ఈ యేడు బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాం : అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్

ఈ యేడు బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాం : అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్

ఈ యేడు బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాం : అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్

*ఈ యేడు బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాం*..

*సప్త మాత్రుకలకు బంగారు బోనం సమర్పిస్తాం*

 *ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ వెల్లడి*

,ప్రజా క్షేత్ర్, చార్మినార్​ :

భాగ్యనగర్​ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో ఈ యేడు ఆషాడమాసం పాతనగర బోనాల ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపి శెట్టి రాఘవేందర్ తెలిపారు. గురువారం హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయంలో నిర్వహించిన సమావేశానికి అయన ముఖ్య అతిధిగా పాల్గొని,  ఈ యేడు ఆషాడ మాసం బోనాల ఉత్సవాల వివరాలను వెల్లడించారు. జూన్​ 26వ తేదీన గోల్కొండ శ్రీ జగదాంబ దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం తో ప్రారంభమయ్యే ఉత్సవాలు జూలై 21వ తేదీన అమ్మవారి సామూహిక ఘటాల నిమజ్జన ఊరేగింపుతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయన్నారు. జూలై 11 నుంచి జూలై 2  వరకు 11 రోజుల పాటు బోనాల ఉత్సవాలు జరుగుతాయన్నరు. జూలై 13వ తేదీన షాలిబండా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి పాతగనర అమ్మవారి ఘటాల స్థాపన, జూలై 20వ తేదీన బోనాల పండుగ పర్వదినం సందర్భంగా బోనాల సమర్పణ, జూలై 21వ తేదీన పాతబస్తీ అమ్మవార్ల సామూహిక ఘటాల ఊరేగింపుతో పాతనగర బోనాల ఉత్సవాలు ముగుస్తాయన్నారు. 

సప్త మాత్రుకలకు బంగారు బోనం ...

బోనాల ఉత్సవాలలో భాగంగా సప్త మాతృకలు సప్త బంగారు బోనాలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏడు అమ్మవారి దేవాలయాలకు బంగారు పాత్రలో బోనంతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.  హరిబౌలి శ్రీ  అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం నుంచి జూన్​ 26 వ తేదీన గురువారం గోల్కొండ శ్రీ జగదాంబ దేవాలయంలో అమ్మవారికి సంప్రదాయ బద్దంగా మొదటి బంగారు బోనాన్ని సమర్పించనున్నామన్నారు. జూన్ 29 వ తేదీన ఆదివారం విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో, జూలై 2 వ తేదీన బుధవారం బల్కంపేట్​ శ్రీ ఎల్లమ్మ దేవాలయంలో, జూలై 4వ తేదీన శుక్రవారం జూబ్లిహిల్స్​ శ్రీ పెద్దమ్మ దేవాలయంలో, జూలై 10వ తేదీన  గురువారం సికింద్రాబాద్​ శ్రీ ఉజ్జయని మహంకాళి దేవాలయం, జూలై 15వ తేదీన మంగళవారం చార్మినార్​ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయంలో, జూలై 17వ తేదీన గురువారం లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయాలలో బంగారు బోనాన్ని సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్​ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ప్రధాన కార్యదర్శి కె. గురునాథ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బుల్లెట్ శ్రీధర్, కార్యదర్శులు ఎ. మానిక్ ప్రభు గౌడ్, ఆకుల వేణు గోపాల్, కె. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.