Prajakshethre News & : హైదరాబాద్ https://prajakshethrenews.com/rss/category/హైదరాబాద్ Prajakshethre News & : హైదరాబాద్ en Copyright 2024 Prajakshethre News & All Rights Reserved. బీ సీ ల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు మద్దతు తెలిపిన పాతనగర మున్నూరు కాపు సంఘం https://prajakshethrenews.com/బీ-సీ-ల-హక్కుల-కోసం-పోరాటం-చేస్తున్న-ఎమ్మెల్సీ-కవితకు-మద్దతు-తెలిపిన-పాతనగర-మున్నూరు-కాపు-సంఘం https://prajakshethrenews.com/బీ-సీ-ల-హక్కుల-కోసం-పోరాటం-చేస్తున్న-ఎమ్మెల్సీ-కవితకు-మద్దతు-తెలిపిన-పాతనగర-మున్నూరు-కాపు-సంఘం బీ సీ ల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు మద్దతు తెలిపిన పాతనగర మున్నూరు కాపు సంఘం 

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పాతనగర మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవితను మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పల్లె శ్రవణ్ కుమార్, ప్రతినిధులు ఎం.భాస్కర్,పరమేశ్వరీ, తిరుపతి రాఘవేందర్,పోసు కృష్ణ, పుప్పాల రాధాకృష్ణ, చలపతిలు మర్యాద పూర్వకంగా కలిశారు. బీ సీ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవిత పోరాటం అభినందనియమన్నారు. పాతనగర మున్నూరు కాపు సంఘం తరపున కవితకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పల్లె శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ బీసీలు అన్ని విధాలుగా నష్టపోతున్నారని, తమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని, జులై17న నిర్దేశించిన రైలు రోకో ను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

]]>
Mon, 07 Jul 2025 16:17:04 +0530 admin
బోర్ వెల్ ను ప్రారంభించిన టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వతాల రాజేందర్ https://prajakshethrenews.com/బోర్-వెల్-ను-ప్రారంభించిన-టీపీసీసీ-కార్యనిర్వాహక-కార్యదర్శి-పర్వతాల-రాజేందర్ https://prajakshethrenews.com/బోర్-వెల్-ను-ప్రారంభించిన-టీపీసీసీ-కార్యనిర్వాహక-కార్యదర్శి-పర్వతాల-రాజేందర్ జంగమ్మెట్ లో నూతన బోర్ వెల్ ను ప్రారంభించిన టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి  పర్వతాల రాజేందర్

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

జంగమ్మెట్ శివాజినగర్ లోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో రూ. 2 లక్షలు రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న నూతన బోర్ వెల్ ను టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి  పర్వతాల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో  నాయకులు సురేందర్, శ్రీనివాస్, శ్రీను, శ్రీశైలం గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Mon, 07 Jul 2025 16:03:24 +0530 admin
టిజీఎస్పిడీసీఎల్ ఐపీసీ ఆర్ ఏ సి, డిపి ఈ కమర్షియల్ డైరెక్టర్ గా నియమితులైన చక్రపాణి https://prajakshethrenews.com/టిజీఎస్పిడీసీఎల్-ఐపీసీ-ఆర్-ఏ-సి-డిపి-ఈ-కమర్షియల్-డైరెక్టర్-గా-నియమితులైన-చక్రపాణి https://prajakshethrenews.com/టిజీఎస్పిడీసీఎల్-ఐపీసీ-ఆర్-ఏ-సి-డిపి-ఈ-కమర్షియల్-డైరెక్టర్-గా-నియమితులైన-చక్రపాణి టిజీఎస్పిడీసీఎల్ ఐపీసీ ఆర్ ఏ సి, డిపి ఈ కమర్షియల్ డైరెక్టర్ గా నియమితులైన చక్రపాణి

చక్రపాణి ని ఘనంగా సత్కరించిన బీసీ ఇంజనీర్స్

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

టిజీఎస్పిడీసీఎల్ ఐపీసీ ఆర్ ఏ సి, డిపి ఈ కమర్షియల్ డైరెక్టర్ గా నూతనంగా నియమితులైన చక్రపాణి కి బోయిన్ పల్లి ఏడీఈ రోషన్,  ఆర్ పి నిలయం ఏ డీ ఈ రాంచారి, సికింద్రాబాద్ ఏ డీ ఈ మురళి, ఫలక్ నుమ ఏ డీ ఈ కె. రాజు లు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

]]>
Sun, 29 Jun 2025 19:51:42 +0530 admin
ఉపఎన్నిక & ప్రధాన పార్టీల కసరత్తు...! https://prajakshethrenews.com/ఉపఎన్నిక-ప్రధాన-పార్టీల-కసరత్తు https://prajakshethrenews.com/ఉపఎన్నిక-ప్రధాన-పార్టీల-కసరత్తు ఉపఎన్నిక - ప్రధాన పార్టీల కసరత్తు...!
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 23 :
రాష్ట్రంలో మరోసారి ఉపఎన్నిక రాబోతుంది. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందటంతో….జూబ్లీహిల్స్ స్థానానికి బైపోల్ రానుంది. అయితే ఈ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ చూస్తుండగా… మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు కూడా పాగా వేసే దిశగా కసరత్తు చేసే పనిలో పడుతున్నాయి.రాష్ట్రంలో మరోసారి ఉపఎన్నిక రాబోతుంది. ఇప్పటికే రాజకీయాలు రసవత్తరంగా సాగుతుండగా.. ఈ బైపోల్ తో మరో లెవల్ కి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ చెబుతుంటే… అలాంటి పరిస్థితే లేదంటోంది కాంగ్రెస్. ఇదే టైమ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు వాయిస్ పెంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే అనారోగ్యంతో ఆయన ఇటీవలే మృతి చెందారు. దీంతో ఈస్థానానికి ఉపఎన్నిక రావటం ఖాయమైపోయింది. రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది.జూబ్లీహిల్స్ స్థానానికి ఉపఎన్నిక రానున్న నేపథ్యంలో… ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోరుకు సిద్ధమయ్యే పనిలో పడుతున్నాయి. ముఖ్యంగా ఈ సిట్టింగ్ సీటును కాపాడుకోవటం బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సవాల్ గా మారనుంది. ఇందుకోసం ఆ పార్టీ అధినాయకత్వం… అప్పుడే కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మాగంటి గోపినాథ్ భార్యకు టికెట్ ఇవ్వటమా..? లేక మరో నాయకుడిని తెరపైకి తీసుకురావటమా అనే విషయంపై మల్లగుల్లాలు పడుతోంది. పీజేఆర్ కుమారుడైన విష్ణువర్థన్ రెడ్డితో పాటు రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అన్ని కోణాల్లో పరిశీలించి… అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది.ఇక అధికార కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు అప్పుడే ఉపఎన్నికపై రియాక్ట్ అవుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన… అజహరుద్దీన్ మరోసారి బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇదే విషయంపై తాజాగా మాట్లాడిన ఆయన… రానున్న ఉప ఎన్నికలో పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందని.. తప్పకుండా విజయం సాధిస్తానని స్పష్టం చేశారు.ఇక ఇదే టికెట్ పై మరో నేత ఫిరోజ్ ఖాన్ కూడా ఆశలు పెంచుకుంటున్నారు. అజహరుద్దీన్ కు టికెట్ రాకపోతే…. తన పేరును పరిశీలించాలని కోరుతున్నారు. ఈసారి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెబుతున్నారు. వీరిద్దరే కాకుండా మరికొంత మంది నేతలు కూడా ప్రయత్నాలు చేసే చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక బీజేపీకి కూడా ఈ ఉపఎన్నిక ఛాలెంజ్ అనే చెప్పొచ్చు. గ్రేటర్ పరిధిలో ఆ పార్టీకి కార్పొరేటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో… జూబ్లీహిల్స్ లో జెండా ఎగరవేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకెల దీపక్రెడ్డి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరేకాకుండా కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేని పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇక బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి కూడా పోటీపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.మూడు ప్రధాన పార్టీల పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు ఎంఐఎం పోటీపై ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లు ఎక్కువగానే ఉంటాయి. దీంతో సొంతంగా అభ్యర్థిని నిలుపుతుందా…? లేక అధికార కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమంటుందా అనే చర్చ కూడా వినిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఇక్కడ పోటీ చేయలేదు. మరీ ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది..!జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,87,206 మంది ఓటర్లు ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం 47.49 నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 పర్యాయాలు విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా… సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజాహరుద్దీన్కు 64,212 ఓట్లు దక్కాయి.

]]>
Mon, 23 Jun 2025 13:52:17 +0530 admin
గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో స్వల్ప తొక్కిసలాట https://prajakshethrenews.com/గచ్చిబౌలి-బాలయోగి-స్టేడియంలో-స్వల్ప-తొక్కిసలాట https://prajakshethrenews.com/గచ్చిబౌలి-బాలయోగి-స్టేడియంలో-స్వల్ప-తొక్కిసలాట గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో స్వల్ప తొక్కిసలాట
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
గచ్చిబౌలి జియంసి బాలయేగి స్టేడియంలో యోగా దినోత్సవం వేడుకల్లో తోక్కిసలాట జరిగింది. గేట్ నేంబరు 2 దగ్గర బ్రేక్ ఫాస్ట్ పంపిణీ దగ్గర స్వల్ప తోపులాట జరిగింది. ఘటనలో ఒక యువతి సృహ కోల్పోయింది. ఆమెను  గచ్చిబౌలి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. యువతి గాంధీ మెడికల్ కాలేజీ నర్సింగ్ స్టుడేంట్. చికిత్స నిమిత్తం కోండాపుర్ ఏరియా హస్పటల్ కు తరలించారు. యువతి పరిస్థితి నిలకడగా ఉందని  వైద్యులు చెప్పారు.

]]>
Sat, 21 Jun 2025 14:42:21 +0530 admin
పర్యాటక, విహార కేంద్రంగా చర్లపల్లి చెరువు https://prajakshethrenews.com/పర్యాటక-విహార-కేంద్రంగా-చర్లపల్లి-చెరువు https://prajakshethrenews.com/పర్యాటక-విహార-కేంద్రంగా-చర్లపల్లి-చెరువు పర్యాటక, విహార కేంద్రంగా చర్లపల్లి చెరువు..
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 21 :
హైదరాబాద్‌లోని జలవనరుల పునరుజ్జీవనానికి, పట్టణ సౌందర్యాన్ని పెంపొందించే లక్ష్యంతో.. హైదరాబాద్ డెవలప్‌మెంట్ అండ్ రీడెవలప్‌మెంట్ అథారిటీ ( హైడ్రా) చర్లపల్లి చెరువుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో, జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ఆహ్వానం మేరకు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా చర్లపల్లి చెరువును సందర్శించారు. ఈ సందర్శన.. తదనంతర సమావేశం 58 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును ఆధునీకరించి పర్యాటక, విహార కేంద్రంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టం చేశాయి.చర్లపల్లి చెరువు దాని చుట్టూ ఉన్న పరిసరాలు దీర్ఘకాలంగా అభివృద్ధికి నోచుకోలేదు. అయితే.. హైడ్రా కమిషనర్ రంగనాథ్, జైళ్లశాఖ అధికారులతో పాటు స్థానిక రెవెన్యూ, నీటిపారుదల, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులతో కలిసి ఈ చెరువు ఆధునీకరణపై సమగ్రంగా చర్చించారు. చెరువు చుట్టూ ఉన్న నీటి ప్రవాహ మార్గాలైన 'ఇన్‌లెట్', 'అవుట్‌లెట్‌'లను పరిశీలించిన రంగనాథ్.. చెరువులో నీరు పరిశుభ్రంగా ఉండటం, జీవవైవిధ్యానికి గణనీయమైన అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది పర్యావరణ పరిరక్షణకు, స్థానిక జీవావరణ వ్యవస్థకు ఎంతగానో తోడ్పడుతుంది.ఈ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా.. చర్లపల్లి చెరువు చుట్టూ బలోపేతమైన కట్టను నిర్మించి, పకడ్బందీగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఇరు శాఖల అధికారులు నిర్ణయించారు. ఇది ఆక్రమణల నుంచి చెరువును కాపాడటమే కాకుండా, భవిష్యత్తులో స్థానికులకు ఒక సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది.చర్లపల్లి చెరువును కేవలం నీటి వనరుగా మాత్రమే కాకుండా.. ఒక ఆకర్షణీయమైన పర్యాటక, విహార కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా.. చెరువు చుట్టూ దాదాపు 3 కిలోమీటర్ల మేర నడక దారి (వాకింగ్ పాత్‌వే) ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా.. చెరువు పరిసరాల్లో అందమైన మినీ పార్కులు, విశాలమైన పచ్చదనం కోసం చెట్లు, సందర్శకుల కోసం సౌకర్యవంతమైన సీటింగ్ సౌకర్యం కల్పించనున్నారు. భద్రతను పెంపొందించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ పూర్తయితే చర్లపల్లి చెరువు కేవలం స్థానికులకు మాత్రమే కాకుండా.. హైదరాబాద్ నగరవాసులకు ఒక ముఖ్యమైన విహార కేంద్రంగా మారుతుందని అధికారులు ఆశిస్తున్నారు.హైడ్రా తెచ్చిన సంబురం.. పండగే పండగ..చెరువు అభివృద్ధికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ను రూపొందించాలని హైడ్రా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగానికి కమిషనర్ రంగనాథ్ సూచించారు. ఈ డీపీఆర్ ప్రాజెక్టు అమలు, నిధుల వినియోగం, కాలపరిమితిపై స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తుంది. చర్లపల్లి చెరువు ఒక గొలుసుకట్టు చెరువుల వ్యవస్థలో భాగం. హకీంపేట నుంచి నాగిరెడ్డి కుంట, కాప్రా చెరువు, మోతుకుల‌కుంట, బైస‌న్‌కుంట వంటి చెరువుల ద్వారా చర్లపల్లి చెరువుకు నీరు చేరుతుంది. అంతేకాకుండా.. చెరువుకు మురుగు నీరు కలవకుండా నిరోధించడానికి ఒక ప్రత్యేక డైవర్షన్ నాలా కూడా ఉంది. ఇది చెరువు నీటి స్వచ్ఛతను కాపాడుతుంది.ఈ ప్రాజెక్టు అమలుకు నిధుల సేకరణలో కార్పొరేట్ సామాజిక బాధ్యత  నిధులు కీలక పాత్ర పోషించనున్నాయి. చర్లపల్లి ప్రాంతంలోని పరిశ్రమల ప్రతినిధులు ఈ చెరువు అభివృద్ధి కోసం CSR కింద నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా తెలిపారు. ఇది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టడానికి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. పారిశ్రామిక సంస్థలు తమ సామాజిక బాధ్యతను గుర్తించి, స్థానిక పర్యావరణ పరిరక్షణకు, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ముందుకు రావడం ప్రశంసనీయం. చర్లపల్లి చెరువు పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్ నగరంలో పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ, పౌర సౌకర్యాల పెంపుదలకు ఒక ఆదర్శప్రాయమైన నమూనాగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.

]]>
Sat, 21 Jun 2025 14:32:03 +0530 admin
ఎల్‌బి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం https://prajakshethrenews.com/ఎల్బి-స్టేడియంలో-అంతర్జాతీయ-యోగా-దినోత్సవం https://prajakshethrenews.com/ఎల్బి-స్టేడియంలో-అంతర్జాతీయ-యోగా-దినోత్సవం ఎల్‌బి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
     పాల్గొన్న వెంకయ్య నాయుడు, గవర్నర్,కిషన్ రెడ్డి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 20 :
: హైదరాబాద్ మహానగరంలోని ఎల్‌బి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 సందర్భంగా కౌంట్ డౌన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఎంపి ఈటెల రాజేందర్, బిజెపి నేత, నటి ఖష్బూ, సినీ నటులు మినాక్షీ చౌదరి, సాయి దుర్గా తేజ్, తేజా సజ్జ, తదితరలు పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నగర ప్రజలు పాల్గొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

]]>
Fri, 20 Jun 2025 15:32:22 +0530 admin
లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న పోలీసు అధికారులు https://prajakshethrenews.com/లాల్-దర్వాజా-అమ్మవారిని-దర్శించుకున్న-పోలీసు-అధికారులు https://prajakshethrenews.com/లాల్-దర్వాజా-అమ్మవారిని-దర్శించుకున్న-పోలీసు-అధికారులు లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న పోలీసు అధికారులు

ప్రజా క్షేత్ర్, చార్మినార్  :

చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయాన్ని పలువురు పోలీసు అధికారులు గురువారం సాయంత్రం సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఛత్రినాక ఏసీపీ సి హెచ్.చంద్ర శేఖర్,ఛత్రినాక ఇన్స్పెక్టర్ కె.నాగేంద్ర ప్రసాద్ వర్మ తో పాటు పలువురు ఎస్ఐ లు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతీ యాదవ్ వారికి స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. వచ్చే నెలలో జరగనున్న బోనాల పండుగ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆలయ చైర్మన్ మారుతీ యాదవ్ పోలీస్ అధికారులకు వివరించారు.

]]>
Thu, 19 Jun 2025 19:40:58 +0530 admin
ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు... రాహుల్ గాంధీ మంచి విజన్ ఉన్న నాయకుడు https://prajakshethrenews.com/ఘనంగా-రాహుల్రా-గాంధీ-జన్మదిన-వేడుకలు-రాహుల్-గాంధీ-మంచి-విజన్-ఉన్న-నాయకుడు https://prajakshethrenews.com/ఘనంగా-రాహుల్రా-గాంధీ-జన్మదిన-వేడుకలు-రాహుల్-గాంధీ-మంచి-విజన్-ఉన్న-నాయకుడు ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

రాహుల్ గాంధీ మంచి విజన్ ఉన్న నాయకుడు 

నిన్నటి త్యాగాలకు వారసుడు రేపటి తరానికి మార్గదర్శకులు

దేశ ప్రజల తరఫున ప్రశ్నించే ఏకైక గొంతుక 

ప్రజా క్షేత్ర్, చార్మినార్ : 

పాతబస్తీ చాంద్రాయణగుట్టలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బోయ నగేష్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ  55వ  పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అయన తో పాటు చార్మినార్ టీపీసీసీ కో ఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం, టీ పీ సీ సీ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్ లు పాల్గొని, చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ  మంచి విజన్ ఉన్న నాయకుడు,యువతకు ఆదర్శం,నిరంతరం దేశప్రజాసామ్యాలపై పోరాడుతూనే ఉంటాడన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ఆశకిరణం,ధృవ తార అని,రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి  నీ చేసెంతవరకు అహర్నిశలు పనిచేస్తామన్నారు. ఈ దేశంలో అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం జరగాలని పోరాడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ  అని కొనియాడారు. దేశంలో పేదరికం రోజుకు రోజుకు పెరిగిపోతుందని ఆ పేదరిక నిర్మూలన జరగాలంటే దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు వెంకటేష్ ముదిరాజ్, పర్వతాల రాజేందర్, ఎల్. నర్సింగ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

]]>
Thu, 19 Jun 2025 19:01:36 +0530 admin
చాంద్రాయణ గుట్టలో మంచినీరు, సివరేజ్ సమస్యలు పరిష్కరించాలని బీజేపీ నాయకుల వినతి https://prajakshethrenews.com/చాంద్రాయణ-గుట్టలో-మంచినీరు-సివరేజ్-సమస్యలు-పరిష్కరించాలని-బీజేపీ-నాయకుల-వినతి https://prajakshethrenews.com/చాంద్రాయణ-గుట్టలో-మంచినీరు-సివరేజ్-సమస్యలు-పరిష్కరించాలని-బీజేపీ-నాయకుల-వినతి చాంద్రాయణ గుట్టలో మంచినీరు, సివరేజ్ సమస్యలు పరిష్కరించాలని బీజేపీ నాయకుల వినతి

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో మంచి నీరు, సివరేజ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  వాటర్ వర్క్స్ జిఎం సంతోష్ కు గురువారం లలిత బాగా డివిజన్ కంటెస్టెడ్ బిజెపి కార్పొరేటర్ మాదిరి చంద్రశేఖర్, బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు మాణిక్, యువమోర్చా నాయకులు సుభాష్ లు ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు అందజేసిన విజ్ఞాపన పత్రంలో చాంద్రాయణ గుట్ట నియోజకవర్గంలోని లలితా బాగ్, ఉప్పుగూడ డివిజన్ , రియాసత్ నగర్ డివిజన్ ప్రాంతాలలో మంచినీటి సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. అలాగే తాతల కాలం నాటి సివరేజ్ వ్యవస్థ తో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరన్నారు. వెంటనే ఆయా ప్రాంతాలలో నెలకొన్న మంచినీటి, సివరేజ్ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.

]]>
Fri, 13 Jun 2025 10:55:02 +0530 admin
లాల్ దర్వాజా సింహవాహిని ఆలయ కమిటీ చైర్మన్ గా మారుతీ యాదవ్ https://prajakshethrenews.com/లాల్-దర్వాజా-సింహవాహిని-ఆలయ-కమిటీ-చైర్మన్-గా-మారుతీ-యాదవ్ https://prajakshethrenews.com/లాల్-దర్వాజా-సింహవాహిని-ఆలయ-కమిటీ-చైర్మన్-గా-మారుతీ-యాదవ్ లాల్ దర్వాజా సింహవాహిని ఆలయ కమిటీ చైర్మన్ గా మారుతీ యాదవ్

ప్రజా క్షేత్ర్,, చార్మినార్ :

తెలంగాణ లో ప్రసిద్ధి చెందిన, చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ నూతన చైర్మన్ గా బి. మారుతీ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆదివారం  మధ్యాహ్నం దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన దేవాలయ కమిటీ సర్వసభ్య సమావేశంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు, కమిటీ సభ్యులు మారుతీ యాదవ్ ను చైర్మన్ గా ఎన్నుకున్నారు,గత ఐదు సంవత్సరాలుగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మారుతీ యాదవ్ అమ్మవారికి  సేవలు అందిస్తున్నారు.త్వరలోనే మరో సమావేశం ఏర్పాటు చేసి మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకొని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో  ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు జి.కాశీనాథ్ గౌడ్,సి.బంగ్లా రాజు యాదవ్,కె.విష్ణు గౌడ్, కె. వెంకటేష్,బి.బల్వంత్ యాదవ్, ఎ.మాణిక్ ప్రభూ గౌడ్, సి.వెంకటేష్, సి.రాజ్ కుమార్ యాదవ్, సి.రాజేందర్ యాదవ్, తిరుపతి నరసింగరావు,సిరా రాజ్ కుమార్,కన్వీనర్ జి.అరవింద్ కుమార్ గౌడ్,కోశాధికారి పోసాని సతీష్ ముదిరాజ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

