Prajakshethre News & Latest Posts https://prajakshethrenews.com/rss/latest-posts Prajakshethre News & Latest Posts en Copyright 2024 Prajakshethre News & All Rights Reserved. ఛత్రినాకలో రెడ్మిక్సర్ వాహనంపై పడ్డ విద్యుత్ ఇనుప స్తంభం https://prajakshethrenews.com/ఛత్రినాకలో-రెడ్మిక్సర్-వాహనంపై-పడ్డ-విద్యుత్-ఇనుప-స్తంభం https://prajakshethrenews.com/ఛత్రినాకలో-రెడ్మిక్సర్-వాహనంపై-పడ్డ-విద్యుత్-ఇనుప-స్తంభం ఛత్రినాకలో రెడ్మిక్సర్ వాహనంపై పడ్డ విద్యుత్ ఇనుప స్తంభం

 

పాతబస్తీ ఛత్రినాక మేనకాథియేటర్ వద్ద జరుగుతున్న సి.సి రోడ్డు పనుల నిమిత్తం కాంక్రీట్తో చేరుకున్న రెడ్ మిక్సర్ వాహనం పై 11కెవి సరఫరా అవుతున్న విద్యుత్ ఇనుప స్తంభం పడడంతో పెనుప్రమాదం తప్పింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం పాతబస్తీ మేనకాథియేటర్ వద్ద సి.సి రోడ్డు పనులు జరుగుతున్నాయి. దీనికి కావాల్సిన కాంక్రీట్ తో రెడ్ మిక్సర్ వాహనం అక్కడికి చేరుకుంది. అయితే ఇరుకైన గల్లీలు... రోడ్డుపై అడ్డందిడ్డంగా ఉన్న ఇనుప స్తంభాల కారణంగా రెడ్ మిక్సర్ వాహనం గల్లీలోకి రోడ్డు వేసే సమీప ప్రాంతంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా విద్యుత్ ఇనుప స్థంభం, వెర్లకు తగిలింది. 11కెవి సరఫరా అవుతున్న విద్యుత్ ఇనుప స్తంభం ఒక్కసారిగా రెడ్ మిక్సర్ వాహనంపై పడింది. ఆసమయంలో అక్కడ ఎవ్వరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

]]>
Sun, 01 Mar 2026 15:36:58 +0530 admin
ముఖేష్, నిఖిత దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన పీ ఎం. నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా https://prajakshethrenews.com/ముఖేష్-నిఖిత-దంపతులకు-వివాహ-శుభాకాంక్షలు-తెలిపిన-పీ-ఎం-నరేంద్ర-మోదీ-హోం-మంత్రి-అమిత్-షా https://prajakshethrenews.com/ముఖేష్-నిఖిత-దంపతులకు-వివాహ-శుభాకాంక్షలు-తెలిపిన-పీ-ఎం-నరేంద్ర-మోదీ-హోం-మంత్రి-అమిత్-షా బీజేపీ నాయకుడు ముఖేష్, నిఖిత దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన పీ ఎం. నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా

పాతబస్తీలో బీజేపీ కార్యకర్త  ముఖేష్, నిఖిత ల వివాహం సందర్భంగా అరుదైన గౌరవం దక్కింది.బీజేపీ శాలిబండ డివిజన్ మాజీ అధ్యక్షుడు కరన్ కోట్ నాగేకార్ ముఖేష్ నిజామాబాద్ కి చెందిన నికిత తో ఇటీవల వివాహం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ అగ్ర నాయకత్వం నుండి ప్రత్యేక శుభాకాంక్షలు అందాయి. సాధారణ కార్యకర్త పంపిన ఆహ్వానానికి స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లు ప్రత్యేకంగా లేఖల ద్వారా నవ దంపతులను ఆశీర్వదిస్తు  ఒక సాధారణ కార్యకర్తకు పంపడం అనేది పార్టీలో కార్యకర్తలకు లభించే అపారమైన విలువను, గౌరవాన్ని స్పష్టం చేస్తోందని బీజేపీ శ్రేణులు పేర్కొన్నాయి. దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్తను బీజేపీ నాయకత్వం గుర్తించి, ప్రోత్సహిస్తుందనడానికి ఈ సంఘటన ఒక బలమైన నిదర్శనమని పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

]]>
Thu, 27 Nov 2025 20:07:59 +0530 admin
సుల్తాన్ షాహి శ్రీ జగదాంబ దేవాలయంలో దేవి నవరాత్రుల్లో మహాద్భుతం https://prajakshethrenews.com/సుల్తాన్-షాహి-శ్రీ-జగదాంబ-దేవాలయంలో-దేవి-నవరాత్రుల్లో-మహాద్భుతం https://prajakshethrenews.com/సుల్తాన్-షాహి-శ్రీ-జగదాంబ-దేవాలయంలో-దేవి-నవరాత్రుల్లో-మహాద్భుతం సుల్తాన్ షాహి శ్రీ జగదాంబ దేవాలయంలో దేవి నవరాత్రుల్లో మహాద్భుతం

సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్న మహిళా భక్తులు

ఓ భక్తురాలి పళ్లెంలో పులి పాదం ముద్రల దర్శనం

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సుల్తాన్ షాహిలోని శ్రీ జగదాంబ దేవాలయంలో అద్భుతం చోటు చేసుకుంది. ఆలయ కమిటీ అధ్యక్షుడు రాకేష్ తివారి ఆధ్వర్యంలో మహిళాభక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో సామూహిక కుంకుమార్చన పూజలు చేస్తుండగా ఓ భక్తురాలి పల్లెంలో పసుపుపై పులి పాదం ముద్రలు ప్రత్యక్షమయ్యాయి. దీంత పూజల్లో పాల్గొన్న మహిళ భక్తులందరూ భక్తిపారవశ్యంతో పులి పాదం గుర్తులను తిలకించారు. దేవి నవరాత్రుల సందర్భంగా అనునిత్యం సామూహిక కుంకుమార్చన సందర్భంగా మహిళలందరికీ దేవాలయం కమిటీ తరపున పూలు, పసుపు, కుంకుమ అందజేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.  కుంకుమార్చన పూర్తయిన అనంతరం మహిళా భక్తులందరూ తమ తమ పూజా సామాగ్రిని తిరిగి పూజారికి అప్పగించి వెళుతుంటారు. ఈ నేపధ్యంలోనే మహా అద్భుతం చోటుచేసుకుంది. ఓ భక్తురాలు తన పూజా సామాగ్రిని పూజారికి అప్పగిస్తున్న సమయంలో పులి పాదం ముద్రలు  దర్శనం ఇవ్వడంతో ఆ భక్తురాలుఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఆలయ పూజారి దానిని పరిశీలించి శ్రీ జగదాంబికా అమ్మవారు పులిపై స్వారీ చేస్తూ భక్తులకు ఈ విధంగా దర్శనమిచ్చిందని పేర్కొన్నారు.

]]>
Sun, 28 Sep 2025 09:48:04 +0530 admin
రికార్డు బ్రేక్ చేసిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట https://prajakshethrenews.com/రికార్డు-బ్రేక్-చేసిన-బాలాపూర్-గణేష్-లడ్డు-వేలం-పాట https://prajakshethrenews.com/రికార్డు-బ్రేక్-చేసిన-బాలాపూర్-గణేష్-లడ్డు-వేలం-పాట

రికార్డు బ్రేక్ చేసిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట

*హోరాహోరీగా సాగిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట*

*రూ. 35 లక్షలకు బాలాపూర్ గణేష్ లడ్డును సొంతం చేసుకున్న లింగాల దశరథ్ గౌడ్*

*లడ్డును బీజేపీ అగ్రనేతలకు పంపిణీ చేస్తాం.......  దథరథ్ గౌడ్*

*బాలాపూర్ గణేష్ ని దర్శించుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి*

*మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి*

*బడంగ్ పేట్ మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నర్సింహారెడ్డి*

*భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శశిధర్*

ప్రజా క్షేత్ర్ , సెప్టెంబర్ 6 :

హైదరాబాద్ లో కదిలో తొలివినాయకుడు ... బాలాపూర్ గణపతి 21 కిలోల లడ్డు వేలం పాటకు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామం బొడ్డురాయి వేదికయ్యింది. ఎంతో ఉత్కంఠగా  ఎదురుచూస్తున్న బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట వేలాదిమందిభక్త జన సందోహం నడుమ చంపాపేట్ కు చెందిన మర్రి రవికిరణ్ రెడ్డి, ఎల్ బినగర్ అర్బన్ గ్రూప్ కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి, కర్మాన్ ఘాట్ కుచెందిన లింగాల దశరథ్ గౌడ్, కర్మాన్ ఘాట్ కు చెందిన కంచర్ల శివా రెడ్డి, కందుకూరు కొత్తగూడెం కు చెందిన సామరామ్ రెడ్డి (దయ), హైదరాబాద్ కు చెందిన పిఎస్ కె ( PSK) గ్రూప్, చంపాపేట్ కు చెందిన జిట్టా పద్మా సురేందర్ రెడ్డి అనే ప్రధాన పోటీదారుల మధ్య రూ.1016 తో ప్రారంభమై హోరాహోరీగా సాగిన పోరులో రూ. 35లక్షలకు కర్మాన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ రూ. 35 లక్షలకు 21 కిలోల లడ్డును సొంతం చేసుకున్నారు. తాజాగా 32వ సారి బాలాపూర్ గణేష్ లడ్డును వేలం పాటలో  దక్కించుకున్న జాబితాలో లింగాల దశరథ్ గౌడ్ చేరిపోయారు. 45 వసంతాల గణేష్ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా గత  32 సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బాలాపూర్ గణేష్  లడ్డు వేలం పాటకు తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశ, ప్రపంచ వ్యాప్తంగా విశిష్ఠ గుర్తింపు ఉంది. కరోనా కారణంగా 2020లో బాలాపూర్ గణపతి లడ్డు వేలం పాటను రద్దు చేశారు.  దీంతో ఆ లడ్డును అప్పట్లో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి  బృందం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహుకరించారు. 2021లో జరిగిన వేలం పాట కంటే 2022లో  5.70లక్షలు రెట్టింపు, 2022 లో జరిగిన వేలం పాట కంటే 2023లో 2.40 లక్షలు, 2023 లో జరిగిన వేలం పాట కంటే 2024లో రూ. 3,01,000 లక్షలు ఈ  యేడు రూ. 4.99 లక్షలు అధిక ధర పలికింది. బాలాపూర్ లడ్డువేలం పాట చరిత్రలో ఈ యేడు రికార్డు బ్రేక్ చేసింది. లడ్డు వేలం పాటలో గడిచిన 31 ఏళ్లలో రూ.2,39,52,950కోట్ల రూపాయలు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సొంతం కాగా అందులో ని రూ. 1,64,87,970 కోట్ల రూపాయలతో బాలాపూర్ గ్రామంలో పలు అభివృద్ది పనులు చేపట్టడం జరిగింది. అయితే ఈ ఏడు జరిగిన వేలం పాటతో కలిపి రూ.2కోట్ల 74లక్షల 52వేల 950 రూపాయలు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సొంతమయ్యాయి. అయితే గత సంవత్సరం 2024లో బాలాపూర్ గణేష్ లడ్డు ను వేలం పాటలో దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి రూ. 30,01,000 లక్షల నగదు ను గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్లెం నిరంజన్ రెడ్డికి అందజేశారు. నగదు ను అందజేసిన కొలను శంకర్ రెడ్డికి గణేష్ ఉత్సవసమితి తరపున లక్ష రూపాయల విలువ గల బంగారు చైన్ ను అందజేశారు.

*తెల్లవారుజామున 5గంటలకే ప్రారంభమయిన నిమజ్జన పూజలు* ....

తెల్లవారుజామున 5గంటల నుంచే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జన పూజలు ప్రారంభమయ్యాయి.  అనంతరం బాలాపూర్ గణేష్ మండపం నుంచి  బాలాపూర్ పుర వీధులగుండా సన్నాయి మేళాలు .. భజన కార్యక్రమాల నడుమ బాలాపూర్ గణపతి ఊరేగింపుగా ముందుకు కదిలింది.  దారిపొడవునా బాలాపూర్ గ్రామస్థులు  కొబ్బరి కాయలు కొట్టి, మంగళ హారతులు పట్టారు. 10.34 గంటల ప్రాంతంలో బాలాపూర్ గణపతి డిసిఎం వ్యాన్ లో బొడ్డురాయి వద్దకు చేరుకుంది. ఉదయం 10.54 గంటలకు బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట అట్టహాసంగా ప్రారంభయ్యింది.

*బొడ్డురాయి వద్దకు 1.30గంటలు ఆలస్యంగా చేరుకున్న బాలాపూర్ గణేష్* .....

బాలాపూర్ గ్రామ పురవీధుల్లో బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని డీసీఎం వ్యాన్లో ఊరేగిస్తుండగా ఉదయం 9.10గంటలకు ఒక్కసారిగా డీసీఎం వ్యాన్ లెఫ్ట్ సైడ్ కమాన్ పట్టిలో విరిగి పోవడంతో ఒక్కసారిగా భారీ గణేష్ విగ్రహం ఒక వైపుకు ఒరగడంతో, ఎక్కడ  గణేష్ విగ్రహం కిందపడుతుందోనని ఒక్కసారిగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, పోలీసులు ఆందోళనకు గురయ్యారు. రోడ్డుకు సమాంతరంగా వెళ్ళాల్సిన డీసీఎం వ్యాన్ అదుపుతప్పుతుండడం... భారీ విగ్రహం ఓ పక్కకు ఒరగడం ద్వారా గల్లీల్లో ఉన్న ఇండ్లకు సంబంధించిన రేకులతో పాటు డీసీఎం వ్యాన్కు అడ్డుగా ఉన్న ఇండ్లముందు నిర్మించుకున్న అరుగులను తొలగించారు. దీంతో 9గంటల వరకు బాలాపూర్ గ్రామ బొడ్డురాయి వద్దకు చేరుకోవాల్సిన బాలాపూర్ గణేష్ విగ్రహం గంటన్నర ఆలస్యమయ్యింది. 

*హోరా హోరీగా సాగిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట* ......

బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరపున రూ. 1016 లతో వేలం పాట అట్టహాసంగా ప్రారంభమయ్యింది. దివంగత కొలను మోహన్రెడ్డి రూ.50వేలు, మర్రి రవికిరణ్రెడ్డి ఒక లక్ష, సామ ప్రణీత్ రెడ్డి రూ.2లక్షలు, లింగాల దశరథ్ గౌడ్, రూ.3లక్షలు, కంచర్ల శివారెడ్డి రూ.4లక్షలు, సామ రామ్ రెడ్డి రూ.6లక్షలు, పిఎస్ కె గ్రూప్ రూ. 7లక్షలు, జిట్టా సురేందర్ రెడ్డి రూ.8లక్షలు, మర్రి రవికిరణ్ రెడ్డి రూ.9లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.10లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.11లక్షలు, కంచర్ల శివారెడ్డి రూ.12లక్షలు, సామ రాంరెడ్డి రూ.13లక్షలు, పి ఎస్ కె గ్రూప్ రూ.14లక్షలు, జిట్టా సురేందర్ రెడ్డి రూ.15 లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.16లక్షలు, మర్రి రవికిరణ్రెడ్డి రూ.17లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.18లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.19 లక్షలు, కంచర్ల శివారెడ్డి రూ.20లక్షలు, సామ రాంరెడ్డి రూ.21లక్షలు, పిఎస్ కె గ్రూప్ రూ.22 లక్షలు, జిట్టా సురేందర్ రెడ్డి రూ.23 లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.24 లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.25 లక్షలు, మర్రి రవికిరణ్ రెడ్డి రూ.26 లక్షలు, సామ రాం రెడ్డి రూ.27 లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.28లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ. 29 లక్షలు, జిట్టా సురేందర్ రెడ్డి రూ.30లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.30.25 లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ. 30.50లక్షలు, సామ రాంరెడ్డి రూ.30.75 లక్షలు, మర్రి రవికిరణ్ రెడ్డి రూ.31 లక్షలు, పిఎస్ కె గ్రూప్ 31.25 లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి 31.50లక్షలు, కంచర్ల శివారెడ్డి 31.75 లక్షలు, సామ రాం రెడ్డి రూ.32 లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి 32.25 లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ 32.50 లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ. 32.75 లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.32.80వేలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.33 లక్షలు, లింగాల దశరథ్ రౌడ్ రూ.33.25లక్షలు, కంచర్ల శివారెడ్డి రూ.33.50లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.33.75లక్షలు ,సామ ప్రణీత్ రెడ్డి రూ.33.80లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ. 33.90లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ. 33.95లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.34లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ. 34.25లక్షలు, కంచర్ల శివారెడ్డి 34.50లక్షలు, సామ రాం రెడ్డి రూ.34.70లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.34.75లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షలు ఒకటవ సారి... రెండవసారి... మూడవసారి అంటూ బాలాపూర్ గణేష్ లడ్డును దక్కించుకున్న 32వ జాబితాలో చేరిపోయారు.  

*హాజరయిన ప్రముఖులు*.....

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన బాలాపూర్ గణేష్ లడ్డు  వేలం పాటకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి, జెడ్పి చైర్మన్ తీగల హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, బడంగ్ పేట్  మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నర్సింహా రెడ్డి, భాగ్య నగర్ గణేష్ ఉత్సవసమితి అధ్యక్షులు రాఘవరెడ్డి, కార్యదర్శి శశిధర్, పీ స్థానిక కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు కొలను శంకర్ రెడ్డి, దైవాజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు. 

*రూ. 35 లక్షలకు లడ్డును సొంతం చేసుకున్న లింగాల దశరథ్ గౌడ్*..

బాలాపూర్ గణేష్ లడ్డును వేలం పాటలో దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని లింగాల దశరథ్ గౌడ్ అన్నారు. గత ఆరు సంవత్సరాలుగా వేలం పాటలో పాడుతున్న తనకు 2025 లో లడ్డు దక్కడం అదృష్టం గా భావిస్తున్నానన్నారు. ఈ లడ్డును కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండిసంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, ఎంపి ఈటెల రాజేందర్ లతో పాటు బీజేపీ అగ్రనేతలకు పంపిణీచేస్తామని ధశరథ్ గౌడ్ పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడైన దశరథ్ గౌడ్ కు స్టీల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

]]>
Sat, 06 Sep 2025 22:30:02 +0530 admin
రేపు కేసీఆర్, కేటీఆర్‌కూ నా పరిస్థితే...హరీష్‌దే కుట్ర : కవిత https://prajakshethrenews.com/రేపు-కేసీఆర్-కేటీఆర్కూ-నా-పరిస్థితేహరీష్దే-కుట్ర-కవిత https://prajakshethrenews.com/రేపు-కేసీఆర్-కేటీఆర్కూ-నా-పరిస్థితేహరీష్దే-కుట్ర-కవిత రేపు కేసీఆర్, కేటీఆర్‌కూ నా పరిస్థితే...హరీష్‌దే కుట్ర : కవిత

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ : 

హరీష్ రావు కుట్రలో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపేలా చేశారని కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావును పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. రేపు కేసీఆర్, కేటీఆర్ లను కూడా తన లాగే పార్టీ నుంచి బయటకు పంపుతారని.. పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకుంటారని కవిత జోస్యం చెప్పారు. కాళేశ్వరం విషయంలో హరీష్ భారీ స్కాం చేశారని, ఆ డబ్బులతో ఎమ్మెల్యే అభ్యర్థులకూ ఫండింగ్ చేశారని అన్నారు. కేటీఆర్ ను ఓడించడానికి హరీష్ రావు సిరిసిల్లకు "అరవై లక్షల" రూపాయలు పంపించాడన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్, హరీష్ రావు ఒకే ఫ్లైట్‌లో వెళ్లారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ కు, హరీష్ రావు పూర్తి స్థాయిలో సరెండర్ అయ్యారని, హాస్టళ్లకు హరీష్ రావు డెయిరీ నుంచి పాలు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. అందరిపై కేసులు పెడుతూంటే..ఒక్క హరీష్ పైనే ఎందుకు చిన్న కేసు కూడా పెట్టలేదని కవిత ప్రశ్నించారు. కేసీఆర్ వెంట..హరీష్ మొదటినుంచి లేరన్నారు. టీడీపీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తూంటే హరీష్ ఆపారని ఆరోపించారు. పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడు హరీష్ రావు వైఎస్ ను కూడా కలిశారన్నారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదని, డబుల్ షూటర్ అని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌లకు హాని కలిగించే పనులు తాను చేయబోనని స్పష్టం చేశారు. ఎంతో నష్టం జరుగుతున్నా హరీష్ , సంతోష్‌లను ఎందుకు ప్రోత్సహిస్తున్నారన్నదే తన ఆవేదన అని చెప్పారు. సంతోష్ రావు వల్ల రామన్నకు చెడ్డపేరు వచ్చిందన్నారు. బంగారు తెలంగాణ అంటే హరీష్,సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే..బంగారు తెలంగాణ అవుతుందా అని ప్రశ్నించారు. ఏ పని అయినా చెడగొట్టడానికే సంతోష్ రావు ఉంటారన్నారు. సంతోష్ రావు మోకిలాలో 750 కోట్ల ప్రాజెక్టును చేపట్టారన్నారు. గ్రీన్ ఇండియా పేరుతో నకిలీ కార్యక్రమం పెట్టి ఫారెస్ట్ ను కొట్టేయాలని కుట్ర చేశారన్నారు.

కడు ఉండాలి వీడు వాడే..?..సంతోష్ రావు ధన దాహానికి అడ్డు అదుపు లేదు.!..

టార్చర్ చేసింది సంతోష్ చెడ్డ పేరు మాత్రం కేటీఆర్ కు వీరు ఇద్దరు మేక వన్నె పులులు..హరీష్ రావు మీడియాను మేనేజ్ చేస్తే, రాం అన్న యూట్యూబ్ ను మేనేజ్ చేస్తారు.

750 కోట్ల విల్లా ఎక్కడిది తనికి? 

తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ, కేసీఆర్ మరో మేనల్లుడు అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ మీద కూడా కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సంతోష్ రావు దన దాహానికి అడ్డు అదుపు లేదు. సిరిసిల్ల ఇసుక లారీ కేసులో దళితులను టార్చర్ చేసింది సంతోష్, చెడ్డ పేరు మాత్రం కేటీఆర్ కు ఇచ్చారు. ముందులో మంచింగ్ చేయడానికి ఒకడు ఉండాలి వీడు వాడే. అంటూ కవిత తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.సంతోష్‌కు ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు. ఇప్పుడు షాట్. ఇది నాకు చెప్పింది పల్లా రాజేశ్వర్ రెడ్డి. 750 కోట్ల విల్లా ఎక్కడిదితనికి? నవీన్ రావు ఎమ్మెల్సీకి పదవి ఎలా వచ్చింది..సంతోష్ వాళ్ళ. హరీష్ రావు, సంతోష్ రావులు తలో వర్గం మేంటేయిన్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ లతో కుమ్మక్కు అయి బిఆర్ఎస్ ఓడిపోయేలా చేశారు. చివరకు కెసిఆర్ కామారెడ్డిలో ఓడిపోయేలా చేశారు. హరీష్ రావు మీడియాను మేనేజ్ చేస్తే, రాం అన్న యూట్యూబ్ ను మేనేజ్ చేస్తారు. రాం అన్నకు చెప్తున్న నువ్వు కూడా హరీష్ రావు లాగా నేర్చుకో. కూతురిగా చెప్తున్న వీళ్ళను పార్టీలో ఉంచుకుంటే వీళ్లు మిమ్మల్ని కూడా మింగేస్తారు. వీరు ఇద్దరు మేక వన్నె పులులు. అంటూ కవిత, కేసీఆర్ మేనల్లుళ్లు అయిన హరీశ్ రావు, సంతోష్ రావు లపై ధ్వజమెత్తారు.

]]>
Wed, 03 Sep 2025 23:15:53 +0530 admin
ఓటు చోరీ కాదు… రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు https://prajakshethrenews.com/ఓటు-చోరీ-కాదు-రాహుల్-గాంధీ-బ్రెయిన్-చోరీ-బీజేపీ-రాష్ట్ర-అధ్యక్షుడు-రాంచందర్-రావు https://prajakshethrenews.com/ఓటు-చోరీ-కాదు-రాహుల్-గాంధీ-బ్రెయిన్-చోరీ-బీజేపీ-రాష్ట్ర-అధ్యక్షుడు-రాంచందర్-రావు ఓటు చోరీ కాదు… రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ
* బీజేపీ గెలిస్తే ఓటు చోరీ, కాంగ్రెస్ గెలిస్తే మాత్రం కాదా? ఇదేం తీరు?
* కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం రజాకార్ల వారసుల కాళ్లు పట్టుకుని దాసోహం అవుతోంది
* కాంగ్రెస్‌కి మెజారిటీ లేకపోయినా, తెలంగాణా బిల్లు ఆమోదం పొందింది బీజేపీ మద్దతుతోనే.
 * సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్ వంటి నాయకుల కృషి వల్లే తెలంగాణా సాధ్యమైంది
* గతంలో నిజాం రాజు గొప్పోడు అని కేసీఆర్ పొగిడారు.
* తెలంగాణ ప్రజలపై నరమేధం చేసిన నిజాం ఎలా గొప్ప పాలకుడు?
* బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి బిజెపి తెలంగాణ అధ్యక్షులు  ఎన్. రాంచందర్‌ రావు డిమాండ్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ (నల్గొండ) :
సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం  నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో బిజెపి తెలంగాణ అధ్యక్షులు ఎన్.రాంచందర్‌ రావు  నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు నివాళి అర్పించారు.ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ నిజాం నిరంకుశత్వ పాలనలో గుండ్రాంపల్లిలో 26 మందిని రజాకార్లు దారుణంగా హతమార్చి బావిలో పడేసిన ఘటన మనకు మరిచిపోలేని విషాద ఘట్టం. ఆ అమరవీరుల, త్యాగధనుల కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. గుండ్రాంపల్లి గ్రామం సాహస చరిత్రకు ప్రతీక. ఇక్కడికి రావడం నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది.హైదరాబాద్ స్టేట్‌కు సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చింది.1947 ఆగస్టు 15న భారత్‌లో ఎక్కడైనా త్రివర్ణ పతాకం ఎగురుతుంటే, నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో మాత్రం ఎక్కడా భారత జెండా ఎగరలేదు. తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్నాటక జిల్లాలతో కూడిన హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం స్వతంత్ర ఇస్లామిక్ దేశంగా ఉంచాలని చూశాడు. కుదరని పక్షంలో పాకిస్తాన్‌తో కలుపుకోవాలని ప్రయత్నించాడు.నిజాం నిరంకుశత్వాన్ని ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు.. సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో ‘ఆపరేషన్ పోలో’ ద్వారా భారత సైన్యం హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేసింది. సెప్టెంబరు 17, 1948న తెలంగాణకు స్వాతంత్ర్యం లభించింది.ప్రజల ధైర్యం, సర్దార్ వల్లభభాయ్ పటేల్ కఠిన నిర్ణయం, ‘ఆపరేషన్ పోలో’లో భారత సైన్యం వీరోచిత పోరాటం వల్లే 1948 సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయాడు. తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది.ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే సర్దార్ వల్లభభాయ్ పటేల్ కృషి కారణమే. వారికి మనమంతా రుణపడి ఉన్నాం.సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవంగా జరపాలనే డిమాండ్ మొదట సీహెచ్. విద్యాసాగర్ రావు లేవనెత్తారు. ఆనాడు ఆయన సూచనతోనే అన్ని పార్టీ కార్యాలయాలకు ((కాంగ్రెస్, కమ్యూనిస్టు, తెలుగుదేశం, ఆ తదనంతరం టీఆర్ఎస్) వెళ్లి ఈ చరిత్రను వివరించాను.నేడు ఆ కార్యాలయాల్లో మూడు రంగుల జెండా ఎగురవేసి "జనగణమన" పాడుతున్నామంటే అది విద్యాసాగర్ రావు కృషి ఫలితం అని అన్నారు.. అందులో నేను భాగస్వామి కావడం గర్వకారణంగా ఉంది.కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను అధికారికంగా విముక్తి దినోత్సవంగా జరుపుతున్నాయి. కానీ సంతుష్టీకరణ రాజకీయాల కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు, తరువాత టీఆర్ఎస్–కాంగ్రెస్ ప్రభుత్వాలు వెనకడుగు వేశాయి.ఉద్యమ సమయంలో కేసీఆర్ సెప్టెంబర్ 17 అధికారికంగా జరుపుతానని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక వాగ్దానం నిలబెట్టుకోలేదు. ప్రజల ఆకాంక్షను వమ్ము చేశారు.బీజేపీ మాత్రమే ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతోంది.తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా జరగాలంటే.. 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే నన్నారు.. అది ఖాయం.నిజాం వ్యతిరేక పోరాటంలో భైరాన్‌పల్లి బురుజు, పరకాల అమరధామం, నిజామాబాద్ జైలు, నిర్మల్ సహా అనేక ప్రదేశాలు కీలక ఘట్టాలకు సాక్ష్యాలుగా నిలిచాయి.విమోచన దినోత్సవ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మజ్లిస్ భయంతో పెట్టడం లేదు. ఖాసీం రజ్వీ, రజాకార్ల వారసులకు కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీలు కవలపిల్లలవంటివి.నిజాం పాలనలో జరిగిన అకృత్యాలు మరువలేనివి. రజాకార్లు గుండ్రాంపల్లిపై దాడి చేసి ప్రజలను నీరు లేని బావిలో పడేసి సామూహిక దహనం చేశారు.తెలంగాణ మహిళలను వివస్త్రాలను చేసి బతుకమ్మ ఆడించారు. ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగాయి. ఒకేరోజు 96 మందిని హతమార్చారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటుంది కానీ కాంగ్రెస్ ఆలస్యం వల్ల వందలాది మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారన్నారు..తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కాదు. సోనియమ్మ వందలాది యువకులను బలితీసుకుంది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు.బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ తెచ్చామని చెబుతోంది. కానీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వారి ఎంపీలు హాజరే కాలేదు.కాంగ్రెస్‌కి మెజారిటీ లేకపోయినా, బిల్లు ఆమోదం పొందింది బీజేపీ మద్దతుతోనే. సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్ వంటి నాయకుల కృషి వల్లే సాధ్యమైంది.గతంలో నిజాం రాజు గొప్పోడు అని కేసీఆర్ పొగిడారు. కానీ తెలంగాణ ప్రజలపై నరమేధం చేసిన నిజాం ఎలా గొప్ప పాలకుడు? బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి.కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలన నిజాం తరహాలోనే నడుస్తోంది.కాంగ్రెస్ 42% ఇవ్వాల్సిన బీసీ రిజర్వేషన్లలో 10% ముస్లింలకు కట్టబెట్టాలని చూస్తోంది. ఎందుకంటే వారికి ఓవైసీల మద్దతు ముఖ్యం.తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువత చేసిన పోరాటాన్ని మరచిపోతున్నారు.తెలంగాణ సంపదను దోచుకున్నది బీఆర్ఎస్. అదే మాట స్వయంగా కేసీఆర్ కుటుంబ సభ్యురాలే చెబుతున్నారు. తెలంగాణ సొమ్మును దోచుకున్న డబ్బును సరిగ్గా పంచుకోలేకపోవడంతో ఈరోజు ఆ కుటుంబంలో గొడవలు అవుతున్నాయి. తెలంగాణ ప్రజల సంపదను దోచుకుని పాలనను విస్మరించిన పార్టీ బీఆర్ఎస్.నేడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కలెక్టర్లను బెదిరించి భూకబ్జాలు చేస్తున్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు నిజంగా తెలంగాణ ప్రజల శ్రేయస్సుపై చిత్తశుద్ధి ఉంటే, భారతదేశంపై గౌరవం ఉంటే సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలి. లేకుంటే ఆ అర్హత మీకు లేదు.ఓటు దొంగతనం జరిగిందని, అందుకే కాంగ్రెస్ ఓడిపోయిందని రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు విషయం ఓటు చోరీ కాదు… రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ. బీజేపీ గెలిస్తే ఓటు చోరీ, కాంగ్రెస్ గెలిస్తే మాత్రం కాదా? ఇదేంటి తీరు?కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం రజాకార్ల వారసుల కాళ్లు పట్టుకుని దాసోహం అవుతోంది.త్వరలో జూబ్లీహిల్స్ ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ మజ్లిస్ పార్టీకి చెందిన ఇండ్లలో ఒక్కో ఇంటిలో 60 నుండి వందల దొంగ ఓట్లు ఉన్నాయని వాస్తవం.మజ్లిస్ గెలిచే 7 నియోజకవర్గాల్లో ఒక్కో ఇంట్లో వందల దొంగ ఓట్లు ఉన్నాయి. రోహింగ్యాలు కూడా ఓటర్ల జాబితాలో ఉన్నారు. ఇది అసలు ఓటు చోరీ.రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటూ అబద్ధ ప్రచారం చేస్తున్నారు. అసలు ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ.హిందువులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకుంటుంది. కానీ ముస్లింలకు మాత్రం విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయ, మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటోంది.సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా జరిపి త్రివర్ణ పతాకం ఎగురవేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.తెలంగాణ విముక్తి చెంది భారతదేశంలో భాగమై, స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే దాని వెనుక అనేక మంది వీరుల త్యాగాలు ఉన్నాయి.అందుకే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బీజేపీ కృషి చేసింది, ఉద్యమించింది. తెలంగాణ విమోచన దినోత్సవం వల్లే తెలంగాణ ఉద్యమం కూడా బలపడింది.భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను రాష్ట్రంలోని అన్ని మండలాల స్థాయిలో ఘనంగా జరుపుతోంది. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను.

]]>
Tue, 02 Sep 2025 23:46:19 +0530 admin
తెలంగాణ సీఎం కాన్వాయ్ వెహికల్స్ మీద 18 చలాన్లు పెండింగ్ https://prajakshethrenews.com/తెలంగాణ-సీఎం-కాన్వాయ్-వెహికల్స్-మీద-18-చలాన్లు-పెండింగ్ https://prajakshethrenews.com/తెలంగాణ-సీఎం-కాన్వాయ్-వెహికల్స్-మీద-18-చలాన్లు-పెండింగ్ తెలంగాణ సీఎం కాన్వాయ్ వెహికల్స్ మీద 18 చలాన్లు పెండింగ్
ప్రజా క్షేత్ర్, , హైదరాబాద్ :
ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి కాన్వాయి లోని వాహానాలపై 18 ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు పెండింగ్ లో వున్నాయి. ఒకటే నెంబర్ ప్లేటుతో పలు వాహనాలు వున్నాయి. పలు వాహనాలు కాన్వాయ్ సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నట్లు గుర్తించారు. రాత్రిపూట సెక్యూరిటీ లేకుండా ఔటర్ రింగ్ రోడ్ మీద టీజీ 09 ఆర్ఆర్  0009 బీఎండబ్ల్యూ కారు చక్కర్లు కొడుతున్నట్లు నమోదయ్యింది.

