రెండు రోజుల పాటు జపాన్‌లో పర్యటించనున్నప్రధాని మోదీ
రెండు రోజుల పాటు జపాన్‌లో పర్యటించనున్నప్రధాని మోదీ
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ ఆగష్టు 26 :
రెండు రోజుల పాటు జపాన్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ ఈ విషయాన్ని ఇవాళ వెల్లడించారు. ఆగస్టు 29వ తేదీన మోదీ జపాన్ వెళ్లనున్నట్లు ఆ శాఖ పేర్కొన్నది. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో ఆయన మాట్లాడుతారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 8 సార్లు జపాన్‌కు వెళ్లారు. రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జపాన్ నుంచి ఆయన నేరుగా చైనాకు వెళ్తారు.