బాసర సరస్వతి సన్నిధిలో అలరించిన అష్టావధానం

బాసర సరస్వతి  సన్నిధిలో అలరించిన అష్టావధానం

బాసర సరస్వతి  సన్నిధిలో అలరించిన అష్టావధానం
బాసర, ఆగష్టు 26 :
జ్ఞాన సరస్వతి మాత వెలసిన బాసర పట్టణంలో శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమంలో కోటి  పార్థివ లింగ స్తూప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము లో వ్యవస్థాపక అధ్యక్షులు నిర్మల అంబికానాథ శర్మ ఆధ్వర్యంలో , ఆసిఫాబాద్ కు చెందిన మాడుగుల నారాయణమూర్తి  నిర్వహించిన అష్టావధానం సాహిత్య ప్రియులందరినీ ఆలరించింది. బాసరలోని ద్వాదశ జ్యోతిర్లింగ మందిరంలో ఈ అష్టావధానం జరిగింది. ఇందూరు కవులు డాక్టర్ గణపతి అశోక శర్మ అధ్యక్షతన జరిగిన, ఈ అవధానానికి సమన్వయకర్తగా డాక్టర్ కాసర్ల నరేశ్ రావు వ్యవహరించారు. పృఛ్ఛకులుగా కవి పండితులు,నిషిద్ధాక్షరిని తొగరి రాజేశ్వర్ ,సమస్యను ప్రవీణ్ కుమార్ శర్మ, దత్తపదిని చింతల శ్రీనివాస్ గుప్త ,వర్ణనను డాక్టర్ శారద, న్యస్తాక్షరిని గుడి రాజేశ్వర శర్మ సిద్ధాంతి, అప్రస్తుత ప్రసంగాన్ని కంకణాల రాజేశ్వర్, ఆశువును ఇందారపు మధుకర్ శర్మ నిర్వహించారు. రసవత్తరంగా జరిగిన ఈ అవధానంలో పృఛ్ఛకులు అడిగిన ప్రశ్నలకు అవధాని సమయస్ఫూర్తితో, పాండిత్య పటిమతో చక్కటి సమాధానాలు చెప్పారు. రెండు గంటలకు పైగా సాగిన ఈ అవధానం అందరికీ పద్యగాన వినోదాన్ని పంచి సరస్వతీ మాతకు అక్షర  నీరాజనాన్ని అందించిందని అతిథులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు అంబికానాథ శర్మ దంపతులు, ఆసిఫాబాద్ నుంచి వచ్చిన కవులు, మూడ నాగభూషణం గుప్త విద్యాలయానికి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం అష్టావధానిని పృఛ్ఛకులను ఆలయ నిర్వహకులు ఆలయ సంప్రదాయం ప్రకారం గా సత్కరించారు.