Prajakshethre News & : స్పోర్ట్స్ https://prajakshethrenews.com/rss/category/స్పోర్ట్స్ Prajakshethre News & : స్పోర్ట్స్ en Copyright 2024 Prajakshethre News & All Rights Reserved. క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్ https://prajakshethrenews.com/క్రికెట్-లవర్స్-కు-గుడ్-న్యూస్ https://prajakshethrenews.com/క్రికెట్-లవర్స్-కు-గుడ్-న్యూస్ క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్
ప్రజా క్షేత్ర్, విశాఖపట్టణం, జూన్ 11 :
విశాఖపట్నం వాసులకు గుడ్ న్యూస్.. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని క్రికెట్ అభిమానులకు ఇది పండగలాంటి వార్తనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచకప్ మ్యాచులను వీక్షించే అవకాశం దక్కనుంది. అది కూడా ఒకటీ రెండు కాదు. ఏకంగా ప్రపంచకప్ మ్యాచ్‌లను ఐదింటిని చూసే అవకాశం దక్కింది. త్వరలోనే మహిళల వన్డే ప్రపంచకప్ 2025 జరగనున్న సంగతి తెలిసిందే. 2025 మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం ఐసీసీ ఇటీవల వేదికలను ఖరారు చేసింది. అందులో విశాఖపట్నం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో మహిళల ప్రపంచకప్‌కు సంబంధించి ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని (కేశినేని శివనాథ్) వెల్లడించారు.ఐదు ప్రపంచకప్ మ్యాచ్‌లతో పాటుగా ఒక వన్డే మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు కేశినేని చిన్ని వివరించారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో క్రికెట్ గ్రౌండ్లు నిర్మించేందుకు ఏసీఏ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. తొలివిడతగా కర్నూలు, నెల్లూరులో క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. అలాగే త్వరలోనే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ నిర్వహణ కోసం ఏసీఏ ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు.45 రోజుల్లోనే విశాఖపట్నం స్టేడియాన్ని ఆధునీకరించామని.. ఈ ఏడాదిలో రెండు ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా నిర్వహించినట్లు కేశినేని శివనాథ్ గుర్తు చేశారు. స్టేడియం అప్‌గ్రేడ్‌ మీద బీసీసీఐ, ఐసీసీ కూడా సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. దీంతోనే విశాఖపట్నంలో మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ నుంచి అనుమతి వచ్చినట్లు తెలిపారు. దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఇందుకోసం ప్రభుత్వాన్ని 65 ఎకరాల భూమిని కోరినట్లు కేశినేని శివనాథ్ వెల్లడించారు. అమరావతి స్పోర్ట్స్ సిటీలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు వెల్లడించారు. అలాగే జిల్లా క్రికెట్ సంఘాలకు అందించే గ్రాంటును కూడా 20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచినట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని వివరించారు.

]]>
Wed, 11 Jun 2025 23:28:48 +0530 admin
బీసీసీఐకి కొత్త అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా! https://prajakshethrenews.com/బీసీసీఐకి-కొత్త-అధ్యక్షుడిగా-రాజీవ్-శుక్లా https://prajakshethrenews.com/బీసీసీఐకి-కొత్త-అధ్యక్షుడిగా-రాజీవ్-శుక్లా బీసీసీఐకి కొత్త అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా!
ప్రజా క్షేత్ర్, ముంబై జూన్ 4 :

త్వరలో బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు రానున్నారు. ఆయన ఎవరో కాదు.. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా. ప్రస్తుత చీఫ్ రోజర్ బిన్నీ 2025 జూలైలో 70 ఏళ్లు నిండిన తర్వాత పదవి నుంచి వైదొలగుతారు.భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నాయకత్వ మార్పుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా పేరు తెరపైకి వచ్చింది. అనుభవజ్ఞుడైన రాజకీయ వ్యూహకర్త, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ అయిన శుక్లా బోర్డు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా ప్రస్తుతం బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుత చీఫ్ రోజర్ బిన్నీ 2025 జూలైలో 70 ఏళ్లు నిండిన తర్వాత పదవి నుంచి వైదొలగుతారు. భారత క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం 70 ఏళ్లు దాటిన తర్వాత బీసీసీఐలో ఏ వ్యక్తి కూడా ఏ పదవిలో ఉండకూడదు..బీసీసీఐ ప్రస్తుత ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించారు. ఆయన ప్రారంభ జీవితం విద్యారంగం, జర్నలిజంపై ఉండేది. జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన జనసత్తా, రవివర్ వంటి ప్రముఖ పబ్లికేషన్స్ లో పనిచేశారు. పదునైన రాజకీయ విశ్లేషణ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆయనను రాజకీయాల్లో కెరీర్‌కు సహజంగానే వెళ్లేలా చేశాయి.2000లో రాజీవ్ శుక్లా అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదట్లో అఖిల భారతీయ లోక్ తాంత్రిక్ కాంగ్రెస్‌తో, ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్‌లోకి వచ్చారు. అనతికాలంలోనే జాతీయ అధికార ప్రతినిధిగా, ఆ తర్వాత రాజ్యసభలో ఎంపీ వరకు ఎదిగారు.రాజీవ్ శుక్లా ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘంలో కీలక వ్యక్తి. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌లో సెక్రటరీగా పని చేశారు. ఆ తర్వాత బీసీసీఐ వైపు వచ్చారు. రాజీవ్ శుక్లా 2011లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. వివాదాల మధ్య 2013లో ఆయన తాత్కాలికంగా పదవి నుంచి వైదొలిగారు. చివరకు 2015లో మళ్లీ ఆ పదవిలోకి వచ్చారు. 2020లో బీసీసీఐ ఉపాధ్యక్షుడయ్యారు.బిన్నీ స్థానంలో శుక్లా అధ్యక్షుడిగా నియమితులైతే జనరల్ బాడీ, అపెక్స్ కౌన్సిల్ సమావేశాలన్నింటికీ ఆయన అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. బీసీసీఐ ఆడిట్ చేసిన వార్షిక ఖాతాలు, ఇతర ఆర్థిక ప్రకటనలపై సంతకం చేయాల్సిన ముగ్గురు వ్యక్తులలో ఆయన ఒకరు అవుతారు.

]]>
Wed, 04 Jun 2025 11:48:39 +0530 admin
ఐపిఎల్‌తో స్టార్‌డమ్.. వైభవ్ సూర్యవంశీని కలిసిన ప్రధాని https://prajakshethrenews.com/ఐపిఎల్తో-స్టార్డమ్-వైభవ్-సూర్యవంశీని-కలిసిన-ప్రధాని https://prajakshethrenews.com/ఐపిఎల్తో-స్టార్డమ్-వైభవ్-సూర్యవంశీని-కలిసిన-ప్రధాని ఐపిఎల్‌తో స్టార్‌డమ్.. వైభవ్ సూర్యవంశీని కలిసిన ప్రధాని
ప్రజా క్షేత్ర్ : ఫాట్నా :
 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ కోసం జరిగిన మెగా వేలంలో రాజస్థాన్‌ రాయల్స్ తనని కొనుగోలు చేయడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ   తొలుత కొన్ని మ్యాచుల్లో ఆడే అవకాశం రాకపోయినా.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ సాధించి స్టార్‌డమ్‌ను తెచ్చుకున్నాడు. దేశం మొత్తం ఈ యువ కెరటాన్ని ప్రశంసలతో ముంచెత్తింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ   వైభవ్‌ని కలిశారు.ప్రస్తుతం బిహార్ పర్యటనలో ఉన్న ప్రధాని శుక్రవారం పాట్నా ఎయిర్‌పోర్ట్‌లో వైభవ్‌  అతని తల్లిదండ్రులను కలిశారు. ఈ విషయాన్ని ప్రధాని   తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. వైభవ్‌తో కాసేపు క్రికెట్‌కి సంబంధించిన విషయాలు మాట్లాడారు. అతను సాధించిన ఘనతలకు అభినందించారు. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్ ప్రయత్నాలన్ని విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. అతను మరిన్ని ఉన్న శిఖరాలు అధిరోహించాలని, దేశానికి పేరు ప్రఖాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. వైభవ్‌కి తన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని అన్నారు. ప్రస్తుతం వైభవ్ ప్రధానిని కలిసి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

]]>
Fri, 30 May 2025 19:00:20 +0530 admin
సత్తా చాలిన ఏకాగ్ర చెస్ అకాడమీ క్రీడాకారులు https://prajakshethrenews.com/సత్తా-చాలిన-ఏకాగ్ర-చెస్-అకాడమీ-క్రీడాకారులు https://prajakshethrenews.com/సత్తా-చాలిన-ఏకాగ్ర-చెస్-అకాడమీ-క్రీడాకారులు సత్తా చాలిన ఏకాగ్ర చెస్ అకాడమీ క్రీడాకారులు
 ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
తెలంగాణా చెస్ అకాడమీ, ఐక్యూ చెస్ అకాడమీ నిర్వహించిన చెస్ టోర్నమెంట్స్ లో ఏకాగ్ర చెస్ అకాడమీ క్రీడాకారులు సత్తాచాటి ఛాంపియన్స్ గా నిలిచారని అకాడమీ చీఫ్ కోచ్ చైతన్య సురేష్ తెలిపారు.  జూబ్లీహిల్స్ లోని ఏకాగ్ర చెస్ అకాడమీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఛాంపియన్ షిప్ టోర్నమెంట్స్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తెలంగాణా చెస్ అకాడమీ నిర్వహించిన టోర్నమెంట్లో అండర్-9 గర్ల్స్ విభాగంలో అన్య రంగినేని ఛాంపియన్ గా నిలవగా, యంగెస్ట్ ప్లేయర్ గా శ్వాన నిలవగా, ఐక్యూ చెస్ అకాడమీ నిర్వహించిన టోర్నమెంట్లో అండర్ 13 బాయ్స్ లో చరత్ అశ్విన్ ఛాంపియన్ గా నిలిచాడని తెలిపారు. అకాడమీలో సీఈఓ సందీప్ నాయుడు, చీఫ్ కోచ్ చైతన్యల శిక్షణ, ఎత్తుకు పై ఎత్తులను ఎలా వేయాలి, మైండ్ గేమ్ ఎలా ఆడాలని పలు అంశాలపై తీసుకున్న శ్రద్దతో ఛాంపియన్ గా నిలిచామని, గ్రాండ్ మాస్టర్స్ అవ్వడమే తమ లక్ష్యమని విజేతలు పేర్కొన్నారు. వరల్డ్ నెంబర్ టూగా మా అకాడమీ విద్యార్థిని నిలిచిందని, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మా అకాడమీ క్రీడాకారులు ఛాంపియన్స్ గా నిలవడం సంతోషంగా ఉందని చీఫ్ కోచ్ చైతన్య తెలిపారు.

]]>
Fri, 30 May 2025 18:10:28 +0530 admin
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి : రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ సెక్రటరీ పద్మా రెడ్డి https://prajakshethrenews.com/విద్యార్థులు-క్రీడల్లో-రాణించాలి-రంగారెడ్డి-అర్బన్-జిల్లా-బీజేపీ-సెక్రటరీ-పద్మా-రెడ్డి https://prajakshethrenews.com/విద్యార్థులు-క్రీడల్లో-రాణించాలి-రంగారెడ్డి-అర్బన్-జిల్లా-బీజేపీ-సెక్రటరీ-పద్మా-రెడ్డి విద్యార్థులు క్రీడల్లో రాణించాలి 

రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ సెక్రటరీ పద్మా రెడ్డి 

ప్రజాక్షేత్ర్ , వెబ్​ న్యూస్​ 

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను రాణించాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ సెక్రటరీ పద్మా రెడ్డి  అన్నారు. క్రీడల ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ , సమయ పాలన, క్రీడా స్పూర్తి అలవడుతుందన్నారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ సెక్రటరీ పద్మా రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన  క్రికెట్​ టోర్నమెంట్​లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీని, నగదు బహుమతిని అదంజేశారు. రెండవ స్థానంలో నిలిచిన రన్నరప్​కు నగదు బహమతిని అందజేశారు. ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ క్రీడా స్పూర్తి ద్వారా విద్యార్థులు తమ నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను తేలికగా అధికమించగలుగుతారన్నారు. జిల్లా , రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోను సత్తా చాటాలని ఆయన పిలుపు నిచ్చారు.

]]>
Thu, 27 Feb 2025 19:08:35 +0530 admin
అర్జున అవార్డు 2024 కు ఎంపికయిన దీప్తి జీవాంజీ కి సీఎం అభినందనలు https://prajakshethrenews.com/అర్జున-అవార్డు-2024-కు ఎంపికయిన -దీప్తి-జీవాంజీ-కి-సీఎం-అభినందనలు https://prajakshethrenews.com/అర్జున-అవార్డు-2024-కు ఎంపికయిన -దీప్తి-జీవాంజీ-కి-సీఎం-అభినందనలు అర్జున అవార్డు 2024  గ్రహీత దీప్తి జీవాంజీ కి సీఎం అభినందనలు 

పారాలింపిక్స్‌లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి  విశిష్ట క్రీడా పురస్కారం అర్జున అవార్డు 2024 కు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ప్రజా ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా 1 కోటి రూపాయలు, కోచ్ నాగపురి రమేష్ కి రూ. 10 లక్షల నగదు బహుమతిని గతంలోనే అందజేశారు. అదే సమయంలో దీప్తి గారికి గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వరం‌గల్‌లో 500 గజాల స్థలం కేటాయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.తెలంగాణ యువ క్రీడాకారులు మరింతగా రాణించాలని, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మితం కానున్న స్పోర్ట్స్ కాంప్లెక్సులు అందుకు దోహదపడతాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.అలాగే, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన గుకేష్ (చెస్), హర్మన్ ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (ప్యారా అథ్లెటిక్స్), మను బాకర్ (షూటింగ్)లకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. 2024 లో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి అర్జున, ద్రోణాచార్య అవార్డులకు ఎంపికైన క్రీడాకారులు, కోచ్‌లకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.

]]>
Fri, 03 Jan 2025 09:12:25 +0530 admin
యువత క్రీడలపై దృష్టి సారించండి : రేవంత్​రెడ్డి https://prajakshethrenews.com/యువత-క్రీడలపై-దృష్టి-సారించండి-రేవంత్రెడ్డి https://prajakshethrenews.com/యువత-క్రీడలపై-దృష్టి-సారించండి-రేవంత్రెడ్డి యువత క్రీడలపై దృష్టి సారించండి : రేవంత్​రెడ్డి

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

యువత వ్యసనాల వైపు వెళ్లొద్దు. వ్యసనాలు జీవితంలో మిమ్మల్ని ఏ తీరానికి చేర్చలేవు. తల్లిదండ్రులకు దుఃఖం తప్ప. మీ కుటుంబానికి కష్టాలు తప్ప. అదే క్రీడల్లో రాణిస్తే మీ జీవితంలో గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందడమే కాకుండా మీ కుటుంబానికి గౌరవం తెస్తారు. అంతే కాకుండా దేశ ప్రతిష్టను ప్రపంచంలోనే ఇనుమడించే క్రీడాకారులుగా రాణిస్తారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  యువతకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 12,600 గ్రామాల్లో నిర్వహిస్తోన్న చీఫ్ మినిస్టర్స్ కప్-2024 (ChiefMinistersCup 2024)ను ఎల్బీ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి  లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో క్రీడల మస్కట్, లోగో, పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమ చివర్లో క్రీడా జ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. క్రీడాకారులు కఠోరమైన శ్రమతో రాణించాలి. ఇటీవలి ఒలంపిక్స్‌లో పతకాలు సాధించలేకపోయాం. 2028 లో భారతదేశం తరఫున ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలని ప్రతిజ్ఞ తీసుకోండి. మిమ్మల్ని అన్ని విధాలుగా ప్రోత్సహించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది” అని క్రీడాకారుల హర్షద్వానాల మధ్య ముఖ్యమంత్రి ప్రకటించారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి, క్రీడలను అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకుంటున్న చర్యలను ఈ వేదికగా ముఖ్యమంత్రి గారు వివరించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. బాక్సింగ్‌లో దేశానికి తలమానికంగా క్రీడాకారిని నిఖత్ జరీన్ కు డీఎస్పీ ఉద్యోగం కల్పించాం. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం ఎలా ప్రోత్సహిందో చెప్పడానికి నిఖత్ ఒక నిదర్శనం.  అండర్ 17 జాతీయ ఫుట్‌బాల్ టీమ్‌ను తెలంగాణ దత్తత తీసుకోవాలని నిర్ణయించాం. వారికి కావలసిన శిక్షణను హైదరాబాద్‌లో అందిస్తామని ఇండియా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడితో మాట్లాడారు. పట్టుదల, ప్రయత్నం ఉంటే విజయం సాధిస్తారు. అందుకు దక్షిణ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉదాహరణ. 16 ఎకరాల్లో ఉన్న ఆ ఒక్క యూనివర్సిటీ ఒలంపిక్స్‌లో ఏకంగా 32 బంగారు పతకాలను సాధించింది. క్రీడలను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (YoungIndiaSportsUniversity), యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ (YoungIndiaSportsAcademy)లను స్థాపించాం. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి. గురుద్వార్, మందిరం, మసీదు, ఒక చర్చ్ వంటి ప్రార్థనా మందిరాలకు ఎవరికి వారు వెళ్తారు. కానీ మతాలకు అతీతంగా అందరూ కలిసేది క్రీడామైదానం ఒక్కటే. ఎల్బీ స్టేడియం అద్బుతమైన స్టేడియంగా తీర్చిదిద్ది నగర క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తాం. ఈ కార్యక్రమంలో క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి , తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి , ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు త్రివిధ దళాలకు చెందిన ప్రతినిధులు, క్రీడాకారులు పెద్దఎత్తున హాజరయ్యారు.

