ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన డా. దత్తాత్రేయుడు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన డా. దత్తాత్రేయుడు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని ప్రముఖ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ని కలిసిన డా. దత్తాత్రేయుడు , విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, కృషిని అభినందించారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టం అభివృద్ధిలో ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.