ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పై దాడి
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పై దాడి
గట్టిగా రెండు సార్లు ఆమె చెంపపై కొట్టి జుట్టు పట్టుకుని మరీ బాదిన వైనం
ప్రజా క్షేత్ర్న్యూ, ఢిల్లీ ఆగస్టు 20 :
: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పై బుదవారం దాడి జరిగింది. సీఎం నివాసంలో జన్ సున్వాయి కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఆ అటాక్ జరిగింది. తన సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి సీఎం రేఖా గుప్తాపై అకస్మాత్తుగా దాడి చేశాడు. ఆ వ్యక్తి 30 ఏళ్ల ఉంటాడని బీజేపీ నేతలు చెబుతున్నారు. సీఎంపై దాడి చేసిన వ్యక్తిని.. అక్కడ ఉన్న సీఎం సిబ్బంది తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. పబ్లిక్ మీటింగ్‌లో సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వ్యక్తి ఎందుకు దాడికి పాల్పడ్డారన్న కోణంలో విచారణ నిర్వహిస్తున్నారు. గట్టిగా రెండు సార్లు ఆమె చెంపపై కొట్టినట్లు తెలుస్తోంది. జుట్టు పట్టుకుని మరీ బాదినట్లు చెబుతున్నారు. జుట్టు పట్టి పీకడంతో.. తలకు గాయాలైనట్లు తెలుస్తోంది