]]>
Sat, 31 May 2025 21:02:05 +0530 admin
అత్యాధునిక సదుపాయాలతో గోశాలల ఏర్పాటు : సీ ఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/అత్యాధునిక-సదుపాయాలతో-గోశాలల-ఏర్పాటు-సీ-ఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/అత్యాధునిక-సదుపాయాలతో-గోశాలల-ఏర్పాటు-సీ-ఎం-రేవంత్-రెడ్డి అత్యాధునిక సదుపాయాలతో గోశాలల ఏర్పాటు
గోశాలల ఏర్పాటుకు కమిటీని ఏర్పాటుకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ మే 31 :
 గోశాలల ఏర్పాటుకు కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాల డిజైన్ ను సిఎం పరిశీలించారు. అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై సమీక్ష నిర్వహించారు. నాలుగైదు రోజుల్లోగా డిజైన్ ఖరారు చేయనున్నట్లు తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో గోశాలల ఏర్పాటుకు కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో జరగాలని సిఎం ఆదేశం ఇచ్చారు. గోసంరక్షణ, నిర్వహణ సులువుగా, వీలుగా ఉండేలా చేయాలని పేర్కొన్నారు. పశు, వ్యవసాయ వర్శిటీలు, కాలేజీలు, దేవాదాయ భూముల్లో గోశాలలు ఉండాలని అన్నారు. అందుబాటులో ఉన్న స్థలాలు గుర్తించాలని, కనీసం 50 ఎకరాలకు తగ్గకుండా గోశాలలు ఉండాలని తెలియజేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలతో ప్రణాళికలు రూపొందించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

