Prajakshethre News & : సినిమా https://prajakshethrenews.com/rss/category/సినిమా Prajakshethre News & : సినిమా en Copyright 2024 Prajakshethre News & All Rights Reserved. 'మిరాయ్' స్పెషల్ పోస్టర్ రిలీజ్ https://prajakshethrenews.com/మిరాయ్-స్పెషల్-పోస్టర్-రిలీజ్ https://prajakshethrenews.com/మిరాయ్-స్పెషల్-పోస్టర్-రిలీజ్ సూపర్ హీరో తేజ సజ్జా, మనోజ్ మంచు, కార్తీక్ ఘట్టమనేని, టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పాన్ ఇండియా ఫిల్మ్

'మిరాయ్' నుంచి అంబికగా శ్రియ శరణ్‌ స్పెషల్ పోస్టర్ రిలీజ్


ప్రజా క్షేత్ర్, సినిమా : 
సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ 'మిరాయ్‌'లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో శ్రియ శరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మేకర్స్ తాజాగా శ్రియను అంబికగా పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు.శ్రియ శరణ్ పవర్ ఫుల్ మదర్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్‌ ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్ ఎమోషన్ తో వుండబోతుంది. ఈ  పోస్టర్ సూపర్ హీరో ప్రయాణం వెనుక ఉన్న ఎమోషన్ ని హైలైట్ చేస్తుంది.ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే స్క్రీన్‌ప్లేను కార్తీక్ స్వయంగా రూపొందించారు. మణిబాబు కరణం రచన, సంభాషణలకు కీలకంగా పని చేశారు. గౌర హరి సంగీతం, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సుజిత్ కుమార్ కొల్లి పని చేస్తున్నారు.మిరాయ్ సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జ, మనోజ్ మంచు, రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు

]]>
Tue, 02 Sep 2025 23:33:54 +0530 admin
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ బొనాంజా https://prajakshethrenews.com/పవర్-స్టార్-పవన్-కళ్యాణ్-అభిమానులకు-డబుల్-బొనాంజా https://prajakshethrenews.com/పవర్-స్టార్-పవన్-కళ్యాణ్-అభిమానులకు-డబుల్-బొనాంజా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ బొనాంజా
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'ఓజీ' నుండి పోస్టర్, గ్లింప్స్ విడుదల

ప్రజా క్షేత్ర్ , సినిమా : 

పవర్ స్టార్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న పోస్టర్, గ్లింప్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, 'ఓజీ' చిత్ర బృందం అభిమానులకు డబుల్ బొనాంజా ఇచ్చింది. అద్భుతమైన కొత్త పోస్టర్ తో పాటు, “HBD OG - LOVE OMI” పేరుతో ఓ సంచలనాత్మక గ్లింప్స్ ను విడుదల చేసింది. వింటేజ్ లుక్ లో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న పోస్టర్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పోస్టర్ రాకతో సామాజిక మాధ్యమాలు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ను ఈ తరహా లుక్ లో చూసి చాలా కాలం అయిందని అభిమానులు, ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌ ను ఇంత శక్తివంతమైన, ఆకర్షణీయమైన శైలిలో చూపించినందుకు అభిమానులు, సినీ ప్రేమికులు.. దర్శకుడు సుజీత్, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'ఓజీ' అనే టైటిల్ కి తగ్గట్టుగానే పోస్టర్ కూడా ఎంతో శక్తివంతంగా ఉంది.
పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ చిత్ర బృందం “HBD OG - LOVE OMI” అనే గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. మొదటి నుండి 'ఓజీ'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌ను గంభీరమైన అవతారంలో చూపించిన హంగ్రీ చీతా గ్లింప్స్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు “HBD OG - LOVE OMI” గ్లింప్స్‌ సినిమా యొక్క మరో విస్ఫోటన కోణాన్ని వెల్లడిస్తుంది. తాజా గ్లింప్స్ లో ఇమ్రాన్ హష్మీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ని ఢీ కొట్టే బలమైన పాత్రలో ఆయన కనువిందు చేయనున్నారు.
'ఓజీ' సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా విడుదలైన ప్రతి పోస్టర్, గ్లింప్స్, పాటలు కట్టిపడేశాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా 'ఓజీ' కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ లుక్, అద్భుతమైన విజువల్స్, సంగీతం, సంభాషణలు ఇలా ప్రతి అంశం సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేస్తున్నాయి.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్‌ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.
ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో 'ఓజీ' ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. సెప్టెంబర్ 25, 2025న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
తారాగణం: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి

]]>
Tue, 02 Sep 2025 23:18:55 +0530 admin
మిరాయ్' ట్రైలర్ ఆగస్టు 28న రిలీజ్...సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ https://prajakshethrenews.com/మిరాయ్-ట్రైలర్-ఆగస్టు-28న-రిలీజ్సినిమా-సెప్టెంబర్-12న-రిలీజ్ https://prajakshethrenews.com/మిరాయ్-ట్రైలర్-ఆగస్టు-28న-రిలీజ్సినిమా-సెప్టెంబర్-12న-రిలీజ్ సూపర్ హీరో తేజ సజ్జా, మనోజ్ మంచు, కార్తీక్ ఘట్టమనేని, టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పాన్ ఇండియా ఫిల్మ్

'మిరాయ్' ట్రైలర్ ఆగస్టు 28న రిలీజ్

సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్

ప్రజా క్షేత్ర్, సినిమా : 
సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ 'మిరాయ్‌'లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, బిటిఎస్ వీడియో వైబ్ ఉంది. సాంగ్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ట్రైలర్ ఆగస్టు 28న లాంచ్ చేయనున్నారు. హీరో, విలన్ పవర్ ఫుల్ గా కనిపించిన ట్రైలర్ పోస్టర్‌ అదిరిపోయింది. తేజ సూపర్ యోధాగా ఎనర్జీతో మెరుస్తున్న మ్యాజికల్ స్టిక్ తో కనిపించగా, మనోజ్ ఫెరోషియస్ బ్లాక్ స్వోర్డ్ గా, భారీ ఖడ్గాన్ని పట్టుకుని ఎదురు నిలబడ్డాడు. ఈ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాయి.ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీయా శరణ్, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో నిపించనున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే స్క్రీన్‌ప్లేను కార్తీక్ స్వయంగా రూపొందించారు. మణిబాబు కరణం రచన, సంభాషణలకు కీలకంగా పనిచేశారు. గౌర హరి సంగీతం, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సుజిత్ కుమార్ కొల్లి పని చేస్తున్నారు.ట్రైలర్ పోస్టర్ ద్వారా మేకర్స్ సినిమాను సెప్టెంబర్ 12న ఎనిమిది భాషల్లో 2డి, 3 డిఫార్మాట్లలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జ, మనోజ్ మంచు, రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు

]]>
Wed, 27 Aug 2025 20:42:22 +0530 admin
మాస్ జాతర' చిత్రం వాయిదా https://prajakshethrenews.com/మాస్-జాతర-చిత్రం-వాయిదా https://prajakshethrenews.com/మాస్-జాతర-చిత్రం-వాయిదా మాస్ జాతర' చిత్రం వాయిదా

కాస్త ఆలస్యమైనా అసలుసిసలైన మాస్ పండుగను థియేటర్లలో తీసుకొస్తామని నిర్మాతలు హామీ

ప్రజా క్షేత్ర్, సినిమా : 

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మాస్ జతర' చిత్రం ఆగస్టు 27వ తేదీన థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా డింది.టీవల పరిశ్రమ వ్యాప్తంగా జరిగిన సమ్మెలు, కీలకమైన కంటెంట్ పూర్తి చేయడంలో ఊహించని జాప్యం కారణంగా.. సినిమాను అనుకున్న తేదీకి సకాలంలో సిద్ధం చేయలేకపోయామని నిర్మాతలు అధికారికంగా తెలిపారు. కంగారుగా సినిమాని విడుదల చేయడం కంటే.. కాస్త సమయం తీసుకొని అత్యుత్తమ చిత్రంగా మలిచి, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు.మాస్ జతార చిత్రాన్ని అసలైన పండుగ సినిమాగా తీర్చిదిద్దడానికి ప్రతి విభాగం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ, త్వరలోనే ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. అభిమానులు నిరీక్షణకు బహుమానంగా త్వరలో ఆశ్చర్యకర కంటెంట్ రాబోతుందని నిర్మాతలు హామీ ఇచ్చారు.

]]>
Wed, 27 Aug 2025 20:31:14 +0530 admin
ప్రముఖ సినీ హీరోల చేతుల మీదుగా విజయ్ మిల్టన్ – రాజ్ తరుణ్ చిత్రం టైటిల్ లాంచ్ https://prajakshethrenews.com/ప్రముఖ-సినీ-హీరోల-చేతుల-మీదుగా-విజయ్-మిల్టన్-రాజ్-తరుణ్-చిత్రం-టైటిల్-లాంచ్ https://prajakshethrenews.com/ప్రముఖ-సినీ-హీరోల-చేతుల-మీదుగా-విజయ్-మిల్టన్-రాజ్-తరుణ్-చిత్రం-టైటిల్-లాంచ్ ప్రముఖ సినీ హీరోల చేతుల మీదుగా విజయ్ మిల్టన్ – రాజ్ తరుణ్ చిత్రం టైటిల్ లాంచ్

ప్రజా క్షేత్ర్, సినిమా : 

రాజ్ తరుణ్ – విజయ్ మిల్టన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా టైటిల్ రేపు విడుదల కానుంది . తమిళ సినీ తారలు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోని, ఆర్యతో పాటు తెలుగు యంగ్ హీరో మాస్ క దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా ఈ చిత్రం టైటిల్ విడుదల కానుంది. ఈ టైటిల్ లాంచ్ వినాయక చవితి సందర్భంగా రేపు ఉదయం 11:11 గంటలకు జరగనుంది.
విజయ్ మిల్టన్ దర్శకత్వంలో, రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి అభిరామి కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ప్రొడక్షన్ నెం. 5గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది.
ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా టైటిల్ అనౌన్స్‌మెంట్‌పై కూడా ప్రేక్షకులు, సినీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

]]>
Wed, 27 Aug 2025 20:15:18 +0530 admin
"ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి 'ఏం జరుగుతోంది...' లిరికల్ సాంగ్ రిలీజ్ https://prajakshethrenews.com/ది-గర్ల్-ఫ్రెండ్-సినిమా-నుంచి-ఏం-జరుగుతోంది-లిరికల్-సాంగ్-రిలీజ్ https://prajakshethrenews.com/ది-గర్ల్-ఫ్రెండ్-సినిమా-నుంచి-ఏం-జరుగుతోంది-లిరికల్-సాంగ్-రిలీజ్ నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి  జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్".

ప్రజా క్షేత్ర్, సినిమా : 
 ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ఈ రోజు "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి 'ఏం జరుగుతోంది...' లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా, చిన్మయి పాడారు. హేషమ్ అబ్దుల్ వాహాబ్ ఛాట్ బస్టర్ ట్యూన్ అందించారు. 'ఏం జరుగుతోంది...' పాట ఎలా ఉందో చూస్తే - ' కలకలమను కలగలిపిన కథ మొదలా, కలవరమున తెగనలిగిన నిజము కలా, ఏం చేయను తడబడిన తప్పటడుగా, మతిచెడెనా ఏమో,  సతమతమౌ తలపేదో,  నిలదీసి నన్నెడుగెనుగా, ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది, మనసా తెలుసా, మనసా తెలుసా, ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది...' అంటూ హార్ట్ టచింగ్ లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.
నటీనటుskshetలు - రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, తదితరులు

]]>
Wed, 27 Aug 2025 20:11:07 +0530 admin
కాంతార చాప్టర్ 1 నుంచి కులశేఖరగా గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్ రిలీజ్ https://prajakshethrenews.com/కాంతార-చాప్టర్-1-నుంచి-కులశేఖరగా-గుల్షన్-దేవయ్య-ఫస్ట్-లుక్-రిలీజ్ https://prajakshethrenews.com/కాంతార-చాప్టర్-1-నుంచి-కులశేఖరగా-గుల్షన్-దేవయ్య-ఫస్ట్-లుక్-రిలీజ్ కాంతార చాప్టర్ 1 నుంచి కులశేఖరగా గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్ రిలీజ్

హోంబాలే ఫిల్మ్స్, రిషబ్ శెట్టి బిగ్గెస్ట్ పాన్-ఇండియా మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి కులశేఖరగా గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రజా క్షేత్ర్, సినిమా : 

మోస్ట్ ఎవైటెడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కాంతార చాప్టర్ 1 నిర్మాతలు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. రిషబ్ శెట్టి బాక్‌బస్టర్ కాంతారకు ప్రతిష్టాత్మక ప్రీక్వెల్‌లో కులశేఖర పాత్రలో నటిస్తున్నాడు గుల్షన్ దేవయ్య. ఈ అనౌన్స్ మెంట్ ఫ్రాంచైజీ అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించి తానే మళ్లీ సెంట్రల్ క్యారెక్టర్‌గా నటిస్తున్న "కాంతార చాప్టర్ 1" మొదటి పార్ట్‌లో ఉన్న యూనివర్స్‌ని ఇంకా విస్తరించబోతోంది. తొలి సినిమా రా, ఫోక్‌లొర్, ఆధ్యాత్మికత, భావోద్వేగాలతో రూటెడ్ స్టోరీటెల్లింగ్ కి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఈ ప్రీక్వెల్ మాత్రం మూలాలను ఇంకా లోతుగా ఎక్స్ప్లోర్ చేస్తూ, మరింత ఇంటెన్సిటీ, భావోద్వేగం జోడించబోతోంది.ఈ సినిమా విజువల్‌ విజువల్ వండర్ గా ఉండబోతోంది. సినిమాటోగ్రఫీని అర్వింద్ ఎస్. కాశ్యప్ అందిస్తుండగా, ఫస్ట్ పార్ట్ లో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన బి. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ ఇస్తున్నారు. హోంబాలే ఫిలిమ్స్‌ విజయ్ కిరగందూర్ నెక్స్ట్ లెవల్ లో నిర్మిస్తున్నారు. కులశేఖర పాత్రలో గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్ బయటికి రావడంతో సినిమా మీద మరింత హైప్ పెరిగింది. ఈ మోస్ట్ లవ్డ్ యూనివర్స్ లో అతని రోల్ ఎలాంటి మలుపులు తీసుకొస్తుందో అన్న ఆసక్తి పెరుగుతోంది.
ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్ లో అక్టోబర్ 2, 2025న గ్రాండ్ గా వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది.

]]>
Wed, 20 Aug 2025 15:23:31 +0530 admin
ఇప్పుడు ప్రైమ్ లో హరి హర వీరమల్లు https://prajakshethrenews.com/ఇప్పుడు-ప్రైమ్-లో-హరి-హర-వీరమల్లు https://prajakshethrenews.com/ఇప్పుడు-ప్రైమ్-లో-హరి-హర-వీరమల్లు హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో

ప్రజా క్షేత్ర్, వెబ్ సినిమా :
పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త! ఆయన తాజా చిత్రం హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది..ఈ చిత్రాన్ని రాధాకృష్ణ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. పీరియడ్ అడ్వెంచర్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, సచిన్ ఖేడ్కర్, నాజర్, రఘుబాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.మొఘల్ కాలం నాటి ఈ కథలో, వీరమల్లు అనే ఒక ధైర్యవంతుడు చక్రవర్తి ఔరంగజేబు కోట నుండి ప్రసిద్ధ కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడానికి బయలుదేరుతాడు. రాజకీయ కుట్రలు, యుద్ధాలు మరియు సాహసాలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. కాని కథ ముందుకు వెళ్ళే కొలది కథ ధర్మ రక్షణ కోసం అనే మలుపుతో మరింత ఇంట్రెస్ట్ కలిగించింది.ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా అందుబాటులో ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ప్రైమ్ సభ్యులు ఈ సినిమాను చూడవచ్చు

]]>
Wed, 20 Aug 2025 15:10:31 +0530 admin
నేనెవరు?" టైటిల్ లోగో లాంచ్ https://prajakshethrenews.com/నేనెవరు-టైటిల్-లోగో-లాంచ్ https://prajakshethrenews.com/నేనెవరు-టైటిల్-లోగో-లాంచ్ *నేనెవరు?" టైటిల్ లోగో లాంచ్*

*నటకిరీటి డా: రాజేంద్ర ప్రసాద్ నటించిన "నేనెవరు?" టైటిల్ లోగో లాంచ్ చేసిన సినీ ప్రముఖులు*

*దర్శకుడిగా చిరంజీవికి ఉజ్వల భవిష్యత్ ఉందని కితాబు*
ప్రజా క్షేత్ర్, సినిమా : 
ఇటీవల కాలంలో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నటకిరీటి డా: రాజేంద్ర ప్రసాద్, "నువ్వేకావాలి, ప్రేమించు" వంటి సూపర్ హిట్ ఫిల్మ్స్ ఫేమ్ సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రల్లో యువ ప్రతిబాశాలి చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సందేశభరిత వినోదాత్మక చిత్రం "నేనెవరు?" జై చిరంజీవ మూవీ మేకర్స్ పతాకంపై సరికొండ మల్లిఖార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు - సకినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంతో వైజాగ్ సత్యానంద్ శిష్యులు అభిలాష్, సాయిచెర్రి హీరోలుగా పరిచయమవుతున్నారు. దీపిక - సోనాక్షి జబర్దస్త్ రాజమౌళి.... ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం షూటింగ్ ముగించుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది!! త్వరలో విడుదల తేది ప్రకటించుకోనున్న ఈ చిత్రం టైటిల్ లోగోను తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు - ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్,  ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, వి.సముద్ర ఆవిష్కరించి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లోని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రివ్యూ ధియేటర్ లో జరిగిన ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొని, ఈ సినిమా తామందరికీ పేరు తెచ్చిపెడుతుందని పేర్కొన్నారు! ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ - అప్పాజీ, మాటలు: శ్రీనివాస్, పాటలు: ఎస్.ఎస్.వీరు, మ్యూజిక్: చిన్నికృష్ణ, ఎడిటర్: నందమూరి హరి - తారకరామారావు, సినిమాటోగ్రఫీ: నాయుడు ప్రసాద్ కొల్లి, సమర్పణ: సరికొండ మల్లిఖార్జున్, నిర్మాతలు: అండేకర్ జగదీష్ బాబు - సకినాన భూలక్ష్మి, రచన - దర్శకత్వం: చిరంజీవి తన్నీరు!!

]]>
Wed, 20 Aug 2025 15:05:11 +0530 admin
డివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ 'G2' మే 1, 2026న వరల్డ్ వైడ్ రిలీజ్ https://prajakshethrenews.com/డివి-శేష్-పాన్-ఇండియా-స్పై-యాక్షన్-థ్రిల్లర్-g2-మే-1-2026న-వరల్డ్-వైడ్-రిలీజ్ https://prajakshethrenews.com/డివి-శేష్-పాన్-ఇండియా-స్పై-యాక్షన్-థ్రిల్లర్-g2-మే-1-2026న-వరల్డ్-వైడ్-రిలీజ్ డివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ 'G2' మే 1, 2026న వరల్డ్ వైడ్ రిలీజ్
ప్రజా క్షేత్ర్, సినిమా : 
బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ గూఢచారికి సిక్వెల్‌గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'G2' 2026 మే 1న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అడివి శేష్ హీరోగా మరో సరికొత్త మిషన్‌కి రెడీ అవుతున్న ఈ సినిమాకి గ్రాండ్ లెవెల్ పోస్టర్స్‌తో రిలీజ్ డేట్‌ని ఎనౌన్స్ చేశారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం, ఫస్ట్ పార్ట్ గూఢచారి సక్సెస్‌ను బేస్‌గా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు. 150 రోజుల పాటు, 6 దేశాల్లో షూటింగ్ చేసి, 23 భారీ సెట్లతో తెరకెక్కించిన ఈ మూవీ, ఇండియన్ సినిమాలో స్పై థ్రిల్లర్ జానర్‌ ని రీడిఫైన్ చేయనుంది.ఈసారి ఏజెంట్ 116గా వామికా గబ్బి ఎంట్రీ ఇస్తోంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ వున్న క్యారెక్టర్ ఇది. ఈ మూవీతో ఇమ్రాన్ హష్మీ తొలిసారి తెలుగు తెరపై కనిపించబోతున్నారు. అలాగే మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ కానుంది. పవర్‌ఫుల్ క్యాస్ట్, అంతర్జాతీయ స్థాయి ప్రొడక్షన్, గ్రాండ్ విజన్‌తో G2, 2026లో మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులని అలరించనుంది

]]>
Mon, 04 Aug 2025 22:28:46 +0530 admin
దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ సినిమా షూటింగ్ ప్రారంభం https://prajakshethrenews.com/దుల్కర్-సల్మాన్-కొత్త-మూవీ-సినిమా-షూటింగ్-ప్రారంభం https://prajakshethrenews.com/దుల్కర్-సల్మాన్-కొత్త-మూవీ-సినిమా-షూటింగ్-ప్రారంభం దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ సినిమా షూటింగ్ ప్రారంభం 

ప్రజా క్షేత్ర్, ఆగస్టు 4 ( తెలుగు ప్రభ) : 

దుల్కర్ సల్మాన్, రవి నేలకుదిటి, సుధాకర్ చెరుకూరి, SLV సినిమాస్ పాన్ ఇండియా ఫిల్మ్ #DQ41, #SLV10 పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం- ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన నేచురల్ స్టార్ నాని- రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ అద్భుతమైన స్క్రిప్ట్ సెలెక్షన్స్ తో ఎప్పుడూ యూనిక్ కథలు, చాలెంజింగ్ రోల్స్ తో అలరిస్తున్నారు. తన 41వ చిత్రం #DQ41 కోసం దుల్కర్, నూతన దర్శకుడు రవి నేలకుదిటితో చేతులు కలిపారు. లవ్ స్టొరీ తో పాటు అద్భుతమైన హ్యుమన్ డ్రామా గా రూపొందనున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు. ఇది నిర్మాణ సంస్థ 10వ వెంచర్. #SLV10 మైల్ స్టోన్ గా నిలుస్తుంది.ఈ రోజు హైదరాబాద్లో ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ముహూర్తపు షాట్‌కు నేచురల్ స్టార్ నాని క్లాప్ కొట్టారు. దర్శకుడు బుచ్చి బాబు సానా కెమెరా స్విచ్ ఆన్ చేయగా, గుణ్ణం సందీప్, నాని, రమ్య గుణ్ణం స్క్రిప్ట్‌ను టీంకు  అందజేశారు. ఫస్ట్  షాట్‌ను రవి నెలకుడిటి స్వయంగా దర్శకత్వం వహించారు.దసరా, ది ప్యారడైజ్ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభం అవుతుంది.మలయాళం, తెలుగు సినిమాల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్ లాంటి హీరోని ఒప్పించడం మామూలు విషయం కాదు. దర్శకుడు రవి నెలకుడిటి ఒక అద్భుతమైన కథ, కాన్సెప్ట్‌ తో దుల్కర్ ని ఇంప్రెస్ చేశారు.  హై ప్రొడక్షన్ అండ్ టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు, జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, తమిళ భాషలలో పాన్ ఇండియా విడుదల కానుంది.
నటీనటులు, మిగతా టెక్నికల్ టీం సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
తారాగణం: దుల్కర్ సల్మాన్

]]>
Mon, 04 Aug 2025 22:25:29 +0530 admin
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్ 2 సినిమాలో ని ‘ఆవన్ జావన్’ సాంగ్ https://prajakshethrenews.com/సోషల్-మీడియాలో-హల్-చల్-చేస్తున్న-వార్-2-సినిమాలో-ని-ఆవన్-జావన్-సాంగ్ https://prajakshethrenews.com/సోషల్-మీడియాలో-హల్-చల్-చేస్తున్న-వార్-2-సినిమాలో-ని-ఆవన్-జావన్-సాంగ్ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న‘వార్ 2’ ఫస్ట్ సింగిల్ అప్డేట్..

హృతిక్ రోషన్, కియారా అద్వానీ పై చిత్రీకరించిన ‘ఆవన్ జావన్’

ప్రజా క్షేత్ర్, సినిమా : 

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద అయాన్ ముఖర్జీ భారీ ఎత్తున తెరకెక్కించిన చిత్రం ‘వార్ 2’.  ఐకానిక్ స్టార్‌లైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్డేట్‌ను అయాన్ ముఖర్జీ ఇచ్చారు.
‘వార్ 2’ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈరోజు (జూలై 29) తన సోషల్ మీడియాలో ‘వార్ 2’ లోని మొదటి పాట ‘ఆవన్ జావన్’ గురించి పోస్ట్ వేశారు. సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, కియారా అద్వానీ నటించిన ఈ రొమాంటిక్ సాంగ్ గురించి చిత్రయూనిట్ అప్డేట్ ఇచ్చింది. బ్రహ్మాస్త్రలోని తన బ్లాక్ బస్టర్ పాట కేసరియా ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ ‘ఆవన్ జావన్’ పాట కోసం ప్రీతమ్, అమితాబ్ భట్టాచార్య, అరిజిత్ సింగ్ అందరూ కలిసి ఈ ప్రత్యేకమైన పాట కోసం పని చేశారు. హృతిక్, కియారా కెమిస్ట్రీ ఈ పాటకు మరింత ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈ వారమే ఈ పాట అందరి ముందుకు రానుంది. ‘వార్ 2’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదలకానుంది.

]]>
Tue, 29 Jul 2025 22:54:18 +0530 admin
క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయిన ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా https://prajakshethrenews.com/క్లైమాక్స్-చిత్రీకరణ-పూర్తయిన-ఉస్తాద్-భగత్-సింగ్-సినిమా https://prajakshethrenews.com/క్లైమాక్స్-చిత్రీకరణ-పూర్తయిన-ఉస్తాద్-భగత్-సింగ్-సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి


భావోద్వేగాలు, యాక్షన్ తో కూడిన అద్భుతమైన క్లైమాక్స్ ను రూపొందిన దర్శకుడు హరీష్ శంకర్

ప్రజా క్షేత్ర్, సినిమా : 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. 'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, హరి హర వీరమల్లు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ.. 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవర్ స్టార్ యొక్క అంకితభావం మరియు కష్టపడి పనిచేసే స్వభావానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణను తాజాగా చిత్ర బృందం పూర్తి చేసింది. దర్శకుడు హరీష్ శంకర్ భావోద్వేగాలు, యాక్షన్ తో కూడిన అద్భుతమైన క్లైమాక్స్ ను రూపొందించారు. ఈ చిత్రానికి ప్రధాన బలాలలో ఒకటిగా నిలిచే ఈ అత్యంత పవర్ ఫుల్ సీక్వెన్స్ కు నబకాంత మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. పవన్ కళ్యాణ్ యొక్క అత్యుత్తమ ప్రదర్శనతో ఈ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చింది. చిత్రీకరణ పూర్తయిన తర్వాత, నబకాంత మాస్టర్ బృందానికి మరియు ఫైటర్లు అందరికీ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్లైమాక్స్ సీక్వెన్స్‌ అద్భుతంగా రావడానికి కృషి చేసినందుకు వారిని అభినందించారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు.. మాస్ ప్రేక్షకులు, యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు హామీ ఇచ్చారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, రాంకీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకి అత్యున్నత సాంకేతిక బృందం పనిచేస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యువ ప్రతిభావంతుడు ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం మరియు నబకాంత మాస్టర్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా అయనంక బోస్, కాస్ట్యూమ్ డిజైనర్ గా నీతా లుల్లా, కళా దర్శకుడిగా ఆనంద్ సాయి వ్యవహరిస్తున్నారు.
తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా

]]>
Tue, 29 Jul 2025 22:43:37 +0530 admin
ఆగస్టు 8న 'బకాసుర రెస్టారెంట్‌' ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ విడుదల https://prajakshethrenews.com/ఆగస్టు-8న-బకాసుర-రెస్టారెంట్-ప్రపంచవ్యాప్తంగా-థియేట్రికల్-విడుదల https://prajakshethrenews.com/ఆగస్టు-8న-బకాసుర-రెస్టారెంట్-ప్రపంచవ్యాప్తంగా-థియేట్రికల్-విడుదల ఆగస్టు 8న 'బకాసుర రెస్టారెంట్‌' ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ విడుదల

ప్రజా క్షేత్ర్, సినిమా : 
 ఈ ఆగస్టు 8 న తెలుగు సినీ ప్రియులకు 'బకాసుర రెస్టారెంట్‌' పేరుతో ఓ విందుభోజనం రెడీ అవుతోంది. ఈ సినిమా చూసిన వాళ్లకు ఓ మంచి విందు భోజనం ఆరగించిన ఫీల్‌ కలగబోతుందని చెబుతోంది చిత్ర టీమ్‌. తన నటనతో, డైలాగ్‌ డెలివరితో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాందించుకున్న క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, కమెడియన్‌ ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌', ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమౌతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ'' ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ '' హంగర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది. సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మీ హృదయాలను హత్తుకునే ఎమోషన్‌ను ఇస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా చూశామనే సంతృప్తిని పొందుతారు' అన్నారు. ఆగస్టు 8న అత్యధిక థియేటర్స్‌తో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ప్రవీణ్‌, వైవా హర్ష, షైనింగ్‌ ఫణి (బమ్‌చిక్‌ బంటి), కేజీఎఫ్‌ గరుడ రామ్‌, కృష్ణభగవాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఉప్పెన జయకృష్న, వివేక్‌ దండు, అమర్‌, రామ్‌పటాస్‌, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్‌, జబర్థస్త్‌ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్‌: మార్తండ్‌.కె.వెంకటేష్‌, సంగీతం: వికాస్‌ బడిస, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్‌ కొట్టి, ఆర్ట్‌ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్‌ తంగాల, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి, దర్శకత్వం: ఎస్‌జే శివ

]]>
Thu, 17 Jul 2025 23:01:12 +0530 admin
" K&ర్యాంప్" సినిమా నుంచి 'ది రిచెస్ట్ చిల్లర్ గయ్' గ్లింప్స్ రిలీజ్, https://prajakshethrenews.com/k-ర్యాంప్-సినిమా-నుంచి-ది-రిచెస్ట్-చిల్లర్-గయ్-గ్లింప్స్-రిలీజ్ https://prajakshethrenews.com/k-ర్యాంప్-సినిమా-నుంచి-ది-రిచెస్ట్-చిల్లర్-గయ్-గ్లింప్స్-రిలీజ్  " K-ర్యాంప్" సినిమా నుంచి 'ది రిచెస్ట్ చిల్లర్ గయ్' గ్లింప్స్ రిలీజ్, దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

ప్రజా క్షేత్ర్, సినిమా : 
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. "K-ర్యాంప్" మూవీ దీపావళి పండుగ సందర్భంగా  అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు " K-ర్యాంప్"  సినిమా నుంచి 'రిచెస్ట్ చిల్లర్ గయ్' గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో మాస్ ఆటిట్యూడ్ ఉన్న కుమార్ అనే యువకుడిగా కిరణ్ అబ్బవరం కనిపించారు. చిల్ కావడంలో అతనికి పోటీ లేదు. ఈ క్యారెక్టర్ ను ఫుల్ ఎనర్జీతో పర్ ఫార్మ్ చేశారు కిరణ్ అబ్బవరం. ఈ గ్లింప్స్ చివరలో 'మనం ఏఎంబీ సినిమాలో మలయాళ ప్రేమకథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే ఆ సినిమాల్లో ఉండే ఆంథెటిసిటీ మన సినిమాల్లో ఉండదు. ప్రేమ మాత్రం బాగుండాలని కోరుకుంటాం..' అంటూ కిరణ్ అబ్బవరం చెప్పిన డైలాగ్ గ్లింప్స్ కు హైలైట్ గా నిలుస్తోంది. 'రిచెస్ట్ చిల్లర్ గయ్' గ్లింప్స్ చూస్తే " K-ర్యాంప్" తో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీ అని తెలుస్తోంది.
నటీనటులు - కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు

]]>
Mon, 14 Jul 2025 23:52:15 +0530 admin
"ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి 'నదివే...' లిరికల్ సాంగ్ రిలీజ్ https://prajakshethrenews.com/ది-గర్ల్-ఫ్రెండ్-సినిమా-నుంచి-నదివే-లిరికల్-సాంగ్-రిలీజ్ https://prajakshethrenews.com/ది-గర్ల్-ఫ్రెండ్-సినిమా-నుంచి-నదివే-లిరికల్-సాంగ్-రిలీజ్ ఈ నెల 16న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి 'నదివే...' లిరికల్ సాంగ్ రిలీజ్
ప్రజా క్షేత్ర్, సినిమా :
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి  జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.
ఈ రోజు "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి 'నదివే...' లిరికల్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పాటను ఈ నెల 16వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 'నదివే...' పాటను బ్యూటిఫుల్ మెలొడీగా కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్. చిత్రీకరణ తుది దశలో ఉన్న  "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్  త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.
నటీనటులు - రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, తదితరులు

]]>
Sun, 13 Jul 2025 09:59:31 +0530 admin
ది 100 సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ https://prajakshethrenews.com/ది-100-సినిమాకి-అద్భుతమైన-రెస్పాన్స్ https://prajakshethrenews.com/ది-100-సినిమాకి-అద్భుతమైన-రెస్పాన్స్ ది 100 సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ.

