ప్రపంచ శాంతి కోసం ప్రత్యంగిరా వారాహి యజ్ఞం
ప్రపంచ శాంతి కోసం ప్రత్యంగిరా వారాహి యజ్ఞం
ప్రజా క్షేత్ర్, విజయవాడ జూలై 5 :
ప్రపంచ శాంతి కోసం , ప్రజలందరు సుఖ శాంతులతో ఉండాలని ప్రత్యంగిరా వారాహి మాత ఆశీస్సుల వల్ల జరగాలనే సంకల్పం తో విజయవాడ కృష్ణలంక లోని హరిహర గో సేవ క్షేత్రంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పైనైట్ ఇన్ఫో సొల్యూషన్స్ సిఎండి నవీన్ పామిడి ల సౌజన్యంతో జరిగిన వారాహి ప్రత్యంగిరా మాతల నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన పూర్ణాహుతి కార్యక్రమానికి పైనైట్ ఇన్ఫో సొల్యూషన్స్ సిఎండి నవీన్ పామిడి ప్రత్యేక అతిథిగా హాజరై పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించిన శంకర విశ్వేశ్వర స్వామి, నారాయణి ప్రత్యంగిరా మాత పీఠాధిపతులు నవరాత్రుల మహోత్సవం యొక్క గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేబి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.