డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి సాద్యం: పురంధేశ్వరి
డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి సాద్యం: పురంధేశ్వరి
ప్రజా క్షేత్ర్, అమరావతి జూన్ 26 :
వికసిత్ భారత్ లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఒక భాగం అని బిజెపి ఎంపి పురంధేశ్వరి తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే అభివృద్ధి సాధ్యమని ఆనాడు చెప్పామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు తమపై నమ్మకం ఉంచి ఆశీర్వదించి గెలిపించారని, అమరావతి, పోలవరం ఇలా అన్నింటిలో కేంద్రం సహకారం అందిస్తోందని, అనేక పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటున్నామని తెలియజేశారు. చారిత్రక ప్రాధాన్యత గుర్తించి అభివృద్ధి చేసేందుకు కేంద్రం సాయమందిస్తోందని పురంధేశ్వరి పేర్కొన్నారు.