]]>
Tue, 02 Sep 2025 23:36:50 +0530 admin
'మిరాయ్' స్పెషల్ పోస్టర్ రిలీజ్ https://prajakshethrenews.com/మిరాయ్-స్పెషల్-పోస్టర్-రిలీజ్ https://prajakshethrenews.com/మిరాయ్-స్పెషల్-పోస్టర్-రిలీజ్ సూపర్ హీరో తేజ సజ్జా, మనోజ్ మంచు, కార్తీక్ ఘట్టమనేని, టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పాన్ ఇండియా ఫిల్మ్

'మిరాయ్' నుంచి అంబికగా శ్రియ శరణ్‌ స్పెషల్ పోస్టర్ రిలీజ్


ప్రజా క్షేత్ర్, సినిమా : 
సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ 'మిరాయ్‌'లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో శ్రియ శరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మేకర్స్ తాజాగా శ్రియను అంబికగా పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు.శ్రియ శరణ్ పవర్ ఫుల్ మదర్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్‌ ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్ ఎమోషన్ తో వుండబోతుంది. ఈ  పోస్టర్ సూపర్ హీరో ప్రయాణం వెనుక ఉన్న ఎమోషన్ ని హైలైట్ చేస్తుంది.ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే స్క్రీన్‌ప్లేను కార్తీక్ స్వయంగా రూపొందించారు. మణిబాబు కరణం రచన, సంభాషణలకు కీలకంగా పని చేశారు. గౌర హరి సంగీతం, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సుజిత్ కుమార్ కొల్లి పని చేస్తున్నారు.మిరాయ్ సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జ, మనోజ్ మంచు, రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు

]]>
Tue, 02 Sep 2025 23:33:54 +0530 admin
తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద మరణకాండలలో గుండ్రంపల్లి ఒకటి https://prajakshethrenews.com/తెలంగాణ-చరిత్రలోనే-అతి-పెద్ద-మరణకాండలలో-గుండ్రంపల్లి-ఒకటి https://prajakshethrenews.com/తెలంగాణ-చరిత్రలోనే-అతి-పెద్ద-మరణకాండలలో-గుండ్రంపల్లి-ఒకటి రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం, యువత వీరోచిత పోరాటం
*కాసిం రీజ్వీ రజాకార్ సైన్యం గుండ్రంపల్లి, వీరభైరానపల్లి, పర్కల, గొరాట వంటి గ్రామాలపై దాడి చేసి వందలాది అమాయకులను ఊచకోత కోసింది
*తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద మరణకాండలలో గుండ్రంపల్లి ఒకటిగా నిలిచింది
*గుండ్రంపల్లి అమరవీరులకు మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఘన నివాళ్ళు
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్ సెప్టెంబర్ 2 :
స్సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా నల్గొండ జిల్లా గుండ్రంపల్లి గ్రామంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన 300 మందికి పైగా అమరవీరులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు , మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్  నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ నర్సయ్య గౌడ్ ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,“రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం, యువత వీరోచిత పోరాటం చేసింది. కాసిం రీజ్వీ రజాకార్ సైన్యం గుండ్రంపల్లి, వీరభైరానపల్లి, పర్కల, గొరాట వంటి గ్రామాలపై దాడి చేసి వందలాది అమాయకులను ఊచకోత కోసింది. తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద మరణకాండలలో గుండ్రంపల్లి ఒకటిగా నిలిచింది” అని తెలిపారు.వీరభైరానపల్లి ఘటనలో 200 మంది, గుండ్రంపల్లిలో 350 మందికి పైగా, పర్కలలో 22 మంది (150 మంది గాయాలు), గొరాట గ్రామంలో 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు.అలాగే రజాకార్ల నేత ఖాసీం రీజ్వీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక విమానంలో పాకిస్తాన్‌కు పంపడం చరిత్రలో మరక అని వ్యాఖ్యానించారు. “సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభభాయ్ పటేల్ జోక్యంతో తెలంగాణ విముక్తి సాధ్యమైంది. అదే రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  జన్మదినం కూడా ఉండటం యాదృచ్చికం” అని అన్నారు.నల్గొండ జిల్లా రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్రబిందువుగా నిలిచిందని గుర్తు చేస్తూ, “ఈ ప్రాంతంలోని పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా గుండ్రంపల్లిలో జాతీయ స్థాయిలో అమర వీరుల స్ఫూర్తి చిహ్నం నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సెప్టెంబర్ 17ను అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా జరపాలి” అని ఆయన స్పష్టం చేశారు.బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత అమర వీరులు ప్రాణత్యాగం చేసిన ఈ నాలుగు ప్రాంతాల్లో అధికారికంగా స్మారక స్థూపాలు నిర్మించి, రాష్ట్ర స్థాయిలో విమోచన దినోత్సవాన్ని జరిపే కట్టుబాటు ఉందని ఈ సందర్భంగా తెలిపారు.

]]>
Tue, 02 Sep 2025 23:26:52 +0530 admin
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ బొనాంజా https://prajakshethrenews.com/పవర్-స్టార్-పవన్-కళ్యాణ్-అభిమానులకు-డబుల్-బొనాంజా https://prajakshethrenews.com/పవర్-స్టార్-పవన్-కళ్యాణ్-అభిమానులకు-డబుల్-బొనాంజా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ బొనాంజా
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'ఓజీ' నుండి పోస్టర్, గ్లింప్స్ విడుదల

ప్రజా క్షేత్ర్ , సినిమా : 

పవర్ స్టార్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న పోస్టర్, గ్లింప్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, 'ఓజీ' చిత్ర బృందం అభిమానులకు డబుల్ బొనాంజా ఇచ్చింది. అద్భుతమైన కొత్త పోస్టర్ తో పాటు, “HBD OG - LOVE OMI” పేరుతో ఓ సంచలనాత్మక గ్లింప్స్ ను విడుదల చేసింది. వింటేజ్ లుక్ లో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న పోస్టర్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పోస్టర్ రాకతో సామాజిక మాధ్యమాలు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ను ఈ తరహా లుక్ లో చూసి చాలా కాలం అయిందని అభిమానులు, ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌ ను ఇంత శక్తివంతమైన, ఆకర్షణీయమైన శైలిలో చూపించినందుకు అభిమానులు, సినీ ప్రేమికులు.. దర్శకుడు సుజీత్, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'ఓజీ' అనే టైటిల్ కి తగ్గట్టుగానే పోస్టర్ కూడా ఎంతో శక్తివంతంగా ఉంది.
పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ చిత్ర బృందం “HBD OG - LOVE OMI” అనే గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. మొదటి నుండి 'ఓజీ'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌ను గంభీరమైన అవతారంలో చూపించిన హంగ్రీ చీతా గ్లింప్స్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు “HBD OG - LOVE OMI” గ్లింప్స్‌ సినిమా యొక్క మరో విస్ఫోటన కోణాన్ని వెల్లడిస్తుంది. తాజా గ్లింప్స్ లో ఇమ్రాన్ హష్మీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ని ఢీ కొట్టే బలమైన పాత్రలో ఆయన కనువిందు చేయనున్నారు.
'ఓజీ' సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా విడుదలైన ప్రతి పోస్టర్, గ్లింప్స్, పాటలు కట్టిపడేశాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా 'ఓజీ' కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ లుక్, అద్భుతమైన విజువల్స్, సంగీతం, సంభాషణలు ఇలా ప్రతి అంశం సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేస్తున్నాయి.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్‌ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.
ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో 'ఓజీ' ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. సెప్టెంబర్ 25, 2025న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
తారాగణం: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి

]]>
Tue, 02 Sep 2025 23:18:55 +0530 admin
కేసీఆర్, హరీష్ రావులకు ఊరట https://prajakshethrenews.com/కేసీఆర్-హరీష్-రావులకు-ఊరట https://prajakshethrenews.com/కేసీఆర్-హరీష్-రావులకు-ఊరట కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, సెప్టెంబర్ 2 : 
కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడం తెలిసిందే. దీనిపై మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ లో వీరికి స్వల్ప ఊరట లభించింది.
హైకోర్టు ఈ పిటిషన్ తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. అప్పటివరకూ (తదుపరి విచారణ తేదీ వరకు) వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ఏజీ తెలిపారు. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు, సీబీఐ దర్యాప్తునకు ఏ సంబంధం లేదని కోర్టుకు ఏజీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులు అవకతవకలు జరిగాయని, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని కేసును సీబీఐకి అప్పగించాలని ఆదివారం అర్ధరాత్రి శాసనసభలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేసు సీబీఐకి అప్పగిస్తున్నట్లు లేఖ సైతం రాశారు. అయితే సీబీఐకి కాళేశ్వరం కేసు దర్యాప్తును అప్పగించడంతో కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఏమాత్రం ప్రామాణికత లేని కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారని, సీబీఐ దర్యాప్తును నిలిపివేయాలని తమ పిటిషన్లో కోరారు. సోమవారం అత్యవసరంగా పిటిషన్ విచారణకు రాగా, విచారణను మంగళవారానికి (సెప్టెంబర్ 2కు) హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరినా కోర్టు అందుకు నిరాకరించింది.ఈ క్రమంలో హైకోర్టు మంగళవారం నాడు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు విచారించింది. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదికి వాయిదా వేసింది. కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. కాళేశ్వరంపై దర్యాప్తు కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని అడ్వకేట్
జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే సీబీఐ దర్యాప్తునకు, కాళేశ్వరం రిపోర్టుకు ఎలాంటి సంబంధం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా  సీబీఐ దర్యాప్తు చేపట్టరాదని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేపట్టడానికి బ్రేకులు పడ్డాయి.కేసు తదుపరి విచారణ అక్టోబర్ 7న కనుక అప్పటివరకూ ఎలాంటి చర్యలు చేపట్టవద్దన్న హైకోర్టు ఆదేశాలు పాటించాల్సి ఉంటుందని కేసీఆర్, హరీష్ రావు తరపున వాదనలు వినిపించిన లాయర్ అన్నారు. కమిషన్ రిపోర్టునే పరిగణనలోకి తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, అలాంటప్పుడు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టే అవకాశం ప్రస్తుతానికి లేదన్నారు.

]]>
Tue, 02 Sep 2025 22:07:47 +0530 admin
అంతా కావాలని చేసిన కవిత? https://prajakshethrenews.com/అంతా-కావాలని-చేసిన-కవిత https://prajakshethrenews.com/అంతా-కావాలని-చేసిన-కవిత అంతా కావాలని చేసిన కవిత? 
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్, సెప్టెంబర్ 2 : 
భారత రాష్ట్ర సమితి నుంచి కవితను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాలను పెద్దగా ఆశ్చర్యపరచలేదు. గత మే నెలలోనే కవిత కుటుంబంలో, పార్టీలో తిరుగుబాటు చేశారు. తనకు ప్రాధాన్యత లేకుండా
చేయడం, రాజకీయాల నుంచి విరమించుకోవాలని కుటుంబ పెద్దలు సలహాలు ఇవ్వడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. అందుకే అప్పటి నుంచి జాగృతి తరపున రాజకీయాలు చేయడం ప్రారంభిచారు. రాను రాను ఆ గ్యాప్ పెరిగిపోయింది. చివరికి పాతికేళ్ల పార్టీ ఆవిర్భావ సభ తర్వాత ఆమె కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు రావడంతో కవిత తిరుగుబాటు వ్యవహారం బహిరంగమయింది. తాను కేసీఆర్ కు రాసిన లేఖలు ఆయన చుట్టూ ఉందే దెయ్యాలే లీక్ చేశాయని ఆరోపించడం ప్రారంభించారు. అయితే కవిత .. కాంగ్రెస్ పార్టీతో కలిసి సొంత రాజకీయం చేస్తున్నారన్న అనుమానాలు బీఆర్ఎస్ పార్టీలో కొంత కాలం నుంచి ఉన్నాయి. దానికి  తగ్గ ఆధారాలు వారి దగ్గర ఉన్నాయో లేవో కానీ కవితపై ఎప్పుడూ దూకుడుగా మాట్లాడలేదు. విమర్శలు చేయలేదు. పార్టీ హైకమాండ్ ఆదేశాలతో సైలెంట్ గా ఉంటూనే వస్తున్నారు. అయితే కవిత మాత్రం తన రాజకీయాలు తాను జోరుగా చేసుకుంటున్నారు. కవిత చాలా ప్రణాళికా  బద్దంగా జాగృతిని రాజకీయ పార్టీగా మార్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నాయకత్వాన్ని పెంచుకున్నారు. కొత్త నేతలకు శిక్షణ ఇస్తున్నారు. నమ్మకమైన కార్యకర్తలను  దరి చేర్చుకున్నారు. ఇప్పుడు ఆమె సొంత రాజకీయాలు చేయాలంటే బలమైన కారణంతో ప్రజల ముందుకు రావాల్సింది. అందుకే కాళేశ్వరంపై సీబీఐ రిపోర్టును ఉపయోగించుకుని మీడియా ముందుకు
వచ్చారు. కేసీఆర్ పై చాలా అభిమానం చూపిస్తూ.. హరీష్, సంతోష్ లను టార్గెట్ చేశారు.హరీష్, సంతోష్‌లపై ఆరోపణలు చేసిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మరో మార్గం లేకుండా పోయింది.  కవితపై చర్యలు తీసుకుంటే..  హరీష్, కవితలకు గౌరవం ఇచ్చినట్లుగా.  తీసుకోకపోతే వారికి పార్టీలో ప్రాధాన్యత లేనట్లే అవుతుంది. కవిత సొంత పార్టీ కోసం రెడీ అయిపోయిన సమయంలో ఇద్దరు నేతల్ని వదులుకోలేరు.అందుకే కవితపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  ఇక బీఆర్ఎస్ పార్టీలో తనకు చోటు లేదని ఎప్పుడైన కవిత.. ఖచ్చితంగా ఇలాంటి ఎఫెక్ట్ కోసమే చూస్తున్నారు. తనంతట తాను బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంటే ఎఫెక్టివ్ గా ఉండదు..కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరవాత పార్టీ పెట్టుకుంటే ప్రజల్లో సానుభూతి వస్తుంది. ఆ గోల్ ను కవిత సాధించారు. కవిత ఇప్పుడు విక్టిమ్ కార్డు ప్రదర్శించవచ్చు. పార్టీని కేటీఆర్, హరీష్ ను నాశనం చేస్తున్నారని..తన తండ్రికి చెడ్డపేరు తెస్తున్నారని ప్రచారం చేసే అవకాశం ఉంది. ఆమెకు రాజకీయంగా ఎన్ని అవకాశాలు వస్తాయన్న సంగతిని పక్కన పెడితే .. కేసీఆర్ కుటుంబం మాత్రం రెండుగా చీలిపోయింది.          

]]>
Tue, 02 Sep 2025 21:59:14 +0530 admin
గీత దాటితే వేటు.. సంకేతాలు పంపిన కేసీఆర్ https://prajakshethrenews.com/గీత-దాటితే-వేటు-సంకేతాలు-పంపిన-కేసీఆర్ https://prajakshethrenews.com/గీత-దాటితే-వేటు-సంకేతాలు-పంపిన-కేసీఆర్ గీత దాటితే వేటు..
సంకేతాలు పంపిన కేసీఆర్

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ : 
తనకు ప్రాణసమానమైన కూతురిపై కేసీఆర్‌ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనక… చాలాకారణాలే కనిపిస్తున్నాయి. పార్టీ సైతం.. ఆ దిశగా నిర్ణయం తీసుకోవడానికి చాలా రీజన్సే కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ
కేసీఆర్‌ కూతురనో… పార్టీ ఆడకూతురనో.. ఆమె కామెంట్స్‌పై అధినేత సహా, పార్టీనేతలు సైతం పెద్దగా రియాక్ట్‌ కాలేదు. కానీ, ఇప్పుడు ఏకంగా కేటీఆర్‌, హరీష్‌, సంతోష్‌లాంటి పార్టీ అగ్రనాయకత్వంపై తీవ్రస్థాయిలో
విమర్శలు చేయడం.. పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడటం… అధినేతకు కోపం తెప్పించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, కాళేశ్వరం విషయంలోనూ ఆమె టంగ్‌ స్లిప్పవడం.. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. అంతా
హరీష్‌రావు, సంతోష్‌రావులే చేశారనీ.. వారివల్లే కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటుకున్నాయనీ… తీవ్ర వ్యాఖ్యలు చేసిన కవిత… పరోక్షంగా కాళేశ్వరంలో ఏదో తప్పు జరిగిందన్నట్టుగా మాట్లాడారన్న అభిప్రాయం
వ్యక్తమవుతోంది. అది ప్రత్యర్థులకు అస్త్రం అందేలా చేసిందని పార్టీ భావిస్తోంది.ఒక్క కేసీఆర్‌ తప్ప…. ఒకే ఒక్క కేసీఆర్‌ తప్ప…ఇదీ, కొన్నాళ్లుగా బీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో వినిపిస్తున్న కవితాగానం. కేసీఆర్‌ దేవుడే… ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో మొదలైన కలకలం… ఇక్కడి దాకా లాక్కొచ్చింది. కేసీఆర్‌ ఒక్కరిని మినహాయించి.. బీఆర్‌ఎస్‌లో మిగితా నేతలందరినీ ఆమె టార్గెట్‌ చేస్తున్న తీరు గులాబీసేనను ఇరకాటంలో పడేసిందనే చెప్పాలి. అందుకే అధిష్ఠానం కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలుస్తోంది.తెలంగాణ జాగృతిని స్థాపించి ఉద్యమ పార్టీతోనే కొన్నేళ్లుగా ప్రయాణం కొనసాగించిన కవిత… ఒకసారి నిజామబాద్‌ ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్సీగానూ అవకాశం ఇచ్చింది పార్టీ. పార్టీలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ల తర్వాత ఆస్థాయి నాయకురాలిగా కవితకు పేరుండేది. కానీ ఢిల్లీ లిక్కర్‌ కేసులో
అరెస్టయ్యాక, పరిస్థితి మారింది. ఈ కేసులో ఆర్నెళ్లకుపైగా జైళ్లో ఉన్న కవిత.. బెయిల్‌పై విడుదలయ్యాక అంతే స్పీడుతో రాజకీయంగా దూసుకొచ్చారు. అయితే, ఆ స్పీడు కాస్తా.. సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా చేసింది.ఏప్రిల్‌లో ఘనంగా బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సంబరాలు జరుపుకోగా… పార్టీ తీరును తప్పుబడుతూ కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖ మే 20న బహిర్గతం కావడం సంచలనం సృష్టించింది. ఆ సమయంలో అమెరికా పర్యటనలో ఉన్న కవిత… తిరిగొచ్చాక పెద్ద బాంబే పేల్చారు. అది రాసింది తానేననీ… అయితే అది ఎలా బయటకు వచ్చిందో తేలాలంటూ… పెద్ద బాంబే పేల్చారు. కేసీఆర్‌ దేవుడే కానీ… ఆయన చుట్టూతా కొన్ని దయ్యాలున్నాయంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై కేసీఆర్‌కు నోటీసులిస్తే… పార్టీ ఏం చేస్తోందంటూ.. నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కవిత. అంతేకాదు, కేసీఆర్‌ కాళేశ్వరం కమిషన్‌ ముందర హాజరయ్యేందుకు ముందు, సరిగ్గా ఒక్కరోజు ముందు…. గన్‌పార్క్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా కూడా చేశారు. తనపై కొందరు పార్టీలో కుట్రలు చేస్తున్నారంటూ… కవిత చేసిన వ్యాఖ్యలూ సంచలనమయ్యాయి. కర్మకు తగ్గ ఫలితం అనుభవిస్తారంటూ.. అప్పట్లో ఆమె చేసిన హెచ్చరిక సంచలనం రేపింది.పార్టీతో సంబంధం లేకుండా ఆమె చేపట్టిన కార్యక్రమాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. జాగృతికోసం ప్రత్యేకంగా ఆఫీసును ప్రారంభించిన ఆమె… ఇక బీఆర్‌ఎస్‌తో సంబంధం లేదన్నట్టుగానే ప్రోగ్రామ్స్‌ తీసుకున్నారు. బీసీల రిజర్వేషన్లయినా, ఇతర అంశాలైనా.. ఆమె సొంత ఎజెండాతో ముందుకు వెళ్లారు. అందుకే, ఇటీవల ఆమెను సింగరేణి పార్టీ అనుబంధం సంఘం బాధ్యతలనుంచి కూడా తప్పించారు. ఇలా వరుస పరిణామాల తర్వాత… ఆమె వ్యవహారశైలి మితిమీరినట్టుగా భావించిన గులాబీ బాస్‌… కూతురిపై బహిష్కరణ వేటు వేశారు.

]]>
Tue, 02 Sep 2025 21:51:10 +0530 admin
బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్... కొంతకాలం నుంచి కవిత ధిక్కార స్వరం.. https://prajakshethrenews.com/బీఆర్ఎస్-నుంచి-కవిత-సస్పెండ్-కొంతకాలం-నుంచి-కవిత-ధిక్కార-స్వరం https://prajakshethrenews.com/బీఆర్ఎస్-నుంచి-కవిత-సస్పెండ్-కొంతకాలం-నుంచి-కవిత-ధిక్కార-స్వరం బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్
కొంతకాలం నుంచి కవిత ధిక్కార స్వరం..
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, సెప్టెంబర్ 2 : 
అంతా ఊహించిందే జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసేందుకు పార్టీ అధినేత , కవిత తండ్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో పార్టీ క్రమశిక్షణా కమిటీ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నట్లు సోమభరత్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. గత కొంతకాలం నుంచి కవిత వ్యవహారం పార్టీకి నష్టం చేకూర్చేలా ఉందని బీఆర్ఎస్ నుంచి ఆమెపై వేటు వేశారు. కవిత చేసే వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు.ఎమ్మెల్సీ కవిత బిఆర్ ఎస్ లో కొనసాగుతూనే గత కొంత కాలంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏకంగా తన తండ్రి , బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించే స్దాయిలో ఆమె కామెంట్స్ పీక్స్ కు చేరుకున్నాయి. పార్టీలు దేయ్యాలు కేసీఆర్ ను నడిపిస్తున్నాయంటూ మొదలైన కవితధిక్కార స్వరం ,  అక్కడితో ఆగలేదు.. అనేకసార్లు పార్టీ విధానాలపై, పార్టీలో కీలక నేతలపైన తీవ్ర స్దాయిలో బహిరంగ విమర్శలు చేస్తూ వచ్చారు. తన తండ్రి దేవుడు అంటూనే ,కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉన్న నేతలపై విరుచుకుపడ్డారు.ఇన్నాళ్లు పార్టీలో కీలక నేతల పేర్లు ప్రస్తావించని కవిత, తాజాగా మాజీ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు, పార్టీలో నెంబర్ త్రీగా చెప్పుకునే హరీష్ రావుపై  మీడియా ముందు పేరు ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. కాలేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా అంటూనే, సంతోష్ , హరీష్ రావు కలసి,  తన తండ్రి కేసీఆర్ ను తప్పుదోవ పట్టించారని, వారివల్లనే కాలేశ్వరంలో అవినీతి మరకలు కేసీఆర్ కు  అంటుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి స్వార్ధం కోసమే కేసీఆర్ ను బలిచేశారని ఆరోపించడం తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ సునామీని సృష్టించారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి బిఆర్ ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ పార్టీ పరువు గంగలో కలిపినంత పనిచేశారు కవిత..కవిత వ్యాఖ్యల అనంతరం బీఆర్ఎస్ లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు భరించింది చాలు. కేసీఆర్ కూతురు కాబట్టే ఓపిక పట్టాం. ఇంక పంపేద్దాం ...పార్టీ నుండి. ఆమె మాకొద్దు మహా ప్రభో అంటూ తీవ్ర స్దాయిలో పార్టీ కేడర్ నుండి ముఖ్య నేతల నుండి కేసీఆర్ పై ఒత్తిడి పెరిగింది. మరోవైపు మీడియా సైతం కేసీఆర్ కూతురు కాబట్టే చర్యలు తీసుకోవడంలేదుంటూ ఉతికి ఆరేస్తోంది. ఈ నేపధ్యంలో రంగంలోకి దిగిన కేసీఆర్ ముఖ్యనేతలతో చర్చించి , ఓ క్లారిటీ వచ్చినట్లుగా సమాచారం. కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూతురు కదా అని ఊరుకుంటే, ఇన్నాళ్లు కాపాడుకున్న పార్టీకి భారీ నష్టం వాటిల్లే అవకాశం  ఉందని భావించిన , పార్టీ కంటే కూతురేం ఎక్కువ కాదనే నిర్ణయానికి  కేసీఆర్ వచ్చారు. పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసినట్లు ప్రకటనలో తెలిపారు. సస్పెండ్ చేయాడనికి కారణాలు చెబుతూ అటు కవితపై తీవ్ర స్దాయి విమర్శల జోలిికి వెళ్లకుండా,  పార్టీపై కవిత వ్యాఖ్యలకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నాం., ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాం అని స్పష్టత వచ్చింది.

]]>
Tue, 02 Sep 2025 21:45:50 +0530 admin
ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌...నేటినుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు ఓపెన్ https://prajakshethrenews.com/ఏపీలో-మందుబాబులకు-గుడ్న్యూస్నేటినుంచి-రాత్రి-12-గంటల-వరకు-బార్లు-ఓపెన్ https://prajakshethrenews.com/ఏపీలో-మందుబాబులకు-గుడ్న్యూస్నేటినుంచి-రాత్రి-12-గంటల-వరకు-బార్లు-ఓపెన్ ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌..
నేటినుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు ఓపెన్
ప్రజా క్షేత్ర్, అమరావతి సెప్టెంబర్ : 
; ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. ఇవాల్టి నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉండనున్నాయి. ఈ మేరకు నూతన బార్‌ పాలసీ అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పాలసీ 2008 వరకు మూడేళ్ల కాలం అమలులో ఉండనుంది.గతంలో ఉన్న బార్‌ పాలసీ ప్రకారం.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటలకు బార్లను తెరిచి ఉంచాల్సి ఉంటుంది. కానీ నూతన విధానం ద్వారా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లను తెరిచి ఉంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త బార్‌ పాలసీని అమలు చేస్తూ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ నిశాంత్‌ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఈ ఉత్తర్వుల్లో భాగంగా 10 శాతం మద్యం షాపులను కల్లు గీత కులాలకు కేటాయించిన సంగతి తెలిసిందే.

]]>
Tue, 02 Sep 2025 00:10:59 +0530 admin
అఫ్గాన్‌లో భూకంపం.. 625 కు చేరిన మృతులు https://prajakshethrenews.com/అఫ్గాన్లో-భూకంపం-625-కు-చేరిన-మృతులు https://prajakshethrenews.com/అఫ్గాన్లో-భూకంపం-625-కు-చేరిన-మృతులు అఫ్గాన్‌లో భూకంపం.. 625 కు చేరిన మృతులు

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌ సరిహద్దులోని కునార్‌ ప్రావిన్స్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 6.0 తీవ్రత నమోదైంది. ఈ ఘోర విపత్తు కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 500కు చేరింది. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వివరాల ప్రకారం.. నంగర్హార్‌ ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. 8 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రి 11.47 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

]]>
Tue, 02 Sep 2025 00:06:46 +0530 admin
హరీష్, సంతోష్ వల్లే కేసీఆర్‌ పై మరకలు : ఎమ్మెల్సీ కవిత https://prajakshethrenews.com/హరీష్-సంతోష్-వల్లే-కేసీఆర్-పై-మరకలు-ఎమ్మెల్సీ-కవిత https://prajakshethrenews.com/హరీష్-సంతోష్-వల్లే-కేసీఆర్-పై-మరకలు-ఎమ్మెల్సీ-కవిత

హరీష్, సంతోష్ వల్లే కేసీఆర్‌ పై మరకలు : ఎమ్మెల్సీ కవిత

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి బీఆర్ఎస్ పార్టీలో అణుబాంబు వేశారు. కేసీఆర్ పై సీబీఐ విచారణకు ఆదేశించిన అంశంలో కడుపు రగిలి పోతోందని మీడియా ముందుకు వచ్చిన ఆమె, కేసీఆర్ పై మరకలు పడటానికి హరీష్ రావు, సంతోష్ రావే కారణం అని నేరుగా ఆరోపణలు చేశారు. వారిద్దదరూ తీవ్రమైన అవినీతికి పాల్పడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ కు డబ్బు యావ లేదని..కానీ హరీష్ , సంతోష్ లు మాత్రం భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు. అందుకే హరీష్ రావును గతంలో కేసీఆర్ నీటి పారుదల మంత్రిగా తొలగించారని కూడా కవిత గుర్తు చేసుకున్నారు. తన తండ్రి పై సీబీఐ కేసు నమోదు చేస్తే..కేసీఆర్ పరువుపోతే తనకు ఆవేదన ఉండదా? అని కవిత కంటతడి పెట్టుకున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. తాను ఇలా మాట్లాడుతూంటే తన వెనుక ఎవరో ఉన్నారని ఆరోపిస్తారని నిజానికి వారే రేవంత్ రెడ్డితో కలిసి తన తండ్రిపై కుట్ర చేస్తున్నారన్నట్లుగా మాట్లాడారు. కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి సభ్యులతో సమావశం అయ్యారు. హరీష్ రావు, సంతోష్ రావు వ్యక్తిగత స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఇద్దరు అధికారులు వందల కోట్లతో పట్టుబడ్డారని వారి వెనుక ఎవరున్నారో తేల్చాలన్నారు. అవినీతి ఆనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పై సీబీఐ కేసులు పెట్టే అంత పరిస్థితి వచ్చాక..పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, అని ప్రశ్నించారు. ఈ కేసులో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో పెను సంచలనానికి కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

]]>
Tue, 02 Sep 2025 00:04:28 +0530 admin
బాసర సరస్వతి సన్నిధిలో అలరించిన అష్టావధానం https://prajakshethrenews.com/బాసర-సరస్వతి-సన్నిధిలో-అలరించిన-అష్టావధానం https://prajakshethrenews.com/బాసర-సరస్వతి-సన్నిధిలో-అలరించిన-అష్టావధానం బాసర సరస్వతి  సన్నిధిలో అలరించిన అష్టావధానం
బాసర, ఆగష్టు 26 :
జ్ఞాన సరస్వతి మాత వెలసిన బాసర పట్టణంలో శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమంలో కోటి  పార్థివ లింగ స్తూప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము లో వ్యవస్థాపక అధ్యక్షులు నిర్మల అంబికానాథ శర్మ ఆధ్వర్యంలో , ఆసిఫాబాద్ కు చెందిన మాడుగుల నారాయణమూర్తి  నిర్వహించిన అష్టావధానం సాహిత్య ప్రియులందరినీ ఆలరించింది. బాసరలోని ద్వాదశ జ్యోతిర్లింగ మందిరంలో ఈ అష్టావధానం జరిగింది. ఇందూరు కవులు డాక్టర్ గణపతి అశోక శర్మ అధ్యక్షతన జరిగిన, ఈ అవధానానికి సమన్వయకర్తగా డాక్టర్ కాసర్ల నరేశ్ రావు వ్యవహరించారు. పృఛ్ఛకులుగా కవి పండితులు,నిషిద్ధాక్షరిని తొగరి రాజేశ్వర్ ,సమస్యను ప్రవీణ్ కుమార్ శర్మ, దత్తపదిని చింతల శ్రీనివాస్ గుప్త ,వర్ణనను డాక్టర్ శారద, న్యస్తాక్షరిని గుడి రాజేశ్వర శర్మ సిద్ధాంతి, అప్రస్తుత ప్రసంగాన్ని కంకణాల రాజేశ్వర్, ఆశువును ఇందారపు మధుకర్ శర్మ నిర్వహించారు. రసవత్తరంగా జరిగిన ఈ అవధానంలో పృఛ్ఛకులు అడిగిన ప్రశ్నలకు అవధాని సమయస్ఫూర్తితో, పాండిత్య పటిమతో చక్కటి సమాధానాలు చెప్పారు. రెండు గంటలకు పైగా సాగిన ఈ అవధానం అందరికీ పద్యగాన వినోదాన్ని పంచి సరస్వతీ మాతకు అక్షర  నీరాజనాన్ని అందించిందని అతిథులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు అంబికానాథ శర్మ దంపతులు, ఆసిఫాబాద్ నుంచి వచ్చిన కవులు, మూడ నాగభూషణం గుప్త విద్యాలయానికి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం అష్టావధానిని పృఛ్ఛకులను ఆలయ నిర్వహకులు ఆలయ సంప్రదాయం ప్రకారం గా సత్కరించారు.

]]>
Wed, 27 Aug 2025 21:15:56 +0530 admin
పూర్ణాహుతితో ముగిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు https://prajakshethrenews.com/పూర్ణాహుతితో-ముగిసిన-ఒంటిమిట్ట-శ్రీ-కోదండరామస్వామివారి-పవిత్రోత్సవాలు https://prajakshethrenews.com/పూర్ణాహుతితో-ముగిసిన-ఒంటిమిట్ట-శ్రీ-కోదండరామస్వామివారి-పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ముగిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు
ప్రజా క్షేత్ర్, తిరుపతి :
 ఒంటిమిట్ట‌ శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు మ‌హాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చ‌తుష్టార్చ‌న‌, మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగిశాయి.

]]>
Wed, 27 Aug 2025 21:08:19 +0530 admin
యూరియా పంపిణీపై రేపు అన్ని జిల్లా కలెక్టర్లతో సమీక్ష:మంత్రి జూపల్లి కృష్ణారావు https://prajakshethrenews.com/యూరియా-పంపిణీపై-రేపు-అన్ని-జిల్లా-కలెక్టర్లతో-సమీక్షమంత్రి-జూపల్లి-కృష్ణారావు https://prajakshethrenews.com/యూరియా-పంపిణీపై-రేపు-అన్ని-జిల్లా-కలెక్టర్లతో-సమీక్షమంత్రి-జూపల్లి-కృష్ణారావు యూరియా పంపిణీపై రేపు అన్ని జిల్లా కలెక్టర్లతో సమీక్ష : మంత్రి జూపల్లి కృష్ణారావు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ ఆగష్టు 26 :
 యూరియా కోసం రైతులు క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. యూరియా పంపిణీపై రేపు అన్ని జిల్లాల్లో సమీక్షిస్తామని అన్నారు. జూపల్లి మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కేంద్రప్రభుత్వం పంపిన యూరియానే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోందని, నానో యూరియా వాడాలని కేంద్రం చెప్తోందని తెలియజేశారు. నానో యూరియా వాడకంపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగలేదని, యూరియా కొరత ఉందని కేంద్రప్రభుత్వమే చెప్తోందని అన్నారు. అంతర్జాతీయ యుద్ధాల వల్ల దిగుమతి సమస్య ఉందని కేంద్రం చెప్తోందని, యూరియా కేటాయింపులో కేంద్రం సహకరించటం లేదని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

]]>
Wed, 27 Aug 2025 21:03:49 +0530 admin
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీ https://prajakshethrenews.com/సచివాలయంలో-సీఎం-చంద్రబాబు-అధ్యక్షతన-రాష్ట్రస్థాయి-బ్యాంకర్ల-కమిటీ-భేటీ https://prajakshethrenews.com/సచివాలయంలో-సీఎం-చంద్రబాబు-అధ్యక్షతన-రాష్ట్రస్థాయి-బ్యాంకర్ల-కమిటీ-భేటీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీ


ప్రజా క్షేత్ర్, అమరావతి :

 సచివాలయం 5 బ్లాక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అధ్యక్షత రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి న సీఎస్ కే.విజయానంద్, ఎస్ఎల్ బీసీ ఛైర్మన్ నితీష్ రంజన్, కేంద్ర ఆర్ధిక విభాగం, ఆర్బీఐ, నాబార్డు, సిడ్బీ, ఎగ్జిమ్  బ్యాంక్ ఇతర బ్యాంకుల ప్రతినిధులు, ఉన్నతాధికారులు హజరయ్యారు. ఖరీఫ్ సీజన్లో  రూ.1,80,540 కోట్ల రుణ లక్ష్యానికిగానూ  జూన్ నాటికి రూ.94,666 కోట్ల మేర రుణాలను  బ్యాంకులు ఇచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు రూ.985 కోట్ల రుణాల్ని బ్యాంకులు మంజూరు చేశాయి. ఎంఎస్ఎంఈ రంగానికి రూ.49,831 కోట్ల రుణం మంజూరు చేసాయి. విద్యారంగానికి రూ.252 కోట్లు, హౌసింగ్ కు రూ.1,146 కోట్ల రుణాలు మంజూరు చేసాయి. పునరుద్పాదక ఇంధన రంగానికి రూ.125 కోట్ల మేర రుణ మంజూరు, స్వయం సహాయ సంఘాలకు రూ.5,937 కోట్ల రుణాన్ని ఇచ్చాయి. ముద్రా రుణాల కింద రూ.3189 కోట్లు మంజూరు చేసాయి.

]]>
Wed, 27 Aug 2025 21:00:33 +0530 admin
నేను ఆ కార్డులను ఉపయోగిస్తే… చైనా నాశనం అవుతుంది: ట్రంప్ https://prajakshethrenews.com/నేను-ఆ-కార్డులను-ఉపయోగిస్తే-చైనా-నాశనం-అవుతుంది-ట్రంప్ https://prajakshethrenews.com/నేను-ఆ-కార్డులను-ఉపయోగిస్తే-చైనా-నాశనం-అవుతుంది-ట్రంప్ నేను ఆ కార్డులను ఉపయోగిస్తే… చైనా నాశనం అవుతుంది: ట్రంప్
ప్రజా క్షేత్ర్, న్యూయార్క్ఆగస్టు 26
 ఈ సంవత్సరం చివరలో తాను చైనా పర్యటనకు వెళ్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. చైనా, అమెరికా మధ్య అద్భుతమైన సంబంధాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. బీజింగ్‌తో తాము సంబంధాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని, కానీ చైనా కంటే తమ ఆధిపత్యమే ఎక్కువ అని హెచ్చరించారు. వాణిజ్య విభేదాల్లో బీజింగ్ కంటే వాషింగ్టన్ బలంగా ఉందని తెలియజేశారు. చైనా వద్ద కొన్ని కార్డులు ఉన్నాయని, వాళ్ల కంటే తమ వద్ద అద్భుతమైన కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ కార్డులతో తాము ఆట ఆడుకోవాలని లేదని, తాము ఒకవేళ ఆడితే చైనా నాశనం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటోమొబైల్, రక్షణ రంగానికి కావాల్సిన మ్యాగ్నెట్స్‌ను చైనా తమకు దిగుమతి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. చైనా వాళ్లు మ్యాగ్నెట్స్‌ను దిగుమతి చేయకుంటే టారిఫ్‌లను 200 శాతం పెంచుతామని ట్రంప్ వివరించారు. అందుకే ఆ కార్డులతో ఆడటం లేదని చెప్పారు.అమెరికా టెక్ కంపెనీలపై పలు దేశాలు విధిస్తున్న డిజిటల్ పన్నులపై ట్రంప్ మండిపడ్డారు. మా టెక్ కంపెనీలపై పన్నుల రూపంలో జరుగుతున్న దాడులకు ఎదురునిలబడుతానని చెప్పారు. డిజిటల్ పన్నులు, డిజిటల్ సర్వీసెస్ చట్టాలు, డిజిటల్ మార్కెట్ రెగ్యులెషన్స్ లాంటి అమెరికా టెక్నాలజీకి హాని కలిగిస్తున్నాయని, చైనా కంపెనీలపై ఎలాంటి పన్నులు వేయడంలేదని మండిపడ్డారు. ఇవన్నీ ఆగాలంటే ఆయా దేశాలపై అదనపు టారిఫ్‌లు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. మా టెక్ కంపెనీలను గౌరవించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.

]]>
Wed, 27 Aug 2025 20:52:42 +0530 admin
నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు https://prajakshethrenews.com/నల్గొండ-జిల్లా-కోర్టు-సంచలన-తీర్పు https://prajakshethrenews.com/నల్గొండ-జిల్లా-కోర్టు-సంచలన-తీర్పు నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు
పోక్సో కేసులో దోషికి 51 ఏళ్ల జైలు శిక్ష.!

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 

పోక్సో కేసులో నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషికి 51 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. అంతేకాదు 85 వేలు జరిమానా విధిస్తూ బాధితురాలికి 7 లక్షల పరిహారం అందించాలని నల్గొండ జిల్లా కోర్టు ఆదేశించింది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలానికి చెందిన బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు ఖయ్యూంకి ఈ కఠిన కారాగార శిక్షను కోర్టు విధించింది. క్రైమ్ నం.242/2021, తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సీ, నం.94/2022)లో,తిప్పర్తి గ్రామం, మండలానికి చెందిన నిందితుడు ఖయ్యూంను ఎస్సీ ఎస్టీ కోర్ట్ జడ్జి రోజా రమణి దోషిగా తేల్చారు. అత్యాచారానికి 20 సంవత్సరాల కారాగార శిక్ష, ఫోక్సో  చట్టం కింద మరో 20 సంవత్సరాల కారాగార శిక్ష, ఎస్సీ, ఎస్టి సంబంధిత సెక్షన్, చట్టం కింద 10 సంవత్సరాల కారాగార శిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.వీటితో పాటు.. ఐపీసీ సెక్షన్ 506 కింద ఒక సంవత్సరం కారాగార శిక్షను కూడా విధించారు. 

]]>
Wed, 27 Aug 2025 20:48:45 +0530 admin
మిరాయ్' ట్రైలర్ ఆగస్టు 28న రిలీజ్...సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ https://prajakshethrenews.com/మిరాయ్-ట్రైలర్-ఆగస్టు-28న-రిలీజ్సినిమా-సెప్టెంబర్-12న-రిలీజ్ https://prajakshethrenews.com/మిరాయ్-ట్రైలర్-ఆగస్టు-28న-రిలీజ్సినిమా-సెప్టెంబర్-12న-రిలీజ్ సూపర్ హీరో తేజ సజ్జా, మనోజ్ మంచు, కార్తీక్ ఘట్టమనేని, టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పాన్ ఇండియా ఫిల్మ్

'మిరాయ్' ట్రైలర్ ఆగస్టు 28న రిలీజ్

సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్

ప్రజా క్షేత్ర్, సినిమా : 
సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ 'మిరాయ్‌'లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, బిటిఎస్ వీడియో వైబ్ ఉంది. సాంగ్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ట్రైలర్ ఆగస్టు 28న లాంచ్ చేయనున్నారు. హీరో, విలన్ పవర్ ఫుల్ గా కనిపించిన ట్రైలర్ పోస్టర్‌ అదిరిపోయింది. తేజ సూపర్ యోధాగా ఎనర్జీతో మెరుస్తున్న మ్యాజికల్ స్టిక్ తో కనిపించగా, మనోజ్ ఫెరోషియస్ బ్లాక్ స్వోర్డ్ గా, భారీ ఖడ్గాన్ని పట్టుకుని ఎదురు నిలబడ్డాడు. ఈ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాయి.ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీయా శరణ్, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో నిపించనున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే స్క్రీన్‌ప్లేను కార్తీక్ స్వయంగా రూపొందించారు. మణిబాబు కరణం రచన, సంభాషణలకు కీలకంగా పనిచేశారు. గౌర హరి సంగీతం, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సుజిత్ కుమార్ కొల్లి పని చేస్తున్నారు.ట్రైలర్ పోస్టర్ ద్వారా మేకర్స్ సినిమాను సెప్టెంబర్ 12న ఎనిమిది భాషల్లో 2డి, 3 డిఫార్మాట్లలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జ, మనోజ్ మంచు, రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు

]]>
Wed, 27 Aug 2025 20:42:22 +0530 admin
మాస్ జాతర' చిత్రం వాయిదా https://prajakshethrenews.com/మాస్-జాతర-చిత్రం-వాయిదా https://prajakshethrenews.com/మాస్-జాతర-చిత్రం-వాయిదా మాస్ జాతర' చిత్రం వాయిదా

కాస్త ఆలస్యమైనా అసలుసిసలైన మాస్ పండుగను థియేటర్లలో తీసుకొస్తామని నిర్మాతలు హామీ

ప్రజా క్షేత్ర్, సినిమా : 

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మాస్ జతర' చిత్రం ఆగస్టు 27వ తేదీన థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా డింది.టీవల పరిశ్రమ వ్యాప్తంగా జరిగిన సమ్మెలు, కీలకమైన కంటెంట్ పూర్తి చేయడంలో ఊహించని జాప్యం కారణంగా.. సినిమాను అనుకున్న తేదీకి సకాలంలో సిద్ధం చేయలేకపోయామని నిర్మాతలు అధికారికంగా తెలిపారు. కంగారుగా సినిమాని విడుదల చేయడం కంటే.. కాస్త సమయం తీసుకొని అత్యుత్తమ చిత్రంగా మలిచి, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు.మాస్ జతార చిత్రాన్ని అసలైన పండుగ సినిమాగా తీర్చిదిద్దడానికి ప్రతి విభాగం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ, త్వరలోనే ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. అభిమానులు నిరీక్షణకు బహుమానంగా త్వరలో ఆశ్చర్యకర కంటెంట్ రాబోతుందని నిర్మాతలు హామీ ఇచ్చారు.

]]>
Wed, 27 Aug 2025 20:31:14 +0530 admin
రెండు రోజుల పాటు జ‌పాన్‌లో ప‌ర్య‌టించ‌నున్నప్ర‌ధాని మోదీ https://prajakshethrenews.com/రెండు-రోజుల-పాటు-జపాన్లో-పర్యటించనున్నప్రధాని-మోదీ https://prajakshethrenews.com/రెండు-రోజుల-పాటు-జపాన్లో-పర్యటించనున్నప్రధాని-మోదీ రెండు రోజుల పాటు జ‌పాన్‌లో ప‌ర్య‌టించ‌నున్నప్ర‌ధాని మోదీ
ప్రజా క్షేత్ర్,  న్యూఢిల్లీ ఆగష్టు 26 :
రెండు రోజుల పాటు జ‌పాన్‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌టించ‌నున్నారు. విదేశాంగ శాఖ ప్ర‌తినిధి విక్ర‌మ్ మిశ్రీ ఈ విష‌యాన్ని ఇవాళ వెల్ల‌డించారు. ఆగ‌స్టు 29వ తేదీన మోదీ జ‌పాన్ వెళ్ల‌నున్న‌ట్లు ఆ శాఖ పేర్కొన్న‌ది. జ‌పాన్ ప్ర‌ధాని షిగేరు ఇషిబాతో ఆయ‌న మాట్లాడుతారు. 2014లో దేశ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 8 సార్లు జ‌పాన్‌కు వెళ్లారు. రెండు దేశాల మ‌ధ్య బంధాన్ని బలోపేతం చేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. జ‌పాన్ నుంచి ఆయ‌న నేరుగా చైనాకు వెళ్తారు.

]]>
Wed, 27 Aug 2025 20:24:22 +0530 admin
బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి https://prajakshethrenews.com/బహరేన్-జైలు-నుంచి-ఐదుగురిని-విడిపించండి https://prajakshethrenews.com/బహరేన్-జైలు-నుంచి-ఐదుగురిని-విడిపించండి బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి
సీఎం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన నలుగురి తల్లులు, ఒకరి చెల్లెలు

ముగ్గురు నిజామాబాద్, ఒకరు జగిత్యాల, మరొకరు రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు

ప్రజా క్షేత్ర్, జగిత్యాల :

బహరేన్ లో రెండేళ్ళ జైలుశిక్ష విధించబడిన ఐదుగురు తెలంగాణ కార్మికుల కుటుంబ సభ్యులలో నలుగురి తల్లులు, ఒకరి చెల్లెలు సహాయం కోసం మంగళవారం హైదరాబాద్ లోని 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' ని ఆశ్రయించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సూచన మేరకు వారు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట అందరు కల్సి ఒక ఉమ్మడి వినతిపత్రం ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లు గల్ఫ్ కుటుంబాలను సీఎం ప్రజావాణి నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ వద్దకు తీసికెళ్లి సమస్య తీవ్రతను వివరించారు. వారి గోడు విన్న వెంటనే ఆమె సీఎంఓ లో కీలక అధికారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ వి. శేషాద్రి దృష్టికి ఈ సమస్యను తీసికెళ్లారు. గల్ఫ్ కుటుంబాల వెంట బొజ్జ అమరేందర్ రెడ్డి, బషీర్ అహ్మద్, మోత్కూరి నవీన్ గౌడ్, కొండ శ్రీనివాస్ తదితరులున్నారు.
గడువు తీరిన ఆహార ఉత్పత్తుల తేదీలను ఫోర్జరీ చేసి మార్చడం, నిల్వ, మార్కెటింగ్, అమ్మకం  చేసిన ఆహార భద్రతా కేసులో... ముగ్గురికి మూడేళ్లు, 19 మందికి రెండేళ్ల జైలుశిక్ష విధించిన  సంఘటన ఇటీవల బహరేన్ లో జరిగింది. వీరిలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నకిడి లింబాద్రి (డిచుపల్లి), కర్రోల్ల లక్ష్మినర్సింహ (మల్లారం), తిమ్మజడ సంతోష్ (తిర్మన్ పల్లి), జగిత్యాల జిల్లాకు చెందిన గోవింద్ రాకేష్ (రత్నాపూర్), రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బంటు బాబు (కొండాపూర్) అనే ఐదుగురు యువకులు ఉన్నారు. గోదాములో ఆహార ఉత్పత్తులపై లేబుళ్లు తొలగించి, కొత్త తేదీలతో స్టిక్కర్లు అతికించడానికి కంపెనీ యాజమాన్యం కార్మికులను ఉపయోగించి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టివేసిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం చెప్పినట్లు డ్యూటీ చేయడం, చేసేపని మంచో... చెడో అవగాహన లేకపోవడం ప్రవాసీ కార్మికుల పాలిట శాపమైందని వారు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని బహరేన్ లోని ఇండియన్ ఎంబసీ ద్వారా జైల్లో ఉన్న కార్మికులకు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) అందించాలని కోరారు. బహరేన్ లోని తెలంగాణ సామాజిక సేవకులు కోటగిరి నవీన్ ఇండియన్ ఎంబసీ ద్వారా సహాయం చేయడానికి ముందుకు వచ్చారని వారు తెలిపారు.
యజమాని ఒత్తిడి వలన అమాయకులైన కార్మికులు విధులు నిర్వర్తించిన విషయాన్ని గమనించాలని, ప్రత్యేక కేసుగా పరిగణించి వారికి 'క్షమాబిక్ష' లభించేలా చూడాలని బాధితుల కుటుంబ సభ్యులు నకిడి గంగామణి (డిచుపల్లి), కర్రోల్ల సరస్వతి (మల్లారం), తిమ్మజడ నర్సవ్వ (తిర్మన్ పల్లి), గోవింద్ విజయ (రత్నాపూర్), బట్టు
117 స్నేహ (కొండాపూర్) లు కోరుతున్నారు.

]]>
Wed, 27 Aug 2025 20:19:07 +0530 admin
ప్రముఖ సినీ హీరోల చేతుల మీదుగా విజయ్ మిల్టన్ – రాజ్ తరుణ్ చిత్రం టైటిల్ లాంచ్ https://prajakshethrenews.com/ప్రముఖ-సినీ-హీరోల-చేతుల-మీదుగా-విజయ్-మిల్టన్-రాజ్-తరుణ్-చిత్రం-టైటిల్-లాంచ్ https://prajakshethrenews.com/ప్రముఖ-సినీ-హీరోల-చేతుల-మీదుగా-విజయ్-మిల్టన్-రాజ్-తరుణ్-చిత్రం-టైటిల్-లాంచ్ ప్రముఖ సినీ హీరోల చేతుల మీదుగా విజయ్ మిల్టన్ – రాజ్ తరుణ్ చిత్రం టైటిల్ లాంచ్

ప్రజా క్షేత్ర్, సినిమా : 

రాజ్ తరుణ్ – విజయ్ మిల్టన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా టైటిల్ రేపు విడుదల కానుంది . తమిళ సినీ తారలు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోని, ఆర్యతో పాటు తెలుగు యంగ్ హీరో మాస్ క దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా ఈ చిత్రం టైటిల్ విడుదల కానుంది. ఈ టైటిల్ లాంచ్ వినాయక చవితి సందర్భంగా రేపు ఉదయం 11:11 గంటలకు జరగనుంది.
విజయ్ మిల్టన్ దర్శకత్వంలో, రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి అభిరామి కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ప్రొడక్షన్ నెం. 5గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది.
ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా టైటిల్ అనౌన్స్‌మెంట్‌పై కూడా ప్రేక్షకులు, సినీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

]]>
Wed, 27 Aug 2025 20:15:18 +0530 admin
"ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి 'ఏం జరుగుతోంది...' లిరికల్ సాంగ్ రిలీజ్ https://prajakshethrenews.com/ది-గర్ల్-ఫ్రెండ్-సినిమా-నుంచి-ఏం-జరుగుతోంది-లిరికల్-సాంగ్-రిలీజ్ https://prajakshethrenews.com/ది-గర్ల్-ఫ్రెండ్-సినిమా-నుంచి-ఏం-జరుగుతోంది-లిరికల్-సాంగ్-రిలీజ్ నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి  జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్".

ప్రజా క్షేత్ర్, సినిమా : 
 ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ఈ రోజు "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి 'ఏం జరుగుతోంది...' లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా, చిన్మయి పాడారు. హేషమ్ అబ్దుల్ వాహాబ్ ఛాట్ బస్టర్ ట్యూన్ అందించారు. 'ఏం జరుగుతోంది...' పాట ఎలా ఉందో చూస్తే - ' కలకలమను కలగలిపిన కథ మొదలా, కలవరమున తెగనలిగిన నిజము కలా, ఏం చేయను తడబడిన తప్పటడుగా, మతిచెడెనా ఏమో,  సతమతమౌ తలపేదో,  నిలదీసి నన్నెడుగెనుగా, ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది, మనసా తెలుసా, మనసా తెలుసా, ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది...' అంటూ హార్ట్ టచింగ్ లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.
నటీనటుskshetలు - రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, తదితరులు

]]>
Wed, 27 Aug 2025 20:11:07 +0530 admin
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు https://prajakshethrenews.com/వైష్ణోదేవి-ఆలయానికి-వెళ్లే-మార్గంలో-విరిగిపడ్డ-కొండచరియలు https://prajakshethrenews.com/వైష్ణోదేవి-ఆలయానికి-వెళ్లే-మార్గంలో-విరిగిపడ్డ-కొండచరియలు వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు
   ఈ ప్రమాదంలో ఐదుగు మృతి .. 14 మంది తీవ్రంగా గాయాలు
ప్రజా క్షేత్ర్, శ్రీనగర్ ఆగష్టు 26 :
: జమ్ముకశ్మీర్ రాష్ట్రంపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్రంగా కష్టాలు పడుతున్నారు. మంగళవారం కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్కూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. ఘటనస్థలిలో అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

]]>
Wed, 27 Aug 2025 20:04:53 +0530 admin
హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ ప్రాంతం మాత్రమేనా!.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి https://prajakshethrenews.com/హైదరాబాద్-అంటే-కేవలం-హైటెక్-సిటీ-ప్రాంతం-మాత్రమేనా-కేంద్రమంత్రి-కిషన్-రెడ్డి https://prajakshethrenews.com/హైదరాబాద్-అంటే-కేవలం-హైటెక్-సిటీ-ప్రాంతం-మాత్రమేనా-కేంద్రమంత్రి-కిషన్-రెడ్డి హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ ప్రాంతం మాత్రమేనా!..
 కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్ ఆగష్టు 22 : 
 హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ ప్రాంతం మాత్రమేనా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  ప్రశ్నించారు.శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ    బిఆర్ఎస్, కాంగ్రెస్ పాలన వల్ల హైదరాబాద్ పరిస్థితి అస్తవ్యస్థంగా మారిందని కిషన్ రెడ్డి   తెలిపారు. హైదరాబాద్ లో రాత్రివేళ వీధి దీపాలు ఉండడం లేదని అన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ ప్రాంతం మాత్రమే కాదని, స్థిరాస్తి వ్యాపారం బాగా ఉన్న ప్రాంతాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించారని తెలియజేశారు. డ్రైనేజీల్లో పూడికలు తీయడం లేదని, మంచినీటి పైపులైన్లు వేయడం లేదని మండిపడ్డారు.హైదరాబాద్ ను విశ్వనగరం   చేస్తామని మాజీ సిఎం కెసిఆర్ అన్నారని, అంతకంటే ఎక్కువ అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారని చెప్పారు. జిహెచ్ఎంసికి నిధుల కొరత లేకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని, జిహెచ్ఎంసి పనులు చేసిన కాంట్రక్టర్లకు బిల్లులు చెల్లించటం లేదని విమర్శించారు. జిహెచ్ఎంసి పనులకు టెండర్లు వేసేందుకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.

]]>
Sat, 23 Aug 2025 00:00:53 +0530 admin
సహస్ర హత్య కేసులో బాలుడే హంతకుడు https://prajakshethrenews.com/సహస్ర-హత్య-కేసులో-బాలుడే-హంతకుడు https://prajakshethrenews.com/సహస్ర-హత్య-కేసులో-బాలుడే-హంతకుడు సహస్ర హత్య కేసులో బాలుడే హంతకుడు

దొంగతనానికి వచ్చి... ఎక్కడ చెబుతుందోనని హత్య చేసిన బాలుడు

15 నిమిషాల పాటు బాలుడు ఆ ఇంటినే చూస్తున్నట్లు సిసి కెమెరాలో నిక్షిప్తం

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 

సంచలనం సృష్టించిన పన్నెండేళ్ల చిన్నారి సహస్ర హత్య కేసులో మిస్టరీ వీడింది. బాలిక ఉంటున్న అపార్ట్ మెంట్ పొరుగునే ఉంటున్న 10వ తరగతి విద్యార్థి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది. దొంగతనానికి వెళ్లిన బాలుడు ఊహించని విధంగా  సహస్​ర ఇంట్లో ఉండటం...తనను చూడటంతో అందరికీ విషయం చెప్పేస్తుందని ఆమెను కిరాతకంగా హతమార్చినట్టుగా వెల్లడైంది. క్రికెట్ బ్యాట్ కొనటానికే డబ్బు దొంగిలించటానికే వచ్చినట్టుగా తెలుస్తోంది.  ప్రస్తుతం బాలున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు. కూకట్​ పల్లి సంగీత్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ పెంట్ హౌస్​ లో నివాసముంటున్న సహస్ర అయిదు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. స్కూల్ కు వెళ్లిన కొడుక్కి లంచ్​ బాక్స్ ఇద్దామని చిన్నారి తండ్రి కృష్ణ ఇంటికి వచ్చినపుడు ఈ ఘాతుకం వెలుగు చూసింది. కత్తితో గొంతు, కడుపులో ఇరవై సార్లకు పైగా పొడవటంతో రక్తం మడుగులో చనిపోయిన సహస్ర మృతదేహం కనిపించింది. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా అందరిలో తీవ్ర కలవరాన్ని సృష్టించింది. ఈ క్రమంలో పోలీసులు కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు. నిందితున్ని పట్టుకునేందుకు బాలానగర్ జోన్​ డీసీపీ సురేశ్​ కుమార్ అయిదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ బృందాలు పదుల సంఖ్యలో అనుమానితులను విచారించాయి. సహస్ర కుటుంబం ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే అద్దెకు ఉంటున్న ఒడిషాకు చెందిన వ్యక్తితోపాటు దాదాపు నలభై మందిని ప్రశ్నించాయి. అయితే, కేసులో మిస్టరీ మాత్రం వీడలేదు. *సహస్ర కుటుంబం అద్దెకుంటున్న అపార్ట్ మెంట్ లో సీసీ కెమెరాలు లేవు. అయితే, దాని ఎదురుగా ఉన్న ఓ ఇంటి వద్ద సీసీ కెమెరాలు పని చేస్తున్నాయి. వాటి ఫుటేజీని విశ్లేషించినపుడు సహస్ర కుటుంబం ఉంటున్న అపార్ట్ మెంట్ లోకి ఎవరు వెళుతున్నట్టుగానీ...బయటకు వస్తున్నట్టుగానీ కనిపించ లేదు. ఇక, అపార్ట్ మెంట్​ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినపుడు కూడా హత్య జరిగిన సమయంలో అటుగా అనుమానాస్పదంగా ఎవరు వచ్చినట్టుగానీ...వెళ్లినట్టుగానీ అగుపించ లేదు. అయితే, సహస్ర ఉంటున్న అపార్ట్ మెంట్ గేటు వద్ద ఓ యువకుడు బయటకు తొంగి చూస్తున్న దృశ్యాలు మాత్రం రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరుగుపొరుగున ఉంటున్న వారిలోనే ఎవరో ఒకరు టెర్రస్​ పైనుంచి వచ్చి ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానించిన పోలీసులు ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని క్షుణ్నంగా విచారించటం మొదలు పెట్టారు. 

దొంగతనానికి వచ్చి...నేనే చంపేశా...

ఈ క్రమంలోనే సహస్ర కుటుంబం ఉంటున్న అపార్ట్ మెంట్ పక్క బిల్డింగ్ లోని 10వ తరగతి విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మొదట తనకేమీ తెలియదని బాలుడు నమ్మించటానికి ప్రయత్నించినా పోలీసులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిర చేయటంతో తానే సహస్రను చంపినట్టుగా అంగీకరించాడు. నిజానికి తాను దొంగతనం చేయటానికి వెళ్లినట్టుగా చెప్పాడు. సహస్ర తనను చూడటంతో అందరికీ చెబుతుందన్న భయంతోనే  ఈ నేరానికి పాల్పడినట్టుగా వెల్లడించాడు. ఈ క్రమంలో పోలీసులు అతని నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితోపాటు రక్తం మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు దొంగతనం ఎలా చేయాలి? అన్నదానికి సంబంధించి ఆ బాలుడు రాసుకున్న కాగితాన్ని కూడా సీజ్ చేశారు. 

మిషన్ don? 

హత్యకు గురైన సహస్ర కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. ఆమె తమ్ముడు మరో ప్రైవేట్ స్కూల్ విద్యార్థి. తల్లి రేణుక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తుండగా తండ్రి కృష్ణ బైక్ మెకానిక్​ గా పని చేస్తున్నాడు. ప్రతీరోజు ఉదయం పిల్లలు స్కూళ్లకు వెళ్లగానే ఇంటికి తాళం వేసి రేణుక, కృష్ణలు తమ తమ పనులపై వెళ్లిపోయేవారు. పొరుగింట్లోనే ఉంటున్న బాలునికి ఈ విషయం బాగా తెలుసు. ఈ క్రమంలో కృష్ణ ఇంట్లో చోరీకి పథకం వేసుకున్నాడు. యూ ట్యూబ్​ వీడియోలు చూసి తాళాన్ని ఎలా విరగ్గొట్టాలో తెలుసుకున్నాడు. గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆ వివరాలను మిషన్ థెఫ్ట్ అంటూ పేపర్ పై రాసుకోవటం. హౌ టు ఎంట్రీ...హౌ టు బ్రేక్ హుండీ...హౌ టు ఎస్కేప్ అని రాసి చివరకు మిషన్ డన్​ అని కూడా ఆ కాగితంపై రాశాడు. రూపొందించుకున్న పథకం ప్రకారం ఓ కత్తి, స్క్రూడ్రైవర్ వెంట తీసుకుని టెర్రస్ పైనుంచి సహస్ర కుటుంబం ఉంటున్న పెంట్ హౌస్ వద్దకు చేరుకున్నాడు. ఆ రోజు స్కూల్​ కు సెలవు కావటంతో సహస్ర ఒంటరిగా ఇంట్లో ఉంది. చోరీ చేయటానికి లోపలికి వచ్చిన బాలున్ని చూసింది. దాంతో తన గురించి అందరికీ చెబుతుందని భయపడ్డ బాలుడు ఆమెపై దాడి చేశాడు. మొదట గొంతు నులిమి ఆ తరువాత కత్తితో గొంతుపై, కడుపులో విచక్షణారహితంగా పొడిచాడు. సహస్ర చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత దేవుని ఫోటోల వద్ద ఉన్న హుండీని పగులగొట్టి దొరికిన డబ్బు తస్కరించి టెర్రస్ పైనుంచే ఉడాయించాడు. ఆ రోజు సెలవు లేకుండా ఉంటే సహస్ర స్కూల్​ కు వెళ్లేదని...ప్రాణాలతో బతికేదని స్థానికులు ఆవేదనతో వ్యాఖ్​యానించారు. చూస్తుంటే మృత్యువు ఆ చిన్నారిని వెంటాడినట్టుగా అనిపిస్తోందన్నారు. ఇక, పోలీసులు బాలుని నుంచి దొంగతనం ఎలా చేయాలని రాసుకున్న లెటర్, రక్తం మరకలు ఉన్న దుస్తులు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు. కేసులో మిస్టరీ వీడినట్టే అని చెప్పిన అధికారులు అన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

]]>
Fri, 22 Aug 2025 23:56:15 +0530 admin
తెలంగాణలో మరో రెండు విమానాశ్రయాలు https://prajakshethrenews.com/తెలంగాణలో-మరో-రెండు-విమానాశ్రయాలు https://prajakshethrenews.com/తెలంగాణలో-మరో-రెండు-విమానాశ్రయాలు తెలంగాణలో మరో రెండు విమానాశ్రయాలు

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ 

తెలంగాణలో విమానయాన రంగం కొత్త ఊపు అందుకోబోతోంది. వరంగల్, ఆదిలాబాద్‌లలో నిలిచిపోయిన విమానాశ్రయ ప్రణాళికలు ఇప్పుడు మళ్లీ కదలికలు మొదలుపెట్టాయి. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ,ఈ రెండు నగరాల్లో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను వచ్చే రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ కోసం అవసరమైన భూసేకరణ దాదాపు పూర్తయింది. 253 ఎకరాల భూమికి రూ.205 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు పట్ల తన కట్టుబాటును స్పష్టంగా చూపించింది. మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి మొదట చిన్న విమానాలకే పరిమితం చేయాలనుకున్నారు. కానీ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు ఏఏఐ పెద్ద విమానాలు, కార్గో ఫ్లైట్లకూ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. అంటే ఏ320, బోయింగ్ 737 లాంటి వాణిజ్య విమానాల రాకపోకలకు కూడా ఈ ఎయిర్‌పోర్ట్ సిద్ధమవుతుందన్నమాట.
ఈ ఏడాది చివర్లోనే పనులు ప్రారంభించేలా సన్నాహాలు జరుగుతున్నాయి. వరంగల్ అభివృద్ధికి ఇది కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. ఇక ఆదిలాబాద్‌లో ఇప్పటికే 362 ఎకరాల వాయుసేన స్థలం ఉంది. దానిని వినియోగించుకుంటూ మిగతా భూసేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఏఏఐ వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ ఎయిర్‌పోర్టును కూడా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణ ప్రభుత్వం 2027 జూన్ నాటికే పనులు పూర్తయ్యేలా కసరత్తు చేస్తుండగా, కేంద్రం డిసెంబర్ వరకు గడువు పెట్టినట్లు సమాచారం. రెండు ప్రాజెక్టులు పూర్తైతే తెలంగాణలో వాయు ప్రయాణం మరింత విస్తరించనుంది. వరంగల్ విమానాశ్రయానికి ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యం ఉంది. నిజాం కాలంలోనే ఇక్కడి నుంచి విమానాలు ఎగిరాయి. భారత్ చైనా యుద్ధ సమయంలో కీలకమైన సేవలు అందించాయి. కానీ గత మూడు దశాబ్దాలుగా ఈ ఎయిర్‌పోర్ట్ మూతపడే ఉంది. ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించాలనే ప్రయత్నం విజయవంతమైతే, వరంగల్ వాసుల కల నిజమవుతుంది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌కి ఈ ప్రాజెక్టు కొత్త ఊపును తీసుకురానుంది. ఈ రెండు విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తే, తెలంగాణలో పర్యాటకానికి, వాణిజ్యానికి, పరిశ్రమలకు పెరుగుదల ఖాయం. ప్రత్యేకంగా వరంగల్‌లో ఐటీ, ఎడ్యుకేషన్, హ్యాండ్లూమ్ రంగాల అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది. ఆదిలాబాద్‌లో ఖనిజ, అటవీ సంపద ఆధారిత వ్యాపారాలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మొత్తానికి ఈ రెండు ప్రాజెక్టులు తెలంగాణ రవాణా రంగానికే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త రెక్కలు ఇస్తాయని చెప్పొచ్చు.

]]>
Thu, 21 Aug 2025 12:30:27 +0530 admin
వినాయక చవితి కి కళాత్మక విగ్రహాలు సిద్ధం https://prajakshethrenews.com/వినాయక-చవితి-కి-కళాత్మక-విగ్రహాలు-సిద్ధం https://prajakshethrenews.com/వినాయక-చవితి-కి-కళాత్మక-విగ్రహాలు-సిద్ధం వినాయక చవితి కి కళాత్మక విగ్రహాలు సిద్ధం

 ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

శ్రీకాళహస్తి లో  వినాయక చవితి సందర్భంగా కళాకారుల కుంచె నుండి చక్కటి రంగులను సింగారించుకున్న కళాత్మక వినాయకుని విగ్రహాలు వినాయక చవితి  పండుగకు సిద్ధం అవుతున్నాయి. ఏడాదికి ఒకసారి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో సిద్ధం చేసే విగ్రహాలకు ఎనలేని గిరాకీ ఉన్నది. మట్టి విగ్రహాలు కన్నా  ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో  సిద్ధం చేసిన రంగు రంగుల వినాయక విగ్రహాలు అంటే  శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు,అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఇష్టం. వినాయక చవితి అంటేనే వీధి వీధినా అందమైన ప్రధమ గణాధిపతి వినాయక విగ్రహాలను ప్రతిష్టించడానికి పేద, ధనిక భేదము లేకుండా పోటీ పడుతుంటారు. వినాయక చవితి పండుగకు రకరకాల సైజుల్లో వినాయక ప్రతిమలకు రంగులు అలంకరించి వినాయక విగ్రహాలను విక్రయించటం చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది. శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీ  జాతీయ రహదారి ప్రక్కన వినాయక విగ్రహాలు అందరిని ఆకట్టుకునేలా  రాజస్థాన్ చెందిన కూలీలు సిద్ధం చేస్తున్నారు

]]>
Thu, 21 Aug 2025 12:26:06 +0530 admin
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుకు ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్ విడుదల https://prajakshethrenews.com/రాష్ట్రవ్యాప్తంగా-మద్యం-దుకాణాల-టెండర్ల-దరఖాస్తుకు-ఆబ్కారీ-శాఖ-నోటిఫికేషన్-విడుదల https://prajakshethrenews.com/రాష్ట్రవ్యాప్తంగా-మద్యం-దుకాణాల-టెండర్ల-దరఖాస్తుకు-ఆబ్కారీ-శాఖ-నోటిఫికేషన్-విడుదల రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుకు ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్ విడుదల
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ ;

తెలంగాణలో మద్యం దుకాణాల ఆశావాహులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుకు ఆబ్కారీ శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే, దరఖాస్తుల ఫీజు కూడా భారీగా పెంచేసింది. దరఖాస్తు పీజు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచినట్లు పేర్కొంది. వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2025 డిసెంబర్ నుంచి 27 నవంబర్ వరకు)కి కి సంబంధించి లాటరీ పద్దతి ద్వారా మద్యం దుకాణాల లైసెన్సులను ఎంపిక చేయనుంది. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించనుంది. మద్యం దుకాణాలకు 6 శ్లాబ్‌లలో ఎక్సైజ్‌శాఖ లైసెన్స్‌లు జారీ చేయనుంది.

]]>
Thu, 21 Aug 2025 12:23:24 +0530 admin
కృష్ణమ్మ పరవళ్లతో కళకళలాడుతున్న నాగార్జన సాగర్‌ https://prajakshethrenews.com/కృష్ణమ్మ-పరవళ్లతో-కళకళలాడుతున్న-నాగార్జన-సాగర్ https://prajakshethrenews.com/కృష్ణమ్మ-పరవళ్లతో-కళకళలాడుతున్న-నాగార్జన-సాగర్ కృష్ణమ్మ పరవళ్లతో కళకళలాడుతున్న నాగార్జన సాగర్‌    

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ : 

రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా భారీ వర్షాల కారణంగా ఓవైపు ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నా.. మరోవైపు జలాశయాలు మాత్రం జలకళను సంతరించుకుంటున్నాయి. నాగార్జన సాగర్‌   కూడా నీటితో నిండిపోయింది. శ్రీశైలం జలాశయం నుంచి వచ్చిన నీటి ప్రవాహంతో నాగార్జున సాగర్‌కు భారీగా నీరు వచ్చి చేసింది. దీంతో సాగర్ కృష్ణమ్మ పరవళ్లతో కళకళలాడుతుంది. ఈ సీజన్‌లో సాగర్‌‌కు 4.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడం ఇదే తొలిసారి. దీంతో అధికారులు మొత్తం 26 గేట్లను దాదాపు 10 అడుగుల పైకి ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇలా జరిగడం కూడా సాగర్ చరిత్రలో తొలిసారి కావడం విశేషం.గడిచిన మూడు రోజుల నుంచి వరద ప్రమాదం పెరుగుతుండటంతో నాగార్జున సాగర్   నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతుంది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ఇప్పటికే 584.80 అడుగులుగా నమోదైంది. నీటి నిల్వ సామర్థ్యం 312,0450 టిఎంసిలు కాగా.. ప్రస్తుతం 274,8580 టిఎంసిలుగా ఉంది.

]]>
Thu, 21 Aug 2025 12:20:32 +0530 admin
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పై దాడి https://prajakshethrenews.com/ఢిల్లీ-సీఎం-రేఖా-గుప్తా-పై-దాడి https://prajakshethrenews.com/ఢిల్లీ-సీఎం-రేఖా-గుప్తా-పై-దాడి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పై దాడి

గ‌ట్టిగా రెండు సార్లు ఆమె చెంప‌పై కొట్టి జుట్టు ప‌ట్టుకుని మ‌రీ బాదిన వైనం  

ప్రజా క్షేత్ర్న్యూ, ఢిల్లీ ఆగస్టు 20 : 
: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పై బుదవారం దాడి జ‌రిగింది. సీఎం నివాసంలో జ‌న్ సున్వాయి కార్య‌క్రమం నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఆ అటాక్ జ‌రిగింది. త‌న‌ స‌మ‌స్య‌ను చెప్పుకునేందుకు వ‌చ్చిన ఓ వ్య‌క్తి సీఎం రేఖా గుప్తాపై అకస్మాత్తుగా దాడి చేశాడు. ఆ వ్య‌క్తి 30 ఏళ్ల ఉంటాడ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. సీఎంపై దాడి చేసిన వ్య‌క్తిని.. అక్క‌డ ఉన్న సీఎం సిబ్బంది త‌క్ష‌ణ‌మే అదుపులోకి తీసుకున్నారు. ప‌బ్లిక్ మీటింగ్‌లో స‌మ‌స్య చెప్పుకునేందుకు వ‌చ్చిన వ్య‌క్తి ఎందుకు దాడికి పాల్ప‌డ్డార‌న్న కోణంలో విచార‌ణ నిర్వ‌హిస్తున్నారు. గ‌ట్టిగా రెండు సార్లు ఆమె చెంప‌పై కొట్టిన‌ట్లు తెలుస్తోంది. జుట్టు ప‌ట్టుకుని మ‌రీ బాదిన‌ట్లు చెబుతున్నారు. జుట్టు ప‌ట్టి పీక‌డంతో.. త‌ల‌కు గాయాలైన‌ట్లు తెలుస్తోంది

]]>
Wed, 20 Aug 2025 21:11:14 +0530 admin
ఎన్డిఎ అభ్యర్థికి సపోర్ట్ చేయండి.. ప్రతిపక్షలకు ప్రధాని విజ్ఞప్తి https://prajakshethrenews.com/ఎన్డిఎ-అభ్యర్థికి-సపోర్ట్-చేయండి-ప్రతిపక్షలకు-ప్రధాని-విజ్ఞప్తి https://prajakshethrenews.com/ఎన్డిఎ-అభ్యర్థికి-సపోర్ట్-చేయండి-ప్రతిపక్షలకు-ప్రధాని-విజ్ఞప్తి ఎన్డిఎ అభ్యర్థికి సపోర్ట్ చేయండి.. ప్రతిపక్షలకు ప్రధాని విజ్ఞప్తి
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ :
ఉపరాష్ట్రపతి పవికి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశాక.. ఆ పదవిలో ఎవరు భర్తీ చేస్తారన విషయంలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఎన్డిఎ.. మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేస్తున్న సిపి రాధాకృష్ణన్‌ను తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే తాజాగా ప్రధాని మోదీ, రాధాకృష్ణను ఉప రాష్ట్రపతిగా చేసేందుకు ప్రతిపక్షాలు మద్ధతు ఇవ్వాలని కోరారు. ఎన్నిక లేకుండా ఉప రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు అన్ని ప్రతిపక్షపార్టీలు సహకరించాలని మోదీ కోరికనట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో ఎన్డిఎ ఎంపిల సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్‌ను మోదీ ఎంపిలకు పరిచయం చేశారు. ఆనంతరం ఆయనను ప్రధాని, కేంద్ర మంత్రలు సన్మానించారు.

]]>
Wed, 20 Aug 2025 15:49:33 +0530 admin
యాదగిరిగుట్ట కు మూడు ఐ ఎస్ ఓ.. గుడ్ గవర్నన్స్ సర్టిఫికెట్స్ https://prajakshethrenews.com/యాదగిరిగుట్ట-కు-మూడు-ఐ-ఎస్-ఓ-గుడ్-గవర్నన్స్-సర్టిఫికెట్స్ https://prajakshethrenews.com/యాదగిరిగుట్ట-కు-మూడు-ఐ-ఎస్-ఓ-గుడ్-గవర్నన్స్-సర్టిఫికెట్స్ *యాదగిరిగుట్ట కు మూడు ఐ ఎస్ ఓ.. గుడ్ గవర్నన్స్ సర్టిఫికెట్స్*

*దేశంలోనే ఎనర్జీ ఆడిట్ ను నిర్వహించిన తొలి ఆలయంగా యాదగిరిగుట్ట*
*డిప్యూటీ సి.ఎం చే అందుకున్న ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, గుట్ట ఈ.ఓ వెంకట్ రావు*.
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్  ::
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ ఆలయానికి నాలుగు  ISO 9001 , ISO 22000 లతో కలిపి నాలుగు  సర్టిఫికేషన్ పురస్కారాలు యాదగిరి గుట్ట లయానికి లభించాయి. దేశంలోనే ఎనర్జి ఆడిట్ నిర్వహించిన మొట్ట మొదటి ఆలయంగా, స్వామివారి అన్న,  ప్రసాదాల విషయంలో అత్యంత ఉన్నత ప్రమాణాలు, గుట్ట సందర్శనకు వచ్చే యాత్రికులకు మెరుగైన , సంతృప్తికర సౌకర్యాలు కల్పించడం, భక్తులకు సంతృప్తికరమైన దైవ దర్శనం కల్పించడం, తదితర అంశాలకు ఈ నాలుగు అవార్డులు లభించాయి.  గత రెండు నెలలుగా విజయవంతంగా ఐఎస్ఓ ఇన్స్పెక్షన్ సర్టిఫికేషన్, ఆడిట్ ను  HYM ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఆధ్వర్యంలో గుట్టలో నిర్వహించారు.. కాగా ఈ ISO సర్టిఫికెట్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దనసరి అనసూయ, సి.ఎస్ రామకృష్ణా రావు ల సమక్షంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, ఎండోమెంట్ కమీషనర్, యాదగిరిగుట్ట కార్యనిర్వహణాధికారి వెంకట్ రావు లకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎస్.ఓ సర్టిఫికేషన్ బాధ్యులు ఆలపాటి శివయ్య, తదితరులు పాల్గొన్నారు.

]]>
Wed, 20 Aug 2025 15:30:08 +0530 admin
కాంతార చాప్టర్ 1 నుంచి కులశేఖరగా గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్ రిలీజ్ https://prajakshethrenews.com/కాంతార-చాప్టర్-1-నుంచి-కులశేఖరగా-గుల్షన్-దేవయ్య-ఫస్ట్-లుక్-రిలీజ్ https://prajakshethrenews.com/కాంతార-చాప్టర్-1-నుంచి-కులశేఖరగా-గుల్షన్-దేవయ్య-ఫస్ట్-లుక్-రిలీజ్ కాంతార చాప్టర్ 1 నుంచి కులశేఖరగా గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్ రిలీజ్

హోంబాలే ఫిల్మ్స్, రిషబ్ శెట్టి బిగ్గెస్ట్ పాన్-ఇండియా మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి కులశేఖరగా గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రజా క్షేత్ర్, సినిమా : 

మోస్ట్ ఎవైటెడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కాంతార చాప్టర్ 1 నిర్మాతలు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. రిషబ్ శెట్టి బాక్‌బస్టర్ కాంతారకు ప్రతిష్టాత్మక ప్రీక్వెల్‌లో కులశేఖర పాత్రలో నటిస్తున్నాడు గుల్షన్ దేవయ్య. ఈ అనౌన్స్ మెంట్ ఫ్రాంచైజీ అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించి తానే మళ్లీ సెంట్రల్ క్యారెక్టర్‌గా నటిస్తున్న "కాంతార చాప్టర్ 1" మొదటి పార్ట్‌లో ఉన్న యూనివర్స్‌ని ఇంకా విస్తరించబోతోంది. తొలి సినిమా రా, ఫోక్‌లొర్, ఆధ్యాత్మికత, భావోద్వేగాలతో రూటెడ్ స్టోరీటెల్లింగ్ కి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఈ ప్రీక్వెల్ మాత్రం మూలాలను ఇంకా లోతుగా ఎక్స్ప్లోర్ చేస్తూ, మరింత ఇంటెన్సిటీ, భావోద్వేగం జోడించబోతోంది.ఈ సినిమా విజువల్‌ విజువల్ వండర్ గా ఉండబోతోంది. సినిమాటోగ్రఫీని అర్వింద్ ఎస్. కాశ్యప్ అందిస్తుండగా, ఫస్ట్ పార్ట్ లో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన బి. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ ఇస్తున్నారు. హోంబాలే ఫిలిమ్స్‌ విజయ్ కిరగందూర్ నెక్స్ట్ లెవల్ లో నిర్మిస్తున్నారు. కులశేఖర పాత్రలో గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్ బయటికి రావడంతో సినిమా మీద మరింత హైప్ పెరిగింది. ఈ మోస్ట్ లవ్డ్ యూనివర్స్ లో అతని రోల్ ఎలాంటి మలుపులు తీసుకొస్తుందో అన్న ఆసక్తి పెరుగుతోంది.
ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్ లో అక్టోబర్ 2, 2025న గ్రాండ్ గా వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది.

]]>
Wed, 20 Aug 2025 15:23:31 +0530 admin
ఇప్పుడు ప్రైమ్ లో హరి హర వీరమల్లు https://prajakshethrenews.com/ఇప్పుడు-ప్రైమ్-లో-హరి-హర-వీరమల్లు https://prajakshethrenews.com/ఇప్పుడు-ప్రైమ్-లో-హరి-హర-వీరమల్లు హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో

ప్రజా క్షేత్ర్, వెబ్ సినిమా :
పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త! ఆయన తాజా చిత్రం హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది..ఈ చిత్రాన్ని రాధాకృష్ణ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. పీరియడ్ అడ్వెంచర్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, సచిన్ ఖేడ్కర్, నాజర్, రఘుబాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.మొఘల్ కాలం నాటి ఈ కథలో, వీరమల్లు అనే ఒక ధైర్యవంతుడు చక్రవర్తి ఔరంగజేబు కోట నుండి ప్రసిద్ధ కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడానికి బయలుదేరుతాడు. రాజకీయ కుట్రలు, యుద్ధాలు మరియు సాహసాలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. కాని కథ ముందుకు వెళ్ళే కొలది కథ ధర్మ రక్షణ కోసం అనే మలుపుతో మరింత ఇంట్రెస్ట్ కలిగించింది.ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా అందుబాటులో ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ప్రైమ్ సభ్యులు ఈ సినిమాను చూడవచ్చు

]]>
Wed, 20 Aug 2025 15:10:31 +0530 admin
నేనెవరు?" టైటిల్ లోగో లాంచ్ https://prajakshethrenews.com/నేనెవరు-టైటిల్-లోగో-లాంచ్ https://prajakshethrenews.com/నేనెవరు-టైటిల్-లోగో-లాంచ్ *నేనెవరు?" టైటిల్ లోగో లాంచ్*

*నటకిరీటి డా: రాజేంద్ర ప్రసాద్ నటించిన "నేనెవరు?" టైటిల్ లోగో లాంచ్ చేసిన సినీ ప్రముఖులు*

*దర్శకుడిగా చిరంజీవికి ఉజ్వల భవిష్యత్ ఉందని కితాబు*
ప్రజా క్షేత్ర్, సినిమా : 
ఇటీవల కాలంలో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నటకిరీటి డా: రాజేంద్ర ప్రసాద్, "నువ్వేకావాలి, ప్రేమించు" వంటి సూపర్ హిట్ ఫిల్మ్స్ ఫేమ్ సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రల్లో యువ ప్రతిబాశాలి చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సందేశభరిత వినోదాత్మక చిత్రం "నేనెవరు?" జై చిరంజీవ మూవీ మేకర్స్ పతాకంపై సరికొండ మల్లిఖార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు - సకినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంతో వైజాగ్ సత్యానంద్ శిష్యులు అభిలాష్, సాయిచెర్రి హీరోలుగా పరిచయమవుతున్నారు. దీపిక - సోనాక్షి జబర్దస్త్ రాజమౌళి.... ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం షూటింగ్ ముగించుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది!! త్వరలో విడుదల తేది ప్రకటించుకోనున్న ఈ చిత్రం టైటిల్ లోగోను తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు - ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్,  ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, వి.సముద్ర ఆవిష్కరించి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లోని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రివ్యూ ధియేటర్ లో జరిగిన ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొని, ఈ సినిమా తామందరికీ పేరు తెచ్చిపెడుతుందని పేర్కొన్నారు! ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ - అప్పాజీ, మాటలు: శ్రీనివాస్, పాటలు: ఎస్.ఎస్.వీరు, మ్యూజిక్: చిన్నికృష్ణ, ఎడిటర్: నందమూరి హరి - తారకరామారావు, సినిమాటోగ్రఫీ: నాయుడు ప్రసాద్ కొల్లి, సమర్పణ: సరికొండ మల్లిఖార్జున్, నిర్మాతలు: అండేకర్ జగదీష్ బాబు - సకినాన భూలక్ష్మి, రచన - దర్శకత్వం: చిరంజీవి తన్నీరు!!

]]>
Wed, 20 Aug 2025 15:05:11 +0530 admin
ఇక శ్రీశైలానికి తగ్గనున్న దూరం https://prajakshethrenews.com/ఇక-శ్రీశైలానికి-తగ్గనున్న-దూరం https://prajakshethrenews.com/ఇక-శ్రీశైలానికి-తగ్గనున్న-దూరం ఇక శ్రీశైలానికి తగ్గనున్న దూరం
ప్రజా క్షేత్ర్, మహబూబ్ నగర్, ఆగస్టు 14 :
హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో నాలుగు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 7,668 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ ఏరియా మీదుగా ఈ కారిడార్ నిర్మించనుండటం వల్ల పర్యావరణపరంగా కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని స్వల్ప మార్పులతో ఈ ప్రాజెక్టుకు త్వరలోనే కేంద్రం తుది ఆమోదం తెలిపే అవకాశముంది.ప్రతిపాదిత రహదారి పొడవు 54.915 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్ రహదారి పొడవు 45.19 కిలోమీటర్లు కాగా, మిగిలిన 9.725 కిలోమీటర్ల మేర సాధారణ రోడ్డు ఉంటుంది. ఈ రహదారిని దాదాపు 30 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో 300 మీటర్ల మేర వయాడక్ట్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌-శ్రీశైలం మధ్య ప్రయాణ సమయం 45 నిమిషాల వరకు తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి ప్రారంభమై అమ్రాబాద్ మండలం మన్ననూరు, కుంచోనిమూల, దోమలపెంట గ్రామాల మీదుగా శ్రీశైలం పాతాళగంగ వరకు ఈ రహదారి విస్తరిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా దోమలపెంట-శ్రీశైలం మధ్య కృష్ణా నదిపై ఒక ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జిని కూడా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇరుకైన, ప్రమాదకరమైన ఘాట్ రోడ్లు, మలుపుల వల్ల వాహనాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ కొత్త కారిడార్ వల్ల ప్రయాణం సురక్షితంగా, వేగంగా ఉంటుంది. అంతేకాకుండా, నల్లమల అడవిలో వన్యప్రాణులు రహదారి ప్రమాదాల బారిన పడకుండా ఇది సహాయపడుతుంది.హైదరాబాద్-శ్రీశైలం మార్గం పర్యాటకానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ మార్గంలో శ్రీశైలం డ్యామ్, పుణ్యక్షేత్రంతో పాటు ఫర్హాబాద్ వ్యూ పాయింట్, టైగర్ సఫారీ వంటి పలు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కొత్తగా నిర్మించనున్న ఐకానిక్ వంతెన పర్యాటకులకు అదనపు ఆకర్షణగా నిలవనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-విజయవాడ తర్వాత అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఇది ఒకటి. పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణను చేపట్టారు. ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంతంరవాణా,
పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు.

]]>
Thu, 14 Aug 2025 11:32:30 +0530 admin
సాగర్ కు భారీ వరద పోటు https://prajakshethrenews.com/సాగర్-కు-భారీ-వరద-పోటు https://prajakshethrenews.com/సాగర్-కు-భారీ-వరద-పోటు సాగర్ కు భారీ వరద పోటు
ప్రజా క్షేత్ర్, నల్గొండ :
 నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు భారీ వరద ప్రవాహం పోటెత్తింది. దాంతో అధికారులు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసారు. ఇన్ ఫ్లో, 1,74,533 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 2,33,051 క్యూసెక్కులు . పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం : 589.30. పూర్తి స్థాయి సామర్ధ్యం : 312.0450 టీఎంసీలు. ప్రస్తుత సామర్థ్యం : 309.95 టీఎంసీలు

