జూలై 1న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవం
జూలై 1న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవం
ప్రజాక్షేత్ర్,, హైదరాబాద్ :
జూలై 1న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం , 2న రథోత్సవం జరగనున్నట్లు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా జరుగుతునట్లే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుందని అన్నారు... కల్యాణినికి రాష్ట్ర నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలో భక్తులు వస్తారు.. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసి , వాటర్ వర్క్స్ , విద్యుత్ , పోలీస్ , ఫైర్ , అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు..ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కేతినేని సరళ , ఆలయ ఈవో కృష్ణ , సూపరింటెండెంట్ హైమావతి , ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.