రికార్డు బ్రేక్ చేసిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట
రికార్డు బ్రేక్ చేసిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట
*హోరాహోరీగా సాగిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట*
*రూ. 35 లక్షలకు బాలాపూర్ గణేష్ లడ్డును సొంతం చేసుకున్న లింగాల దశరథ్ గౌడ్*
*లడ్డును బీజేపీ అగ్రనేతలకు పంపిణీ చేస్తాం....... దథరథ్ గౌడ్*
*బాలాపూర్ గణేష్ ని దర్శించుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి*
*మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి*
*బడంగ్ పేట్ మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నర్సింహారెడ్డి*
*భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శశిధర్*
ప్రజా క్షేత్ర్ , సెప్టెంబర్ 6 :
హైదరాబాద్ లో కదిలో తొలివినాయకుడు ... బాలాపూర్ గణపతి 21 కిలోల లడ్డు వేలం పాటకు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామం బొడ్డురాయి వేదికయ్యింది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట వేలాదిమందిభక్త జన సందోహం నడుమ చంపాపేట్ కు చెందిన మర్రి రవికిరణ్ రెడ్డి, ఎల్ బినగర్ అర్బన్ గ్రూప్ కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి, కర్మాన్ ఘాట్ కుచెందిన లింగాల దశరథ్ గౌడ్, కర్మాన్ ఘాట్ కు చెందిన కంచర్ల శివా రెడ్డి, కందుకూరు కొత్తగూడెం కు చెందిన సామరామ్ రెడ్డి (దయ), హైదరాబాద్ కు చెందిన పిఎస్ కె ( PSK) గ్రూప్, చంపాపేట్ కు చెందిన జిట్టా పద్మా సురేందర్ రెడ్డి అనే ప్రధాన పోటీదారుల మధ్య రూ.1016 తో ప్రారంభమై హోరాహోరీగా సాగిన పోరులో రూ. 35లక్షలకు కర్మాన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ రూ. 35 లక్షలకు 21 కిలోల లడ్డును సొంతం చేసుకున్నారు. తాజాగా 32వ సారి బాలాపూర్ గణేష్ లడ్డును వేలం పాటలో దక్కించుకున్న జాబితాలో లింగాల దశరథ్ గౌడ్ చేరిపోయారు. 45 వసంతాల గణేష్ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా గత 32 సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాటకు తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశ, ప్రపంచ వ్యాప్తంగా విశిష్ఠ గుర్తింపు ఉంది. కరోనా కారణంగా 2020లో బాలాపూర్ గణపతి లడ్డు వేలం పాటను రద్దు చేశారు. దీంతో ఆ లడ్డును అప్పట్లో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి బృందం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహుకరించారు. 2021లో జరిగిన వేలం పాట కంటే 2022లో 5.70లక్షలు రెట్టింపు, 2022 లో జరిగిన వేలం పాట కంటే 2023లో 2.40 లక్షలు, 2023 లో జరిగిన వేలం పాట కంటే 2024లో రూ. 3,01,000 లక్షలు ఈ యేడు రూ. 4.99 లక్షలు అధిక ధర పలికింది. బాలాపూర్ లడ్డువేలం పాట చరిత్రలో ఈ యేడు రికార్డు బ్రేక్ చేసింది. లడ్డు వేలం పాటలో గడిచిన 31 ఏళ్లలో రూ.2,39,52,950కోట్ల రూపాయలు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సొంతం కాగా అందులో ని రూ. 1,64,87,970 కోట్ల రూపాయలతో బాలాపూర్ గ్రామంలో పలు అభివృద్ది పనులు చేపట్టడం జరిగింది. అయితే ఈ ఏడు జరిగిన వేలం పాటతో కలిపి రూ.2కోట్ల 74లక్షల 52వేల 950 రూపాయలు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సొంతమయ్యాయి. అయితే గత సంవత్సరం 2024లో బాలాపూర్ గణేష్ లడ్డు ను వేలం పాటలో దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి రూ. 30,01,000 లక్షల నగదు ను గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్లెం నిరంజన్ రెడ్డికి అందజేశారు. నగదు ను అందజేసిన కొలను శంకర్ రెడ్డికి గణేష్ ఉత్సవసమితి తరపున లక్ష రూపాయల విలువ గల బంగారు చైన్ ను అందజేశారు.
*తెల్లవారుజామున 5గంటలకే ప్రారంభమయిన నిమజ్జన పూజలు* ....
తెల్లవారుజామున 5గంటల నుంచే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జన పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం బాలాపూర్ గణేష్ మండపం నుంచి బాలాపూర్ పుర వీధులగుండా సన్నాయి మేళాలు .. భజన కార్యక్రమాల నడుమ బాలాపూర్ గణపతి ఊరేగింపుగా ముందుకు కదిలింది. దారిపొడవునా బాలాపూర్ గ్రామస్థులు కొబ్బరి కాయలు కొట్టి, మంగళ హారతులు పట్టారు. 10.34 గంటల ప్రాంతంలో బాలాపూర్ గణపతి డిసిఎం వ్యాన్ లో బొడ్డురాయి వద్దకు చేరుకుంది. ఉదయం 10.54 గంటలకు బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట అట్టహాసంగా ప్రారంభయ్యింది.
*బొడ్డురాయి వద్దకు 1.30గంటలు ఆలస్యంగా చేరుకున్న బాలాపూర్ గణేష్* .....
బాలాపూర్ గ్రామ పురవీధుల్లో బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని డీసీఎం వ్యాన్లో ఊరేగిస్తుండగా ఉదయం 9.10గంటలకు ఒక్కసారిగా డీసీఎం వ్యాన్ లెఫ్ట్ సైడ్ కమాన్ పట్టిలో విరిగి పోవడంతో ఒక్కసారిగా భారీ గణేష్ విగ్రహం ఒక వైపుకు ఒరగడంతో, ఎక్కడ గణేష్ విగ్రహం కిందపడుతుందోనని ఒక్కసారిగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, పోలీసులు ఆందోళనకు గురయ్యారు. రోడ్డుకు సమాంతరంగా వెళ్ళాల్సిన డీసీఎం వ్యాన్ అదుపుతప్పుతుండడం... భారీ విగ్రహం ఓ పక్కకు ఒరగడం ద్వారా గల్లీల్లో ఉన్న ఇండ్లకు సంబంధించిన రేకులతో పాటు డీసీఎం వ్యాన్కు అడ్డుగా ఉన్న ఇండ్లముందు నిర్మించుకున్న అరుగులను తొలగించారు. దీంతో 9గంటల వరకు బాలాపూర్ గ్రామ బొడ్డురాయి వద్దకు చేరుకోవాల్సిన బాలాపూర్ గణేష్ విగ్రహం గంటన్నర ఆలస్యమయ్యింది.
*హోరా హోరీగా సాగిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట* ......
బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరపున రూ. 1016 లతో వేలం పాట అట్టహాసంగా ప్రారంభమయ్యింది. దివంగత కొలను మోహన్రెడ్డి రూ.50వేలు, మర్రి రవికిరణ్రెడ్డి ఒక లక్ష, సామ ప్రణీత్ రెడ్డి రూ.2లక్షలు, లింగాల దశరథ్ గౌడ్, రూ.3లక్షలు, కంచర్ల శివారెడ్డి రూ.4లక్షలు, సామ రామ్ రెడ్డి రూ.6లక్షలు, పిఎస్ కె గ్రూప్ రూ. 7లక్షలు, జిట్టా సురేందర్ రెడ్డి రూ.8లక్షలు, మర్రి రవికిరణ్ రెడ్డి రూ.9లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.10లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.11లక్షలు, కంచర్ల శివారెడ్డి రూ.12లక్షలు, సామ రాంరెడ్డి రూ.13లక్షలు, పి ఎస్ కె గ్రూప్ రూ.14లక్షలు, జిట్టా సురేందర్ రెడ్డి రూ.15 లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.16లక్షలు, మర్రి రవికిరణ్రెడ్డి రూ.17లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.18లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.19 లక్షలు, కంచర్ల శివారెడ్డి రూ.20లక్షలు, సామ రాంరెడ్డి రూ.21లక్షలు, పిఎస్ కె గ్రూప్ రూ.22 లక్షలు, జిట్టా సురేందర్ రెడ్డి రూ.23 లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.24 లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.25 లక్షలు, మర్రి రవికిరణ్ రెడ్డి రూ.26 లక్షలు, సామ రాం రెడ్డి రూ.27 లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.28లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ. 29 లక్షలు, జిట్టా సురేందర్ రెడ్డి రూ.30లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.30.25 లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ. 30.50లక్షలు, సామ రాంరెడ్డి రూ.30.75 లక్షలు, మర్రి రవికిరణ్ రెడ్డి రూ.31 లక్షలు, పిఎస్ కె గ్రూప్ 31.25 లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి 31.50లక్షలు, కంచర్ల శివారెడ్డి 31.75 లక్షలు, సామ రాం రెడ్డి రూ.32 లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి 32.25 లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ 32.50 లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ. 32.75 లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.32.80వేలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.33 లక్షలు, లింగాల దశరథ్ రౌడ్ రూ.33.25లక్షలు, కంచర్ల శివారెడ్డి రూ.33.50లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.33.75లక్షలు ,సామ ప్రణీత్ రెడ్డి రూ.33.80లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ. 33.90లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ. 33.95లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.34లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ. 34.25లక్షలు, కంచర్ల శివారెడ్డి 34.50లక్షలు, సామ రాం రెడ్డి రూ.34.70లక్షలు, సామ ప్రణీత్ రెడ్డి రూ.34.75లక్షలు, లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షలు ఒకటవ సారి... రెండవసారి... మూడవసారి అంటూ బాలాపూర్ గణేష్ లడ్డును దక్కించుకున్న 32వ జాబితాలో చేరిపోయారు.
*హాజరయిన ప్రముఖులు*.....
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాటకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి, జెడ్పి చైర్మన్ తీగల హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, బడంగ్ పేట్ మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నర్సింహా రెడ్డి, భాగ్య నగర్ గణేష్ ఉత్సవసమితి అధ్యక్షులు రాఘవరెడ్డి, కార్యదర్శి శశిధర్, పీ స్థానిక కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు కొలను శంకర్ రెడ్డి, దైవాజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు.
*రూ. 35 లక్షలకు లడ్డును సొంతం చేసుకున్న లింగాల దశరథ్ గౌడ్*..
బాలాపూర్ గణేష్ లడ్డును వేలం పాటలో దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని లింగాల దశరథ్ గౌడ్ అన్నారు. గత ఆరు సంవత్సరాలుగా వేలం పాటలో పాడుతున్న తనకు 2025 లో లడ్డు దక్కడం అదృష్టం గా భావిస్తున్నానన్నారు. ఈ లడ్డును కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండిసంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, ఎంపి ఈటెల రాజేందర్ లతో పాటు బీజేపీ అగ్రనేతలకు పంపిణీచేస్తామని ధశరథ్ గౌడ్ పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడైన దశరథ్ గౌడ్ కు స్టీల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.