ఘనంగా రెడ్డమ్మల బోనం

ఘనంగా రెడ్డమ్మల బోనం

మేకల్​ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల సందడి

ఘనంగా రెడ్డమ్మల బోనం 

అమ్మవారికి వెండి బోనం సమర్పించిన రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నంది కొండ గీతారెడ్డి

బోనాలతో ఊరేగింపుగా వచ్చిన రెడ్డి జాగృతి మహిళలు

ప్రజా క్షేత్ర్, చార్మినార్​, జూలై 15 :

ఆషాడమాసం బోనాల ఉత్సవాలలో భాగంగా మేకల్​బండలోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నంది కొండ గీతారెడ్డి వెండి బోనం సమర్పించారు.  ఈ సందర్భంగా శివపార్వతి ఫంక్షన్​హాల్​ నుంచి ప్రారంభమై  మేకల్​బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం వరకు దాదాపు వందలాది మంది రెడ్డి జాగృతి రాష్ట్ర మహిళలు భారీ ఊరేగింపుగా పోతరాజుల నృత్యాల నడుమ ఆటపాటలతో  ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నంది కొండ గీతారెడ్డి , రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు పిట్ట శ్రీనివాస్​రెడ్డి , రెడ్డి జాగృతి సహ వ్యవస్థాపకులు కొట్టం మధుసూధన్​రెడ్డి ,  తదితర మహిళా నాయకురాళ్ళకు ఆలయ కమిటీ అధ్యక్షులు పొన్న వెంకట రమణ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు నంది కొండ గీతారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని,అందరి ఇండ్లలో అంత మంచి జరిగేలా అమ్మవారిని వేడుకునాన్ని తెలిపారు.  పాతనగర బోనాల ఉత్సవాలలో పాల్గొననున్న అశేష భక్త జనకోటికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్​పి నాయకులు సామ కృష్ణారెడ్డి,  రెడ్డి జాగృతి ఉపాధ్యక్షులు గుజ్జ మోహన్​రెడ్డి, ప్రధాన కార్యదర్శి మందడి కరుణారెడ్డి , ప్రధాన కార్యదర్శి మిద్దె తరుణారెడ్డి, ఉపాధ్యక్షులు గూడురు శ్రీవాణి రెడ్డి, నూకల ప్రశాంతి రెడ్డి, పల్ల విజయ రెడ్డి, కోశాధి కారి రెడ్డెడ్డి సబితా రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు తుమ్మల పెళ్లి ఉమారెడ్డి,  ప్రతినిధులు టేకుల మంజులరెడ్డి, బద్దం సబితా రెడ్డి, గోపిడి సబితా రెడ్డి, కళ్లెం మౌనిక రెడ్డి,ఏదుల కంటి సద్గుణ రెడ్డి, అనుగు వాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.