ కృష్ణయ్య బీసీలను మోసం చేయాలని చూస్తున్నారని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్  విమర్శించారు. బుదవారం గాంధి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ 42 శాతం బిసి రిజర్వేషన్ కు సంబంధించి  రేవంత్ రెడ్డి  ప్రభ్జుత్వం తెచ్చిన  జిఓ ను కోర్టు కొట్టేస్తే ఆర్ కృష్ణయ్య బిల్లును అమిత్ షా తో మాట్లాడి  9 వ  షెడ్యూల్ లో పెట్టించగలడా? అని సవాల్ విసిరారు.40ఏండ్ల నుండి బిసిల రిజర్వేషన్ కోసం పోరాడి ఎందుకు రిజర్వేషన్ సాధించలేదు   ప్రశ్నించిన మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్లోకల్ బాడీ ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ కల్పించాలి అని ఆర్ కృష్ణయ్య అంటుండని, రిజర్వేషన్ మీద ప్రత్యేక GO విడుదల చేయాలని అంటుండులేదంటే గాంధీ భవన్ ను ముట్టడి చేస్తాం ధర్నా చేస్తాం అంటుండం ను కోర్టు కొట్టేస్తే ఆర్ కృష్ణయ్య బిల్లును 9th షెడ్యూల్ లో పెట్టించగలడా?జవాబు చెప్పాలని డిమాండ్ చేసారు. దామాషా ప్రకారం బిసి లకు హక్కులను కల్పించాలని రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చిండురాహుల్ గాంధీ ఒత్తిడి వలనే కేంద్రంలో బీజేపీ కులగణన చేస్తున్నదని ఆర్ కృష్ణయ్య ఒప్పుకోవాలన్నారు.తెలంగాణ ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లు పెట్టి గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపిన మన్నారు.ఆర్ కృష్ణయ్య కు చిత్త శుద్ధి ఉంటే బీజేపీ ఎంపీ గా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి బిల్లును 9th షెడ్యూల్ లో పెట్టించాలిలేదంటే కాంగ్రెస్ పై విమర్శలు మానుకోవాలి1992 లో ఇంద్ర సహని వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో 50శాతం దాటకుడదని కాప్ విధించారు2006 లో నాగరాజు కేసులో ప్రమోషన్స్ కు కూడా 50శాతం మించకూడదని చెప్పారు. ఎన్టిఆర్ హాయంలో 32శాతం రిజర్వేషన్ ఉందిసీఎం రేవంత్ రెడ్డి కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తుండు అనీ గ్రహించాలన్నారు.

]]>
Wed, 11 Jun 2025 22:35:35 +0530 admin
టీపీసీసీ ప్రధాన కార్యదర్శులను సత్కరించిన మామిడాల శ్రీనివాస్ https://prajakshethrenews.com/టీపీసీసీ-ప్రధాన-కార్యదర్శులను-సత్కరించిన-మామిడాల-శ్రీనివాస్ https://prajakshethrenews.com/టీపీసీసీ-ప్రధాన-కార్యదర్శులను-సత్కరించిన-మామిడాల-శ్రీనివాస్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శులను సత్కరించిన మామిడాల శ్రీనివాస్

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

నూతనంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా  నియమితులైన అల్లం భాస్కర్, కొప్పుల ప్రవీణ్ కుమార్ లను శాలువాతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేస్తున్న యాకుత్ పుర నియోజకవర్గం ఏ బ్లాక్ ప్రెసిడెంట్ మామిడాల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు శశి యాదవ్ చిన్న తదితరులు 

]]>
Wed, 11 Jun 2025 21:27:39 +0530 admin
వినియోగదారుల హక్కులను కాపాడడమే వినియోగదారుల కోర్టు లక్ష్యం : జస్టిస్ ఎమ్మెస్ కే జయశ్వాల్ https://prajakshethrenews.com/వినియోగదారుల-హక్కులను-కాపాడడమే-వినియోగదారుల-కోర్టు-లక్ష్యం-జస్టిస్-ఎమ్మెస్-కే-జయశ్వాల్ https://prajakshethrenews.com/వినియోగదారుల-హక్కులను-కాపాడడమే-వినియోగదారుల-కోర్టు-లక్ష్యం-జస్టిస్-ఎమ్మెస్-కే-జయశ్వాల్ వినియోగదారుల హక్కులను కాపాడడమే వినియోగదారుల కోర్టు లక్ష్యం

జస్టిస్ ఎమ్మెస్ కే జయశ్వాల్

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

హైదరాబాద్ బర్కత్ పుర లో తెలంగాణ అఖిలభారత గ్రాహక్ పంచాయతీ సాధారణ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వినియోగదారుల కోర్టు జస్టిస్ ఎమ్మెస్ కే జయశ్వాల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా 2024 - 2025 సంవత్సరానికి గాను ఆదాయ వ్యయం వివరాలను తెలంగాణ ప్రాంత కోశాధికారి డి మాణిక్ రావు  ఈ సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా జస్టిస్ ఎమ్మెస్ కె  జయస్వాల్  మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను రక్షించడంతో పాటు వారికి న్యాయం అందించడమే వినియోగదారుల కోర్టు లక్ష్యం అన్నారు. వినియోగదారుల హక్కులను కాపాడటానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కోర్టును ఏర్పాటు చేసిందన్నారు. వ్యాపారి చేత మోసగించబడి, తన హక్కులను కోల్పోయిన ఏ వినియోగదారుడైనా ఈ చట్టం కింద వ్యాపారిపై ఫిర్యాదు చేయవచ్చని, కేసు దాఖలు చేయడానికి వినియోగదారుడి వద్ద సరైన పత్రాలు ఉండాలన్నారు. వినియోగదారుల హక్కులుఉల్లంఘించబడినప్పుడల్లా పరిహారం కోరే హక్కు ఉంటుందన్నారు. అలాగే  సమాజంలో స్వచ్ఛంద సంస్థ అయినటువంటి గ్రాహక్ పంచాయతీ సేవలను గుర్తించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రాంత అధ్యక్షులు బండి నరేష్, దక్షిణ క్షేత్ర సంఘటన మంత్రి నది దత్తాత్రేజీ, తెలంగాణ అఖిల భారత గ్రామపంచాయతీ ఇన్చార్జ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Tue, 10 Jun 2025 21:00:15 +0530 admin
కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాం : మాజీ మంత్రి హరీష్ రావు https://prajakshethrenews.com/కాళేశ్వరం-కమిషన్-అడిగిన-అన్ని-ప్రశ్నలకు-సమాధానం-చెప్పాం-మాజీ-మంత్రి-హరీష్-రావు https://prajakshethrenews.com/కాళేశ్వరం-కమిషన్-అడిగిన-అన్ని-ప్రశ్నలకు-సమాధానం-చెప్పాం-మాజీ-మంత్రి-హరీష్-రావు కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా పిలవడం జరిగింది.
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ : 
కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఆధారాలతో సమాధానాలను కమిషన్ కు అందించడం జరిగిందన్నారు. కమిషన్ విచారణకు హాజరై రాజకీయాలు మాట్లాడటం సరికాదని, రాజకీయాలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం.లోపట ఒకటి చెప్పి బయట ఒకటి చెప్పడం తప్పు అవుతుంది. మొట్టమొదలు తమ్మిడి హట్టి నుండి మేడిగడ్డకు బ్యారేజ్ ను ఎందుకు మార్చారు అనేదానిపై చాలాసేపు డిస్కషన్ జరిగింది. దానికి నేను కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం తమ్మిడి హట్టి దగ్గరే ప్రాజెక్టు కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేసాము. ఇరిగేషన్ మంత్రిగా రివ్యూ చేసినప్పుడు ప్రాణాహిత ప్రాజెక్టు 7 ప్యాకేజీలు 27 భాగాలుగా టెండర్లను పిలిచింది గత కాంగ్రెస్ ప్రభుత్వం.
తల పనులు స్టార్ట్ చేయకుండా తోక పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. మహారాష్ట్ర కాంగ్రెస్ ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రఫ్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నెలకే వెళ్లి కలవడం జరిగింది.
తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వండని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి హసన్ ముష్రఫ్ కోరడం జరిగింది.
ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హాసన్ ముష్రఫ్ చాలా రోజులుగా ముంపు గ్రామాల ప్రజలు మా ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పుకోమని తేల్చి చెప్పారు.ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్  అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కు ఈ ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తులో నిర్మించడానికి ఒప్పుకోమని తేల్చి చెప్పారని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా కమిషన్ దృష్టికి తీసుకు వెళ్ళాము. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య తమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఐదారు మీటింగ్లు జరిగాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక  నీటిపారుదల మంత్రిని కలిసి మళ్లీ తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని, తెలంగాణకు నీటి అవసరం ఉందని కోరడం జరిగింది.
స్వయంగా కేసీఆర్  మహారాష్ట్ర వచ్చి అప్పటి గవర్నర్ విద్యాసాగర్  సమక్షంలో బిజెపి ముఖ్యమంత్రి ఫడ్నవీస్  కలిశారు.
అనేక విధాలుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కెసిఆర్  విజ్ఞప్తి చేశారు. ఏడేండ్లు మాకంటే ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పై బిజెపి పార్టీ తరఫున ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు చేసింది తానేనని ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేమని పడ్నవీస్ తేల్చి చెప్పారు.
కేంద్రంలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఏడు సంవత్సరాలు అధికారంలో ఉంటే ఒక్క అనుమతి కూడా సాధించలేదు. ఒక్క అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదు. ఒక గుంట భూమిని కూడా సేకరించలేదు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి  పట్టించు కోలేదు.
సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదు అని ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని లేఖ రాసింది.
అదేవిధంగా సిడబ్ల్యుసి, తమ్మిడిహట్టి ప్రాజెక్టులో ప్రతిపాదించిన రిజర్వాయర్ల సామర్థ్యం కూడా సరిపోదని సామర్థ్యానికి సరిపోయే రిజర్వాయర్లను పెంచుకోవాలని ఉత్తరం రాసింది.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ని బ్యారేజ్ నిర్మాణ స్థల ఎంపిక చేయాలని కేసీఆర్  కోరడం జరిగింది.
కేంద్ర సంస్థ వాప్కోస్ లాడార్ సర్వే చేసి, ఎగ్జామిన్ చేసి మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉంది అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవచ్చని తెలిపింది.
వాప్కోస్, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇంజనీర్ల సూచన  మేరకు మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడేండ్లుగా పొరుగు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేదు. అదేవిధంగా మహారాష్ట్రలో ముంపుకు గురవుతున్న చోట చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. వైల్డ్ లైఫ్ అనుమతులు లభించాలంటే కనీసం 10 సంవత్సరాలు సుప్రీంకోర్టులో కొట్లాడాల్సి వస్తుంది. నీళ్లు లేనిచోట కాంగ్రెస్ ప్రాజెక్ట్ ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్నచోట ప్రాజెక్టును బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది.
అన్ని రకాల ఆధారాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన ఉత్తరాలు, జీవోలు అన్నీ కమిషన్ కు సమర్పించడం జరిగింది. కాళేశ్వరం కార్పొరేషన్ కి అనుమతి ఉందా అని అడిగారు. కాళేశ్వరం కమిషన్ కు స్పష్టంగా అనుమతి ఉన్న విషయాన్ని అన్ని ఆధారాలతో సమర్పించడం జరిగింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లోకేషన్ మార్పుల గురించి అడిగారు. అది పూర్తిగా టెక్నికల్ నిర్ణయం ఇంజనీర్ల డీటెయిల్ సర్వే ఆధారంగా బ్యారేజ్ లొకేషన్ మారింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునే నిర్ణయమని చెప్పాను.
దేశంలో ఇలా అనేక ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో జరుగుతుంది వాటికి సంబంధించిన ఆధారాలు కూడా కమిషన్ కి సమర్పించడం జరిగింది.
ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్లకు కెపాసిటీ ఎంత అని అడిగారు.
141 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించామని చెప్పడం జరిగింది. కాళేశ్వరం పై పిచ్చి కూతలు కూస్తూ కూలేశ్వరం అని మాట్లాడుతున్నారు. కాళేశ్వరంలో 100 భాగాలు ఉన్నాయి. అన్ని ఇంటెక్ట్ ఉన్నాయి...కాలేశ్వరం ప్రాజెక్టులో
3 బ్యారేజీలు
15 రిజర్వాయర్లు
19 సబ్ స్టేషన్లు
21 పంప్ హౌజులు
203 కిలోమీటర్ల సొరంగాలు
1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్
98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్
141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ
530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్
240 టిఎంసీల నీటి వినియోగం,
పూర్తిగా ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి.
ముఖ్యమంత్రి గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు నీళ్లు మల్లన్న సాగర్ నుంచి పోతాయి. మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం. హైదరాబాద్ మూసీ సుందరీకరణకు మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తరలిస్తామంటున్నారు. ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం. అదేవిధంగా హైదరాబాద్ కు తాగునీటిని మల్లన్న సాగర్ నుంచి ఇస్తామంటున్నారు అది కాళేశ్వరంలో భాగం కాదా,
మల్లన్న సాగర్ పై ఆధారపడ్డ గంధమల్లకు టెండర్లు పిలిచి శంకుస్థాపన చేస్తారు. మరో పక్క కాళేశ్వరం కూలింది అని దుష్ప్రచారం చేస్తారు.
కాళేశ్వరం ఎప్పటి కైనా తెలంగాణకు జీవధార. ఈ విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాళేశ్వరం కమిషన్ ముందు ఏదీ నోటి మాటగా చెప్పలేదు. అన్నీ సాక్ష్యాధారాలతో సహా సమర్పించడం జరిగింది.
క్యాబినెట్ నిర్ణయాలు, వాప్కోస్ రిపోర్టులు, సీడబ్ల్యూసీ లేఖలు అన్నీ సమర్పించడం జరిగింది.

]]>
Mon, 09 Jun 2025 20:48:23 +0530 admin
2.99 లక్షల కోట్లతో అమృత్ 2 అమలు చేస్తున్నాం : కేంద్ర మంత్రి బండి సంజయ్ https://prajakshethrenews.com/299-లక్షల-కోట్లతో-అమృత్-2-అమలు-చేస్తున్నాం-కేంద్ర-మంత్రి-బండి-సంజయ్ https://prajakshethrenews.com/299-లక్షల-కోట్లతో-అమృత్-2-అమలు-చేస్తున్నాం-కేంద్ర-మంత్రి-బండి-సంజయ్ 2.99 లక్షల కోట్లతో అమృత్ 2 అమలు చేస్తున్నాం : కేంద్ర మంత్రి బండి సంజయ్ 
అమృత్ 1 అమృత్ 2 కింద తెలంగాణలో మొత్తం 6 వేల 876 కోట్లు ఖర్చు చేస్తున్నాం
ఇంటింటికీ నీళ్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించడమే లక్ష్యం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి.

చొప్పదండిలో రూ.36.3 కోట్ల వ్యయంతో, వాటర్ ఇంప్రూవ్ మెంట్, స్కీంకు కేంద్ర మంత్రి శంకుస్థాపన.

స్థానిక ఎమ్మెల్యేతో కలిసి భూమిపూజ చేసిన బండి సంజయ్..

ప్రజా క్షేత్ర్, కరీంనగర్ :
అమృత్ 2 పథకం కింద దేశవ్యాప్తంగా పట్టణాల్లో నివసించే వారికి నీళ్లను అందించేందుకు రూ.2 లక్షల 99 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. ఇందులో కేంద్ర వాటా కింద 76 వేల 760 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు, నగర పాలక సంస్థలు సమీకరించుకుంటున్నాయని పేర్కొన్నారు. అందులో భాగంగా అమృత్ 1, అమృత్ 2.0 కింద తెలంగాణలో  మొత్తం 6 వేల 876 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. చొప్పదండి పట్టణంలోని నల్లాలబావి వద్ద స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తో కలిసి రూ.36.3 కోట్ల వ్యయంతో ‘వాటర్ ఇంప్రూవ్ మెంట్, స్కీంకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా భూమి పూజ చేశారు. శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ చొప్పదండి మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికీ సరిపడ నీళ్లను అందించాలనే లక్ష్యంతో  అమృత్ 2 పథకం కింద 36 కోట్ల 30 లక్షల రూపాయల నిధులతో పైప్ లైన్, వాటర్ సంప్ ఇతర పనులను చేపట్టేందుకు ఈరోజు నల్లాల బావివద్ద స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యేతో కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉంది.
2015 జూన్ 25న ప్రారంభమైన అమృత్ 1 పథకం కింద 2015-16 నుండి 2019-20 వరకు, కేంద్ర ప్రభుత్వం తన వాటాకింద ఖర్చు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అమ్రుత్ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1 కోటి 34 లక్షల నీటి కనెక్షన్‌లు అందించగలిగినం. 1 కోటి 2 లక్షల మురుగునీటి కనెక్షన్‌లు అందించాం. వీటితోపాటు 2 వేల 411 పార్కులను అభివృద్ధి చేసుకోగలిగినం. 62 లక్షల 78 వేల  ఎల్ఈడీ లైట్లను మార్చుకోగలిగినం.అట్లాగే 2021లో అమృత్ 2.0  పథకం ప్రారంభమైంది. ఐదేళ్లపాటు ఈ పథకం అమలులో ఉంటుంది. ఈ స్కీం కింద కేంద్ర, రాష్ట్రాలు, మున్సిపాలిటీల భాగస్వామ్యంతో ఈసారి 2 లక్షల 99 వేల కోట్ల రూపాయల ఖర్చు చేయాలని నరేంద్రమోదీ  ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో కేంద్ర వాటా కింద 76 వేల 760 కోట్ల రూపాయలను కేటాయించబోతున్నం. మిగిలిన మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు, నగర పాలక సంస్థలు సమీకరించుకోవాల్సి ఉంది.
మన రాష్ట్రం విషయానికొస్తే అమృత్ 1, అమృత్ 2.0 కింద మొత్తం 6 వేల 876 కోట్లు ఖర్చు చేయబోతున్నం. ఇందులో కేంద్ర వాటా 3 వేల 591 కోట్ల 72 లక్షల రూపాయలు.  రాష్ట్ర వాటా కింద 2 వేల 614 కోట్ల 82 లక్షల రూపాయలు. ఎంపిక చేయబడిన మున్సిపాలిటీల వాటా 669 కోట్ల 85 లక్షల రూపాయలు. అమృత్ 1 కింద 11 వందల 53 కోట్లు, అమృత్ 2 కింద 2వేల 438 కోట్ల రూపాయలను నరేంద్రమోదీ ప్రభుత్వం కేటాయించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికొస్తే అమృత్ 1, అమృత్ 2 కింద మొత్తం 852 కోట్ల 11 లక్షల రూపాయలు కేటాయించినం. అందులో కేంద్ర వాటా 481 కోట్ల 19 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 297 కోట్ల 55 లక్షలు, మున్సిపాలిటీల వాటా 73 కోట్ల 37 లక్షలు. అందులో భాగంగానే చొప్పదండి మున్సిపాలిటీలో అమృత్ 2 కింద 36 కోట్ల 30 లక్షల రూపాయల నిధులతో ఇంటింటికీ నీళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో కేంద్ర ప్రభుత్వం 17 కోట్ల 89 లక్షలు, రాష్ట్రం వాటా 15 కోట్ల 11 లక్షలు, మున్సిపాలిటీ వాటా 3 కోట్ల 30 లక్షలు. ఈ పథకము ద్వారా నల్లాల బావివద్ద వాటర్ సంప్, 46.21 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్ నిర్మాణంతోపాటు 1500 KL ELBR cum ELSR లను ఏర్పాటు చేస్తున్నాం. ఈ స్కీం ద్వారా 2 వేల 800 నల్లా కనెక్షన్లకు నీటిని సరఫరా చేయబోతున్నాం. నిజానికి మన దేశంలో 40 శాతం జనాభా పట్టణాల్లోనే నివసిస్తోంది. 2047 నాటికి ఈ సంఖ్య  50 శాతం కంటే ఎక్కువ కాబోతోంది. పట్టణాల్లో నివసించే వారికి రోజుకు సగటున ప్రతి వ్యక్తికి 136 లీటర్ల నీళ్లు అవసరం. కానీ 60 నుండి 69 లీటర్ల నీరు మాత్రమే  అందుతోంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో దూరద్రుష్టితో  నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రతి ఇంటికీ సరిపడా నీటిని అందించంతోపాటు, డ్రైనేజీ సౌకర్యం కల్పించి నీటి భద్రతా నగరాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అమృత్ అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్, పథకాన్ని ప్రారంభించారు.వాస్తవానికి చొప్పదండిలో ఎప్పుడో ఈ స్కీంను స్టార్ట్ చేయాల్సి ఉండే. గత ప్రభుత్వం సహకరించకపోవడంవల్ల ల్యాండ్ కేటాయించలేదు. లేకుంటే ఈ స్కీం ఇప్పటికే ప్రారంభమయ్యేది.  ఇయాళ అన్ని అడ్డంకులను అధిగమించి పథకం పనులకు శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ పనులను పూర్తి చేసి చొప్పదండి ప్రజలకు ఇంటింటికీ సరిపడా నీళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
నేను ఎంపీగా ఉన్న సమయంలో స్మార్ట్ సిటీ, అమ్రుత్ నిధులు రావడం కరీంనగర్ పార్లమెంట్ ను అభివ్రుద్ధి చేసుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉంది. దీంతోపాటు సీఆర్ఐఎఫ్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రోడ్లను నిర్మిస్తున్నాం. ఇవిగాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అనేక అభివ్రుద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.

]]>
Mon, 09 Jun 2025 20:39:52 +0530 admin
ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ https://prajakshethrenews.com/ఎలక్ట్రిక్-బస్సులను-ప్రారంభించిన-డిప్యూటీ-సీఎం-బట్టి-విక్రమార్క-మంత్రి-పొన్నం-ప్రభాకర్ https://prajakshethrenews.com/ఎలక్ట్రిక్-బస్సులను-ప్రారంభించిన-డిప్యూటీ-సీఎం-బట్టి-విక్రమార్క-మంత్రి-పొన్నం-ప్రభాకర్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం అనంతరం బస్సులో ప్రయాణం చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,మంత్రి పొన్నం ప్రభాకర్.

ప్రజా క్షేత్ర్, సూర్యాపేట :

ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లతో కలిసి సోమవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభిచారు. ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం అనంతరం  డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,మంత్రి పొన్నం ప్రభాకర్ లు బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు పద్మావతి రెడ్డి, మందుల శామ్యూల్,టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చుట్టు ముట్టు సూర్యాపేట నట్ట నడుమ నల్లగొండ అని సూర్యాపేట కు ఉన్న  ఖ్యాతిని గుర్తించి సూర్యాపేట కు 79 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించడం జరిగింది.45 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు.రాబోయే కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల సౌకర్యాలు దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం,ఆర్టీసీ సంస్థ పరిరక్షణ  మూడు నినాదాలతో ముందుకు పోతుంది.గతంలో నష్టాలబాట పట్టి గత 10 సంవత్సరాల్లో ఒక్క బస్సు కొనుగోలు చేయక, ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయని పరిస్థితి ఉండేది. ఇప్పుడు వేలాది నూతన బస్సుల కొనుగోలు వేలాది ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నామని అక్క చెల్లెళ్ల ఆశీర్వాదం ప్రభుత్వ నిర్ణయం మహా లక్ష్మి పథకం ద్వారానే సాధ్యం అవుతుంది.ఇప్పటి వరకు 182 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ లో ఉచితంగా ప్రయాణం చేశారు దాదాపు 6200 కోట్ల రూపాయలు వాళ్ళు అదా చేసుకున్నారు.మహిళలు హాస్పిటల్, గుడి కి ఎక్కడికి వెళ్లాలన్న ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు.దేవాలయాల దగ్గర రద్దీ కనిపిస్తుంది అంటే ఆర్టీసీ లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడమే.నెలకు 330 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తుంది. పిఎఫ్, సిసిఎస్ బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుంది.ఆర్టీసీ లాభాల బాటలో తీసుకుపోతుంది అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే.ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం చేస్తున్నాం.వారి సమస్యలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి కార్మికుల సంక్షేమం వారి సేవలు గుర్తిస్తూనే ఆర్టీసీ సంస్థ పరిరక్షిస్తూ ముందుకు పోతున్నాం.45 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తున్నాం ఇవి సూర్యాపేట నుండి హైదరాబాద్, ఖమ్మం, హనుమకొండ తదితర ప్రాంతాల్లో ప్రయాణం చేస్తాయి.నల్గొండ కేంద్రంలో కూడా ఇవి బస్సులు ప్రారంభం చేసుకుంటున్నాం.హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించాం.ఆర్టీసీ అంటే ప్రజలది ప్రభుత్వంది దీనిని పరిరక్షించుకోవాలి.ఎక్కడ గ్రామాల్లో చూసినా బస్సులు కావాలని అడుగుతున్నారు శాసన సభ్యులు బస్సులు అడుగుతున్నారు.నూతన బస్సుకు కొనుగోలు చేస్తున్నాం అన్ని మండలాలు జిల్లాలకు జిల్లాల నుండి రాజధానికి బస్సులు కనెక్ట్ చేస్తున్నామని పేర్కొన్నారు.

]]>
Mon, 09 Jun 2025 20:26:06 +0530 admin
భూ భారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి : జువ్వాడి కృష్ణారావు https://prajakshethrenews.com/భూ-భారతి-చట్టాన్ని-రైతులు-సద్వినియోగం-చేసుకోవాలి-జువ్వాడి-కృష్ణారావు https://prajakshethrenews.com/భూ-భారతి-చట్టాన్ని-రైతులు-సద్వినియోగం-చేసుకోవాలి-జువ్వాడి-కృష్ణారావు భూ భారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి : జువ్వాడి కృష్ణారావు

ఇందిరమ్మ ఇళ్లు కు భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు
ప్రజా క్షేత్ర్, కోరుట్ల : 
మండలం పైడుమడుగు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కు భూమి పూజ కార్యక్రమాల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు లబ్ధిదారుల ఆహ్వానం మేరకు గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు . అనంతరం గ్రామంలో జరిగిన భూభారతి కార్యక్రమంలో పాల్గొని  గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి ద్వారా రైతులను ఎలా మోసం చేసింది వివరించి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రజలందరికీ న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.. అనంతరం గ్రామంలోని ప్రసిద్ధి చెందిన శుక్రవారం అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి కృష్ణ చైతన్యతో పాటు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి ,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరిపెళ్లి జనార్ధన్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆశిరెడ్డి, రాజేశం,నేమురి భూమయ్య ,దొమ్మటి నరేందర్ గౌడ్, నేమిళ్ల రామ్మోహన్, సత్తిరెడ్డి, దొమ్మటి తిరుపతి గౌడ్, దుంపల అశోక్, మేకల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

]]>
Mon, 09 Jun 2025 20:13:50 +0530 admin
క్యాన్సర్ తో బాధపడే నిరుపేదలకు జగ్గ రెడ్డి అపన్న హస్తం https://prajakshethrenews.com/క్యాన్సర్-తో-బాధపడే-నిరుపేదలకు-జగ్గ-రెడ్డి-అపన్న-హస్తం https://prajakshethrenews.com/క్యాన్సర్-తో-బాధపడే-నిరుపేదలకు-జగ్గ-రెడ్డి-అపన్న-హస్తం క్యాన్సర్ తో బాధపడే నిరుపేదలకు జగ్గ రెడ్డి అపన్న హస్తం
 క్యాన్సర్ పేషంట్ ను పరామర్శించిన  జగ్గారెడ్డి
ప్రజా క్షేత్ర్, సంగారెడ్డి జూన్ 9 : 
క్యాన్సర్ తో బాధపడే నిరుపేదలకు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గ రెడ్డి అపన్న హస్తం  అందించారు. సంగారెడ్డి పట్టణం లో నీ సోమేశ్వర వాడ కు చెందిన రాణి కిబ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. విషయం తెలుసుకున్న జగ్గ రెడ్డి క్యాన్సర్ పేషంట్ ఇంటికి వెల్లి పరామర్శించారు. ఈ సందర్బంగా జగ్గ రెడ్డి మాట్లాడుతూ  క్యాన్సర్ ట్రీట్ మెంట్  లక్షల రూపాయల తో కూడుకున్న వ్యవహారం కావడంతో  పేదలు ఆర్థికం గా చితికిపోతున్నరు.తన నియోజకవర్గంలో క్యాన్సర్ తో బాధపడే నిరుపేద లకు ట్రీట్ మెంట్ కోసం ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.ఈ సందర్బంగా క్యాన్సర్ పేషంట్  రాణమ్మ కు  ట్రీట్ మెంట్ కోసం నాలుగు లక్షలు రూపాయల ఆర్థిక సహాయం జగ్గారెడ్డి అందించారు. సంగారెడ్డి పట్టణం లో నీ సోమేశ్వర వాడ కు చెందిన రాణి కిబ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని, ట్రీట్ మెంట్ కోసం ఆర్థిక సహాయం నాలుగు లక్షలు అందించాను అని చెప్పారు.  స్పెసిఫిక్ గా మీడియా ముందుకు రావడానికి కారణం క్యాన్సర్ అనేది ఎవ్వరికీ రావొద్దు  క్యాన్సర్ బాధితుల ది టెన్షన్ లతో కూడిన జీవితం క్యాన్సర్ ట్రీట్ మెంట్  లక్షల రూపాయల తో కూడుకున్న వ్యవహారం కావడం తో  పేద లు ఆర్థికం గా చితికిపోతున్నరు  లక్షల రూపాయల ఖర్చు చేసినా కొన్ని సందర్బాల్లో బతకడం లేదు... ఆ పేషంట్ ట్రీట్ మెంట్ కోసం అప్పులు చేసిన ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నా నియోజకవర్గానికి చెందిన ఆర్థిక స్థోమత  లేని పేద క్యాన్సర్ పేషెంట్ల కు ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నా ను  మొన్న సదాశివపేట లో క్యాన్సర్ పేషంట్ కు 10 లక్షల రూపాయలు, ఈరోజు సంగారెడ్డి పట్టణానికి చెందిన  క్యాన్సర్ పేషంట్ కు 4 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం అందించాను . నా వద్దకు ఆరోగ్య సమస్య ల ట్రీట్ మెంట్ కోసం సహాయం కావాలని ఎంతోమంది వస్తారు.. వారికి   నా ద్వారా సహాయం అందుతుంది. కానీ ఎన్నడూ మీడియాలో రాదు. అది నాకిష్టం ఉండదు.  ఇలా మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం  రాష్ట్రం లో ఎంతో మంది దాతలు ఉన్నారు. క్యాన్సర్ పేషంట్ లకు వారి ద్వారా సహాయం దొరుకుతుందనే ఉద్దేశ్యం తో  మీడియా ముఖంగా అందించడం జరిగింది.

]]>
Mon, 09 Jun 2025 20:09:37 +0530 admin
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో రాయితీ కల్పించాలని కలెక్టర్ కు TUWJ వినతి https://prajakshethrenews.com/జర్నలిస్టుల-పిల్లలకు-ప్రైవేటు-పాఠశాలల్లో-రాయితీ-కల్పించాలని-కలెక్టర్-కు-tuwj-వినతి-496 https://prajakshethrenews.com/జర్నలిస్టుల-పిల్లలకు-ప్రైవేటు-పాఠశాలల్లో-రాయితీ-కల్పించాలని-కలెక్టర్-కు-tuwj-వినతి-496 *జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించండి*

*రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి జర్నలిస్టుల వినతి పత్రం*

*విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేసిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు*

ప్రజా క్షేత్ర్, రంగా రెడ్డి : 

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సలీం, ఉపాధ్యక్షుడు కొనియాల భాస్కర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు చెక్కల శ్రీశైలం, కార్యదర్శి రాఘవేందర్ యాదవ్ (రఘు) తో పాటు కార్యవర్గ సభ్యులు కోరారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కి టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలు కార్పొరేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసించేందుకుగాను ఫీజులు రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో మాదిరిగా ఉన్న ఫీజులో 50% రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో విద్యాశాఖ ప్రత్యేక సర్కులర్ ను జారీ చేశారని గుర్తు చేశారు. మరో మూడు రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి సంబంధిత విద్యాశాఖ అధికారులు సకాలంలో స్పందించి రాయితీకి సంబంధించిన సర్కులర్ ను జారీ చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బ్యూరో చీఫ్ లు ప్రదీప్,పాండు, కలెక్టరేట్ రిపోర్టర్లు  బాలు, భాస్కర్, పాండురంగ రెడ్డి, పాండు యాదవ్, రాజేంద్ర నగర్  నియోజకవర్గ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, వర్కల చందు, ప్రేమ్, డి శ్రీనివాస్, రాజ్ కుమార్, శ్రావణ్, మహేందర్, కలెక్టరేట్ రిపోర్టర్లు శ్రీనివాస్, ఇలియాజ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Mon, 09 Jun 2025 20:02:57 +0530 admin
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో రాయితీ కల్పించాలని కలెక్టర్ కు TUWJ వినతి https://prajakshethrenews.com/జర్నలిస్టుల-పిల్లలకు-ప్రైవేటు-పాఠశాలల్లో-రాయితీ-కల్పించాలని-కలెక్టర్-కు-tuwj-వినతి https://prajakshethrenews.com/జర్నలిస్టుల-పిల్లలకు-ప్రైవేటు-పాఠశాలల్లో-రాయితీ-కల్పించాలని-కలెక్టర్-కు-tuwj-వినతి *జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించండి*

*రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి జర్నలిస్టుల వినతి పత్రం*

*విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేసిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు*

ప్రజా క్షేత్ర్, రంగా రెడ్డి : 

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సలీం, ఉపాధ్యక్షుడు కొనియాల భాస్కర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు చెక్కల శ్రీశైలం, కార్యదర్శి రాఘవేందర్ యాదవ్ (రఘు) తో పాటు కార్యవర్గ సభ్యులు కోరారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కి టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలు కార్పొరేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసించేందుకుగాను ఫీజులు రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో మాదిరిగా ఉన్న ఫీజులో 50% రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో విద్యాశాఖ ప్రత్యేక సర్కులర్ ను జారీ చేశారని గుర్తు చేశారు. మరో మూడు రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి సంబంధిత విద్యాశాఖ అధికారులు సకాలంలో స్పందించి రాయితీకి సంబంధించిన సర్కులర్ ను జారీ చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బ్యూరో చీఫ్ లు ప్రదీప్,పాండు, కలెక్టరేట్ రిపోర్టర్లు  బాలు, భాస్కర్, పాండురంగ రెడ్డి, పాండు యాదవ్, రాజేంద్ర నగర్  నియోజకవర్గ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, వర్కల చందు, ప్రేమ్, డి శ్రీనివాస్, రాజ్ కుమార్, శ్రావణ్, మహేందర్, కలెక్టరేట్ రిపోర్టర్లు శ్రీనివాస్, ఇలియాజ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Mon, 09 Jun 2025 20:02:51 +0530 admin
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌, సిటీ కాలేజ్‌ల మధ్య విద్యా సహకార ఒప్పందం* https://prajakshethrenews.com/ఇన్స్టిట్యూట్-ఆఫ్-పబ్లిక్-ఎంటర్ప్రైజ్-సిటీ-కాలేజ్ల-మధ్య-విద్యా-సహకార-ఒప్పందం https://prajakshethrenews.com/ఇన్స్టిట్యూట్-ఆఫ్-పబ్లిక్-ఎంటర్ప్రైజ్-సిటీ-కాలేజ్ల-మధ్య-విద్యా-సహకార-ఒప్పందం *ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌, సిటీ కాలేజ్‌ల మధ్య విద్యా సహకార ఒప్పందం*

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్‌, 9 జూన్‌ : 

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ (IPE)-ఓయూ క్యాంపస్‌, గవర్నమెంట్‌ సిటీ కాలేజ్‌ (అటానమస్) నేడు ఒక ముఖ్యమైన అవగాహనా ఒప్పందంపై (MOU) సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ఈ ఒప్పందం ఇరు సంస్థల మధ్య బోధన, పరిశోధన, విద్యార్థి కేంద్రక సహకారాన్ని మరింత పెంపొందించడానికి దోహదపడుతుంది.ఈ ఒప్పందంపై IPE డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ (డా.) ఎస్. శ్రీనివాస మూర్తి, IPE PGDM ప్రోగ్రామ్ హెడ్‌ ప్రొఫెసర్‌ (డా.) రామకృష్ణ యలమంచిలి, సిటీ కాలేజ్‌ వైస్‌-ప్రిన్సిపల్‌ డా.పి.శాంతి, వాణిజ్య విభాగ అధిపతి డా. కె. మల్లికార్జున రావు, అధ్యాపకులు డా. ఎస్. ఝాన్సీ రాణి,  ఇఫ్ఫత్ ఉన్నిసా సంతకాలు చేశారు.పాఠ్య ప్రణాళిక, పాఠ్యాంశాల రూపకల్పనలో సంయుక్తంగా పనిచేయడం, ఇరు సంస్థల అధ్యాపకులు, విద్యార్థులు ఉమ్మడి పరిశోధన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా తక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం.

ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం...

ఒప్పందంలోని ముఖ్యాంశాలు: పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను నవీకరించడం, ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా పాఠ్యాంశాలను రూపొందించడానికి ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయి. ప్రత్యక్ష శిక్షణ, పారిశ్రామిక సందర్శనలు: సిటీ కాలేజ్ విద్యార్థులకు IPE వేదికగా ప్రత్యక్ష శిక్షణ, వివిధ పరిశ్రమలకు సందర్శనల అవకాశాలు లభిస్తాయి. సంయుక్త పరిశోధన: కొత్త వ్యాపార నమూనాలపై ఇరు సంస్థల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి పరిశోధనలు నిర్వహిస్తారు. నైపుణ్యాభివృద్ధి శిబిరాలు: డేటా అనలిటిక్స్, ఎక్సెల్, పవర్ బిఐ, డిజిటల్ మార్కెటింగ్‌ వంటి అంశాలపై సిటీ కాలేజ్ విద్యార్థులకు IPE ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించబడతాయి.అ ధ్యాపక సామర్థ్యవృద్ధి శిక్షణ: సిటీ కాలేజ్‌ అధ్యాపకుల కోసం IPE అధ్యాపకులు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ మూర్తి మాట్లాడుతూ, “ఈ ఒప్పందం విద్యా సంస్థలు, వ్యాపార ప్రపంచం మధ్య ఒక ఆచరణాత్మక వంతెనలా పనిచేస్తుంది. విద్యార్థులకు పరిశ్రమ అనుభవాన్ని అందించడానికి ఇది దోహదపడుతుంద”ని అన్నారు.డా.పి.శాంతి మాట్లాడుతూ, “IPE సంస్థ విలువైన వనరులు సిటీ కాలేజ్ యొక్క అనుభవంతో కలవడం వల్ల విద్యార్థులకు పరిశోధన, ఇంటర్న్‌షిప్‌లు,  ఉద్యోగ అవకాశాలు మరింత విస్తృతమవుతాయి. ఇది మా విద్యార్థుల భవిష్యత్తుకు ఒక గొప్ప ముందడుగు,” అని తెలిపారు. ఈ సహకారంతో ఇరు సంస్థలు విద్యార్థులకు అత్యుత్తమ విద్యా మరియు నైపుణ్యాలను అందించడానికి కృషి చేస్తాయని పేర్కొన్నారు.

]]>
Mon, 09 Jun 2025 19:06:42 +0530 admin
స్మశాన వాటిక అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన చార్మినార్ జోనల్ కమిషనర్ https://prajakshethrenews.com/స్మశాన-వాటిక-అభివృద్ధికి-నిధులు-మంజూరు-చేసిన-చార్మినార్-జోనల్-కమిషనర్-489 https://prajakshethrenews.com/స్మశాన-వాటిక-అభివృద్ధికి-నిధులు-మంజూరు-చేసిన-చార్మినార్-జోనల్-కమిషనర్-489 స్మశాన వాటిక అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన చార్మినార్ జోనల్ కమిషనర్

జోనల్ కమిషనర్ వెంకన్న కు కృతజ్ఞతలు

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

చాంద్రాయణగుట్ట నల్లవాగు హిందు స్మశాన వాటిక అభివృద్ధికి బల్దియా దక్షిణ మండలం జోనల్ కమిషనర్  వెంకన్న ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతో సోమవారం కాంగ్రెస్ ఓబీసీ సెల్ నగర ఉపాధ్యక్షుడు కాశమోని శ్యామ్ రావు ముదిరాజ్,భాగ్యనగర్ బ్యాగరి సంఘం అధ్యక్షుడు పెరోజి సాయినాథ్ జోనల్ కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారూ మాట్లాడుతూ పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు.

]]>
Mon, 09 Jun 2025 19:01:32 +0530 admin
స్మశాన వాటిక అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన చార్మినార్ జోనల్ కమిషనర్ https://prajakshethrenews.com/స్మశాన-వాటిక-అభివృద్ధికి-నిధులు-మంజూరు-చేసిన-చార్మినార్-జోనల్-కమిషనర్ https://prajakshethrenews.com/స్మశాన-వాటిక-అభివృద్ధికి-నిధులు-మంజూరు-చేసిన-చార్మినార్-జోనల్-కమిషనర్ స్మశాన వాటిక అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన చార్మినార్ జోనల్ కమిషనర్

జోనల్ కమిషనర్ వెంకన్న కు కృతజ్ఞతలు

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

చాంద్రాయణగుట్ట నల్లవాగు హిందు స్మశాన వాటిక అభివృద్ధికి బల్దియా దక్షిణ మండలం జోనల్ కమిషనర్  వెంకన్న ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతో సోమవారం కాంగ్రెస్ ఓబీసీ సెల్ నగర ఉపాధ్యక్షుడు కాశమోని శ్యామ్ రావు ముదిరాజ్,భాగ్యనగర్ బ్యాగరి సంఘం అధ్యక్షుడు పెరోజి సాయినాథ్ జోనల్ కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారూ మాట్లాడుతూ పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు.

]]>
Mon, 09 Jun 2025 19:01:23 +0530 admin
ఆర్టిసిలో ప్రయాణించిన మహిళలకు 182 కోట్ల జీరో టికెట్లు జారీ చేసింది : డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క https://prajakshethrenews.com/ఆర్టిసిలో-ప్రయాణించిన-మహిళలకు-182-కోట్ల-జీరో-టికెట్లు-జారీ-చేసింది-డిప్యూటీ-సీ-ఎం-భట్టి-విక్రమార్క https://prajakshethrenews.com/ఆర్టిసిలో-ప్రయాణించిన-మహిళలకు-182-కోట్ల-జీరో-టికెట్లు-జారీ-చేసింది-డిప్యూటీ-సీ-ఎం-భట్టి-విక్రమార్క మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆర్టిసిని ఆధునీకరీస్తున్నాం
*ఆర్టిసి బస్సులు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి
*ఆర్టిసిలో ప్రయాణించిన మహిళలకు 182 కోట్ల జీరో టికెట్లు జారీ చేసింది
*ఆర్టిసికి ప్రభుత్వం రూ. 6,088 కోట్లు చెల్లించింది
 *ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ప్రజా క్షేత్ర్ , హైదరాబాద్ జూన్ 9 :
 మహాలక్ష్మి పథకం పేరిట ఉచిత ప్రయాణంతో కొందరు ఆందోళన చెందారని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  తెలిపారు. మహిళలు ఉచిత ప్రయాణం చేసినా ప్రభుత్వం ఆర్టిసికి డబ్బులు చెల్లించిందని అన్నారు.  సూర్యాపేటలో ఆయన ఆర్టిసి డిపోలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టిసిలో ప్రయాణించిన మహిళలకు 182 కోట్ల జీరో టికెట్లు జారీ చేసిందని తెలియజేశారు. ఆర్టిసికి ప్రభుత్వం రూ. 6,088 కోట్లు చెల్లించిందని, ఆర్టిసి బస్సులు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని చెప్పారు.పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నందునే ఆర్టిసి నిలదొక్కుకుందని పేర్కొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆర్టిసిని ఆధునీకరిస్తున్నామని, ప్రజా ప్రభుత్వం చొరవతోనే ఆర్టిసి లాభాల బాటతో నడుస్తోందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేకపోతే ఆర్టిసి సంస్థ ఉండేది కాదని, హైదరాబాద్ ను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఒఆర్ఆర్ లోపల 2,800 బ్యాటరీ బస్సులు తీసుకు వచ్చాం అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

]]>
Mon, 09 Jun 2025 18:48:20 +0530 admin
బస్ పాస్ ధరలను భారీగా పెంచిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి https://prajakshethrenews.com/బస్-పాస్-ధరలను-భారీగా-పెంచిన-తెలంగాణ-రాష్ట్ర-ఆర్టీసి https://prajakshethrenews.com/బస్-పాస్-ధరలను-భారీగా-పెంచిన-తెలంగాణ-రాష్ట్ర-ఆర్టీసి బస్ పాస్ ధరలను భారీగా పెంచిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 9 :
ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి సంస్థ షాకిచ్చింది. బస్ పాస్ ధరలను భారీగా పెంచింది. ఈ మేరకు బస్ పాస్ లపై ఆర్టీసి ప్రకటన చేసింది. ఇకనుంచి ఆర్టీసి బస్ పాస్ ధరలను 20 శాతం పెంచుతూ టిజీఎస్ఆర్టీసి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్డినరీ బస్ పాస్ ధరను రూ.1,150 నుండి రూ.1,400 కు, మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ ధరను రూ.1300 నుండి రూ.1600 కు, మెట్రో డీలక్స్ పాస్ ధరను రూ.1450 నుండి రూ.1800 కు పెంచింది. పెరిగిన ధరలు ఈరోజు నుండే అమల్లోకి రానున్నట్టు ఆర్టీసి యజమాన్యం తెలిపింది. అయితే, బస్ పాస్ ధరలను పెంచడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

]]>
Mon, 09 Jun 2025 18:43:35 +0530 admin
కరోనా కారణంగా నిలిచిపోయిన రైలు సర్వీసులను తక్షణమే ప్రారంభించాలి : సిపిఐ https://prajakshethrenews.com/కరోనా-కారణంగా-నిలిచిపోయిన-రైలు-సర్వీసులను-తక్షణమే-ప్రారంభించాలి-సిపిఐ https://prajakshethrenews.com/కరోనా-కారణంగా-నిలిచిపోయిన-రైలు-సర్వీసులను-తక్షణమే-ప్రారంభించాలి-సిపిఐ కరోనా కారణంగా నిలిచిపోయిన రైలు సర్వీసులను తక్షణమే ప్రారంభించాలి : సిపిఐ
స్టేషన్ మాస్టర్ కు డిమాండ్ పత్రాన్ని అందజేసిన తుగ్గలి మండల సమితి సభ్యులు.
ప్రజా క్షేత్ర్, తుగ్గలి :
 కరోనా కారణంగా నిలిచిపోయిన ప్యాసింజర్ మరియు ఎక్స్ప్రెస్ రైలు సర్వీసులను తక్షణమే ప్రారంభించాలని తుగ్గలి మండల సమితి సభ్యులు సోమవారం రోజున పెండేకల్ ఆర్.ఎస్ స్టేషన్ నందు ధర్నాను నిర్వహించారు.జూన్ 7,8 తేదీలలో రైలు సర్వీసులను ప్రారంభించాలని ప్రజల అభిప్రాయం కొరకు సంతకాల సేకరణను సిపిఐ పార్టీ నాయకులు నిర్వహించారు.అనంతరం సోమవారం రోజున తుగ్గలి మండల సమితి రైల్వే స్టేషన్ ఎదుట ధర్నాను నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కరోనా సమయమప్పటి నుండి రైలు సర్వీసులు సరిగ్గా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలియజేశారు.వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే పేద ప్రజలు,చదువుల కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు సరైన సమయంలో రైలు సర్వీసులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు రైల్వే ఉద్యోగులకు తెలియజేశారు. రాయలసీమ జిల్లా కేంద్రాలను కలుపుతూ రైలు సర్వీసులను తక్షణమే ప్రారంభించాలని  డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రజల సౌకర్యార్థం నూతన రైలు సర్వీసులను కూడా ప్రారంభించాలని వారు రైల్వే అధికారులకు డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నబి రసూల్,సిపిఐ మండల కార్యదర్శి సుల్తాన్,సిపిఐ నాయకులు సూరారెడ్డి, మాబు పీర,డీలర్ రాజశేఖర్,రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

]]>
Mon, 09 Jun 2025 18:40:38 +0530 admin
ఎయిర్ పోర్టు లో మీడియాపై ప్రభాకర్ రావు అనుచరుల దాడి https://prajakshethrenews.com/ఎయిర్-పోర్టు-లో-మీడియాపై-ప్రభాకర్-రావు-అనుచరుల-దాడి https://prajakshethrenews.com/ఎయిర్-పోర్టు-లో-మీడియాపై-ప్రభాకర్-రావు-అనుచరుల-దాడి ఎయిర్ పోర్టు లో మీడియాపై ప్రభాకర్ రావు అనుచరుల దాడి
ప్రజా క్షేత్ర్, శంషాబాద్ :
మాజీ ఐపిఎస్ ప్రభాకర్ రావు బౌన్సర్లు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మీడియాపై దాడికి పాల్పడ్డారు. ప్రభాకర్ రావు ఎయిర్ పోర్ట్ నుండి బయటికి వచ్చే సమయంలో 50 మంది తన అనుచరులు వచ్చారు. 15 మంది బౌన్సర్లను పెట్టుకొని మీడియా పై దాడికి పాల్పడ్డారు. ఇమిగ్రేషన్ కార్యాలయంలోనే మూడు గంటలపాటు ప్రభాకర్ రావు వివరాలు అధికారులు తీసుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుండి బయటికి వచ్చే సమయంలో ప్రభాకర్ రావును మాట్లాడించే ప్రయత్నం మీడియా చేసింది. అదే సమయంలో ప్రభాకర్ రావు వెంట ఉన్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులను నెట్టివేసి దాడికి పాల్పడ్డారు..

]]>
Mon, 09 Jun 2025 10:00:18 +0530 admin
త్యాగానికి ప్రతీక బక్రీద్ https://prajakshethrenews.com/ఘనంగా-బక్రీద్-భక్తి-శ్రద్దలతో-ప్రత్యేక-ప్రార్థనలు https://prajakshethrenews.com/ఘనంగా-బక్రీద్-భక్తి-శ్రద్దలతో-ప్రత్యేక-ప్రార్థనలు ఘనంగా బక్రీద్

భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు

దిశ, చార్మినార్ : 

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకొనే పండుగల్లో ఒకటైన బక్రీద్ పండుగ పర్వదినాన్ని శనివారం ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని ప్రధాన ఈద్గాలు, మసీదులు ముస్లిం సోదరులతో కిటకిటలాడాయి. వేలాది మంది ముస్లిం సోదరులు మీరాలం ఈద్గాలో సామూహికంగా నమాజులు పఠించారు. చార్మినార్ మక్కా మసీద్​ లో ఇమామ్ మౌలానా రిజ్వాన్ ఖురేషి సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అనంతరం బక్రీద్ పండుగ ప్రాముఖ్యత ను వివరించారు.  ప్రతి ఒక్కరు స్తోమత ను బట్టి ఖుర్బానీ ఇవ్వాలని గుర్తు చేశారు. హజ్రత్ ఇబ్రహీం కాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని ముస్లిం సోదరులు అందరూ పాటించాలన్నారు. యువత పాశ్చాత్య సాంస్కృతికి అలవాటు పడుతున్నారు. ముస్లింలు అల్లాహ్ ప్రవక్త బోధనలను శిరసావహించాలని, వారు చూపించిన మార్గంలో నడవాలని సూచించారు.  దైవ ప్రవక్తలలో ఒకరైన హజ్రత్ ఇబ్రహీం (ఆలై) తన ప్రియ తనయుడైన హజ్రత్ ఇస్మాయిల్ (ఆలై) ల త్యాగ నిరతిని స్మరించుకుంటూ జరుపుకునే పండుగే బక్రీద్. హజ్ యాత్ర చివర్లో ఈ పండుగను జరుపుకొంటారు. అల్లాపై ఉన్న విశ్వాసాన్ని చాటుతూ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అల్లాహ్ ఆదేశంతో ఇబ్రహీం అనే ప్రవక్త తన ఏకైక కుమారుడిని సైతం బలి ఇవ్వడానికి సిద్ధపడతారు. ఆయన త్యాగానికి సంతోషించిన అల్లాహ్ అతడి కుమారుడి బదులు గొర్రెను ఉంచుతాడు. నాటి నుంచి బక్రీద్‌ పండుగను జరుపుకుంటున్నారు. బక్రీద్ పండుగనుపురస్కరించుకుని ఉదయమే తల స్నానాలు చేసి, నూతన వస్త్రాలు ధరించారు. అత్తరు, సుగంధ ద్రవ్యాలు పూసుకొని మసీదులు, ఈద్గాలకు వెళ్లారు. ఉలేమాలు ఇచ్చే ధార్మిక ప్రసంగాల తర్వాత ప్రత్యేక నమాజ్‌ చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని  ముస్లిం సోదరులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.  బక్రీద్ సందర్భంగా పత్తర్ కా ఘోష్, మటన్ బిర్యానీ, కుర్మా లాంటి రుచికరమైన వంటలను వండుకున్నారు. ఖీర్, షీర్ కుర్మాలను కూడా పండుగ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేశారు. బక్రీద్ పండుగ రోజున మేకలు, గొర్రెలను బలివ్వడం ముస్లిం సంప్రదాయం కావడంతో ఆర్థిక స్థోమతగల వారు వాటిని కొనుగోలు చేస్తారు. నగర చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు మేకలు, గొర్రె పొట్టేళ్లను తెచ్చి పాతబస్తీలో విక్రయించారు. ఒక్కో పొట్టేలు ధర రూ.13 వేల నుంచి నుంచి రూ.1.20 లక్షల వరకు పలుకుతోంది. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో బక్రీద్‌ పండుగ సందర్భంగా  పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. మీరాలం ఈద్గా, చార్మినార్‌, మక్కామసీదు, మదీనా, బార్కాస్ ప్రాంతాలతోపాటు పాతబస్తీలోని పలు బస్తీల్లో బందోబస్తు నిర్వహించారు. మీరాలం ఈద్గా, చార్మినార్ మక్కా మసీదు, బార్కా స్, జామా మసీదులలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.  ధనిక, పేద తారతమ్యం లేకుండా ముస్లిం సోదరులు ఘనంగా  బక్రీద్‌ను జరుపుకున్నారు. పండుగ సందర్బంగా దేశంలోని వివిధ నగరాల్లోని ప్రధాన ఈద్గాలు, మసీదులు ముస్లిం సోదరులతో క్రిక్కిరిసాయి.  దక్షిణ మండలం డిసిపి స్నేహ మెహ్రా తదితరులు ఈద్గా నుంచి ప్రార్థనలు ముగించుకొని వచ్చిన చిన్నారులకు, ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

]]>
Sat, 07 Jun 2025 23:09:09 +0530 admin
కరీంనగర్ రూ.31 కోట్లతో ఉపాధి నిధులతో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం : కేంద్ర మంత్రి బండి సంజయ్ https://prajakshethrenews.com/కరీంనగర్-రూ31-కోట్లతో-ఉపాధి-నిధులతో-రోడ్ల-నిర్మాణ-పనులు-ప్రారంభం-కేంద్ర-మంత్రి-బండి-సంజయ్ https://prajakshethrenews.com/కరీంనగర్-రూ31-కోట్లతో-ఉపాధి-నిధులతో-రోడ్ల-నిర్మాణ-పనులు-ప్రారంభం-కేంద్ర-మంత్రి-బండి-సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రూ.31 కోట్లతో ఉపాధి నిధులతో రోడ్ల నిర్మాణం:
కేంద్ర మంత్రి బండి సంజయ్ 

సీఆర్ఐఎఫ్ నిధులతో 1314 కి.మీల పరిధిలో రోడ్లను విస్తరించాం

పీఎంజీఎస్ వై కింద మారుమూల గ్రామాల్లో రోడ్లను నిర్మించాం.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి
కొత్తపల్లిలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన రోడ్డును ప్రారంభించిన కేంద్ర మంత్రి.
ఆసిఫ్ నగర్ లో ఎంపీ లాడ్స్ నిధులతో కూరగాయల మార్కెట్ షెడ్ కు శంకుస్థాపన

ప్రజా క్షేత్ర్, కరీంనగర్ :
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. అందులో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.31 కోట్ల 12 లక్షల రూపాయలతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్గత రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని ఖాజీపూర్ లో  జాతీయ ఉపాధి హామీ పథకం కింద 14 లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్డును బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్ నగర్ లో 9 లక్షల 50 రూపాయల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించనున్న మార్కెట్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మొత్తం  పెద్ద ఎత్తున పనులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా రోడ్లను నిర్మిస్తున్నాం. ఈసారి ఈ పథకం కింద దాదాపు 31 కోట్ల 12 లక్షల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఈ కొత్తపల్లి మండలంలో రోడ్ల నిర్మాణం కోసం ఈ ఏడాది 74 లక్షల రూపాయలను విడుదల చేశారు.  అందులో భాగంగా ఖాజీపూర్ లో  జాతీయ ఉపాధి హామీ పథకం కింద 14 లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్డును  ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి సిఆర్ ఐ ఎఫ్, కింద రూ. 291 కోట్లను ఖర్చు చేసి 1341 కిలోమీటర్ల మేరకు రోడ్లను నిర్మించామన్నారు. తెలంగాణలోనే అత్యధికంగా   సిఆర్ ఐఎఫ్, నిధులను తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రోడ్లను నిర్మించగలగడం సంతోషంగా ఉందన్నారు. ఇవిగాకుండా ప్రధానమంత్రి సడక్ యోజన కింద వందల కోట్లను ఖర్చు చేసి మారుమూల గ్రామాల్లో రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ విషయానికొస్తే.. జాతీయ రహదారుల నిర్మాణం కోసం దాదాపు 5 వేల కోట్లు ఖర్చు చేసినం కరీంనగర్ నుండి వరంగల్, సిద్దిపేట నుండి ఎల్కతుర్తి నేషనల్ హైవేల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలోనే కరీంనగర్- జగిత్యాల రోడ్డ నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నం అని పేర్కొన్నారు. ప్రయాణీకులకు కలుగుతున్న ఇబ్బందులను ద్రుష్టిలో ఉంచుకుని నేషనల్ హైవే నిధులతో రాజీవ్ రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. అయితే ప్రస్తుతం స్టేట్ హైవేగా ఉన్న ఈరోడ్డు మెయింటెనెన్స్ కు సంబంధించి కాంట్రాక్ట్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. సదరు కాంట్రాక్టర్ తో మాట్లాడుకుని సమస్యను సెటిల్ చేసుకుని  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే వెంటనే రాజీవ్ రహదారిని విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

]]>
Sat, 07 Jun 2025 23:00:19 +0530 admin
కాళేశ్వరం కమిషన్ ముందు ఈటలవన్నీ అబద్దాలే : మంత్రి తుమ్మల https://prajakshethrenews.com/కాళేశ్వరం-కమిషన్-ముందు-ఈటలవన్నీ-అబద్దాలే-మంత్రి-తుమ్మల https://prajakshethrenews.com/కాళేశ్వరం-కమిషన్-ముందు-ఈటలవన్నీ-అబద్దాలే-మంత్రి-తుమ్మల కాళేశ్వరం కమిషన్ ముందు ఈటలవన్నీ అబద్దాలే 

సుమోటోగా కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్తానని మంత్రి తుమ్మల

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్  జూన్ 7 :
కాళేశ్వరం వివాదంలోకి తనను లాగుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు  అన్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల అబద్దాలు చెప్పారని.. సబ్ కమిటీకి కాళేశ్వరానికి సంబంధం లేదని పేర్కొన్నారు. మేడిగడ్డకు అనుమతులు ఇచ్చిన తర్వాత కమిషన్ వేశారని తెలిపారు. ఈటల రాజేందర్ చేసిన ప్రకటన అవాస్తవమని.. కమిషన్ ముందు అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఏంటని.. ప్రశ్నించారు. ఈటెల తన వాంగ్మూలాన్ని అనాలోచితంగా ఇచ్చారా లేక ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయా అని అడిగారు.తప్పుడు ప్రకటనలతో ఎక్కువ రోజులు మభ్యపెట్టలేరని పేర్కొన్నారు. తాను సుమోటోగా కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్తానని మంత్రి తెలిపారు. కాళేశ్వరంపై సబ్‌కమిటీ ఎప్పుడూ నివేదిక ఇవ్వలేదని.. అందుకు సంబంధించిన వివరాలన్నీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ప్రాణహితపై మాత్రమే స్టేటస్ రిపోర్టు ఇచ్చామని.. పెండింగ్ ప్రాజెక్టులపై మాత్రమే కమిషన్ వేశారని పేర్కొన్నారు.

]]>
Sat, 07 Jun 2025 22:44:41 +0530 admin
లాల్ దర్వాజా మహంకాళి దేవాలయానికి రంగుల కార్యక్రమానికి శ్రీకారం https://prajakshethrenews.com/లాల్-దర్వాజా-మహంకాళి-దేవాలయానికి-రంగుల-కార్యక్రమానికి-శ్రీకారం https://prajakshethrenews.com/లాల్-దర్వాజా-మహంకాళి-దేవాలయానికి-రంగుల-కార్యక్రమానికి-శ్రీకారం  లాల్ దర్వాజా మహంకాళి దేవాలయానికి రంగుల కార్యక్రమానికి శ్రీకారం 

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

వచ్చే నెలలో జరగనున్న  బోనాల ఉత్సవాలకు గాను లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయాన్ని  ముస్తాబు చేస్తున్నారు.అందులో భాగంగా శనివారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ ఛైర్మన్ బి. మారుతీ యాదవ్ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి దేవాలయానికి  రంగులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వచ్చే నెల 11 వ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ పూజారి రామకృష్ణ శర్మ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు కె.విష్ణు గౌడ్, కె. వెంకటేష్, సిరా రాజ్ కుమార్, కోశాధికారి ఎ.చంద్ర కుమార్, ప్రచార కార్యదర్శి యశ్వంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Sat, 07 Jun 2025 22:37:54 +0530 admin
బత్తిన నివాసంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ https://prajakshethrenews.com/బత్తిన-నివాసంలో-సత్యనారాయణ-స్వామి-వ్రతంలో-పాల్గొన్న-ఫిషరీస్-ఛైర్మన్-మెట్టు-సాయి-కుమార్ https://prajakshethrenews.com/బత్తిన-నివాసంలో-సత్యనారాయణ-స్వామి-వ్రతంలో-పాల్గొన్న-ఫిషరీస్-ఛైర్మన్-మెట్టు-సాయి-కుమార్ బత్తిన నివాసంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

చేప ప్రసాదం పంపిణీ కి ముందు రోజు ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి అక్కడ బావికి పూజలు నిర్వహించిన అనంతరం ఆ నీటితోనే చేప ప్రసాదం తయారు చేయడం ఆనవాయితీగా వస్తుందని బత్తిన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శనివారం పాతబస్తీ దూద్ బౌలి లోని బత్తిన నివాసంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతానికి బత్తిన కుటుంబ సభ్యులు,వారి సన్నీ హితులతో పాటు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఇంచార్జి కె.వెంకటేష్ తదితరులు పాలొన్నారు.వారికి బత్తిన గౌరీ శంకర్ గౌడ్ స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం వారిని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ ఆదివారం నాంపల్లి ఎక్సిబిషన్ మైదానంలో నిర్వహించే ఉచిత చేప ప్రసాదం పంపిణీ భగవంతుని ఆశీర్వాదంతో సజావుగా కొనసాగాలని కోరుకున్నానని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. ఈ ఏడాది కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు.

]]>
Sat, 07 Jun 2025 22:26:39 +0530 admin
రెండో రోజు మసులా బీచ్ ఫెస్ట్ కు పోటెత్తిన ప‌ర్యాట‌కులు https://prajakshethrenews.com/రెండో-రోజు-మసులా-బీచ్-ఫెస్ట్-కు-పోటెత్తిన-పర్యాటకులు https://prajakshethrenews.com/రెండో-రోజు-మసులా-బీచ్-ఫెస్ట్-కు-పోటెత్తిన-పర్యాటకులు రెండో రోజు మసులా బీచ్ ఫెస్ట్ కు పోటెత్తిన ప‌ర్యాట‌కులు

గ‌తంలో ఎన్నడూ లేని విధంగా మ‌చిలీపట్నంకు త‌ర‌లివ‌చ్చిన ప్ర‌జ‌లు

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
ఫుడ్ కోర్టులు కిట‌కిట‌....సీ కయాకింగ్ కు ఆద‌ర‌ణ‌....వాలీబాల్ పోటీల‌ను తిల‌కిస్తున్న ప్ర‌జ‌లు.... క‌బ‌డ్డీకి ప‌ట్టం క‌డుతున్న ప్ర‌జ‌లు.... అమ్యూజ్ మెంట్ కు ఆద‌ర‌ణ‌.... ప్యారా గ్లైడింగ్ కు ఆద‌ర‌ణ‌.... హెలీ రైడ్ కు విప‌రీత‌మైన డిమాండ్ పెరిగింది. సాయంత్రం కురిసిన చిరుజ‌ల్లుల‌తో ప్ర‌జ‌లు సేద తీరారు. చ‌ల్ల‌ని సాయంత్రం వేళ బీచ్ ప‌రిస‌రాలు వ‌ర్షం రాక‌తో ఆహ్లాదంగా మారాయి.రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల రద్దీని గ‌మ‌నించి ఎక్క‌డిక‌క్క‌డ సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది

 

]]>
Sat, 07 Jun 2025 10:04:51 +0530 admin
తిరుమల తరహా యాదగిరి గుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం : సీ ఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/తిరుమల-తరహా-యాదగిరి-గుట్ట-ఆలయాన్ని-అభివృద్ధి-చేస్తాం-సీ-ఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/తిరుమల-తరహా-యాదగిరి-గుట్ట-ఆలయాన్ని-అభివృద్ధి-చేస్తాం-సీ-ఎం-రేవంత్-రెడ్డి గంధమల్ల రిజర్వాయర్‌ పనులకు రేవంత్ రెడ్డి సిఎం  శంకుస్థాపన
తిరుమల తరహా యాదగిరి గుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం : సీ ఎం రేవంత్ రెడ్డి
యాదగిరిగుట్టలో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం
ప్రజా క్షేత్ర్, యాదాద్రి భువనగిరి :
;తిరుమల దేవస్థానం లాగా యాదగిరి గుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. యాదగిరిగుట్ట పేరును గత ప్రభుత్వంలో యాదాద్రిగా మార్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రజలంతా పిలుచుకునే యాదగిరిగుట్టగా మార్చామని అన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో కలిసి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో సిఎం రేవంత్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆలేరు రైతుల కల నేరవేర్చేందుకు గంధమల్ల రిజర్వాయర్‌ పనులకు శంకుస్థాపన చేశారు. దాంతోపాటు జిల్లాలో రూ.15 వందల కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభించారు.అనంతరం తిర్మలాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ.. యాదగిరిగుట్టలో యూనివర్సిటీని ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు. గంధమల్లను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నించారు. మూసీనది ప్రక్షాళన చేస్తామని ఆనాడే చెప్పామని సిఎం అన్నారు. సబర్మతి, గంగా, యమున ప్రక్షాళన చేస్తున్నప్పుడు మూసీ ఎందుకు ప్రక్షాళన చేయకూడదని ప్రశ్నించారు. “ఎర్రవల్లి, మొయినాబాద్‌, జన్వాడ ఫాంహౌస్‌లు లాక్కుంటామని మేం అనడం లేదు.. గోదావరి జలాలతో మూసీ ప్రక్షాళన చేస్తామనే అంటున్నాం” అని సిఎం రేవంత్‌ అన్నారు.

]]>
Sat, 07 Jun 2025 09:38:17 +0530 admin
రేవంత్, ఉత్తమ్.. చంద్రబాబుకు దాసోహం అయ్యారు: హరీష్ రావు https://prajakshethrenews.com/రేవంత్-ఉత్తమ్-చంద్రబాబుకు-దాసోహం-అయ్యారు-హరీష్-రావు https://prajakshethrenews.com/రేవంత్-ఉత్తమ్-చంద్రబాబుకు-దాసోహం-అయ్యారు-హరీష్-రావు రేవంత్, ఉత్తమ్.. చంద్రబాబుకు దాసోహం అయ్యారు: హరీష్ రావు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు.. ఎపి సిఎం చంద్రబాబుకు దాసోహం అయ్యారని మాజీ మంత్రి, సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా చంద్రబాబు ఇంటికి వెళ్ళి బజ్జీలు తిని వచ్చాడని.. అప్పటినుండి చంద్రబాబుకు ఎదురు చెప్పడం లేదని దుయ్యబట్టారు. కృష్ణా నది జలాల్లో మన వాటాలో ఉండే 65 టీఎంసిల నీళ్ళు వాడుకోకుండా.. ఆంధ్రాకు వదిలేస్తున్న చేతకాని దద్దమ్మ ప్రభుత్వమని హరీష్ రావు మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డిని మించి పోతున్నాడని ఎద్దేవా చేశారు.హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడి సీఎం అయ్యాడు. నేను ఆయనకంటే కంటే తక్కువ అబద్ధాలు ఆడాను.. అందుకే సీఎం కాలేదు అనుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నాడు. ఉత్తమ్ ని మీడియా వాళ్లు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు గురించి అడిగితే నేను ఇంక ప్రిపేర్ అయ్యి రాలేదు అంటున్నాడు. గతంలో కూడా అసెంబ్లీలో ఇలాగే ప్రిపేర్ అయ్యి రాలేదు అన్నాడు. నీటిపారాదుల శాఖ మంత్రిగా ఇంత అసమర్థతగా ఉంటారా?. కేబినెట్ మీటింగ్ లో బనకచర్ల ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడలేదు?. చంద్రబాబు గోదావరి నీళ్లు అక్రమంగా తరలించుకపోతుంటే సుప్రీం కోర్టుకు వెళ్లి ఆపే బాధ్యత మీకు లేదా?. రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ లో ప్రధాన మంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు?” అని నిలదీశారు.

