Hostel Warden Suspended | మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్ వార్డెన్ సస్పెండ్
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్ వార్డెన్ సస్పెండ్
మలక్పేట(Malakpet) ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్లో 8 ఏండ్ల అంధ బాలిక లైంగిక దాడి ఘటనపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ ఇంచార్జీ వార్డెన్(Govt Blind Girls Hostel Warden) బి. స్వప్నను గురువారం సస్పెండ్(Suspended) చేశారు. సంఘటనపై నిజనిర్దారణ కమిటీని నియమంచి పూర్తిస్థాయి రిపోర్టు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ కమిటీలో వికాలంగుల సాధికారత శాఖ డైరెక్టర్, కమిషనర్ బి. శైలజ, సభ్యులుగా బీసీ సంక్షేమ శాఖాధికారి ఆశన్న, , ఏ రాజేందర్లను నియమించారు. ఈ కమిటి రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి.