గౌలిపుర బోనాలకు విజయవాడ కనక దుర్గ దేవాలయం ఈ ఓ కు ఆహ్వానం
గౌలిపుర బోనాలకు విజయవాడ కనక దుర్గ దేవాలయం ఈ ఓ కు ఆహ్వానం
ప్రజా క్షేత్ర్, విజయవాడ :
హైదరాబాద్ పాతబస్తీ గౌలిపుర శ్రీ మహంకాళి మాతేశ్వరి, భారత మాత దేవాలయం, శ్రీ కోటమైసమ్మ దేవాలయంలో జూలై, 20,21 వ తేదీన జరుగనున్న బోనాల ఉత్సవాలకు రావాలని కోరుతూ విజయవాడ కనక దుర్గ దేవాలయం ఈ ఓ శ్రీను నాయక్ కు ఆలయ కమిటీ చైర్మన్ ఎర్మనీ కైలాష్ బృందం ఆహ్వానం అందజేసింది. ఈ సందర్బంగా ఆలయ ఈఓ కు శాలువా తో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో గౌలిపుర దేవాలయ కమిటీ సభ్యులు ఆలయ అధ్యక్షులు ఎర్మని కైలాష్ గంగపుత్ర , వర్కింగ్ ప్రెసిడెంట్ కె. ఎస్. ఆనంద్ , ముఖ్య సలహాదారులు కె. జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , ప్రధాన కార్యదర్శి అల్లి మధు సుధన్ గిరి , ఉపాధ్యక్షులు బి. వై. శ్రీకాంత్ , ట్రెజరర్ బొడ్డు సాయి బాబా , యెంగిలి. రాజు తదితరులు పాల్గొన్నారు.