గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో స్వల్ప తొక్కిసలాట
గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో స్వల్ప తొక్కిసలాట
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
గచ్చిబౌలి జియంసి బాలయేగి స్టేడియంలో యోగా దినోత్సవం వేడుకల్లో తోక్కిసలాట జరిగింది. గేట్ నేంబరు 2 దగ్గర బ్రేక్ ఫాస్ట్ పంపిణీ దగ్గర స్వల్ప తోపులాట జరిగింది. ఘటనలో ఒక యువతి సృహ కోల్పోయింది. ఆమెను గచ్చిబౌలి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. యువతి గాంధీ మెడికల్ కాలేజీ నర్సింగ్ స్టుడేంట్. చికిత్స నిమిత్తం కోండాపుర్ ఏరియా హస్పటల్ కు తరలించారు. యువతి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.