నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామంలో బిజెపి జెండా ఎగరాలి : రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు
బిజెపి తోనే వికసిత్ తెలంగాణ నిర్మాణం సాద్యం
*నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామంలో బిజెపి జెండా ఎగరాలి.
*ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ గెలిచేలా ప్రతి ఒక్కరు పనిచేయాలి
*కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం అందరం కలసి ఉద్యమించాలి
ప్రజా క్షేత్ర్, నల్లగొండ, జూలై 14
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు చౌటుప్పల్ పర్యటన సందర్భంగా కార్యకర్తలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జరిగిన స్వాగతసభలో ఎన్. రాంచందర్ రావు మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా తొలి పర్యటనను నల్లగొండ జిల్లాలో చేయాలని కోరాను. నేను పుట్టిన జిల్లా ఇదే కావడంతో ప్రత్యేకంగా కోరాను. పార్టీ కూడా అందుకు నుమతినిచ్చింది. పార్టీ బలోపేతం కోసం కృషి చేయమని సూచించింది.తెలంగాణలో బిజెపి ప్రభుత్వం రావాలని ఎంతోకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ రోజు కార్యకర్తలు, ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహమే దీనికి నిదర్శనమన్నారు..నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామంలో బిజెపి జెండా ఎగరాలి. ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ గెలిచేలా ప్రతి ఒక్కరు పనిచేయాలి.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం అందరం కలసి ప్రజా ఉద్యమం చేయాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను, విద్యార్థులను మోసం చేసింది.రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టింది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో పాటు పాలనా వైఫల్యంతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మారుస్తోంది. ప్రజలు ‘ఎందుకు కాంగ్రెస్‌ను ఎన్నుకున్నాం’ అనే బాధపడుతున్నారు.బిజెపి మాత్రమే బంగారు తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, వికసిత్ తెలంగాణ నిర్మించగలదు. అందుకే బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయం.రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలందరూ కలిసిమెలిసి పనిచేసి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా కృషిచేయాలని రామ చంద్రార్ రావు పిలుపునిచ్చారు