]]>
Sat, 31 May 2025 20:26:38 +0530 admin
ఎమర్జెన్సీ సేవల్లో కేర్ హాస్పిటల్ విప్ల వాత్మక మార్పులు https://prajakshethrenews.com/ఎమర్జెన్సీ-సేవల్లో-కేర్-హాస్పిటల్-విప్ల-వాత్మక-మార్పులు https://prajakshethrenews.com/ఎమర్జెన్సీ-సేవల్లో-కేర్-హాస్పిటల్-విప్ల-వాత్మక-మార్పులు ఎమర్జెన్సీ సేవల్లో విప్లవాత్మక మార్పులు
* ‘ది పవర్ ఆఫ్ త్రీ’ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన కేర్ హాస్పిటల్స్
•వేగం, నిపుణత మరియు సానుభూతితో కూడిన అత్యవసర వైద్య సేవలలో కొత్త మైలురాయి
•హైదరాబాద్‌లోని అన్ని కేర్ హాస్పిటల్స్‌కి 5G టెక్నాలజీతో కూడిన అత్యాధునిక అంబులెన్సులు
•హైదరాబాద్ నగరానికి ఇదే తొలి పూర్తి స్థాయి ఎమర్జెన్సీ కవరేజ్
•28 ఏళ్లుగా నమ్మకంగా సేవలందిస్తున్న కేర్ హాస్పిటల్స్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, మే31:
 భారతదేశంలో ప్రముఖ ఆరోగ్య సంస్థ అయిన కేర్ హాస్పిటల్స్, "ది పవర్ ఆఫ్ త్రీ" పేరుతో దేశవ్యాప్తంగా నూతన ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ద్వారా, వేగవంతమైన స్పందన, నిపుణులచే చికిత్స, సానుభూతితో కూడిన సేవలపై దృష్టిపెట్టి, అత్యవసర వైద్య సేవల్లో దేశవ్యాప్తంగా కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేయడం ఈ ప్రచార లక్ష్యం.ఈ కార్యక్రమంలో భాగంగా, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ లోని అన్ని ఆసుపత్రులలో 5G అంబులెన్సులు ప్రారంభించింది. ఇవి అత్యవసర సేవలను వేగంగా, చాకచక్యంగా అందించేందుకు సహాయపడతాయి. ఇలాంటివి హైదరాబాదులో తొలిసారిగా చూడబోతున్నాం — ఇది ఒక రకంగా సాంకేతికతతో వైద్య నైపుణ్యాలు కలసి పనిచేసే విధానం. రోగి పరిస్థితిని అంబులెన్స్‌లోనే ఆసుపత్రికి వెంటనే తెలియజేస్తారు. దీంతో డాక్టర్లు ముందుగానే సిద్ధంగా ఉంటారు. ఈ అంబులెన్సులు ఆసుపత్రితో సులభంగా మాట్లాడగలుగుతాయి, అవసరమైన సమాచారం వెంటనే షేర్ చేయగలుగుతాయి, లైవ్ ట్రాకింగ్‌ సహాయంతో ఆసుపత్రి ఎమర్జెన్సీ డాక్టర్లు త్వరగా స్పందించగలుగుతారు. రోగి సమాచారం సురక్షితంగా ఉంటుంది. తక్షణ అలర్ట్స్ మరియు రిపోర్ట్స్‌ ద్వారా చికిత్సను మెరుగుపరిచేలా కూడా సహాయపడతాయి. ప్రతి నిమిషం కీలకమైన పరిస్థితుల్లో, ఈ 5G అంబులెన్సులు మరిన్ని ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఈ కార్యక్రమం, 28 ఏళ్లుగా కేర్ హాస్పిటల్స్ అందిస్తున్న అత్యున్నత వైద్య సేవల ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. అత్యవసర మరియు ప్రత్యేక వైద్య చికిత్సల్లో నాణ్యత ఎలా మెరుగుపడిందో ఈ ప్రచారం ద్వారా తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత వేగవంతమైన, నాణ్యమైన వైద్యం అందించడానికి కేర్ హాస్పిటల్స్ ప్రామాణికతను చూపిస్తోంది.ఈ కార్యక్రమాన్ని, క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఖన్నా, గ్రూప్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ విశాల్ మహేశ్వరి, గ్రూప్ చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ శలభ్ డాంగ్, గ్రూప్ చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డా. నిఖిల్ మాథూర్, జోనల్ హెచ్ సిఓఓ బిజు నాయర్, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డా. కిరణ్ కుమార్, కేర్ యొక్క ఇతర హాస్పిటల్ హెడ్‌లు & సీనియర్ నాయకత్వంతో కలిసి ప్రారంభించారు. బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో నిర్వహించైనా ఈ కార్య‌క్రమంలో సీనియర్ డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మరియు అత్యవసర చికిత్సల ద్వారా ప్రాణాలు నిలిచిన రోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ ఖన్నా మాట్లాడుతూ, “ఇది కేర్ హాస్పిటల్స్ మరియు భారతదేశంలో ఆరోగ్య సంరక్షణకు గర్వకారణమైన క్షణం. మూడు దశాబ్దాలుగా, కేర్ సమయానికి , నాణ్యమైన, హృదయపూర్వక సేవలకు ప్రతీకగా నిలిచింది. ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రామాణికత ద్వారా, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేస్తున్నాం. ‘ది పవర్ ఆఫ్ త్రీ’ క్యాంపెయిన్ ద్వారా వేగం, ప్రాప్యత మరియు నిపుణత్వం కలిసి ప్రాణాలను ఎలా రక్షించగలవో తెలియజేస్తున్నాం. ప్రతి రోగి మరియు వారి కుటుంబానికి – మేము అత్యవసర సమయాల్లో మీకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం.” అని తెలిపారు. ‘ది పవర్ ఆఫ్ త్రీ’ ప్రచారంలో భాగంగా కేర్ హాస్పిటల్స్ మూడు ముఖ్యమైన హామీలు ఇస్తోంది.ఎమర్జెన్సీ కాల్స్‌కు 3 రింగ్స్ లోపల స్పందిస్తారుహైదరాబాద్‌లో ఎక్కడైనా 30 నిమిషాల్లో అంబులెన్స్‌ రోగిని తీసుకెళ్తుంది

]]>
Sat, 31 May 2025 20:23:21 +0530 admin