ఆర్కే నాయుడు లానే విక్రాంత్ ఐపీఎస్ క్యారెక్టర్ కూడా ఆడియన్స్ కి గుర్తుండిపోతుంది: థాంక్ యు మీట్ లో హీరో ఆర్కే సాగర్
ప్రజా క్షేత్ర్, సినిమా :
హీరో ఆర్కే సాగర్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్  'ది 100'. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం జూలై 11న థియేటర్స్ లో విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, ఘన విజయం సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు. థాంక్ యూ మీట్ లో హీరో ఆర్కే సాగర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. థాంక్యూ మీట్ పెట్టాలనుకున్నప్పుడు నాకు ముందుగా గుర్తొచ్చింది మీడియా. ఈ సినిమాని చాలా గొప్పగా ఆదరించారు. ఎక్కడ కూడా ఒక నెగిటివ్ రివ్యూ లేకుండా చాలా అద్భుతంగా ప్రోత్సహించారు. అందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాల్లో ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆర్కే నాయుడు లాగే విక్రాంత్ ఐపీఎస్ క్యారెక్టర్ కూడా ఆడియన్స్ కి గుర్తుండిపోయింది. వెంకయ్య నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా రెస్పాన్స్ వస్తుంది. ఇంకా మంచి కథలు చెప్పాలనే స్ఫూర్తి ఆడియన్స్ ఇచ్చారు. డైరెక్టర్  చాలా అద్భుతంగా ఈ సినిమాను తీశారు,హర్షవర్ధన్ రామేశ్వర్  మా సినిమాని తన మ్యూజిక్ తో మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది. సినిమాని తప్పకుండా థియేటర్స్ లో వెళ్లి చూడండి. సినిమా డిసప్పాయింట్ చెయ్యదు. ఈ సినిమా నచ్చలేదని ఒక్కరు చెప్పినా సరే నేను దేనికైనా సిద్ధం. అంత నమ్మకంగా చెబుతున్నాను. మీ అందరి ప్రోత్సాహానికి ధన్యవాదాలు'అన్నారు.  
రాజా రవీంద్ర మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఒక పోలీసుగా ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ విక్రమ్ ఐపీఎస్ లాగా ఉండాలని అనిపించింది. 100 నాట్ నెంబర్ ఒక వెపన్. సినిమా అందరికీ కనెక్ట్ అయింది. ఇంత మంచి సినిమాని అందించిన ఆర్కే నాయుడు గారికి వారి టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్'అన్నారు.  
మిషా నారంగ్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. మా సినిమా గురించి అందరూ చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఆడియన్స్ ఈ సినిమా మీద చూపిస్తున్న ప్రేమకి ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి క్యారెక్టర్ ని ప్లే చేసిన అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా చూడండి మీ అందరికీ నచ్చుతుంది'అన్నారు.  
డైరెక్టర్ శశిధర్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. మీడియా వారికి థాంక్యూ చాలా అద్భుతమైన రివ్యూస్ ఇచ్చారు.  ఈ సినిమాకి మీడియా ప్రేక్షకులు చాలా పెద్ద స్థాయి ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ సపోర్టు తో మరిన్ని మంచి కథలతో మీ ముందుకు రావడానికి మాకు ఒక ధైర్యం వచ్చింది. ప్రేక్షకులు సినిమాని చాలా బాగా ఆదరిస్తున్నారు. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అందరూ సినిమాకు వచ్చి మమ్మల్ని బ్లెస్స్ చేయాలను కోరుకుంటున్నాను.  సొసైటీలో ఉన్న ఛాలెంజ్ లు గురించి తీసిన సినిమా ఇది. సినిమా చూసిన ఆడియన్స్ ప్రతి ఇంట్లో ఒక విక్రాంత్ లాంటి క్యారెక్టర్ ఉండాలని కోరుకున్నారు.  నిజానికి ఆ మాట నాకు చాలా నచ్చింది.  సినిమాకి ఎంకరేజ్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సాగర్  వలన నేను డైరెక్టర్ అయ్యాను. ఈ అవకాశం ఇచ్చిన ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'అన్నారు  
రమేష్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మీడియా మిత్రులకు చాలా థాంక్స్. సినిమాకు చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. సినిమాకి  అందరూ చాలా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా లేడీస్ చాలా కనెక్ట్ అవుతున్నారు. డైరెక్టర్ గారు ఫ్యామిలీ ఎమోషన్ క్రైమ్ ఎలిమెంట్స్ ని  చక్కగా బ్యాలెన్స్ చేశారు. ఆడియన్స్ చాలా కొత్తగా ఫీల్ అవుతున్నారు. సినిమా చూసిన ఆడియోస్ క్లైమాక్స్లో క్లాప్స్ కొడుతున్నారు. సినిమాకి అన్ని వైపుల నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. సాగర్ ని తెలుగు ప్రజలు చాలా ఓన్ చేసుకున్నారు.  చాలా మంచి రెస్పాన్స్ ఉంది.  ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'అన్నారు.  
రాంబాబు గోసాల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు చాలా థాంక్యూ. మంచి రివ్యూస్ ఇచ్చిన మీడియా వారికి  థాంక్ యూ హర్షవర్ధన్  చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా డైరెక్టర్  చాలా అద్భుతంగా సినిమా తీసి సూపర్ హిట్ కొట్టారు. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్. ఈ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అందరూ థియేటర్స్ లో సినిమా చూడాలని కోరుకుంటున్నాను'అన్నారు.

]]>
Sun, 13 Jul 2025 09:54:59 +0530 admin
ఆ గ్యాంగ్ రేపు 3' ఫస్ట్ లుక్ విడుదల https://prajakshethrenews.com/ఆ-గ్యాంగ్-రేపు-3-ఫస్ట్-లుక్-విడుదల https://prajakshethrenews.com/ఆ-గ్యాంగ్-రేపు-3-ఫస్ట్-లుక్-విడుదల ఆ గ్యాంగ్ రేపు 3' ఫస్ట్ లుక్ విడుదల
ప్రజా క్షేత్ర్, సినిమా :
ఇంతకు ముందు 45 మిలియన్స్‌కు పైగా యూట్యూబ్‌లో వ్యూస్‌ సాధించి వైరల్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా పేరుపొందిన 'ఆ గ్యాంగ్‌ రేపు'తో పాటు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు పొందిన స్వీకెల్‌ చిత్రం 'ఆ గ్యాంగ్‌ రేపు-2' షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించిన టీమ్‌ నుండి రాబోతున్న మరో సన్సేషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ 'ఆ గ్యాంగ్‌ రేపు-3' త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. దర్శకుడు యోగీ కుమార్‌ ఈ సినిమాను ఎంతో ఎమోషనల్‌గా, నిజాయితీగా.. అందరి హృదయాలకు హత్తుకునే విధంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ లవ్‌ యూ టూ ఓటీటీలో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ సారి ఈ ఆ గ్యాంగ్‌ రేపు-3 ఆయనకు దర్శకుడిగా మరింత గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నారు. నరేన్‌ అన్నసాగరం, ప్రీతి సుందర్‌ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సహచర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నోక్షియస్ నాగ్స్ నిర్మించిన ఈ చిత్రానికి, హ్యాండ్ హెల్డ్ స్టైల్ చిత్రీకరణ చేసిన సినిమాటోగ్రాఫర్ నాని ఐనవెల్లి విజువల్స్ మరింత ఎంగేజింగ్ గా ఉంటాయి. కథన వేగం, మూడ్‌ను ఖచ్చితంగా నిలబెట్టిన ఎడిటర్ అనిల్ కుమార్ జల్లు కట్ ఈ సినిమా టెన్షన్‌ను అద్భుతంగా పటిష్టం చేసింది.మరియు 2017లో మొదటి SIIMA షార్ట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు, కన్నడ హిట్ షుగర్ ఫ్యాక్టరీకి సంగీతం అందించిన కబీర్ రఫీ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ మరియు విడుదల తేదీ త్వరలో ప్రకటించబడనుంది! కంటెంట్ ట్రైలర్ జూలై 16న విడుదల కానుంది. పూర్తి విడుదల కోసం అప్‌డేట్స్ కోసం ఎదురుచూడండి! నరేన్‌ అన్నసాగరం, ప్రీతి సుందర్‌, సందీప్‌ సాండిలియా, దయానంద్‌ రెడ్డి, మహిపాల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్యానర్‌: సహచర ప్రొడక్షన్స్‌, నిర్మాత: నోక్షియస్‌ నాగ్స్‌, దర్శకుడు: యోగేష్‌ కుమార్‌, డీఓపీ: నాని ఐనవల్లి, సంగీతం: కబీర్‌ రఫీ, ఎడిటర్‌: అనిల్‌ కుమార్‌ జల్లు

]]>
Sun, 13 Jul 2025 09:50:52 +0530 admin
జూనియర్‌' మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. https://prajakshethrenews.com/జూనియర్-మంచి-ఎమోషనల్-ఫ్యామిలీ-డ్రామా https://prajakshethrenews.com/జూనియర్-మంచి-ఎమోషనల్-ఫ్యామిలీ-డ్రామా జూనియర్‌' మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.

అందరికీ కనెక్ట్ అయ్యే కోర్ ఎమోషన్ ఉంది. తప్పకుండా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు: సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్  
ప్రజా క్షేత్ర్, సినిమా :
ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ 'జూనియర్‌'తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్‌ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ డివోపీగా పని చేస్తున్నారు. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.  
ఈ ప్రాజెక్టు ఎలా స్టార్ట్ అయింది?
-నిర్మాత సాయి తో నాకు మంచి పరిచయం ఉంది. ఆయనతో 'ఈగ' సినిమా చేశాను. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమా గురించి చెప్పారు.  డైరెక్టర్ రాధాకృష్ణ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. మంచి ప్రొడక్షన్ హౌస్, టెక్నికల్ టీం కూడా చాలా బాగుంది. అలా ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది.
ఈ కథలో మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఏమిటి ?
-కొత్తవారిని పరిచయం చేసినప్పుడు ఫ్యామిలీ డ్రామా జానర్ కి వెళ్ళరు. డాన్స్లు ఫైట్లు ఉంటే చాలు అనుకుంటారు. కానీ ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది. అది నాకు చాలా ఇంప్రెస్ చేసింది. కొత్త హీరో ఇలాంటి ఛాలెంజ్ తీసుకొని చేయడం అనేది నాకు చాలా నచ్చింది
హీరో కిరీటి గురించి?
-కిరీటి చాలా హార్డ్ వర్కర్. చాలా అద్భుతమైన డాన్సర్. యాక్షన్ చాలా బాగా చేస్తాడు. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తను బ్యాలెన్స్డ్ యాక్టర్. తను వన్ ఆఫ్ ది బెస్ట్ న్యూ కమ్మర్.  

మీరు రాజమౌళి తో పెద్ద కాన్వాస్ సినిమాలు చేశారు. ఇప్పుడు  జూనియర్ లాంటి న్యూ కమ్మర్ సినిమాని ఎంచుకోవడానికి కారణం?
-ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం. ఒక హెవీ గ్రాఫిక్స్ సిజీ వర్క్ ఉన్న సినిమా తర్వాత ఇలాంటి సినిమా చేయడం నాకూ రిఫ్రెష్ గా అనిపించి చేశాను. ఇందులో ఉన్న కోర్ ఎమోషన్ నాకు చాలా నచ్చింది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాస్ రావడం తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో ఈ సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది.

-ఈ సినిమా పాటలు జనాలకి నచ్చాయి. వైరల్ వయ్యారి పాటలో కిరీటి శ్రీలీల డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కూడా బాగా నచ్చింది. ప్రమోషనల్ కంటెంట్ అంతా బాగా రీచ్ అవుతుంది. కచ్చితంగా సినిమాని  ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.
మీరు ఒక సినిమాని సెలెక్ట్ చేసుకోవాలంటే కథలో ఎలాంటి ఎలిమెంట్స్ చూస్తారు?
స్టోరీ ఎమోషనల్ గా మూవ్ అవుతుందో లేదో చూస్తాను. అది చాలా ఇంపార్టెంట్. ఎమోషన్ మనల్ని కదిలించకపోతే మిగతా ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నా కూడా వర్కౌట్ అవ్వదు.  
మీరు రాజమౌళి తో కంటిన్యూగా పని చేశారు కదా..ఇప్పుడు చేస్తున్న సినిమాకి గ్యాప్ రావడానికికారణం ఏమిటి?
-ఇప్పుడే కాదండి. గతంలో కూడా రాజమౌళి గారు నేను వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఉండేది. విక్రమార్కుడు, మర్యాద రామన్న నేను చేయలేదు. దీనికి షాక్ అవ్వాల్సిన అవసరం లేదు(నవ్వుతూ) తర్వాత మేము కలిసి పని చేస్తాం.  
రవిచంద్రన్ తో పనిచేయడం ఎలా అనిపించింది?
రవిచంద్రన్ గ్రేట్ యాక్టర్. ఆయన ఏజ్ లో ఆయనకున్న ఎనర్జీ చూస్తే  అన్ బిలియబుల్ అనిపిస్తుంది. ఆయనతో వర్క్ చేయడం రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్
జెనీలియా  క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
ఇందులో చాలా డిఫరెంట్ జెనీలియాని చూశారు. ఈ సినిమాలో ఆమె పాత్ర, పెర్ఫార్మన్స్ సరికొత్తగా ఉంటుంది. ఆడియన్స్ చాలా సర్ప్రైజ్ అవుతారు.
డైరెక్టర్ గారి గురించి ?
-డైరెక్టర్ రాధాకృష్ణ చాలా క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. ఆయనకు ఏం కావాలో చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన కథ చెప్పిన విధానం తీసిన విధానం నాకు చాలా నచ్చింది. డైరెక్టర్ కి క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఆ క్లారిటీ ఆయనలో ఉంది.
నిర్మాత సాయి  గురించి?
-ఒక కొత్త హీరోని ఎంత అద్భుతంగా లాంచ్ చేయాలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ చేశారు. ఒక మంచి సినిమా అందించాలనే పాషన్ తో పని చేశారు. చాలా అద్భుతమైనటువంటి టెక్నికల్ టీం ని ఎంపిక చేసుకున్నారు దేవిశ్రీప్రసాద్ గారి మ్యూజిక్, పీటర్ హెయిన్ లాంటి ఫైట్ మాస్టర్.. టెక్నికల్ గా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వారాహి ప్రొడక్షన్ లో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
మీకు దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?
-ఆలోచన అయితే ఉంది. అదే అయితే అది ఇప్పుడే కాదు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. కొన్ని కథల మీద వర్క్ చేయడం జరుగుతుంది.
మీ జర్నీని చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది?
-ఇండస్ట్రీ లోకి వచ్చి 25 ఏళ్ల అవుతుంది. ఈ 25 ఏళ్ళు మంచి సినిమాలు చేస్తున్నాం, చక్కగా పనిచేస్తున్నామనే పేరు తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. బాహుబలి, ఆర్ఆఆర్ లాంటి సినిమాలు చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
కొత్తగా చేస్తున్న సినిమాలు గురించి?
-స్వయంభు చేస్తున్నాను. అది బహుబలి లాంటి జోనరు. రాజులనాటి కథ. అలాగే ఇండియన్ హౌస్ సినిమా చేస్తున్నాను.

]]>
Sun, 13 Jul 2025 09:38:35 +0530 admin
వర్జిన్ బాయ్స్" చిత్రం సక్సెస్ మీట్ & https://prajakshethrenews.com/వర్జిన్-బాయ్స్-చిత్రం-సక్సెస్-మీట్ https://prajakshethrenews.com/వర్జిన్-బాయ్స్-చిత్రం-సక్సెస్-మీట్  "వర్జిన్ బాయ్స్" చిత్రం సక్సెస్ మీట్ -

పూల చొక్కా నవీన్, మరికొన్ని యూట్యూబ్ చానల్స్ పై కంప్లైంట్  
ప్రజా క్షేత్ర్, సినిమా :
రాజ్ గురు ఎంటర్టైన్మెంట్స్ గ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ దర్శకత్వంలో జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జర్నీఫర్, రోనిత్, అన్షుల, బబ్లు, కౌశల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయితే ఎంతో ప్రేక్షక ఆదరణతో ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమక్షంలో కేక్ కటింగ్ తో చిత్ర బృందం వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దారపునేని రాజా మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. మా వర్జిన్ బాయ్స్ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మాకు మొదటి నుండి సపోర్టుగా నిలిచిన మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిన్న సిటీలోని వేరు వేరు థియేటర్లకు వెళ్లినప్పుడు అక్కడ ప్రజాదరణ చూసి ఎంత సంతోషం వేసింది. అయితే ఇంత గొప్ప ఆదరణ పొందుతున్న సినిమాపై కొంతమంది మీడియా ముసుగులో విషం జల్లుతున్నారు. మేము థియేటర్లలో చూసినప్పుడు ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగా నచ్చిందో స్వయంగా అర్థమైంది. కానీ పూల చొక్కా నవీన్ లాంటివారు మా సినిమా నుండి డబ్బులు డిమాండ్ చేసి అవి ఇవ్వకపోయేప్పటికి మాపై పగ పట్టి మా సినిమాను ప్రేక్షకులలో నెగిటివ్ చేసేందుకుగాను వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కావాలని మా సినిమా ఇమేజ్ డామేజ్ చేసే విధంగా రివ్యూలు ఇస్తున్నారు. అలాగే మరికొందరు యూట్యూబ్ ఛానల్స్ సినిమా విడుదలకు ముందే సినిమాలపై నెగిటివ్గా రివ్యూలు ఇచ్చి ప్రేక్షకులను తప్పుదారి పట్టిస్తున్నారు. వారిపై ఇప్పటికే ఫిలిం చాంబర్లో కంప్లైంట్ చేశాము. లీగల్ గా కూడా వారిపై చర్యలు తీసుకుంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. దయచేసి ప్రేక్షకులు అటువంటి వాడి రివ్యూలను నమ్మి మోసపోకండి. మా చిత్ర బృందానికి పనిచేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అన్నారు.
దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ... "మా సినిమాను అన్ని విధాలుగా ఆదరించిన ప్రేక్షకులకు చాలా థాంక్స్. సినిమా టైటిల్ చూసి ఎలా ఉంటుందో అనుకున్నవారంతా థియేటర్లలో సినిమా చూశాక ఎంతగానో ఆదరించడం జరిగింది. ఈ సినిమా కోసం కష్టపడిన అందరికీ నా ధన్యవాదాలు. అలాగే మా సినిమాపై విషం జల్లడానికి ప్రయత్నిస్తున్న వారిపై తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాము. అలాగే నటీనటులపై అతను చేసిన కామెంట్లపై కచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాము. మా సినిమాను థియేటర్లో చూసి ప్రతి సీనుకు కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేసిన ప్రేక్షకుల ఆదరణను మేము నమ్ముతాము. సినిమా మరింత విజయం సాధించిపోతుంది" అన్నారు.
నటుడు గీతానంద్ మాట్లాడుతూ... "మా సినిమాను మంచి విజయం సాధిస్తూ ముందుకు వెళ్లడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. దానికి కారణమైన మీడియా వారికి, అలాగే చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. ఎంతో మంది కలిసి ఎంతో కాలం కష్టపడి ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము. అటువంటి సినిమాలు సపోర్ట్ చేసి ముందుకు తీసుకుని వెళ్లాలి. అంతేకానీ కొత్తవారు అంటూ సపోర్ట్ చేయకుండా ఉండకపోగా నెగిటివ్గా మాట్లాడటం అనేది తప్పు. నాది ఈ వర్జిన్ బాయ్స్ మూడో సినిమా. దయచేసి సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేయకండి" అన్నారు. నటుడు శ్రీహాన్ మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. ముందుగా మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు నేను మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొదటిసారి నన్ను నేను వెండితెరపై చూసుకోవడం నాకు చాలా సంతోషకరంగా అనిపించింది. మా సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడంతో పిల్లలను ఈ సినిమాకు దూరంగా ఉంచాలని కోరుకుంటున్నాను. అలాగే సినిమాను మరింత సపోర్ట్ చేసి ఇంకా విజయం సాధించేందుకు తోడ్పడాలని కోరుకుంటున్నాను" అంటూ ముగించారు.
ఆర్టిస్టులు : గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహన్, రోనీత్, జెన్నీఫర్, అన్షుల, సుజిత్ కుమార్, బబ్లు, అభిలాష్

]]>
Sun, 13 Jul 2025 09:34:21 +0530 admin
స్కై" సినిమా టీజర్ విడుదల https://prajakshethrenews.com/స్కై-సినిమా-టీజర్-విడుదల https://prajakshethrenews.com/స్కై-సినిమా-టీజర్-విడుదల  "స్కై" సినిమా టీజర్ విడుదల

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

ప్రజా క్షేత్ర్, సినిమా : 
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "స్కై". ఈ చిత్రాన్ని వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్ లో నాగి రెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు  "స్కై" సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ తో పాటు ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. మనీ ట్రాన్సాక్షన్ లో జరిగిన మిస్టేక్ హీరో హీరోయిన్స్ మధ్య ఒక బాండింగ్ కు ఎలా దారి తీసింది. హీరో విక్కీ తను అనుకున్న రెస్టారెంట్ బిజినెస్ లో సక్సెస్ అయ్యాడా లేదా అనేది టీజర్ లో ఆసక్తి కలిగించింది. హీరోయిన్ ప్రేమను హీరో విక్కీ ఎందుకు వద్దనుకున్నాడు, తన తండ్రికి సంబంధించి విక్కీకి ఉన్న గతమేంటి అనేది క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన జర్నీ ఆఫ్ ఎమోషనల్ "స్కై" తో పాటు లిరికల్ సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
నటీనటులు - మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ భారతి, రాకేశ్ మాస్టర్, ఎంఎస్, కేఎల్ కే మణి బమ్మ, తదితరులు

]]>
Sat, 12 Jul 2025 21:43:06 +0530 admin
'హరి హర వీరమల్లు' అసలు కథ ఇదేనా...! https://prajakshethrenews.com/హరి-హర-వీరమల్లు-అసలు-కథ-ఇదేనా https://prajakshethrenews.com/హరి-హర-వీరమల్లు-అసలు-కథ-ఇదేనా శివుడు, విష్ణువుల అవతారం ఈ 'వీరమల్లు'
'హరి హర వీరమల్లు' అసలు కథ ఇదేనా...!
ట్రైలర్ తో 'హరి హర వీరమల్లు' రైట్స్ కి పెరిగిన డిమాండ్

ప్రజా క్షేత్ర్, సినిమా : 
పవన్ కళ్యాణ్ నూతన చిత్రం 'హరి హర వీరమల్లు' తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా రూపొందించబడిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదు. ఈ చిత్రం నిజ జీవితంలోని ఏ ఒక్క నాయకుడి కథ ఆధారంగానూ తెరకెక్కలేదు. సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా ఇది తెరకెక్కింది.జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత 'హరి హర వీరమల్లు' కథ పూర్తిగా మారిపోయింది. దర్శకుడు కథలోని స్ఫూర్తిని, సారాన్ని అలాగే ఉంచుతూ.. సరికొత్త కథగా దీనిని మలిచారు.
పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామిని శివుడు-మోహినిల కుమారుడిగా, శైవం, వైష్ణవం మధ్య వారధిగా ఎలా వర్ణిస్తారో..  అలాగే 'హరి హర వీరమల్లు'ను శివుడు మరియు విష్ణువుల అవతారంగా చూడబోతున్నాం.
సరిగ్గా గమనిస్తే, హరి(విష్ణు) హర(శివుడు) అనే టైటిల్ ఈ చిత్ర సారాంశాన్ని తెలియజేస్తుంది. శివుడు, విష్ణువుల అవతారం 'వీరమల్లు' అని తెలిపేలా ఈ చిత్రంలో పలు అంశాలను గమనించవచ్చు. విష్ణువు వాహనం గరుడ పక్షిని సూచించే డేగను ఈ చిత్రంలో ఉపయోగించారు. అలాగే, కథానాయకుడు తన చేతుల్లో శివుడిని సూచించే డమరుకం పట్టుకున్నాడు. ఈ చిత్రంలో కథానాయకుడు ధర్మాన్ని రక్షించడానికి మరియు ధర్మం కోసం పోరాడటానికి శివుడు, విష్ణువుల యొక్క రూపంగా కనిపిస్తాడు.
'హరి హర వీరమల్లు' సినిమాను ఎ.ఎం. రత్నం అత్యధిక బడ్జెట్ తో భారీస్థాయిలో నిర్మించారు. భారీ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన ఎ.ఎం. రత్నం.. గతంలో కూడా ఇలా అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలతో ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. 'హరి హర వీరమల్లు'పై కూడా ఆయన ఎంతో నమ్మకంతో ఉన్నారు. అందుకే ఓవర్సీస్, హిందీ తప్ప సినిమాకి సంబంధించిన మిగతా హక్కులను అమ్మడానికి ఎ.ఎం. రత్నం సిద్ధమవ్వలేదు.
అసలే పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా, దానికితోడు సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో 'హరి హర వీరమల్లు'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరినీ విశేషంగా ఆకట్టుకొని.. అంచనాలను రెట్టింపు చేసింది. దాంతో ఈ చిత్ర హక్కులను దక్కించుకోవడానికి తీవ్ర పోటీ నెలకొంది. ఎందరో పంపిణీదారులు ఇప్పటికే నిర్మాతను సంప్రదించారు. భారీ మొత్తాన్ని చెల్లించి, హక్కులను పొందేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. సినిమాని భారీస్థాయిలో రూపొందిస్తే.. హక్కుల రూపంలో ఉత్తమ ధరలను పొందగలమని నిర్మాతలు నమ్మారు. అందుకే ఎక్కడా రాజీ పడకుండా 'హరి హర వీరమల్లు'ను అత్యంత భారీస్థాయిలో నిర్మించారు. నిర్మాతల నమ్మకం నిజమై.. చిత్ర పంపిణీ హక్కులు భారీ ధర పలుకుతున్నాయి. ప్రేక్షకులు కూడా వెండితెరపై ఈ చిత్రాన్ని చూసి అనుభూతి పొందటం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
'హరి హర వీరమల్లు' చిత్రం జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి.
దర్శకత్వం: జ్యోతి కృష్ణ , క్రిష్ జాగర్లమూడి,

]]>
Tue, 08 Jul 2025 23:23:30 +0530 admin
'3 BHK'కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : హీరో సిద్దార్థ్ https://prajakshethrenews.com/3-bhkకి-వచ్చిన-అద్భుతమైన-రెస్పాన్స్-చాలా-ఆనందాన్ని-ఇచ్చింది-హీరో-సిద్దార్థ్ https://prajakshethrenews.com/3-bhkకి-వచ్చిన-అద్భుతమైన-రెస్పాన్స్-చాలా-ఆనందాన్ని-ఇచ్చింది-హీరో-సిద్దార్థ్ '3 BHK'కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.

ఇంత క్రౌడ్ చూడడం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్.

సినిమాని గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్ యూ: 3 BHK థాంక్ యూ మీట్ లో హీరో సిద్ధార్థ్

ప్రజా క్షేత్ర్, సినిమా : 
హీరో సిద్ధార్థ్ లేటెస్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ '3 BHK'.  గణేష్ దర్శకత్వం వహించారు. శరత్ కుమార్ , దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన చిత్రం జూలై 4న విడుదలై ఘన విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ ని నిర్వహించారు. థాంక్ యూ మీట్ లో హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రేక్షకులకు చేరిందంటే దానికి కారణం మీడియా ముందుగా మీడియా వారందరికీ థాంక్యూ. ఒక స్వీట్ ఫిల్మ్ ని ఆడియన్స్ దగ్గరికి చేరవేశారు. ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఒక క్లాసిక్ సినిమాకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఈ సినిమాకి ఉన్నాయి. ఈ సినిమాలో పార్ట్ కావడం గర్వంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో స్క్రిప్టు చదివిన వెంటనే మా నాన్నని కౌగిలించుకున్నాను అని చెప్పాను. తర్వాత ఇందులో ఉండే ఎలిమెంట్స్ అన్ని రిలేట్ చేసుకునేలాగా ఉంటాయని అన్నాను. ఆ రెండిటిని ఆడియన్స్ ఈరోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఈ కథ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా చూసిన అందరూ కూడా చాలా అద్భుతంగా ఉందని మెసేజ్లు పెడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో ప్రతి కొడుకు థియేటర్ కి వెళ్లి తండ్రిని చూడగలుగుతున్నాడు. ప్రతి తండ్రి కొడుకుని చూడగలుగుతున్నాడు. ఒక కామన్ మ్యాన్ కథ చెప్పడం నాకు. గెలుపు మన దగ్గరికి వచ్చేటప్పుడు ఆ సంతృప్తి వేరు. అలాంటి ఆనందాన్ని డైరెక్టర్  గణేష్ ఈ సినిమాలో చూపించాడు. ఈ సినిమాలో ప్రభు క్యారెక్టర్ లాగే నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను.  ప్రభు పాత్ర చాలా విషయాలు నాకు చాలా విషయాలు నేర్పింది.  ఓడిపోవడం పర్మినెంట్ కాదని డైరెక్టర్ ఈ సినిమాతో చాలా అద్భుతంగా చూపించాడు. అరుణ్ విశ్వా చాలా మంచి కంటెంట్ ని సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్. వారితో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. గణేష్ రైటింగ్ అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ గా చాలా క్లియర్ విజన్ తో ఉంటాడు. ఈ సినిమాకి రెండో రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది.  మేము ఏపీ తెలంగాణలో థియేటర్స్ విజిట్ చేయబోతున్నాం. ఫస్ట్ వీక్ తర్వాత ఇంత క్రౌడ్ చూడడం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాని రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ కి చాలా థాంక్స్. ఈ సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్ట్ కి నేను రుణపడి ఉన్నాను. శరత్ కుమార్  దేవయాని ఈ సినిమా చేయకపోతే ఇంత అందంగా వచ్చేది కాదు. ప్రతి ఇంట్లో ఉండే తల్లిదండ్రులని వాళ్ళు మా కళ్ళ ముందుకు తీసుకువచ్చారు. మితా చెల్లెలు క్యారెక్టర్ కి ప్రాణం పోసింది. చైత్ర నాలుగు సీన్స్ చేసి బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు తీసుకుంది (నవ్వుతూ) అమృత్ రామ్నాథ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ ఆల్బమ్ మెమొరబుల్ గా ఉండిపోతుంది. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాకి ఎంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’అన్నారు
యాక్ట్రెస్ దేవయాని మాట్లాడుతూ...అందరికి నమస్కారం. ఈ సినిమాకి అద్భుతంగా సపోర్ట్ చేసిన మీడియా వారికి ధన్యవాదాలు. చాలా గొప్ప రివ్యూస్ వచ్చాయి. సినిమాని మరో లెవల్ కి తీసుకువెళ్లారు. మంచి సినిమాని తీయడం ఒక ఎత్తు ఆ సినిమాని జనాల దగ్గరికి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఈ విషయంలో మీడియా వారందరికీ కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మీరందరూ మా గృహప్రవేశానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది (నవ్వుతూ) విశ్వ గారు ఎక్సలెంట్ ప్రొడ్యూసర్. గణేష్ అద్భుతమైన ఫ్యామిలీ సినిమా ఇచ్చాడు. మా అబ్బాయి సిద్ధార్థ ఎక్సలెంట్ పర్ఫార్మర్. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఈ సినిమాతో మా అబ్బాయి సిద్ధార్థ వచ్చాడు నవ్వుతూ. ప్రభు పాత్రలో ఒదిగిపోయాడు. సినిమాకి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ'అన్నారు.
యాక్ట్రెస్ చైత్ర మాట్లాడుతూ. అందరికీ నమస్కారం. సినిమా చూసిన అందరికీ థాంక్యు. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఉందని చెప్పారు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సిద్ధార్థ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ టీంలో అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ'అన్నారు
డైరెక్టర్ గణేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీడియా నుంచి చాలా అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. రివ్యూలు చదివినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా గొప్పగా కనెక్ట్ అయింది. నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం .రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్  ఇలా అందరూ దర్శకులు వర్క్ నాకు ఇష్టం. వాళ్ళందరి నుంచి నేను స్ఫూర్తిని పొందాను. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా టీమ్ అందరికీ థాంక్యూ .చంద్రబోస్  అద్భుతమైన పాట ఇచ్చారు. రాకేందు మౌళి తెలుగులో చాలా అద్భుతమైన మాటలు రాశారు. మైత్రి మూవీ మేకర్స్ కి థాంక్యూ. సినిమాని చాలా గొప్పగా రిలీజ్ చేశారు. సినిమా గ్రాండ్ గా రీచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. నాకు జెర్సీ సినిమా చాలా ఇన్స్పైర్ చేసింది. ఈ సందర్భంగా నాని కి డైరెక్టర్ గారికి థాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ రామ్నాథ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ తెలుగు తమిళ్ సినిమా. ఇంత గొప్ప సినిమాతో కెరీర్ ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో పాటలు చాలా ఎమోషనల్ కనెక్షన్స్ తో ఉంటాయి. ముఖ్యంగా తెలుగు సాహిత్యంతో పాట విన్నప్పుడు ఒక సోల్ ఫుల్ కనెక్షన్ వచ్చింది. ఆ బ్యూటీ తెలుగులో వుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి థాంక్యూ. ఈ సినిమా నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్యూ. సినిమాకి ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ'అన్నారు.
నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమా రిలీజ్ అయి అయిదో రోజు ఇది. తమిళ్ తెలుగులో చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. తెలుగులో ఇంకా అద్భుతంగా పిక్ అప్ అవుతుంది. సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ కి చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి సినిమాని నిర్మించినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగు నుంచి చాలా అద్భుతమైన మెసేజ్లు వస్తున్నాయి. అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. ఈ సినిమాల్లో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సిద్ధార్థ తో నాకు చాలా స్పెషల్ బాండింగ్ ఉంది. మేము భవిష్యత్తులో కలిసి ఇంకెన్నో సినిమాలు చేయాలనుకుంటున్నాము. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'అన్నారు.

]]>
Tue, 08 Jul 2025 23:19:42 +0530 admin
రాంచరణ్ కి అయ్యప్ప స్వామి అంటే భక్తి.,.నాకు సాయి బాబా పట్ల విశ్వాసం https://prajakshethrenews.com/రాంచరణ్-కి-అయ్యప్ప-స్వామి-అంటే-భక్తినాకు-సాయి-బాబా-పట్ల-విశ్వాసం https://prajakshethrenews.com/రాంచరణ్-కి-అయ్యప్ప-స్వామి-అంటే-భక్తినాకు-సాయి-బాబా-పట్ల-విశ్వాసం రాంచరణ్ కి అయ్యప్ప స్వామి అంటే భక్తి.,.నాకు సాయి బాబా పట్ల విశ్వాసం

సాయి బాబా వ్రతం నా జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చింది.: ఉపాసనా కామినేని కొణిదెల

ప్రజా క్షేత్ర్, సినిమా :
ఉపాసనా కామినేని కొణిదెల ఆధ్యాత్మికతపై గొప్ప నమ్మకంతో ఉంటారు. తాజాగా ఆమె ఒక వీడియోలో తన సాయి బాబా మీద ఉన్న భక్తిని గురించి చెప్పారు. ముఖ్యంగా సాయి బాబా వ్రతం, దానివల్ల తన జీవితంలో ఎలా మార్పులు వచ్చాయో ఆమె తన అనుభవాలతో చెప్పారు. అత్తమ్మ కిచెన్ పుస్తకంలో ఉన్న శ్లోకాలు చదువుతూ తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. 'ప్రతి ఒక్కరికీ ఇష్టదైవం వుంటుంది. నా భర్తకి అయ్యప్ప స్వామి అంటే భక్తి. నాకు సాయి బాబా పట్ల విశ్వాసం. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో తాతయ్య, అమ్మమ్మలు, అమ్మా నాన్నలంతా దేవుడి మీద ఎంతో భక్తితో ఉండేవాళ్లు. వాళ్లని చూసి నాకూ ఆ విశ్వాసం బలంగా పెరిగింది. ఒకసారి జీవితంలో కష్టంగా ఉన్న సమయంలో, ఏటూ తేల్చుకోలేని పరిస్థితి వున్నప్పుడు ఒక్కసారి సాయి బాబా వ్రతం ఆచరించమని వారు చెప్పారు. ఆ కథ చదవటం మొదలుపెట్టిన తర్వాతే మార్పులు మొదలయ్యాయి” అని చెప్పారు ఉపాసన.“నేను మెల్లిగా పాజిటివ్‌గా మారాను. నా చుట్టూ ఉన్న వాళ్లు కూడా హాయిగా మారిపోయారు. ఇవి చిన్నచిన్న మార్పుల్లా కనిపించినా, వ్యక్తిత్వంగా చాలా గొప్ప మార్పులు వచ్చాయి. అందుకే ఈ వ్రతంపై చాలా విశ్వాసం వుంది.  జీవితంలో ఏదైనా అడ్డు ఎదురైతే, ఏదీ సరిగా జరగకపోతే, వ్రతం లాంటి ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రయత్నించొచ్చు. ఎందుకంటే ఈ లోకంలో ఏ మందు చేయని పని, విశ్వాసం చేస్తుంది' అన్నారు. స్పిరిచ్యువాలిటీని అలావాటు చేసుకోవడం వల్ల మనిషిలో గొప్ప మార్పులు వస్తాయి. ఉపవాసాలు, వ్రతాలు మన మనసును శుభ్రం చేస్తాయి. నిజమైన నమ్మకంతో చేస్తే జీవితంలో మార్పులు వస్తాయని ఉపాసన షేర్ చేసిన వీడియో ఆధ్యాత్మికత పట్ల గొప్ప స్ఫూర్తిని ఇస్తోంది.

]]>
Tue, 08 Jul 2025 20:26:49 +0530 admin
విజయవాడలో ‘కన్నప్ప’ ప్రత్యేక ప్రదర్శన https://prajakshethrenews.com/విజయవాడలో-కన్నప్ప-ప్రత్యేక-ప్రదర్శన https://prajakshethrenews.com/విజయవాడలో-కన్నప్ప-ప్రత్యేక-ప్రదర్శన విజయవాడలో ‘కన్నప్ప’ ప్రత్యేక ప్రదర్శన

అఘోరాలు , సాధువులు, నాగ సాధువులతో పాటుగా వీక్షించిన డా. ఎం. మోహన్ బాబు
ప్రజా క్షేత్ర్, సినిమా : 
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’కి మంచి రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. జూన్ 27న విడుదలైన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. డివోషనల్ బ్లాక్ బస్టర్‌గా ఈ చిత్రం ఇప్పటికీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో మంగళవారం విజయవాడలో ప్రఖ్యాత గజల్ గాయకుడు, సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ కన్నప్ప చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ స్పెషల్ షోని డా.ఎం. మోహన్ బాబుతో పాటుగా నాగ సాధువులు, అఘోరాలు వీక్షించారు. అనంతరం.. *డా. ఎం. మోహన్ బాబు మాట్లాడుతూ* .. ‘‘కన్నప్ప’ సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు. ప్రతీ చోటా కన్నప్పకి మంచి స్పందన వస్తోంది. విష్ణు నటనను అందరూ కొనియాడుతున్నారు. ఇక ఈ రోజు ఇలా విజయవాడలో సోదరుడు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో షోను నిర్వహించారు. నాగ సాధువులు, సాధువులు, యోగినిలు, అఘోరాలతో కలిసి మరోసారి సినిమాను వీక్షించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
*గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ* .. ‘‘కన్నప్ప’ను వెండితెరపైకి మళ్లీ తీసుకు రావడం ఓ గొప్ప నిర్ణయం. చిత్రం అద్భుతంగా ఉంది. విష్ణు నటన కన్నుల విందుగా అనిపించింది. కన్నప్ప జీవితాన్ని మరోసారి ఇంత అద్భుతంగా తీసిన నిర్మాత మోహన్ బాబుకి ధన్యవాదాలు. సినిమా ఆద్యంతం రోమాంచితంగా ఉంది. సంపూర్ణమైన భక్తి రస చిత్రంగా తీసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. అక్షయ్ కుమార్ , ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్ , శరత్ కుమార్, విష్ణు నటన అందరినీ కదిలించింది. ఈ రోజు నాగ సాధవులు, సాధువులు, మాతాజీలు, యోగినీలు ఎంతో మంది సినిమాను చూసి ఆనందిస్తున్నారు’ అని అన్నారు.

]]>
Tue, 08 Jul 2025 20:21:50 +0530 admin
జూలై 31న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' విడుదల https://prajakshethrenews.com/జూలై-31న-విజయ్-దేవరకొండ-కింగ్డమ్-విడుదల https://prajakshethrenews.com/జూలై-31న-విజయ్-దేవరకొండ-కింగ్డమ్-విడుదల జూలై 31న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' విడుదల
అదిరిపోయే యాక్షన్ ప్రోమోతో కొత్త విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం

ప్రజా క్షేత్ర్, సినిమా :
తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్
సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, 'హృదయం లోపల' గీతం విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘కింగ్‌డమ్’ విడుదల కోసం విజయ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు.‘కింగ్‌డమ్’ చిత్రం జూలై 31, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. యాక్షన్, హీరోయిజం, డ్రామాల సమ్మేళనంగా శక్తివంతమైన చిత్రంగా ‘కింగ్‌డమ్’ రూపుదిద్దుకుంటోంది. ప్రోమోలో యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగాలు, విజువల్స్ కట్టిపడేశాయి. మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సినిమాటిక్ దృశ్యాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నట్లు ఈ ప్రోమో హామీ ఇస్తోంది. ఈ అద్భుతమైన చిత్రాన్ని వెండితెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు కొత్త విడుదల తేదీ ప్రకటన ఎంతో ఉపశమనాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. అభిమానుల అంచనాలకు మించే చిత్రాన్ని అందించాలనే ఏకైక లక్ష్యంతో 'కింగ్‌డమ్' కోసం చిత్ర బృందం అదనపు సమయాన్ని కేటాయిస్తోంది.
కొత్త విడుదల తేదీ ప్రకటన సందర్భంగా నిర్మాతలు స్పందిస్తూ.. "కింగ్‌డమ్ కేవలం సినిమా కాదు.. ఇది మేము ఎంతో మక్కువతో నిర్మించిన ఒక గొప్ప ప్రపంచం. ప్రతి ఫ్రేమ్ మరపురానిదిగా ఉండాలని మేము కోరుకున్నాము. జూలై 31న ఈ చిత్రం బాక్సాఫీస్ తుఫానుకు నాంది పలుకుతుంది." అన్నారు. కింగ్‌డమ్ రిలీజ్ డేట్ ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అద్భుతమైన విజువల్స్, సంగీతంతో రూపొందిన ఈ ప్రోమో అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి 'కింగ్‌డమ్' కోసం అద్భుతమైన కథను ఎంచుకున్నారు. ఆ అద్భుతమైన కథను, అంతే అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు.'కింగ్‌డమ్' చిత్రానికి ప్రతిభగల సాంకేతిక బృందం పని చేస్తోంది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో ఉండనుంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న 'కింగ్‌డమ్' చిత్రం.. ప్రేక్షకులను మునుపెన్నడూ చూడని గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించనుందని నిర్మాతలు హామీ ఇచ్చారు.
తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే

]]>
Tue, 08 Jul 2025 09:37:21 +0530 admin
'మారెమ్మ'& పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ https://prajakshethrenews.com/మారెమ్మ-పవర్-ఫుల్-ఫస్ట్-లుక్-రిలీజ్ https://prajakshethrenews.com/మారెమ్మ-పవర్-ఫుల్-ఫస్ట్-లుక్-రిలీజ్

మాధవ్, మంచాల నాగరాజ్, మయూర్ రెడ్డి బండారు, మోక్ష ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 టైటిల్ 'మారెమ్మ'- పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రజా క్షేత్ర్, సినిమా :
మాస్ మహారాజా రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కుమారుడు యంగ్ చాప్ మాధవ్ రూరల్ రస్టిక్ మూవీ 'మారెమ్మ'తో హీరోగా సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ హై-ఆక్టేన్ ప్రాజెక్ట్‌ను మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు తమ ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మిస్తున్నారు. ఈరోజు మేకర్స్ ఈ చిత్రం ఇంపాక్ట్ ఫుల్ టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ రెండింటినీ రిలీజ్ చేశారు. ఇది పవర్ ఫుల్ రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా ఉంటుందని హామీ ఇస్తోంది. ఫస్ట్ లుక్ మాధవ్‌ను రూరల్ అవతార్‌లో పరిచయం చేస్తుంది. చెక్డ్ షర్ట్, లుంగీ ధరించి, మెడలో క్యాజువల్‌గా చుట్టుకున్న టవల్‌తో, మాధవ్ రగ్గడ్ రూరల్ హీరోగా కనిపించారు. అతని చెదిరిన జుట్టు, గడ్డం ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాయి. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఉంచబడిన ఒక గేదె, బలం, ఆధిపత్యాన్ని సూచిస్తుంది. మాధవ్ పొడవాటి కర్రను పట్టుకుని ఏదైనా సవాలును ఎదుర్కోవడానికి సిద్ధం గా వున్నట్లు కనిపించారు. పోస్టర్, టైటిల్ అదిరిపోయాయి.మాధవ్‌ను ఫెరోషియస్ రగ్గడ్ పాత్రలో ప్రజెంట్ చేయడానికి మంచాల నాగరాజ్ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రాశారు. మాధవ్ తన తొలి పాత్ర కోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి,  వి.ఎస్.రూప లక్ష్మి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో మాధవ్ సరసన దీపా బాలు కథానాయిక గా నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. దేవ్ రాథోడ్ ఎడిటర్, రాజ్‌కుమార్ మురుగేశన్ ఆర్ట్ డైరెక్టర్. తారాగణం: మాధవ్, దీపా బాలు, వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, V.S.రూపా లక్ష్మి

]]>
Tue, 08 Jul 2025 09:32:13 +0530 admin
ఈ నెల 11వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న 'శారీ' https://prajakshethrenews.com/ఈ-నెల-11వ-తేదీ-నుంచి-ఆహా-ఓటీటీలో-స్ట్రీమింగ్-కు-వస్తున్న-శారీ https://prajakshethrenews.com/ఈ-నెల-11వ-తేదీ-నుంచి-ఆహా-ఓటీటీలో-స్ట్రీమింగ్-కు-వస్తున్న-శారీ 11ఈ నెల 11వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న రామ్ గోపాల్ వర్మ సినిమా 'శారీ'
ప్రజా క్షేత్ర్, సినిమా : 
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కథను అందించి నిర్మించిన సినిమా 'శారీ' ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా ఈ నెల 11వ తేదీ నుంచి ఆహాలో ప్రీమియర్ కానుంది. ఇంటెన్స్ సైకలాజికల్
థ్రిల్లర్ గా దర్శకుడు గిరి కృష్ణ కమల్ రూపొందించిన ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై రవిశంకర్ వర్మ నిర్మించారు.'శారీ' సినిమా ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు ఆహాలో మరింతగా ప్రేక్షకులకు రీచ్ కానుందీ మూవీ. యదార్థ ఘటనల స్ఫూర్తితో 'శారీ' సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సాహిల్ సంభవ్, అప్పాజీ అంబరీష్, కల్పలత, తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

]]>
Tue, 08 Jul 2025 09:22:39 +0530 admin
మహేష్ బాబుకు మళ్ళీ నోటీసులు https://prajakshethrenews.com/మహేష్-బాబుకు-మళ్ళీ-నోటీసులు https://prajakshethrenews.com/మహేష్-బాబుకు-మళ్ళీ-నోటీసులు మహేష్ బాబుకు మళ్ళీ నోటీసులు

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూలై 7 :
సాయి సూర్య డెవలపర్స్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు  ఒక కమర్షియల్ యాడ్ చేశారు. హీరోలు యాడ్స్ చేయడం మామూలే.‌ అందుకు గాను వాళ్లకు కోట్ల రూపాయల పారితోషికం లభిస్తుంది.‌ యాడ్స్ వల్ల హీరోలకు లాభం అనుకుంటే పొరపాటే. అప్పుడప్పుడు కేసుల్లో కూడా వాళ్ల పేర్లు రావచ్చు. సాయి సూర్య డెవలపర్స్ స్టార్ట్ చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం మహేష్ చేసిన యాడ్ ఆయన పేరు కేసుల్లో రావడానికి కారణమైంది.సాయి సూర్య డెవలపర్స్, అలాగే సురానా గ్రూప్ కంపెనీలలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి దాంతో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌) విచారణ చేపట్టింది.‌ ఆ కంపెనీ యాడ్ చేసిన మహేష్ బాబును విచారణకు రావాల్సిందిగా ఏప్రిల్ నెలలో నోటీసులు ఇచ్చింది.సాయి సూర్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ వెంచర్ కేసులో తాజాగా రంగారెడ్డి కన్జ్యూమర్ కమిషన్ నుంచి మహేష్ బాబుకు నోటీసులు వచ్చాయి. ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా వెంచర్ స్టార్ట్ చేశారని, డబ్బులు కట్టిన వినియోగదారులకు స్థలాలు ఇంకా ఇవ్వలేదని సమాచారం. స్థలాలకు బదులు తాము కట్టిన డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాలని కస్టమర్లు కోరగా అది కూడా సాయి సూర్య డెవలపర్స్ చేయలేదు దాంతో రంగారెడ్డి కన్జ్యూమర్ కమిషన్ ను వాళ్ళు ఆశ్రయించారు. ఫిర్యాదులో మహేష్ బాబును మూడో ప్రతివాదిగా పేర్కొన్నారు. యాడ్ చేయడమే అందుకు కారణం.సాయి సూర్య డెవలపర్స్ యాడ్ చేసినందుకు మహేష్ బాబు ఐదు కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం.‌ అందులో మూడున్నర కోట్ల రూపాయలు నగదు రూపంలో, రెండున్నర కోట్ల రూపాయలను ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకున్నారట. సినిమాల విషయానికి వస్తే... దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా SSMB29 మహేష్ చేస్తున్న సంగతి తెలిసిందే.

]]>
Mon, 07 Jul 2025 11:10:55 +0530 admin
తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు త్వరగా పెట్టాలి : నిర్మాతలు https://prajakshethrenews.com/తెలుగు-ఫిలింఛాంబర్-ఆఫ్-కామర్స్-ఎన్నికలు-త్వరగా-పెట్టాలి-నిర్మాతలు https://prajakshethrenews.com/తెలుగు-ఫిలింఛాంబర్-ఆఫ్-కామర్స్-ఎన్నికలు-త్వరగా-పెట్టాలి-నిర్మాతలు కొందరు స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుపడుతున్నారు

నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపాలి
 - నిర్మాతలు

ప్రజా క్షేత్ర్, సినిమా :
తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలను వాయిదా వేసేందుకు కొందరు తమ స్వార్థంతో ప్రయత్నిస్తున్నారని అసోసియేషన్ లోని పలువురు నిర్మాతలు ఆరోపించారు. తెలుగు ఫిలింఛాంబర్ మాజీ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు ఫిలింఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ మాజీ చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్, తెలుగు ఫిలింఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ ఈసీ మెంబర్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ జూలైతో ప్రస్తుత బాడీ గడువు ముగుస్తున్నందున వెంటనే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఈ రోజు తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు బసిరెడ్డి కార్యాలయంలో సమావేశమైన నిర్మాతలు ఏకగ్రీవంగా తీర్మానించారు. అసోసియేషన్ నిబంధనల ప్రకారం రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరపాలని, అయితే ఇప్పుడున్న వారినే కంటిన్యూ చేయాలని కొందరు తమ సొంత ఎజెండా పెట్టుకుని ప్రతిపాదించడం సరికాదని అన్నారు. ఇప్పుడున్న బాడీనే కొనసాగుతుందని కొందరు మీడియాల్లో దిగజారుడు ప్రచారం చేస్తున్నారని నిర్మాతలు అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపాలని, ఎన్నికలు అడ్డుకోవాలని చూసేవారి ఆటలు సాగవని  నిర్మాతలు హెచ్చరించారు. ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటలకు నిర్మాతలు బసిరెడ్డి, డా.ప్రతాని రామకృష్ణ గౌడ్  ఆధ్వర్యంలో నిర్మాతలందరూ కలసి తెలుగు ఫిలింఛాంబర్ కు మెమొరాండం సమర్పించనున్నారు. మెమోరాండం సమర్పించిన తరువాత. మీడియా సమావేశం ఉంటుంది. కాబట్టి నిర్మాతలంతా ఈ మెమొరాండం సమర్పణ కార్యక్రమం మరియు ప్రెస్ మీట్ లో పాల్గొనాలని ఈరోజు సమావేశమైన నిర్మాతలు కోరారు.  ఈ సమావేశంలో నిర్మాతలు రమేష్ నాయుడు, లయన్ సాయి వెంకట్, కె. సురేష్ బాబు, బోడపాటి మురళి, రవీంద్ర గోపాల్ జి.సుదర్శన్ రావు, గురురాజ్, వింజమూరి మధు, శంకర్ గౌడ్, భానూరు నాగరాజు, బండారు అమర్, పి ఎల్ కె.రెడ్డి,  రంగా రవీంద్ర గుప్త (బుల్లెట్ రవి),  మున్నవర్ అలీ, మిత్తాన ఈశ్వర్,RVN వరప్రసాద్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు

]]>
Sat, 05 Jul 2025 22:40:23 +0530 admin
' ఓ భామ అయ్యో రామ' ట్రైలర్‌ విడుదల https://prajakshethrenews.com/ఓ-భామ-అయ్యో-రామ-ట్రైలర్-విడుదల https://prajakshethrenews.com/ఓ-భామ-అయ్యో-రామ-ట్రైలర్-విడుదల హీరో సుహాస్‌  ' ఓ భామ అయ్యో రామ' ట్రైలర్‌ విడుదల
ప్రజా క్షేత్ర్,, సినిమా : 
సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న  నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో  కథానాయికగా పరిచయమవుతోంది.  రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్‌ రిలీజ్‌ కానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్‌. ట్రైలర్‌ను గమనిస్తే.. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌, హీరో, హీరోయిన్స్‌ ఎనర్జీ, ఇలా ఈతరం ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారిని అలరించే ఫుల్‌ ప్యాకేజీగా ఈ చిత్రాన్ని రూపొందించారని అర్థమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ '' ట్రైలర్‌ విడుదలైన కొద్ది సమయంలోనే మంచి స్పందన వస్తోంది. ట్రైలర్‌ చూసిన వారు ఈచిత్రం షూర్‌ షాట్‌ విజయం అంటుంటే ఆనందంగా ఉంది. క్యూట్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రత సన్నివేశం ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తుంది. హీరో సుహాస్‌, మాళవిక మధ్య వచ్చే లవ్‌ సీన్స్‌ కూడా అలరించే విధంగా ఉంటాయి. సుహాస్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం అందరికి కొత్త అనుభూతినిస్తుంది. జూలై 11న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. పూర్తి ఎంటర్‌టైనింగ్‌గా రాబోతున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మీ హృదయాలను దోచుకుంటుంది. తప్పకుండా నిర్మాతగా ఓ మంచి సినిమాను ఇవ్వబోతున్నాం అనే నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ  ఇటీవల విడుదలైన ప్రతి ప్రమోషన్‌ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఓ క్వాలిటీ సినిమాను ప్రేక్షకులకు ఇవ్వడానికి ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా  నిర్మాత హరీష్‌ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించాడు.  ప్రొడక్ట్‌ క్వాలిటీగా రావడానికి ఆయనే కారణం. మణికందన్‌ ఫోటోగ్రఫీతో ఈ సినిమాను చాలా కలర్‌ఫుల్‌గా మలిచాడు.రథన్‌ ఈ లవ్‌స్టోరీకి చాలా మంచి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో ఉన్న ఆరుపాటలు వేటికవే అనే విధంగా బ్యూటిఫుల్‌గా ఉంటాయి అన్నారు. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్  అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. మణికందన్‌ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రానికి రథన్‌ సంగీతాన్నిసమాకూరుస్తున్నాడు. బ్రహ్మా కడలి ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు

]]>
Sat, 05 Jul 2025 17:08:21 +0530 admin
ఈడీ విచారణకు అల్లు అరవింద్ https://prajakshethrenews.com/ఈడీ-విచారణకు-అల్లు-అరవింద్ https://prajakshethrenews.com/ఈడీ-విచారణకు-అల్లు-అరవింద్  ఈడీ విచారణకు అల్లు అరవింద్
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్, జులై 4 :
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు  ప్రశ్నించారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్కామ్‌లో   అరవింద్‌ను మూడు గంటలపాటు విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేశారు. 2018-2019లో జరిగిన బ్యాంక్ స్కామ్‌లో ఈడీ విచారణను కొనసాగిస్తోంది. ఇందులో మనీలాండరింగ్ కోణం ఉందని భావించిన ఈడీ.. ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణను చేపట్టింది. గతంలో బ్యాంక్‌కు సంబంధించి అవకతవకలు జరిగాయన్న అభియోగాలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతోంది ఈడీ. ఇప్పటికే అల్లు అరవింద్‌ను విచారించిన అధికారులు.. బ్యాంక్ లావాదేవీలు, ఆస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే వారం మరోసారి విచారణకు రావాలని నిర్మాతను ఈడీ అధికారులు ఆదేశించారు.2024లో హైదరాబాద్, కర్నూలు, ఘజియాబాద్‌లోని వివిధ ప్రదేశాలలో సోదాలు చేసిన ఈడీ.. రూ.1.45 కోట్లను సీజ్ చేసింది. నిందితులు రూ.101.48 కోట్ల రుణ నిధులను మోసపూరితంగా మళ్లించారన్న ఆరోపణలకు సంబంధించి ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో అకౌంట్ హోల్డర్స్‌గా ఉన్న వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారు. ప్రధానంగా బ్యాంక్ యాజమాన్యం ఎలాంటి నిబంధనలు పాటించకుండా, ఆర్‌బీఐ నిబంధనలు ఉల్లంఘించి రూ.100 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగాలపై ఈడీ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు.

]]>
Fri, 04 Jul 2025 21:37:50 +0530 admin
పోలీస్ వారి హెచ్చరిక " టీజర్ ను ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు https://prajakshethrenews.com/పోలీస్-వారి-హెచ్చరిక-టీజర్-ను-ఆవిష్కరించిన-హీరో-సుధీర్-బాబు https://prajakshethrenews.com/పోలీస్-వారి-హెచ్చరిక-టీజర్-ను-ఆవిష్కరించిన-హీరో-సుధీర్-బాబు పోలీస్ వారి హెచ్చరిక " టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు
ప్రజా క్షేత్ర్, సినిమా :
అభ్యుదయ  దర్శకుడు  బాబ్జీ దర్శకత్వంలో  బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా  తనిష్క్ క్రియేషన్స్  పతాకంలో రూపొందిన " పోలీస్ వారి హెచ్చరిక"  టీజర్ ను తన కార్యాలయంలో  సుధీర్ బాబు ఆవిష్కరించారు. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేయగా గజ్వేల్ వేణు  ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. కాగా నేడు నవ దళపతి సుధీర్ బాబు చేతుల మీదగా ఈ చిత్ర టీజర్ విడుదల కావడం జరిగింది. ఈ సందర్భంగా నవ దళపతి సుధీర్ బాబు మాట్లాడుతూ... "దర్శకుడు బాబ్జీ మా మామగారైన  సూపర్ స్టార్ కృష్ణ  కి బాగా దగ్గరివాడు. దేశ వ్యాప్తంగా ఉన్న  కృష్ణ  అభిమానులందరికీ  సుపరిచితుడు. అటువంటి బాబ్జీ  దర్శకత్వం లో రూపొందిన  ఈ చిత్రం టీజర్ ను  నా చేతుల  మీదుగా ఆవిష్కరించడం  నాకు  సంతోషాన్ని  కలిగిస్తుంది. టీజర్  అంటే  రక రకాల  వ్యాపకాలతో, రకరకాల మూడ్స్ తో  ఉండే  ప్రేక్షకులనుచిటిక  వేసి  మనవైపుకు తిప్పుకునే  అస్త్రం. "పోలీస్ వారి హెచ్చరిక" అలా ఒక అస్త్రంలా  ఆకర్షణీయంగా, రిచ్ గా ఉంది" అన్నారు. దర్శకుడు బాబ్జీ  మాట్లాడుతూ... "నేను ఏ  సినిమా చేసినా  ఆ సినిమా  తాలూకు  ఏదో ఒక కార్యక్రమాన్ని  కృష్ణ  చేతుల మీదుగా  జరుపుకునే వాడిని, ప్రస్తుతం  కృష్ణ  భౌతికంగా  మన మధ్య లేకపోవడం తో ఈ సినిమా కు సంబంధించిన ఒక్క కార్యక్రమం కూడా ఆయన చేతుల మీదుగా  జరుపుకోలేక పోయాననే  లోటు  ఇలా సుధీర్ బాబు  ఈ టీజర్ ను  విడుదల చేయడం తో తీరిందని" అన్నారు.
నిర్మాత  బెల్లి జనార్థన్  మాట్లాడుతూ... "ఒక  కొత్త
నిర్మాతగా  నేను  నిర్మించిన ఈ సినిమాకు సంబంధిన  ప్రమోషన్  కార్యక్రమాలకు సినీ పరిశ్రమలోని  ప్రముఖులు  హాజరు కావడం, టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను, లిరికల్  సాంగ్స్ ను, ఆడియోను ఆవిష్కరించడం వంటి సంఘటనలు  నన్ను  ఆనందపరుస్తున్నాయి" అని పేర్కొన్నారు.
చిత్ర  కథానాయకుడు సన్నీ అఖిల్  మాట్లాడుతూ... "సినిమా లో హీరో పాత్ర అనగానే  అందమైన కాస్ట్యూమ్స్ ధరించి, హీరోయిన్  వెంటపడి  డ్యూయెట్ లు పాడడం జరుగుతుందని కానీ ఈ చిత్రంలో  సంఘ వ్యతిరేక శక్తుల  కారణంగా మతిబ్రమించి  తిరుగుతూ క్లైమాక్స్ కు  తెర తీసేఒకానొక  సగటు యువకుని పాత్ర  లో నటిస్తున్నానని, నాలోని  నటుడిని ఆవిష్కరించుకునే  అద్భుతమైన  ఆస్కారాన్ని ఈ పాత్ర  నాకు అందించింది" అన్నారు.
తారాగణం: సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, షాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్, కాశీ విశ్వనాథ్, జబర్దస్త్ వినోద్, జబర్దస్త్ పవన్, జబర్దస్త్ శాంతి స్వరూప్, హిమజ, శంకరాభరణం తులసి, జయ వాహిని, మేఘనా  ఖుషి  తదితరులు.

]]>
Wed, 25 Jun 2025 19:50:33 +0530 admin
జులై 11న విడుదల కానున్న వర్జిన్ బాయ్స్ చిత్రం నుండి దం దిగ దం సాంగ్ లాంచ్ https://prajakshethrenews.com/జులై-11న-విడుదల-కానున్న-వర్జిన్-బాయ్స్-చిత్రం-నుండి-దం-దిగ-దం-సాంగ్-లాంచ్ https://prajakshethrenews.com/జులై-11న-విడుదల-కానున్న-వర్జిన్-బాయ్స్-చిత్రం-నుండి-దం-దిగ-దం-సాంగ్-లాంచ్ జులై 11న విడుదల కానున్న వర్జిన్ బాయ్స్ చిత్రం నుండి దం దిగ దం సాంగ్ లాంచ్
 ప్రజా క్షేత్ర్, సినిమా :
రాజ్ గురు బ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో జూన్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించనున్నారు. స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. నేడు ఈ చిత్రం నుండి విడుదలైన దం దిగా దం పాటకు ప్రణవ్ చాగంటి లిరిక్స్ అందించగా యాసిర్ నిసర్ తన స్వరాన్ని అందించారు. మార్తాండ్ కె వెంకటేష్ చిత్రానికి ఎడిటింగ్ పనిచేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్ర పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ సందర్భంగా వర్జిన్ చిత్ర నిర్మాత రాజా దారపనేని మాట్లాడుతూ... "సాంగ్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పటికే వర్జిన్ బాయ్స్ చిత్రం నుండి టీజర్ ఇంకా ఒక పాటకు మంచి స్పందన లభించింది. సినిమా యూత్ ఫుల్ గా ఉండబోతుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని ఎన్నో ప్రశంసలతో కొనియాడారు. ఆడవారు కూడా చిత్రాన్ని ప్రశంసించడం ప్రత్యేకంగా కనిపించింది. చిత్రంలో ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. చిత్రానికి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్ వచ్చింది. చిత్రాన్ని నైజంలో ఏషియన్ సునీల్ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. జులై 11వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది" అన్నారు. నటి జెన్నీఫర్ ఇమాన్యుల్ మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. మీడియా వారిని మరోసారి కలవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బంధం అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చిత్రంలో నటించిన వారితో పనిచేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. జెడి మాస్టర్ తో కలిసి పనిచేయడం ప్రత్యేకంగా కనిపించింది" అన్నారు. నటుడు శ్రీహాన్ మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన బాలు , మిత్ర , రాజ లకి ధన్యవాదాలు. ఈ సినిమా పూర్తిగా యూత్ కు ఎంటర్టైన్మెంట్ కోసం చేసింది. ఈ చిత్రంలో ఏది మంచిది ఏది కానిది అనేది ఎన్నో విషయాలు చెప్పాము. ఈ సినిమా చూస్తే పూర్తిగా ఎంటర్టైన్ అవుతారు. జూలై 11వ తేదీన తప్పకుండా థియేటర్లో ఈ చిత్రంని చూడండి" అన్నారు.
చిత్ర దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ... "సాంగ్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన అందరికీ నా ధన్యవాదాలు.
 ఈ చిత్రం ఒక మంచి లవ్ స్టోరీ తో యూత్ ఫుల్ గా ఉండబోతుంది. సినిమా చూసినంతసేపు మీ కాలేజీ రోజు గుర్తొస్తాయి. ఈ చిత్రం కోసం నిర్మాత రాజా  అలాగే నటీనటులు అందరితో పని చేయడం నాకు ఎంత సంతోషకరంగా కనిపించింది. మీరందరితో కలిసి పనిచేసి మంచి సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. నేడు విడుదలైన పాట ప్రేక్షకులందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. జులై 11వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రానికి మంచి సంగీతాన్ని అందించిన స్మరణ్ సాయికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిత్రంలో మంచి బిజీఎం తో పాటు మొత్తం ఆరు పాటలు ఉంటాయి. అలాగే చిత్రం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అన్నారు.
నటుడు గీతానంద్ మాట్లాడుతూ... "నేను ఇంతకుముందు చేసిన రథం సినిమాకు కూడా ఇదే నిర్మాత రాజా  నిర్మించారు. గత సంవత్సరం గేమ్ ఆన్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఇప్పుడు వర్జిన్ బాయ్స్ చిత్రం ద్వారా మరోసారి మీ ముందుకు రాబోతున్నాను. విడుదలైన ఈ దం దిగ దం పాటలు ఎంతటి పార్టీ మూడ్ ఉందో సినిమా అంతా కూడా అలాగే ఉంటుంది. సినిమా చూసి ఎంతో మంచి అనుభూతిని పొందుతారు. యూత్ ఈ చిత్రాన్ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు" అన్నారు. నటి మిత్ర శర్మ మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ముందుగా ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. వర్జిన్ బాయ్స్ చిత్రం ద్వారా నేను పూర్తిగా నటిగా తృప్తి చెందాను. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరితోను నేను ఎంతో కలిసిమెలిసి పనిచేశాను. దయానంద్ ఓ మంచి సోదరుడిలా నా వెంట ఉంటూ దర్శకత్వాన్ని వహించారు. జెడి గారు ఎంత మంచి కొరియోగ్రఫీ అందించారు. చిత్రంలో ముఖ్యంగా డ్యూటీ క్యారెక్టర్ ఎంతో ప్రత్యేకమైనది. ఆ క్యారెక్టర్ కోసం ఎవరు బాగా చేస్తారో అనుకుంటున్నాప్పుడు మాకు శ్రీహాన్ వచ్చారు. ఆయన ఆ క్యారెక్టర్ ను ఎంతో బాగా చేశారు. ఈ చిత్రాన్ని నేడు ఇక్కడ వరకు తీసుకువచ్చే ప్రయాణంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. అలాగే మమ్మల్ని నమ్మి మాకు ఈ అవకాశం ఇచ్చిన రాజా గారికి ధన్యవాదాలు. ఈ సాంగ్ షూటింగ్ కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేసాము. జులై 11వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము" అంటూ ముగించారు.


ఆర్టిస్టులు : గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహన్, రోనీత్, జెన్నీఫర్, అన్షుల, సుజిత్ కుమార్, బబ్లు, అభిలాష్

]]>
Wed, 25 Jun 2025 19:03:51 +0530 admin
హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్ https://prajakshethrenews.com/హాలీవుడ్లో-అడుగుపెట్టిన-వరలక్ష్మి-శరత్కుమార్ https://prajakshethrenews.com/హాలీవుడ్లో-అడుగుపెట్టిన-వరలక్ష్మి-శరత్కుమార్ హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్
ప్రజా క్షేత్ర్, సినిమా :
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ప్రఖ్యాత బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ సరసన నటిస్తున్నారు.వెటరన్ దర్శకుడు చంద్రన్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శ్రీలంకలో చిత్రీకరించబడింది. 'రిజానా - ఎ కేజ్‌డ్ బర్డ్' అనే ఈ సినిమా ఒక నిజమైన కథ ఆధారంగా రూపొందించబడుతోంది.
ఈ ప్రాజెక్ట్ గురించి వరలక్ష్మి మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న జెరెమీ ఐరన్స్ వంటి గొప్ప నటుడితో కలిసి పనిచేయడం నిజంగా ఒక కల నెరవేరినట్టు అనిపిస్తోంది. లయన్ కింగ్‌ సినిమాలో స్కార్ పాత్రకు ఆయనే వాయిస్ ఇచ్చారు. ఆ సినిమా నాకు ఇష్టం. అన్ని డైలాగులు నాపక్కా గుర్తుండిపోతాయంతగా చూసాను. ఇప్పుడా సినిమాకు వాయిస్ ఇచ్చిన ఆయనతో నేను నటించడం అనేది ఒక గొప్ప అవకాశం. చంద్రన్ రత్నం  దర్శకత్వంలో పనిచేయడం కూడా నాకు గర్వకారణం. శ్రీలంకలోనే కాదు, ప్రపంచ సినిమాకే ఆయన కొత్త దారులు చూపిన దర్శకుడు. ఇలాంటి అద్భుతమైన అంతర్జాతీయ స్టార్స్‌తో కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికినందుకు ఆనందంగా వుంది.ఇది నా కెరీర్‌లో మరిచిపోలేని ఒక మైలురాయి'అన్నారు. రిజానా - ఎ కేజ్‌డ్ బర్డ్ మూవీ దక్షిణాసియా, అంతర్జాతీయ సినిమా మధ్య ఒక హిస్టారికల్ కొలాబరేషన్ గా నిలవబోతోంది.

]]>
Wed, 25 Jun 2025 17:14:44 +0530 admin
జూలై 24న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు' విడుదల https://prajakshethrenews.com/జూలై-24న-పవర్-స్టార్-పవన్-కళ్యాణ్-ప్రతిష్టాత్మక-చిత్రం-హరి-హర-వీరమల్లు-విడుదల https://prajakshethrenews.com/జూలై-24న-పవర్-స్టార్-పవన్-కళ్యాణ్-ప్రతిష్టాత్మక-చిత్రం-హరి-హర-వీరమల్లు-విడుదల జూలై 24న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు' విడుదల
ప్రజా క్షేత్ర్, సినిమా :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు'. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకులు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న 'హరి హర వీరమల్లు'లో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదటిసారి చారిత్రక యోధుడిగా నటిస్తుండటంతో పాటు, భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుండటంతో 'హరి హర వీరమల్లు'పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్లింప్స్, టీజర్ లో యోధుడిగా కనిపించిన పవన్ కళ్యాణ్ లుక్ కి, అద్భుతమైన విజువల్స్ కి విశేష స్పందన లభించింది. 'మాట వినాలి', 'కొల్లగొట్టినాదిరో', 'అసుర హననం', 'తార తార' గీతాలు ఒక దానిని మించి మరొకటి శ్రోతలను మెప్పించాయి. రికార్డు వ్యూస్ తో సామాజిక మాధ్యమాల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.
'హరి హర వీరమల్లు' నుంచి వచ్చే ప్రతి కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఆ అంచనాలకు తారాస్థాయికి తీసుకెళ్ళేలా.. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ త్వరలో విడుదల కాబోతుంది. అంతేకాదు, చిత్ర విడుదల తేదీని కూడా తాజాగా నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస మరియు జ్ఞాన శేఖర్ వి.ఎస్. ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి నభూతో నభవిష్యతి అన్నచందాన అద్భుతమైన సెట్ లను రూపొందించారు. చారిత్రాత్మక నేపథ్యంలో అద్భుతమైన నాటకీయత, శక్తివంతమైన ప్రదర్శనలు, ఉత్కంఠభరితమైన యాక్షన్ తో రూపొందిన 'హరి హర వీరమల్లు' చిత్రం ప్రేక్షకులను వెండితెరపై గొప్ప అనుభూతిని కలిగించనుంది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది.
తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి.

]]>
Sat, 21 Jun 2025 20:10:57 +0530 admin
కుబేర'కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: కింగ్ నాగార్జున https://prajakshethrenews.com/కుబేరకు-యునానిమస్-బ్లాక్బస్టర్-హిట్-ఇచ్చిన-ప్రేక్షకులకు-థాంక్-యూ-కింగ్-నాగార్జున https://prajakshethrenews.com/కుబేరకు-యునానిమస్-బ్లాక్బస్టర్-హిట్-ఇచ్చిన-ప్రేక్షకులకు-థాంక్-యూ-కింగ్-నాగార్జున కుబేర'కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున
'కుబేర' సినిమాకు ఇంత గొప్ప స్థాయి ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: డైరెక్టర్ శేఖర్ కమ్ముల

ప్రజా క్షేత్ర్, సినిమా :

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల 'కుబేర'. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై  యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అద్భుతమైన బుకింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీడియా అందరికీ థాంక్యు. ఫస్ట్ టైం యునానమస్ గా బ్లాక్ బస్టర్ రివ్యూలు వచ్చాయి. ఎందులోనూ 3 రేటింగ్ కి తక్కువ లేదు. అంత యునానిమస్ గా  సినిమా అందరికీ నచ్చింది. నిర్మాతలు సునీల్, పుష్కర్ రామ్మోహన్ కి థాంక్యూ. శేఖర్ తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఉంది. సుమంత్, చైతన్య, అమల వీళ్లంతా పనిచేయడానికి ముందు నుంచే శేఖర్ తో వర్క్ చేయాలని ఉండేడి. శేఖర్ కూడా 'మీతో ఒక స్టైలిష్, ఫ్యామిలీ సినిమా చేయాలని వుందని' చెప్తుండేవారు. ఫైనల్ గా మా కాంబినేషన్లో 'కుబేర' వచ్చింది. ఇది బ్యూటిఫుల్ క్యారెక్టర్. నాకు ఎప్పటినుంచో ఒక కొత్త క్యారెక్టర్ చేయాలని ఉండేది. శేఖర్ సినిమాలన్నీ చూశాను. ఆయన క్యారెక్టర్ కి అద్భుతంగా న్యాయం చేస్తారు. ఈ కథ వినగానే నాది మెయిన్ కరెక్ట్ అనిపించింది. ప్రతి పాత్ర కూడా నేను చేసిన దీపక్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. ఈ కథ వినగానే ఇది దీపక్ కథ అనిపించింది. శేఖర్ కూడా దీన్ని అలానే చెప్పారు. దీపక్ క్యారెక్టర్ ఆర్క్ అద్భుతంగా ఉంటుంది. అది నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్ ఆర్క్స్ ఒకేలా ఉంటాయి. కానీ దీపక్ క్యారెక్టర్ లో త్రీ షేడ్స్ ఇచ్చారు. అందుకే ఈ క్యారెక్టర్ బాగా నచ్చి ఓకే చెప్పాను. నా క్యారెక్టర్ కి వచ్చిన రెస్పాన్స్ గొప్ప ఆనందం ఇచ్చింది. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మిస్సమ్మ మాయాబజార్ గుండమ్మ కథ ఈ సినిమా అన్నిట్లో కూడా హీరో ఎవరని చెప్పలేం. అందులో కథ హీరో. అవన్నీ కూడా డైరెక్టర్ ఫిలిమ్స్. కుబేర కూడా అవుట్ అండ్ అవుట్ శేఖర్ కమ్ముల గారి ఫిలిం. ఈ సినిమా కోసం ప్రాణం పోశారు. వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్. సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ'అన్నారు.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..అందరికి నమస్కారం. చాలా ఎమోషనల్ గా ఉంది. ఈ సినిమా కథ పుట్టినప్పటినుంచి చాలా డిఫరెంట్ గా చేద్దాం, హాలీవుడ్ స్థాయిలో తీద్దాం, రియల్ లొకేషన్స్ లో చేద్దాం, ముంబైని కొత్తగా చూపిద్దామని ఆశ. నాగార్జున దగ్గరికి అదే ఆశతో వెళ్ళాము. చాలా డిఫరెంట్గా తీద్దామని అని ఆయనకి చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. ఆయన అద్భుతంగా చేశారు. ఈ జర్నీలో మాకు ఆయన ఎంతో ధైర్యాన్ని నింపి ముందుకు నడిపారు. అలాగే ధనుష్  కూడా. ఇది సామాన్యమైన సినిమా కాదు. సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా అని ప్రీరీలీజ్ ఈవెంట్లో చెప్పాను. అది ఈరోజు నిజమైంది. నేను చేసిన సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, హానెస్ట్, ట్రూ ఫిలిం. ఇంత కొత్తగా జెన్యూన్ గా సినిమా తీసినప్పుడు ఇందులో చాలా లేయర్స్ చెప్పడానికి ప్రయత్నించాను. ఆ క్రమంలో కాస్త లెంత్ ఉండవచ్చు. ఈ సినిమాని మీరు మరోసారి చూసినప్పుడు మీకు తెలియని లేయర్స్ కూడా కొత్తగా కనిపిస్తాయి. సినిమా తగ్గించాలని డైరెక్టర్ కి గాని,  టీం కి గాని తెలియని విషయం కాదు.  కానీ ఇది చెప్పాల్సిన విషయం. కచ్చితంగా చెప్పి తీరాలి. ఒక పాయింట్ ని నిజాయితీగా చెప్పడమే మా ధర్మం. ఇప్పుడు మీరు ఇచ్చిన యునానిమిస్ రిపోర్ట్ తో చాలా ప్రౌడ్ గా ఉంది. ఈ స్థాయి మీరు ఇచ్చారని భావిస్తున్నాను. ఈ సినిమాకి గొప్ప స్థాయి ఇచ్చిన మీడియా కి, ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాగర్జున, ధనుష్  పర్ఫార్మెన్స్ కి థియేటర్స్ లో వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. చాలా మంచి టేకింగ్.. డైరెక్షన్..ప్రొడక్షన్.. అన్నిటి గురించి ప్రేక్షకులు చాలా గొప్పగా మాట్లాడుతున్నప్పుడు చాలా గర్వంగా ఆనందంగా అనిపిస్తోంది. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ. ఇది ఒక కంప్లీట్ ఫిలిం'అన్నారు.  
నిర్మాత సునీల్ నారంగ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. కుబేర పెద్ద సూపర్ హిట్. ఆడియన్స్ ,  మీడియా వారికి థాంక్యూ వెరీ మచ్. సినిమా పట్ల చాలా ఆనందంగా ఉన్నాం. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని కథ విన్నప్పుడే చెప్పాను. శేఖర్ కమ్ముల  గ్రేట్ డైరెక్టర్.  ఫ్యూచర్ లో కూడా ఆయన అన్ని సూపర్ హిట్ సినిమాలు తీస్తారు. నాగార్జునకి థాంక్ యూ. ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్ తోనే సినిమాని అనుకున్న సమయంలో రిలీజ్ చేయగలిగాం. నిన్న సెకండ్ షో చూస్తున్నప్పుడు మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈరోజు కూడా బుకింగ్స్ టెర్రిఫిక్ గా ఉన్నాయి. ఇది డే బై డే పెరుగుతూ వెళుతుంది. ఎక్కడ తగ్గదు. మీడియా, ఆడియన్స్ సపోర్టుకి థాంక్యూ వెరీ మచ్'అన్నారు. నిర్మాత పుష్కర రామ్మోహన్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మేము చాలా ఆనందంగా వున్నాం. శేఖర్ అద్భుతమైన సినిమా ఇచ్చారు. సినిమాకి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వచ్చిం.ది ఈ క్రెడిట్ అంతా టీం అందరికీ దక్కుతుంది. నిర్మాతలుగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నాగార్జునకి, ధనుష్కి , శేఖర్ కి అందరికీ థాంక్యూ. ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు'అన్నారు

]]>
Sat, 21 Jun 2025 19:53:47 +0530 admin
2026 సంక్రాంతికి విడుదల కానున్న #Mega157 మూవీ https://prajakshethrenews.com/2026-సంక్రాంతికి-విడుదల-కానున్న-mega157-మూవీ https://prajakshethrenews.com/2026-సంక్రాంతికి-విడుదల-కానున్న-mega157-మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానున్న #Mega157 మూవీ 

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ #Mega157 ముస్సోరీ షెడ్యూల్ పూర్తి
ప్రజా క్షేత్ర్, సినిమా :
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ #Mega157.  చిరంజీవి సరసన కథానాయికగా నయనతార నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అర్చన సమర్పిస్తున్నారు.  ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తాజాగా మేకర్స్ ముస్సోరీ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో చిరంజీవి, నయనతార మీద కీలక సన్నివేశాలు షూట్ చేశారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా ఉండబోతున్నాయి.  కమర్షియల్ ఫార్మాట్లలో హిలేరియస్ ఎంటర్ టైనర్స్ చిత్రాలను రూపొందించడంలో మాస్టర్ అయిన అనిల్ రావిపూడి ప్రమోషనల్ కంటెంట్‌ను రూపొందించడంలో స్పెషలిస్ట్. ఇప్పటివరకు #Mega157 ప్రతి ప్రమోషనల్ వీడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే ముస్సోరీ షెడ్యూల్ నుంచి రిలీజ్ చేసిన వీడియోలో చిరంజీవి వింటేజ్ అవతార్‌లో అలరించారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. ఎస్. కృష్ణ,  జి. ఆది నారాయణ కో రైటర్స్. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.
#Mega157 మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్

]]>
Thu, 19 Jun 2025 19:37:15 +0530 admin
కన్నప్ప' చిత్రం మీద జరుగుతున్న దుష్ప్ర చారాన్ని ఆపండి https://prajakshethrenews.com/కన్నప్ప-చిత్రం-మీద-జరుగుతున్న-దుష్ప్ర-చారాన్ని-ఆపండి https://prajakshethrenews.com/కన్నప్ప-చిత్రం-మీద-జరుగుతున్న-దుష్ప్ర-చారాన్ని-ఆపండి తెలుగు సినిమా ప్రేక్షకులకి, అన్ని కులాల వారికి, ముఖ్యంగా బ్రాహ్మణ మిత్రులందరికీ... నమస్సులు...!
గత కొద్ది కాలంగా విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన 'కన్నప్ప' చిత్రం మీద జరుగుతున్న దుష్ప్ర చారాన్ని చూసి సినిమాకి మాటల రచయితగా పనిచేసిన నా మనసుకి ఆవేదన కలిగి, కొన్ని విషయాలు మీతో చెప్పదల్చుకున్నాను. నా పేరు ఆకెళ్ళ శివప్రసాద్, బ్రాహ్మణుడిని. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ముకేష్ కుమార్ సింగ్ కూడా ఉత్తర భారత దేశానికి చెందిన బ్రాహ్మణులు. టీవీ సీరియల్గా మహాభారతాన్ని అత్యద్భుతంగా తీసిన దర్శకులు. ఈ చిత్రంలో బ్రాహ్మణులని గానీ, ఏ ఇతర కులాల వారిని గానీ కించపరచలేదు.
అలాగే ఇదివరకు కన్నప్ప చరిత్ర మీద వచ్చిన చిత్రాలలో కన్నడ కంఠీరవ  రాజ కుమార్ నటించిన 'శ్రీ కాళహస్తి మహత్యం', శ్రీ కృష్ణంరాజు  నటించిన 'భక్త కన్నప్ప' చిత్రాలలో గుడిలో ప్రధాన పూజారి మహదేవ శాస్త్రి పాత్రను (మొదటి చిత్రంలో  లింగమూర్తి , రెండవ దాంట్లో రావు గోపాల రావు  పోషించారు) గుడిలో దేవుడి నగలు తీసుకెళ్ళి తన ఉంపుడుగత్తెకు ఇచ్చినట్టుగా చూపించారు. కానీ కన్నప్ప చిత్రంలో కథానాయకుడిగా నటించడమే గాక, కథా రచన చేసిన విష్ణు మంచు  ... ధూర్జటి 16వ శతాబ్దంలో రచించిన శ్రీ కాళహస్తి మహత్యం గ్రంథం ఆధారంగా,  మోహన్ బాబు  పోషించిన మహదేవ శాస్త్రి పాత్రని మహా శివ భక్తుడి పాత్రగా చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు. రేపు సినిమా చూశాక, ప్రేక్షకులందరికీ ఆ విషయం అర్థమవుతుంది.మరో విషయం ఏమిటంటే.. ఈ చిత్ర కథని రాస్తున్నప్పుడే కాకుండా, చిత్రాన్ని పూర్తి చేశాక కూడా పరమ పవిత్రమైన శ్రీ కాళహస్తి దేవస్థానం ప్రధాన అర్చకులకి చూపించారు. వారు చిత్రం ఎంతో ఉన్నతంగా వుందని ప్రశంసించి, శ్రీ మోహన్ బాబు ని, విష్ణు ని వేదమంత్రాలతో ఆశీర్వదించారు.ఇక ఈ చిత్రంలో పాటని రాసిన శ్రీ రామజోగయ్య శాస్త్రి తో పాటు ఎందరో బ్రాహ్మణులు వివిధ శాఖలలో పనిచేసారు. ఇంకొక విషయం... ఏ వర్గం వారిని కించపరచడానికి, కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, ఎన్నో వ్యయ ప్రయాసలను భరించి చిత్రాన్ని నిర్మించవలసిన అవసరం ఎవరికీ లేదు. చివరగా, కన్నప్ప చిత్రం ఇంకా విడుదల కాకుండానే ఏవేవో వదంతులు పుట్టించి, దుష్ప్రచారం చేస్తున్న వారి విషయం ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు.

]]>
Thu, 19 Jun 2025 19:32:00 +0530 admin
కుబేర ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున https://prajakshethrenews.com/కుబేర-ఆడియన్స్-కి-చాలా-మంచి-ఎక్స్పీరియన్స్-ఇస్తుంది-కింగ్-నాగార్జున https://prajakshethrenews.com/కుబేర-ఆడియన్స్-కి-చాలా-మంచి-ఎక్స్పీరియన్స్-ఇస్తుంది-కింగ్-నాగార్జున కుబేర' కథ, క్యారెక్టర్స్, స్క్రీన్‌ప్లే... అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇలాంటి సినిమా చేయడానికి గట్స్ కావాలి.

కుబేర ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున


ప్రజా క్షేత్ర్, సినిమా : 
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల 'కుబేర'. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
కుబేర లాంటి మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేయడానికి కారణం ?
-మంచి కథలు రావాలంటే స్టార్స్ కలిసి పనిచేయాలి. ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు చేశాను. నాన్న(ఏఎన్ఆర్) ఎన్టీఆర్ , కృష్ణ , శోభన్ బాబు .. ఇలా అంతమంది కలిసి ఎన్నో సినిమాలు చేశారు.
-శేఖర్ కమ్ముల తో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఆనంద్ దగ్గర నుంచి ఆయన సినిమాలు గురించి మనందరికీ తెలుసు. ఆయన సినిమాలు నాకు బాగా ఇష్టం. ఆయన కథల్లో సోషల్ రెలివెంట్ పాయింట్ ఉంటుంది. మిగతావన్నీ కూడా కమర్షియల్ గానే ఉంటాయి. అద్భుతమైన పాటలు ఉంటాయి.
కుబేరలో ఉన్న యూనిక్ పాయింట్ ఏమిటి ?
-కుబేరలో చాలా మంచి యూనిక్ పాయింట్ ఉంది. ఇప్పుడున్న సొసైటీకి ఆ పాయింట్ చాలా రిలెవెంట్. శేఖర్ కి  ఈ పాయింట్ మైండ్ లో ఎప్పటినుంచో ఉంది.-ఈ సినిమాల్లో మంచోళ్ళు ఉన్నారు. చెడ్డోళ్ళు ఉన్నారు. అల్ట్రారిచ్, మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్.. ఇలా మూడు సొసైటీల మధ్య క్లాష్ ఈ సినిమాలో ఉంటుంది. 

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

-నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్. సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. మంచి చేయాలా?  చెడు చేయాలా? అనే సంఘర్షణ మధ్య ఆ క్యారెక్టర్ ఉంటుంది.  నా క్యారెక్టర్స్ లో చాలా షేడ్స్ వుంటాయి. శేఖర్ నా క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా రాశారు. షటిల్ పెర్ఫార్మన్స్ కి మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్.
- ఇందులో చాలా అద్భుతమైన ఇన్సిడెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా రియల్ లైఫ్ కి రిలేటెడ్ గా ఉంటాయి.  
-ధనుష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అద్భుతంగా చేశాడు.
శేఖర్  మీ ఇమేజ్ కి తగ్గట్టు స్క్రిప్ట్ లో ఏమైనా మార్పులు చేశారా ?
-లేదండి. ఆయన ఏమనుకున్నారో అదే చేశారు. నేను కూడా ఎలాంటి మార్పులు అడగలేదు. మారిస్తే చెడిపోతుంది.
మీ ఫ్యామిలీలో దాదాపుగా అందరూ శేఖర్ కమ్ముల తో చేశారు కదా.. ఆయన స్టైల్ గురించి ముందుగా ఎవరినైనా అడిగారా?
-చైతన్యని అడిగాను. ‘ఆయన వర్కింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. మీరు సినిమా అంతా ఎంజాయ్ చేస్తారని' చెప్పాడు
ఇప్పుడు వరకు మీరు చేసిన క్యారెక్టర్ అన్నిటిలో కుబేరలో క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందా ?
- ఈ సినిమా కథ డిఫరెంట్. నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, రియాక్షన్... అవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. శేఖర్ కమ్ముల స్టైల్ లో ఉంటాయి.
- సినిమాని దాదాపుగా రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశాం. తిరుపతి,  ముంబై, గోవా, బ్యాంకాక్ ఇలా అన్ని బిగ్ రియల్ లొకేషన్స్ లో వర్క్ చేసాం.
రష్మిక మందన క్యారెక్టర్ ఎలా ఉంటుంది?  
-తన క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. తను చాలా అద్భుతంగా చేసింది. సినిమా చూసి నువ్వే స్టార్ అని చెప్పాను. ఆ కథలో చాలా రిప్రెషన్ క్యారెక్టర్ అది.
కుబేర నిర్మాతల గురించి?
సునీల్ నారంగ్, పుష్కర రామ్మోహన్ గారు ఒక పెద్ద సినిమా చేయాలనుకున్నారు. తెలుగు, తమిళ్.. పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్టుని చేయడం జరిగింది. చాలా పాషన్ తో సినిమా తీశారు. డైరెక్టర్ శేఖర్ కమ్ములకి కావాల్సినది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇచ్చారు. సినిమా చాలా అద్భుతమైన క్వాలిటీతో వచ్చింది.
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి?  
-ఈ సినిమాకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. పాటలు చాలా సిచువేషనల్ గా వస్తాయి. దేవి వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు.
-ఈ కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్ స్క్రీన్ ప్లేకాదు. రొటీన్ క్యారెక్టర్స్ కావు. ప్రతీది డిఫరెంట్ గా ఉంటుంది.  ఇందులో ఏ క్యారెక్టర్ కూడా హీరో హీరోయిన్ అనడానికి లేదు. అన్ని పాత్రలు గానే ఉంటాయి. ఇలాంటి సినిమాలు చేయడానికి గట్స్ కావాలి.
100 సినిమా ప్లానింగ్స్ జరుగుతున్నాయని విన్నాం?
అవునండి. ప్లానింగ్ చేస్తున్నాం. వర్కింగ్ టైటిల్ కింగ్ 100 అని పెట్టారు.
చాలా ఫిట్ గా కనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆహార నియమాల్లో ఏమైనా మార్పులు చేశారా?
లేదండి. గత 15 ఏళ్లుగా  ఏం చేస్తున్నానో అదే చేస్తున్నాను. కొత్తగా చేసింది ఏమీ లేదు.
పాన్ ఇండియా ట్రెండ్ మీద మీ ఒపీనియన్ ?
-పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని. అన్ని సినిమాలు దానికి సరిపోవు. పాన్ ఇండియా సినిమా అని తీసినవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలో కావడం లేదు కదా.
శివ 4k పనులు ఎంతవరకు వచ్చాయి ?
శివ 4కె ఫినిష్ అయింది. ఇంకా బెటర్ ఎఫెక్ట్స్ కోసం వర్క్ జరుగుతుంది. చాలా బాగా వస్తుంది. ఒక రీల్ చూసాను. చాలా అద్భుతంగా ఉంది.
సితార బ్యానర్ లో మీరు ఒక సినిమా చేస్తారాని విన్నాం?
సితార , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఇలా అందరికీ చేయాలని ఉంది. అయితే  ప్రాజెక్ట్ సెట్ కావాలి.
కూలీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ?
-కూలీలో డిఫరెంట్ కరెక్ట్ చేస్తున్నాను. లోకేష్ కనకరాజ్ కంప్లీట్ న్యూ ఏజ్ డైరెక్టర్. క్యారెక్టర్ చాలా కొత్తగా వుంటుంది. ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేశాను.

]]>
Thu, 19 Jun 2025 19:25:16 +0530 admin
సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ప్రైమ్ వీడియో ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్ https://prajakshethrenews.com/సుహాస్-కీర్తి-సురేష్-నటించిన-ప్రైమ్-వీడియో-ఉప్పు-కప్పురంబు-ట్రెయిలర్-లాంచ్ https://prajakshethrenews.com/సుహాస్-కీర్తి-సురేష్-నటించిన-ప్రైమ్-వీడియో-ఉప్పు-కప్పురంబు-ట్రెయిలర్-లాంచ్ సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ప్రైమ్ వీడియో ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్
 ప్రజా క్షేత్ర్, సినిమా : 
భారతదేశపు అత్యంత ప్రియమైన వినోదాల గమ్యస్థానం, ప్రైమ్ వీడియో ఈరోజు తన రెండవ తెలుగు ఒరిజినల్ చిత్రము, నిరంకుశాధికార ప్రభుత్వము ద్వారా మరణించినవారి సంఖ్య పెరిగిపోయిన కారణంగా స్మశానంలో చోటు తక్కువ అయిన ఒక దక్షిణభారత పల్లెటూరు లో చిత్రీకరించబడిన హాస్యభరిత చిత్రము, ఉప్పు కప్పురంబు చిత్రం యొక్క ట్రెయిలర్ ను విడుదల చేసింది. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రై లి. బ్యానర్ పై రాధిక లావూ నిర్మించగా, అని. ఐ.వి. శశి దర్శకత్వం వహించారు. వసంత్ మరింగంటి రచించిన ఈ చిత్రం లో సుహాస్, జాతీయ అవార్డు-గెలుచుకున్న నటి కీర్తి సురేష్ ప్రధానపాత్రలు పోషించగా, బాబు మోహన్, శత్రు, తాళ్ళూరి రామేశ్వరి  ఇతర కీలక పాత్రలలో నటించారు. ఉప్పు కప్పురంబు చిత్రము భారతదేశము, ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలలో జులై 4న ప్రైమ్ వీడియో పై ప్రీమియర్ గా ప్రత్యేక ప్రసారానికి సిద్ధంగా ఉంది. తెలుగు తోపాటు హింది, తమిళం, మళయాళం మరియు కన్నడ భాషలలో డబ్బింగ్ మరియు ఇంగ్లీష్ తో కలిపి 12 భాషలలో సబ్‎టైటిల్స్ తో ప్రసారం అవుతుంది.
1990 ప్రారంభములో సెట్ చేయబడిన ఈ చిత్ర కథ, చిట్టి జయపురం అనే పల్లెటూరిలో ప్రారంభం అవుతుంది. ఈ పల్లెటూరు ఒక చిత్రమైన సమస్యని ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ ఊరిలో మరణించినవారిని పూడ్చిపెట్టటానికి చోటు లేదు. కొత్తగా నియమించబడిన, ఆదర్శవంతురాలైన గ్రామాధికారి, అపూర్వ (కీర్తి సురేష్) పదవి చేపట్టినప్పుడు ఒక మహిళ అధికారములో ఉండడం జీర్ణించుకోలేని స్థానికులు ఆమెను అపహాస్యం చేస్తూ ఉంటారు. సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించుకున్న ఆమె, ఆ ఊరి కాటికాపరి అయిన చిన్న (సుహాస్) సహాయం కోరుతుంది. కాని వీరి ఉద్దేశాలు ఊరిలో గందరగోళాన్ని రేకెత్తిస్తాయి. స్మశానంలో స్లాట్ బుక్ చేసుకోవడానికి లక్కీ డ్రా నుండి పెరుగుతున్న గ్రామీణ నాటకము వరకు, ఈ ట్రెయిలర్ చమత్కారం, హాస్యం, భావోద్వేగాల రోలర్ కోస్టర్ ను అందిస్తుంది. ఈ ట్రెయిలర్ సామాజిక వ్యంగ్యముతో ఊహించని గందరగోళాన్ని సృష్టించే ఒక ప్రపంచములోకి తొంగి చూస్తుంది.“ఈ ఉప్పు కప్పురంబు కథ యొక్క వ్యంగ్య  హృద్యమైన సమ్మేళనము నన్ను ఆకట్టుకుంది,” అని కీర్తి సురేష్ తెలిపారు. తన పాత్ర గురించి మాట్లాడుతూ, ఆమె ఇలా చెప్పుకొచ్చారు, “అపూర్వ అనేది ఒక భిన్నమైన పాత్ర. ఆమె ఆదర్శవాది, దృఢనిశ్చయం కలిగినది. ఆమె పాత్రలో నటించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది, ముఖ్యంగా గ్రామీణ సంస్కృతుల నేపథ్యములో. ఒక గంభీరమైన సమస్యను ప్రజల దృష్టిలోకి తీసుకొని రావటానికి ఈ చిత్రము హాస్యాన్ని, ప్రాంతీయ అభిరుచులను ఉపయోగిస్తుంది, దీనితో ఇది అందరి హృదయాలకు హత్తుకునేలా ఉంటుంది. ఇది కూడా నన్ను బాగా కదిలించింది. ఇప్పుడు ప్రేక్షకులు ఈ ప్రపంచాన్ని గురించి ప్రైమ్ వీడియోలో చూసి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను.”
“చిన్నా పాత్ర ఇదివరకు నేను చేసిన పాత్రల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది,” అని సుహాస్ అన్నారు, “ఇతను ఒక విచిత్రమైన పరిస్థితిలో ఇరుక్కుంటాడు. ఈ చిత్రము యొక్క సారాన్ని, దీని చమత్కారమైన, భావోద్వేగమైన, ఆశ్చర్యాలను ట్రెయిలర్ చాలా చక్కగా చూపింది. ఉప్పు కప్పురంబులో నాకు బాగా నచ్చింది, ఇది నీతులు చెప్పేదిగా ఉండదు. ట్రెయిలర్ కేవలం ఒక అంతర్దృష్టి, ఇందులో తెలుసుకునవలసిన అనేక భావోద్వేగాలు ఉన్నాయి. ప్రైమ్ వీడియో పై ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం పై నేను ఆసక్తిగా ఉన్నాను

]]>
Thu, 19 Jun 2025 19:17:51 +0530 admin
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' భారీ సెట్‌లో ఇంటెన్స్ & ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ట్రైన్ యాక్షన్ బ్లాక్‌ షూటింగ్ https://prajakshethrenews.com/గ్లోబల్-స్టార్-రామ్-చరణ్-పెద్ది-భారీ-సెట్లో-ఇంటెన్స్-ఫస్ట్-అఫ్-ఇట్స్-కైండ్-ట్రైన్-యాక్షన్-బ్లాక్-షూటింగ్ https://prajakshethrenews.com/గ్లోబల్-స్టార్-రామ్-చరణ్-పెద్ది-భారీ-సెట్లో-ఇంటెన్స్-ఫస్ట్-అఫ్-ఇట్స్-కైండ్-ట్రైన్-యాక్షన్-బ్లాక్-షూటింగ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' భారీ సెట్‌లో ఇంటెన్స్ & ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ట్రైన్ యాక్షన్ బ్లాక్‌ షూటింగ్
ప్రజా క్షేత్ర్, సినిమా : 
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది'. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పవర్ ఫుల్ కొలాబరేషన్, అద్భుతమైన టీంతో 'పెద్ది' భారతీయ సినిమాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే చిత్రం యూనిట్, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో కీలక సన్నివేశాలతో పాటు ఓ భారీ యాక్షన్ బ్లాక్‌ను పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మించిన మ్యాసీవ్ సెట్లో భారత సినిమా చరిత్రలో ఎన్నడూ లేనంత అద్భుతమైన యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. ఇది ఇండియన్ యాక్షన్ సినిమాల ప్రమాణాలను పెంచేలా ఉన్న హై-ఆక్టేన్, హై బడ్జెట్‌తో రూపొందిస్తున్న ట్రైన్ ఎపిసోడ్. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా అద్భుతంగా సెట్స్ ని డిజైన్ చేశారు. ఈ ట్రైన్ స్టంట్ కోసం రూపొందించిన సెట్స్ కన్నులకు పండుగగా ఉండబోతున్నాయి. ఈ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ తన కెరీర్‌లోనే అత్యంత రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనుంది. పుష్ప 2 వంటి చిత్రాల్లో తన వర్కింగ్ స్టయిల్ తో ఆకట్టుకున్న నబాకాంత్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ కు కొరియోగ్రఫీ వహిస్తున్నారు. పెద్ది ఐకానిక్ క్రికెట్ షాట్‌ కి ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పలు హై-ప్రొఫైల్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆయన, ఈ చిత్రంలోనే అత్యంత భారీగా రూపుదిద్దుకున్న యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కిస్తున్నారు.ఈ మైండ్-బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో మేజర్ హైలైట్‌గా వుండబోతోంది.  ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.చిత్రానికి స్టార్ డివోపీ ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటర్. వినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేశారు. ఈ చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తారాగణం: రామ్ చరణ్, జాన్వి కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ

]]>
Wed, 18 Jun 2025 19:44:11 +0530 admin
గేమ్ చేంజర్ గా నిలవబోతున్న కుబేర https://prajakshethrenews.com/గేమ్-చేంజర్-గా-నిలవబోతున్న-కుబేర https://prajakshethrenews.com/గేమ్-చేంజర్-గా-నిలవబోతున్న-కుబేర కుబేర లాంటి కథ చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది.

ఇలాంటి సినిమాని ఇప్పటివరకూ చూసి వుండరు.

