లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న పోలీసు అధికారులు

లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న పోలీసు అధికారులు

లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న పోలీసు అధికారులు

ప్రజా క్షేత్ర్, చార్మినార్  :

చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయాన్ని పలువురు పోలీసు అధికారులు గురువారం సాయంత్రం సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఛత్రినాక ఏసీపీ సి హెచ్.చంద్ర శేఖర్,ఛత్రినాక ఇన్స్పెక్టర్ కె.నాగేంద్ర ప్రసాద్ వర్మ తో పాటు పలువురు ఎస్ఐ లు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతీ యాదవ్ వారికి స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. వచ్చే నెలలో జరగనున్న బోనాల పండుగ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆలయ చైర్మన్ మారుతీ యాదవ్ పోలీస్ అధికారులకు వివరించారు.