ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలకు సీ ఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలకు సీ ఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. జూలై 13 న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా మంత్రులు కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్ లతో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, అర్చకులు కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా మహంకాళి ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి కి ఆశీర్వచనం అందించారు.