]]>
Wed, 13 Aug 2025 23:58:15 +0530 admin
కలవరపెడుతున్న కొత్త బార్ పాలసీ!!! https://prajakshethrenews.com/కలవరపెడుతున్న-కొత్త-బార్-పాలసీ https://prajakshethrenews.com/కలవరపెడుతున్న-కొత్త-బార్-పాలసీ కలవరపెడుతున్న కొత్త బార్ పాలసీ!!!
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బార్లకి సంబంధించి నూతన మద్యం పాలసీపై యజమానుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది.
ఈ నూతన విధానం వారి ఆర్థిక భద్రతపై, వ్యాపార స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తటస్థంగా చూస్తే, దీని వల్ల ప్రస్తుత బార్ యజమానులకు లాభాలు తగ్గిపోవడమే కాదు, కొత్తగా బిజినెస్ చేయాలనుకొనే వారికి ఎదురయ్యే సమస్యలు కూడా అధికమే.
1. లైసెన్సులు - ఆనిశ్చితి, పెట్టుబడులకు రిస్క్
లాటరీ పద్ధతి: లాటరీ విధానం ప్రవేశపెట్టడం వలన సుదీర్ఘకాలంగా ఈ రంగంలో ఉన్న ప్రస్తుత బార్ యజమానులకు తమ లైసెన్సులు కొనసాగింపును పోగొట్టుకునే ప్రమాదం ఎక్కువైంది.
సంపాదించుకున్న బ్రాండ్ విలువ, కస్టమర్ నెట్వర్క్ ఒక్కరోజులో లాటరీలో అదృష్టం దక్కకపోతే నిరాశే గతి.
• పెరిగిన లైసెన్స్ ఫీజు: జనాభా ఆధారంగా రూ.55లక్షల నుండి రూ.75 లక్షల వరకు లైసెన్స్ ఫీజులను నిర్ణయించడం, చిన్న పట్టణాల్లో బార్లు నిర్వహించే వారికి చాలా చాలా ఇబ్బందికరం.
• ఆస్తుల్లో పెట్టుబడిపై భద్రత లేదు: ఎంత పెద్ద పెట్టుబడి పెట్టినా, లైసెన్స్ పునరుద్ధరణలో మళ్లీ లాటరీ విధానమే అనిశ్చితి రావడంతో బార్ల అభివృద్ధికి విస్తరణకు అర్థం ఉండదు.
2. అనవసర పోటీ
• ప్రస్తుత యజమానులకు కొనసాగింపుపై హామీ లేదు: భారీగా ఖర్చు పెట్టి భవనాలు, ఇంటీరియర్ వెచ్చించిన యజమానులకు మరోసారి లైసెన్స్ దక్కుతుందన్న గ్యారంటీ లేదు. అది లేదంటే, వారి పెట్టుబడి పూర్తిగా నష్టపోతుంది.
• BCలకు 10% రిజర్వేషన్: సామాజిక న్యాయం అవసరమైనదే అయినా, ఇలాంటివి వేగంగా అనుభవజ్ఞులైన వ్యాపారులకు నిస్పృహ కలిగించేలా మారుతున్నాయి. మిగతా 90%కి 10% వారితో పోటీ చాలా ఎక్కువగా మారి నష్టాలను చవిచూసే అవకాశాలు పుష్కలం
3. మార్కెట్ ప్రవేశం కొత్తవారికి కష్టమే
• అధిక పెట్టుబడితో ప్రారంభం: పెద్ద మొత్తంలో లైసెన్స్ ఫీజు, వడ్డీ ఖర్చులు, చెల్లించాల్సిన పన్నులు కొత్తగా రంగంలోకి రావాలనుకునే ‘ప్రవేశికులకు, ఆదిలోనే హంసపాదులుగా మారి తెలియక వ్యాపారంలోకి ప్రవేశించేవారు దివాళ తీయడం ఖాయం!
4. లాభాల క్షీణత
• డిస్ట్రిబ్యూషన్లో ధరల్లో అసమానత: బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా బార్లకు సరఫరా చేసే మద్యం ధరలు, రిటైల్ ఔట్లెట్లకు సరఫరా చేసే ధరలకు పోలిస్తే 10% అధికం ఉంటోంది. దీనివల్ల బార్లకు లాభాల మార్జిన్ తక్కువవుతోంది. వ్యాపార భద్రత తగ్గిపోతోంది.
• ప్రభుత్వానికి మాత్రం అధిక లాభాలు: గతంలో  ప్రభుత్వానికి లైసెన్స్, అప్లికేషన్ ఫీజుల ద్వారా రూ.700 కోట్లు ఆదాయం వస్తే, బార్ల యజమానులకు మాత్రం మరింత ఒత్తిడి, అమ్మకాల్లో మార్జిన్ భారిగా తగ్గిపోయింది.
5. కాలపరిమితి, నిబంధనల్లో స్పష్టత లోపం
• లైసెన్స్ కాలపరిమితి చిన్నదే: మూడు సంవత్సరాల వరకే లైసెన్స్ మంజూరవ్వడం వ్యాపార భవిష్యత్తుపై సందేహాన్ని కలిగిస్తోంది. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో సంవత్సరానికి 40 లక్షలు ఫీజుతో బార్ లైసెన్స్ దొరికినా అక్కడ లాభాలు ఎక్కువగా ఉన్నాయి; ఇక్కడ ఇవ్వబడిన ఫీజుకు అంత లాభదాయకత ఒక్క శాతం కూడా కనిపించడం లేదు.
6. చట్టపరమైన గందరగోళం, బ్యూరోక్రసీ అంతరాయం
• లైసెన్సింగ్ పద్ధతులు స్పష్టంగా తెలియకపోవడం, గుర్తింపు మార్గదర్శకాలు లేదా ప్రామాణిక విధివిధానాల్లో పారదర్శకత లేకపోవడం కొత్తవారిని, ప్రస్తుత యజమానులను బిజినెస్ చేయాలన్న ఉత్సాహాన్ని తగ్గిస్తోంది.
సంక్షిప్తంగా విమర్శాత్మక విశ్లేషణ:
• రెగ్యులర్ వ్యాపారానికి మూల్యం తగ్గిన విధానం ఈపాలసీ. గతంలో గల యజమానులకు పెట్టుబడిపై భద్రత లేదు. నూతన ప్రవేశికులకు తలపోయే పెట్టుబడి, మార్కెట్ ప్రమాణాలు అతిగా ఉన్నాయి. లాభాల మార్జిన్లు తక్కువగా, పోటీ ఎక్కువగా ఉండటంతో ఈ రంగంలో స్థిరత్వం లేదన్న సంగతి సుస్పష్టం.
• నీతిగతంగా, ఆరోగ్య దృష్టికోణం బాగున్నా, వ్యాపార ప్రోత్సాహానికి మాత్రం ఈ పాలసీ బహు దూరంగా ఉంది.
• ప్రాధాన్యత ప్రభుత్వ ఆదాయానికి అధికంగా ఉండటం, వ్యాపారులు, వ్యాపారం చేసే తీరుపై దుష్ప్రభావం చూపేలా మారింది.
చివరగా…
ప్రస్తుతం ఉన్న బార్ యజమానులకు లేదా కొత్తగా రంగంలోకి రావాలనుకొనేవారికి, ఈ పాలసీ రాబోతున్న ఏడాదుల్లో లాభదాయక కార్యకలాపాలు సాగించేందుకు గణనీయమైన ఇబ్బందులు మిగిల్చే అవకాశమే ఎక్కువ. పాలసీ లక్ష్యాలే సరె, కానీ పారదర్శకత లేని నూతన విధానాలు , స్థిరత, వ్యాపారానికివ్వే గౌరవం లేకపోవడం – కొత్త బార్ల వ్యాపారాన్ని మరియు పాత బార్ల వ్యాపారస్థులను  తీవ్రంగా దెబ్బ తీయడం ఖాయం!!!
నాన్ రిఫండబుల్ పాలసీ కింద లాటరీ టోకెన్ ఫీజు వసూలు చేయడం ప్రభుత్వం చేస్తున్న దోపిడీ అని క్షేత్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వం ప్రకటించిన కమీషన్ పాలసీ అమలులో ఉంటుందని గ్యారంటీ లేదు. వైన్ షాపుల యజమానులకు ఇస్తామన్న కమీషన్ ఇవ్వలేదు. ఈ తీరుతో  ప్రభుత్వం మీద అపనమ్మకం పెరుగుతోంది.
 లాభార్జన కోసం మద్యం వ్యాపారుల ప్రయోజనాలను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి..

]]>
Wed, 13 Aug 2025 23:54:24 +0530 admin
జయాబచ్చన్‌పై కంగన రనౌత్ ఫైర్‌ https://prajakshethrenews.com/జయాబచ్చన్పై-కంగన-రనౌత్-ఫైర్ https://prajakshethrenews.com/జయాబచ్చన్పై-కంగన-రనౌత్-ఫైర్ అమితాబ్‌ భార్య కాబట్టి ఆమెను సహిస్తున్నారు..
          జయాబచ్చన్‌పై కంగన రనౌత్ ఫైర్‌
ప్రజా క్షేత్ర్, ముంబై ఆగస్టు 13
అలనాటి ప్రముఖ నటి, సమాజ్‌వాది పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్‌  పై బాలీవుడ్‌ స్టార్‌ నటి, మండి బీజేపీ ఎంపీ కంగన రనౌత్ ‌తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమె బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అమితాబ్ బచ్చన్ భార్య కాబట్టి ప్రజలు ఆమె కోపతాపాలను సహిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిపై జయాబచ్చన్‌ చిందులు తొక్కారు. అతడిని సీరియస్‌గా పక్కకు తోసేశారు. ‘ఏం చేస్తున్నావు నువ్వు..? ఏంటిది..?’ అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ రాజధాని ఢిల్లీ   లోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌  ఆవరణలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. ఆ వీడియోపై కంగన స్పందిస్తూ విమర్శలు చేశారు. జయాబచ్చన్‌ అత్యంత విశేషాధికారం కలిగిన మహిళ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఘటనను అవమానకరంగా, సిగ్గు చేటుగా అభివర్ణించారు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

]]>
Wed, 13 Aug 2025 23:49:42 +0530 admin
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం : ఐదు రోజులపాటు వర్షాలు https://prajakshethrenews.com/వాయువ్య-బంగాళాఖాతంలో-అల్పపీడనం-ఐదు-రోజులపాటు-వర్షాలు https://prajakshethrenews.com/వాయువ్య-బంగాళాఖాతంలో-అల్పపీడనం-ఐదు-రోజులపాటు-వర్షాలు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
ఐదు రోజులపాటు వర్షాలు
ప్రజా క్షేత్ర్, విశాఖపట్నం :
పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని అనుకోని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 24 పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం వుంది. రాగల 48 గంటలలో పశ్చిమ వాయువ్య దిశగా  కదులుతూ ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తిరాలవైపు పయనించే అవకాశం వుంది. అల్పపీడననికి అనుబంధం గా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల ఐదు రోజులలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కోస్తా జిలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం. రాగల 24 గంటల్లో ఎన్ టి ఆర్ , బాపట్ల, గుంటూరు,పల్నాడు జిలాల్లో అత్యంత  భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. ఏలూరు, పశ్చిమగోదావరి, నెల్లూరు, కృష్ణ జిలాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, తిరుపతి జిలాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. రాగల రెండు రోజులలో కోస్తా తీరంలో 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయి. రానున్న ఐదు రోజులు పాటు మత్య్సకారులు వేట కు వెళ్లారాదు. గడిచిన 24 గంటలలో అత్యధికంగా మంగళగిరి 20 సెంటిమిటర్ల వర్షపాతం నమోదు అయింది.

]]>
Wed, 13 Aug 2025 23:43:47 +0530 admin
సింధు జాలాల విషయంలో భారత్ కు పాకిస్తాన్ మరోసారి వార్నింగ్ https://prajakshethrenews.com/సింధు-జాలాల-విషయంలో-భారత్-కు-పాకిస్తాన్-మరోసారి-వార్నింగ్ https://prajakshethrenews.com/సింధు-జాలాల-విషయంలో-భారత్-కు-పాకిస్తాన్-మరోసారి-వార్నింగ్ సింధు జాలాల విషయంలో భారత్ కు పాకిస్తాన్ మరోసారి వార్నింగ్
ప్రజా క్షేత్ర్, ఇస్లామాబాద్ ఆగష్టు 13
 సింధు జాలాల విషయంలో పాకిస్తాన్ మరోసారి భారత్ కు వార్నింగ్ ఇచ్చింది. అమెరికా పర్యటన సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ భారత్ పై అణు బెదిరింపు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో భారత్ నుండి తమ దేశం ఉనికికి ముప్పును ఎదురైతే.. పాకిస్తాన్, భారత్ తోపాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని హెచ్చరించాడు. తాజాగా పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా భారత్ ను హెచ్చరించాడు. తమ దేశానికి హక్కుగా చెందిన ఒక్క చుక్క నీటిని కూడా భారత్ ను తీసుకోనివ్వమని ప్రతిజ్ఞ చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన మంత్రి షరీఫ్ మాట్లాడుతూ.. తమకు దక్కాల్సిన నీటిని ఆపడానికి భారత్ ప్రయత్నిస్తే.. యుద్ధ చర్యగా పరిగణిస్తామని హెచ్చరించాడు. మీరు మా నీటిని నిలిపేస్తామని బెదిరిస్తే, మీరు పాకిస్తాన్ నుండి ఒక్క చుక్కను కూడా లాక్కోలేరని గుర్తుంచుకోండి. భారత్ అలాంటి చర్యకు ప్రయత్నిస్తే.. తగిన గుణపాఠం నేర్పుతాం” అని హెచ్చరించాడు.కాగా.. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆర్మీ.. పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల శిభిరాలను మిస్సైల్స్ తో ధ్వంసం చేసింది. అలాగే, ఉగ్రవాదులకు పాక్ సహకరిస్తుందని.. సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది.

]]>
Wed, 13 Aug 2025 23:38:07 +0530 admin
ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ కి మద్దతుగా నిలవండి : జగ్గారెడ్డి https://prajakshethrenews.com/ఎన్నికల-కమిషన్-కు-వ్యతిరేకంగా-పోరాటం-చేస్తున్న-రాహుల్-గాంధీ-కి-మద్దతుగా-నిలవండి-జగ్గారెడ్డి https://prajakshethrenews.com/ఎన్నికల-కమిషన్-కు-వ్యతిరేకంగా-పోరాటం-చేస్తున్న-రాహుల్-గాంధీ-కి-మద్దతుగా-నిలవండి-జగ్గారెడ్డి ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ కి మద్దతుగా నిలవండి...
బీజేపీ పార్టీ ఓట్లు చోరీ విషయాన్ని ఎండ గట్టండి
బిజెపి కల్లు దుకాణం.. అన్నదమ్ములు చంద్రబాబు, జగన్..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ ప్రజలకు  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపు
ప్రజా క్షేత్ర్, అమరావతి ఆగస్టు 13 : 
న్నికల కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ కి మద్దతుగా నిలిచి బీజేపీ పార్టీ ఓట్లు చోరీ విషయాన్ని ఎండ గట్టాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ ప్రజలకు  పిలుపునిచ్చారు.బుదవారం అమరావతి లో ఏపి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు......రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలపై ఎంక్వైరీ చేయడం లేదు....అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండకూడదు అనేది బిజెపి కుట్ర... రాహుల్ గాంధీకి ప్రధాని పదవి   కొత్త కాదు.. ఆ ప్రధాని పోస్టు పుట్టిందే వాళ్ళింట్లో ఈసీ ని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.. రాహుల్ గాంధీ కుటుంబం మీద బిజెపి ది కక్ష సాధింపు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్ధల ద్వారా దొంగ ఓట్లు తయారు చేసారు..ఎలక్షన్ కమీషన్ కూడా ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ రీడర్ అని చెప్పక తప్పడం లేదు పాకిస్తాన్ లాంటి విధానాలు అమలు చేయాలనే కుట్ర బిజెపి చేస్తోందిఓటుహక్కు మి చేతిలోంచీ పోవాలనేదే బిజెపి ఆలోచన ప్రజలారా గమనించండి అని జగ్గ రెడ్డి విజ్ఞప్తి చేసారు.రాహుల్ గాంధీ ప్రయత్నాలకు తోడవండి..ఆ పోస్టు ఆశ పెద్దగా వారికి ఉండదు...అలమరా ఎత్తుకెళ్ళిపోడు ఏ దొంగా.. ఏం అనుకుంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డి..ఏపీకి బిజెపి తండ్రి, జగన్ చంద్రబాబు కొడుకులు...ఏపీ పాలిటిక్స్ కల్లుదుకాణం దగ్గర కూచునే అన్నదమ్ముల్లా ఉంటుంది బిజెపి కల్లు దుకాణం.. అన్నదమ్ములు చంద్రబాబు, జగన్.. రాష్ట్ర విభజనకు లెటర్లు ఇచ్చింది చంద్రబాబు, జగన్మా కాంగ్రెస్ లో అందరూ దమ్మున్నోళ్ళమే..కోమటిరెడ్డి సోదరులు దమ్మున్న వాళ్ళే...చంద్రబాబు, జగన్ లు ఇద్దరూ బానిసలు కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు. ఈసీ ని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.. రాహుల్ గాంధీ కుటుంబం మీద బిజెపి ది కక్ష సాధింపు  ఎలక్షన్ కమీషన్ బిజెపి అడుగు జాడల్లో నడుస్తోంది బిజెపి, ఆర్ఎస్ఎస్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి దేశ ప్రజల స్వేచ్ఛను అణగదొక్కే కుట్ర బిజెపి, ఆర్ఎస్ఎస్ చేస్తున్నాయి.ప్రతీ ఒక్కరికీ ఓటు ద్వారా స్వతంత్రం, స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది ఎవ్వరూ ఊహించని విధంగా మూడోసారి మోదీ ప్రధాని అయ్యాక పలు అనుమానాలు వచ్చాయి. మోదీ ప్రధాని అవడానికి కారణమైన నలభైకి పైగా ఎంపీల ఓట్లు బోగస్ అని అనుమానం అది నిజమా అబద్ధమా చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమీషన్ ది..భద్రతగా భావించే ఎలక్షన్ కమీషన్ తప్పు దారి పట్టింది మారు మూల గ్రామాలలో, కనిపించని ప్రాంతాలలో దొంగ ఓట్లను నమోదు చేయించి గెలుపుకు ప్రణాళిక చేసారు.దొంగ ఓట్ల‌ ద్వారా అధికారం లోకి వచ్చారు.. ముఫ్ఫై, నలభై ఏళ్ళ నుంచీ ఇది జరుగుతోందని అనుమానం*వ్యూహాత్మకంగా బిజెపి చేస్తున్న ప్రయత్నం  దేశ ప్రజల స్వేచ్ఛను అణగదొక్కే కుట్ర బిజెపి, ఆర్ఎస్ఎస్ చేస్తున్నాయి.దొంగ ఓట్లను తయారుచేసే నైపుణ్యం కలిగినవి బిజెపి, ఆర్ఎస్ఎస్దే దేశం మొత్తం ఈ దొంగ ఓట్ల ప్రక్రియ జరిగింది. రాహుల్ గాంధీ కుటుంబం మీద బిజెపి ది కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. మూడోసారి బిజెపి రావడానికి చేసిన కుట్ర దొంగ ఓట్లు ఎలక్షన్ కమీషన్ బిజెపి అడుగు జాడల్లో నడుస్తోంది కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో మాజీ సీఎంబిజెపి స్క్రిప్ట్ చదవాలి కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి అదే చేసాడు.కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి లీడరా, ఎన్నికల కమీషనరా అర్ధం కాలేదన్నారు.

]]>
Wed, 13 Aug 2025 23:34:09 +0530 admin
బందిపోట్ల ముఠానాయకుడు చంద్రబాబు : వై ఎస్ జగన్ https://prajakshethrenews.com/బందిపోట్ల-ముఠానాయకుడు-చంద్రబాబు-వై-ఎస్-జగన్ https://prajakshethrenews.com/బందిపోట్ల-ముఠానాయకుడు-చంద్రబాబు-వై-ఎస్-జగన్ బందిపోట్ల ముఠానాయకుడు చంద్రబాబు
చంద్రబాబుది అడ్డగోలు రాజకీయం.. చంబల్‌వ్యాలీలో బందిపోట్లను కూడా మరిపించారు
వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
ప్రజా క్షేత్ర్, అమరావతి ఆగస్టు 13 :
ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లేవు అని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. నిన్న పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన ఘటనలే అందుకు ఉదాహరణగా ఉన్నాయని, వైసిపి సంబంధించిన ఏజెంట్లు లేకుండా పోలింగ్‌ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తాడిపల్లిలోని వైసిపి పార్టీ కేంద్ర కార్యాలయంలోజగన్ మాట్లాడారు. వైసిపి ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌లలో కూర్చోనీయలేదని, 15 పోలింగ్‌ బూత్‌లలో వైసిపి ఏజెంట్లు లేకుండా చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇంత అన్యాయంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదన్నారు.బందిపోటు దొంగల తరహాలో సిఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలు జరిపించారని దుయ్యబట్టారు. పులివెందుల జడ్ పిటిసి ఉప ఎన్నిక కోసం చంద్రబాబు కుట్రలకు పాల్పడ్డారని, పోలింగ్‌ బూత్‌లను మార్చేశారని మండిపడ్డారు. చంద్రబాబుది అడ్డగోలు రాజకీయమని, చంబల్‌వ్యాలీలో బందిపోట్లను కూడా మరిపించారని, బందిపోట్ల ముఠానాయకుడు చంద్రబాబు అని జగన్ విమర్శలు గుప్పించారు.పులివెందుల వైసిపి అభ్యర్థి హేమంత్‌రెడ్డిని ఇంటినుంచి బయటకు ఎందుకు రానీయలేదని అడిగారు. డిఐజి కోయ ప్రవీణ్‌ పర్యవేక్షణలో ఉప ఎన్నికలు జరిగాయని, చంద్రబాబు పాలనలో మాట వినని పోలీసు అధికారులపై కేసులు పెడుతున్నారని, ఎంతో మంది అధికారులను వేధించి, సస్పెండ్‌ చేశారని ధ్వజమెత్తారు. కొంత మంది పోలీసు అధికారులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని,  జడ్ పిటిసి ఉప ఎన్నిక కోసం పోలీసులను ఏరికోరి నియమించుకున్నారని జగన్ చురకలంటించారు.

]]>
Wed, 13 Aug 2025 23:27:41 +0530 admin