ఢిల్లీ లో బోనాల ఉత్సవాలకు బయలుదేరిన లాల్ దర్వాజా ఆలయ కమిటీ
ఢిల్లీ లో బోనాల ఉత్సవాలకు బయలుదేరిన లాల్ దర్వాజా ఆలయ కమిటీ
ప్రజా క్షేత్ర్, చార్మినార్:
దేశ రాజధాని ఢిల్లీలో లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలకు ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతీ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం బయలుదేరి వెళ్ళారు.ముందుగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కమిటీ సభ్యులు ఆలయం నుండి లాల్ దర్వాజా మోడ్ వరకు ఊరేగింపు నిర్వహించారు.అక్కడి నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళి రైలులో ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఈ నెల 30 తేదీన తెలంగాణ భవన్ లో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం, జూలై 1 న ఇండియా గేట్ నుండి తెలంగాణ భవన్ వరకు అమ్మవారి ఘటం తో భారీ ఊరేగింపుగా తీసుకొని వచ్చి తెలంగాణ భవన్ లో ప్రతిష్ఠాపన చేస్తారు.2 వ తేదీన పోతరాజు స్వాగతం,అమ్మవారికి బంగారు,పట్టువస్త్రాలు సమర్పణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్ తెలిపారు. ఢిల్లీ బయలుదేరి వెళ్లిన వారిలో ఆలయ కమిటీ ప్రతినిధులు కె.విష్ణు గౌడ్, సి. వెంకటేష్,పోసాని సతీష్ ముదిరాజ్, ఎ.చంద్ర కుమార్, ఎ.వినోద్ కుమార్, ఎస్.శేషు నారాయణ తో పాటు వంద మంది కమిటీ సభ్యులు ఉన్నారు.