ఢిల్లీ లో జరిగే లాల్ దర్వాజా బోనాలకు రావాలని ఆహ్వానం

ఢిల్లీ లో జరిగే లాల్ దర్వాజా బోనాలకు రావాలని ఆహ్వానం
ఢిల్లీ లో జరిగే లాల్ దర్వాజా బోనాలకు రావాలని ఆహ్వానం

ఢిల్లీ లో జరిగే లాల్ దర్వాజా బోనాలకు రావాలని ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ లకు ఆహ్వానం

ప్రజా క్షేత్ర్, న్యూ ఢిల్లీ :

దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఈ నెల 30, జులై 1,2 తేదీలలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు రావాలని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లను లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ ప్రతినిధులు ఆహ్వానం అందజేశారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కె.వెంకటేష్,కన్వీనర్ జి. అరవింద్ కుమార్ గౌడ్ లు ఢిల్లీ తెలంగాణ భవన్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్ లను మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు.ఢిల్లీలో గత పది సంవత్సరాల నుండి తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని వారికి ఆలయ కమిటీ ప్రతినిధులు తెలియజేశారు.