రేపు కేసీఆర్, కేటీఆర్‌కూ నా పరిస్థితే...హరీష్‌దే కుట్ర : కవిత
రేపు కేసీఆర్, కేటీఆర్‌కూ నా పరిస్థితే...హరీష్‌దే కుట్ర : కవిత
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
హరీష్ రావు కుట్రలో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపేలా చేశారని కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావును పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. రేపు కేసీఆర్, కేటీఆర్ లను కూడా తన లాగే పార్టీ నుంచి బయటకు పంపుతారని.. పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకుంటారని కవిత జోస్యం చెప్పారు. కాళేశ్వరం విషయంలో హరీష్ భారీ స్కాం చేశారని, ఆ డబ్బులతో ఎమ్మెల్యే అభ్యర్థులకూ ఫండింగ్ చేశారని అన్నారు. కేటీఆర్ ను ఓడించడానికి హరీష్ రావు సిరిసిల్లకు "అరవై లక్షల" రూపాయలు పంపించాడన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్, హరీష్ రావు ఒకే ఫ్లైట్‌లో వెళ్లారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ కు, హరీష్ రావు పూర్తి స్థాయిలో సరెండర్ అయ్యారని, హాస్టళ్లకు హరీష్ రావు డెయిరీ నుంచి పాలు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. అందరిపై కేసులు పెడుతూంటే..ఒక్క హరీష్ పైనే ఎందుకు చిన్న కేసు కూడా పెట్టలేదని కవిత ప్రశ్నించారు. కేసీఆర్ వెంట..హరీష్ మొదటినుంచి లేరన్నారు. టీడీపీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తూంటే హరీష్ ఆపారని ఆరోపించారు. పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడు హరీష్ రావు వైఎస్ ను కూడా కలిశారన్నారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదని, డబుల్ షూటర్ అని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌లకు హాని కలిగించే పనులు తాను చేయబోనని స్పష్టం చేశారు. ఎంతో నష్టం జరుగుతున్నా హరీష్ , సంతోష్‌లను ఎందుకు ప్రోత్సహిస్తున్నారన్నదే తన ఆవేదన అని చెప్పారు. సంతోష్ రావు వల్ల రామన్నకు చెడ్డపేరు వచ్చిందన్నారు. బంగారు తెలంగాణ అంటే హరీష్,సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే..బంగారు తెలంగాణ అవుతుందా అని ప్రశ్నించారు. ఏ పని అయినా చెడగొట్టడానికే సంతోష్ రావు ఉంటారన్నారు. సంతోష్ రావు మోకిలాలో 750 కోట్ల ప్రాజెక్టును చేపట్టారన్నారు. గ్రీన్ ఇండియా పేరుతో నకిలీ కార్యక్రమం పెట్టి ఫారెస్ట్ ను కొట్టేయాలని కుట్ర చేశారన్నారు.
ఒకడు ఉండాలి వీడు వాడే..?..సంతోష్ రావు ధన దాహానికి అడ్డు అదుపు లేదు.!..
టార్చర్ చేసింది సంతోష్ చెడ్డ పేరు మాత్రం కేటీఆర్ కు వీరు ఇద్దరు మేక వన్నె పులులు..హరీష్ రావు మీడియాను మేనేజ్ చేస్తే, రాం అన్న యూట్యూబ్ ను మేనేజ్ చేస్తారు.
750 కోట్ల విల్లా ఎక్కడిది తనికి?
తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ, కేసీఆర్ మరో మేనల్లుడు అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ మీద కూడా కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సంతోష్ రావు దన దాహానికి అడ్డు అదుపు లేదు. సిరిసిల్ల ఇసుక లారీ కేసులో దళితులను టార్చర్ చేసింది సంతోష్, చెడ్డ పేరు మాత్రం కేటీఆర్ కు ఇచ్చారు. ముందులో మంచింగ్ చేయడానికి ఒకడు ఉండాలి వీడు వాడే. అంటూ కవిత తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.సంతోష్‌కు ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు. ఇప్పుడు షాట్. ఇది నాకు చెప్పింది పల్లా రాజేశ్వర్ రెడ్డి. 750 కోట్ల విల్లా ఎక్కడిదితనికి? నవీన్ రావు ఎమ్మెల్సీకి పదవి ఎలా వచ్చింది..సంతోష్ వాళ్ళ. హరీష్ రావు, సంతోష్ రావులు తలో వర్గం మేంటేయిన్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ లతో కుమ్మక్కు అయి బిఆర్ఎస్ ఓడిపోయేలా చేశారు. చివరకు కెసిఆర్ కామారెడ్డిలో ఓడిపోయేలా చేశారు. హరీష్ రావు మీడియాను మేనేజ్ చేస్తే, రాం అన్న యూట్యూబ్ ను మేనేజ్ చేస్తారు. రాం అన్నకు చెప్తున్న నువ్వు కూడా హరీష్ రావు లాగా నేర్చుకో. కూతురిగా చెప్తున్న వీళ్ళను పార్టీలో ఉంచుకుంటే వీళ్లు మిమ్మల్ని కూడా మింగేస్తారు. వీరు ఇద్దరు మేక వన్నె పులులు. అంటూ కవిత, కేసీఆర్ మేనల్లుళ్లు అయిన హరీశ్ రావు, సంతోష్ రావు లపై ధ్వజమెత్తారు.