గోల్కొండ జగదాంబ అమ్మవారికి బోనం
గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం
సమర్పించిన లాల్ దర్వాజా సింహవాహినిమహంకాళి ఆలయ కమిటీ
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
లాల్ దర్వాజా సింహావాహిని మహంకాళి ఆలయ కమిటీ అధ్యక్షులు మారుతీ యాదవ్ ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. ముందుగా లాల్ దర్వాజా సింహావాహిని మహంకాళి ఆలయంలో ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రీలతో ఊరేగింపుగా వెళ్లిన లాల్ దర్వాజా సింహావాహిని ఆలయ కమిటీకి గోల్కొండ జగదాంబిక ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడ అమ్మవారికి భక్తి శ్రద్దలతో బంగారు బోనం, పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. ఈ సందర్బంగా జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన లాల్ దర్వాజా ఆలయ కమిటీ ప్రతినిధులకు చంటి బాబు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ లు విష్ణు గౌడ్, ప్రతినిధులు నర్సింగ్ రావు, చంద్రకుమార్, హరీష్, సతీష్ ముదిరాజ్, శేష్ నారాయణ, వినోద్ కుమార్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.