రెడ్డమ్మల బోనంకు వందలాదిగా మహిళలు తరలిరండి

రెడ్డమ్మల బోనంకు వందలాదిగా మహిళలు తరలిరండి

 రెడ్డమ్మల బోనంకు వందలాదిగా మహిళలు తరలిరండి

ప్రజా క్షేత్ర్, చార్మినార్​, జూలై 14

ఈ నెల 15వ తేదీన మేకల్​బండలోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో రెడ్డి జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రెడ్డమ్మల బోనంకు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరుతూ రాజన్నబావి రెడ్డి జన సంఘం ప్రతినిధులకు రెడ్డి జాగృతి ప్రతినిధుల బృందం ఆహ్వాన పత్రికను అందజేసింది. నాలుగు వందల మంది మహిళలతో ఛత్రినాక శివ పార్వతి ఫంక్షన్​ హాల్​ నుంచి మేకల్​ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం వరకు బోనాల ఊరేగింపు జరుగనుందన్నారు. ఈ రెడ్డమ్మ బోనాలకు వందలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జ జగన్​ మోహన్​రెడ్డి, ఎండపల్లి నవీన్​రెడ్డి, సామ మహేందర్​రెడ్డి, తుమ్మల పల్లె స్వప్నారెడ్డి, కోశాధికారి రెడ్డిడి సబితా రెడ్డి, కార్యదర్శి గొపిడి సబితారెడ్డి, రాష్ట్ర నాయకురాలు మాధవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.