విజయవాడలో తెలంగాణ బోనాల జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి : ఊరేగింపు కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్

విజయవాడలో తెలంగాణ బోనాల జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి : ఊరేగింపు కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్

విజయవాడలో తెలంగాణ బోనాల జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి : ఊరేగింపు కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్

ఏపి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి కి వినతి పత్రం సమర్పించిన ఉమ్మడి ఊరేగింపు కమిటీ

ప్రజా క్షేత్ర్, చార్మినార్​ :

భాగ్యనగర్​ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో  విజయవాడలో జూన్ 29వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ బోనాల జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డిని బుధవారం ఉమ్మడి ఊరేగింపు కమిటీ చైర్మన్​ గోపిశెట్టి రాఘవేందర్ బృందం మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించింది. ఈ మేరకు అందజేసిన విజ్ఞాపన పత్రంలో గత 15 ఏళ్లుగా భాగ్యనగర్​ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో తెలంగాణ బోనాల జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాలలో భాగంగా భాజాభజంత్రీల నడుమ పోతరాజుల నృత్యాలతో విజయవాడ బ్రాహ్మణ వీధిలోని ఈవో కార్యాలయం నుంచి విజయవాడ కనక దుర్గమ్మ గుడి వరకు జాతర సాగుతదని, అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు బోనం, వడి బియ్యం, పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ యేడు కూడా విజయవాడలో తెలంగాణ బోనాల జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రికి విన్నపించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని చైర్మన్​ గోపి శెట్టి రాఘవేందర్ పేర్కొన్నారు. మంత్రికి వినతిపత్రం సమర్పించిన వారిలో ఉమ్మడి కమిటీ ప్రతినిధులు జనగామ మధుసూధన్​గౌడ్, మధుసూదన్ యాదవ్, రామ్ దేవ్ అగర్వాల్, దత్తాత్రేయ, దినేష్, చేతన్ సూరి, గట్టు శ్రీనివాస్, భిక్షపతి ముదిరాజ్, సాత్విక్ తదితరులు ఉన్నారు.