9న భువనగిరి స్వర్ణగిరి దేవాలయం లో గిరిప్రదక్షిణ
9న భువనగిరి స్వర్ణగిరి దేవాలయం లో గిరిప్రదక్షిణ
ప్రజా క్షేత్ర్, యాదగిరిగుట్ట, ఆగస్టు 7:
నెల 9 తేదీ శనివారం రోజు శ్రవణా నక్షత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకొని ఉదయం 6:00 గంటలకు తెలంగాణ యాదాద్రి తిరుమలగా పేరుగాంచిన స్వర్ణగిరి దేవస్థానంలో ( భువనగిరి మానేపల్లి హిల్స్ )గిరి ప్రదక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. ఆ రోజు వేకువజామున స్వర్ణగిరి దివ్య క్షేత్రాన్ని సందర్శించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.గిరి ప్రదక్షణలో పాల్గొనాలనుకునే భక్తులందరూ హిందూ సాంప్రదాయ దుస్తులతో స్వామివారి పాదాల వద్దకు చేరుకోవాలని సూచించారు