నల్ల పోచమ్మ దేవాలయంలో బంగారు బోనం సమర్పించనున్న మల్లా రెడ్డి విద్యా సంస్థ వైస్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ ప్రీతిరెడ్డి

నల్ల పోచమ్మ దేవాలయంలో బంగారు బోనం సమర్పించనున్న మల్లా రెడ్డి విద్యా సంస్థ  వైస్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ ప్రీతిరెడ్డి

ఈ నెల 20 వ తేదీన బోనాల పండుగ రోజున శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో బంగారు బోనం సమర్పించనున్న మల్లా రెడ్డి విద్యా సంస్థ  వైస్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ ప్రీతిరెడ్డి 

బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని డాక్టర్ ప్రీతిరెడ్డి ని ఆహ్వానించిన ఆలయ అధ్యక్షులు పొన్న వెంకట రమణ బృందం

ఆలయకమిటీ ప్రతినిధులతో కలిసి బోనాల ఉత్సవాల బ్రౌచర్ ను ఆవిష్కరించిన ప్రీతి రెడ్డి 

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

పాతబస్తీ అలియాబాద్ మేకల్ బండ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో ఈ నెల 20 వ తేదీన అంగరంగ వైభవంగా జరుగనున్న బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ మల్లా రెడ్డి విద్యా సంస్థ వైస్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ ప్రీతిరెడ్డి ని ఆలయ కమిటీ  అధ్యక్షులు పొన్న వెంకట రమణ బృందం మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం శ్రీ నల్ల పోచమ్మ దేవాలయ బోనాల ఉత్సవాల బ్రౌచర్ ను ప్రీతి రెడ్డి ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 20 వ తేదీనా బోనాల పండుగ రోజున శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నట్లు ప్రీతి రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు వైస్ చైర్మన్ సి. వెంకటేష్, ప్రధాన కార్యదర్శి గోల్కొండ నవీన్, ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్, కార్యదర్శి భాను యాదవ్, ఉమ్మడి దేవాలయాల కమిటీ  సభ్యుడు అక్షయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.