]]>
Sat, 05 Oct 2024 02:42:23 +0530 admin
బంగ్లాదేశ్​ తో టీ 20 సీరీస్ కు పంత్​ , గిల్​ దూరం https://prajakshethrenews.com/బంగ్లాదేశ్-తో-టీ-20-లకు-పంత్-గిల్-దూరం https://prajakshethrenews.com/బంగ్లాదేశ్-తో-టీ-20-లకు-పంత్-గిల్-దూరం బంగ్లాదేశ్​ తో టీ 20 సీరీస్ కు పంత్​ , గిల్​ దూరం

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

బంగ్లాదేశ్​తో అక్టోబన్​ 7వ తేదీ నుంచి జరిగే 3 మ్యాచ్​ల టీ 20 సీరిస్​కు పంత్​తో పాటు గిల్​, బూమ్రా, సిరాజ్​ లకు రెస్ట్​ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. రాబోయే టెస్ట్​ సీరీస్​ల దృష్ట్యా వీరికి విశ్రాంతి ఇచ్చే యోచనలో ఉన్నట్లు చెప్పారు. టీ 20 జట్టుకు ఎవరెవరు ఎంపిక​వుతారనేది ఆసక్తి కరంగా మారింది. 

]]>
Sun, 15 Sep 2024 21:00:45 +0530 admin
క్రీడా భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/క్రీడా-భవనాన్ని-ప్రారంభించిన-ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/క్రీడా-భవనాన్ని-ప్రారంభించిన-ముఖ్యమంత్రి-రేవంత్-రెడ్డి క్రీడా భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్​

రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన క్రీడా భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రారంభించారు. బ్యాట్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడా వసతులతో పాటు అధునాతన జిమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి సీఎం కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఈ కార్య‌క్ర‌మంలో పలువురు ప్రజాప్రతినిధులతో పాటు డీజీపీ జితేంద‌ర్ సహా ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

]]>
Thu, 12 Sep 2024 00:12:30 +0530 admin
సిరియా జట్టుకు "ఇంటర్ కాంటినెంటల్ కప్&2024" ను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/సిరియా-జట్టుకు-ఇంటర్-కాంటినెంటల్-కప్-2024-ను-అందజేసిన-సీఎం-రేవంత్-రెడ్డి-144 https://prajakshethrenews.com/సిరియా-జట్టుకు-ఇంటర్-కాంటినెంటల్-కప్-2024-ను-అందజేసిన-సీఎం-రేవంత్-రెడ్డి-144 సిరియా జట్టుకు "ఇంటర్ కాంటినెంటల్ కప్-2024" ను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ఇంటర్ కాంటినెంటల్ కప్ (4వ ఎడిషన్) 2024 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ విజేతలైన సిరియా ఆటగాళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. మంగళవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరియా విజయం సాధించింది. దీంతో సిరియా ఈ ఎడిషన్ విన్నర్‌గా నిలవగా, ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి ఆ జట్టుకు "ఇంటర్ కాంటినెంటల్ కప్-2024" ను అందజేశారు.  మూడు దేశాలు మధ్య మూడు మ్యాచులు (రౌండ్ రాబిన్ ఫార్మేట్) జరిగిన ఈ ఫుట్‌బాల్‌ టోర్నీని ఈ నెల 3 న ప్రారంభించిన ముఖ్యమంత్రి  నేటి ముగింపు వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలను, నిర్వహకులను అభినందించారు.  ఈ టోర్నమెంట్ నిర్వహించే అవకాశం హైదరాబాద్‌కు కల్పించినందుకు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ను దేశ క్రీడా రాజధానిగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ ప్రయత్నమని సీఎం పునరుద్ఘాటించారు.  ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించారంటూ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి తో పాటు ఇతర ముఖ్యులకు సీఎం అభినందనలు తెలియజేశారు. ఈ ముగింపు ‌వేడుకల్లో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి , అనిల్ కుమార్ యాదవ్ , ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఏ హరిస్ , సెక్రటరీ జనరల్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Wed, 11 Sep 2024 03:10:59 +0530 admin
2024 పారాలింపిక్స్ లో భారత్​ హవా : 29 పతకాలు కైవసం https://prajakshethrenews.com/2024-పారాలింపిక్స్-లో-భారత్-హవా-29-పతకాలు-కైవసం https://prajakshethrenews.com/2024-పారాలింపిక్స్-లో-భారత్-హవా-29-పతకాలు-కైవసం 29 పతకాలతో మువ్వెన్నెల జెండాను ప్రపంచవేదికపై రెపరెపలాడించిన భారత క్రీడాకారులు

పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచిన భారత్​  

ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్య పతకాలు కైవసం

ప్రజాక్షేత్ర్, స్పోర్ట్స్​ న్యూస్​ 

పారిస్ పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తాచాటారు. 25 పతకాల లక్ష్యంగా బరిలోకి దిగి 29 పతకాలతో మువ్వెన్నెల జెండాను ప్రపంచవేదికపై రెపరెపలాడించారు. అద్భుత ప్రదర్శనతో అంచనాలకు మించి పతకాలు సాథించి దేశం గర్వించేలా ప్రదర్శన చేశారు. వైకల్యాన్ని దాటి సత్తా చాటారు. పతక లక్ష్యంగా 84 మందిలో  29 మెడల్స్ సాధించడమంటే మామూలు విషయం కాదు. ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్య పతకాలు సాధించారు. పతకాల పట్టికలో 18వ స్థానంలో దేశాన్ని సగర్వంగా నిలబెట్టారు. గత టోక్నో పారాలింపిక్స్‌ 19 పతకాలను ఆదిలోనే అధిగమించి అదరగొట్టారు. 1968 నుంచి పారాలింపిక్స్‌లో భారత్ పోటీపడగా, 2016 పారాలింపిక్స్ వరకు మన క్రీడాకారులు కేవలం 12 పతకాలే సాధించారు. కానీ ఆ తర్వాత గత రెండు పారాలింపిక్స్‌లో ఏకంగా 48 పతకాలు సాధించారు. 12 స్వర్ణాలు, 17 రజతాలు, 19 సార్లు కంచు మోత మోగించారు. ఈ విశ్వక్రీడల్లో మన పతక విజేతల పూర్తి జాబితా ఇదే.....

1.అవని లేఖా -  (షూటింగ్) మహిళల 10మీ ఎయిర్‌ రైఫిల్ SH1 .. స్వర్ణం

2.మోనా అగర్వాల్ - (షూటింగ్) మహిళల 10మీ ఎయిర్‌ రైఫిల్ SH1 .. కాంస్యం

3.ప్రీతి పాల్ -  (అథ్లెటిక్స్) మహిళల 100మీ T35 ...కాంస్యం

4.మనీశ్‌ నర్వాల్ - (షూటింగ్) పురుషుల ఎయిర్‌ పిస్టల్ SH1.. రజతం ..

5.రుబీనా ఫ్రాన్సిస్‌ - (షూటింగ్) మహిళల 10మీ ఎయిర్‌పిస్టల్ SH1 .. కాంస్యం 

6. ప్రీతి పాల్ -  (అథ్లెటిక్స్‌) మహిళల 200మీ T35..కాంస్యం

7. నిషాద్ కుమార్ - (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ T47 ..రజతం 

8.యోగేశ్ కతునియా - (అథ్లెటిక్స్‌) పురుషుల డిస్కస్ త్రో F56..రజతం  

9.నితేష్ కుమార్ - (బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్ SL3 ..స్వర్ణం 

10.తులసిమతి మురుగేశన్ -  (బ్యాడ్మింటన్) మహిళల సింగిల్స్ SU5 ..రజతం

11.మనీశా రామదాస్ -  (బ్యాడ్మింటన్) మహిళల సింగిల్స్ SU5 ..కాంస్యం

12.సుహాస్ యతిరాజ్ -  (బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్ SL4 ..రజతం

13.రాకేశ్‌ కుమార్/శీతల్ దేవి -(ఆర్చరీ) ఆర మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్.. కాంస్యం  

14.సుమిత్‌ అంటిల్‌ -  (అథ్లెటిక్స్) జావెలిన్ త్రో ఎఫ్64 ..స్వర్ణం

15.నిత్య శ్రీ శివన్ - (బ్యాడ్మింటన్) మహిళల సింగిల్స్ SH6 ..కాంస్యం 

16.దీప్తి జీవాంజి -  (అథ్లెటిక్స్) మహిళల 400 మీటర్ల టీ20 ..కాంస్యం

17.శరద్ కుమార్ -  (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ టీ63 (అథ్లెటిక్స్) ..రజతం

18.మరియప్పన్ తంగవేలు - (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ టీ63 ..కాంస్యం 

19.అర్జీత్‌ సింగ్‌ - (అథ్లెటిక్స్‌) పురుషుల జావెలిన్ త్రో F46 ..రజతం 

20.గుర్జర్‌ సుందర్‌ సింగ్‌ - (అథ్లెటిక్స్) పురుషుల జావెలిన్ త్రో F46 ..కాంస్యం 

21.సచిన్‌ ఖిలారీ - (అథ్లెటిక్స్) పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46 ..రజతం  

22.హర్విందర్ సింగ్ - (ఆర్చరీ) పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్..స్వర్ణం  

23.ధరంబీర్ సింగ్ - (అథ్లెటిక్స్) పురుషుల క్లబ్ త్రో 51..స్వర్ణం 

24.ప్రణవ్ -  (అథ్లెటిక్స్) పురుషుల క్లబ్ త్రో 51..రజతం

25.కపిల్ పర్మార్ -  (జూడో) పురుషుల -60 కేజీల జే1 ..కాంస్యం

26.ప్రవీణ్ కుమార్ - (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ T64..స్వర్ణం  

27.హొకాటో హొటోజి సెమా - (అథ్లెటిక్స్‌) పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57 ..కాంస్యం 

28.సిమ్రాన్ - (అథ్లెటిక్స్) మహిళల 200 మీటర్ల టీ12 ..కాంస్యం 

29.నవదీప్ సింగ్ -  (అథ్లెటిక్స్) పురుషుల జావెలిన్ త్రో F41...స్వర్ణం

]]>
Mon, 09 Sep 2024 03:07:53 +0530 admin
అథ్లెట్ జీవాంజి దీప్తికి నజరానా ప్రకటించిన రేవంత్ సర్కారు https://prajakshethrenews.com/-అథ్లెట్-జీవాంజి-దీప్తికి-నజరానా-ప్రకటించిన-రేవంత్-సర్కారు https://prajakshethrenews.com/-అథ్లెట్-జీవాంజి-దీప్తికి-నజరానా-ప్రకటించిన-రేవంత్-సర్కారు తెలంగాణ యువ అథ్లెట్ జీవాంజి దీప్తిని సత్కరించిన రేవంత్ రెడ్డి 

అథ్లెట్ దీప్తికి భారీ నజరానా ప్రకటించిన రేవంత్ సర్కారు 

గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం

1 కోటి రూపాయల నగదు బహుమానం

వరం‌గల్‌లో 500 గజాల స్థలం

కోచ్ నాగపురి రమేష్ కి రూ. 10 లక్షలు నగదు బహుమతి

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ పారాలింపిక్స్ 2024లో పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ జీవాంజి దీప్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించారు. విశ్వ వేదికపై సత్తా చాటిన పారా అథ్లెట్ దీప్తికి  గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, 1 కోటి రూపాయల నగదు బహుమానం, వరం‌గల్‌లో 500 గజాల స్థలం, కోచ్ నాగపురి రమేష్ కి రూ. 10 లక్షలు బహుమతిగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి  ఆదేశించారు. ఇటీవల పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్ 2024 మహిళల 400 మీటర్ల టీ20 రేసులో జీవాంజి దీప్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. పారా అథ్లెట్స్, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేలా, వారికి అవసరమైన ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్ , ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్) చైర్మన్ శివసేనా రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

]]>
Sun, 08 Sep 2024 00:58:25 +0530 admin
దేశానికి మరో పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తి https://prajakshethrenews.com/దేశానికి-మరో-పతకం-సాధించిన-తెలంగాణ-బిడ్డ-జీవాంజి-దీప్తి https://prajakshethrenews.com/దేశానికి-మరో-పతకం-సాధించిన-తెలంగాణ-బిడ్డ-జీవాంజి-దీప్తి దేశానికి మరో పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తి

ప్రతిభకు వైకల్యం అడ్డురాదు 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, స్పోర్ట్స్ న్యూస్ : 

పారిస్ వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్-2024లో మన దేశానికి మరో పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 రేసులో దీప్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ విశ్వ క్రీడా వేదికపై విజేతగా నిలిచిన దీప్తి మనందరికీ గొప్ప స్ఫూర్తి అని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు. పారాలింపిక్స్ 2024లో మెడల్స్ సాధించిన భారత అథ్లెట్స్, ప్లేయర్స్ అందరికీ ఈ సందర్బంగా ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.

]]>
Wed, 04 Sep 2024 18:03:49 +0530 admin
ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/ఇంటర్-కాంటినెంటల్-కప్-2024-ఫుట్బాల్-టోర్నమెంట్ను-ప్రారంభించిన-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ఇంటర్-కాంటినెంటల్-కప్-2024-ఫుట్బాల్-టోర్నమెంట్ను-ప్రారంభించిన-రేవంత్-రెడ్డి మూడు దేశాలు పాల్గొనే ప్రతిష్టాత్మక ఇంటర్ కాంటినెంటల్ కప్ (4వ ఎడిషన్) 2024 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతోన్న టోర్నమెంట్‌లో ఇండియాతో పాటు మారిషస్, సిరియా దేశాల జట్లు తలపడతాయి. ఇండియా, మారిషస్‌ల మధ్య తొలి మ్యాచ్ ఓపెనింగ్ సెర్మనీలో ముఖ్యమంత్రి  పాల్గొన్నారు.ఇండియా, సిరియా, మారిషస్ దేశాల జరిగే ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య నిర్ణయించడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ క్రీడాభిమానులు, ముఖ్యంగా హైదరాబాద్ ఫుట్‌బాల్ ప్రియుల తరఫున ఆటగాళ్లకు ముఖ్యమంత్రి  స్వాగతం పలికారు. హైదరాబాద్‌ను దేశ క్రీడా రాజధానిగా మార్చాలన్న తమ ప్రభుత్వ ప్రయత్నమని వివరించారు. టోర్నమెంట్‌ను ప్రారంభించిన అనంతరం అన్ని జట్ల ఆటగాళ్లకు సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు.మూడు జట్ల మధ్య మూడు మ్యాచులు (రౌండ్ రాబిన్ ఫార్మేట్) జరగనుండగా, సెప్టెంబర్ 6న మారిషస్ వర్సెస్ సిరియా, 9 వ తేదీన ఇండియా వర్సెస్ సిరియా జట్లు తలపడనున్నాయి. ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024 ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ , క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి , ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కల్యాణ్ చౌబే, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి , పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

]]>
Wed, 04 Sep 2024 13:26:55 +0530 admin
*తెలంగాణ ఫుట్‌బాల్ టీమ్‌కు ముఖ్యమంత్రి అభినందన* https://prajakshethrenews.com/తెలంగాణ-ఫుట్బాల్-టీమ్కు-ముఖ్యమంత్రి-అభినందన https://prajakshethrenews.com/తెలంగాణ-ఫుట్బాల్-టీమ్కు-ముఖ్యమంత్రి-అభినందన *తెలంగాణ ఫుట్‌బాల్ టీమ్‌కు ముఖ్యమంత్రి అభినందన*

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

జూనియర్ బాలుర జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో టైర్ 2 విజేతగా నిలిచిన తెలంగాణ జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ అభినందించారు. ప్రఖ్యాత బీసీ రాయ్ ట్రోఫీలో భాగంగా 2024-25 ఏడాదికిగానూ అస్సాం వేదికగా జరిగిన ఫుట్ బాల్ పోటీల ఫైనల్స్ లో మణిపూర్ జట్టుపై విజయం సాధించిన తెలంగాణ జట్టు ఛాంపియన్షిప్ దక్కించుకుంది. దాదాపు 48 ఏళ్ల తర్వాత తెలంగాణ ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫుట్‌బాల్ టీమ్, కోచ్ సయ్యద్ అలీ అక్బర్ అబిది సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి విజయానందాన్ని పంచుకున్నారు.

]]>
Fri, 30 Aug 2024 13:45:25 +0530 admin