తప్పకుండా ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: డైరెక్టర్ శేఖర్ కమ్ముల

ప్రజా క్షేత్ర్, సినిమా :
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల 'కుబేర'. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
కుబేర తీయడానికి మోటివేషన్ ఏమిటి?
-మోటివేషన్ అంటూ ఏం లేదు కానీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ లైన్ అనిపించింది. ఒక సూపర్ రిచ్ ప్రపంచం, ఇంకొకటి అట్టడుగున ఉండే ప్రపంచం.. బిలినియర్ వర్సెస్ బెగ్గర్.. అది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నిజానికి ఇది కథగా చెప్పడం చాలా కష్టం. చాలా పెద్ద పాయింట్. అది మెల్లగా ఇవాల్వ్ అయిన ఒక ఎమోషనల్ థ్రిల్లర్ తయారయింది. అక్కడ నుంచి డెవలప్ చేయడం జరిగింది.
-తనకి ఏమీ వద్దు అనుకునే ఒక బెగ్గర్.. తనకి ప్రపంచంలో అన్ని కావాలనుకునే ఒక బిలినియర్.. వారి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటే ఎలా ఉంటుందనేది చాలా ఇంట్రెస్టింగ్.
- ఈమధ్యకాలంలో చాలా సినిమాలు కథలు వస్తున్నాయి కానీ ఇలాంటి ఒక కథ నేను చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కథ డెఫినెట్ గా చెప్పబడాలి. ఈ కథ అవేర్నెస్ ని తీసుకొస్తుంది. మంచి థ్రిల్లింగ్ పాయింట్.
-సినిమాని తెలుగు తమిళ్ రెండు భాషల్లో షూట్ చేశాం. కథపరంగా ఎలాంటి మార్పు ఉండదు కానీ లెంత్ లో ఒక నిమిషం తేడా వుంటుంది. లిప్ సింక్ పరంగా ప్రతిది విడివిడిగా తీశాం. టెక్నికల్ గా రెండు సినిమాలు తీసినట్లే. అందుకే కొంచెం టైం పట్టింది.
ఈ కథకు నాగర్జున కావాలి అని మీరు పట్టుపట్టారని తెలిసింది?  
- కొన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ నాగార్జున చేస్తే బాగుంటుంది. ఈ క్యారెక్టర్ కి ఆయన పర్ఫెక్ట్ యాప్ట్. ఆయనని స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అయితే ఇందులో ఆయన్ని ఒక వేరే విధమైన యాక్టింగ్, మేనేజర్స్ తో క్యారెక్టర్ కి తగ్గట్టుగా చూపించడం జరిగింది.  
-నాగార్జున  మనం, ఊపిరి ఇలా చాలా చిత్రాల్లో డిఫరెంట్ వేరియేషన్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ క్యారెక్టర్ లోకి ఆయన అద్భుతంగా ఇమిడిపోయారు.
-రష్మిక కూడా అందర్నీ సర్ప్రైజ్ చేస్తుంది. తనకి మంచి అవకాశం వస్తే నెక్స్ట్ లెవెల్ లో నటించే హీరోయిన్ తను.
కుబేర పాత్ర కోసం ధనుష్ ని ఎంపిక చేయడానికి కారణం?
-ఈ క్యారెక్టర్ ని ఆయన తప్పితే ఎవరూ చేయలేరు.  సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా ఇదే మాట చెబుతారు. అంతా అద్భుతంగా పెర్ఫాం చేశారు. అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ అనేది చిన్న మాట. ఆ క్యారెక్టర్ లో ఇంకా ఎవరిని ఊహించలేరు. ఆయన సినిమా పూర్తి అయ్యేవరకూ ఆ క్యారెక్టర్ లోనే ఉంటారు. ఏదైనా సింగిల్ టేక్ లో చేసేస్తారు.
కుబేర కూడా మీ మార్క్ లోనే ఉంటుందా?
-నిజానికి నా మీద ఒక మార్క్ పడింది కానీ నేను ఒక మార్కు కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదు. కథకు ఏం కావాలో అదే చేశాను. అయితే ఎక్కువగా బ్లాక్ బస్టర్ ఆయన సినిమాలు మ్యూజికల్ హిట్స్, లవ్ స్టోరీలు ఉంటాయి కాబట్టి అలా ఒక ముద్ర వచ్చింది.
-లీడర్ సినిమా చాలా హానెస్ట్ గా చెప్పిన కథ. అందులో లవ్ స్టోరీ పెట్టాలి మంచి పాటలు పెట్టాలని అనుకోలేదు. హ్యాపీ డేస్ లో కూడా అంతే. కాలేజ్ స్టోరీ అంటే కాల్ స్టోరీ లాగే ట్రీట్ చేయడం జరిగింది. అందుకే మీకు నచ్చింది. కుబేర కూడా అంతే. ఈ కథకు కావలసింది చేశాను. మార్క్ అనేది కథ ప్రకారం ఉంటుంది. అయితే ఇలాంటి కథని ఇలా చేశారా అనే వావ్ ఫ్యాక్టర్ కుబేర చూసినప్పుడు ఆడియన్స్ లో ఉంటుంది. అందుకే ముందుగానే ఈ కంటెంట్ ఏంటనేది ట్రైలర్ టీజర్ లో క్లియర్ గా చెప్పాము. రిచ్, పూర్ మధ్య జరిగే కథని ముందుగానే ఎస్టాబ్లిష్ చేశాం.
-ఇది ఒక డిఫరెంట్ సినిమా. నేను ఏ సినిమా తీసిన హానెస్ట్ గానే చేస్తాను. అది ఈ సినిమాలో పదింతలు కనిపిస్తుంది.
ఇలాంటి ఒక ఇదియాలజీ ఎవరినైనా నొప్పించేలా ఉంటుందా?
-లేదండి. ఇది ఐడియాలాజికల్ బాటిల్ ఉండే సినిమా కాదు. అయితే సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి ఒక రెండు ప్రపంచాలు ఉన్నాయనే అవేర్నెస్ వస్తుంది.
దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ గురించి ?
-దేవిశ్రీ ప్రసాద్ తో జర్నీ సూపర్ గా ఉంది. కమర్షియల్ గా ఆయన కింగ్. కుబేర కి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. హై ఇచ్చే చాలా మూమెంట్స్ వున్నాయి.  మ్యూజిక్ చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
ఇది మీ కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా కదా ..నిర్మాతలు సపోర్టు గురించి?
-ఇంత పెద్ద స్టార్ కాస్ట్, పెద్ద బడ్జెట్ నిర్మాతల వల్లే సాధ్యమైంది. నేను ఏమి అడిగినా అది కాదనకుండా ఇచ్చారు. చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు.
సినిమాలో నాగార్జున, ధనుష్  క్యారెక్టర్స్ ఎలా ట్రావెల్ చేస్తాయి?
అది మీరు సినిమాలోనే చూడాలి.(నవ్వుతూ) చాలా బ్యూటిఫుల్ గా వుంటుంది.  
జిమ్ షర్బ్ గురించి?    
-ఆయన నన్ను చాలా సర్ప్రైజ్ చేశారు. ఎంత పెద్ద డైలాగ్ అయినా నేర్చుకునేవారు. చాలా పర్ఫెక్ట్ గా ఒక లైన్ మిస్ కాకుండా చెప్పేవారు. ఈ సినిమా తర్వాత ఆయనకి మరిన్ని అవకాశాలు ఇక్కడ వస్తాయి.  
ఈ సినిమా ప్రాసెస్ లో ఛాలెంజింగ్ అనిపించింది ఏమిటి ?
-ముంబై షూట్ చాలా డిఫికల్ట్., అక్కడ పర్మిషన్స్ రావు. చాలా కండిషన్స్ ఉంటాయి.  ముంబై వాళ్లే వేరే చోట షూట్ చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ షూట్ చేయడం అనేది చాలా చాలెంజింగ్ గా అనిపించింది.
ముంబై బ్యాక్ డ్రాప్ తీసుకోవడానికి కారణం ఏమిటి?
-ఈ కథే ముంబై బ్యాక్ డ్రాప్ కోరుకున్నది. కథపరంగా ముంబై  తప్పనిసరి.
ఈ 25 ఇయర్స్ జర్నీ చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది?
-ఎక్కడో ఒక చిన్న ఇంట్లో ఫస్ట్ సినిమా తీశాను. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా చేశాను. ఈ జర్నీ అంత చూసుకున్నప్పుడు ఎమోషనల్ గా అనిపిస్తుంది. ప్రేక్షకులు చాలా ప్రేమని ఇచ్చారు. ఎప్పుడు నాపై ఒక నమ్మకాన్ని ఉంచారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. అది చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. నా సినిమాల్ని అప్రిషియేట్ చేసి ఆడియన్స్ నాకు ఒక స్థాయిని ఇచ్చారు. అంతకంటే నేను ఏం కోరుకోను.
కుబేర కి పార్ట్ 2 ఉంటుందా?
లేదండి. ఇక్కడితో అయిపోతుంది. నేను ఒక్కటి తీసినప్పటికే సరిపోతుంది(నవ్వుతూ)
లీడర్ కి సీక్వల్ ఉంటుందా?
అది నేను ఆలోచిస్తూ ఉంటాను. కథ నాకు క్లారిటీ ఉంది. కానీ లీడర్ తీసినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులన్నీ చాలా మారిపోయాయి. దేశం, ప్రజల్లో చాలా మార్పులు వచ్చేసాయి. థింకింగ్ మారిపోయింది. దాన్ని సరిగ్గా పట్టుకోవాలి
నెక్స్ట్ కూడా పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారా?
-అలా ఏం లేదండి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా చేయాలి అని చేసింది కాదు. కథలోన ఒరిజినల్ గా ట్రూ పాన్ ఇండియా ఎక్స్పీరియన్స్ ఉంది. దేశం మొత్తం  రిలేట్ అయ్యే కథ ఇది.  నిజానికి పాన్ ఇండియా సినిమా చేయడం చాలా కష్టం. పాటలు డబ్బింగ్ లిరిక్స్ ఇవన్నీ చూసుకోవడం సామాన్యమైన విషయం కాదు.  
నాని గారితో మీరు ఒక సినిమా అనుకున్నారని విన్నాం ?
-షాలిడ్ గా అనుకోలేదు. దానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా వర్క్ చేయాలి.  

]]>
Wed, 18 Jun 2025 19:39:03 +0530 admin
24 గంటల్లో 59 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" టీజర్ https://prajakshethrenews.com/24-గంటల్లో-59-మిలియన్-ఫ్లస్-వ్యూస్-తో-రికార్డులు-క్రియేట్-చేస్తున్న-రెబల్-స్టార్-ప్రభాస్-రాజా-సాబ్-టీజర్ https://prajakshethrenews.com/24-గంటల్లో-59-మిలియన్-ఫ్లస్-వ్యూస్-తో-రికార్డులు-క్రియేట్-చేస్తున్న-రెబల్-స్టార్-ప్రభాస్-రాజా-సాబ్-టీజర్ 24 గంటల్లో 59 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" టీజర్
ప్రజా క్షేత్ర్, సినిమా : 
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న "రాజా సాబ్" సినిమా టీజర్ డిజిటల్ వ్యూస్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. నిన్న రిలీజ్ చేసిన ఈ టీజర్ 24 గంటల్లోనే 59 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో నెం.1 ప్లేస్ లో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. టీజర్ కు వస్తున్న భారీ వ్యూస్ "రాజా సాబ్" సినిమా మీద ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వింటేజ్ లుక్ లో ప్రభాస్ కనిపించిన తీరు, గ్రాండ్ మేకింగ్, హై క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు "రాజా సాబ్" టీజర్ ను రిపీటెడ్ గా చూసేలా చేస్తున్నాయి.
డార్లింగ్ ప్రభాస్ ను ఎలా చూడాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారో అలా చూపించారు టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి. డిసెంబర్ 5న "రాజా సాబ్" సాధించబోయే బాక్సాఫీస్ రికార్డులకు టీజర్ సక్సెస్ చిన్న శాంపిల్ గా నిలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ "రాజా సాబ్" చిత్రాన్ని ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో నాయికలుగా నటిస్తున్నారు.

]]>
Tue, 17 Jun 2025 21:56:47 +0530 admin
క్రేజీ మూవీ టైటిల్ గ్లింప్స్ ఈ నెల 19న రిలీజ్ https://prajakshethrenews.com/క్రేజీ-మూవీ-టైటిల్-గ్లింప్స్-ఈ-నెల-19న-రిలీజ్ https://prajakshethrenews.com/క్రేజీ-మూవీ-టైటిల్-గ్లింప్స్-ఈ-నెల-19న-రిలీజ్ యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్ , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు కాంబో క్రేజీ మూవీ టైటిల్ గ్లింప్స్ ఈ నెల 19న రిలీజ్

ప్రజా క్షేత్ర్, సినిమా :
నువ్విలా,జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా, మజాక వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో ఓ క్రేజీ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను ఈ నెల 19న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి నిఖిల కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఓ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా హవీష్, నక్కిన త్రినాథరావు మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా..నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.
నటీనటులు - హవీష్, తదితరులు

]]>
Tue, 17 Jun 2025 21:51:46 +0530 admin
అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సంయుక్త https://prajakshethrenews.com/అత్యంత-ప్రతిష్టాత్మక-పాన్-ఇండియా-ప్రాజెక్ట్-లో-హీరోయిన్-గా-సంయుక్త https://prajakshethrenews.com/అత్యంత-ప్రతిష్టాత్మక-పాన్-ఇండియా-ప్రాజెక్ట్-లో-హీరోయిన్-గా-సంయుక్త విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, పూరి కనెక్ట్స్ అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సంయుక్త

ప్రజా క్షేత్ర్, సినిమా : 
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. హై-ఆక్టేన్ కథలకు పాపులరైన పూరి, తన సిగ్నేచర్ మాస్, కమర్షియల్ స్టయిల్ ని విజయ్ సేతుపతి మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో బ్లెండ్ చేసి ఒక యూనిక్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తారు. అన్ని ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీలు పూర్తయ్యాయి.
ఈ సినిమాలోని కీలక నటీనటులను నిర్మాతలు ఒకరి తర్వాత ఒకరిని అనౌన్స్ చేస్తున్నారు. టబు, దునియా విజయ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు, టాలీవుడ్ లక్కీ చార్మ్‌గా సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఇది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదు. సంయుక్త పాత్ర కథనంలో కీలకంగా ఉంటుంది. ఎమోషనల్ డెప్త్, పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వుండే పాత్రలో కనిపించబోతున్నారు. కథ, ఆమె పాత్రతో సంయుక్త చాలా థ్రిల్ అయ్యింది. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఆసక్తిగా వుంది. ఫస్ట్ షెడ్యూల్ కోసం లొకేషన్లను ఖరారు చేయడానికి టీం ఇటీవల హైదరాబాద్, చెన్నైలలో రెక్కీని పూర్తి చేసింది. జూన్ చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.తారాగణం: విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, విజయ్ కుమార్

]]>
Tue, 17 Jun 2025 21:46:56 +0530 admin
హనుమాన్ జంక్షన్' జూన్ 28న గ్రాండ్ గా రీ&రిలీజ్ https://prajakshethrenews.com/హనుమాన్-జంక్షన్-జూన్-28న-గ్రాండ్-గా-రీ-రిలీజ్ https://prajakshethrenews.com/హనుమాన్-జంక్షన్-జూన్-28న-గ్రాండ్-గా-రీ-రిలీజ్ అర్జున్, జగపతి బాబు, వేణు, మోహన్ రాజా, ఎడిటర్ మోహన్ హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హనుమాన్ జంక్షన్' జూన్ 28న గ్రాండ్ గా రీ-రిలీజ్
ప్రజా క్షేత్ర్, సినిమా : 
2001లో విడుదలైన హనుమాన్ జంక్షన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. యాక్షన్‌ అద్భుతమైన హ్యుమర్ మేళవించిన ఈ సినిమాలో అర్జున్, జగపతి బాబు, వేణు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆయన తరువాత తమిళ 'జయం', 'తనీ ఒరువన్', 'గాడ్‌ఫాదర్' వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు.లయ, స్నేహ, విజయలక్ష్మి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, కోవై సరళ, అలీ, ఎల్.బి. శ్రీరామ్, ఎం.ఎస్. నారాయణ, వేణు మాధవ్ వంటి ప్రముఖులు హాస్య పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.ఎడిటర్ మోహన్ స్థాపించిన ఎం.ఎల్. మూవీ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎం.వి. లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే, ఆకట్టుకునే సంభాషణలు, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు కల్ట్ స్టేటస్‌ను తీసుకువచ్చాయి.ఇప్పుడీ ఎవర్ గ్రీన్ ఎంటర్‌టైనర్ మళ్లీ ప్రేక్షకులను థియేటర్లో అలరించబోతోంది. హనుమాన్ జంక్షన్ ను జూన్ 28న మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అనౌన్స్ చేసింది. ఈ తరహా సినిమాలు ఎప్పుడు వచ్చినా హిట్ అవుతాయి. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్స్ కొరవడుతున్న సమయంలో, హనుమాన్ జంక్షన్ మళ్లీ తన మ్యాజిక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతోంది.
ఈ చిత్రానికి సి. రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, సురేశ్ పీటర్స్ మ్యూజిక్ అందించారు.

]]>
Tue, 17 Jun 2025 21:42:44 +0530 admin
మోహన్ బాబు ఫ్యామిలీతో కలిసి కన్నప్ప చిత్రాన్ని వీక్షించిన సూపర్ స్టార్ రజనీకాంత్ https://prajakshethrenews.com/మోహన్-బాబు-ఫ్యామిలీతో-కలిసి-కన్నప్ప-చిత్రాన్ని-వీక్షించిన-సూపర్-స్టార్-రజనీకాంత్ https://prajakshethrenews.com/మోహన్-బాబు-ఫ్యామిలీతో-కలిసి-కన్నప్ప-చిత్రాన్ని-వీక్షించిన-సూపర్-స్టార్-రజనీకాంత్ ఫ్యామిలీతో కలిసి సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కన్నప్ప’ చిత్రాన్ని వీక్షించడం ఆనందంగా ఉంది : డా. ఎం. మోహన్ బాబు*
*‘కన్నప్ప’ అద్భుతంగా ఉందని సూపర్ స్టార్ రజినీకాంత్ గారు మెచ్చుకున్నారు : విష్ణు మంచు*

ప్రజా క్షేత్ర్, సినిమా : 
దిగ్గజ నటులు రజనీకాంత్, డాక్టర్ ఎం. మోహన్ బాబు కలిసి నటించిన ‘పెద రాయుడు’ చిత్రానికి ముప్పై ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చెన్నైలో వీరిద్దరూ కలుసుకుని నాటి జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నారు. జూన్ 15, 1995న విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. సినిమా విడుదలై ముప్పై ఏళ్లు అవుతున్న సందర్భంగా ఇలా చెన్నైలో రజినీకాంత్, మోహన్ బాబు సందడి చేశారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కన్నప్ప’ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. కన్నప్ప చిత్రాన్ని వీక్షించిన రజినీకాంత్ తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. సినిమా అద్భుతంగా ఉందని విష్ణుని కొనియాడారు. ఈ మేరకు విష్ణు మంచు సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘కన్నప్ప’ చిత్రాన్ని రజినీకాంత్  ప్రత్యేకంగా వీక్షించారు. సినిమాను చూసిన తరువాత నన్ను గట్టిగా హత్తుకున్నారు. ‘కన్నప్ప’ ఎంతో నచ్చిందని ఆయన అన్నారు. ఈ క్షణం కోసం నేను గత 22 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. నా నటనను ఆయన ఎప్పుడు మెచ్చుకుంటారు.. ఇలా ఎప్పుడు హత్తుకుంటారు అని అనుకుంటూ ఉన్నాను.. ఆ కల ఇప్పుడు నెరవేరింది. నాకు ఈ రోజు ఎంతో ఆనందంగా, సంతోషంగా, గర్వంగా ఉంది’ అని అన్నారు.
డా. ఎం. మోహన్ బాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘జూన్ 15కి ‘పెద రాయుడు’ రిలీజ్ అయి 30 ఏళ్లు పూర్తయ్యాయి. అదే రోజు నా ప్రియ మిత్రుడు రజినీకాంత్ ‘కన్నప్ప’ చిత్రాన్ని వీక్షించారు. ఆయన తన ఫ్యామిలీతో సహా మూవీని వీక్షించారు. సినిమా చూసిన తరువాత ఆయన కురిపించిన ప్రేమ, ప్రశంసలు, ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను. థాంక్యూ మిత్రమా’ అని అన్నారు.

]]>
Tue, 17 Jun 2025 21:36:51 +0530 admin
జూలై 11న హీరో సుహాస్‌ బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ' ఓ భామ అయ్యో రామ' విడుదల https://prajakshethrenews.com/జూలై-11న-హీరో-సుహాస్-బ్యూటిఫుల్-రొమాంటిక్-ఎంటర్టైనర్-ఓ-భామ-అయ్యో-రామ-విడుదల https://prajakshethrenews.com/జూలై-11న-హీరో-సుహాస్-బ్యూటిఫుల్-రొమాంటిక్-ఎంటర్టైనర్-ఓ-భామ-అయ్యో-రామ-విడుదల జూలై 11న హీరో సుహాస్‌ బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ' ఓ భామ అయ్యో రామ' విడుదల
ప్రజా క్షేత్ర్, సినిమా :
సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న  నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో  కథానాయికగా పరిచయమవుతోంది.  రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి  స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు, పాటలకు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రాన్ని జూలై11న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ '' ఇదొక బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్. అన్ని వర్గాలకు కావాలసిన అంశాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందర్ని అలరిస్తుంది. ఇదొక క్యూట్‌ అండ్‌ ఎంటర్‌టైనింగ్‌ లవ్‌స్టోరీలా సినిమాలోని  ప్రతి ఫేమ్‌ కలర్‌ఫుల్‌గా ఉంది. సుహాస్‌ ఎంతో ఎనర్జీ ఈ సినిమాకు బిగ్గెస్ట్‌ ప్లస్‌.   రామ్‌గా సుహాస్‌, సత్యభామగా మాళవిక మనోజ్‌లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు. హీరోయిన్‌ మాళవిక, హీరో సుహాస్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో వినోదాన్ని పంచుతాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడా  కూడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్  అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ సాధారణంగా లవ్ రొమాంటిక్ కామెడీ సినిమాలను అందరం ఇష్టపడుతుంటాము. ఇప్పుడు అదే తరహాలో సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ఓ భామ అయ్యో రామ. అందరిని నవ్వించే వినోదమైన యువకుడి చుట్టూ తిరిగే ఓ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించాం. తప్పకుండా ఈ చిత్రం సుహాస్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుంది. జూలై 11న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు థియేటర్‌లో ఎంజాయ్‌ చేస్తారు' అన్నారు.
నటీనటులు : సుహాస్, మాళవిక మనోజ్, అనిత హసానందిని, ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కరుమంచి, మొయిన్, సాత్విక్ ఆనంద్, నయని పావని తదితరులు.

]]>
Tue, 17 Jun 2025 21:31:29 +0530 admin
‘సయారా’ కొత్త పాట ‘తుమ్ హో తో’ ప్రమోషన్‌లో మోహిత్ సూరి https://prajakshethrenews.com/సయారా-కొత్త-పాట-తుమ్-హో-తో-ప్రమోషన్లో-మోహిత్-సూరి https://prajakshethrenews.com/సయారా-కొత్త-పాట-తుమ్-హో-తో-ప్రమోషన్లో-మోహిత్-సూరి నా పాటలే విశాల్ మిశ్రాని సంగీత ప్రపంచంలో కెరీర్‌ కొనసాగించేలా ప్రేరేపించాయని తెలియడం ఆనందంగా ఉంది

- ‘సయారా’ కొత్త పాట ‘తుమ్ హో తో’ ప్రమోషన్‌లో మోహిత్ సూరి

ప్రజా క్షేత్ర్, సినిమా :
యష్ రాజ్ ఫిల్మ్స్, మోహిత్ సూరి కాంబోలో రూపొందుతున్న ‘సయారా’ బెస్ట్ మ్యూజికల్ ఆల్బమ్‌గా మారుతోంది. చార్ట్‌బస్టర్ సయారా టైటిల్ ట్రాక్ తర్వాత జుబిన్ నౌటియాల్ పాడిన ‘బర్బాద్’ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇప్పుడు మూడవ పాటను రిలీజ్ చేశారు.  ఇండియన్ సెన్సేషనల్ సింగర్ విశాల్ మిశ్రా ఈ థర్డ్ సింగిల్ ‘తుమ్ హో తో’ని ఆలపించారు. ఈ పెప్పీ లవ్ ట్రాక్‌ను మేకర్స్ మంగళవారం (జూన్ 17) నాడు విడుదల చేశారు! ఈ మూడో పాట రిలీజ్ సందర్భంగా మోహిత్ సూరి మాట్లాడుతూ..  ‘12 సంవత్సరాల క్రితం విశాల్ నన్ను కలవడానికి వచ్చినప్పటి నుండి నేను, తను కలిసి ఓ ప్రత్యేకమైన సినిమా కోసం పనిచేయాలని అనుకున్నాము. మేము సరైన క్షణం కోసం వేచి చూస్తున్నాం. చివరకు అది సయారాతో నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా పాటలే అతన్ని సంగీత ప్రపంచంలోకి తీసుకు వచ్చాయని, అవే స్పూర్తి నింపాయని విశాల్ చెప్పడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. మన పని ఎవరిపైన అయినా ఇలాంటి ప్రభావాన్ని చూపుతుందని తెలుసుకున్నప్పుడు అదొక గొప్ప అనుభూతిని ఇస్తుంది. సంగీతానికి ప్రజల హృదయాలను తాకే సామర్థ్యం ఉందని, అది చాలా స్వచ్ఛమైన మాధ్యమమని నేను ఎప్పుడూ భావించాను. కాబట్టి నా 20 సంవత్సరాల దర్శకత్వం, సంగీత సృష్టిలో నా పాటల ద్వారా ప్రజలకు ఎన్నో జ్ఞాపకాలను సృష్టించినందుకు నాకు నేనే కృతజ్ఞుడిగా భావిస్తుంటాను. నా కెరీర్‌లో నేను కలిసిన అత్యంత ప్రతిభావంతులైన కళాకారులలో విశాల్ మిశ్రా ఒకరు. సయారా మ్యూజిక్ ఆల్బమ్‌లో ఆయన పాట పాడటం నా అదృష్టం. 12 సంవత్సరాలుగా నన్ను కలుస్తూనే ఉన్నప్పటి నుండి విశాల్ నాకు ఇచ్చిన గీతాలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ అద్భుతాలే.
విశాల్ గురించి, అతని టాలెంట్ గురించి, అతని ఎదుగుదల గురించి తెలుసుకోవడం నాకు ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. తుమ్ హో తో పాటతో మరోసారి అద్భుతాన్ని క్రియేట్ చేశారు. సయారా సినిమా నుండి మూడవ పాటతో అతని ప్రతిభను బయటపెట్టడానికి మేం ఎంతో ఎదురుచూశాం. అతని సంగీతాన్ని ఇష్టపడే వారు, అతని అత్యుత్తమ రొమాంటిక్ పాటను విని ఎంతో థ్రిల్ అవుతారు. విశాల్ సంగీతాన్ని ఇష్టపడే వారు తుమ్ హో తో పాటతో ప్రేమలో పడతారు’ అని అన్నారు.
‘సయారా’ టీజర్‌కు అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. కాలాతీత ప్రేమకథలను సృష్టించడంలో పేరుగాంచిన YRF, మోహిత్‌లు ఈ సారి మరోసారి కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీని ఆడియెన్స్‌కు అందించబోతోన్నారు. సయ్యారా టైటిల్ కూడా ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. దీని అర్థం సంచరించే నక్షత్రం. ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ, ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడూ ఎవ్వరికీ అందదు. కేవలం వర్ణించడానికి ఉపయోగిస్తారు.ఈ చిత్రం ద్వారా అహాన్ పాండేను హిందీ చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం చేస్తున్నారు. అనీత్ పద్దా ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. సయారాను అక్షయ్ విధాని నిర్మించారు. జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. YRF గత 50 సంవత్సరాల సినీ చరిత్రలో భారతదేశానికి అన్ని కాలాలలోనూ కల్ట్ రొమాంటిక్ చిత్రాలను అందించింది. ప్రధానంగా యష్ చోప్రా, ఆదిత్య చోప్రా దర్శకత్వంలో ఎన్నో గొప్ప ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. మోహిత్ సూరి గతంలో ఆషికి 2, మలంగ్, ఏక్ విలన్ వంటి గొప్ప లవ్, రొమాంటిక్ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

]]>
Tue, 17 Jun 2025 21:28:11 +0530 admin
రాజా సాబ్" మూవీకి ఆకర్షణగా నిలవనున్న రికార్డ్ స్థాయి భారీ హారర్ సెట్ https://prajakshethrenews.com/రాజా-సాబ్-మూవీకి-ఆకర్షణగా-నిలవనున్న-రికార్డ్-స్థాయి-భారీ-హారర్-సెట్ https://prajakshethrenews.com/రాజా-సాబ్-మూవీకి-ఆకర్షణగా-నిలవనున్న-రికార్డ్-స్థాయి-భారీ-హారర్-సెట్ రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" మూవీకి ఆకర్షణగా నిలవనున్న రికార్డ్ స్థాయి  భారీ హారర్ సెట్
ప్రజా క్షేత్ర్, సినిమా : 
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్". ఈ సినిమా డిసెంబర్ 5న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  "రాజా సాబ్" సినిమాకు వేసిన భారీ హవేలీ సెట్ ప్రధాన ఆకర్షణ కాబోతోంది. 41,256 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ ఈ రికార్డ్ స్థాయి హవేలీ సెట్ ను రూపొందించారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మరే హారర్ మూవీకి ఇంత భారీ సెట్ నిర్మించలేదు."రాజా సాబ్" హవేలీ సెట్ గురించి ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ స్పందిస్తూ - హవేలీలోని ప్రతి అడుగు ఒక ఎమోషన్ ను వ్యక్తీకరిస్తుంది. చూసేందుకు మాత్రమే హాంటెడ్ హౌస్ లా ఉండటం కాదు. హాంటెడ్ హౌస్ లో మనమంతా ఉన్న ఫీల్ కలిగిస్తుంది. ఈ హవేలీ చూస్తుంటే మీకు కథలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అన్నారు. జూన్ 16 సోమవారం "రాజా సాబ్" టీజర్ లాంఛ్ తో పాటు నేషనల్, స్టేట్ మీడియాకు ఈ హవేలీని ప్రత్యక్షంగా చూపించబోతున్నారు. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా "రాజా సాబ్" ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో నటిస్తుండటంతో "రాజా సాబ్" సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

]]>
Mon, 16 Jun 2025 13:46:50 +0530 admin
ఘనంగా కన్నప్ప’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ https://prajakshethrenews.com/ఘనంగా-కన్నప్ప-ట్రైలర్-లాంచ్-ఈవెంట్ https://prajakshethrenews.com/ఘనంగా-కన్నప్ప-ట్రైలర్-లాంచ్-ఈవెంట్ *ఆ శివుడి అనుగ్రహం ఈ ‘కన్నప్ప’ చిత్రంపై ఉండాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మోహన్‌లాల్*                                                                                      
*‘తుడరుమ్’ కంటే ఎక్కువ కలెక్షన్స్ ఇవ్వాలని మోహన్‌లాల్ అభిమానుల్ని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మోహన్ బాబు*                                                                                
*మోహన్‌లాల్ తో నటించడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం నా పూర్వ జన్మ సుకృతం.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విష్ణు మంచు*

ప్రజా క్షేత్ర్, సినిమా :
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం. మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు, పోస్టర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇక శనివారం నాడు కొచ్చిలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో..*మోహన్‌లాల్ మాట్లాడుతూ* .. ‘ప్రస్తుతం అంతా ప్యాన్ ఇండియన్ ట్రెండ్ నడుస్తోంది. భాషా హద్దుల్లేకుండా సినిమాల్ని తీస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అద్భుతంగా వచ్చింది. ఇంత మంచి చిత్రంలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది. అన్ని భాషల నటీనటులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి ఈ మూవీని చేశారు. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన మెహన్ బాబు కి, విష్ణుకి థాంక్స్. శివుడుకి కన్నప్ప గొప్ప భక్తుడు. అలాంటి గొప్ప భక్తుడి కథను ఎంతో గొప్పగా నిర్మించారు. న్యూజిలాండ్‌లో ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. మోహన్ బాబు ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ. ఆ శివుడి అనుగ్రహం ఈ ‘కన్నప్ప’ చిత్రంపై ఉండాలని కోరుకుంటున్నాను. జూన్ 27న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.*డా. మోహన్ బాబు మాట్లాడుతూ* .. ‘‘మోహన్‌లాల్ నాకు సోదరుడి వంటి వారు. ఇక్కడ మోహన్‌లాల‌్‌తో ప్రియదర్శిని తీసిన ‘చిత్రం’ మూవీని తెలుగులో నేను ‘అల్లుడు గారు’ అని రీమేక్ చేశాను. అలా జీరో నుంచి మళ్లీ స్టార్ హీరోగా నిలిచాను. అలా మా బంధం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లాల్ ఏమాత్రం మారలేదు. శారీరకంగా, మానసికంగా అలానే ఉన్నారు. స్వచ్చమైన ఆలోచనలు, హృదయం ఉన్నవారే ఇలా ఉండగలుగుతారు. మోహన్‌లాల్  గొప్ప నటులు. ఆయన ఎంత స్థాయిలో ఉన్నా కూడా వెంట ఒక మేకప్ మెన్ మాత్రమే వస్తారు. మా అందరి కంటే సెట్‌లోకి ముందు వస్తుండేవారు. ఈ మూవీ కోసం ఇంత వరకు మోహన్‌లాల్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆయన చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. లాల్ గారితో నటించే అవకాశం విష్ణుకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయనతో కలిసి ఎప్పుడూ నటించలేకపోయాను.  ఇప్పుడైనా నాకు ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాను. జూన్ 27న మా కన్నప్ప చిత్రం రాబోతోంది. అందరూ చూసి మా చిత్రయూనిట్‌ను ఆశీర్వదించండి. ‘తుడరుమ్’ కంటే ఎక్కువ కలెక్షన్స్ ఇవ్వాలని మోహన్‌లాల్ అభిమానుల్ని కోరుకుంటున్నాను’ అని అన్నారు. *విష్ణు మంచు మాట్లాడుతూ.* . ‘‘కన్నప్ప’ గురించి ఇక నేను చెప్పాల్సిన పని లేదు. మీరు ఆల్రెడీ విజువల్స్ చూశారు. ఈ మూవీ ఆ శివుడి ఆశీస్సులతోనే జరిగింది. మా చిత్రం జూన్ 27న రాబోతోంది. మోహన్‌లాల్ కి నేను పెద్ద అభిమానిని. ఆయన నాకు తండ్రి సమానులు. ఆయన మా కుటుంబ సభ్యులు. మోహన్‌లాల్ ప్రభావం అన్ని తరాలపై ఉంటుంది. ట్రైలర్ చూస్తే మోహన్‌లాల్  పాత్ర ఏంటో అర్థం అవుతోంది. ఆ సర్ ప్రైజ్ ఏంటో నేను ఇప్పుడే చెప్పలేను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా పూర్వ జన్మ సుకృతం. మోహన్‌లాల్  ఎంతో ఒదిగి ఉంటారు. ప్రభాస్ నా స్నేహితులు. మా నాన్న గారంటే ప్రభాస్‌కి ఎనలేని గౌరవం ఉంటుంది. మా మూవీని రిలీజ్ చేస్తున్న ఆశీర్వాద్ సినిమాకు థాంక్స్’ అని అన్నారు.
*ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ* .. ‘పరుశురాముడు, ఆది శంకరాచార్యులు నడయాడిన నేల ఇది. ఆది శంకరాచార్యులు శివుడికి గొప్ప భక్తుడు. కన్నప్ప కూడా గొప్ప శివ భక్తుడు. సినిమాను అందరూ ప్రేమతో, ఇష్టంతో తీస్తారు. మేం మాత్రం ఈ మూవీని శివుడికి ఓ ప్రార్థనలా తీశాం. శివతత్త్వాన్ని చాటేలా ఈ మూవీని తీశాం. మోహనుడు అని కృష్ణుడ్ని అంటాం. అలా నేను ఈ మూవీలో ఇద్దరు మోహన్‌లతో పని చేశాను. మోహన్ బాబు , మోహన్‌లాల్  అద్భుతమైన నటులు. నటనపై ప్యాషన్, డెడికేషన్, సినిమా పట్ల ఉన్న నాలెడ్జ్ గురించి మోహన్ బాబు  నుంచి ఎంతో నేర్చుకున్నాను. లాల్ గారి నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆఫ్ స్క్రీన్‌లో లాల్ ని చూసిన తరువాత నేను కూడా ఆయనలానే ఉండాలని అనుకుంటున్నాను. విష్ణు ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. అయ్యప్వ స్వామి గుడిని ఈ రోజు తెరుస్తున్నారు. ఈ రోజు మా ట్రైలర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు కూడా మా సినిమాపై ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*అర్పిత్ రంకా మాట్లాడుతూ* .. ‘‘కన్నప్ప’ లాంటి చిత్రంలో అవకాశం రావడం అదృష్టం. ఆ శివుడి ఆశీస్సులతోనే ఈ మూవీని చేయగలిగాం. విష్ణు , మోహన్ బాబు , అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్  వంటి వారితో పని చేయడం ఆనందంగా ఉంది. రీసెంట్‌గా నేను మోహన్‌లాల్ తుడరం సినిమా చూశాను. అద్భుతంగా అనిపించింది. కన్నప్ప లాంటి చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. మా సినిమాను జూన్ 27న అందరూ చూడండి’ అని అన్నారు.
*ముఖేష్ రిషి మాట్లాడుతూ* .. ‘‘కన్నప్ప’ కోసం విష్ణు చాలా కష్టపడ్డారు. ఇంత గొప్ప చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది. విష్ణు మా అందరినీ ఎంతో అద్భుతంగా చూసుకున్నారు. ఈ మూవీని ఆ శివుడు ఆశీర్వదిస్తారు. మోహన్ బాబు తో పని చేయడం ఆనందంగా ఉంది. కన్నప్ప టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
*ఆశీర్వాద్ అధినేత ఆంటోని పెరంబవూర్ మాట్లాడుతూ* .. ‘మోహన్ బాబు సినిమా అంటే మా సినిమా. ఇది మా సొంత చిత్రం. ఈ మూవీని అందరూ ప్రేమిస్తారు’ అని అన్నారు.

]]>
Mon, 16 Jun 2025 13:43:44 +0530 admin
'8 వసంతాలు' విజువల్లీ పొయెటిక్, హార్ట్ టచ్చింగ్ ట్రైలర్ రిలీజ్ https://prajakshethrenews.com/8-వసంతాలు-విజువల్లీ-పొయెటిక్-హార్ట్-టచ్చింగ్-ట్రైలర్-రిలీజ్ https://prajakshethrenews.com/8-వసంతాలు-విజువల్లీ-పొయెటిక్-హార్ట్-టచ్చింగ్-ట్రైలర్-రిలీజ్  '8 వసంతాలు' విజువల్లీ పొయెటిక్, హార్ట్ టచ్చింగ్ ట్రైలర్ రిలీజ్
ప్రజా క్షేత్ర్, సినిమా : 
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు' ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ. అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్, టీజర్లు, పాటలు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ రోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ని రిలీజ్ చేశారు.
'ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు. అంత్యక్రియలకి కర్మ కాండలకు వాళ్లు పనికిరారు'' అంటూ ఓ క్యారెక్టర్ చెప్పిన మాటలకు  ''పేగు పంచి ప్రాణం పొయ్యగలిగిన వాళ్ళం.. చితిముట్టించి మోక్షం ఇప్పించలేమా''అంటూ అనంతిక బదులు చెప్పిన సన్నివేశంతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. ఇది కేవలం ఒక మహిళ ప్రయాణం కాదు, సమాజంలో చెరపాల్సిన మూఢనమ్మకాలకు ఎదురు నిలిచే కథని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. తండ్రి చేతే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతూ, ఆనందం, ప్రేమ, విషాదం లాంటి అనుభూతులతో అనంతిక  ప్రయాణం సాగుతుంది. ప్రతి వసంతం ఒక కీలక మలుపు. ఆమె ఒక కుమార్తెగా మొదలై, కొన్ని విధానాలను ఎదిరించే ధైర్యవంతురాలిగా మారడాన్ని ట్రైలర్ అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. అనంతికా సనీల్‌కుమార్ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. ఆమె క్యారెక్టర్ లో ఎమోషన్స్ ని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఒక మటన్ షాప్‌లో జరిగే యాక్షన్ సీన్‌ ఆమె ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల ముఖ్య పాత్రలలో ఆకట్టుకున్నారు. వీరి పాత్రలు కూడా కథకు అర్థవంతమైన బలాన్నిస్తాయి. లోతైన కథలు చెప్పడంలో పాపులరైన దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి కథనాన్ని కవిత్వం లాగా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ప్రతి భావోద్వేగాన్ని అద్భుతంగా క్యాప్చర్ చేస్తుంది. హెషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం మనసుని తాకేలా వుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు అత్యుత్తమంగా వున్నాయి.ఆర్ట్ డైరెక్షన్ అరవింద్ ములే, ఎడిటింగ్ శశాంక్ మాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాబాసాయి కుమార్ మామిడిపల్లి.
బోల్డ్ కథనం, అద్భుతమైన విజువల్స్, మరపురాని పెర్ఫార్మెన్స్ లతో ‘8 వసంతాలు’ భావోద్వేగాలతో నిండిన సినిమాటిక్ అనుభూతిని ఇవ్వనుంది. ఈ మనసుకు తాకే విజువల్ వండర్ జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: అనంతిక సనిల్‌కుమార్, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్

]]>
Mon, 16 Jun 2025 13:36:37 +0530 admin
ఘనంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ https://prajakshethrenews.com/ఘనంగా-తెలంగాణ-గద్దర్-ఫిల్మ్-అవార్డ్స్ https://prajakshethrenews.com/ఘనంగా-తెలంగాణ-గద్దర్-ఫిల్మ్-అవార్డ్స్ ఘనంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

ప్రతిష్టాత్మక “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024” వేడుక హైదరాబాద్ హైటెక్స్‌లో కన్నుల పండుగగా సాగింది. అత్యంత వైభవంగా సాగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  పాల్గొని వివిధ విభాగాల్లో ఉత్తమ అవార్డులకు ఎంపికైన ప్రముఖులకు పురస్కారాలను అందించారు.14 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వం పునరుద్ధరించడమే కాకుండా 2014-24 వరకు పదేళ్ల కాలానికి గానూ సినిమా రంగంలో ఉత్తమ అవార్డులతో పాటు చలనచిత్ర వైతాళికుల పేరుతో నెలకొల్పిన ప్రత్యేక పురస్కారాలను కూడా ఈ వేడుక ద్వారా అందించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , తెలంగాణ ఫిల్మ్ డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుల సమక్షంలో ముఖ్యమంత్రి  అవార్డులకు ఎంపికైన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులు, చలన చిత్ర పరిశ్రమలో విశేష కృషి చేసిన ప్రముఖులకు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను అందజేశారు.ఎన్టీఆర్ జాతీయ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణ కి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డును మణిరత్నంకి, బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డును శ్రీసుకుమార్, నాగిరెడ్డి, చక్రపాణి ఫిల్మ్ అవార్డును అట్లూరి పూర్ణచందర్ రావు , కాంతారావు ఫిల్మ్ అవార్డును విజయ్ దేవరకొండ కి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డును యండమూరి వీరేంద్రనాథ్ కి, ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ కి, ఉత్తమ నటి అవార్డును నివేదా థామస్ కి అందజేశారు. ఇవే కాకుండా అనేక విభాగాల్లో అవార్డులను అందజేశారు.ఆస్కార్ అవార్డు గ్రహీతలు చంద్రబోస్, ఎంఎం కీరవాణి లను ఈ వేదికగా ముఖ్యమంత్రి  సత్కరించారు. గద్దర్ జయంతి వేడుకల నిర్వహణలో భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వం తరఫున మూడు కోట్ల రూపాయలకు సంబంధించిన పత్రాన్ని గద్దర్ ఫౌండేషన్ సూర్యకిరణ్ కు అందజేశారు.సినీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రజాగాయకుడు గద్దర్ పేరిట అవార్డులను పునరుద్ధరించడం పట్ల నటీనటులు, సినీ పరిశ్రమ ప్రముఖులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

]]>
Sun, 15 Jun 2025 11:08:08 +0530 admin
ఘనంగా 'మిత్ర మండలి' టీజర్ ఆవిష్కరణ https://prajakshethrenews.com/ఘనంగా-మిత్ర-మండలి-టీజర్-ఆవిష్కరణ https://prajakshethrenews.com/ఘనంగా-మిత్ర-మండలి-టీజర్-ఆవిష్కరణ ఘనంగా 'మిత్ర మండలి' టీజర్ ఆవిష్కరణ 
'మిత్ర మండలి' టీజర్ చాలా బాగుంది : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్

ప్రజా క్షేత్ర్, సినిమా :
బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మిత్ర మండలి'. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రం అపరిమిత వినోదాన్ని అందించనుందనే నమ్మకాన్ని పోస్టర్ కలిగించింది. తాజాగా 'మిత్ర మండలి' టీజర్ ను నిర్మాతలు విడుదల చేశారు. టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు(జూన్ 12) ఉదయం హైదరాబాద్ లోని ఏఏఏ సినిమాస్ లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్వరలో థియేటర్లలో నవ్వుల పండుగ రాబోతుందని చాటిచెప్పేలా 'మిత్ర మండలి' టీజర్ ఉంది. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా పోటాపోటీగా టీజర్ లో నవ్వులు పంచారు. క్రికెట్ తరహా కామెంటరీతో టీజర్ ను వినోదభరితంగా మలిచిన తీరు ఆకట్టుకుంది. "బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడతారు.. బోర్డు లేకుండా క్యారమ్స్ ఆడతారు.. రోజూ ఎవరో ఒకర్ని ఎర్రిపప్పని చేస్తారు" అంటూ ప్రధాన పాత్రధారులు ఎలాంటి హాస్యాన్ని పంచబోతున్నారో చెప్పకనే చెప్పేశారు. ఇక టీజర్ లో వెన్నెల కిషోర్, సత్య మధ్య కామెడీ డైలాగ్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆద్యంతం నవ్వులు పంచుతున్న ఈ 'మిత్ర మండలి' టీజర్.. నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, "బన్నీ వాసు సమర్పిస్తున్న మొదటి సినిమాగా, నా మిత్రులందరూ కలిసి తీసిన ఈ 'మిత్ర మండలి' టీజర్ ను లాంచ్ చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. నేను యంగ్ స్టర్స్ తో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంటాడు. దాని వల్ల స్క్రిప్ట్ ఎంపిక వంటి విషయాల్లో ఎంతో హెల్ప్ జరుగుతుంటుంది. ఒకసారి వాసు ఈ కథ వినమని దర్శకుడిని నా దగ్గరకు పంపించాడు. కానీ, మీ ముందు కథ చెప్పలేకపోతున్నాను అని దర్శకుడు వెళ్ళిపోయాడు. నేను కథ వినకుండానే, నేరుగా ఈ సినిమా చూడబోతున్నాం. వీరందరి మాటలు వింటుంటే.. దర్శకుడిలో ఎంతో ప్రతిభ ఉందని అర్థమవుతోంది. ప్రియదర్శి మాకు ఒక వెబ్ సిరీస్ చేశాడు. అప్పుడే అనిపించింది.. ఇతను మంచి స్థాయికి వెళ్తాడని. యాక్టర్ గా ఎంత చేయాలో, ఎంత చేయకూడదో తెలిసిన మనిషి. కోర్ట్ సినిమాలో అద్భుతంగా నటించాడు. సోషల్ మీడియాలో నిహారికకు మంచి ఫాలోయింగ్ ఉంది. తనకి ఆల్ ది బెస్ట్. నిర్మాతలతో నాకు మంచి అనుబంధం ఉంది. టీజర్ చాలా బాగుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకంటూ, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్." అన్నారు. అతిథి, దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ, "ఈ మిత్ర మండలి చిత్ర దర్శకుడు విజయ్ నాకు స్నేహితుడు. అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఈ స్టోరీ రెడీ చేసుకున్నాడు. రైటింగ్ క్రేజీగా ఉంటుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి యువ ప్రతిభను ప్రోత్సహిస్తున్న బన్నీ వాస్ కి కృతఙ్ఞతలు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్." అన్నారు.
అతిథి, నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ, "ఏ హోమం చేసినా మనం ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం. మా సినిమా వేడుకలకు గణపతి, ఆది దేవుడు అల్లు అరవింద్ నన్ను, బన్నీ వాసుని ఆయన బిడ్డల్లాగే చూసుకుంటారు. చేతి ఐదు వేళ్ళు విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తాయి కానీ, కలిసే ఉంటాయి. అరవింద్  ప్రోత్సహించిన కుటుంబం మేము. మేమంతా ఎప్పుడూ కలిసే ఉంటాం. ఆయన కోసం మేము పిడికిలిగా మారడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఈ మిత్ర మండలి టీజర్ చూస్తుంటే జాతి రత్నాలు, మ్యాడ్, ఆయ్, సింగిల్ సినిమాల వైబ్ వస్తుంది. అవన్నీ హిట్ సినిమాలే. మిత్ర మండలి వాటిని మించిన విజయం సాధించాలని కోరుకుంటున్నాను." అన్నారు.
చిత్ర సమర్పకులు, నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ, "ఒక నలుగురు కుర్రాళ్ళు కలిసి చేసే బడ్డీ కామెడీ ఎలా ఉంటుందో.. మిత్ర మండలి అలా ఉంటుంది. ఇలాంటి సినిమా తీయడానికి 'జాతిరత్నాలు' స్ఫూర్తి. ఒక నలుగురు స్నేహితులు సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడితే చూడటానికి ఎంత బాగుంటుంది. ఇది యంగ్ స్టర్స్ అంతా కలిసి తీసిన సినిమా. మేము వాళ్ళకి మా వంతు సపోర్ట్ ఇచ్చాము. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక అందరూ అద్భుతంగా చేశారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ - సత్య ట్రాక్ అదిరిపోతుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. థియేటర్లకు వచ్చి మనస్ఫూర్తిగా నవ్వుకోండి. ఈ సందర్భంగా అరవింద్ కి, అనుదీప్ గారికి, మిత్రుడు ఎస్.కె.ఎన్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు. అల్లు అరవింద్ మాకు గాడ్ ఫాదర్ లాంటివారు. ఆయన చేతుల మీదుగా టీజర్ లాంచ్ జరగడం సంతోషంగా ఉంది. నా లైఫ్ లో మా తల్లిదండ్రులు కంటే కూడా అరవింద్ తోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఆయన వల్లే మేము ఎదిగాము. సినీ పరిశ్రమలో నేను ఏం సాధించినా దానికి అరవింద్ కే కారణం." అన్నారు.
చిత్ర నిర్మాత భాను ప్రతాప మాట్లాడుతూ, "అల్లు అరవింద్ మా టీజర్ లాంచ్ కి చాలా సంతోషంగా ఉంది. ఆయన రాక మా అందరికీ ఎంతో ఎనర్జీ ఇచ్చింది. అలాగే, అనుదీప్  మాకు రైటింగ్ పరంగా ఎంతో సహాయం అందించారు. ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని నమ్మకంగా ఉన్నాము." అన్నారు.చిత్ర దర్శకుడు విజయేందర్ ఎస్ మాట్లాడుతూ, "మా టీజర్ లాంచ్ ఈవెంట్ కి విచ్చేసిన అల్లు అరవింద్ కి, నా మిత్రుడు అనుదీప్ కి, అందరికీ నా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతుంది. నేను రాసిన కామెడీని నటీనటులంతా తెరమీద అద్భుతంగా పండించారు." అన్నారు.
చిత్ర కథానాయకుడు ప్రియదర్శి మాట్లాడుతూ, "టీజర్ మీ అందరికీ నచ్చింది కదా. సినిమా అంతకుమించి ఎన్నో రెట్లు వినోదాన్ని పంచబోతుంది. ఈ సినిమా కథ చాలా బాగుంది. అందుకే ఇంతమంది నిర్మాతలు ముందుకు వచ్చారు. వాసు మా అందరినీ నడిపించారు. మా లాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్న అల్లు అరవింద్ కి ధన్యవాదాలు. విజయ్ లాంటి రచయితలు, దర్శకులు సినీ పరిశ్రమకు రావాలి. ఈ సినిమా థియేటర్లలో మీ అందరినీ నవ్విస్తుందని నమ్ముతున్నాను." అన్నారు. చిత్ర కథానాయిక నిహారిక మాట్లాడుతూ, "ఇంత మంచి సినిమా నా మొదటి తెలుగు చిత్రం కావడం సంతోషంగా ఉంది. టాలెంటెడ్ యాక్టర్స్ ఈ సినిమాలో నటించారు. వాళ్ళ కామిక్ టైమింగ్ అదిరిపోతుంది. వారందరి నుంచి నేనెంతో నేర్చుకున్నాను. అల్లు అరవింద్ కి, బన్నీ వాసు కి, దర్శక నిర్మాతలకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. " అన్నారు. వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న 'మిత్ర మండలి' చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే, ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా వ్యవహరిస్తున్నారు.
'మిత్ర మండలి' అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించడానికి త్వరలోనే థియేటర్లలో అడుగుపెట్టనుంది.
చిత్రం: మిత్ర మండలి
తారాగణం: ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్.ఎం.

]]>
Thu, 12 Jun 2025 22:21:07 +0530 admin
#గోపీచంద్33& అద్భుతమైన గోపీచంద్ బర్త్ డే గ్లింప్స్ రిలీజ్ https://prajakshethrenews.com/గోపీచంద్33-అద్భుతమైన-గోపీచంద్-బర్త్-డే-గ్లింప్స్-రిలీజ్ https://prajakshethrenews.com/గోపీచంద్33-అద్భుతమైన-గోపీచంద్-బర్త్-డే-గ్లింప్స్-రిలీజ్ #గోపీచంద్33- అద్భుతమైన గోపీచంద్ బర్త్ డే గ్లింప్స్ రిలీజ్

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి, శ్రీనివాసా చిట్టూరి, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, పవన్ కుమార్ ప్రజెంట్స్ హిస్టారికల్ ఫిల్మ్ #గోపీచంద్33- అద్భుతమైన గోపీచంద్ బర్త్ డే గ్లింప్స్ రిలీజ్
ప్రజా క్షేత్ర్, సినిమా : 
మాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం తన కొత్త చిత్రం #గోపీచంద్33 లో నటిస్తున్నారు. విజనరీ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.  పవన్ కుమార్ సమర్పణలో నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ ఎపిక్ షూటింగ్ జరుగుతోంది.గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకుని, మేకర్స్ అద్భుతమైన  పోస్టర్, గ్లింప్స్‌ను విడుదల చేశారు. గోపీచంద్ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఒక యోధుడిగా అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. పొడవాటి జుట్టు, యుద్ధగాయాలు, నుదిటిపై వీర తిలకంతో కనిపించిన ఇంటెన్స్ లుక్ ఫ్యాన్స్‌ను సర్ ప్రైజ్ చేసింది. చేతిలో ఖడ్గంతో యుద్ధరంగంలో కనిపించిన ఈ పోస్టర్ శక్తి, శౌర్యాన్ని ప్రజెంట్ చేస్తోంది.మంచుతో కప్పబడిన అద్భుతమైన పర్వత శ్రేణుల నడుమ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఓ యోధుడు తన టెంట్ నుంచి బయటకు వస్తాడు. తాను ప్రేమగా పెంచిన గుర్రంతో మమేకమయ్యే విజువల్ లో తన తలను గుర్రం తలపై ఆనిస్తూ, మౌనంగా ఓ వాగ్దానాన్ని చేస్తాడు. దీనికి బ్యాక్గ్రౌండ్‌లో “ధీర ధీర” సంగీతం మ్యాజికల్ అనుభూతిని కలిగిస్తుంది. ఈ విజువల్స్ మనసును తాకుతూనే పవర్‌ఫుల్‌గా, పీస్ మెడిటేటివ్ ఫీల్‌ను ఇస్తున్నాయి.
IB 71 (ఆకాశంలో), ఘాజి (నీటిలో), అంతరిక్షం (అంతరిక్షంలో) వంటి విభిన్న కథనాల చిత్రాలతో తన ప్రత్యేక కథనశైలి, సాంకేతిక నైపుణ్యంతో గుర్తింపు పొందిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి, ఇప్పుడు మరో డిఫరెంట్ జానర్ లోకి అడుగుపెట్టారు. సంకల్ప్ రెడ్డి ఈ సినిమాలో భారతదేశ చరిత్రలో మరిచిపోయిన ఒక కీలక ఘట్టాన్ని అద్భుతంగా మలిచారు. 7వ శతాబ్దం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఒక చారిత్రక ఘటనను ఆవిష్కరిస్తూ, మరిచిపోయిన అధ్యాయానికి మళ్లీ జీవం పోస్తోంది.గోపిచంద్ ఈ సినిమాలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడనివంటి విభిన్న పాత్రలో కనిపించనున్నారు.  ఈ ఏప్రిల్‌లో కాశ్మీర్ అందమైన లొకేషన్లలో తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. ఆ అద్భుత దృశ్యాలు బిగ్ స్క్రీన్‌పై గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో రూపొందించిన సెట్లో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించి ఇతర నటీనటులు , సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
 తారాగణం: గోపీచంద్

]]>
Thu, 12 Jun 2025 20:59:08 +0530 admin
ఈ నెల 11న క్రేజీ మూవీ "తమ్ముడు" ట్రైలర్ రిలీజ్ https://prajakshethrenews.com/ఈ-నెల-11న-క్రేజీ-మూవీ-తమ్ముడు-ట్రైలర్-రిలీజ్ https://prajakshethrenews.com/ఈ-నెల-11న-క్రేజీ-మూవీ-తమ్ముడు-ట్రైలర్-రిలీజ్ ఈ నెల 11న హీరో నితిన్, డైరెక్టర్ శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ క్రేజీ మూవీ "తమ్ముడు" ట్రైలర్ రిలీజ్ 

జూలై 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

ప్రజా క్షేత్ర్, సినిమా : 
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ "తమ్ముడు". ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు "తమ్ముడు" సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు క్రియేటివ్ గా, ఎంటర్ టైనింగ్ వీడియోతో తెలిపారు.
"తమ్ముడు" మూవీ ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ వీడియో ఫన్నీగా డిజైన్ చేశారు. తాను గట్టిగా అడిగినందు వల్లే ఈ చిత్ర రిలీజ్ డేట్ ను ప్రకటించారని, ట్రైలర్ రిలీజ్ చేయమని అడిగితే చేస్తారని హీరోయిన్ వర్ష బొల్లమ్మ చెప్పగా, తాను అడిగితేనే మూవీ రిలీజ్ డేట్ చెప్పారని లయ అంటుంది. వీళ్లిద్దరితో పోటీ పడుతూ స్వసిక విజయన్, సప్తమి గౌడ, బేబి శ్రీరామ్ దిత్య తాము చెప్పడం వల్లే "తమ్ముడు" మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారని అంటారు. ఇలా వీళ్లు గొడవ పడుతుండగా, దర్శకుడు శ్రీరామ్ వేణు వచ్చి 'మీ డౌట్స్ అన్నీ క్లారిఫై కావాలంటే ట్రైలర్ చూడండి.' అని చెప్తాడు. ట్రైలర్ అనౌన్స్ మెంట్ ఇలా సరికొత్తగా డిజైన్ చేయడం మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉంది. హీరో నితిన్ దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ చేయగా..దర్శకుడు శ్రీరామ్ వేణు నాని హీరోగా ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో "తమ్ముడు" సినిమా వస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ను "తమ్ముడు" సినిమాతో అందించబోతున్నారు దర్శకుడు శ్రీరామ్ వేణు.
నటీనటులు - నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, బేబీ శ్రీరామ్ దిత్య, తదితరులు

]]>
Mon, 09 Jun 2025 19:55:41 +0530 admin
బ్రోకోడ్’ చిత్రంతో హీరోగా, నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న స్టార్ హీరో రవి మోహన్ https://prajakshethrenews.com/బ్రోకోడ్-చిత్రంతో-హీరోగా-నిర్మాతగా-ప్రేక్షకుల-ముందుకు-రానున్న-స్టార్-హీరో-రవి-మోహన్ https://prajakshethrenews.com/బ్రోకోడ్-చిత్రంతో-హీరోగా-నిర్మాతగా-ప్రేక్షకుల-ముందుకు-రానున్న-స్టార్-హీరో-రవి-మోహన్ బ్రోకోడ్’ చిత్రంతో హీరోగా, నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న స్టార్ హీరో రవి మోహన్
ప్రజా క్షేత్ర్, సినిమా : 
కోలీవుడ్‌లో రవి మోహన్‌కు ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లు హీరోగా అందరినీ మెప్పించిన రవి మోహన్ ఇకపై నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన హీరోగా, నిర్మాతగా రానున్న ‘బ్రోకోడ్’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ప్రకటించారు. ‘డిక్కిలూనా’, ‘వడక్కుపట్టి రామసామి’ వంటి చిత్రాలతో ప్రసిద్ధి చెందిన కార్తీక్ యోగి దర్శకత్వంలో ఈ ‘బ్రోకోడ్’ రానుంది. నలుగురు ప్రముఖ మహిళా నటులతో పాటు ప్రముఖ నటుడు ఎస్.జె. సూర్య కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నారు. పోర్ తోజిల్ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన కలైసెల్వన్ శివాజీ, యానిమల్, అర్జున్ రెడ్డి వంటి విజయాలను అందించిన హర్షవర్ధన్ ఈ ప్రాజెక్ట్ కోసం పని చేయనున్నారు. ఎడిటర్‌గా ప్రదీప్ ఇ. రాఘవ్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ. రాజేష్ వ్యవహరించనున్నారు. స్లాప్ స్టిక్ కామెడీ అంశాలతో కూడిన వినోదాత్మక ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని నటుడు రవి మోహన్ స్వయంగా రవి మోహన్ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు కార్తీక్ యోగి మాట్లాడుతూ.. ‘నేను రవి మోహన్‌కి కథ చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఈ కథను పూర్తిగా ఆస్వాదించారు. కథ విన్న వెంటనే దానిని నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో స్లాప్ స్టిక్ హాస్యం అధికంగా ఉంటుంది. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా రూపొందిస్తున్నామ’ని అన్నారు. నలుగురు ప్రముఖ మహిళా నటీనటుల గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. రవి మోహన్ ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’, గణేష్ కె. బాబు డైరెక్ట్ చేస్తున్న ‘కరాటే బాబు’ చిత్రాలలో కూడా నటిస్తున్నారు.

]]>
Mon, 09 Jun 2025 19:49:24 +0530 admin
వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ https://prajakshethrenews.com/వరుస-బ్లాక్-బస్టర్లతో-దూసుకుపోతున్న-గాడ్-ఆఫ్-మాసెస్-బాలకృష్ణ https://prajakshethrenews.com/వరుస-బ్లాక్-బస్టర్లతో-దూసుకుపోతున్న-గాడ్-ఆఫ్-మాసెస్-బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని, వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్ హిస్టారికల్ ఎపిక్ NBK111 అనౌన్స్‌మెంట్
ప్రజా క్షేత్ర్, సినిమా :
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్నారు. ఆయన పుట్టినరోజు (జూన్ 10) పురస్కరించుకొని బాలకృష్ణ 111వ చిత్రం అధికారికంగా ప్రకటించారు. NBK111 చిత్రానికి బ్లాక్ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తారు. భారీ బ్లాక్ బస్టర్ హిట్ వీరసింహరెడ్డి తర్వాత ఇది వారి సెకెండ్ కొలాబరేషన్. ప్రస్తుతం 'పెద్ది' వంటి పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్న వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ కొత్త ప్రాజెక్ట్‌ను మ్యాసీవ్ స్కేల్ లో నిర్మించనున్నారు.
అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో ఉగ్ర సింహం ఫెరోషియస్ ఇమేజ్ వుంది. దాని ముఖంలో సగం లోహ కవచం, మిగిలిన సగం వైల్డ్ గా కనిపిస్తోంది. ఈ అద్భుతమైన ఇమేజ్ బాలకృష్ణ ఈ చిత్రంలో పోషించబోయే ఇంటెన్స్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ని ప్రజెంట్ చేస్తోంది.   మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లతో అదరగొట్టే దర్శకుడు గోపీచంద్ మలినేని తొలిసారిగా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లోకి అడుగుపెట్టనున్నారు. బాలకృష్ణ కోసం ఆయన ఇంతకు ముందు చూడని అవతార్‌ను రూపొందిస్తున్నారు. ఇది గ్రాండియర్, హిస్టరీ, హై-ఆక్టేన్ యాక్షన్‌ను బ్లెండ్ చేసే ఒక ఎపిక్ స్టొరీ. పవర్ ఫుల్ అండ్ యూనిక్ గా వుండబోతున్న ఈ స్క్రిప్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.
మిగిలిన తారాగణం, సాంకేతిక సిబ్బందిని మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు.
తారాగణం: నందమూరి బాలకృష్ణ

]]>
Mon, 09 Jun 2025 10:03:58 +0530 admin
హరి హర వీర మల్లు & కాస్త ఆలస్యం, చరిత్ర సృష్టించడానికి సిద్ధం & https://prajakshethrenews.com/హరి-హర-వీర-మల్లు-కాస్త-ఆలస్యం-చరిత్ర-సృష్టించడానికి-సిద్ధం https://prajakshethrenews.com/హరి-హర-వీర-మల్లు-కాస్త-ఆలస్యం-చరిత్ర-సృష్టించడానికి-సిద్ధం హరి హర వీర మల్లు - కాస్త ఆలస్యం, చరిత్ర సృష్టించడానికి సిద్ధం - విడుదల తేదీపై అధికారిక ప్రకటన

ప్రజా క్షేత్ర్, సినిమా :
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో 'హరి హర వీర మల్లు' ఒకటి. ఈ చిత్ర విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు, పెరుగుతున్న ఊహాగానాలు నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు."అచంచలమైన ఓపిక  నమ్మకంతో 'హరి హర వీరమల్లు' సినిమాకు తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు సినీ ప్రేమికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.గతంలో ప్రకటించిన జూన్ 12వ తేదీకి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నాము. అయినప్పటికీ ఆ తేదీకి చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని తెలియజేస్తున్నాము.
కష్టమైనయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  యొక్క ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలనేదే మా ప్రయత్నం. ప్రతి ఫ్రేమ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాము. అందుకే మేము మరి కొంత సమయం తీసుకుంటున్నాము. మీ ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాము." మరోవైపు, సామాజిక మాధ్యమాల్లో 'హరి హర వీరమల్లు' చిత్రం గురించి తప్పుడు వార్తలు ప్రచారమవ్వడం మేము గమనించాము. చాలామంది తమకు తోచినది రాసేస్తున్నారు. ధృవీకరించని వార్తలను నమ్మవద్దని, వాటిని వ్యాప్తి చేయవద్దని మేము ప్రతి ఒక్కరినీ కోరుతున్నాము.దయచేసి మా అధికారిక హ్యాండిల్స్ ద్వారా మాత్రమే సినిమాకి సంబంధించిన అప్డేట్ల కోసం వేచి ఉండండి. అప్పటి వరకు, ఎటువంటి ప్రచారాలను నిజమని భావించకండి.
'హరి హర వీరమల్లు' చిత్రం ఒక అద్భుతమైన ప్రయాణం. వందలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు కలిసి వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి 24 గంటలూ తమ శక్తికి మించి కృషి చేస్తున్నారు.
ఈ ఆలస్యం మన సహనాన్ని పరీక్షించవచ్చు. కానీ, అంతకంటే గొప్పది ఏదో రూపుదిద్దుకుంటుందని కూడా ఇది సూచిస్తుంది. ప్రతి దృశ్యం ఆశ్చర్యపరిచేలా, ప్రతి శబ్దం ప్రతిధ్వనించేలా, ప్రతి సన్నివేశం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం నిర్మాణాంతర కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది.'హరి హర వీరమల్లు' యొక్క భారీ శక్తివంతమైన థియేట్రికల్ ట్రైలర్ త్వరలో విడుదల కానుందని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ట్రైలర్‌తో పాటు, కొత్త విడుదల తేదీని కూడా తెలియజేస్తాము. కాబట్టి భారీ ప్రకటన కోసం వేచి ఉండండి. సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అద్భుతమైన ట్రైలర్ ను మీతో పంచుకోవడానికి మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. అద్భుతాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి.
ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా అటు విజువల్ పరంగానూ, ఇటు మ్యూజిక్ పరంగానూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించనుంది.
జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతిభగల సాంకేతిక బృందం మద్దతుతో ఈ చిత్రం అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది.
మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. ఎం. రత్నం చిత్ర సమర్పకులు గా,
ఎ. దయాకర్ రావు నిర్మాతగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మాగ్నమ్ ఓపస్ అభిమానులు, సినీ ప్రియుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా రూపొందుతోంది.
మీ నిరంతర మద్దతు, ప్రేమ, ఓర్పుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

]]>
Sat, 07 Jun 2025 09:58:03 +0530 admin
హరివీరముల్లు పై రాజకీయ నీడ https://prajakshethrenews.com/హరివీరముల్లు-పై-రాజకీయ-నీడ https://prajakshethrenews.com/హరివీరముల్లు-పై-రాజకీయ-నీడ హరివీరముల్లు పై రాజకీయ నీడ
ప్రజా క్షేత్ర్, విజయవాడ, జూన్ 6 :
చాలా కాలం తరువాత రాబోతున్న పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు గురించి ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలకు ముందు టాలీవుడ్‌లో మొదలైన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. దీనికి తోడు రాజకీయం సెగలు కక్కుతోంది. మరోవైపు హరిహర వీరమల్లు కోసం నిర్మాత నుంచి తీసుకున్న 11 కోట్ల రూపాయల అడ్వాన్స్‌ను పవన్ వెనక్కి ఇచ్చేశారు.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసే క్రమంలో హరిహర వీరమల్లు సినిమాను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. కొద్దిరోజుల క్రితం సినీ ఇండస్ట్రీలో చెలరేగిన వివాదాన్ని కూడా పవన్‌పై విమర్శలు చేసేందుకు వాడుకుంటున్నారు. సినిమా వాళ్లను జైల్లో వేస్తామని పవన్ బెదిరిస్తున్నారని.. ఇవి దివాళా రాజకీయాలు కావా అని మాజీమంత్రి పేర్ని నాని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన చెప్పుచేతల్లో ఉన్న మంత్రితో బెదిరింపులకు దిగుతున్నారని.. ఫ్లాప్ సినిమా కోసం ఇంత చేయాలా అంటూ విమర్శించారు.పవన్ కల్యాణ్ తనకు ఓటేసిన ప్రజలను పట్టించుకోకుండా తన సినిమాల గురించి ఆలోచిస్తున్నారని ఆరోపించారు మరో మాజీమంత్రి అంబటి రాంబాబు. హరిహరవీర మల్లు సినిమా ఐదేళ్లకు పైగా తీశారని.. అది నిర్మాతకు కనకవర్షం కురిపించాలంటూ సెటైర్లు వేశారు.మరోవైపు హరిహర వీరమల్లు చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక వాయిదాపడింది. ఈ నెల 8న తిరుపతి ఎస్వీయూ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని సినిమా యూనిట్ ప్రకటించిందిఇదిలా ఉంటే హరిహర వీరమల్లు కోసం తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు పవన్‌ ప్రకటించారు. 2020లో అధికారికంగా ఈ సినిమా మొదలు కాగా, సుదీర్ఘ కాలం సెట్స్‌పైనే ఉండిపోయింది. పవన్‌కల్యాణ్‌ రాజకీయంగా బిజీ కావడంతో సినిమా మరింత ఆలస్యమవుతూ వచ్చింది. ఇన్నేళ్ల పాటు సినిమా సెట్స్‌పైనే ఉండటంతో నిర్మాత ఏఎం రత్నంపై ఆర్థికంగా అదనపు భారం పడింది. ఈ విషయాలను తెలుసుకున్న పవన్‌కల్యాణ్‌ తాను అడ్వాన్స్‌గా తీసుకున్న పారితోషికం మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారు.

]]>
Fri, 06 Jun 2025 18:40:38 +0530 admin
"నరివెట్ట" చిత్రంలో ఎమోషన్స్ సీన్స్ లో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరో "టొవినో థామస్" !!! https://prajakshethrenews.com/నరివెట్ట-చిత్రంలో-ఎమోషన్స్-సీన్స్-లో-ప్రేక్షకులను-కట్టిపడేసిన-హీరో-టొవినో-థామస్ https://prajakshethrenews.com/నరివెట్ట-చిత్రంలో-ఎమోషన్స్-సీన్స్-లో-ప్రేక్షకులను-కట్టిపడేసిన-హీరో-టొవినో-థామస్ తెలుగులో విడుదలైన "నరివెట్ట" చిత్రంలో ఎమోషన్స్ సీన్స్ లో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరో  "టొవినో థామస్" !!!
ప్రజా క్షేత్ర్, సినిమా :
మలయాళ హీరో టొవినో థామస్ నటించిన లేటెస్ట్ కాప్ యాక్షన్ డ్రామా చిత్రం ‘నరివెట్ట’ మలయాళంతో పాటు తెలుగులో విడుదలై మంచి విజయం సాధించింది. టొవినో నటనకు ప్రసంశలు వస్తున్నాయి. మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ హీరోకు తెలుగులోనూ మంచి గుర్తింపు దక్కింది. నరివెట్ట సినిమా చూస్తూ ఎమోషనల్ అయిన ఆడియన్స్, మలయాళంలో అలాగే తెలుగు లోను సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో ప్రదర్షింపబడుతున్న ఈ సినిమా ను చూసి ఆడియన్స్ బావోద్యేగానికి లోనవుతున్నారు, ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హీరో  టొవినో థామస్. ‘ఐడెంటిటీ’  'ఏఆర్ఎమ్' మూవీస్ లో టొవినో తన పాత్రతో ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ దక్కించుకున్నాడు. లేటెస్ట్ గా నరివెట్ట సినిమా ద్వారా ఇలా పోలీస్ స్టోరీ చిత్రంతో రావడంతో తెలుగు ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయ్యింది.
ఇక ఈ సినిమాను అనురాజ్ మనోహర్ డైరెక్ట్ చేస్తుండగా అబిన్ జోసెఫ్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో సురాజ్ వెంజరమూడు, చెరణ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.

]]>
Tue, 03 Jun 2025 16:34:14 +0530 admin
డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" https://prajakshethrenews.com/డిసెంబర్-5న-వరల్డ్-వైడ్-గ్రాండ్-థియేట్రికల్-రిలీజ్-కు-రాబోతున్న-రెబల్-స్టార్-ప్రభాస్-రాజా-సాబ్ https://prajakshethrenews.com/డిసెంబర్-5న-వరల్డ్-వైడ్-గ్రాండ్-థియేట్రికల్-రిలీజ్-కు-రాబోతున్న-రెబల్-స్టార్-ప్రభాస్-రాజా-సాబ్ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్", ఈ నెల 16న  టీజర్ విడుదల

ప్రజా క్షేత్ర్, సినిమా :
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్" రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఈ రోజు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 16న ఉదయం 10.52 నిమిషాలకు "రాజా సాబ్" టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ అనౌన్స్ మెంట్ తో రెబెల్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ డబ్బులతో నిండి ఉన్న గదిలో ఫెరోషియస్ గా కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది.  మరోవైపు "రాజా సాబ్" రిలీజ్ డేట్, టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది."రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో ఈ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. "రాజా సాబ్" సినిమాతో ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నారు డైరెక్టర్ మారుతి.
నటీనటులు - ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, తదితరులు

]]>
Tue, 03 Jun 2025 16:19:27 +0530 admin
షూటింగ్ పూర్తి చేసుకున్న టిఎస్సార్ మూవీ మేకర్స్ 'ప్రొడక్షన్ నెంబర్ 3'! https://prajakshethrenews.com/షూటింగ్-పూర్తి-చేసుకున్న-టిఎస్సార్-మూవీ-మేకర్స్-ప్రొడక్షన్-నెంబర్-3 https://prajakshethrenews.com/షూటింగ్-పూర్తి-చేసుకున్న-టిఎస్సార్-మూవీ-మేకర్స్-ప్రొడక్షన్-నెంబర్-3 షూటింగ్ పూర్తి చేసుకున్న టిఎస్సార్ మూవీ మేకర్స్ 'ప్రొడక్షన్ నెంబర్ 3'!

ప్రజా క్షేత్ర్, సినిమా :
టిఎస్సార్ మూవీ మేకర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందిన కొత్త చిత్రం షూటింగ్ విజయవంతంగా ముగిసింది. తిరుపతి శ్రీనివాసరావు నిర్మాణ సారథ్యంలో, ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకోనుంది. నటుడు హరికృష్ణ హీరోగా, భవ్యశ్రీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రేమ, త్యాగం, కుటుంబ విలువలను ఆవిష్కరిస్తూ భావోద్వేగాలతో నిండిన కథాంశంతో రూపొందింది.
సినిమాటోగ్రఫీ బాధ్యతలను ప్రభాకర్ రెడ్డి నిర్వహించగా, గౌతమ్ రవిరామ్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. విజయ్ కందుకూరి రచించిన సంభాషణలు కథను మరింత బలపరిచాయి. ప్రేమ, త్యాగం, కుటుంబ బంధాలను ఆలంబనగా చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక భావోద్వేగ అనుభవాన్ని అందించనుంది.
షూటింగ్ పూర్తయిన సందర్భంగా నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ, “మా బృందం అంకితభావంతో పనిచేసింది. ఈ సినిమా అందరి హృదయాలను తాకుతుందని ఆశిస్తున్నాం” అన్నారు. దర్శకుడు ఆదినారాయణ మాట్లాడుతూ, “ప్రేక్షకులకు ఒక అర్థవంతమైన కథను అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు. త్వరలో విడుదల తేదీని, ఆసక్తికరమైన టైటిల్ తో ప్రకటించనున్న చిత్ర బృందం, ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ ఆశిస్తోంది.

]]>
Tue, 03 Jun 2025 14:51:39 +0530 admin
జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న థగ్ లైఫ్ https://prajakshethrenews.com/జూన్-5న-థియేటర్లలో-విడుదలకు-సిద్ధమవుతున్న-థగ్-లైఫ్ https://prajakshethrenews.com/జూన్-5న-థియేటర్లలో-విడుదలకు-సిద్ధమవుతున్న-థగ్-లైఫ్ జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న థగ్ లైఫ్

ప్రజా క్షేత్ర్, సినిమా

కమల్ హాసన్, శింబు, మణిరత్నం హైలీ యాంటిసిపేటెడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' నుంచి 'విశ్వద నాయక' సాంగ్ రిలీజ్
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలోని శింబు, అశోక్ సెల్వన్, త్రిష కృష్ణన్, అభిరామి కీలక పాత్రలు పోషిస్తున్నారు. AR రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు, ఫోర్త్ సింగిల్ - విశ్వద నాయక సాంగ్ ని విడుదల చేశారు. ఇది సినిమాలోని కమల్ హాసన్ పాత్రని  అద్భుతంగా ప్రజెంట్ చేసింది. రెహమాన్ పవర్ ఫుల్ ఆర్కెస్ట్రేషన్‌ తో అద్భుతమైన ట్రాక్‌ను అందించారు. లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్, కమల్ హాసన్ క్యారెక్టర్ నేచర్, అభిరామి, త్రిష పాత్రలలోని  డైనమిక్స్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ప్రశాంత్ వెంకట్ రాసిన ర్యాప్ పాటకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అలెగ్జాండ్రా జాయ్ వండర్ ఫుల్ వోకల్స్ ఎమోషన్ ని నావిగేట్ చేస్తూ... AR అమీన్ ర్యాప్ ఎనర్జీని మరింతగా పెంచింది. విజువల్ ఈ పాటలో కమల్ హాసన్ డిఫరెంట్ అవతార్స్ లో కనిపించడం అదిరిపోయింది.  రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్‌ ఎన్ సుధాకర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

]]>
Mon, 02 Jun 2025 23:17:07 +0530 admin
కుబేర స్టార్&స్టడెడ్ ఆడియో లాంచ్ https://prajakshethrenews.com/కుబేర-స్టార్-స్టడెడ్-ఆడియో-లాంచ్ https://prajakshethrenews.com/కుబేర-స్టార్-స్టడెడ్-ఆడియో-లాంచ్ కుబేర స్టార్-స్టడెడ్ ఆడియో లాంచ్ 

శేఖర్ కమ్ముల ప్యూర్ సోల్, కుబేర పై 2000% నమ్మకం ఉంది:

కుబేర స్టార్-స్టడెడ్ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో హీరో ధనుష్

-కుబేర ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది: హీరో నాగార్జున

-ధనుష్ అద్భుతమైన వ్యక్తి. కుబేర బ్రిలియంట్ ఫిల్మ్: డైరెక్టర్ శేఖర్ కమ్ముల

ప్రజా క్షేత్ర్, సినిమా :
ధనుష్-నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'కుబేర' ఆడియో లాంచ్  చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అభిమానులు, మీడియా, చిత్ర పరిశ్రమ నుండి ప్రముఖులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో హీరోలు ధనుష్, నాగార్జున, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు శేఖర్ కమ్ముల, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, నిర్మాతలు సునీల్ నారంగ్, జాన్వి నారంగ్, భరత్ నారంగ్, సిమ్రాన్ నారంగ్, సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి, ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి, లిరిక్ రైటర్స్ వివేక, చంద్రబోస్, నంద కిషోర్ పాల్గొన్నారు. వారందరూ ఈ సినిమా గురించి తమ ఉత్సాహాన్ని పంచుకున్నారు.హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ.. మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. ఐ లవ్ యూ టూ. తన సినిమా వరల్డ్ లోకి నన్ను తీసుకొచ్చినందుకు శేఖర్ కమ్ముల కి కృతజ్ఞతలు. కుబేర నా కెరీర్ లో చాలా స్పెషల్ ఫిల్మ్. ధనుష్‌తో మళ్ళీ కలిసి పనిచేయాలని వుంది. ఈసారి పూర్తి స్థాయి రొమాంటిక్ చిత్రం చేయాలని వుంది' అన్నారు.దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ..ఈ చిత్రంలోని పాటలు, పోయిరా మామా, ట్రాన్స్ ఆఫ్ కుబేరా పట్ల అభిమానులకు చూపిన ప్రేమకు కృతజ్ఞతలు. కుట్టి నుండి వెంగై వరకు, ఇప్పుడు కుబేరా వరకు ధనుష్‌తో తన సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తూ, మరొక విజయవంతమైన సహకారం కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని'అన్నారు.నిర్మాతలు పుష్కర్ రామ్మోహన్, సునీల్ నారంగ్ మాట్లాడుతూ..ఈ సినిమాకి అందరూ సపోర్ట్ చేశారు. ధనుష్  అద్భుతమైన వ్యక్తి. నాగార్జున  ఇండియా మన్మధుడు. ఇలా అద్భుతమైన తారాగణం కలిసి చేసిన ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా మా టీం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సినిమా జూన్ 20న చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము'అన్నారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ధనుష్ అద్భుతమైన వ్యక్తి, నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గీత రచయిత, అరుదైన ఆల్ రౌండర్. కుబేరా ఒక అద్భుతమైన చిత్రం. ధనుష్, నాగార్జున  పెర్ఫార్మెన్స్ మెస్మరైజింగ్ గా వుంటుంది. కుబేర బ్రిలియంట్ ఫిల్మ్. ఆడియన్స్ కి చాలా న్యూ ఎక్స్ పీరియన్స్ వుంటుంది. మూవీ టీంకు హృదయపూర్వక కృతజ్ఞతలు'తెలిపారు. హీరో నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అడయార్‌లో పుట్టి, గిండి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్నాను. చెన్నై కుటుంబంలో వివాహం చేసుకుని, ఇక్కడే తన కెరీర్‌ను ప్రారంభించాను. చెన్నై ప్రేక్షకుల నుండి సంవత్సరాలుగా తనకు లభించిన ప్రేమకు కృతజ్ఞతలు. “కుబేర' ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది. శేఖర్ కమ్ముల గారు సినిమాని అద్భుతంగా తీశారు. ఈ సినిమా తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ కూలీ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడానికి రెడీ వుంది'అన్నారు.  
హీరో ధనుష్ మాట్లాడుతూ.. “ఓం నమః శివాయ”. “ఇది కలికాలం, ద్వేషం, ప్రతికూలత, అసూయ వృద్ధి చెందే సమయం. చెడు మంచిపై విజయం సాధిస్తున్నట్లు అనిపిస్తుంది. శేఖర్ కమ్ముల  ప్యూర్ సోల్ వున్న వ్యక్తి. సినిమాకి ఎంతగానో సపోర్ట్ చేసిన నిర్మాతలు సునీల్, జాన్వి నారంగ్‌కు కృతజ్ఞతలు. తిరుపతి ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించి, బిచ్చగాడిని నటించిన విజవల్ వెరీ మెమరబుల్. ఆ అనుభవం జీవితంలోని ముఖ్యమైన సత్యాలను గుర్తు చేసింది, బనారస్‌లోని రాంఝానా చిత్రీకరణ సమయంలో, చితుల మధ్య గడిపిన సమయంలో “దురాశ, డబ్బు, ప్రాపంచిక సుఖాలు - అవి ఏమీ శాశ్వతం కాదని అర్ధమైయింది,  “స్వచ్ఛమైన మనసు ముఖ్యం. కుబేర దానిని తెలియజేస్తుంది. ఈ చిత్రం చూపే ఇంపాక్ట్ గురించి నాకు 2000% నమ్మకం ఉంది' అన్నారు.  అద్భుతమైన తారాగణం, టాప్ టెక్నికల్ టీం తో వస్తున్న  కుబేర గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. ఈ చిత్రం జూన్ 20న గ్రాండ్ గా విడుదల కానుంది.

]]>
Mon, 02 Jun 2025 22:21:03 +0530 admin
జూలై 11న ఘాటి' థియేట్రికల్ రిలీజ్ https://prajakshethrenews.com/జూలై-11న-ఘాటి-థియేట్రికల్-రిలీజ్ https://prajakshethrenews.com/జూలై-11న-ఘాటి-థియేట్రికల్-రిలీజ్ జూలై 11న ఘాటి'  థియేట్రికల్ రిలీజ్

క్వీన్ అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, UV క్రియేషన్స్ ప్రజెంట్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పాన్ ఇండియా ఫిల్మ్ 'ఘాటి' జూలై 11న థియేట్రికల్ రిలీజ్
ప్రజా క్షేత్ర్, సినిమా : 
క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. అనుష్క పుట్టినరోజున విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన స్పందన వచ్చింది. దీని తర్వాత, తమిళ స్టార్ విక్రమ్ ప్రభు ఇంటెన్స్ అవతార్ లో కనిపించిన  క్యారెక్టర్ గ్లింప్‌ను మేకర్స్ విడుదల చేశారు.  ఇది సినిమాపై ఉన్న బజ్‌ను మరింత పెంచింది. ఘాటిని UV క్రియేషన్స్ సమర్పిస్తుంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తారు.ఈరోజు, మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ అప్‌డేట్‌ ఇచ్చారు. ఘాటి జూలై 11న రిలీజ్ కానుంది. మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేయనున్నారు. రిలీజ్ డేట్  పోస్టర్‌లో అనుష్క, విక్రమ్ ప్రభు నది గుండా సంచులు మోసుకుంటూ వెళుతున్న విజువల్స్ ఇంటెన్స్ జర్నీని సూచిస్తున్నాయి. 'ఘాటి' అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్‌ సక్సెస్ ఫుల్ మూవీ 'వేదం'తర్వాత కలిసిన చేస్తున్న  హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్. అనుష్క, UV క్రియేషన్స్‌తో నాలుగోసారి కలిసి వర్క్ చేయడం మరో విశేషం.ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు, వెంకట్ ఎన్ స్వామి ఎడిటర్. సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. ఈ చిత్రం హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది.ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.
తారాగణం: అనుష్క శెట్టి

]]>
Mon, 02 Jun 2025 22:04:39 +0530 admin
సైయారా’ టీజర్‌ విడుదల https://prajakshethrenews.com/సైయారా-టీజర్-విడుదల https://prajakshethrenews.com/సైయారా-టీజర్-విడుదల సైయారా’ టీజర్‌ విడుదల

ప్రజా క్షేత్ర్, సినిమా :

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అహాన్ పాండే, అనీత్ పద్దా జంటగా మోహిత్ సూరి తెరకెక్కించిన ‘సైయారా’ టీజర్‌ విడుదల
యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) నిర్మాణంలో మోహిత్ సూరి తెరకెక్కించిన చిత్రం ‘సైయారా’. YRF బ్యానర్ నుంచి వచ్చే  ప్రేమ కథా చిత్రాలకు ఉండే ఫాలోయింగ్, క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ ‘సైయారా’ చిత్రాన్ని రూపొందించారు. అహాన్ పాండేను హిందీ చిత్ర పరిశ్రమకు ఈ చిత్రంతోనే హీరోగా పరిచయం చేయనున్నారు.
 ఈ క్రమంలో అహాన్ పాండే, అనీత్ జంట ఎలా ఉండబోతోంది? అసలు వారిద్దరి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియజేసేందుకు టీజర్‌ను విడుదల చేశారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా రాబోతోన్న ఈ ‘సైయారా’ టీజర్‌ను రిలీజ్ చేశారు. సైయారా చిత్రాన్ని కంపెనీ CEO అక్షయ్ విధాని నిర్మించారు. ఇక ఈ మూవీ టీజర్‌ను గమనిస్తే.. ఇదొక ఇంటెన్స్ లవ్ డ్రామా అని అర్థం అవుతోంది. నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ ప్రేమ కథను అంతే అందంగా తెరకెక్కించారు.
హీరో హీరోయిన్ల పరిచయం, ప్రేమ, బ్రేకప్ వంటి సీన్లతో టీజర్‌ను అందంగా మలిచారు. ఇద్దరి నటన ఈ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఇక విజువల్స్, మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ అస్సెట్‌ కానున్నాయి. సైయారా అంటే ఆకాశంలోని ఒంటరి తార అని టీజర్ చూస్తే అర్థం తెలుస్తోంది.
50 సంవత్సరాల YRF చరిత్రలో ఎన్నో కల్ట్ రొమాంటిక్, ప్రేమ కథా చిత్రాలను అందించారు. ఇక మోహిత్ సూరి సైతం ఇది వరకు ఆషికి 2, మలంగ్, ఏక్ విలన్ వంటి అద్భుతమైన రొమాంటిక్ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ ‘సైయారా’ జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

]]>
Fri, 30 May 2025 19:19:05 +0530 admin
పోలీస్ కంప్లెయింట్' మూవీ నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ విడుదల https://prajakshethrenews.com/పోలీస్-కంప్లెయింట్-మూవీ-నుంచి-వరలక్ష్మి-శరత్-కుమార్-ఫస్ట్-లుక్-విడుదల https://prajakshethrenews.com/పోలీస్-కంప్లెయింట్-మూవీ-నుంచి-వరలక్ష్మి-శరత్-కుమార్-ఫస్ట్-లుక్-విడుదల సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. 'పోలీస్ కంప్లెయింట్' మూవీ నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ విడుదల
 హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త కాన్సెప్ట్
 మూవీలో సూపర్ స్టార్ కృష్ణ మీద స్పెషల్ సాంగ్

ప్రజా క్షేత్ర్, సినిమా :
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైన నటి వరలక్ష్మి శరత్ కుమార్. బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి స్టార్ రేంజ్ కు చేరిన వరలక్ష్మి శరత్ కుమార్.. తాజాగా తెలుగులో 'పోలీస్ కంప్లెయింట్' మూవీ చేస్తోంది. ఈ మూవీలోని వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ ను సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో పాటు, తొలిసారి ఆద్యంతం వినోదాన్ని కలిగించే పాత్రలో వరలక్ష్మి నటించడం విశేషం.
ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ మీద స్పెషల్ సాంగ్ షూట్ చేసామని, అది సినిమాకే మెయిన్ హైలెట్ అని ఈ సందర్భంగా నిర్మాతలు తెలిపారు.
ఈ చిత్రాన్ని ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్, శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా సంస్థల సంయుక్త బ్యానర్లలో సింగపూర్ బాలకృష్ణ , మల్లెల ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, అఘోర (తెలుగు, తమిళం), ఆప్త, పౌరుషం, రాఘవ రెడ్డి, ఆదిపర్వం వంటి వినూత్న చిత్రాలను రూపోందించిన దర్శకుడు సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్నారు. నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం ,
అమిత్, దిల్ రమేష్, రాజశ్రీ నాయర్, సింగపూర్ బాలకృష్ణ, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీహర్ష కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. "సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ప్రధాన పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను లాంచ్ చేశాం. 'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. మనం చేసే ప్రతి చర్యకి ఫలితంగా అదే తిరిగి మనకే వస్తుందని కాన్సెప్ట్ తో, హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది." అని చెప్పారు.
నిర్మాతలు సింగపూర్ బాలకృష్ణ , మల్లెల ప్రభాకర్ మాట్లాడుతూ.., "వరలక్ష్మి శరత్ కుమార్ పోషిస్తున్న పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ మీద చేసిన స్పెషల్ సాంగ్ అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. ఈ సినిమాను భారీగా రూపొందిస్తున్నాం. యాక్షన్, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేళవించి ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించబోతున్న ఈ చిత్రానికి “పోలీస్ కంప్లెయింట్” అనే టైటిల్ ఫిక్స్ చేశాం. దర్శకుడు సంజీవ్ మేగోటి రచన, దర్శకత్వం బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు." అని చెప్పారు.
ఈ సినిమాలో వరలక్ష్మి, నవీన్ చంద్రలతో పాటు ప్రముఖ నటులు శరత్ లోహితాశ్వ, పృథ్వీ (యానిమల్), శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, జెమినీ సురేష్, జబర్దస్త్ నవీన్, బేబీ తనస్వి (పొట్టేలు ఫేమ్) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే సీనియర్ నటులంతా సీరియస్ పాత్రల్లో అలరించనున్నారు.

]]>
Fri, 30 May 2025 19:16:41 +0530 admin
బకాసుర రెస్టారెంట్‌' నుంచి ''జాతీయం'' లిరికల్‌ వీడియో విడుదల https://prajakshethrenews.com/బకాసుర-రెస్టారెంట్-నుంచి-జాతీయం-లిరికల్-వీడియో-విడుదల https://prajakshethrenews.com/బకాసుర-రెస్టారెంట్-నుంచి-జాతీయం-లిరికల్-వీడియో-విడుదల   'బకాసుర రెస్టారెంట్‌' నుంచి ''జాతీయం''  లిరికల్‌ వీడియో విడుదల

ప్రజా క్షేత్ర్, సినిమా : 
పలు విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌',   ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న  ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు మేకర్స్‌. ట్రైలర్‌ అన్ని వర్గాల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'నా అంగీ జాతీయం.. నీ లుంగీ జాతీయం' అంటూ కొనసాగే లిరికల్ వీడియోను విడుదల చేశారు. బ్యాచ్‌లర్‌ కష్టాలు, బ్యాచ్‌లర్‌ లైఫ్‌లో ఉండే ఆనందాలు తెలియజేస్తూ విష్ణు వర్థన్‌ ఈ చిత్రానికి సాహిత్యం అందించారు. వికాస బడిస స్వరాలు సమాకూర్చిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి ఆలపించాడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ '' ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్నో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. పూర్తి వినోద భరితంగా తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.
ప్రవీణ్‌, వైవా హర్ష, షైనింగ్‌ ఫణి (బమ్‌చిక్‌ బంటి), కేజీఎఫ్‌ గరుడ రామ్‌, కృష్ణభగవాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఉప్పెన జయకృష్న, వివేక్‌ దండు, అమర్‌, రామ్‌పటాస్‌, రమ్య ప్రియ,  ప్రాచీ ఠాకూర్‌, జబర్థస్త్‌ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్‌: మార్తండ్‌.కె.వెంకటేష్‌, సంగీతం: వికాస్‌ బడిస, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్‌ కొట్టి, ఆర్ట్‌ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్‌ తంగాల, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి, దర్శకత్వం: ఎస్‌జే శివ.

]]>
Fri, 30 May 2025 19:12:45 +0530 admin
మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!! https://prajakshethrenews.com/మెర్సీ-కిల్లింగ్-సినిమాలో-నటించిన-బేబి-హారిక-కు-ప్రతిష్టాత్మక-గద్దర్-అవార్డ్ https://prajakshethrenews.com/మెర్సీ-కిల్లింగ్-సినిమాలో-నటించిన-బేబి-హారిక-కు-ప్రతిష్టాత్మక-గద్దర్-అవార్డ్ మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!
ప్రజా క్షేత్ర్, సినిమా :
తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ లో నటించిన బేబి హారిక ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టులుగా  గద్దర్ అవార్డ్స్ కు ఎంపికయ్యారు. సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై  తెరకెక్కిన సినిమా "మెర్సీ కిల్లింగ్" సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబి హారిక ప్రధాన పాత్రల్లో  సిద్ధార్ద్ హరియల,  మాధవి తాలబత్తుల నిర్మించిన ఈ సినిమాకు  వేదుల బాల కామేశ్వరి సమర్పించారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రాఫి అందించగా ఎం.ఎల్.రాజా సంగీతం సమకూర్చారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుంది. గత ఏడాది ఏప్రిల్ 12న థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాధించింది.
ఎమోషనల్ కథ కథనాలను సమాజంలో జరిగే కొన్ని సంఘటనలను తీసుకొని చేసిన మెర్సి కిల్లింగ్ సినిమా ప్రస్తుతం అహలో స్ట్రీమింగ్ అవుతోంది.

]]>
Fri, 30 May 2025 18:56:43 +0530 admin
సినీ అవార్డులపై రెండు ప్రభుత్వాలు అవగాహనకు రావాలి : మురళీ మోహన్ https://prajakshethrenews.com/సినీ-అవార్డులపై-రెండు-ప్రభుత్వాలు-అవగాహనకు-రావాలి-మురళీ-మోహన్ https://prajakshethrenews.com/సినీ-అవార్డులపై-రెండు-ప్రభుత్వాలు-అవగాహనకు-రావాలి-మురళీ-మోహన్ ఒకే సినిమాకు రెండు ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగోదు
సినీ అవార్డులపై రెండు ప్రభుత్వాలు అవగాహనకు రావాలి
ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
ఒకే సినిమాకు రెండు ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగోదని ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్   తెలిపారు. ఎపిలోనూ సినీ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డుల ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ అవార్డులపై రెండు ప్రభుత్వాలు అవగాహనకు రావాలని, ఒక ఏడాది తెలంగాణ, మరో ఏడాది ఎపి ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని సూచించారు. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలని, సినిమాలను తెలంగాణ, ఆంధ్రా అంటూ వేర్వేరుగా చూడొద్దని కోరారు. సినిమాకు సంబంధించి తెలుగు ప్రేక్షకులంతా ఒకటేనని, తెలుగు సినిమా  అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సినిమాలను మనకంటే ముందు అమెరికా వాళ్లు చూస్తున్నారని మురళీమోహన్ పేర్కొన్నారు.

]]>
Fri, 30 May 2025 18:49:34 +0530 admin
నేను క్షమాపణలు చెప్పను : తేల్చి చెప్పిన కమల్‌హాసన్ https://prajakshethrenews.com/నేను-క్షమాపణలు-చెప్పను-తేల్చి-చెప్పిన-కమల్హాసన్ https://prajakshethrenews.com/నేను-క్షమాపణలు-చెప్పను-తేల్చి-చెప్పిన-కమల్హాసన్ నేను క్షమాపణలు చెప్పను’.. తేల్చి చెప్పిన కమల్‌హాసన్
ప్రజా క్షేత్ర్, చెన్నై :
స్టార్ హీరో కమల్‌హాసన్   తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆయన చిత్రం ‘థగ్ లైఫ్’   ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కన్నడ భాషను కించపరిచేలా ఉన్నాయంటూ.. కన్నడిగులు కమల్‌పై మండిపడుతున్నారు. కమల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై కమల్ స్పందించారు. తాను తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతానని లేకుంటే చెప్పను అని తేల్చి చెప్పేశారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని, తాను చట్టాన్ని, న్యాయాన్ని నమ్ముతానని.. వాటిని గౌరవిస్తానని అన్నారు.‘థగ్‌ లైఫ్’ ఈవెంట్‌లో కమల్  మాట్లాడుతూ.. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కర్ణాటక అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్రంగా స్పందించింది. మే 30లోగా కమల్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్   సినిమాను అడ్డుకుంటామని ప్రకటించింది. మరోవైపు కమల్ తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే వివరణ ఇచ్చారు. అవి ప్రేమతో చేసిన వ్యాఖ్యలేనని.. ప్రేమ ఎన్నడూ క్షమాపణ చెప్పదన్నారు.

]]>
Fri, 30 May 2025 18:17:26 +0530 admin
మే 30 న ఖలేజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ&రిలీజ్ https://prajakshethrenews.com/మే-30-న-ఖలేజా-చిత్రం-ప్రపంచవ్యాప్తంగా-గ్రాండ్-రీ-రిలీజ్ https://prajakshethrenews.com/మే-30-న-ఖలేజా-చిత్రం-ప్రపంచవ్యాప్తంగా-గ్రాండ్-రీ-రిలీజ్ మే 30 న ఖలేజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ-రిలీజ్ 

ప్రజా క్షేత్ర్, సినిమా :

సూపర్ స్టార్ కృష్ణ  జన్మదినోత్సవం సందర్భంగా మే 30 న ఖలేజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ-రిలీజ్ కు రంగం సిద్దం అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఖలేజా రీ రిలీజ్ సందర్భంగా ప్రీ సేల్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఖలేజా నిర్మాతలు శింగనమల రమేశ్, సి. కళ్యాణ్, కృష్ణ సోదరులు ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరి రావు, కమెడియన్ అలీ, సునీల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ... నిర్మాతలిద్దరితో చాలా మంచి అనుబంధం ఉందన్నారు. పోకిరి సినిమాతో రీ రిలీజ్ మొదలైందన్నారు. ఈ సినిమాను సుబ్బారావు రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. రీరిలీజ్ వలన నిర్మాతలు సంతోషంగా ఉంటున్నారు, ఖలేజాకు మంచి ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఖలేజా సినిమా రీ రిలీస్ అవుతున్న సందర్భంగా కనకరత్న మూవీస్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. సినిమా చాలా కష్టపడి తీసినట్లు చెప్పారు. సినిమాలో ప్రతీ సీన్ చాలా అద్భుతంగా ఉంటుందన్నారు. సినిమాలో త్రివిక్రమ్, మహేష్ బాబు, నమ్రత అందరూ ఒక టీంలా పనిచేశారు అన్నారు. ఇప్పటికి 1500 సార్లు బుల్లి తెరమీద ప్రదర్శించి రికార్డ్ సృష్టించిన సినిమా ఖలేజా అని సీ కళ్యాణ్ చెప్పారు. ఇప్పటికి యూత్ ఈ సినిమాను చూడడానికి ఇష్టపడుతున్నారు. సినిమాలో ఉన్న సీతారాం పాత్ర మహేష్ బాబు కు చాలా దగ్గర ఉంటుందన్నారు. సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అన్నారు. మే 30 వ తేదీన థియేటర్ లు బద్దలు అవుతాయి అన్నారు. రీ రిలీజ్ సినిమాల్లో ఈ సినిమా సరికొత్త రికార్డ్ క్రేయేట్ చేస్తుంది అన్నారు. అలాగే నిర్మాత శింగనమల రమేష్ మాట్లాడుతూ.. సినిమా అందరిని అలరిస్తుంది అని చెప్పారు.అలీ మాట్లాడుతూ.. సినిమాను తీయడానికి నిర్మాతలు చాలా కష్టపడ్డారు అన్నారు. ఖలేజా సినిమా టీవీ లలో రికార్డ్ క్రియేట్ చేసింది అన్నారు. ఏ దేశం వెళ్లిన ఖలేజా గురించి మాట్లాడుతారు అని అన్నారు. సినిమాను త్రివిక్రమ్, మహేష్ బాబు ప్రాణం పెట్టి చేశారు అన్నారు. ఈ సినిమాను రీ రిలీజ్ అనడం కన్నా డైరెక్ట్ రిలీజ్ అంటే బెటర్ అని అన్నారు. సినిమాకు ఇప్పటికి కల్ట్ ఫాన్స్ ఉన్నారు అని, మే 30 థియేటర్ లో చూద్దాం అని అన్నారు.ఏసియన్ సునీల్ నారాయణ మాట్లాడుతూ.. ఈ సినిమా ఫ్రెష్ రిలీజ్ లా ఉందన్నారు. ఓపెన్ చేసిన నిముశాలలొనే టికెట్స్ బుక్ అవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.  నటీనటులు: మహేష్ బాబు, అనుష్క శెట్టి, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు, షఫీ తదితరులు

]]>
Thu, 29 May 2025 20:57:24 +0530 admin
ఇళయరాజా తో పని చేసే వరాన్ని ‘షష్టిపూర్తి’ టీం నాకు ఇచ్చింది & లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్* https://prajakshethrenews.com/ఇళయరాజా-తో-పని-చేసే-వరాన్ని-షష్టిపూర్తి-టీం-నాకు-ఇచ్చింది-లిరిసిస్ట్-చైతన్య-ప్రసాద్ https://prajakshethrenews.com/ఇళయరాజా-తో-పని-చేసే-వరాన్ని-షష్టిపూర్తి-టీం-నాకు-ఇచ్చింది-లిరిసిస్ట్-చైతన్య-ప్రసాద్ ఇళయరాజా తో పని చేసే వరాన్ని ‘షష్టిపూర్తి’ టీం నాకు ఇచ్చింది - లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్*

