శ్రీ లక్ష్మీ నృసింహుని సన్నిధిలో...అర్చక సేవలో ఐదు దశాబ్దాలు
శ్రీ లక్ష్మీ నృసింహుని సన్నిధిలో...అర్చక సేవలో ఐదు దశాబ్దాలు
పదవీ విరమణోత్సవంలో ప్రధానార్చకులు నల్లంది గల్ లక్ష్మీనరసింహచార్యులు
ప్రజా క్షేత్ర్, యాదగిరిగుట్ట ,ఆగస్టు4 :
భక్తుల కొంగుబంగారంగా కోట్లాదిమంది భక్తుల పూజలు అందుకుంటున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లో అనేక అర్చక హోదాలలో దాదాపు ఐదు దశాబ్దాల పాటు పనిచేసిన తన జీవితం ధన్యమైందని, దేవస్థానం అభివృద్ధిలో తాను భాగస్వామ్యం కావడం పూర్వజన్మ సుకృతం అని, జీవితాంతం ఆధ్యాత్మిక సేవలో గడుపుతానని ప్రధాన అర్చకులుగా పదవీ విరమణ చేసిన నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యులు అన్నారు. తన అర్చక సేవలకు సహకారం అందించిన ముఖ్యమంత్రులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ,విఐపి లకు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్లకు, ఉన్నతాధికారులకు, యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులకు ,సిబ్బందికి, భక్తులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎస్ వెంకట్రావు, కలెక్టర్ ఎం హనుమంతరావు, ఇతర అధికారులు, సిబ్బంది ,అర్చకులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సన్మానించారు. శ్రీ స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఆయన చేసిన సేవలు యాదగిరి దేవస్థానం చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వేణుగోపాల పురం గ్రామానికి చెందిన ధర్మచార్యులు సీతమ్మ దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు 1979 డిసెంబర్ 13 న యాదగిరిగుట్ట ఆలయంలో పరిచారకుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. అంచలంచలుగా ఎదిగి, పదోన్నతులు పొంది ప్రధాన ఆచార్యులుగా ఉద్యోగ విరమణ చేశారు, ఈ కార్యక్రమంలో కాంచి, మేలుకోటి ( కర్ణాటక) తిరుమల, అహోబిలం, ఒంటిమిట్ట, కదిరి, అన్నవరం, సింహాచలం, భద్రాచలం తదితర దేవాలయాలకు చెందిన అర్చకులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు.