పూర్ణాహుతితో ముగిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు
పూర్ణాహుతితో ముగిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు
ప్రజా క్షేత్ర్, తిరుపతి :
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చతుష్టార్చన, మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగిశాయి.