Prajakshethre News & : బిజినెస్ https://prajakshethrenews.com/rss/category/బిజినెస్ Prajakshethre News & : బిజినెస్ en Copyright 2024 Prajakshethre News & All Rights Reserved. తగ్గిన బంగారం ధరలు https://prajakshethrenews.com/తగ్గిన-బంగారం-ధరలు https://prajakshethrenews.com/తగ్గిన-బంగారం-ధరలు తగ్గిన బంగారం ధరలు
ప్రజా క్షేత్ర్, ముంబై, జూన్ 27 :
బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. తాజాగా జూన్‌ 27వ తేదీన తులం బంగారంపై స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,020 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,850 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర కూడా అతి స్వల్పంగానే తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర లక్షా 7,900 రూపాయల వద్ద కొనసాగుతోంది.హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,020 ఉండగా, 22 క్యారెట్ల ధర 89,850 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,000 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,020 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,850 వద్ద ఉంది.బంగారం ధర తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గి రావడమే అసలు కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా పశ్చిమ ఆసియా దేశాలలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గిన అనంతరం బంగారం ధరలు తగ్గుతున్నాయి. దీనికి తోడు అమెరికాలో కూడా బంగారం ధర తగ్గుముఖం పట్టింది ఈ ప్రభావం కూడా బంగారంపై గమనించవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి మరో ప్రధాన కారణం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పుంజుకోవడం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పసిడి ధరలు మార్కెట్లో తగ్గుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది కాస్త ఊరట అని చెప్పవచ్చు.పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలో వేగంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. వాణిజ్య యుద్ధ కారణాల వల్ల బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, దేశీయ బులియన్ మార్కెట్లో ధరలు నిరంతరం తగ్గుతున్నాయి. ఇది కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించే విషయం. అయితే, ఫ్యూచర్స్ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. అదే సమయంలో విదేశీ మార్కెట్లలో కూడా సందడి ఉంది. భవిష్యత్తులో కూడా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని నిపుణులు
అంటున్నారు

]]>
Fri, 27 Jun 2025 23:39:41 +0530 admin
బిఎస్ఎన్ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్..రోజుకు 2జీబీ డేటా, 80 రోజుల వ్యాలిడిటీ https://prajakshethrenews.com/బిఎస్ఎన్ఎల్-చౌకైన-రీఛార్జ్-ప్లాన్రోజుకు-2జీబీ-డేటా-80-రోజుల-వ్యాలిడిటీ https://prajakshethrenews.com/బిఎస్ఎన్ఎల్-చౌకైన-రీఛార్జ్-ప్లాన్రోజుకు-2జీబీ-డేటా-80-రోజుల-వ్యాలిడిటీ బిఎస్ఎన్ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్..రోజుకు 2జీబీ డేటా, 80 రోజుల వ్యాలిడిటీ
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 16 :
;ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీ పడటానికి ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఒకదాని తర్వాత ఒకటి చౌకైన, ఎక్కువ ప్రయోజనాలతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే కంపెనీ ఇప్పుడు మరో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ లో కాలింగ్, డేటా ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా దాదాపు 80 రోజుల దీర్ఘకాల చెల్లుబాటుతో వస్తుంది. ఇప్పుడు ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ గురించి పూర్తిగా చూద్దాం.బిఎస్ఎన్ఎల్ కంపెనీ రూ. 485 ప్లాన్‌ను తీసుకొచ్చింది.ఈ ప్లాన్ లో ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటాను పొందొచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. అంటే రోజంతా కావలసినంత మాట్లాడవచ్చు. దీనితో పాటు బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ 100 ఉచిత SMSలను కూడా అందిస్తోంది. అంటే.. డేటా, కాలింగ్‌తో పాటు సాధారణ SMSలను కూడా పంపవచ్చు.ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ ఎక్కువ డేటాను ఉపయోగించేవారికి, రీఛార్జ్ ప్లాన్ చేసుకోవడానికి బడ్జెట్ దాదాపు రూ. 500 మాత్రమే ఉంటె ఈ ప్లాన్ ఉత్తమ ఎంపిక కావచ్చు. ప్రైవేట్ టెలికాం కంపెనీల ప్లాన్‌లో ఈ ప్రయోజనాలన్నింటినీ కోరుకుంటే కనీసం రూ. 600 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

]]>
Mon, 16 Jun 2025 18:20:29 +0530 admin
సైయెంట్ తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం https://prajakshethrenews.com/సైయెంట్-తో-ఏపీ-రాష్ట్ర-ప్రభుత్వం-ఒప్పందం https://prajakshethrenews.com/సైయెంట్-తో-ఏపీ-రాష్ట్ర-ప్రభుత్వం-ఒప్పందం సైయెంట్ తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో సైయెంట్(Cyient) ఫౌండేషన్, ఏఐసీటీఈ ప్రతినిధులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం అధికారులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఇది త్రైపాక్షిక ఒప్పందం. ఈ ఒప్పందం ద్వారా ప్రధానంగా నగర ఆధారిత ఇన్నోవేషన్ క్లస్టర్లను ప్రారంభించేందుకు సైయెంట్(Cyient) ఫౌండేషన్, ఏఐసీటీఈ సహకారం అందించనున్నాయి. మొదటగా విశాఖ నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి

]]>
Wed, 11 Jun 2025 22:59:40 +0530 admin
బ్యాంకింగ్‌ మోసాలు 36 వేల కోట్లు : రిజర్వుబ్యాంక్‌ వార్షిక నివేదికలో వెల్లడి https://prajakshethrenews.com/బ్యాంకింగ్-మోసాలు-36-వేల-కోట్లు-రిజర్వుబ్యాంక్-వార్షిక-నివేదికలో-వెల్లడి https://prajakshethrenews.com/బ్యాంకింగ్-మోసాలు-36-వేల-కోట్లు-రిజర్వుబ్యాంక్-వార్షిక-నివేదికలో-వెల్లడి 100డిజిటల్‌ కరెన్సీ లావాదేవీలు రూ.1,016 కోట్లుగా నమోదు
 క్రితం ఏడాది రూ.234 కోట్లు
ప్రస్తుతం రిజర్వుబ్యాంక్‌ వద్ద 879.58 మెట్రిక్‌ టన్నుల విలువైన గోల్డ్‌ నిల్వలు
2024-25లో తగ్గిన ఫ్రాడ్‌.. నష్టాలు మూడింతలు
బ్యాంకింగ్‌ మోసాలు 36 వేల కోట్లు..
బెడిసికొడుతున్న రిజర్వు బ్యాంక్‌ ప్రయత్నాలు
రిజర్వుబ్యాంక్‌ వార్షిక నివేదికలో వెల్లడి
ప్రజా క్షేత్ర్, ముంబై : 
బ్యాంకింగ్‌లో మోసాలను నియంత్రించడానికి రిజర్వు బ్యాంక్‌ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రుణ ఖాతాలు, డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించి సంఖ్య పరంగా తగ్గినప్పటికి విలువ పరంగా చూస్తే మాత్రం మూడింతలు పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రిజర్వు బ్యాంక్‌ విడుదల చేసిన తన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంచేసింది.2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.36,014 కోట్ల విలువైన మోసాలు జరిగాయని తెలిపింది. అంతక్రితం ఏడాది రూ.12,230 కోట్ల మోసాలు జరిగాయి. సంఖ్యపరంగా చూస్తే మాత్రం 2023-24లో 36,060 మోసాలు జరగగా, ఆ తర్వాతి ఏడాదికిగాను 23,953కి తగ్గాయి. ప్రధానంగా 122 కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు గడిచిన ఆర్థిక సంవత్సరంలో వర్గీకరించడం వల్లనే విలువ భారీగా పెరిగిందని తెలిపింది.బ్యాంకింగ్‌ మోసాల్లో డిజిటల్‌ పేమెంట్లు, కార్డు, ఇంటర్నెట్‌ ద్వారా జరిగే మోసాలు అధికంగా ఉన్నాయని పేర్కొంది. మొత్తం మోసాల్లో 60 శాతం మోసాలు ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లోనే జరిగాయని తెలిపింది. మొత్తం విలువల్లో వీటి వాటా 71 శాతంగా ఉన్నది. కార్డు/ఇంటర్నెట్‌ ద్వారా జరిగే మోసాలు అధికంగా 13,516గా నమోదయ్యాయి. మొత్తం 23,956 మోసాల్లో వీటి వాటా 56.5 శాతంగా ఉన్నది. లక్ష రూపాయల కంటే అధికంగా నమోదైన మోసాల గురించి ఆర్బీఐ వివరించింది.
25% పెరిగిన కరెన్సీ ప్రింటింగ్‌ ఖర్చులు
కరెన్సీ ప్రింటింగ్‌ కోసం పెట్టే రిజర్వుబ్యాంక్‌ గరిష్ఠ స్థాయిలో ఖర్చు చేస్తున్నది. గతేడాదికిగాను కరెన్సీల ప్రింటింగ్‌ కోసం రూ.6,372.8 కోట్ల నిధులను ఖర్చు చేసింది. అంతక్రితం ఏడాది ఖర్చు చేసిన రూ.5,101.4 కోట్లతో పోలిస్తే 25 శాతం పెరిగినట్టు తన వార్షిక నివేదికలో వెల్లడించింది. నోట్లు సంఖ్య ఆరు శాతం అధికం కాగా, విలువ పరంగా చూస్తే 5.6 శాతం పెరిగాయి. కరెన్సీ ప్రింటింగ్‌లో రూ.500 నోట్‌ 86 శాతం వాటా కలిగివున్నది. క్రితం ఏడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. అలాగే రూ.10 డినామినేషన్‌ బ్యాంక్‌ నోట్‌ వాటా 16.4 శాతంగా ఉన్నది. మొత్తం బ్యాంక్‌ నోట్ల సర్క్యూలేషన్‌లో రూ.10, రూ.20, రూ.50 మొత్తంగా 31.7 శాతం వాటా కలిగివున్నది. రెండేండ్ల క్రితం రద్దు చేసిన రూ.2 వేల నోట్లలో ఇప్పటి వరకు 98.2 శాతం నోట్లు బ్యాంకుల వద్ద జమ అయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో రూ.2, 5, 10, 20, 50, 100, 200, 500 నోట్లు చలామణిలో ఉన్నాయి.రిజర్వు బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌ ఏడాది ప్రాతిపదికన 8.20 శాతం ఎగబాకి రూ.76.25 లక్షల కోట్లకు చేరుకున్నది. నగదు నిల్వలు అత్యధికంగా ఉండటంతో గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను సెంట్రల్‌ బ్యాంక్‌..కేంద్ర ప్రభుత్వానికి రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్‌ చెల్లింపులు జరిపింది. పసిడి ఆస్తులు 52.09 శాతం అధికమవగా, దేశీయ పెట్టుబడులు 14.32 శాతం, విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు 1.70 శాతం అధికమయ్యాయి.
పసిడి నిల్వలు హైజంప్‌
రిజర్వు బ్యాంక్‌ వద్ద ఉన్న పసిడి నిల్వలు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను సెంట్రల్‌ బ్యాంక్‌ విడుదల చేసిన వార్షిక నివేదికలో పసిడి విలువ ఏడాది ప్రాతిపదికన 57.12 శాతం ఎగబాకి రూ.4,31,624.8 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. అదనంగా 54.13 మెట్రిక్‌ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడంతోపాటు ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం వల్లనే విలువ పెరిగిందని వెల్లడించింది. మార్చి 31, 2024 నాటికి గోల్డ్‌ రిజర్వులు రూ.2,74,714.27 కోట్లుగా ఉన్నది.ముక్కలు చేసిన నోట్లతో కణ బోర్డులను తయారు చేస్తున్నారు.డిజిటల్‌ కరెన్సీ లావాదేవీలు రూ.1,016 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది రూ.234 కోట్లుగా ఉన్నాయి.ప్రస్తుతం రిజర్వుబ్యాంక్‌ వద్ద 879.58 మెట్రిక్‌ టన్నుల విలువైన గోల్డ్‌ రిజర్వులు ఉన్నాయి. అంతక్రితం ఏడాది 822.10 మెట్రిక్‌ టన్నులు ఉన్నాయి.311.38 మెట్రిక్‌ టన్నుల విలువైన పసిడి ఆస్తులు కలిగివుండగా, మిగతా 568.20 మెట్రిక్‌ టన్నుల విలువైన పసిడి బ్యాంకింగ్‌ డిపార్ట్‌మెంట్ల వద్ద ఉన్నది.గడిచిన ఆర్థిక సంవత్సరంలో అదనంగా 54.13 మెట్రిక్‌ టన్నుల విలువైన పసిడిని కొనుగోలు చేసింది

]]>
Fri, 30 May 2025 18:04:02 +0530 admin
*ముఖ్యమంత్రితో ఐబీఎం (IBM) వైస్ ప్రెసిడెంట్ భేటీ https://prajakshethrenews.com/ముఖ్యమంత్రితో-ఐబీఎం-ibm-వైస్-ప్రెసిడెంట్-భేటీ https://prajakshethrenews.com/ముఖ్యమంత్రితో-ఐబీఎం-ibm-వైస్-ప్రెసిడెంట్-భేటీ *ముఖ్యమంత్రితో ఐబీఎం (IBM) వైస్ ప్రెసిడెంట్ భేటీ*

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో 

 ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఐబీఎం (IBM) వైస్ ప్రెసిడెంట్ (ఎమర్జింగ్ టెక్ అడ్వకెసీ) డానియెలా కాంబ్ (Daniela Combe) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ హెఐసీసీ వేదికగా జరుగుతోన్న గ్లోబల్ ఏఐ సదస్సు #GlobalAISummit2024 ప్రాంగణంలో  సమావేశమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భవిష్యత్తు, నూతన ఆవిష్కరణల అన్వేషణ తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల ప్రాంగణంలో అధునాతన ఏఐ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఫ్యూచర్ సిటీని ఏఐ రాజధానిగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికల పట్ల ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ ఆసక్తి కనబరిచారు. ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఉన్నతాధికారులు, ఐబీఎం ప్రతినిధులు పాల్గొన్నారు.

]]>
Thu, 05 Sep 2024 17:58:12 +0530 admin
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో CWEIC చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసీ గ్లేజ్‌బ్రూక్ భేటీ https://prajakshethrenews.com/ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి-తో-cweic-చీఫ్-ఎగ్జిక్యూటివ్-రోసీ-గ్లేజ్బ్రూక్-భేటీ https://prajakshethrenews.com/ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి-తో-cweic-చీఫ్-ఎగ్జిక్యూటివ్-రోసీ-గ్లేజ్బ్రూక్-భేటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో CWEIC చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసీ గ్లేజ్‌బ్రూక్ భేటీ 

56 కామన్వెల్త్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణకు కృషి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో ప్రజాప్రభుత్వం నూతనంగా చేపట్టిన ప్రాజెక్టులపై కామన్వెల్త్ కూటమిలో భాగమైన కామన్వెల్త్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిల్ (CWEIC) ఆసక్తి కనబర్చింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని CWEIC చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసీ గ్లేజ్‌బ్రూక్ (Rosie Glazebrook)  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో పెట్టుబడులు, నైపుణ్యాల అభివృద్ధి తదితర అంశాలు చర్చకు వచ్చాయి.ప్రపంచ వ్యాప్తంగా 56 కామన్వెల్త్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణకు Commonwealth Enterprise and Investment Council (CWEIC) కృషి చేస్తోందని, ప్రత్యేకించి చిన్న-మధ్యతరహా పరిశ్రమ (MSME)లకు ప్రోత్సాహం, స్టార్టప్‌లు, నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పాలు అందిస్తోందని రోసీ  తమ CWEIC కౌన్సిల్ ఉద్దేశాలను ముఖ్యమంత్రి కి వివరించారు.తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు(RRR), ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ నది ప్రక్షాళన తదితర ప్రాజెక్టులపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజన్‌ను పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టుల్లో వ్యూహాత్మక భాగస్వామిగా ఉండేందుకు కామన్వెల్త్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిల్ (CWEIC) ఆసక్తి చూపింది. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

]]>
Sat, 31 Aug 2024 01:06:26 +0530 admin