ప్రజా క్షేత్ర్, సినిమా : 
మ్యూజిక్ మ్యాస్ట్రో, ఇసైజ్ఞాని ఇళయరాజా ఓ సినిమాను ఒప్పుకుని సంగీతాన్ని అందించడమే ఓ గొప్ప విషయం. అలాంటి ఇసైజ్ఞాని ప్రస్తుతం ‘షష్టిపూర్తి’ సినిమాకు పని చేశారు. ఇక తన సంగీతంతో సినిమా స్థాయిని పెంచిన ఇళయరాజా ప్రస్తుతం ప్రమోషన్స్ కూడా చేస్తుండటం విశేషం. ‘షష్టిపూర్తి’ కోసం ఇళయరాజా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకంపై డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేశ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలుగా రూపేశ్ నిర్మించిన ఈ చిత్రానికి పవన్ ప్రభ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేయబోతోన్నారు.  ఈక్రమంలోనే లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ ఇసైజ్ఞాని ఇళయరాజాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఇళయరాజా, చైతన్య ప్రసాద్, దర్శకుడు పవన్ ప్రభ, నిర్మాత రూపేశ్ ఏం చెప్పారంటే..
చైతన్య ప్రసాద్ : ఇన్నేళ్ల సినీ ప్రయాణం.. ఎన్నో వేల పాటలు అందించారు.. పైగా సింఫనీ కూడా చేశారు? సింఫనీ అంటే ఏంటి? అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది?
ఇళయరాజా : సింఫనీ అంటే ఏంటి? అనేది ఎవ్వరూ చెప్పలేరు.. సింఫనీ అనే ఓ అనుభూతి. దాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేస్తేనే తెలుస్తుంది. త్వరలోనే నేను చేసిన ఆ ప్రయోగం వస్తుంది. అప్పుడు వినండి.. ఆస్వాధించండి.. అనుభూతి చెందండి. ఓ సినిమాకు సంగీతం చేయమని మాత్రమే దర్శక, నిర్మాతల నా వద్దకు వస్తుంటారు. నా పాండిత్యాన్ని వినియోగించి ఓ సింఫనీ చేయమని అడగరు. అందుకు నాకు నేనుగా, నాకోసం అన్నట్టుగా ఈ సింఫనీ చేస్తున్నాను.
చైతన్య ప్రసాద్ : ఎక్కడో కుగ్రామం నుంచి వచ్చారు.. ఇంతటి స్థాయికి ఎదిగారు.. మీ ప్రయాణం, యాత్ర గురించి చెప్పండి?
ఇళయరాజా : నేను ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టాను. ఆ కుగ్రామంలో సంగీతాన్ని నేర్పించేవారు కూడా ఉండరు. అలాంటి చోట నుంచి ఈ స్థాయికి వచ్చాను. మీరు నా ప్రయాణాన్ని యాత్ర అన్నారు. యాత్ర అంటే ప్రారంభ స్థలం ఉండాలి.. ఓ దారి ఉండాలి.. ఓ గమ్యస్థానం ఉండాలి. కానీ నాకు ప్రారంభం లేదు.. గమ్యస్థానం లేదు. అందుకని మీరు యాత్ర అని చెప్పొద్దు.
చైతన్య ప్రసాద్ : మీ మ్యూజిక్ మీద ఎలా ఇంట్రెస్ట్ ఏర్పడింది? మీరు ఈ రంగంలోకి ఎలా వచ్చారు?
ఇళయరాజా : చిన్నప్పుడు మా అన్న గారు పాటలు పాడుతుండేవారు. అలా ఆ పాటలు వింటూ వింటూ  నాకు కూడా పాటల మీద మక్కువ ఏర్పడింది. మా అన్న పాటలు వింటూ నేను ఏదో ఒకటి వాయిస్తూ ఉండేవాడిని. ఈ ప్రపంచంలో నాలాంటి వాళ్లు ఎవ్వరూ ఉండరు. గతంలోనూ లేరు.. భవిష్యత్తులోనే రారు. ఎందుకంటే నేను ఎవ్వరి దగ్గర సంగీతాన్ని నేర్చుకోలేదు. నాకు సంగీతంలో ఓనమాలు కూడా తెలియవు. కానీ ఈ ప్రపంచంలో ఏ ఫేమస్ మ్యూజిషీయన్‌ను అయినా తీసుకోండి.. వారు సంగీతాన్ని నేర్చుకుని ఉంటారు.. లేదా ఎవరి వద్దైనా శిష్యరికం చేసి ఉంటారు. కానీ నేను మాత్రం ఎవ్వరి దగ్గర సంగీతాన్ని నేర్చుకోలేదు. నాకు ఆ దేవుడు ఈ వరాన్ని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అసలు నాకు సంగీతం ఎలా వచ్చింది? నా నుంచి పాటలు ఎలా ఉద్భవిస్తాయో నాకు కూడా తెలియదు.
 చైతన్య ప్రసాద్ : మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, పాటల్ని కంపోజ్ చేయాలని ఎప్పుడు అనిపించింది?
ఇళయరాజా : మా అన్న గారు పాటలు పాడుతుంటే వాటికి మధ్యలో మ్యూజిక్ వాయించేవాడిని. అప్పుడు అందరూ చప్పట్లు కొడుతుండేవారు. ఆ చప్పట్లు వింటుంటే నాకు అలా గర్వం పెరుగుతూ వచ్చేది. అయితే వాళ్లు చప్పట్లు కొట్టేది నేను వాయించినందుకా? ఆ సంగీతానికా? అని అనుకునేవాడిని. కచ్చితంగా సంగీతానికి చప్పట్లు కొడుతున్నారు. అంటే అది కంపోజ్ చేసిన ఎంఎస్‌వి గారి కోసం చప్పట్లు కొడుతున్నారని అర్థమైంది. మనకు కూడా ఈ చప్పట్లు కావాలంటే.. మనం కూడా మ్యూజిక్ కంపోజ్ చేయాలి అని అలా కంపోజింగ్ మీద దృష్టి సారించాను.
చైతన్య ప్రసాద్ : ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను ఎలా ఫాలో అవుతుంటారు?.. ఇక ఏఐ కూడా మ్యూజిక్ ఇండస్ట్రీని శాసిస్తుందని అంటున్నారు?
ఇళయరాజా : అసలు ఈ ట్రెండ్ అనే మాటే నాకు అర్థం కాదు. పాట బాగుంటే ఎప్పుడైనా వింటారు. మనం చేసే పాట జనాలకు నచ్చాలంతే. అందులో ట్రెండ్ అనేది ఏం ఉంది. ఏఐ అనేది స్వతాహాగా ఏం చేయలేదు. మనిషి మెదడు లక్ష ఏఐలతో సమానం. ఏఐ ఏం చేసినా కూడా అందులో జీవం ఉండదు. ముందే మనం ఫీడ్ చేసిన ఇన్‌స్ట్రక్షన్స్‌తో ఏఐ పని చేస్తుందంతే. మనిషి ఏఐని కనిపెట్టాడు.. కానీ ఓ ఏఐ మనిషిని గాని, మానవ మెదడుని గానీ సృష్టించలేదు.
చైతన్య ప్రసాద్ : మీలాంటి వారు ఇలాంటి కొత్త టీం కోసం ముందుకు వచ్చారు. ‘షష్టిపూర్తి’లో మీకు నచ్చిన అంశం ఏంటి?
ఇళయరాజా : నా కెరీర్ ఆరంభం నుంచి కూడా కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాను. భారతీరాజా, మణిరత్నం ఇలా అందరూ అప్పట్లో కొత్త వాళ్లే. నాతో సినిమాలు చేసిన తరువాత వారికి ఆ స్టార్డం, గుర్తింపు వచ్చింది. వాళ్లని వాళ్లు నిరూపించుకుని ఆ స్థాయికి వెళ్లారు. అలా కొత్తగా వచ్చే వారిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ‘షష్టిపూర్తి’ని ఒప్పుకున్నాను. ఇందులో మేం చేసిన పని ఎలా ఉంది? అనేది ఆడియెన్స్ చెప్పాలి. మంచి కథ ఉందా? లేదా? అన్నదే నేను చూస్తాను. స్టార్స్ ఉన్నారా? లేదా? అన్నది నేను పట్టించుకోను.
చైతన్య ప్రసాద్ : మీరు ఎప్పుడూ ఇళయరాజా గారి పాటలే వింటుంటారు. అసలు మీ తొలి ప్రాజెక్ట్‌కి ఆయనతోనే చేస్తాను అని ఎలా అనుకున్నారు?
పవన్ ప్రభ : నేను 80వ దశకంలో పుట్టాను. నాకు ఇళయరాజా గారి పాటలే ప్రపంచం. నాకు అవి పాటలు కాదు.. కీర్తనలు. నేను దేవుడికి దండం పెట్టడం అయినా మర్చిపోతాను కానీ ఇళయరాజా గారి పాటలు వినడం మాత్రం మర్చిపోను. నేను ఇళయరాజా గారితోనే చేయాలని గుడ్డిగా ఫిక్స్ అయ్యాను. ముందు ఆయన్నే అడుగుదాం. ఆయన కుదరదు అంటే చూద్దాంలే అని అనుకునేవాడ్ని. కానీ నా ఈ కలను మా నిర్మాత రూపేశ్ గారు నిజం చేశారు. ఇదే కథను చాలా వద్దకు తీసుకెళ్లి వినిపించాను. కానీ రాజా గారు నీ కోసం ఎందుకు వస్తారు? అని అంతా అడిగేవారు. కానీ రూపేశ్ మాత్రం ప్రయత్నిద్దాం అని అన్నారు. నేను రాజా గారికి రెండు నిమిషాలు కూడా కథ చెప్పలేదు. ఆయన వెంటనే ఓకే అన్నారు. అసలు నేను చెప్పిందాంట్లో ఆయనకు ఏం అర్థమైందో ఆ దేవుడికే తెలియాలి. ఈ భూమ్మీద ఉన్న దర్శకుల్లోనే నేనే చాలా లక్కీ పర్సన్ అని అనిపిస్తుంటుంది. ‘షష్టిపూర్తి’ చిత్రం ఎప్పటికీ అలా నిలిచిపోతుంది. ఈ చిత్రంలో ఎంతో అద్భుతమైన మ్యూజిక్ ఉంది. ఈ చిత్రానికి రాజా గారే హీరో. ఇదొక మ్యూజికల్ ఫిల్మ్. ఈ మూవీలో ఆరు పాటలు అద్భుతంగా వచ్చాయి. రాజా గారితో పని చేసిన ఈ అనుభవాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను.
చైతన్య ప్రసాద్ : రాజా గారితో పని చేసిన అనుభవం మీ మాటల్లో చెప్పండి?
హీరో, నిర్మాత రూపేశ్ : రాజా గారి వద్దకు వెళ్తున్నామంటేనే చాలా భయంగా అనిపించింది. మా లాంటి కొత్త వారిని కూడా ఎంతో గొప్పగా ప్రేమించి సపోర్ట్ చేశారు. ఆయనతో పని చేయడం మా అదృష్టం. మా ఈ ‘షష్టిపూర్తి’ జర్నీని ఎప్పటికీ మర్చిపోలేను.
చైతన్య ప్రసాద్ : ‘షష్టిపూర్తి’ కూడా రాజా గారి స్టూడియోలోనే ప్రారంభమైంది కదా?
పవన్ ప్రభ : నాకు రాజా గారి స్టూడియో అంటే గుడి. అలాంటప్పుడు గుడిలోనే కదా నా సినిమాను ప్రారంభించాలి. నా సినిమాకు మ్యూజిక్ ఇస్తానని రాజా గారు వరం ఇచ్చారు.

]]>
Thu, 29 May 2025 20:51:08 +0530 admin
'8 వసంతాలు' జూన్ 20న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ https://prajakshethrenews.com/8-వసంతాలు-జూన్-20న-వరల్డ్-వైడ్-గ్రాండ్-రిలీజ్ https://prajakshethrenews.com/8-వసంతాలు-జూన్-20న-వరల్డ్-వైడ్-గ్రాండ్-రిలీజ్  '8 వసంతాలు' జూన్ 20న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

ప్రజా క్షేత్ర్, సినిమా :

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు' ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ. అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని,వై రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోందని ప్రోమోలు ప్రామిస్ చేశాయి. మేకర్స్ ఈ మాన్సూన్ సీజన్‌లో సినిమాని థియేటర్స్ లోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. జూన్ 20న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. హృదయాన్ని కదిలించే ప్రేమ గాథ మరో మూడు వారాలలో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచబోతోంది.  రిలీజ్ డేట్ పోస్టర్‌లో అనంతిక సనీల్‌కుమార్ బ్యూటీఫుల్ గా వున్నారు. అద్భుతమైన చీరలో ఆమె ప్లజెంట్ గా కనిపించారు. ఆమె జుట్టులో గులాబీ ఆమె లుక్‌, క్యారెక్టర్ నేచర్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.వరుస మ్యూజికల్ హిట్స్ ని అందిస్తున్న హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ పరంగా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. విశ్వనాథ్ రెడ్డి డీఓపీ గా వర్క్ చేస్తున్నారు. అరవింద్ ములే ప్రొడక్షన్ డిజైన్‌ను, శశాంక్ మాలి ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.  మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్స్ తో దూకుడుగా ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు.తారాగణం: అనంతిక సనిల్‌కుమార్, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్

]]>
Thu, 29 May 2025 20:43:52 +0530 admin
వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న విడుదల కానున్న 'మాస్ జాతార' చిత్రం https://prajakshethrenews.com/వినాయక-చవితి-కానుకగా-ఆగస్టు-27న-విడుదల-కానున్న-మాస్-జాతార-చిత్రం https://prajakshethrenews.com/వినాయక-చవితి-కానుకగా-ఆగస్టు-27న-విడుదల-కానున్న-మాస్-జాతార-చిత్రం వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న విడుదల కానున్న మాస్ మహారాజా రవితేజ 'మాస్ జాతార' చిత్రం
ప్రజాక్షేత్ర్, సినిమా : 
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. 'మాస్ జాతర' కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా నిర్మాతలు చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.'మాస్ జతర' చిత్రం వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న విడుదల కానుంది. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా 'మాస్ జాతర' రూపొందుతోంది. వింటేజ్ వైబ్స్, కమర్షియల్ హంగులతో థియేటర్లలో మాస్ పండుగను తీసుకురానుంది. ప్రచార చిత్రాలతోనే ఈ చిత్రం ఏ స్థాయి వినోదాన్ని అందించబోతుందో అర్థమైంది.
ఇటీవల మొదటి గీతం 'తు మేరా లవర్' విడుదలై అందరినీ ఉర్రూతలూగిస్తోంది. 'చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే' పాటకు ట్రిబ్యూట్ గా మలిచిన 'తు మేరా లవర్' గీతం అభిమానులకు విందు భోజనంలా ఉంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. ధమాకా జోడి రవితేజ-శ్రీలీల తెరపై కనిపిస్తే ఆ సందడే వేరు. ఈ జోడి మరోసారి బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతోంది.
సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో 'మాస్ జాతర' చిత్రానికి స్వరకర్త. ధమాకా చిత్ర విజయంలో ఆయన సంగీతం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు 'మాస్ జాతర'తో మరోసారి మాస్ ప్రేక్షకులను మెప్పించనున్నారు. దర్శకుడు భాను బోగవరపు.. రవితేజ అభిమానులతో పాటు, మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా 'మాస్ జాతర'ను మలుస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు విధు అయ్యన్న ఆకట్టుకునే విజువల్స్ తో పక్కా కమర్షియల్ వైబ్ తీసుకొస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి తన అనుభవంతో అసలు సిసలైన పండుగ చిత్రంగా మలుస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్ నిర్మాణ సంస్థలు వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్నాయి. ఈ వినాయక చవితికి 'మాస్ జాతర' చిత్రంతో థియేటర్లలో మాస్ పండుగను తీసుకొచ్చి, అభిమానుల దాహాన్ని తీర్చడానికి సిద్ధమవుతున్నారు.

]]>
Thu, 29 May 2025 19:56:15 +0530 admin
సంక్రాంతి కానుకగా 'అనగనగా ఒక రాజు' https://prajakshethrenews.com/సంక్రాంతి-కానుకగా-అనగనగా-ఒక-రాజు https://prajakshethrenews.com/సంక్రాంతి-కానుకగా-అనగనగా-ఒక-రాజు సంక్రాంతి కానుకగా 'అనగనగా ఒక రాజు'
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వినోదభరిత చిత్రం 'అనగనగా ఒక రాజు' సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనుంది. తనదైన ప్రత్యేక కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బ్లాక్ బస్టర్ మెషిన్ నవీన్‌ పొలిశెట్టి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన మోషన్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంతో నవీన్‌ పొలిశెట్టి థియేటర్లలో నవ్వుల పండుగను తీసుకురాబోతున్నాడని మోషన్ పోస్టర్ తోనే అర్థమైంది.తెలుగు సినీ అభిమానులు సంక్రాంతి పండుగను సినిమా పండుగలా భావిస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ లకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే పండుగకి సరైన సినిమాగా 'అనగనగా ఒక రాజు' వచ్చే సంక్రాంతికి థియేటర్లలో అడుగుపెట్టనుంది.
తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి 'అనగనగా ఒక రాజు'లో నవీన్‌ పొలిశెట్టికి జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేక్షకులను సరికొత్త వినోదాన్ని అందించేలా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. పండుగ రుచికి సరిగ్గా సరిపోయేలా ఆయన తనదైన మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేయనున్నారు.
ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థలు కొన్నేళ్లుగా వరుస ఘన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'డాకు మహారాజ్' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2026 సంక్రాంతికి 'అనగనగ ఒక రాజు'తో మరో పండగ విజయాన్ని ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
తారాగణం: నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి

]]>
Mon, 26 May 2025 19:14:04 +0530 admin
రూ.1000కోట్లు బిజినెస్ చేసిన పుష్ప 2 (Pushpa2)ప్రీ&రిలీజ్ బిజినెస్ https://prajakshethrenews.com/రూ1000కోట్లు-బిజినెస్-చేసిన-పుష్ప-2-pushpa2ప్రీ-రిలీజ్-బిజినెస్ https://prajakshethrenews.com/రూ1000కోట్లు-బిజినెస్-చేసిన-పుష్ప-2-pushpa2ప్రీ-రిలీజ్-బిజినెస్ రూ.1000కోట్లు బిజినెస్ చేసిన పుష్ప 2 (Pushpa2)ప్రీ-రిలీజ్ బిజినెస్

ప్రజా క్షేత్ర్, సినిమా : 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన పుష్ప 2(Pushpa 2) క్రేజ్ రోజురోజుకి క్రేజ్ పెరిగి పోతుంది. రిలీజ్ కు ముందే ఇండియన్ టాప్ స్టార్స్ సైతం టచ్ చేయని రికార్డ్స్ పుష్ప -2 క్రియేట్ చేస్తోంది. విడుదలకు ముందే పుష్ప 2 రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు ట్రేడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా పుష్ప 2 - ది రూల్ మూవీకి ట్రేడ్‌లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర భారతదేశంలో థియేట్రికల్ హక్కులు 375-400 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.600 కోట్లు పలికినట్లు సమాచారం.  మిగతా ఇండియా స్టేట్స్లో ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.100 కోట్లకు చేరుకోగా.. ఓవర్సీస్ రైట్స్ బిజినెస్ దాదాపు రూ.125 కోట్లు మేరకు ఉందని ట్రేడ్ నిపుణుల అంచనాలు వేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 600+ కోట్లు అని చెబుతున్నారు.ఓవర్ ఆల్ బిజినెస్ లో సౌత్ నుండి రూ.900 కోట్లతో ఆర్ఆర్ఆర్ టాప్ లో ఉంది. ఇప్పుడు ఆ సినిమా రికార్డ్ బ్రేక్ చేసి రూ.1000 కోట్ల బిజినెస్ చేసిన మూవీగా పుష్ప 2 నిలిచిందని ట్రేడ్ నిపుణులు మాట్లాడుకుంటున్నారు. అలాగే రూ.65 కోట్లకు మ్యూజిక్ రైట్స్ ను, రూ. 85 కోట్లకు టెలివిజన్ హక్కులను, ఇక రూ.275 కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్ హక్కులను పొందినట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి మొత్తంగా పుష్ప 2 - ది రూల్ యొక్క ప్రీ-రిలీజ్ థియేట్రికల్, నాన్-థియేట్రికల్ బిజినెస్ 1025+ కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే పుష్ప 2 ఇండియన్ సినీ హిస్టరీలో ఆల్ టైమ్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు.

]]>
Tue, 22 Oct 2024 13:59:38 +0530 admin
చిరంజీవి ఆల్ టైమ్ ఫెవరెట్ హీరోయిన్ ఆమెనే https://prajakshethrenews.com/చిరంజీవి-ఆల్-టైమ్-ఫెవరెట్-హీరోయిన్-ఆమెనే https://prajakshethrenews.com/చిరంజీవి-ఆల్-టైమ్-ఫెవరెట్-హీరోయిన్-ఆమెనే చిరంజీవి ఆల్ టైమ్ ఫెవరెట్ హీరోయిన్ ఆమెనే 

ప్రజా క్షేత్ర్, సినిమా 

గతంలో తన పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి తను నటించిన హీరోయిన్స్ లో ఆల్ టైం ఫేవరెట్ ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా అసలు విషయం చెప్పుకొచ్చారు. నేను నటించిన హీరోయిన్స్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ కి నేను ఫిదా. హీరోయిన్స్ ఒక్కొక్కరు ఒక్కో విషయంలో ఎక్స్పర్ట్స్. సుమలత హోమ్లి రోల్స్‌కి క్యారఫ్ అడ్రస్. శ్రీదేవి ఓవరాల్ గా పర్సనాలిటీ పరంగా సూపర్. రాధ గురించి చెప్పాలంటే తన డ్యాన్స్ అద్భుతం.  సుహాసిని మరో విధంగా గొప్ప. అలా ప్రతి హీరోయిన్ లో ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ కి నేను అభిమానిని. అయితే మహానటి సావిత్రి, జయసుధ, వాణిశ్రీ తర్వాత విలక్షణత కలిగిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ఆమె రాధిక. ఆమె ఎమోషన్, కామెడీ, క్లాస్, మాస్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలోనూ నటించేయగలరు. వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోగలదు. అందుకే నాకు రాధిక అంటే చాలా ఇష్టం అంటూ వివరించారు. అలా చిరు తన ఆల్ టైం ఫేవరెట్ హీరోయిన్ రాధిక అని చెప్పకనే చెప్పేశారు. ఇక చిరంజీవి, రాధికకాంబోలో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. పట్నం వచ్చిన పతివ్రతలు, అభిలాష, దొంగ మొగుడు, న్యాయం కావాలి,  ఇలా ఎన్నో సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు. ఇక ఇప్పటికప్పుడు చిరు తన హీరోయిన్స్‌తో గెట్ టు గెదర్ జరుపుతూనే ఉంటారు. ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. సోషియా ఫాంటసీ డ్రామాగా మల్లిడి వసిష్ట డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

]]>
Sat, 14 Sep 2024 12:43:49 +0530 admin
రష్మిక మందన్నాకు ఏమైందంటే? https://prajakshethrenews.com/రష్మిక-మందన్నాకు-ఏమైందంటే https://prajakshethrenews.com/రష్మిక-మందన్నాకు-ఏమైందంటే రష్మిక మందన్నాకు ఏమైందంటే?

సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే రష్మిక మందన్నా అనూహ్యంగా  నెల రోజులకుపైగా సోషల్‌ మీడియాకి దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించింది రష్మిక. తాను సోషల్‌ మీడియాకి దూరం కావడానికి కారణమేంటో చెప్పింది. ఈ సందర్భంగా ఆమె అభిమానులకు పెద్ద షాకిచ్చింది.రష్మిక మందన్నా గాయాలపాలయ్యిందట. తనకు గాయాలు అయ్యాయని, అందువల్లే సోషల్‌ మీడియాకి దూరంగా ఉన్నట్టు చెప్పింది. ఈ మేరకు ట్విట్టర్‌(ఎక్స్) ద్వారా పోస్ట్ పెట్టింది రష్మిక మందన్నా. నేను సోషల్‌ మీడియాకి కనిపించి చాలా రోజులవుతుందని నాకు తెలుసు.గత నెలలో నేను పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోవడానికి కారణం నాకు చిన్న ప్రమాదం జరిగింది. ఇప్పుడు నేను దాన్నుంచి కోలుకుంటున్నాను. డాక్టర్లు చెప్పినట్టుగానే ఇంట్లోనే ఉండి రెస్ట్న్నా తీసుకుంటున్న. ఇప్పుడు చాలా చురుకుగా ఉన్నాను. నా యాక్టివిటీస్‌ అన్ని బాగానే చూసుకుంటున్నాను.

]]>
Tue, 10 Sep 2024 02:57:07 +0530 admin
దేవర ప్రీ సేల్స్ అదుర్స్ https://prajakshethrenews.com/దేవర-ప్రీ-సేల్స్-అదుర్స్ https://prajakshethrenews.com/దేవర-ప్రీ-సేల్స్-అదుర్స్ దేవర ప్రీ సేల్స్ అదుర్స్ 

ప్రజా క్షేత్ర్, సినిమా :

ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇప్పటికే అనేక సంచలనాలను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ప్రీ సేల్స్ ఐదు లక్షల డాలర్స్‌ను దాటేయటం విశేషం. ఈ మధ్య విడుదలైన ఫియర్ సాంగ్, చుట్టమల్లే.. , దావుడి సాంగ్స్‌కు, టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్నాయి. ఓవర్‌సీస్‌లో 'దేవర' అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రత్యాంగిర సినిమాస్ అమెరికాలోనే ఎప్పుడు ఎవరూ చేయనంత గొప్పగా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తోంది. రీసెంట్‌గానే ప్రీ బుకింగ్స్‌ను యు.ఎస్‌లో ఓపెన్ చేయగా అక్కడ సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఇప్పటికే ప్రీ సేల్స్ ఐదు లక్షల డాలర్స్‌ను దాటేయటం విశేషం. సినిమాపై ఉన్న బజ్‌, ఊపు చూస్తుంటే ఇంకా ఈ లెక్క రోజు రోజుకీ పెరుగుతోందే కానీ తగ్గటం లేదు. ఆడియెన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమాటిక్ ఫీల్‌ను తెరపై ఎంజాయ్ చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. అభిమానులు టికెట్స్ కోసం ఎగబడుతున్న తీరు చూస్తుంటే దేవర బాక్సాఫీస్ దగ్గర మంచి జోరు చూపిస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు.  త్వరలోనే రాబోతున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌తో ఈ అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు రీచ్ అవుతాయనటంలో ఎటువంటి సందేహం లేదు. 2024లో విడుదలకు సిద్ధమైన ఈ యాక్షన్ చిత్రంలో భైరా అనే పాత్రలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. దేవర'గా టైటిల్ పాత్రలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలను పోషించారు.

]]>
Mon, 09 Sep 2024 21:59:56 +0530 admin
అంగరంగ వైభవంగా తెలుగు సినీ రచయితల సంఘం త్రిదశాబ్ది వేడుకలు https://prajakshethrenews.com/అంగరంగ-వైభవంగా-తెలుగు-సినీ-రచయితల-సంఘం-త్రిదశాబ్ది-వేడుకలు https://prajakshethrenews.com/అంగరంగ-వైభవంగా-తెలుగు-సినీ-రచయితల-సంఘం-త్రిదశాబ్ది-వేడుకలు అంగరంగ వైభవంగా తెలుగు సినీ రచయితల సంఘం త్రిదశాబ్ది వేడుకలు

హాజరయిన కె.రాఘవేంద్రరావు, మురళీమోహన్, డి.సురేష్​బాబు, పరుచూరి గోపాల కృష్ణ , తనికెళ్ల భరణి

ప్రజాక్షేత్ర్ , ఫిలిం న్యూస్​ :

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లోని కృష్ణ హాల్ లో తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ పరుచూరి గోపాల కృష్ణ ఆధ్వర్యంలో తెలుగు సినీ రచయితల సంఘం త్రిదశాబ్ది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి దర్శకులు కె. రాఘవేంద్ర రావు, సీనియర్ నటులు ఎం. మురళీ మోహన్ రావు, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు,బి. గోపాల్​ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ముందుగా  ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు, తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ పరుచూరి గోపాల కృష్ణ, బి. గోపాల్,సంఘం ప్రధాన కార్యదర్శి ఉమర్జీ అనూరాధ, కోశాధికారి నటరాజ గోపాల మూర్తి లు సంఘం మహిళా ప్రతినిధులతో కలిసి  జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సరస్వతి దేవికి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా డి.లిట్​ నీ, పి.హెచ్​.డి లను గౌరవ డాక్టరేట్లను పొంది, రచయితల సంఘానికి తల మానికాలైన కవి మాణిక్యాలకు, జాతీయ అవార్డులు పొందిన కవి రాజులకు, రాష్ట్ర గీతాన్ని ఇచ్చిన కవి శ్రేష్టునికి దర్శకులు కె. రాఘవేంద్ర రావు, సీనియర్ నటులు ఎం. మురళీ మోహన్ రావు, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు లు ఆత్మీయ సత్కారాలను అందజేశారు. 

సమాజాన్ని ఉద్దరించడానికి సినిమాలురాస్తున్నాం : పరుచూరి గోపాల కృష్ణ

ఒకప్పుడు రేడియో రైటర్​కు ఉన్న గౌరవం కూడా సినిమా రైటర్​కు ఉండేది కాదు. నేను డాక్టర్​ కావాలనే చాలా కోరిక నా  తల్లిదండ్రులకు ఉండేది. నేను సూది మందు ఇవ్వకపోవచ్చు కానీ సూది మందు ప్రభావాన్ని అందిచకలిగినటువంటి మాటల తూటాలతో ఇవాళ సినిమాలకు  రచన చేశాం. మొక్కే కదా అని పీకేస్తే ..పీక కోస్తాం .... తప్పు మావైపు ఉంది కదా అని తలదించుకునివెళ్తున్నాం..లేకపోతే తలలు తీసుకుని వెళ్లే వాళ్లం అని రాసిన  డైలాగ్​లు ప్రజల్లో ఇప్పటికే  మెదులుతూనే ఉన్నాయి. సినిమా ఒక ఎంటర్​టెయిన్​ మెంట్​ మాత్రమే కాదని ఇది ఎడ్యుకేషన్​ కూడా అని ప్రపంచానికి చెప్పేవిధంగా తెలుగు సినిమా కథ సామాజిక దృష్టి అనే అంశంపైన 806 పేజీల పుస్తకంను రాశాను. ఎన్నో ఏళ్ళ నిరీక్షణ అనంతరం వచ్చిన డాక్టరేట్​ను నా తల్లి ఆదండ్రులకు అంకితం ఇచ్చాను. సినిమా అనేది వినోదం కోసం కాదు.. విజ్ఞానం కోసమే అన్న విధంగా సినిమా కథలను రచించాలని చెప్పారు. సినిమాలు ఏదో నవ్వించడానికో ..కవ్వించడానికో.. నాలుగు స్టెప్పులు వేయించడానికో సినిమాలు రాయడంలేదని సమాజాన్ని ఉద్దరించడానికి సినిమాలు రాస్తున్నాం అని ధైర్యంగా చెప్పుకోవాలి. 

సినిమాకు రచయితల సంఘం గుండెలాంటిది :

మురళీమోహన్

తెలుగు రచయితల సంఘం త్రిదశాబ్ది వేడుకల్లో ఇంతమంది రచయితలను ఒకే వేదికపై చూడడం చాలా సంతోషంగా ఉంది. ఏ సినిమాకు అయినా మూలం అనేది కథ. ఆ  కథ ...  మాటలు ఈ రెండు ఉంటేనే సినిమా సూపర్​ డూపర్​ హిట్​ అయ్యేది. సినిమాకు రచయితల సంఘం గుండెలాంటిది. ఆనారోగ్యంగా, ఆర్థికంగా ఇబ్బందులున్న కొంత మందికి ఆర్థిక సహాయం చేయడానికి తెలుగు రచయితల సంఘం ముందుకు రావడం గర్వించదగ్గ విషయం. 

ఎప్పుడు ఒప్పుకోవద్దురా ... ఓటమి  : విజయేంద్రప్రసాద్​

ఎప్పుడు ఒప్పుకోవద్దురా ... ఓటమి , ఎప్పుడు వదులు కోవద్దురా ...ఓరిమి..నొప్పిలేనినిమిషమే జననమయిన ...మరణమయిన బ్రతుకు నీకిచ్చే ఘర్షణ. అశ నీకు అస్త్రం అవు..  శ్వాస నీకు శస్త్రం అవు...ఆయుధమ్ము సాగద్రోలురా... నిరంతరం ప్రయత్నం ఉన్నదా...నిరాశకే నిరాశ పుట్టదా? ఎప్పుడు ఒప్పకోవద్దురా ఓటమి అంటూ తాను నేర్చుకున్న ఈ మంత్రమే సక్సెస్​ దిశగా నడుస్తున్నానని వెల్లడించారు.

రచయిత లేకపోతే.. సినిమా ఇండస్ట్రీనే లేదు

డి. సురేష్ బాబు : 

మా సంస్థలాంటి ఎన్నో సంస్థలు ఈ రోజు ఉన్నాయంటే కారణం రచయితలే. అసలు రచయితలు లేకపోతే సినిమాలే లేవు.. సినిమా ఇండస్ట్రీనే లేదని డి. సురేష్ బాబు అన్నారు. 

రౌరవ ఆర్ ఆర్ ఆర్ పురస్కారం:

రచయిత విజయేంద్ర ప్రసాద్ కు గౌరవ ఆర్ ఆర్ ఆర్ పురస్కారం అందజేశారు.

గౌరవ డాక్టరేట్ల పురస్కారం.....

డాక్టర్ తనికెళ్ళ భరణి, డాక్టర్ నటరాజ గోపాల మూర్తి, డాక్టర్ పి. రాజేంద్ర కుమార్, డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి, డాక్టర్ పొలిశెట్టి రామ్మోహన్ లకు గౌరవ డాక్టరేట్ల పురస్కారం అందజేశారు.

లైఫ్ టైమ్ అచీవ్ మెంట్  అవార్డుల ప్రధానం...

ప్రముఖ సినీ రచయితలు ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి, పరుచూరి వెంకటేశ్వర్ రావు, పరుచూరి గోపాల కృష్ణ, సత్యానంద్ తోట పల్లి సాయినాథ్, డాక్టర్ వడ్డే పల్లి కృష్ణ, ఎస్వీ రామరావు లకు 

లైఫ్ టైమ్ అచీవ్ మెంట్  అవార్డుల ప్రధానం చేశారు. 

ఆత్మీయ పురస్కారాలు....

అందేశ్రీ, చంద్ర శేఖర్ ఆజాద్, దీపికా రాజ్, వెంకటేష్ కిలారి, జి. భగీరథ, ఇందురమణ, మౌన శ్రీ మల్లిక్ లకు ఆత్మీయ పురస్కారాలు  అందజేశారు.

ఈ సందర్బంగా  త్రి దశాబ్ది వేడుకల కార్యక్రమం రచయతల సంఘం ప్రధాన కార్యదర్శి ఉమార్జీ అనురాధ నిర్వహించగా, కోశాధికారి డా చిలుకమఱ్ఱి నటరాజ్ వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు. 

]]>
Tue, 03 Sep 2024 00:19:01 +0530 admin
అదిరిపోయిన 'సరిపోదా శనివారం' కలెక్షన్స్ https://prajakshethrenews.com/అదిరిపోయిన-సరిపోదా-శనివారం-కలెక్షన్స్ https://prajakshethrenews.com/అదిరిపోయిన-సరిపోదా-శనివారం-కలెక్షన్స్

అదిరిపోయిన 'సరిపోదా శనివారం' కలెక్షన్స్


నాని – వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో ‘అంటే సుందరానికీ!’ తర్వాత రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందింది. ప్రియాంక అరుళ్ మోహన్  హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య  పవర్ఫుల్ విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్స్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఆగస్టు 29న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. సరిపోదా శనివారం’ చిత్రానికి రూ.44.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.45 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.11.15 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.33.85 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

]]>
Sat, 31 Aug 2024 13:50:42 +0530 admin