ఈ నెల 22న వరంగల్ భద్రకాళి అమ్మవారికి లాల్ దర్వాజ సింహావాహిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సమర్పించనున్న బంగారు బోనం

ఈ నెల 22న వరంగల్ భద్రకాళి అమ్మవారికి లాల్ దర్వాజ సింహావాహిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సమర్పించనున్న బంగారు బోనం

ఈ నెల 22న వరంగల్ భద్రకాళి అమ్మవారికి లాల్ దర్వాజ సింహావాహిని మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సమర్పించనున్న బంగారు బోనం

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

లాల్ దర్వాజా సింహావాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ అధ్వర్యంలో వరంగల్ భద్రకాళి దేవాలయంలో భద్ర కాళీ అమ్మవారికి ఈ నెల 22 వ తేదీన తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంప్రదాయ బద్దంగా బంగారుబోనం సమర్పించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మారుతీ యాదవ్, కన్వీనర్ జి. అరవింద్ కుమార్ గౌడ్, మాజీ అధ్యక్షులు వెంకటేష్ లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వరంగల్ భద్రకాళి అమ్మవారికి సమర్పించనున్న బంగారు బోనం కార్యక్రమానికి వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ భద్రకాళి దేవాలయం చైర్మన్ డాక్టర్ బి. శివ సుబ్రహ్మణ్యం,సహాయక కమిషనర్, కార్యనిర్వాహక అధికారి కె. శేషు భారతి, తదితరులు పాల్గొననున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది.