*అంగరంగ వైభవంగా పాతనగర బోనాల ఉత్సవాలు*

*అంగరంగ వైభవంగా పాతనగర బోనాల ఉత్సవాలు*

*అంగరంగ వైభవంగా పాతనగర బోనాల ఉత్సవాలు*

*రాష్ట్ర  ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు*

*బంగారు బోనం సమర్పించిన మహిళా ప్రముఖులు*

ప్రజా క్షేత్ర్, చార్మినార్​  : 

బోనాల పండుగ పర్వదిన వేడుకలను పాతబస్తీ ప్రజలు ఆదివారం భక్తిశ్రద్దలతో కన్నుల పండువగా జరుపుకున్నారు. సుధూర ప్రాంతాలంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనం, నైవేద్యం, సాక సమర్పించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని మొక్కుకున్నారు. గత తొమ్మిదిరోజులుగా ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించిన భక్తులు పర్వదినాన అమ్మవారికి బోనాలు సమర్పించి తమ భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. దక్షణమండలం డిసిపి స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో గట్టి పోలీస్​ బందోబస్తు నడుమ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పాతనగరంలో పలు ప్రధాన దేవాలయాలతో పాటు వీధులు వేలాది మంది భక్తులతో క్రిక్కిరిసాయి. గంటల తరబడి క్యూలో నిలబడి మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. హుషారెత్తించే గీతాలు... జానపదగేయాలు... డప్పువాయిద్యాలు... పోతరాజుల వీరంగం.... నృత్యాలు చేస్తూ పాతనగర వాసులు బోనాల పండుగ పర్వదినాన్ని అత్యంతవైభవంగా జరుపుకున్నారు. తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత వైభవంగా జరుపుకునే పాతబస్తీ బోనాల ఉత్సవాలకు ప్రముఖులతో పాటు సినీనటులు, మంత్రులు, ఎమ్మల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాగం రాకతో పాతబస్తీ సందడిగా మారింది. పాతనగరంలోని 117వ ఉత్సవాలు జరుపుకుంటున్న లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం , హరిబౌళి శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం, శ్రీ బంగారుమైస్మ దేవాలయం, మీరాలం మండి శ్రీ మహంకాళి దేవాలయం, చార్మినార్​ భాగ్యలక్ష్మి దేవాలయం, గౌలిపురా శ్రీ మహంకాళి దేవాలయం, ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం, చందులాల్​ బేలాలోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయం, సుల్తాన్​షాహి శ్రీ జగదాంబ దేవాలయం, మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం,  అలియాబాద్​లోని శ్రీ దర్బార్​ మైసమ్మ దేవాలయం, మేకల్​ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, చాంద్రాయణగుట్టలోని  బంగారు మైసమ్మ దేవాలయం, శ్రీ కనకదుర్గ దేవాలయాలను ప్రముఖ సినీనటులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆయా ఆలయాలలో అమ్మవారికి  మహాభిషేకం, బోనాల సమర్పణ, శాంతి కళ్యాణం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రం ప్రభుత్వం తరపున పలు దేవాలయాలోని అమ్మవారికి పట్టువస్త్రాలు, శాంతి కళ్యాణం కోసం తలంబ్రాలను సమర్పించారు. ఆదివారం తెల్లవారుజామున లాల్​దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో మాజీ హోం శాఖా మంత్రి దేవేందర్​ గౌడ్​ కుమారుడు వీరేందర్​గౌడ్​ కుటుంబం అమ్మవారికి అభిషేక పూజలో పాల్గొన్నారు. అనంతరం స్వర్గీయ చింతమల దేవయ్య వారసులు దశరథ్​, మల్లేష్​ కుటుంబ సభ్యులు ఆధ్యర్యంలో లాల్​దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. తదనంతరం అమ్మవారికి బోనాల సమర్పణ ప్రారంభమైంది. 

*రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ* ...

రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖమంత్రి భల్లు భట్టి విక్రమార్క, నగర ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్​, రాజ్య సభ సభ్యులు అనిల్​కుమార్​ యాదవ్​ లు ​ సింహవాహిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. లాల్​దర్వాజా ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్​ జిల్లా కలెక్టర్​ హరిచందన దాసరి , దేవాదాయ శాఖ కమిషనర్​ ​ వెంకట్​రావులు పూర్ణ కుంభంతో  ఘనంగా స్వాగతం పలికారు. హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్​బాబు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర అమ్మవారికి మంత్రి జూ పల్లి కృష్ణారావు అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. చార్మినార్​ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమట్​ రెడ్డి వెంకట్​ రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. గౌలిపురా శ్రీ భారతమాత కోట మైసమ్మ అమ్మవారికి మంత్రి వాకిటి శ్రీహరి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారికి శాసనమండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. బంగారు మైసమ్మ అమ్మవారికి జీహెచ్ఎంసి మేయర్​ గద్వాల్​విజయలక్ష్మి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అలియాబాద్​ దర్బార్​ మైసమ్మ అమ్మవారికి డిప్యూటి స్పీకర్​ జాటోథ్​ రాంచందర్​ నాయక్​ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.

*బంగారు బోనం సమర్పించిన ప్రముఖులు* ... 

ఆషాడమాసం బోనాల పండుగ సందర్భంగా హర్యాన గవర్నర్​ బండారు దత్తాత్రేయ, హైకోర్టు జస్టిస్​ ఎస్​.నంద, గ్రేటర్​ మేయర్​ గద్వాల విజయలక్ష్మి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్​ డాక్టర్​ సిహెచ్​ ప్రీతిరెడ్డి, బడంగ్ పేట్​ మాజీ కార్పొరేటర్ పెద్దబావి మౌనిక సుదర్శన్​రెడ్డి దంపతులు సమర్పించారు. జోగిని శ్యామల అమ్మవారికి వెండి బోనం సమర్పించారు. 

*ప్రముఖుల సందర్శన*....

అమ్మవారిని దర్శించుకున్న వారిలో హర్యాన గవర్నర్​ బండారు దత్త్రాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ , మంత్రులు అట్లూరి లక్ష్మణ్​, వాకిటి శ్రీహరి ముదిరాజ్ దంపతులు, మాజీ మంత్రులు గీతారెడ్డి, సి.కృష్ణాయాదవ్​, టీటీడీ చైర్మన్​ విఆర్​ నాయుడు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్​కుమార్​ గౌడ్​ , శాసనమండలి డిప్యూటి చైర్మన్​బండ ప్రకాష్​ ముదిరాజ్​ , డిప్యూటి స్పీకర్​ జె.రాందర్​ నాయక్​ , ఎంపిలు డి.కె అరుణ, డాక్టర్​ కె.లక్ష్మణ్​ , చామల కిరణ్​కుమార్ రెడ్డి, మాజీ ఎంపిలు ఎం.అంజన్​కుమార్​ యాదవ్​, వి.హనుమంత్​రావు, హైకోర్టు జస్టిస్​ ఎస్​.నంద, నగర మేయర్​ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటి మేయర్​ శ్రీలత శోభన్​ రెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు దానం నాగేందర్​, రాజాసింగ్, పైడి రాకేష్​రెడ్డి, మక్కాన్​ సింగ్​ రాజ్​ ఠాకూర్​, మురళీనాయక్​, సినీ నటుడు మంచు మనోజ్​, రాష్ట్ర బిసి కమిషనర్​ చైర్మన్​ జి.నిరంజన్​, ఫైనాన్స్​ కమిటీ చైర్మన్​ రాజయ్య, ప్లానింగ్​ కమిషన్​ చైర్మన్​ చిన్నారెడ్డి, ఫిషరీస్​ మెన్​ కమిటీ చైర్మన్​ మెట్టు సాయికుమార్​, వైశ్య కార్పొరేషన్​ చైర్మన్​ కాల్వ సుజాత, మాజీ బీసీ కమిషన్​ చైర్మన్​ వకులాభరణం కృష్ణమోహన్​రావు, మాజీ  ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు మాధవిలత, చీకోటి ప్రవీణ్​కుమార్​, కాంగ్రెస్​ నాయకులు ఫేరోజ్​ ఖాన్​, జోగిని శ్యామల, జోగిని నిషాక్రాంతి, గాయకురాలు మధుప్రియ, సినీ ఆర్టిస్ట్​ కరాటే కళ్యాణి, గోరక్షక సమితి బాలకృష్ణ గురుస్వామి , ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గోపిశెట్టి రాఘవేందర్​ తదితరులు ఉన్నారు. ఈ సందర్బంగా ఆలయాలను సందర్శించిన ప్రముఖులకు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గోపిశెట్టి రాఘవేందర్​,  వివిధ ఆలయ కమిటీ చైర్మన్ లు బి.మారుతీయాదవ్​, గాజుల అంజయ్య, రాకేష్​ తివారి, ఎర్మని కైలాష్​, పొటేల్​ సదానంద్​ యాదవ్​, జనగామ మధుసూధన్​గౌడ్​, ప్రభాకర్​, నరేష్​, హన్స్​ రాజ్​ తదితరులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.