హెచ్‌-1బీకి ప్రత్యామ్నాయం ఓ-1!

హెచ్‌-1బీకి ప్రత్యామ్నాయం ఓ-1!

హెచ్‌-1బీకి ప్రత్యామ్నాయం ఓ-1!

*అసాధారణ ప్రతిభావంతులకు జారీ చేస్తున్న అమెరికా సర్కార్‌

*లాటరీ లేని హెచ్‌-1బీ వీసాగా గుర్తింపుతో పెరిగిన ఆదరణ

*ఈ వీసా లభించిన వారిలో 3వ స్థానంలో భారతీయులు

ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ జూన్ 29: అమెరికా ప్రేమికులకు హెచ్‌-1బీ వీసాకు నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఓ-1 వీసా మారింది. ఎస్‌టీఈఎంవ్యాపారంకళలుక్రీడలు వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభావంతుల కోసం ఈ వీసాను అమెరికన్‌ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది లాటరీ లేని హెచ్‌-1బీ వీసాగా పేరు పొందింది. దీనిపై భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. టాప్‌ కంపెనీలు కూడా ఈ వీసా ద్వారా నిపుణులను ఉద్యోగులుగా నియమించుకొనేందుకు ముందుకొస్తున్నాయి.

ఈ ఓ-1 వీసా? అంటే ఏమిటి

దీనిని ఇమిగ్రేషన్‌ చట్టం1990 ప్రకారం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గొప్ప పురస్కారాలుస్కాలర్లీ పబ్లికేషన్స్‌తమ రంగంలో ఒరిజినల్‌ కంట్రిబ్యూషన్స్‌ వంటి ఎనిమిది కఠినమైన ప్రమాణాలను నిర్దేశించింది. అభ్యర్థి వీటిలో కనీసం మూడింటిని సాధించి ఉండాలి. అయితేచెప్పుకోదగ్గ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటేవార్షిక లాటరీ కానిపరిమితులు కాని లేవు. 93 శాతం అప్రూవల్‌ రేటు ఉంది. మూడేళ్ల వరకు చెల్లుబాటు ఉందిగడువును పొడిగించుకునే అవకాశాలు అపరిమితం.

అనిశ్చితిని అధిగమించొచ్చు

హెచ్‌-1బీ వీసాకు విపరీతమైన తనిఖీలుపరీక్షలు ఎదురవుతున్నాయి. అప్రూవల్‌ రేటు 37 శాతమే. అదే ఓ-1 వీసా ద్వారా అయితే అత్యధిక నైపుణ్యంగల ప్రతిభావంతులు వ్యవస్థాగత అనిశ్చితిని అధిగమించొచ్చు. అందుకే ఇది ఆకర్షణీయంగా మారింది. అమెరికన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ డేటా ప్రకారం.. 2020 ఆర్థిక సంవత్సరంలో 8,838 ఓ-1ఏ వీసాలు జారీ కాగా2023 ఆర్థిక సంవత్సరంలో 18,994 జారీ అయ్యాయి. వీటిని పొందినవారిలో బ్రిటన్‌బ్రెజిల్‌ తర్వాతి స్థానంలో భారతీయులు ఉన్నారు. భారతీయులకు 1,418 ఓ-1ఏ వీసాలు వచ్చాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో 487 ఓ-1ఏ వీసాలు భారతీయులకు లభించాయిఅంటే191 శాతం పెరుగుదల నమోదైంది. ఎస్‌టీఈఎం గ్రాడ్యుయేట్లుఏఐ రీసెర్చర్స్‌ఎంటర్‌ప్రెన్యూవర్స్‌కళాకారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు.

 

టాప్‌ స్పాన్సర్స్‌లో టెస్లాగూగుల్‌

ఓ-1 ట్యాలెంట్‌ను చురుగ్గా స్పాన్సర్‌ చేస్తున్న ప్రధాన అమెరికన్‌ సంస్థల్లో గూగుల్‌టెస్లామెక్‌కిన్సే వంటివి ఉన్నాయి. అదేవిధంగా హార్వర్డ్‌యేల్‌ వంటి విశ్వవిద్యాలయాలు భారతీయ ఫ్యాకల్టీని ఈ వీసాల ద్వారా నియమించుకుంటున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) బూమ్‌ వల్ల ఈ వీసాలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ఓ-1 వీసా దరఖాస్తుదారులు తమ పరిశోధనను ప్రచురించాలనిసమావేశాల్లో ప్రసంగించాలనిలేదాపేటెంట్లను దాఖలు చేయాలనిఇలా చేయడం వల్ల దరఖాస్తులకు ఆమోదం లభించే అవకాశాలు పెరుగుతాయని కంపెనీలు సలహా ఇస్తున్నాయి. ఉదాహరణకు, ‘ది క్యూరియస్‌ మావరిక్‌’ అనే విద్యా సంస్థను స్థాపించిన సౌందర్య బాలసుబ్రమణి (28)కి ఓ-1ఏ వీసా వచ్చింది. దీనిని బట్టి సంప్రదాయ ఉపాధికి భిన్నంగా ఈ వీసా అందుబాటులో ఉన్నదనే విషయం తేటతెల్లమవుతున్నది.

సవాళ్లువ్యూహాలు

హెచ్‌-1బీ ఫీజు కన్నా 10 రెట్లు ఎక్కువగా అంటే 10,000 డాలర్ల నుంచి 30,000 డాలర్ల వరకు ఓ-1 వీసా పొందడానికి ఖర్చవుతుంది. అయినప్పటికీ ఈ వీసా కోసం అత్యధికంగా పెట్టుబడి పెడుతున్నారు. వీటికి పెరుగుతున్న డిమాండ్‌ వల్ల తమ క్లయింట్‌ రోస్టర్స్‌ 60 నుంచి 300కు పెరిగినట్లు జినీ గ్రీన్‌ కార్డ్‌ వంటి ఇమిగ్రేషన్‌ ఫర్మ్స్‌ చెప్తున్నాయి. ముఖ్యంగాహెచ్‌-1బీ లాటరీలో తిరస్కరణకు గురైన భారతీయులు ఓ-1 కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపాయి. ఓ-1ఏ వీసాలు ఏటా 10 శాతం చొప్పున పెరుగుతున్నాయి. కనీస జీతంఫార్మల్‌ డిగ్రీ వంటివేవీ అవసరం లేకపోవడంఅంతర్జాతీయ పురస్కారాలు లేదా మీడియా కవరేజ్‌ వంటివాటిని సాక్ష్యాలుగా అంగీకరించడంఅతి తక్కువగా 10 రోజుల్లోనే పిటిషన్లను ప్రాసెస్‌ చేయడం వంటి ఆకర్షణలు ఉత్తమ భారతీయ ప్రొఫెషనల్స్‌కుఅదేవిధంగాకంపెనీలకు ఓ-1 వీసా ప్రయోజనకరంగా మారింది.