శ్రీశైల మల్లన్న హుండీల లెక్కింపు

శ్రీశైల మల్లన్న  హుండీల లెక్కింపు

శ్రీశైల మల్లన్న  హుండీల లెక్కింపు

ప్రజా క్షేత్ర్,  శ్రీశైలం :

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి మొత్తం రూ 4,78,54,875/- నగదు రాబడిగా లభించింది.
ఇందులో ఆలయాల హుండీల ద్వారా రూ.4,70,34,342/-లు మరియు అన్నప్రసాద వితరణ హుండీల ద్వారా రూ.8,20,533/-లు మొత్తం వెరసి రూ. 4,78,54,875/- లు లభించాయి.కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 31 రోజులలో (26.05.2025 నుండి 26.08.2025 వరకు) సమర్పించారు.అలాగే అన్నప్రసాద వితరణ హుండీల రాబడిని భక్తులు (17.02.2025 నుండి 26.06.2025 వరకు ) సమర్పించారు. అదేవిధంగా 842 యుఎస్ఏ డాలర్లు, 121 సౌదీ రియాల్స్, 218- కువైట్ దినార్స్, 145 – యు.ఏ.ఈ దిర్హమ్స్, 70- మలేషియా రింగిట్స్ 8- సింగపూర్ డాలర్లు, 35 ఇంగ్లాండు పౌండ్సు, 20- ఎ.యు.ఎస్ డాలర్సు. 30 హంకాంగ్ డాలర్లు, 10- కెనడా డాలర్లు, 600 శ్రీలంక రూపీస్. 15 – యూరోస్, మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.కాగా అప్రైజర్ రాని కారణంగా ఈ రోజు జరిగిన హుండీల లెక్కింపులో బంగారు, వెండి లెక్కించలేదు. ఈ రోజు లభించిన బంగారు, వెండిని కూడా తిరిగి హుండీలోనే సమర్పించడం జరిగింది.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి  యం. శ్రీనివాసరావు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్. రమణమ్మ, ఎస్. మోహన్, జిల్లా దేవదాయశాఖ అధికారి, నంద్యాల, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.