బీ సీ ల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు మద్దతు తెలిపిన పాతనగర మున్నూరు కాపు సంఘం

బీ సీ ల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు మద్దతు తెలిపిన పాతనగర మున్నూరు కాపు సంఘం

బీ సీ ల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు మద్దతు తెలిపిన పాతనగర మున్నూరు కాపు సంఘం 

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పాతనగర మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవితను మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పల్లె శ్రవణ్ కుమార్, ప్రతినిధులు ఎం.భాస్కర్,పరమేశ్వరీ, తిరుపతి రాఘవేందర్,పోసు కృష్ణ, పుప్పాల రాధాకృష్ణ, చలపతిలు మర్యాద పూర్వకంగా కలిశారు. బీ సీ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవిత పోరాటం అభినందనియమన్నారు. పాతనగర మున్నూరు కాపు సంఘం తరపున కవితకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పల్లె శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ బీసీలు అన్ని విధాలుగా నష్టపోతున్నారని, తమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని, జులై17న నిర్దేశించిన రైలు రోకో ను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.