40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారు : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా

40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారు :  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా

40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారు

             పసుపు బోర్డును ప్రారంభించిన కేంద్రమంత్రి అమిత్ షా

ప్రజా క్షేత్ర్, నిజామాబాద్‌ జూన్ 29 ;నిజామాబాద్‌లో కేంద్రమంత్రి అమిత్ షా పసుపు బోర్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని అన్నారు. పసుపు బోర్డు ఇక్కడికి రావడంలో రాష్ట్ర బీజేపీ ఎంపీల కృషి చాలా ఉందన్నారు. నిజామాబాద్ పసుపు ప్రపంచ మార్కెట్ లోకి వెళ్తుందనిపసుపు ధర పెరుగుతుందనివ్యాపారాలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. మార్కెటింగ్ఎక్స్‌పోర్ట్స్ ఆఫీస్ కూడా నిజామాబాద్‌లో ఉంటాయనివివిధ దేశాలకు ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే.. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా పాకిస్థాన్ మూకలకు బుద్ధి చెప్పామన్నారు. ఈ నేపథ్యంలోనే.. నక్సల్స్ ఆయుధాలు పక్కన పెట్టి లొంగిపొవడం మంచిదని సూచించారు. నక్సల్ కు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఆయుధాలు పట్టిన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. నక్సల్స్ కు మద్దతుగా మాట్లాడే వారువారి బాధిత కుటుంబాల పరిస్థితి తెలుసుకోవాలని అన్నారు. 2026 మార్చి చివరి వరకు నక్సల్స్ ను పూర్తిగా అంతమొందిస్తామన్నారు. రాష్ట్రంలో భారీ అవినీతి జరిగిందనితెలంగాణ మొన్నటి వరకు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా ఉందనిఇప్పుడు రేవంత్ రెడ్డికి మారిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే అవినీతి అంతం అవుతుందని కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.