]]>
Sat, 07 Jun 2025 09:34:57 +0530 admin
బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ ను విచారించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ https://prajakshethrenews.com/బిజెపి-ఎంపి-ఈటెల-రాజేందర్-ను-విచారించిన-జస్టిస్-పిసి-ఘోష్-కమిషన్ https://prajakshethrenews.com/బిజెపి-ఎంపి-ఈటెల-రాజేందర్-ను-విచారించిన-జస్టిస్-పిసి-ఘోష్-కమిషన్ సిడబ్ల్యుసి, మహారాష్ట్ర అభ్యంతరాల దృష్టా తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్పు

జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు ఈటెల రాజేందర్ వివరణ
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 6 :
 కేబినేట్ నిర్ణయం మేరకే ఆనకట్టల నిర్మాణం జరిగిందని బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ తెలిపారు. సాంకేతిక కమిటీ, కేబినెట్ కమిటీ సిఫార్సు మేరకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ ను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారించింది. విచారణ ముగిసిన అనంతరం రాజేందర్ మీడియాతో మాట్లాడారు. సిడబ్ల్యుసి, మహారాష్ట్ర అభ్యంతరాల దృష్టా ప్రాజెక్టు లొకేషన్ తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్పు చేశామన్నారు. నిధుల కొరత దృష్టా కాళేశ్వరం కార్పేరేషన్ ఏర్పాటు చేశామని, ప్రారిశ్రామిక, తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయాలని డిపిఆర్‌లో ఉందని స్పష్టం చేశారు. బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా? అని ఈటెలను కమిషన్ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణ అంశాలన్నీ నీటిపారుదల శాఖ కిందకే వస్తాయని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆర్ధిక మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్‌ను ఇవాళ కమిషన్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈనెల 9వ తేదీ సోమవారం రోజున నీటిపారుదల శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు కమిషన్ ముందుకు రానున్నారు. ఈనెల 11వ తేదీ బుధవారం రోజున మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కూడా కమిషన్ విచారించనున్నది.

]]>
Fri, 06 Jun 2025 17:25:10 +0530 admin
నాలాల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ : హైడ్రా కమిషనర్ రంగనాథ్ https://prajakshethrenews.com/నాలాల-ఆక్రమణలపై-స్పెషల్-డ్రైవ్-హైడ్రా-కమిషనర్-రంగనాథ్ https://prajakshethrenews.com/నాలాల-ఆక్రమణలపై-స్పెషల్-డ్రైవ్-హైడ్రా-కమిషనర్-రంగనాథ్ నాలాల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్
        హైడ్రా కమిషనర్ రంగనాథ్  
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ , జూన్ 6 :

నాలాల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వచ్చే నాలుగు నెలల పాటు నాలాలపైనే దృష్టి పెడుతామని, హైదరాబాద్‌లో వరద నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక అధ్యయనం చేస్తున్నామని, నాలా, నీటి వనరుల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను తొలగిస్తామని, నాలాలపై పేదల నిర్మాణాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. అక్రమణల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడకూడదని హెచ్చరించారు. రసూల్‌పురా నాలాపై ఆక్రమ నిర్మాణాలను కూల్చివేశామని రంగనాథ్ స్పష్టం చేశారు.

]]>
Fri, 06 Jun 2025 17:06:43 +0530 admin
ఒక్క నిమిషం ఆలస్యమైన లా సెట్ కు నో ఎంట్రీ https://prajakshethrenews.com/ఒక్క-నిమిషం-ఆలస్యమైన-లా-సెట్-కు-నో-ఎంట్రీ https://prajakshethrenews.com/ఒక్క-నిమిషం-ఆలస్యమైన-లా-సెట్-కు-నో-ఎంట్రీ ఒక్క నిమిషం ఆలస్యమైన లా సెట్ కు నో ఎంట్రీ

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 5 :

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు జూన్‌ 6వ తేదీన లాసెట్‌ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జూన్‌ 6వ తేదీన మూడు విడతలుగా ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 57,715 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకి 41,210 మంది, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీకి (ఇంటర్‌ విద్యార్హతతో రాసే ప్రవేశ పరీక్ష) 11,695 మంది, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు 4,810 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఈ పరీక్షల హాల్‌ టికెట్లను కూడా జారీ చేశారు. వీరందరికీ శుక్రవారం (జూన్‌ 6) రాత పరీక్ష నిర్వహించనున్నట్లు లాసెట్ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బి విజయలక్ష్మి తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు తమతోపాటు హాల్‌టికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలని, ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదని ఆమె స్పష్టం చేశారు.
జూన్‌ 23 వరకు ఎస్సీ మహిళా గురుకుల డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువు
తెలంగాణ ఎస్సీ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలకు అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదలైంది. ఆసక్తి కలిగిన విద్యార్ధినులు జూన్‌ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుతో పాటు పదోతరగతి మార్కుల మెమో, ఇంటర్‌మార్కుల మెమోను జత చేయాలని, అలాగే ఈ ఏడాది జనవరి 1 తరువాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రాలు, ఐదు పాస్‌పోర్టు ఫొటోలు తీసుకుని సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలకు గురుకుల వెబ్‌సైట్‌తోపాటు 040-23391598 ఫోన్‌ నంబరును సంప్రదించవచ్చని సూచించారు.

]]>
Thu, 05 Jun 2025 22:34:58 +0530 admin
ఎడ్యుకేషన్ లో దేశంలోనే నెంబర్ వన్ ఉండే విధంగా ప్రభుత్వం చేస్తున్న చర్యలకు తల్లిదండ్రులు సహకరించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్ https://prajakshethrenews.com/ఎడ్యుకేషన్-లో-దేశంలోనే-నెంబర్-వన్-ఉండే-విధంగా-ప్రభుత్వం-చేస్తున్న-చర్యలకు-తల్లిదండ్రులు-సహకరించాలి-మంత్రి-పొన్నం-ప్రభాకర్ https://prajakshethrenews.com/ఎడ్యుకేషన్-లో-దేశంలోనే-నెంబర్-వన్-ఉండే-విధంగా-ప్రభుత్వం-చేస్తున్న-చర్యలకు-తల్లిదండ్రులు-సహకరించాలి-మంత్రి-పొన్నం-ప్రభాకర్ ఎడ్యుకేషన్ లో దేశంలోనే  నెంబర్ వన్ ఉండే విధంగా ప్రభుత్వం చేస్తున్న చర్యలకు తల్లిదండ్రులు సహకరించాలి

మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

తమ పిల్లలను ప్రాథమిక ఉన్నత సాంకేతిక విద్యా అందుకునే విధంగా ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్ లో దేశంలోనే  నెంబర్ వన్ ఉండే విధంగా ప్రభుత్వం చేస్తున్న చర్యలకు తల్లిదండ్రులు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రూపొందిన ప్రజల సహకారం కావాలని, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకొని ఎదిగితే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విప్లవం వచ్చిందని, ప్రజలకు సౌకర్యాలు పెరిగాయని, సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రపంచ స్థాయి కాంపిటీటివ్ స్కిల్స్ ఉండే ఎడ్యుకేషన్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ,యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చాం. తెలంగాణ ప్రభుత్వం టీచర్ల నియామకాలు, బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చింది ఇంటిగ్రేటెడ్ గురుకులాలు తెచ్చింది హాస్టల్ మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచాం

ఎడ్యుకేషన్ కు మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుంది.

తెలంగాణ యావత్ ప్రజలకు విజ్ఞప్తి.. స్కూల్ డ్రాప్ ఔట్స్ లేకుండా సామాజిక బాధ్యతగా అందరు చదువు అందుకునే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలబడండి

తల్లిదండ్రుల విద్యను అందించేందుకు బాధ్యత గా వ్యవహరించాలి.  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరూ పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేయాలి. కాలుష్యాన్ని నియంత్రణ చేయడానికి మొక్కలు నాటాలి. పర్యావరణం కాపాడడానికి ప్రతి తెలంగాణ బిడ్డ మొక్కలు నాటడం తో పాటు దానిని కాపాడడానికి విధిగా దినచర్య గా తీసుకోవాలి. రాబోయే కాలానికి సమాజానికి మనం అందిస్తున్న భవిషత్ ఆస్తిగా గమనించాలి. లేదంటే భవిషత్ సమాజం క్షమించదు. ఆక్సిజన్ పెట్టుకొని పోయే పరిస్థితి వస్తుంది. ఢిల్లి మహా నగరంలో నివసించే పరిస్థితి లేదని, హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో కాలుష్యం పెరుగుతుందన్నారు. మొక్కలు నాటడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మొక్కలు నాటడానికి హైదరాబాద్ లో 30 లక్షల పైగా మొక్కలు నాటాలని ప్లాన్ చేస్తున్నామని,మొక్కలు అందు బాటులో ఉన్నాయి ఎక్కడ ఇబ్బంది లేదు. జహీరాబాద్ ప్రజా ప్రతినిధులు కోరితే వారం రోజుల్లో ఏసీ బస్సు వేస్తాం ప్రయాణికులు ఉపయోగించు కోవాలని పేర్కొన్నారు.

]]>
Thu, 05 Jun 2025 22:19:12 +0530 admin
లోహ విజ్ఞాన౦ పై వూట్జ్ ది ఫర్గాటెన్ మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ డెక్కన్ గ్రంధం ఆవిష్కరణ https://prajakshethrenews.com/లోహ-విజ్ఞాన౦-పై-వూట్జ్-ది-ఫర్గాటెన్-మెటల్-క్రాఫ్ట్-ఆఫ్-డెక్కన్-గ్రంధం-ఆవిష్కరణ https://prajakshethrenews.com/లోహ-విజ్ఞాన౦-పై-వూట్జ్-ది-ఫర్గాటెన్-మెటల్-క్రాఫ్ట్-ఆఫ్-డెక్కన్-గ్రంధం-ఆవిష్కరణ లోహ విజ్ఞాన౦ పై వూట్జ్ ది ఫర్గాటెన్ మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ డెక్కన్ గ్రంధం ఆవిష్కరణ
* అత్యంత నాణ్యమైన ఉక్కు లోహం కూడా ఉత్పత్తి లో తెలంగాణ అగ్రగామీ
* గ్రందాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనా చారి
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్ జూన్ 5 :
లోహ విజ్ఞాన౦ పై రూపొందించిన  డా, శ్రీపెరుందురు జైశంకర్ రాసిన వూట్జ్ ది ఫర్గాటెన్ మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ డెక్కన్ గ్రంధం ఆవిష్కరణ పబ్లిక్ గార్దేన్ లలితా కళాతోరణం లో గురువారం జరిగింది . జాతీయ విశ్వకర్మ ఎంప్లాయిస్, ప్రొఫెషనల్స్ అసోషియేషన్ జాతీయ  అధ్యక్షులు ఏ. పద్మాచారి అధ్యక్షతన జరిగిన ఆధ్వర్యంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్ లు ముఖ్య అతిధులుగా హాజరయి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మధుసుదనాచారి మాట్లాడుతూ   "ప్రపంచంలో అత్యంత నాణ్యమైన కత్తుల తయారీకి ప్రధాన కేంద్రం డమాస్కస్. అయితే, ఈ కత్తుల తయారీకి తెలంగాణలో ఉత్పత్తయ్యే ఉక్కును డమాస్కస్ దిగుమతి చేసుకునేది. పైగా, ఒక ముద్ద ఉక్కు కు పది రేట్ల బంగారు ముద్దలను మన తెలంగాణా ఉక్కు తయారీ దారులకు అందచేసే వారట. ఆరువేల సంవత్సరాలకు పూర్వమే తెలంగాణలో ప్రపంచంలోనే అత్యంత మేలు రకమైన ఉక్కు తయారీ కావడంతోపాటు ప్రపంచంలోని పలు దేశాలకు ఎగుమతి చేసేవారట" ఈ అంశాలతోపాటు  ఎంతో విలువైన సమాచారాన్ని వూట్జ్ ది ఫర్గాటెన్ మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ డెక్కన్ అనే గ్రంధంలో పేర్కొన్నారు. తెలంగాణా కేవలం సాంస్కృతికంగా, చారిత్రకంగా ఉన్నత చరిత్ర కలిగిన తెలంగాణలో అత్యంత నాణ్యమైన ఉక్కు లోహం కూడా ఉత్పత్తి చేసేదని ఆధారాలతో సహా రూపొందించిన ఈ పుస్తకం మంచి పరిశోధనా గ్రంధం గా ఉపయోగపడుతుందని అన్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, ప్రస్తుత నిచ్చెనమెట్ల సమాజంలో అద్భుత కళాకారులుగా, నిర్మాణ ప్రతిభ వున్నా విశ్వబ్రాహ్మలు శూద్రులుగా విభజించబడి అణగారిన కులాలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి నాగరికత నేర్పిన విశ్వ బ్రాహ్మణుల గొప్పతనంపై ఈ గ్రంధంలో అద్భుతంగా పేర్కొన్నారని అన్నారు. గ్రంథ రచయిత శ్రీపెరంబుదూరు జైకిసాన్ తెలంగాణాలో ఉక్కు లోహ పరిశ్రమ పరిణామంపై వివరించారు.  ఆంగ్లంలో వూట్జ్ అని పిలిచే ఉక్కును భారత దేశంలో అత్యంత పదునైన ఆయుధాలు తయారు చేయడానికి ఉపయోగించేవారు. ఈలోహం అధిక కర్బనం కలిగిఉంటుంది. ఇది, ఇనుములాగా మెత్తనైనా లోహం కాదు. ఇనుప ముక్కలను అతి ఉష్టోగ్రత దగ్గర కరిగించి కర్బనం జోడించి ఉక్కుగా తయారు చేస్తారు. దీనితోనే కత్తులు, చాకులు, పదునైన ఆయుధాల తయారీకి ఉపయోగించేవారు. ఈ ఉక్కును గుజరాత్ లోని క్యాచ్ ఓడరేవుద్వారా పర్షియన్ జలసంధి మీదుగా డమాస్కస్ కు రవాణా చేయబడి సిరియాలో ఆయుధాలు తయారు చేసేవారు. కచ్ మీదుగా ఎగుమతి చేసినందున ఈ లోహాన్ని కచ్చి లోగా పిలిచే వారట. 1750 లో డమాస్కస్ లో మన లోహంతో కత్తులు, ఆయుధాల తయారీ నిలిచిపోయిందని ఈ గ్రంధంలో సవివరంగా తెలిపారు.మహమ్మద్ ప్రవక్త వాడిన ఖడ్గాన్ని 'మొహాన్నద్' అని పిలిచేవారు. మొహాన్నది అంటే మంచి భారతదేశం ఉక్కుతో తయారుచేసిన ఖడ్గమని అర్ధం. ఇక, మనదేశంలో గుప్తుల కాలం క్రీ.శ. 400 లో నిర్మించిన ఢిల్లీ ఇనుప స్తంభం, ఒర్రిస్సాలోని కోణార్క్ దేవాలయం లో సుమారు 50  నుండి 60 టన్నుల బరువైన దాదాపు 60 ఇనుప స్తంబాలు, ఇప్పటికీ కానవచ్చే ఎన్నో ఫిరంగులు తుప్పుపట్టకుండా ఉంది మన పూర్వీకుల లోహ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.     *Wootz The Forgotten Metal Craft of  Deccan అనే ఈ పుస్తకంలో మొదటి అధ్యాయంలో తెలంగాణ సంక్షిప్త చరిత్ర, ఈ ప్రాంతంలోని ఉక్కు భౌతిక సంస్కృతీ, వివిధ ప్రాంతాల్లో తుప్పుపట్టని  ఉక్కు స్తంబాలు, ఫిరంగులు, విశ్వా కర్మల వృత్తి నైపుణ్యం తదితర అంశాల గురించి వివరించారు. రెండు అధ్యాయంలో తెలంగాణాలో పెద్ద రాతి సమాధుల యుగంగురించి, క్రీ.పూ. 6 వేలసంవత్సరాల నాడు ఇక్కడ కనిపించే ఇనుప సంస్కృతిని వివరించారు. మూడవ అధ్యాయంలో తెలంగాణలో అధికంగా ఉక్కు ఆధారిత వస్తువులు తయారయ్యే గ్రామాలు, చిన్న పట్టణాల గురించి వివరించారు. కర్ణాటక, తమిళ నాడు, తెలంగాణా లో ఉక్కు తయారీలో తేడాలున్నాయని, తెలంగాణలో ఉక్కు తయారీలో ఉక్కు ముద్దలకు 1 % నుండి 2 % కార్బనం కలిపేవారు. ఇతర రాష్ట్రాలల్లో ఇది, 0 .8 % నుండి 1 .2 % కర్బనం కలిపే వారు. అందుకే, తెలంగాణా ఉక్కు అత్యంత ప్రామాణికమైనది.  తెలంగాణా లో ఉక్కు లోహానికి సంబందించిన అనేక అంశాలను తెలియ చేసే ఈ పుస్తకం మెటల్స్ పై పరిశోధన చేసే స్కాలర్స్ కు, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వ భ్రమణ సంగం రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్ మోహన్, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ, హైదరాబాద్ డీఆర్ఓ వెంకటా చారి, రాజేందర్ రెడ్డి, వి. రఘునాధ్,  రఘువీర్ ప్రతాప్, పెందోట శ్రీను, తంగెళ్ల పల్లి రవికుమార్, కిరణ్ కుమార్, బుద్దారం సుధాకర్, శాంతి కృష్ణ, మంజుల, తదితరులు పాల్గొన్నారు.

]]>
Thu, 05 Jun 2025 21:55:01 +0530 admin
స్థానిక సంస్థల రిజర్వేషన్లను 42 శాతంకు పెంచిన తరువాతే ఎన్నికలు జరపాలి : ఆర్. కృష్ణయ్య https://prajakshethrenews.com/స్థానిక-సంస్థల-రిజర్వేషన్లను-42-శాతంకు-పెంచిన-తరువాతే-ఎన్నికలు-జరపాలి-ఆర్-కృష్ణయ్య https://prajakshethrenews.com/స్థానిక-సంస్థల-రిజర్వేషన్లను-42-శాతంకు-పెంచిన-తరువాతే-ఎన్నికలు-జరపాలి-ఆర్-కృష్ణయ్య స్థానిక సంస్థల రిజర్వేషన్లను 42 శాతంకు పెంచిన తరువాతే ఎన్నికలు జరపాలి : ఆర్. కృష్ణయ్య

* రాజకీయ పార్టీలు - ప్రతి పక్షాలు బి.సి.లకు మద్దతు ఇవ్వాలి.

* ఉద్యమాలకు సిద్దంగా యుండండి- కుల సంఘాలు పిలుపు
* ముఖ్యమంత్రి లేఖ రాసిన 14 కుల సంఘాలు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 4 :
స్థానిక సంస్థలలో బి.సి రిజర్వేషన్లను 42 శాతంకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని లేకపోతే పెద్ద యెత్తున ఆందోళన చేస్తామని ఊరు వాడ లో ఉద్యమం చేస్తామని రాజ్యసభ్యులు, జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ఒక వేళ పెంచకపోతే గ్రామ స్థాయి నుంచి ఉద్యమాలకు సిద్దంగా యుండాలని బి.సి ప్రజలకు పిలుపు నిచ్చారు. 42 శాతంకు పెంచిన తరువాతే ఎన్నికలు జరపాలని ఈ రోజు విద్యానగర్ బి.సి భవన్ లో 14 బి.సి సంఘాలు సమావేశమై ముఖ్యమంత్రికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.వాస్తవంగా దాదాపు 12 నెలల క్రితం జరగవలసిన ఎన్నికలు బీసీ రిజర్వేషన్ గురించి వాయిదా మీద వాయిదా పడుతూ జాప్యం జరుగుతుంది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల విషయం పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇది పరిష్కారం కాకుండా పెంచకుండా ఎన్నికలకు ఎలా వెళ్ళడం న్యాయం కాదు. ప్రతి పక్ష పార్టీలు బి.సి రిజర్వేషన్ల విషయంలో తమ వైఖరి ప్రకటించాలని కోరారు.బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతం అసెంబ్లీలో చట్టం చేశారు. కానీ దీని ప్రకారం ఇంతవరకు ప్రభుత్వ జిఓ జారీ కాలేదు. అసెంబ్లీ చట్టం చేసిన తర్వాత కేంద్రముకు పంపుతామని ప్రకటనలు వెలువడ్డాయి కానీ ఇంతవరకు దాని అతి-గతి తెలియడం లేదు. వాస్తవంగా రాజ్యాంగ ప్రకారం స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి యుంది. కానీ ముక్యమంత్రి కేంద్రంపై నెట్టి తప్పించుకోవడానికి చేస్తున్నారు.త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది 42 శాతం కు బిసి రిజర్వేషన్ల పెంచే విషయంలో ఇంతవరకు క్లారిటీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఒక్కొక్కసారి ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు. ఒకసారి 42 శాతం రిజర్వేషన్లు పెంచనున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇంకోసారి పార్టీ పరంగా 42 శాతం టికెట్లు ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఇలా వివాదాస్పదమైన ప్రకటనలు జారీ చేస్తున్నారు. పార్టీ పరంగా టికెట్లు వద్దు ఆ బిక్షం వద్దు హక్కు కావాలి. "హక్కు యుంటి అన్నీ పార్టీ టికెట్లు ఇస్తారు. పార్టీ పరంగా ఇస్తే అన్యాయం జరుగుతుంది. ఒక్కక్క పార్టీ ఒక చోట ఇస్తే ఆగ్రా కులాలకు డబ్బుతో బి.సి.లు పోటీ పడలేరు. ముక్తకంఠంతో బీసీలందరూ కోరేది ఒకటే 42 శాతం కు బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేయాలి. 42 శాతం రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వానికి ఎలాంటి అవరోధాలు లేవు.స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. 73-74వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-D6 ప్రకారం స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధమైన అధికారం ఇచ్చింది. దీని ప్రకారం అసెంబ్లీలో చట్టం చేశారు. దీని ప్రకారం జిఓ తీసి వెంటనే ఎన్నికలు జరపవచ్చు. సుప్రీంకోర్టుకు ఎవరైనా వెళ్ళినా బీసీల కేసు గెలిచే అవకాశం యుంది. ఎందుకంటే జనాభా లెక్కలు ఉన్నవి. అసెంబ్లీలో చట్టం చేశారు. అలాగే సుప్రీంకోర్టు EWS కేసులో 50% సీలింగ్ ఎత్తివేసింది. ఇప్పుడు అన్ని కోణాలలో చూస్తే గెలిచే అవకాశం యుంది చట్టపరమైన, న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవరోదాలు లేవు. కావున సుప్రీం కోర్టులో కేసు గెలుస్తుంది. కావున తమరు జోక్యం చేసుకొని వెంటనే జిఓ తీసి ఎన్నికలు జరుపాలని విజ్ఞప్తి చేస్తున్నాం.ఒక వేళ ఎవరైనా కోర్టుకు వెళితే గట్టిగా వాదిస్తే కేసు గెలుస్తుంది. ఒక వేళ కేసు గెలవకపోతే పార్టీ బాధ్యత లోపాలు ప్రజలు కూడా చూసుకుంటారు. ప్రజా ఉద్యమాల ద్వారా రాడో పేడో బి.సి సంఘాలు చూసుకుంటారు. జి.ఓ తీసి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం...ఇక విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంపుకు కచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుంది. తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి కేంద్రానికి పంపి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలి. ఇందుకోసం తమరు కృషి చేయాలి. విద్యా, ఉద్యోగాలపై 50% సీలింగ్ సుప్రీం కోర్టు విదించింది. కావున తమరు అసెంబ్లీలో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి - ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, రాష్ట్ర బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, రామ్మూర్తి గౌడ్, రామకోటి, జిల్లా నరేందర్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు 

]]>
Wed, 04 Jun 2025 20:17:00 +0530 admin
భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు : జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ https://prajakshethrenews.com/భూ-సమస్యల-పరిష్కారం-కోసమే-రెవెన్యూ-సదస్సులు-జిల్లా-కలెక్టర్-బి-సత్య-ప్రసాద్ https://prajakshethrenews.com/భూ-సమస్యల-పరిష్కారం-కోసమే-రెవెన్యూ-సదస్సులు-జిల్లా-కలెక్టర్-బి-సత్య-ప్రసాద్ భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు
జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్
ప్రజా క్షేత్ర్, జగిత్యాల :
 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి
రెవెన్యూ చట్టమని, దీనిని గ్రామలలో రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఆన్నారు.బుధవారం జిల్లా లోని ఎండపల్లి,గొల్లపల్లి, వెల్గటూర్ మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు.ఈసంధర్భంగా ఎండపల్లి మండలంలోని గొడిశెలపేట్, వెల్గటూర్ మండలంలోని మొక్కరావుపేట్, గోల్లపెల్లి మండలంలోని దట్నూర్ గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని భూ సమస్యలేని రాష్ట్రంగా తీర్చిదిద్దుటకై ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టం–2025 మరియు భూభారతి నియమావళి–2025 అమలుకు సంబంధించి జూన్ 3, 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయబడ్డాయిన్నారు.
భూ భారతి రెవెన్యూ సదస్సులు జగిత్యాల జిల్లాలోని  రెవెన్యూ డివిజనల్ లోని అన్నీ మండలాల రెవెన్యూ గ్రామాలలో జూన్ 3, 2025 నుండి జూన్ 20, 2025 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించబడుతున్నాయిని తెలిపారు.ఈ సదస్సులలో అధికారులు గ్రామాల వారీగా సందర్శించి, రైతుల భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తారు. రైతులు తమ భూ సమస్యల దరఖాస్తులతో పాటు సంబంధిత పత్రాలను సమర్పించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.జగిత్యాల జిల్లాలో జూన్ 3 నుండి జూన్ 20 వరకు జరగబోయే రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ రెవెన్యూ గ్రామాల వారీగా రూపొందించాలని, మరియు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, ఎండపల్లి, వెల్గటూర్, గోల్లపెల్లి తహసీల్దారులు ఎంపీడీవోలు, రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.

]]>
Wed, 04 Jun 2025 19:36:28 +0530 admin
ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు https://prajakshethrenews.com/ఉద్యోగుల-సమస్యల-పరిష్కారం-మా-బాధ్యత-డిప్యూటీ-సీఎం-భట్టి-విక్రమార్క-మల్లు https://prajakshethrenews.com/ఉద్యోగుల-సమస్యల-పరిష్కారం-మా-బాధ్యత-డిప్యూటీ-సీఎం-భట్టి-విక్రమార్క-మల్లు ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత

రేపు క్యాబినెట్ సమావేశంలో నివేదిక సమర్పిస్తాం, పరిష్కారం కనుగొంటాం

ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశంలో
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా ప్రభుత్వం బాధ్యత, సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని నియమించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సబ్ కమిటీ సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు తదితరులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలపై మీ అందరితో చర్చించి సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి సానుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల కమిటీకి సూచించారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన త్రీమెన్ కమిటీ ఉద్యోగ సంఘాలతో పలుమార్లు సమావేశమై విజ్ఞప్తులను స్వీకరించారు. మీ వద్ద స్వీకరించిన సమాచారాన్ని కమిటీకి పలు దఫాలుగా వివరించారు. గత కొన్ని సంవత్సరాలుగా బకాయిలు పేరుకుపోవడంతో అన్ని ఒకేసారి చేయలేకపోయాం, ఇక ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టకుండా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలనదే ప్రభుత్వ ఆలోచన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాలకు వివరించారు. గురువారం క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో అధికారుల నివేదికతో పాటు నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు గా ప్రజా ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. ప్రజలకు చేయాల్సిన పనులు, అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఆదాయం, వ్యయం వీటన్నిటితో పాటు ఉద్యోగ వ్యవస్థకు ఇవ్వాల్సినవి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా భావిస్తుందని డిప్యూటీ సీఎం వివరించారు. ఒకవైపు ప్రజలకు మరోవైపు ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా కలిసి కూర్చుని చర్చించుకుని ముందుకు పోవాలన్న ఆలోచనతోనే క్యాబినెట్ సమావేశానికి ముందు ఉద్యోగ సంఘాలతో సమావేశమైనట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
గత పది సంవత్సరాల పాలనతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి అయినప్పటికీ ఉద్యోగులకు సాధ్యమైనంత మేరకు మేలు చేయాలి, వారి సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనలో భాగంగానే మా ప్రభుత్వం రాగానే మొదటి తారీకు నే జీతాలు చెల్లిస్తుందని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, కొత్త పథకాలు పెద్ద సంఖ్యలో తీసుకువచ్చాం, విజయవంతంగా అమలు చేస్తున్నాం వీటికి తోడు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలన్న తపనలో ప్రజా ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.
వనరులు సమకూర్చుకొని ప్రజలపై అదనంగా ఒక్క రూపాయి భారం పడకుండా ముందుకు పోతున్నాం అదే నేపథ్యంలో ఉద్యోగుల సంక్షేమం కోసం ఆర్థికపరమైన కసరత్తు చేస్తున్నాం ఈ కసరత్తు విజయవంతం కావాలని మనసున్న ప్రభుత్వం కోరుకుంటుందని వివరించారు. ఉద్యోగులకు మంచి చేయాలన్న ఆలోచనతోనే పలుమార్లు సమావేశాలు నిర్వహించామని వివరించారు.
ప్రభుత్వ ఆదాయానికి మరియు ఖర్చుకు చేయాల్సిన పనులను బేరీజు వేసుకొని ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి బలంగా ఉన్నారని డిప్యూటీ సీఎం ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారు. ఉద్యోగుల కుటుంబాల్లో పెళ్లిళ్లు, ఆసుపత్రుల ఖర్చులకు సంబంధించిన సమస్యలపై క్యాబినెట్ సహచరులం అంతర్గతంగా పలుమార్లు చర్చించుకున్నామని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న అంశంపై ఎవరికీ భిన్నాభిప్రాయం లేదని తెలిపారు.  గురువారం క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో ఉద్యోగ సంఘాల సమస్యలపై ఏర్పాటు చేసిన అధికారుల త్రీ మెన్ కమిటీ, ఆర్థిక శాఖ, ఇతర అధికారులతో చర్చించి ఒక నివేదిక రూపొందించి క్యాబినెట్ కు నివేదిస్తాం, పరిష్కారం కనుగొంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారు. సమావేశం లో అధికారులు నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్, సందీప్ కుమార్ సుల్తానియా, మహేష్ దత్ ఎక్కా తదితరులు పాల్గొన్నారు.

]]>
Wed, 04 Jun 2025 19:32:48 +0530 admin
మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం https://prajakshethrenews.com/మున్సిపల్-ఎన్నికలకు-తెలంగాణ-ప్రభుత్వం-సన్నద్ధం https://prajakshethrenews.com/మున్సిపల్-ఎన్నికలకు-తెలంగాణ-ప్రభుత్వం-సన్నద్ధం *మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం* 

*వార్డుల విభజనకు  సంబంధించి నోటిఫికేషన్ విడుదల* 

*రాష్ట్ర వ్యాప్తంగా 18 కొత్త మున్సిపాలిటీలు* 

*5 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు* 

*7 మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలు విలీనం* 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం  సన్నద్ధమవుతోంది. కొత్త మున్సిపాలిటీలలో వార్డుల విభజనకు కసరత్తు చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వార్డుల విభజనకు  సంబంధించి నోటిఫికేషన్  మంగళవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 కొత్త మున్సిపాలిటీలు, 5 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. 7 మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలు విలీనం అయ్యాయి. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో వార్డుల విభజన ప్రక్రియకు మున్సిపల్ శాఖ అధికారి శ్రీదేవి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 21 వరకు వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులను ఆదేశించారు.

*త్వరలో రిజర్వేషన్‌లు ఖరారు..* 

ప్రభుత్వం ఇప్పటికే గ్రామాల్లో, పంచాయతీల్లో వార్డుల విభజన, ఓటరు జాబితాను తయారు చేసింది. ఎంపీటీసీల విభజన, ఓటరు జాబితాను సిద్ధం చేసి ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. త్వరలో ఎన్నికలకు అవసరమైన రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో పట్టణాల్లోనూ వార్డుల విభజన చేపట్టడంతో ఆ తర్వాత ఓటరు జాబితా పూర్తికానుంది. అనంతరం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి కాగానే పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా జరగనున్నాయి.

*పునర్విభజన ఇలా..* 

కొహిర్, కేసముద్రం, అశ్వరావుపేట, స్టేషన్ ఘనపూర్, మద్దూర్, ఎదులాపురం, దేవరకద్ర, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, చేవెళ్ల, మొయినాబాద్, ములుగు, బిచ్కుంద, కల్లూరు, అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో వార్డుల విభజన జరగనుంది. మహబూబ్ నగర్, మంచిర్యాల, కరీంనగర్, రామగుండం, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లు, నర్సంపేట, పరిగి, కొల్లాపూర్, ఆలేరు, బాన్సువాడ, జగిత్యాల, హాలియా మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల్లోనూ కొత్త వార్డులు ఏర్పాటు కానున్నాయి. కొత్త మున్సిపాలిటీల్లో వార్డుల విభజన తర్వాత జూన్‌‌ నెలాఖరు వరకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని భావిస్తోంది..

]]>
Wed, 04 Jun 2025 15:32:00 +0530 admin
కరీంనగర్లో డివిజన్, వార్డుల పునర్విభజన కు సర్కారు నోటిఫికేషన్ https://prajakshethrenews.com/కరీంనగర్లో-డివిజన్-వార్డుల-పునర్విభజన-కు-సర్కారు-నోటిఫికేషన్ https://prajakshethrenews.com/కరీంనగర్లో-డివిజన్-వార్డుల-పునర్విభజన-కు-సర్కారు-నోటిఫికేషన్ కరీంనగర్లో డివిజన్, వార్డుల పునర్విభజన కు సర్కారు నోటిఫికేషన్

ప్రజా క్షేత్ర్, కరీంనగర్, జూన్4 :
 మున్సిపల్‌ ఎన్నికలకు త్వరలోనే నగరా మోగనున్న నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో విలీన గ్రామాలకు సంబంధించి డివిజన్లు, వార్డుల పునర్విభజనకు రాష్ట్ర సర్కారు సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 3న డివిజన్ల విభజనకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉంటుంది 5 నుంచి 11 వరకు అభ్యంతరాలు, నివేదికలు స్వీకరించాలి. 12 నుంచి 16 వరకు అభ్యంతరాలను పరిశీలించాల్సి ఉంటుంది. 17, 18 తేదీల్లో డివిజన్ల విభజన పత్రాలకు కలెక్టర్‌ అనుమతి తీసుకోవాలి. 19న ముసాయిదా జాబితాను సీడీఎంఎకు పంపించాలి. 20న సీడీఎంఏ నుంచి ప్రభుత్వానికి నివేదికను పంపించి, 21న ఫైనల్‌ డివిజన్ల జాబితాను విడుదల చేస్తారు.కరీం‘నగరం’ సమీపంలో కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు మల్కాపూర్‌, చింతకుంట, గోపాల్‌పూర్‌, దుర్శేడ్‌, బొమ్మకల్‌ గ్రామాలను కలుపుతూ ప్రస్తుతం ఉన్న 60 డివిజన్లను 66కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నగరపాలక అధికారులు 66 డివిజన్లకు సంబంధించి గతంలోని ఓటరు జాబితాను అనుసరించి డివిజన్ల విభజనను పూర్తి చేసి సీడీఎంఏకు పంపినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఒక జాబితా కూడా గతంలోనే సోషల్‌ మీడియాల్లో చక్కర్లు కొట్టింది. అప్పటి నుంచే కార్పొరేషన్‌లోని వివిధ పార్టీల నాయకుల్లో డివిజన్ల విభజనపై ప్రత్యేక ఆసక్తి నెలకొన్నది.ఎవరికివారే తమ డివిజన్ల విభజన ఎలా జరిగింది? ఏయే కాలనీల ఓట్లు ఏయే ప్రాంతాల్లో కలిపారన్న చర్చలు సాగాయి. ప్రతి డివిజన్‌కు 4500 నుంచి 5500 ఓటర్లు ఉండేలా అధికారులు డివిజన్లను విభజించినట్లు తెలుస్తుండగా, అయితే పలు డివిజన్లల్లో దూర ప్రాంతాలకు చెందిన ఇండ్లను చేర్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు సంబంధించి ఫిర్యాదులు, తమ అభ్యంతరాలు తెలిపేందుకు ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నాయకులు సిద్ధమయ్యారు

]]>
Wed, 04 Jun 2025 12:05:33 +0530 admin
రాజీవ్ యువవికాస్ పధకం మరింత ఆలస్యం https://prajakshethrenews.com/రాజీవ్-యువవికాస్-పధకం-మరింత-ఆలస్యం https://prajakshethrenews.com/రాజీవ్-యువవికాస్-పధకం-మరింత-ఆలస్యం రాజీవ్ యువవికాస్ పధకం మరింత ఆలస్యం
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్4 :
రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ అందజేయాల్సిన శాంక్షన్ లెటర్ల ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసింది. మరింత పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.తెలంగాణ రాజీవ్‌ యువ వికాసం స్కీమ్ మంజూరు పత్రాల అందజేత ప్రక్రియ వాయిదా పడింది. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన వివరాల ప్రకారం… నేటి నుంచి జూన్ 9వ తేదీ వరకు లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లను అందజేయాల్సి ఉంది. రూ. లక్షలోపు యూనిట్లకు ముందుగా ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించింది. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో శాంక్షన్ లెటర్ల అందజేత ప్రక్రియపై సర్కార్ వెనక్కి తగ్గింది.రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు భారీ దరఖాస్తులు వచ్చాయి. అన్ని జిల్లాల నుంచి కలిపి 16.22 ల‌క్ష‌ల మంది అప్లికేషన్ చేసుకున్నారు. అనూహ్యమైన రీతిలో దరఖాస్తులు రావటంతో… దరఖాస్తుల పరిశీలన విషయంలో ప్రభుత్వం పలు జాగ్రత్తలను చేపట్టింది. అన్ని కోణాల్లో దరఖాస్తుదారుడి వివరాలను సేకరించే ప్రయత్నం చేసింది. విడతలవారీగా శాంక్షన్ లెటర్లను అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ముందుగా రూ. లక్ష లోపు యూనిట్లను ఇచ్చేందుకు సిద్ధమైంది.భారీగా దరఖాస్తులు రావటంతో పరిశీలన ప్రక్రియ కాస్త ఇబ్బందిగానే కొనసాగింది. అయితే లబ్ధిదారుల ఎంపిక పక్కాగా ఉండాలని… అనర్హులకు దక్కవద్దనే అభిప్రాయాలు భారీగా వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వంలోని మంత్రులు…. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయించారు. ఒక్క అనర్హుడికి కూడా స్కీమ్ అందవద్దని స్పష్టం చేశారు. ఈ అంశంపై మంత్రివర్గ భేటీలో చర్చించి… నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో ఇవాళ చేపట్టాల్సిన మంజూరు పత్రాల జారీ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడాల్సి వచ్చింది.జూన్ 5వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఇందులో యువ వికాసం స్కీమ్ తో పాటు మరికొన్ని స్కీమ్ లపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు చివరి నిమిషంలో శాంక్షన్ లెటర్ల ప్రక్రియ వాయిదా పడటంతో… పలువురు దరఖాస్తుదారులు నిరాశకు లోనయ్యారు.ఈ స్కీమ్ కింద ఈ ఏడాదికి 5 ల‌క్ష‌ల మంది అర్హుల‌ను(లబ్ధిదారులను) ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని కోసం రూ.6,250 కోట్ల నిధుల‌ను కేటాయించింది. కేబినెట్ భేటీ తర్వాత… లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముందుకుసాగటంతో పాటు శాంక్షన్ లెటర్లను అందజేసే అవకాశం ఉంది.

]]>
Wed, 04 Jun 2025 11:58:36 +0530 admin
రూ. 200 కోట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో చెప్పాలి ఖర్చు అయినట్లు నిరూపించాలని.. లేదంటే ముక్కు నెలకు రాయాలి.. కేటీఆర్, హరీష్‌రావులకు మంత్రి పొన్నం సవాల్!.. https://prajakshethrenews.com/రూ-200-కోట్లు-ఖర్చు-ఎక్కడ-అయ్యాయో-చెప్పాలి-ఖర్చు-అయినట్లు-నిరూపించాలని-లేదంటే-ముక్కు-నెలకు-రాయాలి-కేటీఆర్-హరీష్రావులకు-మంత్రి-పొన్నం-సవాల్ https://prajakshethrenews.com/రూ-200-కోట్లు-ఖర్చు-ఎక్కడ-అయ్యాయో-చెప్పాలి-ఖర్చు-అయినట్లు-నిరూపించాలని-లేదంటే-ముక్కు-నెలకు-రాయాలి-కేటీఆర్-హరీష్రావులకు-మంత్రి-పొన్నం-సవాల్ రూ. 200 కోట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో చెప్పాలి
 ఖర్చు అయినట్లు నిరూపించాలని.. లేదంటే ముక్కు నెలకు రాయాలి
కేటీఆర్, హరీష్‌రావులకు మంత్రి పొన్నం సవాల్..
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 3 :
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్‌రావులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. వారు చెప్పిన టైమ్‌కు చర్చకు ఎక్కడికైనా వస్తానని దీనికి వారం రోజుల సమయం ఇస్తున్నానని.. ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు వారు రావాలని మంత్రి అన్నారు.తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే విపక్షాలు పిల్లి శాపనార్థాలు పెడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్   మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అంతర్జాతీయ అతిథులు రాష్ట్రానికి వస్తే విమర్శలు చేయడం తగదని అన్నారు. బీఆర్ఎస్ నేతలు   కేటీఆర్  హరీష్‌రావు  లకు సవాల్ చేస్తున్నా.. దీనిపై చర్చకు ఎక్కడకు రావాలి.. తెలంగాణ భవన్‌కు రావాలా? అబిడ్స్ చౌరస్తాకు రావాలో చెప్పాలన్నారు. రూ. 200 కోట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో చెప్పాలని.. ఖర్చు అయినట్లు నిరూపించాలని.. లేదంటే ముక్కు నెలకు రాయాలని మంత్రి సవాల్ చేశారు.
వారం రోజులు టైమ్ ఇస్తున్నా...
కేటీఆర్, హరీష్‌రావు చెప్పిన టైమ్‌కు చర్చకు ఎక్కడికైనా వస్తానని దీనికి వారం రోజులు సమయం ఇస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు వారు రావాలని మరోసారి ఆయన సవాల్ చేశారు.

]]>
Tue, 03 Jun 2025 21:12:44 +0530 admin
సస్పెండ్‌ చేస్తే పార్టీ కే నష్టం...అందరి జాతకాలు బయటపెడతా : ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ https://prajakshethrenews.com/సస్పెండ్-చేస్తే-పార్టీ-కే-నష్టంఅందరి-జాతకాలు-బయటపెడతా-ఎమ్మెల్యే-రాజాసింగ్-వార్నింగ్ https://prajakshethrenews.com/సస్పెండ్-చేస్తే-పార్టీ-కే-నష్టంఅందరి-జాతకాలు-బయటపెడతా-ఎమ్మెల్యే-రాజాసింగ్-వార్నింగ్ సస్పెండ్‌ చేస్తే పార్టీ కే నష్టం...
                  అందరి జాతకాలు బయటపెడతా
బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్‌ వార్నింగ్‌

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్‌, జూన్‌ 3 : నన్ను సస్పెండ్‌ చేస్తే అందరి జాతకాలు బయటపెడతానని బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాష్ట్ర నాయకత్వానికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ మేరకు సోమవారం రాజాసింగ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు పార్టీ నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నట్టు ప్రచారం సాగుతున్నదని.. నోటీసులు కాదు.. కావాలంటే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు.ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందనేది ప్రజల ముందుంచి తాను బయటకు వెళ్తానని.. సొంత పార్టీ నేతలను ఆయన హెచ్చరించారు. బీజేపీలో రాష్ట్ర నాయకత్వం వర్సెస్‌ రాజాసింగ్‌ వివాదం మరింత ముదురుతున్న వేళ.. ఆయన తాజా ప్రకటన కాషాయపార్టీలో మరోసారి కలకలం రేపింది.

]]>
Tue, 03 Jun 2025 18:43:25 +0530 admin
పేద కుటుంబాలు అప్పుల పాలు కావడానికి ఒక ప్రధానమైన కారణం వైద్యం : ఎంపీ ఈటల రాజేందర్ https://prajakshethrenews.com/పేద-కుటుంబాలు-అప్పుల-పాలు-కావడానికి-ఒక-ప్రధానమైన-కారణం-వైద్యం-ఎంపీ-ఈటల-రాజేందర్ https://prajakshethrenews.com/పేద-కుటుంబాలు-అప్పుల-పాలు-కావడానికి-ఒక-ప్రధానమైన-కారణం-వైద్యం-ఎంపీ-ఈటల-రాజేందర్ పేద కుటుంబాలు అప్పుల పాలు కావడానికి ఒక ప్రధానమైన కారణం వైద్యం :

ఎంపీ ఈటల రాజేందర్

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 3 :
పేద కుటుంబాలు అప్పుల పాలు కావడానికి ఒక ప్రధానమైన కారణం వైద్యం అని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కుషాయిగూడ, అల్వాల్ పి.హెచ్.సి లకు క్యాన్సర్ పరీక్షాపరికరాలు మహతి ఫౌండేషన్ సహకారంతో అందించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైనారు.ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కొంతమంది తాగి ఆరోగ్య ని చెడగొట్టుకోవచ్చు కానీ  నాకు ఆరోగ్య శాఖతో చాలా అనుబంధం ఉంది. దీంట్లో ఎన్ని బాధలు ఉంటాయో నేను కళ్ళారా చూశాను.ఈ శాఖ ఎంత బలపడితే, ఎంత గొప్పగా పని చేస్తే ప్రజలకి పేదరికం నుండి బయటపడే ఆస్కారం ఉంటుందన్నారు.. వైద్యానికి అయ్యే వచ్చే ఖర్చు అనుకోకుండా వచ్చే ఖర్చు. తల్లి ప్రేమకు ధనిక, పేద తేడా ఉండదు. ఎంత టెక్నాలజీ పెరిగిన క్యాన్సర్ మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.నవరత్నాలలో మీ కంపెనీ ఉన్నందుకు గర్వపడుతున్నాను. ప్రజలకోసం ముందుకు వచ్చి డబ్బులు ఇస్తున్నంక్షేత్ర్దు కు సంతోషం.గరీబోళ్ల అడ్డా అంటే మల్కాజ్గిరి. ఎవరు పొట్ట చేత పట్టుకొని వచ్చిన మొదట ఉండేది మల్కాజ్గిరి లోనే. అందుకే దీన్ని మినీ ఇండియా అంటారు. హైదరాబాద్ అనగానే హైటెక్ సిటీ చూసి మనం మురిసిపోకూడదు,దాని పక్కనే దుఃఖాలతో నిండిన బస్తీలు ఉంటాయి. వాళ్లకి మనం అండగా ఉండాలి.కొంతమంది తాగి ఆరోగ్య ని చెడగొట్టుకోవచ్చు కానీ పేద కుటుంబాలు అప్పుల పాలు కావడానికి ఒక ప్రధానమైన కారణం వైద్యం. ఈ జిల్లా మొత్తంలో ఏ హాస్పిటల్లో ఏ సౌకర్యాలు కావాలో నాకు ఇవ్వండి తప్పకుండా మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను. కొత్తగా మంత్రి అయిన నాడు MNJ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో , NIMS లో పెట్ స్కాన్ లేదు. నేను 25 కోట్లతో రెండు పెట్ స్కాన్లు తీసుకొచ్చి పెట్టాను. మీలాంటి ఒక సంస్థను రిక్వెస్ట్ చేసి 17 కోట్లతో కేంద్ర సెంటర్ ను ఏర్పాటు చేశాము. వైద్యం నారాయణనో హరి. డాక్టర్ల జీతాలు ఏంటి, మీ సమస్యలు ఏంటి, మీ కష్టాలు ఏంటో నాకు తెలుసు. డాక్టర్లకు జీతాలు అతితక్కువ ఉంటున్నాయి. డాక్టర్స్ కి కడుపునిండా జీతం ఇచ్చి పని చేయించుకోండి. ఎన్నో వేల కోట్లు దేనికో ఖర్చు పెడుతున్నాము కానీ ఈ శాఖకు ఖర్చు పెడితే ఫ్రూటిఫుల్ ఎక్స్పెండిచర్ అని చెప్పాను.ఆశావర్కర్లకి జీతాలు సరిగాలేవు. మీకు కూడా మంచి రోజులు వస్తాయి.నాకు వేరే వ్యాపకం లేదు. సమస్యలు నా దృష్టికి తీసుకొని రండి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తానని, ఎంత పని చేసినా మీ ఋణం తీర్చుకోలేనిది అని ఈటల రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి,IOCL CGM ARV బద్రీనాథ్, DMHO మేడ్చల్ - మల్కాజ్గిరి  Dr. C. ఉమా గౌరీ, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ మెంబెర్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్  రమేష్ శేఖర్ రెడ్డి, జిల్లా బీజేపీ జనరల్ సెక్రెటరీ మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

]]>
Tue, 03 Jun 2025 17:45:58 +0530 admin
కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు : తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క https://prajakshethrenews.com/కొత్త-చట్టాలపై-రైతులకు-అవగాహన-కల్పిస్తూ-సదస్సులు-తెలంగాణ-డిప్యూటీ-సిఎం-భట్టివిక్రమార్క https://prajakshethrenews.com/కొత్త-చట్టాలపై-రైతులకు-అవగాహన-కల్పిస్తూ-సదస్సులు-తెలంగాణ-డిప్యూటీ-సిఎం-భట్టివిక్రమార్క కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు
             తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 3 :
 కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తున్నామని, తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా- ఎర్రుపాలెం సదస్సులో ఆయన మాట్లాడుతూ..  రైతులకు ఎంతో ఉపయోగపడే భూభారతి చట్టాన్ని జాగ్రత్తగా రూపకల్పన చేశామని తెలిపారు. అత్యంత పారదర్శకమైన ఈ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని అన్నారు. గతంలో భూమికి రకం కట్టడం వల్ల రైతులకు భూమి ఎంత ఉందో తెలిసేది అని చెప్పారు. ఏటా రకం కట్టడం వల్ల రికార్డుల్లో   భూమి మారితే వెంటనే రైతులకు తెలిసేదని, గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులకు వివరాలు తెలియకుండా పోయిందని భట్టి విమర్శించారు.

]]>
Tue, 03 Jun 2025 17:39:39 +0530 admin
కాళేశ్వరం ప్రాజెక్టుల్లో దోచుకున్న డబ్బుతో విదేశాల్లో సంబరాలు: మంత్రి సీతక్క https://prajakshethrenews.com/కాళేశ్వరం-ప్రాజెక్టుల్లో-దోచుకున్న-డబ్బుతో-విదేశాల్లో-సంబరాలు-మంత్రి-సీతక్క https://prajakshethrenews.com/కాళేశ్వరం-ప్రాజెక్టుల్లో-దోచుకున్న-డబ్బుతో-విదేశాల్లో-సంబరాలు-మంత్రి-సీతక్క కాళేశ్వరం ప్రాజెక్టుల్లో దోచుకున్న డబ్బుతో విదేశాల్లో సంబరాలు: మంత్రి సీతక్క
హైదరాబాద్ జూన్ : కాళేశ్వరం విచారణ నిష్పక్షపాతంగా జరుగుతోందని మంత్రి సీతక్క తెలిపారు. నిజాయితీపరులు అయితే విచారణకు హాజరుకావాలని సవాల్ విసిరారు. మంగళవారం సీతక్క మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో దోచుకున్న డబ్బుతో విదేశాల్లో సంబరాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ అవతరణ దినోత్సవం అమెరికాలో జరుపుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ లో నాలుగు స్తంభాల ఆట అధికారం కోసమే అని చురకలంటించారు. లిక్కర్ కేసును డైవర్ట్ చేసేందుకే బిఆర్ఎస్ డ్రామా ఆడుతోందని సీతక్క విరుచుకపడ్డారు.

]]>
Tue, 03 Jun 2025 17:34:55 +0530 admin
కేటిఆర్,కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి : మెట్టు సాయి కుమార్ https://prajakshethrenews.com/కేటిఆర్కేసీఆర్-తెలంగాణ-ప్రజలకు-బేషరతుగా-క్షమాపణ-చెప్పాలి-మెట్టు-సాయి-కుమార్ https://prajakshethrenews.com/కేటిఆర్కేసీఆర్-తెలంగాణ-ప్రజలకు-బేషరతుగా-క్షమాపణ-చెప్పాలి-మెట్టు-సాయి-కుమార్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే కేసీఆర్ కు అంత చులకనా?
  * కేటిఆర్,కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
   * ఫిషర్మెన్  కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ డిమాండ్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 3 :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే కేసీఆర్ కు అంత చులకనా? మాజీ ముఖ్యమంత్రి గా,పార్టీ అధ్యక్షుడు గా కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు ఎందుకు జరపలేదని ఫిషర్మెన్  కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రశ్నించారు.మంగళవారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా కేటిఆర్,కేసీఆర్ లు తెలంగాణప్రజలను అవమానించారని బేషరతుగాకేటిఆర్,కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాన్ చేసారు.తెలంగాణ కోసం తల తాకట్టు పెట్టి, చావు నోట్లో తల పెట్టిన అన్న కేసీఆర్ ఎక్కడతెలంగాణ రాష్ట్ర ఉత్సవాలను బిఆర్ఎస్ నాయకులు అవమానించారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఉత్సవాలకు ఎందుకు ముందుకు రాలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటె ఓర్వలేక కొంత మంది నాయకులు విదేశాలలో తిరుగుతున్నారు కేటిఆర్ టెక్సాస్ లో గింటన్ అనే ఊరు మరో  గుంటూరు అంటుండు గుంటూరు పేరు కేటీఆర్ నోట్లో ఎందుకు వచ్చిందిటెక్సాస్ లో తెలంగాణ పరువును కేటిఆర్ బజారున పెట్టిండుతెలంగాణ లో ఏ ప్రాంతం కేటిఆర్ కు కనిపించలేదా?టెక్సాస్ లో తల దాచుకోవడానికి కేటిఆర్ విల్లా కొన్నాడుతప్పు చేస్తే ఇక్కడ దాచుకున్న వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం సెటిల్ చేయడానికి కేటిఆర్ విదేశాలకు పోయిండువిదేశాలలో ఎన్ని చిల్లర వేశాలు వేసినా కూడా ప్రజల ఆశీర్వాదం సీఎం రేవంత్ రెడ్డికి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి కోతల ప్రభాకర్ రెడ్డికి లేదుకొత్త ప్రభాకర్ రెడ్డి సలహాలు,ఆలోచనలు కేటిఆర్ కు బిఆర్ఎస్ నాయకులకు ఇవ్వాలి2023 లో బిఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా వచ్చింది.2028 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా రాకుండా ప్రజలు చూసుకుంటారన్నారు.

]]>
Tue, 03 Jun 2025 16:26:01 +0530 admin
బీజేపీ నేతల ఒళ్ళంతా కుట్రలు..కుతంత్రాలు* : జగ్గారెడ్డి https://prajakshethrenews.com/బీజేపీ-నేతల-ఒళ్ళంతా-కుట్రలుకుతంత్రాలు-జగ్గారెడ్డి https://prajakshethrenews.com/బీజేపీ-నేతల-ఒళ్ళంతా-కుట్రలుకుతంత్రాలు-జగ్గారెడ్డి బీజేపీ నేతల ఒళ్ళంతా కుట్రలు..కుతంత్రాలు*
బీజేపీ నేతలకు తలకాయ ఉంది కానీ బేజా లేదు
* 26 మందిని కాల్చేంత వరకు కేంద్ర ఇంటలిజెన్స్ ఏం చేసిందో జవాబు చెప్పాలి
* యుద్ధం ఆగినపుడు మోడీ ప్రకటన చేస్తారు అనుకుంటే ట్రంప్ ప్రకటన వచ్చింది
* ర్యాలీ లు ఎందుకు తీస్తున్నారో కిషన్ రెడ్డి బీజేపీ వాళ్లు సిగ్గు అనిపించడం లేదా
* కాంప్రమైజ్ మీరు అయ్యి...మా నాయకుడిని నిందిస్తారా..?
* మోడీ చేసిన తప్పులకు మొఖం ఎక్కడ పెట్టుకుంటారు
* టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డి


ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 2 :

త్యాగాల కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ పై లేనిపోనివి మాట్లాడుతున్న బిజెపి నేతలు ఆయనకు భెశరథితూగా క్షమాపన చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డి  డిమాండ్ చేసారు. సోమవారం  గాంధీ భవన్లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ పుల్వామా దాడి తర్వాత కేంద్ర లోని . బీజేపీ ప్రభుత్వం షాక్ లో ఉందన్నారు. పుల్వామా దాడి వివరాలు అడిగితే . రాహుల్ గాంధీ ని కిషన్ రెడ్డి...బండి సంజయ్ లు...రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు . పాకిస్తాన్ మిలిటెంట్లు దేశంలోకి చొరబడి..26 మంది నీ కాల్చి చంపారు . ప్రధాని మోదీ...రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రాహుల్ గాంధీపై విమర్శలు కాశ్మీర్ లోకి ఉగ్రవాదులు వచ్చి పార్క్ లో 26 మందిని కాల్చేంత వరకు కేంద్ర ఇంటలిజెన్స్ ఏం చేసిందో జవాబు చెప్పాలని కిషన్ రెడ్డి...సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ దేశానికి ఇప్పటి వరకు ఎందుకు సమాధానం చెప్పలేదు మీరు నిద్రావస్థలో ఉండి...రాహుల్ గాంధీ పై విమర్శలు చేస్తూ...డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు.దీనికి సమాధానం చెప్పకుండా మాట్లాడితే ప్రతిఘటిస్తాంతప్పులు మీరు చేసి..ప్రతిపక్ష నాయకుడి పై నిందలా..?ఙ్ఞానం ఉండి...అజ్ఞానులు గా మాట్లాడుతున్నారు.యుద్ధం జరుగుతుంటే... పాకిస్తాన్ ను ఓడిస్తారు మోదీ అనుకున్నారు ప్రజలు. సడన్ గా యుద్ధం ఆగిపోయింది అని బ్రేకింగ్ లు వచ్చాయి . మోడీ ప్రకటన చేస్తారు అనుకుంటే ట్రంప్ ప్రకటన వచ్చింది మోడీ యుద్ధం చేయండి మీ వెనక మేము ఉంటాం అని రాహుల్ గాంధీ చెప్పారు . ట్రంప్ ఇండియా..పాకిస్తాన్ యుద్ధం ఆపినట్టు ప్రకటించారు . రాహుల్ గాంధీపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు దేశ ప్రజలకు యుద్ధం ఆగినట్టు మోడీ చెప్పాల్సింది ...ట్రంప్ చెప్పినందుకు మీకు సిగ్గు అనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.కాంప్రమైజ్ మీరు అయ్యి...మా నాయకుడిని నిందిస్తారా..?ఎప్పుడైతే ట్రంప్ ప్రకటన చేశాడో... ఇందిరాగాంధీ సోషల్ మీడియా లో తెరపైకి వచ్చారు ట్రంప్ మాటలకు మోదీ తలొగ్గడం ఏంటని ప్రజలు వ్యతిరేకించారు ఇందిరా గాంధీ హయంలో అమెరికా జోక్యం చేసుకునే ప్రయత్నం చేసినా.. ఎవరి జోక్యం అవసరం లేదు అని చెప్పిందిప్రధాని మోడీ.. వాజ్ పాయ్ బర్త్ డే రోజు దేశంలో లేకుండా పాకిస్తాన్ వెళ్లలేదా..?అదే రోజు పాకిస్థాన్ ప్రధాని  నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి..నవాజ్ షరీఫ్ తల్లి కాళ్ళు మొక్కలేదా..?వీటికి సమాధానం చెప్పాలి..చెప్పా పెట్టకుండా వాజ్ పాయి బర్త్ డే రోజు పాకిస్థాన్ వెళ్ళడం సమంజసమేనా..?కిషన్ రెడ్డి..సంజయ్ లు దీనికి సమాధానం చెప్పాలని జగ్గ రెడ్డి డిమాండ్ చేసారు. అప్పుడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడండి రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ సాహసం ముందు బీజేపీ నేతలు ఎంత..? మోడీ చేసిన తప్పులకు మొఖం ఎక్కడ పెట్టుకుంటారువాజ్ పాయ్ పార్లమెంట్ లోనే దుర్గా మాత గా పోల్చారు370 ఆర్టికల్ మోడీ తీసేశాడు.. మళ్ళీ ఎందుకు వచ్చింది ఉగ్రవాదంమూడు సార్లు పాకిస్థాన్ ను తిట్టే ప్రధాని అయ్యాడు..26 మందిని చంపినోడు ఎక్కడో తెలుసుకోలేదు.. సిగ్గు అనిపించడం లేదా కిషన్ రెడ్డిబీజేపీ వాళ్లు చేసే ర్యాలీ లు ఎందుకో ట్రంప్ కే తెలియాలితెలంగాణ లో ఉన్న బీజేపీ నేతలకు తలకాయ ఉంది కానీ బేజా లేదు బీజేపీ నేతల ఒళ్ళంతా కుట్రలు..కుతంత్రాలు ఉంటాయి

]]>
Mon, 02 Jun 2025 23:27:33 +0530 admin
పాతబస్తీ లో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం https://prajakshethrenews.com/పాతబస్తీ-లో-సోనియా-గాంధీ-చిత్రపటానికి-పాలాభిషేకం https://prajakshethrenews.com/పాతబస్తీ-లో-సోనియా-గాంధీ-చిత్రపటానికి-పాలాభిషేకం పాతబస్తీ లో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

పాతబస్తీ లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం వద్ద సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఇంచార్జి కె.వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని, జాతీయ పతకాన్ని ఆవిష్కరించినారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజల అరవై ఏళ్ల సాకారాన్ని నిజం చేసిన సోనియా గాంధీ చిత్రపటానికి వెంకటేష్ పార్టీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఆరు దశాబ్దాల నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని అన్నారు.రాష్ట్రం ఏర్పడిన అనంతరం అధికారంలో ఉన్న బిఅర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని పేర్కొన్నారు. పదేండ్ల  ఆర్ధిక విధ్వంసాన్ని అధిగమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ తరహాలో పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వెంకటేష్ అన్నారు.అన్ని కులాలకు వర్గాలకు న్యాయం లభించాలని దేశానికి ఆదర్శంగా నిలిచేలా బీసీ కులగణనను చేపట్టడంతో పాటు బీసీ రిజర్వేషన్లు,ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి చారిత్రాత్మక ఘట్టాలకు తెరతీశారని ప్రశంసించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కె.సురేష్ బాబు, జి.శ్రీనివాస్,నరసింహ,దినేష్ శ్రీవాత్సవ్,హైదర్ అలీ జాఫ్రీ తదితరులు పాల్గొన్నారు.

]]>
Mon, 02 Jun 2025 21:58:53 +0530 admin
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణకు టైం అడిగిన కెసిఆర్ https://prajakshethrenews.com/కాళేశ్వరం-ప్రాజెక్టు-అవకతవకలపై-విచారణకు-టైం-అడిగిన-కెసిఆర్ https://prajakshethrenews.com/కాళేశ్వరం-ప్రాజెక్టు-అవకతవకలపై-విచారణకు-టైం-అడిగిన-కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణకు టైం అడిగిన కెసిఆర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 2 :
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టీస్ పిసి ఘోష్‌ ఆధ్వర్యంలో కమిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజినీర్లను, అధికారులను కమిషన్ విచారించింది. ఇప్పుడు మాజీ సిఎం కెసిఆర్ ను విచారించేందుకు ఘోష్ కమిషన్ సిద్ధమైంది. ఈ క్రమంలో జూన్ 5న విచారణకు హాజరుకావాలని కెసిఆర్ కు నోటీసులు ఇచ్చింది. అనంతరం మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో పలుమార్లు చర్చించిన కెసిఆర్.. విచారణకు హాజరయ్యేందుకు నిర్ణయించుకున్నారు. అయితే, ఈనెల 5న కాకుండా 11న కాళేశ్వరం కమిషన్ ఎదుట కెసిఆర్ విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం. కెసిఆర్ విజ్ఞప్తి మేరకు ఘోష్ కమిషన్‌ ఈనెల 11న విచారించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కెసిఆర్ తర్వాత హరీశ్ రావు, బిజెపి ఎంపి ఈటల రాజేందర్ ను కూడా కమిషన్ విచారించనుంది. వీరికి ఇప్పటికే నోటీసులు అందజేసింది.

]]>
Mon, 02 Jun 2025 21:09:31 +0530 admin
అబద్ధాలు చెప్పడంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అగ్రగామి: హరీష్ రావు https://prajakshethrenews.com/అబద్ధాలు-చెప్పడంలో-తెలంగాణ-సిఎం-రేవంత్-రెడ్డి-అగ్రగామి-హరీష్-రావు https://prajakshethrenews.com/అబద్ధాలు-చెప్పడంలో-తెలంగాణ-సిఎం-రేవంత్-రెడ్డి-అగ్రగామి-హరీష్-రావు అబద్ధాలు చెప్పడంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అగ్రగామి: హరీష్ రావు  
 ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 2
 అబద్ధాలు చెప్పడంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అగ్రగామి అని మాజీ మంత్రి హరీష్ రావు  విమర్శించారు. అభివృద్ధిలో మాజీ సిఎం కెసిఆర్ అగ్రగామి అని అన్నారు. హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..బిఆర్ఎస్ ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి   అందాల పోటీలపై రివ్యూ చేశారు తప్ప..రైతుల ధాన్యంపై మాత్రం రివ్యూ చేయలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రూ.21 వేల కోట్ల వడ్డీలేని రుణాలు..మహిళలకు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కెసిఆర్ ఆనవాళ్లను ఎవరూ చెరిపివేయలేరని హరీష్ రావు పేర్కొన్నారు.

]]>
Mon, 02 Jun 2025 16:30:24 +0530 admin
బంజారాహిల్స్‌ లో తెలంగాణ జాగృతి కార్యాలయం ప్రారంభం https://prajakshethrenews.com/బంజారాహిల్స్-లో-తెలంగాణ-జాగృతి-కార్యాలయం-ప్రారంభం https://prajakshethrenews.com/బంజారాహిల్స్-లో-తెలంగాణ-జాగృతి-కార్యాలయం-ప్రారంభం బంజారాహిల్స్‌ లో తెలంగాణ జాగృతి కార్యాలయం ప్రారంభం
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్ మే 31 : 
తెలంగాణ ప్రజల గొంతుక జాగృతి సంస్థ అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శనివారం బంజారాహిల్స్‌ తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి ప్రారంభించి 18 ఏళ్ల అయిందని.. మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, ఆచార్య జయశంకర్‌ స్పూర్తితోనే తెలంగాణ జాగృతి సంస్థ పుట్టిందని చెప్పారు. యూఎస్‌ నుంచి వచ్చాక జయశంకర్ మాకు మార్గదర్శనం చేశారని తెలిపారు. ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నా.. ఏదో కొంత గ్యాప్ ఉందని… ఆ గ్యాప్‌ను ఫిల్ చేయాలని జయశంకర్ తనకు సూచించారని ఆమె అన్నారు. మేము చేసిన ఉద్యమాల వల్ల చాలా జీవోలు వచ్చాయని కవిత చెప్పారు. కాగా, ఇందిరాపార్క్ వద్ద ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని మూసివేసి.. బంజారాహిల్స్‌లోని తన ఇంటి సమీపంలోనే కవిత కొత్త ఆఫీస్ ను ప్రారంభించారు.

]]>
Sun, 01 Jun 2025 21:30:44 +0530 admin
బీఆర్ఎస్ బీజేపీలో క‌లిసే ప్ర‌స‌క్తే లేదు :తేల్చిచెప్పిన ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి https://prajakshethrenews.com/బీఆర్ఎస్-బీజేపీలో-కలిసే-ప్రసక్తే-లేదు-తేల్చిచెప్పిన-ఎమ్మెల్సీ-మధుసూదనాచారి https://prajakshethrenews.com/బీఆర్ఎస్-బీజేపీలో-కలిసే-ప్రసక్తే-లేదు-తేల్చిచెప్పిన-ఎమ్మెల్సీ-మధుసూదనాచారి బీఆర్ఎస్ బీజేపీలో క‌లిసే ప్ర‌స‌క్తే లేదు...
తేల్చిచెప్పిన ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి
ప్రజా క్షేత్ర్, హైద‌రాబాద్ మే 31 :
బీఆర్ఎస్ బీజేపీలో క‌లిసే ప్ర‌స‌క్తే లేదని ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి తేల్చిచెప్పారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది అనే కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మ‌ధుసూద‌నాచారి మీడియాతో మాట్లాడారు.ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భావం జరిగింది. ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ టీఆర్ఎస్‌ను స్థాపించారు. తెలంగాణ అంటే నక్సలైట్లు అన్న సందర్భంలో కేసీఆర్ పార్టీని పెట్టారు. కాంగ్రెస్, టీడీపీలకు ధీటుగా టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగింది. ఇద్దరు బలమైన నాయకులు చంద్రబాబు, వైఎస్ఆర్‌ను కేసీఆర్ ఎదుర్కొన్నారు. తెలంగాణ సాధించి కేసీఆర్ సీఎం అయ్యి అభివృద్ధి చేశారు. బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చాలని కుట్ర పూరితంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడవ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.కేసీఆర్ సీఎంగా లేనందుకు ప్రజలు బాధపడుతున్నారు. కేసీఆర్ పాలన చర్చకు వస్తే కాంగ్రెస్, బీజేపీల రాజకీయ పునాదులు కదులుతాయి. పరిపాలనలో కాంగ్రెస్, బీజేపీ ప్రజల మెప్పు పొందాలి. కేంద్రమంత్రుల భాష, వారి పాలన ప్రజలు అసహ్యించుకునే విధంగా ఉంది. కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ భవన్‌లో ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి. కేసీఆర్ ఆలోచనలు నాకు తెలుసు. తెలంగాణ ప్రయోజనాలకు ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగదు. తెలంగాణ ప్రజలు ఉన్నంతవరకు బీఆర్ఎస్ ఉంటుంది. పార్టీలో ఏ నిర్ణయం అయినా కేసీఆర్ తీసుకుంటారు. జూన్ 2వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు అని మ‌ధుసూద‌నాచారి తెలిపారు.

]]>
Sat, 31 May 2025 20:11:22 +0530 admin
పార్టీని కాపాడుకుకోవాలనేదే తన తపనతో లేఖ లో ప్రస్థావించా : కవిత https://prajakshethrenews.com/పార్టీని-కాపాడుకుకోవాలనేదే-తన-తపనతో-లేఖ-లో-ప్రస్థావించా-కవిత https://prajakshethrenews.com/పార్టీని-కాపాడుకుకోవాలనేదే-తన-తపనతో-లేఖ-లో-ప్రస్థావించా-కవిత పార్టీని కాపాడుకుకోవాలనేదే తన తపన
కార్యకర్తల ఆవేదననే లేఖలో ప్రస్తావించా... ఎమ్మెల్సీ కవిత
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
 బిఆర్ఎస్ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పార్టీని కాపాడుకుకోవాలనేదే తన తపన అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ..పదేళ్లుగా ఎంతో ఆవేదన అనుభవిస్తున్నానని, మాజీ సిఎం కెసిఆర్ కు   లేఖ రాయడంలో తన తప్పు లేదని అన్నారు. కార్యకర్తల ఆవేదననే లేఖలో ప్రస్తావించానని పేర్కొన్నారు. లేఖను బయట పెట్టిన వారిని పట్టుకోవాలని సూచించారు. తనకంటూ సొంత జెండా, అజెండా లేదని చెప్పారు. కెసిఆర్ తప్ప మరో నాయకత్వాన్ని ఒప్పుకోనని, బిజెపిలో పార్టీ విలీనాన్ని తాను ఒప్పుకోనని కవిత తెలియజేశారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని, తాను జైల్లో ఉన్నప్పుడు బిజెపితో పొత్తు ప్రస్తావన ఆవేదన కలిగించిందని కవిత స్పష్టం చేశారు.

]]>
Fri, 30 May 2025 18:53:18 +0530 admin
ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా https://prajakshethrenews.com/ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి-ఢిల్లీ-పర్యటన-వాయిదా https://prajakshethrenews.com/ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి-ఢిల్లీ-పర్యటన-వాయిదా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా
ప్రజా క్షేత్ర్, హైద‌రాబాద్ : 
 ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. దీంతో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌, టీ పీసీసీ పోస్టుల భ‌ర్తీ ఆశావ‌హుల‌కు ఆడియాశ‌లు ఎదుర‌య్యాయి. సీఎం ఢిల్లీకి వెళ్ల‌గానే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై నిర్ణ‌యం వెలువడుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ ఆయ‌న ప‌ర్య‌ట‌న అర్ధాంత‌రంగా వాయిదా ప‌డ‌డంతో ఆశావ‌హులు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం.అయితే ఢిల్లీకి రావాల‌ని సీఎం రేవంత్ రెడ్డికి, టీపీసీసీ ప్రెసిడెంట్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌కు పార్టీ హైక‌మాండ్ నుంచి పిలుపు అందింది. శుక్ర‌వారం పార్టీ వ్య‌వ‌హారాల‌పై చ‌ర్చించాల‌ని హైక‌మాండ్ వారికి సూచించింది. కానీ రేవంత్ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డ‌డంతో అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.గ‌త ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, టీ పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్ స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో మరిన్ని చర్చలు, సమావేశాల కోసం సోమవారం వారిని ఢిల్లీలోనే ఉండమని కోరారు. కానీ వారి అపాయింట్‌మెంట్ ల‌భించ‌క‌పోవ‌డంతో.. ముఖ్య‌మంత్రి రేవంత్ నిరాశ‌తో హైద‌రాబాద్‌కు తిరిగొచ్చారు. అయితే సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ శుక్ర‌వారం ఢిల్లీకి రావాల‌ని ఏఐసీసీ మ‌ళ్లీ ఆదేశించింది. సీఎం మాత్రం ఢిల్లీకి వెళ్ల‌కుండా హైద‌రాబాద్‌లోనే ఉండిపోయారు. అయితే ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే అపాయింట్‌మెంట్ ఖ‌రారు కాక‌పోవ‌డంతో సీఎం రేవంత్ రెడ్డి, మ‌హేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్ల‌లేద‌ని గాంధీ భ‌వ‌న్ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

]]>
Fri, 30 May 2025 18:29:49 +0530 admin
బిఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు : బిజెపి ఎంపి రఘునందన్ రావు https://prajakshethrenews.com/బిఆర్ఎస్-ను-ప్రజలు-నమ్మే-పరిస్థితి-లేదు-బిజెపి-ఎంపి-రఘునందన్-రావు https://prajakshethrenews.com/బిఆర్ఎస్-ను-ప్రజలు-నమ్మే-పరిస్థితి-లేదు-బిజెపి-ఎంపి-రఘునందన్-రావు బిఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
బిఆర్ఎస్ గా మారిన టిఆర్ఎస్ కు ప్రజలు విఆర్ఎస్ ఇచ్చారు
బిజెపి ఎంపి రఘునందన్ రావు  
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

బిఆర్ఎస్ కు పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు లేరని బిజెపి ఎంపి రఘునందన్ రావు   చురకలంటించారు. బిఆర్ఎస్ గా మారిన టిఆర్ఎస్ కు ప్రజలు విఆర్ఎస్ ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు  ) బిజెపికి దగ్గరవుతున్నారని, బిఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. జనం గుండె చప్పుడుగా బిజెపి మారిందని పేర్కొన్నారు. తనపై వ్యక్తిగతంగా బురద జల్లేందుకు యత్నిస్తున్నారని,  దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుందని బిఆర్ఎస్ తీరు అని విమర్శించారు. తెలంగాణలో బిఆర్ఎస్ ఎక్కడా లేదని, బిఆర్ఎస్ చెల్లని రూపాయని అన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న పెయిడ్ బ్యాచ్ లపై కేసులు నమోదు చేయాలని సూచించారు. పెయిడ్ ఆర్టిస్టులతో పోస్టులు పెట్టిస్తున్నారని, ఎమ్మెల్యే కవిత కూడా ఆరోపించారని చెప్పారు. తెలంగాణలో మాజీ సిఎం కెసిఆర్ కుటుంబ ఆస్తులే పెరిగాయని రఘునందన్ రావు స్పష్టం చేశారు.

]]>
Fri, 30 May 2025 16:54:38 +0530 admin
సరస్వతి పుష్కర ఆదాయం రెండు కోట్ల 83 లక్షలు. https://prajakshethrenews.com/సరస్వతి-పుష్కర-ఆదాయం-రెండు-కోట్ల-83-లక్షలు https://prajakshethrenews.com/సరస్వతి-పుష్కర-ఆదాయం-రెండు-కోట్ల-83-లక్షలు సరస్వతి పుష్కర ఆదాయం రెండు కోట్ల 83 లక్షలు.
ప్రజా క్షేత్ర్, జయశంకర్ భూపాలపల్లి :

సరస్వతి నది పుష్కరాల సందర్బంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి  పుష్కరాలు 12 రోజులలో హుండీ ద్వారా రు.1,36,28,099 ఆదాయం వచ్చినట్లు హుండీల పర్యవేక్షణాధికారి నందనం కవిత తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎస్  మహేష్, సహాయ కమీషనర్  ఆర్ సునిత పాల్గొన్నారు. గదుల అద్దె ద్వారా రు. 1,71,000, హోమముల ద్వారా రు.1,23,000, శీఘ్రదర్శనం ద్వారా రు. 5,60,000,  ప్రసాదముల ద్వారా రు.138,36,552, హుండీల ఆదాయం రు. 1,36,28,099, మొత్తం రు. 2,83,18,651,మిశ్రమ బంగారు 15 గ్రాములు, మిశ్రమ వెండి 1-750 గ్రాములు వచ్చినట్లు పర్యవేక్షణాధికారి నందనం కవితవెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, పుష్కరాల ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.

]]>
Thu, 29 May 2025 22:37:09 +0530 admin
బిఆర్ఎస్ ను బిజెపిలో కలపాలని చూస్తున్నారు: కవిత కీలక వ్యాఖ్యలు https://prajakshethrenews.com/బిఆర్ఎస్-ను-బిజెపిలో-కలపాలని-చూస్తున్నారు-కవిత-కీలక-వ్యాఖ్యలు https://prajakshethrenews.com/బిఆర్ఎస్-ను-బిజెపిలో-కలపాలని-చూస్తున్నారు-కవిత-కీలక-వ్యాఖ్యలు బిఆర్ఎస్ ను బిజెపిలో కలపాలని చూస్తున్నారు: కవిత కీలక వ్యాఖ్యలు

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ : 

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు. బిఆర్ఎస్ ను బిజెపిలో కలపాలని చూస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ ను గంపగుత్తగా బిజెపికి అప్పగించాలన్న ప్రయత్నం జరిగిందని ఆమె చెప్పారు. తాను జైలులో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వచ్చిందని.. దానిని తాను వ్యతిరేకించానని తెలిపారు. బిఆర్ఎస్ స్వతంత్రంగా ఉండాలనేదే తన అభిమతమన్నారు. 101 శాతం బిజెపిలో కలిపే ప్రయత్నం చేస్తున్నారని.. తాను ఉంటే బిఆర్ఎస్ ను బిజెపిలో కలపడం కుదరదని.. కొంతమంది తనను కెసిఆర్ కు దూరం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎంపిగా పోటీ చేస్తే సొంత పార్టీ వారే తనను ఓడించారని ఆరోపించారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతున్న పార్టీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని కవిత స్పష్టం చేశారు.

]]>
Thu, 29 May 2025 22:32:22 +0530 admin
తన జోలికి వస్తే బాగుండదు వార్నింగ్ ఇచ్చిన కవిత https://prajakshethrenews.com/తన-జోలికి-వస్తే-బాగుండదు-వార్నింగ్-ఇచ్చిన-కవిత https://prajakshethrenews.com/తన-జోలికి-వస్తే-బాగుండదు-వార్నింగ్-ఇచ్చిన-కవిత ఇంటి ఆడబిడ్డపై పెయిడ్‌ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా?
   లీకువీరులను పట్టుకోమంటే.. గ్రీకువీరులు దండెత్తారుని..
    తన జోలికి వస్తే బాగుండదు వార్నింగ్ ఇచ్చిన కవిత
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్ :
;ఇంటి ఆడబిడ్డపై పెయిడ్‌ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా? అంటూ పరోక్షంగా మాజీ మంత్రి కెటిఆర్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానన్నానని.. కానీ, కెసిఆర్ వద్దని వాదించారని చెప్పారు. లీకువీరులను పట్టుకోమంటే.. గ్రీకువీరులు దండెత్తారుని.. తన జోలికి వస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఓ మునిగిపోయే నావ అని కవిత అన్నారు. 2013లో కాంగ్రెస్‌తో మాట్లాడానని.. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ మాట్లాడలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో రాయబారాలు జరిపే అవసరం తనకు లేదని తెలిపారు.“కెసిఆర్‌ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారు. కెసిఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు. నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు. పార్టీ సోషల్‌ మీడియాలో నన్ను టార్గెట్‌ చేశారు. నా లేఖ లీక్‌ చేసిందెవరో చెప్పాల్సిందే.కెసిఆర్‌కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదు. ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా. నేను వాళ్లలా చిచోరా రాజకీయాలు చేయను, హుందాగా ఉంటా. పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపున నేను చేస్తున్నా. పార్టీలో కోవర్టులు ఉన్నప్పుడు ఎందుకు పక్కనపెట్టడం లేదు. బిఆర్ఎస్‌లో కెసిఆర్‌ ఒక్కరే నాయకుడు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించను” అని కవిత పేర్కొన్నారు.

]]>
Thu, 29 May 2025 22:29:42 +0530 admin
జూన్ 8 చేప ప్రసాదం పంపిణీ& https://prajakshethrenews.com/జూన్-8-చేప-ప్రసాదం-పంపిణీ https://prajakshethrenews.com/జూన్-8-చేప-ప్రసాదం-పంపిణీ జూన్ 8 చేప ప్రసాదం పంపిణీ
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
ప్రతీ ఏటా తెలుగు రాష్ట్రాల ప్రజలకు బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదం ఓ పండుగలా జరుగుతుంది.భారీగా జనం ఈ చేప ప్రసాదం కోసం పోటీ పడుతుంటారు. ఈ ఏడాది జూన్ 8వ తేదీన ఈ చేప ప్రసాదం పంపిణీ జరగనున్న  వేళ అధికారులు  ముందస్తు వ్యూహాలతో, తొక్కిసలాటకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లకు సిద్దమైయ్యారు.185 సంవత్సరాలుగా ఉబ్బస వ్యాధిగ్రస్తులకు హైదరాబాద్ లో బత్తిని సోదరులు చేపప్రసాదం పంపిణీ చేస్తున్నారు. లక్షల మంది పాల్గొనే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో పోలీసులు పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకోవాలని లా అండ్ ఆర్డర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ కోసం 1.5 లక్షల చేప పిల్లలను ఏర్పాటు చేసినట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. చేప పిల్లల ఖర్చును నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ
భరించాలని సూచించారు. వచ్చే భక్తులకు క్యూ లైన్ లో ఇబ్బందులు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు, మహిళలకు వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయనున్నారు. వీఐపీ పాస్ లు లిమిట్ గా
ఇవ్వడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని భావించి, ఆ దిశగా చర్యలు తీసుకోనున్నారు. చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో వారికి సరిపడ
తాగునీటి సౌకర్యాలు , టాయిలెట్స్ ఏర్పాటు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే భోజన సౌకర్యాలకు  ఇలా ఎటువంటి ఇబ్బందులు సర్వం సిద్దం చేయనున్నారు.నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పక్కా ప్లాన్ రూపొందించనున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ చుట్టూ పది పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. వాహనాలు మొరాయించినప్పుడు వాటిని తీసుకెళ్లడానికి క్రేన్ వాహనాలు సిద్ధం చేశారు.వీటితోపాటు ఎక్కడికక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకూ జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది  అందుబాటులో ఉండటంతోపాటు మొబైల్ టాయిలెట్స్ ఎప్పటికప్పుడు శుభ్రంచేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఎప్పటికప్పుడు చెత్తను తరలించేందుకు తగిన వాహనాలు సిద్ధం చేశారు. వెటర్నరీ డాక్టర్ లు ఫిష్ పర్యవేక్షణ చేయడంతోపాటు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార పర్యవేక్షణ చేసేలా చర్యలు చేపట్టారు. దూద్ బౌలి, నాంపల్లి లో కరెంట్ ఇబ్బందులు లేకుండా చూడటంతోపాటు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి రావడం కోసం ఆర్టీసీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ ,చర్లపల్లి నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తేనున్నారు. చేప ప్రసాదం పంపిణీ జరిగే ప్రదేశాల్లో వీల్ చైర్లు ఏర్పాటు చేయడం ,నాలుగు హెల్త్ క్యాంపులు ,నాలుగు అంబులెన్స్ లు సిద్దంగా ఉండనున్నాయి. చేప ప్రసాదం వేసే వాలంటీర్లకు సీపీఆర్ శిక్షణ ఇవ్వనున్నారు. ప్రసాదం కోసం టోకెన్ లకు అదనపు కౌంటర్ లు ఏర్పాటు చేయడం, ఐ అండ్ పీఆర్ ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇవ్వడం చేప ప్రసాదం కోసం వచ్చే వారికి తగిన సమాచారం అందించడం, లయన్స్ క్లబ్ ,NCC నుంచి వాలంటీర్ లను అందుబాటులో ఉంచడం,. అన్ని డిపార్ట్మెంట్ లను కోఆర్డినేట్ చేసుకోవడానికి 20 ప్రాంతాల్లో ఒక ఆర్డీవో,ఒక అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేయడం ద్వాారా ఈ సారి చేప ప్రసాదం పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సర్వం సిద్దంకాబోతోంది.

]]>
Thu, 29 May 2025 22:22:08 +0530 admin
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటన : బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా ప్రభాస్ 'కల్కి'.. బెస్ట్ యాక్టర్‌గా బన్నీ https://prajakshethrenews.com/తెలంగాణ-ప్రభుత్వం-గద్దర్-అవార్డులు-ప్రకటన-బెస్ట్-ఫీచర్-ఫిల్మ్గా-ప్రభాస్-కల్కి-బెస్ట్-యాక్టర్గా-బన్నీ https://prajakshethrenews.com/తెలంగాణ-ప్రభుత్వం-గద్దర్-అవార్డులు-ప్రకటన-బెస్ట్-ఫీచర్-ఫిల్మ్గా-ప్రభాస్-కల్కి-బెస్ట్-యాక్టర్గా-బన్నీ తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటన -
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా ప్రభాస్ 'కల్కి'.. బెస్ట్ యాక్టర్‌గా బన్నీ
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ : 
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజుతో కలిసి జ్యూరీ ఛైర్ పర్సన్ జయసుధ మీడియా సమావేశంలో అవార్డులు ప్రకటించారు. 2024 ఏడాదికి సంబంధించి.. ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా.. ప్రభాస్ 'కల్కి 2898 ఏడి' మూవీ నిలిచింది. అలాగే సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ 'పొట్టేల్', థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ 'లక్కీ భాస్కర్' పురస్కారాలు అందుకున్నాయి.మొత్తం 1,248 నామినేషన్లను కమిటీ పరిశీలించింది. వ్యక్తిగత కేటగిరీలో 1,172.. ఫీచర్ ఫిల్మ్ డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్ వంటి ఇతర విభాగాల్లో 76 అప్లికేషన్స్ వచ్చాయి.
14 ఏళ్ల తర్వాత..
దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ అవార్డులను ప్రకటించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకూ ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి.. సెన్సార్ అయిన చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.
2024కు సంబంధించి అన్నీ కేటగిరీల్లోనూ అవార్డులు ఇచ్చారు. ఉత్తమ నటుడు, దర్శకుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత, స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇచ్చారు. తెలుగుతో పాటు ఉర్దూ చిత్రాలకూ అవార్డుల్లో
ప్రాధాన్యత ఇచ్చారు. వీటితో పాటే ఎన్టీఆర్, బీఎన్ రెడ్డి, పైడి జయరాజు, నాగిరెడ్డి చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లలో స్పెషల్ అవార్డులు ప్రకటించారు. 'పుష్ప 2' సినిమాకు అల్లు అర్జున్‌కు ఉత్తమ
నటుడిగా అవార్డు వరించింది. అలాగే ఉత్తమ నటిగా నివేదా థామస్.. '35 ఇది చిన్న కథ కాదు' మూవీకి పురస్కారం అందించారు.
అవార్డుల జాబితా ఇదే..
ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ - కల్కి 2898 ఏడీ
సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ - పొట్టేల్
మూడో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ - లక్కీ భాస్కర్
జాతీయ సమైక్యత, మత సామరస్యం, సామాజిక అభ్యున్నతిపై బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ - కమిటీ కుర్రాళ్లు
ఉత్తమ ప్రజాదరణ చిత్రం - ఐ అండ్ మై ఫ్రెండ్స్
హిస్టరీ విభాగంలో ఫీచర్ హెరిటేజ్ మూవీ - రజాకార్
ఉత్తమ బాలల చిత్రం - 35 ఇది చిన్న కథ కాదు
ఉత్తమ పరిచయ దర్శకుడు - యధువంశీ (కమిటీ కుర్రాళ్లు)
వ్యక్తిగత విభాగాల్లో..
బెస్ట్ యాక్టర్ - అల్లు అర్జున్ (పుష్ప 2)
బెస్ట్ యాక్ట్రెస్ - నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు)
బెస్ట్ డైరెక్టర్ - నాగ్ అశ్విన్ (కల్కి)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - SJ సూర్య (సరిపోదా శనివారం)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ - శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - భీమ్స్ సిసిరోలియో (రజాకార్)
బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ - సిద్ శ్రీరామ్ (ఊరుపేరు భైరవకోన - నిజమే చెబుతున్న సాంగ్)
బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ - శ్రేయ ఘోషల్ (పుష్ప 2 - సూసీకి సాంగ్)
బెస్ట్ కమెడియన్ - సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ - మాస్టర్ అరుణ్ దేవ్ (35 ఇది చిన్నకథ కాదు) మాస్టర్ హారిక (మెర్సీ కిల్లింగ్)
బెస్ట్ స్టోరీ రైటర్ - శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
బెస్ట్ స్క్రీన్ ప్లే - వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
బెస్ట్ లిరిసిస్ట్ - చంద్రబోస్ (రాజు యాదవ్)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - విశ్వనాధ్ రెడ్డి (గామి)
బెస్ట్ ఎడిటర్ - నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
బెస్ట్ ఆడియోగ్రాఫర్ - అరవింద్ మీనన్ (గామి)
బెస్ట్ కొరియోగ్రాఫర్ - గణేష్ మాస్టర్ - దేవర - ఆయుధ పూజ సాంగ్
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ - అధినితిన్ జిహాని చౌదరి (కల్కి)
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ - చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ - నల్ల శీను (రజాకార్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ - అర్చన రావు, అజయ్ కుమార్ (కల్కి)
స్పెషల్ జ్యూరి అవార్డు(హీరో) - దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
స్పెషల్ జ్యూరి అవార్డు (హీరోయిన్) - అనన్య నాగళ్ళ (పొట్టేల్)
స్పెషల్ జ్యూరి అవార్డు (డైరెక్టర్) - సుజీత్, సందీప్ (క)
స్పెషల్ జ్యూరి అవార్డు (నిర్మాత) - ప్రశాంతి రెడ్డి, రాజేష్ కళ్లేపల్లి (రాజు యాదవ్)
జ్యురి స్పెషల్ మెన్షన్ (సింగర్) - ఫారియా అబ్దుల్లా (ర్యాప్ సాంగ్ - మత్తు వదలరా)
బెస్ట్ బుక్ ఆన్ సినిమా - మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్)

]]>
Thu, 29 May 2025 22:13:43 +0530 admin
నకిలీ విత్తనాలను సరఫరా చేసిన కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి https://prajakshethrenews.com/నకిలీ-విత్తనాలను-సరఫరా-చేసిన-కంపెనీలపై-క్రిమినల్-కేసులు-నమోదు-చేయాలి https://prajakshethrenews.com/నకిలీ-విత్తనాలను-సరఫరా-చేసిన-కంపెనీలపై-క్రిమినల్-కేసులు-నమోదు-చేయాలి నకిలీ విత్తనాలను సరఫరా చేసిన కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన గిరిజన రైతులకు న్యాయం చేయాలి
రాష్ట్ర డీజీపీకి  బీజేపీ ఎస్టి మోర్చా రాష్ట్ర బృందం  ఫిర్యాదు
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 
;తెలంగాణ డిజిపి కార్యాలయంలో డిజిపి జితేందర్ రెడ్డి   నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన గిరిజన రైతులకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టాలని – బీజేపీ ST మోర్చా రాష్ట్ర బృందం డీజీపీకి ఫిర్యాదు చేసింది.ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతాల్లో నకిలీ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతులకు న్యాయం కల్పించాలంటూ, బీజేపీ ST మోర్చా రాష్ట్ర బృందం ఈరోజు రాష్ట్ర డీజీపీని కలిసి  ఫిర్యాదు చేసింది.ఈ సందర్భంగా ST మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డా. కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ –“గత కొద్ది నెలలుగా సింజంత, హైటెక్, బాయర్, సిబివంటి కంపెనీలు నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనే ఈ మోసాలు జరుగుతున్నాయి. నాణ్యమైన విత్తనాలపై భరోసా ఉంచిన గిరిజన రైతులు పూర్తిగా నష్టపోయారు. అప్పుల్లో కూరుకుపోయిన కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది కేవలం వ్యవసాయ విఫలత కాదు – అమాయక గిరిజనులపై అవినీతి రాష్ట్ర ప్రభుత్వ కుట్ర. బాధ్యులైన కంపెనీలపై పీడియాక్ట్ కింద కేసులు నమోదు చేయాలి. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. భవిష్యత్తులో ఇటువంటి మోసాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలి,” అని తెలిపారు.1. 3000 ఎకరాలు పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి 800 వందల మంది గిరిజన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి మరియు చనిపోయిన 5 గురు రైతుల కుటుంబాలకు తక్షణమే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.2. నకిలీ విత్తనాలను సరఫరా చేసిన కంపెనీలపై మనీలాండరింగ్ యాక్ట్ , అలాగే యజమానులపై పీడియాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.3. బాధ్యులైన ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలి.4. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరగకుండా నియంత్రణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డిమండ్ చెసారు. “మంత్రి సీతక్క గారికి ఇసుక క్వారీలపై ఉన్న శ్రద్ధ, అందాల పోటీలపై ఉన్న ఆసక్తి గిరిజన రైతుల ఆత్మహత్యలపై ఏమాత్రం లేదని, వ్యవసాయ శాఖ మంత్రి కూడా స్పందించలేదని, ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తున్నా, గిరిజన రైతుల విషయంలో పూర్తిగా విస్మరించారని, మంత్రివర్గంలో ఒక్క గిరిజన మంత్రిని కూడా నియమించని ఈ ప్రభుత్వ ధోరణి గిరిజనుల పట్ల అవమానకరంగా ఉంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ST మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శ రవి నాయక్ నేనావత్,రాష్ట్ర కార్యదర్శి కుంజా సంతోష్,మహేష్ రూపావత్,బానోత్ అనూష,రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Mon, 26 May 2025 20:27:45 +0530 admin
నెలాఖరులో మంత్రివర్గ విస్తరణపై ప్రకటన.. https://prajakshethrenews.com/నెలాఖరులో-మంత్రివర్గ-విస్తరణపై-ప్రకటన https://prajakshethrenews.com/నెలాఖరులో-మంత్రివర్గ-విస్తరణపై-ప్రకటన నెలాఖరులో మంత్రివర్గ విస్తరణపై ప్రకటన..
             సామాజికవర్గాల వారీగా కసరత్తు
వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎస్‌సి,ఎస్‌టి, మైనారిటీలకు అవకాశం?
                    మంత్రివర్గ విస్తరణపైనా చర్చలు
మరో రెండు రోజులు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 
: పీసీసీ కార్యవర్గం ఎంపికకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు ఆ పార్టీ వర్గాల తాజా సమాచారం. ఈ నెలాఖరున పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణను కూడా అధిష్ఠానం తేల్చేపనిలో ఉన్న ట్టు తెలిసింది. నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా వీరి మధ్య చర్చలు సాగాయి. రేవంత్‌తో పాటు పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఉన్నారు.సోమవారం ఉదయం వేణుగోపాల్‌తో కలిసి రాహుల్‌గాంధీని కూడా సీఎం రేవంత్‌రెడ్డి కలువనున్నారని తెలిసింది. అలాగే మంగళవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గే అపాయింట్‌మెంట్ లభించడంతో మరో రెండు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలోనే ఉంటారని తెలిసింది. మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన పీసీసీ అధ్యక్షు డు మహేశ్‌కుమార్‌గౌడ్ ఇప్పటికే పీసీసీ కార్యవ ర్గం ఎంపికపై తమ ప్రతిపాదనలను పార్టీ పెద్దల ముందు ఉంచినట్టు తెలిసింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా కలిసి కార్యవర్గం ఎంపి క ప్రతిపాదనలపై మహేశ్‌కుమార్‌గౌడ్ చర్చించినట్టు తెలిసింది.పీసీసీ అధ్యక్షుడు, అధిష్ఠానం సంయుక్తంగా చేసిన కసరత్తుపై తుదిగా సీఎం రేవంత్‌రెడ్డితో అధిష్ఠానం చర్చించాక, పీసీసీ కా ర్యవర్గం, మంత్రివర్గ విస్తరణ రెండింటిపై స్పష్టత రానున్నదని ఈ వర్గాల సమాచారం. పీసీసీ కా ర్యవర్గం ఖరారు దాదాపు ఒక కొలిక్కి రావడంతో ఈ నెలాఖరున ప్రకటించే అవకాశం ఉన్నట్టు తె లిసింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఈ మూడు పదవులలో ఉన్న సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ లో, ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లభించని సామాజిక వర్గాలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అవకాశం కల్పించబోతున్నట్టు తెలిసింది. ఎస్టీ, ఎస్సీ (మాదిగ), మైనార్టీ ఈ మూడు సామాజిక వర్గాలకు చెందిన వారికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అవకాశం దక్కబోతున్నట్టు తెలిసింది. అలాగే కార్యవర్గంలో కీలకమైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు,  కార్యదర్శులుగా సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని కసరత్తు చేసినట్టు తెలిసింది.
వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ?
పీసీసీ కార్యవర్గం ఎంపిక కొలిక్కి రావడంతో పార్టీ అధిష్ఠానం మంత్రివర్గ విస్తరణపై ఇక దృష్టి సారించినట్టు తెలిసింది. ఈ నెలఖారున పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించి, వచ్చే నెల జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం సూచనప్రాయంగా అంగీకరించినట్టు ఈ వర్గాల సమాచారం. మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించే అంశం వల్లనే జాప్యానికి కారణంగా చెబుతున్నారు.డిప్యూటీ సీఎం, స్పీకర్ రెండు కీలక పదవులు మాల సామాజిక వర్గానికి అవకాశం కల్పించడంతో కనీసం మంత్రివర్గంలో అయినా తమకు ప్రాధాన్యత కల్పించాలని మాదిగ సామాజిక వర్గం చేస్తోన్న డిమాండ్‌ను అధిష్ఠానం సీరియస్‌గా తీసుకొని ఆ దిశగా కసరత్తు చేస్తోన్నట్టు తెలిసింది. మంత్రివర్గంలో ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రి దామోదర రాజనరసింహకు ప్రాతినిధ్యం కల్పించినప్పటికీ ఆయన తమ సామాజిక వర్గం కాదని ఆరుగురు మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేల వాదనతో అధిష్ఠానం ఏకీభవించినట్టు తెలిసింది. దీంతో మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై సందిగ్థత నెలకొన్నట్టు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా ఆరుగురు మాదిగ ఎమ్మెల్యేలు మరోసారి తమ డిమాండ్‌పై అధిష్ఠానంతో చర్చించాల్సిందిగా విజ్ఞప్తి చేసారు. మరోవైపు అధిష్ఠానం పెద్దలకు కూడా లిఖిత పూర్వకంగా వారు లేఖ రాసారు.మంత్రివర్గ విస్తరణలో తమ వర్గానికి ప్రాతినిథ్యం కల్పించాలని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూ సిఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం లేఖ అందజేసిన విషయం తెలిసిందే. వీరిలో ఎమ్మెల్యేలు మందుల సామేల్ (తుంగతుర్తి), కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొండూరు), వేముల వీరేశం (నకిరేకల్), తోట లక్ష్మీకాంతరావు (జుక్కల్), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి), కాలె యాదయ్య (చేవెళ్ల)లు ఉన్నారు. తమ కోటాలో మంత్రివర్గంలో ఉన్న దామోదర రాజనర్సింహ మాదిగ కాదని, ఆయనది ఉపకులమని వారు తమ లేఖలో పేర్కొన్నారు. మాదిగ సామాజిక వర్గ జనాభా రాష్ట్రంలో 2011 జనగణన ప్రకారం 33 లక్షల మంది ఉన్నారని, మాలలకు డిప్యూటీ సిఎం, స్పీకర్ పదవి దక్కడంతో మంత్రివర్గంలో అయినా తమకు చోటు కల్పించాలని ఆ లేఖలో వారు పేర్కొన్నారు.

]]>
Mon, 26 May 2025 20:00:36 +0530 admin
రోహిణి కార్తె ప్రారంభం.. రోళ్లు పగిలే ఎండల్లేవు https://prajakshethrenews.com/రోహిణి-కార్తె-ప్రారంభం-రోళ్లు-పగిలే-ఎండల్లేవు https://prajakshethrenews.com/రోహిణి-కార్తె-ప్రారంభం-రోళ్లు-పగిలే-ఎండల్లేవు రోహిణి కార్తె ప్రారంభం..
 రోళ్లు పగిలే ఎండల్లేవు
ఈ సారి వేసవికాలం వర్షాకాలంలా మారింది.
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :  
క్రమం తప్పకుండా కురుస్తున్న వర్షాలకు పరిస్థితులే మారిపోయాయి.నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభమైంది. సాధారణంగా రోహిణి కార్తెలో రోళ్లు (బండలు) పగిలేలా ఎండలు ఉంటాయని నానుడి. నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్లే కనిపిస్తోంది.మరోవైపు కాలం ముందే వచ్చేసిందని, ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేస్తాయేమోనని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

]]>
Mon, 26 May 2025 19:43:32 +0530 admin
ఆపరేషన్ సిందూర్” సైనిక చర్య చరిత్రలో గర్వకారణమైన అధ్యాయం https://prajakshethrenews.com/ఆపరేషన్-సిందూర్-సైనిక-చర్య-చరిత్రలో-గర్వకారణమైన-అధ్యాయం https://prajakshethrenews.com/ఆపరేషన్-సిందూర్-సైనిక-చర్య-చరిత్రలో-గర్వకారణమైన-అధ్యాయం ఆపరేషన్ సిందూర్” సైనిక చర్య చరిత్రలో  గర్వకారణమైన అధ్యాయం
*దేశీయ టెక్నాలజీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
*భారత యువతకు డా. ర్యాగ రిషి అరుణ్ పిలుపు
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 
దేశ భద్రత మరియు గౌరవం విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రపంచానికి గంభీర సందేశాలు పంపించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  నాయకత్వంలో నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” సైనిక చరిత్రలో ఒక గర్వకారణమైన అధ్యాయంగా నిలిచిందని, పాకిస్తాన్ మద్దతుతో భారత భూభాగంపై చొరబాటు చేస్తున్న ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం అత్యంత వ్యూహాత్మకంగా దాడి చేసి వాటిని ధ్వంసం చేసిందని డా. ర్యాగ రిషి అరుణ్  కోఆర్డినేటర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం  విలేకరుల సమావేశంలోపేర్కొన్నారు . ప్రపుల్ పొడిశెట్టి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ బీసీ లిబరేషన్ ఫోర్స్ మరియు బీసీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ భారత్ సేన చేసిన ఆపరేషన్ సిందూర్ లో, పౌరులకు ఎలాంటి హాని కలగకుండా అత్యాధునిక టెక్నాలజీతో ఉగ్రవాద శిబిరాలను ఒక్కొక్కటిగా నాశనం చేసింది. పాకిస్తాన్, చైనా, టర్కీ దేశాల నుండి దిగుమతి చేసుకున్న డిఫెన్స్ టెక్నాలజీ, డ్రోన్లను కూడా భారత్ సమర్థవంతంగా నిర్వీర్యం చేసింది. ఇది భారత్ సాంకేతికంగా ప్రపంచంలోని ఏ దేశానికీ తీసిపోనిదని మరోసారి నిరూపించింది అని అన్నారు.భారత యువత కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేషన్ మిషన్ వంటి పథకాల ఉపయోగం తీసుకొని దేశీయ టెక్నాలజీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ప్రతి యువత రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం వంటి రంగాల్లో స్వదేశీ పరిష్కారాలపై దృష్టి సారించాలి. భారత్‌కి కావలసింది ఆయుధాలు మాత్రమే కాదు — ఆవిష్కరణలు, ఆత్మవిశ్వాసం, ఆదర్శాల కలయిక!దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిద్దా మన్నారుప్రస్తుతం చాలామంది విదేశీ పర్యటనల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ మన దేశంలోనే చూడదగిన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య భారత రాష్ట్రాలు — త్రిపురా, మణిపూర్, అసోం, అరుణాచల్ ప్రదేశ్ — సాంస్కృతికంగా, భౌగోళికంగా, ఆధ్యాత్మికంగా విలక్షణమైనవి.కామాఖ్యా దేవాలయం (అసోం), త్రిపురేశ్వరి దేవాలయం (త్రిపురా), శ్రీగోవిందాజీ ఆలయం (మణిపూర్), తవాంగ్ మఠం (అరుణాచల్ ప్రదేశ్) వంటి ప్రదేశాలు భారత ప్రాచీనతను ప్రతిబింబిస్తాయి. అలాగే కాశీ, అయోధ్య, కేదారనాథ్, ద్వారకా, తిరుపతి, రామేశ్వరం, మాత విష్ణో దేవి వంటి పవిత్ర ప్రదేశాలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనాలన్నారు.దేశాభిమానం అనేది నినాదంగా కాదు – జీవన విధానంగా ఉండాలి అని డా. ర్యాగ రిషి అరుణ్ అన్నారు. భారతమాత సేవలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలి అని పిలుపు ఇచ్చారు.

]]>
Mon, 26 May 2025 19:22:03 +0530 admin
కవిత లేఖ తో కాంగ్రెస్ కి వచ్చే నష్టంఏం లేదు : జగ్గారెడ్డి https://prajakshethrenews.com/కవిత-లేఖ-తో-కాంగ్రెస్-కి-వచ్చే-నష్టంఏం-లేదు-జగ్గారెడ్డి https://prajakshethrenews.com/కవిత-లేఖ-తో-కాంగ్రెస్-కి-వచ్చే-నష్టంఏం-లేదు-జగ్గారెడ్డి కవిత లేఖ తో కాంగ్రెస్ కి వచ్చే నష్టంఏం లేదు...
* తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బలంగానే ఉంటది
 *కవిత ఎపిసోడ్...బీజేపీ కి బలం పెంచేలా ఉన్నాయి.
 జగ్గారెడ్డి  

ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్ : 
కవిత లేఖ తో కాంగ్రెస్ కి వచ్చే నష్టంఏం లేదని,  తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బలంగానే ఉంటదని  పిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్  లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ     రాష్ట్ర విభజన తర్వాత కేసిఆర్ కి పదేళ్లు అవకాశం ఇచ్చారు .. తర్వాత కాంగ్రెస్ కి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బంది లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్లు ఉంది   అన్ని రాజకీయ పార్టీల్లో అంతర్గత విషయాలు ఉంటాయి వారం నుండి కవిత రాసిన లేఖల గురించి చర్చ జరుగుతుంది కేసీఆర్ కుటుంబం లో లేఖల కలకలం.. నడుస్తుంది . ఏదో జరుగుతుంది అనే చర్చ నడిసింది. కవిత ఎపిసోడ్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి కవిత కొత్త పార్టీ అనే చర్చ నడుస్తుందిబలంగా లేని పార్టీ బీజేపీ పార్టీ అన్ని అన్నారు.. కేసీఆర్ కి రాష్ట్ర విభజన అంశం తో ఓటేశారు . కాంగ్రెస్ కి పాలన చూసి ఓటేస్తారు ప్రజలు ఇందిరా గాంధీ మొదలు కొని...సోనియా..రాహుల్ గాంధీ వరకు మంచి పరిపాలన అందిస్తారు అని అవకాశం ఇస్తున్నారన్నారు.. మతం పేరుతో .. బీజేపీ రాజకీయం చేస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో ముందు కాంగ్రెస్.. రెండో స్థానంలో బిఆర్ఎస్ మూడో స్థానం లో బీజేపీ ఉంది కేసీఆర్ కుటుంబ పంచాయతీ..రాజకీయంగా వాళ్లకు నష్టందాని నుండి ఎలా బయట పడాలి అనేది వాళ్ళు చూస్తున్నారుకుటుంబ తగాదా తో బిఆర్ఎస్ క్యాడర్ డిసప్పాయింట్ అవుతారు... ఆ క్యాడర్ బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉంటుందికవిత లేఖ తో  బిఆర్ఎస్ క్యాడర్..లీడర్స్ బీజేపీ వైపు వెళ్లే ప్రమాదం ఉందిఎవరికి వాళ్ళు నేను ఏదో అనే ఫీలింగ్ మంచిది కాదుఎవరు ఒప్పుకున్నా..ఒప్పుకోకపోయినా కేసీఆర్.. కేసీఆరేఆయనతోనే  ఆ పార్టీకి ఉనికి.. కేటీఆర్...హరీష్..కవిత ల వల్ల ఏం కాదుకవిత స్వతహాగా లీడర్ కాదు.కేసీఆర్ నీ దేవుడు అంటూనే...కవిత ఏ చెట్టు నీడలో బతుకుతున్నారు... ఆ చెట్టు నరికేస్తున్నదికూర్చున్న చెట్టు కొమ్మని నరికినట్టు ఉంది కవితకవిత ఎపిసోడ్...బీజేపీ కి బలం పెంచేలా ఉన్నాయి...అంత రాజకీయ ఆలోచన లేదా..?కేసీఆర్ నీ దేవుడు అంటూనే...రాజకీయ జీవిత సమాధి చేస్తున్నావు కవిత కవిత డిప్రెషన్ లో ఉండి...తొందర పడి లేఖ విడుదల చేశారు బీజేపీ నీ పెంచి పోషించే పరిస్థితి లో ఉన్నారు కాంగ్రెస్ నేతలు అలెర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది లేఖలు లీకులు మీడియా లో లైవ్ లో కనిపిస్తాయి కానీ.. బిఆర్ఎస్ రాజకీయ ఆత్మహత్య చేసుకుని.. బీజేపీ నీ పెంచే పని జరుగుతుందికేసీఆర్ లేకుంటే బిఆర్ఎస్ లేదు.. కేసీఆర్ నీ దేవుడు అంటూనే కొంప ముంచుతుంది రాష్ట్రంలో ఉనికి లేని బీజేపీ నీ...మీ ఇంట్లో పంచాయతీ మూలంగా బిజెపి కి బలం ఇచ్చే ప్రయత్నం భవిష్యత్ నీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అలెర్ట్ అవ్వాలికవిత తండ్రి మీద దండయాత్ర చేస్తూ... కేసీఆర్ కొంప ముంచి బీజేపీ కి బలం ఇస్తుందన్నరు.

]]>
Mon, 26 May 2025 19:18:43 +0530 admin
ఈ 2న పంచాయతీ ఎన్నికలపై ప్రకటన https://prajakshethrenews.com/ఈ-2న-పంచాయతీ-ఎన్నికలపై-ప్రకటన https://prajakshethrenews.com/ఈ-2న-పంచాయతీ-ఎన్నికలపై-ప్రకటన ఈ 2న పంచాయతీ ఎన్నికలపై ప్రకటన
ఆలస్యమైతే కాంగ్రెస్‌కు మరింత నష్టం.
ఉన్నతాధికారులతో సీఎం భేటీ
ఎన్నికల నిర్వహణపై సమాలోచన
సన్నబియ్యం రేషన్‌కార్డులు రాజీవ్‌ యువవికాసంపైనే ఆశలు.
ఆలస్యమైతే ఇంకా నష్టమనే భయం

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వ పెద్దలు కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.
సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత జూన్‌ 5లోగా స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ఎస్‌ఈసీ, నుంచి ఈ మే రకు ప్రకటన రావచ్చని పేర్కొన్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ పీఆర్‌, కమిషనర్‌ సృజన, ఇతర ఉన్నతాధికారులతో తాజాగా సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.
పంచాయతీ ఎన్నికలు జరపాలని ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వస్తున్నదని సీఎం తెలుపగా, ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసి ఉంచామని అధికారులు చెప్పినట్టు సమాచారం. బ్యాలెట్‌ పేపర్లు సైతం ముద్రించి సిద్ధంగా ఉంచామని చెప్పినట్టు తెలిసింది. సీఎంతో భేటీ అనంతరం తొలిసారిగా కమిషనర్‌ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఇతర ముఖ్య అధికారులతో మాట్లాడినట్టు అధికారవర్గాలు సైతం వెల్లడించాయి. ఏ సమయంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడవచ్చని, సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపాయి.
ఆలస్యమైతే మరింత నష్టం?
రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసి ఏడాది దాటిపోయింది. కేంద్రం, 15వ ఫైనాన్స్‌ నిధులు రాక గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన నిలిచింది. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి 15 నెలలు దాటింది. అయినా, ఎన్నికలు నిర్వహించక పోవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై గ్రామీణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇంకా ఆలస్యమైతే మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వ పెద్దలకు ఫీడ్‌బ్యాక్‌ అందింది. ఫలితాలు ఎలా వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వ పెద్దల వద్ద మొర పెట్టుకుంటున్నారు.
పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు తమ సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్తారని, తమపై కాస్త ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. వెంటనే ఎన్నికలకు వెళ్లాలని కొందరు ఎమ్మెల్యేలు ఒత్తిడి కూడా తీసుకొస్తున్నట్టు తెలిసింది. సన్నబియ్యం, రేషన్‌కార్డుల పంపిణీ, యువవికాసం వంటి పథకాల అమలు అంశం కలిసి వస్తుందని కూడా హస్తం నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆ పథకాలపై ఇంటింటా ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం డిప్యూటీ సీఎం పలు సూచనలు ఇచ్చారు.

]]>
Mon, 26 May 2025 19:06:45 +0530 admin
టీజీ ఎప్ సెట్ ఫలితాలు విడుదల https://prajakshethrenews.com/టీజీ-ఎప్-సెట్-ఫలితాలు-విడుదల https://prajakshethrenews.com/టీజీ-ఎప్-సెట్-ఫలితాలు-విడుదల టీజీ ఎప్ సెట్ ఫలితాలు విడుదల 

తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2025 ఫలితాలను రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఎంట్రెన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 2,07,190 విద్యార్థులు హాజరు కాగా, 1,51,779 మంది (73.26%) ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 81,198 విద్యార్థులు హాజరు కాగా, 71,309 (87.82%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంట్రెన్స్ లో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులకు, నిర్వాహకులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. వి బాలకిష్టా రెడ్డి , ఎప్‌సెట్‌ 2025 చైర్మన్ ప్రొ. టి. కిషన్ కుమార్ రెడ్డి , కన్వీనర్ డా. బి. డీన్ కుమార్ తో పాటు విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

]]>
Sun, 11 May 2025 17:31:04 +0530 admin
మంచు ఫ్యామిలిలో టెన్షన్​ https://prajakshethrenews.com/మంచు-ఫ్యామిలిలో-టెన్షన్ https://prajakshethrenews.com/మంచు-ఫ్యామిలిలో-టెన్షన్ Wed, 09 Apr 2025 15:40:48 +0530 admin పాతబస్తీలో వాడవాడలా తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు https://prajakshethrenews.com/పాతబస్తీలో-వాడవాడలా-తెలుగుదేశం-పార్టీ-43-వ-ఆవిర్భావ-దినోత్సవ-వేడుకలు https://prajakshethrenews.com/పాతబస్తీలో-వాడవాడలా-తెలుగుదేశం-పార్టీ-43-వ-ఆవిర్భావ-దినోత్సవ-వేడుకలు పాతబస్తీలో వాడవాడలా తెలుగుదేశం పార్టీ 43 వ  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

పాతబస్తీ చాంద్రాయణగుట్టలో తెలుగుదేశం పార్టీ 43 వ  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ సీనియర్​ నాయకులు గాజుల వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదరాబాద్  పార్లమెంట్ కోఆర్డినేటర్ నాగు నాగేష్  ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.  

గౌలిపురాలో....

అనంతరం యాకుత్ పుర  నియోజకవర్గంలోని  గౌలిపుర   డివిజన్ చౌరస్తా లో   బి. వై. శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నాగునాగేష్​ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, కేక్​ను కట్​ చేశారు. 

మొఘల్​పురాలో ...

అలాగే చార్మినార్  నియోజకవర్గంలోని  మొఘల్ పుర  డివిజన్ లోని   జోగేందర్    సింగ్  ఆధ్వర్యంలో  చేపట్టిన  ఆవిర్భావ  దినోత్సవ వేడుకలకు నాగునాగేష్​ పాల్గొని, ముందుగా ఎన్టీఆర్​ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురికి మిఠాయిలను పంచిపెట్టారు. 

బహదూర్​పురాలో ....

బహదూర్ పుర నియోజకవర్గంలోని  శ్యామ్ సుందర్   ఆధ్వర్యంలో  టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగ పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో టీడీపీ సీనియర్​ నాయకులు సమీయుద్దీన్  రఫిక్ , తయ్యాబా  తస్నీమ్,  సల్లా  రాజ్ కుమార్ , బి. వై.  శ్రీకాంత్ , గాజుల వెంకట్ రమణ,      వరుణ్  తేజ ,  యాదిలాల్ ,  యాదయ్య ,  సత్యకృష్ణ ,ఆర్.  అజయ్ , రవీందర్  గౌడ్ ,  అహ్మద్  షరీఫ్, రాజేందర్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

]]>
Sun, 30 Mar 2025 07:18:22 +0530 admin
ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా శ్రీరామ్ కోటయ్య https://prajakshethrenews.com/ఆర్యవైశ్య-సంఘం-నూతన-అధ్యక్షుడిగా-శ్రీరామ్-కోటయ్య https://prajakshethrenews.com/ఆర్యవైశ్య-సంఘం-నూతన-అధ్యక్షుడిగా-శ్రీరామ్-కోటయ్య ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా శ్రీరామ్ కోటయ్య

లాల్ దర్వాజా గౌలిపురా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా శ్రీరామ్ కోటయ్య ను సంఘం జీవిత సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత అధ్యక్షుడు సంతోష్ కుమార్ సంఘానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో గురువారం రాత్రి గౌలిపురా బతుకమ్మ బావి వద్ద ప్రత్యేక సర్వ సభ్య సమావేశం నిర్వహించి అధ్యక్షడిగా సంతోష కుమార్ ను తొలగిస్తూ 132 మంది జీవిత సభ్యులు కోటయ్యను అధ్యక్షుడిగ  ఎన్నుకున్నారు.

]]>
Sat, 22 Mar 2025 10:06:29 +0530 admin
గ్రూప్ 1 లో విజయం సాధించిన సాయి శ్రీనివాస్ యాదవ్. https://prajakshethrenews.com/గ్రూప్-1-లో-విజయం-సాధించిన-సాయి-శ్రీనివాస్-యాదవ్ https://prajakshethrenews.com/గ్రూప్-1-లో-విజయం-సాధించిన-సాయి-శ్రీనివాస్-యాదవ్ గ్రూప్ 1 లో విజయం సాధించిన సాయి శ్రీనివాస్ యాదవ్....

సాయి శ్రీనివాస్ యాదవ్ ను సత్కరించిన జమ్మిచెట్టు రాజు 

లంగర్ హౌజ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న  పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గం లలితాబాగ్ డివిజన్ రాఘవేంద్ర స్వామి నగర్ కు చెందిన సాయి శ్రీనివాస్ యాదవ్ గ్రూప్ 1 లో 473.5 మార్కులు సాధించాడు. దీంతో  అతని తల్లి దండ్రులు సావిత్రి, రాజు యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు.  ఈ సందర్బంగా సాయి శ్రీనివాస్ యాదవ్ ను  లలితా బాగ్ డివిజన్ బీ ఆర్ ఎస్ అధ్యక్షులు జమ్మి చెట్టు రాజు, లలితా బాగ్ టెంపుల్ మాజీ బోర్డు మెంబర్ నారని వేణు గోపాల్, సర్వేష్, నరసింహ తదితరులు కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

]]>
Mon, 17 Mar 2025 21:06:01 +0530 admin
జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న శ్రీ వెంకరేశ్వరస్వామి దేవాలయం చైర్మన్ భాషెట్టి లెనిన్ బాబు https://prajakshethrenews.com/జాతీయ-పతాకాన్ని-ఎగురవేస్తున్న-శ్రీ-వెంకరేశ్వరస్వామి-దేవాలయం-చైర్మన్-భాషెట్టి-లెనిన్-బాబు https://prajakshethrenews.com/జాతీయ-పతాకాన్ని-ఎగురవేస్తున్న-శ్రీ-వెంకరేశ్వరస్వామి-దేవాలయం-చైర్మన్-భాషెట్టి-లెనిన్-బాబు పాతబస్తీ ఫూల్ బాగ్ చమన్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న  శ్రీ వెంకరేశ్వరస్వామి దేవాలయం చైర్మన్ భాషెట్టి లెనిన్ బాబు 

]]>
Mon, 27 Jan 2025 08:04:39 +0530 admin
త్రివర్ణపతకాన్ని ఆవిష్కరించిన చాంద్రాయణ గుట్ట నియోజకవర్గం ఇంచార్జి బోయ నగేష్ https://prajakshethrenews.com/త్రివర్ణపతకాన్ని-ఆవిష్కరించిన-చాంద్రాయణ-గుట్ట-నియోజకవర్గం-ఇంచార్జి-బోయ-నగేష్ https://prajakshethrenews.com/త్రివర్ణపతకాన్ని-ఆవిష్కరించిన-చాంద్రాయణ-గుట్ట-నియోజకవర్గం-ఇంచార్జి-బోయ-నగేష్ పాతబస్తీ గౌస్ నగర్ లో  జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రివర్ణపతకాన్ని ఆవిష్కరించిన చాంద్రాయణ గుట్ట నియోజకవర్గం ఇంచార్జి బోయ నగేష్ తదితరులు.

]]>
Mon, 27 Jan 2025 07:56:26 +0530 admin
అర్థరాత్రి నుంచి రైతు ఖాతాల్లో ప్రతి ఎకరాకు 6 వేల చొప్పున డబ్బులు జమ : సీఎం రేవంత్​రెడ్డి https://prajakshethrenews.com/అర్థరాత్రి-నుంచి-రైతు-ఖాతాల్లో-ప్రతి-ఎకరాకు-6-వేల-చొప్పున-డబ్బులు-జమ-సీఎం-రేవంత్రెడ్డి https://prajakshethrenews.com/అర్థరాత్రి-నుంచి-రైతు-ఖాతాల్లో-ప్రతి-ఎకరాకు-6-వేల-చొప్పున-డబ్బులు-జమ-సీఎం-రేవంత్రెడ్డి అర్థరాత్రి నుంచి రైతు ఖాతాల్లో ప్రతి ఎకరాకు 6 వేల చొప్పున డబ్బులు జమ : సీఎం రేవంత్​రెడ్డి

ప్రజాక్షేత్ర్ , వెబ్​ న్యూస్​  

ప్రజా పాలనలో భాగంగా రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి నాలుగు నూతన సంక్షేమ కార్యక్రమాలను కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రాష్ట్రానికి అంకితం చేశారు. జనవరి 26 న బ్యాంకులకు సెలవు రోజు అయినందున అర్థరాత్రి తర్వాత రైతు భరోసా కింద రైతు ఖాతాల్లో ప్రతి ఎకరాకు 6 వేల చొప్పున డబ్బు జమవుతుందని చెప్పారు. 

]]> Sun, 26 Jan 2025 19:53:38 +0530 admin అంగరంగ వైభవంగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి కళ్యాణ వేడుకలు https://prajakshethrenews.com/అంగరంగ-వైభవంగా-శ్రీ-నల్లపోచమ్మ-అమ్మవారి-కళ్యాణ-వేడుకలు https://prajakshethrenews.com/అంగరంగ-వైభవంగా-శ్రీ-నల్లపోచమ్మ-అమ్మవారి-కళ్యాణ-వేడుకలు అంగరంగ వైభవంగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి కళ్యాణ వేడుకలు

అగ్నిగుండాలపై నడుచుకుంటూ వెళ్లిన శివసత్తులు, భక్తులు 

పాతబస్తీ అలియాబాద్​ మేకల్​బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో శ్రీ నల్లపోచమ్మ దేవి పాదుక ప్రతిష్ఠ మహోత్సవాలలో భాగంగా ఆదివారం అమ్మవారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గత డిసెంబర్​ 10వ తేదీన రాత్రి నేల మీద పసుపు పై అమ్మవారి పాదముద్ర ప్రత్యక్షమైనందున జనవరి 22వ తేదీ నుంచి ఆలయంలో శ్రీ నల్లపోచమ్మ దేవి పాదుక ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పొన్న వెంకటరమణ ఆధ్వర్యంలో శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి కళ్యాణ వేడుకలు, అమ్మవారి పటం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగాయి. అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శివ నామాన్ని జపిస్తూ ఉత్సవ మూర్తులను తీసుకుని శివసత్తులతో పాటు .... భక్తులు అగ్నిగుండం మీదుగా నడుచుకుంటూ వెళ్లారు. చిన్న పిల్లలు సైతం అగ్నిగుండం మీదుగా నడవడం వారికి అమ్మవారిపై ఉన్న  భక్తికి నిదర్శనం. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.

]]>
Sun, 26 Jan 2025 19:19:06 +0530 admin
పాత నగరం నిజానికి ఓల్డ్ కాదు.. ఒరిజినల్ సిటీ : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/పాత-నగరం-నిజానికి-ఓల్డ్-కాదు-ఒరిజినల్-సిటీ-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/పాత-నగరం-నిజానికి-ఓల్డ్-కాదు-ఒరిజినల్-సిటీ-రేవంత్-రెడ్డి పాత నగరం నిజానికి ఓల్డ్ కాదు.. ఒరిజినల్ సిటీ : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ బ్యూరో : 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోగానీ హైదరాబాద్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 11 కిలోమీటర్ల అత్యంత పొడవైన పీవీ నరసింహారావు ఫ్లైఓవర్‌ నిర్మితమైతే, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కిలోమీటర్ల మేర రెండో అతిపొడవైన  డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ ను నిర్మించామని, తద్వారా తమకు తామే పోటీ అని నిరూపించుకున్నట్టయిందన్నారు.నూతనంగా నిర్మించిన ఆరాంఘర్-జూపార్క్ 4కిలోమీటర్ల ఫ్లైఓవర్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ , స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్తో  కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలో రూ.301 కోట్లతో సీవరేజ్ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి సీఎం గారు మాట్లాడారు.

]]> Mon, 06 Jan 2025 23:08:32 +0530 admin ఆకర్షించిన టీయూడబ్ల్యూజే పోరాటాలు https://prajakshethrenews.com/ఆకర్షించిన-టీయూడబ్ల్యూజే-పోరాటాలు https://prajakshethrenews.com/ఆకర్షించిన-టీయూడబ్ల్యూజే-పోరాటాలు *టీయూడబ్ల్యూజే పోరాటాలు* *ఆకర్షించాయి* 

*దానికి అనుబంధంగానే పని చేస్తాం*

*- తెలంగాణ వీడియో జర్నలిస్టుల* *అసోసియేషన్ వెల్లడి*

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

దశాబ్దాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ-IJU) అవిశ్రాంతంగా పోరాడడం తమను ఎంతో ఆకర్షించిందని, ఈ నేపథ్యంలోనే ఆ సంఘానికి అనుబంధంగా పనిచేసేందుకు తమ అసోసియేషన్ నిర్ణయం తీసుకుందని తెలంగాణ వీడియో జర్నలిస్టుల అసోసియేషన్ బాధ్యులు వెల్లడించారు. శనివారం బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన  అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో  అధ్యక్షులు నాగరాజు, ప్రధాన కార్యదర్శి హరీష్ లు తమ నిర్ణయాన్ని సభా ముఖంగా ప్రకటించి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీకి లేఖను అందించారు.ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ వీడియో జర్నలిస్టులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. వీడియో జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ సంఘం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజె ఉప ప్రధాన కార్యదర్శి కె రాములు, కార్యదర్శులు వి.యాదగిరి, కె.శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి యం.వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరి, హెచ్.యూ.జె.అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్,  హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శి హరిప్రసాద్, టీయూడబ్ల్యూజె మహిళ విభాగం బాధ్యురాలు కల్యాణం రాజేశ్వరిలతో పాటు వీడియో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

]]>
Sat, 04 Jan 2025 22:15:00 +0530 admin
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ ని ఆవిష్కరించిన సీ ఎం https://prajakshethrenews.com/తెలంగాణ-గెజిటెడ్-ఆఫీసర్స్-అసోసియేషన్-2025-డైరీ-ని-ఆవిష్కరించిన-సీ-ఎం https://prajakshethrenews.com/తెలంగాణ-గెజిటెడ్-ఆఫీసర్స్-అసోసియేషన్-2025-డైరీ-ని-ఆవిష్కరించిన-సీ-ఎం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ ని  ఆవిష్కరించిన సీ ఎం 

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చామని, ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చెప్పారు. 

రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని అన్నారు. ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, వారికి నష్టం కలిగించే పనులు ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలెండర్‌ను   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఉద్దేశించి మాట్లాడారు.

గత పదేళ్లలో పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మేం అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేశాం. తెలంగాణ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల మొదటి తారీఖు జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం.

ఈ ప్రభుత్వం కష్టకాలంలో బాధ్యతలు చేపట్టింది. ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.

ప్రభుత్వంలో కనీస అవసరాలకు ప్రతీ నెల రూ. 22,500 కోట్లు అవసరం ఉండగా, రూ. 18,500 కోట్లు మాత్రమే ఆదాయం వస్తోంది. ఇంకా రూ. 4,000 కోట్ల లోటు ఉంటోంది. 

వచ్చే ఆదాయంలో రూ.6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు చెల్లిస్తున్నాం. మరో రూ. 6,500 కోట్లు ప్రతి నెల అప్పులు చెల్లిస్తుండగా, మిగిలిన రూ. 5,500 కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.

నిజానికి ప్రభుత్వం అన్నీ సక్రమంగా నిర్వహించాలంటే నెలకు రూ. 30 వేల కోట్లు అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వం మనందరిది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉద్యోగుల సహకారం కావాలి. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి.

ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి ధర్నాలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని ఒక కార్యాచరణ ప్రకారం ప్రభుత్వం పరిష్కరిస్తుంది. కొందరు రాజకీయాల కోసం నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారని, అలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.

సర్వశిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం కింద పనిచేస్తోంది. అందులో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధం చేసే అవకాశం లేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఉన్నా ప్రభుత్వానికి చేయలేని పరిస్థితి. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , నాయిని రాజేందర్ తో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

]]>
Fri, 03 Jan 2025 23:22:48 +0530 admin
*టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి* https://prajakshethrenews.com/టీయూడబ్ల్యూజే-డైరీని-ఆవిష్కరించిన-మంత్రి-పొంగులేటి https://prajakshethrenews.com/టీయూడబ్ల్యూజే-డైరీని-ఆవిష్కరించిన-మంత్రి-పొంగులేటి *టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి*

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ : 

సమగ్ర మీడియా సమాచారంతో, దాదాపు నలభై యేండ్లుగా ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) సంఘ ఆనవాయితీగా డైరీని ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2025 మీడియా డైరీని గురువారం నాడు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలోని తన ఛాంబర్ లో సమాచార శాఖ కమిషనర్ ఎస్. హరీష్ తో కలిసి ఆవిష్కరించారు.ఈ  కార్యక్రమంలో ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, ఐజేయు జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు,  కార్యదర్శి కె. శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి యం.వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రాజేష్, బి. కిరణ్, గౌస్ మోహియుద్దీన్, అనీల్, హెచ్.యూ.జే అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, హమీద్ షౌకత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డికి, సమాచార శాఖ కమిషనర్ హరీష్ కు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. విరాహత్ అలీ, కె. రాంనారాయణ లు పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

]]>
Thu, 02 Jan 2025 13:31:44 +0530 admin
అయ్యప్ప పడి పూజలో శ్రీ అయ్యప్ప దివ్య రూపం https://prajakshethrenews.com/అయ్యప్ప-పడి-పూజలో-శ్రీ-అయ్యప్ప-దివ్య-రూపం https://prajakshethrenews.com/అయ్యప్ప-పడి-పూజలో-శ్రీ-అయ్యప్ప-దివ్య-రూపం అయ్యప్ప పడి పూజలో శ్రీ అయ్యప్ప దివ్య రూపం 

పాతబస్తీ రాఘవేంద్ర స్వామినగర్ లో జెమ్మిచెట్టు సన్నిధానంలో జెమ్మిచెట్టు రాజు గురుస్వామి ఆధ్వర్యంలో నీలేష్ కన్నె స్వామి నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజలో ప్రత్యక్షమయిన శ్రీ అయ్యప్ప దివ్య రూపం దృశ్యం.

]]>
Wed, 01 Jan 2025 12:59:05 +0530 admin
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/ఉద్యోగుల-సమస్యలను-పరిష్కరించడానికి-ప్రభుత్వం-సిద్ధంగా-ఉంది-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ఉద్యోగుల-సమస్యలను-పరిష్కరించడానికి-ప్రభుత్వం-సిద్ధంగా-ఉంది-రేవంత్-రెడ్డి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు తో కలిసి సీఎం సమావేశమయ్యారు.ఉద్యోగుల డీఏ చెల్లింపు విషయంపై శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.ఉద్యోగులకు సంబంధించి వివిధ సమస్యల పరిశీలన కోసం కేబినేట్ సబ్ కమిటీని నియమించారు.ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా కేశవరావు ప్రత్యేక ఆహ్వానితులుగా కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.దీపావళి తర్వాత శాఖల వారిగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కేబినేట్ సబ్ కమిటీ సమావేశమవుతుంది.జీవో 317 పై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే  సమర్పించిన నివేదికపై కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.జేఏసీ ప్రతినిధులతో జరిగిన సమావేశాల్లో ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

]]>
Sat, 26 Oct 2024 22:59:23 +0530 admin
రైజింగ్ తెలంగాణ, రైజింగ్ హైదరాబాద్‌గా తీర్చిద్దడంలో అందరూ సహకరించండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/రైజింగ్-తెలంగాణ-రైజింగ్-హైదరాబాద్గా-తీర్చిద్దడంలో-అందరూ-సహకరించండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/రైజింగ్-తెలంగాణ-రైజింగ్-హైదరాబాద్గా-తీర్చిద్దడంలో-అందరూ-సహకరించండి-రేవంత్-రెడ్డి రైజింగ్ తెలంగాణ, రైజింగ్ హైదరాబాద్‌గా తీర్చిద్దడంలో అందరూ సహకరించండి : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

పన్నుల వాటాల్లో దక్షిణాది రాష్ట్రాలకు హక్కుగా రావలసిన నిధుల విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశం ప్రగతిబాటలో పయనించడానికి అన్ని రాష్ట్రాలు సమంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.ABP Network మీడియా సంస్థ హైదరాబాద్ లో నిర్వహించిన ది సదరన్ రైజింగ్ సదస్సు (The Southern Rising Summit 2024)లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రగతిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, రైజింగ్ తెలంగాణ (Rising Telangana), రైజింగ్ హైదరాబాద్ (Rising Hyderabad) లక్ష్యాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్, ఫ్యూచర్ సిటీ ఆలోచనలను వివరించారు.సబర్మతి రివర్ ఫ్రంట్‌కు మద్దతునిస్తున్న వారు మూసీ పురుజ్జీవాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆక్షేపించారు.మూసీ, ఈసా నదుల కలయిక ప్రాంతమైన బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యుత్తమంగా గాంధీ స్మారకాన్ని నిర్మించతలపెట్టామన్నారు.తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి కాంగ్రెస్ ప్రధానులు దేశంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణల ఫలితాలను వివరించారు.బహుళార్థ సాధక ప్రాజెక్టులు, విద్య, హరిత విప్లవం, బ్యాంకుల జాతీయీకరణ, 73-74 వ రాజ్యాంగ సవరణలు, శాస్త్ర సాంకేతిక రంగంలో తీసుకొచ్చిన విప్లవం, 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పన, తీసుకొచ్చిన  ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి ఏ విధంగా తోడ్పడిందీ విడమరిచారు.ఎంతో మంది యువకుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని గుర్తుచేస్తూ రాష్ట్ర ప్రగతి విషయంలో కొందరు  అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను... రైజింగ్ తెలంగాణ, రైజింగ్ హైదరాబాద్‌గా తీర్చిద్దడంలో అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

]]>
Sat, 26 Oct 2024 22:55:18 +0530 admin
క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/క్రీడా-విధానానికి-సంబంధించిన-తుది-ముసాయిదాను-నవంబర్-నెలాఖరులోగా-సిద్ధం-చేయండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/క్రీడా-విధానానికి-సంబంధించిన-తుది-ముసాయిదాను-నవంబర్-నెలాఖరులోగా-సిద్ధం-చేయండి-రేవంత్-రెడ్డి క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయండి : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో : 

జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మన యువత సత్తా చాటేలా తెలంగాణ క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ క్రీడా విధానంపై ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ విధానంలో భాగంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (Young India Physical Education and Sports University - YIPESU)కి సంబంధించిన బిల్లు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా రూపొందించాలని చెప్పారు.మరో పది రోజుల్లోగా యంగ్ ఇండియా స్పోర్ట్ వర్సిటీకి సంబంధించిన గవర్నింగ్ బాడీని ఖరారు చేయాలన్నారు.అత్యుత్తమ క్రీడా విధానం కోసం ద‌క్షిణ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివ‌ర్సిటీ అనుస‌రిస్తున్న విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని, ఈ రంగంలో నిపుణులు, క్రీడాకారులతో సంప్రదింపులు జరపాలని చెప్పారు.రాష్ట్ర, జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడా పోటీల‌కు సంబంధించిన క్యాలెండ‌ర్‌ను వెంట‌నే త‌యారు చేయాలన్నారు.వ‌చ్చే రెండేళ్ల‌లో నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్‌ను సంప్రదించాల‌ని ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కే.కేశ‌వ‌రావు, క్రీడా స‌ల‌హాదారు ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మ‌న్ శివసేనారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , రాష్ట్ర క్రీడ‌ల శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి జయేశ్ రంజన్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

]]>
Sat, 26 Oct 2024 22:50:43 +0530 admin
వారం రోజుల్లో Young India Skills యూనివర్సిటీ భవన నిర్మాణానికి తుది రూపు ఇవ్వండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/వారం-రోజుల్లో-young-india-skills-యూనివర్సిటీ-భవన-నిర్మాణానికి-తుది-రూపు-ఇవ్వండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/వారం-రోజుల్లో-young-india-skills-యూనివర్సిటీ-భవన-నిర్మాణానికి-తుది-రూపు-ఇవ్వండి-రేవంత్-రెడ్డి వారం రోజుల్లో Young India Skills యూనివర్సిటీ భవన నిర్మాణానికి తుది రూపు ఇవ్వండి : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో 

తెలంగాణ యువతను ప్రపంచంలోనే అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి  మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ (MEIL_Group)కి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మెఘా కంపెనీ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.అంతకుముందు ముఖ్యమంత్రి  మెఘా ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపారు.స్కిల్స్ వర్సిటీలో అధునాతన మౌలిక సదుపాయాలతో కూడిన యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (CSR) నిధుల నుంచి రూ. 200 కోట్లు కేటాయించింది.ఈ క్యాంపస్‌లో అకడమిక్ బిల్డింగ్, వర్క్ షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ బిల్డింగ్స్ నిర్మిస్తామని పీవీ కృష్ణారెడ్డి తెలిపారు.సీఎస్ఆర్ నిధులతో ఈ క్యాంపస్ నిర్మాణానికి ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి  మెఘా కంపెనీకి  అభినందనలు తెలిపారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు.హైదరాబాద్ శివారు కందుకూరు మండలంలో మీర్‌ఖాన్‌పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ శ్రేణి Young India Skills University నిర్మాణానికి గత ఆగస్టులోనే ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు.ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను నేటి  సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి   సూచించారు.డిజైన్లకు తుది రూపం ఇచ్చి నవంబర్ 8 వ తేదీన యూనివర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తో పాటు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

]]>
Sat, 26 Oct 2024 22:46:07 +0530 admin
బంజారా జీవితంతో ముడి పడిన... ఘుగర (మువ్వ)ల సవ్వడి https://prajakshethrenews.com/బంజారా-జీవితంతో-ముడి-పడిన-ఘుగర-మువ్వల-సవ్వడి https://prajakshethrenews.com/బంజారా-జీవితంతో-ముడి-పడిన-ఘుగర-మువ్వల-సవ్వడి బంజారా జీవితంతో ముడి పడిన... ఘుగర (మువ్వ)ల సవ్వడి 

ప్రాచీన కాలం నుంచి మొదలుకొని నేటి వరకు గజ్జెలు (మువ్వలు) మన జీవన విధానంలో ఎనలేని మనుగడను కొనసాగిస్తున్నాయి. పశుపక్ష్యాదులు మొదలుకొని, పసిపాప ప్రాయం నుంచి వృద్ధ్యాప్యం దాకా మువ్వలతో వున్న అనుబందం విడదీయలేనిది. కోడిపుంజు కాళ్ల నుంచి... లేగ దూడ మెడ వరకు పసిపాపగా వేసే మొదటి అడుగు నుంచి.. భర్తతో వేసే చివరి అడుగు వరకు బంజార ప్రజల జీవితంలో మువ్వ/ గజ్జెలకు ఉన్న ప్రాముఖ్యత వైవిధ్యమైనది.

ఛమ్క్య  ఘుగర పేరి... ఛమ్మ్​ ఛమ్మ్​ నాచుకన్ 

ఝంజరియ పేరి.. జవాని ఉమర్ అయికన్ 

గోళ్ ఘుగర పేరి.. గోల్ మాల్ న వేణోకన్... 

తీని రంగీర్ ఘుగర ఛూట్ చాలే... 

మారే వీరణారీ సోపతి ఛూట్ చాలీ... 

వాక్టీర్ బంధమేతి భందీ చాలీ.... 

ఓ ఘుగర మార్ బేటీ బేటార్ ఖుణ్ ఖుతియ మ బోలే కన్ మురిసి చాలీ... 

ఛమక్క్య ఘుగర, ఝూంజరియ, గోళ్ ఘుగర, వాంక్డ్ ఇలా బాల్య దశ నుంచి యవ్వన దశ, కౌమర దశ, వృద్యాప్యం దాకా బంజార భోరీకి గజ్జలతో ఉన్న అనుబందం విడదీయరానిది. బాల్య దశలో తండ్రి తన కూతురు ఛమక్క్య ఘుగరతో చేసే సవ్వడిని వింటూ మురి సిపోతాడు. తన బాధ గాధలను మరిచిపోయేలా తన కూతురిని...నాఛ్​ బాయి నాఛ్​ అంటూ పాట పాడుతూ ఆ మువ్వలు మరింత గా సవ్వడి చేసేలా ప్రోత్సహిస్తాడు. యవ్వన దశ ఆరంభంలో తన జీవితంలో చోటు చేసుకునే మార్పులకు, బాధ్యతలకు భయపడకుండా శరీర పరిపక్వతకు మునుపే మానసిక పరిపక్వతకు సంసిద్ధపరుస్తూ తల్లీ తన కూతురికి ఇచ్చే కానుకే 'ఝూంజరియ ఈ గజ్జెలు పూర్తిగా లోహంతో తయారు చేయబడి ఉంటాయి. లేత కాళ్లకు నొప్పిని, బొబ్బలను పరిచయం చేస్తాయి. అసౌకర్యంగానూ అనిపిస్తాయి. వాటన్నింటిని ఓర్చుకోవడం వల్ల ఊహించని మార్పులు మన జీవితంలో చోటు చేసుకున్నప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఎలా నడుచుకోవాలి అనే అనుభవ పాఠాలను ఈ ఝాంజరియ నేర్పిస్తాయి. కౌమర దశలో కానుకగా అందించే గోళ్ ఘుగర బంజార(ఛోరీ) అమ్మాయికి ఉద్వేగ పూరితమైన బహుమతిగా భావించబడతాయి. ఎందుకనగా అన్నదమ్ములు ప్రేమతో ఒక్కో గజ్జను తాడు సహాయంతో ప్రేమగా అల్లి తమ అక్క చెల్లికి 'గోళ్ ఘగర'తో పాటు ఇంటి పరువు, ప్రతిష్టను బాధ్యతగా అందిస్తారు. కౌమర దశలో ఉన్న తనపై తమ ఇంటి పరువు ప్రతిష్టలు ఆధారపడి ఉన్నాయని అంతటి బరువైన గోళ్ ఘుగరను తాను ధరించి సత్ప్ర వర్తనతో మొలుగుతూ మంచి పేరును తెచ్చుకోవాలని, ప్రేమతో కూడిన బాధ్యతను తన అన్నదమ్ముల చేతుల మీదుగా గోళ్ ఘుగర రూపంలో ఆనందంగా అందిపుచ్చుకుంటుంది. ఈ గోళ్ ఘుగరలు చాలా బరువుగా ఉంటాయి. తాను వేసే ప్రతి అడుగులో తనపై ఉన్న బాధ్యతను గుర్తుచేస్తూ ఉంటాయి. తన పెళ్లి సమయంలో తనను అత్తగారి ఇంటికి అప్పజెప్పే ముందు తనపై నమ్మకం ఉంచి తల్లిదండ్రుల గౌరవ మర్యాదలను తనకు అప్పగించి నందుకు గాను తన పుట్టింటి వారు ఆశించినట్లుగా పుట్టింటి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించకుండా నడుచుకొని ఆ బాధ్యతలను తిరిగి గోళ్ ఘుగర్ రూపంలో అన్నదమ్ములకు అందిస్తుంది. ప్రతి ఆడపిల్ల జీవితంలో అత్యత్తమమైన ఘట్టం పెళ్లి. ఈ సమయంలో అన్నదమ్ములు తమ సోదరి తమ ఇంటి పరువు ప్రతి ష్టలను బాధ్యతగా కాపాడిందని గుర్తించి ఆ గోళ్ ఘుగరను ఎంతో భావోద్వేగంతో ఏడుస్తూ విప్పుతారు. ఈ సందర్భంగా పెళ్లికూతురు జీవితకాలం తాను వారికి సోదరి గానే ఉంటానని, తనకు ఆ గోళ్ ఘుగర బరువుగా లేవని. తనను పరాయి ఇంటికి పంపించకూడదని తన కుటుంబంతో ఉన్న అను బంధంలో వచ్చే మార్పులను తాను స్వాగతించనని, తనను వారి ప్రేమానురాగాలకు దూరంగా పంపించకూడదని, అంతటి మధుర మైన అనుబంధాన్ని విడదీయకూడదని ఏడుస్తూ తన భావాలను పాట (ఢావ్లో) రూపంలో వ్యక్తపరుస్తుంది. అన్నదమ్ములు ఘుగర విడిపించగా తనకు కాబోయే భర్త 'వాంక్డి'ని (ఇసుక రేణువుల్లాంటి చిన్న చిన్న మువ్వలు అమర్చబడి లోహంతో తయారు చేయబడినది) పెళ్లి కూతురు కాళ్లకు ఎక్కిస్తారు. ఈ వాంక్డిని  తిరిగి తన భర్త మరణం తరువాతనే తొలగిస్తారు. వాంక్డిని  స్వీకరించిన తాను అత్తింటి గౌరవ మర్యాదలను అనుగుణంగా అత్తింటి బాధ్యతలను స్వీకరించినట్లుగా భావిస్తుంది. ఛమక్క్య ఘుగర, ఝూంజరియ, గోళ్ ఘుగర తన మానసిక పరి పక్వతకు అర్థవంతమైన నడవడికకు ప్రోత్సహించడం ద్వారా తాను తన పుట్టింటి గౌరవ మర్యాదలను కాపాడటంలో గడించిన అనుభ వాల ఆధారంగా తన మెట్టినింటి పరువు ప్రతిష్టలను కాపాడాల్సిం దిగా... ఆ బాధ్యతలను అనుక్షణం గుర్తుంచుకునే లాగా ఘుగరను పెళ్లికూతురు (నవ్లేరి) కి తన వేషధారణలో భాగం చేస్తూ గ్లుంగ్టో టోప్లీ , కాళీ, ఖయ్య, తాక్లీ, పట్టిలలో మువ్వలను అమర్చుతారు. " కొత్త జీవితాన్ని స్వాగతిస్తూ పెళ్లికూతురు (నవ్లేరీ) వాటి బరువును ఆనందంగా ఆస్వాదిస్తుంది. అనుక్షణం తన అత్తింటి కట్టుబాట్లను గుర్తు చేసుకుంటూ వాటికి అనుగుణంగా సక్రమంగా నడుచుకుంటూ తాను అడుగులు వేసినప్పుడు మొదలైన మువ్వల సవ్వడి తన పిల్లల చేతిలో (ఖుణ్ ఖుణియ) గిలకగా మారి చేస్తున్న సవ్వడిని వింటూ ఆనందంగా తన జీవితంలో మువ్వలు / (గజ్జెల)కు ఉన్న అనుబంధం విడదీయలేనిది అనే విషయాన్ని గ్రహిస్తుంది.

బంజార చోరీ...

నేనావత్​ స్రవంతి 

జేఎల్​, ఇంగ్లీష్​ 

7‌‌093644541

]]>
Tue, 22 Oct 2024 14:41:50 +0530 admin
జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని మంత్రి దామోదర రాజనరసింహాతో టీయూడబ్ల్యూజే భేటీ https://prajakshethrenews.com/జర్నలిస్టుల-ఆరోగ్య-పథకాన్ని-అమలు-చేయాలని-మంత్రి-దామోదర-రాజనరసింహాతో-టీయూడబ్ల్యూజే-భేటీ https://prajakshethrenews.com/జర్నలిస్టుల-ఆరోగ్య-పథకాన్ని-అమలు-చేయాలని-మంత్రి-దామోదర-రాజనరసింహాతో-టీయూడబ్ల్యూజే-భేటీ జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని మంత్రి దామోదర రాజనరసింహాతో టీయూడబ్ల్యూజే భేటీ

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

గత ఐదేళ్ల నుండి రాష్ట్రంలో జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం (JHS) సక్రమంగా అమలుకాక పోవడంతో జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అది అమలయ్యేలా పగడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహాను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కోరింది. సోమవారం నాడు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ నె్తృత్వంలో ప్రతినిధి బృందం బంజారా హిల్స్ లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో, మంత్రి దామోదర రాజనర్సింహాను, రాష్ట్ర ఆరోగ్య  కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు ఆర్.వి.కర్ణన్ ను కలిసి జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలుపై చర్చింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు EJHS పథకాన్ని ప్రవేశపెట్టి, హెల్త్ కార్డులు జారీ చేయగా, ఆ పథకం 2019వరకు సక్రమంగా పనిచేసిందని విరాహత్ అలీ తెలిపారు. కారణాలు ఏమిటో తెలియదు కానీ గత ఐదేళ్లుగా వైద్యం కోసం జర్నలిస్టులు కార్పొరేట్ ఆసుపత్రులకెళ్తే హెల్త్ కార్డులను తిరస్కరిస్తున్నారని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఐదేళ్ల కాలంలో వివిధ ప్రమాదాలు, కరోనా కాటు, ఆయా వ్యాధులకు గురై రాష్ట్రంలో దాదాపు 300మంది జర్నలిస్టులు అకాలమరణానికి గురైనట్లు ఆయన తెలిపారు. పథకం అమలుకాక పోవడంతో పలువురు జర్నలిస్టులు అప్పులు చేసి చికిత్స పొందుతున్నట్లు ఆయన విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఆరోగ్య పథకాన్ని పునరుద్దరించి జర్నలిస్టులకు ఆరోగ్య భద్రతా కల్పించాలని మంత్రి దామోదర రాజానరసింహాను కోరారు. మంత్రిని కలిసిన టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందంలో రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, రాష్ట్ర కార్యదర్శులు వరకాల యాదగిరి, కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, హెల్త్ కమిటీ కన్వీనర్ ఏ.రాజేష్, HUJ అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ లు ఉన్నారు.

*త్వరలో ఉన్నత స్తాయి సమావేశం*

*-మంత్రి దామోదర రాజనరసింహా*

ఆరోగ్య పథకం విషయంలో జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని పటిష్టంగా అమలుచేసే విషయంలో త్వరలో శాఖా పరంగా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి చర్చిస్తామని టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి మంత్రి దామోదర రాజనరసింహా హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని ట్రస్ట్ ద్వారనైనా, థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారనైనా నిర్వహించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అధికారులతో సమావేశమై, తదుపరి జర్నలిస్టు, ఉద్యోగ సంఘాల బాధ్యులతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

]]>
Mon, 21 Oct 2024 22:12:48 +0530 admin
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠినంగా వ్యవహరించండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/శాంతి-భద్రతలకు-విఘాతం-కలిగించేవారిపై-కఠినంగా-వ్యవహరించండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/శాంతి-భద్రతలకు-విఘాతం-కలిగించేవారిపై-కఠినంగా-వ్యవహరించండి-రేవంత్-రెడ్డి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠినంగా వ్యవహరించండి : రేవంత్ రెడ్డి 

ప్రజాక్షేత్ర్ , తెలంగాణ బ్యూరో

శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు చెప్పారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన ఘటనను ఉటంకిస్తూ, ప్రజల్లో విబేధాలు సృష్టించాలన్న సంఘ వ్యతిరేక శక్తుల చర్యలను నియంత్రించడంలో ప్రభుత్వం పోలీసులకు సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గోషామహల్‌లో నిర్వహించిన ఫ్లాగ్ డే పరేడ్‌లో పాల్గొని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం అమర పోలీసు కుటుంబాలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏ రాష్ట్రమైనా ప్రగతి పథంవైపు నడవాలంటే శాంతి భద్రతలు పరిరక్షణ అత్యంత కీలకమని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడటంలో నిరంతరం శ్రమిస్తున్నందుకు తెలంగాణ పోలీసు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు. తప్పు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. అలాగే ఎవరో తప్పు చేశారని, వాళ్లను తామే శిక్షిస్తామని కొందరు శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకుంటున్నారు. అలాంటి సందర్భాల్లో తప్పు చేసిన వారికి, చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్న వారికి మధ్య తేడా లేకుండా పోతుంది. తప్పు చేసే వారెవరైనా పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. శాంతి భద్రతలు, మత సామరస్యం కాపాడబడినప్పుడే మన పండుగలను గొప్పగా నిర్వహించుకోగలం. కొన్ని సందర్భాల్లో ఎలాంటి వసతి సౌకర్యాలు లేనప్పటికీ పోలీసులు హైదరాబాద్ నగరంలో మతసామరస్యాన్ని కాపాడటంలో ఎంతో శ్రమిస్తున్నారు. బాధితుల విషయంలో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలే తప్ప క్రిమినల్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. పోలీసు కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు విధి నిర్వహణలో ప్రమాదాలకు లోనైనప్పుడు, అమరులైనా లేదా అంగవైకల్యం చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం పెంచుతున్నాం. పోలీసు శాఖ, సిబ్బంది పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంది. పోలీసులు ఆత్మగౌరవంతో బ్రతకాలి. మరొకరు చులకనగా మాట్లాడే అవకాశం ఇవ్వొద్దు. సమాజంలో అందరికీ రక్షణ కల్పించే పోలీసుల గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. కొత్త కొత్త రూపాల్లో జరుగుతున్న నేరాలను అరికట్టడంలో గతంలో ఎస్ఐబీ, గ్రేహౌండ్స్ తరహాలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి. హోం గార్డు నుంచి డీజీపీ వరకు పోలీసు కుటుంబాల పిల్లలకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతోనే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, సైనిక్ స్కూల్ తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూలును ప్రారంభిస్తున్నాం. ఎలాంటి లోటురాకుండా పోలీసు కుటుంబాల పిల్లల భవిష్యత్తుకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతుంది.

]]>
Mon, 21 Oct 2024 20:22:04 +0530 admin
జీవితంలో రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేం : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/జీవితంలో-రిస్క్-తీసుకోకుండా-లక్ష్యాలను-సాధించలేం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/జీవితంలో-రిస్క్-తీసుకోకుండా-లక్ష్యాలను-సాధించలేం-రేవంత్-రెడ్డి జీవితంలో రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేం : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

జీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. మంచి నాయకుడిగా ఎదగాలంటే ధైర్యం, త్యాగం కీలకమైన అంశాలన్నారు. ISB నిర్వహించిన నాయకత్వ సదస్సు 2024 లో పాల్గొన్న ముఖ్యమంత్రి లీడర్ షిప్ ఇన్ న్యూ ఇండియా అంశంపై ప్రసంగించారు. హైదరబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా నిలబెట్టడంలో అందరి సహకారం కావాలని సదస్సులో కోరారు. దేశంలోని నగరాలతో కాకుండా, న్యూయార్క్, ప్యారిస్, టోక్యో , సియోల్‌ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని కోరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి  చెప్పారు. ఐఎస్బీ విద్యార్థులు హైదరాబాద్, తెలంగాణతో పాటు న్యూ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్లు అని, తెలంగాణను ట్రిలియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యసాధనలో సహకరించాలని, వెళ్లే ప్రతి చోట తెలంగాణ, హైదరాబాద్ గురించి మాట్లాడాలని సూచించారు.రాష్ట్రంలో స్కిల్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, హైదరాబాద్ నగరాన్ని దేశానికి ఒక రోల్ మాడల్ గా, గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దాలన్నదే తమ ఆలోచన అని ముఖ్యమంత్రి చెప్పారు.

]]>
Mon, 21 Oct 2024 03:10:29 +0530 admin
నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లోను తెలంగాణ పోలీసులు రాణించాలి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/నేషనల్-పోలీస్-డ్యూటీ-మీట్లోను-తెలంగాణ-పోలీసులు-రాణించాలి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/నేషనల్-పోలీస్-డ్యూటీ-మీట్లోను-తెలంగాణ-పోలీసులు-రాణించాలి-రేవంత్-రెడ్డి నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లోను తెలంగాణ పోలీసులు రాణించాలి : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, క్రైం బ్యూరో :

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారి నిర్వహించిన పోలీస్ డ్యూటీమీట్ ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాజాబహదూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ఈ వేడుకలో పోలీసులకు వారు దిశానిర్దేశం చేశారు.పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో అనుసరించాల్సిన విధి విధానాలపై రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి  ఆవిష్కరించారు. పోలీసు శాఖకు సంబంధించి వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ట్రోఫీలు అందజేశారు. మొదటి బహుమతి పొందిన టీమ్‌కు రూ. 5 లక్షలు, రెండో బహుమతికి రూ3 లక్షలు, మూడో బహుమతిగా రూ. 1.5 లక్షల నగదు అవార్డును ప్రకటించారు.క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు తెలంగాణ పోలీసు శాఖకు స్పూర్తినిచ్చే విధంగా డ్యూటీ మీట్ కార్యక్రమం నిర్వహించినందుకు ఈ సందర్భంగా ఆ శాఖను అభినందించారు.నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లో కూడా తెలంగాణ పోలీసులు రాణించాలని ఆకాంక్షించారు. అందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. దేశంలోనే మిగతా పోలీసులకు ఆదర్శంగా నిలువాలని కోరారు.సైబర్ క్రైమ్స్, మాదక ద్రవ్యాల రవాణా వంటి కొత్త పుంతలు తొక్కుతున్న నేరాలను అరికట్టడానికి పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి ఎంతో మంది త్యాగాలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు. పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు. ఇదొక భావోద్వేగం.పోలీసు కుటుంబాల కష్టం, నష్టాన్ని గమనించే అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభిస్తున్నాం.శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నందునే హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగింది.రాష్ట్రంలోకి గంజాయి లాంటి మత్తుపదార్థాలు సరిహద్దు జిల్లాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013 లో కాకినాడలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ తర్వాత తెలంగాణలో తొలిసారి డ్యూటీ మీట్ నిర్వహణకు అంగీకరించడంపై డీజీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హోం సెక్రెటరీ రవి గుప్తా, డీజీపీ జితేంద్ర, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీపీ (సీఐడీ) శిఖా గోయల్ , ఇతర ఉన్నతాధికారులు, వివిధ విభాగాల పోలీసులు పాల్గొన్నారు.

]]>
Sun, 20 Oct 2024 02:45:20 +0530 admin
ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడుతాం : రేవంత్​రెడ్డి https://prajakshethrenews.com/ఆర్థిక-మూలాలను-దెబ్బతీయాలనే-ఆర్థిక-ఉగ్రవాదుల-భరతం-పడుతాం-రేవంత్రెడ్డి https://prajakshethrenews.com/ఆర్థిక-మూలాలను-దెబ్బతీయాలనే-ఆర్థిక-ఉగ్రవాదుల-భరతం-పడుతాం-రేవంత్రెడ్డి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడుతాం : రేవంత్​రెడ్డి 

ప్రజా క్షేత్ర్ , తెలంగాణ బ్యూరో 

మురికికూపంలో మగ్గిపోతున్న నిరుపేదలకు మంచి భవిష్యత్తును అందించాలన్న లక్ష్యంతోనే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం కోసం చేపట్టిన ప్రాజెక్టు, జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన హైడ్రా వ్యవస్థ రెండు వేర్వేరని విడమరిచి చెప్పారు.  మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర సంస్మరణ కమిటీ చార్మినార్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సీఎం  పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. Rajiv Gandhi Sadbhavana అవార్డును మాజీ మంత్రి గీతారెడ్డి కి ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహూకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ... దేశ సమగ్రతను కాపడటానికి చేపట్టిన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రను స్పూర్తిగా తీసుకుని మత సామరస్యాన్ని కాపాడుకుంటూ తెలంగాణ అభివృద్ధికి ముందుకు సాగుతాం. ట్రాఫిక్ నియంత్రణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, కలుషితాలను నిలుపుదల చేయడం, ప్రభుత్వ భూముల ఆక్రమణలను నిరోధించడం వంటి ఎన్నో ప్రజాసౌలభ్యాల కోసం హైడ్రా పనిచేస్తుంది.  చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారు, 111 జీవోను ఉల్లఘించిన వారు మాత్రమే హైడ్రాను చూసి భయపడుతున్నారు. మదపుటేనుగులను అణచడానికి అంకుశం తరహాలో హైడ్రా పనిచేస్తుంది. అనుమతులున్న ఆస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సామాన్యులకు అండగా ఉంటాం.  మూసీ పునరుజ్జీవం, హైడ్రాను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. మురికికూపంలో నలిగిపోతున్న నిరుపేదలకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు కేటాయించి వారి పిల్లలకు మంచి చదువులు అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వారు వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నాం.  హైదరాబాద్ నగరంలోని బోజగుట్ట ప్రాంత వాసుల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 

]]>
Sun, 20 Oct 2024 00:25:37 +0530 admin
కొమురం భీమ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు https://prajakshethrenews.com/కొమురం-భీమ్-కు-సీఎం-రేవంత్-రెడ్డి-ఘన-నివాళులు https://prajakshethrenews.com/కొమురం-భీమ్-కు-సీఎం-రేవంత్-రెడ్డి-ఘన-నివాళులు కొమురం భీమ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

ఆదివాసీ ఆత్మగౌరవ పోరాట యోధుడు కొమురం భీమ్​ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఇతర ప్రతినిధులు ఉన్నారు.

]]>
Fri, 18 Oct 2024 02:46:49 +0530 admin
ఆదికవి వాల్మీకి సీఎం రేవంత్​ రెడ్డి ఘన నివాళులు https://prajakshethrenews.com/ఆదికవి-వాల్మీకి-సీఎం-రేవంత్-రెడ్డి-ఘన-నివాళులు https://prajakshethrenews.com/ఆదికవి-వాల్మీకి-సీఎం-రేవంత్-రెడ్డి-ఘన-నివాళులు ఆదికవి వాల్మీకి సీఎం రేవంత్​ రెడ్డి ఘన నివాళులు 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

ఆదికవి వాల్మీకి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  ఆ మహర్షి ని స్మరిస్తూ వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు వాల్మీకి మహర్షి కి పుష్పాంజలి ఘటించారు.

]]>
Fri, 18 Oct 2024 02:42:58 +0530 admin
మూసీ పునరుజ్జీవనం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/మూసీ-పునరుజ్జీవనం-చేయాలన్నది-ప్రభుత్వ-లక్ష్యం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/మూసీ-పునరుజ్జీవనం-చేయాలన్నది-ప్రభుత్వ-లక్ష్యం-రేవంత్-రెడ్డి మూసీ పునరుజ్జీవనం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం : రేవంత్ రెడ్డి

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

తెలంగాణ ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్ధేశించే కార్యాచరణలో భాగంగా మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం అయిదు ప్రముఖ సంస్థలతో కలిసిన కన్సార్షియమ్ కు పనులు అప్పగించినట్టు తెలిపారు. ఈ కన్సార్షియమ్ వచ్చే 18 నెలల్లో డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (#DPR), ప్రాజెక్టుకు కావలసిన నిధులు, నిధుల సమీకరణకు ఉన్న మార్గాలను  అధ్యయనం చేసి నివేదిస్తుందని చెప్పారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి  సచివాలయంలో మీడియా సమావేశంలో సమగ్రంగా వివరించారు. అనేక సందేహాలను నివృతి చేశారు. ప్రజల్లో అపోహలు కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. ఇది మూసీ సుందరీకరణ కాదు. ఇది మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. ఇందుకోసం ఎంపిక చేసిన కన్సార్షియమ్ లోని అయిదు కంపెనీలు భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పూర్తి చేసిన అనేక కీలకమైన ప్రాజెక్టుల వివరాలను వీడియో ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. ఈ కన్సార్షియమ్ కోసం ప్రభుత్వం 141 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. 1.50 లక్షల కోట్ల రూపాయలంటూ జరుగుతున్నది కొందరు కావాలని చేస్తున్న ప్రచారం మాత్రమేనన్నారు. ఇంకా డీపీఆర్ పూర్తి కాలేదు. ఆరు నుంచి ఆరున్నర సంవత్సరాల్లో మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా కొందరు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మురికి కూపంగా మారిన మూసీ పరీవాహక ప్రాంతంలో దుర్భర జీవితం గడుపుతున్న వారిని ఆదుకుంటాం. మూసీ పునరుజ్జీవనం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నిర్వాసితులను అక్కున చేర్చుకోవాలన్నది ప్రభుత్వ సంకల్పం. నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రతిపక్షాలు సరైన సూచనలు, సలహాలతో ముందుకు రావాలి. అవసరమైతే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రత్యామ్నాయాలపై చర్చించడానికి సిద్ధం. ఎవరైనా ఎలాంటి ప్రతిపాదనలైనా ఇవ్వొచ్చు. అపోహలు, అనుమానాలు సృష్టించి గందరగోళ పరచొద్దు. ప్రత్యామ్నాయ ప్రణాళికలతో వస్తే ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మునుషులే కాదు వారి మనసులను కూడా గెలవాలి. మూసీ పునరుజ్జీవన కోసం సంప్రదింపులే ముఖ్యం. నిర్వాసితులకు అండగా నిలవడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి అన్ని చర్యలు తీసుకుంటాం. పర్యావరణ వేత్తలు, విద్యా వేత్తలు, సంపాదకులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. బాధితులకు నష్టపరిహారం ఎంతమేరకు ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలన్న అంశాలపై బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్ష పార్టీలతో పాటు పాత్రికేయులు కూడా రాత పూర్వకంగా ప్రతిపాదనలు, సూచనలు చేయాలి. ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉంటే ముందుకు రండి. మాకు ప్రజలిచ్చిన బాధ్యతను గుర్తెరిగి పనిచేస్తున్నాం. హైడ్రాకు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ముడిపెట్టొద్దు. సలహాలు, సూచనలు ఇవ్వకుండా కేవలం ప్రజల్లో అనుమానాలు, అపోహలు కలిగించొద్దు. మూసీ గర్భంలో కొందరు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వం ఎక్కడా కూల్చివేతలకు పాల్పడలేదు. వారికి మంచి జీవితం కల్పించాలన్న ఉద్దేశంతో ఇప్పటికే 1600 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చాం. నాగరికతకు నదులకు విడదీయరాని అనుబంధం ఉంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చెరువులు, కుంటలు, నాలాలు పోయాయి. మూసీని కూడా కాలగర్భంలో కలిపి చరిత్ర హీనులుగా మిగిలిపోదామా.... ప్రభుత్వం ఒక మంచి ప్రణాళికతో ముందుకొచ్చింది. భారీ వర్షాలొచ్చినప్పుడు ముంచెత్తిన వరదలతో బెంగళూరు, చెన్నై, వయనాడ్ లాంటి నగరాలు అతలాకుతలమైన పరిస్థితులను చూశాం. ఇటీవల ఖమ్మం, విజయవాడల్లో వచ్చిన వరదలు ఎలాంటి విపత్తును సృష్టించాయో కళ్లముందే ఉదాహరణలుగా ఉన్నాయి. ఈ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా. ఈ ప్రాజెక్టు తెలంగాణలోని 4 కోట్ల ప్రజలను నిర్దేశించబోతోంది. అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టొద్దు. ఈ మీడియా సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస్, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, కన్సార్షియమ్ లోని ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

]]>
Fri, 18 Oct 2024 02:18:40 +0530 admin
ఏపీజే అబ్దుల్ కలాం చిత్ర పటానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి https://prajakshethrenews.com/ఏపీజే-అబ్దుల్-కలాం-చిత్ర-పటానికి-సీఎం-రేవంత్-రెడ్డి-పుష్పాంజలి https://prajakshethrenews.com/ఏపీజే-అబ్దుల్-కలాం-చిత్ర-పటానికి-సీఎం-రేవంత్-రెడ్డి-పుష్పాంజలి ఏపీజే అబ్దుల్ కలాం చిత్ర పటానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 

భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం  జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జూబ్లీహిల్స్ నివాసంలో వారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. మంత్రి కొండా సురేఖ , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి లు అబ్దుల్ కలాం చిత్రపటానికి నివాళులర్పించారు.

]]>
Wed, 16 Oct 2024 01:41:16 +0530 admin
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/రక్షణ-శాఖ-మంత్రి-రాజ్-నాథ్-సింగ్-కు-స్వాగతం-పలికిన-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/రక్షణ-శాఖ-మంత్రి-రాజ్-నాథ్-సింగ్-కు-స్వాగతం-పలికిన-రేవంత్-రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

వికారాబాద్ జిల్లా పూడురు మండలంలో ఇండియన్ నేవీ ఏర్పాటు చేస్తోన్న రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కి బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంలో సీఎం తోపాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. వాతావరణం అనుకూలించని కారణంగా హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పూడురు మండలంలోని కార్యక్రమ స్థలికి బయలుదేరారు.

]]>
Wed, 16 Oct 2024 01:22:56 +0530 admin
దేశ భద్రత విషయాల్లో ఎక్కడా రాజీ పడబోం : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/దేశ-భద్రత-విషయాల్లో-ఎక్కడా-రాజీ-పడబోం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/దేశ-భద్రత-విషయాల్లో-ఎక్కడా-రాజీ-పడబోం-రేవంత్-రెడ్డి దేశ భద్రత  విషయాల్లో ఎక్కడా రాజీ పడబోం : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఎక్కడా రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత నావికాదళం విఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా పూడూరు మండల ప్రాంతాన్ని వ్యూహాత్మక ప్రాంతంగా ఎంచుకుందని అన్నారు. దీనిపై రాజకీయాలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. VLF రాడార్ కేంద్రం వల్ల స్థానికులకు గానీ ఈ ప్రాంతానికి గానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు.భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజున నావికా దళం నిర్మించనున్న వీఎల్ఎఫ్ రాడార్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి , పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  ప్రాజెక్టుకు సంబంధించి పలు కీలక అంశాలను వివరించారు.రక్షణ శాఖకు హైదరాబాద్ మొదటి నుంచి వ్యూహాత్మక ప్రాంతంగా ఉంది. అనేక రక్షణ పరిశోధనా కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి.రాజకీయాల్లో సైద్ధాంతిక వైరుధ్యాలు ఉండొచ్చు. కానీ దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేయడం సరికాదు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి.ఈ ప్రాజెక్టు ఏర్పాటు నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. రక్షణ శాఖ మంత్రి అడిగిన వెంటనే మేం కార్యాచరణను ముందుకు కొనసాగించాం.దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం సంతోషకరం. ఈ ప్రాజెక్టు కారణంగా స్థానికులకు, పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదు.1990 లో తమిళనాడులో ఏర్పాటు చేసిన వీఎల్ఎఫ్ వల్ల ప్రజలకు, ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు.ఇక్కడ 400 ఏళ్ల నాటి రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. మందిరానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి.నావికా దళం ఇక్కడ ఏర్పాటు చేసే విద్యా సంస్థల అడ్మిషన్లలో స్థానికులకు మూడింట ఒకవంతు అవకాశం కల్పించాలి.ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి  మద్దతునిస్తుంది.APJ Abdul Kalam జయంతి సందర్భంగా ఈ వీఎల్ఎఫ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకోవడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్  సంతోషం వ్యక్తం చేశారు. దీని ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి  చూపిన చొరవను అభినందించారు.రక్షణ శాఖలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్స నాథ్ సింగ్  వివరించారు. నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠీ స్వాగతోపన్యాసం చేశారు.

]]>
Wed, 16 Oct 2024 01:17:19 +0530 admin
కొండా రెడ్డి పల్లి లో అభివృద్ధి పనులకు సీ ఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన https://prajakshethrenews.com/కొండా-రెడ్డి-పల్లి-లో-అభివృద్ధి-పనులకు-సీ-ఎం-రేవంత్-రెడ్డి-శంకుస్థాపన https://prajakshethrenews.com/కొండా-రెడ్డి-పల్లి-లో-అభివృద్ధి-పనులకు-సీ-ఎం-రేవంత్-రెడ్డి-శంకుస్థాపన కొండా రెడ్డి పల్లి లో అభివృద్ధి పనులకు సీ ఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

దసరా పండుగ శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండారెడ్డిపల్లికి చేరుకున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది. డప్పు దరువులు, కోలాటాలు, పూల జల్లులతో గ్రామస్తులు పెద్దఎత్తున హాజరై స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామంలో రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను నాటారు.రూ. 55 లక్షలు వెచ్చించి అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన మోడల్ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు.రూ. 18 లక్షల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.18 కోట్లతో చేపట్టే భూగర్భ మురుగు నీటి పైప్ లైన్ నిర్మాణం, మురుగునీటి శుద్ధి కేంద్రం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.రూ. 64 లక్షలతో అత్యాధునిక ప్రయాణ ప్రాంగణ నిర్మాణం, ప్రధాన రహదారి గుండా విద్యుత్ దీపాలంకరణ పనులకు శంకుస్థాపన చేశారు.రూ. 32 లక్షల వ్యయంతో చిల్డ్రన్స్ పార్క్, వ్యాయామశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.రూ.70 లక్షలతో అధునాతన సదుపాయాలతో కమ్యూనిటీ భవనం, ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి వెంట నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

]]>
Mon, 14 Oct 2024 12:43:05 +0530 admin
కొండారెడ్డిపల్లి దసరా వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/కొండారెడ్డిపల్లి-దసరా-వేడుకల్లో-పాల్గొన్న-సీఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/కొండారెడ్డిపల్లి-దసరా-వేడుకల్లో-పాల్గొన్న-సీఎం-రేవంత్-రెడ్డి కొండారెడ్డిపల్లి దసరా వేడుకల్లో పాల్గొన్న సీఎం  రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

కొండారెడ్డిపల్లి గ్రామస్తుల ఆనందోత్సాహాల మధ్య శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగ జరుపుకున్నారు. గ్రామస్తులంతా ఊరేగింపుగా జమ్మి చెట్టువద్దకు రాగా ముఖ్యమంత్రి  ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జమ్మి పూజలో పాల్గొన్నారు. అంతకు ముందు వారు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

]]>
Mon, 14 Oct 2024 12:38:22 +0530 admin
తెలంగాణ సంస్కృతి నలు దిశలా వ్యాపించచేయడానికి అలయ్ బలయ్' గొప్ప వేదిక https://prajakshethrenews.com/తెలంగాణ-సంస్కృతి-నలు-దిశలా-వ్యాపించచేయడానికి-అలయ్-బలయ్-గొప్ప-వేదిక https://prajakshethrenews.com/తెలంగాణ-సంస్కృతి-నలు-దిశలా-వ్యాపించచేయడానికి-అలయ్-బలయ్-గొప్ప-వేదిక తెలంగాణ సంస్కృతి నలు దిశలా వ్యాపించచేయడానికి అలయ్ బలయ్' గొప్ప వేదిక

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

తెలంగాణ సంస్కృతి నలు దిశలా వ్యాపించడానికి, మనమంతా ఒక్కటే అనే సందేశం ఇయ్యడానికి 'అలయ్ బలయ్' గొప్ప వేదిక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాడు రాష్ట్ర సాధన కోసం పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు, సకల జనులు ఉద్యమంలో కార్యోన్ముఖులు కావడానికి కూడా అలయ్ బలయ్ ఒక కారణమని గుర్తుచేశారు. తెలంగాణలో పెద్ద పండుగ దసరా సందర్భంగా రాజకీయాలకు అతీతంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.గత 19 ఏండ్లుగా ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను పునరుద్దరించడానికి వారు ప్రయత్నిస్తున్నారు.తెలంగాణ ప్రజలకు అతి పెద్ద పండుగ దసరా అంటే పాలపిట్ట, జమ్మి చెట్టు గుర్తుకు వస్తాయి. అలాగే అలయ్ బలయ్ అంటే బండారు దత్తాత్రేయ  గుర్తుకొస్తారు. దత్తాత్రేయ వారసురాలిగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్న  బండారు విజయలక్ష్మికి అభినందనలు. ప్రజా ప్రభుత్వం, పార్టీ పెద్దలంతా అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తెలంగాణ సంప్రదాయాలు కాపాడుకోవడం మన బాధ్యత అని చాటి చెప్పాం.ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తో పాటు ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, మేఘాలయ గవర్నర్ విజయ్ శంకర్, రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ కిషన్‌రావ్ బాగ్డే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇతర తదితరులు పాల్గొన్నారు.

]]>
Mon, 14 Oct 2024 12:35:31 +0530 admin
ఏక సభ్య న్యాయ కమిషన్ చైర్మన్ గా తెలంగాణ హైకోర్టు మాజీ జడ్జి డాక్టర్ జస్టిస్ షహీమ్ అఖ్తర్ నియామకం https://prajakshethrenews.com/ఏక-సభ్య-న్యాయ-కమిషన్-చైర్మన్-గా-తెలంగాణ-హైకోర్టు-మాజీ-జడ్జి-డాక్టర్-జస్టిస్-షహీమ్-అఖ్తర్-నియామకం https://prajakshethrenews.com/ఏక-సభ్య-న్యాయ-కమిషన్-చైర్మన్-గా-తెలంగాణ-హైకోర్టు-మాజీ-జడ్జి-డాక్టర్-జస్టిస్-షహీమ్-అఖ్తర్-నియామకం ఏక సభ్య న్యాయ కమిషన్ చైర్మన్ గా తెలంగాణ హైకోర్టు మాజీ జడ్జి డాక్టర్ జస్టిస్ షహీమ్ అఖ్తర్ నియామకం 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసం ఏర్పాటైన ఏక సభ్య న్యాయ కమిషన్ చైర్మన్ గా తెలంగాణ హైకోర్టు మాజీ జడ్జి డాక్టర్ జస్టిస్ షహీమ్ అఖ్తర్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో ఎలాంటి చిక్కులు తలెత్తకుండా జస్టిస్ షహీమ్ అఖ్తర్ కమిషన్‌ వచ్చే 60 రోజుల్లోగా సమగ్ర అధ్యయనం పూర్తి చేయాల్సిఉంది. రెండు రోజుల కిందట ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు తక్షణం హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య న్యాయ కమిషన్‌ను నియమించాలని, 24 గంటల్లోగా కమిషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం తెలిసిందే.

]]>
Sat, 12 Oct 2024 03:20:01 +0530 admin
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం https://prajakshethrenews.com/యంగ్-ఇండియా-స్కిల్స్-యూనివర్సిటీ-yisu-అడ్మిషన్ల-ప్రక్రియ-ప్రారంభం https://prajakshethrenews.com/యంగ్-ఇండియా-స్కిల్స్-యూనివర్సిటీ-yisu-అడ్మిషన్ల-ప్రక్రియ-ప్రారంభం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది దసరా పండుగ నుంచే స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా కొన్ని కోర్సులకు యూనివర్సిటీ అడ్మిషన్స్ నోటిఫికేషన్ జారీచేసింది.తొలి విడతగా యూనివర్సిటీ ప్రాథమికంగా మూడు స్కూల్స్‌ను, వాటిల్లో నాలుగు కోర్సులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్‌కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్‌ను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తోంది. వీటిల్లో లాజిస్టిక్స్ అండ్ ఈ -కామర్స్ స్కూల్ కింద వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్సయినర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు, హెల్త్‌కేర్‌లో భాగంగా ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ కింద ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కోర్సుల్లో చేరాలనుకునే అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 29 లోగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ (https://yisu.in/)  ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ తెలిపింది. నవంబర్ 4 వ తేదీ నుంచి ఈ కోర్సులు ప్రారంభమవుతాయి. తాత్కాలికంగా హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ESCI) నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) క్యాంపస్‌లలో ఈ కోర్సులను నిర్వహిస్తారు.

]]>
Sat, 12 Oct 2024 03:16:10 +0530 admin
ఇంటిగ్రేటెడెట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన https://prajakshethrenews.com/ఇంటిగ్రేటెడెట్-రెసిడెన్షియల్-స్కూల్-నిర్మాణానికి-ముఖ్యమంత్రి-శంకుస్థాపన https://prajakshethrenews.com/ఇంటిగ్రేటెడెట్-రెసిడెన్షియల్-స్కూల్-నిర్మాణానికి-ముఖ్యమంత్రి-శంకుస్థాపన ఇంటిగ్రేటెడెట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి  శంకుస్థాపన

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

తండాలు, మారుమూల పల్లెలు, బస్తీల్లో నివసించే నిరుపేదలకు మంచి వైద్యం, నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. నిరుపేదలను విద్యకు దూరం చేయకూడదన్న ఆలోచనతో చాలా మంది మేధావులు, సామాజిక తత్వవేత్తలతో చర్చించిన మీదట యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.దసరా పండుగ శుభ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గ్‌లో ఇంటిగ్రేటెడెట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదిక నుంచి మాట్లాడుతూ ఆ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వేర్వేరు చోట్ల విద్యా బోధన వల్ల ఈ వ్యవస్థ మమ్మల్ని దూరం పెడుతుందన్న  భావన విద్యార్థుల్లో కలిగే ప్రమాదం ఉంది. అలాంటి భావన సమాజానికి, దేశానికి మంచిది కాదు. అందుకే పాతిక ఎకరాల్లో ఒకే క్యాంపస్‌లో అందరూ కలిసిమెలిసి ఒక సోదర భావంతో చదువుకుని రాణించాలన్న సంకల్పంతో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం.నిరుపేదలకు అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు  కల్పించడానికి ఒక్కోచోట 120 నుంచి 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ క్యాంపస్‌లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఒక్కో రెసిడెన్షియల్ స్కూల్‌లో దాదాపు 2500 మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుకుని, భవిష్యత్తులో వారంతా ఉన్నతస్థాయికి ఎదగాలని, తద్వారా వారు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.నిరుపేదలను విద్యకు దూరం చేస్తే ఈ దేశ సంపదకే తీవ్ర నష్టం చేసిన వారమవుతాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో దాదాపు 5 వేల పాఠశాలలు మూసివేయబడ్డాయి. తద్వారా ముఖ్యంగా దళితులు, గిరిజనులు విద్యకు దూరమయ్యే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి.పేదల కోసం పనిచేసే అధికారులను తప్పనిసరిగా ప్రభుత్వం, ప్రజలు ఎప్పుడూ అభినందిస్తారు. విద్యా ప్రమాణాలను పెంచాలన్న లక్ష్యంతోనే సుదీర్ఘ కాలంగా ప్రమోషన్లు లేక ఆందోళనకు గురవుతున్న సందర్భంలో రాష్ట్రంలో 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించడమే కాకుండా ఎక్కడా వివాదాలకు తావులేకుండా 34 వేల మంది టీచర్లను బదిలీలు చేశాం.ఈ శంకుస్థాపన కార్యక్రమలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి  ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు."భగవంతుడు ప్రజలకు సుఖశాంతులు కలిగించాలి. పాడిపంటలు ఇవ్వాలని, పిల్లలకు మంచి చదువులు, ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.

]]>
Sat, 12 Oct 2024 03:07:34 +0530 admin
శ్రీ మహిషాసుర మర్దని దేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ మహంకాళి అమ్మవారు. https://prajakshethrenews.com/శ్రీ-మహిషాసుర-మర్దని-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-మహంకాళి-అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-మహిషాసుర-మర్దని-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-మహంకాళి-అమ్మవారు దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర మర్దని దేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ మహంకాళి అమ్మవారు.

]]>
Fri, 11 Oct 2024 21:24:08 +0530 admin
శ్రీ దుర్గా దేవి అలంకారంలో దర్శనమిచ్చిన మీరాలం మండి శ్రీ మహంకాళి అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-దుర్గా-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-మీరాలం-మండి-శ్రీ-మహంకాళి-అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-దుర్గా-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-మీరాలం-మండి-శ్రీ-మహంకాళి-అమ్మవారు దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదివ రోజు శ్రీ దుర్గా దేవి అలంకారంలో దర్శనమిచ్చిన మీరాలం మండి శ్రీ మహంకాళి అమ్మవారు

]]>
Fri, 11 Oct 2024 13:00:12 +0530 admin
అలయ్ బలయ్ లో పాల్గొనాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం https://prajakshethrenews.com/అలయ్-బలయ్-లో-పాల్గొనాలని-ముఖ్యమంత్రికి-ఆహ్వానం https://prajakshethrenews.com/అలయ్-బలయ్-లో-పాల్గొనాలని-ముఖ్యమంత్రికి-ఆహ్వానం అలయ్ బలయ్ లో పాల్గొనాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం 

ఈ నెల 13 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు. వారు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

]]>
Fri, 11 Oct 2024 04:00:32 +0530 admin
ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం నేతలు https://prajakshethrenews.com/ముఖ్యమంత్రి-నిర్ణయం-పట్ల-హర్షం-వ్యక్తం-చేస్తున్న-బీసీ-సంక్షేమ-సంఘం-నేతలు https://prajakshethrenews.com/ముఖ్యమంత్రి-నిర్ణయం-పట్ల-హర్షం-వ్యక్తం-చేస్తున్న-బీసీ-సంక్షేమ-సంఘం-నేతలు ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం నేతలు 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సంఘం నాయకులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని కలిసి ప్రభుత్వ నిర్ణయంపై వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు తో పాటు పలువురు బీసీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు.

]]>
Fri, 11 Oct 2024 03:57:59 +0530 admin
ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిని సారించండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/ఆదాయ-పెంపు-మార్గాలపై-దృష్టిని-సారించండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ఆదాయ-పెంపు-మార్గాలపై-దృష్టిని-సారించండి-రేవంత్-రెడ్డి ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిని సారించండి : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిని సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదాయం సమకూర్చే శాఖల లక్ష్యాలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. వార్షిక లక్ష్యాలను చేరుకోవడంలో శాఖల పనితీరును మెరుగుపరుచుకోవాలని చెప్పారు. సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

]]>
Fri, 11 Oct 2024 03:41:37 +0530 admin
రాడార్ ప్రాజెక్ట్ పనుల శంకుస్థాపనకు హాజరు కావాలని సీ ఎం రేవంత్ రెడ్డికి వినతి https://prajakshethrenews.com/రాడార్-ప్రాజెక్ట్-పనుల-శంకుస్థాపనకు-హాజరు-కావాలని-సీ-ఎం-రేవంత్-రెడ్డికి-వినతి https://prajakshethrenews.com/రాడార్-ప్రాజెక్ట్-పనుల-శంకుస్థాపనకు-హాజరు-కావాలని-సీ-ఎం-రేవంత్-రెడ్డికి-వినతి రాడార్ ప్రాజెక్ట్ పనుల శంకుస్థాపనకు హాజరు కావాలని సీ ఎం రేవంత్ రెడ్డికి వినతి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

దేశ రక్షణలో కీలక భూమిక పోషించే భారత నావికాదళం (Indian Navy) వికారాబాద్ జిల్లా దామగుండంలో నిర్మించ తలపెట్టిన రాడార్ ప్రాజెక్ట్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆహ్వానం అందించారు. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి , దామగుండం రాడార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీర్ సింగ్, నేవీ ఉన్నతాధికారులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈనెల 15న పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్టు పనుల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.

]]>
Fri, 11 Oct 2024 03:37:28 +0530 admin
శ్రీ దుర్గా దేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-దుర్గా-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-శ్రీ-మహంకాళి-అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-దుర్గా-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-శ్రీ-మహంకాళి-అమ్మవారు దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదివ రోజు శ్రీ దుర్గా దేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారు

]]>
Fri, 11 Oct 2024 02:53:31 +0530 admin
శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ జమ్మి చెట్టు దుర్గా మాత https://prajakshethrenews.com/శ్రీ-దుర్గాదేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-జమ్మి-చెట్టు-దుర్గా-మాత https://prajakshethrenews.com/శ్రీ-దుర్గాదేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-జమ్మి-చెట్టు-దుర్గా-మాత శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ జమ్మి చెట్టు దుర్గా మాత

]]>
Fri, 11 Oct 2024 02:47:58 +0530 admin
తెలంగాణ లో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు, బీసీ కులగణన పూర్తి చేయడానికి స్పష్టమైన చర్యలు తీసుకోండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/తెలంగాణ-లో-ఎస్సీ-వర్గీకరణపై-సుప్రీంకోర్టు-తీర్పు-అమలు-బీసీ-కులగణన-పూర్తి-చేయడానికి-స్పష్టమైన-చర్యలు-తీసుకోండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/తెలంగాణ-లో-ఎస్సీ-వర్గీకరణపై-సుప్రీంకోర్టు-తీర్పు-అమలు-బీసీ-కులగణన-పూర్తి-చేయడానికి-స్పష్టమైన-చర్యలు-తీసుకోండి-రేవంత్-రెడ్డి తెలంగాణ లో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు, బీసీ కులగణన పూర్తి చేయడానికి స్పష్టమైన చర్యలు తీసుకోండి : రేవంత్ రెడ్డి 

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు, బీసీ కులగణన పూర్తి చేయడానికి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో ఎలాంటి చిక్కులు తలెత్తకుండా ఏక సభ్య న్యాయ కమిషన్‌ ద్వారా వచ్చే 60 రోజుల్లోగా సమగ్ర అధ్యయనం పూర్తి చేయించాలని చెప్పారు.సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీ కులగణన అంశాలపై మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , ధనసరి అనసూయ సీతక్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు తక్షణం హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య న్యాయ కమిషన్‌ను నియమించాలని, అంతేకాకుండా 24 గంటల్లోగా కమిషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.నిర్దేశించిన రెండు నెలల గడువులోగా కమిషన్ తన రిపోర్టు సమర్పించాలంటూ పలు సూచనలు చేశారు.2011 తర్వాత జన గణన జరగని కారణంగా 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా అధ్యయనం జరగాలి. క్షేత్రస్థాయి విజ్ఞాపనలు, ఫిర్యాదుల కోసం కమిషన్ జిల్లాల్లో పర్యటించాలి.ఏకసభ్య న్యాయ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి.తెలంగాణ‌లో బీసీ సామాజిక‌, ఆర్థిక, కుల స‌ర్వే ప్ర‌క్రియ‌ను త‌క్ష‌ణ‌మే ప్రారంభించాలి. బీసీ క‌మిష‌న్‌కు తక్షణం అవసరమైన యంత్రాంగం సమకూర్చాలి. 60 రోజుల్లోగా సామాజిక‌, ఆర్థిక స‌ర్వే పూర్తి చేసి డిసెంబ‌రు 9 లోపు నివేదిక స‌మ‌ర్పించాలి. ఈ స‌ర్వే పూర్త‌యితే వెంట‌నే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లకు వెళ్లాలి.

]]>
Thu, 10 Oct 2024 04:41:36 +0530 admin
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నామని గర్వంగా చెప్పుకునే రోజులు తెలంగాణలో రావాలి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/ప్రభుత్వ-పాఠశాలల్లో-చదివిస్తున్నామని-గర్వంగా-చెప్పుకునే-రోజులు-తెలంగాణలో-రావాలి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ప్రభుత్వ-పాఠశాలల్లో-చదివిస్తున్నామని-గర్వంగా-చెప్పుకునే-రోజులు-తెలంగాణలో-రావాలి-రేవంత్-రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నామని గర్వంగా చెప్పుకునే రోజులు తెలంగాణలో రావాలి : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నామని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజులు తెలంగాణలో రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులంతా భవిష్యత్తు తరాలకు నిర్మాతలుగా అంకితభావంతో పని చేయాలని కోరారు.ఎల్బీ స్టేడియం వేదికగా DSC2024 రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , ఇతర మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందించారు.భారత దేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ లాంటి ఎందరో మహామహులను తీర్చిదిద్దినవి  ప్రభుత్వ పాఠశాలలేనని ఈ సందర్బంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని చెబుతూ, ఈ సందర్భంగా సీఎంగారు ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు.“విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం, పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసంతో బాధ్యతాయుతమైన భావి పౌరువులుగా తీర్చిదిద్దేందుకు ఎప్పటికప్పుడు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ మానవీయ విలువలతో మెలిగే భవ్య సమాజ నిర్మాణంలో నావంతు పాత్ర నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను” అని డీఎస్సీ ఎంపికైన అభ్యర్థులు ప్రతినబూనారు.ప్రభుత్వ పాఠాశాల ప్రాధాన్యతను గుర్తించే ఇచ్చిన మాట ప్రకారం మీ కుటుంబాల్లో దసరా పండుగ సంతోషాలు నింపాలని నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోగా నియామకాలు పూర్తి చేశాం.ప్రభుత్వ రంగంలోని 30 వేల పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులుంటే, ప్రైవేటు రంగంలో 10 వేల పాఠశాలల్లో ఏకంగా 34 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలంటేనే నమోషీగా భావిస్తున్న పరిస్థితిపై అందరూ ఆలోచించాలి.ప్రభుత్వ పాఠశాలల్లో చదివామని గర్వంగా చెప్పుకునేలా ప్రైవేటు సంస్థలతో పోటీ పడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నాం.తొలిదశలో 5 వేల కోట్లు వెచ్చించి, 25 నియోజకవర్గాల్లో సకల వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్‌కు ఈనెల 11న శంకుస్థాపన చేయబోతున్నాం.నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతోనే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి గారి సారథ్యంలోని విద్యా కమిషన్ చేసే సూచనలను ఎప్పటికప్పుడు అమలు చేస్తాం.ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యం ప్రదర్శించిన బదిలీలు, ప్రమోషన్ల సమస్యను పరిష్కరించాం. ఎక్కడా చిన్న వివాదం లేకుండా 34 వేల మంది టీచర్లకు బదిలీలు చేయడంతో పాటు 21 వేల మందికి ప్రమోషన్లు కల్పించాం.తెలంగాణ భావితరాలను అద్భుతమైన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత యువతరం టీచర్లదే. ఆ టీచర్లకు కావాల్సినవన్నీ సమకూర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది.యువత మాదకద్రవ్యాలకు, వ్యసనాలకు బానిసలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

]]>
Thu, 10 Oct 2024 04:36:18 +0530 admin
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతి : దిగ్ర్భాంతి కి గురైన రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/ప్రముఖ-పారిశ్రామిక-వేత్త-రతన్-టాటా-మృతి-దిగ్ర్భాంతి-కి-గురైన-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ప్రముఖ-పారిశ్రామిక-వేత్త-రతన్-టాటా-మృతి-దిగ్ర్భాంతి-కి-గురైన-రేవంత్-రెడ్డి ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతి :  దిగ్ర్భాంతి కి గురైన రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మృతి చెందారు. రతన్ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటు అని అన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు. పద్మవిభూషణ్ సహా అనేక గౌరవ పురస్కారాలు అందుకున్న రతన్ టాటా  ఇక మన మధ్య లేకపోవడం బాధకరమన్నారు. టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా వారు ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని గుర్తుచేశారు. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.

]]>
Thu, 10 Oct 2024 04:30:01 +0530 admin
శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన జమ్మిచెట్టు దుర్గా మాత అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-సరస్వతీ-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-జమ్మిచెట్టు-దుర్గా-మాత-అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-సరస్వతీ-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-జమ్మిచెట్టు-దుర్గా-మాత-అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన జమ్మిచెట్టు దుర్గా మాత అమ్మవారు

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన జమ్మిచెట్టు దుర్గా మాత అమ్మవారు

]]>
Thu, 10 Oct 2024 00:13:51 +0530 admin
శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-సరస్వతి-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-శ్రీ-మహంకాళి-అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-సరస్వతి-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-శ్రీ-మహంకాళి-అమ్మవారు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారు 

]]>
Wed, 09 Oct 2024 17:06:56 +0530 admin
శ్రీలలితా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన మీరాలం మండి అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీలలితా-త్రిపుర-సుందరి-అలంకారంలో-భక్తులకు-దర్శనమిచ్చిన-మీరాలం-మండి-అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీలలితా-త్రిపుర-సుందరి-అలంకారంలో-భక్తులకు-దర్శనమిచ్చిన-మీరాలం-మండి-అమ్మవారు శ్రీలలితా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన మీరాలం మండి అమ్మవారు

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్​ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో  శ్రీలలితా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన మీరాలం మండి అమ్మవారు

]]>
Tue, 08 Oct 2024 14:04:49 +0530 admin
ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు https://prajakshethrenews.com/ఉప్పుగూడ-శ్రీ-మహంకాళి-అమ్మవారికి-ప్రత్యేక-పూజలు https://prajakshethrenews.com/ఉప్పుగూడ-శ్రీ-మహంకాళి-అమ్మవారికి-ప్రత్యేక-పూజలు ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు 

ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్​ మధుసూధన్​ గౌడ్​ దంపతులు.

]]>
Tue, 08 Oct 2024 13:54:57 +0530 admin
శ్రీ మహాఛండీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ మహంకాళి అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-మహాఛండీ-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-మహంకాళి-అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-మహాఛండీ-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-మహంకాళి-అమ్మవారు శ్రీ మహాఛండీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ మహంకాళి అమ్మవారు

దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ జనగామ మధుసూధన్​గౌడ్​ ఆధ్వర్యంలో శ్రీ మహాఛండీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ మహంకాళి అమ్మవారు

]]>
Tue, 08 Oct 2024 13:49:55 +0530 admin
శ్రీ మహాచండీ దేవి అలంకారంలో జమ్మిచెట్టు దుర్గామాత అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-మహాచండీ-దేవి-అలంకారంలో-జమ్మిచెట్టు-దుర్గామాత-అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-మహాచండీ-దేవి-అలంకారంలో-జమ్మిచెట్టు-దుర్గామాత-అమ్మవారు  శ్రీ మహాచండీ దేవి అలంకారంలో జమ్మిచెట్టు దుర్గామాత అమ్మవారు

దేవిశరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 5వ రోజు శ్రీ మహాచండీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన జమ్మిచెట్టు దుర్గామాత అమ్మవారు

]]>
Tue, 08 Oct 2024 13:46:47 +0530 admin
కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కలిసిన రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/కేంద్ర-మంత్రి-మనోహర్-లాల్-ఖట్టర్-ని-కలిసిన-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/కేంద్ర-మంత్రి-మనోహర్-లాల్-ఖట్టర్-ని-కలిసిన-రేవంత్-రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కలిసి రాష్ట్రానికి చెందిన కీలకమైన ప్రాజెక్టులపై చర్చించారు. హైద‌రాబాద్ స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్ట‌ర్ ప్లాన్ (CSMP), మూసీ సహా  సివరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం, మెట్రో రైలు విస్తరణకు సంబంధించి ప్రాజెక్టులపై రాష్ట్రానికి సహకరించాలని కోరారు. సీసీఎంపీని అమృత్ 2.0 లో చేర్చాల‌ని లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టుగా చేప‌ట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. చారిత్ర‌క హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏళ్లనాటి మురుగు శుద్ధి వ్య‌వ‌స్థ‌నే ఉంద‌ని, ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు ఆ వ్యవస్థ ఏమాత్రం త‌గిన‌ట్లుగా లేద‌ని వివ‌రించారు. శివారు పుర‌పాల‌క సంఘాల్లోనూ స‌రైన మురుగు నీటి పారుద‌ల వ్య‌వ‌స్థ లేదని తెలిపారు. సివరేజీ మాస్టర్ ప్లాన్ లో భాగంగా హైద‌రాబాద్‌తో పాటు శివారు 27 పుర‌పాల‌క సంఘాల‌ను క‌లుపుకొని 7,444 కి.మీ. మేర రూ.17,212.69 కోట్ల‌తో రూపొందించిన డీపీఆర్‌ను కేంద్ర మంత్రికి అంద‌జేశారు. మూసీలో మురుగునీరు చేర‌కుండా ఉండేందుకు ట్రంక్ సీవ‌ర్స్ మెయిన్స్‌, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవ‌రేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ. 4 వేల కోట్ల‌తో రూపొందించిన మరో డీపీఆర్ ను కేంద్ర మంత్రికి స‌మ‌ర్పించారు.హైద‌రాబాద్ మెట్రో రెండో ద‌శలో నాగోల్ - శంషాబాద్ రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం (36.8 కి.మీ.), రాయ‌దుర్గం - కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్‌ - చాంద్రాయ‌ణ‌గుట్ట (7.5 కి.మీ.), మియాపూర్‌ - ప‌టాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ న‌గ‌ర్‌-హ‌య‌త్ న‌గ‌ర్ (7.1 కి.మీ.) మొత్తం 76.4 కి.మీ. మేర విస్తరణకు సహకరించాలని కేంద్ర మంత్రి కి కోరారు.ఈ కారిడార్ల నిర్మాణ అంచనా వ్యయం రూ. 24,269 లో కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వం 50:50 నిష్పత్తిలో జాయింట్ వెంచ‌ర్‌గా చేప‌ట్టాల‌ని కోరారు. దీనిపై త్వరలోనే డీపీఆర్‌ను స‌మ‌ర్పిస్తామ‌ని చెప్పారు.కేంద్ర మంత్రి ఖట్టర్  భేటీలో సీఎం వెంట ఎంపీలు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ , చామల కిరణ్ కుమార్ రెడ్డి , ఢిల్లీలో తెలంగాణ‌ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏపీ జితేంద‌ర్ రెడ్డి , ప్ర‌భుత్వ స‌ల‌హాదారు శ్రీ‌నివాస‌రాజు , ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

]]>
Tue, 08 Oct 2024 02:38:18 +0530 admin
శ్రీ అన్న పూర్ణాదేవి అలంకారంలో l భక్తులకు దర్శనమిచ్చిన ఉప్పుగూడ మహంకాళి అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-అన్న-పూర్ణాదేవి-అలంకారంలో-l-భక్తులకు-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-మహంకాళి-అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-అన్న-పూర్ణాదేవి-అలంకారంలో-l-భక్తులకు-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-మహంకాళి-అమ్మవారు శ్రీ అన్న పూర్ణాదేవి అలంకారంలో l భక్తులకు దర్శనమిచ్చిన ఉప్పుగూడ మహంకాళి అమ్మవారు

దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ జనగామ మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ అన్న పూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన ఉప్పుగూడ మహంకాళి అమ్మవారు

]]>
Sun, 06 Oct 2024 13:55:16 +0530 admin
మూసీ నిర్వాసితులందరికి ప్రత్యామ్నాయం కల్పిస్తాం : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/మూసీ-నిర్వాసితులందరికి-ప్రత్యామ్నాయం-కల్పిస్తాం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/మూసీ-నిర్వాసితులందరికి-ప్రత్యామ్నాయం-కల్పిస్తాం-రేవంత్-రెడ్డి మూసీ నిర్వాసితులందరికి ప్రత్యామ్నాయం కల్పిస్తాం : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

మూసీ పరీవాహక ప్రాంత నిరుపేదలెవరూ నిరాశ్రయులు కాబోరని, వారందరికీ ప్రత్యామ్నాయం కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్న వారందరికీ మంచి ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. ఈ విషయంలో కొందరు రెచ్చగొటే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని అన్నారు. గడ్డం వెంకటస్వామి (కాకా)  95 వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి  ప్రసంగించారు. వెంకటస్వామి ని స్పూర్తిగా తీసుకుని నిరుపేదలందరికీ ఒక మంచి జీవితాన్ని, మంచి వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.మూసీ పక్కన మగ్గుతున్న నిరుపేదల కోసం ఈ ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొస్తోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీనిచ్చారు.హైదరాబాద్ నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నగరంలో 12 నుంచి 14 వందల ఫీట్ల లోతుల్లోకి బోరు వేస్తే తప్ప నీళ్లు పడే పరిస్థితి లేదని చెప్పారు. మూసీ కాలుష్యం కారణంగా నల్గొండ ప్రజలు విషాన్ని దిగమింగుకుని బతుకుతున్నారు. నిరుపేదలను ఆదుకోవడానికి ప్రతిపక్ష నేతల సూచనలు కూడా తీసుకోవడానకి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి, హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ముఖ్యమంత్రి సూచించారు.ఆనాడు వెంకటస్వామి  వేలాది మంది పేదలకు గూడు కల్పించారు. సింగరేణి మూతపడే దశకు చేరుకున్న దశలో దాన్ని కాపాడటానికి ఎంతో కృషి చేశారు.మహనీయుడు వెంకటస్వామి  ఆకాంక్షించినట్టు తమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి ఆదిలాబాద్ కు నీరందిస్తాం. అభివృద్ధిలో ఆదిలాబాద్ తో పాటు పెద్దపల్లి జిల్లాకు ప్రాధాన్యతనిస్తామని చెప్పారు.ప్రజా ప్రభుత్వం కాకాను సమున్నతంగా గౌరవిస్తూ వారి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ , అనిల్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, కేఆర్ నాగరాజు , మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ , సీపీఐ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

]]>
Sun, 06 Oct 2024 03:27:49 +0530 admin
సీఎం రేవంత్ చొరవతో స్వదేశానికి చేరుకున్న ఎడారి ఒంటెల కాపరి రాథోడ్ https://prajakshethrenews.com/సీఎం-రేవంత్-చొరవతో-స్వదేశానికి-చేరుకున్న-ఎడారి-ఒంటెల-కాపరి-రాథోడ్ https://prajakshethrenews.com/సీఎం-రేవంత్-చొరవతో-స్వదేశానికి-చేరుకున్న-ఎడారి-ఒంటెల-కాపరి-రాథోడ్ సీఎం రేవంత్  చొరవతో స్వదేశానికి చేరుకున్న ఎడారి ఒంటెల కాపరి రాథోడ్ 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

కువైట్ - సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా చిత్రహింసలకు గురై రాష్ట్ర ప్రభుత్వ చొరవతో స్వదేశానికి చేరుకున్న నిర్మల్ జిల్లావాసి రాథోడ్ నాందేవ్ , వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. తన వేదనను తెలియజేస్తూ నాందేవ్ పంపిన వీడియోపై స్పందించిన ముఖ్యమంత్రి  అతడిని తిరిగి దేశం కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఢిల్లీలోని విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తూ కువైట్, సౌదీ అరేబియా రెండు దేశాల్లోని భారతీయ ఎంబసీలతో సంప్రదింపులు జరిపి నాందేవ్‌ను స్వదేశానికి చేరుకునేలా చొరవ తీసుకున్నారు.హైదరాబాద్‌కు క్షేమంగా చేరుకున్న నాందేవ్‌ తన  కుటుంబ సభ్యులతో వచ్చి సీఎంని కలిశారు. ఈ సందర్భంగా మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి, కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు, స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్‌ తదితరులు ఉన్నారు.

]]>
Sun, 06 Oct 2024 03:20:32 +0530 admin
శ్రీ అన్న పూర్ణాదేవి అవతారంలో ఉప్పుగూడ మహంకాళి మాత https://prajakshethrenews.com/శ్రీ-అన్న-పూర్ణాదేవి-అవతారంలో-ఉప్పుగూడ-మహంకాళి-మాత https://prajakshethrenews.com/శ్రీ-అన్న-పూర్ణాదేవి-అవతారంలో-ఉప్పుగూడ-మహంకాళి-మాత దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ జనగామ మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ అన్న పూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన ఉప్పుగూడ మహంకాళి అమ్మవారు

]]>
Sat, 05 Oct 2024 21:14:41 +0530 admin
శ్రీ గాయత్రి అలంకారంలో ఉప్పుగూడ మహంకాళి అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-గాయత్రి-అలంకారంలో-ఉప్పుగూడ-మహంకాళి-అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-గాయత్రి-అలంకారంలో-ఉప్పుగూడ-మహంకాళి-అమ్మవారు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్​ జనగామ మధుసూధన్​ గౌడ్​ ఆధ్వర్యంలో రెండవ రోజు శ్రీ గాయత్రి అలంకారంలో ఉప్పుగూడ మహంకాళి అమ్మవారు 

]]>
Sat, 05 Oct 2024 21:09:56 +0530 admin
గాయత్రీదేవి అలంకారంలో జమ్మిచెట్టు దర్గామాత అమ్మవారు https://prajakshethrenews.com/గాయత్రీదేవి-అలంకారంలో-జమ్మిచెట్టు-దర్గామాత-అమ్మవారు https://prajakshethrenews.com/గాయత్రీదేవి-అలంకారంలో-జమ్మిచెట్టు-దర్గామాత-అమ్మవారు దేవి శరన్నవరాత్ర ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు గాయత్రీదేవి అలంకారంలో దర్శనం ఇచ్చిన ఉప్పుగూడ జమ్మిచెట్టు దర్గామాత అమ్మవారు 

]]>
Sat, 05 Oct 2024 21:04:54 +0530 admin
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం తయారుచేయండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/అంతర్జాతీయ-స్థాయిలో-తెలంగాణకు-గుర్తింపు-తెచ్చేలా-కొత్త-క్రీడా-విధానం-తయారుచేయండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/అంతర్జాతీయ-స్థాయిలో-తెలంగాణకు-గుర్తింపు-తెచ్చేలా-కొత్త-క్రీడా-విధానం-తయారుచేయండి-రేవంత్-రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం తయారుచేయండి : రేవంత్ రెడ్డి 

ప్రజాక్షత్ర్, తెలంగాణ బ్యూరో 

అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దటంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులకు సూచించారు. 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త పాలసీలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పారు.  కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, ఏపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి , ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు.  క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను ప్రధానంగా చర్చించి పలు సూచనలు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YoundIndiaPhysicalEducationandSportsUniversity)గా తీర్చిదిద్దాలి.  యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (YoungIndiaSkillUniversity) తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ తరహాలో నిర్వహించాలి.  ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి చైర్మన్‌ను నియమించాలి. యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండాలి.  ఈ యూనివర్సిటీలో క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్‌, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, అక్వాటిక్స్ లాంటి 14 క్రీడలను స్పోర్ట్స్ హబ్‌లో చేర్చాలి.  దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలి.  హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్, కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్డేడియం, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, ఓయూలోని వెలోడ్రోమ్ ప్రముఖ క్రీడా మైదానాలు, స్టేడియంలు అన్నింటినీ ఒకే గొడుకు కిందకు తెచ్చి స్పోర్ట్ హబ్‌గా మార్చాలి.  తెలంగాణ భౌగోళిక పరిస్థితులతో పాటు ఇక్కడి యువతకు ఆసక్తి ఉన్న క్రీడలకు ప్రాధాన్యమివ్వాలి. శిక్షణకు దేశ విదేశాల్లో ఉన్న కోచ్‌లను రప్పించాలి.  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలకు స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి.

]]>
Sat, 05 Oct 2024 02:53:06 +0530 admin
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూపు ప్రతినిధి బృందం భేటీ https://prajakshethrenews.com/ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి-తో-మారియట్-ఇంటర్నేషనల్-గ్రూపు-ప్రతినిధి-బృందం-భేటీ https://prajakshethrenews.com/ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి-తో-మారియట్-ఇంటర్నేషనల్-గ్రూపు-ప్రతినిధి-బృందం-భేటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూపు ప్రతినిధి బృందం భేటీ

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూపు ప్రతినిధి బృందం భేటీ అయింది. గ్రూపు విస్తరణ ప్రణాళికలపై ఈ సందర్భంగా సంస్థ వైఎస్ ప్రెసిడెంట్ డ్య్రూ పింటో ముఖ్యమంత్రికి వివరించారు. మారియట్ ఇంటర్నేషనల్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

]]>
Sat, 05 Oct 2024 02:48:37 +0530 admin
DSC&2024లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనను ఈ నెల 5లోపు పూర్తి చేయండి :రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/dsc-2024లో-ఎంపికైన-అభ్యర్థుల-సర్టిఫికేట్ల-పరిశీలనను-ఈ-నెల-5లోపు-పూర్తి-చేయండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/dsc-2024లో-ఎంపికైన-అభ్యర్థుల-సర్టిఫికేట్ల-పరిశీలనను-ఈ-నెల-5లోపు-పూర్తి-చేయండి-రేవంత్-రెడ్డి DSC-2024లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనను ఈ నెల 5లోపు పూర్తి చేయండి :రేవంత్ రెడ్డి

ప్రజాక్షేత్ర్ , వెబ్​ న్యూస్​

డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ DSC-2024లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనను ఈ నెల 5 వ తేదీలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను మూడు రోజుల కిందట ముఖ్యమంత్రి విడుదల చేశారు. దసరా పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 9 వ తేదీన వారందరికీ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందించాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి నిర్ధేశించిన గడువులోగా సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 9090 మంది అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిందని విద్యా శాఖ అధికారులు సీఎంకు వివరించారు.

]]>
Sat, 05 Oct 2024 02:45:35 +0530 admin
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/ధాన్యం-కొనుగోళ్ల-ప్రక్రియ-సాఫీగా-జరిగేలా-చర్యలు-తీసుకోండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ధాన్యం-కొనుగోళ్ల-ప్రక్రియ-సాఫీగా-జరిగేలా-చర్యలు-తీసుకోండి-రేవంత్-రెడ్డి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోండి : రేవంత్ రెడ్డి 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు కనీస మద్దతు ధర (MSP) కు అదనంగా ఒక్కో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని స్పష్టం చేశారు.  ఖరీఫ్ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి ముఖ్యమంత్రి అనేక సూచనలు చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోపే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పగా, అవసరమైన చోట కలెక్టర్లు అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రస్తుత సీజన్ లో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.  సన్న వడ్లకు బోనస్ ఇవ్వటం ఇదే మొదటిసారి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు, తప్పులు జరగకుండా జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి.  ప్రతి కేంద్రానికి ఒక నెంబర్ కేటాయించి, ఆ కేంద్రంలో కొనుగోలు చేసిన వడ్ల సంచులపైన ఆ నెంబర్ తప్పకుండా వేయాలి. తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని ఉపేక్షించరాదు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ధాన్యం సేకరణ ప్రక్రియలో పాల్గొనాలి.  కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు, టార్ఫాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. సమస్యల పరిష్కారానికి పౌర సరఫరాల శాఖ విభాగంలో 24X7 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి.

]]>
Sat, 05 Oct 2024 02:33:02 +0530 admin
ప్రతి ఫ్యామిలీకి డిజిటల్​కార్డులు : రేవంత్​ రెడ్డి https://prajakshethrenews.com/ప్రతి-ఫ్యామిలీకి-డిజిటల్కార్డులు-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ప్రతి-ఫ్యామిలీకి-డిజిటల్కార్డులు-రేవంత్-రెడ్డి ప్రతి ఫ్యామిలీకి డిజిటల్​కార్డులు : రేవంత్​ రెడ్డి 

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను సక్రమంగా, మరింత సమర్థవంతంగా అమలు చేయడానికే  ఫ్యామిలీ డిజిటల్ కార్డులు (FDC) జారీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వన్ స్టేట్ – వన్ కార్డు ఆలోచనతో చేపట్టిన ఈ బహుళ ప్రయోజన కార్డుల జారీ ప్రక్రియను ప్రజలంతా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పనకు సంబంధించిన సర్వే పత్రాలను సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సిఖ్ విలేజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రాధాన్యతను ముఖ్యమంత్రి వివరించారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, రైతు బీమా, రైతు భరోసా, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్ వంటి  ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు 30 శాఖలు 30 రకాలుగా సమాచారం సేకరించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. అలా కాకుండా అర్హులైన వారందరూ ఒకే కార్డు ద్వారా ఈ సేవలు పొందడానికి వీలుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు అందజేస్తారు. ఇందుకోసం 3 నుంచి 7 వ తేదీ వరకు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. ప్రతిపక్షాలు దీనిపై ఎవైనా సూచనలు, సలహాలు ఉంటే ఇవ్వాలి. కుటుంబంలో సభ్యులు పెరిగినందున ప్రజలంతా కుటుంబ డిజిటల్ కార్డు కోసం వివరాలను నమోదు  చేయించుకోవాలి. ఇందులో అవసరమైన మార్పుచేర్పులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒక్క క్లిక్ తో కుటుంబ సమగ్ర సమాచారం ఉండాలన్న ఆలోచనతో ఈ విధానం తీసుకొచ్చాం. ఒకసారి కార్డు పొందిన తర్వాత రేషన్ తో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలను ఎక్కడి నుంచైనా పొందడానికి వీలుంటుంది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్, ఎమ్మెల్యే శ్రీగణేశ్ , మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

]]>
Sat, 05 Oct 2024 02:27:14 +0530 admin
గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన నల్లపోచమ్మ అమ్మవారు https://prajakshethrenews.com/గాయత్రీ-దేవి-అలంకారంలో-భక్తులకు-దర్శనమిచ్చిన-నల్లపోచమ్మ-అమ్మవారు https://prajakshethrenews.com/గాయత్రీ-దేవి-అలంకారంలో-భక్తులకు-దర్శనమిచ్చిన-నల్లపోచమ్మ-అమ్మవారు దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన మేకల్​బండ శ్రీ నల్ల పోమ్మ అమ్మవారు 

]]>
Fri, 04 Oct 2024 19:21:54 +0530 admin
తొలి రోజు అమ్మవారికి మహాభిషేకం https://prajakshethrenews.com/తొలి-రోజు-అమ్మవారికి-మహాభిషేకం https://prajakshethrenews.com/తొలి-రోజు-అమ్మవారికి-మహాభిషేకం దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్​ జనగామ మధుసూధన్​ గౌడ్​ ఆధ్వర్యంలో  తొలిరోజు అమ్మవారికి మహాభిషేకం అనంతరం బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన ఉప్పుగూడ మహంకాళి అమ్మవారు

]]>
Fri, 04 Oct 2024 19:14:52 +0530 admin
తొలిరోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో దర్శనం https://prajakshethrenews.com/తొలిరోజు-బాలా-త్రిపుర-సుందరి-అవతారంలో-దర్శనం https://prajakshethrenews.com/తొలిరోజు-బాలా-త్రిపుర-సుందరి-అవతారంలో-దర్శనం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలిరోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన ఉప్పుగూడ జమ్మిచెట్టు దుర్గామాత అమ్మవారు 

]]>
Fri, 04 Oct 2024 19:06:02 +0530 admin
నేటి నుంచి శ్రీ నల్లపోనమ్మ దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు: పొన్న వెంకట రమణ https://prajakshethrenews.com/నేటి-నుంచి-శ్రీ-నల్లపోనమ్మ-దేవాలయంలో-దేవి-శరన్నవరాత్రి-ఉత్సవాలు-పొన్న-వెంకట-రమణ https://prajakshethrenews.com/నేటి-నుంచి-శ్రీ-నల్లపోనమ్మ-దేవాలయంలో-దేవి-శరన్నవరాత్రి-ఉత్సవాలు-పొన్న-వెంకట-రమణ నేటి నుంచి శ్రీ నల్లపోనమ్మ దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు: పొన్న వెంకట రమణ 

ఈ నెల 4వ తేదీన మా భగవతీ విశాల్​ జాగరన్​ 

ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్ :

మేకల్​ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో ఈ నెల3 వ తేదీ నుంచి శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయని ఆలయ కమిటీ అధ్యక్షులు పొన్న వెంకటరమణ తెలిపారు. ఈ నెల4వ తేదీన రాత్రి 7గంటలకు మా భగవతీ విశాల్​ జాగరన్ జరుగనుందన్నారు.  విజయదశమి ఉత్సవాలలో  భాగంగా ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి బంగారు కవచము, బంగారు కిరీటము, బంగారు చీరెతో అలంకరించనున్నట్లు చెప్పారు. శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి నవరాత్రులతో వెండితో రూపొందించిన పంచహారతులతో  :నాగహారతి, సింహహారతి, కుంభ హారతి, నక్షత్ర హారతి, కర్పూర హారతి లు ఇవ్వనున్నట్లు చెప్పారు. విజయదశమి రోజున అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు అమ్మవారి రూపంతో ప్రత్యేకంగా తయారుచేయించిన వెండినాణాన్ని అందజేయనున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని అధ్యక్షులు పొన్న వెంకట రమణ కోరారు.

]]>
Thu, 03 Oct 2024 11:43:34 +0530 admin
మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్ https://prajakshethrenews.com/మంత్రి-కొండా-సురేఖకు-లీగల్-నోటీసులు-పంపిన-కేటీఆర్ https://prajakshethrenews.com/మంత్రి-కొండా-సురేఖకు-లీగల్-నోటీసులు-పంపిన-కేటీఆర్ మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్ 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

 కేటీఆర్ మంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలతో పాటు, నాగచైతన్య, సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ కొన్ని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారన్నారు. కేవలం తన గౌరవానికి ఈ ఇమేజ్‌కి భంగం కలిగించాలన్న లక్ష్యంగానే సమంత- నాగచైతన్య పేర్లను తీసుకుంటూ కొండ సురేఖ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు.  కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకుంటున్నారన్నారు. ఒక మహిళ అయ్యిండి ఇంకొక మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరం అన్నారు. అసలు తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్,ఇతర అంశాల పైన కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారన్నారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్య పూరిత వ్యాఖ్యలు, దురుద్దేశ పూరిత మాటలు మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచురితం అయ్యాయన్నారు. ఎలాంటి సాక్షాదారాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన కొండ సురేఖ ఒక మంత్రి అని, ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడేఅవకాశం ఉందని కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని సోయి కూడా లేకుండా కొండా సురేఖ మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసింది అన్నారు. గతంలో ఇవే అడ్డగోలు మాటలు మాట్లాడిన కొండా సురేఖకు ఈ సంవత్సరం నాలుగవ నెలలో నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు భారత ఎన్నికల సంఘం గట్టి హెచ్చరిక చేసిందని అయినా ఇలాంటి దురుద్దేశపూర్వక ఒక వ్యాఖ్యలను కొనసాగిస్తున్నరన్నారు. కొండా సురేఖ ప్రణాళికబద్ధంగా కావాలనే పదేపదే అవే అబద్దాలను తన వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం, నష్టపరచడం కోసం చేస్తుందన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తన లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు. దీంతోపాటు అబద్దాలు, అసత్యాలు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక, చిల్లర మాటలు మాట్లాడవద్దని సూచించారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులను కూడా వేస్తానని హెచ్చరించారు.

]]>
Thu, 03 Oct 2024 03:28:40 +0530 admin
బొంతు రామ్మోహన్‌ తల్లి కమలమ్మకు నివాళులర్పించిన సీఎం రేవంత్​రెడ్డి https://prajakshethrenews.com/బొంతు-రామ్మోహన్-తల్లి-కమలమ్మకు-నివాళులర్పించిన-సీఎం-రేవంత్రెడ్డి https://prajakshethrenews.com/బొంతు-రామ్మోహన్-తల్లి-కమలమ్మకు-నివాళులర్పించిన-సీఎం-రేవంత్రెడ్డి బొంతు రామ్మోహన్‌ తల్లి కమలమ్మకు నివాళులర్పించిన సీఎం రేవంత్​రెడ్డి

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

తల్లి మరణంతో దుఃఖంలో ఉన్న నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పరామర్శించారు. రెండు రోజుల కిందట రామ్మోహన్ మాతృమూర్తి కమలమ్మ మరణించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి నగరంలోని చర్లపల్లిలో రామ్మోహన్ నివాసానికి వెళ్లి వారి తల్లి కమలమ్మ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

]]>
Thu, 03 Oct 2024 03:17:01 +0530 admin
మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/మాజీ-ప్రధాని-లాల్-బహదూర్-శాస్త్రికి-నివాళులర్పించిన-సీఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/మాజీ-ప్రధాని-లాల్-బహదూర్-శాస్త్రికి-నివాళులర్పించిన-సీఎం-రేవంత్-రెడ్డి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

మాజీ ప్రధానమంత్రి దివంగత లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఎంపీ రఘువీర్ రెడ్డి  పాల్గొన్నారు.

]]>
Thu, 03 Oct 2024 03:07:14 +0530 admin
గాంధీకి ఘన నివాళుర్పించిన సీఎం రేవంత్​ రెడ్డి https://prajakshethrenews.com/గాంధీకి-ఘన-నివాళుర్పించిన-సీఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/గాంధీకి-ఘన-నివాళుర్పించిన-సీఎం-రేవంత్-రెడ్డి గాంధీకి ఘన నివాళుర్పించిన సీఎం రేవంత్​ రెడ్డి

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నివాళులు అర్పించారు. సర్వమత ప్రార్థనలో పాలుపంచుకున్నారు. సీఎం వెంట పలువురు మంత్రులు, అధికారులు, నేతలు ఉన్నారు.

]]>
Thu, 03 Oct 2024 03:03:36 +0530 admin
శ్రీ దత్త సభా మంటపాన్నిప్రారంభించిన రేవంత్​ రెడ్డి https://prajakshethrenews.com/శ్రీ-దత్త-సభా-మంటపాన్నిప్రారంభించిన-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/శ్రీ-దత్త-సభా-మంటపాన్నిప్రారంభించిన-రేవంత్-రెడ్డి శ్రీ దత్త సభా మంటపాన్నిప్రారంభించిన రేవంత్​ రెడ్డి 

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

ఏ రాష్ట్రంలో అయితే ప్రశాంతమైన వాతావరణం నెలకొని, సంప్రదాయాలు కాపాడబడుతాయో, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించే వాళ్లకు ఎక్కడైతే గౌరవం దక్కుతుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు. అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దుండిగల్‌ ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన శ్రీ దత్త సభా మంటపాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు తెలంగాణకు విచ్చేసినందుకు రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. దసరా నవరాత్రి ఉత్సవాల ప్రారంభ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజలందరికీ ముఖ్యమంత్రి దసరా పండుగ  శుభాకాంక్షలు తెలిపారు. మైసూర్‌లో జరగాల్సిన దసరా నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలను స్వామీజీ వారు ఇక్కడ నిర్వహించడం తెలంగాణకు శుభ సూచకమని పేర్కొన్నారు. శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీ (బాల స్వామీజీ) తో పాటు ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , భక్తులు పాల్గొన్నారు.వేదవ్యాస మహర్షి విరిచితమైన శ్రీమద్భాాగవతానికి పరమపూజ అప్పాజీ రాసిన వ్యాఖ్యాన పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

]]>
Thu, 03 Oct 2024 02:51:11 +0530 admin
అక్టోబరు 3 నుంచి శ్రీ మహంకాళి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు : జనగామ మధుసూధన్​గౌడ్ https://prajakshethrenews.com/అక్టోబరు-3-నుంచి-శ్రీ-మహంకాళి-దేవాలయంలో-శ్రీ-దేవి-శరన్నవరాత్రి-ఉత్సవాలు-జనగామ-మధుసూధన్గౌడ్ https://prajakshethrenews.com/అక్టోబరు-3-నుంచి-శ్రీ-మహంకాళి-దేవాలయంలో-శ్రీ-దేవి-శరన్నవరాత్రి-ఉత్సవాలు-జనగామ-మధుసూధన్గౌడ్ అక్టోబరు 3  నుంచి శ్రీ మహంకాళి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు : జనగామ మధుసూధన్​గౌడ్

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

పాతబస్తీ ఉప్పగూడలోని చారిత్రాత్మక శ్రీ మహంకాళి దేవాలయంలో ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్​ జనగామ మధుసూధన్​గౌడ్​ తెలిపారు. ఈ నెల 3వ తేదీన బాలా త్రిపుర సుందరీ దేవి, బంగారు రంగు వస్త్రం, నైవేద్యం కట్టె పొంగలి, 4 వ తేదీన శ్రీ గాయత్రీదేవి పసుపురంగు వస్త్రం, పులిహోర నైవేద్యం, 5వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి,  ఎరుపు రంగు వస్త్రం, నైవేద్యం అల్లం గారెలు, 6వ తేదీన శ్రీలలితా త్రిపుర సుందరి,  కాషాయ రంగు వస్త్రం కొబ్బెర అన్నం నైవేద్యం, 7వ తేదీన శ్రీ మహాచండి దేవి, ఎరుపు రంగు వస్త్రం, నైవేద్యం పులిహోర ,బూరెలు, 8వ తేదీన శ్రీ మహాలక్ష్మిదేవి,  గులాభి రంగు వస్త్రం,  చక్కెర పొంగలి నైవేద్యం, 9వ తేదీన శ్రీ సరస్వతి దేవి, తెలుపురంగు వస్త్రం, పెరుగు అన్నం నైవేద్యం, 10వ తేదీన శ్రీ దుర్గా దేవి, ఆకుపచ్చరంగు వస్త్రం, నైవేద్యం కదంబం, 11వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని దేవి, నీలం రంగు, నైవేద్యం పాయసం, 12వ తేదీన శ్రీ రాజజేశ్వరి దేవి, బంగారు రంగు వస్త్రం, లడ్డులు నైవేద్యం, ఆయుధపూజ, శమిపూజ, అమ్మవారి విగ్రహ ఊరేగింపు ఆలయ పురవీధుల గుండా జరుగనుందన్నారు. ఈ నవరాత్రి ఉత్సవాలకు అత్యథిక సంఖ్యలో భక్తులు పాల్గొని, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. 

]]>
Thu, 03 Oct 2024 00:37:14 +0530 admin
శ్రీ జగదాంబ దేవాలయంలో అక్టోబరు 3 నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు : రాకేష్​ తివారి https://prajakshethrenews.com/శ్రీ-జగదాంబ-దేవాలయంలో-అక్టోబరు-3-నుంచి-దేవి-శరన్నవరాత్రి-ఉత్సవాలు-రాకేష్-తివారి https://prajakshethrenews.com/శ్రీ-జగదాంబ-దేవాలయంలో-అక్టోబరు-3-నుంచి-దేవి-శరన్నవరాత్రి-ఉత్సవాలు-రాకేష్-తివారి శ్రీ జగదాంబ దేవాలయంలో అక్టోబరు 3 నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు : రాకేష్​ తివారి

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

సుల్తాన్​షాహి శ్రీ జగదాంబ దేవాలయంలో ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహంచడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్​ రాకేష్​ తివారి తెలిపారు. ఈ నెల 3 వ తేదీన పాడ్యమి హస్తా నక్షత్రం శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకారం, నైవేద్యం పులిహోర, 4వ తేదీన విధిత చిత్తా నక్షత్రం, శ్రీ గాయత్రీ దేవి అలంకారం, నైవేద్యం కొబ్బరి అన్నం, 5వ తేదీన తదియ స్వాతి నక్షత్రం, శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం, నైవేద్యం అల్లం గారెలు, 6వ తేదీన చవితి విశాఖ నక్షత్రం, శ్రీలలితా త్రిపుర సుందరి దేవి అలంకారం, నైవేద్యం రవ్వకేసరి, 7వ తేదీన పంచమి అనురాధ నక్షత్రం, శ్రీ మహాచండీదేవి అలంకారం, నైవేద్యం శాకన్నం, 8వ తేదీన షష్ఠి జ్యేష్ట్యా నక్షత్రం , శ్రీ మహాలక్షమి దేవి అలంకారం, నైవేద్యం, దద్దోజనం, 9వ తేదీన మూలా నక్షత్రం శ్రీ సరస్వతి దేవి అలంకారం, నైవేద్యం పెసర, బూరెలు, పులిహోర, 10వ తేదీన అష్టమి పూర్వాషాడ , శ్రీ దుర్గాదేవి అలంకారం, నైవేద్యం కదంబము, 11వ తేదీన నవమి ఉత్తరాషాఢ, శ్రీ మహిషాసుర మర్దని దేవి అలంకారం, నైవేద్యం గారెలు, పులి హోర, 12వ తేదీన దశమి శ్రవణా నక్షత్రం, శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, నైవేద్యం పరమాన్నం, కేసరన్నం  సమర్పించనున్నట్లు చెప్పారు. 3వ తేదీన అమ్మవారికి అభిషేకం, ఊంజల్​ సేవ, పంచ హారతి, 4వ తేదీన 108 మహిళా మాతృ మూర్తుల చే లక్ష పుష్పార్చన, 5వ తేదీన రంగోలి, ఆటల పోటీలు, 6వ తేదీన దాండియా, బతుకమ్మ కార్యక్రమాలు, 7వ తేదీన చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, 11వ తేదీన 108 మహిళా మూర్తులచే కుంకుమార్చన, 12వ తేదీన యజ్ఞ మహా పూర్ణాహుతి, అమ్మవారి ఊరేగింపు, బతుకమ్మ ఆట పాటలతో ఉత్సవాలు ముగుస్తామని రాకేష్ తివారి పేర్కొన్నారు. 

]]>
Thu, 03 Oct 2024 00:22:52 +0530 admin
శ్రీ లక్ష్మణేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా https://prajakshethrenews.com/శ్రీ-లక్ష్మణేశ్వర-స్వామి-దేవాలయంలో-పూజలు-చేసిన-ఎమ్మెల్సీ-బొగ్గారపు-దయానంద్-గుప్తా https://prajakshethrenews.com/శ్రీ-లక్ష్మణేశ్వర-స్వామి-దేవాలయంలో-పూజలు-చేసిన-ఎమ్మెల్సీ-బొగ్గారపు-దయానంద్-గుప్తా శ్రీ లక్ష్మణేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

అమావాస్యను పురస్కరించుకుని  శివగంగానగర్​ శ్రీ లక్ష్మణేశ్వర స్వామి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం లాల్ దర్వాజా గౌలిపుర  ఆధ్వర్యంలో బుధవారం భక్తి శ్రద్దలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం గోశాలలోని గోవులకు గోగ్రసం తినిపించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా ముఖ్య అతిధిగా పాల్గొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా గోశాల లోని గోవుల గోగ్రాసం కోసం రూ.20వేల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్​ ఆలె జితేంద్ర, ఆలయ చైర్మన్​ దామోదర్​ రెడ్డి, కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ చైర్మన్ చీల రాములు గుప్తా,  గుగ్గిల అశోక్ కుమార్, సరాబు విశ్వేశ్వరయ్య, కొర్ల వెంకటేష్, సంఘ అధ్యక్షులు సరాబు సంతోష్ కుమార్, సంఘ ప్రధాన కార్యదర్శి గుబ్బ శ్రీనివాస్​, సంఘం సభ్యులు బూర్గు కుమార్, బనస రవికుమార్, పూల జగన్నాథం, సిరంగి సంతోష్ కుమార్, గౌరీశెట్టి విశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు.

]]>
Thu, 03 Oct 2024 00:06:12 +0530 admin
శ్రీ దుర్గామాత దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్దం : జమ్మిచెట్టురాజు https://prajakshethrenews.com/శ్రీ-దుర్గామాత-దేవాలయంలో-శ్రీ-దేవి-శరన్నవరాత్రి-ఉత్సవాలకు-సర్వం-సిద్దం-జమ్మిచెట్టురాజు https://prajakshethrenews.com/శ్రీ-దుర్గామాత-దేవాలయంలో-శ్రీ-దేవి-శరన్నవరాత్రి-ఉత్సవాలకు-సర్వం-సిద్దం-జమ్మిచెట్టురాజు  శ్రీ దుర్గామాత దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్దం : జమ్మిచెట్టురాజు

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

పాతబస్తీ ఉప్పగూడలోని రాఘవేంద్ర స్వామి నగర్​ జమ్మిచెట్టు వద్ద శ్రీ దుర్గామాత దేవాలయంలో అక్టోబరు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు జమ్మిచెట్టు రాజు ​ తెలిపారు. ఈ నెల 3వ తేదీన శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి అలంకారం, నీలం రంగు వస్త్రం, గణపతి పూజ, అఖండ దీపారాదన, కలశస్థాపన, అమ్మవారి ప్రతిష్ఠాపన,  నైవేద్యం తీపి బూంది, శనగలు, 4వతేదీన శ్రీగాయత్రీ దేవి అలంకారం, పసుపు రంగు వస్త్రం, సామూహిక కుంకుమార్చన, నైవేద్యం పులిహోర, 5వ తేదీన శ్రీ అన్న పూర్ణాదేవి అలంకారం, మెరున్​ రంగు వస్త్రం, శివ పార్వతుల కళ్యాణం, పల్లకి సేవ, నైవేద్యం పొంగలి, 6వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరి అవతారం, అకుపచ్చ రంగు,  నైవేద్యం పులిహోర, పెసరబూరెలు, 7వ తేదీన శ్రీ మహాచండి దేవి అవతారం, బంగారు రంగు వస్త్రం, మహాశివునికి అభిషేకం, నైవేద్యం వడపప్పు, పాయసం, 8వ తేదీన శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం, రాణి గులాబిరంగు వస్త్రం, శ్రీ పద్మావతి సమేత, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, పల్లకి సేవ,  నైవేద్యం క్షీరన్నం, 9వ తేదీన శ్రీ సరస్వతి దేవి మూలా నక్షత్రం అవతారం, తెలుపు రంగు వస్త్రం, నైవేద్యం శనగపప్పు, కొబ్బరి అన్నం , 10వ తేదీన శ్రీ దుర్గా దేవి అవతారం, ఎరుపు రంగు వస్త్రం, నైవేద్యం కదంబం, బతుకమ్మ, దాండియా కార్యక్రమం, 11వ తేదీన శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అవతారం, ముదురు నీలం రంగు వస్త్రం, నవఛండీ హోమం, నైవేద్యం చెక్కెర పొంగలి, 12వ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం, పసుపు రంగు వస్త్రం, జమ్మిచెట్టు పూజ,  నైవేద్యం పులిహోర, గారెలు తదితరర పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ నవరాత్రి ఉత్సవాలకు అత్యథిక సంఖ్యలో భక్తులు పాల్గొని, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ నిర్వాహకులు అరవింద్​, ఎ.శ్రీనివాస్​, రఘు, అనిల్​, నరేష్​, నాగేశ్వర్​ రావు, జనార్థన్​, సురేష్​, రవి తదితరులు పాల్గొన్నారు.

]]>
Thu, 03 Oct 2024 00:00:36 +0530 admin
తెలంగాణ డీఎస్సీ ‌‌2024 ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/తెలంగాణ-డీఎస్సీ-2024-ఫలితాలు-విడుదల-చేసిన-సీఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/తెలంగాణ-డీఎస్సీ-2024-ఫలితాలు-విడుదల-చేసిన-సీఎం-రేవంత్-రెడ్డి తెలంగాణ డీఎస్సీ ‌‌2024 ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో 

ప్రజా ప్రభుత్వం రికార్డు సమయంలో డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ #DSC-2024 ఫలితాలను ప్రకటించింది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు. దసర పండుగ శుభ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి అక్టోబర్ 9 వ తేదీన నియామకపు పత్రాలు అందజేస్తామని ప్రకటించారు. డా.బీఆర్ అబేంద్కర్ సచివాలయంలో డీఎస్సీ ఫలితాల విడుదల అనంతరం ముఖ్యమంత్రి విద్యా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2012 లో ఒకసారి, తెలంగాణ ఏర్పడిన తర్వాత గడిచిన పదేళ్లలో 2017 లో ఒకే ఒక్కసారి అదికూడా కేవలం 7,857 పోస్టులకు మాత్రమే డీఎస్సీ నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో 30 వేల పోస్టులను భర్తీ చేశాం. వ్యవస్థలను నిర్వీర్యం చేసి అంగడిగా మార్చిన టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాం.  ప్రస్తుత టీచర్ల నియామకాలు పూర్తయిన తర్వాత ఖాళీల ఆధారంగా కొత్త నియామక ప్రక్రియ చేపడుతాం. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు నిరంతర ప్రక్రియగా సాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న కారణంగా పాఠశాలలు మూసివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. విద్యపై ఖర్చును భవిష్యత్తుకు పెట్టుబడిగా భావిస్తాం. గడిచిన పదేళ్లలో విద్యా రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యకు నిధులు పెంచాం. ఇంకా పెంచుతాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వంటి గురుకులాలు ప్రారంభించారు గానీ వాటిలో కనీస సౌకర్యాలు కల్పించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. అందుకే సామాజిక సమతుల్యత పాటిస్తూ రాష్ట్రంలోని 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తాం.  ఒక్కో నియోజకవర్గంలో 100 -120 కోట్ల రూపాయల నిధులతో 20 నుంచి 25 ఎకరాల స్థలంలో సంపూర్ణమైన వసతులతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల క్యాంపస్ లను ఏర్పాటు చేస్తాం. అందులో భాగంగానే కొడంగల్, మధిరల్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టాం. బదిలీలు, ప్రమోషన్లు లేక నిరాశా నిస్పృహలతో ఉన్న టీచర్లకు సంబంధించి 34,706 మందికి ఎలాంటి అవాంతరాలు, ఆరోపణలు లేకుండా ఆ ప్రక్రియను చేశాం.  విద్య, నీళ్లు, నియామకాలు వంటివి భావోద్వేగంతో కూడినవి. త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు ప్రకటిస్తాం. ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 60 నుంచి 65 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నది లక్ష్యం.  గత జూలై 18 నుంచి ఆగస్టు 5 వ తేదీ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 54 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను 55 రోజుల రికార్డు సమయంలో ప్రకటించడం పట్ల విద్యా శాఖ అధికారులకు అభినందనలు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,  విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తదితరులు పాల్గొన్నారు.

]]>
Tue, 01 Oct 2024 02:27:32 +0530 admin
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరుగొద్దు : రేవంత్​రెడ్డి https://prajakshethrenews.com/ఫ్యామిలీ-డిజిటల్-కార్డుల-జారీ-ప్రక్రియలో-ఎలాంటి-పొరపాట్లు-జరుగొద్దు-రేవంత్రెడ్డి https://prajakshethrenews.com/ఫ్యామిలీ-డిజిటల్-కార్డుల-జారీ-ప్రక్రియలో-ఎలాంటి-పొరపాట్లు-జరుగొద్దు-రేవంత్రెడ్డి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరుగొద్దు : రేవంత్​రెడ్డి

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియలో కుటుంబ సభ్యుల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.డిజిటల్ కార్డుల కోసం చేపడుతున్న పైలెట్ ప్రాజెక్టు ద్వారా వెల్లడయ్యే అనుభవాల ఆధారంగా సానుకూల, ప్రతికూల అంశాలపై సమగ్రమైన నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు ప్రాతిపదికన ఏవైనా లోపాలుంటే సవరించుకుని పూర్తి స్థాయిలో చేపట్టాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాలను ప్రాతిపదికగా ఎంపిక చేసుకుని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే గుర్తించిన 238 ప్రాంతాల్లో బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , కొండా సురేఖ , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి  సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు. కార్డుల ప్రక్రియకు సంబంధించి ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాతిపదికన ప్రాంతాల ఎంపిక పూర్తయిందని అధికారులు వివరించారు. అక్టోబర్ 3 నుంచి 7 వ తేదీ వరకు అయిదు రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు చేపట్టే ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు అందరూ సమ్మతిస్తే ఫోటో తీయాలని, అది ఒక ఆప్షన్ గా మాత్రమే ఉండాలని చెప్పారు. రేష‌న్ కార్డు, పింఛ‌ను-స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, రైతు భ‌రోసా, రుణ‌మాఫీ, బీమా, ఆరోగ్యశ్రీ‌, కంటి వెలుగు వంటి కార్యక్రమాల్లో నమోదైన డేటా ఆధారంగా ఇప్ప‌టికే కుటుంబాల‌ గుర్తింపున‌కు సంబంధించిన ప్ర‌క్రియ పూర్త‌యింది. పైలెట్ ప్రాజెక్టులో వాటిని నిర్ధారించుకోవ‌డంతో పాటు కొత్త స‌భ్యులను చేర్చడంతో పాటు కుటుంబంలో ఎవరైనా మృతి చెందింతే అలాంటి వారిని తొల‌గిస్తామ‌ని అధికారులు వివ‌రించారు.

]]>
Tue, 01 Oct 2024 02:19:53 +0530 admin
మీ ఇండ్లను కూల్చకుండా బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలంతా రక్షణ కవచం లా నిల్చుంటాం : హరీష్​రావు https://prajakshethrenews.com/మీ-ఇండ్లను-కూల్చకుండా-బీఆర్ఎస్-ఎమ్మెల్యేలంతా-రక్షణ-కవచం-లా-నిల్చుంటాం-హరీష్రావు https://prajakshethrenews.com/మీ-ఇండ్లను-కూల్చకుండా-బీఆర్ఎస్-ఎమ్మెల్యేలంతా-రక్షణ-కవచం-లా-నిల్చుంటాం-హరీష్రావు మీ ఇండ్లను కూల్చకుండా బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలంతా రక్షణ కవచం లా నిల్చుంటాం : హరీష్​రావు

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

మీ ఇండ్లను కూల్చకుండా బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలంతా రక్షణ కవచం లా నిల్చుంటారని మాజీ మంత్రి హరీష్​రావు భరోసా ఇచ్చారు. లంగర్​హౌజ్​ హైదర్​ షా కోట్​ లోని మూసి నిర్వాసిత బాధితులను ఆదివారం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఎమ్మెల్యేలు పరామర్షించారు. ఈ సందర్భంగా  మాజీ మంత్రుల,నగర ఎమ్మెల్యేల,బీఆర్ఎస్ బృందం ముందు బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు హరీష్​రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మల్లారెడ్డిలు మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంలో పేదలకు ఒక న్యాయం,పెద్దలకు ఒక న్యాయం అమలవుతుందని మండి పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని, మీరు ఫోన్ చేస్తే అర్థగంటలో మీ ముందు ఉంటామని భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇళ్లన్నీ కూలగొట్టి ప్రపంచ బ్యాంకుకు మన భూములను కుదువబెడతాడని ఆరోపించారు. మూసీ నది సుందరీకరణ పేరుమీద రిసార్ట్​లు గట్టి హోటల్ కట్టి ఏదో ఉద్దరిస్తాడంట అని చమత్కరించారు. పేదవాళ్ల రక్తం మీద, కన్నీళ్ళ మీద మూసీ సుందరీ కరణ చేస్తావా?  చేయడానికి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అయినా వాటిని వదిలేసి మూసి నది మీద పడి పేదల ఉసురు తీస్తున్నారని రేవంత్​ రెడ్డి ని తీవ్రంగా విమర్షించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టకుండా. ఎన్నికల్లో ఇవ్వని హామీ కోసం ఎందుకు కూల్చడం అని ప్రశ్నించారు. ఇందులో ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. మహిళలకు ఇచ్చేందుకు 2500 లేవు కానీ పేదల బతుకులను కూల్చేందుకు  1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కెసిఆర్ 200 పెన్షన్ 2000 చేసిండు. రేవంత్ రెడ్డి 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నాడు కానీ ఇప్పటివరకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదని ఆరోపించారు. అసెంబ్లీలో పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని నిలదీస్తే పైసలు లేవని చేతులెత్తేశారు. మరి మూసి ప్రాజెక్టు కోసం లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని మండిపడ్డారు. మేనిఫెస్టోలో మూసి గురించి చెప్పలేదు కదా. ఆరు గ్యారెంటీల గురించి చెప్పావు కదా ఎందుకు మూసి గురించి  డ్రామాలు చేస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికోసం మూసి ప్రాజెక్ట్ నిర్మిస్తున్నావు.? ఇందులో ఎవరెవరి హస్తముందో చెప్పాలన్నారు. కెసిఆర్ నిర్మాణాలు చేపడితే రేవంత్ రెడ్డి కూలగొట్టే కార్యక్రమం పెట్టుకున్నాడని దుయ్యబట్టారు. ఇతర రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం నడవదు అని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కానీ హైదరాబాద్ లో మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూండా రాజ్ రాజ్యం తెచ్చాడు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును తీసేసి బుల్డోజర్ గుర్తును పెట్టుకోవాలి. ఇది మీ అయ్య జాగిరి కాదు రేవంత్ రెడ్డి. ఇక్కడ 30 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఉండే ప్రజలు అన్ని రకాల టాక్స్లు కడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించుకున్న నిర్మాణాలే కదా... కేసు పెట్టేది ఉంటే ఏ ప్రభుత్వమైతే అనుమతులు ఇచ్చిందో వారి మీద కేసు పెట్టాలని హితవు పలికారు. మీరు ధైర్యంగా ఉండండి బుల్డోజర్ రావాల్సి వస్తే మమ్మల్ని దాటుకొని రావాల్సిందేనన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీకు కోర్టు ద్వారా న్యాయం చేయిస్తుందన్నారు. కార్తీక్​ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు  ఎమ్మెల్యే దగ్గరకి పోతే నాకు సంభంధం లేదు అంటున్నారు.బాధితులకు అండగా ఉంటాం....బీఆర్ఎస్ పక్షాన పోరాడుతాం.అతి తక్కువ సమయంలోనే అత్యధిక ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటికైనా పేదల గురుంచి ఆలోచించి,బుల్డోజర్ సంస్కృతిని విడనాడాలని కార్తీక్​రెడ్డి హితవు పలికారు. 

]]>
Mon, 30 Sep 2024 00:24:15 +0530 admin
విరాహత్ అలీకి మంజీరా రచయితల సంఘం ఆత్మీయ సత్కారం https://prajakshethrenews.com/విరాహత్-అలీకి-మంజీరా-రచయితల-సంఘం-ఆత్మీయ-సత్కారం https://prajakshethrenews.com/విరాహత్-అలీకి-మంజీరా-రచయితల-సంఘం-ఆత్మీయ-సత్కారం విరాహత్ అలీకి మంజీరా రచయితల సంఘం ఆత్మీయ సత్కారం

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో ఆదివారం మంజీరా రచయితల సంఘం 38వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నిర్భంధాలను సైతం లెక్కజేయకుండా వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంతో పాటు మంజీరా రచయితల సంఘం కార్యకలాపాలను మెతుకుసీమలో విస్తరింపజేసేందుకు ప్రజా పాత్రికేయుడిగా విరాహత్ అలీ పోషించిన పాత్ర అభినందనీయమని  కొనియాడారు. మంజీరా రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన విరాహత్ అలీ టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. మంజీరా రచయితల సంఘం అధ్యక్షుడు కె.రంగాచారీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసీం, మ.ర.సం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి,  వ్యవస్థాపక సభ్యులు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దేవిప్రసాద్, కె. అంజయ్య, తోట అశోక్, అలాజీపూర్ శ్రీనివాస్ లతో పాటు సిద్దిపేట జర్నలిస్టులు పాల్గొన్నారు.

]]>
Mon, 30 Sep 2024 00:01:42 +0530 admin
మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది : రేవంత్​రెడ్డి https://prajakshethrenews.com/మహిళల-ఆరోగ్య-సంరక్షణకు-ప్రజా-ప్రభుత్వం-కట్టుబడి-ఉంది-రేవంత్రెడ్డి https://prajakshethrenews.com/మహిళల-ఆరోగ్య-సంరక్షణకు-ప్రజా-ప్రభుత్వం-కట్టుబడి-ఉంది-రేవంత్రెడ్డి మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది : రేవంత్​రెడ్డి

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి సాధికారతతో పాటు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలమని, సమాజ శ్రేయస్సుకు అదే పునాది అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని, సంబంధిత వ్యవస్థలను బలోపేతం చేస్తామని తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సుధా రెడ్డి ఫౌండేషన్ నేతృత్వంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన 'పింక్ పవర్ రన్' కార్యక్రమంలో ముఖ్యమంత్రి  పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పక్షి అకృతిలో అతిపెద్ద మానవహారంగా ఏర్పడిన వలంటీర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సుధా రెడ్డి ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు.

]]>
Sun, 29 Sep 2024 20:05:14 +0530 admin
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళ నే యజమాని : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/ఫ్యామిలీ-డిజిటల్-కార్డులో-మహిళ-నే-యజమాని-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ఫ్యామిలీ-డిజిటల్-కార్డులో-మహిళ-నే-యజమాని-రేవంత్-రెడ్డి ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళ నే యజమాని : రేవంత్ రెడ్డి 

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపైన ఆ ఇంటి మహిళనే యజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సూచించారు. కుటుంబంలోని సభ్యుల పేర్లు, ఇతర వివరాలను కార్డు వెనుక భాగంలో ఉండే విధంగా కార్డుల రూపకల్పన జరగాలని చెప్పారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల (FDC) రూపకల్పనపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు.సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రల్లో డిజిటల్ కార్డుల అమలుపై చేసిన అధ్యయన వివరాలను సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్రంలో జారీ చేసే డిజిటల్ కార్డుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు.ప్రస్తుత రేష‌న్, రాజీవ్ ఆరోగ్య‌శ్రీ‌, ఐటీ, వ్య‌వ‌సాయ‌, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల్లోని డాటా ఆధారంగా కుటుంబాలను  నిర్ధారించాలి. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వివరాలు అవసరం లేదు.రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోచోట ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాలి.ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో ఏ ఏ అంశాలను పొందుపరచాలన్న వివరాలను నివేదిక రూపంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల తో కూడిన మంత్రివర్గ ఉపసంఘానికి అందించాలి.మంత్రివర్గ ఉప సంఘం సూచనలకు అనుగుణంగా సమగ్ర వివరాలతో నివేదిక రూపొందించాలి.అక్టోబర్ 3 వ తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎలాంటి లోపాలు లేకుండా క్షేత్రస్థాయి (డోర్ టు డోర్) పరిశీలన పూర్తి చేయాలి.సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

]]>
Sun, 29 Sep 2024 16:19:45 +0530 admin
రేవంత్ బుల్డోజర్ రాజ్ ను ఆపు రాహుల్ : హరీష్ రావు https://prajakshethrenews.com/రేవంత్-బుల్డోజర్-రాజ్-ను-ఆపు-రాహుల్-హరీష్-రావు https://prajakshethrenews.com/రేవంత్-బుల్డోజర్-రాజ్-ను-ఆపు-రాహుల్-హరీష్-రావు రేవంత్ బుల్డోజర్ రాజ్ ను ఆపు రాహుల్ : హరీష్ రావు 

తెలంగాణ భవన్‌కు మూసీ సుందరీకరణ బాధితులు (హైడ్రా) బాధితులు. 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 

మీ అందరి మాటలు వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తో కలిసి మీ ఏరీయాకు వస్తామని,మీకు మేమంతా అండగా ఉంటామని ఎమ్మెల్యే హరీష్ రావు భరోసా ఇచ్చారు. హైడ్రా బాధితులు మాజీ మంత్రి హరీష్ రావు ముందు కంట తడి పెట్టారు. పై సా పైసా కూడబెట్టి కట్టిన ఇల్లును నిర్దాక్ష్య ణ్యంగా కూల్చి వేస్తున్నారని మండి పడ్డారు. అనంతరం ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సోదరునికి నోటీసులిచ్చి 45 రోజులు టైం ఇస్తారా? అదే పేదోడికైతే రాత్రిరాత్రికే వచ్చి బుల్డోజర్లతో కూలగొడతారా? ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు.కాంగ్రెస్ హయాంలోనే బాధితులంతా ఇండ్లకు పర్మిషన్ ఇచ్చిండ్రు. కష్టంతో భూములు కొనుక్కున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.మున్సిపాలిటీల కెళ్లి పర్మిషన్ తీసుకున్నారు. ఇళ్లు కట్టుకునేందుకు బ్యాంకు కెళ్లి లోన్‌లు పెట్టుకున్నారు. ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టారు. 1993 కాంగ్రెస్ ప్రభుత్వమే వీరికి పరిష్మన్లు ఇచ్చింది.ఇప్పుడు వాటిని కూల్చడం అన్యాయం.రేవంత్ .. నువ్వు చేస్తున్న గొప్ప పనేంటి..? సుందరీకరణ?కేసీఆర్ మిషన్ భగీరథ పెడితే.. ప్రతీ ఇంటికి నీరంది ప్రజలకు మేలు జరిగింది.కాళేశ్వరం కడితే లక్షాలాది మంది రైతులకు సాగు,తాగు నీరందింది దాని వల్ల ప్రజలకు మేలు జరిగింది.రేవంత్‌రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు పారిస్తానంటున్నాడు. పేద మధ్య తరగతి ప్రజల రక్తం, కన్నీళ్లు పారించే ప్రయత్నం చేస్తున్నావ్..హైడ్రా.. హైడ్రా.. హైడ్రొజన్ బాంబులా మారింది. ఎవరికీ కంటిమీద కునుకులేకుండా పోయింది. సోషల్ మీడియాలో వీడియోలు చూస్తే పేదల గుండెలు ఆగిపోతున్నాయ్.పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్లు దీవెనలు ఇస్తారు. కానీ, వారి ఉసురు తీస్తే శాపనార్ధాలు పెడతారని మర్చిపోకు రేవంత్.. నువ్వు మంచి పనులు చేయ్.. దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు.నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి ఒక్క మంచి పనిచేశావా? నీకు కూల్చడం తప్ప కట్టడం తెలీదా? ముర్ఖుడా పేదలకు పనికొచ్చే పనిచేయ్.రాహుల్ గాంధీ.. తెలంగాణలో బుల్డోజర్  రాజ్యం నడుస్తోంది. మీరు దేశమంతా తిరిగి బుల్డోజర్ ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. ముందు తెలంగాణాలో బుడ్జోజర్ రాజ్‌ను ఆపండి.రేవంత్ రెడ్డి.. అఖిలపక్ష మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకోండి.. ఆ తర్వాతే మూసీ మీద ముందుకెళ్లండి ముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. హైడ్రా పేరుతో నాటకాలు ఆడుతున్నావ్..మూడు విషయాలు మీకు హామీనిస్తాం.24 గంటలు మా న్యాయవాదుల బృంధం తెలంగాణ భవన్‌లో ఉంటుంది.వారి నెంబర్ తీసుకోండి.. ఏ అవసరమొచ్చినా.. మా తలుపులు తెరిచే ఉంటాయ్.మీకు మేమంతా రక్షణ కవచంగా నిలబడతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కలిసి మీ దగ్గరికొస్తాం..మీకు భరోసా కల్పిస్తాం.10వేల ఇండ్లు ఉన్నాయని ప్రభుత్వం బయలుదేరింది.. కానీ 25వేల ఇండ్లను కూల్చేందుకు సిద్ధమవుతున్నారు.మీకు న్యాయం జరిగేలా కృషి చేస్తాం..మీరు ఫోన్ చేస్తే.. మేం మీకు అండగా నిలబడతాం.మీరు ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.

]]>
Sun, 29 Sep 2024 02:04:18 +0530 admin
ఘనంగా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ వేడుకలు https://prajakshethrenews.com/ఘనంగా-నల్సార్-న్యాయ-విశ్వవిద్యాలయం-21వ-వేడుకలు https://prajakshethrenews.com/ఘనంగా-నల్సార్-న్యాయ-విశ్వవిద్యాలయం-21వ-వేడుకలు ఘనంగా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ వేడుకలు 

ముఖ్య అతిధిగా హాజరయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం (నేషనల్ అకాడమీ ఫర్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ NALSAR) 21వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీఎస్.నర్సింహ  తదితరులు అధిధులుగా పాల్గొన్నారు. యూనివర్సిటీ చాన్సలర్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్‌ అరాధే  కోర్సులను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకృష్ణ దేవ రావు , వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.వాసంతి, మంత్రి సీతక్క, తదితరులు పాల్గొన్నారు. పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీఏ, బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ తదితర కోర్పులను విజయవంతంగా పూర్తి చేసుకున్న 592 మంది విద్యార్థులకు పట్టాలు అందుకున్నారు. పట్టభద్రులైన వారిలో 57 మంది గోల్డ్ మెడల్స్ సాధించారు.

]]>
Sat, 28 Sep 2024 23:45:45 +0530 admin
వారం రోజుల్లో తెలంగాణలో మళ్లీ అడ్డదారుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు! https://prajakshethrenews.com/వారం-రోజుల్లో-తెలంగాణలో-మళ్లీ-అడ్డదారుల్లో-బ్యాక్లాగ్-ఉద్యోగాల-భర్తీకి-సన్నాహాలు https://prajakshethrenews.com/వారం-రోజుల్లో-తెలంగాణలో-మళ్లీ-అడ్డదారుల్లో-బ్యాక్లాగ్-ఉద్యోగాల-భర్తీకి-సన్నాహాలు వారం రోజుల్లో తెలంగాణలో మళ్లీ అడ్డదారుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు!

ఒక్కో జాబుకు 16 లక్షలకు వసూలు 

గతంలో అడ్డదారీలో బ్యాక్లాగ్ జాబులు నియమించబడ్డ వాళ్లని తొలగించాలి

తెలంగాణ నిరుద్యోగ రక్షణ జెఏసి ఛైర్మన్ డాక్టర్​ మహిపాల్ యాదవ్ 

ప్రజాక్షత్ర్, వెబ్​ న్యూస్​ 

గత ప్రభుత్వంలో అడ్డదారుల్లో బ్యాగ్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసి అనేక తప్పిదాలు చేశారని, ఆ బాటలోనే ఈ ప్రభుత్వంలో ఉన్న కొంత మంది అధికారులు వారం రోజుల్లో మళ్లీ అడ్డదారుల్లో గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ తదితర శాఖలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సిద్దపడుతున్నట్టు తెలంగాణ నిరుద్యోగ రక్షణ జెఏసి ఛైర్మన్ డాక్టర్​ మహిపాల్ యాదవ్ ఆరోపించారు. తెలంగాణలో మళ్ళీ అడ్డదారిలో బ్యక్ లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నాలను నిరసిస్తూ  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నిరుద్యోగ రక్షణ జెఏసి ఛైర్మన్ డా. మహిపాల్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ ఒకటి గతంలో అడ్డదారీలో బ్యాక్లాగ్ జాబులు నియమించబడ్డ వాళ్లని తొలగించాలని డిమాండ్ చేశారు. రెండోది బ్యాక్లాగ్ జాబులు అక్రమంగా నియమించిన వాళ్లను కఠినంగా శిక్షించాలని, అర్హులైన వారిని బ్యాక్లాగ్ జాబులో నియమించాలని డిమాండ్​ చేశారు. ఇప్పుడు వారం రోజుల్లో మళ్లీ అడ్డదారులు బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ చేయాలనుకుంటున్న అధికారులను గుర్తించి వారిని అడ్డుకోవాలన్నారు. అడ్డదారుల్లో బ్యాక్లాగ్ జాబు కొనాలి అనుకునే వారికి మీ డబ్బులు పోతాయి, మీ జాబులు పోతాయి, మీరు జైలుకు వెళ్తారని ప్రభుత్వం గట్టిగా హెచ్చరికలు చేయాలని డిమాండ్​ చేశారు. తెలంగాణలో గత ప్రభుత్వంలో కూడా అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు నిర్మల్ మున్సిపల్ లో ఏకంగా 44 పోస్టులు భర్తీ చేయడం జరిగిందని, కొన్నిటిని బంధుప్రీతితో, మరి కొన్నిటిని వేలం వేసి అమ్ముకున్నారని ఆరోపించారు. ఒక్కో జాబుకు 16 లక్షలకు వసూలు చేసినట్టు డాక్టర్ మహిపాల్ యాదవ్ ఆరోపించారు. గతంలో కెసిఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన సరితారావుకు తెలంగాణ జెన్కోలో ఏఈ ఎగ్జామ్ రాయకుండానే ఆమెకు ఏఈ పోస్ట్ను సీఎండీ ప్రభాకర్ రావు ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దొడ్డి దారిన జరిగే బ్యాక్లాగ్ నియమాకులను అడ్డుకోవాలని తెలంగాణ నిరుద్యోగ రక్షణ జెఏసి పక్షనా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విష్ణు కిషోర్, ఓకే టీవీ శ్రావ్య, ఏ. నరేష్,  డియస్సీ అభ్యర్థుల నాయకుడు బండారి సురేష్ , డప్పిస్ట్ సురేష్ బాబు, సామాజికవేత్త అశోక్, వ్యాపారవేత్త రాజేష్, చీమల జగదీష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు....

]]>
Sat, 28 Sep 2024 22:09:38 +0530 admin
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/భారత-రాష్ట్రపతి-ద్రౌపది-ముర్ము-కి-స్వాగతం-పలికిన-సీఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/భారత-రాష్ట్రపతి-ద్రౌపది-ముర్ము-కి-స్వాగతం-పలికిన-సీఎం-రేవంత్-రెడ్డి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

]]>
Sat, 28 Sep 2024 20:15:48 +0530 admin
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ https://prajakshethrenews.com/భారత-రాష్ట్రపతి-ద్రౌపది-ముర్ము-కి-స్వాగతం-పలికిన-గవర్నర్-జిష్ణుదేవ్-వర్మ https://prajakshethrenews.com/భారత-రాష్ట్రపతి-ద్రౌపది-ముర్ము-కి-స్వాగతం-పలికిన-గవర్నర్-జిష్ణుదేవ్-వర్మ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

]]>
Sat, 28 Sep 2024 20:13:23 +0530 admin
5 వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగాలకు అవకాశం కల్పించనున్న హెచ్‌సిఎల్ https://prajakshethrenews.com/5-వేల-మంది-ఇంజనీర్లకు-ఉద్యోగాలకు-అవకాశం-కల్పించనున్న-హెచ్సిఎల్ https://prajakshethrenews.com/5-వేల-మంది-ఇంజనీర్లకు-ఉద్యోగాలకు-అవకాశం-కల్పించనున్న-హెచ్సిఎల్ 5 వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగాలకు అవకాశం కల్పించనున్న హెచ్‌సిఎల్ 

ప్రజాక్షేత్ర్, వెబ్​న్యూస్​

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో హెచ్‌సిఎల్ త్వరలో కొత్త క్యాంపస్ ప్రారంభిస్తోంది. ఇందులో అదనంగా 5 వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగాలను కల్పించనుంది. సచివాలయంలో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఛైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. విద్యార్థులకు మెరుగైన శిక్షణతో పాటు, విద్యా వనరులను విస్తరించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో హెచ్సీఎల్ భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువకులకు ప్రయోజనం చేకూర్చే నైపుణ్యాభివృద్ధికి హెచ్‌సిఎల్‌తో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.  రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధి అవకాశాల కల్పనకు హెచ్సీఎల్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అభినందించారు. హెచ్‌సిఎల్‌కు రాష్ట్ర ప్రభుత్వం తగినంత సహకారం అందిస్తుందని అన్నారు. హెచ్సీఎల్ వ్యూహత్మక భాగస్వామ్యం యువతకు ఉద్యోగాలను కల్పించటంతో  పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని  ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాలను నేర్పించి సాధికారత కల్పించేందుకు చేపట్టే కార్యక్రమాల్లో తమ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని  రోష్ని నాడార్ అన్నారు. ఉపాధి అవకాశాలతో పాటు సాంకేతిక సామర్థ్యాలను HCL GUVI పెంపొందిస్తుందని ప్రకటించారు.  తెలంగాణ ప్రభుత్వంతో తమ కంపెనీ భాగస్వామ్యం పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించి  అభ్యాసకులకు సాధికారత కల్పిస్తుందని అన్నారు. ఔత్సాహిక సాంకేతిక నిపుణులను తయారు చేస్తుందని చెప్పారు.  స్కిల్ యూనివర్శిటీతో పాటు హెచ్‌సిఎల్ విద్యా కార్యక్రమాలను తెలంగాణలో ఉన్న ఇతర విశ్వవిద్యాలయాలకు విస్తరించే ప్రణాళికలు, దీంతో ఎక్కువ మంది లబ్ధి పొందుతారనే ఆలోచనలను కూడా ఈ సమావేశంలో పంచుకున్నారు.  HCL రెండేండ్ల కిందట తమ నైపుణ్య విభాగం GUVIని  ప్రారంభించింది. దీంతో దేశీయ భాషల్లో సాంకేతిక కోర్సులను  అందిస్తోంది. ప్రధానంగా సాంకేతిక విద్యలో భాషా అవరోధాలు తొలిగించేందుకు కృషి చేస్తోంది.

]]>
Sat, 28 Sep 2024 03:26:02 +0530 admin
చారిత్రక కట్టడాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతాం : రేవంత్​ రెడ్డి https://prajakshethrenews.com/చారిత్రక-కట్టడాలను-పర్యాటక-ప్రాంతాలుగా-తీర్చిదిద్దుతాం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/చారిత్రక-కట్టడాలను-పర్యాటక-ప్రాంతాలుగా-తీర్చిదిద్దుతాం-రేవంత్-రెడ్డి చారిత్రక కట్టడాలను పర్యాటక ప్రాంతాలుగా  తీర్చిదిద్దుతాం : రేవంత్​ రెడ్డి

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తూ వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అడుగు ముందుకు పడింది. పలు చారిత్రక పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు ముందుకొచ్చారు. తెలంగాణ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం సచివాలయంలో సమావేశమయ్యారు. మంత్రి జూపల్లి కృష్ణారావు , ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో నగరంలోని పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు ఆయా సంస్థలు ముందుకొచ్చి సీఎం సమక్షంలో పర్యాటక శాఖతో ఒప్పందాలు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాటి పరిరక్షణ కోసం పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మూసీ పరివాహన ప్రాంతంలో చారిత్రక భవనాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, మూసీ ప్రక్షాళన కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు.  పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్దరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసనమండలి కార్యకలాపాలు నిర్వహిస్తామని వెల్ల‌డించారు. జూబ్లీహాల్‌కు చారిత్ర‌క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని దాని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని సీఐఐకి సూచించారు. ఉస్మానియా ఆస్పత్రి భవనాలు, హైకోర్టు, సిటీ కాలేజీ, పురానాపూల్ బ్రిడ్జి వంటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవాలన్నారు. నగరంలోని పురాతన మెట్ల బావులను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్దరణను ఇన్ఫోసిస్ సంస్థ, మంచిరేవుల మెట్ల బావిని లైఫ్ సైన్సెస్ సంస్థ దత్తత తీసుకున్నాయి.  సాలార్ జంగ్, అమ్మపల్లి బావులను భారత్ బయోటెక్ సంస్థ, అడిక్‌మెట్ మెట్ల బావిని దొడ్ల డైరీ సంస్థ, ఫలక్‌నుమా మెట్ల బావిని టీజీఆర్టీసీ సంస్థ, కోఠీలోని రెసిడెన్సీ మెట్ల బావిని ఉమెన్స్ కాలేజీ పునరుద్దరించనున్నాయి.

]]>
Sat, 28 Sep 2024 03:20:42 +0530 admin
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు శుభవార్త https://prajakshethrenews.com/ప్రభుత్వ-పాఠశాలల్లో-చదివే-విద్యార్థులకు-శుభవార్త https://prajakshethrenews.com/ప్రభుత్వ-పాఠశాలల్లో-చదివే-విద్యార్థులకు-శుభవార్త ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు శుభవార్త

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

పర్యాటక, చారిత్ర‌క ప్రాంతాలను విద్యార్థులు ఉచితంగా సందర్శించే అవకాశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించారు. 'తెలంగాణ దర్శిని' పేరుతో ఈ మేరకు కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయి. విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని విషయాలను పాఠాలుగా వినడం కంటే ప్రత్యక్షంగా చూసి అనుభవించడం వల్ల ఎక్కువ జ్ఞానాన్ని పొందుతారనే శాస్త్రీయ నిరూపణలున్న నేపథ్యంలో చారిత్ర‌క‌, పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని తలపెట్టారు. ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి సీఎం తెలంగాణ దర్శిని పోస్టర్ ను ఆవిష్కరించారు. రెండో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థులను కేటగిరీలుగా విభజించి, ఆయా ప్రాంతాల్లోని పర్యాటక క్షేత్రాలను చూపిస్తారు. రవాణా, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రభుత్వం రూ12.10 కోట్ల నిధులు విడుదల చేసింది. తొలి దశలో 1లక్ష మంది విద్యార్థులను పర్యాటక స్థలాలకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నోడల్ ఆఫీసర్లు నియమించే కమిటీలు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. తెలంగాణ దర్శినికి సంబంధించిన విధివిధానాలను జీవోలో పొందుపర్చారు.

]]>
Sat, 28 Sep 2024 03:15:55 +0530 admin
కొడంగల్ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు నాణ్యమైన పౌష్టిక అల్పాహారం అందిచాలని రూ.6.4కోట్లు విరాళం https://prajakshethrenews.com/కొడంగల్-ప్రభుత్వ-పాఠశాల-పిల్లలకు-నాణ్యమైన-పౌష్టిక-అల్పాహారం-అందిచాలని-రూ64కోట్లు-విరాళం https://prajakshethrenews.com/కొడంగల్-ప్రభుత్వ-పాఠశాల-పిల్లలకు-నాణ్యమైన-పౌష్టిక-అల్పాహారం-అందిచాలని-రూ64కోట్లు-విరాళం కొడంగల్ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు నాణ్యమైన పౌష్టిక అల్పాహారం అందిచాలని రూ.6.4కోట్లు విరాళం

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల పిల్లలకు నాణ్యమైన పౌష్టిక అల్పాహారం అందించే కార్యక్రమానికి ప్రఖ్యాత వయాట్రిస్‌ (Viatris) ఫార్మా సంస్థ తమ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.6.4కోట్లు విరాళంగా ఇచ్చింది. హరేకృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్ నియోజకవర్గంలోని  312 పాఠశాలల్లోని 28వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సమక్షంలో ఈ మేరకు రెండు సంస్థల మధ్య అవగాన ఒప్పందం (MoU) కుదిరింది. వయాట్రిస్ సీఎస్ఆర్ విభాగం బాధ్యురాలు మిచెల్ డొమినికా , హెచ్‌కెఎమ్ ఛారిటబుల్ ఫౌండేషన్ సీఈవో కౌంతేయ దాస పరస్పరం ఎంవోయూ ప‌త్రాలు మార్చుకున్నారు. సీఎస్ఆర్ వ్యవహారాలు పర్యవేక్షించే T-SIG విభాగం హెడ్ అర్చన సురేశ్ , కొడంగల్ ఏరియా అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ (KADA) ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.

]]>
Sat, 28 Sep 2024 03:12:10 +0530 admin
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జపాన్ కాన్సులేట్ జనరల్ టకాహషి మునియో https://prajakshethrenews.com/సీఎం-రేవంత్-రెడ్డిని-కలిసిన-జపాన్-కాన్సులేట్-జనరల్-టకాహషి-మునియో https://prajakshethrenews.com/సీఎం-రేవంత్-రెడ్డిని-కలిసిన-జపాన్-కాన్సులేట్-జనరల్-టకాహషి-మునియో

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జపాన్ కాన్సులేట్ జనరల్ టకాహషి మునియో 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జపాన్ కాన్సులేట్ జనరల్ టకాహషి మునియో (Takahashi Muneo) మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది. చెన్నై కేంద్రంగా పనిచేసే జపాన్ కాన్సులేట్ తెలంగాణతో కొనసాగిస్తోన్న సంబంధాలు, నిర్వహిస్తోన్న కార్యక్రమాలను ఈ సందర్భంగా టకాహషి ప్రస్తావించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిణి(RPO) జొన్నలగడ్డ స్నేహజ , ఇతర అధికారులు పాల్గొన్నారు.

]]>
Sat, 28 Sep 2024 03:08:27 +0530 admin
సీఎం రేవంత్​రెడ్డిని కలిసిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా https://prajakshethrenews.com/సీఎం-రేవంత్రెడ్డిని-కలిసిన-హెచ్సీఎల్-టెక్నాలజీస్-సంస్థ-చైర్పర్సన్-రోష్ని-నాడార్-మల్హోత్రా https://prajakshethrenews.com/సీఎం-రేవంత్రెడ్డిని-కలిసిన-హెచ్సీఎల్-టెక్నాలజీస్-సంస్థ-చైర్పర్సన్-రోష్ని-నాడార్-మల్హోత్రా సీఎం రేవంత్​రెడ్డిని కలిసిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రఖ్యాత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies Limited) సంస్థ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో టెక్నాలజీ రంగం అభివృద్ధి, తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రపంచ అవసరాలను తీర్చగలిగే స్థాయిలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలు, పెట్టుబడుల విస్తరణ పట్ల రోష్ని నాడార్ ఆసక్తి కనబర్చారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారులు, హెచ్‌సీఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

]]>
Sat, 28 Sep 2024 03:05:29 +0530 admin
భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం రేవంత్​రెడ్డికి ఆహ్వానం https://prajakshethrenews.com/భద్రకాళీ-దేవీ-శరన్నవరాత్రి-ఉత్సవాలకు-సీఎం-రేవంత్రెడ్డికి-ఆహ్వానం https://prajakshethrenews.com/భద్రకాళీ-దేవీ-శరన్నవరాత్రి-ఉత్సవాలకు-సీఎం-రేవంత్రెడ్డికి-ఆహ్వానం  భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం రేవంత్​రెడ్డికి ఆహ్వానం

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

హనుమకొండ జిల్లా శ్రీ భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా దేవస్థానం పాలక మండలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించింది. శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ శేషు, ఈవో శేషుభారతి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందజేశారు.

]]>
Sat, 28 Sep 2024 03:01:38 +0530 admin
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన సీఎం రేవంత్​ రెడ్డి https://prajakshethrenews.com/ఆచార్య-కొండా-లక్ష్మణ్-బాపూజీకి-నివాళులర్పించిన-సీఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ఆచార్య-కొండా-లక్ష్మణ్-బాపూజీకి-నివాళులర్పించిన-సీఎం-రేవంత్-రెడ్డి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన సీఎం రేవంత్​ రెడ్డి 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహానేత చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పుష్పాంజలి ఘటించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ , మైనంపల్లి రోహిత్ , శాట్ చైర్మన్ శివసేనారెడ్డి బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

]]>
Sat, 28 Sep 2024 02:55:51 +0530 admin
సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి : రేవంత్​ రెడ్డి https://prajakshethrenews.com/సాగునీటి-ప్రాజెక్టులను-త్వరగా-పూర్తి-చేయండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/సాగునీటి-ప్రాజెక్టులను-త్వరగా-పూర్తి-చేయండి-రేవంత్-రెడ్డి సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి : రేవంత్​ రెడ్డి

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. రాబోయే రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖకు దిశా నిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించి పలు సూచనలు చేశారు. ఇప్పటికే 75 శాతం, అంతకు మించి పనులు చేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే వచ్చే ఖరీఫ్‌లోగా మరింత ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశముంది. అటు గోదావరి బేసిన్, ఇటు కృష్ణా బేసిన్‌లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులకు నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు. తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించే ప్రాజెక్టులకు గ్రీన్ చానల్ ద్వారా బిల్లుల చెల్లింపులు జరగాలి.  కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం ముందుగా భూసేకరణ వేగంగా పూర్తి చేయాలి. అందుకు రెవిన్యూ విభాగంతో సమన్వయం చేసుకోవాలి. భూసేకరణలో మానవీయత ఉండాలి. భూములు ఇచ్చే వారితో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సంప్రదింపులు జరపాలి.  రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పరిధిలో పేరుకుపోయిన పూడిక తీతపై ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నవిధానాలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి.  ఏ ఏ ప్రాజెక్టులు తొందరగా పూర్తి చేసేందుకు అవకాశాలున్నాయి. వాటికి అవసరమైన నిధుల వివరాలను నీటి పారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇదే సమావేశం నుంచి అన్ని జిల్లాల ఎస్ఈలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

]]>
Sat, 28 Sep 2024 02:51:27 +0530 admin
సీ ఎం రేవంత్ రెడ్డి తో గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ లు భేటీ https://prajakshethrenews.com/సీ-ఎం-రేవంత్-రెడ్డీతో-గోదావరి-కృష్ణా-రివర్-మేనేజ్మెంట్-బోర్డు-చైర్మన్-లు-భేటీ https://prajakshethrenews.com/సీ-ఎం-రేవంత్-రెడ్డీతో-గోదావరి-కృష్ణా-రివర్-మేనేజ్మెంట్-బోర్డు-చైర్మన్-లు-భేటీ సీ ఎం రేవంత్ రెడ్డి తో గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ లు భేటీ 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) చైర్మన్ ఎం కే సిన్హా , కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) చైర్మన్ అతుల్‌ జైన్‌ తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. నీటి పారుదల శాఖ కార్యాలయం జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు , పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Fri, 27 Sep 2024 14:22:45 +0530 admin
నీళ్లు నియామకాల ఆకాంక్షల కోసమే ఏర్పడిందే తెలంగాణ: రేవంత్​రెడ్డి https://prajakshethrenews.com/నీళ్లు-నియామకాల-ఆకాంక్షల-కోసమే-ఏర్పడిన-తెలంగాణ-రేవంత్రెడ్డి https://prajakshethrenews.com/నీళ్లు-నియామకాల-ఆకాంక్షల-కోసమే-ఏర్పడిన-తెలంగాణ-రేవంత్రెడ్డి నీళ్లు నియామకాల ఆకాంక్షల కోసమే ఏర్పడిందే తెలంగాణ: రేవంత్​రెడ్డి

“ఇది మీకు ఉద్యోగం కాదు. ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. నీళ్లు నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ ఏర్పడింది. నీళ్లు మన సంస్కృతిలో భాగం. అలాంటి శాఖకు ప్రతినిధులుగా నియమితులవుతున్నారు. ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది” అని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చెప్పారు.  టీఎస్‌పీఎస్సీ ద్వారా AEE ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నీటి పారుదల శాఖ కార్యాలయం జల సౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో ముఖ్యమంత్రి  నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా AEEలను ఉద్దేశించి సీఎం పలు సూచనలు చేశారు.

]]>
Fri, 27 Sep 2024 02:19:08 +0530 admin
రాష్ట్రంలో పౌరులు అందరికీ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు : రేవంత్​రెడ్డి https://prajakshethrenews.com/రాష్ట్రంలో-పౌరులు-అందరికీ-ఫ్యామిలీ-డిజిటల్-హెల్త్-కార్డులు-రేవంత్రెడ్డి https://prajakshethrenews.com/రాష్ట్రంలో-పౌరులు-అందరికీ-ఫ్యామిలీ-డిజిటల్-హెల్త్-కార్డులు-రేవంత్రెడ్డి రాష్ట్రంలో పౌరులు అందరికీ  ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు : రేవంత్​రెడ్డి

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

రాష్ట్రంలో పౌరులు అందరికీ హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేసి ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పునరుద్ఘాటించారు. డిజిటల్ హెల్త్ కార్డుల రూపకల్పనలో ఆరోగ్య రంగంలో పనిచేస్తోన్న స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఉండాలని అభిలషించారు.  ప్రఖ్యాత దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ ప్రాంగణంలో రెనోవా క్యాన్సర్ సెంటర్‌ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ముఖ్యమంత్రి ప్రారంభించారు.  రాష్ట్రంలో ఇప్పుడున్నది సంక్షేమాభివృద్ధిని అమలు చేసే ప్రజా ప్రభుత్వమని, ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఓరియెంటెడ్ ప్రభుత్వం కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని తెలిపారు. హెల్త్ ప్రొఫైల్ కార్డుల ప్రక్రియలో సహకారానికి సంబంధించి సామాజిక బాధ్యత కలిగిన దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ లాంటి సంస్థలతో త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం మంత్రి కి సూచించారు.  క్యాన్సర్ మహమ్మారితో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారని, క్యాన్సర్ చికిత్స పేదలకు భారమవుతోందని, రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.  దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా సభ, హాస్పిటల్ సేవల విస్తరణపై యాజమాన్యం తీసుకొచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, అమలుకు ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

]]>
Fri, 27 Sep 2024 02:07:51 +0530 admin
చాకలి ఐలమ్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులు https://prajakshethrenews.com/చాకలి-ఐలమ్మకు-ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి-ఘన-నివాళులు https://prajakshethrenews.com/చాకలి-ఐలమ్మకు-ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి-ఘన-నివాళులు చాకలి ఐలమ్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులు

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ వీరనారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సీఎం తో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ , ఎమ్మెల్యే గణేష్ , పలువురు నాయకులు ఉన్నారు.

]]>
Fri, 27 Sep 2024 02:05:36 +0530 admin
జల్సాల కోసం మోహన్​ బాబు ఇంట్లో దొంగతనం..నిందితుడు అరెస్ట్​ https://prajakshethrenews.com/జల్సాల-కోసం-మోహన్-బాబు-ఇంట్లో-దొంగతనంనిందితుడు-అరెస్ట్ https://prajakshethrenews.com/జల్సాల-కోసం-మోహన్-బాబు-ఇంట్లో-దొంగతనంనిందితుడు-అరెస్ట్ జల్సాల కోసం మోహన్​ బాబు ఇంట్లో దొంగతనం..నిందితుడు అరెస్ట్​ 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

నటుడు మోహన్​ బాబు ఇంట్లో రూ.10లక్షలు కాజేసి తప్పించుకు తిరుగుతున్న  నిందితుడిని పహాడిషరీప్​ పోలీసులు అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్​కు తరలించారు. వివరాల లోకి వెళితే... జల్​పల్లిలోని మంచు టౌన్​ షిప్​ కు చెందిన సినీనటుడు మోహన్​బాబు ఇంట్లో గత ఆరు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్​ అనంతపురం జిల్లాకు చెందిన ఎర్ర వంక పల్లి విలేజ్​కు చెందిన వడితె గణేష్​ నాయక్​ (24) హౌజ్​ బాయ్​గా పనిలో చేరాడు. ఈ నెల 22వ తేదీన తిరుపతిలోని ఎం‌బి‌యూ యూనివర్సిటీ నుంచి కార్యదర్శి కిరణ్​కుమార్​ తేజ్​, గణేష్​ నాయక్​లు రూ.10లక్షలను తీసుకుని జల్ పల్లి లోని మంచు టౌన్ షిప్ కు వచ్చారు. అక్కడ  కిరణ్​కుమార్​ తన గదిలో డబ్బులు పెట్టి పడుకున్నారు. మరునాడు ఉదయం లేచి చూసేసరికి అక్కడ రూ.10లక్షలు కనిపించలేదు. వెంటనే సి.సి కెమెరాలు పరిశీలించగా గణేష్​ నాయక్​ తన గదిలోకి వచ్చి వెళ్లినట్టు కనిపించక పోవడంతో పాటు గణేష్​ నాయక్​ కూడా పరారయ్యాడు. వెంటనే జరిగిన విషయాన్ని కార్యదర్శి కిరణ్​ యజమాని మోహన్​బాబుకు జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో మోహన్​ బాబు సూచన మేరకు కిరణ్​కుమార్​ ఈ నెల 23వ తేదీన రాత్రి 10గంటలకు పహాడిషరీఫ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న గణేష్​ నాయక్​ను అదుపులోకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 7,36,400లక్షలు  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

]]>
Thu, 26 Sep 2024 02:42:58 +0530 admin
వైభవంగా ప్రతిభా పురస్కారాల ప్రధానం https://prajakshethrenews.com/వైభవంగా-ప్రతిభా-పురస్కారాల-ప్రధానం https://prajakshethrenews.com/వైభవంగా-ప్రతిభా-పురస్కారాల-ప్రధానం వైభవంగా ప్రతిభా పురస్కారాల ప్రధానం 

ప్రజాక్షేత్ర్, వెబ్​న్యూస్​ 

చంపాపేట్​ లోని మందయాదవ రెడ్డి గార్డెన్స్ లో తెలంగాణ వారాల సంఘం చైర్మన్ కొరిగింజ శ్రీరాములు ​  ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు గాజుల చంద్రశేఖర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ప్రతి భావంతులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య సలహదారులు గాజుల కృష్ణ, రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు కందుకూరి లక్ష్మినారాయణ, మాజీ బి సి కమిషన్ చైర్మన్ వకులాభారణం కృష్ణ మోహాన్, ఉమెన్ & చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ జాయింట్ డైరెక్టర్ లక్షీదేవి , సంఘ శ్రేయోభిలాషులు ముక్త అంజయ్య, బౌరిశెట్టి వెంకన్న, గుంటి ప్రసాద్, ఆల పురుషోత్తం, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు న్యామాల రమేష్ , ప్రధాన కార్యదర్శి బండి భాస్కర్, రాష్ట్ర యువజన అధ్యక్షులు ముక్త కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

]]>
Thu, 26 Sep 2024 00:36:53 +0530 admin
నడిరోడ్డుపై హద్దులు దాటిన ముద్దులు https://prajakshethrenews.com/నడిరోడ్డుపై-హద్దులు-దాటిన-ముద్దులు https://prajakshethrenews.com/నడిరోడ్డుపై-హద్దులు-దాటిన-ముద్దులు నడిరోడ్డుపై హద్దులు దాటిన ముద్దులు 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

నడిరోడ్డు పై  ప్రేమికులు వికృతచేష్టలకు పాల్పడుతున్నారు....తాము నడిరోడ్డుపై ఉన్నామన్నధ్యాసనే మరిచారు...ఏకంగా బైక్ పై ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ ముద్దులు పెట్టుకుంటున్న చిత్రాలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. ఇదంతా హైదరాబాద్ నగర శివార్లలోని పహాడీషరీఫ్ ప్రధాన రహదారిలో ఓ ప్రేమికుల జంట బైక్‌పై వెళ్తూ కెమెరాకు చిక్కింది. రోడ్డు మీద ఉన్నామన్న సంగతి మరిచారు. ఏకంగా బైక్​ వెనుక సీటులో సదరు యువతి కూర్చోకుండా బైక్​  పెట్రోల్​ ట్యాంక్​ పై భాగంలో రివర్స్​ కూర్చొని ప్రేమికునికి ముద్దులు వర్షం కురిపించింది. పక్కన వెళ్తున్న తోటి వాహాదారులు ఏం మాయ రోగం అంటూ సిగ్గుతో తలదించుకున్నారు. ఆ ముద్దులకు  అతను రయి....రయిమంటూ రోడ్డుపై దూసుకెళ్ళే చిత్రం కెమెరా కంటపడింది.  వారిద్దరి భాగోతం వెలుగు లోకి వచ్చింది. దీంతో రోడ్డు పై న్యూసెన్స్​ చేసిన ఆ జంట ఆచూకీ  కోసం పోలీసులు ఆరాతీస్తున్నారు. 

]]>
Thu, 26 Sep 2024 00:25:22 +0530 admin
వారసత్వ సంపదను కాపాడుకోవాలి https://prajakshethrenews.com/వారసత్వ-సంపదను-కాపాడుకోవాలి https://prajakshethrenews.com/వారసత్వ-సంపదను-కాపాడుకోవాలి వారసత్వ సంపదను కాపాడుకోవాలి

డెక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ చైర్మన్ వేద కుమార్

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

చరిత్రను అన్వేషించడానికి, అధ్యయనం చేయడానికి విద్యార్థులను ప్రేరేపించడం కోసం హెరిటేజ్ వాక్ వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని, వారసత్వ సంపదను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని డెక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ చైర్మన్ వేద కుమార్ అన్నారు. పర్యాటక వారోత్సవాలలో భాగంగా సిటీ కళాశాల కామర్స్ మేనేజ్మెంట్ విభాగం సిటీ కాలేజి నుండి పురాని హావేలి వరకు నిర్వహించిన హెరిటేజ్ వాక్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సీనియర్ ఆర్కిటెక్ట్ తాన్యా శ్రీవాత్సవ ఆధ్వర్యంలో మూడు గంటలు సాగిన ఈ నడకలో విద్యార్థులు హై కోర్టు, ఆషుర్ ఖానా, దివాన్ దేవిడి, పురాని హావేలికి సంబంధించిన అనేక విశేషాలు తెలుసుకున్నారు. ఆషుర్ ఖానా లో 400 ఏళ్ళనాటి పర్షియన్ పాలీక్రోమ్ టైల్స్‌తో పరచిన చిత్రాలు, పురాని హావేలిలో ఏర్పాటు చేసిన మ్యూజియంలోని వస్తువులు తమను ఆకట్టుకున్నాయని,  ఇలాంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించటం వల్ల తమకు కోర్సు పట్ల మరింత ఆసక్తి పెరుగుతుందని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.మల్లికార్జున్ రావు, డా. నీరజ, డా.ఝాన్సీ, డా.రవీంద్ర బాబు, నేహా, రాజేష్, అరుణ తదితరులు పాల్గొన్నారు. 

]]>
Thu, 26 Sep 2024 00:03:40 +0530 admin
చారిత్రక నగరాల అధ్యయనం ఆసక్తిదాయకం https://prajakshethrenews.com/చారిత్రక-నగరాల-అధ్యయనం-ఆసక్తిదాయకం https://prajakshethrenews.com/చారిత్రక-నగరాల-అధ్యయనం-ఆసక్తిదాయకం చారిత్రక నగరాల అధ్యయనం ఆసక్తిదాయకం

 ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

భారతదేశంలో అతి పురాతన, చారిత్రక నగరాలలో ఒకటైన హైదరాబాద్ గొప్ప సంస్కృతికి చిరునామా అని సీనియర్ ఆర్కిటెక్ట్ తాన్యా శ్రీవాత్సవ అన్నారు.  ఈ నగర చరిత్రను తెలుసుకోవటం విద్యార్థులకు, పర్యటకులకే కాక అందరికీ ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. పర్యటక వారోత్సవాలలో భాగంగా సిటీ కళాశాల టూరిజం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆమో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. గోల్కొండ నుండి హైదరాబాద్ వరకు,  కాకతీయులు, బహమనీలు, మొఘలులు,  అసఫ్జాహీలతో సహా వివిధ రాజవంశాలచే ప్రభావితమైన నిర్మాణ శైలుల విశిష్టతను ఆమె వివరించారు. ఇండో-పర్షియన్, యూరోపియన్,  ఇండో-యూరోపియన్,  ఇండో-సార్శనిక్ శైలిలో ఉన్న నగరంలోని వారసత్వ కట్టడాలు పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తాయని అన్నారు. అనంతరం ఐజాజ్ సుల్తానా మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి దేశవిదేశాల నుండి పర్యటకులు వస్తారని, ఇక్కడి రుచులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, నగరంలోని వివిధ ప్రదేశాల పేర్లకు సంబంధించిన చరిత్రను తెలుసుకోవటం కూడా విజ్ఞానదాయకంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐక్యూఏసి కోఆర్డినేటర్ డా.నీరజ మాట్లాడుతూ బిబిఏ టూరిజం విద్యార్థులకు క్షేత్ర స్థాయి అవగాహన కోసం వివిధ విద్యార్థి కేంద్రక కార్యక్రమాలను ఈ వారమంతా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజు సదస్సుతో పాటు న్యూట్రిషన్ విద్యార్థులు తెలంగాణ ప్రత్యేక వంటకాలను తయారుచేసి అధ్యాపకులకు, తోటి విద్యార్థులకు రుచి చూపించారని అన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న రాజనీతి శాస్త్ర అధ్యాపకులు డా.భాస్కర్ మాట్లాడుతూ ప్రపంచమంతా కుగ్రామంగా మారి గుప్పెట్లోకి వచ్చిందని, ఇప్పుడు విద్యార్థులు ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న ప్రదేశాల గురించైనా తెలుసుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో కామర్స్ మేనేజ్మెంట్ విభాగం అధ్యక్షులు డా.మల్లికార్జున్,సుమన యాదగిరి, డా.రవీంద్ర బాబు, నేహా, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Thu, 26 Sep 2024 00:00:51 +0530 admin
జాతీయోద్యమ స్ఫూర్తినందిస్తున్న భాష& హిందీ భాష https://prajakshethrenews.com/జాతీయోద్యమ-స్ఫూర్తినందిస్తున్న-భాష-హిందీ-భాష https://prajakshethrenews.com/జాతీయోద్యమ-స్ఫూర్తినందిస్తున్న-భాష-హిందీ-భాష జాతీయోద్యమ స్ఫూర్తినందిస్తున్న భాష- హిందీ భాష

సిటీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. విప్లవ్ దత్ శుక్లా 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

ప్రభుత్వ సిటీ కళాశాలలో హిందీ దివస్ వేడుకలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. విప్లవ్ దత్ శుక్లా ఆధ్వర్యంలో జరిగిన ముగింపు సభకు  ఉర్దూ విభాగం అధ్యక్షులు  డా. సయ్యద్ అస్రార్-అల్-హక్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  హిందీ పక్షం సందర్భంగా విద్యార్థులకు హిందీ భాషా సాహిత్యాలపై వివిధ పోటీలు నిర్వహించారు. అనంతరం  వైస్ ప్రిన్సిపాల్ డా.విప్లవ్ దత్ శుక్లా మాట్లాడుతూ భారత రాజ్యాంగ సభ ద్వారా హిందీని అధికారిక భాషగా స్వీకరించిన రోజుకు గుర్తుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవం జరుపుకుంటామని, భారత జాతీయోద్యమంలో సాధారణ ప్రజలందరిని ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఎంతో తోడ్పడిందని గుర్తు చేశారు.  హిందీ విభాగాధిపతి డా.రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ ఒక్క భారతదేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాషలలో హిందీ మూడవదని, ఆయా దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయటం భాష ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. అనంతరం  డా. సయ్యద్ అస్రార్   విజేతలకు బహుమతులు అందించారు. హిందీ కవితా రచనలో అస్రా బేగం ప్రథమ, జ్యోతి కుమారి ద్వితీయ, జీనత్ పర్వీన్ తృతీయ స్థానంలో నిలిచారు.వ్యాస రచనలో బి.ఇ రమేష్  ప్రథమ, కృపా లత ద్వితీయ, మెహరాజ్ ఖాన్ తృతీయ స్థానంలో నిలిచారు. పోస్టర్ పెయింటింగ్‌లో రాఖీ కుమారి మొదటి స్థానంలో నిలవగా, జ్యోతి కుమారి రెండో స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో హిందీ విభాగం సహాచార్యులు డా. యువరాజ్ ధావన్ తదితరులు పాల్గొన్నారు. 

]]>
Wed, 25 Sep 2024 23:56:17 +0530 admin
మహిళా జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తా : చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి https://prajakshethrenews.com/మహిళా-జర్నలిస్టుల-సంక్షేమానికి-ప్రత్యేక-కృషి-చేస్తా-చైర్మన్-కె-శ్రీనివాస్-రెడ్డి https://prajakshethrenews.com/మహిళా-జర్నలిస్టుల-సంక్షేమానికి-ప్రత్యేక-కృషి-చేస్తా-చైర్మన్-కె-శ్రీనివాస్-రెడ్డి మహిళా జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తా :

-మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

రాష్ట్రంలో మహిళా జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం  బషీర్ బాగ్ లోని దేషోద్దారక భవన్లో జరిగిన మహిళా జర్నలిస్టుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మీడియా రంగంలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుల కోసం, వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టంలో ప్రత్యేక సౌకర్యాలు, రక్షణ కల్పించాలనే అమెండ్మెంట్స్ ఉన్నాయని,  వాటిని యాజమాన్యాలు ఎంతవరకు అమలు పర్చతున్నారనే విషయంలో ఆరాతీస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల కోసం అమలు చేసే సంక్షేమ పథకాల్లో, మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక కోటా కోసం కృషి చేస్తానని శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. అక్రెడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా, వృత్తిలో సీనియారిటీ ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మీడియా సంస్థల్లో ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు ఐక్యమై, వారి హక్కుల సాధన కోసం కృషి చేస్తున్నట్లుగా, మహిళా జర్నలిస్టులు కూడా సంఘటితంగా ముందుకురావాలని ఆయన సూచించారు. త్వరలో హైదరాబాద్ వేదికగా,  జాతీయ స్థాయి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ నిర్వహించేందుకు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ మాట్లాడుతూ మహిళా జర్నలిస్టుల భద్రతా, సంక్షేమం కోసం తమ సంఘం ఎంతో కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే వారిని ఏకం చేసి, హక్కుల సాధన కోసం పోరాటాల్ని మరింత ఉదృతం చేసేందుకు గాను తమ సంఘంలో మహిళా విభాగాన్ని పటిష్టం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కళ్యాణం రాజేశ్వరీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, మహిళా విభాగం కన్వీనర్ పొట్లపల్లి స్వరూప, సభ్యులు యశోదా, సాజీదా బేగం, తరుణి, ప్రతిభలతో పాటు పలువురు మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు.

]]>
Wed, 25 Sep 2024 03:01:12 +0530 admin
పద్మశ్రీ మొగిలయ్య కు 600 గజాల స్థలం పత్రాలను అందజేసిన సీఎం రేవంత్​ రెడ్డి https://prajakshethrenews.com/పద్మశ్రీ-మొగిలయ్య-కు-600-గజాల-స్థలం-పత్రాలను-అందజేసిన-సీఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/పద్మశ్రీ-మొగిలయ్య-కు-600-గజాల-స్థలం-పత్రాలను-అందజేసిన-సీఎం-రేవంత్-రెడ్డి పద్మశ్రీ మొగిలయ్య కు 600 గజాల స్థలం పత్రాలను అందజేసిన సీఎం రేవంత్​ రెడ్డి 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

ప్రముఖ కిన్నెర వాయిద్య కారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి మంగళవారం ఇంటి స్థలం ధ్రువపత్రాలను అందజేశారు. ప్రభుత్వం హయత్ నగర్ లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించగా, అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి సీఎం అందించారు. స్థలం పత్రాలను అందించినందుకు ఈ సందర్భంగా కిన్నెర మొగిలయ్య సీఎం రేవంత్​రెడ్డికి  కృతజ్ఞతలు తెలియజేశారు.

]]>
Wed, 25 Sep 2024 01:13:42 +0530 admin
ప్ర‌తి కుటుంబానికి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులు https://prajakshethrenews.com/ప్రతి-కుటుంబానికి-ఫ్యామిలీ-డిజిటల్-కార్డులు https://prajakshethrenews.com/ప్రతి-కుటుంబానికి-ఫ్యామిలీ-డిజిటల్-కార్డులు ప్ర‌తి కుటుంబానికి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులు 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో 

రాష్ట్రంలో ప్ర‌తి కుటుంబానికి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. రేష‌న్‌, ఆరోగ్య‌, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాలన్నింటికీ ఉపయోగపడేలా ఒకే కార్డు అందించాల‌ని భావిస్తోంది. ఈ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులో ప్ర‌తి కుటుంబ స‌భ్యుని హెల్త్ ప్రొఫైల్ పొందుపరచడమే కాకుండా దీర్ఘ‌కాలంలో వైద్య సేవ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఉండాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు.డిజిటల్ హెల్త్ కార్డుల జారీ అంశంపై వైద్యారోగ్య, పౌర సరఫరాల శాఖ మంత్రులు, అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. కుటుంబాల్లో కొత్త స‌భ్యులు చేరినప్పుడు లేదా తొల‌గించాల్సి వచ్చినప్పుడు కార్డును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకునేలా వ్యవస్థ ఉండాల‌ని ఆదేశించడంతో పాటు పలు సూచనలు చేశారు.కుటుంబాల స‌మ‌గ్ర వివ‌రాల న‌మోదుతో ఇప్ప‌టికే రాజ‌స్థాన్, హ‌ర్యానా, క‌ర్ణాట‌క రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్య‌య‌నం చేసి నివేదిక రూపొందించాలి.తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌తి శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఒక ప‌ట్ట‌ణ‌, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని పైలెట్ ప్రాజెక్టు కింద కార్యాచ‌ర‌ణ ప్రారంభించాలి.అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందేలా ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులు ఉండాల‌ని, ఈ కార్డుల‌తో ల‌బ్ధిదారులు ఎక్క‌డైనా రేష‌న్‌, ఆరోగ్య సేవ‌లు పొందేలా ఉండాలి.ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల వ్య‌వ‌స్థ మానిట‌రింగ్ కోసం జిల్లాల వారీగా వ్యవస్థల‌ను ఏర్పాటు చేయాలి.

]]>
Tue, 24 Sep 2024 04:26:42 +0530 admin
ముఖ్యమంత్రి సహాయ నిధికి మహేష్ బాబు విరాళం https://prajakshethrenews.com/ముఖ్యమంత్రి-సహాయ-నిధికి-మహేష్-బాబు-విరాళం https://prajakshethrenews.com/ముఖ్యమంత్రి-సహాయ-నిధికి-మహేష్-బాబు-విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి మహేష్ బాబు విరాళం 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

వరద బాధితుల సహాయార్థం అగ్ర నటుడు మహేశ్ బాబు  ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసిన మహేశ్ బాబు దంపతులు ఈ మేరకు విరాళం చెక్కు అందజేశారు. ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ (AMB) తరపున కూడా మరో 10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. మహేశ్  వెంట సతీమణి నమ్రత కూడా ఉన్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న మహేష్ము బాబు దంపతులను ముఖ్యమంత్రి అభినందించారు.

]]>
Mon, 23 Sep 2024 18:04:09 +0530 admin
తెలంగాణ ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌లు బాగున్నాయ‌ని ప్రశంసించిన ప్ర‌పంచ బ్యాంకు https://prajakshethrenews.com/తెలంగాణ-ప్రభుత్వ-ప్రాధాన్యతలు-బాగున్నాయని-ప్రశంసించిన-ప్రపంచ-బ్యాంకు https://prajakshethrenews.com/తెలంగాణ-ప్రభుత్వ-ప్రాధాన్యతలు-బాగున్నాయని-ప్రశంసించిన-ప్రపంచ-బ్యాంకు తెలంగాణ ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌లు బాగున్నాయ‌ని ప్రశంసించిన ప్ర‌పంచ బ్యాంకు 

ప్రజాక్షేత్ర్ , తెలంగాణ బ్యూరో 

అభివృద్ధి విష‌యంలో  తెలంగాణ ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌లు బాగున్నాయ‌ని ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధి బృందం ప్ర‌శంసించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్ర‌పంచ‌బ్యాంకు ద‌క్షిణాసియా ప్రాంత ఉపాధ్య‌క్షుడు మార్టిన్ రైజ‌ర్ నేతృత్వంలోని బృందం భేటీ అయింది. ముఖ్య‌మంత్రి గత నెలలో అమెరికా పర్యటనలో భాగంగా ప్ర‌పంచ‌బ్యాంక్ అధ్య‌క్షుడు అజ‌య్ బంగాతో సమావేశం కాగా, తదుప‌రి చ‌ర్చ‌ల కోసం మార్టిన్ రైజ‌ర్ బృందం హైదరాబాద్ వచ్చింది. ఈ సంద‌ర్భంగా ప‌ట్ట‌ణ మౌలిక వ‌స‌తుల అభివృద్ధి, విద్యా, వైద్య‌, సాగు నీటి రంగాల‌ను త‌మ ప్ర‌భుత్వ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నామ‌ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు. ఆయా ఆయా రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టుల‌కు ఆర్థిక స‌హకారం అందించాలని కోరారు. విద్యా, వైద్య రంగాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దార్శ‌నిక‌త బాగుంద‌ని, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణ‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని మార్టిన్ రైజ‌ర్ ప్ర‌శంసించారు. ప్ర‌పంచ బ్యాంకు ఏ రంగాలను ప్రాధాన్య అంశాలుగా ఎంచుకుందో అవే తెలంగాణ ప్ర‌భుత్వ ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయ‌ని అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించేందుకు తాము ఆస‌క్తిగా ఉన్నామ‌ని తెలిపారు. స‌మావేశంలో మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి,  ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి , పలు విభాగాల ఉన్నతాధికారులు, వ‌ర‌ల్డ్ బ్యాంక్‌  కంట్రీ ఆప‌రేష‌న్ హెడ్ పాల్ ప్రోసీ, అర్బ‌న్ ఇన్‌ఫ్రా, ప్రాజెక్ట్ లీడ్ న‌టాలియా , డిజిట‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ సీనియ‌ర్ స్పెష‌లిస్ట్ మ‌హిమాప‌త్ రే  తదితరులు పాల్గొన్నారు.

]]>
Mon, 23 Sep 2024 02:39:24 +0530 admin
కొండా లక్ష్మణ్ బాపూజీ కి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/కొండా-లక్ష్మణ్-బాపూజీ-కి-నివాళులర్పించిన-సీఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/కొండా-లక్ష్మణ్-బాపూజీ-కి-నివాళులర్పించిన-సీఎం-రేవంత్-రెడ్డి కొండా లక్ష్మణ్ బాపూజీ కి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

 ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

స్వాతంత్య్రసమర యోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో బాపూజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బాపూజీ తపించారని, వారి స్ఫూర్తిని ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు.

]]>
Sun, 22 Sep 2024 00:34:56 +0530 admin
వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా చర్యలు తీసుకోండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/వంద-అసెంబ్లీ-నియోజకవర్గాల్లో-ఐటీఐఏటీసీలు-ఉండేలా-చర్యలు-తీసుకోండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/వంద-అసెంబ్లీ-నియోజకవర్గాల్లో-ఐటీఐఏటీసీలు-ఉండేలా-చర్యలు-తీసుకోండి-రేవంత్-రెడ్డి వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా చర్యలు తీసుకోండి : రేవంత్ రెడ్డి

ప్రజాక్షేత్ర్, తెలంగాణబ్యూరో

రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా మార్చుతున్న నేపథ్యంలో ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక రంగంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని చెప్పారు.  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇండస్ట్రీకి అవసరమైన రీతిలో ఏటీసీల్లో సిలబస్ మార్పునకు ఉన్నతస్థాయి కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలతో పాటు స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని చెప్పారు.  పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఐటీఐలు లేని  అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి నివేదిక సమర్పించాలని అన్నారు.  రాష్ట్రంలో కనీసంగా వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వృత్తి నైపుణ్యం అందించే ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలు స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధివిధానాలను రూపొందించాలని చెప్పారు.

]]>
Sun, 22 Sep 2024 00:16:25 +0530 admin
రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తా : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/రాజన్న-సిరిసిల్ల-జిల్లా-నేరెళ్ల-బాధితులకు-న్యాయం-చేస్తా-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/రాజన్న-సిరిసిల్ల-జిల్లా-నేరెళ్ల-బాధితులకు-న్యాయం-చేస్తా-రేవంత్-రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తా : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ , విప్ ఆది శ్రీనివాస్ లతో కలిసి నేరెళ్ల బాధితులు సచివాలయంలో ముఖ్యమంత్రి తో భేటీ అయ్యారు. 2017 నాటి ఘటనల్లో ఇసుక లారీల వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నాయని అడిగినందుకు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితులు ఆరోపించారు. బాధ్యులైన పోలీస్ అధికారులతో పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీస్ సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని బాధితులు సీఎంకు విజ్ఞప్తి చేశారు.

]]>
Sat, 21 Sep 2024 02:52:36 +0530 admin
హైడ్రా కు మరిన్ని అధికారాలు : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/హైడ్రా-కు-మరిన్ని-అధికారాలు-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/హైడ్రా-కు-మరిన్ని-అధికారాలు-రేవంత్-రెడ్డి హైడ్రా కు మరిన్ని అధికారాలు : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో : 

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరును, తెలుగు విశ్వవిద్యాలయానికి  సురవరం ప్రతాపరెడ్డి పేరును, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ  పేరును మంత్రిమండలి నిర్ణయించింది. హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రాను బలోపేతం చేయడం, వాల్టా చట్టంతో పాటు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ బోర్డుకు ఇప్పుడున్న అధికారాలను హైడ్రా కమిషనర్‌కు అప్పగించడం.తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఓఆర్ఆర్ లోపల ఉన్న హైదరాబాద్ సిటీ ఏరియా) పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలన్నీ పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుంది. కోర్ అర్బన్ రీజియన్‌లో జీహెచ్ఎంసీతో పాటు 27 అర్బన్ లోకల్ బాడీస్, 51 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో హైడ్రా కమిషనర్‌కు అవసరమైన అధికారాలు కల్పించేలా చట్ట సవరణకు కేబినేట్ ఆమోదం.కోర్ అర్బన్ సిటీలోని అన్ని చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా సీసీ కెమెరాలతో నిఘా పెట్టి ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయడం. హైడ్రాకు అవసరమైన దాదాపు 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్ మీద నియమించుకునేందుకు అనుమతి. ఖరీఫ్ సీజన్ నుంచే సన్నవడ్లకు 500 రూపాయల బోనస్. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్వర్యంలో 12 మందితో కమిటీ ఏర్పాటు.ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమును ఎస్పీఎఫ్‌కు కూడా వర్తింపజేయడం.తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌కు భూమి కేటాయింపు. ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 58 ఎకరాల భూమి కేటాయింపు.ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో ఏర్పాటు చేసిన ఫైర్ స్టేషన్‌కు 34 మంది సిబ్బంది మంజూరు.రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 మెడికల్ కాలేజీలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన దాదాపు 3 వేల పోస్టుల మంజూరు.ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులను రెండేండ్లలో పూర్తి చేసి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించి రైతుల చిరకాల కోరికను నెరవేర్చడం.కోస్గి ఇంజనీరింగ్ కాలేజీకి, హకీంపేటలో జూనియర్ కాలేజీకి అవసరమైన పోస్టులు మంజూరు అయ్యాయి.

]]>
Sat, 21 Sep 2024 02:47:55 +0530 admin
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/గల్ఫ్-కార్మికుల-సంక్షేమం-కోసం-ప్రత్యేక-శ్రద్ధ-తీసుకుంటున్న-ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/గల్ఫ్-కార్మికుల-సంక్షేమం-కోసం-ప్రత్యేక-శ్రద్ధ-తీసుకుంటున్న-ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం  ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

గల్ఫ్ దేశాల్లో కార్మికులెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో : 

తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం  ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ , విప్ ఆది శ్రీనివాస్, గల్ఫ్ సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు.ముఖ్యమంత్రి  ఇచ్చిన హామీ మేరకు, గల్ఫ్ దేశాల్లో కార్మికులెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే, గల్ఫ్ కార్మికుల కష్టనష్టాలను అధ్యయనం చేయడానికి ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయడం, గల్ఫ్ వర్కర్ల కుటుంబాల సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణిని ఏర్పాటు చేయడం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ల అడ్మిషన్లలో ప్రాధాన్యతనివ్వడం వంటి అంశాలతో ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఈ నేపథ్యంలో గల్ఫ్ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.

]]>
Sat, 21 Sep 2024 02:41:32 +0530 admin
సింగ‌రేణి కార్మికులకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీపి క‌బురు https://prajakshethrenews.com/సింగరేణి-కార్మికులకు-ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి-తీపి-కబురు https://prajakshethrenews.com/సింగరేణి-కార్మికులకు-ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి-తీపి-కబురు సింగ‌రేణి కార్మికులకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీపి క‌బురు

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో : 

సింగ‌రేణి కార్మికులకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీపి క‌బురు అందించారు. గ‌తేడాది సింగ‌రేణి సంస్థ ఉత్ప‌త్తి, గ‌డించిన లాభాల ఆధారంగా బోన‌స్‌ను ప్రకటించారు. ఒక్కో కార్మికునికి రూ.1.90 ల‌క్ష‌లు, కాంట్రాక్ట్ కార్మికుల‌కు రూ.5 వేలు చొప్పున బోన‌స్ చెల్లించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న ప్ర‌క్రియ‌లో సింగ‌రేణి కార్మికులు అగ్ర‌భాగాన నిలిచార‌ని, ఉద్యమాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్ల‌డంతో గ‌ని కార్మికుల పాత్ర మ‌రువ‌లేనిద‌ని ముఖ్య‌మంత్రి గుర్తుచేశారు.సింగ‌రేణి లాభాలు, విస్త‌ర‌ణ‌.. బోన‌స్‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఉప ముఖ్య‌మంత్రి మల్లు భట్టివిక్రమార్క వివ‌రించారు. సింగ‌రేణి కార్మికుల శ్ర‌మ‌తో 2023-24 సంవ‌త్స‌రంలో సంస్థ‌కు మొత్తంగా రూ.4,701 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. ఇందులో సంస్థ విస్త‌ర‌ణ‌, పెట్టుబ‌డుల‌కు రూ.2,289 కోట్లు కేటాయించ‌గా మిగిలిన‌వి రూ.2,412 కోట్లు. ఇందులో మూడో వంతు రూ. 796 కోట్ల‌ను కార్మికుల‌కు బోన‌స్‌గా ప్ర‌క‌టించారు.సింగ‌రేణిలో మొత్తం 41,387 మంది శాశ్వ‌త కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. ఒకొక్క‌రికి బోన‌స్ కింద రూ.1.90 ల‌క్ష‌లు. గ‌తేడాది సింగ‌రేణి కార్మికుల‌కు అందిన బోన‌స్‌ రూ.1.70 ల‌క్ష‌లు మాత్ర‌మే. గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా ఒకొక్క‌రికి రూ.20 వేలు.సింగ‌రేణి సంస్థ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికుల‌కు కూడా బోన‌స్ చెల్లింపు. సంస్థ‌లోని 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు తొలిసారి రూ.5 వేల చొప్పున బోన‌స్‌.సింగ‌రేణి సంస్థ భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు పెట్టుబ‌డులు పెట్టాల‌ని నిర్ణ‌యం. సోలార్ విద్యుదుత్ప‌త్తి కేంద్రాన్ని 1000 మెగావాట్ల‌కు విస్త‌రించ‌డం, రామ‌గుండంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం, జైపూర్‌లోని ప్ర‌స్తుత థ‌ర్మ‌ల్ విద్యుదుత్ప‌త్తి కేంద్రంలో మ‌రో 1x800 మెగావాట్ల సామ‌ర్థ్యం క‌ల మ‌రో థ‌ర్మ‌ల్ విద్యుదుత్ప‌త్తి కేంద్రం, రామ‌గుండంలో టీఎస్ జెన్ కో ఆధ్వ‌ర్యంలో మ‌రో 1x800 మెగావాట్ల థ‌ర్మ‌ల్ విద్యుదుత్ప‌త్తి కేంద్రం, ఒడిశాలోని నైనీ బ్లాక్‌పైన (పిట్‌హెడ్‌) 2,400 మెగావాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన సూప‌ర్ క్రిటిక‌ల్ థ‌ర్మ‌ల్ విద్యుదుత్ప‌త్తి కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం.వీటితో పాటు సింగరేణి కుటుంబాల సంక్షేమానికి పాఠశాలలు, హైదరాబాద్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం.

]]>
Sat, 21 Sep 2024 02:34:54 +0530 admin
అంతరిస్తున్న వృక్షజాతుల పట్ల అప్రమత్తంగా ఉండాలి https://prajakshethrenews.com/అంతరిస్తున్న-వృక్షజాతుల-పట్ల-అప్రమత్తంగా-ఉండాలి https://prajakshethrenews.com/అంతరిస్తున్న-వృక్షజాతుల-పట్ల-అప్రమత్తంగా-ఉండాలి అంతరిస్తున్న వృక్షజాతుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

-విశ్రాంత ఆచార్యులు మనోహరా చారి

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని, ముఖ్యంగా వృక్షశాస్త్ర విద్యార్థులు శాస్త్రీయ పరిశోధనల ద్వారా జీవవైవిధ్యాన్ని,  జీవ పరిణామశాస్త్రాన్ని అధ్యయనం చేయాలని విశ్రాంత ఆచార్యులు మనోహరా చారి అన్నారు.  వృక్ష వర్గీకరణ, హెర్బేరియం, ఆధునిక పద్ధతులపై అధ్యాపకులకు, విద్యార్థులకు సిటీ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం నిర్వహించిన రెండు రోజుల కార్యశాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మనకు తెలియకుండానే మన వృక్షజాతులు అంతరిస్తున్నాయని,  కొన్నింటిపై విదేశీయులు పేటెంట్లు పొందుతున్నారని, దీనికి ప్రధాన కారణం మనకు పర్యావరణం పట్ల ఉన్న అవగాహన లోపమన్నారు. భారతీయ వృక్ష పరిశోధనా సంస్థ, కలకత్తా డైరెక్టర్ మావో ఆన్ లైన్ లో మాట్లాడుతూ మొక్కల వర్గీకరణ, టిష్యూ కల్చర్ ఎలా పునరుత్పత్తి చేయవచ్చో వివరించారు. అనంతరం శాస్త్రవేత్త సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రిమోట్ సెన్సింగ్ ద్వారా జీవావరణాన్ని గమనించటం, పరిశోధించడం ద్వారా ప్రస్తుతానికి మాత్రమే కాక ప్రాచీన కాలంలో వృక్షజాతులు ఎన్ని ఉండేవో, ఎన్ని అంతరించిపోయాయో తెలుసుకోవచ్చని,  భవిష్యత్తులో పరిస్థితుల గురించి పరిశోధనకు ఆధునిక సాంకేతికత ఉపయోగపడుతుందని అన్నారు. దక్కన్ పీఠభూమి రాష్ట్రాలకు ఒక ప్రధాన పరిశోధన సంస్థగా ఉన్న భారతీయ వృక్ష పరిశోధనా సంస్థ హైదరాబాద్ విభాగానికి డైరెక్టర్ గా ఉన్న రసింగం మాట్లాడుతూ విభాగం చేస్తున్న కృషి గురించి తెలియజేశారు. అందులో విద్యార్థులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు గల అవకాశాలను వివరించారు. అనంతరం ప్రిన్సిపాల్ ఆచార్య బాల భాస్కర్ మాట్లాడుతూ వృక్ష శాస్త్ర విభాగం అరుదైన కార్యశాల నిర్వహిస్తున్నదని, నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఇతర కాలేజీల నుండి హాజరైన అధ్యాపకులు, విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

]]>
Fri, 20 Sep 2024 23:11:01 +0530 admin
అధ్యాపకుడు రోబోలా కాకుండా, సజీవ స్ఫూర్తి తో బోధించాలి : ఆచార్య లింబాద్రి https://prajakshethrenews.com/అధ్యాపకుడు-రోబోలా-కాకుండా-సజీవ-స్ఫూర్తి-తో-బోధించాలి-ఆచార్య-లింబాద్రి https://prajakshethrenews.com/అధ్యాపకుడు-రోబోలా-కాకుండా-సజీవ-స్ఫూర్తి-తో-బోధించాలి-ఆచార్య-లింబాద్రి అధ్యాపకుడు రోబోలా కాకుండా, సజీవ స్ఫూర్తి తో బోధించాలి : ఆచార్య లింబాద్రి

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

విదేశీ విద్యార్థులకు ధీటుగా మన విద్యార్థులు కూడా నిలబడాలన్న సంకల్పంతో, కోవిడ్ సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్రిటీష్ కౌన్సిల్  సహకారంతో యుకె లో 7 విశ్వవిద్యాలయాలు సందర్శించి బికాం ఫైనాన్స్, బిఎ స్పెషల్ కోర్సుల రూపకల్పన చేశామని ఆచార్య లింబాద్రి అన్నారు. సిటీ కళాశాలలో నూతన డిగ్రీ కోర్సులపై అధ్యాపకులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచీకరణ, ఇంటర్నేషలైజేషన్ నేపథ్యంలో అంతర్జాతీయ విద్యాప్రమాణాలతో ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో ఉన్నత విద్యామండలి కృషి చేస్తున్నదని అన్నారు. అధ్యాపకులు తమ జ్ఞాన పరిధులను విస్తరింప జేసుకోవడానికి, మెరుగైనబోధనా పద్ధతులను సమకూర్చుకోడానికి అధ్యాపకుల శిక్షణా కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. భారతదేశంలో మిగతా రాష్ట్రాలకంటే భిన్నంగా   ఎక్కువమంది విద్యార్థులు ఇంజినీరింగ్, తెలంగాణలో కామర్స్ కోర్సులకు  ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. ఎంతమంది విద్యార్థులు కోర్సును చదివారనేది కాక, ఎంతమంది ఉపాధి అవకాశాలు పొందారు?   ఎంతమంది విద్యావేత్తలుగా మారారు అన్నది ముఖ్యమన్నారు. అధునాతన బోధన, అభ్యసన, మూల్యాంకన పద్ధతుల ద్వారా మరింత నిర్మాణాత్మకంగా పాఠ్యప్రణాలికలోని విలువలను విద్యార్థుల హృదయాల్లో ప్రతిష్టించాలని విద్యార్థుల జీవితాన్ని మార్చే శక్తి అధ్యాపకులకు మాత్రమే ఉందని అన్నారు.కృత్రిమమేధకు ఆకర్షించ బడుతున్న రాబోయే తరాల విద్యాసవాళ్లను  ఎదుర్కొనేలా పాఠ్య ప్రణాళికను రూపొందించమని, ఈ  కోర్సులను, పాఠ్యప్రణాళికలను అధ్యాపకుల సృజనాత్మక బోధనద్వారానే విజయవంత మవుతాయని, వారి విజయమే తెలంగాణ విజయమన్నారు. అధ్యాపకుడు రోబోలా కాకుండా, సజీవ స్ఫూర్తి తో పాఠాలు బోధించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్యామండలి ప్రవేశపెట్టిన దోస్త్ నేడు భారత దేశంలో అనేక రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. అనంతరం రాజనీతి శాస్త్ర ఆచార్యులు శ్రీలత మాట్లాడుతూ ఉన్నత విద్యామండలి దార్శనికంగా తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సంస్కరణలు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యారంగ ముఖచిత్రాన్ని మార్చబోతున్నదని అభిప్రాయపడ్డారు. అనంతరం  ప్రిన్సిపాల్ బాల భాస్కర్ మాట్లాడుతూ ఆచార్య లింబాద్రి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ గా వినూత్న సంస్కరణలు ప్రవేశపెట్టారని, దోస్త్ ను గొప్ప పారదర్శక ప్రక్రియగా తీర్చిదిద్దారని అన్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఇంజనీరింగ్ కాలేజీల్లో లేని వినూత్న కోర్సులను  ప్రవేశపెట్టి, విద్యార్థులు డిగ్రీ కోర్సులను ఎంచుకునేలా చేశారని అన్నారు. 

]]>
Fri, 20 Sep 2024 23:01:04 +0530 admin
రేవంత్ రెడ్డి ని కలిసిన స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో మార్చ్ పుజోల్ https://prajakshethrenews.com/రేవంత్-రెడ్డి-ని-కలిసిన-స్పెయిన్-రాయబారి-జువాన్-ఆంటోనియో-మార్చ్-పుజోల్ https://prajakshethrenews.com/రేవంత్-రెడ్డి-ని-కలిసిన-స్పెయిన్-రాయబారి-జువాన్-ఆంటోనియో-మార్చ్-పుజోల్ రేవంత్ రెడ్డి ని కలిసిన స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో మార్చ్ పుజోల్ 

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో మార్చ్ పుజోల్ (Juan Antonio March Pujol) సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పలు కార్యక్రమాలపై జువాన్ ఆసక్తి కనబర్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. స్పెయిన్ దేశాన్ని సందర్శించాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జువాన్ రాసిన 'Momentum' పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. భేటీలో ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.

]]>
Fri, 20 Sep 2024 03:12:21 +0530 admin
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలి : రేవంత్​రెడ్డి https://prajakshethrenews.com/తెలంగాణ-యంగ్-ఇండియా-స్కిల్-యూనివర్సిటీని-దేశంలోనే-ఆదర్శంగా-తీర్చిదిద్దాలి-రేవంత్రెడ్డి https://prajakshethrenews.com/తెలంగాణ-యంగ్-ఇండియా-స్కిల్-యూనివర్సిటీని-దేశంలోనే-ఆదర్శంగా-తీర్చిదిద్దాలి-రేవంత్రెడ్డి తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలి : రేవంత్​రెడ్డి 

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో 

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీకి రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యం కావాలని కోరారు. యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో-చైర్మన్ శ్రీని రాజు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు స్కిల్ యూనివర్సిటీ లో భాగస్వామ్యం పంచుకోవాలని, యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి ముందుకు వచ్చిన కంపెనీలు లేదా దాతల పేర్లను ఆ భవనాలకు పెట్టాలని అధికారులకు సూచించారు.  స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆలోచన, ఆశయాలతో పాటు పలు కీలక అంశాలను మంత్రి శ్రీధర్ బాబు సమావేశంలో వివరించారు. యూనివర్సిటీలో కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని యూనివర్సిటీ బోర్డు నిర్ణయించింది. దసరా పండుగ తర్వాత అక్టోబర్ నెలలో కోర్సులను ప్రారంభించనున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించింది. 

]]>
Fri, 20 Sep 2024 03:07:49 +0530 admin
తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న సీఎం రేవంత్​రెడ్డి ఆలోచన గొప్పది : ఆనంద్ మహీంద్రా https://prajakshethrenews.com/తెలంగాణ-నుంచి-నైపుణ్యం-కలిగిన-యువతను-ప్రపంచానికి-అందించాలన్న-సీఎం-రేవంత్రెడ్డి-ఆలోచన-గొప్పది-ఆనంద్-మహీంద్రా https://prajakshethrenews.com/తెలంగాణ-నుంచి-నైపుణ్యం-కలిగిన-యువతను-ప్రపంచానికి-అందించాలన్న-సీఎం-రేవంత్రెడ్డి-ఆలోచన-గొప్పది-ఆనంద్-మహీంద్రా తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న సీఎం రేవంత్​రెడ్డి ఆలోచన గొప్పది : ఆనంద్ మహీంద్రా

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆలోచన గొప్పదని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. మంచి విజన్ ఉన్న సమర్థ నాయకుడు రేవంత్ రెడ్డి అని కొనియాడారు. అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ఉండాలని కోరగానే అంగీకరించానని ఆనంద్ మహీంద్రా  చెప్పారు. సాధారణంగా ప్రభుత్వాలు సబ్సిడీలు, ఆకర్షణీయ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాయని, కానీ యువతను నిపుణులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆలోచించిన తీరులోనే దార్శనికత ఉందన్నారు. అతిపెద్ద యూఎస్ కాన్సులేట్ తెలంగాణలోనే ఉందని, ఎక్కువ మంది ఇక్కడి నుంచే అమెరికాకు వెళుతున్నారని గుర్తుచేశారు. ఇకనుంచి ప్రపంచానికి నైపుణ్యమున్న యువతను అందించే గమ్యస్థానంగా తెలంగాణ నిలబడుతుందని అనడంలో సందేహం లేదన్నారు. ముఖ్యమంత్రి  ఆశయం నెరవేరాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

]]>
Fri, 20 Sep 2024 03:02:12 +0530 admin
ముఖ్యమంత్రి సహాయ నిధికి 10కోట్ల 25లక్షల 65వేల 273 రూపాయల భారీ విరాళం https://prajakshethrenews.com/ముఖ్యమంత్రి-సహాయ-నిధికి-10కోట్ల-25లక్షల-65వేల-273-రూపాయల-భారీ-విరాళం https://prajakshethrenews.com/ముఖ్యమంత్రి-సహాయ-నిధికి-10కోట్ల-25లక్షల-65వేల-273-రూపాయల-భారీ-విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి 10కోట్ల 25లక్షల 65వేల 273 రూపాయల భారీ విరాళం

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి సింగరేణి కాలరీస్ సంస్థ 10కోట్ల 25లక్షల 65వేల 273 రూపాయల భారీ విరాళాన్ని అందించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, సంస్థ సీఎండీ బలరాం నాయక్, కార్మిక సంఘాల నేతలు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ విరాళం ఇచ్చిన సింగరేణి కుటుంబీకులు అందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

]]>
Fri, 20 Sep 2024 02:48:09 +0530 admin
రేష‌న్ కార్డుల జారీకి ప‌టిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ రూపొందించండి రేవంత్​ రెడ్డి https://prajakshethrenews.com/రేషన్-కార్డుల-జారీకి-పటిష్టమైన-కార్యాచరణ-రూపొందించండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/రేషన్-కార్డుల-జారీకి-పటిష్టమైన-కార్యాచరణ-రూపొందించండి-రేవంత్-రెడ్డి రేష‌న్ కార్డుల జారీకి ప‌టిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ రూపొందించండి రేవంత్​ రెడ్డి

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

రేష‌న్ కార్డుల జారీకి ప‌టిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  ఆదేశించారు. కొత్త  రేష‌న్ కార్డుల కోసం అక్టోబ‌రు 2 వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించాల‌ని సీఎం సూచించారు. రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాల‌పై ముఖ్య‌మంత్రి స‌చివాల‌యంలో ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రేష‌న్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇవ్వడానికి సంబంధించి క‌స‌ర‌త్తు చేశారు. ఈ అంశంపై త్వ‌ర‌లోనే మ‌రోసారి స‌మీక్ష నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

]]>
Fri, 20 Sep 2024 02:41:27 +0530 admin
దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్ https://prajakshethrenews.com/దసరా-సెలవులు-ప్రకటించిన-తెలంగాణ-సర్కార్ https://prajakshethrenews.com/దసరా-సెలవులు-ప్రకటించిన-తెలంగాణ-సర్కార్ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్

తెలంగాణలో అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు

తిరిగి అక్టోబర్‌ 15న పాఠశాలలు పునఃప్రారంభం

]]>
Thu, 19 Sep 2024 23:19:23 +0530 admin
తెలంగాణలో MSME లు బలపడాలి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/తెలంగాణలో-msme-లు-బలపడాలి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/తెలంగాణలో-msme-లు-బలపడాలి-రేవంత్-రెడ్డి తెలంగాణలో MSME లు బలపడాలి : రేవంత్ రెడ్డి

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

తెలంగాణలో MSME లు బలపడాలని,  రాష్ట్రం ఆర్థిక పురోభివృద్ధి సాధించడానికి పరిశ్రమలు రాణించాలని,  అందుకు ప్రజా ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.  ఒక పాలసీ లేకుండా ఏ రంగం కూడా అభివృద్ధి సాధించలేదని,  అందుకే తెలంగాణలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేకంగా #MSME Policy-2024 తీసుకొచ్చాం” అని అన్నారు.  MSME లు బలపడితే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, అందుకు ప్రజా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఒక ట్రిలియన్ ఎకానమీ సాధించాలన్న లక్ష్య సాధనలో మీరంతా భాగస్వామిగా ఉండాలని MSME లకు పిలుపునిచ్చారు.  తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్ల నుంచి 2028 నాటికి 7 లక్షల కోట్లకు చేరుతుందని విశ్వసిస్తున్నానని, అందుకు MSME సహాకారం ఉంటుందని ముఖ్యమంత్రి  ఆశాభావం వ్యక్తం చెప్పారు.   రాష్ట్రంలో పారిశ్రామిక రాయితీలను కొనసాగిస్తామని, పెండింగ్ రాయితీలను కూడా చెల్లిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. “ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపించాలన్నదే లక్ష్యం. ఈ ప్రభుత్వం ప్రజా పాలనను అందిస్తుంది. పెట్టుబడులు పెట్టండి. ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈ విషయంలో అందరి సలహాలు, సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దళితులు, గిరిజనులు, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.” అని చెప్పారు.  దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి ఆ వర్గాలకు అవసరమైన భూముల కేటాయింపులు, రాయితీలు, సబ్సిడీలు, విద్యుత్ వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు.  తెలంగాణ సమగ్రాభివృద్ధికి అనేక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ఆ కోవలోనే తెలంగాణలో ఫ్యూచర్ సిటీని డిజైన్ చేశామని చెప్పారు. ఓఆర్ఆర్, దానికి సమాంతరంగా రీజినల్ రింగ్ రోడ్డు, ఈ రెండింటి మధ్య రేడియల్ రోడ్లతో పెట్టుబడుల కోసం సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికలను రచించినట్టు ముఖ్యమంత్రి వివరించారు.  పెట్టుబడుల కోసం అనేక దేశాలు చైనా ప్లస్ వన్ బాట పట్టాయని, పెట్టుబడులకు ప్రత్యామ్నాయం తెలంగాణ మాత్రమేనని ఈ రాష్ట్రంలో ఉన్న అనుకూల పరిస్థితులను ముఖ్యమంత్రి సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో  ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. 

]]>
Thu, 19 Sep 2024 02:07:31 +0530 admin
రాధా,కృష్ణా వేషాధారణలో అలరించిన చిన్నారులు https://prajakshethrenews.com/రాధాకృష్ణా-వేషాధారణలో-అలరించిన-చిన్నారులు https://prajakshethrenews.com/రాధాకృష్ణా-వేషాధారణలో-అలరించిన-చిన్నారులు రాధా,కృష్ణా వేషాధారణలో అలరించిన చిన్నారులు 

పాతబస్తీ ఎస్​ఆర్​టి కాలనీలో ఏర్పాటుచేసిన గణేష్​ మండపం వద్ద రాధా, కృష్ణ వేషాధారణలో అలరించిన సర్​యు, చైత్రలను అభినందిస్తున్న ముప్పిడి శోభారెడ్డి

]]>
Wed, 18 Sep 2024 22:55:44 +0530 admin
విశ్వాసాన్ని కోల్పోతే మనుగడ అసాధ్యం : విరాహత్ అలీ https://prajakshethrenews.com/విశ్వాసాన్ని-కోల్పోతే-మనుగడ-అసాధ్యం-విరాహత్-అలీ https://prajakshethrenews.com/విశ్వాసాన్ని-కోల్పోతే-మనుగడ-అసాధ్యం-విరాహత్-అలీ విశ్వాసాన్ని కోల్పోతే మనుగడ అసాధ్యం

-టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరాహత్ అలీ

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే మీడియా సంస్థలు సమాజంలో మనుగడ సాధించలేవని, ఇందుకుగాను ప్రజల ఆకాంక్షాలకు ప్రాధాన్యత ఇస్తూ, నోరులేని గొంతుకలకు గొంతుకగా నిలబడాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ అన్నారు. బుధవారం  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 'పీపుల్ మీడియా పాయింట్'  ఛానెల్ లోగో, కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతితిగా హాజరై ప్రసంగించారు. నేడు సమాజంలో మీడియాపై రకరకాల చర్చ జరుగుతుందన్నారు. ముఖ్యంగా బడా పెట్టుబడిదారులు, రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తల చేతుల్లోకి మీడియా సంస్థలు వెళ్లిపోవడంతో, సామాన్యులకు వార్తల్లో సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే విమర్శలు వస్తున్నట్లు ఆయన తెలిపారు. యాజమాన్యాల వ్యక్తిగత ఎజెండాలు, ఆంక్షలతో జర్నలిస్టులు స్వేచ్ఛగా వారి భావాల్ని వ్యక్తం చేయలేక పోతున్నారని విరాహత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా విప్లవం కొనసాగడం శుభ పరిణామం అయినప్పటికీ,  భావప్రకటన స్వేచ్ఛకు కూడా రాజ్యాంగంలో కొన్ని పరిమితులు, ఆంక్షలు ఉన్నాయనే విషయాన్ని విస్మరించరాదని ఆయన సూచించారు. అసంఘటిత కార్మికుల గొంతుకగా 'పీపుల్ మీడియా పాయింట్' సంస్థ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడం మంచి పరిణామమని ఆయన స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఛానెల్ నిర్వాహకులు సంపత్ రెడ్డి, రాజిరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు కిరణ్, కృష్ణ సాగర్, అసంఘటిత కార్మికుల ఉద్యమ నాయకురాలు అనిత తదితరులు పాల్గొన్నారు.

]]>
Wed, 18 Sep 2024 22:29:02 +0530 admin
బాలాపూర్​ గణేష్​ లడ్డును ప్రధాని నరేంద్రమోదీకి బహుకరిస్తా : కొలను శంకర్​ రెడ్డి https://prajakshethrenews.com/బాలాపూర్-గణేష్-లడ్డును-ప్రధాని-నరేంద్రమోదీకి-బహుకరిస్తా-కొలను-శంకర్-రెడ్డి https://prajakshethrenews.com/బాలాపూర్-గణేష్-లడ్డును-ప్రధాని-నరేంద్రమోదీకి-బహుకరిస్తా-కొలను-శంకర్-రెడ్డి రూ. 30. 01 లక్షలకు బాలాపూర్ గణేష్ లడ్డును సొంతం చేసుకున్న బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి 

ప్రధాని నరేంద్ర మోడీ కి బాలాపూర్ గణేష్ లడ్డును బహుకరిస్తా

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో 

ప్రపంచ ప్రసిద్దిగాంచిన బాలాపూర్​ గణపతి 21 కిలోల లడ్డు వేలం పాటకు రంగారెడ్డి జిల్లా బాలాపూర్​ గ్రామం బొడ్డురాయి వేదికయ్యింది. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బాలాపూర్​ గణేష్​ లడ్డు వేలం పాట వేలాదిమందిభక్త జన సందోహం నడుమ బాలాపూర్​కు చెందిన కొలను శంకర్​రెడ్డి, కర్మాన్​ఘాట్​కు చెందిన లింగాల దశరథ్​ గౌడ్​, సాహెబ్​నగర్​ కు చెందిన సామ ప్రణీత్​ రెడ్డి( అర్బన్​ గ్రూప్), నాదర్​గూల్​ కు చెందిన గీతా డైరీ లక్ష్మీనారాయణ, అనే ప్రధాన పోటీదారుల మధ్య రూ.1016 తో ప్రారంభమై హోరాహోరీగా సాగిన పోరులో రూ. 30.01 లక్షలకు బాలాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కొలను శంకర్ రెడ్డి  21 కిలోల లడ్డును సొంతం చేసుకున్నారు. తాజాగా 31వ సారి బాలాపూర్​ గణేష్​ లడ్డును వేలం పాటలో  దక్కించుకున్న జాబితాలో కొలను శంకర్ రెడ్డి చేరిపోయారు. 44 వసంతాల గణేష్​ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా గత  30 సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బాలాపూర్​ గణేష్​  లడ్డు వేలం పాటకు తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశ, ప్రపంచ వ్యాప్తంగా విశిష్ఠ గుర్తింపు ఉంది. కరోనా కారణంగా 2020లో బాలాపూర్​ గణపతి లడ్డు వేలం పాటను రద్దు చేశారు.  దీంతో ఆ లడ్డును అప్పట్లో బాలాపూర్​ గణేష్​ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్​రెడ్డి బృందం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్​కు బహుకరించారు. 2021లో జరిగిన వేలం పాట కంటే 2022లో  5.70లక్షలు రెట్టింపు, 2022 లో జరిగిన వేలం పాట కంటే 2023లో 2.40 లక్షలు, 2023 లో జరిగిన వేలం పాట కంటే ఈ  యేడు మూడు లక్షలు అధిక ధర పలికింది. బాలాపూర్​ లడ్డువేలం పాట చరిత్రలో ఈ యేడు రికార్డు బ్రేక్​ చేసింది. లడ్డు వేలం పాటలో గడిచిన 30 ఏళ్లలో 1,82,51,950కోట్ల రూపాయలు బాలాపూర్​ గణేష్​ ఉత్సవ సమితి సొంతం కాగా అందులో ని 1,58,07,970 కోట్ల రూపాయలతో బాలాపూర్​ గ్రామంలో పలు అభివృద్ది పనులు చేపట్టడం జరిగింది. అయితే గత సంవత్సరం 2023లో బాలాపూర్ గణేష్ లడ్డు ను వేలం పాటలో దక్కించుకున్న దాసరి దయానంద్​ రెడ్డి రూ. 27 లక్షల నగదు ను గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్లెం నిరంజన్ రెడ్డికి అందజేశారు. నగదు ను అందజేసిన దాసరి దయానంద్​ రెడ్డికి గణేష్ ఉత్సవసమితి తరపున లక్ష రూపాయల విలువ గల బంగారు చైన్ ను అందజేశారు.

వేలం పాటలో గణేష్​ లడ్డును సొంతం చేసుకుంది వీళ్లే ...

1994లో జరిగిన బాలాపూర్​ లడ్డు వేలం పాటలో కొలన్​ మోహన్​రెడ్డి రూ. 450  కైవసం చేసుకున్నారు. 1995లో కొలన్​ మోహన్​ రెడ్డి రూ. 4500, 1996లో కొలన్​ క్రిష్ణారెడ్డి రూ.18వేలు, 1997లో కొలన్​ క్రిష్ణా రెడ్డి రూ.28వేలు, 1998లో కొలన్​ మోహన్​ రెడ్డి రూ.51వెయ్యి, 1999లో కళ్లెం అంజిరెడ్డి రూ. 65 వేలు,  2000లో కళ్లెం ప్రతాప్​ రెడ్డి రూ. 66వేలు, 2001లో జి.రఘునందన్​ చారి రూ. 85వేలు, 2002లో కనడ మాధవరెడ్డి రూ.ఒక లక్ష 5 వేలు, 2003లో చిగిరింత బాల్​రెడ్డి రూ.ఒక లక్ష55వేలు, 2004లో కొలన్​ మోహన్​ రెడ్డి రూ. 2లక్షల ఒక వెయ్యి, 2005లో ఇబ్రం శేఖర్​ రూ. 2లక్షల 8 వేలు, 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి రూ. 3లక్షలు, 2007లో జి.రఘునందన్​ చారి రూ. 4లక్షల15 వేలు, 2008లో కొలన్​ మోహన్​ రెడ్డి రూ.5లక్షల 7వేలు, 2009లో సరిత రూ. 5లక్షల10వేలు,  2010లో కొడాలి శ్రీధర్​ బాబు రూ. 5లక్షల35వేలు, 2011లో కొలన్​బ్రదర్స్​ రూ. 5లక్షల45వేలు, 2012లో పన్నాల గోవర్థన్​ రెడ్డి రూ. 7లక్షల50వేలు, 2013లో తీగల కృష్ణారెడ్డి రూ.9లక్షల26 వేలు, 2014లో సింగిరెడ్డి జైహింద్​ రెడ్డి రూ. 9 లక్షల50వేలు, 2015లో కళ్లెం మాధవ మోహన్​ రెడ్డి రూ. 10లక్షల32వేలు,  2016లో స్కైలాబ్​ రెడ్డి రూ. 14లక్షల 65 వేలు, 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ. 15లక్షల60 వేలు, 2018లో తేరేటిపల్లి శ్రీనివాస్​ గుప్త రూ. 16లక్షల60 వేలు, 2019లో కొలన్​ రామ్​ రెడ్డి రూ.17లక్షల60 వేలు  బాలాపూర్​ లడ్డును వేలం పాటలో సొంతం చేసుకున్న వారిలో ఉన్నారు. 2020లో కరోనా కారణంగా వేలం పాట నిర్వహించలేదు. దీంతో ఆ యేడు గణేష్​ లడ్డును రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​కు బహకురించారు. 2021లో 18లక్షల 90వేలకు మర్రి శశాంక్​ రెడ్డి, 2022లో 24లక్షల 60వేలకు బాలాపూర్​ గణేష్​ అసోసియేషన్​ మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డును సొంతం చేసుకున్నారు. 2023 లో 27లక్షలకు దాసరి దయానంద్​ రెడ్డి కైవసం చేసుకున్నారు. తాజాగా 2024లో బాలాపూర్​ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్​ నేత కొలను శంకర్​ రెడ్డి 30.01లక్షలకు వేలం పాటలో సొంతం చేసుకున్నారు. 

తెల్లవారుజామున 5.30గంటలకే ప్రారంభమయిన నిమజ్జన పూజలు ....

తెల్లవారుజామున 5.30గంటల నుంచే బాలాపూర్​ గణేష్​ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జన పూజలు ప్రారంభమయ్యాయి.  అనంతరం బాలాపూర్​ గణేష్​ మండపం నుంచి  బాలాపూర్​ పుర వీధులగుండా సన్నాయి మేళాలు .. భజన కార్యక్రమాల నడుమ బాలాపూర్​ గణపతి ఊరేగింపుగా ముందుకు కదిలింది.  దారిపొడవునా బాలాపూర్​ గ్రామస్థులు  కొబ్బరి కాయలు కొట్టి, మంగళ హారతులు పట్టారు. 10.15 గంటల ప్రాంతంలో బాలాపూర్​ గణపతి డిసిఎం వ్యాన్​లో బొడ్డురాయి వద్దకు చేరుకుంది. ఉదయం 10.35 గంటలకు బాలాపూర్​ గణేష్​ లడ్డు వేలం పాట అట్టహాసంగా ప్రారంభయ్యింది.

ప్రధాని నరేంద్ర మోడికి బహుకరిస్తా  : కొలను శంకర్ రెడ్డి

బాలాపూర్​ గణేష్​ లడ్డును వేలం పాటలో దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి అన్నారు. వేలం పాటలో దక్కించుకున్న లడ్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ కి బహుకరిస్తున్నట్లు  చెప్పారు. ఈ యేడు ఎలాగైనా లడ్డును సొంతం చేసుకుందామని వేలంపాటలో పాల్గొన్నానని, అదృష్టానికి 2024లో 30.01 లక్షలకు సొంతం చేసుకున్నట్లు కొలను శంకర్ రెడ్డి పేర్కొన్నారు.

]]>
Tue, 17 Sep 2024 23:52:13 +0530 admin
ప్రజా పాలన దినోత్సవం.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష :రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/ప్రజా-పాలన-దినోత్సవం-నాలుగు-కోట్ల-ప్రజల-ఆకాంక్ష-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ప్రజా-పాలన-దినోత్సవం-నాలుగు-కోట్ల-ప్రజల-ఆకాంక్ష-రేవంత్-రెడ్డి ప్రజా పాలన దినోత్సవం.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష :రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్ ,తెలంగాణ బ్యూరో :

సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోతైన ఆలోచన చేసి ఈ శుభ దినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా జరపాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చెప్పారు. ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.“ప్రజా పాలన దినోత్సవం.. ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష. వారి ఆలోచన. నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి. ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుపడితే వారిది స్వార్థ ప్రయోజనమే అవుతుంది తప్ప ప్రజాహితం కాబోదు” అని అన్నారు.“తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికిలి మాదిరిగా ఉంటుంది. ఆ పిడికిలి పోరాటానికి సంకేతం. తెలంగాణలో అన్ని జాతులు, కులాలు, మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం అందులో ఇమిడి ఉంది. ఈ ఐక్యతను, ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్‌ 17 ను కొందరు వివాదాస్పదం చేయడం మంచిది కాదు”  అని ముఖ్యమంత్రి హితవు పలికారు.జయ జయహే తెలంగాణ… గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా, సంక్షిప్త నామాన్ని టీజీగా మార్చడం, సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ, గద్దర్ పేరిట అవార్డులు, మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరును ఖరారు చేయడం వంటి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి చేపట్టిన అనేక చర్యలను ఈ సందర్భంగా సీఎం  గుర్తుచేశారు.“ఎందరో మహనీయుల త్యాగఫలం మన తెలంగాణ. పరిపాలనలో, ప్రతి నిర్ణయం సందర్భంలో వారి త్యాగాలు మాకు గుర్తుంటాయి. నాలుగు కోట్ల ప్రజల సంక్షేమమే గీటురాయిగా పాలన ఉంటుంది. తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు. వారి ఆలోచనలే మా ఆచరణ. వారి ఆకాంక్షలే. మా కార్యాచరణ” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

]]>
Tue, 17 Sep 2024 20:22:49 +0530 admin
ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/ట్యాంక్-బండ్-వద్ద-గణేష్-నిమజ్జన-ప్రదేశాలను-పరిశీలించిన-సీఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ట్యాంక్-బండ్-వద్ద-గణేష్-నిమజ్జన-ప్రదేశాలను-పరిశీలించిన-సీఎం-రేవంత్-రెడ్డి ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్విఘ్నంగా సాగేలా చూడాలని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జన ప్రదేశాలను అయన పరిశీలించారు. నిమజ్జన ప్రక్రియ ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.నిమజ్జన ప్రదేశాల్లో అమర్చిన క్రేన్స్ వద్ద పరిస్థితులను ముఖ్యమంత్రి పరిశీలించారు. క్రేన్ డ్రైవర్స్, ఇతర సిబ్బందితో మాట్లాడారు. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకునేలా సిబ్బందికి మూడు షిఫ్టుల్లో విధులు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. నిమజ్జనం కోసం వచ్చిన భక్తులను పలకరించారు.  అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ముఖ్యమంత్రి వెంట పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు జీఎహెచ్‌ఎంసీ మేయర్‌, కమిషనర్‌, హైదరాబాద్‌ సిటీ పోలీస్ కమిషనర్‌ ఇతర అధికారులు ఉన్నారు.

]]>
Tue, 17 Sep 2024 20:08:55 +0530 admin
రేవంత్ కు రూ.50లక్షల విరాళం చెక్కు అందజేసిన చిరంజీవి https://prajakshethrenews.com/రేవంత్-కు-రూ50లక్షల-విరాళం-చెక్కు-అందజేసిన-చిరంజీవి https://prajakshethrenews.com/రేవంత్-కు-రూ50లక్షల-విరాళం-చెక్కు-అందజేసిన-చిరంజీవి రేవంత్ కు రూ.50లక్షల విరాళం చెక్కు అందజేసిన చిరంజీవి

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

వరద బాధితుల సహాయార్థం అగ్రనటుడు, కేంద్ర మాజీ మంత్రి 'మెగాస్టార్' చిరంజీవి ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు విరాళం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన చిరంజీవి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. అలాగే తన కుమారుడు రామ్ చరణ్ తరపున మరో 50లక్షల రూపాయల చెక్కును కూడా #CMRFకు చిరంజీవి  అందజేశారు.  సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న చిరంజీవి కుటుంబానికి ముఖ్యమంత్రి  కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంలో సీఎం వెంట మంత్రి సీతక్క కూడా ఉన్నారు.

]]>
Tue, 17 Sep 2024 01:01:53 +0530 admin
గణేష్​ నిమజ్జనోత్సవాలను సక్సెస్​ చేయండి : సీఎం రేవంత్​ రెడ్డి https://prajakshethrenews.com/గణేష్-నిమజ్జనోత్సవాలను-సక్సెస్-చేయండి-సీఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/గణేష్-నిమజ్జనోత్సవాలను-సక్సెస్-చేయండి-సీఎం-రేవంత్-రెడ్డి గణేష్​ నిమజ్జనోత్సవాలను సక్సెస్​ చేయండి : సీఎం రేవంత్​ రెడ్డి

ప్రజాక్షేత్ర్ ,తెలంగాణ బ్యూరో

గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా సాగేలా ట్యాంక్‌బండ్‌తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. నిమజ్జనం కోసం చేసిన ఏర్పాట్లు, పర్యవేక్షణ తదితర అంశాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తంగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నట్టు ఈ సందర్భంగా అధికారులు వివరించారు. పర్యవేక్షణతో పాటు ప్రతి గంట గంటకూ కమాండ్ కంట్రోల్ నుంచి సిబ్బందికి అవసరమైన సూచనలిచ్చి అప్రమత్తం చేయాలని సీఎం చెప్పారు. నిమజ్జన శోభాయాత్రలో సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించడం, బ్లయిండ్ స్పాట్స్, హాట్ స్పాాట్స్‌లకు సంబంధించి రికార్డు మెయింటెన్ చేయడం వంటి పలు అంశాలపై సీఎం పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చారు. సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఇంటెలిజెన్స్ చీఫ్ బి. శివధర్ రెడ్డి , హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ , ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

]]>
Tue, 17 Sep 2024 00:56:17 +0530 admin
రాజీవ్​గాంధీ విగ్రహం ను ఆవిష్కరించిన సీఎం రేవంత్​రెడ్డి https://prajakshethrenews.com/రాజీవ్గాంధీ-విగ్రహం-ను-ఆవిష్కరించిన-సీఎం-రేవంత్రెడ్డి https://prajakshethrenews.com/రాజీవ్గాంధీ-విగ్రహం-ను-ఆవిష్కరించిన-సీఎం-రేవంత్రెడ్డి రాజీవ్​గాంధీ విగ్రహంను ఆవిష్కరించిన  సీఎం రేవంత్​రెడ్డి

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్న సమున్నతమైన ఆశయంతో మాజీ ప్రధానమంత్రి, దివంగత రాజీవ్ గాంధీ  అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ, వారి కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తుచేశారు. దేశ భవితవ్యాన్ని యువత నిర్దేశించాలన్న లక్ష్యంతో 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించడం, పంచాయతీలే పట్టుగొమ్మలని విశ్వసించి వాటికి నేరుగా నిధులు చేర్చాలన్న సంకల్పంతో 73, 74 వ రాజ్యాంగ సవరణ చేయడం, చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, సాంకేతిక విప్లవంతో దేశాన్ని 21 శతాబ్దంలోకి నడిపించడం వంటి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణలను వివరించారు. దేశం కోసం నెహ్రూ  కుటుంబం సర్వం కోల్పోయిందని, నెహ్రూ  ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  దేశాన్ని ప్రగతి బాటన నడిపించడానికి ఆనాడు ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలకు ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. బాక్రానంగల్, నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాం సాగర్ వంటి ప్రాజెక్టులు ఈనాటికీ నెహ్రూ దూరదృష్టికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయన్నారు. 563 సంస్థానాలను దేశంలో విలీనం చేయించి దేశ సమగ్రతను కాపాడిన ఘనత నెహ్రూ గారిదని కొనియాడారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దుతో పాటు దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం పెరిగేలా భూ పరిమితి చట్టం తెచ్చి జాగీర్దార్లు, జమిందార్ల భూములు పేదలకు పంచిన ఘనత ఇందిరా గాంధీ దని గుర్తు చేశారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాకుండా లంబాడాలను ఎస్టీలలో చేర్చింది ఇందిరా గాంధీ అని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దకాలం దాటుతున్నా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ ప్రకటన వెలువడిన నాటి గుర్తుగా డిసెంబర్ 9 న సచివాలయ   ప్రాంగణ ప్రధాన ద్వాారం ముందు వీరనారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని చెప్పారు.

]]>
Tue, 17 Sep 2024 00:51:34 +0530 admin
గణపయ్య మెడలో "నాగుపాము https://prajakshethrenews.com/గణపయ్య-మెడలో-నాగుపాము https://prajakshethrenews.com/గణపయ్య-మెడలో-నాగుపాము గణపయ్య మెడలో "నాగుపాము

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

గణేష్​ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా  జగిత్యాల పట్టణంలో ఒక వింత చోటుచేసుకుంది.నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం పూజలు అందుకుంటున్న గణపతి మెడలోకి ఒక నాగుపాము చేరి ఆభరణంగా మారింది. పట్టణంలోని వాణి నగర్ లో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో 48 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారీ విగ్రహంతో పాటు చిన్న గణేశుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి సోమవారం ఉదయం భక్తులందరూ పూజిస్తుండగా ఒక్క సారిగా  నాగుపాము వచ్చి పూజలు అందుకుంటున్న గణపతి మెడలోకి చేరింది. శివునికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగుపాము ఆయన కుమారుడైన గణపతి మెడలోకి వచ్చి చేరిందంటూ భక్తులు విశేషంగా చెప్పుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.దీంతో గణనాథుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ గా మారాయి. 

]]>
Tue, 17 Sep 2024 00:42:51 +0530 admin
పాతబస్తీ సుల్తాన్​ షాహిలో విషాదం https://prajakshethrenews.com/పాతబస్తీ-సుల్తాన్-షాహిలో-విషాదం https://prajakshethrenews.com/పాతబస్తీ-సుల్తాన్-షాహిలో-విషాదం పాతబస్తీ సుల్తాన్​ షాహిలో విషాదం

చేనేత కుటుంబం పై పగబట్టిన విధి

రోడ్డు ప్రమాదంలో ఇప్పటికే మృతిచెందిన ఇద్దరు అల్లుళ్లు

కూతురి పెళ్ళి ఏర్పాట్లలో ఉండగా ఒక్క సారిగా కుప్పుకూలిన తండ్రి

విధి వంచితకు గురైన కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎంకు రిక్వెస్ట్​ 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

ఇప్పటికే ఇద్దరు అల్లుళ్లను పోగొట్టుకుని తీరని దు:ఖంలో ఉన్న వృద్దాప్యంలో ఉన్న తల్లికి కుమారుడి మరణవార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కూతురి పెళ్ళి ఏర్పాట్లలో నిమగ్నమైన తండ్రి ఒక్క సారిగా కుప్పకూలి మృతిచెందిన హృదయవిధారక సంఘటన పాతబస్తీ సుల్తాన్​ షాహిలో జరిగింది. వివరాలలోకి వెళితే... ముద్దయ్యపేట సరోజిని 34 ఏళ్ల క్రితం తన కుమారుడు రమేష్​(47) తో పాటు ఇద్దరు కూతుళ్ళను వెంటబెట్టుకుని చేనేత కుటుంబం భాగ్యనగరానికి బ్రతుకుదెరువు కోసం వచ్చింది. పాతబస్తీ సుల్తాన్​ షాహిలో మొగ్గం పనులు చేస్తు కుటుంబాన్ని పోషించుకునే వారు. సరైన పనులు దొరకక రమేష్​  చివరికి వంట పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రమేష్​ , తన తల్లి సరోజిని తో పాటు కష్టపడి ఇద్దరు సోదరిల వివాహం ఘనంగా జరిపించారు. తాను కూడా రుక్మిణి ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. ఒక కుమారుడు, కుమార్తె లు ఉన్నారు. అయితే వీరి కుటుంబంపై విధి పగబట్టింది. మొదట పెద్ద సోదరి భర్త ఆరేళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తీవ్ర దు:ఖంలో ఉన్న ఆ కుటుంబంపై మరో మారు వెంటాడింది. ఈ సారి చిన్న సోదరి భర్త కూడా నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో ఇద్దరి సోదరిల భర్తలను పోగొట్టుకోవడంతో వారికి కూడా మంచి చెడు చూస్తు ధైర్యం చెప్పసాగాడు రమేష్​. తన కూతురుకు వివాహం నిశ్చయం కావడంతో పెళ్ళి ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యాడు. శనివారం మెహదీపట్నంలోని ఓ గణేష్​ మండపం వద్ద అన్నప్రసాదం చేయడానికి పనులకు రమేష్​ వెళ్ళాడు. అన్నప్రసాదంకు పూర్తిగా సిద్దం చేశాడు. చివరగా పూరి కోసం పిండిని తడుపుతుండగా ఒక్క సారిగా రమేష్​ కుప్పకూలాడు. దీంతో వెంటనే మండప నిర్వాహకులు రమేష్​ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్​ కు వైద్యులు సిద్దం చేస్తుండగా అంతలోనే రమేష్​ కూడా ప్రాణాలొదిలాడు. దీంతో ఆ చేనేత కుటుంబంలో అంతులేని విషాదం నెలకొన్నది. ఇప్పటికే ఇద్దరు అల్లుళ్ళను పోగొట్టుకుని వృద్దాప్యంలో కుమిలి ఏడుస్తున్న తల్లి సరోజినికి కుమారుడు రమేష్​ మరణవార్త తీవ్ర దు:ఖాన్ని మిగిల్చింది. ఇంకా మాకుటుంబానికి దిక్కెవరు అని ఏడుస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కాగా విధి వంచితగా గురైన చేనేత కుటుంబాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

]]>
Mon, 16 Sep 2024 13:05:39 +0530 admin
గణేష్​ నిమజ్జనోత్సవాలకు సర్వం సిద్దం : రాష్ట్ర డీజీపీ జితేందర్ https://prajakshethrenews.com/గణేష్-నిమజ్జనోత్సవాలకు-సర్వం-సిద్దం-రాష్ట్ర-డీజీపీ-జితేందర్ https://prajakshethrenews.com/గణేష్-నిమజ్జనోత్సవాలకు-సర్వం-సిద్దం-రాష్ట్ర-డీజీపీ-జితేందర్ గణేష్​ నిమజ్జనోత్సవాలకు సర్వం సిద్దం : రాష్ట్ర డీజీపీ జితేందర్

25 వేల మందితో భారీ పోలీస్ బందో బస్తు

ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్​

ఈ నెల 17వ తేదీన జరుగనున్న గణేష్​ నిమజ్జనోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్​ తెలిపారు. నిమజ్జనోత్సవాలకు 25 వేల మందిదో భారీ పోలీస్ బందో బస్తును ఏర్పాటు చేస్తున్నమన్నారు. బాలాపూర్ గణేష్ మండపాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, జీహెచ్ ఎంసి కమిషనర్ ఆమ్రపాలి లు సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలాపూర్ గణేష్ నిమజ్జన రూట్ ను బాలాపూర్ నుంచి చార్మినార్ మీదుగా ట్యాంక్ బండ్ వరకు డీజీపీ జితేందర్, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, జీహెచ్ ఎంసి కమిషనర్ ఆమ్రపాలి లు వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం  డీజీపీ మాట్లాడుతూ బాలాపూర్ గణేషుడి నిమజ్జనం కోసం రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ సీపీ,రాచకొండ సీపీ, జీహెచ్ఎంసి కమిషనర్, కలెక్టర్ లతో కలిసి నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పరిశీలించమన్నారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జనాలు సక్సెస్ చేస్తామన్నారు. అనంతరం నగర పోలీస్​ కమిషర సీవీ ఆనంద్​ మాట్లాడుతూ సెప్టెంబర్17వ తేదీన గణేష్ నిమజ్జనం కోసం హైదరాబాద్ లో రూట్ ను పరిశీలించినట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు, హై లెవెల్ కమిటీ అంత కలిసి నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నిమజ్జనం రూట్ లో రోడ్ల మరమ్మత్తులు చేయించడంతో పాటు, రోడ్డుగా అడ్డంగా ఉన్న చెట్లు ,వైర్లు తొలిగించారన్నారు.  నిమజ్జనం రోజున 25వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని, అందులో 15వేలు సిటీ పోలీసులు,10వేల మంది ఇతర జిల్లాలనుండి పోలీసులు బందోబస్తులో పాల్గొంటారన్నారు.  ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం 1.30 గంటల లోపు పూర్తి అవుతుందన్నారు. ఉదయం అరున్నర గంటలకే పూజలు అన్ని పూర్తి చేసుకొని గణేష్ విగ్రహాలను ఊరేగింపు కు తరలించేలా చర్యలు చేపడుతామని అన్నారు. 

15వేల మంది ఉద్యోగులు విధుల్లో పాల్గొంటారు : జీ హెచ్ ఎం సి కమిషనర్ అమ్రాపలి

జీహెచ్ ఎం సి ఆధ్వర్యంలో 17,18,19 తేదీల్లో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జీ హెచ్ ఎం సి కమిషనర్ అమ్రాపలి తెలిపారు.15వేల మంది ఉద్యోగులు విధుల్లో పాల్గొంటారన్నారు. 140 స్టాటిక్​ క్రేన్​లు, 295 మొబైల్​ క్రేన్లు సిద్దంగా ఉంచినట్లు చెప్పారు. 102 మినీ టిప్పర్లు, జేసీబీలు, యాక్షన్​ టీమ్స్​ రెడీ చెసినట్లు తెలిపారు. శానిటేషన్, ఈతగాళ్ళు, టాయిలెట్స్, నిమజ్జనానికి వెళ్తున్న వారికి అక్కడక్కడ ఫుడ్ ఏర్పాట్లు కూడా చేసినట్లు వివరించారు. ఇంకా రెండు రోజుల్లో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు.19వ తేదీ ఉదయం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశ ఉందన్నారు.  

]]>
Mon, 16 Sep 2024 00:40:48 +0530 admin
టీయూడబ్ల్యూజే తోనే* *జర్నలిస్టులకు న్యాయం : విరాహత్ అలీ https://prajakshethrenews.com/టీయూడబ్ల్యూజే-తోనే-జర్నలిస్టులకు-న్యాయం-విరాహత్-అలీ https://prajakshethrenews.com/టీయూడబ్ల్యూజే-తోనే-జర్నలిస్టులకు-న్యాయం-విరాహత్-అలీ

*టీయూడబ్ల్యూజే తోనే* *జర్నలిస్టులకు న్యాయం*

*-రాష్ట్ర అధ్యక్షులు విరాహత్అలీ*

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగి ఉన్న తమ సంఘం నిరంతరం జర్నలిస్టుల సంక్షేమం, మీడియా స్వేచ్ఛ పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తుందని, ఈ సంఘంతోనే తమకు న్యాయం జరుగుతుందనే బలమైన నమ్మకం జర్నలిస్టుల్లో ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ అన్నారు. శనివారం సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన 22 మంది సీనియర్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, 143 సంఘానికి రాజీనామా చేసి, బషీర్ బాగ్ లోని కార్యాలయంలో , విరాహత్ అలీ సమక్షంలో  టీయూడబ్ల్యూజే-ఐజేయులో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీలకు, ప్రభుత్వాలకు అనుబంధంగా పనిచేసే సంఘాలు మనుగడ సాధించలేవని, గడిచిన 65 ఏండ్లలో తమ సంఘం ఎన్నో పార్టీలను, ఎన్నో ప్రభుత్వాలను చూసిందని, అయినా ఎప్పుడూ జర్నలిస్టుల గొంతుకగానే పనిచేస్తూ వస్తుందని, అందుకే నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలో వేలాది జర్నలిస్టుల ఆదరాభిమానాలు పొందుతున్నట్లు విరాహత్ అలీ స్పష్టం చేశారు. సంఘ సలహాదారు కె.శ్రీనివాస్ రెడ్డి మీడియా అకాడమీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుండే జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై నిమగ్నమై పోవడం అభినందనీయమన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభ్యత్వం జర్నలిస్టుల సంక్షేమం పట్ల సానుకూలంగా ఉందని, త్వరలో వేలాది మంది జర్నలిస్టులతో హైదరాబాద్ లో, భారీ సభను నిర్వహించి, ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో పాటు సమాచార, ఆరోగ్య శాఖల మంత్రులను ఆ సభకు ఆహ్వానించి, జర్నలిస్టుల ప్రధాన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి.మధుగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నయ్య, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను కొల్లాపూర్ జర్నలిస్టులు విరాహత్ అలీ దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

]]>
Sun, 15 Sep 2024 17:16:49 +0530 admin
ముహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి లాంటివి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/ముహమ్మద్-ప్రవక్త-బోధనలు-యావత్-మానవాళికి-దిక్సూచి-లాంటివి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ముహమ్మద్-ప్రవక్త-బోధనలు-యావత్-మానవాళికి-దిక్సూచి-లాంటివి-రేవంత్-రెడ్డి ముహమ్మద్ ప్రవక్త  బోధనలు యావత్  మానవాళికి దిక్సూచి లాంటివి : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో : 

శాంతి, కరుణ, సోదరభావాన్ని చాటి చెప్పే ముహమ్మద్ ప్రవక్త  బోధనలు యావత్  మానవాళికి దిక్సూచి లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రవక్త బోధనలైనా, భగవద్గీత, బైబిల్ సారాంశాలైనా మనకు చెప్పేది మంచి విషయాలే అని, విద్వేషాలు వదిలి శాంతియుతంగా జీవించడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు, ప్రముఖ ఇస్లాం పండితుడు, రచయిత మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మాని గారు రచించిన "Prophet for the World" పుస్తకాన్ని ముఖ్యమంత్రి  ఆవిష్కరించారు.ముహమ్మద్ ప్రవక్త బోధనలపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమని ముఖ్యమంత్రి  అన్నారు. విద్వేష భావనల నుంచి దేశాన్ని, పోరాడి సాధించుకున్న స్వేచ్ఛను కాపాడుకోవాలంటే ప్రవక్త చెప్పిన శాంతి మార్గమే ఆచరణీయమని పేర్కొన్నారు. రాజకీయాలు, ఎన్నికల్లో పరస్పరం తలపడినా, అభివృద్ధి విషయంలో మాత్రం అందరితో కలిసి పని చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మూసీ, ఈసా నదుల ప్రక్షాళన పనుల్లో స్థానిక ఎంఐఎం పార్టీ సహకారం తీసుకుంటున్నామని గుర్తుచేశారు. కులమతాలకు అతీతంగా పేదల సంక్షేమం, అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని తెలిపారు. రాబోయే 10 సంవత్సరాలు ప్రజా ప్రభుత్వానికి అన్ని వర్గాలు అండగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.ఆరాంఘర్‌ లోని మెట్రో కన్వెన్షన్ లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం తో పాటు ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ అలీ షబ్బీర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, TMRIES చైర్మన్ ఫహీం ఖురేషి , తదితరులు పాల్గొన్నారు.

]]>
Sun, 15 Sep 2024 03:25:53 +0530 admin
54 ప్రపంచ రికార్డ్ ల గ్రహీత సోనాలి ఆచార్జీ కి ఘనంగా సత్కారం https://prajakshethrenews.com/54-ప్రపంచ-రికార్డ్-ల-గ్రహీత-సోనాలి-ఆచార్జీ-కి-సత్కారం https://prajakshethrenews.com/54-ప్రపంచ-రికార్డ్-ల-గ్రహీత-సోనాలి-ఆచార్జీ-కి-సత్కారం 54 ప్రపంచ రికార్డ్ ల గ్రహీతకు ఘనంగా సన్మానం

ప్రజాక్షేత్ర్ , వెబ్​ న్యూస్​ 

66 గంటల వ్యవధిలో  మండల ఆర్ట్ ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని గీసి 54 ప్రపంచ రికార్డ్ లను సొంతం చేసుకున్న ప్రముఖ క్లాసికల్ సింగర్, నృత్యకారిణి సోనాలి ఆచార్జీ ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శనివారం  ఘనంగా సత్కరించారు.  ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు సముద్రాల వేణు గోపాల చారి ముఖ్య అతిధిగా పాల్గొని, మాట్లాడారు. తొమ్మిది అడుగుల మూడు ఇంచుల పొడవు ,ఏడు అడుగుల మూడు ఇంచుల వెడల్పుతో 66 గంటల వ్యవధిలో ప్రముఖ క్లాసికల్ సింగర్, నృత్యకారిణి సోనాలి ఆచార్జీ ఈ చిత్ర పటాన్ని గీసింనందుకు గాను 54 ప్రపంచ రికార్డ్ లను ఒకేసారి పొందడం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరపున అవార్డు కోసం ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు. సోనాలి ఆచార్జీ మాట్లాడుతూ తనకు చిన్ననాటి నుండి ఆర్ట్స్ వేయడంలో ఉత్సాహం ఉంది. నాకు సహకారం అందించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. 

]]>
Sat, 14 Sep 2024 23:27:05 +0530 admin
ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసునమోదు https://prajakshethrenews.com/ఎమ్మెల్యే-గాంధీపై-హత్యాయత్నం-కేసునమోదు https://prajakshethrenews.com/ఎమ్మెల్యే-గాంధీపై-హత్యాయత్నం-కేసునమోదు ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసునమోదు

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఫిర్యాదుతో కేసునమోదు చేసిన గచ్చి బౌలి పోలీసులు

ప్రజాక్షేత్ర్, క్రైం బ్యూరో :

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డివ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ తో పాటు అతని అనుచరులు దాడికి పాల్పడ్డారంటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీతో పాటు 30 మంది పై కేసు నమోదు చేశారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, అల్వీన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తదితరులపై ఐపిఎస్ 189, 191(2), 191(3), 61,132,329,333,324 (4)324(5)351(2) r/w 190 బీఎన్ సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

]]>
Sat, 14 Sep 2024 17:19:46 +0530 admin
వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే కేంద్రం ఆర్థిక సాయం అందించాలి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/వరదలతో-నష్టపోయిన-తెలంగాణకు-తక్షణమే-కేంద్రం-ఆర్థిక-సాయం-అందించాలి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/వరదలతో-నష్టపోయిన-తెలంగాణకు-తక్షణమే-కేంద్రం-ఆర్థిక-సాయం-అందించాలి-రేవంత్-రెడ్డి వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే  కేంద్రం ఆర్థిక సాయం అందించాలి : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందని, ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలన్నారు. కఠిన నిబంధనల వల్ల అందుబాటులో ఉన్న రూ.1350 కోట్లల్లో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని, నిబంధనలు సడలించాలని కోరారు. వరద నష్టాన్ని పరిశీలించిన  కేంద్ర అధికారుల బృందంతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఖమ్మం పట్టణంలో మున్నేరు  వాగుతో ఉన్న వరద ముప్పును నివారించేందుకు  రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  ఇందు కోసం కేంద్రం నిధులు కేటాయించేలా చూడాలని,  రాష్ట్రం తనవంతుగా నిధుల వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు.రాకాసి తండా, సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజలను సమీపంలో సురక్షితంగా ఉండే ప్రాంతంలో ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవటం కంటే, నివారించే చర్యలపై ఎక్కువ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ తరహాలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్నపోలీసు బెటాలియన్లను ఉపయోగించుకుంటామని సీఎం తన ఆలోచనలను కేంద్ర బృందంతో పంచుకున్నారు. మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు 50 వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన సంఘటన  అరుదైనది కావడంతో కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సమావేశంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి , సీఎం సలహదారు వేం నరేందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , ఇతర ఉన్నతాధికారులతో పాటు ఎన్​డీఎంఏ సలహాదారు కల్నల్​ కేపీ సింగ్​ సారధ్యంలో శాంతినాథ్​ శివప్ప  మహేష్​ కుమార్, నాయల్​ కాన్సన్​ , రాకేష్​ మీనా, శశివర్ధన్​ రెడ్డి తో కూడిన కేంద్ర బృందం పాల్గొన్నారు.

]]>
Sat, 14 Sep 2024 03:17:58 +0530 admin
ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్ల తో సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రయోగం https://prajakshethrenews.com/ట్రాఫిక్-నియంత్రించేందుకు-ట్రాన్స్-జెండర్ల-తో-సీఎం-రేవంత్-రెడ్డి-కొత్త-ప్రయోగం https://prajakshethrenews.com/ట్రాఫిక్-నియంత్రించేందుకు-ట్రాన్స్-జెండర్ల-తో-సీఎం-రేవంత్-రెడ్డి-కొత్త-ప్రయోగం ట్రాఫిక్  నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్ల తో సీఎం రేవంత్ రెడ్డి  కొత్త ప్రయోగం (యూనిఫామ్ నమూనా చిత్రాలు)

ప్రజాక్షేత్ర్,, తెలంగాణ బ్యూరో 

హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సిటీ పరిధిలో ట్రాఫిక్  నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్ లను వలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోమ్ గార్డ్స్ ప్రస్తుతం సిటీలో ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోం గార్డ్స్ తరహాలోనే ట్రాన్స్ జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి  సూచించారు. ప్రతి నెలా వారికి కొంత స్టైఫండ్ ఇవ్వాలని,  దీంతో వారికి కొంతమేరకు ఉపాధి కల్పించినట్లవుతుందని అన్నారు. అందుకు ఆసక్తిగా ఉన్న ట్రాన్స్​జెండర్ల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. వారం, పది రోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని చెప్పారు. విధుల్లో ఉండే ట్రాన్స్​జెండర్లకు  ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండాలని అధికారులకు సూచించారు.

]]>
Sat, 14 Sep 2024 03:06:55 +0530 admin
హైదరాబాద్ ను ఇండోర్ తరహాలో క్లీన్ సిటీగా తీర్చి దిద్దేందుకు ప్రణాళిక రూపొందించుకోండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/హైదరాబాద్-ను-ఇండోర్-తరహాలో-క్లీన్-సిటీగా-తీర్చి-దిద్దేందుకు-ప్రణాళిక-రూపొందించుకోండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/హైదరాబాద్-ను-ఇండోర్-తరహాలో-క్లీన్-సిటీగా-తీర్చి-దిద్దేందుకు-ప్రణాళిక-రూపొందించుకోండి-రేవంత్-రెడ్డి హైదరాబాద్ ను  ఇండోర్ తరహాలో క్లీన్ సిటీగా తీర్చి దిద్దేందుకు ప్రణాళిక రూపొందించుకోండి : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

గ్రేటర్ హైదరాబాద్ ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులు ఇండోర్ కు వెళ్లి అధ్యయనం చేయాలని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై ముఖ్యమంత్రి  సచివాలయంలో  సమీక్ష నిర్వహించారు. కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద చేపట్టిన 811 కిలోమీటర్ల రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్ల వివరాలతో 15 రోజుల్లోగా తనకు పూర్తి నివేదికను అందించాలని సీఎం ఆదేశించారు. తప్పుడు నివేదికలు ఇస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఇంటి నుంచి నిత్యం చెత్త సేకరించేలా పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. అవసరమైతే జీఐఎస్, క్యూ ఆర్ స్కాన్ లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం చెప్పారు. జీహెచ్ఎంసీలో నిధుల సమీకకరణకు స్పష్టమైన ప్రణాళికలు చేసుకోవాలన్నారు.మూసీ రివర్ డెవెలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసితులకు పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. ఎక్కడా తమకు అన్యాయం జరిగిందని నిర్వాసితులు బాధ పడకుండా, వారికి భరోసా కల్పించాలని చెప్పారు. అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నందున, స్టేషన్ ముందు పార్కింగ్, పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్ కు చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలని  ఆదేశించారు. పరిసరాల్లో ఉన్న అటవీ శాఖ భూమిని, పరిశ్రమల విభాగం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అక్కడున్న పరిశ్రమలను మరో చోటికి తరలించాలని చెప్పారు. సమీక్షా సమావేశంలో సీఎం తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ,  జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి , ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

]]>
Sat, 14 Sep 2024 02:55:46 +0530 admin
రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం : హరీష్ రావు https://prajakshethrenews.com/రాహుల్-గాంధీ-ఇంటి-ముందు-ధర్నా-చేస్తాం-హరీష్-రావు https://prajakshethrenews.com/రాహుల్-గాంధీ-ఇంటి-ముందు-ధర్నా-చేస్తాం-హరీష్-రావు రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం : హరీష్ రావు 

*ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్టు చేసే దాకా, ఉసిగొలిపిన సీఐ, ఏసీపీని సస్పెండ్ చేసేదాకా ఇక్కడి సీపీ ఆఫీస్ నుండి కదిలేది లేదు.

*కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన గుండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

*లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే సీపీ, డీజీపీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలి.

*పోరాడి, దెబ్బలు తిని రాష్ట్రాన్ని సాధించుకున్నం. ఇలాంటి దాడులకు భయపడం.

*అధికారం శాశ్వతం కాదు.. పోలీస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాం

*ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మీద జరిగిన దాడిపై సైబరాబాద్ జాయింట్ సీపీకి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు 

*పోలీసుల వైఫల్యం వల్లే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది

*ఇందుకు కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి

*పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నార్సింగి పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు చేస్తున్నారు

*ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి న్యాయం జరగాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడాలని కోరుతున్నాం

*హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినొద్దు అని మేం కోరుకుంటున్నాం

*గతంలో తెలంగాణ పోలీసులు దేశానికి రోల్ మోడల్‌గా ఉన్నారు

*సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పోలీసులను తమ పని తమను చేసుకోనివ్వడం లేదు

*పోలీసులను వాళ్ల అక్రమాలకు, అరాచకాలకు, అక్రమ కేసులకు వాడుకుంటున్నారు. మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

*ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసులకు 1వ తేదీన జీతాలు ఇస్తామన్నారు

*సైబరాబాద్ పరిధిలో 1200 మంది హోంగార్డులు ఉన్నారు. 12వ తేదీ వచ్చినా హోంగార్డులకు జీతాలు ఇవ్వని దద్దమ్మ ప్రభుత్వం.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం

*పోలీసులకు టీఏలు, డీఏలు రిలీజ్ అవట్లేదు. కానిస్టేబుళ్లకు సరెండర్ లీవ్ డబ్బులు ఇవ్వట్లేదు

*కాంట్రాక్టర్లకు వందల కోట్ల డబ్బులిస్తున్నారు  

*కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన గుండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

*లేదంటే సీబీఐ విచారణ కోరుతాం, అవసరమైతే కోర్టుకు వెళ్తాం, కేంద్ర హోంశాఖ వద్దకు వెళ్తాం. నిజనిజాలు బయటకు రావాలి

*రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లో పోలీసుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది

*ఈ దాడి వెనుక పాత్రదారులెవరు? సూత్రదారులెవరు? సహకరించింది ఎవరో అన్నీ బయటకు రావాలి

*లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే సీపీ, డీజీపీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేయండి

*ఈ దాడిని దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను సస్పెండ్ చేయాలి

*రాళ్లు, కత్తులు, కర్రలతో కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు

*రాష్ట్ర ప్రజలంతా గమనించారు, టీవీల్లో ప్రజలు చూస్తున్నారు

*పదేండ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్నాం

*సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు

*సైబరాబాద్ పోలీసులంటే ఒక మంచి ఇమెజ్ ఉండే.. దాన్ని రేవంత్‌రెడ్డి మంటగలిపిండు

*రేవంత్ నిన్ను హెచ్చరిస్తున్నా.. దాడి చేసిన గుండాలను అరెస్ట్ చెయ్.. వారికి సహకరించిన పోలీసులపై యాక్షన్ తీసుకో

*లేకపోతే ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ ఇంటి ముందు, ఏఐసీసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం.

*రాహుల్‌గాంధీ రాజ్యాంగం చేతులో పట్టుకొని తిరగడం కాదు.. కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేలను ఎలా కొంటున్నరో దేశం మొత్తం తెలిసేలా చేస్తాం.

*రాహుల్ గాంధీకి నిజాయితీ లేదు.. ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దని చెప్పాలని తెలీదా. చేర్చుకున్నా వారిని రాజీనామా చేయాలని చెప్పొద్దా?

*సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు.

*ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేసేందుకు వెళ్తే అక్కడ దాడి చేశారు.

*నల్గొండ జిల్లాలో మాపై దాడి చేశారు.

*కానీ, ఇప్పటి వరకు ఆ గూండాలపై చర్యలు తీసుకోలేదు.

*కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన గుండాలకు నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో రాచ మర్యాదలు చేస్తున్నారు.

*లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు మేము ప్రతి దాడులు చేయడం లేదు.

*పోరాడి, దెబ్బలు తిని రాష్ట్రాన్ని సాధించుకున్నం ఇలాంటి దాడులకు భయపడం.

*గుండాలు, సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టం.

*2014లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జానారెడ్డిని ఆరోజు పీఏసీ చైర్మన్ పేరు ఇవ్వాలని నేను కోరాను. నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి పేరు ఇస్తే మేము పీఏసీ చైర్మన్‌గా అపాయింట్ చేసాం. వారు చనిపోతే పాలేరు ఎమ్మెల్యే రామ్‌రెడ్డి వెంకట్ రెడ్డి పేరు ఇస్తే వారిని కూడా పీఏసీగా నామినేట్ చేసాం. తర్వాత గీతా రెడ్డి పేరు ఇస్తే వారిని పీఏసీ చైర్మన్‌గా అపాయింట్ చేసాం.

*2018లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల ప్రతిపక్ష హోదా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కి పీఏసీ చైర్మన్ ఇచ్చాము.

]]>
Fri, 13 Sep 2024 03:45:43 +0530 admin
ఇదేం ప్రజా పాలన ?.....మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి https://prajakshethrenews.com/ఇదేం-ప్రజా-పాలన-మాజీ-మంత్రి-ఎమ్మెల్యే-సబితా-ఇంద్రారెడ్డి https://prajakshethrenews.com/ఇదేం-ప్రజా-పాలన-మాజీ-మంత్రి-ఎమ్మెల్యే-సబితా-ఇంద్రారెడ్డి ఇదేం ప్రజా పాలన ?.....మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

.ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయ పరంగా పోరాడుతున్నందునే కౌశిక్ రెడ్డిపై దాడి చేశారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.  దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యములో ఇలాంటి దాడులకు తావులేదని కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని ఖండించారు. కొండాపూర్ లో కౌశిక్ రెడ్డిని పరామర్శించిన అనంతరం,సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటనలు చూడలేదన్నారు. ఈ ప్రభుత్వంలో దాడులు పెరిగాయని, లా అండ్ ఆర్డర్ అదుపులో లేకుండా పోయిందన్నారు. ఎమ్మెల్యే పైనే దాడి చేస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.

]]>
Fri, 13 Sep 2024 01:11:59 +0530 admin
సీతారాం ఏచూరి మృతి దేశ రాజకీయాలకు తీరని లోటు : రేవంత్​ రెడ్డి https://prajakshethrenews.com/సీతారాం-ఏచూరి-మృతి-దేశ-రాజకీయాలకు-తీరని-లోటు-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/సీతారాం-ఏచూరి-మృతి-దేశ-రాజకీయాలకు-తీరని-లోటు-రేవంత్-రెడ్డి సీతారాం ఏచూరి మృతి దేశ రాజకీయాలకు తీరని లోటు : రేవంత్​ రెడ్డి

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

వామపక్ష యోధుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యులు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం పట్ల మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సీతారాం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జాతీయ స్థాయికి ఎదిగిన అతికొద్ది మంది తెలుగువారిలో ఏచూరి గారి ప్రస్థానం ప్రత్యేకమైనదని సీఎం అభిప్రాయపడ్డారు. నాలుగు దశాబ్ధాల ప్రజా జీవితంలో ఏచూరి  చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని, వారు లేకపోవడం దేశ రాజకీయాలకు తీరని లోటని తన సందేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

]]>
Fri, 13 Sep 2024 00:02:49 +0530 admin
కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించిన అఘోరి ( Aghora ) https://prajakshethrenews.com/కొండగట్టు-అంజన్న-ఆలయాన్ని-సందర్శించిన-అఘోరి-aghora https://prajakshethrenews.com/కొండగట్టు-అంజన్న-ఆలయాన్ని-సందర్శించిన-అఘోరి-aghora కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించిన అఘోరి ( Aghora ) 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

కుంభమేళాలు, పుష్కరాలలో మాత్రమే అఘోరా( Aghora ) లు ఎక్కువగా కనిపిస్తుంటారు. హిందూ సమాజంలో అఘోరాలను దేవదూతలు గా భావిస్తుంటారు. అయితే ఘోరాలలో పురుషులు మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంటారు. మహిళలను మాత్రం అఘోరీలుగా సంభోదిస్తుంటారు. అయితే మహిళా అఘోరీలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. వాస్తవానికి హిమాలయ మంచు గుహలు, కాశీ లో అఘోరాలు ఎక్కువగా సంచరిస్తూ తపస్సులు చేస్తుంటారు. కానీ ఓ మహిళా అఘోరీ మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ద దేవాలయాలను సందర్శిస్తు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. ఈ నేపధ్యంలోనే సదరు మహిళ అఘోరి కొమురవెల్లిలోని మల్లన్న ఆలయం, కొండ గట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆలయకమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేయించారు. ఒక్కసారిగా మహిళా అఘోరిని భక్తులు దర్శించుకుని, సెల్ఫీలు దిగారు. 

]]>
Thu, 12 Sep 2024 23:49:46 +0530 admin
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి చెక్కు అందజేసిన పవన్​కళ్యాణ్ https://prajakshethrenews.com/ముఖ్యమంత్రి-సహాయనిధికి-రూకోటి-చెక్కు-అందజేసిన-పవన్కళ్యాణ్-149 https://prajakshethrenews.com/ముఖ్యమంత్రి-సహాయనిధికి-రూకోటి-చెక్కు-అందజేసిన-పవన్కళ్యాణ్-149 ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి చెక్కు అందజేసిన పవన్​కళ్యాణ్

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  1కోటి రూపాయలు విరాళం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న పవన్​ కళ్యాణ్​కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

]]>
Thu, 12 Sep 2024 00:39:29 +0530 admin
చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే నేలమట్టం చేస్తాం : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/చెరువులు-కుంటలు-నాలాలు-ఆక్రమిస్తే-నేలమట్టం-చేస్తాం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/చెరువులు-కుంటలు-నాలాలు-ఆక్రమిస్తే-నేలమట్టం-చేస్తాం-రేవంత్-రెడ్డి చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే నేలమట్టం చేస్తాం : రేవంత్ రెడ్డి

ఆక్రమణ దారులను జైలుకు పంపేందుకు కూడా వెనకాడబోం

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

చెరువులు, కుంటలు, నాలాల్లోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి తీరుతామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలను క్రమబద్ధం చేసే ప్రసక్తే లేదన్నారు. ఆక్రమణదారులు స్వచ్చందంగా వైదొలగాలని పిలుపునిచ్చారు. అవసరమైన పక్షంలో ఆక్రమణ దారులను జైలుకు పంపేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు.రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్‌ఐలు, ఏఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. యువత, నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నియామకాలు, డ్రగ్స్ నియంత్రణ, పోలీసింగ్, హైడ్రా, రుణమాఫీ వంటి పలు కీలక అంశాలపై మాట్లాడారు.  వరదల కారణంగా పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ఆక్రమణల కారణంగానే వరదలు వస్తున్నాయి. ఆక్రమణలను తొలగించి మూసీ నది ప్రక్షాళన చేస్తాం. పరీవాహక ప్రాంతంలోని 11 వేలకు పైగా నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది.  మనకు కాస్మెటిక్ పోలీసింగ్ కాదు. కాంక్రీట్ పోలీసింగ్ అవసరం. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే, నేరస్తులకు కాదు. ఖాకీ డ్రెస్ ఉన్నది ప్రజల కోసమే అనే విశ్వాసం కల్పించేలా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఎస్సైలు, ఏఎస్ఐలు పని చేయాలి. పోలీసుల పిల్లల కోసం హైదరాబాద్‌, వరంగల్‌లో ఒక్కోచోట 50 ఎకరాల్లో రెసిడెన్షియల్స్ ను రెండేళ్లలో అందుబాటులోకి తెస్తామన్నారు.  మా ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకురావడమే కాదు, రైతన్నలు, నేతన్నలు, గీతన్నలను ఆదుకుంటోంది. కేవలం 28 రోజుల్లోనే 22,22,685 రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లు జమచేసి రుణమాఫీ చేశాం. తొమ్మిదేండ్లుగా నెరవేరని నిరుద్యోగ యువత ఆకాంక్షలను మా ప్రభుత్వం సాకారం చేస్తోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాం. ఇప్పుడు యువకులు ఉత్సాహంతో పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 

]]>
Thu, 12 Sep 2024 00:27:45 +0530 admin
వరదబాధితుల సహయార్థం పోలీసు శాఖ ఒక రోజు వేతనం 11,06,83,571 కోట్లు సీఎంకు అందజేత https://prajakshethrenews.com/వరదబాధితుల-సహయార్థం-పోలీసు-శాఖ-ఒక-రోజు-వేతనం-110683571-కోట్లు-సీఎంకు-అందజేత https://prajakshethrenews.com/వరదబాధితుల-సహయార్థం-పోలీసు-శాఖ-ఒక-రోజు-వేతనం-110683571-కోట్లు-సీఎంకు-అందజేత వరదబాధితుల సహయార్థం పోలీసు శాఖ ఒక రోజు వేతనం 11,06,83,571కోట్లు సీఎంకు అందజేత

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

వరద బాధితుల సహాయార్థం పోలీసు శాఖ ఒక రోజు వేతనం 11,06,83,571 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేశారు. పోలీస్ అకాడమీలో జరిగిన ఎస్‌ఐలు, ఏఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ఈ మొత్తానికి సంబంధించి చెక్కును హోం సెక్రెటరీ రవి గుప్తా, డీజీపీ జితేందర్,  ఇంటెలిజెన్స్ చీఫ్ బి. శివధర్ రెడ్డి, పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. వరద బాధితులను ఆదుకోవడానికి మంచి ఆశయంతో ముందుకొచ్చి సహాయాన్ని అందించిన పోలీసు శాఖకు ఈ సందర్భంగా సీఎం  అభినందనలు తెలియజేశారు.

]]>
Thu, 12 Sep 2024 00:19:57 +0530 admin
తెలంగాణకు అదనపు సహాయం అందిచాలని 16 వ ఆర్థిక సంఘానికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి https://prajakshethrenews.com/తెలంగాణకు-అదనపు-సహాయం-అందిచాలని-16-వ-ఆర్థిక-సంఘానికి-రేవంత్​రెడ్డి విజ్ఞప్తి https://prajakshethrenews.com/తెలంగాణకు-అదనపు-సహాయం-అందిచాలని-16-వ-ఆర్థిక-సంఘానికి-రేవంత్​రెడ్డి విజ్ఞప్తి  తెలంగాణకు అదనపు సహాయం అందిచాలని 16 వ ఆర్థిక సంఘానికి రేవంత్ రెడ్డి  విజ్ఞప్తి

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో 

తెలంగాణ మరింత పురోభివృద్ధి సాధించేలా రాష్ట్రానికి తగినంత సహాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  16 వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు సవాలుగా మారిన రుణ భారాన్ని తగ్గించేందుకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని,  రుణాలను రీ స్ట్రక్చర్ చేసే అవకాశం కల్పించాలని లేదా అదనపు ఆర్ధిక సహాయాన్ని అందించాలని కోరారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పణగరియా అధ్యక్షతన, సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, అనీ మాథ్యూస్, డాక్టర్ మనోజ్ పండా, డాక్టర్ సౌమ్యా కాంతి ఘోష్ సమక్షంలో జ్యోతీబా పూలే ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రస్తుత పరిస్థితులను వివరించి రాష్ట్ర అభిమతాన్ని ముఖ్యమంత్రి వారి ముందుంచారు.

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50% కి పెంచండి. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్‌ మీ ముందుకు వస్తోంది. ఈ విషయంలో సానుకూలంగా స్పందించండి.

దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్. మా రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్నాం. దేశంలోనే వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మాది. మన దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది.

బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణ భారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్-బడ్జెట్ రుణాలూ ఉన్నాయి.

గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుంది. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి. రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే ఆ ప్రభావం రాష్ట్ర పురోగతిపై చూపే ప్రమాదం ఉంది.

దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  లక్ష్యానికి మేం సంపూర్ణంగా సహకరిస్తాం. తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం.

భారత్‌ను ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తెలంగాణ తరఫున మా వంతు బాధ్యతను నేరవేరుస్తాం. ఫిస్కల్ ఫెడరలిజం బలోపేతం చేయడంలో మీ మద్దతు కోరుతున్నాం. 

తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి 16వ ఆర్థిక సంఘం సిఫారసులు ఉపయోగపడతాయని మేం విశ్వసిస్తున్నాం.

]]>
Wed, 11 Sep 2024 02:52:28 +0530 admin
సోలార్ మోడల్ గ్రామంగా కొండారెడ్డిపల్లి తీర్చిదిద్దడానికి సర్వే షురూ https://prajakshethrenews.com/సోలార్-మోడల్-గ్రామంగా-కొండారెడ్డిపల్లి-తీర్చిదిద్దడానికి-సర్వే-షురూ https://prajakshethrenews.com/సోలార్-మోడల్-గ్రామంగా-కొండారెడ్డిపల్లి-తీర్చిదిద్దడానికి-సర్వే-షురూ సోలార్ మోడల్ గ్రామంగా  కొండారెడ్డిపల్లి తీర్చిదిద్దడానికి సర్వే షురూ 

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

పూర్తి స్థాయి సోలార్ మోడల్ గ్రామంగా  కొండారెడ్డిపల్లిని తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఆ గ్రామంలో ఇంటింటి సర్వే ప్రారంభించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగం పెంచాలన్న లక్ష్యంతో పైలట్ ప్రాజెక్టుగా ఈ గ్రామాన్ని ఎంపిక చేశారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బి. సంతోష్, రెడ్కో VC & MD  అనిల, సంస్థ డైరెక్టర్ కే రాములు, ఇతర శాఖల ముఖ్య అధికారులతో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటించారు.ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు, రైతులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఈ పైలట్ ప్రాజెక్ట్ వివరాలు తెలియజేశారు. గ్రామంలో దాదాపు 499 గృహ, 66 వాణిజ్య, 867 వ్యవసాయ, ఇతర కేటగిరీలతో కలుపుకుని మొత్తంగా 1451 వినియోగదారులు ఉన్నారు. ఇంటింటి సర్వే పూర్తి చేసిన తర్వాత గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ కెపాసిటీని అంచనా వేసి తదుపరి ప్రక్రియ చేపట్టనున్నారు.

]]>
Wed, 11 Sep 2024 02:42:21 +0530 admin
అవసరానికి అనుగుణంగా నూత‌న ఆర్టీసీ బ‌స్సులు కొనుగోలు చేయండి : రేవంత్​ రెడ్డి https://prajakshethrenews.com/అవసరానికి-అనుగుణంగా-నూతన-బస్సులు-కొనుగోలు-చేయండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/అవసరానికి-అనుగుణంగా-నూతన-బస్సులు-కొనుగోలు-చేయండి-రేవంత్-రెడ్డి అవసరానికి అనుగుణంగా నూత‌న బ‌స్సుల కొనుగోలు చేయండి : రేవంత్​ రెడ్డి

ఇప్పటి వరకు ఉచితంగా ప్ర‌యాణం చేసిన 83.42 కోట్ల మంది మ‌హిళ‌లు

ప్ర‌యాణికుల‌కు రూ. 2,840.71 కోట్లు ఆదా

ప్రజాక్షేత్ర్ , తెలంగాణ బ్యూరో 

ప్ర‌జల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఆర్టీసీ నూత‌న బ‌స్సుల కొనుగోలు చేయాల‌ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.పెరిగిన అవ‌స‌రాలు, నూత‌న మార్గాల‌ను అందుకు ప్ర‌తిపాదిక చేసుకోవాల‌ని సూచించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆర్టీసీ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పలు సూచనలు చేశారు. మ‌హాల‌క్ష్మి ప‌థకం మ‌హిళ‌లు వినియోగించుకుంటున్న తీరుపై ముఖ్య‌మంత్రి ఆరా తీశారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని అధికారులు వివరించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 83.42 కోట్ల మంది మ‌హిళ‌లు ఉచితంగా ప్ర‌యాణం చేయగా, తద్వారా ప్ర‌యాణికుల‌కు రూ. 2,840.71 కోట్లు ఆదా అయినట్టు అధికారులు చెప్పారు. ఆర్టీసీకి చెందిన 7,292 బ‌స్సుల్లో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ర్తిస్తుండగా, ఈ ప‌థ‌కం ప్రారంభ‌మైన త‌ర్వాత వివిధ జిల్లాల నుంచి హైద‌రాబాద్‌లోని ఆస్పత్రులకు వ‌స్తున్న మ‌హిళ‌ల సంఖ్య పెరిగినట్టు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

]]>
Wed, 11 Sep 2024 02:30:31 +0530 admin
తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతాం : రేవంత్​రెడ్డి https://prajakshethrenews.com/తెలంగాణ-మహిళా-యూనివర్సిటీకి-చాకలి-ఐలమ్మ-పేరు-పెడతాం-రేవంత్రెడ్డి https://prajakshethrenews.com/తెలంగాణ-మహిళా-యూనివర్సిటీకి-చాకలి-ఐలమ్మ-పేరు-పెడతాం-రేవంత్రెడ్డి తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతాం : రేవంత్​రెడ్డి

ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని నిర్ణయం

ప్రజాక్షేత్ర్ , తెలంగాణ బ్యూరో 

హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. చాకలి ఐలమ్మ 39 వ వర్థంతిని పురస్కరించుకుని ప్రభుత్వం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ధీర వనిత ఐలమ్మ స్పూర్తిని కొనసాగిస్తామన్నారు. పోరాటయోధురాలిని స్మరిస్తూ ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం చెప్పారు. ఐలమ్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని భావిస్తున్నట్టు తెలిపారు. దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాలను పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారంటూ వారిని స్మరించుకున్నారు. ఐలమ్మ స్పూర్తితో ఇందిరా గాంధీ దేశంలో భూ సంస్కరణలు తెచ్చారని, భూమి పేదవాడి ఆత్మగౌరవం, అందుకే ఇందిరమ్మ పేదలకు లక్షల ఎకరాలను పంచిపెట్టారని అన్నారు. ధరణి ముసుగులో కొందరు పేదల భూములను కాజేయాలన్న కుట్ర చేశారని, పేదల భూములను కాపాడేందుకే ఐలమ్మ స్పూర్తితో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం  అన్నారు. చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను నృత్య రూపకంగా ప్రదర్శించిన తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు డాక్టర్ అలేఖ్య పుంజాల  బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Wed, 11 Sep 2024 02:22:40 +0530 admin
గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్దిని వేగవంతం చేయండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/గ్రీన్-ఫార్మా-సిటీ-అభివృద్దిని-వేగవంతం-చేయండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/గ్రీన్-ఫార్మా-సిటీ-అభివృద్దిని-వేగవంతం-చేయండి-రేవంత్-రెడ్డి గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్దిని వేగవంతం చేయండి : రేవంత్ రెడ్డి

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో 

హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. గ్రీన్ ఫార్మా పూర్తిగా కాలుష్య రహిత సిటీగా అభివృద్ధి జరగాలన్నారు. భూములు కోల్పోయిన వారికి  గ్రీన్ ఫార్మాసిటీ  అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని  అధికారులను చెప్పారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రధానకార్యదర్శి శాంతి కుమారి,  ఇతర ఉన్నతాధికారులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్​  జిల్లాల పరిధిలో ముచ్చర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన పరిసరాల్లో గ్రీన్ ఫార్మా సిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. పర్యావరణ హితంగా  కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిశ్రమల అభివృద్ధి జరగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అక్కడ అభివృద్ధికి అవసరమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీలు, తదితర మౌలిక సదుపాయాల నిర్మాణాలను వీలైనంత తొందరగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని, వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఉండాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పనులు చేయాలని సూచించారు.  గ్రీన్ ఫార్మా సిటీలో పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయని, త్వరలోనే ఆ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతామని సీఎం తెలిపారు. ఔషధాల తయారీ కంపెనీలు, బయోటెక్ & లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కొత్తగా నెలకొల్పే అత్యాధునిక గ్రీన్ ఫార్మా సిటీ సింగిల్ స్టాప్ గా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. యాంటీ బయాటిక్స్, ఫెర్మంటేషన్ ఉత్పత్తులు, సింథటిక్ డ్రగ్స్, రసాయనాలు, విటమిన్లు, వ్యాక్సిన్లు, డ్రగ్ ఫార్ములేషన్స్, న్యూట్రాస్యూటికల్స్, హెర్బల్ ఔషధ ఉత్పత్తులు, ప్రత్యేక రసాయనాలు, కాస్మోటిక్స్ తదితర సంబంధిత ఉత్పత్తులన్నింటికీ ఫార్మా సిటీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. వీటితో పాటు పరిశోధన, అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. పరిశోధన, శిక్షణ,  నైపుణ్యాలకు అవసరమైన ప్రత్యేక విశ్వ విద్యాలయం ఉంటుందని అన్నారు. హెల్త్ కేర్, ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా అందులో కోర్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు.

]]>
Tue, 10 Sep 2024 01:52:55 +0530 admin
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్​ కమిషనర్​ సీవి ఆనంద్​ https://prajakshethrenews.com/సీఎం-రేవంత్-రెడ్డిని-మర్యాదపూర్వకంగా-కలిసిన-పోలీస్-కమిషనర్-సీవి-ఆనంద్ https://prajakshethrenews.com/సీఎం-రేవంత్-రెడ్డిని-మర్యాదపూర్వకంగా-కలిసిన-పోలీస్-కమిషనర్-సీవి-ఆనంద్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్​ కమిషనర్​ సీవి ఆనంద్​ 

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ సోమవారం పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్​ కమిషనర్​ సీవీ ఆనంద్​ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్‌ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. 

]]>
Tue, 10 Sep 2024 01:46:06 +0530 admin
శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయ ఆభివృద్ది పనుల ప్రారంభానికి శృంగేరికి వెళ్ళిన అధికార యంత్రాంగం https://prajakshethrenews.com/శ్రీ-రాజరాజేశ్వరస్వామి-దేవాలయ-ఆభివృద్ది-పనుల-ప్రారంభానికి-శృంగేరికి-వెళ్ళిన-అధికార-యంత్రాంగం https://prajakshethrenews.com/శ్రీ-రాజరాజేశ్వరస్వామి-దేవాలయ-ఆభివృద్ది-పనుల-ప్రారంభానికి-శృంగేరికి-వెళ్ళిన-అధికార-యంత్రాంగం శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయ ఆభివృద్ది పనుల ప్రారంభానికి శృంగేరికి వెళ్ళిన అధికార యంత్రాంగం 

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి వారి దేవాలయ ఆభివృద్ది పనులు ప్రారంభించేందుకు గాను శృంగేరి పిఠం వారి ఆజ్ఞ కోసం ఉన్నత స్థాయి బృందం శృంగేరి చేరుకుంది. ఈ బృందంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి((ఓఎస్డీ) వేముల శ్రీనివాసులు, రాజన్న దేవస్థానం ఈవో శ్రీ వినోద్ రెడ్డి,  దేవాదాయ శాఖ స్థపతి శ్రీ వల్లీనాయగం, శృంగేరి పీఠం తెలంగాణ భాధ్యులు శ్రీ రాధాకృష్ణ తో పాటు  దేవస్థానం అధికారులు, అర్చకులు ఉన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రజాప్రభుత్వం వార్షిక బడ్జెట్ లో రూ.50 కోట్ల నిధులు కేటాయించిన విషయం విథితమే.  వేములవాడ ఎమ్మెల్యే  నేతృత్వంలో ఆలయ అర్చకులు, అధికారులు ఆగస్టు 30న సచివాలయంలో ముఖ్యమంత్రి ని కలిసిన సందర్భంలో శృంగేరి పీఠం అనుమతి అంశం చర్చకు రాగా, వెంటనే  అనుమతి తీసుకుని అందుకు సంబంధించిన పనులను చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఉన్నత స్థాయి బృందం శృంగేరి వెళ్లింది.

]]>
Mon, 09 Sep 2024 21:21:47 +0530 admin
హైదరాబాద్ లో IIHT సంస్థను ప్రారంభించిన సీఎం రేంవత్ రెడ్డి https://prajakshethrenews.com/హైదరాబాద్-లో-iiht-సంస్థను-ప్రారంభించిన-సీఎం-రేంవత్-రెడ్డి https://prajakshethrenews.com/హైదరాబాద్-లో-iiht-సంస్థను-ప్రారంభించిన-సీఎం-రేంవత్-రెడ్డి హైదరాబాద్ లో IIHT సంస్థను ప్రారంభించిన సీఎం రేంవత్ రెడ్డి 

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

హైదరాబాద్‌లో ప్రారంభించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు స్వతంత్య్ర సమరయోధుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నిర్ణయించారు. హైదరాబాద్ లో IIHT సంస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి ప్రారంభించారు. ఈ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టడం సముచితంగా ఉంటుందని, వెంటనే అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు.  

సమాజంలో ఆత్మగౌరవంతో బతకడానికి రైతన్న ఎంత ముఖ్యమో... నేతన్న కూడా అంతే ముఖ్యం.

 నేతన్న రుణాలు 30 కోట్ల రూపాయల మేరకు ఉన్నట్టయితే వాటిని మాఫీ చేస్తాం.

*రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 63 లక్షల మంది మహిళలకు ప్రతి ఏటా ఒక్కొక్కరి రెండు మంచి డిజైన్ తో కూడిన నాణ్యమైన చీరలను అందించాలి.

* ఏడాదికి 1.30 కోట్ల చీరలను నేతన్నలకు ఆర్డర్ ఇస్తాం. చేనేతకు చేయూత పథకం కింద రూ.290 కోట్లు సహా నేతన్నల కోసం పెండింగ్‌ బిల్లులు కలిపి మొత్తంగా రూ. 335 కోట్ల విడుదల.

* హ్యాండ్లూమ్ టెక్నాలజీలో తెలంగాణ విద్యార్థులు చదువుకోవాలంటే బయటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులను గమనించి IIHT ని హైదరాబాద్‌ కు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ని కలిసి కోరగా, రాజకీయాలకు అతీతంగా ఆమోదించారు.

* విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభించడానికి నాంపల్లిలో ఖాళీగా ఉన్న తెలుగు యూనివర్సిటీ భవనంలో ఈ సంస్థను ప్రారంభిస్తున్నాం.

* ఈ సంస్థలో చేరిన విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడంతోపాటు నెలకు రూ.2,500 చొప్పున స్కాలర్ షిప్ మంజూరు చేస్తున్నాం.

]]>
Mon, 09 Sep 2024 21:13:46 +0530 admin
నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తా : రేవంత్​ రెడ్డి https://prajakshethrenews.com/నిజమైన-జర్నలిస్టులకు-న్యాయం-చేస్తా-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/నిజమైన-జర్నలిస్టులకు-న్యాయం-చేస్తా-రేవంత్-రెడ్డి  నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తా :  రేవంత్​ రెడ్డి

38 ఎకరాల భూమి జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి అప్పగింత

స్పెషల్ డెవలప్‌మెంట్‌ ఫండ్ నుంచి రూ. 10 కోట్లు మీడియా అకాడమీకి  కేటాయింపు

ఫ్యూచర్ సిటీలోనూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తాం

కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు 

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో 

తమ ప్రభుత్వం జర్నలిస్టులను సమాజానికి చికిత్స చేసే డాక్టర్లుగానే చూస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు. పాత్రికేయుల సమస్యలను పరిష్కారించి, వారికి సంక్షేమాన్ని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ వెనుకడుగు వేయలేదని, నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీలోనూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. ఇండ్ల స్థలాల కోసం 38 ఎకరాల భూమికి సంబంధించి స్వాధీన పత్రాలను ముఖ్యమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ (మ్యాక్‌) హౌసింగ్ సొసైటీకి అప్పగించారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ప్రజా ప్రభుత్వానికి ఈ సందర్భంగా పాత్రికేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున చెక్కులను సీఎం పంపిణీ చేశారు.  ప్రజాభిప్రాయం, పాత్రికేయుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే తమ ప్రభుత్వ విధానమని, జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే అని చెప్పారు.  ఒకప్పుడు రాజాకీయ పార్టీలు తమ సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవి, కానీ ఇప్పుడు ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు.  "వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరు. అది మనకు మనమే పెంచుకోవాలి. కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోంది. కొంతమంది జర్నలిస్టు అనే పదానికి అర్ధాన్నే మార్చేస్తున్నారు. ఉన్మాదంతో వ్యవహరించే అలాంటి వారిని నియంత్రించే బాధ్యత కూడా జర్నలిస్టులపైనే ఉంది. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది" అని ముఖ్యమంత్రి అన్నారు.  జర్నలిజం ముసుగులో కొందరు రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే ఉన్మాదంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దని చెప్పారు.  జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడిటేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్‌మెంట్‌ ఫండ్ నుంచి రూ. 10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇండ్ల స్థలాల విషయంలో మిగతా జర్నలిస్టులు ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,  మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

]]>
Mon, 09 Sep 2024 02:23:38 +0530 admin
వరద బాధితులకు కేంద్రం తక్షణ సాయం అందించాలి : రేవంత్​ రెడ్డి https://prajakshethrenews.com/వరద-బాధితులకు-కేంద్రం-తక్షణ-సాయం-అందించాలి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/వరద-బాధితులకు-కేంద్రం-తక్షణ-సాయం-అందించాలి-రేవంత్-రెడ్డి వరద బాధితులకు కేంద్రం తక్షణ సాయం అందించాలి

 ఏపీతో సమానంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలి

 ప్రాథమిక అంచనాల ప్రకారం  రూ.5438 కోట్ల  నష్టం 

 విపత్తు నిధుల వినియోగం నిబంధనలు సడలించాలి

 కేంద్ర మంత్రి శివరాజ్​ సింగ్​ చౌహన్‌తో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి భేటీ

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో అపార నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్​ సింగ్​ చౌహన్ కి  వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం దాదాపు రూ. 5,438 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా వివరాలను తెలిపారు. పూర్తి అంచనాల తర్వాత ఈ నష్టం మరింత పెరిగే అవకాశముందని చెప్పారు.  వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి చౌహన్, బండి సంజయ్ కుమార్ లతో ముఖ్యమంత్రి సచివాలయంలో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి లు వెంట ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని, కానీ వరద నష్టం భారీగా జరిగిందని పవర్ పాయింట్ ద్వారా వాటి వివరాలను తెలియజేశారు. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో బాధిత కుటుంబాలు కోలుకోలేని విధంగా నష్టపోయాయని, ఇప్పటికీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని సీఎం చెప్పారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. విపత్తు నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వంద శాతం ఎస్డీఆర్ఎఫ్ నిధులు రాష్ట్రాలు వినియోగిస్తేనే, శాశ్వత మరమ్మతు పనులకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోవాలనే నిబంధన విధించారు. గతంలో ఉన్నట్లుగా ఈ నిబంధనను సడలించాలని ముఖ్యమంత్రి  కోరారు.

]]>
Sun, 08 Sep 2024 03:04:33 +0530 admin
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇంటలెక్చువల్ ఫోరమ్ ప్రతినిధుల బృందం https://prajakshethrenews.com/సీఎం-రేవంత్-రెడ్డిని-కలిసిన-ఇంటలెక్చువల్-ఫోరమ్-ప్రతినిధుల-బృందం https://prajakshethrenews.com/సీఎం-రేవంత్-రెడ్డిని-కలిసిన-ఇంటలెక్చువల్-ఫోరమ్-ప్రతినిధుల-బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇంటలెక్చువల్ ఫోరమ్ ప్రతినిధుల బృందం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరమ్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. మాదిగ, మాంగ్, చమర్, ఇతర అనుబంధ కులాల సాధికారత కోసం  గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరమ్ పనిచేస్తోంది. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. సీఎంను కలిసినవారిలో గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరమ్ జాతీయ అధ్యక్షురాలు, రిటైర్డ్ ఐఏఎస్ కె.రత్నప్రభ , ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ ఐపీఎస్ కె.బాబు రావు , డాక్టర్ విద్యాసాగర్ తో పాటు ఇతర ముఖ్యులు ఉన్నారు. ఫోరమ్ తరఫున చేపడుతున్న కార్యక్రమాల గురించి వారు ముఖ్యమంత్రికి వివరించారు.

]]>
Sun, 08 Sep 2024 02:56:30 +0530 admin
ఖైరతాబాద్ వినాయకుడికి సీఎం రేవంత్​రెడ్డి పూజలు https://prajakshethrenews.com/ఖైరతాబాద్-వినాయకుడికి-సీఎం-రేవంత్రెడ్డి-పూజలు https://prajakshethrenews.com/ఖైరతాబాద్-వినాయకుడికి-సీఎం-రేవంత్రెడ్డి-పూజలు ఖైరతాబాద్ వినాయకుడికి సీఎం రేవంత్​రెడ్డి పూజలు 

ప్రజాక్షేత్ర్ , హైదరాబాద్​ ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించినందునే ఉత్సవ కమిటీలను ఆహ్వానించి వారి విజ్ఞప్తి మేరకు మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న  నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఖైరతాబాద్ లో కొలువైన శ్రీ సప్తముఖ మహాశక్తి విశిష్ట గణపతిని సందర్శించి ముఖ్యమంత్రి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఏడు దశాబ్దాలుగా భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. స్వర్గీయ పీజేఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఇటీవల అకాల వర్షాలతో పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించిందని, అందరి పూజలు, దేవుడి ఆశీస్సుల వల్ల తక్కువ నష్టాలతో బయటపడ్డామని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యుడు దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Sun, 08 Sep 2024 02:46:37 +0530 admin
తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా ఎం.కోదండ రెడ్డి https://prajakshethrenews.com/తెలంగాణ-వ్యవసాయ-రైతు-సంక్షేమ-కమిషన్-చైర్మన్-గా-ఎంకోదండ-రెడ్డి https://prajakshethrenews.com/తెలంగాణ-వ్యవసాయ-రైతు-సంక్షేమ-కమిషన్-చైర్మన్-గా-ఎంకోదండ-రెడ్డి తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా ఎం.కోదండ రెడ్డి

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో 

తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా ఎం.కోదండ రెడ్డి నియమితులైనారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కమిషన్‌కు చైర్మన్‌గా నియమించిన నేపథ్యంలో వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ తదితరులు ఉన్నారు. 

]]>
Sun, 08 Sep 2024 02:36:21 +0530 admin
తెలంగాణ బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా గోపిశెట్టి నిరంజన్ https://prajakshethrenews.com/తెలంగాణ-బీసీ-సంక్షేమ-కమిషన్-చైర్మన్గా-గోపిశెట్టి-నిరంజన్ https://prajakshethrenews.com/తెలంగాణ-బీసీ-సంక్షేమ-కమిషన్-చైర్మన్గా-గోపిశెట్టి-నిరంజన్ తెలంగాణ బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా గోపిశెట్టి నిరంజన్ 

ముఖ్యమంత్రిని కలిసిన బీసీ చైర్మన్​, సభ్యులు

తెలంగాణ బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా గోపిశెట్టి నిరంజన్ నియమితులైనారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. చైర్మన్ నిరంజన్ తో  పాటు కొత్తగా నియమితులైన బీసీ  కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్‌ , తిరుమలగిరి సురేందర్‌ , బాలలక్ష్మి లు  ముఖ్యమంత్రిని కలిశారు. బీసీ కమిషన్‌లకు చైర్మన్‌గా, సభ్యులుగా నియమించినందుకు ఈ సందర్భంగా వారు సీఎంకి కృతజ్ఞతలు తెలియజేశారు.

]]>
Sun, 08 Sep 2024 02:12:11 +0530 admin
నలిమెల భాస్కర్ కి కాళోజీ అవార్డు https://prajakshethrenews.com/నలిమెల-భాస్కర్-కి-కాళోజీ-అవార్డు https://prajakshethrenews.com/నలిమెల-భాస్కర్-కి-కాళోజీ-అవార్డు నలిమెల భాస్కర్ కి కాళోజీ అవార్డు*

పద్మవిభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’కు 2024 సంవత్సరానికిగాను ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్  ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవార్డు కింద రూ. 1,01,116 నగదు, జ్జాపిక అందించి శాలువతో సత్కరిస్తారు. కాళోజీ అవార్డుకు ఎంపికైన నలిమెల భాస్కర్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అభినందనలు తెలిపారు.

]]>
Sun, 08 Sep 2024 00:46:40 +0530 admin
టీపీసీసీ ​అధ్యక్షులుగా బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ నియామకం https://prajakshethrenews.com/టీపీసీసీ-అధ్యక్షులుగా-బొమ్మ-మహేష్-కుమార్-గౌడ్-నియామకం https://prajakshethrenews.com/టీపీసీసీ-అధ్యక్షులుగా-బొమ్మ-మహేష్-కుమార్-గౌడ్-నియామకం టీపీసీసీ ​అధ్యక్షులుగా బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ నియామకం

కాంగ్రెస్​ పార్టీ అధిష్ఠానికి ధన్యవాదాలు 

ప్రజాక్షత్ర్, తెలంగాణ బ్యూరో 

టీపీసీసీ ​అధ్యక్షులుగా బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ నియమితులైనారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్​ అధికారిక ప్రకటన విడుదల చేశారు.  మహేష్​కుమార్​ గౌడ్​ టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా, ఎంఎల్​ సి బి. మహేష్​ గౌడ్​కు అరుదైన గౌరవం దక్కిందని కాంగ్రెస్​ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకు టీపీసీసీ అధ్యక్షులుగా కొనసాగిన ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని పార్టీ అధిష్ఠానం అభినందించింది. ఈ సందర్భంగా టీపీసీసీ ​అధ్యక్షులుగా నియమితులైన బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ నాపై అత్యంత నమ్మకం తో నాకు కీలకమైన టీపీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంట్ ప్రతి పక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి వేణుగోపాల్, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ ముంన్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులకు, ఎంపీ లకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యే లకు, డీసీసీ అధ్యక్షులకు, పార్టీ కోసం అనునిత్యం పాటు పడుతున్న నాయకులకు, కార్యకర్తలకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు మహేష్​ కుమార్​గౌడ్​ మాట్లాడుతూ పార్టీ అప్పగించిన ఈ గొప్ప బాధ్యతలను చిత్తశుద్ధి తో అంకిత భావంతో పని చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు. నిరంతరం కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీ కి, ప్రభుత్వానికి అనుసంధానం గా పని చేసి రాష్ట్రాభివృద్ధికి, పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తానన్నారు. ఇంతకాలం నాకు అన్ని రకాలుగా సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. 

]]>
Sat, 07 Sep 2024 00:01:31 +0530 admin
ముంపు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులపై ఫోటో ఎగ్జిబిషన్​ను సీఎంతో కలిసి పరిశీలించిన కేంద్రమంత్రులు https://prajakshethrenews.com/ముంపు-ప్రభావిత-ప్రాంతాల-పరిస్థితులపై-ఫోటో-ఎగ్జిబిషన్ను-సీఎంతో-కలిసి-పరిశీలించిన-కేంద్రమంత్రులు https://prajakshethrenews.com/ముంపు-ప్రభావిత-ప్రాంతాల-పరిస్థితులపై-ఫోటో-ఎగ్జిబిషన్ను-సీఎంతో-కలిసి-పరిశీలించిన-కేంద్రమంత్రులు ముంపు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులపై ఫోటో ఎగ్జిబిషన్​ను సీఎంతో కలిసి పరిశీలించిన కేంద్రమంత్రులు  

ఏరియల్​ సర్వేలో పాల్గొన్న కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎం

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో 

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టం,వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రులకు వివరించారు. అంతకుముందు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఏరియల్​ సర్వే నిర్వహించారు. వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు , ప్రధానకార్యదర్శి శాంతికుమారి తదితరులు వెంట ఉన్నారు.

]]>
Fri, 06 Sep 2024 23:40:55 +0530 admin
ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్.. ఉత్తర్వులు జారీ* https://prajakshethrenews.com/ప్రభుత్వ-విద్యా-సంస్థలకు-ఉచిత-విద్యుత్-ఉత్తర్వులు-జారీ https://prajakshethrenews.com/ప్రభుత్వ-విద్యా-సంస్థలకు-ఉచిత-విద్యుత్-ఉత్తర్వులు-జారీ * ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్.. ఉత్తర్వులు జారీ*

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.ప్రజాప్రభుత్వం ఇదివరకే ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. ఏ విద్యా సంస్థలు ఉచిత విద్యుత్ పథకం పరిధిలోకి వస్తాయనేది సంబంధిత విభాగాల కార్యదర్శులు త్వరలోనే వెల్లడిస్తారు.

]]>
Fri, 06 Sep 2024 03:18:13 +0530 admin
అయోధ్య రామమందిరం నమూనాలో బాలాపూర్​ గణేష్​ మండప నిర్మాణం https://prajakshethrenews.com/అయోధ్య--రామమందిరం-నమూనాలో-బాలాపూర్-గణేష్-మండప-నిర్మాణం https://prajakshethrenews.com/అయోధ్య--రామమందిరం-నమూనాలో-బాలాపూర్-గణేష్-మండప-నిర్మాణం అయోధ్య రామమందిరం నమూనాలో బాలాపూర్​ గణేష్​ మండప నిర్మాణం

 ప్రజాక్షేత్ర్, రంగారెడ్డి బ్యూరో :

బాలాపూర్ గణేష్​  మండపాన్నిఉత్సవ సమితి అధ్యక్షులు కళ్లెం నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అయోధ్య బాల రామమందిరం నమూనాలో నిర్మిస్తున్నారు. దిల్ సుఖ్ నగర్ డెకరేటర్​ సుధారక్​ ఆధ్వర్యంలో కలకత్తాకు చెందిన 40 మంది కళాకారుల బృందం ఇప్పటికే గణేష్​ మండప పనులను ప్రారంభించారు. సెప్టెంబర్​ 7వ తేదీ లోపు అయోధ్య ఆలయం ఆకృతిలో బాలాపూర్​ గణేష్​ మండప నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు. మండపంలో అయోధ్య బాలరాముని ఆకృతిలో విగ్రహంతో పాటు ఇతర దేవతా మూర్తుల విగ్రహాలను విగ్రహాలను భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దూల్​పేట్​ నుంచి 23 ఫీట్ల ఎత్తైన విగ్రహాన్ని కొనుగోలు చేసి తీసుకువచ్చారు. 21 కిలోల లడ్డూను కూడా ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు.

]]>
Fri, 06 Sep 2024 00:40:38 +0530 admin
సోలార్ విద్యుత్‌ ను ప్రోత్సహించేలా రేవంత్ సర్కార్ కసరత్తు https://prajakshethrenews.com/సోలార్-విద్యుత్ ను-ప్రోత్సహించేలా-రేవంత్-సర్కార్-కసరత్తు https://prajakshethrenews.com/సోలార్-విద్యుత్ ను-ప్రోత్సహించేలా-రేవంత్-సర్కార్-కసరత్తు సోలార్ విద్యుత్‌ ప్రోత్సహించేలా రేవంత్ సర్కార్ కసరత్తు 

నాణ్యమైన విద్యుత్ అందించేలా ప్రణాళిక రూపొందించండి : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో : 

రాబోయే రోజుల్లో ఒక బిజినెస్ హబ్‌గా మారబోతున్న తెలంగాణలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు.

*రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి చేసేందుకు వీలుగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగేలా చర్యలు.

* వివిధ శాఖల పరిధిలో నిరుపయోగంగా ఉన్న భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి.

* సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడానికి రైతులకు ఉచితంగా సోలార్ పంప్‌సెట్లు.

* అందుకు కొండారెడ్డిపల్లెలో పైలట్ ప్రాజెక్టు.

* వంటగ్యాస్ బదులుగా సోలార్ విద్యుత్ వినియోగ విధానం. మహిళా సంఘాలకు శిక్షణ.

* అటవీ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు.

* ప్రతీ ఏటా 40వేల మెగావాట్స్ విద్యుత్ అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణ.

* ఓవర్ లోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం, అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయడం.

]]>
Thu, 05 Sep 2024 03:38:24 +0530 admin
వరద బాధితులకు కేంద్ర సాయం.. కిషన్‌రెడ్డి https://prajakshethrenews.com/వరద-బాధితులకు-కేంద్ర-సాయం-కిషన్రెడ్డి https://prajakshethrenews.com/వరద-బాధితులకు-కేంద్ర-సాయం-కిషన్రెడ్డి వరద బాధితులకు కేంద్ర సాయం.. కిషన్‌రెడ్డి

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో 

వరదల్లో చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 3లక్షలు వస్తాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన రూ. 5లక్షల్లో కేంద్రం ఇచ్చే రూ. 3లక్షలు కలుపుకొని ఇస్తారా? లేదా? రాష్ట్ర ప్రభుత్వమే రూ. 5లక్షలు ఇస్తోందా? అనే విషయంపై క్లారిటీ లేదని కిషన్ రెడ్డి అన్నారు. వరదల్లో చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 3లక్షలు వస్తాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి.. వారం రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంటే రూ. 16వేలు, వారం లోపుల ఆస్పత్రిలో ఉంటే రూ. 4 వేలను ఆస్పత్రి ఖర్చులకు కేంద్రం ఇస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులతో బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. యుటిలైజేషన్ నిధులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎలాంటి రిపోర్ట్ విడుదల చేయలేదని చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్ కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ. 1300 కోట్లకు పైగా నిధులు ఉన్నాయని తెలిపారు. మరో రూ. 200 కోట్లు యూసీ నిధులున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తే కేంద్ర ప్రభుత్వం దానికి తగిన నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని కిషన్‌రెడ్డి తేల్చిచెప్పారు. అంటు వ్యాధులు సోకకుండా మెడిసిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శలు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. 1948లో నిజాం లొంగిపోయిన రోజు గణేష్ నిమజ్జనం ఒకేరోజు జరిగిందని చెప్పారు. మళ్లీ 75ఏళ్ల తర్వాత ఇది రిపేట్ అవ్వడం సంతోషమని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

]]>
Thu, 05 Sep 2024 02:06:56 +0530 admin
వరద బాధితులను ఆదుకోండి : రేవంత్​రెడ్డి https://prajakshethrenews.com/వరద-బాధితులను-ఆదుకోండి-రేవంత్రెడ్డి https://prajakshethrenews.com/వరద-బాధితులను-ఆదుకోండి-రేవంత్రెడ్డి వరద బాధితులను ఆదుకోండి : రేవంత్​రెడ్డి

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో : 

వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ఇతర రంగాల్లోని ప్రముఖులు స్పందించాలని కోరారు. “వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత సహాయాన్ని అందించండి. మానవత్వం ప్రదర్శించాల్సిన సమయమిది” అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)కి విరాళాలు ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా గానీ, చెక్కులు, డీడీల రూపంలోగానీ లేదంటే యూపీఐ పేమెంట్ యాప్స్ నుంచి ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసిగానీ పంపవచ్చు.

]]>
Thu, 05 Sep 2024 00:31:45 +0530 admin
మానవత్వం చాటుకున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు https://prajakshethrenews.com/మానవత్వం-చాటుకున్న-తెలంగాణ-ప్రభుత్వ-ఉద్యోగులు https://prajakshethrenews.com/మానవత్వం-చాటుకున్న-తెలంగాణ-ప్రభుత్వ-ఉద్యోగులు * మానవత్వం చాటుకున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు*

* వరద బాధితుల సహాయార్థం భారీగా రూ.130 కోట్ల విరాళం*

* సహాయనిధిలో జమచేసిన పత్రాలు ముఖ్యమంత్రికి అందజేత*

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులంతా ఉదారత చాటుకున్నారు. వరద బాధితుల కోసం ఉద్యోగులంతా కలిసి తమ ఒకరోజు మూల వేతనం రూ.130 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు మహబూబాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఈ మేరకు సతకాలతో కూడిన అంగీకార పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఉద్యోగులందరినీ అభినందించారు. "వరద బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు మూలవేతనాన్ని అందించడం వారి మానవత్వానికి ఒక ప్రతీక. మనస్పూర్తిగా వారిని అభినందిస్తున్నాను. త్వరలోనే మీ ఉద్యోగ జేఏసీలతో సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమవుతాను" అని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రజలు విపత్తులో ఉన్న సమయంలో ఉద్యోగులంతా కలిసి సీఎం సహాయ నిధికి రూ.130 కోట్లు విరాళం ఇవ్వడం గొప్ప విషయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఉద్యోగులు అందరికీ మంత్రి  ధన్యవాదాలు తెలిపారు.

]]>
Wed, 04 Sep 2024 13:38:34 +0530 admin
తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు https://prajakshethrenews.com/తెలంగాణ-విద్యా-కమిషన్-ఏర్పాటు-103 https://prajakshethrenews.com/తెలంగాణ-విద్యా-కమిషన్-ఏర్పాటు-103 తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ విద్యా కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యా రంగంపై సమగ్రమైన విద్యా పాలసీని తయారు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కమిషన్ ను ఏర్పాటు చేసింది.  చైర్మన్ తో పాటు విద్యా రంగంలో నిపుణులైన  ముగ్గురు సభ్యులతో కమిషన్ ను ఏర్పాటు చేశారు. విద్యా శాఖ ఉన్నతాధికారి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు.

]]>
Wed, 04 Sep 2024 13:34:01 +0530 admin
వైఎస్ రాజశేఖరరెడ్డికి సీ ఎం రేవంత్ రెడ్డి నివాళులు https://prajakshethrenews.com/వైఎస్-రాజశేఖరరెడ్డికి-సీ-ఎం-రేవంత్-రెడ్డి-నివాళులు https://prajakshethrenews.com/వైఎస్-రాజశేఖరరెడ్డికి-సీ-ఎం-రేవంత్-రెడ్డి-నివాళులు వైఎస్ రాజశేఖరరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 15వ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన వారిలో సీ ఎం రేవంత్ రెడ్డి తో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

]]>
Mon, 02 Sep 2024 19:13:23 +0530 admin
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అందరూ అలెర్ట్‌గా ఉండండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/ఎడతెరిపి-లేకుండా-కురుస్తున్న-వర్షాలపై-అందరూ-అలెర్ట్గా-ఉండండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ఎడతెరిపి-లేకుండా-కురుస్తున్న-వర్షాలపై-అందరూ-అలెర్ట్గా-ఉండండి-రేవంత్-రెడ్డి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అందరూ అలెర్ట్‌గా ఉండండి 

వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి 

అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో : 

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అందరూ అలెర్ట్‌గా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  , తుమ్మల నాగేశ్వరరావు,  జూపల్లి కృష్ణారావు, ఉన్నతస్థాయి అధికారులతో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని అత్యవసరంగా సమీక్షించారు.ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మున్సిపల్, విద్యుత్,  పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్ లో  సీఎం ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమయంలో అధికారులెవరూ సెలవులు పెట్టొద్దని, ఇప్పటికే సెలవుపై ఉన్నవారు వెంటనే విధుల్లో చేరి సహాయక పనుల్లో నిమగ్నం కావాలని ఆదేశించారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని సీఎం చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర పనులుంటే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ప్రజలందరికీ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని, 24 గంటలు అలెర్ట్ గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగం కావాలని పార్టీ కార్యకర్తలనూ ముఖ్యమంత్రి ఆదేశించారు.

]]>
Sun, 01 Sep 2024 23:57:39 +0530 admin
ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద నీటిని సేవ్ చేయండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/ప్రాజెక్టుల్లోకి-వచ్చిన-వరద-నీటిని-సేవ్-చేయండి-రేవంత్-reddi https://prajakshethrenews.com/ప్రాజెక్టుల్లోకి-వచ్చిన-వరద-నీటిని-సేవ్-చేయండి-రేవంత్-reddi

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు.నిండిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు లిఫ్ట్ చేయాలని, రోజుకు ఒక టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని ఆదేశించారు. అలాగే, నంది, గాయత్రి పంప్ హౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయక సాగర్‌, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు. కడెం ప్రాజెక్టు, మిడ్‌మానేరు ప్రాజెక్టు, లోయర్ మానేరు డ్యామ్‌, అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా  రంగనాయక సాగర్‌కు తరలిస్తున్నారు. రంగనాయక సాగర్ నుంచి నీటిని పంప్‌ చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని.. అక్కడి నుంచి సింగూర్ ప్రాజెక్ట్, నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరకు నీటిని తరలించాలని ఆదేశించారు.కేంద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో అన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తూ సాధ్యమైనంత వరకు నీటిని నిల్వ చేయాలని అధికారులను ఆదేశించారు.

]]>
Sun, 01 Sep 2024 23:48:11 +0530 admin
టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు: రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/టీటీడీ-తరహాలో-యాదగిరిగుట్ట-టెంపుల్-బోర్డు-ఏర్పాటు-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/టీటీడీ-తరహాలో-యాదగిరిగుట్ట-టెంపుల్-బోర్డు-ఏర్పాటు-రేవంత్-రెడ్డి *టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు*

రామప్ప ఆలయ నమూనా తరహాలో కీసర గుట్ట ఆలయాన్ని నిర్మించండి 

* దేవాలయాల అభివృద్ధిపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం*

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ (Yadagirigutta Temple) బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆదేశించారు. అచ్చంగా టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి, విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలని ఆదేశించారు.స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (#SPEED) ప్రాజెక్టుల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై  డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు చాలావరకు అర్థంతరంగా నిలిచిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ అలా ఆగిపోవడానికి వీల్లేదని, ఇప్పటివరకు ఏమేం అభివృద్ధి పనులు జరిగాయి. ఇంకా ఏమేం అసంపూర్తిగా ఉన్నాయనే వివరాలతో వారం రోజుల్లో సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు.ప్రస్తుతం కీసర గుట్టపై ఉన్న రామలింగేశ్వర ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి  నిర్ణయం తీసుకున్నారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా, అచ్చం అదే నమూనాతో కీసరగుట్ట ఆలయాన్ని నిర్మించాలని చెప్పారు. ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతిలో యథాతథంగా కీసర ఆలయం పునర్మిర్మాణం చేపట్టాలని సూచించారు.

]]>
Sat, 31 Aug 2024 01:41:32 +0530 admin
పర్యాటక అభివృద్ధిపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/పర్యాటక-అభివృద్ధిపై-సమీక్షలో-ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/పర్యాటక-అభివృద్ధిపై-సమీక్షలో-ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి * ఎకో, హెల్త్ , టెంపుల్ టూరిజాలకు విడివిడిగా పాలసీలు*

* పర్యాటక అభివృద్ధిపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి *

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం కొత్త పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. అందుకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలని అధికారులకు చెప్పారు. ఎకో టూరిజం, హెల్త్ టూరిజం, టెంపుల్ టూరిజంలకు విడివిడిగా పాలసీలను రూపొందించాలని సూచించారు.స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (#SPEED) ప్రాజెక్టుల్లో భాగంగా డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో పర్యాటక రంగ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలో ఉన్న వనరుల అభివృద్ధికి అవసరమైన చోట పీపీపీ విధానాన్ని అవలంభించాలని సూచించారు.మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో పర్యాటక రంగానికి సంబంధించిన అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని, కొన్ని చోట్ల రాత్రి విడిది ఉండే కాటేజీలను నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు.హైదరాబాద్ బయట దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జామ్​ నగర్​ లో అనంత్ అంబానీ 3 వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన విషయాన్ని ప్రస్తావించారు.అనంతగిరి ప్రాంతంలో అద్బుతమైన ప్రకృతి అటవీ సంపద, అక్కడున్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. బెంగుళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్ తరహాలో నేచర్ వెల్​ నెస్​ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.హైదరాబాద్ ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న హెల్త్ సిటీలో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఉండేలా కొత్త పాలసీ తయారు చేయాలని చెప్పారు. దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు..

]]>
Sat, 31 Aug 2024 01:33:36 +0530 admin
వ్యవసాయం, విద్యా రంగాలకు అధిక ప్రాధాన్యత : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/వ్యవసాయం-విద్యా-రంగాలకు-అధిక-ప్రాధాన్యత-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/వ్యవసాయం-విద్యా-రంగాలకు-అధిక-ప్రాధాన్యత-రేవంత్-రెడ్డి ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, 'వరల్డ్ ఫుడ్ ప్రైజ్' అవార్డు గ్రహీత డాక్టర్ సమరేందు మొహంతి , అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ నుంచి (2002) లో ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు పొందిన ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ అల్దాస్ జానయ్యలు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో వ్యవసాయ పరిశోధనలు, వ్యవసాయ విధానాల రూపకల్పన, పంటల మార్కెట్ విశ్లేషణ తదితర అంశాలపై మొహంతి, జానయ్య తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి తో పంచుకున్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం వ్యవసాయం, విద్యా రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  స్పష్టం చేశారు.

]]>
Sat, 31 Aug 2024 01:25:25 +0530 admin
2021 చరణాలతో ప్రపంచంలోనే అతి పెద్ద జానపద గీతం https://prajakshethrenews.com/021-చరణాలతో-ప్రపంచంలోనే-అతి-పెద్ద-జానపద-గీతం https://prajakshethrenews.com/021-చరణాలతో-ప్రపంచంలోనే-అతి-పెద్ద-జానపద-గీతం 2021 చరణాలతో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద జానపద గీతాన్ని రచించిన తెలంగాణ జానపద కళాకారుడు డాక్టర్ పత్రి కుమారస్వామిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. “2021 చరణాలతో అతిపెద్ద పాట” పుస్తకరూప జానపద గీతాన్ని సచివాలయంలో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. 5 వేల చరణాలతో కూడిన మరో పాట కూడా పూర్తయి పుస్తకం రూపంలో ముద్రణ దశలో ఉన్నట్టు ఈ సందర్భంగా రచయిత తెలిపారు.

]]>
Sat, 31 Aug 2024 01:12:56 +0530 admin
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం https://prajakshethrenews.com/ముఖ్య-మంత్రి-రేవంత్-రెడ్డికి-ఆశీర్వచనం https://prajakshethrenews.com/ముఖ్య-మంత్రి-రేవంత్-రెడ్డికి-ఆశీర్వచనం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం 

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ బ్యూరో :

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం అందించారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ. 50 కోట్లు కేటాయించినందుకు విప్ ఆది శ్రీనివాస్ , ఆలయ అర్చకులు, అధికారులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయ విస్తరణ ప్రణాళికలు, నమూనాపై శృంగేరి పీఠం అనుమతి తీసుకోవలసి ఉందని వివరించగా, వెంటనే  అనుమతి తీసుకుని అందుకు సంబంధించిన పనులను చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి చెప్పారు. సీఎంను కలిసినవారిలో వేములవాడ రాజన్న ఆలయ ఈవో వినోద్ , స్థపతి వల్లినాయగం , ఈఈ రాజేష్ , డీఈఈ రఘునందన్ , ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ తదితరులు ఉన్నారు.

]]>
Fri, 30 Aug 2024 17:41:43 +0530 admin
హైడ్రా ఆఫీస్ ను కూల్చేయండి: హరీశ్ రావు https://prajakshethrenews.com/హైడ్రా-ఆఫీస్-ను-కూల్చేయండి-హరీశ్-రావు https://prajakshethrenews.com/హైడ్రా-ఆఫీస్-ను-కూల్చేయండి-హరీశ్-రావు హైడ్రా ఆఫీస్ ను కూల్చేయండి: హరీశ్ రావు

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో : 

హైదరాబాద్ లోని బుద్ధ భవన్ నాలా కింద ఉన్న  హైడ్రా ఆఫీస్ ను కమిషనర్ రంగనాథ్ ముందుగా కూల్చి వేయాలని ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై అందరికీ ఒకే రూల్ ఉండాలని అయన అన్నారు. నెక్లెస్ రోడ్డులోని ప్రైవేట్, కమర్షియల్ షాపులు, తదితర వాణిజ్య భవనాలు హుస్సేన్ సాగర్ ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్నాయని వాటిని కూలగొడతారా? అని ప్రశ్నించారు. కొందరివి డైరెక్ట్ గా కూలగొట్టి, మరికొందరికి నోటీసులిచ్చి టైం పాస్ చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు.

]]>
Fri, 30 Aug 2024 16:04:32 +0530 admin
సెప్టెంబర్ 19 న మిలాద్&ఉన్&న‌బీ ర్యాలీకి అంగీకారం https://prajakshethrenews.com/సెప్టెంబర్-19-న-మిలాద్-ఉన్-నబీ-ర్యాలీకి-అంగీకారం https://prajakshethrenews.com/సెప్టెంబర్-19-న-మిలాద్-ఉన్-నబీ-ర్యాలీకి-అంగీకారం సెప్టెంబర్ 19 న మిలాద్-ఉన్-న‌బీ ర్యాలీకి అంగీకారం 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో : 

*మిలాద్-ఉన్-న‌బీ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను సెప్టెంబ‌రు 19 వ తేదీన* నిర్వ‌హించుకునేందుకు మిలాద్ క‌మిటీ ప్ర‌తినిధులు అంగీక‌రించారు. మిలాద్-ఉన్-న‌బీ ఏర్పాట్ల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో స‌మీక్ష నిర్వ‌హించారు. సెప్టెంబ‌రు 7 నుంచి గ‌ణేష్ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు, 17న నిమ‌జ్జ‌నం ఉన్న విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చిన సందర్భంలో మిలాద్-ఉన్-నబీ ప్రదర్శనలను వాయిదా వేసుకోవాలని కోరారు.ముఖ్యమంత్రి సూచనల మేరకు సమీక్ష అనంతరం ఈ అంశంపై మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొన్నం ప్ర‌భాక‌ర్‌ , ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్బ‌రుద్దీన్ ఒవైసీ, మిలాద్ క‌మిటీ స‌భ్యులు ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై చర్చించారు. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని సెప్టెంబర్ 16 న మిలాద్-ఉన్-న‌బీ వేడుక‌లు నిర్వ‌హించి, ప్రదర్శనలను మాత్రం వాయిదా వేసుకోవడానికి ఈ సందర్భంగా మిలాద్ క‌మిటీ అంగీకరించింది.

]]>
Fri, 30 Aug 2024 13:57:49 +0530 admin
* హైద‌రాబాద్ ఇమేజ్‌ను పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాలు* : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/హైదరాబాద్-ఇమేజ్ను-పెంచేలా-గణేష్-ఉత్సవాలు-ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/హైదరాబాద్-ఇమేజ్ను-పెంచేలా-గణేష్-ఉత్సవాలు-ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి * హైద‌రాబాద్ ఇమేజ్‌ను పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాలు*

* అనుమ‌తులు తీసుకున్న మండ‌పాల‌కు ఉచిత విద్యుత్* 

* అధికారులు, నిర్వాహ‌కులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాలి*

* గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి*

* సుప్రీంకోర్టు నిబంధ‌న‌లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి*

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

హైద‌రాబాద్ నగరం తొలి నుంచి మ‌త సామ‌ర‌స్యానికి, ప్ర‌శాంత‌త‌కు పేరు పొందింద‌ని, ఆ ఇమేజ్‌ను మ‌రింత పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ ఉండాల‌ని, ఇందుకోసం ఉత్స‌వ క‌మిటీలు, మండప నిర్వాహ‌కులు, ప్ర‌భుత్వ అధికారులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర స‌చివాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు. మండ‌పాల ఏర్పాటు, తొమ్మిది రోజుల ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ, నిమ‌జ్జ‌నానికి సంబంధించి మండ‌ప నిర్వాహ‌కులు బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లోనో అనుమ‌తులు తీసుకోవాల‌ని ముఖ్యమంత్రి సూచించారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, నీటి పారుద‌ల శాఖ‌, విద్యుత్ శాఖ‌తో పాటు ఇత‌ర ముఖ్య శాఖ‌ల అధికారులు సైతం మండ‌ప నిర్వాహ‌కులతో స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌న్నారు. నిమ‌జ్జ‌న మహోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎటువంటి లోటుపాట్ల‌కు తావు ఇవ్వొద్దని సీఎం హెచ్చ‌రించారు. గణపతి ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి గ్రేటర్ ప‌రిధిలోని న‌లుగురు లోక్‌స‌భ స‌భ్యులు, ఎమ్మెల్యేల అభిప్రాయాల‌ను తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి పోలీసుల‌కు చెప్పారు. సెప్టెంబ‌రు 16న మిలాద్ ఉన్ న‌బి, 17న తెలంగాణ‌లో వివిధ రాజ‌కీయ పార్టీలు ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తాయ‌ని, అందువ‌ల‌న అన్ని కార్య‌క్ర‌మాల‌కు స‌క్ర‌మ‌మైన ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగాల‌ని, ఎక్క‌డా ఎటువంటి స‌మ‌స్య త‌లెత్త‌కుండా చూసుకోవాల‌ని పోలీసుల‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.గ‌ణేష్ మండ‌పాల‌కు ఉచిత విద్యుత్ ఇవ్వాల‌ని భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి స‌భ్యులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞ‌ప్తి చేశారు. అందుకు ముఖ్య‌మంత్రి సానుకూలంగా స్పందించారు. ముందుగా మండ‌ప నిర్వాహ‌కులు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు.  అనుమ‌తులు లేకుండా విద్యుత్ వినియోగిస్తే చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, జ‌వాబుదారీత‌నం కోస‌మే అనుమ‌తి చేసుకోవాల‌ని కోరుతున్నామ‌ని తెలిపారు. మండపాల్లో డీజే సౌండ్లు వంటి అంశాల్లో సుప్రీంకోర్టు నిబంధ‌న‌ల ప్ర‌కారం ముందుకు వెళ‌తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. ఈ స‌మావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు , దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌ , పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి , సీత‌క్క‌ , ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు కేశ‌వ‌రావు, ష‌బ్బీర్ అలీ , ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి , మేయ‌ర్ గద్వాల విజయ‌ల‌క్ష్మి , ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి , పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

]]>
Fri, 30 Aug 2024 13:39:21 +0530 admin
తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ ద‌క్షిణ భాగం అలైన్‌మెంట్ పై సమీక్ష https://prajakshethrenews.com/తెలంగాణ-రీజినల్-రింగ్-రోడ్-దక్షిణ-భాగం-అలైన్మెంట్ https://prajakshethrenews.com/తెలంగాణ-రీజినల్-రింగ్-రోడ్-దక్షిణ-భాగం-అలైన్మెంట్ తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ ద‌క్షిణ భాగం అలైన్‌మెంట్ 

ఆర్ఆర్ఆర్‌, రేడియ‌ల్ రోడ్లు, ఫోర్త్ సిటీలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయండి

రావిర్యాల నుంచి అమ‌న్‌గ‌ల్ రూట్​లో మూడుచోట్ల నైట్​ సఫారీలు ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించండి

అధ్య‌య‌నం చేశాకే  గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూప‌క‌ల్ప‌న చేయాలి

భూములిచ్చే రైతులకు సాధ్యమైనంత ఎక్కువ పరిహారం అందేలా చూడాలి

జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సుదీర్ఘ స‌మీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి

తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ (Regional Ring Road) ద‌క్షిణ భాగం అలైన్‌మెంట్ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించే విధంగా ఉండాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.  నూత‌నంగా ఏర్ప‌డ‌నున్న ఫ్యూచర్ సిటీలో నెల‌కొల్ప‌నున్న ప‌రిశ్ర‌మ‌లు, అక్కడ నివసించే కుటుంబాలకు అన్నిరకాల వ‌సతులు అందుబాటులో ఉండేలా అలైన్‌మెంట్ ఉండాలన్నారు. ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ ర‌హ‌దారి అంశాలపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సుదీర్ఘ స‌మీక్ష నిర్వ‌హించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శి, పలువురు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. దాదాపు 189 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం (చౌటుప్పల్ నుంచి – ఇబ్రహింపట్నం – కందుకూరు – ఆమన్ గల్ – చేవెళ్ల – శంకర్ పల్లి – సంగారెడ్డి వరకు) అధికారులు రూపొందించిన అలైన్‌మెంట్‌లో మరికొన్ని మార్పుల‌ను ముఖ్య‌మంత్రి సూచించారు. ప్ర‌తిపాదిత రేడియ‌ల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ స‌మీక‌ర‌ణ, భూ సేక‌ర‌ణ‌ చేయాల‌న్నారు. భూములిచ్చే రైతులకు సాధ్యమైనంత ఎక్కువ పరిహారం అందేలా చూడాలని ఆదేశించారు. మనదగ్గర డ్రైపోర్టును ఏపీలోని మ‌చిలీప‌ట్నం, కాకినాడ రేవుల‌తో అనుసంధానం చేసే అవకాశాలపై అధ్య‌య‌నం చేశాకే  గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని,  ఇన్‌ల్యాండ్ వాట‌ర్ వేస్ సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని సీఎం అన్నారు. #ORR - #RRR మ‌ధ్య రావిర్యాల నుంచి అమ‌న్‌గ‌ల్  వ‌ర‌కు నిర్మించ‌నున్న ర‌హ‌దారిలో మూడు చోట్ల ఉన్న అట‌వీ ప్రాంతాల‌ను నైట్ స‌ఫారీలుగా మార్చే అంశంపై కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. కాలిఫోర్నియాలో ఆపిల్ పండ్లతోటలోనే 'ఆపిల్' సంస్థ కార్యాలయం, బెంగ‌ళూరులో జిందాల్ నేచ‌ర్ కేర్ తరహాలో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలోనూ పర్యావరణహిత నిర్మాణాలకు అధ్యయనం చేయాలన్నారు. ప్రకృతి సౌంద‌ర్యానికి నెలవైన రాచకొండలో సినీ ప‌రిశ్ర‌మ‌ అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయన్నారు.ఆర్ఆర్ఆర్‌, రేడియ‌ల్ రోడ్లు, ఫోర్త్ సిటీలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన భూ స‌మీక‌ర‌ణ‌, భూ సేక‌ర‌ణ విష‌యంలో అన్ని శాఖ‌ల అధికారులు సమన్వయంతో పని చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని ముఖ్య‌మంత్రి హెచ్చ‌రించారు.

]]>
Thu, 29 Aug 2024 23:51:13 +0530 admin
ఎవరినీ ఉపేక్షించేది లేదు: ముఖ్యమంత్రి హెచ్చరిక https://prajakshethrenews.com/ఎవరినీ-ఉపేక్షించేది-లేదు-ముఖ్యమంత్రి-హెచ్చరిక https://prajakshethrenews.com/ఎవరినీ-ఉపేక్షించేది-లేదు-ముఖ్యమంత్రి-హెచ్చరిక ఎవరినీ ఉపేక్షించేది లేదు: ముఖ్యమంత్రి హెచ్చరిక

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో 

హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి, బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పందించారు. గ‌తంలో ఇచ్చిన‌ నోటీసులు, రెండు మూడేండ్ల కింద‌టి ఫిర్యాదుల‌ను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, అటువంటి వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీఎం హెచ్చ‌రించారు. ఇలాంటి వ‌సూళ్ల‌కు పాల్ప‌డే వారిపై ఫోక‌స్ పెట్టాల‌ని ఏసీబీ, విజిలెన్స్ అధికారుల‌ను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు.

]]>
Thu, 29 Aug 2024 23:32:53 +0530 admin
ఇంటికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. కుటుంబ సభ్యులను ఆత్మీయ అలింగనం చేసుకున్న దృశ్యాలు https://prajakshethrenews.com/ఇంటికి-చేరుకున్న-ఎమ్మెల్సీ-కవిత-కుటుంబ-సభ్యులను-ఆత్మీయ-అలింగనం-చేసుకున్న-దృశ్యాలు https://prajakshethrenews.com/ఇంటికి-చేరుకున్న-ఎమ్మెల్సీ-కవిత-కుటుంబ-సభ్యులను-ఆత్మీయ-అలింగనం-చేసుకున్న-దృశ్యాలు Thu, 29 Aug 2024 00:35:59 +0530 admin తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ చేసిన సీఎం https://prajakshethrenews.com/తెలంగాణ-తల్లి-విగ్రహ-ప్రతిష్టాపనకు-భూమిపూజ-చేసిన-సీఎం https://prajakshethrenews.com/తెలంగాణ-తల్లి-విగ్రహ-ప్రతిష్టాపనకు-భూమిపూజ-చేసిన-సీఎం *తెలంగాణ దర్పం, పోరాట స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాలకు ప్రతీకగా తెలంగాణ తల్లి*

* మన కన్నతల్లుల్ని చూసుకున్నంత సంతోషకరంగా కొత్త రూపం*

*సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

*డిసెంబర్ 9న లక్షలాది మంది సమక్షంలో వైభవోపేతంగా విగ్రహావిష్కరణ*

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో : 

తెలంగాణ దర్పం, పోరాట స్ఫూర్తి ఉట్టిపడేలా, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దొరతనానికి ప్రతీకగా కాకుండా ప్రజలు తమ కన్నతల్లిని చూసుకున్నంత సంతోషకరంగా తెలంగాణ తల్లి రూపం ఉంటుందని స్పష్టం చేశారు. విగ్రహ నమూనా రూపొందించే బాధ్యతను జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగానికి అప్పగించామన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది మంది సమక్షంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వైభవోపేతంగా జరుపుతామని ప్రకటించారు.సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని తెలంగాణ ఉద్యమం నిరూపించిందని, ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ  రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ముఖ్యమంత్రి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ఆవరణలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని దశాబ్ది వేడుకల సందర్భంలోనే తాను ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. సచివాలయం లోపల తెలంగాణ తల్లి, మరోవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, దానికి ఎదురుగా పీవీ నర్సింహారావు, అంజయ్యల విగ్రహాలు, జైపాల్ రెడ్డి  స్మారకం, ఇటువైపు కాకా వెంకటస్వామి తదితర మహానుభావుల విగ్రహాలు, అమరవీరుల స్మారకచిహ్నం -సచివాలయానికి మధ్య దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ  విగ్రహం శోభాయమానంగా ఉంటుందని, మేధావుల సూచనల మేరకే ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.గడిచిన పదేండ్లలో తెలంగాణ తల్లిని తెరమరుగు చేసిన గత పాలకులు సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో తమ విగ్రహం పెట్టుకోడానికి ప్రయత్నించారని, అయితే ప్రజల ఆశీర్వాదంతో అధికారంలో వచ్చిన ప్రజా ప్రభుత్వం ఆ ప్రయత్నాలను అడ్డుకొని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తల్లిని సచివాలయంలో ప్రతిష్టిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ అవకాశం దక్కడం తన అదృష్టమన్నారు. బుధవారం తప్పితే దసరా వరకు మంచి రోజులు లేవని వేద పండితులు చెప్పడంతో హుటాహుటిన భూమిపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  కేరళ వెళ్లడం, మిగతా మంత్రులు ముందే నిర్దేశించిన కార్యక్రమాల్లో ఉండటం వల్ల హాజరుకాలేక పోయారని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

]]>
Wed, 28 Aug 2024 21:08:25 +0530 admin
గోషామహల్‌లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనం* https://prajakshethrenews.com/గోషామహల్లో-ఉస్మానియా-హాస్పిటల్-కొత్త-భవనం https://prajakshethrenews.com/గోషామహల్లో-ఉస్మానియా-హాస్పిటల్-కొత్త-భవనం * గోషామహల్‌లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనం*

*32 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం*

* ఇప్పుడున్న ఉస్మానియా ఆస్పత్రి చారిత్రక కట్టడాల పరిరక్షణ*

* స్పీడ్‌ ప్రణాళికలోని పనులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు*

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో : 

హైదరాబాద్​ లోని గోషామహల్‌లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. అందుకోసం గోషామహల్‌ పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ కలిపి దాదాపు 32 ఎకరాల స్థలాన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్‌ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫీషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి  సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ  ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్పీడ్ జాబితాలో ఉన్న 19 పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారా మెడికల్ కాలేజీలు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలను సీఎం చర్చించారు.రాబోయే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆసుపత్రి నిర్మాణానికి అనుభజ్ఞులైన ఆర్కిటెక్టులతో డిజైన్లు  రూపొందించాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టింగ్ రోడ్లను అభివృద్ధి చేయాలని, ఆసుపత్రి చుట్టూ నలు దిశలా రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని చెప్పారు. ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించేలా ప్రణాళికలు ఉండాలని చెప్పారు. కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు, సేవలన్నీ అక్కడే అందుబాటులో ఉండాలని సూచించారు.ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే బాధ్యతను చేపడుతామని సీఎంగారు చెప్పారు. మూసీ రివర్ డెవెలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న భవనాలను పర్యాటకులను ఆకట్టుకునే చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని అన్నారు.గోషామహల్ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించినందుకు పోలీసు విభాగానికి ప్రత్నామ్నాయ స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పేట్లబుర్జులో ఉన్న పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీ, చుట్టూ ఉన్న స్థలాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

]]>
Wed, 28 Aug 2024 20:58:04 +0530 admin
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి https://prajakshethrenews.com/సీజనల్-వ్యాధుల-పట్ల-అప్రమత్తంగా-ఉండాలి https://prajakshethrenews.com/సీజనల్-వ్యాధుల-పట్ల-అప్రమత్తంగా-ఉండాలి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం 

సీఎం రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో 

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు ప్రబలకుండా తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రేయింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ , ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి తో పాటు సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే ఉద్యోగులు, సిబ్బందిపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. జీహెచ్ఎంసీ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,  జిల్లా కలెక్టర్ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైతే పోలీసు విభాగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారం తీసుకొని సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. డెంగ్యూ, చికున్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలను గుర్తించాలని, అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

]]>
Wed, 28 Aug 2024 20:31:01 +0530 admin
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సంగీత సాహిత్య నృత్యోత్సవం https://prajakshethrenews.com/ఘనంగా-శ్రీకృష్ణ-జన్మాష్టమి-సంగీత-సాహిత్య-నృత్యోత్సవం https://prajakshethrenews.com/ఘనంగా-శ్రీకృష్ణ-జన్మాష్టమి-సంగీత-సాహిత్య-నృత్యోత్సవం వరంగల్ లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సంగీత సాహిత్య నృత్యోత్సవం

ప్రజాక్షేత్ర్, వరంగల్​ బ్యూరో 

వరంగల్ పట్టణం లోని రాధాకృష్ణ గార్డెన్స్ (వరంగల్ చౌరస్తా) లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సహకారంతో బజ్జూరి ఆర్గనైజేషన్ కృష్ణ సొసైటీ,  కాకతీయ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో  రెండు రోజులు పాటు  నిర్వహించిన సంగీత సాహిత్య నృత్యోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు మంత్రి కొండా సురేఖ, వరంగల్ పట్టణ మేయర్ గుండు సుధారాణి లు ముఖ్య అతిథులుగా పాల్గొ, వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్ కు చెందిన (కళాధార కూచిపూడి నృత్య కళాక్షేత్రం ) కాలేశ్వరం అనూష రాజ్ కుమార్ శర్మ వారి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన అధ్యంతం కన్నుల పండుగగా సాగింది. చిన్నపిల్లలు కృష్ణుడు, గోపిక వేషధారణలో చేసిన నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  అనంతరం నృత్య బృందం వారికి సర్టిఫికెట్ మెమొంటోలు తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాధార కూచిపూడి నృత్య కళాక్షేత్రం  కాళేశ్వరం అనూష రాజ్ కుమార్ శర్మ, వారి శిష్య బృందం శివానిక, శ్రీజ, రితన్య, సాన్విక, లౌక్య, నగీషా, రుహిక, మాన్వికా, సాన్విక, వేదిక, సమీక్ష తదితరులు పాల్గొన్నారు.

 

]]>
Wed, 28 Aug 2024 00:02:30 +0530 admin
అనాధ ఆశ్రమంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు https://prajakshethrenews.com/అనాధ-ఆశ్రమంలో-ఘనంగా-కృష్ణాష్టమి-వేడుకలు https://prajakshethrenews.com/అనాధ-ఆశ్రమంలో-ఘనంగా-కృష్ణాష్టమి-వేడుకలు మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు 

ప్రజా క్షేత్ర్, రంగారెడ్డి బ్యూరో :

మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో నిర్వాహకులు గట్టు గిరి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. 130 మంది మానసిక వికలాంగుల మధ్య ఉట్టి కార్యక్రమ వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. మానసిక ఒత్తిడిని దూరం చేసి వారు సంతోషంగా, మనస్సు ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రతి యేటా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆశ్రమ నిర్వాహకులు గట్టు గిరి తెలిపారు..ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా 130 మంది అనాధ మానసిక వికలాంగుల మధ్య ఎంతో సంబరంగా ఉట్టి కొట్టి జన్మాష్టమి వేడుకలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

]]>
Tue, 27 Aug 2024 03:24:19 +0530 admin
ఎస్సీ వర్గీకరణలో మాలలకు న్యాయం చేయాలని సీఎం కు వినతి https://prajakshethrenews.com/ఎస్సీ-వర్గీకరణలో-మాలలకు-న్యాయం-చేయాలని-సీఎం-కు-వినతి https://prajakshethrenews.com/ఎస్సీ-వర్గీకరణలో-మాలలకు-న్యాయం-చేయాలని-సీఎం-కు-వినతి ఎస్సీ వర్గీకరణపై ఒక కమిటీని నియమించి, ఆ రిపోర్ట్ ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  హామీ ఇచ్చారు.ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మాల, మాదిగలకు సరైన న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ మాల సామాజికవర్గం ప్రజాప్రతినిధులు, మాల మహానాడు నేతలు అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ని కలిశారు.ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని వారు అభ్యర్థించారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి , మట్టా రాగమయి, చిక్కుడు వంశీకృష్ణ, కేఆర్ నాగరాజు, ఎంపీ గడ్డం వంశీ , మాల మహానాడు నేతలు చెన్నయ్య తదితరులు ఉన్నారు.

]]>
Tue, 27 Aug 2024 02:37:23 +0530 admin
సివిల్స్ మెయిన్స్‌కు అర్హ‌త సాధించిన 135 మందికి లక్ష ఆర్థిక సహాయం https://prajakshethrenews.com/సివిల్స్-మెయిన్స్కు-అర్హత-సాధించిన-135-మందికి-లక్ష-ఆర్థిక-సహాయం https://prajakshethrenews.com/సివిల్స్-మెయిన్స్కు-అర్హత-సాధించిన-135-మందికి-లక్ష-ఆర్థిక-సహాయం ద్రౌపది స్వయంవరం సమయంలో అర్జునుడి లక్ష్యం చేప కన్నుపై మాత్రమే కేంద్రీకృతమైనట్టు సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల లక్ష్యం కూడా ఫలితం సాధించడమే కావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు ఇతర సమస్యలను పట్టించుకోవద్దని, ఏకాగ్రతతో ముందుకు వెళ్లాలని ఉద్బోధించారు.తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్‌కు అర్హ‌త సాధించిన వారిలో అర్హులైన 135 మందికి ఆర్థిక సహాయంగా రాజీవ్ సివిల్స్ అభ‌య హ‌స్తం కింద ఒక్కొక్కరికీ రూ.ల‌క్ష చొప్పున ముఖ్యమంత్రి చెక్కులను అందించారు. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధిలో ముందున్నా సివిల్స్ సాధ‌న‌లో బిహార్‌, రాజ‌స్థాన్‌ల‌తో పోల్చితే వెనుక‌బ‌డి ఉన్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.ప్ర‌స్తుతం మెయిన్స్‌కు అర్హ‌త సాధించిన వారికి రూ.ల‌క్ష సాయం అందించామ‌ని, మెయిన్స్‌లో ఉత్తీర్ణులై ఇంట‌ర్వ్యూకు అర్హ‌త సాధిస్తే మ‌రో రూ.ల‌క్ష అందిస్తామ‌ని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్ర‌భుత్వం ఇచ్చే ల‌క్ష రూపాయలు పెద్ద మొత్తం కాక‌పోవ‌చ్చ‌ని, కానీ ఈ ప్ర‌భుత్వం మీ వెనుక ఉంద‌నే ఆత్మ‌విశ్వాసం క‌ల్పించ‌డానికి భ‌రోసా ఇస్తున్నామ‌ని తెలిపారు.తెలంగాణ నుంచి పెద్ద సంఖ్య‌లో సివిల్స్‌లో ఎంపికై రాష్ట్ర ప్ర‌తిష్ట‌ను పెంచాల‌ని సూచించారు. మీ ఎంపిక‌లు మీ కుటుంబానికి, మీ ఊరుకు, మీ జిల్లాకే కాక తెలంగాణ‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌నే విష‌యం గుర్తుంచుకోవాల‌ని అభ్య‌ర్థుల‌కు సూచించారు. గ‌త ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర డ‌బ్బులున్నా ఇటువంటి ప‌నులు ఏం చేయ‌లేద‌ని, ఇప్పటి ప్రజా ప్ర‌భుత్వం మాత్రం విద్య, విశ్వవిద్యాలయాలు, ఉద్యోగ నియామకాలు, ఉపాధి కల్పన, రైతుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.రైతుల రుణమాఫీ కోసం రూ. 31 వేల కోట్లు వెచ్చిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్"ను ఏర్పాటు చేస్తున్నామని, మెగా డీఎస్సీ ద్వారా పెద్ద ఎత్తున టీచర్లను నియమించి ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. చదువులకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న ఆగధాన్ని పూడ్చేందుకు "యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ"ని ప్రారంభించామని, ఒలింపిక్స్ లో ఎక్కువ మెడల్స్ తెలంగాణ నుంచే సాధించేలా "యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తున్నట్టు సీఎం తెలిపారు. మరో రెండు వారాల్లో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తామని, వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నిరుద్యోగుల బలిదానాలతో అధికారంలోకి వచ్చి, గడిచిన పదేండ్లు యువతను అడుగడుగునా మోసం చేసినవాళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోయి మళ్ళీ యువతను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని, అలాంటి మోసకారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రజా ప్రభుత్వంలో సీఎం నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారని, సమస్య ఏదైనా కలిసి చెప్పుకోవచ్చని అన్నారు. సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందించే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ని, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ని ముఖ్యమంత్రిగారు అభినందించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొన్నం ప్ర‌భాక‌ర్‌ , ఎమ్మెల్యేలు కూనంనేని సాంబ‌శివ‌రావు , కోరం క‌న‌క‌య్య‌, మాలోత్ రాందాస్ నాయ‌క్‌ , మ‌ట్టా రాగ‌మ‌యి, గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావు , గ‌డ్డం వివేక్ వెంక‌ట‌స్వామి , డాక్ట‌ర్ క‌వ్వంప‌ల్లి స‌త్యానారాయ‌ణ‌ , ఖ‌మ్మం, పెద్ద‌ప‌ల్లి ఎంపీలు రామ‌స‌హాయం ర‌ఘురాంరెడ్డి , గ‌డ్డం వంశీ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , పలు శాఖల ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

]]>
Tue, 27 Aug 2024 02:29:58 +0530 admin
"బ్రహ్మ కుమారీస్ & శాంతి సరోవరం" 20వ వార్షికోత్సవాలు https://prajakshethrenews.com/బ్రహ్మ-కుమారీస్-శాంతి-సరోవరం-20వ-వార్షికోత్సవాలు https://prajakshethrenews.com/బ్రహ్మ-కుమారీస్-శాంతి-సరోవరం-20వ-వార్షికోత్సవాలు యాంత్రికంగా మారిన ఆధునిక మానవ జీవితంలో శాంతి, సమాధానాలు తప్పనిసరి అవసరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు. సమాజాన్ని శాంతియుత మార్గంలో నడిపించడంలో బ్రహ్మ కుమారీస్ సంస్థ ఆశయాలకు దగ్గరగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని తెలిపారు. రైతుల సంక్షేమం, డ్రగ్స్ వంటి మహమ్మారుల నుంచి యువతను కాపాడి, వారికి సాధికారత నేర్పడంలోనూ బ్రహ్మ కుమారీస్ మార్గాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోందని చెప్పారు. మౌంట్ అబూ (రాజస్థాన్) తర్వాత హైదరాబాద్ లో బ్రహ్మ కుమారీల శాంతి సరోవర్ ఉండటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.హైదరాబాద్ గచ్చిబౌలిలోని "బ్రహ్మ కుమారీస్ - శాంతి సరోవరం" 20వ వార్షికోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి  మాట్లాడుతూ, రైతుల ఆత్మహత్యల్ని నివారించి, చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం  రైతుల రుణమాఫీకి రూ. 31వేల కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. యువత పెడదారులు పట్టకుండా, డ్రగ్స్ పేరు వింటేనే భయపడేలా నార్కోటిక్స్ టీమ్స్ ద్వారా  మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు.యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించామని, ప్రముఖ పారిశ్రామికవేత్తల సారధ్యంలో ఈ యూనివర్సిటీ నడుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.శాంతి సరోవరం లీజ్ పొడిగింపుతో సహా అన్ని విషయాల్లో  బ్రహ్మ కుమారీలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. మౌంట్ అబూలో జరగబోయే బ్రహ్మ కుమారీల గ్లోబల్ సదస్సులో పాల్గొంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

]]>
Tue, 27 Aug 2024 02:19:20 +0530 admin
భగవద్గీత స్పూర్తి.. శ్రీకృష్ణుడే మార్గదర్శి* https://prajakshethrenews.com/భగవద్గీత-స్పూర్తి-శ్రీకృష్ణుడే-మార్గదర్శి https://prajakshethrenews.com/భగవద్గీత-స్పూర్తి-శ్రీకృష్ణుడే-మార్గదర్శి * భగవద్గీత స్పూర్తి..  శ్రీకృష్ణుడే మార్గదర్శి*

* ధర్మ రక్షణ లాంటిదే చెరువుల పరిరక్షణ*

*జనహితం, భవిష్యత్ తరాల మేలు కోసం ఆక్రమణలపై యుద్ధం తప్పదు*

*హైడ్రా విషయంలో ఒత్తిళ్ళను పట్టించుకోం.. ఎంతటివారినైనా వదలం*

*ప్రభుత్వ అస్పత్రుల్లో భోజనానికీ హరే కృష్ణ సంస్థ సహకారం తీసుకుంటాం* 

*హరేకృష్ణ హెరిటేజ్ టవర్ శంకుస్థాపన మహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణను బృహత్తర బాధ్యతలా చేపట్టామని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోకుంటే అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని,  భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకం కావొద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తప్పవన్నారు.కోకాపేటలో 430 అడుగుల ఎత్తుతో వైభవోపేతంగా నిర్మితం కానున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్ భవనానికి ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ కాంక్రీట్ జంగల్ గా మారిన కోకాపేట ప్రాంతంలో హరే కృష్ణ హెరిటేజ్ భవనం ద్వారా యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని, ఇలాంటి మహోత్తమ కార్యక్రమంలో పాల్గొనడం జన్మ సుకృతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర ప్రభుత్వ ఆస్పత్రులల్లో భోజనం అందించేందుకు హరే కృష్ణ ఫౌండేషన్ సహకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు.భగవద్గీత స్పూర్తిగా శ్రీకృష్ణుడే మార్గదర్శిగా చెరువుల పరిరక్షణను ధర్మ రక్షణగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు."శతాబ్దాల కిందటే హైదరాబాద్ ను చెరువుల నగరం(లేక్ సిటీ)గా నాటి పాలకులు అభివృద్ధి చేశారు. కోట్లాది మందికి దాహార్తిని తీర్చిన చెరువుల పరిధిలో ఇవాళ కొందరు వ్యక్తులు విలాసాల కోసం ఫామ్ హౌస్ లు కట్టి వ్యర్ధజలాలను వదులుతున్నారు. వీటిని విస్మరిస్తే మేము ప్రజా ప్రతినిధులుగా ఉండి కూడా వ్యర్ధమే అవుతుంది. అందుకే చెరువుల పరిరక్షణకు పూనుకున్నాం. కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్పూర్తితో చెరువుల ఆక్రమణలపై మా ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. ఇది రాజకీయ కక్షల కోసం కానేకాదు. భవిష్యత్ తరాలు బాగుండాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. హైడ్రా విషయంలో ఎవరు ఎన్ని ఒత్తిడులు తెచ్చినా పట్టించుకోం. చెరువుల ఆక్రమణదారులు ఎంతటివారైనా భరతం పడతాం. ధర్మాన్ని కాపాడాలన్న శ్రీకృష్ణుడి బోధనల స్ఫూర్తిగా మా ప్రభుత్వం ధర్మంవైపు నిలబడుతుంది" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అనంతశేష స్థాపన పూజలో ముఖ్యమంత్రి తో పాటు మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పలువురు ప్రజాప్రతినిధులు, హరే కృష్ణ ఉద్యమ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

]]>
Mon, 26 Aug 2024 12:32:57 +0530 admin
విశ్వగురువుగా భారత్ మారాలన్నా బీజేపీతోనే సాధ్యం https://prajakshethrenews.com/విశ్వగురువుగా-భారత్-మారాలన్నా-బీజేపీతోనే-సాధ్యం https://prajakshethrenews.com/విశ్వగురువుగా-భారత్-మారాలన్నా-బీజేపీతోనే-సాధ్యం విశ్వగురువుగా భారత్ మారాలన్నా, వికసిత్ భారత్ సాకారం కావాలన్నా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. అవినీతికి ఆస్కారం లేని పాలన, అభివృద్ధికి కొత్త నిర్వచనం ఇచ్చే బిజెపికి మరింత బలాన్ని ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం - 2024ని ప్రారంభించడం జరిగింది. అభివృద్ధి, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పని చేసే బిజెపికి అండగా ఉండేందుకు సభ్యత్వాన్ని స్వీకరించి, పార్టీకి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరుతున్నాను. సభ్యత్వ నమోదు కోసం కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి  అధ్యక్షతన నిర్వహించిన వర్క్ షాప్ లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్​ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కార్యదర్శి విజయ రహత్కర్ గారు, ఓబిసి మోర్చ జాతీయ అధ్యక్షులు, ఎంపి డా. కె. లక్ష్మణ్ , రాష్ట్ర సంఘటన ప్రధన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Sat, 24 Aug 2024 20:16:05 +0530 admin
ఫోర్త్​ సిటీలోను ఫాక్స్​కాన్​ పెట్టుబడులు https://prajakshethrenews.com/ఫోర్త్-సిటీలోను-ఫాక్స్కాన్-పెట్టుబడులు https://prajakshethrenews.com/ఫోర్త్-సిటీలోను-ఫాక్స్కాన్-పెట్టుబడులు ముఖ్యమంత్రి విజన్ అద్భుతమన్న యాంగ్ లియూ

* ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫాక్స్‌కాన్‌ చైర్మన్*

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

ఢిల్లీలోని అధికారిక నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంత‌ర్జాతీయ దిగ్గ‌జ పారిశ్రామిక సంస్థ ఫాక్స్‌కాన్‌ (Foxconn) చైర్మ‌న్ యాంగ్ లియూ (Young Liu) మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కొత్త పెట్టుబడుల విస్తరణ అంశంపై ఫాక్స్‌కాన్‌ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సీఎం వెంట పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు ఉన్నారు.తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా పెట్టుబడులకు అనుకూలమైన కొత్త విధానాలను ప్రజాప్రభుత్వం అమలు చేస్తోందని, అంతర్జాతీయ అవసరాలకు తగ్గట్టు హైదరాబాద్ శివారులో ఫోర్త్ సిటీ (ఫ్యూచర్ సిటీ)ని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్‌కాన్‌ (Foxconn) చైర్మ‌న్ యాంగ్ లియూ కి వివరించారు. ఫోర్త్ సిటీలో ఫాక్స్‌కాన్‌ (Foxconn) సంస్థ కూడా పెట్టుబడులు పెట్టాల్సిందిగా సీఎం ఆహ్వానించారు. ఫోర్త్ సిటీలో ఫాక్స్‌కాన్‌ (Foxconn) వారు ప‌రిశ్ర‌మ‌లు నెలకొల్పేందుకు అవసరమైన సహకారాన్నిఅందిస్తామని యాంగ్ లియూ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఫ్యూచర్ సిటీగా ఫోర్త్ సిటీ రూప‌క‌ల్ప‌న‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శ‌నిక‌త‌, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయ‌ని ఫాక్స్‌కాన్‌ (Foxconn) చైర్మ‌న్ యాంగ్ లియూ (Young Liu) అన్నారు. ఫోర్త్ సిటీతో పాటు పారిశ్రామిక అనుకూల విధానాల్లో సీఎం రేవంత్ రెడ్డి విజ‌న్ అద్భుతంగా ఉందని యాంగ్ లియూ కొనియాడారు. సాధ్యమైనంత తొందర్లోనే హైద‌రాబాద్ ను సంద‌ర్శిస్తానని ఫాక్స్‌కాన్‌ (Foxconn) చైర్మ‌న్ ముఖ్యమంత్రి తో చెప్పారు. అంతకంటే ముందుగా ఫాక్స్‌కాన్‌ (Foxconn) క్యాంప‌స్ ఆప‌రేష‌న్స్ చీఫ్ క్యాథీ యాంగ్ (kathy yang), ఫాక్స్‌కాన్‌ (Foxconn) భార‌త దేశ ప్ర‌తినిధి  వీ లీ (V Lee) నేతృత్వంలోని బృందం హైద‌రాబాద్ వ‌స్తుంద‌ని యాంగ్ లియూ తెలిపారు.సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లను వివరించారు. ఇటీవల ముఖ్యమంత్రి బృందం విజయవంతంగా చేపట్టిన అమెరికా, ద‌క్షిణ కొరియా పర్యటన, రాబట్టిన పెట్టుబడులు, తెలంగాణపై అంతర్జాతీయంగా నెలకొన్న ఆసక్తుల వివరాలను కూడా మంత్రి శ్రీధర్ బాబు  యాంగ్ లియూకి  తెలియజేశారు.

]]>
Sat, 17 Aug 2024 01:30:58 +0530 admin
కాంగ్రెస్ మాట శిలాశాసనం https://prajakshethrenews.com/కాంగ్రెస్-మాట-శిలాశాసనం-62 https://prajakshethrenews.com/కాంగ్రెస్-మాట-శిలాశాసనం-62 *రూ.2లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నాం*

*ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి చూపిస్తాం*

*వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

దేశచరిత్రలోనే తొలిసారి రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రజాప్రభుత్వానికే దక్కిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రూ.2లక్షల రుణమాఫీ కోసం మొత్తం రూ.31వేల కోట్లు వెచ్చిస్తున్నామని, తద్వారా వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు.'సాగుకు జీవం.. రైతుకు ఊతం' పేరుతో ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.ప్రభుత్వం అజెండాలో వ్యవసాయరంగానికి ప్రాధాన్యత ఉందని, ఒకవైపు రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూ, మరోవైపు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను కూడా శరవేగంగా నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ''ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును ఈరోజే జాతికి అంకితం చేసుకున్నాం. ఏడాది తిరిగేలోపే ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది" అని ముఖ్యమంత్రి తెలిపారు.అటు ప్రాజెక్టుల నిర్మాణం, ఇటు రుణమాఫీ ప్రక్రియతో తెలంగాణ రైతన్నల ఇంట పండుగ వాతావరణం నెలకొందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ ప్రక్రియలో సాంకేతిక కారణాలతో రైతులకు ఏవైనా ఇబ్బందులు వస్తే వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుందని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ మాటిస్తే అది శిలాశాసనం లాంటిదని, ఆరు గ్యారంటీలతోపాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకొని తీరుతామని సీఎం స్పష్టం చేశారు.ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ అసాధ్యం అని, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే పదవులకు రాజీనామాలు చేస్తామన్న ప్రతిపక్ష నేతలు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ముఖ్యమంత్రి సూచించారు.సాగుకు జీవం - రైతుకు ఊతం బహిరంగ సభలో ముఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు , ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి , పలువురు ఎంపీలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

]]>
Fri, 16 Aug 2024 02:37:47 +0530 admin
ఒప్పందాల పర్యవేక్షణకు ఇన్వెస్టర్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు https://prajakshethrenews.com/ఒప్పందాల-పర్యవేక్షణకు-ఇన్వెస్టర్స్-టాస్క్-ఫోర్స్-ఏర్పాటు https://prajakshethrenews.com/ఒప్పందాల-పర్యవేక్షణకు-ఇన్వెస్టర్స్-టాస్క్-ఫోర్స్-ఏర్పాటు *ఒప్పందాల పర్యవేక్షణకు ఇన్వెస్టర్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు*

*పదేండ్లలో 1ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ*

* ప్రపంచంతోనే పోటీ పడతాం.. పక్క రాష్ట్రాలతో కాదు*

*కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి*

ప్రజా క్షేత్ర్ , తెలంగాణ బ్యూరో : 

అంతర్జాతీయ, జాతీయ స్థాయి కంపెనీలతో చేసుకునే ఒప్పందాలు ఎప్పటికప్పుడే కార్యరూపందాల్చేలా కొత్తగా తెలంగాణ ఇన్వెస్టర్స్ టాస్క్ ఫోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. టెక్నాలజీ, స్కిల్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ తదితర రంగాల్లో అపారమైన అవకాశాలున్న తెలంగాణలో పెట్టుబడుల భద్రతకు ప్రభుత్వమే భరోసా ఇస్తుందని చెప్పారు. రాబోయే పదేండ్లలో తెలంగాణను 1ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం 'తెలంగాణ ది ప్యూచర్ స్టేట్ ' నినాదంతో ప్రజాప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ ప్రపంచంతోనే పోటీపడుతుంది కానీ పక్క రాష్ట్రాలతో కాదని సీఎం అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నాలుగో నగరమైన ఫ్యూచర్ సిటీని ప్రపంచ అవసరాలు తీర్చగలిగేలా 'చైనా ప్లస్ వన్  కంట్రీ' స్థాయిలో ఉంటుందని చెప్పారు.దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కోకాపేటలో నూతనంగా ఏర్పాటుచేసిన క్యాంపస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ఉన్నతాధికారులు, కాగ్నిజెంట్ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కాగ్నిజెంట్ సంస్థకు దేశంలోనే హైదరాబాద్ అతిపెద్ద కేంద్రంగా మారిందని, ప్రస్తుతం సుమారు 65వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారని, తద్వారా తెలంగాణలో ఉద్యోగాలు కల్పించే రెండో అతిపెద్ద సంస్థగా కాగ్నిజెంట్ ఎదగడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి అభినందించారు. దావోస్ పర్యటనలో అంగీకారం కుదిరితే, కేవలం ఆరు నెలల వ్యవధిలోనే కాగ్నిజెంట్ వారు హైదరాబాద్ లో నూతన క్యాంపస్ ఏర్పాటు చేయడం రికార్డు అని సీఎం అభినందించారు.శతాబ్దాల మనగడలో హైదరాబాద్ నేడు విశ్వనగరంగా ఎదిగిందని, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ  మద్దతుతో ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం నేదురుమల్లి  ఐటీ పార్కుకు శంకుస్థాపన చేసిన నేపథ్యమే హైదరాబాద్ ను ఐటీలో మేటిగా నిలబెట్టిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోగానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాతగానీ పాలకులు హైదరాబాద్ విషయంలో రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనపెట్టారని , ప్రస్తుత ప్రపంచ అవసరాల దృష్ట్యా తాము నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ అభివృద్దిని మరో స్థాయికి తీసుకెళుతుందని సీఎం తెలిపారు.పెట్టుబడుల సాధన కోసం ఇటీవల చేపట్టిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలు విజయవంతం అయ్యాయని, ఒక్క అమెరికాలోనే సుమారు 31వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టగలిగామని, తద్వారా దాదాపు 30వేల ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా పెట్టుబడులు, ఒప్పందాల ప్రక్రియ కొనసాగుతుందని సీఎం అన్నారు. తెలంగాణకు మొత్తం మూడు వలయాలు ఉంటాయని, కోర్ అర్బన్ హైదరాబాద్ మొదటి వలయమైతే, రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉండే రెండోదైన సెమీ అర్బన్ వలయంలో మాన్యుఫ్యాక్చరింగ్ హబ్స్, ఫ్యూచర్ సిటీ ఉంటాయని, ఇక మూడో వలయమైన రూరల్ తెలంగాణలోని గ్రామాలను ఆసియాలోనే ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ఐటీ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని అన్నింటితో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి  భావిస్తున్నారని ఐటీ మంత్రి తెలిపారు. తెలంగాణ యువతలో నైపుణ్యాలు పెంచి గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ప్రజాప్రభుత్వం సరికొత్తగా ఏఐ సిటీని నిర్మిస్తోందని, సెప్టెంబర్ లో ప్రతిష్టాత్మక ఏఐ గ్లోబల్ సదస్సును కూడా నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

]]>
Thu, 15 Aug 2024 13:22:21 +0530 admin
చార్మినార్​ వద్ద 5400 చదరపు అడుగుల త్రివర్ణపతాకం https://prajakshethrenews.com/చార్మినార్-వద్ద-5400-చదరపు-అడుగుల-త్రివర్ణపతాకం https://prajakshethrenews.com/చార్మినార్-వద్ద-5400-చదరపు-అడుగుల-త్రివర్ణపతాకం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మహమ్మద్​ క్యాప్​ మార్ట్​ ఆధ్వర్యంలో  పాతబస్తీలోని మదీనా సర్కిల్ నుంచి చార్మినార్ మీదుగా బుధవారం 5400 చదరపు అడుగుల  త్రివర్ణపతాకంను ప్రదర్శించారు

]]>
Thu, 15 Aug 2024 01:16:57 +0530 admin
Cyber Crime | లింక్‌ క్లిక్‌ చేయగానే.. 3 లక్షలు కాజేశారు https://prajakshethrenews.com/cyber-crime-లింక్-క్లిక్-చేయగానే-3-లక్షలు-కాజేశారు https://prajakshethrenews.com/cyber-crime-లింక్-క్లిక్-చేయగానే-3-లక్షలు-కాజేశారు సైబర్‌ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఓ వివాహితను బ్లాక్‌మెయిల్‌ చేసి.. రూ. 3 లక్షలు కాజేశారు. గృహిణికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశం వచ్చింది. ఆ లింక్‌ను క్లిక్‌ చేయగానే..మొబైల్‌కు ఓటీపీ వచ్చింది. ఆ నంబర్‌లో నమోదు చేయడంతో సైబర్‌నేరగాళ్లు ఆ ఫోన్‌ను హ్యాక్‌ చేశారు.

ఈ క్రమంలో కొన్ని రోజులకు ఆమె ఫోన్‌కు నగ్న ఫొటోలు వచ్చాయి. ‘ఈ ఫొటోలను నీ ఫోన్‌లోని కాంటాక్ట్‌లో ఉన్న వారందరికీ పంపిస్తామం’టూ నిందితులు బెదిరించారు. పలు దఫాలుగా డబ్బులు వసూలు చేశారు. వాట్సాప్‌ నుంచి ఆ ఫొటోలు డిలీట్‌ చేయాలంటే డబ్బులు ఇవ్వాలంటూ.. తనను బెదిరిస్తున్నారంటూ.. బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేపట్టారు.

]]>
Fri, 26 Jul 2024 01:49:45 +0530 admin
Hostel Warden Suspended | మలక్‌పేట ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్‌ వార్డెన్‌ సస్పెండ్‌ https://prajakshethrenews.com/hostel-warden-suspended-మలక్పేట-ప్రభుత్వ-అంధ-బాలికల-హాస్టల్-వార్డెన్-సస్పెండ్ https://prajakshethrenews.com/hostel-warden-suspended-మలక్పేట-ప్రభుత్వ-అంధ-బాలికల-హాస్టల్-వార్డెన్-సస్పెండ్ మలక్‌పేట(Malakpet) ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్‌లో 8 ఏండ్ల అంధ బాలిక లైంగిక దాడి ఘటనపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌ ఇంచార్జీ వార్డెన్‌(Govt Blind Girls Hostel Warden) బి. స్వప్నను గురువారం సస్పెండ్‌(Suspended) చేశారు. సంఘటనపై నిజనిర్దారణ కమిటీని నియమంచి పూర్తిస్థాయి రిపోర్టు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ కమిటీలో వికాలంగుల సాధికారత శాఖ డైరెక్టర్‌, కమిషనర్‌ బి. శైలజ, సభ్యులుగా బీసీ సంక్షేమ శాఖాధికారి ఆశన్న, , ఏ రాజేందర్‌లను నియమించారు. ఈ కమిటి రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి.

]]>
Fri, 26 Jul 2024 01:46:41 +0530 admin